దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకి ధరలు పెరిగి పోతుండటంతో సామాన్య ప్రజానీకం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ వన్, అథర్ ఎనర్జీ వంటి ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పోటీ వాతావరణం విపరీతంగా ఏర్పడింది. అయితే, చాలా మంది వినియోగదారులు ఈవీలకు సంబంధించి ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్యగా మారింది. వాహనాలను ఛార్జ్ చేయడానికి భారతదేశంలో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యగా పేర్కొనవచ్చు.
పెట్రోల్, డీజిల్ వంటి ఇందనాలతో నడిచే వాహనాల మాదిరిగా కాకుండా.. ఈవీల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు చాలా తక్కువ దశలో ఉన్నాయి. అయితే, ఈ నేపథ్యంలో ఈవీల ఛార్జింగ్ సమస్యలకు పేటిఎమ్ వ్యవస్థాపకుడు చేసిన ట్వీట్ కు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్పందిస్తూ "సులభమైన పరిష్కారం" ఉంది అని ట్వీట్ చేశారు. ఈవీల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల గురుంచి పేటిఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇలా ఒక ట్వీట్ చేశారు.."ఈవీ అనేది లగ్జరీ కాదు, ఈ జీవరాశులతో గల గ్రహాన్ని కాపాడటం మనమందరం బాధ్యతగా స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. సిటీలో స్వచ్చమైన పీల్చుకోవడానికి నివాస, కార్యాలయ స్థలాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే విధానాన్ని ప్రోత్సహించే విధంగా నిబందనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని" విజయ్ శేఖర్ శర్మకోరారు.(చదవండి: ఉద్యోగం లేకున్నా క్రెడిట్ కార్డు పొందండి ఇలా..?)
Every 2W, 4W spends 20 hours of its daily life parked somewhere, at home or office! Easiest solution to charging infra is low cost slow charging outlets in parking, be in independent homes, RWAs/apartments etc. Much cheaper than lots of large scale public fast charging. https://t.co/QI2u9tuT5y
— Bhavish Aggarwal (@bhash) September 8, 2021
పేటిఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చేసిన ట్వీట్ కు ప్రతి స్పందనగా భవిష్ అగర్వాల్ ఇలా సమాధానం ఇచ్చారు.."ప్రతి 2డబ్ల్యు, 4డబ్ల్యు గల వాహనాలను చార్జ్ చేయడానికి రోజువారీ జీవితంలో 20 గంటలు ఇంటి వద్ద లేదా ఆఫీసులో పార్క్ చేస్తున్నాము. ఈ ఛార్జింగ్ సమస్యలకు సులభమైన పరిష్కారం తక్కువ ఖర్చుతో స్లో ఛార్జింగ్ అవుట్ లెట్లను ఇంటి వద్ద, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద, అపార్ట్ మెంట్ల మొదలైన ప్రదేశాలలో ఏర్పాటు చేయవచ్చు. పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కంటే ఇది చాలా చౌక" అని ఆయన శర్మ ట్వీట్ కు బదులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment