Charging
-
ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టడం తెలుసా..?
స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.ఇతర ఛార్జర్లను ఉపయోగించడంప్రతిఫోన్కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్‌ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.రాత్రంతా ఛార్జింగ్చాలామందికి లేట్‌నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడంఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.సాఫ్ట్వేర్ అప్డేట్లను విస్మరించడంఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.0% నుంచి 100% వరకుఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.చలి, వేడికి దగ్గరగా..విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్‌ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.దెబ్బతిన్న కేబుల్‌తో ఛార్జింగ్పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయకపోవడంఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. -
యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..
ప్రపంచ నంబర్ 1 కంపెనీ యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లను యూరప్‌లో నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం(EU) నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిసింది.యూరప్ ప్రభుత్వం అన్ని మోబైళ్లలో ప్రామాణికంగా యూఎస్బీ టైప్-సీ(Type-C) పోర్ట్‌తో ఉన్న ఛార్జింగ్ సదుపాయం ఉండాలనేలా నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా వాడుకలో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది యూరప్ నిబంధనలకు విరుద్ధం. దాంతో స్థానికంగా ఈ మోడళ్లను నిలిపేస్తున్నట్లు యాపిల్(Apple) ప్రకటించింది.ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలుయాపిల్ ఐఫోన్ 14 తర్వాత విడుదల చేసిన మోడళ్లలో టైప్-సీ పోర్ట్‌ను తీసుకొచ్చింది. దాంతో ఐఫోన్ 15తోపాటు తదుపరి మోడళ్లకు ఈ సమస్య లేదు. ఇప్పటికే ఐఫోన్(IPhone) 14 వాడుతున్నవారికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మాత్రం యూరప్‌లో అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఐఫోన్ 16 మోడల్‌ను విడుదల చేయడంతో చాలామంది ఈ మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. యూరప్‌కు చెందిన వినియోగదారులకు 2025 ప్రారంభంలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో ఐఫోన్ ఎస్ఈ(IPhone SE) మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. -
ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ నుంచి సరికొత్త 35 సిరీస్‌ను ఆవిష్కరించింది. 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో మూడు వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.కొత్త చేతక్ రూ.1.2 లక్షల ధరతో మిడ్ వేరియంట్ 3502, రూ.1.27 లక్షల ధరతో టాప్–ఎండ్ వేరియంట్ 3501 మాత్రమే ప్రస్తుతానికి విడుదలైంది. వీటి టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు. బేస్ వేరియంట్ అయిన 3503 కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. డెలివరీలు డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభం అతుతాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్స్ అందుకునేలా స్మార్ట్ టచ్‌స్క్రీన్ పొందుపరిచారు. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్ ఏర్పాటు ఉంది. స్టోరేజ్ స్థలం పరంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఇదే అత్యధికం. రిమోట్ ఇమ్మొబిలైజేషన్, గైడ్ మీ హోమ్ లైట్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 3501 మూడు గంటల్లో, 3502 వేరియంట్ 3 గంటల 25 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ తెలిపింది. వారంటీ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. -
చార్జింగ్ వసతులకు రూ.16,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) కోసం దేశంలో పెరుగుతున్న పబ్లిక్ చార్జింగ్ డిమాండ్‌ను తీర్చడానికి.. అలాగే 2030 నాటికి 30 శాతానికి పైగా ఈవీలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి భారత్‌కు రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫిక్కీ సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ‘ప్రస్తుతం ఈవీ చార్జింగ్ స్టేషన్ల వినియోగం 2 శాతం లోపే ఉంది. దీంతో ఇవి లాభసాటిగా లేవు. ఇవి లాభాల్లోకి రావడానికి, మరింత విస్తరణ చెందేందుకు 2030 నాటికి వీటి వినియోగాన్ని 8–10 శాతానికి చేర్చే లక్ష్యంతో పనిచేయాలి. ఇంధన వినియోగంతో సంబంధం లేకుండా స్థిర ఛార్జీలతో విద్యుత్ టారిఫ్ ఉండడం, అలాగే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో తక్కువ వినియోగం కారణంగా బ్రేక్ ఈవె న్ సాధించడం సవాలుగా మారింది. యూపీ, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు సున్నా లేదా తక్కు వ స్థిర సుంకాలను కలిగి ఉన్నాయి. అయితే స్థిర సుంకాలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మనుగడ సవాలుగా మారింది’ అని నివేదిక తెలిపింది. అనుమతి అవసరం లేని.. స్వచ్ఛ ఇంధనం, సుస్థిరత వైపు భారత పరివర్తనను ప్రారంభించడానికి విధాన రూపకర్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలతో సహా కీలక వాటాదారులు రంగంలోకి దిగాలి. పబ్లిక్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడానికి పరిమిత ఆర్థిక సాధ్యత, డిస్కమ్ లేదా విద్యుత్ సంబంధిత సమస్యలు, భూమి సమస్యలు, కార్యాచరణ సవాళ్లు, ప్రామాణీకరణ మరియు ఇంటర్–ఆపరేబిలిటీ వంటి కీలక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈవీ వ్యవస్థ అంతటా పన్నుకు అనుగుణంగా చార్జింగ్ సేవలకు జీఎస్టీ రేట్లను 18 నుండి 5 శాతానికి ప్రామాణీకరించాలి. అన్ని రాష్ట్రాలలో స్థిర ధరలతో రెండు–భాగాల టారిఫ్ నుండి సింగిల్–పార్ట్ టారిఫ్‌కు మార్చాలి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలు కోసం ఎటువంటి అనుమతి అవసరం లేని విధానాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. అలాగే సీఎన్జీ త్రీ–వీలర్ నుండి ఎలక్ట్రిక్‌కు మారడానికి అదే అనుమతిని ఉపయోగించేలా వెసులుబాటు ఇవ్వాలి’ అని నివేదిక పేర్కొంది. టాప్–40 నగరాల్లో..చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్‌మ్యాప్ అమలును ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి పరిశ్రమల వాటాదారులు, రాష్ట్ర, కేంద్ర అధికారుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర–స్థాయి సెల్‌ను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను సకాలంలో స్థాపించేందుకు రాష్ట్ర డిస్కమ్‌ల కోసం ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల యొక్క సంస్థాపన, నిర్వహణకై విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉండాలి. 2015 నుండి 2023–24 వరకు ఈవీ విక్రయాల ఆధారంగా విశ్లేషించిన 700లకుపైగా నగరాలు, పట్టణాల్లోని టాప్–40, అలాగే 20 హైవేల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత ఈవీ స్వీకరణ రేటు, అనుకూల రాష్ట్ర విధానాలను బట్టి ఈ ప్రధాన 40 నగరాలు, పట్టణాలు రాబోయే 3–5 సంవత్సరాలలో అధిక ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని కలిగి ఉంటాయని అంచనా. ఈ 20 హైవేలు 40 ప్రాధాన్యత నగరాలను కలుపుతున్నాయి. మొత్తం వాహనాల్లో ఈ నగరాల వాటా 50 శాతం’ అని నివేదిక వివరించింది. -
ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
దేశవ్యాప్తంగా వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సుమారు 600 పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వెల్లడించింది. 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి 50 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ భారీ స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందని కంపెనీ ఫంక్షన్ హెడ్ (కార్పొరేట్ ప్లానింగ్ విభాగం) జేవాన్ రియూ తెలిపారు.చార్జింగ్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల కస్టమర్లు జాతీయ రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి సంకోచిస్తున్నట్లుగా తమ అధ్యయనాల్లో వెల్లడైందని ఆయన వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాలతో పాటు కీలక హైవేలపై కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు రియూ తెలిపారు.ఇదీ చదవండి: యూజర్ మాన్యువల్ మిస్సింగ్.. రూ.5 వేలు జరిమానాఇదిలాఉండగా, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రకటించింది. -
ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!
ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు. అదేంటి ఛార్జర్ లేకుండా ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుందనేగా మీ అనుమానం.. సింపుల్.. ఫోన్‌ను మీ ఒళ్లో పెట్టుకోండి. వెంటనే ఛార్జింగ్ అవుతుంది. అవునండి.. మీరు విన్నది నిజమే. ఇదో కొత్తరకం టెక్నాలజీ. థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ అనే టెక్నాలజీతో ఇది సాధ్యమేనని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈమేరకు స్వీడన్‌లోని ఛామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని నిరూపించారు.థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ సాంకేతిక ద్వారా మనం ధరించే దుస్తుల్లోని సిల్క్ దారాలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ సిల్క్ దారాలకు కండక్టివ్ ప్లాస్టిక్ అనే లోహాన్ని పూయడం ద్వారా బ్యాటరీ లేకుండానే విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చని నిరూపించారు. ఈ టెక్నాలజీ ద్వారా బయటి వాతావరణం, శరీర ఉష్ణోగ్రత వ్యత్యాసాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టెక్నాలజీను విభిన్న పరిస్థితుల్లో పరీక్షించి, మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఉపయోగాలెన్నో..సంప్రదాయ బ్యాటరీలు లేకుండా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీ అవసరంలేని సెన్సార్ల వంటి వాటికి ఈ సాంకేతికతతో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. కొన్ని సంస్థలు వినియోగదారుల హృదయ స్పందనలను ట్రాక్ చేయడానికి, ఆరోగ్య కొలమానాలను పర్యవేక్షించడానికి టెక్స్టైల్ సెన్సార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటికి ఈ థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ద్వారా ఎనర్జీని అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగులకూ, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండేవారికీ ఉపయోగపడేలా ఈ దుస్తుల్ని రూపొందిస్తున్నారు.ఇదీ చదవండి: క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలుఏ ప్రమాదం లేదు..అసలే కరెంటుతో వ్యవహారం.. అలాంటిది మనం ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ధరించొచ్చా అనే సందేహం అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో మానవులకు ఎలాంటి హాని ఉండదంటున్నారు. ఈ ప్రక్రియతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఈవీబ్యాటరీల స్వాపింగ్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది.బ్యాటరీల స్వాపింగ్, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది. విదేశాల్లో ఈ విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్న వారు సైతం స్వాపింగ్ సేవలను ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుత విద్యుత్ కనెక్షన్ ద్వారానే స్వాపింగ్ సేవలను అందించడానికి కేంద్రం వీరికి అవకాశం కల్పించింది. సర్వీసు చార్జీలపై సీలింగ్ ఈవీ చార్జింగ్ కేంద్రాల్లో ఏసీ/డీసీ చార్జింగ్కు వసూలు చేయాల్సిన సర్వీసు చార్జీలపై గరిష్ట పరిమితిని కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ, భూమి ధరకు సంబంధించిన చార్జీలు వీటికి అదనం కానున్నాయి. యూనిట్ విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కంలు చేసే సగటు వ్యయంతో పోల్చితే చార్జింగ్ కేంద్రాలకు సరఫరా చేసే విద్యుత్ టారిఫ్ అధికంగా ఉండరాదని కేంద్రం స్పష్టం చేసింది. 2028 మార్చి 31 వరకు దేశ వ్యాప్తంగా ఇవే సర్వీస్ చార్జీలు, టారిఫ్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. సగటు సరఫరా వ్యయంతో పోల్చితే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 0.7 రేట్లు, సాయంత్రం 4 నుంచి ఉదయం 9 గంటల వరకు 1.3 రేట్ల అధిక వ్యయంతో చార్జింగ్ కేంద్రాలకు డిస్కంలు విద్యుత్ సరఫరా చేయాలని సూచించింది. ఈవీ చార్జర్ల కోసం సబ్ మీటర్లను సరఫరా చేయాలని డిస్కంలను కోరింది. 3 రోజుల్లోనే కరెంట్ కనెక్షన్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే మెట్రోపాలిటన్ నగరాల్లో కేవలం 3 రోజుల్లోనే కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇతర మున్సిపాలిటీల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో, కొండలున్న గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల్లో, సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటే 90 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం చేస్తే ఎలక్ట్రిసిటీ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ రూల్స్–2020 ప్రకారం దరఖాస్తుదారులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థకు స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయాలి ప్రభుత్వం, ప్రభుత్వ రంగసంస్థలు తమ స్థలాలను ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం రెవెన్యూ షేరింగ్ మోడల్ కింద అందించాలని కేంద్రం సూచించింది. స్థలం ఇచ్చినందుకుగాను ప్రతి యూనిట్ విద్యుత్ చార్జింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో రూపాయిని వాటాగా తీసుకోవాలని చెప్పింది. తొలుత 10 ఏళ్ల లీజుకు స్థలాలను కేటాయించాలని కోరింది. చార్జింగ్ కేంద్రాలఏర్పాటుదారులకు కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందించాలని సూచించింది. -
ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత మార్కెట్లో ఈ–మ్యాక్స్ 7 ఎలక్ట్రిక్ ఎంపీవీ ప్రవేశపెట్టింది. ధర రూ.26.9 లక్షల నుంచి ప్రారంభం. మూడు వరుసల సీటింగ్‌తో 2021లో ఎంట్రీ ఇచి్చన ఈ6కు ఆధునిక హంగులు జోడించి ఈ–మ్యాక్స్7కు రూపకల్పన చేశారు. ఒకసారి చార్జింగ్‌తో ప్రీమియం వేరియంట్ 420 కిలోమీటర్లు, సుపీరియర్ వేరియంట్ 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 12.7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 12.8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ చార్జింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి హంగులు ఉన్నాయి. -
మారుతీ ఈవీ రేంజ్ 500 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తొలి ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రోడ్లపై పరుగుతీయనుంది. ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో ఈ కారును రూపొందిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీని పొందుపరుస్తున్నట్టు సియామ్ సమావేశంలో చెప్పారు. ఇలాంటి పలు ఈవీ మోడళ్లను ప్రవేశపెడతామని తెలిపారు. యూరప్, జపాన్ తదితర దేశాలకు ఈ ఈవీని ఎగుమతి చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశీయ విపణిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్, బలమైన హైబ్రిడ్ కార్లతోపాటు మారుతీ తన కార్లలో అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించాలని భావిస్తోంది. 2030 నాటికి ఎగుమతులను మూడు రెట్లు పెంచుకునే యోచనలో ఉన్నట్లు టాకేయూచీ తెలిపారు. కంపెనీ ఇప్పటికే కొన్ని వాహనాలను జపాన్‌కి కూడా ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ షో సందర్భంగా తొలి ఈవీని ఆవిష్కరిస్తామని మారుతీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక వసతుల ఏ ర్పాటు, రీసేల్ మార్గాలను కలిగి ఉండటం వంటి ఇతర కీలక అంశాలపై కూడా దృష్టి సారించామన్నారు. -
జావా కొత్త బైక్ 42 ఎఫ్‌జే
ముంబై: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ తాజాగా సరికొత్త జావా 42 ఎఫ్‌జే బైక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 42 సిరీస్‌లో ఇది మూడవ మోడల్. 334 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 350 ఆల్ఫా2 ఇంజన్‌తో తయారైంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. ఎల్ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్ వంటి హంగులు జోడించారు. అక్టోబర్ 2 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 ఆర్ఎస్కు పోటీనిస్తుంది. 2018 నవంబర్‌లో జావా బ్రాండ్ భారత్‌లో రీఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 450 డీలర్íÙప్స్ ఉన్నాయి. పండుగల సీజన్ నాటికి మరో 100 జావా కేఫ్స్ రానున్నాయి. జావా వంటి పునరుత్థాన బ్రాండ్ల పునర్నిర్మాణంలో ఎలాంటి సవాళ్లనైనా క్లాసిక్ లెజెండ్స్ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. -
భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే
శంషాబాద్: చార్జింగ్ కేంద్రాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని ఐటీ,పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. పర్యావరణహిత∙ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందన్నారు.స్వీడన్‌కు చెందిన గ్లీడా సంస్థ శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో శ్రీశైలం హైవేలో ఒకేసారి 102 వాహనాలు చార్జింగ్ చేసుకునేలా ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్‌రంజన్ మాట్లాడుతూ గ్లీడా వంటి సంస్థ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ 2018 కేవలం ఒక చార్జింగ్ పాయింట్‌తో ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం నగరంలో మొత్తం 89 కేంద్రాలను విస్తృత పర్చిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవదేష్ అన్నారు. -
పబ్లిక్ ప్రాంతాల్లో చార్జింగ్ పోర్టులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ప్రయాణాల సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్ జాకింగ్‌కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏమిటీ జ్యూస్ జాకింగ్..? చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్‌కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ♦ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. ♦ చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. ♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. ♦ మొబైల్ ఫోన్లకు స్క్రీన్‌లాక్ తప్పకుండా పెట్టుకోవాలి. ♦ వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. -
చార్జింగ్‌తో పాటు డేటా స్టోరేజ్
చార్జింగ్‌తో పాటు డేటా స్టోరేజ్ చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం ఒకేసారి రెండుపనులు చేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో ఈ పరికరం పోర్టబుల్ చార్జర్‌లా పనిచేస్తుంది. దీని ద్వారా స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి వాటిని చార్జింగ్ చేసుకోవచ్చు. పరికరాలను చార్జింగ్ చేస్తున్న సమయంలోనే, వాటిలోని ముఖ్యమైన డేటాను కూడా ఇందులో భద్రపరచుకోవచ్చు. ఇది సైనిక అవసరాల కోసం ఉపయోగించే ‘ఏఈఎస్–256’ ఎన్క్రిప్షన్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ఏకకాలంలో రెండు పరికరాలకు 65 వాట్ల విద్యుత్తును సరఫరా చేస్తూ చార్జింగ్ చేయగలదు. అలాగే, 1000 ఎంబీపీఎస్ వేగంతో డేటాను స్టోర్ చేసుకోగలదు. డేటా స్టోరేజ్ సామర్థ్యం ప్రకారం ‘మెమ్కీపర్’ పేరుతో చైనాకు చెందిన మెమ్కీపర్ టెక్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం మూడు మోడల్స్‌లో– 256 జీబీ, 512 జీబీ, 1టీబీ మోడల్స్‌లో దొరుకుతుంది. మోడల్‌ను బట్టి ఈ పరికరం ధర 99 డాలర్ల నుంచి 132 డాలర్ల (రూ.8,214 నుంచి రూ.10,957)వరకు ఉంటుంది. -
3 రోజుల్లో కొత్త కరెంట్ కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: మెట్రోపాలి టన్ నగరాల్లో వినియోగదారులు అవసరమైన పత్రాలన్నీ పొందుపరిచి, కొత్త కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వా లని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాత కనెక్షన్లో మార్పుల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ(వినియోగదారుల హక్కులు) రూల్స్–2020ని సవరిస్తూ రూల్స్–2024ను శుక్రవారం జారీ చేసింది. అదేవిధంగా మున్సిపల్ ప్రాంతాల్లో వారంరోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా కనెక్షన్ జారీ చేయాలని నిర్దేశించింది. రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొండ ప్రదేశాల్లో అయితే 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. పంపిణీ వ్యవస్థల విస్తరణ, కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటే.. 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని, విద్యుత్ సరఫరా చేయాలని నిర్దేశించింది. ఇక గ్రూప్ హౌసింగ్ సొసైటీ కింద అన్ని ఇళ్లకు అవకాశం ఉంటే.. సింగిల్ పాయింట్ కనెక్షన్ (ఒకే కనెక్షన్) ఇవ్వాలని పేర్కొంది. సొసైటీలో 50 శాతం దాకా యాజమానులు వ్యక్తిగత కనెక్షన్ కోరితే.. వారందరికీ వ్యక్తిగత కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగిల్ పాయింట్ కనెక్షన్ టారిఫ్ కూడా సగటు గృహ కనెక్షన్ టారిఫ్‌ను దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సొసైటీల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం ప్రత్యేకంగా కనెక్షన్ కావాలంటే జారీ చేయాలని నిర్దేశించింది. మీటర్లలో లోపాలు లేదా దెబ్బతినడం.. కాలిపోవడం వంటి అంశాలపై దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోపు కొత్త మీటర్ బిగించాలని, మీటర్ రీడింగ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేస్తే కొత్త మీటర్‌ను ఐదురోజుల్లోగా బిగించడమే కాకుండా తప్పుడు బిల్లింగ్‌పై ఫిర్యాదును మూడు నెలల్లోపు పరిష్కరించాలని పేర్కొంది. సోలార్ విద్యుత్ కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను 15 రోజుల్లోగా అందించాలన్నారు. 10 కిలోవాట్ల దాకా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ కోసం వచి్చన దరఖాస్తును సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక అవసరం లేకుండా అనుమతించాలని ఆదేశించింది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ బిగించిన తర్వాత సరి్టఫికెట్‌ను వినియోగదారుడు దాఖలు చేస్తే కనెక్షన్ అగ్రిమెంట్, కొత్త మీటర్‌ను 15 రోజుల్లోగా అందించాలని స్పష్టం చేసింది. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
వావ్.. పవర్ బ్యాంక్ వాచీలు వచ్చేశాయ్.. అవి ఎలా పనిచేస్తాయంటే?
