Finland
-
ఆన్లైన్ నుంచి అక్షింతల దాకా
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్. ప్రేమకథా కాలం.. 1997.. స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్‌లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్‌కూ రైతా పట్ల అదే భావన. నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్‌కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు. ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్‌ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది. దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్‌ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్‌ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది. రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్‌లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు. ‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్‌షిప్‌ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా. – సరస్వతి రమ -
శీతాకాలపు అద్భుత ప్రపంచంలో ఎంజాయ్ చేస్తున్నా దీపిక పిల్లి (ఫొటోలు)
-
సంగీతాన్ని నమ్ముకున్న పోలీసులు..
ఫిన్లండ్ తీరనగరం ఎస్పో బీచ్‌లో యువతీ యువకులు తరచు గోలగోలగా పార్టీలు చేసుకోవడం, ఆగడాలకు పాల్పడటం, బీచ్‌కు వచ్చే సాధారణ జనాలతో దురుసుగా ప్రవర్తించడం కొంతకాలంగా సమస్యగా ఉంటూ వచ్చింది. అదుపులేని యువత తరచుగా ఆగడాలకు పాల్పడుతుండటం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది.ఫిర్యాదులు వచ్చిప్పుడల్లా నిందితులను నిర్బంధంలోకి తీసుకోవడం, వారి మీద కేసులు పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నా, వాటి వల్ల పెద్దగా ఫలితాలు కనిపించలేదు. ఆకతాయి యువతను బీచ్‌కు దూరంగా ఉంచడానికి ఏదో ఒకటి చేయాలని, సాధారణ ప్రజలు బీచ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంచరించే వాతావరణం కల్పించాలని పోలీసులు నిశ్చయించుకున్నారు.అయితే, వారు మన పోలీసుల మాదిరిగా లాఠీలను నమ్ముకోలేదు, సంగీతాన్ని నమ్ముకున్నారు. పాప్, ర్యాప్లాంటి హోరెత్తించే సంగీతాన్ని ఇష్టపడే యువతకు శాస్త్రీయ సంగీతం అంటే సరిపడదని తెలివైన పోలీసు అధికారి ఒకరు గుర్తించారు.ప్రయోగాత్మకంగా బీచ్‌లో జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రతిచోటా లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేసి, శాస్త్రీయ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం ధాటికి ఆకతాయి యువత క్రమంగా బీచ్‌వైపు రావడం మానుకున్నారు. పోలీసుల సంగీతం చిట్కా ఫలించడంతో ఎస్పో నగరవాసులూ ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇవి చదవండి: ఈ వింతజీవి గురించి మేరెప్పుడైనా విన్నారా..!? -
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పూర్తిగా గడ్డకట్టిన మంచుతో నిర్మితమైన ఈ హోటల్ ఫిన్లండ్‌లోని కెమీ నగరంలో ఉంది. దీనిని తొలిసారిగా 1996లో ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే ఈ హోటల్‌కు మూడు లక్షల మంది అతిథులు వచ్చారు. ఫిన్లండ్‌లో ఏటా ఏప్రిల్ వరకు శీతకాలం ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు గడ్డకట్టే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఏటా శీతకాలంలో ఈ హోటల్‌ను నిర్మించి, అతిథులకు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి మొదలయ్యాక ఈ మంచు అంతా కరిగిపోతుంది. దాదాపు ఇరవైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో ఒక ప్రార్థనా మందిరం, రెస్టారెంట్ సహా పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని టేబుళ్లు, కుర్చీలు, మంచాలు కూడా మంచుతో తయారు చేసినవే! వీటిపైన ధ్రువపు జింకల చర్మంతో సీట్లు, పరుపులు ఏర్పాటు చేస్తారు. ఇందులోని రెస్టారెంట్లో విందు భోజనాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. (చదవండి: వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..) -
'అనందంలో'.. ఫిన్‌ల్యాండ్ మొదటి స్థానం! మరి ఇండియా..??
"అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.." అని ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం సముద్రాల రామానుజాచార్య ఓ పాట రాశారు. ఆ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచి, ఆలపించారు ఘంటసాల. ఇది 1973లో వచ్చిన 'బతుకుతెరువు' సినిమాలోనిది. పాట చివర్లో "జీవితమే ఒక నాటకరంగం" అంటారు. నాటకం వంటి జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒకరోజు తెరపడుతుంది. అది తప్పదు. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకూ సాగే బతుకు నడుమ ఆనందాన్ని పోగుచేసుకొని అనుభవిస్తేనే ఆనందం. లేకపోతే, అంతా అయోమయం, విషాదం. ఈ జీవనసారాన్ని మన మహర్షులు, మహర్షుల వంటి మహాకవులు, మహనీయులు, మాననీయ మూర్తులు తెలుసుకున్నారు, మనసారా అనుభవించారు, ఆచరించండని మనకు అనేక రూపాల్లో, మార్గాల్లో చెప్పారు. మార్చి, 20 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'. మనుషులంతా సంతోషంగా ఉండండి, అది అందరికీ పంచండి, అది ఎక్కుడుందో వెతికి పట్టుకోండి, పట్టుకొని వదలకండి.. అంటూ ఐక్యరాజ్య సమితి అంటోంది. సుమారు ఓ పుష్కరం క్రితం (2013) తొలిసారిగా, సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ వేడుకను జరుపుకున్నాయి. అప్పటి నుంచి ప్రతి ఏడూ జరుపుకుంటున్నాయి. బుధవారం నాడు అందరం జరుపుకున్నాం. కానీ, అందరికీ ఈ ఉత్సవం గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ స్థాయిలో ప్రచారం జరుగలేదు. మనదేశంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో.. మనం ఈ ఆనంద సంబరాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయాం. ఈ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడూ కొన్ని నివేదికలు అందుతూ వుంటాయి. ఏ ఏ దేశాలలో సంతోష, ఆనందాల స్థాయి ఎట్లా వుందని కొలుస్తారు. ఆ కొలతలకు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఈ నియమాల ప్రకారం నివేదిక ద్వారా మనకు అర్థమవుతున్నదేంటంటే? అనందంలో మనదేశం 126 వ స్థానంలో వుంది. మనకంటే ఎంతో పేద దేశాలు ముందు వరుసలో వున్నాయి. మన పొరుగు దేశాలైన చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ మనకంటే ఆనందంగా వున్నాయి. మొత్తం దేశాలలో ఫిన్ ల్యాండ్ అందరికంటే ఆనందమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు ఏడేళ్ల నుంచి ఫిన్ ల్యాండ్ తన అగ్రతను కాపాడుకుంటూ వస్తోంది. 60 వ ర్యాంక్ తో మనకంటే చైనా చాలా ఆనందంగా ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. క్షేత్రస్థాయిలో, నిజజీవితంలో వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిన సంస్థ చెప్పే నివేదికలో మాత్రం విషయాలు అలాగే వున్నాయి. ప్రపంచ మానవాళికి శాంతిని, ఆనందమయ జీవితాన్ని చాటి చెప్పామని చెప్పుకుంటున్న మన దేశం ఈ సూచీలో వెనుకబడి పోవడం వివిధ ఆలోచనలను రేకెత్తిస్తోంది. అంతర్ముఖంగా మళ్ళీ అలోచించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఏది ఆలోచిస్తే, ఏది చేస్తే, ఏది చూస్తే ఆనందం కలుగుతుందో? అవన్నీ మన మహర్షులు మనకు ఎన్నడో చెప్పేశారు. భగవద్గీత నుంచి సంగీతం వరకూ, ధ్యానం నుంచి యోగాభ్యాసం వరకూ, మౌనం నుంచి ఆధ్యాత్మిక సాధన వరకూ, శాంతి నుంచి స్థితప్రజ్ఞత వరకూ మనకు బోధించారు. వాటిని కొందరు ఆచరించారు, కొందరు ఆచరించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. కొందరు ఇవ్వేమీ తెలియకుండానే సహజంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎక్కువమంది ఆనందంగా లేరు. అసంతృప్తితో అలమటిస్తున్నారు, అయోమయంలో వున్నారు. ఐక్యరాజ్య సమితి పెట్టిన నియమాలను ఒకసారి వీక్షిద్దాం. ఆత్మతృప్తి, జీవనకాలం (లైఫ్ స్పాన్), సామాజిక మద్దతు, తలసరి ఆదాయం, దాతృత్వం, స్వేచ్ఛ, అవినీతి మొదలైన వాటిల్లో ఆయా దేశాలు, ఆయా దేశ ప్రజలు ఎలా వున్నారన్నది ప్రాతిపదికగా దేశాలకు ర్యాంకులను కేటాయించారు. