
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతని ప్రవర్తన కారణంగా ఉద్యోగులు, సంస్థ బోర్డు సభ్యులు సైతం సంస్థను వదిలేయడానికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఓలా మాజీ ఉద్యోగులు భవిష్ అగర్వాల్‌పై పలు ఆరోపణలు చేశారు. రెండేళ్ల నుంచి సంస్థలో వర్క్ కల్చర్ పూర్తి వ్యతిరేకంగా ఉందని పలువురు మాజీ ఉద్యోగులు బ్లూంబెర్గ్‌కు తెలిపారు. ఉదాహరణకు ఆఫీస్‌లో జరిగే మీటింగ్ సంబంధించి తయారు చేసుకున్న ప్రజెంటేషన్ పేపర్లలో పేజ్ నెంబర్‌లు మారిపోతే.. ఆ ప్రజెంటేషన్ పేపర్లను చించేయడం, సిబ్బందిని ఓ వర్గానికి చెందిన వారితో ఆపాదిస్తూ ‘యూజ్‌లెస్’ అని సంబోధించేవారని వాపోయారు.
ఉద్యోగులపై అరవడం
మీటింగ్ సంబంధించి ప్రజెంటేషన్ పేపర్లలో వర్డ్ ఫార్మేషన్ లేకపోతే అరవడం, ప్రజెంటేషన్ పేపర్లకు క్లిప్‌లు సరిగ్గా పెట్టకపోయినా, ప్రింటింగ్ పేపర్‌లు నాసిరకంగా ఉన్నా సహించలేరని తెలిపారు. ఒక్కోసారి సహనం కోల్పోతే గంట పాటు ఆఫీస్ మీటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తే.. దాన్ని పది నిమిషాల్లో ముగించేస్తారని ఉద్యోగులు చెప్పిన విషయాల్ని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది. ఇదే విషయాన్ని భవిష్‌తో చర్చించగా.. అందరూ మన వర్క్ కల్చర్‌కు ఇమడలేకపోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఉద్యోగులకు నచ్చేలా ఆఫీస్ వాతావరణం లేదని అన్నారు.
చదవండి👉 భవిష్ అగర్వాల్ మామూలోడు కాదు..ఎలాన్ మస్క్‌కే ఝలక్ ఇచ్చాడు
Comments
Please login to add a commentAdd a comment