ఇవి కొత్తరకం వాచీల్లా కనిపిస్తున్నాయి కదూ! ఇవి వాచీలు మాత్రమే కాదు, పవర్‌బ్యాంకులు కూడా! రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్‌వాచీలు అవసరమైనప్పుడు స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లను చార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దక్షిణ కొరియాకు చెందిన మార్క్ అండ్ డ్రా కంపెనీ స్మార్ట్‌వాచీలకు అనుబంధంగా ఉండేలా 450 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్‌ను రూపొందించింది. ఈ పవర్‌బ్యాంక్ ఆపిల్ స్మార్ట్‌వాచీలకు బాగా ఉపయోగపడతాయి. ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు చార్జింగ్ చేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ పవర్‌బ్యాంకును ఒకసారి చార్జ్ చేసుకుంటే, సాధారణ పవర్‌బ్యాంకుల కంటే మూడురెట్లు ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఈ పవర్‌బ్యాంక్ వాచీ ధర 349.97 డాలర్లు (రూ.29,126) మాత్రమే! -
గల్ఫ్ ఆయిల్ చేతికి టైరెక్స్
ముంబై: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) చార్జర్ల తయారీ కంపెనీ టైరెక్స్ ట్రాన్స్‌మిషన్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండి యా తాజాగా పేర్కొంది. ఇందుకు రూ.103 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. తద్వారా ఈవీ విభాగంలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నట్లు అంచనా వేసింది. ఈవీ చార్జింగ్ మార్కెట్ ప్రస్తుత అంచనా విలువ 20 బిలియన్ డాలర్లుకాగా.. 2030కల్లా భారీగా 200 బిలియన్ డాలర్లను తాకగలదన్న అంచనాలున్నట్లు తెలిపింది. -
అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
Apple Warning: టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్‌ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్‌పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్‌కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్ చేయకూడదని సలహా ఇచ్చింది. కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్ రూంలో కూడా వదలకుండా ఫోన్ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు!
ఉద్యోగ జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో తన ప్రొఫిషినల్ లైఫ్‌లో ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించాడు. తాను తన కార్యాలయంలో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాననని దానిలో పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్టులో @Melodic-Code-2594 అనే ఖాతా కలిగిన యూజర్ తన బాస్ తాను ఆఫీసులో ఫోన్ ఛార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత ఉపయోగం కోసం కంపెనీ విద్యుత్ చోరీ చేశానని’ బాస్ ఆరోపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యూజర్ తన పోస్టులో.. ‘ఆఫీసులో తాను ఫోన్ ఛార్జ్ చేసినందుకు మా బాస్ నాతో.. వ్యక్తి గత అవసరాలకు కంపెనీ విద్యుత్ చోరీ చేస్తున్నారు. మీ లాంటి వాళ్లకు ఎలా చెప్పాలి? నేనేమీ రోజంతా ఫోనులోనే మునిగిపోను. అప్పుడప్పుడు రాత్రి వేళ బెడ్‌మీదకు చేరేముందు ఫోన్ చార్జ్ చేయడం మరచి పోతుంటానంతే. ఇది డెస్క్ జాబ్’ అని బాస్ సీరియస్‌గా చెప్పాడని వివరించారు. ఈ పోస్టును చూసిన యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్..‘మీ బాస్ పెద్ద మూర్ఖుడు. ఫోన్ ఛార్జింగ్ పెడితే కంపెనీ కరెంట్ చోరీ చేసినట్లు అవుతుందన్నాడంటే.. అక్కడి గాలి పీల్చినా, నీటిని తాగినా చోరీ చేశావని అంటాడేమో’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్..‘మీ బాస్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవద్దన్నాడంటే.. ఆఫీసులోని ఫోనుకు వచ్చిన ఏ కాల్‌ను రిసీవ్ చేసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు కంపెనీ ఫోను టాక్‌టైమ్, బ్యాటరీ పవర్ చోరీ చేసినట్లువుతుందని’ పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆఫీసులోని టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఫ్లష్ చేయవద్దని మీ బాస్‌కు చెప్పండి. ఎందుకంటే అలా చేస్తే కంపెనీకి చెందిన నీరు వృథా అవుతుందని వివరించండి’ అని సలహా ఇచ్చాడు. ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్! -
తల్లీకొడుకుల ప్రాణం తీసిన మొబైల్ చార్జర్
యూపీలోని సీతాపూర్‌లో మొబైల్ చార్జింగ్ అవుతున్న సమయంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన తల్లీకుమారుడు మృతిచెందారు. వారిద్దిరూ ఒకే గదిలో ఉండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఆ గది తలుపులు తెరవగానే వారికి అక్కడ అచేతనంగా పడివున్న తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే కుటుంబ సభ్యులు మృతులకు పోస్టుమార్టం చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన భవానీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల రోహిత్ జైశ్వాల్ తమ ఇంటిలోని ఒక గదిలో పడుకున్నాడు. అదే గదిలో అతని తల్లి రామస్ హెలీ కూడా పడుకుంది. రాత్రి వేళ రోహిత్ మొబైల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతనిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా విద్యుదాఘాతానికి గురయ్యింది. ఉదయం కుటుంబ సభ్యులు తల్లీకొడుకులు మృతి చెందిన విషయాన్ని గుర్తించారు. మృతులకు పోస్టుమార్టం చేయవద్దంటూ అభ్యర్ఙంచి, వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో.. -
షాకింగ్ న్యూస్: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ చేస్తే..
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే 18 శాతం చొప్పున జీఎస్టీ వర్తిస్తుందని కర్ణాటక అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విషయాన్ని ఓ విద్యుత్ పంపిణీ సంస్థ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ సంస్థ ముందుకు తీసుకెళ్లింది. ఇందు కోసం వాహనదారుల నుంచి పన్నుతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫీజును వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఎనర్జీ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అనే రెండు భాగాలు ఉంటాయి. ఎనర్జీ ఛార్జ్ అనేది వాహనదారులు వినియోగించే ఎనర్జీ యూనిట్ల సంఖ్యను సూచిస్తుంది. ఈ సందర్భంగా ఇంధన ఛార్జీలను వస్తువుల సరఫరాగా పరిగణిస్తారా లేదా సేవల సరఫరాగా పరిగణిస్తారా అనే సమస్య ప్రాథమికంగా తలెత్తింది. ఇందులో మొదటిది అయితే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌ని విద్యుత్ సరఫరా కేటగిరి కింద పరిగణించాలా వద్దా అన్నది అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ముందున్న ప్రధాన సమస్య. ఇదీ చదవండి ➤ FAME 3: ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం! ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని ఛార్జ్ చేయడం అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ అని రూలింగ్ అథారిటీ తెలిపింది. విద్యుత్ అనేది వస్తువుగా వర్గీకరించిన చరాస్తి. దాన్ని అలాగే కాకుండా బ్యాటరీల్లో రసాయన శక్తిగా మార్చి వినియోగదారులకు అందిస్తున్నారని అడ్వాన్స్ రూలింగ్ సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక వివరణను కూడా ప్రస్తావిస్తూ.. ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ అనేది విద్యుత్ విక్రయం కిందకు రాదని, దాన్ని సర్వీస్ కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా, సర్వీస్ ఛార్జీలను సర్వీస్ సప్లయిగా పరిగణించాలని, కాబట్టి 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్మానించింది. -
‘ఈవీ’ ఏటీఎం.. ఏపీలో 12 సౌర విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వాహనాల (ఈవీల) కోసం రాష్ట్రంలో అత్యాధునిక సౌర విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల యజమానులు ఈ సౌర చార్జింగ్ కేంద్రాల్లో కార్డు ద్వారా వారే డబ్బులు చెల్లించి, వారే వాహనానికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ చార్జింగ్ కేంద్రాలకు అనుమతినిచ్చింది. తొలుత అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 కేంద్రాలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఈ నగరాల్లో సౌర విద్యుత్ ప్యానళ్లతో చార్జింగ్ కియోస్‌్కలను రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఏర్పాటు చేస్తుంది. ఏటీఎం కార్డు ద్వారా డబ్బు చెల్లించి వాహనదారుడే చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) చేస్తుంది. రానున్న కాలం ‘ఈవీ’లదే దేశంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు 2030 నాటికి 30% విద్యుత్ కార్లు, 80 శాతం విద్యుత్ టూ వీలర్లు, 70 శాతం విద్యుత్ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 1 గిగా టన్ కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేసింది. దీంతోపాటు ఇంధనం దిగుమతులు తగ్గించటం ద్వారా 330 బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుంది. రానున్న ఎనిమిదేళ్లల్లో 66 శాతం వాహనదారులు విద్యుత్ వాహనాలనే వాడతారని ఈవీ మార్కెట్‌పై తాజా అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ వినూత్న చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఏడాదిలో 250 కేంద్రాలు దేశంలో 2070 నాటికి ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లాలని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్ చార్జీలు భారంగా ఉన్న దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయడానికి, స్థిరమైన రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం అంతటా చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 110 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చేందుకు నెడ్‌క్యాప్ ప్రణాళికలు తయారు చేసింది. ప్రైవేట్ భూ యజమానులతో కలిసి 4 వేల లొకేషన్లను గుర్తించింది. రాష్ట్రంలో ఏడాదిలో 250 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా పద్థతిలో లక్ష ఈ–వాహనాల పంపిణీతో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలనిస్తోంది. ఖర్చు తక్కువ విద్యుత్ వాహనాలకు బ్యాటరీ చార్జింగ్, మెయింటెనెన్స్, ఆపరేషన్ ఖర్చులు తక్కువ. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈవీలు సురక్షితమైనవి కూడా. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. వాటితో పాటు భవిష్యత్‌లో పెరగనున్న ఈవీలన్నిటి కోసం చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నాం. – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
బైపాస్ చార్జింగ్: కొత్త ఫీచర్‌తో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ( Infinix Note 30 5G) తాజాగా విడుదలైంది. 6.78 అంగుళాల 120హెడ్జ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 8GB వరకు ర్యామ్‌తో కూడిన ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ఇది. హై రిజల్యూషన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, JBL సౌండ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తోంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ, గేమింగ్ సమయంలో వేడెక్కడాన్ని తగ్గించడానికి బైపాస్ చార్జింగ్ మోడ్‌ను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇక 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ అమ్మకాలు జూన్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి. స్పెసిఫికేషన్లు ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత XOS 13 ఆపరేటింగ్ సిస్టమ్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 580 నిట్ల వరకు గరిష్ట బ్రయిట్నెస్తో పెద్ద 6.78అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, మాలి G57 MC2 GPU, 8GB వరకు ర్యామ్ హై-రిజల్యూషన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, రెండు అదనపు సెన్సార్లు ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా. JBL సౌండ్‌ని అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు. హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్ 256 జీబీ వరకు స్టోరోజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉపయోగించి విస్తరించవచ్చు. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లకు మద్దతు యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అనేక సెన్సార్లు. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీ. గేమర్లు నేరుగా మదర్‌బోర్డుకు చార్జ్ చేసే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్. 168.51x76.51x8.45mm కొలతలు, 204.7 గ్రాముల బరువు. Time to live life in the fast lane with Note 30 5G, thanks to India's first MediaTek Dimensity 6080 Processor, a smooth 120Hz Display, up to 16GB* RAM, and 256 Storage! Sale starts 22nd June, 12PM, only on Flipkart. Click here to know more: https://t.co/6DNmOKpB2z#ChangeTheGame pic.twitter.com/HVXgXOlDtB — Infinix India (@InfinixIndia) June 14, 2023 -
చార్జింగ్ చాలట్లే!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలోని చార్జింగ్‌ను ట్రాఫిక్ జామ్‌లు హరిస్తున్నాయి. దీంతో బస్సు గమ్యం చేరేందుకు అవసరమైన చార్జింగ్ లేకపోవడంతో మధ్యలో మరోసారి బ్యాటరీని చార్జ్ చేయాల్సి వస్తోంది. ఇది ఇటీవలే ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ– గరుడ బస్సులకు తలనొప్పిగా మారింది. ‘ఈ–బస్సు’.. రెండు సార్లు చార్జ్ చేయాల్సిందే.. ♦ ఆర్టీసీ ఇటీవలే పది ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రారంభించిన విషయం తెలి సిందే. తొలి విడతలో అందుబాటులోకి వచి్చ న ఈ పది బస్సులను విజయవాడ వరకు తిప్పుతున్నారు. వీటిని బీహెచ్ఈఎల్ డిపో ద్వారా నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు తిరు గుతున్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం మియాపూర్ డిపోలో బ్యాటరీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో, ఈ బస్సులకు కూడా అక్కడే చార్జి చేస్తున్నారు. పూర్తి చార్జింగ్ తర్వా త బస్సు ప్రారంభమై ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఎంజీబీఎస్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి విజయవాడ బయలు దేరుతుంది. సిటీ దాటేటప్పటికే చార్జింగ్ డౌన్ ♦ మియాపూర్–ఎంజీబీఎస్ మధ్య 30 కి.మీ. దూరం ఉంది. ఈ రూట్ అంతా విపరీతమైన ట్రాఫిక్ నేపథ్యంలో తరచూ బస్సుకు బ్రేకులు వేయాల్సి వస్తుండటంతో బ్యాటరీ శక్తి ఎక్కువగా ఇక్కడే ఖర్చవుతోంది. ఎంజీబీఎస్‌లో బయలు దేరిన తర్వాత చౌటుప్పల్ వెళ్లే వరకు ట్రాఫిక్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో కూడా మరింత ఖర్చవుతోంది. మొత్తంగా 150 కి.మీ. దూరం రావాల్సిన శక్తి ఈ రెండు ప్రాంతాల్లోనే ఖర్చవుతుండటంతో విజయవాడ వరకు వెళ్లేందుకు సరిపోవటం లేదు. విజయవాడకు చేరుకున్న తర్వాత తిరిగి చార్జ్ చేసేందుకు, అక్కడి బస్టాండుకు పది కి.మీ. దూరంలో ఉన్న చార్జింగ్ పాయింట్ వద్దకు వెళ్లాలి. వెరసి మియాపూర్ నుంచి ఆ పాయింట్ వరకు 325 కి.మీ.దూరం అవుతోంది. సాధారణంగా బ్యాటరీలో 20 శాతం చార్జింగ్ ఉండగానే మళ్లీ ఫిల్ చేయాలనేది నిబంధన. లేదంటే సాంకేతిక సమస్య తలెత్తి బస్సు ఉన్నదిఉన్నట్టు ఆగిపోతుంది. దీంతో నగరంలో ఫుల్ చార్జ్ చేసినా... ట్రాఫిక్ చిక్కుల్లో పవర్ ఖర్చవుతుండటంతో మధ్యలో మరోసారి విధిగా చార్జ్ చేయించాల్సి వస్తోంది. దీంతో సూర్యాపేటలో ఉన్న ఓ ప్రైవేటు చార్జింగ్ స్టేషన్లో రెండో సారి చార్జ్ చేయిస్తున్నారు. ఇది ప్రయాణికులకు విసుగ్గా మారింది. నాన్‌స్టాప్‌గా వెళ్తుందనుకుంటే మధ్యలో ఆగాల్సి రావటం వారికి చిరాకు తెప్పిస్తోంది. బ్రేక్ సమయంగా మార్పు.. విజయవాడ వెళ్లే బస్సులను మధ్యలో కోదాడ వద్దో, ఇతర దాబాల వద్దనో అరగంటపాటు ఆపుతుంటారు. ప్రయాణికుల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బ్రేక్ సమయాన్ని సూర్యాపేటలో ఇస్తూ, ఆ సమయంలోనే బ్యాటరీని చార్జ్ చేయిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. సూర్యాపేట బస్టాండులో ఆర్టీసీ సొంతంగా చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే మరింత వేగంగా చార్జ్ అవుతుందని పేర్కొంటున్నారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో కూడా, విజయవాడ బస్టాండుకు 10 కి.మీ. దూరంలో ఉన్న పాయింట్లో ఫుల్ చార్జ్ చేయించి.. మళ్లీ సూర్యాపేటలో రెండో సారి చార్జ్ చేయిస్తున్నారు. ఫుల్ డిమాండ్.. ఈ–గరుడ బస్సులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఏసీ బస్సులు కావటం, ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో చప్పుడు లేకపోవటంతో ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటప్పటితో పోలిస్తే అక్కడి నుంచి వచ్చేటప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల వరసగా కొన్ని రోజులపాటు 100 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వెళ్లేప్పుడు అది 70 శాతంగా ఉంటోంది. -
ఈ–స్కూటర్ కస్టమర్లకు చార్జర్ డబ్బు వాపస్
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలతో పాటు చార్జర్లను విడిగా కొనుగోలు చేసిన కస్టమర్లకు సదరు చార్జర్ల డబ్బును వాపసు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్, ఎథర్ ఎనర్జీ తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. స్వార్ధ శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ విద్యుత్ వాహనాల పరిశ్రమ గత కొన్నాళ్లుగా అసాధారణంగా వృద్ధి చెందినట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్లో ఓలా పేర్కొంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన కస్టమర్లందరికీ చార్జర్ల డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మొత్తం చెల్లించనున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఇది సుమారు రూ. 130 కోట్లు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈవీ స్కూటర్లతో కలిపే చార్జర్లను విక్రయించే అంశంపై భారీ పరిశ్రమల శాఖతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఎథర్ ఎనర్జీ తెలిపింది. చట్టబద్ధంగా ఇలా చేయాల్సిన అవసరం లేనప్పటికీ వాహనాలతో పాటే చార్జరును కూడా ఇచ్చేలా తమ నిబంధనలు మార్చుకున్నట్లు వివరించింది. అలాగే 2023 ఏప్రిల్ 12కు ముందు కొనుగోలు చేసిన వాహనాల విషయంలో చార్జర్లకు వసూలు చేసిన మొత్తాన్ని రిఫండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో టీవీఎస్ మోటార్ కంపెనీ తాము రూ. 20 కోట్లు పైచిలుకు వాపసు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
విద్యుత్ వాహనాల బీమాకు జాగ్రత్తలు
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. 2022 ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం మన రహదారులపై 13 లక్షల పైచిలుకు ఈవీలు ఉన్నాయి. మూడేళ్లుగా వీటి అమ్మకా ల వృద్ధి వార్షికంగా 130 శాతంగా ఉంటోంది. వీటిల్లో అత్యధికంగా త్రిచక్ర రవాణా వాహనాలు, తర్వాత స్థానంలో ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నా యి. అయితే మిగతా వాటి తరహాలోనే విద్యుత్ వాహనాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి.. ► ఒక్క సారి చార్జి చేస్తే వాహనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందనేది ఒక సవాలు. ► ఈవీలు విజయవంతం కావాలంటే చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాలు భారీగా అవసరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పురోగమన దశలోనే ఉన్నాయి. ► ఈవీ బ్యాటరీ ఖరీదు.. వాహనం రేటులో దాదాపు సగం దాకా ఉంటోంది. కాబట్టి, బ్యాటరీ దీర్ఘాయుష్షు, వారంటీ, రీసేల్ విలువ గురించి చాలా సందేహాలే ఉన్నాయి. ► ఓవర్ చార్జింగ్ వల్ల వాహనంలో మంటలు చెలరే గితే పరిస్థితి ఏమిటనే భయాలూ ఉన్నాయి. అగ్నిప్రమాదాలకు దారి తీస్తే థర్డ్ పార్టీకి వాటిల్లే ఆస్తి, ప్రాణ నష్టానికి లయబిలిటీపైనా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక మోటరు బీమా పాలసీ దశాబ్దాల కిందట రూపొందింది. అప్పుడు ఈవీలు, హైబ్రీడ్ వాహనాల ఉనికి లేదు. అయితే, మారే మార్కెట్ అవసరాలు, సమయానికి తగినట్లు కొత్త పథకాలను ప్రవేశపెట్టేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ నియంత్రణ సంస్థ స్వేచ్ఛనిస్తోంది. తదనుగుణంగానే బీమా సంస్థలు కూడా పైన పేర్కొన్న పలు సవాళ్లను పరిష్కరించగల యాడ్–ఆన్‌లను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల కోసం బీమా తీసుకునేటప్పుడు కొనుగోలుదారు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ► బ్యాటరీకి విడిగా కవరేజి ఉందా? ఒకవేళ చార్జింగ్ చేసేటప్పుడు వరద లేదా అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినట్లయితే బ్యాటరీ పూర్తి నష్టానికి పాలసీలో కవరేజీ ఉండాలి. ► ప్లాస్టిక్, లోహాలు, గాజు లేదా ఫైబర్ ఏవైనా భాగాలు అన్నింటికీ జీరో డిప్రిసియేషన్ కవరేజీ ఉందా అన్నది చూసుకోవాలి. ► ఈవీ వల్ల థర్డ్ పార్టీ ప్రాపర్టీ ధ్వంసమైనా, వారికి గాయాలైనా ఈవీ యజమానిపై దావా వేస్తే పరిహారంపరమైన సమస్యలు ఎదురవకుండా విడి గా లయబిలిటీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► గోడలో బిగించిన చార్జర్‌కు, చార్జింగ్ చేసే కేబుల్‌కు విడిగా కవరేజి ఉందా లేదా. ఈ భాగాలన్నీ వాహనంలో బిగించి ఉండవు కాబట్టి, వాటి గురించి నిర్దిష్టంగా తెలియపరుస్తూ కవరేజీ కల్పించడం ముఖ్యం. ► ఓఈఎం (వాహనం తయారీ సంస్థ) చేసే ప్రామాణికమైన ఫిట్టింగ్స్కు అదనంగా కారులో బిగించిన ఇన్ఫోటెయిన్మెంట్ గ్యాడ్జెట్లు, మ్యూ జిక్ సిస్టమ్‌లు, ఇతరత్రా ఏవైనా గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికీ కవరేజీ ఉందో లేదో చూసుకోవాలి. -
స్విగ్గీలో కొత్త చార్జీలు.. ప్రతి ఆర్డర్‌పైనా అదనంగా..
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తోంది. విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌కు అదనంగా రూ. 2 'ప్లాట్‌ఫామ్ ఫీజు' పేరుతో వసూలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతానికి బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఫుడ్ ఆర్డర్లపై మాత్రమే ఈ చార్జీలను స్విగ్గీ వసూలు చేస్తోంది. క్విక్-కామర్స్, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లపై ఈ చార్జీలను ఇంకా విధించడం లేదు. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! మరోవైపు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో స్విగ్గీ ఈ ఛార్జీలను ఇంకా ప్రవేశపెట్టకపోవడం గమనార్హం. గత వారంలో దశలవారీగా అమలులోకి వచ్చిన ఈ చార్జీలు ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది. రూ. 2 తక్కువగానే అనిపించినా స్విగ్గీ ప్రతిరోజు 1.5 మిలియన్లకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. అంటే భారీ మొత్తంలోనే ఆదాయం వస్తుంది. ఈ మొత్తం వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి తగినంత భారీ కార్పస్‌ను సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! డెలివరీ వ్యాపారం మందగించడమే ఈ కొత్త చార్జీలు వసూలుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక అనిశ్ఛిత పరిస్థితులకు కంపెనీ మినహాయింపు కాదు అని 380 ఉద్యోగాల తొలగింపు సందర్భంగా స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజెటీ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. కాగా మరో ప్రధాన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం ఇంకా ఎలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టలేదు. ఆదాయాల పరంగా చూస్తే జొమాటో ఆదాయం రూ. 4,100 కోట్లతో పోలిస్తే స్విగ్గీ ఆదాయం దాదాపు రూ. 5,700 కోట్లుగా ఉంది. -
యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్‌కు బీఐఎస్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్ నాణ్యత ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రకటించింది. మొబైల్స్‌కు, ధరించగలిగే ఎలక్ట్రానిక్స్ కోసం రెండు ఒకే తరహా (కామన్) ఛార్జింగ్ పోర్ట్‌లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారుల ప్రయోజనాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు పరిశ్రమ వాటాదారులతో సంప్రదింపులు జరిపిన డిపార్ట్మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ రెండు రకాల సాధారణ ఛార్జింగ్ పోర్ట్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వీటిలో మొబైల్స్, స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్ పీసీల కోసం యూఎస్బీ టైప్–సీ ఛార్జర్ ఒకటి కాగా, మరొకటి వేరబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఇతర సాధారణ ఛార్జర్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)–కాన్పూర్ స్మార్ట్ వాచెస్ వంటి ధరించగలిగే ఎలక్ట్రానిక్ పరికరాల కోసం సింగిల్ ఛార్జింగ్ పోర్ట్‌ను అధ్యయనం చేస్తోంది. ఐఐటీ కాన్పూర్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత పరిశ్రమతో ఈ విషయమై ప్రభుత్వం చర్చించనుంది. -
ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి
సాక్షి, గద్వాల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా పదేళ్ల నిహారిక 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ-వాహనాలు పేలుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు -
మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ కష్టాలకు చెక్..
-
చార్జింగ్ స్టేషన్లు: ఎంఅండ్ఎం, చార్జ్‌ప్లస్‌జోన్ జట్టు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టబోతున్న మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తమ వాహనాలకు చార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ మౌలిక సదుపాయాల సంస్థ చార్జ్+జోన్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం కింద వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల కోసం వేగవంతమైన డీసీ చార్జర్ల ఏర్పాటు, నిర్వహణ అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి. మహీంద్రా అనుబంధ సంస్థలు, గ్రూప్ సంస్థలకు చెందిన సొంత స్థలాలు, అద్దె స్థలాలు, కార్యాలయాలు, లేక ఇతరత్రా మహీంద్రా ఎంపిక చేసుకున్న స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎంఅండ్ఎం యూజర్లతో పాటు ఇతరత్రా వాహనదారులు కూడా ఉపయోగించుకునేలా ఉంటాయి. ఎంఅండ్ఎం కొత్తగా అయిదు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఈ-ఎస్యూవీ) ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2024-2026 మధ్య తొలి నాలుగు మార్కెట్లోకి రానున్నాయి. చార్జ్+జోన్ దేశవ్యాప్తంగా 1,450 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది. రోజూ సుమారు 5,000 ఈవీలకు సర్వీసులు అందిస్తోంది. ఈ-ఎస్‌యూవీల కోసం దేశవ్యాప్తంగా ఫాస్ట్ చార్జింగ్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు దేశీయంగా విద్యుత్ వాహనాల వ్యవస్థ మరింతగా వృద్ధి చెందేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని చార్జ్+జోన్ వ్యవస్థాపకుడు, సీఈవో కార్తికేయ్ హరియాణి తెలిపారు. తమ కంపెనీ కస్టమర్లందరికీ భారీ స్థాయిలో ఈవీ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) విజయ్ నాక్రా పేర్కొన్నారు. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేస్తుండగా..
కుషాయిగూడ: సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేస్తుండగా షాట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన శుక్రవారం చర్లపల్లిలో చోటు చేసుకుంది. వెంకట్‌రెడ్డినగర్ కాలనీకి చెందిన చెన్నమ్మ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో చెన్నమ్మ ఆమె భర్త బయటకు వెళ్లగా కొడుకు తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లాడు. చార్జింగ్ పెట్టిన చోట షాట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. పొగలు రావడాన్ని గమనించిన అతడు బయటకు వచ్చి చూడగా ఇంట్లో వస్తువులకు మంటలు అంటుకుంటున్నాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లోని బట్టలు, వస్తువులు, ఆహార పదార్థాలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలిసిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించి ఆదకుంటానని హామీ ఇచ్చారు. ఆమె వెంట నాగిళ్ల బాల్‌రెడ్డి, కనకరాజుగౌడ్, ప్రభుగౌడ్ తదితరులు ఉన్నారు. (చదవండి: ఓటర్లను యాదాద్రి తీసుకెళ్లి ప్రమాణాలు...టీఆర్ఎస్పై కేసు నమోదు) -
ఈవీ వాహనదారులకు శుభవార్త, ఫోన్ ఛార్జింగ్ కంటే ఫాస్ట్‌గా!
ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈవీలతో సుధీర్ఘ ప్రయాణాలు చేసే వాహనదారులకు ఛార్జింగ్ పెట్టుకునే సమయం ఎక్కువ పట్టడం, ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యల్ని అధిగమించేందుకు పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ పరిశోధనల్లో సత్ఫలితాలు నమోదవుతున్నాయని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇడాహో నేషనల్ లాబొరేటరీ (Idaho National Laboratory) సంస్థ ఛార్జింగ్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేలా కొత్త పద్దతుల్ని సృష్టించినట్లు తెలిపింది. ఈ పద్దతులతో వాహనదారులు సెల్ ఫోన్ ఛార్జింగ్ కంటే వేగంగా..కేవలం 10 నిమిషాల్లో ఈవీ వెహికల్స్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ఇడాహో సైంటిస్ట్ ఎరిక్ డుఫెక్ స్పష్టం చేశారు. ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెట్టే ఛార్జింగ్ అన్నీ వాహనాలకు ఒకేలా ఉండదు. వాహనాన్ని బట్టి మారుతుంటుంది. కొన్ని ఈవీ బ్యాటరీలకు మొత్తం ఛార్జింగ్ పెట్టాలంటే సుమారు 40 నుంచి 50 గంటల సమయం పడుతుంది. మరికొన్నింటికి 20 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పెట్టొచ్చు. ఉదాహరణకు ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో అగ్ర గామిగా ఉన్న టెస్లా సంస్థ 320 కిలోమీటర్ల ప్రయాణించే కార్లకు కేవలం 15 నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదే కొత్త టెక్నిక్ ఎలక్ట్రిక్ బ్యాటరీలను ఛార్జింగ్ పెట్టే సమయంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే దీర్ఘకాలంలో బ్యాటరీకి హాని కరం. ఒక్కోసారి ఆ బ్యాటరీలో అగ్నికి ఆహుతైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే బ్యాటరీ లైఫ్ టైమ్ అంచనా వేస్తే ఫాస్ట్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం డుఫెక్ బృందం మెషిన్ లెర్నింగ్ సాయంతో బ్యాటరీ లైఫ్ టైంను పరిశీలించింది. ఈ అల్గోరిథంలో 20,000 నుండి 30,000 డేటా పాయింట్లను అంచనా వేసింది. ఈ డేటా పాయింట్ల సాయంతో బ్యాటరీ మన్నికను గుర్తించి 10నిమిషాల్లో 90శాతం ఛార్జింగ్ పెట్టింది. ప్రస్తుతం 10నిమిషాల కంటే తక్కువ సమయంలో ఈవీలకు ఛార్జింగ్ పెట్టే పద్దతిపై తమ ప్రయోగాల్ని ముమ్మురం చేసినట్లు అమెరికాకు చెందిన ఇడాహో నేషనల్ లాబొరేటరీ తెలిపింది. -
టపా టప్!.. పేలుతున్న స్మార్ట్ ఫోన్లు
దేశంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా పెరుగుతోంది. మరీ యువత ఫోన్లు లేకుండా ఒక వారం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొన్ని కంపెనీల స్మార్ట ఫోన్లు చార్జింగ్ పెడుతున్న సమయంలోనూ, లేదా జేబులు ఉండగానో పేలుతున్నాయి. ఈ తరహా వరుస ప్రమాదాలు మొబైల్ వినియోగదారులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇటువంటి ఘటనలు పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో స్మార్ట్ ఫోన్ పేలడంతో కస్టమర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాములపాడులో బుధవారం ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌ని ఇంట్లో చార్జింగ్కు ఉంచిన సమయంలో పేలిపోయింది. వివరాల ప్రకారం.. షేక్‌ముర్తుజా ఈ ఏడాది జూలై 13న నందికొట్కూరులో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టి బయటకు రాగా.. శబ్దంతో పేలిందని ఆయన తెలిపారు. ఫోన్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని షేక్‌ముర్తుజా కోరారు. మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌లో మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్. లిడ్ యాసిడ్లతో పోల్చితే.. లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. అలాగే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని నిపుణులు చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. చదవండి: గుడ్ న్యూస్: ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో -
భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు
కుషాయిగూడ(హైదరాబాద్): చార్జింగ్ పెట్టిన రెండు ఎలక్ట్రికల్ బైకులు పేలిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జగదేవపూర్‌కు చెందిన పనగట్ల హరిబాబు కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో ఉంటున్నాడు. తన ఎలక్ట్రికల్స్ బైకులకు సోమవారం సాయంత్రం పార్కింగ్ ఏరియాలో చార్జింగ్ పెట్టాడు. పెట్టిన ఒక గంటకే ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చింది. కిందికి వచ్చి చూడగా తన రెండు బైకులకు మంటలంటకుని దగ్ధమయ్యాయి. ఇటీవల ఎలక్ట్రికల్ బైక్‌ల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వాహనదారులను గందరగోళానికి గురి చేస్తోంది. మరో వైపు ఎలక్ట్రిక్ బైక్ కంపెనీలు మాత్రం సేఫ్టీ విషయంలో మాత్రం రాజీ పడకుండా బైకులను తయారీ చేస్తున్నామని చెప్తున్నాయి. ఇలాంటి ఘటనలకు గల అసలు కారణాలను తెలుసుకుని వాటిని పునరావృతం కాకుండా చూస్తామని సంస్థలు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా -
ఈవీ చార్జింగ్ స్టేషన్లొస్తున్నాయ్..