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ వంటి దేశాలలో కూడా సంతోషం సన్నగిల్లుతోందని ఈ నివేదిక చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న దేశాలే ఎక్కువ ఆనందంగా వున్నాయి. "చిన్న కుటుంబం - చింతలులేని కుటుంబం " అన్న పాత సామెత గుర్తుకువస్తోంది. అనందాన్ని అనుభవించేవారి వయసుల్లోనూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరు నడుస్తోంది. పెద్ద వయస్సు వారికంటే చిన్నవాళ్లే ఆనందంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నా, అన్నిచోట్లా అట్లా లేదు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో యువత కంటే పెద్దలే ఎక్కువ ఆనందంగా వున్నారు. ఐరోపా వాసుల్లో ఆనందం కాస్త పెరుగుతున్నట్లు, పశ్చిమ యూరప్ లో అందరూ సమానమైన సంతోషకర వాతావరణంలో వున్నారని తెలుస్తోంది. ఒక్క ఐరోపా దేశాల్లో తప్ప మిగిలిన అన్ని దేశాలలోనూ ఆనందంలో అసమానతలు పెరిగిపోతూ ఉండడం బాధాకరం. అందులో మనదేశం కూడా వుండడం ఇంకా బాధాకరం. అందరి కంటే అత్యంత ఆనందంగా వున్న ఫిన్ ల్యాండ్ ప్రజలను గమనిస్తే వారి లక్షణాలు, ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రకృతితో ఎక్కువ మమేకమై ఉండడం, వృత్తిని - జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, సమతుల్యత పాటిస్తూ సాగడం, విజయంపై స్పష్టమైన అవగాహన కలిగివుండడం, అవినీతి తక్కువగా ఉండడం, ప్రభుత్వాల పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి వుండడం, ఆరోగ్యం, విద్య, సంరక్షణలో ప్రభుత్వం సక్రమంగా పరిపాలన, సేవలు అందించడం మొదలైనవి ఫిన్ ల్యాండ్ వారి ఆనందమయ జీవితానికి కారకాలుగా, ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎజెండా పెట్టుకుంటున్నాం. "అనందానికి తిరిగి దగ్గర కావడం - స్థితప్రజ్ఞత కలిగే, పెరిగే సమాజాలు నిర్మించుకోవడం" ఈ 2024 సంవత్సరానికి పెట్టుకున్నాం. ఇది సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే వుంది. మన ఆలోచనలలో వుంది, మన ఆచరణలో, నడవడికలో వుంది. రమణమహర్షి నుంచి రామానుజాచార్యులు (సముద్రాల) వరకూ, మహాత్మాగాంధీ నుంచి మార్క్ ట్వైన్ వరకూ, ఆదిశంకరాచార్యుల నుంచి అబ్రహం లింకన్ వరకూ, లియో టాల్ స్టాయ్ నుంచి జాన్ కీట్స్ వరకూ చెప్పింది ఒక్కటే! "ఆనందంగా ఉండండి, తోటివారిని అనందంగా ఉంచండి ". ఈ క్రమంలో, మనకు బోలెడు సారస్వతం వుంది, కళలు వున్నాయి, భగవద్గీత, మహాభారత రామాయణాది కావ్యాలు, ఇతిహాసాలు, వేదవేదాంగాలు అందించిన జ్ఞానభాండాగారం మన దేశానికి మెండుగా అండగా వుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకొనేంత వరకూ ఏమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యకూడదో ఆచార్యులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతూనే వున్నారు. ఆహారం, నిద్ర, వ్యాయామ నియమాలు, శాంతి, విశ్రాంతిని ఆచరించడం మన చేతుల్లోనే వుంది. ప్రతి మనిషి కోరుకొనేది ఒక్కటే.. ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. అదే జీవిత మకరందం. ఈ ఆనంద సూచీలో మనం ఫిన్ ల్యాండ్ ను దాటి మొదటి స్థాయిని అందుకోవాలి. అందరూ అనందంగా ఉండాలని అనుకుందాం. — మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే!
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. ఏడు సార్లుగా అదే స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం (మార్చి 20)న యూఎన్ ఆధారిత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్(1), డెన్మార్క్(2), ఐస్లాండ్(3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ గతేడాదిలానే 126వ స్థానంలో ఉంది. ఇక చైనా (60), నేపాల్ (95), పాకిస్థాన్ (108), మయన్మార్(118) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2020లో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లినప్పటి నుంచి మానవతా విపత్తుతో బాధపడుతోంది అఫ్ఘనిస్తాన్. దీంతో ఈ హ్యపీనెస్ ఇండెక్స్ 143 దేశాలలో అఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికను ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. దాదాపు దశాబ్దకాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి కిందకు దిగజారాయి. అవి వరుసగా 23, 23 స్థానాల్లో నిలిచాయి. అయితే టాప్ 20లో కోస్టారికా(12), కువైట్(13) స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడడా టాప్ 10లో పెద్ద దేశమేది లేదని నివేదిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో తొలి టాప్ 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇక టాప్ 20లో మాత్రం మూడు కోట్ల కంటే అధిక జనాభా ఉన్న కెనడా, యూకేలు ఉన్నాయి. అలాగే ఈ నివేదికలో పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. కానీ ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒకేవిధంగా లేదని పేర్కొంది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది. అగ్రస్థానంలో ఫిన్లాండ్ దేశమే ఎందుకంటే.. మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా ప్రకారం, ఫిన్లాండ్ దేశం సంతోషంగా ఉండటానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే, అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. మొదటిది ఐక్యతా భావం అది ఇక్కడ ఎక్కువ. ఎలాంటి చెడు పరిస్థితులతోనైనా పోరాడే శక్తిని కలిగి ఉంటారు. అలాగే అందరితో సామరస్యంగా జీవించడం వంటివి ఉంటాయి. ప్రధానంగా చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ వహించాలని ఫిన్లాండ్ దేశ ప్రజలకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఇది వారి అభివృద్ధిలో ముఖ్యమైన భాగం. అంతేగాదు ఫిన్లాండ్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో ప్రతి కుటుంబం తమ పొరుగువారితో సంతోషంగా గడుపుతాయని తేలింది. సమస్యలన్నీ మాట్లాడుకోవడం వల్ల భారం తగ్గుతుంది. ఇక్కడ అందరిలోనూ దయ కూడా ఎక్కువే. రెండవది, ఇక్కడి ప్రభుత్వ సంస్థలు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మూడవది సమానత్వం. ఇక్కడ ఎక్కువ సంపాదించేవారు, తక్కువ సంపాదించేవారు అనే తేడా ఉండదు. అందువల్ల ఇక్కడ పేదరికం ఉండదు. అవినీతికి తావుండదు. అదీగాక ఫిన్లాండ్ సంపన్న దేశం. జనాభా తక్కువ. డబ్బు కొరత లేని దేశం. ఈ కారణాల రీత్యా ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా ఏడోసారి తొలి స్థానంలో కొనసాగుతోంది. (చదవండి: అమెరికా ఆపద్బంధువు 911 హడావిడి! ) -
ఫిన్లాండ్, స్వీడన్లో రికార్డు స్థాయి చలి
స్టాక్‌హోమ్: నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లను చలి వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఎముకలు కొరికే చలికి తోడు దట్టమైన మంచు కురుస్తుండటంతో మూడు దేశాల్లోనూ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. స్వీడన్‌లోని ఉత్తరప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1999 తర్వాత –43.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ తెలిపింది. 1951లో, తిరిగి 1999లోనూ –49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తు చేసింది. పొరుగునే ఉన్న ఫిన్లాండ్లోని వైలివియెస్కాలో ఉష్ణోగ్రత మంగళవారం –37.8 డిగ్రీలుగా నమోదైంది. -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: వెరైటీగా వీళ్లు ఏం చేస్తారంటే..
