Bhavish Aggarwal
-
డిసెంబర్ 20 నాటికి 3200: సీఈఓ ట్వీట్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసిన కస్టమర్లతో అసంతృప్తి పెరిగిపోతున్న తరుణంలో.. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ శుభవార్త చెప్పారు. వాహనాల సర్వీసుల్లో జాప్యం కలగకుండా చూడటానికి దేశ వ్యాప్తంగా మరో 3,200 సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.డిసెంబర్ 20 నాటికి 3,200 కొత్త స్టోర్స్ ప్రారంభించనున్నట్లు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆ తరువాత కంపెనీ మొత్తం నెట్వర్క్ 4,000 అవుట్లెట్లకు చేరుకుంటుంది.ప్రస్తుతం దేశంలో ఓలా స్టోర్లు కేవలం 800 మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య త్వరలోనే 4,000లకు చేరుకుంటుంది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా సీఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ప్రారంభం కానున్న స్టోర్లలో సర్వీస్ కూడా లభిస్తుంది. కాబట్టి కస్టమర్లు నిశ్చింతగా.. తమ వాహనంలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు (ఓలా ఎస్1 జెడ్, ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్) స్కూటర్లను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే అమ్మకానికి రానున్నాయి. కాగా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా అడుగు పెట్టడానికి యోచిస్తోంది. ఇది బహుశా వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.Taking the Electric revolution to the next level this month.Going from 800 stores right now to 4000 stores this month itself. Goal to be as close to our customers as possible.All stores opening together on 20th Dec across India. Probably the biggest single day store opening…— Bhavish Aggarwal (@bhash) December 2, 2024 -
రూ. 39999కే ఎలక్ట్రిక్ స్కూటర్: ఓలా సరికొత్త వెహికల్స్ చూశారా..
భారతీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి.ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన స్కూటర్లు.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ కస్టమర్ల రోజువారీ వినియోగానికి, వాణిజ్యపరమైన వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కలిగి ఉంటాయి.ఓలా గిగ్: రూ. 39,999ఓలా గిగ్ ప్లస్: రూ. 49,999ఓలా ఎస్1 జెడ్: రూ. 59,999ఓలా ఎస్1 జెడ్ ప్లస్: రూ. 64,999ఓలా గిగ్రోజువారీవినియోగానికి లేదా తక్కువ దూరాలు ప్రయాణించడానికి.. ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. పేలోడ్ కెపాసిటీ బాగేనా ఉంటుంది. ఇందులోని 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 112 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం మాత్రమే. కంపెనీ దీనిని ప్రధానంగా గిగ్ వర్కర్ల కోసం లాంచ్ చేసినట్లు సమాచారం.ఓలా గిగ్ ప్లస్కొంత ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఓలా గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనికొస్తుంది. గంటకు 45 కిమీ వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ రేంజ్ 81 కిమీ మాత్రమే. అయితే రెండు బ్యాటరీల ద్వారా 157 కిమీ రేంజ్ పొందవచ్చు. ఇందులో కూడా 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. గిగ్ వర్కర్లు వేగవంతమైన డెలివరీ కోసం ఈ స్కూటర్లు ఉపయోగపడతాయి. రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణనికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.ఓలా ఎస్1 జెడ్ఓలా ఎస్1 జెడ్ అనేది వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించే స్కూటర్. పరిమాణంలో ఇది కొంత చిన్నదిగా ఉండటం వల్ల దీనిని రద్దీగా ఉండే అర్బన్, సెమీ-అర్బన్ రోడ్లపై కూడా సాఫీగా రైడ్ చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్‌తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 జెడ్ ప్లస్ఇక చివరగా.. ఓలా ఎస్1 జెడ్ ప్లస్ విషయానికి వస్తే, ఇది దృఢమైన నిర్మాణం, అధిక పేలోడ్ కెపాసిటీ పొందుతుంది. దీనిని కూడా వ్యక్తిగత వినియోగం కోసం లేదా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్‌తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా పవర్పాడ్ఓలా ఎలక్ట్రిక్ కేవలం కొత్త స్కూటర్లను లాంచ్ చేయడమే కాకుండా.. పవర్పాడ్ కూడా లాంచ్ చేసింది. ఇది పోర్టబుల్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. గృహోపకరణాలు, లైట్లు, ఫ్యాన్లు, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలకు శక్తినిచ్చే ఇన్వర్టర్‌గా ఉపయోగపడుతుంది. 500W అవుట్‌పుట్‌ను కలిగిన ఓలా పవర్పాడ్.. 1.5 కిలోవాట్ బ్యాటరీ, 5 ఎల్ఈడీ బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్లు, 1 టీవీ, 1 మొబైల్ ఛార్జింగ్, 1 Wi-Fi రూటర్ వంటి వాటికి మూడుగంటల పాటు శక్తినిస్తుంది. అంటే పనిచేసేలా చేస్తుంది. దీని ధర రూ. 9999 మాత్రమే.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..ఓలా ఎలక్ట్రిక్.. కొత్త స్కూటర్లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి మూలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓలా గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్ల లాంచ్ ఈవీ రంగం వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు. సరసమైన ధర వద్ద లభించే ఈ స్కూటర్లు తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని అన్నారు.Say hello to Ola S1 Z & Gig range, starting at just ₹39K!Affordable, accessible, and now with a portable battery pack that doubles up as home inverter using the Ola PowerPodReservations open, deliveries Apr’25!🛵⚡🔋Ola S1 Z: https://t.co/jRj8k4oKvQOla Gig:… pic.twitter.com/TcdfNhSIWy— Bhavish Aggarwal (@bhash) November 26, 2024 -
రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
స్కూటర్ రిపేర్ వస్తే షోరూమ్ వాళ్లు వేసిన బిల్లు చూసి ఓ కస్టమర్ నిర్ఘాంతపోయాడు. ఆ బిల్లు ఏకంగా ప్రస్తుతం కొత్త స్కూటర్ రేటుతో దాదాపు సమానంగా ఉంది. దాంతో చిర్రెత్తిన ఆ కస్టమర్ స్కూటర్ షోరూమ్ ముందే సుత్తితో స్కూటర్‌ను పగలగొట్టాడు. ఆ స్కూటర్ షోరూమ్‌కు రిపేర్ కోసం వచ్చిన ఇతర కస్టమర్లు చుట్టూ చేరి సుత్తితో బాదే కస్టమర్ చర్యలకు మద్దతుగా నిలిచారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ కోసం ఓ కస్టమర్ షోరూమ్‌ను సంప్రదించాడు. రిపేర్ పూర్తయ్యాక బిల్లు చూసిన తాను షాక్‌కు గురయ్యాడు. ఏకంగా రూ.90,000 బిల్లు చేసినట్లు గుర్తించాడు. దాంతో కోపంతో ఆ షోరూమ్ ముందే స్కూటర్‌ను సుత్తితో పగలగొట్టాడు. రిపేర్ బిల్లులకు సంబంధించి సరైన నిబంధనలు పాటించడం లేదని ఇతర కస్టమర్లు తన చర్యను సమర్థించారు. ఈమేరకు తీసిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.Furious Ola Electric customer smashes scooter with hammer after allegedly receiving ₹90,000 bill from showroom. pic.twitter.com/c6lYSKSUf7— Gems (@gemsofbabus_) November 24, 2024ఇదీ చదవండి: అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లుఓలా స్కూటర్లకు సంబంధించి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓలా కస్టమర్ల నుంచి 10,644 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని పరిష్కరించాలనేలా సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతంలో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. -
డిసెంబర్ నాటికి వెయ్యి సర్వీస్ సెంటర్లు: భవిష్ అగర్వాల్
బెంగళూరు: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ సర్వీస్ సెంటర్లను 30 శాతం మేర పెంచుకుంది. కొత్తగా 50 సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 500 మంది టెక్నీషియన్లను నియమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదపడగలదని వివరించాయి. అలాగే, సర్వీస్ వ్యూహాలు, ప్రక్రియలను మెరుగుపర్చుకునేందుకు తగు సూచనలు ఇచ్చేందుకు ఎర్న్స్ట్ అండ్ యంగ్‌ను నియమించుకున్నట్లు పేర్కొంది.ఓలా వాహన సర్వీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యుత్తమ ఆఫ్టర్–సేల్స్ అనుభూతిని అందించేందుకు 2024 డిసెంబర్ నాటికి తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 సెంటర్లకు పెంచుకోనున్నట్లు ఓలా వ్యవస్థాపకుడు, సీఎండీ భవీష్ అగర్వాల్ సెప్టెంబర్‌లో ప్రకటించారు. -
ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సర్వీసు సెంటర్ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.ఇదీ చదవండి: సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేశారు. దానిపై కునాల్ ఎక్స్ వేదికగా కొన్ని డిమాండ్లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్లను తీర్చాలి.ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్ అన్నారు. -
హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1— Harsh Goenka (@hvgoenka) October 8, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. -
ఎన్నికల్లో సంస్థల సహకారం ఎంతున్నా అది తప్పనిసరి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 ద్వారా అందించిన రాయితీలు దేశంలోని మొత్తం ప్రజల సొమ్మని కేరళ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలని పేర్కొంది. ఇటీవల ఓలా వంటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు అందిస్తున్న సేవలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దాంతో కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీను ట్యాగ్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది.‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అయ్యే ఖర్చు భారత ప్రజలందరిది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల పెంపునకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల ద్వారా రాయితీలిచ్చింది. మే 2023 కంటే ముందు విక్రయించిన ఓలా ఎస్1 ప్రో మోడల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్యాక్స్‌తో సహా రూ.1.16 లక్షలు రాయితీ అందించాయి. ఒక స్కూటర్‌కు ఇది భారీ రాయితీ. వినియోగదారులు, వారి భద్రత, సర్వీసును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందించిన రాయితీలు ఏమేరకు ప్రయోజనం కలిగించాయో ప్రభుత్వం తెలుసుకోవడం చాలాముఖ్యం’ అని తెలిపింది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు‘మన దేశాన్ని బ్రాండ్ ఇమేజ్ సమస్య వెంటాడుతోంది. చైనా చౌకైన, తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు తయారీ చేస్తుందనే బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కొన్ని భారతీయ కంపెనీలు ఎలాంటి రెగ్యులేటర్ పరిశీలన లేకుండా కస్టమర్ భద్రతను విస్మరించి తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. దాంతో దేశంలోని ఇతర బ్రాండ్లపై ప్రభావం పడుతోంది. అందువల్ల ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న నాణ్యమైన వాహనాలను ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతోంది. ఫలితంలో ‘చైనా బ్రాండ్’ ఇమేజ్‌నే మూటగట్టుకునే ప్రమాదముంది. కాబట్టి వాహనాల తయారీ, సర్వీసు అందించడంలో ప్రభుత్వం రెగ్యులేటర్‌గా ఉండాలని కోరుతున్నాం. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనదైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి’ అని కేరళ కాంగ్రెస్ పేర్కొంది.Dear @nitin_gadkari,The reported quality issues with @OlaElectric or any other Electric Vehicle company for that matter is not between the company and their customers. It concerns each and every tax payer of this country.We've been giving huge subsidies to these companies… pic.twitter.com/rbCbkTHOhL— Congress Kerala (@INCKerala) October 7, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
అంత బలుపు వద్దు.. ఓలా సీఈవోపై నెటిజన్ల ఫైర్!
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మాట తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వేదికగా కమెడియన్ కునాల్ కమ్రాపై భవిష్ అగర్వాల్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు.భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకుంటున్నారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కునాల్ కమ్రా పెట్టిన పోస్టులకు ‘ఇది పెయిడ్ పోస్టు’.. ‘నువ్వు సంపాదించలేనంత డబ్బు ఇస్తా’.. అంటూ తలపొగరుగా ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించిన తీరు.. ప్రయోగించిన పదాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..అగర్వాల్ వర్సెస్ కమ్రా మాటల యుద్ధం వ్యవహారంలో చాలా మంది ఓలా కస్టమర్లతోపాటు నెటిజన్లు సైతం కమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్ మాట తీరుపై చీవాట్లు పెడుతున్నారు. ఓలా సర్వీస్ ఎంత చెత్తగా ఉందో చెప్పేందుకు మంచి కమెడియనే కావాల్సిన అవసరం లేదంటూ ఒక యూజర్ స్పందించారు. ఈ అహంకారం నిర్లక్ష్య ధోరణి నుంచి వచ్చిందని, దీనికి బుద్ధి చెప్పాలని మరో యూజర్ కామెంట్ చేశారు. ‘ఎంత అహంకారివి నువ్వు. సంపదను చాటుకోవడం మానేయండి. అంతా పోగొట్టుకుని రోడ్లపైకి వచ్చిన ఇలాంటి అహంకార సీఈవోలు ఎందరో ఉన్నారు. మీ విఫలమైన ఉత్పత్తులు, సేవల నమూనాను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చారు.ఈ అంశంలో ఓలా రూపొందించిన ఏఐ ఫ్లాట్‌ఫామ్ కృత్రిమ్ కూడా భవిష్ అగర్వాల్‌నే తప్పుపట్టింది. భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధంపై ఓ జర్నలిస్ట్ ఓలా కృత్రిమ్ ఏఐ స్పందనను కోరారు. అది అందించిన స్పందనను ‘ఎక్స్’లో షేర్ చేశారు. కమ్రా లేవనెత్తిన ఆందోళనపై భవిష్ స్పందించిన తీరు హుందాగా లేదంటూ బదులిచ్చింది. ఆందోళనలను గుర్తించి పరిస్థితి పట్ల సానుభూతి చూపాలని అగర్వాల్‌కు కృత్రిమ్ సలహా ఇచ్చింది. I asked OLA bro's AI for PR advice on the developing situation with @kunalkamra88.It clearly does not like the response OLA bro gave. 😆 pic.twitter.com/bX6FifrThO— meghnad (Nerds ka Parivaar) (@Memeghnad) October 6, 2024 -
ఓలా సీఈఓ, కమెడియన్ మధ్య మాటల యుద్ధం
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆన్లైన్ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై కమ్రా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఎలక్ట్రిక్ వాహనాలను సూచించే ఫొటో షేర్ చేస్తూ కమ్రా తన ఎక్స్ ఖాతాలో ‘భారతీయ వినియోగదారులు సమస్యలపై మాట్లాడలేరని అనుకుంటున్నారా? వారికి ఇలాంటి సమస్యా? రోజువారీ వేతన కార్మికులు ద్విచక్ర వాహనాలు వాడుతూ జీవనాధారం పొందుతున్నారు’ అని ఆయన తన పోస్ట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ ‘భారతీయులు ఈవీలను ఎలా ఉపయోగిస్తారు?’ అని తెలిపారు. ‘పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా సంస్థ నాయకుడి నుంచి ఎలాంటి సమాధానం లేదు’ అని మరోపోస్ట్ పెట్టారు.Since you care so much @kunalkamra88, come and help us out! I’ll even pay more than you earned for this paid tweet or from your failed comedy career.Or else sit quiet and let us focus on fixing the issues for the real customers. We’re expanding service network fast and backlogs… https://t.co/ZQ4nmqjx5q— Bhavish Aggarwal (@bhash) October 6, 2024ఈ వ్యవహారంపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఘాటుగా స్పందించారు. కమ్రా పెట్టిన పోస్ట్‌లు ‘పెయిడ్ పోస్ట్’లు అని వ్యాఖ్యానించారు. ఈమేరకు భవిష్ కమ్రా విమర్శలకు ప్రతిస్పందనగా పోస్ట్ చేశారు. ‘మీరు ఈవీల వ్యవహారంపై చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి, వచ్చి మాకు సాయం చేయండి! ఈ ‘పెయిట్ ట్వీట్’లు, విఫలమైన మీ కామెడీ కెరీర్ ద్వారా ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగానే మీకు డబ్బు ఇస్తాను. ఇవేవీ కాదంటే నిశ్శబ్దంగా ఉండండి. మేము కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతున్నాం. సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం. బ్యాక్‌లాగ్‌లు త్వరలో క్లియర్ చేస్తాం’ అని స్పందించారు.Instead can you give a total refund to anyone who wants to return their OLA EV & who’s purchased it in the last 4 months? I don’t need your money people not being able to get to their workplace need your accountability.Show your customers that you truly care? https://t.co/tI2dwZT2n2— Kunal Kamra (@kunalkamra88) October 6, 2024కమ్రా భవిష్ ట్వీట్‌పై తిరిగి స్పందించారు. ‘పెయిడ్ ట్వీట్ చేసినట్లు, నేను ఏదైనా ప్రైవేట్ కంపెనీ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి డబ్బు పొందినట్లు మీరు రుజువు చేస్తే నా అన్ని సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే తొలగించి, మీరన్నట్లు ఎప్పటికీ నిశ్శబ్దంగా కూర్చుంటాను’ అని చెప్పారు. దీనికి అగర్వాల్ బదులిస్తూ ‘నేను అన్న మాటలతో బాధపడ్డారా? సర్వీస్ సెంటర్‌కు రండి. మాకు చాలా పని ఉంది. మీ ఫ్లాప్ షోల కంటే నేను బాగా డబ్బులిస్తాను. మీ వ్యాఖ్యలపై నిజంగా మీరెంత శ్రద్ధ వహిస్తున్నారో మీ అభిమానులకు తెలియాలి’ అని అన్నారు.ఇదీ చదవండి: రతన్‌టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరందీనిపై కమ్రా బదులిస్తూ ‘కస్టమర్ల ఈవీను తిరిగి ఇవ్వాలనుకునే వారికి, గత నాలుగు నెలల్లో ఈవీను కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేస్తారా? మీ డబ్బు నాకు అవసరం లేదు. మీ ఈవీ వాడుతున్న కస్టమర్లు సరైన సేవలందక తమ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. దీనికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నట్లు మీ కస్టమర్లకు తెలియాలి కదా?’ అని అన్నారు. దీనిపై భవిష్ స్పందిస్తూ ‘మా కస్టమర్లకు అందే సర్వీసు జాప్యం జరిగితే వారికి తగినన్ని ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. మీరు నిజంగా సమస్యపై స్పందించాలంటే కేవలం కుర్చీలో కూర్చొని విమర్శలు చేయడం కాదు. సమస్య ఎక్కడుందో తెలుసుకోండి. దీనిపై వెనక్కి తగ్గకండి’ అని పోస్ట్ చేశారు.We have enough programs for our customers if they face service delays. If you were a genuine one, you would have known.Again, don’t try and back out of this. Come and do some real work rather than armchair criticism. https://t.co/HFFKgsl7d9— Bhavish Aggarwal (@bhash) October 6, 2024 -
మ్యాప్‌మైఇండియా ఆరోపణల్లో విశ్వసనీయత లేదు..
