
ఇలా కూడా ఫోన్ చార్జింగ్!
లండన్ : త్వరలో సూర్యకాంతి, గది ఉష్ణోగ్రత, కదలికల నుంచి చార్జింగ్ చేసుకునే అవకాశం లభించనుంది. ఫిన్ ల్యాండ్‌లోని ఓయూఎల్‌యూ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వివిధ రూపాల్లో ఉండే, పనికిరాకుండా వ్యర్థమయ్యే శక్తిని గ్రహించే పెరోవ్‌స్కిట్ స్పటిక నిర్మాణ ఖనిజాన్ని గుర్తించారు. ఖనిజ వర్గానికి చెందిన ఈ పెరోవ్‌స్కిట్‌లలో కొన్ని ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రూపాల్లోని శక్తిని గ్రహిస్తాయని.. కొన్ని సూర్యశక్తిని గ్రహించగలిగితే మరికొన్ని ఉష్ణోగ్రత, పీడనంలోని మార్పుల నుంచి గ్రహిస్తాయని చెబుతున్నారు.
ఈ పెరోవ్‌స్కిట్‌లలో ఒకటైన కేబీఎన్ ఎన్ ఓపై పరిశోధన చేసిన యాంగ్ బై, ఇతర శాస్త్రవేత్తలు.. కేబీఎన్ ఎన్ ఓ ఫొటోవోల్టాయిక్, ఫెర్రో ఎలక్ట్రిక్ ధర్మాలపై గతంలో పరిశోధనలు చేశారని.. తాజాగా ఉష్ణోగ్రత, పీడనం నుంచి కేబీఎన్ ఎన్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని తేలిందని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి వివిధ రూపాల నుంచి శక్తిని గ్రహించే పరికరాన్ని తయారు చేస్తామని వివరించారు. ఇలాంటి వస్తువులు ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ టరీలకు అనుబంధంగా పని చేస్తాయి.