కొత్త సంవత్సరాలు మనకి కొత్త గానీ, అనాది కాలగమనానికి కాదు!. అలుపుసొలుపు లేని నిత్య చైతన్యాలాపనకి కొత్తా పాతా ఏమిటి? అన్నాడో కవి. అయినా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరాదికి ఆహ్వానం పలకడం.. అదో వేడుకగా జరగడం షరా మామూలు అయ్యింది. అయితే ఇక్కడ కొన్ని దేశాలు కొత్త సంవత్సరాన్ని వెరైటీగా ఆహ్వానించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. డెన్మార్క్ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యుల అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వలన చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని డెన్మార్క్ ప్రజల నమ్మకం. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం. న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రతి అమెరికా ప్రజలు టీవీలకు, ఆన్‌లైన్‌లకు అతుక్కుపోతారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో జరిగే బాల్ డ్రాప్ ఈవెంట్ అందుకు కారణం. ఇక్కడి వన్ టైమ్స్ స్క్వేర్‌పై ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రాప్ ఈవెంట్‌ను వీక్షిస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన బాల్‌ను 31వ తేదీన రాత్రి వన్టైమ్స్ స్కైర్ పై నుంచి 11. 59 నిమిషాలకు డ్రాప్ చేస్తారు. ఇటీవల కాలంలో బాల్ డ్రాప్‌కు ముందు సంగీతకారుల ప్రదర్శనలతో లైవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను తొలిసారి ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్‌పేపర్ యజమాని అడాల్ఫ్ ఓచ్స్ నిర్వహించారు. 1908 న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుతూ 1907 డిసెంబర్ 31న తొలిసారి బాల్ డ్రాప్ ఈవెంట్ జరిగింది. టైమ్స్ కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రచారం చేసేందుకు బాణాసంచాలతో న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించారు. బంతి నిఆర్ట్క్రాఫ్ట్ స్ట్రాస్ కన్సల్టెంట్ కంపెనీ రూపొందించింది. కేందుకు డిసెంబర్ 31, 1907న మొదటిసారిగా బాల్ డ్రాప్ నిర్వహించబడింది. 1942, 1943లో యుద్ధకాల సమయాల్లో మినహా ప్రతది ఏడాది బాల్ డ్రాప్ ఈవెంట్ నిర్వహణ జరుగుతూ వస్తుంది. బాల్ డిజైన్‌ను నాలుగుసార్లు ఆధునీకరించారు. తొలినాళ్లలో బాల 5 అడుగులు( 1.5 మీ) వ్యాసం కలిగి ఉండేది. దీనిని చెక్క, ఇనుముతో తయారు చేసేవాళ్లు.ఇది దాదాపు 100 బల్బులతో ప్రకాశిస్తుంది. ప్రస్తుత బంతి 12 అడుగులు(3.7 మీ) వ్యాసం కలిగి ఉంది. దీనిలో 32,00 ఎల్ఈడీ బల్బ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్లో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులను చేస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక లోదుస్తులు ధరిస్తారు. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఫిన్లాండ్: ఫిన్లాండ్లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరగనున్న విశేషాల గురించి ఊహిస్తారు . దీని కోసం.. వారు కరిగిన టిన్ను నీటిలో ముంచి, లోహం గట్టిపడిన తర్వాత.. లోహానికి ఆకారంగా మార్చే పక్రియను చేపడతారు. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే.. అది వివాహం జరగడానికి చిహ్నం అని అర్థం. మరోవైపు మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే, అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారు. 12 గంటలకు.. 12 ద్రాక్షలు స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున పాటించే సంప్రదాయం విచిత్రంగా ఉంటుంది. న్యూ ఇయర్ అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇలా చేయడానికి రీజన్ ఏమిటంటే.. 12 ద్రాక్షలు 12 నెలలు.. ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒకొక్క ద్రాక్ష పండు ఒకొక్క నెల అదృష్టంతో ముడిపడి ఉంటుందట. స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనాలాంటి బడా నగరాల్లో 12 ద్రాక్షను సామూహికంగా ఆరగించేందుకు ప్రధాన కూడళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు. -
ఆ గుహలోకి వెళ్తే ..ఆత్మలను లైవ్‌లో చూడొచ్చట!
