
రాణులు ధరించే ప్రతి ఆభరణానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంటుంది. తరతరాలుగా ఆ ఆభరణాలను వారసత్వంగా ధరించడం జరుగుతుంది. అయితే ఆ భరణాలు అత్యంత ఖరీదే గాక వాటి వెనుక ఎంతో ఆసక్తికరమైన కథలు ఉంటాయి. వాటి నేపథ్యం చూస్తే నోటమాటరాదు. అన్నేళ్లుగా ఆ ఆభరణాలను తరతరాలుగా భద్రపరచడం చూస్తే..వాటికున్న విలువ, పూర్వకాలం నాటి హస్తకళా నైపుణ్యం భవిష్యత్తు తరాలకు తెలుసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ డెన్మార్క్ క్వీన్ ధరించి శోరోభూషణం కూడా అందరీ దృష్టిని ఆకర్షించడమే ఒక్కసారిగా దాని చారిత్రక నేపథ్యం కళ్లముందుకు కదలాడింది. మరీ ఆఇంట్రస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దామా..!.
డెన్మార్క్‌రాణి మేరీ ఇటీవల హెల్సింకిలోని ఒక రాష్ట్ర వేడకలో అందరూ మర్చిపోయిన రాజ ఆభరణాన్ని వెలుగులోకి తెచ్చింది. క్వీన్ మేరీ డెన్మార్క్, ఫిన్లాండ్‌ల మధ్య సన్నిహిత సంబంధాల బలోపేతం చేసుకునేందకు ఏర్పాటు చేసిన వైట్- టై ఈవెంట్‌లో ఈ శిరో ఆభరణాన్ని(కిరీటం)ధరించింది.
ఆమె ధరించి కిరీటం 1839- 1848 కాలం నాటిది. ఆ కాలంలో డెన్మార్క్ రాజప్రతినిధి అయిన క్రిస్టియన్ VIIIని వివాహం చేసుకున్న క్వీన్ కరోలిన అమాలీకి చెందిన బంగారు కీరిటీం. ఈ కిరీటం అత్యంత అరుదైన రత్నాలతో పొదిగి ఉంటుంది. డానిష్ కోర్టు ప్రకారం, 1819-1821లో ఈ జంట ఇటలీ పర్యటన సందర్భంగా ఆ 11 రత్నాలను సేకరించారట. ఆ పర్యటనలో ఈ దంపతులు రోమ్‌ని సందర్శించి సమీపంలో పాంపీలో జరిపిన పురాతన తవ్వకాల నుంచి వీటిని సేకరించినట్లు డానిష్ కోర్టు పేర్కొంది.
ఆసక్తికర కథేంటంటే..
ఈ కిరీటం 140 ఏళ్లకు పైగా కనిపించలేదు. రాజ ఖజనాలోనే లాక్ చేసి ఉంచారని డానిష్ కోర్టు ధృవీకరించింది. మళ్లీ ఇన్నేళ్లకు డెన్మార్క్ రాణి మేరీ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో జరిగిన వేడుకలో ఆ ఆభరణాన్ని తలకు ధరించింది. ఈ కార్యక్రమం ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, అతని భార్య సుజాన్ ఇన్నెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఇది ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా జరిగిన ఈవెంట్. ఇక రాయల్ కలెక్షన్లలో తరుచుగా కనిపించే అత్యంత విలాసవంతమైన వస్తువులా కాకుండా రోజువారీ దుస్తులకు సరిపోయేలా ధరించడానికి అనుగుణంగా ఉండేటమే ఈ కిరీటం ప్రత్యేకతట.
(చదవండి: ‘ఆడపిల్లనమ్మా..’ పాటతో పాపులర్ అయిన సింగర్ మధుప్రియ జర్నీ..!)
Comments
Please login to add a commentAdd a comment