న్యూఢిల్లీ: మ్యాప్‌లను కాపీ చేశారంటూ మ్యాప్‌మైఇండియా తమపై చేస్తున్న ఆరోపణల్లో విశ్వసనీయత లేదని ఓలా సహ–వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్‌ను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందేందుకే ఆ కంపెనీ తమపై మ్యాప్‌ల కాపీయింగ్ ఆరోపణలు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము లీగల్ నోటీసు పంపినా మ్యాప్‌మైఇండియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అగర్వాల్ పేర్కొన్నారు. సొంతంగా దేశీ నావిగేషన్ మ్యాప్ తయారు చేశామంటూ ఓలా మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రకటించడం ఓ గిమ్మిక్కు అంటూ మ్యాప్‌మైఇండియా ఆరోపించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో సంబంధ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడానికి మూడు రోజుల ముందు జూలై 23న మ్యాప్‌మైఇండియా ఆ సంస్థకు నోటీసులు పంపింది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 9న లిస్టయింది. ఈ నేపథ్యంలోనే అగర్వాల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము చాలాకాలంగా రైడ్ షేరింగ్ వ్యాపారంలో ఉన్నందున తమ దగ్గర మ్యాపింగ్‌కి సంబంధించిన డేటా..టెక్నాలజీ బోలెడంత ఉందని, ఒక సంస్థను కూడా కొనుగోలు చేశామని అగర్వాల్ తెలిపారు. బహుశా మ్యాప్‌మైఇండియా కస్టమర్లు ఓలా మ్యాప్స్ వైపు మళ్లుతున్నారేమోనని, ఇది సమస్యగా మారడం వల్లే ఆ కంపెనీ తమపై ఆరోపణలు చేస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. -
ఓలా ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టు: క్లారిటీ ఇచ్చిన భవిష్
ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మూడేళ్ళ క్రితమే ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ ప్రెజెక్టును నిలిపివేస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వల్ వెల్లడించారు.ఓలా ఎలక్ట్రిక్ ఈ నెల ప్రారభంలో ఐపీఓ ప్రారంభించిన తరువాత లాభాలను ఆర్జించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా భారతీయ వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు భవిష్ అన్నారు.నిజానికి 2022లో పుల్ గ్లాస్ రూఫ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేయబోతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఆ తరువాత అదే ఏడాది ఆగష్టు 15న జరిగిన ఓ ఈవెంట్లో ఈ కారుకు సంబంధించిన స్కెచ్‌లు విడుదల చేశారు. అప్పట్లోనే ఈ కారు తయారు కావడానికి సుమారు రెండేళ్లు పడుతుందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.భారతదేశంలో ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీకి సవాలుగా ఓలా ఎలక్ట్రిక్ సింగిల్ చార్జితో 500 కిమీ రేంజ్ అందించే కారును లాంచ్ చేయనున్నట్లు ఎప్పుడో చెప్పింది. కానీ ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐపీఓకు వెళ్లడం వల్ల ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలన్న ఓలా నిర్ణయాన్ని భవిష్ అగర్వాల్ ధృవీకరించారు. అయితే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మళ్ళీ ప్రారంభమవుతుందా? లేదా? అనే విషయాలను సీఈఓ స్పష్టం చేయలేదు. -
ఓలా ఈ–బైక్స్ వచ్చేశాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టింది. 2.5–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తయారయ్యాయి. ధర రూ.74,999 నుంచి మొదలై రూ.2,49,999 వరకు ఉంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి 200 నుంచి 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 124–194 కిలోమీటర్లు. కాగా, క్విక్ కామర్స్‌లోకి ఓలా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఓలా క్యాబ్స్ కాస్తా ఓలా కన్జూమర్ అయింది. అలాగే ఓలా పే పేరుతో యూపీఐ సేవలను సైతం కంపెనీ ఆవిష్కరించింది. అనుబంధ కంపెనీ కృత్రిమ్ ఏఐ 2026 నాటికి ఏఐ చిప్‌ను ప్రవేశపెట్టనుంది. -
సోమనాథ్ ఆలయంలో ఓలా సీఈఓ పూజలు (ఫోటోలు)
-
ఓలా ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. టార్గెట్ రూ. 5,500 కోట్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఆగస్టు 2న రిటైల్ సబ్స్క్రిప్షన్లు ప్రారంభించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రం ఒక రోజు ముందుగా ఆగస్టు 1న సబ్స్క్రిప్షన్లు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 6న ఐపీఓ ముగుస్తుంది.ఐపీఓ ద్వారా రూ. 5,500 కోట్లను (సుమారు 657 మిలియన్ డాలర్లు) ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా దాదాపు 38 మిలియన్ షేర్లను విక్రయించాల్సి ఉందని కంపెనీ తెలిపింది. 2023 డిసెంబర్లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌లో సూచించిన 47.4 మిలియన్ షేర్ల విక్రయం కంటే ఇది దాదాపు 20% తక్కువ.ఓలా ఎలక్ట్రిక్ సుమారు 4.2 బిలియన్ డాలర్ల నుంచి 4.4 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఐపీఓకు వస్తోంది. సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ టెమాసెక్ గతేడాది 140 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ విలువను 5.4 బిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇప్పుడు కంపెనీ ఐపీఓ వాల్యూషన్ 20 శాతం మేర తగ్గడం గమనార్హం. -
టెకీలూ.. ఆఫీసులకు కుర్తా వేసుకురండి
టెకీలు, ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు ఎలాంటి దస్తులు వేసుకుని వస్తారు..? చక్కగా సూటు బూటు వేసుకుని వస్తారు. కానీ కుర్తాలు వేసుకుని రావాలని చెబుతున్నారు ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్.ఏఎన్ఐకి చెందిన స్మితా ప్రకాష్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతీయులందరూ పాశ్చాత్య దుస్తులకు స్వస్తి పలికి కుర్తాలను ధరించాలని సూచించారు.“మనం కుర్తాలో మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు. ఇది ప్రత్యేకంగా భారతీయమైనది. నా దృష్టిలో, కుర్తా చాలా సొగసైన డ్రెస్. భారతీయులందరూ, ముఖ్యంగా యువ సాంకేతిక నిపుణులు కుర్తాలను ధరించాలని నేను అనుకుంటున్నాను” అని అగర్వాల్ అన్నారు.జూలై 8న షేర్ చేసిన ఈ పాడ్‌కాస్ట్ కొద్ది సమయంలోనే ట్రాక్‌ని పొందింది. చాలా మంది అగర్వాల్ భావాలతో ఏకీభవించడంతో కామెంట్ సెక్షన్ సానుకూల స్పందనలతో నిండిపోయింది. -
‘ఓలా అలా కాదు’.. మహిళా నియామకాలపై భవిష్ అగర్వాల్
ఫాక్స్‌కాన్ నియామక పద్ధతులపై వచ్చిన వార్తలపై ఓలా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ స్పందించారు. తమ కొత్త కర్మాగారాల్లో వివాహితలతో సహా మహిళల నియామకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వివాహితలను నియమించుకోవడంపై ఓలాకు ఎటువంటి వ్యతిరేక విధానం లేదని అగర్వాల్ పేర్కొన్నారు.ఇటీవల ఓ మీడియా సమావేశంలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'మహిళలు ఎక్కువ క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉంటారు. మేము మా కర్మాగారాలలో మహిళా శ్రామిక శక్తిని నియమించడం కొనసాగిస్తాం. పెళ్లైన మహిళలను నియమించుకోకూడదనే ఫాక్స్‌కాన్ లాంటి విధానాలు మా దగ్గర లేవు’ అన్నారు.భారత్‌లో మహిళా శ్రామిక శక్తి తక్కువగా ఉందని, దీనిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నామని, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మరింత మంది మహిళలను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.కాగా మహిళా శ్రామిక శక్తిని పెంపొందించడంపై ఓలా ఎలక్ట్రిక్ గతంలోనే తమ వైఖరిని ప్రకటించింది. "ఈ రోజు, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నాను. ఈ వారం మేము మొదటి బ్యాచ్ ను స్వాగతించాం. పూర్తి సామర్థ్యంతో, ఫ్యూచర్ ఫ్యాక్టరీ 10,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, ఇది మహిళలకు మాత్రమే పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం, ఏకైక మహిళా ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుంది'' అని బ్లాగ్ పోస్ట్‌లో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.యాపిల్ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు అయిన ఫాక్స్‌కాన్ భారత్‌లోని తన ఐఫోన్ కర్మాగారంలో వివాహిత మహిళలను ఉద్యోగాలకు తిరస్కరిస్తున్నట్లు ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక బహిర్గతం చేసింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న ప్రధాన ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలో వివాహిత మహిళలను ఉద్యోగావకాశాల నుంచి తప్పించారని నివేదిక ఆరోపించింది. -
మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన భవిష్ అగర్వాల్ - ఫోటోలు
ఆదివారం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్లో 'నరేంద్ర మోదీ' మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ మొదలైనవారు పాల్గొన్నారు.దేశాధినేతలు మాత్రమే కాకుండా పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ, భవిష్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను భవిష్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పోస్ట్ చేశారు. అయితే జాతీయ జెండాలను క్యాప్సన్గా పెట్టారు. పోస్ట్‌లో రాష్ట్రపతి భవన్ని చూపిస్తూ మూడు చిత్రాలను పంచుకున్నాడు.🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/0yrflT9DHs— Bhavish Aggarwal (@bhash) June 9, 2024 -
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చింది. లింక్డిన్లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు గుడ్‌బై చెప్పింది. ఇకపై అజ్యూర్‌ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్‌నకే చెందిన కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ప్రకటించారుఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్ ఏఐ బాట్లో భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్లతో లింక్డిన్ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్ పోస్ట్ ఉందంటూ దానిని లింక్డిన్ డిలీట్ చేసింది. దీంతో లింక్డిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్.. మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌కు గుడ్ బై చెప్పారు. లింక్డిన్ చర్యతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. -
లింక్డ్ఇన్పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్
ఓలా సీఈఓ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో లింక్డ్ఇన్ను విమర్శించారు. పాశ్చాత్య దేశాల టెక్నలాజిలు భరతదేశంలో వ్యాపిస్తున్నాయి. ఇందులో లోపాలు కూడా కూడా ఉన్నయని వివరించారు. అందుకే భారత్ సొంత టెక్నాలజీని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.లింక్డ్ఇన్ ఏఐ బాట్లో 'భవిష్ అగర్వాల్' ఎవరు అని సెర్చ్ చేస్తే.. వచ్చిన ఫలితంలో చాలా వరకు సర్వనామాలకు సంబంధించిన దోషాలు ఉన్నయని భవిష్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.దీనిపైన లింక్డ్ఇన్ కూడా స్పందించింది. ఇది ప్రొఫెషనల్ కమ్యూనిటీ పాలసీలకు వ్యతిరేఖంగా ఉందని లింక్డ్ఇన్ నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్నారు. నిజానికి భారత్ సొంత టెక్నాలజీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల టెక్నాలజీలను గుడ్డిగా నమ్మితే ఇలాంటి దోషాలే వస్తాయి. దీనిని యూజర్స్ నమ్మే ప్రమాదం ఉంది.Dear @LinkedIn this post of mine was about YOUR AI imposing a political ideology on Indian users that’s unsafe, sinister.Rich of you to call my post unsafe! This is exactly why we need to build own tech and AI in India. Else we’ll just be pawns in others political objectives. pic.twitter.com/ZWqiM90eT1— Bhavish Aggarwal (@bhash) May 9, 2024 -
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. -
హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా?
పైన ఫోటోలో చూడగానే పిలక పెట్టుకుని, కళ్ళజోడుతో స్టైల్‌గా కనిపిస్తున్న వ్యక్తి ఏ హాలీవుడ్ హీరో అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈయన ఇండియాలో ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అయితే ఎందుకు ఈ అవతారమెత్తారు అనే అనుమానం మీలో రావచ్చు? దాని గురించే ఇక్కడ తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్థాపించి, ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసి అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలను పొందుతూ దూసుకెళ్తున్న ఈయనే ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్'. ఈ పేరు వినగానే ఇప్పుడు గుర్తోచేసి ఉంటుంది, ఈయనే భవిష్ అగర్వాల్ అని.. ఇక ఈ అవతారమెందుకు ఎత్తరనుకుంటున్నారా.. భవిష్ అగర్వాల్ ఆదివారం అబుదాబిలో ఇటీవల ప్రారంభించిన 'బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన హిందూ మందిర్'ను సందర్శించారు. ఆ సమయంలో ఇలా కనిపించారు. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి భవిష్ అగర్వాల్ ఈ టెంపుల్ సందర్శించిన సందర్భంగా.. ఇది నా జీవిత జ్ఞాపకం అని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. Visiting and speaking at the @BAPS Hindu Mandir in Abu Dhabi was a life memory for me. It is such a historic moment of two civilisations coming together and thankful to be there to witness it🙏🏼 pic.twitter.com/rfHh8x4eJ3 — Bhavish Aggarwal (@bhash) February 18, 2024 -
ఓలా ఎలక్ట్రిక్ బంపరాఫర్!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఓలా కీలక ప్రకటన చేసింది. త్వరలో ఓలా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడిన ఆయన..తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 25 వేల మందికి కొలువులు లభిస్తాయని తెలిపారు. తద్వారా ప్రతి ఏటా సుమారు ఒక కోటి టూ వీలర్స్ తయారవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ కోసం గతేడాది తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఎలక్ట్రిక్.. ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం ఓలా ఎలక్ట్రిక్ రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎనిమిది నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ యూనిట్ విజయవంతంగా నిర్మించుకున్నట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చేనెల నుంచి ఈవీ స్కూటర్ల ఉత్పత్తి తయారవుతుందని అన్నారు. గత జూన్‌లోనే తమిళనాడులో మెగా మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సహకారంతో తమిళనాడు గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపింది. దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లీడర్‌గా నిలిచింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ఈవీ స్కూటర్ల విక్రయంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 32 శాతం. గతేడాది నవంబర్ నాటికి దాదాపు 30 వేల ఈవీ స్కూటర్లను విక్రయించింది. -
నేడే కృత్రిమ్ ఏఐ విడుదల
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. కృత్రీమ్.ఏఐని ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం 2.30గంటలకు కృత్రీమ్.ఏఐ లాంచ్‌ను కృత్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. Excited to showcase the potential of our AI. Tune in to the live launch event of Krutrim, India's own AI at 2:30PM tomorrow! Watch here: https://t.co/g7qmlHMuk1 pic.twitter.com/i7CrTrJYH1 — Bhavish Aggarwal (@bhash) December 14, 2023 ఈ సందర్భంగా ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో సొంత ఏఐ కుత్రిమ్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తద్వారా పరిశ్రమలు, జీవన విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఏఐని 1.4 బిలియన్ల మందికి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏఐ మేడ్ ఇన్ ఇండియా ప్రస్తుత టెక్ ప్రపంచంలో కృత్తిమ మేధ దూసుకుపోతుంది. మనదేశం కూడా సొంతంగా ఏఐని తయారు చేసే స్థాయికి ఎదగాలి. కానీ దేశీయ స్టార్టప్‌లు, వినియోగదారులు విదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నిపుణులతో తయారు చేసిన ఏఐని వినియోగిస్తున్నాయి. అలా కాకుండా భారతీయ భాషల్లో ఏఐని డెవలప్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు దారులకు శుభవార్త!
ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు దారులకు ఓలా శుభవార్త చెప్పింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరపై రూ.20,000 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ బైక్ ధర రూ.1,09,999 ఉండగా.. ధర తగ్గింపుతో రూ.89,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ కొత్తగా ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ కొనుగోలు దారులకు మాత్రమే అందుబాటులో ఉందని ఓలా పేర్కొంది. ఓలా ఎస్1ఎక్స్ సిరీస్‌లోని ఓలా ఎస్1 ఎక్స్ 3 కిలోవాట్ల బ్యాటరీ, ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలో వాట్ల బైక్‌లను కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్ పొందలేరని వెల్లడించింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 3 వాట్ల బ్యాటరీతో జతచేసిన 6కిలో వాట్ల మోటార్‌ను అందిస్తుంది. ఇందులో మొత్తం మూడు రైడ్ మోడ్లు ఉన్నాయి. వాటిల్లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్. ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40కేపీఎంహెచ్ నుండి 3.3 సెకన్లలో, 5.5 సెకన్లలో 0-60 కేపీఎంహెచ్ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 90కేఎంపీహెచ్. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ రేంజ్ ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 151కిమీ అయితే, ఒరిజినల్ రేంజ్ ఎకో మోడ్‌లో 125కిమీ, సాధారణ మోడ్‌లో 100కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. 500డబ్ల్యూ పోర్టబుల్ ఛార్జర్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఇంట్లో కేవలం ఏడు గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లోని ఫీచర్ల విషయానికొస్తే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టైలాంప్తో వస్తుంది. 5 అంగుళాల ఎస్సీడీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, డిజిటల్ కీ, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్,క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
ఏఐపై భవిష్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సామాన్యులు సైతం సులభంగా వినియోగించేలా చాట్‌జీపీటీ తరహాలో భారత్ సైతం చాట్ బాట్లను తయారు చేయాలని ఓలా అధినేత భవిష్ అగర్వాల్ పిలుపునిచ్చారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో జరిగిన ఇన్సైట్: ది డిఎన్ఎ ఆఫ్ సక్సెస్ 12వ ఎడిషన్‌లో అగర్వాల్ మాట్లాడారు. రోజువారీ వినియోగంలో ఏఐ పాత్రపై ఆయన నొక్కి చెప్పారు. ఏఐ గురించి మాట్లాడుతూ..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారత్ ప్రపంచ దేశాలకు దిశా నిర్ధేశం చేసే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ‘ఏఐ రెవెల్యూషన్ వేగంగా జరుగుతోంది. ఇది మనుషుల ప్రొడక్టివిటీని పెంచుతుంది. సైన్స్ ,ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది.అంతేకాదు జ్ఞానం, సృజనాత్మకత సరిహద్దులను చెరిపేస్తుంది. సాంకేతిక, ఆర్థిక పురోగతితో పాటుగా రీసెర్చ్ ,మెటాఫిజికల్ అన్వేషణ వంటి వివిధ ఏఐ అంశాలలో భారత్ అగ్రగామిగా వృద్ది సాధిస్తుందని భవిష్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు. -
‘70 గంటలు పని’..నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగుల ఆగ్రహం!
దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని ట్రోల్ చేస్తున్నారు. కానీ, ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ మాత్రం నారాయణ మూర్తి వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్ దాస్ పై’ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారాయణ మూర్తి భారతీయల పని సంసృ్కతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత వారానికి 70 గంటలు పనిచేస్తే భారత్ ఆర్ధిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చని వ్యాఖ్యానించారు. చైనా లాంటి దేశాలతో పోల్చినా దేశంలో పని గంటలు తక్కువని, ప్రపంచంలోనే అత్యల్పమని వివరించారు. ఇలా కాకుండా రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో జపాన్, జర్మన్ ప్రజలు ఎలా విధులు నిర్వహించారో, అలా చేయాలని అభిప్రాయపడ్డారు. Totally agree with Mr Murthy’s views. It’s not our moment to work less and entertain ourselves. Rather it’s our moment to go all in and build in 1 generation what other countries have built over many generations! https://t.co/KsXQbjAhSM — Bhavish Aggarwal (@bhash) October 26, 2023 ఈ సందర్భంగా ప్రభుత్వాల్లోని అవినీతి, బ్యూరోక్రాట్స్ జాప్యం వంటి ఇతర సమస్యలను ప్రస్తావించారు. ‘‘ఉత్పాదకత విషయంలో భారత్ చాలా వెనుకబడి పోయింది. దీన్ని పెంచాలి. మెరుగుపరుచుకోకపోయినా, ప్రభుత్వంలో అవినీతిని ఏదో ఒక స్థాయిలో తగ్గించకపోయినా, అధికార యంత్రాంగం వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైనా మనం ఏమీ సాధించలేం. అద్భుతమైన పురోగతి సాధించిన దేశాలతో పోటీ పడలేం’ అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో పెద్ద దుమారమే చెలరేగింది. చాలామంది ఆయన వ్యాఖ్యలను ఖండించడం, విమర్శించడం చేశారు. కానీ... భవిష్ అగర్వాల్ మాత్రం మద్దతుగా మాట్లాడారు. ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నారాయణ మూర్తి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. తక్కువ పని చేసి మనల్ని మనం సమర్ధించుకోవడం కాదని ట్వీట్ చేశారు. మరోవైపు టెక్కీలు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి అభిప్రాయాలపై విభిన్నంగా స్పందిస్తున్నారు. 2005లో ఇన్ఫోసిస్‌లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతం ఏడాదికి రూ. 3.5 లక్షలుంటే 2023లోనూ అంతే ఇస్తున్నారని, ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కేలా రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తే .. అంచనాలకు మించి దాని కంటే 40 గంటలు అంకితభావంతో పనిచేస్తామని కొందరు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లు మీరూ చేసేయండి. Infosys fresher salary in 2005: 3.5 lakhs pa Infosys fresher salary in 2023: 3.5 lakhs pa If uncle adjusted inflation atleast, it would be well over 15LPA. Pay that and then expect to work for 40 hours with full dedication. Everything will sort out as is. https://t.co/kaAXbgzhwB — Abhishek (@MrAbhi_shek) October 26, 2023 Law limits work to 48 hours a week, but he wants 70. If we exclude Sundays, that's a grueling 12 hours a day. Dear Narayan murthy if youngsters work 12 hours daily, who will embrace your technology? It's time for your retirement; otherwise, Infosys faces a natural demise. https://t.co/7AesTZJWiS — Abinash Sahoo (@irabinash) October 26, 2023 #Infosys management loooking for employees to work 70 hrs a week pic.twitter.com/VR9WkVZYck — T.Ramesh (@hereiam_hi) October 26, 2023 First start paying salary to your Infosys employees like the companies pay in Germany and Japan. And then you call speak BS from your capitalist mouth.#NarayanaMurthy 🤡 pic.twitter.com/RO21ELrUbs — 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) October 27, 2023 Indirectly #Infosys founder Narayana Murthy is saying.. work 12 hours per day spoil your mental health due to NO proper sleep after spoiling ur health,spend lakhs of rupees in hospitals for ur treatment increase the business of Infosys increase profit,revenue of Infosys 😁😁 pic.twitter.com/YEEVdoEoig — Sharanu.N🇮🇳 (@sharanu_ja) October 27, 2023 -