ఆత్మల గురించి కథలు కథలుగా వినడం లేదా సినిమాల్లో చూడటమే. గాన్నీ ప్రత్యక్షం చూసిన అనుభవం ఎవరికీ ఉండదు. మహా అయితే దేన్నో చూసి ఊహించుకుని భయపటమే జరగుతుంది. ఈ గుహలోకి వెళ్తే ఆ కోరక తీరిపోతుందట. ఏంటీ..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగా ఆత్మలను ప్రత్యక్ష్యంగా చూడాలనుకునేవాళ్లు నేరుగా ఈ గుహలోకి వెళ్లిపోతే ఆ ఫీలింగ్ దక్కుతుందట. పైగా ఆ అనుభవాన్ని అంత తేలిగ్గా మరిచిపోలేరట కూడా. ఆ గుహ ఎకడుందంటే..? ఇదేదో మామూలు కొండగుహ కాదు, దయ్యాల నిలయం. ఫిన్లండ్‌లోని కోలి అభయారణ్య ప్రాంతంలో ఉన్న ఈ గుహను స్థానిక ఫిన్నిష్ భాషలో ‘పిరున్కిర్కో’ అంటారు. అంటే, దయ్యాల ఆలయం అని అర్థం. ప్రేతాత్మల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక పర్యాటకులు అడపాదడపా ఇక్కడకు వచ్చి, ఈ గుహలో కాసేపు గడిపి వెళుతుంటారు. ఈ గుహలోకి అడుగుపెట్టిన తర్వాత గుహలో ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి కలిగినట్లు ఇందులోకి వెళ్లి వచ్చిన చాలామంది చెప్పారు. ఇందులోకి అడుగు పెట్టగానే ఎవరో అదృశ్యంగా తాకుతున్న అనుభూతి కలిగిందని, చెవిలో ఎవరో గుసగుసలు చెబుతున్నట్లుగా అనిపించిందని పలువురు చెప్పారు. గుహలో ఎవరో రోదిస్తున్న ధ్వని వినిపించినట్లుగా కూడా కొందరు చెప్పారు. ఈ గుహ లోపలి పొడవు 34 మీటర్లు ఉంటుంది. అంతా ఖాళీగా, చీకటిగా ఉంటుంది. ఈ గుహలోని ఆత్మ గురించి ఫిన్లండ్‌లో చాలా కథలు శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇందులోకి వెళ్లేవారికి అక్కడ ఏదో ఆత్మ సంచరిస్తున్న అనుభూతి ఎందుకు కలుగుతోందనే దానిపై నిగ్గు తేల్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఫిన్లండ్ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధనలు ప్రారంభించారు. (చదవండి: ఆ ఫౌంటెన్ కోసం ఏకంగా రూ. 16 కోట్లు ..! కానీ చివరికి..) -
Icon Of The Seas: టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది
సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి. ప్రత్యేకతలివీ.. ► ఫిన్లాండ్లో మెయర్ తుర్కు షిప్‌యార్డ్ ఈ నౌకని నిర్మించింది ► రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’. ► నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు, ► ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 5,610 మంది ప్రయాణించగలరు ► ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్లో లభిస్తాయి. ► నౌకలో వాటర్‌పార్క్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సకల సదుపాయాలున్నాయి. ► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి బయల్దేరే ఈ నౌక కరేబియన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తుంది. ► ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఉంది. దీనికి కేటగిరీ 6 అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్లు ఉన్నాయి. ► ఒక వాటర్ స్లయిడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు. ► జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ► నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు. ► కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ను ఇంథనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది. ► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి ప్రారంభమయ్యే ఈ నౌకలో ప్రయాణం కోసం ఇప్పటికే రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ► వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (రూ. 3 లక్షలకు పైన ) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ► కరేబియన్‌లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది. ► వినోదమే ప్రధానంగా రూపొందించిన ఈ షిప్లో జరీ్నకి సర్వత్రా ఆసక్తి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మా విడాకులు.. ఇకపైనా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటాం
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ విడాకుల ప్రకటన చేశారు. చిరకాల స్నేహితుడు.. భర్త మార్కస్ రైక్కోనెన్ నుంచి విడిపోబోతున్నట్లు ప్రకటించారామె. పదిహేనేళ్లకు పైగా కలిసే ఉన్న ఈ జంట.. కరోనా టైంలో మాత్రం వివాహ బంధంతో ఒక్కటైంది. వీళ్లకు ఐదేళ్ల పాప కూడా ఉంది. సన్నా మారిన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా విడాకులపై ప్రకటన చేశారు. విడిపోతున్నప్పటికీ ఇకపైనా తాము బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతామని ప్రకటించారామె. ఒక కుటుంబంగా ఇకపైనా తాము కలుసుకుంటామని, జీవితంలో ముందుకు వెళ్తామని తెలిపారామె. ఇదిలా ఉంటే.. కిందటి నెలలో జరిగిన ఎన్నికల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆమె త్వరలోనే ప్రధాని గద్దె నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 19 ఏళ్ల పాటు కొనసాగిన బంధానికి బ్రేకప్ చెప్పడానికి గల కారణాలను మాత్రం ఇద్దరూ వెల్లడించలేదు. రైక్కోనెన్ మాజీ ఫుట్‌బాలర్ మాత్రమే కాదు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కూడా. అత్యంత యంగ్ పీఎంగా 2019లో 37 ఏళ్ల ప్రాయంలో ప్రధాని బాధ్యతలు చేపట్టారు సన్నా మారిన్. తద్వారా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అదే సమయంలో కరోనా టైంలోనూ ఆమె వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: అరుదైన ప్రయోగం.. ముగ్గురి డీఎన్ఏతో జన్మించిన శిశువు -
పుతిన్‌కు పెరిగిన తలనొప్పి
మూలిగే నక్క మీద తాటిపండు పడడమంటే ఇదే! ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో)లో చేరడానికి ఉక్రెయిన్ ఉత్సాహపడుతోందని కోపగించి, కదనానికి కత్తి దూసిన రష్యాకు ఆ తలనొప్పి తగ్గకపోగా, ఇప్పుడు ఫిన్లాండ్ రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. అమెరికా సహా మొత్తం 30 పాశ్చాత్య దేశాల కూటమి ‘నాటో’లో 31వ దేశంగా మంగళవారం ఫిన్లాండ్ అధికారికంగా చేరింది. దీంతో, రష్యాకు కంటి మీద కునుకు పట్టనివ్వకుండా ఆ దేశంతో ‘నాటో’ సభ్య దేశాల సరిహద్దు రెట్టింపయింది. పాశ్చాత్య ప్రపంచంతో దీర్ఘకాలంగా ఘర్షణలో ఉన్న మాస్కో విషయంలో ఇన్నేళ్ళుగా తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇప్పుడిలా ప్రత్యర్థితో జట్టు కట్టడం రష్యాకూ, ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్‌కూ పెద్ద ఎదురుదెబ్బ. కానీ, ఉక్రెయిన్‌తో ఏడాది పైగా ఎగతెగని పోరు చేస్తూ, ముందుకు పోలేక వెనక్కి రాలేక సతమతమవుతున్న మాస్కో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఫిన్లాండ్ చేసినపనికి తగురీతిలో ప్రతిచర్యలు ఉంటాయని హూంకరించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్, కెనడాలు స్థాపించిన సైనిక కూటమి ‘నాటో’. 