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీ మరోమారు సిద్ధమైంది. వాహనాలకు ఇంధన ఖర్చు తక్కువ, పర్యావరణహితం కావడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో వీటిని వినియోగించేవారు పెరుగుతున్నారు. అందుకనుగుణంగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు(పీసీఎస్)లు పెంచుతున్నారు. మూడేళ్ల క్రితమే నగరవ్యాప్తంగా వంద పీసీఎస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. అనంతరం వాటిని అటకెక్కించింది.తాజాగా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)తో కలిసి 14 ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 278 ప్రాంతాల్లో ఫీజిబిలిటీ స్టడీ జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. స్టడీ నివేదికను బట్టి 230 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు. దిగువ ప్రాంతాల్లో.. ఇందిరాపార్కు, కేబీఆర్ పార్కు వద్ద 3, ట్యాంక్‌బండ్ రోడ్, బషీర్‌బాగ్, గన్‌ఫౌండ్రి, ఆబిడ్స్, నానక్‌రామ్‌గూడ, మహవీర్ హరిణ వనస్థలి, ఉప్పల్, ఒవైసీ హాస్పిటల్, తాజ్ త్రీస్టార్ హోటల్(సికింద్రాబాద్)ల వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు. అటకెక్కిన గత ఒప్పందం.. దాదాపు మూడేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్æ(ఈఈఎస్ఎల్)తో వంద స్టేషన్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ..అనంతరం దాన్ని అటకెక్కించింది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ రెడ్కోతో ఒప్పందం కుదుర్చుకోనుంది. 2030 నాటికి రోడ్ల మీదకు వచ్చే వాహనాలన్నీ ఎలక్ట్రిక్‌వే ఉండాలని కేంద్రప్రభుత్వం ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రికల్ మొబిలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం 2030 నాటికి ప్రజారవాణా బస్సులన్నీ ఎలక్ట్రిక్‌వే ఉండాలని భావిస్తోంది. అందుకనుగుణంగా రూపొందించిన పాలసీ మేరకు 2022 నాటికి 25 శాతం, 2025 వరకు 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలనేది లక్ష్యం. ఈ లక్ష్యం సాధించాలంటే ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి. వాహనాలను చార్జింగ్ చేసుకునేందుకు తగినన్ని పీసీఎస్‌లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతమున్న ప్రైవేట్ స్టేషన్లు పెరిగే వాహనాల అవసరాలకు సరిపోవు. ఈ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా స్థానిక సంస్థలపై ఉండటంతో జీహెచ్ఎంసీ అందుకు సిద్ధమైంది.ఫీజిబిలిటీ స్టడీని బట్టి ఆయా ప్రాంతాల్లో పీసీఎస్‌లు ఏర్పాటు చేస్తారు. హెచ్ఎండీఏ పరిధిలో మరో వంద ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏర్పాటు కానున్న ప్రతి చార్జింగ్ స్టేషన్ లో ఫాస్ట్ స్పీడ్ ఛార్జింగ్, స్లో స్పీడ్ ఛార్జింగ్ సదుపాయాలుంటాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ స్థలాలు ఇస్తున్నందున పీసీఎస్‌లు వినియోగంలోకి వచ్చాక యూనిట్ కు 1 రూపాయి చొప్పున ప్రతి మూడు నెలలకోసారి జీహెచ్ఎంసీకి చెల్లింపులు చేయాలనేది ప్రతిపాదన. ఆమేరకు ఒప్పందం కుదరాల్సి ఉంది. (చదవండి: నిర్వాసితులకు బేడీలా?) -
ఎలక్ట్రిక్ వాహనాలు: ఇక ఆ దిగులే అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. చార్జింగ్ పాయింట్లు, మైలేజీ, పేలుళ్లు లాంటి సంఘటనలు నమోదవుతున్నప్పటికీ, పెరుగుతున్న కాలుష్య భూతాన్ని నివారించేందుకు ఈవాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో మీరట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికారు. ఈ-వాహనాలు డ్రైవింగ్‌లో ఉండగానే చార్జింగ్ చేసుకోవచ్చు. వైర్లెస్ మొబైల్ ఛార్జర్ లాంటి టెక్నాలజీతో అచ్చం మొబైల్స్ లాగానే వీటిని చార్జ్ చేసుకోవచ్చన్నమాట. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం సాగర్ కుమార్, రోహిత్ రాజ్‌భర్ అనే ఇద్దరు స్టూడెంట్స్ వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ సిస్టంను డెవలప్ చేశారు. ఈ సిస్టంలో రోడ్డుపక్కన టవర్లు ఏర్పాటు చేసి కారులో రిసీవర్ ఏర్పాటు చేస్తామని సాగర్ తెలిపారు. కారు టవర్ పరిధిలోకి రాగానే, కారు బ్యాటరీ ఛార్జ్ అవ్వడం ప్రారంభమవుతుంది. రిసీవర్ పరిధి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దాని వేగాన్ని పెంచుతుందని వెల్లడించారు. ఇది వైర్లెస్ మొబైల్ ఛార్జర్ లాంటిదని చెప్పారు. విద్యుదయస్కాంత శక్తి వ్యవస్థ ఆధారంగా ఈ టెక్నిక్ పనిచేస్తుందని రీజనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త మహదేవ్ పాండే తెలిపారు. తద్వారా డీజిల్, పెట్రోల్ వాహనాల మాదిరిగానే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఎక్కువ దూరం ప్రయాణించడమేకాదు డ్రైవింగ్‌లో ఉండగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్యావరణాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినప్పటికీ, ఛార్జింగ్ పాయింట్లు పరిమితంగా ఉండడం సమస్యగా మారిందని సాగర్ రోహిత్ చెప్పుకొచ్చారు. వాహనాలు ఎక్కువ దూరం వెళ్లలేక పోతున్న కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనీ, అందుకే ఈ ఆలోచన చేశామ చెప్పారు. తమప్రతిపాదనకు నీతి ఆయోగ్‌కు పంపించామన్నారు. వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ సిస్టం ఆలోచన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని రోహిత్ చెప్పారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా తమ ప్రాజెక్ట్‌కు లభించిన సహాయంతో ప్రస్తుతం పని సులభంగా జరుగుతోందని రోహిత్ వెల్లడించారు. మరోవైపు తమ విద్యార్థుల ఆవిష్కరణపై ఎంఐఈటీ వైస్-ఛైర్మన్ పునీత్ అగర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలకు తమ విద్యార్థులకు అన్ని సహాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్, మారిపోతున్న ఇళ్ల రూపురేఖలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను డిజైన్ చేస్తున్నాయి. గతంలో క్లబ్‌హౌస్‌లలో బాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్ వర్క్ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌లలో కూడా షటిల్, స్క్వాష్ వంటి లగ్జరీ గేమ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్ ఏరియాలో 3 శాతం క్లబ్‌హౌస్ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ► వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైన సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్‌కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.లకు ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్‌కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్ వంటి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్ భవనాలపై అవగాహన పెరిగింది. దీంతో డిమాండ్ ఏర్పడింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్ స్పేస్‌లలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ► గతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థుల కోసం పికప్ డ్రాప్ కోసం వినియోగించుకోవచ్చు. -
‘కారు’చౌక. ఖర్చు తక్కువ.. రూ.30తో 300 కిలోమీటర్లు!
ఈ ఎలక్ట్రికల్ కారు చూస్తే చిన్నగా, పనితీరు మిన్నగా ఉంది. అందులో ప్రయాణం ‘కారు’చౌక. ఖర్చు తక్కువ, మైలేజీ ఎక్కువ. ఈ కారును ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్ రాకేశ్ తయారుచేశాడు. ఒక్కసారి చార్జ్ చేస్తే 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్ అవసరమవుతుందని, పది యూనిట్లు వినియోగమైనా రూ.30 వరకు ఖర్చు అవుతుందని రాకేశ్ వెల్లడించారు. ఒకసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చని, కారు నడుస్తుంటే కూడా చార్జింగ్ అవుతుందని వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌కు కారును తీసుకురాగా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు ఆసక్తిగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
ఐఓసీ పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి బ్యూరో: పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఈ ధరలు వాహనాల యజమానులకు కొండంత భారంగా మారాయి. ఈ తరుణంలో పెట్రోల్, డీజిల్‌తో పనిలేని ఎలక్ట్రిక్ వాహనాలు (ఈ–వాహనాలు) అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ వాహనాల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే వాహనాలకు సరిపడినన్ని చార్జింగ్ స్టేషన్లు లేక వాటి కొనుగోలుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) దృష్టి సారించింది. ఈ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనుంది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రాథమికంగా 27 ఈ– చార్జింగ్ స్టేషన్లు/పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు చెందిన 11 పెట్రోల్ బంకుల్లో 25, 30, 50 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మూడు స్టేషన్లకు విద్యుత్ (గ్రిడ్) కనెక్షన్ కూడా ఇవ్వడంతో అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన వాటికి త్వరలో కనెక్షన్ ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో.. కొత్తగా ఆర్టీసీ బస్టాండ్లలో ఈ–చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్, ఆటోనగర్, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్ జంక్షన్, జగ్గయ్యపేట, కంచికచర్ల, నూజివీడు, ఎ.కొండూరు, ఆగిరిపల్లి, అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, చందర్ల పాడు, గన్నవరం, కైకలూరును ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టేషను/డిపో/బస్టాండ్లలో వాహనాల చార్జింగ్కు అనువుగా ఉండే స్థలాలను ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నట్టు నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ జె.వి.ఎల్.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. అవి ఖరారైతే ఆయా చోట్ల చార్జింగ్ పాయింట్లను అమర్చనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే నాలుగు, మూడు చక్రాల విద్యుత్ వాహనాలకు చార్జింగ్ పెట్టుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాహనదారులు తమ వాహనానికి చార్జింగ్ అయిపోతే సమీపంలో చార్జింగ్ స్టేషన్/పాయింట్ ఎక్కడుందో తెలుసుకునే ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు. (క్లిక్: కృష్ణా యూనివర్సిటీకి 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు) -
ఈవీ బైక్ ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
Electric Bike Explodes: తమిళనాడులో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్ బండి పేలుడు ఘటనలో తండ్రీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. వెల్లూరు అల్లపురం ఏరియాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో బైక్ ఓనర్ దురైవర్మ(49)తో పాటు ఆయన కూతురు మోహన ప్రీతి(13) దుర్మరణం పాలయ్యారు. కొత్తగా బైక్ కొన్న దురై.. శుక్రవారం రాత్రి ఇంట్లోనే బైక్‌ను ఛార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలో బైక్ పేలి ఒక్కసారిగా మంటలు అంటుకుంది. మంటల్ని ఆర్పేందుకు వర్మ, ప్రీతి బాత్రూం నుంచి నీళ్లు గుమ్మరించే ప్రయత్నం చేయబోయారు. అయితే పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందారు ఈ తండ్రీకూతుళ్లు. మంటల్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు.. రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూసే లోపే.. ఆ పొగలో దురై, ప్రీతీలు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు బుగ్గి!
కంటోన్మెంట్: సికింద్రాబాద్ పరిధిలోని ఆర్టీసీ కంటోన్మెంట్ డిపోలో మంగళవారం ఓ ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. విద్యుత్ చార్జింగ్ కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే పూర్తిగా దగ్ధమైంది. కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న ఫైరింజన్ కేవలం 10 నిమిషాల్లో డిపోకు చేరుకున్నప్పటికీ ఆలోపే బస్సంతా కాలిపోయింది. జేబీఎస్ నుంచి ఎయిర్‌పోర్టు మధ్య నడిచే ఓ ఎలక్ట్రిక్ బస్సు (టీఎస్10 యూబీ 8025) మంగళవారం ఉదయం రెండు ట్రిప్పులు పూర్తిచేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు డిపోకు వచ్చింది. డ్రైవర్, కండక్టర్ దిగాక డిపో సిబ్బంది బస్సును చార్జింగ్కు పెట్టారు. కాసేపయ్యాక ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సును చుట్టుముట్టాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సమీపంలోని ఇతర బస్సులకు మంటలు అంటుకోకుండా వాటిని దూరంగా తీసుకెళ్లారు. అలాగే ప్యారడైజ్ చౌరస్తా సమీపంలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్ సిబ్బంది డిపోకు వచ్చేసరికే బస్సు మంటల్లో కాలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆర్టీసీ ఉన్నతాధికారులతోపాటు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సు మూడేళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తుండటం గమనార్హం. మూడేళ్లుగా సేవలు... నగరంలోని పికెట్, మియాపూర్ ఆర్టీసీ డిపోల్లో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. పికెట్ డిపోలో 22, మియాపూర్‌లో 20 బస్సులు నిత్యం మూడు ట్రిప్పులవారీగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులను తరలిస్తూ ఉంటాయి. పికెట్ డిపో నుంచి మూడు వేర్వేరు మార్గాల్లో రోజుకు 88 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఫుల్ చార్జింగ్ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణించే ఈ బస్సులను షిప్టులవారీగా నడుపుతూ విరామ సమయాల్లో డిపోలోని ప్రత్యేక చార్జింగ్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేస్తుంటారు. -
ఈ–సైకిల్’.. లోకల్ మేడ్
E Bicycle Homemade: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ అబ్దుల్ జలీల్ ఈ–సైకిల్ తయారు చేశారు. కేవలం రూ.6,200 ఖర్చుతో పాత సైకిల్‌ను ఈ–సైకిల్‌గా విజయవంతంగా మార్చారు. 20 ఏళ్లుగా బైక్ మెకానిక్ అనుభవం ఉన్న జలీల్ తన ఆలోచనతో పంటలపై రసాయన మందు పిచికారీ చేసే యంత్రంలో ఉపయోగించే 8.12 వోల్టుల రెండు బ్యాటరీలు, చైనా మోడల్ కిట్ (ఎక్స్‌లేటర్, మోటార్) అమర్చి ఈ సైకిల్‌ను తయారు చేశారు. (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) ఇది గంటన్నర చార్జింగ్‌తో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని జలీల్ తెలిపారు. ముందుగా ఈ ప్రయోగం పాత సైకిల్‌తో చేసినట్లు తెలిపారు. రూ.21 వేలతో నూతన సైకిల్‌తోపాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్‌ను త్వరలో తయారు చేస్తానని చెప్పారు. మధ్య వయసున్న పేద, మధ్యతరగతి వారు ఈ సైకిల్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) -
రూ.50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అందుబాటులో ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్ల రెంటల్ స్టార్టప్ సంస్థ బౌన్స్ కొత్తగా ఈ–స్కూటర్ల తయారీ, బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. వచ్చే 12 నెలల్లో ఇందుకు సంబంధించి 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 742 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో వివేకానంద హలికెరె ఈ విషయాలు తెలిపారు. రెండు వేరియంట్స్ ఈ నెలాఖరు నాటికి తమ తొలి స్కూటర్‌ను రెండు వేరియంట్స్‌లో ఆవిష్కరిస్తామని, ఆ తర్వాత ప్రీ–బుకింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి డెలివరీ మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రీ–బుకింగ్‌లో సుమారు ఒక లక్ష పైగా వాహనాలకు ఆర్డర్లు రావచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. బ్యాటరీతో కలిపి వాహనం ధర రూ. 70,000 లోపు, బ్యాటరీ లేకుండా సుమారు రూ. 50,000 లోపు రేటు నిర్ణయించే అవకాశం ఉందని వివేకానంద చెప్పారు. బ్యాటరీ లేకుండా బ్యాటరీతో పాటు తీసుకుంటే పోర్టల్ చార్జర్ ద్వారా ఇంటి వద్దే చార్జింగ్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. అదే బ్యాటరీ లేని వేరియంట్ తీసుకుంటే.. బ్యాటరీస్ యాజ్ ఎ సర్వీస్ విధానంలో తాము నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీ మార్పిడి చేసుకోవచ్చని వివేకానంద చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, పుణె తదితర ఆరు నగరాల్లో బ్యాటరీ మార్పి స్టేషన్లు విస్తరిస్తామన్నారు. రాజస్థాన్‌లో ప్లాంటు తొలి దశలో రాజస్థాన్‌లోని భివాడీలో ఉన్న తమ ప్లాంటులో వాహనాలు ఉత్పత్తి చేయనున్నామని, తదుపరి రెండో లొకేషన్ కోసం అన్వేషిస్తున్నామని వివేకానంద తెలిపారు. భివాడీ ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.8 లక్షల స్కూటర్లుగా ఉంటుందని, దీని ద్వారా వచ్చే 3–4 నెలల్లో సుమారు 1,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించగలవన్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 100 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది వ్యవధిలో ఈ ప్లాంటుపై సుమారు 25 మిలియన్ డాలర్లు, బ్యాటరీ మార్పిడి స్టేషన్లపై 50–75 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని వివేకానంద వివరించారు. చదవండి:టెస్లా బ్యాటరీతో.. ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పుడు ఇండియాలో -
15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్!
విద్యుత్తు వాహనాలతో లాభాలు బోలెడు! ప్రయాణం ఖర్చు తక్కువ.. కాలుష్యం ఉండదు.. అయినా సరే.. రోడ్లపై ‘ఈవీ’లు ఎక్కువగా కనిపించవు. ఎందుకు? ఎక్కువ దూరం వెళ్లలేకపోవడం ఒక కారణమైతే.. బ్యాటరీ రీచార్జ్‌కు గంటల సమయం పట్టడం ఇంకొకటి. మొదటి సమస్య మాటెలా ఉన్నా.. రెండో దాన్ని బెంగళూరు స్టార్టప్ ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ పరిష్కరించింది. మరికొన్ని నెలల్లోనే ఈ కంపెనీ అభివృద్ధి చేసిన బ్యాటరీ ప్యాక్, స్మార్ట్ చార్జర్లు దశల వారీగా దేశం మొత్తమ్మీద ఏర్పాటు కానున్నాయి! 15 నిమిషాల్లోనే బ్యాటరీని నింపేస్తామంటోంది ఆ కంపెనీ! అదెలాగో చూసేయండి మరి! సాక్షి, హైదరాబాద్: 2030 నాటికి దేశంలో అమ్ముడుపోయే కొత్త వాహనాల్లో 30 శాతం విద్యుత్తుతో నడిచేవి ఉండేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే చాలా కంపెనీలు విద్యుత్తు వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే వీటన్నింటితో ఉన్న ప్రధాన సమస్య చార్జింగ్ సమయం. ఉదాహరణకు ఓ ప్రముఖ కంపెనీ ఈవీలో 30.2 కిలోవాట్ల బ్యాటరీలు ఉన్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని ఆ కంపెనీ చెబుతోంది. స్పీడ్ చార్జింగ్ ద్వారా 80 శాతం బ్యాటరీ నింపేందుకు గంట సమయం.. ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటే పూర్తిగా నిండేందుకు పది గంటల వరకు సమయం పడుతుందని అంచనా. అంటే ఈ రకమైన విద్యుత్ వాహనాలు తక్కువ దూరం మాత్రమే ప్రయాణించేందుకు పనికొస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి దూరాభారం వెళ్లాలంటే అసాధ్యమే. సాధారణంగా విద్యుత్తు వాహనాల బ్యాటరీలు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 4 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఒక్కో బ్యాటరీని వెయ్యి నుంచి 2 వేల సార్లు చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బ్యాటరీలు మార్చుకోవాలి. వేగంగా చార్జ్ చేయాలంటే లిథియం టైటనేట్ ఆక్సైడ్ (ఎల్‌టీవో) లేదా సూపర్ కెపాసిటర్లను వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరీదైన వ్యవహారాలు. పైగా చార్జింగ్ వేగం ఎక్కువైతే.. బ్యాటరీల సామర్థ్యం కూడా అంతే వేగంగా తగ్గిపోతుంది. కాఫీ తాగొచ్చేలోపు.. ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ అభివృద్ధి చేసిన బ్యాటరీతో ఈవీని తయారు చేశారని అనుకుందాం. ‘ఈ–పంప్’తో ఇంటి దగ్గర 15 నిమిషాల్లో చార్జ్ చేసుకుంటే.. 312 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్లో బ్యాటరీని చార్జ్ చేసేందుకు ఉంచి.. ఓ కాఫీ తాగొస్తే సరి.. మళ్లీ 312 కి.మీలు వెళ్లేందుకు కారు సిద్ధంగా ఉంటుంది. ఈ–ప్యాక్‌ను ఏకంగా 3 వేల సార్లు చార్జింగ్, డిస్ చార్జింగ్ చేసినా దాని సామర్థ్యంలో వచ్చే నష్టం తక్కువగానే ఉంటుందని అరుణ్ వినాయక్ తెలిపారు. అనుమతులు పొందిన తర్వాత ఈ ఏడాది చివరికల్లా బెంగళూరు, ఢిల్లీలో వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కాగా, ఈ–ప్యాక్, ఈ–పంప్‌లను నడిపించేందుకు ప్రత్యేకమైన బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా వీరు సిద్ధం చేశారు. బ్యాటరీ ప్యాక్‌లోని ఒక్కో సెల్లో విద్యుత్తు మోతాదు ఎంత ఉందన్నది గమనించి అందుకు తగ్గట్టుగా ఈ–పంప్ ద్వారా జరిగే విద్యుత్తు ప్రవాహాన్ని ఈ మేనేజ్మెంట్ వ్యవస్థ నియంత్రిస్తుంది. ఎక్స్‌పొనెంట్ ప్రత్యేకతలు.. అరుణ్ వినాయక్, సంజయ్ బైలా కలసి బెంగళూరు కేంద్రంగా ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. విద్యుత్తు వాహనాల బ్యాటరీలను 15 నిమిషాల్లోనే చార్జ్ చేసేందుకు ప్రత్యేకమైన చార్జర్ ‘ఈ–పంప్’ను, అవసరానికి తగ్గట్టు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయేందుకు అవకాశం కల్పించే బ్యాటరీ ప్యాకేజీ ‘ఈ–ప్యాక్’ను ఈ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ రెండింటినీ కలిపి వాడితే 15 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్‌గా చార్జ్ చేయడం సాధ్యమవుతుందని కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అరుణ్ వినాయక్ ‘సాక్షి’తో చెప్పారు. బ్యాటరీ పరిస్థితిని బట్టి చార్జర్ విద్యుత్తు ప్రసారాన్ని నియంత్రిస్తూ ఉంటుందని, ఫలితంగా బ్యాటరీకి జరిగే నష్టాలను నివారిస్తూనే తక్కువ సమయంలో ఎక్కువ విద్యుత్‌ను నింపేందుకు అవకాశం ఏర్పడిందని వివరించారు. -
'అథర్' ఎలక్ట్రిక్ స్కూటర్ బంపర్ ఆఫర్.. ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్ ఫ్రీ
ఎలక్ట్రిక్ వాహనదారులకు 'అథర్ ఎనర్జీ' బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ వాహనదారులకు తగినంతగా ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారి సమస్యకు చెక్ పెట్టేలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచితగా ఛార్జింగ్ సర్వీస్‌ను పొడిగిస్తున్నట్లు అథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ను 500పెచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బెంగళూరు కేంద్రంగా అథర్ ఎనర్జీ 450 ఎక్స్, 450 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రికల్ స్కూటర్ల (ఈవీ) అమ్మకాల్ని ముమ్మరం చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలపై ఇస్తున్న సబ్సీడీ ఆధారంగా వెహికల్ ధరల్ని తగ్గిస్తుంది. పనిలో పనిగా అథర్ గ్రిడ్ పేరుతో అందిస్తున్న ఉచిత ఛార్జింగ్ సర్వీస్‌ను ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తరుణ మెహతా వెల్లడించారు.ఈ గ్రిడ్ లోకేషన్లలో అథర్ సంస్థతో పాటు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అథర్ ప్రకటించింది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లు ఎలక్ట్రిక్ వాహనదారులు ఛార్జింగ్ పాయింట్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాహనదారుల అవసరాన్ని బట్టి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అథర్ సీఈఓ తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న 24 ప్రధాన నగరాల్లో 200 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పినట్లు, 2022 మార్చి నాటికి ఆ సంఖ్యను 500 పెంచనున్నారు. ప్రతి నెల 45 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నట్లు అథర్ ఎనర్జీ సీఈఓ తరుణ మెహతా అన్నారు. చదవండి: కొత్త చట్టం, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి.. -
ప్రపంచంలో ఎతైన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా?