ప్రతి పది సెకన్లకు ఒక బైక్..హాట్‌కేకుల్లా ఓలా స్కూటర్ల అమ్మకాలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ ఓలా ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించింది. ఈ సేల్‌లో ఓలా ఈవీ బైక్స్ హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయని ఆ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలపై భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2022 ఫెస్టివల్ సీజన్‌తో పోల్చితే.. ఈ ఏడాది దసరా, నవరాత్రులలో ప్రతి పది సెకన్లకు ఒక ఓలా బైక్‌ను అమ్మినట్లు పేర్కొన్నారు. దీంతో 2022 కంటే ఈ ఏడాది 2.5 రెట్లు అమ్ముడు పోయినట్లు సంతోషం వ్యక్తం చేశారు. Our sales have gone through the roof this Dussehra and Navratri! Selling a scooter every 10 seconds right now, and almost 2.5x of last year!😀 India’s EV moment is here this festive season!#endICEage — Bhavish Aggarwal (@bhash) October 24, 2023 అందుబాటులో ఐదు మోడళ్లు ఓలా దేశీయ మార్కెట్లో 5 మోడల్స్‌ను అమ్ముతుంది. గత ఆగస్ట్ నెలలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో జనరేషన్2, ఎస్1 ఎక్స్ పేరుతో మూడు వేరియంట్స్‌ను వాహనదారులకు పరిచయం చేసింది. 2030 నాటికి భారత్ లక్ష్యం ఇదే 2030 నాటికి భారతదేశం రోడ్ల పై ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరగాలని అప్పటి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2017లో ప్రకటించారు. అంతేకాదు, 2030 నాటికి దేశంలో 30 శాతం ప్రైవేటు కార్లు, 70 శాతం కమర్షియల్ వాహనాలు, 40 శాతం బస్సులు, 80 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. తాజాగా, ఓలా సేల్స్ చూస్తుంటే భారత ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. చదవండి👉 నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్ -
నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్
ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు నెలకు రూ.70,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని ప్రవేశ పెట్టినట్లు వెల్లడించింది. బెంగళూరుకి చెందిన రైడర్లు ముందుగా ఓలా ఎస్1 బైక్‌ని అద్దెకు తీసుకోవాలని, తద్వారా నెలకు రూ.70,000 సంపాదించుకోవచ్చంటూ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ తెలిపారు. రైడ్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సందించుకోవచ్చో వివరించారు. డబ్బులు ఎలా సంపాదించాలి? రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5,000 చెల్లించి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ బైక్‌ను అద్దెకు తీసుకోవాలి. ఇందుకోసం డ్రైవర్లు పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలు, వినియోగంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అనతరం తాము రూపొందించిన ప్రత్యేక చెల్లింపులు ప్రకారం.. రైడర్లు కస్టమర్లకు సేవలు అందిస్తే కమిషన్ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని భవిష్ విడుదల చేసిన ఓ పాంప్లెట్లో పేర్కొన్నారు. ఓలా విడుదల చేసిన పాంప్లెట్లో ఏముందంటే? బెంగళూరులోని బైక్ ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేసిన చెల్లింపు పద్దతి ప్రకారం.. 10 నుంచి 14 బుకింగ్స్ వరకు ఫిక్స్డ్ పేమెంట్ రూ.800 వరకు చెల్లిస్తుంది. అందులో ప్రతి రోజు రెంటల్ కింద రూ.100 చెల్లించాలి. ఇక, 15 నుంచి 19 బుకింగ్స్ వరకు ఇన్సెంటీవ్ రూపంలో రూ.1,300 వరకు సంపాదించవచ్చు. అందులో రెంటల్ అమౌంట్ రూ.50గా నిర్ధేశించింది. అయితే, రోజుకు 20 కంటే ఎక్కువ రోజువారీ బుకింగ్‌ల కోసం డ్రైవర్లు రోజువారీ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా రోజుకి రూ.1,800 నుండి రూ. 2,800 పరిధిలో సంపాదించవచ్చు. వాళ్లు మాత్రం అనర్హులే అదే సమయంలో, డ్రైవర్లు వారి బుకింగ్‌లు రోజుకు 10 కంటే తక్కువ ఉంటే రోజువారీ స్థిర ఆదాయానికి అర్హులు కాదు. అయితే వారు అద్దె మొత్తంగా రూ. 300 చెల్లించాలని ఓలా తెలిపింది. ప్రయాణీకుల కోసం,ఓలా గత నెలలో షేర్ చేసిన రేట్ చార్ట్ ప్రకారం, బైక్ టాక్సీ సర్వీస్ కోసం 5 కిలోమీటర్లకు రూ. 25, 10 కిలోమీటర్లకు రూ. 50 చొప్పున నిర్ణయించింది. తక్కువలో తక్కువగా నివేదిక ప్రకారం, పూర్తిగా ఛార్జ్ చేయబడిన ఓలా ఎస్1 ఏ స్కూటర్ 70-75 కిమీల దూరం ప్రయాణం చేయొచ్చు. రూ. 800 ఇన్సెంటీవ్ పొందడానికి రైడర్ 10 రైడ్లను పూర్తి చేయాల్సి ఉండగా..ఏడు-ఎనిమిది ట్రిప్పుల తర్వాత వెహికల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. స్కూటర్ పూర్తిగా రీఛార్జ్ చేయడానికి ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. చివరిగా.. రైడర్లు ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాల్ని తెలుసుకునేందుకు అధికారిక పేజీని సంప్రదించాలని ఓలా ప్లాంపెట్లో హైలెట్ చేసింది. చదవండి👉 ఓలాకు భారీ షాక్, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్ అగర్వాల్! -
ఓలా ఎస్1 ఎయిర్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ఎయిర్ డెలివరీలను షురూ చేసింది. ఓలా ఎస్1,ఎస్1 ప్రోకి తరువాత గత నెలలో లాంచ్ అయిన ఇ-స్కూటర్ ఎస్ 1 ఎయిర్.ఇప్పటి వరకు 50వేల బుకింగ్‌లో ప్రజాదరణ పొందిన S1 Air డెలివరీలు 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయని, ఇతర మార్కెట్లలో త్వరలో మొదలవనున్నాయని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఎక్స్పీరియన్స్ నెట్‌వర్క్‌లో ఏదైనా ఒకదానిలో,లేదా యాప్‌ద్వారా S1 ఎయిర్, సులభమైన ఫైనాన్సింగ్ఎంపికలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనిప్రకటించింది. S1Air 3 kWh బ్యాటరీ సామర్థ్యం, 6kW గరిష్ట మోటారు శక్తి, 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ మరియు 90 km/hr గరిష్ట వేగాన్నిఅందిస్తుంది.ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, భారీ 34-లీటర్ బూట్ స్పేస్ , డ్యూయల్-టోన్బాడీ కలిగి ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ , మిడ్నైట్ బ్లూ ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. -
కళ్లు చెదిరేలా ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ.. వీడియోలు షేర్ చేసిన సీఈవో
భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందుతున్న ఓలా ఎలక్ట్రిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్క డీలర్షిప్ కూడా లేకుండా అధిక విక్రయాలు పొందిన ఈ సంస్థ ఇప్పుడు మరింత దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ రెండు వీడియోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా ఫ్యూచర్ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ఇందులోని ఒక వీడియో కంపెనీలో లోపల జరుగుతున్న కార్యకలాపాలను చూపిస్తోంది. మరో వీడియోలో నిర్మాణంలో వేగంగా దూసుకెళ్తున్న గిగాఫ్యాక్టరీని చూడవచ్చు. ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు? ఈ వీడియోలను షేర్ చేస్తూ ఈ రోజు ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో.. రానున్న రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలమంది వీటిని వీక్షించగా.. చాలా మంది లైక్ చేస్తున్నారు. మరి కొందరు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. At the Futurefactory today. Major changeover from Gen 1 production to all Gen 2 products happening this week - Air, Pro, X! Capacity doubling and number of products going from 1 to 5. Also, Gigafactory construction underway. Crazy momentum and activity! pic.twitter.com/bymdf8qoPG — Bhavish Aggarwal (@bhash) August 20, 2023 -
బడ్జెట్ ధరలో, ఓలా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చూస్తే వావ్ అనాల్సిందే
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలా శుభవార్త చెప్పింది. భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా కస్టమర్ డే ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా బడ్జెట్ ధరలో ఓలా ఎస్ 1 ఎక్స్‌తో పాటు ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2 బైక్‌లను లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ఎక్స్ ధర రూ.79,000 (ఎక్స్ షోరూం) ఉండగా, ఓలా ఎస్ 1 ప్రో జనరేషన్ 2 ధర రూ.1.47 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంది ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎక్స్‌ను మూడు వేరింట్లలలో అందిస్తుంది. ఎస్1 ఎక్స్ ప్లస్, 2కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీతో ఎస్1 ఎక్స్, 3కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీతో ఎస్1 ఎక్స్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్లలో టాప్ ఆఫ్ ది లైన్ మోడల్‌తో ఎక్స్ ప్లస్ 5.0 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, ఎక్స్ మోడల్‌లు 3.5 అంగుళాల డిస్ప్లేతో వస్తాయి. కానీ రెండింటి పనితీరు ఒకేలా ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్ కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఓలా సంస్థ వెహికల్ బాడీ తయారీ కోసం బ్లాక్ ప్లాస్టిక్‌ను ఉపయోగించింది. ఇక, ఎస్1 ఎక్స్ ప్లస్, ఎస్1 ఎక్స్3 రెండూ 6 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో 3కేడబ్ల్యూహెచ్ ఛార్జర్‌తో వస్తున్నాయి. ఈ రెండు వేరియంట్ల రేంజ్ 151 కిలోమీటర్లు కాగా, టాప్ స్పీడ్ 90 కేఎంపీఎంహెచ్తో డ్రైవ్ చేయొచ్చు. 3.3 సెకండ్లలో 0 నుంచి 40కేఎంపీహెచ్ వరకు వెళుతుంది. ఓలా ఎస్1 ఎక్స్2 6కే డబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటర్తో 2కేడబ్ల్యూ బ్యాటరీ ఛార్జర్‌ను అందిస్తుంది. లోయర్ రేంజ్ స్పీడ్ 91కేఎం, లోయర్ టాప్ స్పీడ్‌తో 85కేఎంపీహెచ్‌తో వెళ్లొచ్చు. కేవలం రూ.999 చెల్లించి ఆగస్ట్ 15 పర్వదినాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 21 వరకు పరిచయ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందులో భాగంగా ఓలా ఎస్1 ఎక్స్ప్లస్ను రూ.99,999కే సొంతం చేసుకోవచ్చు. డెలివరీలు సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నాయి. ఎస్1ఎక్స్3, ఎస్1 ఎక్స్2 ప్రీ రిజర్వేషన్ కోసం కేవలం రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎస్1 ఎక్స్3 వెహికల్ ధర రూ.89,999 ఉండగా, ఎస్1 ఎక్స్2 ధర రూ.79,999గా ఉంది. కేవలం ఈ ఆఫర్ నేటి నుంచి మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్ ఓలా ఎస్1 ఎయిర్ జనరేషన్ 2ను లాంచ్ చేసింది. బ్యాటరీని రీడిజైన్ చేసి విడుదల చేయడంతో వెహికల్ పనితీరు అద్భుతంగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు పవర్ట్రయిన్లో మార్పులు చేసి 11 డబ్ల్యూ మోటార్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎస్1 ప్రో జనరేషన్ 2 ‘0 నుంచి 40 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో అధిగమించవచ్చు. టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్. పరిధి 195 కిలో మీటర్లుగా ఉంది. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, వెనుకవైపు మెరుగైన మోనోషాక్ ఉన్నాయి. ఇది స్కూటర్ 6 కిలోల బరువు తగ్గడానికి సహాయపడింది. కొత్త ఓలా ఎస్ ప్రో జనరేషన్ 2 ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, పరిచయ) ధరలతో సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. అదరగొట్టేస్తున్న ఓలా బైక్‌లు ఈ సందర్భంగా ఓలా మరికొద్ది రోజుల్లో నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేస్తామని ప్రకటించింది. డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్, క్రూయిజర్ పేరిట వావ్ అనిపించేలా ఉన్న కాన్సెప్ట్ బైక్స్‌ను ప్రదర్శించింది. 2024 చివరికల్లా మార్కెట్‌కు పరిచయం చేయనుంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సైతం ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను అమ్మాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తోంది. చదవండి👉 ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్! -
షాకింగ్: ఓలా ఎస్1 స్కూటర్‌కు గుడ్ బై, కస్టమర్లు ఏం చేయాలి?
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. 2021లో విడుదల చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్ నుండి ఎస్1 వేరియంట్‌ను తొలగించి ఎస్1 ప్రోపై, ఎస్ 1 ఎయిర్ మోడల్స్ ఫోకస్ పెట్టనుంది. ఓలా ఎస్ 1 ఎయిర్ లాంచింగ్ సందర్బంగా ఎస్1 స్కూటర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంపై స్పష్టతలేదు. అయితే పరిమిత ఉత్పత్తి సామర్థ్యం ,ఇతర వేరియంట్లకు అధిక డిమాండ్ కారణంగా కావచ్చని అంచనా. దీని ప్రకారం ఇకపై ఓలా పోర్ట్‌ఫోలియోలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల పరంగా ఎస్ 1 ఎయిర్, ఎస్1 ప్రొ దాదాపు ఒకే రకంగా ఉన్న కారణంగా ఎస్ 1 వేరియంట్ అమ్మకాలను నిలిపి వేసిందే మోననేది అంచనా. అలాగే రెండింటీ మధ్య పేర్లలో భిన్నం తప్ప పెద్దగా తేడా ఏమీ లేదని భావిస్తున్నారు. (ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!) ఎస్1 బుక్ చేసుకున్న వారు ఏంచేయాలి? ఎస్1 వేరియంట్‌ను బుక్ చేసిన కస్టమర్లు ప్లాన్లలో మార్పు గురించి తెలియజేస్తూ కంపెనీ ఇమెయిల్‌ను పంపింది. ఈక్రమంలో వారికి మూడు ఆప్షన్లు ఇచ్చింది. S1 ప్రో వేరియంట్‌కి అప్‌గ్రేడ్ కావడం, 2022 చివరిలో ఎస్1 ప్రొడక్షన్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం లేదా వారి బుకింగ్‌ను రద్దు చేసి మనీ రీఫండ్ పొందడం. ఎస్ 1 ప్రొ ధర రూ. 1,29,999, ఎక్స్-షోరూమ్ (FAME 2 సబ్సిడీతో సహా). ఓలా యాప్‌లో జనవరి 21న సాయంత్రం 6 గంటలకు తుది చెల్లింపు విండో తెరిచినప్పుడు అప్‌గ్రేడ్‌ని ఎంచుకున్న కస్టమర్లు రూ. 30,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఓల్ ఎస్1 ఎయిర్ ఇప్పటికే ఉన్న కస్లమర్లకోసం ముందస్తు బుకింగ్‌లను మొదలు పెట్టింది. విండోను తెరిచిన మొదలు పెట్టిన గంటలోపు 1,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిందని సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్లో ప్రకటించారు. సామాన్య ప్రజానీకం ప్రజల ఈ నెల 31నుంచి సేల్ షురూ అవుతుంది. ఎస్1 ఎయిర్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయి. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎయిర్ ధర రూ. 85,099-1.1లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. After S1 Air, buying an ICE scooter means losing money every month. BUY EV and save money!! pic.twitter.com/GkBVThEyN1 — Bhavish Aggarwal (@bhash) July 28, 2023 ఫ్యూచర్ ప్లాన్స్ అలాగే ఓలా OS4పై పని చేస్తోందట. త్వరలో సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించనుందని మార్కెట్ వర్గాల అంచనా. అంతేకాదు .ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై కూడా పని చేస్తోంది. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరింపజేయనున్నామని భవిష్ హింట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఓలా బైకులు కూడా రంగంలోకి దిగనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 3000! I’m also heading to the factory now 😳 https://t.co/q89piwCOfA — Bhavish Aggarwal (@bhash) July 27, 2023 -
ఓలా ఎస్1 ఎయిర్ లాంచింగ్ బంపర్ ఆఫర్: మూడు రోజులే!
Ola S1 Air introductory price: దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఓలా లేటెస్ట్ ఓలా S1 ఎయిర్. దీనికి సంబంధించి ఒక కీలకవిషయాన్ని ఓలా సీఈఓ భవిష్అగర్వాల్ ప్రకటించారు. పరిచయ ఆఫర్‌గా 10వేల తగ్గింపును ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.ఎస్1 ఎయిర్ జూలై 28- 30 తేదీల మధ్య కొనుగోలు చేసిన వారికి ప్రారంభ ధర రూ. 1,09,999కే లభిస్తుందని పేర్కొన్నారు. జూలై 31 తరువాత దీని ధర రూ. 1,19,999గా ఉంటుదని, అందుకే ఇపుడే మీ ఎలాఎస్1 ఎయిర్‌ను తక్కువ ధరకే రిజర్వ్ చేసుకోమ్మని సూచించారు. అలాగే S1ఎయిర్ డెలివరీ ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమవు తుందని చెప్పారు. 500,000 కి.మీ వరకు పరీక్షించామని కూడా ఆయన వెల్లడించారు. గత రెండు నెలలుగా వ్యక్తిగతంగా ఎస్1 ఎయిర్ని చాలా ఎక్కువగా నడిపాను.. ఇది నిజంగా అద్భుతమైన స్కూటర్ అతి త్వరలో వస్తుందిన ట్వీట్ చేశారు. ఓలా నుంచి అత్యంత చవకైన మోడల్ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ జూలై నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించారు. 999 రూపాయల వద్ద ఈ స్కూటర్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రధానంగా FAME సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 3 kWh బ్యాటరీతో లాంచ్ అయిన ఎస్1 ఎయిర్ పూర్తి ఛార్జ్‌పై 125 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. Purchase for S1 Air will open from 28th July-30th July for reservers and all our existing community, at an introductory price of ₹1,09,999. Everyone else can purchase from 31st July at ₹1,19,999. Reserve now to get the introductory price! Deliveries start early August! pic.twitter.com/EBM35oSh0B — Bhavish Aggarwal (@bhash) July 21, 2023 -
సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న భవిష్ అగర్వాల్ ట్వీట్!
Bhavish Aggarwal Tweet: దేశీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) గురించి, ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే భారతీయ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న సంస్థగా పేరుపొందింది. అయితే ఇటీవల భవిష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలోని కొన్ని కంపెనీలు పరాయి దేశాలకు చెందిన సంస్థల వాహనాలను ఎందుకు తయారు చేస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని, మేము పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తామంటూ ట్వీట్ చేసాడు. ఇది హీరో మోటోకార్ప్ & బజాజ్ ఆటో కంపెనీలను దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేసినట్లు చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: దెబ్బకు 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ - కారణం ఇదే అంటున్న ఐటీ శాఖ!) I can’t understand why some companies are falling head over heels to contract manufacture aging western ICE motorcycle brands in India. We’ll build the future of motorcycling with EVs and #MakeInIndia for the whole world!🏍️🔋🇮🇳 — Bhavish Aggarwal (@bhash) July 11, 2023 ఇటీవల హీరో మోటోకార్ప్ కంపెనీ అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్సన్లో కలిసి ఎక్స్440 బైకుని రూ. 2.29 లక్షలకు లాంచ్ చేసింది. అదే సమయంలో బజాజ్ ఆటో ట్రైయంఫ్ కంపెనీతో కలిసి స్పీడ్ 400 మోటార్ సైకిల్ రూ. 2.33 లక్షలకు విడుదల చేసింది. ఈ కంపెనీలను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేసినట్లు కొంతమంది భావిస్తున్నారు. దీని పైన సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. -
మరో ఓలా స్కూటర్ రానుందా? భవిష్ అగర్వాల్ ఏం చెబుతున్నాడంటే?
Ola Upcoming Electric Scooter: భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇప్పుడు మార్కెట్లో మరో స్కూటర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్' (Bhavish Aggarwal) తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, వచ్చే నెలలో (2023 జూలై) మరో ఉత్పత్తిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎండ్ఐస్ఏజ్ (#endICEAge) షో పార్ట్ వన్ అని అన్నారు. అయితే త్వరలో వెల్లడించనున్న స్కూటర్ ఏది అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ జాబితాలో మరో స్కూటర్ చేరనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నాము. ఇది కూడా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది. Announcing our next product event in July. Calling it the #endICEAge show, Part 1! Part 1 of the show would end ICE age in scooters! With S1 Pro, S1 Air and … XXXX 😉😎 And maybe one more thing!😀 pic.twitter.com/7Qz5JRg9I7 — Bhavish Aggarwal (@bhash) June 19, 2023 -
భవిష్ అగర్వాల్ ట్వీట్.. ఇలా చేస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీదే..!
Ola S1 Pro Special Edition: ఆధునిక కాలాన్ని సోషల్ మీడియా ప్రపంచాన్ని ఎలేస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా నిమిషాల్లో వైరల్ అయిపోతోంది. అంతే కాకుండా కొన్ని సంఘటన మీద ట్రోల్స్ అండ్ మీమ్స్ మరింత ఎక్కువవుతున్నాయి. మీమ్స్ చేసేవారికి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్ అగర్వాల్ ట్విటర్ వేదికగా ఐసీఈ అండ్ పెట్రోల్ వెహికల్స్ మీద మీమ్స్ చేయడానికి ట్రై చేయండి, అందులో ఒక బెస్ట్ మీమ్స్ చేసిన ఒకరికి ఓలా ఎస్1 ప్రో స్పెషల్ ఎడిషన్ లభిస్తుందని ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే కొంత మంది మీమ్స్ చేయడం ప్రారంభించి పోస్ట్ కూడా చేస్తున్నారు. Trying to make some funny ICE and petrol vehicle memes. If you have some, share here! Best one today will get an Ola S1 Pro special edition 🙂 — Bhavish Aggarwal (@bhash) May 27, 2023 ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా కావాలనుకునేవారు ఐసీఈ, పెట్రోల్ వెహికల్స్ మీద మీమ్స్ చేయవచ్చు. ఇది మీమ్స్ చేసేవారికి మంచి సువర్ణావకాశమనే చెప్పాలి. ఎందుకంటే రూ. లక్ష కంటే ఎక్కువ ఖరీదైన స్కూటర్ ఒక్క మీమ్స్ చేయడం ద్వారా ఉచితంగా పొందవచ్చు. బహుశా ఈ అవకాశం ఈ రోజు మాత్రమే అని తెలుస్తోంది. -
ఓలా యూజర్లకు గుడ్ న్యూస్: సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ఓలా తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీలను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు ఒక సమాచారాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. తమ తొలి ఎస్1 ఎయిర్ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసింది!! భలే ఉన్నాయ్..ఓలా ఎస్1 ఎయిర్ డెలివరీలు ఈ ఏడాది జూలైలో ప్రారంభమవుతాయంటా సీఈవో ట్వీట్ చేశారు. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ మరోసారి భారీ నిధులను సేకరించింది. తాజాగా ప్రముఖ సావరిన్ ఫండ్ నేతృత్వంలో 300 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 2,500 కోట్లు) దక్కించుకుంది. దీంతో కంపెపీ విలువ 6 బిలియన్ల డాలర్లకు చేరింది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) కాగా ఓలా ఎస్1 ఎయిర్‌ను గత ఏడాది లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ధరలో మూడు వేరియంట్లలో లభ్యం. దీని ధర బేస్ మోడల్ ధర రూ. 84,999గా ఉంది. మిడ్ వేరియంట్ ధర రూ. 99,999గాను, టాప్ వేరియంట్ ధర రూ.1,09,000 (ఎక్స్-షోరూమ్)గాను నిర్ణయించినసంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) Test drove the first S1 Air vehicles!! Loving them 🙂 Coming to you in July 😎💪🏼🛵 pic.twitter.com/wWnIAFYs62 — Bhavish Aggarwal (@bhash) May 23, 2023 -
ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !
బెంగళూరు: ఎలక్ట్రిక్ వాహన తయారీదారు వోలా ఎలక్ట్రిక్ నిధుల సమీకరణ బాట పట్టింది. విస్తరణ ప్రణాళికలు, ఇతర కార్పొరేట్ అవసరాల రీత్యా 30 కోట్ల డాలర్లు (రూ. 2,475 కోట్లు) సమకూర్చుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే నష్టాల నుంచి బయటపడి, లాభాలు ఆర్జించగలదన్న అంచనాల నడుమ కంపెనీ తాజా నిధుల సమీకరణకు తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. (ఇదీ చదవండి: ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం) 2023, 2024లో మాస్-మార్కెట్ స్కూటర్, మాస్-మార్కెట్ మోటార్‌సైకిల్, మల్టిపుల్ ప్రీమియం బైక్స్ లాంటి మరిన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ గతంలో చెప్పారు. అలాగే 2025 చివరి నాటికి భారతదేశంలో విక్రయించబడే మొత్తం టూవీలర్స్, 2030 నాటికి దేశంలో విక్రయించేకార్లన్నీఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనేది కంపెనీ మిషన్ ఎలక్ట్రిక్ లక్క్ష్యమని ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే) దీనికి తోడు ఇటీవలే తమిళనాడు క్రిష్ణగిరిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భూమి సేకరణకు అక్కడి ప్రభుత్వంతో MOU సంతకం కుదుర్చుకుంది ఓలా. ఇందులోసెల్ ఫ్యాక్టరీ, ఫోర్-వీలర్ ఫ్యాక్టరీ, సప్లయర్ ఎకోసిస్టమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ద్విచక్ర వాహనాల ఫ్యాక్టరీని కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోందని తెలుస్తోంది. -
ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్నారా?.. ఓలా సంస్థ కీలక నిర్ణయం.. ఉచితంగా!
ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన స్కూటర్లలలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పాటు, అగ్నికి ఆహుతైన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్1 ఈవీ వెహికల్స్‌లో ఫ్రంట్ ఫోర్క్ ఉన్నట్టుండీ విరిగిపోవడంతో వాహనదారులు స్వల్పంగా గాయపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తరుణంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్రంట్ ఫోర్క్‌లో ఏదైనా అసౌకర్యంగా ఉంటే ఫ్రీగా అప్‌గ్రేడ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి అప్ గ్రేడ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకునేందుకు తామే కస్టమర్లను సంప్రదిస్తామని ఓలా తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. Important update about your Ola S1! pic.twitter.com/ca0jmw1BsA — Ola Electric (@OlaElectric) March 14, 2023 -
డెలివరీ బాయ్‌తో భవిష్ అగర్వాల్ సెల్ఫీ: ఓలా స్కూటర్‌తో చాలా అదా అంటూ..
ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సజావుగా ముందుకు సాగిపోతోంది. క్రమంగా కంపెనీ అమ్మకాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల భవిష్ అగర్వాల్ ఒక ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫొటోలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఉన్న జొమాటో డెలివరీ బాయ్‌ని చూడవచ్చు. ఈ డెలివరీ బాయ్ 9 నెలల్లో లక్ష కంటే ఎక్కువ ఖర్చులను ఆదా చేసాడని, అతడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడుతున్నాడని కూడా భవిష్ ట్విట్టర్ పోస్ట్‌లో రాశాడు. జొమాటో డెలివరీ బాయ్ ఉపయోగించే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకదానిలో ఛార్జింగ్ పూర్తయినప్పుడు, ఇంకోదానిని ఉపయోగిస్తాడు. అప్పుడు ఛార్జింగ్ కాలీ అయిన స్కూటర్‌కి ఛార్జింగ్ వేసుకుంటాడు. ఈ విధంగా రెండు స్కూటర్లను నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నాడు డెలివరీ బాయ్ సంతోష్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. దీంతో సాధారణ 9 నెలల్లో లక్షకంటే ఎక్కువ ఆదా చేసాడని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా కంపెనీ స్కూటర్లు ఉండటం గమనార్హం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఓలా ఎస్1 ప్రో 4 కిలోవాట్ లిథియం ఆయన బ్యాటరీతో 181 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఇది 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6 గంటల్లో, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది దీపావళి సందర్భంగా 'ఎస్1 ఎయిర్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. Met Santosh at a traffic junction. Very enterprising guy! Owns 2 @OlaElectric scooters and has driven more than 50000 kms! Drives the second one when the first is on charging at our hyper charging station. Has saved more than ₹1 lakh in just 9 months! pic.twitter.com/89OxmM2uy9 — Bhavish Aggarwal (@bhash) February 28, 2023 -
ఓలా సంచలనం: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఈవీ హబ్, భారీ పెట్టుబడులు
చెన్నై: ఓలా సీఈవోభవిష్ అగర్వాల్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా తాజాగా మరో అడుగుముందుకేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్లు, లిథియం-అయాన్ సెల్‌లను తయారు చేసేందుకు ఓలా రూ.7,614 కోట్ల పెట్టనుంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన అనుబంధ కంపెనీలైన ఓలా సెల్ టెక్నాలజీస్ (OCT) , ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ (OET) ద్వారా ఒక ఒప్పందంపై సంతకం చేసారని శనివారం ట్వీట్ చేశారు. (ఇవీ చదవండి: ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు) (భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్ మహీంద్ర) తమిళనాడులో టూ వీలర్, కార్ల లిథియం సెల్ గిగాఫ్యాక్టరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. తమిళనాడుతో ఈరోజు ఎంఓయూపై సంతకం చేశామని భవిష్ వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అగర్వాల్ మధ్య ఒప్పందం కుదిరిందంటూ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. కృష్ణగిరి జిల్లాలో ఈ 20 గిగా వాట్ల బ్యాటరీ తయారీ యూనిట్ఏర్పాటు కానుంది. మొత్తం పెట్టుబడిలో దాదాపు రూ.5,114 కోట్లు సెల్ తయారీ ప్లాంట్‌లోకి, మిగిలిన రూ.2,500 కోట్లు కార్ల తయారీ యూనిట్లోకి వెళ్తాయి. Ola will setup the worlds largest EV hub with integrated 2W, Car and Lithium cell Gigafactories in Tamil Nadu. Signed MoU with Tamil Nadu today. Thanks to Hon. CM @mkstalin for the support and partnership of the TN govt! Accelerating India’s transition to full electric! 🇮🇳 pic.twitter.com/ToV2W2MOsx — Bhavish Aggarwal (@bhash) February 18, 2023 సంవత్సరానికి 140,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లను ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. 2024 నాటికి కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500కిలోమీటర్ల రేంజ్‌తో కారును తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2024 నాటికి ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) ప్రారంభించాలనే ప్రణాళికను మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తాజా డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పెట్టుబడుదల ద్వారా 3,111 ఉద్యోగాలను సృష్టించనుందట. తమిళనాడు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ డీల్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆటో హబ్‌గా ఉన్న తమిళనాడులో హోసూర్‌లోని కంపెనీ ప్రస్తుత సౌకర్యం ప్రపంచంలోనే అతిపెద్దఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్లలో ఒకటి అని తమిళనాడు ప్రభుత్వపెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీ గైడెన్స్ తమిళనాడు సీఎండీ విష్ణు అన్నారు. తమిళనాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2023 ప్రకారం రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను (SGST), పెట్టుబడి లేదా టర్నోవర్ ఆధారిత సబ్సిడీ , అధునాతన కెమిస్ట్రీ సెల్ సబ్సిడీ 100 శాతం రీయింబర్స్మెంట్ ఉన్నాయి. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసే విద్యుత్‌పై ఐదేళ్లపాటు విద్యుత్ పన్నుపై 100 శాతం మినహాయింపు, స్టాంప్ డ్యూటీపై మినహాయింపు ,భూమి ధరపై సబ్సిడీని కూడా రాష్ట్రం అందిస్తుంది. గత ఐదేళ్లలో, ఈవీ సె క్టార్లో 48,000 ఉద్యోగాల ఉపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్టులను సాధించింది. -
ఇంకోసారి, వందల మంది ఉద్యోగుల్ని తొలగించిన ఓలా!
రైడ్ షేరింగ్ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన అన్నీ విభాగాలకు చెందిన ఉద్యోగుల్లో సుమారు 200 మందిని ఫైర్ చేసింది. సంస్థ పునర్నిర్మాణం పేరుతో గతేడాది 1100 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఓలా.. తాజాగా మరోసారి ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు శ్రీకారం చుట్టుంది. ఐఎన్‌సీ 42 నివేదికల ప్రకారం.. ఓలా సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాల్లోని ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్ 200 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత సెప్టెంబర్ నుంచి ఉద్యోగుల తొలగింపుపై సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ చర్చిస్తుస్తున్నారని, తాజాగా నిర్ణయం మేరకు ఐటీ ఉద్యోగులపై కంపెనీ వేటు వేసిందని వెలుగులోకి వచ్చినట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ఓలా సైతం ఉద్యోగుల తొలగింపుల్ని ధృవీకరించింది. ఈ అంశంపై ఓలా అధికారి మాట్లాడుతూ.. ‘సామర్థ్యాలను మెరుగుపరుచుకునే క్రమంలో మేము క్రమం తప్పకుండా కంపెనీ పునర్నిర్మాణ చర్యలను తీసుకుంటాం. ఈ నేపథ్యంలో కొందరిని తొలగించడం అదే విధంగా మా ప్రాధాన్యత రంగాలైన ఇంజనీరింగ్ , డిజైన్‌లో కొత్త నియామకాలు జరుగుతుంటాయి. ఈ ప్రక్రియ ప్రతి ఏడాది జరుగుతుందని’ తెలిపారు. -
ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్!
కార్పోరేట్ ప్రపంచంలో బ్రాండ్ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోయిందా ఇక అంతే సంగతులు. అందుకే కార్పొరేట్ కంపెనీలు కోట్లు కుమ్మురించి బ్రాండ్ వ్యాల్యూని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ళ వరకు తన స్ట్రాటజీతో మార్కెట్లో బ్రాండ్‌ను క్రియేట్ చేయడంలో ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ సమర్ధుడు. ఓలా! ఈవీ మార్కెట్లో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి గత ఐదేళ్లుగా ఎన్నో కంపెనీలు ప్రయత్నించినా.. ఓలా వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. లక్ష రూపాయలు చెల్లించి.. స్కూటర్ డెలివరీ కోసం నెలల తరబడి కస్టమర్లు ఎదురు చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ గతేడాది డిసెంబర్లో విడుదలైన ఓలా వెహికల్స్‌లో లోపాలు తలెత్తాయి. ఆర్ అండ్ డీ మీద దృష్టి సారించకుండా నాసిరకం వెహికల్స్ తయారు చేశారంటూ కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెహికల్తో పెట్టుకుంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన భవిష్ అగర్వాల్ బ్రాండ్‌ను, ప్రొడక్ట్ వ్యాల్యూలో మార్పులు చేశారు. తయారీలో రాజీపడకుండా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. మరోవైపు స్కూటర్ల విజయ ప్రస్థానాన్ని రోజుకో రకంగా వివరిస్తున్నారు. తాజాగా ఓలా స్కూటర్‌ను ఎలా క్రియేటీవ్‌గా వినియోగించుకోవచ్చో తెలుపుతూ ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఓలా స్పీకర్లను ఉపయోగించి ఓ యువకుడు లైవ్ క్రికెట్ కామెంటరీ ఇవ్వడం నెటిజన్లను విపరీంగా ఆకట్టుకుంటుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ ప్రాంతంలో యువకులు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. అయితే గ్రౌండ్ సమీపంలో పార్క్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వైర్లెస్ స్పీకర్ ఫీచర్ సాయంతో ఆ వెహికల్ పక్కనే యువకుడు ఫోన్లో క్రికెట్ కామెంటరీ ఇవ్వడం వైరల్‌గా మారింది. ఆ వీడియోను షేర్ చేసిన భవిష్.. మా వెహికల్‌ను అత్యంత సృజనాత్మకంగా వినియోగించుకోవడం తొలిసారి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ భవీష్ ఇది ఇండియా.. ఇక్కడ అన్నీ సాధ్యమేనని ట్వీట్ చేస్తుంటే.. ఆటోమొబైల్ మార్కెట్లో తయారీ దారులకు గేమ్ ఛేంజర్ వెహికల్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి This has to be the most creative use of our vehicle I have seen so far 😄👌🏼 https://t.co/QjCuv4wGQG — Bhavish Aggarwal (@bhash) December 22, 2022 -
ఆ ఐడియా సూపర్ హిట్.. నేడు వేల కోట్లకు అధిపతిగా..
ప్రస్తుత రోజుల్లో ఓలా కంపెనీ పేరు తెలియని వారుండరు. నగర ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ , మరో వైపు ఎందరో ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తోంది ఓలా. ఎన్నో ఒడిదుడుకులు, జయఅపజయాలు ఎదుర్కొని ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా మొదలై ప్రస్తుతం కొన్ని వేల కోట్ల కంపెనీగా రూపాంతరం చెందింది ఈ సంస్థ. ఓలా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలు, అవమానాలు పడ్డా సంస్థ వ్యవస్థాపకుడు , సీఈఓ భవిష్ అగర్వాల్‌కు ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఆయన సక్సెస్ స్టోరీపై ఏంటో తెలుసుకుందాం! ఐఐటీ బాంబేలో చదువు భవిష్ అగర్వాల్ పంజాబ్‌లోని లూథియానాలో పెరిగారు. ఆయన 2008లో ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. అగర్వాల్ 2008లో దేశీటెక్.ఇన్ (Desitech.in)పేరుతో బ్లాగర్‌గా తన స్వంత బ్లాగును ప్రారంభించారు.ఈ వెబ్సైట్ దేశంలోని సాంకేతిక రంగంలో సరికొత్త స్టార్టప్‌ల గురించి సమాచారాన్ని అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియాలో రీసెర్చ్ ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆగర్వాల్ రెండేళ్లపాటు అందులో పనిచేశాడు. ఆ ఘటనే మార్చింది.. ఒకసారి భవిష్ తన స్నేహితులతో కలిసి టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం వారు అద్దెకు టాక్సీ బుక్ చేసుకున్నారు( బెంగళూరు నుంచి బందీపూర్‌కు వరకు) అయితే టాక్సీ డ్రైవర్ సడన్‌గా మైసూర్లో బండి ఆపేశాడు. తనకు ఈ ప్రయాణ ఖర్చులు సరిపోవని, ఇంకాస్త అదనంగా డబ్బులు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశాడు. చివరికి వారు చెల్లించేందుకు అంగీకరించలేదు. దీంతో అక్కడే వారిని వదిలి టాక్సి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఇదంతా అందులో ఉన్న భవిష్ అగర్వాల్‌ను ఆలోచనలో పడేసింది. ఇలాంటి పరిస్థితులు ప్రజలకు పలు సందర్భాల్లో ఎదురవుతుంటాయనే విషయాన్ని భవిష్ అర్థం చేసుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారంగానే నుంచే ఓలా ఆలోచన పుట్టుకొచ్చింది. ఉద్యోగం వదిలేసి.. భవిష్‌కు టెక్నాలజీపై ఆసక్తి ఉండటంతో.. అతని ఓ ఆలోచన వచ్చింది. అలా అతనికి అద్దె కార్ల ఐడియా ప్రస్తుతం ప్రముఖ సంస్థ ఓలా గా మారింది. మొదట్లో తన ఆలోచనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. ఓ సందర్భంలో 2010లో లక్షలు వస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని సైతం వదలాల్సిన పరిస్థితి ఏర్పడిన ధైర్యంగా రాజీనామా చేశాడు. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. చివరికి స్నేహితుడు అంకిత్ భాటియాతో కలిసి ఓలా కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఓలా దాదాపుగా 15 లక్షల మందికి పైగా ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ వేల కోట్ల విలువైన కంపెనీగా కార్యకలాపాలని నిర్వహిస్తోంది. చదవండి: Income Tax: కేంద్రం దీనికి ఓకే అంటే.. పన్ను చెల్లింపుదారులకు పండగే! -
ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు అదిరే ఆఫర్: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు ఓలా ఎలక్ట్రిక్ గుడ్ న్యూస్ చెప్పింది.డిసెంబర్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ టు రిమెంబర్ అంటూ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అలాగే జీరో డౌన్ పేమెంట్‌తో పాటు మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే బేస్ వేరియంట్‌పై ఈ ఆఫర్ వర్తించదు. అలాగే 10 ఈ స్కూటర్లను ఉచితంగా అందించనుంది. గతంలో అక్టోబర్లోప్రకటించిన ఈ ఆఫర్‌ను తర్వాత నవంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆఫర్‌ను డిసెంబర్ 31 2022 వరకు పొడిగించింది. ఓలా ఎస్1 ప్రోపై డిస్కౌంట్ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10వేల తగ్గింపును అందిస్తోంది. తద్వారా ఈ స్కూటర్‌ను రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,39,999. జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్‌తో నెలకు కనిష్టంగా రూ.2,499 ఈఎంఐ ఆప్షన్‌తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. 8.99 శాతం వడ్డీరేటుతోపాటు, వెహికల్ ఫైనాన్స్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. ఉండదు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా లభ్యం. 10 ఎస్1 ప్రో స్కూటర్లు ఉచితంగా పది ఎస్1 ప్రో స్కూటర్లను కస్టమర్లకు ఉచితంగా అందించేందుకు కాంటెస్టును నిర్వహిస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. లక్ష యూనిట్ల విక్రయాలను అత్యంత వేగంగా సాధించిన సంస్థగా ఓలా అవతరించింది, అలాగే ఈ సెగ్మెంట్లో 50 శాతానికి పైగా ఆదాయ మార్కెట్ వాటాతో వరుసగా 3 నెలలో( నవంబరు) కూడా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా కూడా అవతరించింది. కాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు నవంబర్ 2022లో 20,000 యూనిట్లను దాటేశాయని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే విస్తరణలో భాగంగా 11 నగరాల్లో 14 కొత్త ఎక్స్పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. త్వరలోనే మరో 100 సెంటర్లను ప్రారంభించాలని ఓలా భావిస్తోంది. From winning an Ola 🛵, to endless offers while buying it...if there weren’t enough reasons to switch to the Ola S1, here are some more. Own the #1 EV in India and make it a December to remember! 🎁🥳🎄 #EndICEage ⚡️ pic.twitter.com/8aZyqcy9pq — Ola Electric (@OlaElectric) December 5, 2022 -
ఓలా ఎలక్ట్రిక్ బైక్.. ఊహించని అమ్మకాలు, మళ్లీ అదే సీన్ రిపీట్!
ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నవంబర్‌లో 20 వేల యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. పండుగ సీజన్ తర్వాత కూడా తమ విక్రయాలు జోరు ఏ మాత్రం తగ్గలేదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు జనాదరణ పొందుతున్న తరుణంలో ఓలా కంపెనీ విడుదల చేసిన ఈవీ బైకలు అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. సేల్స్‌లో మరో సారి 20వేల మార్క్‌ను అందుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. కాగా గత అక్టోబర్‌లోనూ సేల్స్ 20 వేలు దాటాయంటూ ఓలా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో.. తమ ద్విచక్ర వాహన బ్రాండ్ మెరుగైన వృద్ధిని సాధించింది. స్కూటర్ మార్కెట్ వాటాలో 50 శాతం సొంతం చేసుకున్నాం. నవంబర్‌లో మా అమ్మకాలు మళ్లీ 20,000 యూనిట్లను దాటాయి. భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీగా మార్చిన మా కస్టమర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ 2021లో 1,400 EVల నుంచి ప్రస్తుతం 90 శాతం ఈవీ సెగ్మెంట్ షేర్ కలిగి ఉంది. 2025 చివరి నాటికి అన్ని 2W విభాగాలలో EVలకు 100 శాతం షేర్ ఉండబోతోందని ట్వీట్ చేశారు. నవంబర్‌లో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి అనే డేటాను ఓలా కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. 20,000 యూనిట్లు అమ్మకాలను మరో సారి అందుకున్నట్లు మాత్రమే ప్రకటించింది. ఓలా ప్రస్తుతం భారత్‌లో S1 ఎయిర్, S1, S1 ప్రోల పేరుతో విక్రయాలు జరుపుతోంది. దీని ధరలు రూ. 84,999 నుంచి రూ. 1.39 లక్షలుగా ఉంది( ఎక్స్-షోరూమ్). వీటిలో ఎస్1 ప్రో ఒక సారి ఫుల్ చార్జింగ్‌తో 116kmph అత్యధిక వేగంతో 180km వరకు ప్రయాణించగలదు. Our sales crossed 20000 again in Nov. Largest EV company in India by a margin! Huge thanks to our customers. From 1400 EVs in June 2021, to 90% EV share today, #EndIceAge is complete in the premium scooter segment! Transition to EVs will be 100% in all 2W segments by end 2025! pic.twitter.com/8dRHcxaxnd — Bhavish Aggarwal (@bhash) December 1, 2022 చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
‘ఒక్కో బిజినెస్ షట్‌డౌన్’..అనుకున్నది సాధిస్తున్న ఓలా సీఈవో భవిష్ అగర్వాల్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా క్యాబ్స్ ప్రయాణంలో కస్టమర్లకు అందించే ఓలా ప్లే సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఓలా 2016లో క్యాబ్‌లో ప్రయాణించే కస్టమర్ల కోసం క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే టాటా ప్లే సర్వీసుల్ని ప్రారంభించింది. ప్రయాణంలో ప్యాసింజర్లు వారికి నచ్చిన మ్యూజిక్ వినొచ్చు. ఎంటర్టైన్మెంట్ వీడియోల్ని వీక్షించొచ్చు. క్యాబ్ ప్రయాణాన్ని ట్రాక్ చేయొచ్చు. అయితే తాజాగా ఓలా నవంబర్ 15నుంచి కస్టమర్లకు ఆ సదుపాయాల్ని అందివ్వబోమని స్పష్టం చేసింది. తన బిజినెస్ ఫోకస్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై పెడుతున్నట్లు తెలిపింది. కాబట్టే ఖర్చును తగ్గిస్తూ ఆదాయం లేని సర్వీసుల్ని నిలిపి వేస్తుంది. ఉద్యోగుల్ని తొలగిస్తుంది. ప్రారంభించిన ఏడాది లోపే సీఈవో భవిష్ అగర్వాల్ ఓలా డాష్ పేరుతో గ్రాసరీ డెలివరీ మార్కెట్లో అడుగు పెట్టారు. కస్టమర్లు ఆర్డర్ చేసిన నిత్యవసర సరకుల్ని 10 నుంచి 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఆ సందర్భంగా ప్రచారం చేశారు. ప్రచారం, బ్రాండ్ కలిసి రావడంతో ఓలా డాష్ వ్యాపారం బాగానే జరిగింది. కానీ భవిష్ ఓలా ఎలక్ట్రిక్‌పై దృష్టిసారించడంతో క్విక్ కామర్స్ బిజినెస్ నష్టాల బాట పట్టింది. వెరసీ బిజినెస్ ప్రారంభించిన ఏడాది లోపే షట్‌డౌన్ చేశారు. ఉద్యోగుల తొలగింపు ఓలా డాష్ షట్‌డౌన్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ పేరుతో ఈవీ మార్కెట్లో అడుగుపెట్టారు. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో వెహికల్స్‌ను ఆటోమొబైల్ మార్కెట్‌కు పరిచయం చేశారు. కానీ ఓలా ఈవీపై క్రియేట్ అయిన హైప్ కారణంగా కొనుగోలు దారుల అంచనాల్ని అందుకోలేకపోయింది. ఒకానొక దశలో ఓలా వెహికల్స్ అగ్నికి ఆహుతవ్వడం, చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్స్ పార్ట్లు ఊడిపోవడంతో అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఖర్చు తగ్గించుకునేందుకు భవిష్ అగర్వాల్ గట్టి ప్రయత్నాలే చేశారు. ఒక్కో బిజినెస్ కార్యకలాపాల్ని నిలిపివేశారు. కాస్ట్ కటింగ్ పేరుతో 400 నుంచి 500 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. ఇలా భవిష్ అగర్వాల్ ఆటోమొబైల్ మార్కెట్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. చివరికి అనుకున్నది సాధిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టార్గెట్ యూరప్ దేశీయంగా 2021 డిసెంబర్ నుంచి 2022 నవంబర్ మధ్య కాలానికి ఏకంగా లక్ష వెహికల్స్‌ను తయారు చేశారు. నవంబర్ 24 కల్లా కోటి ఈవీ బైక్స్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ ఈవీ మార్కెట్‌పై భవిష్ అగర్వాల్ కన్నేశారు. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే నేపాల్‌కు ఈవీ వెహికల్స్‌ను ఎగుమతులు ప్రారంభించింది.ప్రస్తుతం యూరప్ దేశమైన ఇటలీలో జరుగుతున్న ఎస్పోసిజియోన్ ఇంటర్నేషనల్ సిక్లో మోటోసిక్లో ఇ యాక్సెసోరి (EICMA) మోటర్ సైకిల్ షోలో ఓలా ఎస్1 ప్రోను ప్రదర్శిస్తున్నట్లు భవిష్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది క్యూ1లో యూరప్ కంట్రీస్‌లో భారత్ నుంచి వరల్డ్ ఈవీ ప్రొడక్ట్‌ను అందిస్తామని పునరుద్ఘాటించారు. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కమింగ్ సూన్, సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఇ-మొబిలిటీ మార్కెట్లో ఓలా భారీ వ్యూహాలనే రచిస్తోంది. ఇప్పటికే ఎస్1, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఇపుడిక ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఇదీ చదవండి : ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ప్రకటించింది. ఈ పైప్‌లైన్‌లో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను చేర్చింది. త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న స్పోర్ట్స్, క్రూయిజర్, అడ్వెంచర్ లేదా కేఫ్ రేసర్ ఏది కావాలి అంటూ ట్విటర్ తన ఫాలోnయర్లను అడిగారు భవిష్ అగర్వాల్. అయితే ఆసక్తికరంగా స్పోర్ట్స్ కేటగిరీ అత్యధిక ఓట్లను పొందుతోంది. వచ్చే ఏడాది బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Building some 🏍️🏍️!! — Bhavish Aggarwal (@bhash) November 10, 2022 రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా సరసమైన ధరలో, ఆధునిక ఫీచర్లతో తీసుకొస్తున్నందని అంచనా. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఆదరణ బాగా లభించడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు ట్రిమ్‌లలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) Which bike style do you like — Bhavish Aggarwal (@bhash) November 10, 2022 -
‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!