1949లో సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని ఇది అమలు చేస్తుంది. ‘నాటో’లోని ఏ సభ్యదేశం పైన అయినా బయట దేశాలు దాడికి దిగితే, మిగతా సభ్యదేశాలన్నీ సాయం చేయాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకోవడమూ ‘నాటో’ లక్ష్యం. తన ప్రయోజనాలకు విరుద్ధంగా పాశ్చాత్య ప్రపంచం కూడగట్టిన ఈ కూటమి అంటే రష్యాకు అందుకే ఒళ్ళు మంట. 1990ల ద్వితీయార్ధం నుంచి తన పొరుగు దేశాలను ‘నాటో’లో చేర్చుకొని, పక్కలో బల్లెంలా మార్చడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘నాటో’ విస్తరణ విషయంలో ఉక్రెయిన్‌కు సంబంధించి ఇచ్చిన మాట తప్పేందుకు పాశ్చాత్య ప్రపంచం సిద్ధపడడాన్ని మాస్కో జీర్ణించుకోలేకపోయింది. అందుకే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాది క్రితం ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగారు. సరిహద్దు వెంట ‘నాటో’ బెడద తగ్గించుకోవాలనీ, యూరప్‌లో మరే దేశమూ ‘నాటో’లో చేర కుండా చేయాలనీ ఉక్రెయిన్‌తో పోరాటం ప్రారంభించిన పుతిన్ సఫలం కాలేదు. పైపెచ్చు, అందుకు పూర్తి విరుద్ధంగా ఆ సైనికకూటమి విస్తరణకు కారణమయ్యారు. ఇది విరోధాభాస. మాస్కో చేపట్టిన యుద్ధంతో ‘నాటో’ పట్ల ఆకర్షణ పెరిగింది. రష్యాతో తిప్పలు తప్పవనే అనుమానంతో, ‘నాటో’ సైనిక కూటమిలో సభ్యత్వానికి మరిన్ని మధ్యయూరప్ దేశాలు క్యూ కట్టాయి. ఆ క్రమంలో ఫిన్లాండ్, స్వీడన్లు ‘నాటో’ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. నిజానికి, ఫిన్లాండ్ దాదాపు 1,340 కిలోమీటర్ల తూర్పు సరిహద్దును రష్యాతో పంచుకుంటోంది. ఆ దేశం ఎన్నడూ రష్యా వ్యతిరేకి కాదు. పైగా, రెంటికీ మధ్య ఎన్నడూ విభేదాలు లేవు. అలాంటిది– ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో ‘నాటో’లో చేరేందుకే ఫిన్లాండ్లో 80 శాతం మేర ప్రజాభిప్రాయం మొగ్గింది. చివరకు అదే జరిగింది. సభ్యత్వానికి ఫిన్లాండ్ పెట్టుకున్న దరఖాస్తు రికార్డు సమయంలో ఆమోదం పొందింది. ఫిన్లాండ్ అధికారికంగా ‘నాటో’లో చేరినా, స్వీడన్‌కు మాత్రం ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. సభ్యత్వానికి స్వీడన్ అంగలారుస్తున్నా, టర్కీ, హంగరీలు అడ్డంగా నిలిచాయి. టర్కీలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ప్రమాణాల గురించి స్వీడన్ వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశం కినుక వహించింది. మే 14న టర్కీలో ఎన్నికల తర్వాత కానీ ఆ దేశం స్వీడన్ దరఖాస్తుకు ఆమోదముద్ర వేయకపోవచ్చని విశ్లేషకుల అంచనా. హంగరీ విషయానికొస్తే, స్వీడన్ అనేక సంవత్సరాలుగా హంగరీ పట్ల వైరభావంతో వ్యవహరిస్తోంది. పైగా, హంగరీలో న్యాయం క్షీణించిందంటూ స్వీడన్ ప్రధాని ఆ మధ్య వ్యాఖ్యానించారు. దాంతో, హంగరీకి పుండు మీద కారం రాసినట్లయింది. టర్కీ లాగా డిమాండ్ల జాబితా లేకున్నా, తన సాధకబాధకాలను తీరిస్తే హంగరీ సైతం ‘నాటో’లో స్వీడన్ ప్రవేశానికి ఓకే అంటుంది. మొత్తానికి, అమెరికా సారథ్యంలోని ద్వితీయ ప్రపంచ యుద్ధానంతర కూటమి బలోపేతమవుతోంది. బోలెడన్ని నిధులందిన ఆధునిక రక్షణ దళాలతో కూడిన ఫిన్లాండ్ ‘నాటో’కు బలమైన చేర్పు. రేపు ఉక్రెయిన్ యుద్ధం ఎటు తిరిగి ఎలా ముగిసినా, రష్యా మాత్రం బలహీనపడింది. ఏదైతే జరగరాదని పుతిన్ ఆశించారో, అదే జరిగి సరిహద్దు వెంట ‘నాటో’ దేశాల సంఖ్య, సత్తా ఇనుమడించాయి. ఈ పాపపుణ్యాలు పూర్తిగా పుతిన్వే. దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ, నియమాను సారం సాగే అంతర్జాతీయ క్రమాన్ని ఆయన తోసిపుచ్చారు. పాశ్చాత్య ప్రపంచం ఉలిక్కిపడి, కార్యా చరణకు ఉద్యుక్తమయ్యేలా చేశారు. ఇకపై రష్యా – యూరప్‌ల మధ్య బంధం మునుపటిలా ఉండబోదు. మరోపక్క చైనా సైతం నిత్యం ఎవరో ఒకరితో కయ్యానికి కాలుదువ్వుతోంది. వీటన్నిటి దృష్ట్యా ‘నాటో’ లాంటి సైనిక కూటములు మరింత విస్తరించడం ఖాయం. ఇప్పటికే ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి తటస్థంగా ఉన్న ఫిన్లాండ్, స్వీడన్లు పాశ్చాత్య ప్రపంచ మిత్రపక్షాలుగా మారాయి. రష్యాతో చేతులు కలిపి ఆర్కిటిక్‌లో చైనా తన ప్రాబల్యం పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో ధ్రువవృత్తం దాటి, ఆర్కిటిక్ ప్రాంతమంతటా సైనికీకరణ తప్పకపోవచ్చు. భారత్ సైతం ఆర్కిటిక్‌లో తలెత్తే పరిణామాలనూ, ప్రభావాన్నీ జాగ్రత్తగా గమనించక తప్పదు. వెరసి, ఆర్కిటిక్ ప్రాంతం మరింత సమస్యాత్మకం కానుంది. పుతిన్‌తో పాటు ప్రపంచానికీ తలనొప్పి పెరగనుంది! -
సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక
ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి : ప్రపంచంలో సంతోషకర దేశాల గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ దేశాల ఎంపికకు తీసుకుంటున్న ప్రమాణాలపై పలు అభ్యంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ జాబితాపై అంతా ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రపంచ సంతోషకర దేశాల (హ్యాపీనెస్ ఇండెక్స్) జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. ఈ జాబితా కోసం మొత్తం 150 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలోనే సంతోషకర దేశాలుగా నార్డిక్ దేశాలుగా పేరున్న ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. చిట్టచివరి స్థానంలో ఆప్ఘనిస్థాన్ నిలిచింది. మొత్తం 10 పాయింట్లకుగాను తొలిస్థానంలో నిలిచిన ఫిన్లాండ్కు 7.8 పాయింట్లు లభించాయి. మన దేశానికి కేవలం 4.6 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇక అట్టడుగున నిలిచిన ఆఫ్ఘనిస్థాన్‌కు 1.9 పాయింట్లు మాత్రమే వచ్చాయి. సంతోషానికి కొలమానం ఏమిటి? ఇది అత్యంత క్లిష్టమైన ప్రశ్న. మనిషి ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పడానికి కొలమానం ఏమీ లేదు. సంపదకు, సంతోషానికి ప్రత్యక్ష సంబంధం లేదని సంతోష సూచీ ఫలితాలనుబట్టి చూస్తే అర్థమవుతుంది. సైనిక, ఆర్థిక వ్యవస్థల పరంగా పెద్ద దేశాలైన అమెరికా, చైనా టాప్–10లో లేకపోవడం గమనార్హం. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం కంటే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్.. సంతోష సూచీలో ముందుండటంగమనార్హం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ.. సంతోష సూచీలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నివేదిక రూపకర్తలు అభిప్రాయపడ్డారు. కానీ ప్రజాస్వామ్యం లేని దేశాలు కూడా సంతోష సూచీలో మెరుగైన స్థానాలు సంపాదించడం గమనార్హం. ఈ అంశాల ఆధారంగా నివేదిక ‘యూఎన్ సస్టైన్‌బుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్’.. ఏటా సంతోష సూచీ నివేదిక రూపొందిస్తోంది. మార్చి మూడో వారంలో ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజా నివేదికను ఇటీవల విడుదల చేసింది. జీవితంలో ఎంత సంతృప్తిగా ఉన్నారు? అనే తొలి ప్రశ్నతో మొదలుపెట్టి, ప్రజల సంతృప్తస్థాయి, ఆరోగ్యకర జీవనం, విద్య, వైద్య రంగాల్లో నాణ్యత, భద్రత, తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, అతి తక్కువ అవినీతి, సమాజంలో ఔదార్యం.. వంటి ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన జవాబుల ఆధారంగా సూచీని రూపొందించారు. నివేదికపై భిన్నాభిప్రాయాలు భారతీయ సమాజంలో సంక్లిష్టతను పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోలేవని, ఒకే రకమైన కొలమానంతో మన దేశ ప్రజల సంతోషాన్ని కొలవడంలో అర్థం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబంతో కలిసి సంవత్సరానికి ఎన్నిసార్లు భోజనం చేశారు? అనే ప్రశ్న అడిగితే పాశ్చాత్య దేశాలు సంతోష సూచీల్లో వెనుకబడి ఉంటాయని ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (ది కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్) ప్రశ్నించడం గమనార్హం. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన అభిప్రాయంతో కొందరు ఏకీభవిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం చేస్తున్నా ఆనందంగానే.. కాగా ఏడాదికిపైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింది. అయినా సరే సంతోష సూచీలో మెరుగైన స్థానంలోనే ఉంది. గతేడాది 98వ స్థానంలో ఉన్న ఉక్రెయిన్ తాజా నివేదికలో 92కు చేరింది. దేశం కోసం స్వచ్ఛంద సేవ చేయడం, వివిధ రూపాల్లో రోజూ కరుణ చూపడం, తోటి ప్రజలకు సహాయం అందించడం, ఉన్నంతలో పొరుగువారికి పంచడం, ఒకరికోసం ఒకరు నిలబడటం, యుద్ధంలో గాయపడిన వారికి సేవలు చేయడం.. ఇవన్నీ ప్రజల్లో సంతృప్తస్థాయిని పెంచాయని సంతోష సూచీ రూపకర్తల్లో ఒకరైన లారా అక్నిన్ నివేదికలో పేర్కొనడం గమనార్హం. గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడ్డ భారత్ ర్యాంక్ కాగా గతేడాది నివేదికలో మన దేశానికి 136వ స్థానం దక్కగా ఈ సంవత్సరం కాస్త మెరుగుపడి 126వ స్థానానికి చేరింది. సంతోషకర దేశాల జాబితాలో మన దాయాది పాకిస్తాన్ 108, ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైన శ్రీలంక 112, బంగ్లాదేశ్ 118 స్థానాల్లో నిలిచాయి. నేపాల్ 78వ స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ) గణాంకాలను రూపొందిస్తుండగా.. గ్రాస్ నేషనల్ ఇండెక్స్ రూపొందిస్తున్న భూటాన్‌ను ప్రపంచ సంతోష సూచీలో పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం అదే..వరుసగా ఆరోసారి టాప్
ఫిన్లాండ్ ప్రంపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా వరుసగా ఆరోసారి ఈ ఘనత సొంతం చేసుకుంది. అత్యంత సంతోషంగా ఉండే దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్స్ ప్రచురిస్తుంది. దీన్ని150కి పైగా దేశాలలో ప్రజల నుంచి వచ్చిన ప్రపంచ సర్వే ఆధారంగా రూపొందిస్తుంది. మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి వార్షిక హ్యాపినెస్ సూచీ ప్రకారం..డెన్మార్క్ అత్యంత సంతోషకరమైన దేశంగా రెండో స్థానంలో ఉండగా, ఐస్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ నివేదికలో నేపాల్, చైనా, శ్రీలంకల కంటే దిగువున 126వ స్థానంలో ఉంది. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా హ్యాపినెస్ నివేదికలో వాటి ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. రష్యా 72వ స్థానంలో ఉండగా, ఉక్రెయిన్ 92వ స్థానంలో ఉంది. కాగా, ఒక దేశ హ్యాపినెస్‌ని దాని తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి తదితరాల ఆధారంగా కొలిచి హ్యాపినెస్ సూచీలో స్థానం కల్పిస్తారు. ఐతే అనుహ్యంగా 2021లో ఇతరుల పట్ల దయ చూపడం, ముఖ్యంగా అపరిచితుల సహాయం చేయడం వంటివి పెరిగాయి. ఇది 2022లో మరింత ఎక్కువ పెరిగినట్లు యూఎన్ సస్టైనబుల్ సొల్యూషన్స్ నెట్వర్క్ పేర్కొంది. (చదవండి: కొడుకు కళ్లఎదుటే కన్న తల్లిపై కుక్కల దాడి..సాయం కోసం వెళ్లేలోపే..) -
ఆప్ Vs గవర్నర్ల మధ్య చిచ్చురేపిన టీచర్ల ఫిన్లాండ్ పర్యటన!
ఆప్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య మళ్లీ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దాదాపు 30 మంది ప్రైమరీ టీచర్లను ఫిన్లాండ్కి శిక్షణ నిమిత్తం పంపాలన్న ప్రణాళిక నేపథ్యంలో ఇరువురు మధ్య మాటల ఘటర్షణకు దారితీసింది. ఐతే లెఫ్టినెంట్ గర్నర్ టీచర్ల పర్యటనను రద్దు చేసేలా ప్రశ్నలు సంధించారంటూ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు సిసోడియా ట్విట్టర్లో..."ప్రైమరీ టీచర్ల శిక్షణ కోసం విదేశాలకు పంపించే తొలి ప్రభుత్వం ఇది. గవర్నర్ దేశంలోనే టీచర్లకు శిక్షణ ఎందుకు ఇవ్వకూడదంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా పిల్లల భవిష్యత్తుకు ఖరీదు కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ..దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలకు వెళ్లే మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..కుటుంబాలతో సహా వెళ్లే మంత్రుల గురించి ప్రశ్నించారు. అప్పుడూ ఖర్చు, ప్రయోజనాల గురించి ఆలోచించారా! అని నిలదీశారు. పిల్లల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యంగ విరుద్ధంగా భావిస్తున్నారు. మీకు ముకుళిత హస్తలతో జోడించి మరీ చెబుతున్న ఢిల్లీ విద్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకునే కుట్రలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీకి సాయం చేయొద్దు" అని ట్విటర్లో విజ్ఞప్తి చేశారు సిసోడియా. ఐతే లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఇది సరికాదని తాము ఫిన్లాండ్లో ప్రైమరీ టీచర్లకు శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ప్రతిపాదనను తిరస్కరించలేదని గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ...ఆప్ తన అహం కోసం ఏదిపడితే అది చేయడం మానుకోవాలి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆ వివరాలు అడిగే హక్కు ఆయనకు ఉంది. అయినా ఖర్చుల వివరాల గురించి వివరణ ఇవ్వడంలో సమస్య ఏమిటి ?. ఉపాధ్యాయుల గురించి ఇంత ఆందోళన చెందుతున్నప్పుడూ..ఇంకా నలుగురు ఉపాధ్యాయులకు ఎందుకు జీతాలను చెల్లించలేకపోయారు అని బీజేపీ పార్టీ నాయకుడు హరీష్ ఖురానా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రభత్వ సందేశాలుగా ఇచ్చే రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేసిన సుమారు రూ. 