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. అయితే, ఈవీ కొనుగోలుదారులను ప్రధానంగ వేధించే ప్రశ్న ఏదైనా ఉంది అంటే? అది మౌలిక సదుపాయాల కల్పన అని చెప్పుకోవాలి. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ కంపెనీలు, రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మౌలిక సదుపాయాల సమస్యలను తగ్గించడానికి లడఖ్ పరిపాలన కేంద్ర పాలిత ప్రాంతంలోని స్పితి జిల్లాలో ఉన్న కాజాలో ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కనీసం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. కాజా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) మహేంద్ర ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుత ప్రపంచంలోనే ఎతైన ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ కాజాలో ఉంది. ఇది ఇక్కడ మొదటి స్టేషన్. ఈ స్టేషన్ కు మంచి స్పందన లభిస్తే, మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేస్తాము. ఇది వాహన కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి కూడా సహాయపడుతుంది" అని అన్నారు. ఈ రోజు ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ వాహనంపై మనాలి నుంచి కాజాకు వచ్చారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల ఈ రోజుల్లో వాతావరణం అకస్మాత్తుగా మారుతోంది. వాహనాల నుంచి వచ్చే వాయువుల ఉద్గారం ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి అని ఆయన అన్నారు.(చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు) -
కిచెన్‌లో ఈవీ స్కూటర్! కారణమేంటీ?
ఎవరింట్లో అయినా కిచెన్ అంటే వంట పాత్రలు, గ్యాస్‌స్టవ్, మిక్సీ, మైక్రో ఓవెన్లు, పొపుల పెట్టె లాంటి వస్తువులు ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాస్కర్ ఇంట్లో రాత్రయితే చాలు స్కూటర్ వచ్చి చేరుతుంది. వంటింట్లో స్కూటర్‌తో పనేంటి ? ప్రతీ రోజు రాత్రి అదక్కడికి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రిక్ వెహికల్ హాబ్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బెంగళూరు నివాసి భాస్కర్. పెరుగుతున్న పెట్రోలు ధరల భారం మోయలేక ఇటీవలే ముచ్చపడి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే పెట్రోలు బాధలు తప్పినా ఇరుగుపొరుగుకు శత్రువయ్యాడు. వంటిల్లులోకి స్కూటర్ తేవడంతో ఆఖరికి సొంతింట్లో కూడా మద్దతు సంపాదించలేని స్థితికి చేరుకున్నాడు. ఇలాంటి ఒక్క భాస్కర్‌కే కాదు నగరాల్లో నివాసం ఉంటూ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన చాలా మంది పరిస్థితి భాస్కర్లాగే మారింది. ఎక్కడ ఛార్జ్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్న వారిలో ఎక్కువ మంది అపార్ట్మెంట్లలోనే నివాసం ఉంటున్నారు. మన దగ్గరున్న నూటికి 99 శాతం అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లు లేవు. దీంతో వాహనం కొనుగోలు చేసిన వారు దాన్ని ఛార్జింగ్ పెట్టుకునేందుకు నానా ఆగచాట్లు పడుతున్నారు. - అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అన్ని కుటుంబాలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఇంకా మారలేదు. - ఎలక్ట్రిక్ వెహికల్‌కి మారిన వారు అపార్ట్మెంట్లో ఛార్జింగ్ పాయింట్ పెట్టుకుంటామంటే మిగిలిన వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. - ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తే దానికి వచ్చే కరెంటు బిల్లు ఎవరు భరించాలి ? ఆ ఛార్జింగ్ పాయింట్‌ని సురక్షితంగా ఎవరు మెయింటైన్ చేయాలనేది సమస్యగా మారింది. - ఛార్జింగ్ పాయింట్లు పేలిపోతాయనే అపోహలు ఇంకా జనాల్లో ఉన్నాయి. దీంతో ఛార్జింగ్పాయింట్ ఏర్పాటుకు ససేమిరా అంటున్నారు. ఏర్పాటు కూడా కష్టమే ఇక అపార్ట్మెంటులో ఉన్న వాళ్లందరినీ ఒప్పించి ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలంటే విద్యుత్ శాఖ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. - ఛార్జింగ్ పాయింట్‌కి ప్రత్యేకంగా మీటరు ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం విద్యుత్ డిస్కంలకు దరఖాస్తు చేయాలి. - ఇటీవల బెంగళూరుకి చెందిన నరేశ్ ఇలా కొత్తగా పాయింట్ ఏర్పాటు చేసుకుంటే ఈవీ ఛార్జింగ్ ఎక్వీప్మెంట్కి రూ. 2000ల ఖర్చు వస్తే విద్యుత్ శాఖ వారు వైరు లాగేందుకే రూ. 11,000 వసూలు చేశారు. - ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ సంస్థలకు ఓ విధానమంటూ లేదు. పై నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి గైడ్‌లైన్స్ లేవు. దీంతో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల విషయంలో విద్యుత్‌శాఖ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. తప్పని తిప్పలు కాలుష్యాన్ని తగ్గించాలంటూ ఓ వైపు ప్రభుత్వ విధానాలు, మరోవైపు పెరిగిపోతున్న పెట్రోలు ధరల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ పెరిగిపోతుంది. అయితే ఈవీకి మారాలంటూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, అందుకు తగ్గ పరిస్థితులు సృష్టించడంలో విఫలం అవుతోంది. దీంతో అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు ఛార్జింగ్ పాయింట్ల కోసం తోటి వారితో పోరాటం చేయాల్సి వస్తోంది. లేదంటే ఇంటి వంట గదిలోకి తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. మా సమస్య పరిష్కరించండి అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాల్లో అర్జీలు నమోదు అవుతున్నాయి. ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు అడ్డుపడుతున్న అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేన్స్ అభ్యంతరాలను కొట్టేయాలంటూ న్యాయస్థానాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూరు సివిల్ కోర్టులో ఇప్పటికే రెండు వేల మంది సంతకాలతో కూడిన పిటిషన్ విచారణలో ఉంది. సమగ్ర విధానమేదీ? ఈవీ తయారీ, అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధ వాటి మెయింటెన్స్ విధానాలపై కూడా చూపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అపార్ట్మెంట్లలో ఛార్జింగ్ పాయింట్లను చేర్చడం, కొత్త కనెక్షన్ విషయంలో విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొత్తగా వచ్చే ఇళ్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు, మెయింటనెన్స్‌ను తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Yamaha: ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు.. -
బ్లూస్మార్ట్‌తో జియో–బీపీ జట్టు
న్యూఢిల్లీ: పెద్ద యెత్తున దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్ వాహన సేవల సంస్థ బ్లూస్మార్ట్‌తో జియో–బీపీ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం బ్లూస్మార్ట్ కార్యకలాపాలు ఉన్న నగరాల్లో ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రణాళికలు, అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ కలిసి సంయుక్తంగా జియో–బీపీని జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దేశ రాజధాని ప్రాంతంలో (ఎన్సీఆర్) వీటిని ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పే ఈ స్టేషన్ల కనీస చార్జింగ్ సామర్థ్యం 30 వాహనాలుగా ఉంటుందని వివరించింది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రవాణా సేవలు అందించే బ్లూస్మార్ట్ తమ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో కూడా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఈవీ చార్జింగ్ నెట్వర్క్ విషయంలో బీపీకి గల అనుభవం .. దేశీయంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో జియోకి తోడ్పడగలదని జియో–బీపీ సీఈవో హరీష్ సి మెహతా తెలిపారు. దేశీయంగా ప్రపంచస్థాయి ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అందించడంలో తమ సామర్థ్యాలకు జియో–బీపీతో ఒప్పందమే నిదర్శనమని బ్లూస్మార్ట్ సహ వ్యవస్థాపకుడు,సీఈవో అన్మోల్ జగ్గీ తెలిపారు. -
ఈవీ ఛార్జింగ్ సమస్యలను సులభంగా చెక్ పెట్టొచ్చు: ఓలా సీఈఓ
దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకి ధరలు పెరిగి పోతుండటంతో సామాన్య ప్రజానీకం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ వన్, అథర్ ఎనర్జీ వంటి ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమ వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పోటీ వాతావరణం విపరీతంగా ఏర్పడింది. అయితే, చాలా మంది వినియోగదారులు ఈవీలకు సంబంధించి ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఛార్జింగ్ అనేది ప్రధాన సమస్యగా మారింది. వాహనాలను ఛార్జ్ చేయడానికి భారతదేశంలో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యగా పేర్కొనవచ్చు. పెట్రోల్, డీజిల్ వంటి ఇందనాలతో నడిచే వాహనాల మాదిరిగా కాకుండా.. ఈవీల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు చాలా తక్కువ దశలో ఉన్నాయి. అయితే, ఈ నేపథ్యంలో ఈవీల ఛార్జింగ్ సమస్యలకు పేటిఎమ్ వ్యవస్థాపకుడు చేసిన ట్వీట్ కు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్పందిస్తూ "సులభమైన పరిష్కారం" ఉంది అని ట్వీట్ చేశారు. ఈవీల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల గురుంచి పేటిఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇలా ఒక ట్వీట్ చేశారు.."ఈవీ అనేది లగ్జరీ కాదు, ఈ జీవరాశులతో గల గ్రహాన్ని కాపాడటం మనమందరం బాధ్యతగా స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను. సిటీలో స్వచ్చమైన పీల్చుకోవడానికి నివాస, కార్యాలయ స్థలాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే విధానాన్ని ప్రోత్సహించే విధంగా నిబందనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని" విజయ్ శేఖర్ శర్మకోరారు.(చదవండి: ఉద్యోగం లేకున్నా క్రెడిట్ కార్డు పొందండి ఇలా..?) Every 2W, 4W spends 20 hours of its daily life parked somewhere, at home or office! Easiest solution to charging infra is low cost slow charging outlets in parking, be in independent homes, RWAs/apartments etc. Much cheaper than lots of large scale public fast charging. https://t.co/QI2u9tuT5y — Bhavish Aggarwal (@bhash) September 8, 2021 పేటిఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చేసిన ట్వీట్ కు ప్రతి స్పందనగా భవిష్ అగర్వాల్ ఇలా సమాధానం ఇచ్చారు.."ప్రతి 2డబ్ల్యు, 4డబ్ల్యు గల వాహనాలను చార్జ్ చేయడానికి రోజువారీ జీవితంలో 20 గంటలు ఇంటి వద్ద లేదా ఆఫీసులో పార్క్ చేస్తున్నాము. ఈ ఛార్జింగ్ సమస్యలకు సులభమైన పరిష్కారం తక్కువ ఖర్చుతో స్లో ఛార్జింగ్ అవుట్ లెట్లను ఇంటి వద్ద, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద, అపార్ట్ మెంట్ల మొదలైన ప్రదేశాలలో ఏర్పాటు చేయవచ్చు. పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కంటే ఇది చాలా చౌక" అని ఆయన శర్మ ట్వీట్ కు బదులు ఇచ్చారు. -
పెట్రోల్ బంకుల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: డీజిల్, పెట్రోల్ వాహనాలతో రోజురోజుకూ కాలుష్యం అధికమవుతోంది. మరోవైపు రోజు రోజుకూ పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రో వినియోగంతోపాటు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈ–వాహనాలు) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. వీటి కొనుగోలుపై రాయితీలను ఇస్తోంది. దీంతో క్రమంగా ఈ–వాహనాల సంఖ్య కూడా ఊపందుకుంటోంది. ఇప్పటికే పురపాలక, విద్యుత్, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ కార్లను ప్రవేశపెట్టారు. విజయవాడ సహా మరికొన్ని పట్టణాలు, నగరాల్లో ఈ–ఆటోలు కూడా నడుస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల వాతావరణానికి నష్టం కలగకపోయినా, వాటిని చార్జింగ్ చేయడమే అసలు సమస్యగా మారింది. ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలకు ఇళ్లలోనే 5 యాంప్స్ సామర్థ్యం ఉన్న పిన్ ద్వారా చార్జింగ్కు వీలుంటుంది. విద్యుత్ కార్లకు అయితే 15 యాంప్స్ పిన్లు అవసరం. ఈ నేపథ్యంలో ఈ – కార్లకు ఇంటి వద్ద చార్జింగ్ పెట్టడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఈ–కార్ల చార్జింగ్ కోసం రాష్ట్రంలో ప్రాథమికంగా కొన్ని చార్జింగ్ స్టేషన్లను పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత చమురు సంస్థల యాజమాన్యాలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. విజయవాడ నగరంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, సెంట్రల్ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో వీటిని అందుబాటులో ఉంచాలని యోచించారు. తాజాగా పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికొచ్చారు. తొలుత విజయవాడ పరిధిలోనూ, అనంతరం జాతీయ రహదారికి ఆనుకుని, కొన్నాళ్ల తర్వాత మండల కేంద్రాల్లోని బంకుల్లోనూ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. పెరగనున్న మైలేజీ.. గతంలో వచ్చిన ఈ–కార్లకు ఫుల్ చార్జింగ్ కోసం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టేది. పైగా ఆ చార్జింగ్‌తో వాహనం 100 నుంచి 120 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించేది. మారిన పరిస్థితుల్లో తక్కువ సమయంలో చార్జింగయ్యి, ఎక్కువ దూరం ప్రయాణించే సాంకేతికత ఈ–కార్లలో అందుబాటులోకి వచ్చింది. ఇలా ఇప్పుడు వచ్చే ఈ–కార్లకు కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో చార్జింగ్ అవుతుంది. ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జింగ్ అయిన కారు నిరాటంకంగా 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో ఇలాంటి ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లనే ఏర్పాటవుతాయని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ జె.వి.ఎల్.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. అందువల్ల వీటితో ఇకపై ఈ–వాహనదార్లు చార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం రాదని తెలిపారు. ఈ–బైక్‌ల కోసం.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది కోసం విద్యుత్ ద్విచక్ర వాహనాల (ఈ–బైక్‌ల)ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా రాష్ట్రంలో తొలి దశలో లక్ష వరకూ ఈ–బైక్‌లను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా జిల్లాలో అధికారుల అంచనాలకు మించి ఈ–బైక్‌ల కోసం 15 వేల మంది వరకు ఆసక్తి చూపారు. వారిలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తపాలా శాఖ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఈ–బైక్‌ల పంపిణీకి దాదాపు పది కంపెనీలు ముందుకొచ్చాయి. చదవండి: ఘాట్ వద్ద.. చెమర్చిన కళ్లతో -
ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ సదుపాయాలపై నీతి ఆయోగ్ సలహాలు!
