హైదరాబాద్: నెల రోజులుగా ఊరిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ధర గురుంచి నేడు తెలిసిపోయింది. పెట్రోలు ధరల బాదుడు నుంచి ఉపశమనం కలిగించే ఈ స్కూటర్ ను సొంతం చేసుకోవాలంటే ఎంత సొమ్ము చెల్లించాలనే విషయం వెల్లడైంది. ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. S1, S1 Pro ప్రొ పేరుతో ఓలా రెండు మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొనివచ్చింది.
ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మోడల్ ధర రూ.99,999గా ఉంటే ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఓలా ఎలక్ట్రిక్ లాంఛింగ్ ఈవెంట్‌లో ఈ వివరాలు వెల్లడించారు.
.
ఔరా అనిపిస్తున్న ఓలా
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1, S1 ప్రో అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల అయ్యింది.
- S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 50-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ఎల్‌ఈడీ లైటింగ్ అధునాత ఫీచర్లు అందిస్తోంది.
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది.
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది.
- ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిమీల దూరం వెళ్లనుంది.
- ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది.
- ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 115 కి.మీ. ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కి.మీ. దూరం వెళ్లనుంది.
- ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్లలో 0-40 కిమీ/గం చేయగలదని పేర్కొంది.
- స్కూటర్ ఎస్1లో 7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 3 జీబీ ర్యామ్‌తోపాటు ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
- ప్రత్యేక అప్లికేషన్ ఉపయోగించి స్కూటర్‌ను ఆటోమేటిక్‌గా లాక్, లేదా అన్‌లాక్ చేయవచ్చు.
- ఓలా ఎస్1 లోకల్ నావిగేషన్ అప్లికేషన్‌తో వస్తుంది.
- ఓలా స్కూటర్ 3.9 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 8.5 కిలోవాట్ పీక్ పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ కు పవర్ అందిస్తుంది.
- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
- లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ను సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది.
కోటి స్కూటర్ల తయారీ
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోం డెలివరీ పద్దతిలో కస్టమర్లకు అందివ్వనున్నారు. ఇప్పటికే టెస్లా ఇదే పద్దతిలో తన కార్ల అమ్మకాలు చేపడుతోంది. ఆన్‌లైన్‌లో స్కూటర్ బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. షోరూమ్‌ల వ్యవస్థ ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే.
- 2021 ఫిబ్రవరిలో మొదటి స్కూటర్‌ని తయారు చేయడం ప్రారంభించగా ఫస్ట్ స్కూటర్ తయారీకి ఆరు నెలల సమయం పట్టింది.
- తమిళనాడులో ఉన్న ఓలా మెగా ఫ్యాక్టరీలో స్కూటర్లు తయారవుతున్నాయి. ప్రారంభ దశలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసే అవకాశం ఉంది. గరిష్టంగా ఏడాదికి కోటి స్కూటర్ల తయారీ లక్క్ష్యంగా ఇక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి.
- స్కూటర్ సింపుల్ వన్, బజాజ్ చేతక్, ఏథర్ 450X, TVS iQubeలు ఓలా కంటే ముందే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్‌లో ఉన్నాయి
Comments
Please login to add a commentAdd a comment