బండ్లు ఓడలు అవ్వడం.. ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’ అనే సామెత మనం వినే ఉంటాం. ఇప్పుడు ఈ సామెత ఓలా సీఈవో భవిష్ అగర్వాల్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కార్పొరేట్ వరల్డ్‌లో బ్రాండ్ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోగొట్టుకుంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించిన ఓలా పరిస్థితులు ఒకానొక దశలో తారుమారయ్యాయి. కొనే నాథుడే లేడు సమ్మర్ సీజన్లో ఆ సంస్థ తయారు చేసిన ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపాలు సీఈవో భవిష్ అగర్వాల్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. వెహికల్స్‌లోని బ్యాటరీలు హీటెక్కి కాలిపోవడం. వాహనదారులు ప్రమాదాలకు గురికావడం. నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్ తయారు చేయడంతో చిన్న పాటి రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్ టైర్లు ఊడిపోవడం లాంటి వరుస ఘటనలతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో ఓలా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకున్న వాహన దారులు సైతం వెనక్కి తగ్గారు. దీంతో తయారు చేసిన వెహికల్స్ అమ్ముడు పోక.. స్టాక్ మిగిలిపోయింది. చదవండి👉 ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే.. దీనికి తోడు సంస్థను వివాదాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులు, ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, వాటి విడుదలలో కీరోల్ ప్లే చేస్తున్న టాప్ లెవల్ ఎక్జిక్యూటీవ్‌లు సంస్థను వదిలేస్తున్నా భవిష్ మాత్రం అన్నీ తానై సంస్థను ముందుండి నడిపించారు. ఓలా మినహాయి మిగిలిన వ్యాపారాల్ని క్లోజ్ చేశారు. ఓలా ఈవీలపై దృష్టిసారించారు. రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగి ఇంజనీరింగ్ విధులు, టీమ్ బిల్డింగ్, ఉత్పత్తులపై ఫోకస్ చేయడమే కాదు..టూవీలర్లతో పాటు కార్లను మార్కెట్లోకి విడుదల చేసే పనిలో పడ్డారు. కట్ చేస్తే.. Crossed 1 lakh vehicles produced yesterday. In just 10th month of production, probably fastest ever for a new auto company in India. Just getting started and #EndICEage is coming nearer and nearer! pic.twitter.com/FnJWLEQ1D8 — Bhavish Aggarwal (@bhash) November 3, 2022 కట్ చేస్తే తాజాగా ఈవీ చరిత్రలో అత్యంత వేగంగా వెహికల్స్ తయారీ చేసిన సంస్థగా ఓలా సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం పది నెలల్లో లక్ష(నిన్నటితో) వెహికల్స్‌ను తయారు చేసింది. ఈ సందర్భంగా దేశీయ ఆటోమొబైల్ చరిత్రలో ఇంత వేగంగా వెహికల్స్‌ను తయారు చేసిన దాఖలాలు లేవని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. టార్గెట్ కో అంటే కోటి అంతేకాదు డిసెంబర్ 2021లో ఓలా వెహికల్స్ తయారీ ‘సున్నా’ కాగా నవంబర్ 2022 నాటికి ఆ సంఖ్య లక్షకు చేరింది. నవంబర్ 2023నాటికి 10లక్షలు, నవంబర్ 2024 నాటికి కోటి వెహికల్స్ తయారీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. Our cumulative production numbers: Dec 2021: 0 Nov 2022: 1,00,000 Nov 2023: 10,00,000 Nov 2024: 1,00,00,000 This is the journey to #EndICEAge by 2025 🙂😎 pic.twitter.com/HV8x6JbCgm — Bhavish Aggarwal (@bhash) November 4, 2022 నవంబర్‌లో ఓలా ఒక్క నెలలో ఏకంగా తన ఎస్1 సిరీస్ 20 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అమ్మింది. అదనంగా, దాని మొత్తం అమ్మకాలు నెలవారీగా 60 శాతం పెరిగాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ విక్రయాల్లో 4 రెట్లు వృద్ధిని నమోదు చేసినట్లు ఓలా వెల్లడించింది. ఈ కాలంలో ప్రతి నిమిషానికి ఒక స్కూటర్‌ను విక్రయించినట్లు నివేదించింది. కాగా, ఓలా వెహికల్స్ ఉత్పత్తి, అమ్మకాలపై భవిష్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేస్తుండగా..ఆయన సహచరులు మాత్రం ‘బండ్లు ఓడలు అవ్వడం..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’.. సంస్థ పని ఇక అయిపోయిందిలే అని అనుకునే సమయంలో తన అపారమైన వ్యాపార నైపుణ్యాలతో సంస్థను గట్టెక్కించారంటూ భవిష్ అగర్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 20000 Ola S1 units sold in October, highest ever for an EV company in India! 60% growth month on month for @OlaElectric. The Ola community is now bigger than ever and Mission Electric 2025 is in sight! We will #EndICEage together💪🏼 pic.twitter.com/hyU0xiD6WL — Bhavish Aggarwal (@bhash) November 1, 2022 చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
ఓలా సీఈవో భవిష్ అగర్వాల్‌పై సంచలన ఆరోపణలు!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతని ప్రవర్తన కారణంగా ఉద్యోగులు, సంస్థ బోర్డు సభ్యులు సైతం సంస్థను వదిలేయడానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఓలా మాజీ ఉద్యోగులు భవిష్ అగర్వాల్‌పై పలు ఆరోపణలు చేశారు. రెండేళ్ల నుంచి సంస్థలో వర్క్ కల్చర్ పూర్తి వ్యతిరేకంగా ఉందని పలువురు మాజీ ఉద్యోగులు బ్లూంబెర్గ్కు తెలిపారు. ఉదాహరణకు ఆఫీస్‌లో జరిగే మీటింగ్ సంబంధించి తయారు చేసుకున్న ప్రజెంటేషన్ పేపర్లలో పేజ్ నెంబర్లు మారిపోతే.. ఆ ప్రజెంటేషన్ పేపర్లను చించేయడం, సిబ్బందిని ఓ వర్గానికి చెందిన వారితో ఆపాదిస్తూ ‘యూజ్లెస్’ అని సంబోధించేవారని వాపోయారు. ఉద్యోగులపై అరవడం మీటింగ్ సంబంధించి ప్రజెంటేషన్ పేపర్లలో వర్డ్ ఫార్మేషన్ లేకపోతే అరవడం, ప్రజెంటేషన్ పేపర్లకు క్లిప్‌లు సరిగ్గా పెట్టకపోయినా, ప్రింటింగ్ పేపర్లు నాసిరకంగా ఉన్నా సహించలేరని తెలిపారు. ఒక్కోసారి సహనం కోల్పోతే గంట పాటు ఆఫీస్ మీటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తే.. దాన్ని పది నిమిషాల్లో ముగించేస్తారని ఉద్యోగులు చెప్పిన విషయాల్ని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది. ఇదే విషయాన్ని భవిష్‌తో చర్చించగా.. అందరూ మన వర్క్ కల్చర్‌కు ఇమడలేకపోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఉద్యోగులకు నచ్చేలా ఆఫీస్ వాతావరణం లేదని అన్నారు. చదవండి👉 భవిష్ అగర్వాల్ మామూలోడు కాదు..ఎలాన్ మస్క్‌కే ఝలక్ ఇచ్చాడు -
భవిష్ అగర్వాల్ మామూలోడు కాదు..ఎలాన్ మస్క్‌కే ఝలక్ ఇచ్చాడు
ఓలా అధినేత భవిష్ అగర్వాల్..టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు మరోసారి ఝలక్ ఇచ్చారు. టెస్లాకు ధీటుగా తక్కువ ధరకే ఖరీదైన కార్లను పోలి ఉండేలా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ అమెరికాకు చెందిన టెస్లాకు గట్టిపోటీ ఇస్తుంది. బిలియనీర్లు వినియోగించే పాష్ కార్లతో పోలి ఉండేలా ఓలా ఈవీ వెహికల్‌ను తక్కువ , సరసమైన ధరకే అందిస్తున్నట్లు తెలిపారు. చీపెస్ట్ టెస్లా కారు ధర 50వేల డాలర్లు. అంత భారీ మొత్తంలో వెచ్చించి ఆ కారును కొనలేం. అందుకే ఈవీ మార్కెట్లో సరికొత్త రెవెల్యూషన్తో టెస్లా కార్ల ధరల్ని 1000డాలర్ల నుంచి 50వేల డాలర్ల మధ్య ధరలతో వివిధ వేరియంట్ల కార్లను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘ఓలా స్టార్టప్ ప్రయాణం అంత సులువు జరగలేదు. ఎన్నో రిస్కులు తీసుకున్నాం. ఇప్పటికే భారత్ మార్కెట్లో వరల్డ్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. రానున్న పదేళ్లలో దేశీయ ఈవీ మార్కెట్ వ్యాల్యూ దశాబ్దం చివరి నాటికి 150 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నా. ఓలా ఇందులో పాత్ర పోషించడం ఖాయం. ఎందుకంటే గత డిసెంబర్లో కొనుగోలు దారులు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది ఓలా గురించి వ్యతిరేక ప్రచారం చేశారు. అయినా ముందు సాగే దిశగా ఓలా సామ్రాజ్యాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ ‘చవకైన ఈవీలను తయారు చేయడం మాత్రమే కాకుండా, 5జీ, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ మొబిలిటీలో గ్లోబల్ ఫుట్‌ప్రింట్‌ను పెంపొందించడం ద్వారా భారత్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంది’ అని అన్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్! -
ఓలా దివాలీ గిఫ్ట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అతిచౌక ధరలో
సాక్షి, ముంబై: దీపావళి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అతి చౌకధరలో కొత్త వేరియంట్‌ను వినియోగ దారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. రూ.80 వేల లోపు ధరకే ఈ కొత్త వేరియంట్ స్కూటర్‌ను అందుబాటులోకి తేనుందని సమాచారం. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొత్త వేరియంట్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ సీఈవో భావిష్ అగర్వాల్ ఆదివారం ట్వీట్ చేశారు. అక్టోబర్ 22న కంపెనీ దీపావళి ఈవెంట్ జరగ బోతోంది. తమ అతిపెద్ద ప్రకటనలలో ఇది కూడా ఒకటి. త్వరలో కలుద్దాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక టీజర్ కూడా వదిలారు. ఇందులో ఆగస్ట్ 15 ఈవెంట్లో వాగ్దానం చేసినట్లుగా కంపెనీ MoveOS 3ని Ola S1కి రోల్‌అవుట్‌గా ప్రకటించే అవకాశం ఉందని అంచనా. (హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు) ఓలా ఎలక్ట్రిక్ ..ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.99,999లకు భారత్ మార్కెట్లో ప్రస్తుతం లభిస్తోంది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఈ-స్కూటర్లు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది టీవీఎస్ జూపిటర్ , సుజుకి యాక్సెస్ వంటి ప్రముఖ 125సీసీ స్కూటర్లకు పోటీ ఇస్తోంది. దీనికితోడు హీరో మోటాకార్స్ కూడా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడా బ్రాండ్ కింద రెండు వేరియంట్లలో విడా వీ1, వీ1 ప్రొను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. Our Diwali event will be on 22nd Oct. One of the biggest announcements ever from Ola. See you soon! pic.twitter.com/389ntUnsDe — Bhavish Aggarwal (@bhash) October 8, 2022 -
వందల మంది ఉద్యోగులకు భారీ షాక్, ‘ఓలా.. ఎందుకిలా!’
ప్రముఖ రైడ్ షేరింగ్ దేశీయ దిగ్గజ సంస్థ ఓలాలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. సంస్థ పునర్నిర్మాణం పేరుతో ఇప్పటికే వందలాది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఓలా.. తాజాగా 500 మందిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్ని ఫైర్ చేయడానికి కారణం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ తగ్గిపోవడమేనని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది డిసెంబర్లో ఓలా ఈవీ వెహికల్స్‌ను లాంఛ్ చేసింది. నాటి నుంచి సంస్థ పునర్నిర్మాణ కార్యక్రమాల్ని నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రీ ఓన్డ్ కార్ బిజినెస్,ఓలా కార్స్, ఓలా డాష్ ఇలా సుమారు 2 వేల మంది ఉద్యోగులతో పాటు..గత రెండేళ్లలో ఆ సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ నాయకత్వ బృందం సభ్యులతో సహా 30 మందికి పైగా సీనియర్ అధికారుల్ని ఇంటికి సాగనంపింది. షట్ డౌన్ ఈ ఏడాది జులై నెలలో ఓలాకు చెందిన కర్ణాటక ప్లాంటును షట్ డౌన్ చేసింది. ఆ తర్వాత మూడు వారాల్లో సుమారు 350మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. తాజాగా మరో 500 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు పలు మీడియా సంస్థలు కథనాల్ని ప్రచురించాయి. ఇప్పుడు 500 మంది వెహికల్, బ్యాటరీ తయారీ, ఆటోమేషన్, అటానమస్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లు, ఇతర విభాగాలకు చెందిన ఐటీ, ఆర్ అండ్ డి సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి సారించింది. అందుకే వాటిని బలోపేతం చేసే దిశగా పునర్నిర్మాణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు’ ఓలా ప్రతినిధులు తెలిపారు. మరో వైపు 500 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు దారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. 2024 నాటికి తొలి మోడల్‌ను ఆవిష్కరించనుంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. 2026–27 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. రూ. 1 లక్ష నుంచి రూ. 50 లక్షల ధరల రేంజిలో ఎలక్ట్రిక్ టూ–వీలర్లు, కార్ల శ్రేణిని అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ చెప్పారు. ‘ముందుగా ప్రీమియం కారుతో మొదలుపెడుతున్నాం. ఇది 18–24 నెలల్లో వస్తుంది. ఎంట్రీ స్థాయి కార్లను కూడా కచ్చితంగా ప్రవేశపెడతాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్ కారుకు ఒకసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల పైగా నడిచే సామర్థ్యం ఉండగలదని, 4 సెకన్లలోనే 0–100 కి.మీ. వేగాన్ని అందుకోగలదని అగర్వాల్ చెప్పారు. ఓలా గతేడాదే ఎస్1, ఎస్1 ప్రో మోడల్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. భారీ విక్రయాల లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ.. ఉత్పత్తి, డెలివరీల విషయంలో సమస్యలతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టు కోసం 1,000 మందిని తీసుకుంటున్నట్లు అగర్వాల్ తెలిపారు. కాగా, ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నామని, సెప్టెంబర్ 7 నుంచి డెలివరీలు ఉంటాయని సంస్థ తెలిపింది. చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్క చార్జింగ్‌తో 500 పైగా కిలోమీటర్లు!
ముంబై: ఇండియన్ మల్టీనేషన్ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా మరో సంచలనానికి సిద్ధమవుతోంది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఆవిష్కరించనుంది. ఆగస్టు 15న స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారుతో పాటు స్కూటర్‌ను కూడా కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఓలా ఆవిష్కరించనున్న స్పోర్టీ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తుందని సమాచారం. ఇందుకోసం మెరుగైన ఆధునాతన బ్యాటరీలను వాడుతున్నారని తెలిసింది. లేటెస్ట్ టెక్ ఫీచర్లతో అత్యుత్తమంగా స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారు ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించినట్టు ‘కార్ అండ్ బైక్’ వెల్లడించింది. (క్లిక్: Swift S-CNG వచ్చేసింది.. ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) కాగా, తమ తాజా ఆవిష్కరణలకు సంబంధించి ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆగస్టు 15న తాము ఏం ఆవిష్కరించబోతున్నామో ఊహించగలరా అంటూ ట్విటర్లో పోల్ కూడా పెట్టారు. స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయబోతున్నారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తక్కువ రేటుతో కొత్త ఎస్1 తెస్తున్నారని మరికొంత మంది పేర్కొన్నారు. ఓలా సెల్ ఫ్యాక్టరీ, సరికొత్త కలర్లో ఎస్1 ఆవిష్కరిస్తారని ఇంకొందరు ఊహించారు. (క్లిక్: కియా మరోసారి అదరగొట్టింది) -
ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో
సాక్షి, ముంబై: క్యాబ్ సేవలు, ఎలక్ట్రిక్ బైక్స్‌తో హవాను చాటుకుంటున్న ఓలా త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్ట్ 15న ఒక స్పోర్టీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించ నుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వెల్లడించారు. భవిష్ అగర్వాల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, కార్ లాంచింగ్‌ను ధ్రువీకరించారు. 75వ స్వాతంతత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్రొడక్ట్‌ను ఇండియాలో లాంచ్ చేయ నున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో పాటు అతి చౌక ధరలో కొత్త ఎస్1 స్కూటర్‌ను తీసుకురానుందని సమాచారం. ఆగస్టు 15న మేము ఏమి ప్రారంభించ బోతున్నామో ఊహించగలరా? అంటూ ట్వీట్ చేసిన భవీష్ అగర్వాల్ నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అలాగే లాంచ్ ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లోస్ట్రీమ్ చేయనున్నామని, సంబంధిత వివరాలను త్వరలోనే వెల్లడి స్తామన్నారు. Any guesses what we’re launching on 15th August??!! — Bhavish Aggarwal (@bhash) August 5, 2022 ఓలా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కాన్సెప్ట్ తక్కువ ధరలో కొత్త S1, భారతదేశపు అత్యంత స్పోర్టియస్ట్ కారు, సెల్ ఫ్యాక్టరీ , S1లో కొత్త ఉత్తేజకరమైన రంగుఅంటూ నాలుగు హింట్స్ ఇచ్చారు. దీంతో ఈ నాలింటిని పరిచేయనుందనే అంచనాలు మార్కెట్ వర్గాలు నెలకొన్నాయి. స్పోర్టీ ఎలక్ట్రిక్ కారు 10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుందట. అలాగే ఈ ఆగస్ట్ 15న ఫ్యూచర్ ఫ్యాక్టరీలో సెల్ తయారీ ప్లాంట్, కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికలతో సహా అనేక కార్యకలాపాలను వెల్లడించవచ్చని భావిస్తున్నారు. కాగా ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త ఫోర్-వీలర్ లాంచింగ్‌పై గత కొద్ది కాలంగా అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓలా ఇండియాలో ఎస్1, ఎస్1 ప్రో, అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. -
భారత్‌కు ఉబర్ గుడ్‌బై.. స్పందించిన సీఈవో
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా, ఉబర్లు మెర్జ్ అవుతున్నాయా?ఊబర్ ఇండియాలో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు. పలు నివేదికల ప్రకారం.. ఓలా- ఉబర్లు మెర్జ్ అవుతున్నాయని, ఇందులో భాగంగా ఓలా సీఈవో భవీష్ అగర్వాల్..అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉబర్‌కు చెందిన టాప్ ఎగ్జిక్యూటీవ్‌లతో మంతనాలు జరిపారని నివేదికల సారాంశం. అయితే ఆ వార్తల్ని భవిష్ అగర్వాల్ కొట్టి పారేశారు. "అబ్సిల్యూట్ రబిష్" ఓలా లాభాల్ని గడిస్తుంది. అదే సమయంలో వృద్ధి సాధిస్తుంది. కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! మెర్జ్ అయ్యే అవకాశం లేదని ఖండించారు. భారత్ నుంచి బెర్ అవుట్ మరో రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ భారత్‌లో తన కార్యకలాల్ని నిలిపివేస్తున్నట్లు బ్లూం బెర్గ్ తన కథనంలో పేర్కొంది. ఈ కథంపై ఉబర్ సీఈవో డార ఖోస్రోషి స్పందించారు. భారత్‌లో రైడ్ షేరింగ్ మార్కెట్ ఎలా ఉందో మాకు బాగా తెలుసు. భారత్ నుంచి మేం వెళ్లి పోవడం లేదని, కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు బ్లూం బెర్గ్‌కు ఇప్పటికే చెప్పామని అన్నారు. బ్లూం బెర్గ్ ఏం రాసిందంటే ఈ ఏడాది జూన్‌లో ఓలా, ఉబెర్ల గురించి బ్లూం బెర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. పెరిగిపోతున్న ధరల కారణంగా ఆ సంస్థలు అభివృద్ధితో పాటు లాభాల్ని గడించడంలో ఇబ్బందులు పడుతున్నాయని హైలెట్ చేసింది. అందుకే భారత్ మార్కెట్ నుంచి ఉబర్ నిష్క్రమించవచ్చని సూచించింది. అయితే భవిష్యత్తులో ఉబెర్ భారత్‌లో కార్యకలాపాల్ని కొనసాగించేందుకు దేశీయంగా మరో రైడ్ షేరింగ్ సంస్థతో జతకట్టవచ్చని వెల్లడించింది. అందుకు ఉబర్ చైనాలో దీదీ గ్లోబల్‌తో, ఆగ్నేయాసియాలో గ్రాబ్ హోల్డింగ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్ని ఉదహరించింది. -
విలీనమా.. నో వే!...కావాలంటే వారు వెళ్లిపోవచ్చు!