న్యూఢిల్లీ: విద్యుత్‌తో నడిచే వాహనాలకు చార్జింగ్ సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి సహాయకారిగా ఉండే ఒక హ్యాండ్‌బుక్‌ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. విధానాల రూపకల్పన విషయంలో రాష్ట్రాలు, స్థానిక పాలక మండళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నీతి ఆయోగ్ తెలిపింది. ప్రణాళికల రూపకల్పన, ఈవీ చార్జింగ్ సుదుపాయాల ఏర్పాటు విషయంలో సమగ్ర విధానాన్ని అనుసరించేందుకు కావాల్సిన సమాచారం ఇందులో ఉన్నట్టు తెలిపింది. వివిధ సంస్థలు, శాఖలతో కలిసి నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ హ్యాండ్‌బుక్‌ను రూపొందించాయి. -
ఇరవై పైసలకే కిలోమీటర్.. ఈ బండి చాలా మేలండి
విజయనగరం: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు భారంగా మారాయి. బండి బయటకు తీయాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఆశా కిరణంలా కనిపిస్తున్నాయి. వాటి నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడంతో పాటు కాలుష్య నియంత్రణ సాధ్యమతోంది. వాటి వినియోగాన్ని పెంచితే ఖర్చు తగ్గడంతో పాటు భవిష్యత్తు తరాలకు మేలు చేకూరుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతుండగా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు నెడ్‌క్యాప్ ద్వారా సులభ వాయిదాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు ఇప్పించే చర్యలు ప్రారంభించాయి. ఇరవై పైసలకే కిలోమీటరు నగరంలో ఇటీవల వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. కోవిడ్ తర్వాత చాలా మంది ప్రజారవాణా కంటే సొంత వాహనాలపై వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. సులభమైన వాయిదా పద్ధతులు ఇందుకు దోహదపడుతున్నాయి. ఫలితంగా రోడ్లు వాహనాలతో నిండిపోతున్నాయి. రద్దీ సమయాల్లో కొన్ని ముఖ్య కూడళ్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుండగా..ఇవన్నీ పెట్రోల్, డీజిల్‌తో నడిచేవి కావడంతో కాలుష్యం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ బైక్‌ల వినియోగం పెరిగితే.. కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం విజయనగరంలో పెట్రోల్ ధర లీటరు రూ.106గా ఉంది. ఈ లెక్కన పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనానికి కి.మీ.కు రూ.2.50 ఖర్చవుతుంది. అదే విద్యుత్తు బైక్‌కు కేవలం 20 పైసలు మాత్రమే. కేవలం 4 యాంప్ సాకెట్ ఉంటే ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ తరహా బండ్లకు చార్జింగ్ స్టేషన్లూ రానున్నాయి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వే వెంబడి అవి ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వాటిని అందించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో అందరికీ సులభ వాయిదాల్లో అందించనున్నారు. ఈ ద్విచక్ర వాహనాల వేగం 45 నుంచి 55 కి.మీ. ఉంటుంది. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 80 నుంచి 100 కి.మీ. నడుస్తుంది. ఫుల్ చార్జింగ్కు మూడు యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుంది. వాహన మోడల్, ధరను బట్టి నెలకు రూ.2వేల నుంచి రూ.2,500 చొప్పున 60 నెలలు ఈఎంఐ చెల్లించే వెసులుబాటు ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు బ్యాటరీ వాహనాల కొనుగోలుపై యువత, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ తర్వాత కొనుగోళ్లు పెరిగాయి. సెంట్రల్ మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం 25కి.మీ కంటే తక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సు, రోడ్ ట్యాక్స్ అవసరం లేదు. కొనుగోలు చేసిన బండిని వెంటనే వినియోగించవచ్చు. ప్రస్తుతం లిథియం బ్యాటరీలు వస్తున్నాయి. అవి ఎక్కువ కాలం మన్నుతాయి. 5గంటలు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. – పి.శ్రీనివాసరావు, మెకానిక్, విజయనగరం -
ఐఫోన్ ఫీచర్లతో తొలి ఆండ్రాయిడ్ ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీదారు రియల్మీ మరో సంచలనానికి తెర తీయనుంది. ఆపిల్ ఐఫోన్-12 ఫీచర్లు కల్గిన ఫోన్లను రియల్ మీ ఫ్లాష్ పేరిట టీజ్ చేసింది. మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా రియల్మీ ఫ్లాష్ అవతరిస్తుందని కంపెనీ ఇండియా సీఈఓ మాధవ్ శ్వేత్ పేర్కొన్నారు. రియల్మీ నుంచి వచ్చే కొత్త ఫోన్‌ను కంపెనీ సీఈఓ మాధవ్ శ్వేత్ ట్విటర్లో టీజ్ చేశాడు. బీబీకే బ్రాండ్ ఉత్పత్తుల్లో రియల్ మీ ఫ్లాష్ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో పవర్ఫుల్ ఫోన్‌గా నిలుస్తోందని పుకార్లు వస్తున్నాయి. త్వరలో రిలీజ్ కాబోయే రియల్మీ ఫ్లాష్ స్నాప్‌డ్రాగన్ 888ను అమర్చిన్నట్లు తెలుస్తోంది. రియల్మీ ఫ్లాష్ మొబైల్‌ను సపోర్ట్ చేసేందుకు వీలుగా రియల్ మాగ్‌డార్ట్ వైర్లెస్ ఛార్జర్‌ను కూగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ ఐఫోన్లకు మాగ్‌సేఫ్ పనిచేసినట్లుగానే ఈ రియల్ మీ మాగ్‌డార్ట్ పనిచేయనుంది. మాగ్‌డార్ట్ ఛార్జర్ కనీసం 15W ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా రియల్ మీ ఫ్లాష్ మార్కెట్ రిలీజ్ డేట్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రియల్ మీ ఫ్లాష్ ఫీచర్లు క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888 12 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజీ 256 జీబీ కర్వ్డ్ స్క్రీన్ కార్నర్ పంచ్ హోల్ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా Meet realme Flash, World's 1st Android Phone with Magnetic Wireless Charging⚡ RT & reply with #realmeFlash if you are ready to experience its magnificent attraction. #realmeTechCharging #DareToLeap pic.twitter.com/6rZhk42Hgg — Madhav Sheth (@MadhavSheth1) July 27, 2021 -
మీ చేతివేళ్లే ఫోన్ చార్జర్! చెమట నుంచి కరెంట్
స్మార్ట్‌ఫోన్ లేనిదే కాలం గడవని పరిస్థితి. రోజూ ఒకట్రెండు సార్లు చార్జింగ్ పెట్టాలి. ఎక్కడికైనా వెళ్తే చార్జర్ కూడా వెంట తీసుకెళ్లాలి, లేకుంటే వెళ్లిన చోట చార్జర్ కోసం వెతుకులాట తప్పదు. ఇక ముందు అలాంటి తిప్పలు తప్పనున్నాయి. విడిగా చార్జర్ అవసరమేదీ లేకుండా.. మీ చేతి వేళ్లే చార్జర్‌గా మారిపోనున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు అలాంటి ఓ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా? చిన్న ప్లాస్టర్‌లా వేసుకుంటే చాలు.. ఎప్పుడైనా చిన్నపాటి గాయమైతే వేసుకునే ప్లాస్టర్ తరహాలోనే.. ఈ సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పరిమాణం ఒక చదరపు సెంటీమీటర్ మాత్రమే. దీన్ని అమర్చిన స్ట్రిప్‌ను చేతివేలి కొసలకు చుట్టేసి పెడితే చాలు.. ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కూర్చుని ఉన్నా, పడుకున్నా, ఇంకేదైనా పనిలో ఉన్నా సరే.. ఆటోమేటిగ్గా అదే చార్జ్ అవుతూ ఉంటుంది. చెమట నుంచి కరెంటు ఈ పరికరంలో కార్బన్ ఫోమ్‌తో తయారైన ఎలక్ట్రోడ్లు, కొన్నిరకాల ఎంజైమ్‌లు ఉంటాయి. అవి చేతి వేళ్ల వద్ద ఏర్పడే చెమటను గ్రహించినప్పుడు.. రసాయనిక చర్యలు జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంతేగాకుండా ఇందులోని ఎలక్ట్రోడ్ల దిగువన ‘పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ (ఒత్తిడికి లోనైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే పదార్థాలు)’ను అమర్చారు. దీనివల్ల మనం ఏదైనా వస్తువును పట్టుకోవడం, కీబోర్డుపై టైపింగ్ చేయడం, కారు, బైక్ నడపడం వంటివి చేసినప్పుడు వేళ్లకు ఉన్న స్ట్రిప్‌లపై ఒత్తిడిపడి.. విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పరికరంలోని కెపాసిటర్‌లో ఆ విద్యుత్ నిల్వఅవుతుంది. టెస్టులు.. పరికరాలకు.. ప్రస్తుతం ఒక స్ట్రిప్‌ను పది గంటల పాటు ధరిస్తే.. ఒక సాధారణ చేతి గడియారాన్ని 24 గంటలపాటు నడిపేంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అదే పది వేళ్లకు పది స్ట్రిప్‌లను ధరిస్తే ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ స్ట్రిప్ ప్రస్తుతానికి ప్రాథమిక నమూనా మాత్రమేనని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యుత్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. గుండెకు అమర్చే పేస్ మేకర్లు వంటి పరికరాలకు, బ్లడ్ షుగర్, విటమిన్, సోడియం సెన్సర్లు, ఇతర టెస్టుల కోసం శరీరానికి అమర్చే పరికరాలకు ఈ స్ట్రిప్‌ల సాయంతో విద్యుత్ అందించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. హా ప్రస్తుతం ఒక్కో స్ట్రిప్‌తో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ చేయడానికి మూడు వారాలు పడుతుందని.. భవిష్యత్తులో కొద్దిగంటల్లోనే చార్జ్ అయ్యే స్థాయికి అభివృద్ధి చేస్తామని వివరించారు. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్
ప్రస్తుతం స్మార్ట్ యుగంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. రెండు రోజులో క్రితమే చైనాలో కేవలం ఒకే రోజులో 10 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది. ఇప్పుడు మరోసారి సరికొత్త ఆవిష్కరణకు షియోమీ శ్రీకారం చుట్టింది. గత దశాబ్దం కాలంలో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ స్క్రీన్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ పవర్, వైర్ లెస్ కనెక్టివిటీ విషయాలలో సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా అభివృద్ది చెందింది. అయితే, బ్యాటరీ టెక్నాలజీ మాత్రం టెక్నాలజీ మాత్రం అనుకున్నంత వేగంగా అభివృద్ది చెందలేదు. గత ఏడాది నుంచి ఈ టెక్నాలజీలో పురోగతి కనిపిస్తుంది. మొబైల్ తయారీ కంపెనీలు ఛార్జింగ్ వేగంగా అయ్యేందుకు ఛార్జింగ్ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ ఈ మద్యనే 200వాట్ చార్జర్ ని అభివృద్ది చేసింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ కోసం దాఖలు చేసినట్లు సమాచారం. గిజ్ చైనా నివేదిక ప్రకారం, షియోమీ రాష్ట్ర సంస్థ చైనా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ పేటెంట్ టెక్నాలజీ ఒక పరికరాన్ని ధ్వని ద్వారా ఛార్జ్ చేయడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నట్లు పేటెంట్ ద్వారా తెలుస్తుంది. షియోమీ అభివృద్ది చేస్తున్న కాంటాక్ట్ లెస్ వైర్ లెస్ ఛార్జింగ్ మొదటి రూపం ఇది కాదు. జనవరిలో కంపెనీ తన 'ఎయిర్ ఛార్జ్' టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ ద్వారా గదిలో మనం ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉంచిన ఫోన్ చార్జ్ కానుంది. దీని ఛార్జ్ చేయడానికి బీమ్ ఫార్మింగ్ అనే ఫోకస్టింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అయితే, ఈ కొత్త 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీని కొట్టి పారేస్తున్నారు. చదవండి: బడ్జెట్లో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ -
శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్ ఛార్జింగ్..!
సాధారణంగా స్మార్ట్‌వాచ్స్, ఇయర్ బడ్స్, వాడేవారికి ఎక్కువగా వెంటాడే సమస్య బ్యాటరీ. బ్యాటరీ పూర్తిగా ఐపోతే అవి ఎందుకు పనికిరావు. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను తప్పక ఛార్జ్ చేస్తూండాలి. కాగా సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలతో భవిష్యత్తులో ఈ ఛార్జింగ్ సమస్యకు వీడ్కోలు చెప్పవచ్చు. మన శరీరాన్నే వాహకంగా ఉపయోగించి స్మార్ట్‌వాచ్ లాంటి ఇతర వేయరబుల్స్ ను మొబైల్‌తో, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లతో ఛార్జీంగ్ చేయవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్)కు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగం ఈ టెక్నిక్‌ను ఆవిష్కరించింది. బాడీ కపుల్డ్ ట్రాన్స్మిషన్ ద్వారా మన దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా మనం ధరించిన స్మార్ట్ వాచ్‌లను సులువుగా ఛార్జ్ చేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. బాడీ కపుల్డ్ ట్రాన్స్మిషన్ అంటే ఏమిటి..? మమూలుగా మన చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంతోకొంత ఎలక్ట్రోమ్యాగ్నటిక్ క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఈ క్షేత్రాలనుపయోగించి మన శరీరంలో ఏర్పాటుచేసిన రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌తో ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, (స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్)లాంటి బ్యాటరీలను చార్జ్ చేయవచ్చును. ఫోటో కర్టసీ: నేచర్ ఎలక్ట్రానిక్స్ చదవండి: ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..! -
షియోమీ నుంచి సరికొత్త టెక్నాలజీ
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షియోమీ సరికొత్త వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ "ఎంఐ ఎయిర్ ఛార్జ్"ను ఆవిష్కరించింది. పేరుకు తగ్గట్టే ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీతో షియోమీ యూజర్లు కేబుల్స్, ప్యాడ్లు లేదా వైర్లెస్ ఛార్జింగ్ స్టాండ్లు లేకుండా స్మార్ట్ఫోన్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఒకేసారి రిమోట్‌గా ఛార్జ్ చేయవచ్చు. "ఒకేసారి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎటుంవంటి కేబుల్ సహాయం లేకుండా ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఇది, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో పెను మార్పులను తీసుకొస్తుందని ఆశిస్తున్నాం"అని షియోమి తన ట్విటర్ లో తెలిపింది.(చదవండి: రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల) ఈ వైర్లెస్ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ షియోమీ స్పేస్ పొజిషనింగ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసినట్లు షియోమీ సీఈఓ తెలిపారు. దీనిలోని 144 యాంటెన్నాలతో కూడిన ఫేస్ కంట్రోల్ అర్రే మిల్లీమీటర్ తరంగాలు నేరుగా బీమ్‌ఫార్మింగ్ ద్వారా ఛార్జింగ్ అవసరమయ్యే స్మార్ట్‌ఫోన్‌కు వెళతాయి. దీనిలోని బిల్ట్ ఇన్ 5- ఫేస్ ఇంటర్ఫేస్ యాంటెన్నా మనం ఛార్జ్ చేయాలనుకునే డివైజ్‌ను ఖచ్చితంగా గుర్తించగలదు. ఎంఐ ఎయిర్ ఛార్జ్ టెక్నాలజీ బేస్ మోడల్ ద్వారా 5వాట్ కి సపోర్ట్ చేసే అనేక పరికరాలను ఒకేసారి ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది మాయ కాదని ఇది ఒక సైన్స్ అద్భుత సృష్టి అని వీడియో చివరలో పేర్కొంది. ఇది వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. -
బాత్‌టబ్‌లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్
మాస్కో : స్మార్ట్‌ఫోన్ ప్రమాదాలకు సంబంధించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాత్‌టబ్‌లో ఉండగా చార్జింగ్‌లో ఉన్న ఐఫోన్ షాక్కొట్టి ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. రష్యాలోని అర్ఖంగెల్స్క్ నగరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో గతంలో ఆమె బాత్‌టబ్‌లో ఉండగా తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. మరోవైపు దేశంలో ఈ తరహా మరణాలు సంభవించడంతో స్పందించిన రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. వాటర్, విద్యుత్ మెయిన్లకు అనుసంధానించబడిన విద్యుత్ ఉపకరణాలు ప్రమాదకరమని, అప్రమత్తంగా ఉండాలంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒలేసియా సెమెనోవా (24) స్నానం చేస్తోంది. ఇంతలో పక్కనే ఛార్జింగ్ మోడ్‌లో ఉన్న ఆమె ఐఫోన్ 8 టబ్‌లో పడిపోయింది. ఏం జరిగిందో ఆమె గమనించేలోపే.. ఒక్కసారిగా ఆమె విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె స్నేహితురాలు డారియా పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది..టబ్‌లో అచేతనంగా పడి ఉన్న ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యా.. గట్టిగా పిలిచా.. పలకలేదు.. ఆమెను తాకినప్పుడు తనకు కూడా షాక్ కొట్టిందంటూ వణికిపోయిందామె. అంతేకాదు అప్పటికి ఇంకా వాటర్లోనే స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతోందని తెలిపింది. అటు ఛార్జింగ్‌లో ఉండగా ఐఫోన్ బాత్‌టబ్‌లో పడిందని, దీంతో విద్యుత్‌షాక్‌తో సెమెనోవా మృతిచెందినట్టు పారామెడిక్స్ ధృవీకరించింది. కాగా 2019 లో, 26 ఏళ్ల రష్యన్ మహిళ, ఆగస్టులో మాస్కోలో 15 ఏళ్ల బాలిక ఇదే తరహాలో మరణించిన సంగతి తెలిసిందే. -
పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా దేశవ్యాప్తంగా దాదాపు 69,000 పెట్రోల్ బంకుల్లో కనీసం ఒక్కటి చొప్పునైనా చార్జింగ్ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనితో పాటు ప్రభుత్వ రంగ రిఫైనర్లకు చెందిన సొంత బంకుల్లో (సీవోసీవో) ఈవీ చార్జింగ్ కియోస్క్‌ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో చమురు శాఖ వర్గాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ మేరకు సూచనలు చేశారు. ఇందుకోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) తమ నిర్వహణలోని అన్ని సీవోసీవో పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ కియోస్క్‌లను పెట్టే విధంగా చమురు శాఖ ఆదేశాలు జారీ చేయొచ్చని ఆయన సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతరత్రా ఫ్రాంచైజీ ఆపరేటర్లు కూడా తమ ప్రతీ బంకులో కనీసం ఒక్కటైనా కియోస్క్ పెట్టేలా ఆదేశాలిస్తే.. దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం సాకారం కాగలదని పేర్కొన్నాయి. నగరాలతో పాటు జాతీయ రహదారులపై కూడా ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, వదోదర, భోపాల్ వంటి నగరాలపై చమురు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వివరించాయి. -
టయోటా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ ‘వెల్ఫైర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ ‘వెల్ఫైర్’ను భారత్‌లో ప్రవేశపెట్టింది. హైదరాబాద్ వేదికగా ఈ లగ్జరీ మల్టీ పర్పస్ వాహనాన్ని కంపెనీ బుధవారం విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.79.50 లక్షలు. డ్యూయల్ మోటార్స్‌తో 2.5 లీటర్ల గ్యాసోలిన్ హైబ్రిడ్ ఇంజన్ పొందుపరిచారు. 2800–4000 ఆర్పీఎంతో 198 ఎన్ఎం టార్క్, మైలేజీ లీటరుకు 16.35 కిలోమీటర్లు. భద్రత కొరకు 7 ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, వెహికిల్ డైనమిక్స్ ఇంటెగ్రేటెడ్ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లను జోడించారు. 40 శాతం దూరం, 60 శాతం సమయం ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణిస్తుంది. కళ్లు చెదిరే ఇంటీరియర్స్, ట్విన్ మూన్‌రూఫ్స్ దీని ప్రత్యేకత. నాలుగు రంగుల్లో లభిస్తుంది. హైదరాబాద్ నుంచి 20%..: టెస్ట్ మార్కెట్‌గా పేరొందడంతోపాటు ప్రధాన మార్కెట్ కావడంతో వెల్‌ఫైర్‌ను హైదరాబాద్ వేదికగా విడుదల చేసినట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. తొలి 3 నెలల షిప్‌మెంట్స్ అమ్ముడైనట్టు టీకేఎం ఎస్వీపీ నవీన్ సోని వెల్లడించారు. ఒక్కో షిప్మెంట్లో 60 వాహనాలు ఉంటాయని వివరించారు. అమ్ముడైన వాహనాల్లో 20%పైగా హైదరాబాద్ నుంచే నమోదయ్యాయన్నారు. అంతర్జాతీయంగా 6 లక్షలకుపైగా వెల్ఫైర్ వాహనాలు విక్రయమయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం పూర్తిగా తయారైన వెల్ఫైర్ వాహనాలను జపాన్ నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. 1.5 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా విక్రయించామని టీకేఎం ఎండీ మసకజు యోషిముర వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో టయోటాకు 43% వాటా ఉందన్నారు. -
ఈ–కార్.. బేకార్!