163.62 కోట్లను దాదాపు 10 రోజుల్లో చెల్లించాలని ఆప్‌ని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో ఢిల్లీలోని దాని కార్యాలయం, ఇతర ఆస్తులను సీలు చేస్తామని గవర్నర్ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది కూడా. (చదవండి: పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్! మేడమ్ అని పిలవకూడదు! విద్యాశాఖకు కీలక ఆదేశాలు) -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా, బతుకుమ్మ పండుగలని ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిన్లాండ్లోని అన్ని ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది హాజరయ్యారు. చిన్నారులు, పెద్దలు తమ ఆట పాటలతో, నృత్య ప్రదర్శనలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మన తెలుగు వాళ్లతో పాటు, ఫిన్లాండ్లోని ప్రజలు కూడ పాల్గొనడం గమనార్హం. గతంలో ఫిన్లాండ్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తక్కువ మంది వరకు హాజరయ్యేవారని, కాని ఈ సారి నాలుగు వందలకి పైన హాజరుకావడం ఆనందకర విషయమన్నారు. తెలుగు వారు ఫిన్లాండ్కు అధికంగా వస్తున్నారనడానికి ఈ సంఖ్య నిదర్శనమని ఫిన్లాండ్ తెలుగు సంఘం సంస్థ కార్యవర్గం రఘునాథ్ పార్లపల్లి, సుబ్రమణ్య మూర్తి, జ్యోతి స్వరూప్ అనుమాలశెట్టి, సత్యనారాయణ కంచర్ల తెలిపారు. ఇంత మందితో కలిసి పండుగ చేసుకోవడం చూస్తుంటే.. మన ఊరిలో, మన ఇంటిలో ఉన్నట్లే అనిపించిందన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవల్లి అడబాల, రోజా రమణి మొలుపోజు, వినయ్ శింగపురం, స్పందన ఈచూరి, శ్రుతి కొత్రిక్, వాసు దాసరి, వెంకట్ వారణాసి చెప్పారు. -
డ్రగ్స్ టెస్ట్.. ఫిన్లాండ్ ప్రధానికి భారీ ఊరట
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్(36)కు భారీ ఊరట కలిగింది. స్నేహితులతో పార్టీ చేసుకున్న ఆమె.. డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తన నిజాయితీ నిరూపించుకునేందుకు ఆమె డ్రగ్స్ టెస్ట్‌లకు సిద్ధమయ్యారు. ఆగస్టు 19న ఆమె నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించారు అధికారులు. అయితే డ్రగ్స్ టెస్టుల్లో ఆమె ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని తేలిందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మద్యం మాత్రం సేవించినట్లు స్వయంగా మారిన్ ఇదివరకే వెల్లడించడం తెలిసిందే. Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today. She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling. The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw — Visegrád 24 (@visegrad24) August 17, 2022 ఇదిలా ఉంటే.. స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకున్న ఆమె వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారనే అనుమానాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులకు ముందుకు రావాలని ఆమెను డిమాండ్ చేశాయి. 2019లో 34 ఏళ్ల వయసులో సన్నా మారిన్ ఫిన్లాండ్కు ప్రధానిగా ఎన్నికయ్యారు. గతంలోనూ అధికారిక భవనంలో పార్టీలు చేసుకుని ఆమె విమర్శలపాలయ్యారు కూడా. ఇదీ చదవండి: ఎట్టకేలకు.. శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక -
పార్టీ చేసుకున్న ప్రధాని... స్టెప్పులతో హల్చల్: వీడియో వైరల్
ఫిన్లాండ్ ప్రధాని వీడియో పెద్ద వివాదస్పదంగా మారింది. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ కొందరూ నాయకులు, సినీ ప్రముఖులతో కలిసి పార్టీ చేసుకుంది. ఈ వీడియో లీక్ అవ్వడంతో... నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ పార్టీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు ఇల్మారి నూర్మినెన్, ప్రముఖ గాయకులు, ప్రముఖ యూట్యూబర్, టీవీ యాంకర్లు తదితరులు ఉన్నారు. ఆ వీడియోలో ఫిన్లాండ్ ప్రధాని డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. ఐతే ఈ పార్టీ ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కానీ నెటిజన్ల ఈ వీడియోను చూసి విభిన్నంగా స్పందించారు. కొందరూ ప్రధానమంత్రికి కూడా పార్టీలు సర్వసాధారణమైనని అంటూ మారిన్‌కి మద్దతు ఇవ్వగా .... మరికొందరూ ప్రధాని హోదాలో ఇవేమి పనులు అంటూ మండిపడుతున్నారు.. Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today. She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling. The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw — Visegrád 24 (@visegrad24) August 17, 2022 (చదవండి: విదేశాంగ మంత్రి కొడుకుతో యూఎస్ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే....) -
అక్కడ కాస్త ఎండపొడ కనిపించినా చాలు.. పిల్లల్ని తీసుకెళ్లి...
అలవాటు.. ఆచారం.. వ్యవహారం.. ఏదైనా సరే పాటిస్తున్నవారికి సర్వసాధారణమనిపిస్తుంది. ఆ పట్టింపులు.. పాటింపుల్లేని వారికి మాత్రం వింతగా కనిపిస్తుంది. కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. కాలక్షేపాన్నిస్తుంది. అలాంటి సంగతులు కొన్ని.. ఎండల్లో పడక ఫిన్లాండ్లో ఏ కాస్త ఎండపొడ కనిపించినా చాలు.. గబగబా చంటి పిల్లలను స్ట్రాలర్స్లో వేసి తీసుకెళ్లి ఇంటి ముందు వాకిళ్లలో, వాకిళ్లు లేని వాళ్లు పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉంచేసి వాళ్లు ఇళ్లకు వెళ్లిపోతారు. అలా వెచ్చటి ఎండకు ఆ పిల్లలు గంటలు గంటలు ఆదమరచి నిద్రపోతారు. ఇదో ఆచారంగా కొనసాగుతోందట ఆ దేశంలో. కొందరు మోడర్న్ తల్లులు ఇప్పుడు పిల్లలను అలా ఆరుబయట వదిలిపెడుతున్నప్పుడు వాళ్లను చూసుకోవడానికి ఆయాలను పెడుతున్నారట కానీ ఇదివరకైతే పిల్లల దగ్గర ఎవరూ ఉండేవారు కాదట మరి. అలా వదిలేయడమే ఆచారమట. మనసు పవిత్రమవుతుందని.. .. ఎక్కడ? స్పెయిన్‌లో. ఏం చేస్తే? చంటి పిల్లల మీద నుంచి దూకితే.. చంటి పిల్లల ఆత్మ పరిశుద్ధమవుతుందట. ఎవరు దూకుతారు? అలా దూకడానికి ప్రత్యేక వ్యక్తులు ఉంటారట. వాళ్లు పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న దుస్తులను వేసుకుని ఆరుబయట పడుకోబెట్టిన పిల్లల మీద నుంచి లాంగ్ జంప్ చేస్తారు. అలా చేయడం వల్ల పిల్లలను పట్టుకున్న దుష్టశక్తులు వదిలిపోతాయని.. పిల్లలు పవిత్రమైపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని అక్కడి జనాల నమ్మకమట. చదవండి: Aaron Sanderson King Of Piel Island: రాజయోగం.. ఎలక్ట్రీషియన్ వృత్తి నుంచి ఓ దీవికి రాజుగా..! -
లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135!