సాక్షి, ముంబై: క్యాబ్ సేవల సంస్థలు, ఈ బిజినెస్‌లో ప్రధాన ప్రత్యర్థలు ఓలా, ఉబెర్ విలీనవుతున్నాయంటూ పలు రిపోర్టులు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపాయి. ఓలా ఉబర్ సంస్థల విలీనం గురించి ఇప్పటికే చర్చలు ప్రారంభించాయంటూ వార్తలు హల్చల్ చేశాయి. దేశీయ అతిపెద్ద రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. పూర్తిగా పుకార్లే అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశంలో తమ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉందనీ, పురోగతి సాధిస్తున్నామని ఈ క్రమంలో విలీనమనే సమస్య లేదని స్పష్టం చేశారు. అంతేకాదు కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశంనుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! అంతేకానీ తాము ఎప్పటికీ విలీనం కామంటూ అమెరికా కంపెనీ ఉబెర్‌కు వ్యంగ్యంగా చురకలేశారు. ఈ మేరకు అగర్వాల్ వార్తా నివేదికలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. బలమైన బ్యాలెన్స్ షీట్‌తో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన రైడ్ హెయిలింగ్ కంపెనీలలో ఒకటిగా, అందులోనూ భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నామని ఓలా ప్రకటించింది. కాగా రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు ఓలా, ఉబెర్ విలీనమార్గంలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయనీ, సీఈఓ అగర్వాల్ అమెరికాలో ఉబెర్ కీలక అధికారులతో భేటీ కానున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి. రెండు కంపెనీలు ఇంతకు ముందు కూడా విలీన అవకాశాలపై చర్చించాయని, అయితే ఒప్పందం కార్యరూపం దాల్చలేదని నివేదిక పేర్కొంది. అయితే ఓలా తన క్విక్ ఫుడ్ డెలివరీ, యూజ్డ్ కార్ బిజినెస్‌ను మూసివేయడం, ఈ వారంలో దాదాపు 300-350 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ ఊహగానాలు వెలువడటం గమనార్హం. చదవండి: ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం Absolute rubbish. We’re very profitable and growing well. If some other companies want to exit their business from India they are welcome to! We will never merge. https://t.co/X3wC9HDrnr — Bhavish Aggarwal (@bhash) July 29, 2022 -
పాపం..అంచనా తలకిందులైందే? ఈవీ వెహికల్స్ తయారీ నిలిపేసిన ఓలా!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ జిల్లా కృష్ణగిరిలో ఉన్న తయారీ ప్లాంట్‌లో ఓలా తయారీ కార్యకలాపాల్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ నిలిపివేతపై ఓలా ప్రతినిధుల్ని వివరణ కోరగా వెహికల్స్ తయారీ కోసం కొత్త మెషిన్లను ఇన్స్టాల్ కోసం గత వారం రోజుల నుంచి ప్రొడక్షన్ నిలిపివేసినట్లు తెలిపారు. కానీ ప్రొడక్షన్‌ను షట్ డౌన్ చేయడానికి ఇతర కారణాలున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అంచనా తలకిందులైందే? అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు తన ఇన్నోవేటీవ్ మార్కెటింగ్ స్ట్రాటజీతో అమ్మకాలు జరిపే సత్తా ఉన్న ఓలా సీఈవో భవిష్ అగర్వాల్. కానీ ఓలా అమ్మకాల్లో తన అంచనాలు తలకిందులైనట్లు తెలుస్తోంది. సమ్మర్ సీజన్లో ఆ సంస్థ తయారు చేసిన వెహికల్స్‌లోని బ్యాటరీలు హీటెక్కి కాలిపోవడం, నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్ తయారు చేయడం, చిన్న పాటి రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్ టైర్లు ఊడిపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఓలా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకున్న కొనుగోలు దారులు సైతం వెనక్కి తగ్గారు. దీంతో తయారీ ఉత్పత్తి పెరిగిపోయి.. కొనుగోలు డిమాండ్ తగ్గింది. వెహికల్స్ పేరుకుపోతున్నాయ్? తమిళనాడులో ఫ్యూచర్ ఫ్యాక్టరీ పేరుతో ఉన్న ఓలా ఫ్లాంట్‌లో సుమారు 4వేలకు పైగా ఈవీ వెహికల్స్ అమ్ముడుపోక స్టాక్ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి రోజుకు 600వెహికల్స్ తయారీ సామర్ధ్యం ఉన్న ఫ్లాంట్‌లో కేవలం రోజుకు 100 వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇటీవల కాలంలో ఓలా ఎస్1 ప్రోను కొనుగోలు చేసిన వాహనదారులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అశోక్ బైద్ ఏం చెప్పారంటే ఓలా వెహికల్స్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపపథ్యంలో ఓలాఎస్1ప్రో'ను కొన్న అశోక్ బైద్ అనే వాహనదారుడు స్పందించారు. నేను గతనెలలో ఓలా ఎస్1 ప్రోను కొనుగోలు చేశా. ఇప్పటి వరకు నేను ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొలేదు. సంస్థ వెహికల్స్‌ను విడుదల చేసిన ప్రారంభంలో సమస్యలు ఎదురైన మాట వాస్తవమేనంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు లేవు ఆటోమొబైల్ సంస్థలు వార్షిక నిర్వహణకు అనుగుణంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటాయి.మేం కూడా అదే చేస్తున్నాం. ఓలా ప్రొడక్షన్ ఎందుకు షట్ డౌన్ చేశారనే విషయంలో ఇతర కారణాలు ఏవీ లేవని ఓలా స్పోక్ పర్సన్ తెలిపారు. చదవండి: ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోతో..భవిష్ అగర్వాల్ మార్కెటింగ్ స్ట్రాటజీ!
కార్పొరేట్ వరల్డ్‌లో బ్రాండ్ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోగొట్టుకుంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించిన ఓలా పరిస్థితి తారుమారైంది. వెహికల్స్‌లోని లోపాలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ఆ సంస్థ అధినేత భవిష్ అగర్వాల్ తన మార్కెటింగ్ స్ట్రాటజీతో బ్రాండ్ వ్యాల్యూని నిలబెట్టి.. అమ్మకాలు పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు అమ్మకాలు జరిపేందుకు కార్పొరేట్ దిగ్గజాలు మూడు మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ను ఫాలో అవుతుంటాయి. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పిన ఈథోస్, పాథోస్,లోగోస్ టెక్నిక్‌ను ఉపయోగించి ప్రొడక్ట్‌లను సేల్ చేస్తుంటాయి. మిగిలిన కార్పొరేట్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉన్నా..భవిష్ అగర్వాల్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను పోల్చుతూ..తాజాగా పేపర్ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోజులిచ్చిన స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఫోటోల్ని ట్వీట్ చేశారు. 🤷♂️ pic.twitter.com/V0TUsYEgJy — Bhavish Aggarwal (@bhash) July 22, 2022 పెట్రోల్ వాలా వర్సెస్ ప్రోవాలా భవిష్ ట్వీట్లో నేలపై నగ్నంగా కూర్చొన్న రణ్వీర్ సింగ్ ఫోటోకు 'పెట్రోల్ వాలా' అని.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నగ్నంగా డ్యాన్స్ ఫోజ్ పెట్టిన రణ్వీర్ ఫోటోకు 'ప్రో వాలా' అని పేర్కొన్నారు. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో తగ్గిపోతున్న పెట్రో వాహనాల వినియోగం తగ్గుతుందని..ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీ వెహికల్స్ డిమాండ్‌ను హైలెట్ చేస్తూ మరికొన్ని మీమ్స్ నెటిజన్లతో పంచుకున్నారు. pic.twitter.com/GmTGZLq8QC — Bhavish Aggarwal (@bhash) July 22, 2022 ఈవీ వెహికల్స్ కాలిపోతుంటాయ్ ఆసక్తికరమైన విషయమేమిటంటే, అగర్వాల్ ఈ తరహాలో ట్వీట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది జూన్‌లో అగ్నికి ఆహుతైన టాటా నెక్సాన్ ఈవీ విజువల్స్‌పై స్పందించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. విదేశాల్లో తయారైన వెహికల్స్ సైతం కాలిపోతుంటాయి. ఈవీ వెహికల్స్‌తో పోలిస్తే పెట్రో ఇంజిన్ (ఐసీఈ)లకే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటాయంటూ ఆటోకార్ ఇండియా ఎడిటర్ హోర్మజ్డ్ సోరాబ్జీని కూడా ట్యాగ్ చేశారు. ఏది ఏమైనా ఆటోమొబైల్ మార్కెట్లో మార్కెటింగ్ మహరాజుగా పేరొందిన భవిష్ అగర్వాల్..ఓలా ఈవీ వెహికల్స్ అమ్మకాల కోసం ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాలి' అంటూ ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చమత్కరిస్తున్నారు. -
అది బతుకమ్మో, భోగిమంటలో కాదు కదా!
రోజురోజుకి పెరిగిపోతున్న పర్యావరణ కాల్యుషం నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలంటూ ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఎంతగా మొత్తుకున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే ఓలా రాకతో పరిస్థితులు మారిపోయాయి. భవీశ్ అగర్వాల్ ఎంతో ముందు చూపుతో తెచ్చిన ఓలా స్కూటర్లు దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో రోజుకు వెయ్యికి పైగా బైకులు తయారు చేస్తూ.. డెలివరీ చేస్తున్నా ఇంకా ఓలాకి డిమాండ్ తగ్గడం లేదు. ఓలా బైకు తమ చేతికి వస్తే కస్టమర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఓలా స్కూటర్‌ను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా పెట్టుకుని మన దగ్గర బతుకమ్మ. భోగిమంటల చుట్టు నృత్యం చేసినట్టుగా యువతీ యువకులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఓలా ఫౌండర్ భవీశ్ అగర్వాల్ ఆ వీడియోను షేర్ చేస్తూ... ఓలా స్కూటర్‌ను తయారు చేసినప్పుడు దీన్ని ఇలా కూడా ఉపయోగిస్తారని అస్సలు అనుకోలేదంటూ ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు. తన మదిలో మెదిలిన చిన్న ఆలోచన అనూహ్యమైన రేంజ్లో సక్సెస్ కావడం పట్ల భవీశ్ అగర్వాల్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. Never thought of this use case while designing it😄❤️ https://t.co/y5JQWveH0r — Bhavish Aggarwal (@bhash) June 25, 2022 చదవండి: వావ్! ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు తగ్గినా.. కళ్లు తిరిగే ఆదాయం -
సంచలనం..అదిరిపోయే డిజైన్లతో ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉందో మీరే చూడండి!
ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఆటోమొబైల్ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఓలా సంస్థ త్వరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. 10లక్షల ఎలక్ట్రిక్ హచ్ బ్యాక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవ్వగా..ఆ కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఓలా అధినేత భవిష్ అగర్వాల్ రైడ్ షేరింగ్ రంగం నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంపై కన్నేశారు. ఇప్పటికే టూవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసిన భవిష్..భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా త్రీ వేరియంట్ కార్ల ఫస్ట్ టీజర్లను ఇటీవల నిర్వహించిన కస్టమర్ డే ఈవెంట్లో రివిల్ చేశారు. ఆ టీజర్ ఫోటోలు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండగా..ఆగస్ట్ 15న ఓలా ఆ కార్లకు సంబంధించి పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి ఉండగా.. ఆ కార్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం..ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓలా కార్లు ఎస్యూవీ, హచ్‌బ్యాక్, సెడాన్ ఇలా మూడు వేరియంట్ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కూపీ మోడల్, లో సంగ్ల్ స్టాన్స్,మజిలర్ బాడీ, స్టీప్ రూఫ్‌లైన్ స్పెసిఫికేషన్లు ఉండగా..ఒక కారు మాత్రం అప్ రేర్ ఎండ్, యూ షేప్డ్ ఆకారంలో టెయిల్ ల్యాప్ డిజైన్లు ఉన్నాయి. ఇక స్పోర్ట్స్ హచ్ బ్యాక్‌లో స్టబీ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విడుదలైన ఈ టీజర్లో ఓలా ఎలక్ట్రిక్ కారు స్పోర్టీ డిజైన్, షార్ప్ ఎడ్జ్‌లు,రెండు షేడ్లతో మూడు కార్లు దర్శనమిస్తున్నాయి. ఈ డిజైన్లతో పాటు..సెడాన్ వేరియంట్లలో ఓలా అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీపై వర్క్ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
నితిన్ గడ్కారీ.. హైడ్రోజన్ ఫ్యూయల్‌పై భవీశ్ ఏమన్నాడో విన్నావా?
పెట్రోల్ డీజిల్‌కు ప్రత్యామ్నయ ఇంధనాలు ఉపయోగించాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందులో భాగంగా హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు తయారీకి ప్రోత్సహాం అందించారు. ఈ టెక్నాలజీతో తయారైన తొలి కారులో పార్లమెంటుకు కూడా చేరుకున్నారు. మరోవైపు పెట్రోలు/డీజిల్‌లకు బదులు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్ వాహనాలు మార్కెట్లోకి తేవాలంటూ తయారీదారులకు కూడా సూచనలు చేశారు. నితిన్ గడ్కారీ వ్యాఖ్యాలకు పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు భవీశ్ అగర్వాల్. హైడ్రోజనల్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై ఆయన స్పందిస్తూ.. ‘ఎలక్ట్రిసిటీ ఉపయోగించి భార హైడ్రోజన్ (హెచ్2)ను తయారు చేస్తారు. ఈ హెచ్2ను అధిక పీడనాల వద్ద ఫ్యూయల్ స్టేషన్లలో నిల్వ ఉంచుతారు. దీన్ని తిరిగి ఫ్యూయల్ స్టేషన్ ద్వారా కార్లలో నింపుతారు. కార్లలో ఉన్న సెల్స్ ఈ హైడ్రోజన్ నుంచి తిరిగి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ శక్తితో కారు నడుస్తుంది. చూస్తుంటే రవాణా రంగంలో హైడ్రోజన్ వాడకం అంతగా ఉపయోగించే టెక్నాలజీలా అనిపించడం లేదు’ అన్నారు భవీశ్ అగర్వాల్. భవీశ్ అగర్వాల్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ పరిశ్రమను స్థాపించారు. దేశంలో ఇప్పుడు నంబర్ బ్రాండ్‌గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎదుగుతోంది. దీనికి తోడు త్వరలోనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు భవీశ్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో శిలాజ ఇంధనాలకు ప్రభుత్వం చెబుతున్న హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ అంత ఉపయోగకరం కాదంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. చదవండి: హైడ్రోజన్ కారుతో పైలట్ ప్రాజెక్టు.. స్వయంగా ప్రయాణించిన మంత్రి -
ఓలా ఫ్యాక్టరీ టూర్.. ఎప్పుడంటే?
అతి తక్కువ కాలంలోనే ఇండియన్ మార్కెట్‌పై చెరగని ముద్ర వేసింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటికే లక్షకు పైగా ఆర్డర్లు ఉన్నాయి ఈ స్కూటర్ కోసం. డెలివరీ, సర్వీసు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మొత్తంగా ఓలా స్కూటర్‌కి క్రేజ్ అయితే తగ్గలేదు. కాగా తమ కస్టమర్లకు మరో అవకాశం ఇచ్చారు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉంది. భారీ ఎత్తున ఇక్కడ స్కూటర్లు తయారు చేస్తున్నారు. తమ కస్టమర్లు స్కూటర్లు ఎలా తయరవుతున్నాయో నేరుగా చూసే అవకాశం కల్పిస్తున్నారు భవీశ్ అగర్వాల్. 2022 జూన్ 19 ఆదివారం ఓలా ఫ్యాక్టరీలో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన వెయ్యి మంది కస్టమర్లను పిలవాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సంఖ్యపై పరిమితి ఎత్తేశారు. ఇప్పటి వరకు ఓలా స్కూటర్లు యాభై వేల మందికి పైగా డెలివరీ అయ్యాయి. వీరందరూ ఈవెంట్‌కు రావొచ్చంటూ భవీశ్ ట్విటర్లో పేర్కొన్నారు. For our customer event at the Ola Futurefactory on Sunday 19th June, earlier plan was to invite 1000 customers. Now we’ve decided to invite ALL our Ola S1 customers, more than 50,000! We’ll have a factory tour, customer celebrations and MoveOS 2 launch!!#EndICEAge pic.twitter.com/WSiJZnQVV9 — Bhavish Aggarwal (@bhash) June 11, 2022 చదవండి: కారులో శృంగారం.. రూ.40.83 కోట్ల నష్టపరిహారం! -
ఓలా సంచలన నిర్ణయం.. త్వరలో ఆ దేశంలోకి ఎంట్రీ!
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరో సంచలనానికి సై అంటోంది. ఇప్పటికే దేశం నలుమూలల ఓలా స్కూటర్లు పరుగులు పెడుతుండగా త్వరలో విదేశీ రోడ్లపై రయ్‌రయ్‌మని దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే యూనెటైడ్ కింగ్డమ్ (యూకే)లో ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లు ప్రవేశపెడతామని ఓలా ఫౌండర్ కమ్ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్వెల్లీస్తో ఆయన గురువారం సమావేశం అయ్యారు. ఓలా స్కూటర్ తయారీలో ఉపయోగిస్తున్న టెక్నాలజీని బ్రిటీష్ హైకమిషనర్‌కు వివరించారు భవీష్ అగర్వాల్. అదే విధంగా యూకే, ఇండియా పార్టనర్‌షిప్‌లో చేపట్టాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంశాలు సైతం వీరి మధ్య చోటు చేసుకున్నాయి. బ్రిటీష్ హైకమిషనర్ ప్రధానంగా ఇండియా, యూకే వాణిజ్య సంబంధాలపై చర్చించారు. దీంతో ఓలా స్కూటర్‌ను యూకేలో ప్రవేశపెట్టే విషయంపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతో భవీష్ అగర్వాల్ త్వరలో లండన్‌లో ఓలా ఎస్ 1 ప్రో పరుగులు పెట్టబోతుందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు లండన్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ యూనియన్ జాక్ కలర్లో స్కూటర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. Great to meet @AlexWEllis the British High Commissioner to India & discuss our UK R&D plans and showcase our tech 🙂 Thank him for his deep interest in promoting the India UK partnership especially in new tech! We’ll soon bring our S1 to London, in a special Union Jack colour! pic.twitter.com/cx8LVt7SBc — Bhavish Aggarwal (@bhash) June 9, 2022 చదవండి: ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి! -
భవీశ్.. నువ్వు సామాన్యుడివి కాదు!