సాక్షి, అమరావతి బ్యూరో: కాలుష్యాన్ని వెదజల్లవన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్లు (ఈ–కార్లు) అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తరచూ చార్జింగ్ సమస్యలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) ఈ–కార్లను అందజేసింది. ఇలా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, సీఆర్డీఏ సర్కిళ్లకు 40 ఈ–కార్లను సమకూర్చింది. వీటికి ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని డివిజన్ కేంద్రాల్లో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇవి అందుబాటులోకి వచ్చిన కొన్ని నెలల నుంచే సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. రాత్రంతా చార్జింగ్ పెట్టినా.. వాస్తవానికి ఈ–కార్లకు బ్యాటరీ ద్వారా చార్జింగ్ (డీసీ) పెడితే గంటలోను, విద్యుత్‌తో చార్జింగ్ (ఏసీ)కు ఎనిమిది గంటల సమయం తీసుకుంటుంది. ఇలా రాత్రంతా చార్జింగ్ పెట్టి ఉదయాన్నే బయల్దేరుతున్నారు. కారుకు పూర్తిగా చార్జింగ్ పెడితే 120–140 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. కానీ అవి 80–90 కిలోమీటర్లకు మించి రావడం లేదని, మరికొన్ని కార్లకు ఉన్నట్టుండి అకస్మాత్తుగా చార్జింగ్ పడిపోతోందని ఇటు అధికారులు, అటు డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో ఈ కార్లలో విధులకు వెళ్తున్న అధికారులకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక.. కొన్నింటికి గేర్లు, బ్రేకులు, సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, కొన్ని కార్లలో ఏసీలు కూడా సరిగా పనిచేయడం లేదని వీటిని నడుపుతున్న డ్రైవర్లు చెబుతున్నారు. అరొకర స్పందన.. ఈ విద్యుత్ కార్ల నిర్వహణ బాధ్యత ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) చూస్తోంది. ఒక్కో కారుకు నెలకు రూ.20 వేల చొప్పున డిస్కంలు ఈఈఎస్ఎల్కు అద్దెగా చెల్లిస్తున్నాయి. ఈ–కార్లకు ఏమైనా సమస్యలపై ఫిర్యాదు చేస్తే షెడ్డుకు పంపించమని చెబుతున్నారని, అక్కడ కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు కూడా ఉంచాల్సి వస్తోందని అంటున్నారు. కార్లకు వస్తున్న సాంకేతిక సమస్యలపై చేస్తున్న ఫిర్యాదులకు ఈఈఎస్ఎల్ నుంచి సరైన స్పందన ఉండడం లేదని అధికారులు పెదవి విరుస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తున్నాం.. ఈ–కార్ల వల్ల ఇబ్బంది లేదు. చార్జింగ్ ఇబ్బందులు నామమాత్రమే. మాకు ఏమైనా ఫిర్యాదులొస్తే వెంటనే సరిచేస్తున్నాం. విద్యుత్ కార్లకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్నది అవాస్తవం. – వెంకట శ్రీనివాస్,స్టేట్ హెడ్, ఈఈఎస్ఎల్ -
ఈ–వాహనాలకు ‘ఇంటి’ చార్జీలే..
సాక్షి, హైదరాబాద్ : ఇళ్ల వద్ద ప్రజలు సొంత ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు గృహ కేటగిరీ విద్యుత్ చార్జీలనే వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లకు మాత్రం ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఖరారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ టారిఫ్‌ను వర్తింపజేయాలని కోరింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల వద్ద చార్జింగ్ సదుపాయం పొందే వారు విద్యుత్ చార్జీలతో పాటు సర్వీసు చార్జీలు సైతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. సర్వీసు చార్జీలను ఈఆర్సీ/రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 40 లక్షలకు పైగా జనాభా గల హైద రాబాద్ వంటి మహానగరాలు, వాటికి అనుబంధంగా ఉన్న రహదారుల వద్ద ఏడాది నుం చి మూడేళ్లలోగా ప్రైవేటు చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఈ–వాహనాల చార్జింగ్ మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. గృహాలు/కార్యాలయాల వద్ద ప్రైవేటు చార్జింగ్‌ను అనుమతించాలి. డిస్కంలు ఆ మేరకు సదుపాయాలు కల్పించాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్)ల ఏర్పాటుకు ఈఆర్సీ నుంచి లైసెన్సు పొందాల్సి న అవసరం లేదు. ఏ వ్యక్తి/సంస్థ అయి నా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), కేంద్ర విద్యుత్ మం త్రిత్వ శాఖ జారీ చేసిన/జారీ చేసే మార్గదర్శకాలు, సాంకేతిక, భద్రత, నిర్వహణ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ నెలకొల్పాలనుకునే వ్యక్తులు విద్యుత్ కనెక్షన్ కోసం డిస్కంకు దరఖాస్తు చేసుకోవాలి. డిస్కంలు ప్రాధాన్యతనిచ్చి కనెక్షన్ జారీ చేయాలి. ఏదైనా చార్జింగ్ స్టేషన్/చైన్ ఆఫ్ చార్జింగ్ స్టేషన్లు నేరుగా ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుదుత్పత్తి కంపెనీ నుంచి విద్యుత్‌ను పొందొచ్చు. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌కు ఉండాల్సిన కనీస సదుపాయాలు సబ్ స్టేషన్ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ 33/11 కేవీ లైన్/కేబుల్స్, అనుబంధ పరికరాలు ఆన్లైన్లో చార్జింగ్ స్లాట్ల బుకింగ్ సదుపాయం కల్పించేందుకు కనీసం ఒక ఆన్లైన్ నెట్వర్క్ సర్వీసు ప్రొౖవైడర్తో ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. చార్జింగ్ స్టేషన్ల లొకేషన్, చార్జర్ల రకాలు, సంఖ్య, లభ్యత, చార్జీల వివరాలను వాహనదారులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. సరైన సివిల్స్ వర్క్స్, సరైన కేబులింగ్/ఎలక్ట్రికల్ వర్క్స్ వాహనాల రాకపోకలతో పాటు చార్జింగ్కు సరిపడా స్థలం హౌసింగ్ సొసైటీలు, మాల్స్, కార్యాలయ సముదాయాలు, రెస్టారెంట్లు, హోటళ్ల తదితర ప్రాంతాల వద్ద చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సందర్శకుల వాహనాల చార్జింగ్కు అనుమతించొచ్చు. -
టేబులే.. స్మార్ట్‌ఫోన్ ఛార్జర్!
పగలు ఆఫీసులో.. రాత్రి ఇంట్లో.. మన మొబైల్ఫోన్లు విశ్రాంతి తీసుకునే స్థలమేది? ఇంకేముంది.. టేబుల్ లేదా ఛార్జర్!. మరి... ఈ రెండు ఒక్కటైపోతే ఎలాగుంటుంది? ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. వివరాలు చూద్దాం. స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్ న్యూ ఎనర్జీ ఓ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. దీనిపై ఉంచిన మొబైల్‌ఫోన్‌కు విద్యుత్తును అందించడం ఈబోర్డ్గా పిలుస్తున్న ఈ టేబుల్ ప్రత్యేకత. ఇళ్లలో లేదా ఆఫీసుల్లో వాడే దీపాల వెలుగుతోనే విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఈబోర్డుపై ప్రత్యేకమైన సోలార్‌ప్యానెల్స్ ఉంటాయి. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో ఉంటే దాంతోనూ విద్యుదుత్పత్తి చేస్తుంది. మొత్తం 50 వరకూ ఛార్జింగ్ కాయిల్స్ కూడా ఏర్పాటు చేసిన ఈ టేబుల్‌పై ఎక్కడ ఫోన్ ఉంచినా ఛార్జింగ్ అవుతుంది. ఏకకాలంలో నాలుగు స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. కీ ఛార్జింగ్ ప్లాట్ఫార్మ్ను వాడుకుంటున్నందున ఈ టేబుల్ ద్వారా ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్ 3, 3ఎక్స్ ఎల్లతోపాటు సోని, నోకియా, ఎల్జీ వంటి ఫోన్లను స్మార్ట్‌వాచ్, ట్యాబ్లెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ కీ ఛార్జింగ్ ప్లాట్ఫార్మ్ను వాడకపోతే అడాప్టర్లను వాడాల్సి ఉంటుంది. ఈ వినూత్న టేబుల్‌పై తాము సముద్ర బ్యాక్టీరియా తాలూకూ ప్రొటీన్‌తో తయారైన త్వచాన్ని వాడామని.. ఫలితంగా తక్కువ కాంతిలోనూ విద్యుత్తును ఉత్పత్తి చేయడం వీలవుతుందని కంపెనీ చెబుతోంది. -
మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ప్రారంభం
-
వైఫై సంకేతాలతోనే స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్‌తోనే చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ! కానీ రెక్టెన్నా అనే ప్రత్యేకమైన పరికరం సాయంతో ఇది చాలా సులువైన పనే అని అంటున్నారు టోమ్స్ పలాసియోస్ అనే శాస్త్రవేత్త. ఏసీ విద్యుత్తు ద్వారా పుట్టే విద్యుదయస్కాంత తరంగాలను డీసీ తరంగాలుగా మార్చే పరికరమే రెక్టెన్నా. ఎంఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్తరకం రెక్టెన్నా మాత్రం రేడియో తరంగాలను స్వీకరించి ఏసీ విద్యుత్తరంగాలుగా మారుస్తుందన్నమాట. అయితే ఇప్పటివరకూ రెక్టెన్నాతో ఉత్పత్తి చేయగలిగిన విద్యుత్తు చాలా తక్కువగా ఉండటంతో ఈ రెక్టెన్నాను విçస్త్రత స్థాయిలో వాడటం సాధ్యం కాలేదని తమ గాడ్జెట్‌తో ఈ పరిస్థితి మారిపోతుందని టోమ్స్ తెలిపారు. నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ కొత్తతరం రెక్టెన్నాను చాలా చౌకగా, సులువుగా తయారు చేయవచ్చు. హైవేల వెంబడి కొత్త రెక్టెన్నాలను భారీ సైజులో ఏర్పాటు చేయవచ్చునని తద్వారా బ్యాటరీల అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అన్నింటినీ చార్జ్ చేయవచ్చునని తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము తయారుచేసిన రెక్టెన్నాలతో 40 మైక్రోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగామని.. ఎల్ఈడీ స్క్రీన్లు మొదలుకొని అనేక వేరబుల్ గాడ్జెట్స్‌కు ఈ మాత్రం విద్యుత్తు సరిపోతుందని వివరించారు. -
ఈ రోడ్డుపై చార్జింగ్ చేసుకోవచ్చు!
బ్రెస్సెల్స్: సమీప భవిష్యత్‌లో వాహనాలన్నీ విద్యుత్‌తోనే నడుస్తాయా? శిలాజ ఇంధనాలకు విద్యుత్ సరైన ప్రత్యామ్నాయమా? అంటే స్వీడన్ పరిశోధకులు అవుననే చెబుతారు. చెప్పడమే కాదు.. రోడ్లపై వాహనాలు దూసుకెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా చార్జింగ్ అయ్యేలా ప్రత్యేకమైన ట్రాక్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. స్టాక్‌హోం విమానాశ్రయం నుంచి రోజెర్స్బెర్గ్ వరకూ నిర్మించిన ఈ ట్రాక్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశమంతటా అమలు చేసేందుకు స్వీడన్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని 70 శాతం తగ్గించాలని స్వీడన్ లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు మధ్యలో విద్యుత్ ట్రాక్ ఈరోడ్ ఆర్లాండా, వాహనాల తయారీ సంస్థ డీఏఎఫ్, టెక్నాలజీ కంపెనీలు, విద్యాసంస్థలు, స్వీడన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. స్టాక్ హోం ఎయిర్పోర్ట్ నుంచి రోజెర్స్బెర్గ్లోని ఓ సరుకుల సరఫరా కేంద్రం వరకూ దాదాపు 2 కి.మీ పొడవుతో రోడ్డు మధ్యలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ మధ్యలో 6 సెం.మీ లోతులో విద్యుత్ వైర్లను అమర్చారు. దీంతో విద్యుత్‌తో నడిచే ప్రత్యేకమైన కారు లేదా లారీ ఈ మార్గంపైకి రాగానే దాని కింద ఉండే ప్రత్యేకమైన చేయి లాంటి నిర్మాణం ఆటోమేటిక్‌గా విద్యుత్ ట్రాక్‌ను గుర్తించి చార్జింగ్ ప్రారంభిస్తుంది. ఈ మార్గంలో కారు లేదా ట్రక్కు వెళుతున్నంతవరకూ బ్యాటరీలు చార్జ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కారు లేదా ట్రక్కు నిలిచిపోతే, విద్యుత్ సరఫరా దానంతట అదే ఆగిపోతుంది. ఈ వ్యవస్థలో భాగంగా ఒక్కో వాహనం ఎంత విద్యుత్‌ను వినియోగించుకుంటుందో లెక్కించి సదరు కారు లేదా లారీ ఓనర్ నుంచి నగదును వసూలు చేస్తారు. దీనివల్ల విద్యుత్ కొరతతో వాహనాలు ఆగిపోవడమన్న సమస్యే తలెత్తదు. ఈ పైలెట్ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో స్వీడన్ ప్రభుత్వం 70 శాతం భరిస్తోంది. లాభదాయకం.. సురక్షితం ఈ ప్రాజెక్టులో విద్యుత్ ట్రాక్ ఉన్న రోడ్డును 50 మీటర్లకు ఓ సెక్షన్ చొప్పున విభజిస్తారు. తద్వారా వాహనాలు సంబంధిత సెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విద్యుత్ సరఫరా జరుగుతుంది. లేదంటే ఆగిపోతుంది. దీనివల్ల గణనీయంగా ఇంధనాన్ని, శక్తిని ఆదా చేయొచ్చు. దేశమంతటా రోడ్లపై ఇలాంటి ట్రాక్‌లను పరచడం వల్ల విద్యుత్ వాహనాల తయారీ ఖర్చు, బ్యాటరీల పరిమాణం భారీగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ ట్రాక్‌లను ఓ కి.మీ మేర అమర్చాలంటే దాదాపు రూ.8.46 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ మొత్తం ట్రామ్ కారు ఏర్పాటు వ్యయంతో పోల్చుకుంటే 50 రెట్లు తక్కువ. ఇక ఈ ట్రాక్‌ల కారణంగా చార్జింగ్ స్టేషన్ల కోసం వాహనదారులు వెతకాల్సిన బాధ తప్పుతుంది. వరదలు సంభవించినా, రోడ్డంతా ఉప్పు ఉండిపోయినా ఉపరితలంపై విద్యుత్ సరఫరా ఒక ఓల్ట్కు మించదనీ, ప్రజలు నిక్షేపంగా చెప్పులు వేసుకోకుండా నడవొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంధన కొరత అన్నదే లేకుండా ప్రజలు తమ వాహనాలు నడుపుకోవచ్చని హామీ ఇస్తున్నారు. -
8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: ‘టెర్రా హెచ్‌పీ ఫాస్ట్ చార్జింగ్ సిస్టమ్’ను ఏబీబీ భారత మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఇందుకు ప్రపంచ రవాణా సదస్సు వేదికగా నిలిచింది. కేవలం 8 నిమిషాల చార్జింగ్‌తో ఓ కారు 200 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రవాణా వ్యవస్థను ఎలక్ట్రిక్ ఆధారితంగా మార్చే విషయంలో భారత ప్రభుత్వ ఆకాంక్షలు, చర్యల్ని ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పీసోఫర్ ప్రశంసించారు. మూవ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో ఎలక్ట్రిక్ రవాణాకు ఏబీబీ తన టెక్నాలజీలతో సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘కొన్ని నెలల క్రితం జర్మనీలో జరిగిన హానోవర్ ఇండస్ట్రీ ఫెయిర్‌లో నూతన టెర్రా హైపవర్ ఈవీ చార్జర్‌ను ఏబీబీ ఆవిష్కరించింది. ఇది ఎనిమిది నిమిషాల చార్జింగ్‌తో ఓ కారును 200 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా చేయగలదు. ఈ తరహా ఫాస్ట్ చార్జర్‌ను ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగిందని’’ స్పీసోఫర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల రవాణాకు సంబంధించిన టెక్నాలజీలో లీడర్‌గా ఉన్నామని, టోసా సిస్టమ్ కేవలం 20 సెకండ్ల బరస్ట్‌తో ఓ బస్సు రోజంతా నడిచేలా చేయగలదన్నారు. -
జీఐఎస్ సబ్‌స్టేషన్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించిన తొలి 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)ను తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) విజయవంతంగా చార్జింగ్ చేసింది. విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం రిమోట్ ద్వారా ఈ సబ్‌స్టేషన్‌కు చార్జింగ్ నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా భూగర్భంలో 120 మీటర్ల దిగువన నిర్మిస్తున్న మేడారం లిఫ్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.430 కోట్ల వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో నిర్మించింది. మేడారం లిఫ్టులకు అనుసంధానంగా సబ్‌స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఫీడర్ల మధ్య నిర్దిష్ట దూరంతో సబ్‌స్టేషన్ నిర్మాణానికి కనీసం 30 ఎకరాల స్థలం అవసరం కాగా, భూగర్భంలో మేడారం లిఫ్టునకు అనుసంధానంగా సబ్‌స్టేషన్ నిర్మించడానికి అంత స్థలం అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తక్కువ స్థలంలో నిర్మించేందుకు వీలు కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను మేడారంలో ట్రాన్స్‌కో నిర్మించింది. 3 వేల గజాల స్థలంలో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని 5 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్‌లోని ఫీడర్ల మధ్య తక్కు వ దూరం ఉన్నా, వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ పరస్పరం సంపర్కంలోకి రాకుండా ఫీడర్ల మధ్య సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ గ్యాస్ విద్యు త్ నిరోధకంగా పని చేయనుంది. ఈ తరహా సబ్‌స్టేషన్ దేశంలో మూడోది అని, రాష్ట్రంలో నిర్మించడం ఇదే తొలిసారి అని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. 870 మెగావాట్ల విద్యుత్.. మేడారం పంపింగ్ స్టేషన్లో 124.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్న 7 పంపులకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా 870.80 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. ఈ సబ్‌స్టేషన్‌లో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ఏడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 25 ఎంవీఏల సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రామడుగు 400/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి భూగర్భంలోని మేడారం సబ్‌స్టేషన్ వరకు 20.3 కి.మీల 400 కేవీ క్యూఎండీసీ విద్యుత్ లైన్ నిర్మాణం కోసం 2,500 ఎస్‌క్యూఎంఎం కేబుల్‌ను వినియోగించారు. జీఐఎస్ సబ్‌స్టేషన్ చార్జింగ్ విజయవంతం కావడంతో ట్రాన్స్‌కో సీఎండీ, విద్యుత్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. -
ప్రాణాలతో..'సెల్'గాటం
ఎ.మల్లవరం (రౌతులపూడి): మండలంలోని ఎ.మల్లవరంలో రెండో నంబర్ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త ఉప్పలపాటి పార్వతికి ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా పేలిపోయింది. దీంతో ఆమె ఇంటిలోని మంచంమీద పరుపు, బెడ్‌షీట్ కాలిపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న కార్యకర్త కుమార్తె, కుటుంబసభ్యులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ పేలిపోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర సమయంలో జరిగిన ఈ సంఘటనతో గ్రామస్తులు, మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పార దర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ ఇటీవలే ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు అందించింది. శంఖవరం ప్రాజెక్టుపరి«ధిలో రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో 224మంది అంగన్వాడీ కార్యకర్తలకు వీటిని అందజేశారు. ఈ మేరకు ఆయా కేంద్రాల నిర్వహణకు సంబంధించిన వివరాలను సెల్ఫోన్ల ద్వారా ఆన్లైన్ నమోదు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నాణ్యమైన ఫోన్లు ఇవ్వకపోవడంతో కేంద్రాల నిర్వహణకు సంబంధించి డాటా నమోదులో అవి సక్రమంగా పనిచేయకపోవటం, నెట్వర్కు సక్రమంగా అందకపోవడం, తరచూ హ్యాంగై పోవడం వంటి చర్యలతో అంగన్వాడీ కార్యకర్తలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సోమవారం జరిగిన ఈ ప్రమాదసంఘటనతో అంగన్వాడీ కార్యకర్తలు సెల్ఫోన్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అందించిన తక్కువ రకం సెల్ఫోన్లు వాపసు తీసుకుని నాణ్యమైన కంపెనీకి చెందిన సెల్ఫోన్లు అందివ్వాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై శంఖవరం ఐసీడీఎస్ సీడీపీఓ ఎం.గంగాభవానికి సమాచారం అందించినట్టు బాదిత అంగన్వాడీ కార్యకర్త, తోటి అంగన్వాడీ కార్యకర్తలు వివరించారు. ఈ విషయంపై సీడీపీఓ గంగాభవానిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఒకింత ఆమె కూడా ఆందోళన చెందారు. ఈ విషయంపై జిల్లా ఐసీడీఎస్ ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఉపయోగించే సెల్ఫోన్లు సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని తిరిగి వాపసు చేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. -
చార్జింగ్ లేదని దించేశారు..
సూరారం: ఎక్కడైనా బస్సు మొరాయిస్తే ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపిస్తారు. కానీ టికెట్లు జారీ చేసే (ఈ–పోస్) మెషిన్ చార్జింగ్ అయిపోయిందనే సాకుతో కుత్బుల్లాపూర్ పరిధిలోని హెచ్ఎంటీ రోడ్డులో ప్రయాణికులను బస్సులోంచి దించేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో అటువైపు బస్సులు రాకపోవడంతో చాలాసేపు ఎదురుచూసి ఇతర బస్సుల్లో ప్రయాణించారు. కండాక్టర్ ముందుగానే మెషిన్‌ను చెక్ చేసుకొని ఉండాల్సిందిగా ప్రయాణికులు పేర్కొన్నారు. -
ఛార్జింగ్ బండి వచ్చేస్తోంది...
మొబైల్ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే మనం ఏం చేస్తాం. దగ్గరలో ఛార్జింగ్ పాయింట్ ఎక్కడుందా అని వెతుకుతాం. మరి విద్యుత్తు కారులో ఛార్జ్ అయిపోతే..? ఇప్పటికైతే ఛార్జింగ్ స్టేషన్లు పెద్దగా లేవు కాబట్టి.. ఒక్క ఫోన్‌కొడితే మీ దగ్గరికే చార్జింగ్ స్టేషన్ వచ్చేస్తుంది అంటున్నారు జర్మనీకి చెందిన ఛార్జరీ అనే కంపెనీ. ఫొటోలో కనిపిస్తోందే.. అదే ఆ ఛార్జింగ్ స్టేషన్. ఒక మీటర్ పొడవు, దాదాపు 330 కిలోల బరువుండే ఈ యంత్రంలో 24 కిలోవాట్/గంటల విద్యుత్తు నిల్వ ఉండేలా లిథియం అయాన్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఈ స్థాయి విద్యుత్తుతో వాహనాలు దాదాపు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవని అంచనా. త్వరలోనే దీన్ని 50 కిలోవాట్/గంటలకు పెంచేందుకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఛార్జింగ్‌కు పట్టే సమయం కూడా చాలా తక్కువని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా.. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఉత్పత్తి చేసిన విద్యుత్తునే ఇందులో వాడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ అయిపోయిందని ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా చెబితే చాలు.. మీ దగ్గరకు ఛార్జరీ యంత్రం వచ్చేస్తుంది. దాంట్లోంచి ఏసీ అడాప్టర్‌తో ఎంచక్కా మీ విద్యుత్తు వాహనాన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. యూరప్‌లోని 13 నగరాల్లో దాదాపు 350 ఛార్జరీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. -
జియో ఫోన్ కూడా పేలిందట..!
కశ్మీర్: దీపావళి పండుగకు జియో కస్టమర్ల చేతుల్లో మెరిసిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌కు సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కశ్మీర్ లో ఒక జియోఫోన్ యూనిట్ పేలిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో శాంసంగ్, షావోమీ, ఆపిల్ స్మార్ట్‌ఫోన్ పేలుళ్ల ఉదంతాలు సంచలనం సృష్టించగా ఇపుడు జియో ఫీచర్ ఫోన్ పేలుడు ఘటన మరింత కలకలం రేపింది ఫోన్ రాడార్ అందించిన నివేదిక ప్రకారం చార్జింగ్ లో ఉండగా జియో ఫీచర్ పోన్ వెనుక భాగంలో పేలింది. దీంతో ఈ హ్యాండ్సెట్ వెనుగ భాగం పూర్తిగా మండి, కరిపోయినట్టు రిపోర్ట్ చేసింది. అయితే ముందుభాగం, బ్యాటరీ మాత్రం చెక్కుచెదరలేదని నివేదించింది. ఈ ప్రమాదం తమ దృష్టికి వచ్చిందని, అయితే జియో ఫీచర్ ఫోన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్టు రిలయన్స్ రీటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. విడుదలకు ముందు ప్రతీ ఫోన్‌ను క్షుణ్ణంగా పరీక్షించినట్టు తెలిపింది. కావాలని సృష్టించిన వివాదంగా తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని వాదించింది. దీనిపై తదుపరి పరిశోధనల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని తెలిపింది. మరోవైపు తప్పు బ్యాటరీది కాదని లైఫ్ డిస్ట్రిబ్యూటర్ పేర్కొంది. పేలుడు తర్వాత కూడా యూనిట్ బ్యాటరీ ఇప్పటికీ పనిచేస్తుందని, ఈ సంఘటన ఉద్దేశపూర్వక ప్రయత్నమని వ్యాఖ్యానించిందని కూడా ఈ నివేదిక పేర్కొంది. -
మీ కదలికలతో చార్జింగ్!
వాషింగ్టన్: మీ ఫోన్లో చార్జింగ్ అయిపోయిం దా.. ఇకపై చార్జర్ కోసం వెతకాల్సిన పని లేదు.. కేవలం ఒక్కసారి లేచి అటూ ఇటూ తిరిగితే చాలు మీ ఫోన్ చార్జ్ అవుతుంది. ఎందుకంటే మనిషి కదలికలతోనే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు చార్జింగ్ అయ్యే సరికొత్త సాంకేతికతను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త ఉండటం విశేషం. బ్యాటరీ సాంకేతికతను ఆధారంగా చేసు కుని కేవలం పరమాణువుల మందంలో ఉండే పలుచటి బ్లాక్ ఫాస్ఫరస్ పొరలతో తయారు చేసి న ఈ వ్యవస్థ ద్వారా తక్కువ మొత్తంలో విద్యుత్ తయారవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘భవిష్యత్తులో మన కదలికలతోనే మనమంతా ఎలక్ట్రానిక్ పరికరాల చార్జింగ్ కేంద్రాలుగా మారుతామని భావిస్తున్నాను’అని అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యారీ పింట్ పేర్కొన్నారు. కొత్త సాంకేతికతతో రెండు రకాల ప్రయోజనాలున్నాయన్నారు. విద్యు త్ను పుట్టించే పరికరం చాలా సన్నగా ఉంటుం దని, కనీసం బయటకు కన్పించకుండా దుస్తు ల్లోని పొరల్లో కూడా అమర్చొచ్చని చెప్పారు. చాలా చాలా తక్కువ కదలికల నుంచి కూడా విద్యుత్‌ను పుట్టించొచ్చని వివరించారు. భవిష్య త్తులో దుస్తులకు కూడా విద్యుత్ అందించొచ్చని, అంటే దుస్తుల రంగులు, డిజైన్లను స్మార్ట్‌ఫోన్ ద్వారా మార్చుకునే వీలు కలుగుతుందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతికి చెందిన నితిన్ మురళీధరన్ పేర్కొన్నారు. -
చెమటతో చార్జింగ్
లాస్ఏంజిలెస్: మనుషుల స్వేదాన్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసేసాంకేతి కతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చర్మానికి అంటిపెట్టుకొని ఉండేలా పట్టీ(స్కిన్ పాచ్)ని రూపొందించారు. సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే లోహాలను కాకుండా ఈ స్కిన్ పాచ్‌లో ఎంజైమ్స్‌ను ఉపయోగించామని దీన్ని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెప్పారు. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్‌ను ఉపయోగించుకుని పరికరంలో అమర్చిన బయో ఫ్యూయల్ సెల్స్ చార్జ్ అవుతాయని తెలిపారు. -
కార్లకు కరెంటు బంకులు
పెట్రోల్, డీజిల్ కంటే కరెంటు చాలా చౌక. ఈ విషయం అందరికీ తెలుసు. అయినాసరే.. మనం పెట్రోల్, డీజిల్ కార్లనే ఎందుకు వాడుతున్నాం?! ఎందుకంటే.. ఎలక్ట్రిక్ కార్లు ఉన్నా.. వాటిని చార్జ్ చేసుకునేందుకు గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఫుల్‌గా చార్జ్ చేసుకుని రోడెక్కినా బ్యాటరీలు ఖాళీ అయితే పెట్రోలు బంకుల్లా వీధి చివరల్లో ఛార్జింగ్ స్టేషన్లు లేవాయే! సరిగ్గా ఈ అసౌకర్యాన్ని సరిద్దిందుకే చైనా రంగంలోకి దిగింది. ఇంకో పది, పదిహేనేళ్లలో ఎలాగూ పెట్రోలు, డీజిల్ కార్లు కనుమరుగవుతాయి కాబట్టి.. విద్యుత్ కార్ల కోసం చార్జింగ్ స్టేషన్లను డిజైన్ చేయాల్సిందిగా షాంఘై ప్రభుత్వం ఈడీన్ ల్యాబ్ అనే సంస్థను సంప్రదించింది. వాళ్లు డిజైన్ చేసిన వినూత్నమైన చార్జింగ్ స్టేషన్లు పక్క ఫొటోల్లో కొలువుదీరాయి చూడండి. ఒక్కో ఫొటోను కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. గాజు డిజైన్లోపల కార్లు కనిపిస్తాయి. బాగానే ఉందిగానీ.. మరీ అంత ఎత్తు ఎందుకు అనుకుంటున్నారా? ఒకేసారి బోలెడన్ని కార్లను ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చు పెట్రోల్, డీజిళ్ల మాదిరిగా క్షణాల్లో అయిపోయే వ్యవహారం కాదు కదా.. అందుకన్నమాట. అలాగనీ ఇక్కడ విద్యుత్ కార్లను చార్జ్ చేసేందుకు గంటల సమయం పట్టదు. ఒక్కో టవర్‌లో కనీసం 12 కార్లను చార్జ్ చేసేందుకు అవకాశం ఉండగా.. రెండు రకాలుగా చార్జ్ చేసుకోవచ్చు. సూపర్ చార్జ్ ద్వారా కేవలం 25 నిమిషాల్లో మీ కారు పూర్తిస్థాయిలో శక్తి నింపుకోగలదు. దీంతో కనీసం వందమైళ్ల దూరం ప్రయాణించవచ్చునని, ఏసీ, డీసీ కరెంట్లు రెండిటినీ ఏకకాలంలో వాడటం ద్వారా బ్యాటరీలు వేగంగా నిండేందుకు అవకాశం ఏర్పడుతుందని అంటోంది ఈడీన్ ల్యాబ్స్. ఇక రెండో ఆప్షన్‌ను వాడుకుంటే టవర్‌లో కారు పార్క్ చేసి ఓ ఐదు గంటలు అటు ఇటు తిరగాల్సి వస్తుంది. రకరకాల సైజులున్న కార్లను కూడా ఒకే టవర్‌లో స్టోర్ చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. పెట్రోల్ బంకులు పోయి... కరెంటు బంకులు రాబోతున్నాయన్నమాట! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇలా కూడా ఫోన్ చార్జింగ్!
లండన్ : త్వరలో సూర్యకాంతి, గది ఉష్ణోగ్రత, కదలికల నుంచి చార్జింగ్ చేసుకునే అవకాశం లభించనుంది. ఫిన్ ల్యాండ్‌లోని ఓయూఎల్యూ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వివిధ రూపాల్లో ఉండే, పనికిరాకుండా వ్యర్థమయ్యే శక్తిని గ్రహించే పెరోవ్స్కిట్ స్పటిక నిర్మాణ ఖనిజాన్ని గుర్తించారు. ఖనిజ వర్గానికి చెందిన ఈ పెరోవ్స్కిట్లలో కొన్ని ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రూపాల్లోని శక్తిని గ్రహిస్తాయని.. కొన్ని సూర్యశక్తిని గ్రహించగలిగితే మరికొన్ని ఉష్ణోగ్రత, పీడనంలోని మార్పుల నుంచి గ్రహిస్తాయని చెబుతున్నారు. ఈ పెరోవ్స్కిట్లలో ఒకటైన కేబీఎన్ ఎన్ ఓపై పరిశోధన చేసిన యాంగ్ బై, ఇతర శాస్త్రవేత్తలు.. కేబీఎన్ ఎన్ ఓ ఫొటోవోల్టాయిక్, ఫెర్రో ఎలక్ట్రిక్ ధర్మాలపై గతంలో పరిశోధనలు చేశారని.. తాజాగా ఉష్ణోగ్రత, పీడనం నుంచి కేబీఎన్ ఎన్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని తేలిందని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి వివిధ రూపాల నుంచి శక్తిని గ్రహించే పరికరాన్ని తయారు చేస్తామని వివరించారు. ఇలాంటి వస్తువులు ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ టరీలకు అనుబంధంగా పని చేస్తాయి. -
చేతిలోనే ఐదారు నిమిషాల్లో ఛార్జింగ్..
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ అయిపోతుందని మీకెప్పుడైనా అనిపించిందా? పవర్‌బ్యాంక్ చేతిలో ఉన్నా.. మనలో చాలామందికి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడో ఒకసారి కలిగే ఉంటుంది. కానీ ఫొటోలో కనిపిస్తోందే... ఆ బుల్లి బాల్ లాంటి గ్యాడ్జెట్ మన చేతిలో ఉందంటే మాత్రం ఛార్జింగ్ చింత రానేరాదు. ఆ గ్యాడ్జెట్‌ను చేతిలో పట్టుకుని అలా అలా... చేతిలో తిప్పుతూ ఉంటే చాలు... ఐదారు నిమిషాల్లో మీ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునేంత కరెంట్ అక్కడికక్కడే ఉత్పత్తి అవుతుంది. బ్యాటరీలోకి చేరిపోతుంది. ‘అదెలా సాధ్యం’ అంటున్నారా? చాలా సింపుల్. దీంట్లో అయస్కాంతపు రోటర్, ఓ స్టార్టర్ (ఇండక్షన్ మోటర్లలో ఉండే స్ప్రింగ్ లాంటి పరికరం), వెయ్యి ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ, యూఎస్బీ పోర్టులు ఉంటాయి. బాల్‌పై ఉండే చిన్న రింగ్‌ను మెలితిప్పి వదిలేస్తే చాలు. ఇవి పనిచేయడం మొదలుపెడతాయి. చేతితో బాల్‌ను గిరగిరా తిప్పుతూ ఉంటే, లోపలి రోటర్ నిమిషానికి 5 వేల సార్లు తిరుగుతూ ఉంటుంది. తద్వారా అయిదు వాట్ల/ఒక ఆంపియర్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికే ఈ హైటెక్ గ్యాడ్జెట్ నమూనాలు సిద్ధమైపోయాయి. మరికొన్ని నిధులు సమకూరితే మార్కెట్లోకి తెచ్చేస్తామంటున్నారు దీని సృష్టికర్తలు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఆరు నెలల్లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. -
సింగిల్ చార్జింగ్ సూపర్ రేస్
భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండాలన్నా... వాతావరణ మార్పుల ప్రభావంతో మనిషి మనుగడే ప్రశ్నార్థకం కారాదన్నా పెట్రోలు, డీజిళ్ల కంటే కూడా విద్యుత్తు వాహనాలను వాడటం మేలని అందరూ చెబుతుంటారు. నిజమేకానీ.. ఈ రకమైన వాహనాలతో చిక్కులూ లేకపోలేదు. ఎక్కువ దూరం వెళ్లలేమన్నది ఒక చిక్కయితే... ఎక్కువ వేగంగానూ వెళ్లలేమని, బ్యాటరీలు తరచూ మార్చుకోవాలని ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ ఇబ్బందులన్నీ ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి కూడా. ఎలన్ మస్క్ తన టెస్లా కారుతో మైలేజీ ఇష్యూను కొంత వరకూ సాల్వ్ చేసినా... స్పీడు, బ్యాటరీల సమస్యలు ఇంకా తీరలేదు. కానీ చైనా స్టార్టప్ కంపెనీ నెక్స్ట్ ఈవీ మాత్రం తమకు ఇవన్నీ సమస్యలు కానే కావు అంటోంది. అనడమే కాదు.. నియో ఈపీ9 పేరుతో ఓ సూపర్ రేసింగ్ కారును సిద్ధం చేసింది కూడా. ఫొటోలో కనిపిస్తున్నది అదే. నియో ఈపీ9 లోపలి భాగం దీని శక్తి సామర్థ్యాలేమిటో ఒకసారి చూద్దాం. ముందుగా చెప్పాల్సింది వేగం గురించి. దీని గరిష్ట వేగం గంటకు 312 కిలోమీటర్లు! సున్నా నుంచి 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేందుకు ఇది తీసుకునే టైమ్ కేవలం 7.1 సెకన్లు మాత్రమే! ఇందుకోసం మొత్తం నాలుగు విద్యుత్తు మోటర్లు కలిపి దాదాపు 1341 హార్స్‌పవర్‌లకు సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే దాదాపు 427 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలం. కేవలం 45 నిమిషాల్లోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోగలగడంతోపాటు నిమిషాల్లో బ్యాటరీలు మార్చుకోగలగడమూ దీని ప్రత్యేకత. ఇప్పటికే నియో ఈపీ9 రెండు రేస్ట్రాక్లలో తన ప్రతాపాన్ని చూపింది. గత నెల 12న జర్మనీలోని ఎన్బ్రుర్జింగ్ నార్డ్స్షెలిఫే రేస్ట్రాక్పై సరికొత్త రికార్డు సృష్టించింది. ఫ్రాన్‌సలోని పాల్ రికార్డ్ రేస్ట్రాక్పై కేవలం 1 నిమిషం 52 సెకన్ల 7 మిల్లీ సెకన్లలో ఒక ల్యాప్‌ను పూర్తి చేసింది. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
త్రిపురారం: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బడాయిగడ్డ గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధనావత్ శ్రీను(30) తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టడానికి స్విచ్‌బోర్డులో చార్జర్‌ను పెడుతుండగా అతని చేతి వేలు చార్జర్ పిన్నులకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాధితుడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.