బిజినెస్‌కి, సినిమాలకు బ్రాండ్ ఇమేజ్, ప్రమోషన్ ఎంతో ముఖ్యం. అందుకే సినిమా లేదా ప్రొడక్టు రిలీజ్‌కు ముందు చాలా హంగామా చేస్తారు. కానీ ఎలాంటి హాడావుడి చేయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే బ్రాండ్‌ని ప్రమోటై బాహుబలి ఓ కొత్త ట్రాక్ వేసింది. ఇప్పుడదే దారిలో నడుస్తున్నాడు ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్. చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరి చేతా ఔరా అనేలా ఓలాను ప్రమోట్ చేస్తున్నారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి యంగ్ ఎంట్రప్యూనర్ భవీశ్ అగర్వాల్ అనుసరిస్తున్న సరికొత్త ప్రచార పంథా స్టార్టప్‌లకు స్పూర్తిగా నిలుస్తోంది. కేవలం సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బ్రాండ్ ప్రమోషన్ చేయడమే కాకుండా విపత్కర పరిస్థుల్లోనూ తన యూనికార్న్ కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌కి భంగం కలగకుండా జాగ్రత్త పడుతున్న తీరు బిజినెస్ సర్కిళ్లలో సంచలనంగా మారింది. మంటల్లో బ్రాండ్ ఇమేజ్ వేసవి ఆరంభం కావడం మొదలు అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. కొన్ని సందర్భాల్లో స్కూటర్లు అగ్నికి ఆహుతి అవగా మరికొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా జరిగింది. అనేక కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో చిక్కుకుంటూ వాటి భద్రతపై సందేహాలు రేకెత్తించాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓలా స్కూటర్లపైనే నెగటీవ్ ప్రచారం మొదలైంది. సంచలన రీతిలో దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్‌కి ఇది ఓ రకంగా అశనిపాతమే. కమ్యూనిటీ ర్యాలీ ఓలా బ్రాండ్ ఇమేజ్‌కి జరుగుతున్న నష్టాన్ని అదుపు చేసేందుకు ఈ కంపెనీ ఫౌండర్ కమ్ సీఈవో భవీశ్ అగర్వాల్ రంగంలోకి దిగాడు. స్కూటర్ల భద్రతపై తాను ఎన్ని హామీలు ఇచ్చినా వేస్టని గ్రహించాడు. అందుకే ఓలా స్కూటర్లు వాడుతున్న కస్టమర్ల చేతనే ఆ మాట చెప్పించాలని నిర్ణయించాడు. అందులో భాగంగా తెర మీదకు వచ్చిందే ఓలా కమ్యూనిటీ ర్యాలీలు. ముంబై నుంచి మొదలు పెట్టి చెన్నై, పూనే ఇలా ఒక్కో నగరంలో ఈ ర్యాలీను నిర్వహిస్తూ తాజాగా హైదరాబాద్‌లో కూడా పూర్తి చేశారు. ఓలా స్కూటర్లు ఎంత భద్రమైనవో కస్టమర్ల చేతనే రివ్యూ ఇప్పించాడు. ఇదంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా సృష్టించాడు. Thank you Hyderabad! What energy from the Ola community here. I couldn’t make it but clearly I missed all the fun🙂 pic.twitter.com/8ZzjisS2R8 — Bhavish Aggarwal (@bhash) May 29, 2022 మైలేజీ మ్యాజిక్ ఇక ఓలా స్కూటర్ల మైలేజీ ఎంత వస్తుందనే అంశంపై ఉన్న సందేహాలను పటాపంచాలు చేసేందుకు మరో కాంటెస్ట్ నిర్వహించారు. సింగిల్ ఛార్జ్‌తో అత్యధిక మైలేజీ పొందిన వారికి గెరువా రంగు స్కూటర్లు ఫ్రీగా బహుమతిగా ఇస్తానంటూ మరో కంటెస్ట్ పెట్టాడు. దీని మీద జరిగిన హాడావుడితో మైలేజీ మీద కూడా నమ్మకం కలిగించాడు భవీశ్. ఆఖరికి కర్నాటకలో ఉన్న కాషాయ ట్రెండ్‌ను అనుసరించి గెరువా (కషాయ రంగులో) కలర్లో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చాడు భవీశ్. @OlaElectric Can you check and look into this am not any response for this challenge. Am sending multiple tweets but no one has responded on this challenge. https://t.co/8JdLxeysZq — Jayanth Kumar (@jayanth_rudra) May 29, 2022 ఫస్ట్‌టైం ఇన్ హిస్టరీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో ఆది నుంచి భవీష్ భిన్నమైన మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించాడు. ఆటోమొబైల్ చరిత్రలోనే తొలిసారిగా షోరూమ్‌లు లేని వెహికల్‌గా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు ఆన్లైన్లో స్కూటర్ల బుకింగ్ మొదలెట్టి లక్షకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ప్రీ బుకింగ్స్‌లో అడ్వాన్స్ చెల్లించిన వారు డెలివరీ విషయంలో జరుగుతున్న ఆలస్యంపై నిందలు వేస్తుండటంతో.. హ్యాపీ మూమెంట్స్ పేరుతో స్కూటర్ డెలివరీ ప్రచారానికి తెర తీశాడు. . మూవ్ఓఎస్ 2 విషయంలోనూ సోషల్ మీడియాను గణనీయంగా వాడుకున్నాడు భవీశ్. విమెన్ స్పెషల్ సాధారణంగా బైకులు మగవాళ్లు ఇష్టపడితే ఆడవాళ్లు స్కూటర్లకే పరిమితం అవుతుంటారు. దీంతో ఓలా స్కూటర్ల విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ సృష్టించేందుకు మరో ఎత్తుగడను అనుసరించాడు భవీశ్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కర్మగారంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. మహిళా సాధికారతకు ఓలా అద్దం పడుతుంది అంటూ విస్త్రృత ప్రచారం చేయగలిగాడు ఈలాన్తో పోలిక త్వరలో ఓలా నుంచి ఎలక్ట్రిక్ కార్లను తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు భవీశ్. ఇప్పటికే ప్రోటోటైప్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ కారుకు కూడా బజ్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు భవీశ్. అందులో భాగంగా ఇండియాకు టెస్లా కార్లు తెచ్చే విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడగులు వెనక్కి వేస్తున్న ఈలాన్ మస్క్ వ్యవహార తీరుపై సెటైరిక్‌గా స్పందించాడు భవీశ్. ఇండియాకు రానందుకు థ్యాంక్స్, బట్ నాట్ థ్యాంక్స్ అంటూ టెస్లాకు పోటీగా ఓలా ఉందనే ఫీల్‌ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు భవీశ్. చదవండి: మనోడు గట్టొడే! ఏకంగా ఈలాన్ మస్క్ మీదే వేశాడు పెద్ద పంచ్ -
మనోడు గట్టొడే! ఏకంగా ఈలాన్ మస్క్ మీదే వేశాడు పెద్ద పంచ్
వ్యంగంగా కామెంట్లు చేయడంలో భయపడకుండా మాట్లాడటంలో ఎవరైతే నాకేంటి అన్నట్టుగా ప్రవర్తించడంలో మనకు రామ్ గోపాల్ వర్మ్ ఫేమస్. కానీ ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ఈలాన్ మస్క్ ముందు వరుసలో ఉంటాడు. తన సునిశిత విమర్శలు, ఛలోక్తులతో ఎంతటి వారినైనా ఆటపట్టిస్తుంటాడు. అలాంటి మస్క్ మీదే పంచ్ వేశాడు మన భవీష్ అగర్వాల్. టెస్లా కార్ల తయారీ యూనిట్ (గిగా ఫ్యాక్టీ)ని ఈలాన్ మస్క్ ఇండియాలో నెలకొల్పుతాడా? లేదా అనేది ఇన్నాళ్లు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈలాన్ పైకి ట్యాక్సుల పేరు చెబుతున్నా తప్పకుండా ఇండియాకు వస్తాడని చాలా మంది భావిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఓ మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియాను ఈలాన్ మస్క్ వదులుకుంటాడని తాను భావించడం లేదన్నారు. మేం రాబోము ఇండియాలో ఎలక్ట్రిక్ వాహానాలను కేంద్రం భారీ ఎత్తున ప్రోత్సహిస్తోంది, మినహాయింపులు వర్తింప చేస్తోంది. దీంతో చాలా కంపెనీలు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌పై ఫోకస్ చేశారు. ఇందులో ఓలా కూడా ఒకటి. ఇప్పటికే ఓలా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల్లో దుమ్ము రేపుతుండగా త్వరలో ఓలా నుంచి ఎలక్ట్రిక్ కార్లు కూడా రానున్నాయి. అయితే ఓలా తరహాలోనే ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ చేసిన కంపెనీలకు టెస్లా ఇక్కడికి వస్తే ఎలాంటి పోటీ నెలకొంటుందనే సందేహాలు ఉన్నాయి. దీంతో ఈలాన్ మస్క్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మస్క్ ఏమన్నారు ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈలాన్ మస్క్ బదులిస్తూ ‘టెస్లా కార్లు అమ్ముకునేందుకు పన్ను రాయితీలు ఇవ్వని దేశంలో కార్ల తయారీ పరిశ్రమను స్థాపించే ఉద్దేశం లేదు’ అని ప్రకటించారు. దీంతో ఈలాన్ మస్క్ ఇండియాకు రామని, ఇక్కడి మార్కెట్‌పై తమకు ఆసక్తి లేదన్నట్టుగా మాట్లాడారు. ఈలాన్ మస్క్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవీష్ స్పందన మస్క్ తాజా నిర్ణయంపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈవో భవీష్ అగర్వాల్ చిత్రంగా స్పందించారు. థ్యాంక్స్, బట్ నో థ్యాంక్స్ అంటూ ఓలా సీఈవో ట్వీట్ చేశారు. ఇండియాకు రాను అని ప్రకటన చేసిందుకు పోటీ కంపెనీగా థ్యాంక్స్ చెబుతూనే అదే సమయంలో బట్ నో థ్యాంక్స్ అని కూడా అన్నారు. మొత్తంగా నువ్వు ఇండియాకు వస్తే ఏంటీ ? రాకుంటే ఏంటీ ? అన్నట్టుగా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. మేం రెడీ సహజంగా చిత్ర విచిత్రంగా కామెంట్లు చేసి ఎదుటి వాళ్లను ఆత్మరక్షణలోకి నెట్టడం ఈలాన్ మస్క్ స్టైల్. అచ్చంగా అతని స్టైల్లోనే మస్క్‌కి బదులిచ్చాడు భవీష్ అగర్వాల్. ఇండియా లాంటి పెద్ద మార్కెట్‌కు రాకుండా ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఒంటెద్దు పోకడలకు వెళ్తామంటూ అందుకు తగ్గట్టుగా తమకు వ్యూహాలు ఉంటాయని అర్థం వచ్చేలా చిత్రమైన ట్వీట్ చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా టెస్లాతో పోటీకి తాము సిద్ధమే అన్నట్టుగా సవాల్ విసిరారు భవీశ్. Thanks, but no thanks! 🙂🇮🇳 https://t.co/yeO4qI2gg2 — Bhavish Aggarwal (@bhash) May 28, 2022 చదవండి: Elon Musk: ప్రపంచ కుబేరుడు.. పరమ పిసినారి.. -
మొత్తం మీరే చేశారు! భవీష్ అగర్వాల్.. మా ప్రాణాల్ని కాపాడండి!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం ఓలా అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. ఓ వైపు 24 గంటల్లో వెహికల్ డెలివరీతో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండుగా..ఆ వెహికల్స్‌ను వినియోగిస్తున్న వాహనదారులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో యజమానులు ఆ సంస్థ అధినేత భవీష్ అగర్వాల్‌పై మండిపడుతున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా ఓలా వెహికల్స్ వరుస ప్రమాదాల బారిన పడుతున్నాయి. బ్యాటరీ సమస్య కారణంగా మంటల్లో కాలిపోవడం, నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్ టైర్లు ఊడిపోవడం, విరిగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. @OlaElectric @bhash The front fork is breaking even in small speed driving and it is a serious and dangerous thing we are facing now, we would like to request that we need a replacement or design change on that part and save our life from a road accident due to poor material usd pic.twitter.com/cgVQwRoN5t — sreenadh menon (@SreenadhMenon) May 24, 2022 తాజాగా కేరళకు చెందిన శ్రీనాథ్ మీనన్ అనే ట్విట్టర్ యూజర్ తనకు జరిగిన ప్రమాదంపై ట్వీట్ చేశాడు. నామమాత్రం స్పీడ్‌లో ప్రయాణిస్తున్నా వెహికల్స్ కు ప్రమాదాలు జరుగుతున్నాయని, తాను డ్రైవింగ్ చేసే సమయంలో వెహికల్ ఫ్రంట్ ఫోర్క్ ఇరిగిపోయింది. ఓలా సీఈవో ఈ ప్రమాదాలపై స్పందించాలి. రిప్లెస్మెంట్ లేదంటే డిజైన్లు మార్చి నాసిరకం మెటియరల్ కారణంగా రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని ట్వీట్లో పేర్కొన్నాడు. My OLA's front fork got collapsed while hitting against a wall at 25kmph in Eco mode along an uphill Some other users also faced similar issues with the front fork My brother just escaped from very serious head injuries but then also got a deep cut on his face @bhash @OlaElectric pic.twitter.com/W689gOVxYQ — ANAND L S (@anandlavan) May 25, 2022 ఈకో మోడ్‌లో 25 కేఎంపీహెచ్ స్పీడ్‌తో ఓలా బైక్ ప్రమాదానికి గురైందని మరో ట్విట్టర్ యూజర్ ఆనంద్ ఎల్ తెలిపాడు. ఈ సందర్భంగా నాతో పాటు ఇతర ఓలా వాహనదారులు సైతం ఈ తరహా ప్రమాదానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక నా వెహికల్‌కు జరిగిన ఈ ప్రమాదంలో నా తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని ముఖం మీద లోతుగా తెగిన గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడంటూ భవీష్ అగర్వాల్ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. చదవండి👉 ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే.. -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు ఓలా శుభవార్త!
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. ఓలా ఎస్1 ప్రో బైక్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లకు 24గంటల్లో వెహికల్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే ఇప్పటికే పలువురు కొనుగోలు దారులకు అందించినట్లు ఓలా సంస్థ తెలిపింది. ఓలా చైర్మన్, సీఈవో భవీష్ అగర్వాల్ ఎస్1 ప్రో వెహికల్స్ డెలివరీపై ట్వీట్ చేశారు. సాధారణంగా బైక్‌ను బుక్ చేసుకుంటే సంబంధింత ఆటోమొబైల్ కంపెనీలు,డీలర్ సంస్థలు సదరు వెహికల్‌ను కస్టమర్లకు అందించేందుకు నెలల తరబడి సమయం తీసుకుంటాయి. కానీ ఓలా అలా కాదు. కేవలం 24గంటల్లో వెహికల్‌ను అందిస్తుందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Deliveries now happening in under 24hours from purchase! Great work by the @OlaElectric team💪🏼👌🏼 Most other brands have months waiting. Even registrations take a few days in dealerships. The future is here, be a part of it! pic.twitter.com/4LG20pwuI9 — Bhavish Aggarwal (@bhash) May 23, 2022 మూడో సారి గతేడాదిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. నాటి నుంచి ఈ ఏడాది వరకు మూడు సార్లు మాత్రమే పర్చేజ్ విండోను కొనుగోలు దారులకు అందుబాటులోకి తెచ్చింది. చివరి సారిగా మే21న 3వ సారి పర్చేజ్ విండోను విడుదల చేసింది.కాగా,ఈ పర్చేజ్ విండో అందుబాటులోకి తెచ్చే ముందే దేశంలో పలు నగరాల్లో టెస్ట్ రైడ్ క్యాంపెయినింగ్ను నిర్వహిస్తుంది. చదవండి👉 ఓలాకు భారీ షాక్, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్ అగర్వాల్! -
ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!
Ola Electric: ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలాకు భారీ షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆ సంస్థకు సీటీవో దినేష్ రాధా కృష్ణ గుడ్ బై చెప్పగా..తాజాగా వ్యక్తిగత కారణాల వల్ల ఓలాకు రాజీనామా చేస్తున్నట్లు సీఎంఓ వరుణ్ దుబ్ ప్రకటించారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, వాటి విడుదలలో కీరోల్ ప్లే చేస్తున్న టాప్ లెవల్ ఎక్జిక్యూటీవ్‌లు వదిలి వెళ్లిపోతుండడంతో ఓలా సీఈవో భవీష్ అగర్వాల్‌ను ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ గతేడాది సెప్టెంబర్ 15న 'ఓలా ఎస్1, ఎస్1ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. ఆ స్కూటర్లు అలా విడుదలయ్యాయో లేదో వాహనదారులు వాటిని ఎగబడి కొనుగోలు చేశారు.దీంతో కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ.1100కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మినట్లు ఆ సంస్థ సీఈవో భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. భారతీయ ఇ-కామర్స్ చరిత్రలో ఇదో ఘనమైన రికార్డ్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. సీన్ మారింది కట్ చేస్తే విడుదలైన ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో లోపాలు ఆ సంస్థ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. స్కూటర్లలో ఉన్న బ్యాటరీల పనితీరు కారణంగా అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో ఆ సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్స్ యజమానులు గాయాలపాలవుతున్నారు.ప్రాణాలను పణంగా పెడుతున్నారు.తాజాగా అదే వెహికల్స్‌లో ఉన్న రివర్స్ మోడ్ ఆప్షన్ మోడ్ కారణంగా ప్రమాదాలకు గురవుతున్నామంటూ బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఓలాను కుదిపేస్తుండగా.. అదే కారణాలతో ఓలా టాప్ లెవల్ ఎగ్జిక్యూటీవ్ లు వదిలి వెళ్లిపోతున్నారు. మనీ కంట్రోల్ కథనం ప్రకారం..ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో సాంకేతిక లోపాలు, టైం ప్రకారం డెలివరీ చేయకపోవడం, డిమాండ్‌కు అనుగుణంగా వెహికల్స్‌ను కస్టమర్లకు అందిస్తున్నా..భద్రత విషయంలో ఆ సంస్థ పనితీరపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ వైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలిపోతుంటే..మరోవైపు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఆ సంస్థలో కీరోల్ ప్లే చేస్తున్న ఉద్యోగులు అన్ని సర్దుకొని సంస్థ నుంచి బయటకు వెళ్లి పోతున్నారు. ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్ధుకొని ఇటీవల కాలంలో ఓలాకు చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్వయం సౌరభ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ పోర్వాల్, హెచ్ఆర్ హెడ్ రోహిత్ ముంజాల్, జనరల్ కౌన్సెల్ సందీప్ చౌదరిలు ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. సీటీవో దినేష్ రాధా కృష్ణన్‌తో పాటు తాజాగా ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ నిష్క్రమించారు. కాగా, గత వారం ఓలా సీఈఓ అరుణ్ సిర్దేశ్‌ముఖ్, స్ట్రాటజీ చీఫ్ అమిత్ అంచల్ సంస్థను విడిచి వెళ్లిపోతున్నారంటూ మనీకంట్రోల్ నివేదించిన విషయం తెలిసింది. అన్ని తానై ముందుండి నడిపిస్తున్న అయితే సంస్థ ఉన్నత స్థాయి సిబ్బంది విడిచి వెళ్లిపోవడంతో ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయినా అన్నీ తానై సంస్థను ముందుండి నడిపిస్తున్నారు.రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగి ఇంజనీరింగ్ విధులు, టీమ్ బిల్డింగ్, ఉత్పత్తులపై ఫోకస్ చేయడమే కాదు..టూవీలర్లతో పాటు కార్లను మార్కెట్లోకి విడుదల చేసి..తన వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించే పనిలో పడ్డారు ఓలా కోఫౌండర్, సీఈవో భవీష్ అగర్వాల్. చదవండి👉 బ్రాండ్ ఇమేజ్‌కి డ్యామేజ్ అయితే కష్టం.. భవీశ్‌కి ఎన్ని తిప్పలో.. -
బ్రాండ్ ఇమేజ్‌కి డ్యామేజ్ అయితే కష్టం.. భవీశ్‌కి ఎన్ని తిప్పలో..
కార్పోరేట్ ప్రపంచంలో బ్రాండ్ వ్యాల్యూ అనేది ఎంతో ముఖ్యం. కొన్ని కంపెనీలు ఈ బ్రాండ్ వ్యాల్యూ సాధించేందుకు ఏళ్లకేళ్లు కష్టపడతాయి. ఒక్కసారి బ్రాండ్ ఇమేజ్ వచ్చాక దాన్ని కాపాడుకునేందుకు నిరంతరం శ్రమిస్తాయి. తాజాగా ఓలా బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకునేందుకు ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ నడుం బిగించాడు. గేమ్ ఛేంజర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి గత ఐదేళ్లుగా ఎన్నో కంపెనీలు ప్రయత్నించినా.. ఓలా వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. లక్ష రూపాయలు చెల్లించి.. స్కూటర్ డెలివరీ కోసం నెలల తరబడి కస్టమర్లు ఎదురు చూశారు. 2021 అక్టోబరు నుంచి 2022 మార్చి వరకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్థుకుపోయారు. ఓలా బ్రాండ్‌పై నమ్మకం కనబరిచారు. కష్టాలు మొదలు వేసవి ఆరంభం కావడంతోనే ఓలాకు కష్టాలు వచ్చిపడ్డాయి. మొదట పూనేలో ఓలా స్కూటర్ ఉన్నట్టుండి తగలబడిపోయింది. ఆ తర్వాత దేశంలో పలు ప్రాంతాల్లో ఓలాతో పాటు ఇతర ఈవీ స్కూటర్లు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకోవడం మొదలైంది. మరోవైపు కొన్ని స్కూటర్లలో బ్యాటరీ ఛార్జింగ్ తదితర సమస్యలు వెంటాడాయి. కానీ వీటిని సకాలంలో పరిష్కరించడంలో ఓలా విఫలమైంది. ఫలితంగా ఒక యూజర్ తన ఓలా స్కూటర్‌ను గాడిదతో కట్టి ఊరేంగిచగా మరొకరు పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఏకీ పారేస్తున్నారు ఈవీ స్కూటర్లలో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలకు పై రెండు ఘటనలు తోడవటం ఓలాకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఓలా కస్టమర్ కేర్ తీరును ఎండగడుతూ కొందరు, డెలివరీలో ఆలస్యాన్ని నిరసిస్తూ మరికొందరు, ముందుగా చెప్పిన ఫీచర్లు ఎప్పుడు అన్‌లాక్ చేస్తారంటూ మరికొందరు ఓలాను ఏకీ పారేస్తున్నారు. దీంతో బ్రాండ్‌కు చెడ్డ పేరు రాకుండా డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు భవీశ్ అగర్వాల్ అప్రమత్తమైన భవీశ్ ఓలా స్కూటర్ల విజయ ప్రస్థానాన్ని రోజుకో రకంగా వివరిస్తున్నారు. కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్న విషయాన్ని చెబుతూనే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓలా ఇండియాలో నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్‌గా మారిందంటూ వివరించారు. ఆ తర్వాత రోజు ప్రధానీ మోదీ కంటే కూడా మమ్మల్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ప్రత్యర్థి కంపెనీలు మా మీద విషం చల్లడం ఆపి వాళ్ల పని చూసుకుంటే బెటర్ అంటూ తమపై వస్తున్న విమర్శల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. డ్యామేజ్ కంట్రోల్ యత్నాలు తాజాగా గిగ్ ఎకానమీగా రోజురోజుకు పెరుగుతున్న డెలివరీ సర్వీసులను ఉద్దేశిస్తూ ప్రపంచంలోనే డెలివరీ సర్వీసులకు ఓలా స్కూటర్లు ఉత్తమం అంటూ ఓ ఫోటోను జోడించి ట్వీట్ చేశారు. డెలివరీ బ్యాగును వీపుకు మోయం కాకుండా స్కూటర్ ముందు భాగంలో పెట్టుకోవచ్చని అక్కడ కావాల్సినంత లెగ రూమ్ ఉందన్నట్టుగా ఫోటోలో చూపారు. మొత్తంగా నలువైపులా ఓలాపై వస్తున్న విమర్శలు భవీశ్ అగర్వాల్‌లో కాక రేపాయి. దీంతో బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. Probably the best looking food delivery vehicle in the world 😍 pic.twitter.com/611oc2JOoc — Bhavish Aggarwal (@bhash) May 4, 2022 చదవండి: Bhavish Aggarwal: ఆ విషయంలో ప్రధాని మోదీ కంటే నేనే తోపు! -
ఆ విషయంలో ప్రధాని మోదీ కంటే నేనే తోపు!
గత కొంత కాలంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈవో భవీశ్ అగర్వాల్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఓలా స్కూటర్లకు సంబంధించి భవీశ్ అగర్వాల్‌ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. అయితే ఈ ట్రోలింగ్‌లో నిజమైన వాటి కంటే కేవలం తనపై దుష్ప్రచారం చేసేందుకు కార్పొరేట్ వరల్డ్ చేస్తున్నదే ఎక్కువగా ఉందంటున్నాడు భవీశ్ అగర్వాల్. మోదీకి మించి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై భవీశ్ అగర్వాల్ స్పందించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోవర్లతో పోల్చితే అతి తక్కువగా నాకు ఫాలోవర్లు ఉన్నారు. అయినా సరే నేను ఏదైనా విషయం చెప్పడం ఆలస్యం ప్రధాని మోదీ కంటే కూడా ఎక్కువ రియాక్షన్లు వస్తున్నాయి. అవన్నీ కూడా కాపీ పేస్ట్ చేసిన నెగటీవ్ కామెంట్స్‌తో కూడినవే ఉంటున్నాయి. ఇండియాలోని కార్పోరేట్ ప్రపంచంలో ఓలాపై దారుణంగా ట్రోలింగ్ ఎటాక్ జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు భవీశ్ అగర్వాల్. ట్రోల్ ఎటాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల డేటాను ప్రస్తావిస్తూ... ఏప్రిల్‌లో అత్యధిక ఈవీ స్కూటర్లు అమ్మిన సంస్థగా ఓలా రికార్డు సృష్టించిందని పేర్కొంటూ తమ కాంపిటీటర్స్ తమపై దృష్టి పెట్టడం కాకుండా వాళ్ల పనితీరు మెరుగుపరుచుకోవడంపై శ్రద్ధ పెడితే మంచిందంటూ ట్వీట్ చేశాడు. మరుసటి రోజు ఏకంగా ప్రధాని మోదీతో పోల్చుతూ సోషల్ మీడియాలో ఓలా, తాను ఎంతగా ట్రోల్‌కు గురువుతున్నామో ఉదహారించాడు భవీశ్. అనతి కాలంలోనే ఓలా స్కూటర్లు అనతి కాలంలోనే దేశంలో నంంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్‌గా ఎదిగింది అనడంలో ఎటువంటి సందేహాం లేదు. అయితే ఓలా స్కూటర్ లాంచింగ్ సందర్భంగా పేర్కొన్న ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు స్కూటర్ కోసం లక్ష రూపాయలకు పైగా నగదు చెల్లించినా డెలివరీ నెలల తరబడి ఆలస్యం అవుతోంది. వీటికి తోడు డెలివరీ అయిన స్కూటర్లకు ఏదైనా సమస్య తలెత్తితే కస్టమర్ సపోర్ట్ పొందడం చాలా కష్టంగా మారుతోంది. అవే ఆయుధాలు ఓలా స్కూటర్ల వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కస్టమర్లు నేరుగా ట్వీటర్లో భవీశ్ అగర్వాల్‌ను ట్యాగ్ చేస్తూ తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఓలా ప్రత్యర్థులు ఈ సమస్యలనే ఆయుధంగా చేసుకుని ఆ కంపెనీపై దాడి చేస్తున్నారు. దీంతో ఓ రేంజ్లో ఓలాపై ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో వీటికి బదులిచ్చే పనిలో పడ్డాడు భవీశ్ అగర్వాల్. On contrary, @OlaElectric & I are subject to one of the biggest troll attacks in corporate India. My tweets now get more replies than even Modiji’s tweets despite fraction of his followers! And all copy paste negative replies This tweet’s replies also will just prove my point! https://t.co/48uIjB8jkL — Bhavish Aggarwal (@bhash) May 4, 2022 చదవండి: ఈవీ టూ వీలర్ మార్కెట్లో నంబర్ వన్ ఓలా -
ఈవీ టూ వీలర్ మార్కెట్లో నంబర్ వన్ ఓలా
వివాదాలు ఎన్ని చుట్టు ముట్టినా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ క్రేజ్ తగ్గడం లేదు. కస్టమర్ సర్వీస్ చెత్తగా ఉందంటూ రోజుకు ఫిర్యాదులు వస్తున్నా అదే స్థాయిలో స్కూటర్ బుకింగ్స్ జరిగిపోతున్నాయి. మొత్తంగా మార్కెట్లోకి వచ్చిన ఆర్నెళ్లలోపే దేశంలో నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఓలా అవతరించింది. 2021 ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత అక్టోబరు చివరి వారం నుంచి డెలివరీలు చేస్తున్నారు. గత ఆరేడు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఓలా స్కూటర్ల అమ్ముడయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్ వాహన్‌లో ఉన్న వివరాల ప్రకారం 2022 ఏప్రిల్‌లో 12,869 ఓలా స్కూటర్లు దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ రెండో స్థానానికి పడిపోయింది. ఓలా తర్వాత స్థానంలో 10,000 టూ వీలర్ల రిజిస్ట్రేషన్లతో ఒకినావా ద్వితీయ స్థానంలో ఉంది. ఇక యాభై శాతం అమ్మకాలు పడిపోగా ఏప్రిల్‌లో హీరో ఎలక్ట్రిక్ 6,571 స్కూటర్ల అమ్మకాలు జరిపి మూడో స్థానానికి పరిమితమైంది. నాలుగో స్థానంలో అథర్, ఐదో స్థానంలో యాంపియర్ ఈవీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఓలా సీఈవీఓ భవిశ్ అగర్వాల్ స్పందిస్తూ.. ప్రత్యర్థి కంపెనీలు మాపై చెడు ప్రచారం చేయడం ఆపి వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బెటర్ అంటూ ట్వీట్ చేశారు. Ola market share: No.1! We’re shaking up the incumbents and vested interests. They better focus on their products rather than fake narratives against us! Customers and markets have voted for facts and truth. We’re just getting started.#EndICEAge #MissionElectric pic.twitter.com/v5ZTc4lj0b — Bhavish Aggarwal (@bhash) May 2, 2022 ఓలా ఎలక్ట్రిక్ కారు రూ.10 లక్షలు? త్వరలోనే ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి తెస్తామంటూ ఓలా ప్రకటించింది. ఇండస్ట్రీ వర్గాల అంచానా ప్రకారం ఈ కారు 2023 చివర్లో లేదంటే 2024 ఫస్ట్ క్వార్టర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి దేశీయంగా తయారు చేసిన ఈ ఈవీ కారుని ఓలా పరిక్షీస్తోంది. మార్కెట్లో వచ్చే నాటికి ఒక కారు ధర కనిష్టంగా రూ. 10 లక్షల దగ్గర ఉండేలా ఓలా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. చదవండి: Ola Electric: అగ్ని ప్రమాదాల కలకలం...ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం..! -
Ola Scooters : యాప్ లాక్ వచ్చేసిందోచ్!
ఓలా యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాప్ లాక్ (డిజిటల్ కీ) అప్డేట్ వచ్చింది. ఈ డిజిటల్ కీ ఎలా పని చేస్తుందనే విషయాలను వీడియో రూపంలో ఓలా ఫౌండర్ భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఈ అప్డేట్ అతి త్వరలోనే ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో మోడళ్లలో ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) ద్వారా అందివ్వనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించారు. నావిగేషన్, మ్యూజిక్, డిజిటల్ కీ వంటి ఫీచర్లన్నింటినీ టచ్ స్క్రీన్ రూపంలో కన్సోల్ ఏరియాలో పొందు పరిచారు. అయితే ఇందులో అనేక యాప్‌లు ప్రస్తుతం లాక్డ్గా ఉన్నాయి. క్రమంగా ఒక్కో ఫీచర్‌కి సంబంధించిన అప్డేట్ను మూవ్ ఓస్2 పేరుతో రిలీజ్ చేస్తూ అన్‌లాక్ చేస్తోంది ఓలా. తాజాగా డిజిటల్ కీని అన్‌లాక్ చేయబోతున్నట్టు తెలిపింది. డిజిటల్ కీ అప్డేట్ అందుబాటులోకి వస్తే ఓలా స్కూటర్ ఆన్, ఆఫ్ చేసేందుకు ఫిజికల్ కీ అవసరం ఉండదు. మొబైల్ ఫోన్లో ఓలాస్కూటర్ యాప్ ద్వారానే ఆన్ ఆఫ్ చేసుకునే వీలు కలుగుతుంది. Ok! So we have the Ola Electric app ready for MoveOS 2 😀 pic.twitter.com/o1PAJ1CYdO — Bhavish Aggarwal (@bhash) April 20, 2022 చదవండి: ఓలా స్కూటర్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన భవీశ్ అగర్వాల్ -
ఓలా స్కూటర్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన భవీశ్ అగర్వాల్
ఓలా స్కూటర్ యూజర్లకు ఆ కంపెనీ సీఈవో భవిశ్ అగర్వాల్ శుభవార్త చెప్పారు. గత ఆర్నేళ్లుగా ఎదురు చూస్తున్న కీలక ఫీచర్‌కి సంబంధించిన అప్డేట్ను వెల్లడించారు. అతి త్వరలోనే యూజర్లకు మూవ్ఓఎస్2 అప్డేట్ అన్‌లాక్ అవుతుందని తెలిపారు. ఓలా స్కూటర్ ప్రీ పొడక్షన్లో ఉండగానే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. లక్షన్నర ప్రీ బుకింగ్స్‌తో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన బూమ్‌తో స్కూటర్ డెలివరీ ఒత్తిడిలో పడిపోయింది ఓలా సంస్థ. ఆగష్టు 15న ప్రీ బుకింగ్స్ ప్రారంభమైతే అక్టోబరు చివరి వారం నాటికి గానీ డెలివరీ చేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా కస్టమర్లకు బైకులు డెలివరీ అవుతున్నాయి. అయితే యూజర్లకు డెలివరీ అయిన బైకుల్లో చాలా ఆప్షన్లో లాక్‌మోడ్‌లోనే ఉండిపోయాయి. డిజిటల్ కీ, మూవ్ఓస్ లాంటి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. క్రమంగా ఒక్కో ఫీచర్‌ను అన్‌లాక్ చేస్తూ వస్తోంది ఓలా. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు ఓలాను చుట్టుముట్టాయి. ఈ తరుణంలో భవీశ్ అగర్వాల్ త్వరలోనే మూవ్ఓస్ 2 అందుబాటులోకి వస్తోందంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఓలా స్కూటర్ డిజటల్ కన్సోల్‌లో నావిగేషన్ మ్యాప్ అందుబాటులోకి రానుంది. Taking the wife out for some ice cream! Navigation on MoveOS 2 working great 👌🏼Coming very soon to all. pic.twitter.com/CUXh2mOQYQ — Bhavish Aggarwal (@bhash) April 18, 2022 చదవండి: ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం.. -
ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం..
ఎలక్ట్రిక్ వెహికల్స్ యజమానులకు, ఈవీ వాహనాలు కొనాలనే ఆలోచనతో ఉన్న వారికి అదిరిపోయే వార్త చెప్పారు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్. ఈవీ వెహికల్స్‌కి అతి పెద్ద సమస్యగా ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ టైమ్‌కి అతి త్వరలోనే చెక్ పెడుతున్నట్టుగా వెల్లడించారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఓలా సంచలనం సృష్టించింది. అప్పటి వరకు ఈవీలపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఓలా స్కూటర్ లక్షన్నరకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించింది. క్రమంగా ఈ బుకింగ్స్‌కు తగ్గట్టుగా వాహనాల డెలివరీ జరుగుతోంది. ఇప్పుడు ఈ వాహనాలకు ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం చూపించే పనిలో ఉన్నారు భవీష్ అగర్వాల్. ఈవీ బ్యాటరీలు, ఛార్జింగ్ టెక్నాలజీలో అద్భుతమైన ప్రగతి సాధించిన స్టోర్‌డాట్‌తో వ్యూహాత్మక భాగస్వామిగా కలుస్తున్నట్టు భవీష్ అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇండియాలో ఈవీలకు సంబంధించి సరికొత్త శకం చూడబోతారని తెలిపారు. 2 వాట్స్, 4 వాట్స్‌కి సంబంధించి ఇండియాలో తయారీ, ఆర్ అండ్ డీ సెంటర్ నెలకొల్పబోతున్నట్టు వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక స్కూటర్ల విషయానికి వస్తే 18 నిమిషాల ఛార్జింగ్‌తో 78 కి.మీ ప్రయాణం చేయవచ్చని ఆ కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌కి వివిధ మోడళ్లను బట్టి కనిష్టంగా 4 గంటల 48 నిమిషాల నుంచి గరిష్టంగా 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. స్టోర్‌డాట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇది ఐదు నిమిషాల దగ్గరకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. We’re investing big into future cell tech. Excited to announce a strategic partnership with StoreDot of Israel. Will be working together to soon bring to market and manufacture its pioneering extreme fast charging cell tech, capable of charging 0-100% in 5 mins in India. (1/2) — Bhavish Aggarwal (@bhash) March 21, 2022 ఇజ్రాయిల్‌కి చెందిన స్టోర్‌డాట్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ సంస్థల ఛార్జింగ్ టైం కనిష్టంగా 45 నిమిషాల నుంచి గరిష్టంగా 80 నిమిషాల వరకు ఉంది. వీటన్నింటినీ బీట్ చేస్తూ స్టోర్‌డాట్ సంస్థ 5 నిమిషాల్లోనే ఒక కారు బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 100 మైళ్లు (160 కి.మీ) కారులో ప్రయాణం చేయవచ్చు. స్టోర్డాట్కి చెందిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఓలా సంస్థ తమ స్కూటర్లకు ఉపయోగించనుంది. తద్వారా స్కూటర్ల ఛార్జింగ్ టైం అనేది నామమాత్రంగా మారుతుంది. స్టోర్‌డాట్ టెక్నాలజీని ఓలా స్కూటర్లలో ఉపయోగిస్తే... టీ తాగే టైం లేదా ఫోన్లో నోటిఫికేషన్లు చెక్ చేసే టైమ్‌లో బ్యాటరీ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా పెట్రోల్ వెహికల్స్‌లో ఫ్యూయల్ ఎంత ఈజీనో ఈవీలలో ఎనర్జీ కూడా అంతే ఈజీగా లభించే రోజు రానుంది. చదవండి: హమ్మయ్యా ? ఇన్నాళ్లకు ఓ మంచి విషయం చెప్పిన ఓలా సీఈవో -
ఒక్కరోజే డెడ్‌లైన్..! షాక్ ఇచ్చేందుకు సిద్దమైన ఓలా..!
గత ఏడాది ఓలా ఎస్1, ఎస్1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుమారు లక్షకుపైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ జరిగినట్లు కంపెనీ ప్రకటించింది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్ తదుపరి విక్రయాలు మార్చి 17 మొదలవ్వగా మార్చి 18తో ముగియనున్నాయి. వీటి డెలివరీలు ఏప్రిల్‌లో ఉంటాయి. కాగా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు షాక్ ఇవ్వడానికి ఓలా సిద్దమైంది. తదుపరి అమ్మకాల్లో ఓలా ఎస్1 ప్రో ధరలు పెరుగుతాయని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. మార్చి 18 తరువాత జరిపే అమ్మకాల్లో ఓలా ఎస్1 ప్రో ధరలు పెరుగుతాయని ప్రకటించారు. అంతేకాకుండా ఆసక్తికల్గిన వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని భవీష్ అగర్వాల్ ట్విటర్లో తెలిపారు. కాగా ప్రస్తుతం ఓలా ఎస్1 ప్రో ధర రూ. 1,29,999 గా ఉంది. హోలీ నేపథ్యంలో గ్లాసీ ఫినిష్‌తో స్పెషల్ ఎడిషన్ గెరువా రంగుతో స్కూటర్‌ను ఓలా ప్రవేశపెట్టింది. మార్చి 17-18 తేదీల్లో మాత్రమే ఈ రంగు వాహనం లభిస్తుందని వివరించింది. ఎస్1 ప్రో ఇప్పటికే 10 రంగుల్లో లభిస్తుంది. హోలి పండుగ సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు.దాంతో పాటుగా ఓలా స్కూటర్లకు కొత్త అప్డేట్లను ప్రకటించింది. ఇది మొత్తంగా స్కూటర్ల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు MoveOS 2.0 అప్డేట్తో కొత్త ఫీచర్లను జోడించింది. Thanks to all who’ve purchased S1 Pro already and special thanks to those who've bought their 2nd or 3rd S1 Pro! Last chance to get it for 129,999. We'll be raising prices in the next window. This window ends 18th midnight!😊 Buy now, only on the Ola app! pic.twitter.com/I7FF0GlXQD — Bhavish Aggarwal (@bhash) March 17, 2022 చదవండి: రిలయన్స్ వెనకడుగు..! రష్యా ముడిచమురు మాకొద్దు..! కారణం అదే..! -
హమ్మయ్యా ? ఇన్నాళ్లకు ఓ మంచి విషయం చెప్పిన ఓలా సీఈవో
ఎంతోకాలంగా ఊరిస్తూ వచ్చిన ఫీచర్లు త్వరలో తమ కస్టమర్లకి అందివ్వబోతున్నట్టు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు. భారీ అంచనాల మధ్య మార్కెట్లోకి వచ్చింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. అయితే స్కూటర్ రిలీజ్‌కి ముందు చెప్పిన పలు ఆప్షన్లు మొదటి విడత కస్టమర్లకు అందలేదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెస్తామంటూ భవీష్ అగర్వాల్ చేసిన ప్రకటన మార్కెట్లో సంచనలంగా మారింది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. 2021 ఆగస్టు 15న స్కూటర్ని రిలీజ్ చేయగా రికార్డు స్థాయిలో మొత్తం డబ్బులు చెల్లించారు కస్టమర్లు. కానీ ముందుగా ప్రకటించిన సమయానికి స్కూటర్లు డెలివరీ చేయలేకపోయింది ఓలా. అక్టోబరు తర్వాత కస్టమర్లకు స్కూటర్లు అందించినా ముందుగా ప్రకటించిన అనేక ఫీచర్లు డిసేబుల్ మోడ్‌లో ఉంచింది. దీంతో లేటెస్ట్ ఫీచర్లు అందివ్వాలంటూ నలువైపులా ఓలాపై ఒత్తిడి పెరిగింది. చివరకు ఆ ఒత్తిడి నెగటివ్ ప్రచారానికి దారి తీసింది. దీంతో అప్రమత్తమైన ఓలా యాజమన్యం తాజాగా స్పందించింది. ఓలా స్కూటర్‌కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ 2.ఓ, కీ ఫీచర్స్, నావిగేషన్, కంపానియన్ యాప్, క్రూస్ కంట్రోల్, బ్లూటూత్ తదితర ఫీచర్లు 2022 ఏప్రిల్ చివరికల్లా అందిస్తామని భవీశ్ ప్రకటించారు. MoveOS 2.0 almost ready and coming end April to everyone. Key features: navigation, companion app, cruise control, bluetooth, lots of performance improvements and more! — Bhavish Aggarwal (@bhash) March 16, 2022 -
వాళ్ల సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదన్న ఓలా సీఈవో.. మండిపడుతున్న కస్టమర్లు
OLA CEO Bhavish Aggarwal: ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్ సాధించింది. రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌ని సరిగా ఉపయోగించుకోవడంలో ఓలా విఫలమైంది. డెలివరీలు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో సందర్భం ఏదైనా సరే ఓలా స్కూటర్స్ సీఈవో భవిష్య అగర్వాల్‌పై కస్టమర్లు విరుచుకు పడుతున్నారు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తల్లిదండ్రులు పంజాబ్‌లోని లుథియానాలో నివసిస్తున్నారు. దేశంలో మిగిలిన కస్టమర్లలాగే 2021 ఆగస్టు 15న వారు కూడా ఓలా స్కూటర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంచు మించు ఆరు నెలల తర్వాత ఆ స్కూటర్ని లుథియానాలో భవీష్ అగర్వాల్ తల్లిదండ్రులకు డెలవరీ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఎంతో సంతోషంగా తెలిపారు భవీష్ అగర్వాల్. @OlaElectric @varundubey No updates regarding dispatch by taking amount early and customer support wont reply those people paid after me got delivered.why to show first come first serve when r not following it.and you people only reply for good response who will ans complaints? — ashwin (@ashwinas92) February 25, 2022 భవీష్ అగర్వాల్ ట్వీట్‌కి నెటిజన్ల నుంచి నెగటివ్ స్పందన వచ్చింది. ఆరు నెలలుగా ఇంచుమించు లక్షన్న రూపాయలు చెల్లించి స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నామని ఇంత వరకు ఎందుకు డెలివరీ చేయడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రస్టేట్ అవకుండా ఓలా స్కూటర్ అందుకోవడం కష్టమంటున్నారు. My dad is waiting for his @OlaElectric scooter too. Super frustrated by seeing those copy-paste tweet replies from you people. I was a fool to pay money every time in first place when you people opened the payment windows 3 times. The limit is reached now. @consumerforum_ — अभिषेक राय (@Abhishek_Rai555) February 25, 2022 మేము చెల్లించిన డబ్బలుకు వడ్డీ ఎవరు ఇస్తారు ? ఎన్ని సార్లు అడిగినా కాపీ పేస్ట్ సమాధానాలు తప్పితే మీ నుంచి ఏమీ రావడం లేదు ? ఒక మోడల్ బుక్ చేస్తే మరో మోడల్ డెలివరీ చేశారంటూ ఒకరి తర్వాత ఒకరుగా నెటిజన్లు భవీష్ అగర్వాల్‌పై మండిపడుతున్నారు. -
క్రేజీ లుక్స్‌తో ఓలా ఎలక్ట్రిక్ కారు..! సోషల్ మీడియాలో హల్చల్..!
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ను ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పగానే 24 గంటల్లో లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ప్రీబుకింగ్స్ విషయంలో ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఓలా స్కూటర్స్‌ను ఇప్పటికే డెలివరీ చేయడం మొదలుపెట్టింది. ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో పాటుగా ఎలక్ట్రిక్ కార్లను కూడా ఓలా తయారుచేస్తోందని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఓలా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారు టీజర్ ఫోటోని సోషల్ మీడియా ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో రానున్న ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్ కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది, ఇంకా స్టైలిష్ బ్యాటరీ-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఉండనుంది. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓలా ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్..! ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ ట్విటర్లో పంచుకున్న ఎలక్ట్రిక్ కారు డిజైన్ కాస్త నిస్సాన్ లీఫ్ ఈవీ కారు మాదిరిలాగా ఉంది. స్మాల్ హ్యచ్బ్యాక్తో టెస్లా మోడల్ 3 లాగా ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్ ఉంది. ప్రొడక్షన్ కారు సైడ్ ప్రొఫైల్‌లో క్లీన్ షీట్ డిజైన్‌తో మినిమలిస్ట్ విధానంతో రానుంది. డిజైన్ కాన్సెప్ట్ ఫోటోలో ఎలాంటి డోర్ హ్యాండిల్ లేకపోవడం విషయం.ఈ కారులో స్ట్రిప్ రూపంలో సొగసైన ఎల్ఈడీ టెయిల్లైట్లు కనిపించాయి. రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారు కాంపాక్ట్ క్యాబిన్‌తో వస్తుందని తెలుస్తోంది. అలాగే ఈ కారులో స్పోర్టీ సీట్లు పొందవచ్చని భావిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కారు స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌తో రానుంది. కారు వచ్చేది అప్పుడే..! ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి ప్రస్తావిస్తూ ఓలా మొదటి ఎలక్ట్రిక్ కారు 2023లో వస్తుందని, ఈ ప్రాజెక్ట్‌కు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ మద్దతు ఇస్తుందని భవిష్ అగర్వాల్ గతంలో చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. అయితే, ఓలా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. ఓలా ఎలక్ట్రిక్ కారు తమిళనాడులోని ఈవీ తయారీ ప్లాంట్‌లో తయారయ్యే అవకాశం ఉంది. ఈ తయారీ కర్మాగారం ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా నిలుస్తోంది. Can you guys keep a secret? 🤫🤫 pic.twitter.com/8I9NMe2eLJ — Bhavish Aggarwal (@bhash) January 25, 2022 చదవండి: సామాన్యుడితో ఆనంద్ మహీంద్రా డీల్ పూర్తి.. పాత బండికి కొత్త బొలెరో అందజేత