న్యూఢిల్లీ: లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను బుధవారం చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్‌లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది. చదవండి: లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే! -
World Masters Athletics: 94 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్
ఫిన్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్-2022లో భారత అథ్లెట్ భగవానీ దేవీ సంచలనం సృష్టించింది. 94 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించి ఔరా అనిపించింది. 35 ఏళ్లు పైబడిన వారు పోటీ పడిన ఈ రేసును భగవానీ దేవీ 24.74 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించింది. India's 94-year-old #BhagwaniDevi Ji has yet again proved that age is no bar! She won a GOLD medal at the #WorldMastersAthleticsChampionships in Tampere in the 100m sprint event with a timing of 24.74 seconds.🥇She also bagged a BRONZE in Shot put. Truly commendable effort!👏 pic.twitter.com/Qa1tI4a8zS — Dept of Sports MYAS (@IndiaSports) July 11, 2022 లేటు వయసులో సాధించిన ఘనతకు గాను భగవానీ దేవీకి విశ్వం నలుమూలల నుంచి నీరాజనాలు అందుతున్నాయి. ఏదైనా సాధించేందుకు వయసుతో సంబంధం లేదని భగవానీ దేవీ మరోసారి నిరూపించిందని అభినందనలు అందుతున్నాయి. భగవానీ దేవీ సాధించిన ఘనతను కొనియాడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. నెటిజన్లు భగవానీ దేవీని ఆకాశానికెత్తుతున్నారు. సోషల్‌మీడియాలో భగవానీ దేవీ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. చదవండి: ప్రపంచకప్ బరిలో నుంచి టీమిండియా ఔట్ -
ఫిన్లాండ్, స్వీడన్లకు రూట్ క్లియర్... కూటమిలోకి ఆహ్వానం
Agreement that paves the way for Finland and Sweden to join NATO: ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మాడ్రిడ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అదీగాక టర్కీ తన అభ్యంతరాలను ఉపసంహరించుకునేలా ఒప్పందం కుదుర్చోకోవడంతో ఆయా దేశాలు నాటోలో చేరే మార్గం సుగమం అయ్యిందని నాటో చీఫ్ స్టోలెన్‌బర్గ్ చెప్పారు. ఈ మేరకు టర్కీ, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఆయుధాల ఎగుమతులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంతో సహా టర్కీ ఆందోళనలను పరిష్కరించే దిశగా మెమోరాండంపై సంతంకం చేశాయని చెప్పారు. తదనంతరం నాటో నాయకులు ఫిన్లాండ్, స్వీడన్ దేశాలను అధికారికంగా కూటమిలోకి చేరాలని ఆహ్వానిస్తారని స్టోలెన్‌బర్గ్ తెలిపారు. దీంతో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలకు నాటోలో చేరేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాని కూడా అన్నారు. -
భారత్ స్టార్ నీరజ్ చోప్రాకు తప్పిన పెను ప్రమాదం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపియన్ నీరజ్ చోప్రాకు పెను ప్రమాదం తప్పింది. ఫిన్లాండ్లో శనివారం జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్ చోప్రా ఈ గేమ్‌లో జావెలిన్ త్రోయింగ్ ప్రయత్నాల్లో రెండుసార్లు ఫౌల్ చేశాడు. ఈ క్రమంలోనే జావెలిన్ త్రో విసరగానే పట్టు తప్పిన నీరజ్ జారి కిందపడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ నీరజ్‌కు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. కిందపడిన నీరజ్ పైకిలేచి తాను బాగానే ఉన్నానంటూ చిరునవ్వుతో సంకేతాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకముందే భారీ వర్షం పడడంతో గ్రౌండ్ మొత్తం బురదమయమయింది. వర్షం ముగిసిన వెంటనే ఆటను ప్రారంభించారు. ఆటలో మొదటగా నీరజ్ చోప్రానే జావెలిన్ త్రో విసిరాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇది ఆయనకు రెండో పోటీ. ఇక్కడ నీరజ్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. నీరజ్ తర్వాత వాల్కాట్ 86.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. పీటర్స్ 84.75 ఉత్తమ ప్రయత్నంతో మూడో స్థానంలో నిలిచాడు. అదే విధంగా చోప్రాతో పాటు కుర్టానే ఒలింపిక్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న ప్రపంచ పారి జావెలిన్ ఛాంపియన్ సందీప్ చౌదరి కూడా పోటీలో పాల్గొని 60.35 మీటర్ల బెస్ట్ త్రోతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ పది నెలల తర్వాత ఇటీవల పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడు. ఈ గేమ్స్‌లో నీరజ్ ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. Nasty slip for Neeraj Chopra on a very slippery runway at the Kuortane Games. He seems ok though. pic.twitter.com/6Zm0nlojkZ — jonathan selvaraj (@jon_selvaraj) June 18, 2022 చదవండి: Neeraj Chopra: స్వర్ణం నెగ్గిన నీరజ్ చోప్రా Katherine Brunt: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై -
వారెవ్వా నీరజ్ చోప్రా.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత తిరిగి బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో తన పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు. ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 2021, ఆగస్టు 7న జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. తద్వారా అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా.. ఓవరాల్‌గా వ్యక్తిగతంగా ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. గతేడాది మార్చిలో పాటియాలాలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరాడు. చదవండి: బంగారు కొండ.. టైలర్ కలను నెరవేర్చిన కొడుకు Olympic Champion Neeraj Chopra settles for a Silver Medal with a New National Record Throw of 89.30m at the Paavo Nurmi Games in Finland.@afi We can see several performance hikes in various events this season. Hope for more further. @Adille1 @Media_SAI @SPORTINGINDIAtw pic.twitter.com/cBLg4Ke8nh — Athletics Federation of India (@afiindia) June 14, 2022 -
నాటోలో చేరిక.. ఫిన్లాండ్, స్వీడన్లకు షాక్..?
Turkey Blocking Sweden and Finland NATO Bids: ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిన్లాండ్, స్వీడన్.. నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. నాటో చేరువద్దంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో బుధవారం అందజేయనున్నాయి. ఇక, ఈ రెండు దేశాలకు నాటో సభ్యత్వం దక్కలంటే.. అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఉన్నా కొత్త దేశం నాటోలో చేరలేదు. అయితే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో చేరికపై అగ్రరాజ్యం అమెరికా సహా మరిన్ని దేశాలు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కానీ, టర్కీ మాత్రం అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డోగన్.. రష్యా దాడుల భయంతోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు ముందుకు వచ్చాయని సెటైరికల్‌గా ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి ఈ రెండు దేశాలు కుర్దీస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయని కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ తగిలింది. దీంతో టర్కీ అడ్డుపడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. నాటోలో చేరేందుకు సిద్ధమైన స్వీడన్, ఫిన్లాండ్ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ కానున్నారు. వైట్‌హౌస్ వేదికగా గురువారం స్వీడన్ ప్రధాని మాగ్డెలినా అండర్సన్,ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోలతో బైడెన్ సమావేశం కానున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరి మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: అమెరికాలో కరోనా కల్లోలం.. బైడెన్ కీలక నిర్ణయం -
మీరొస్తానంటే.. నేనొద్దంటా!
స్టాక్‌హోమ్: నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. టర్కీ అభ్యంతరాలు నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. టర్కీ వ్యాఖ్యల్లో ఇటీవలి కాలంలో మార్పు వచ్చిందని ఫిన్లాండ్ ప్రధాని నినిస్టో అన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. నాటోలో చేరాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఫిన్లాండ్ పార్లమెంట్ మంగళవారం 188–8 ఓట్లతో మద్దతు పలికింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సభ్యత్వ దరఖాస్తులను బ్రస్సెల్స్‌లోని నాటో కేంద్ర కార్యాలయంలో అందించారు. టర్కీ అభ్యంతరాల నేపథ్యంలో వీటి సభ్యత్వంపై నిర్ణయానికి సమయం పట్టవచ్చని అంచనా. టర్కీతో చర్చలకు బృందాన్ని పంపుతామన్న స్వీడన్ ప్రతిపాదనను కూడా ఎర్డోగన్ వ్యతిరేకించారు. టర్కీతో చర్చలకు ఎదురుచూస్తున్నామని, నాటో దేశాలతోనూ చర్చిస్తున్నామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా చెప్పారు. టర్కీ అభ్యంతరాలు అమెరికాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాటి సంబంధాలు ఇటీవల బాగా క్షీణించాయి. రష్యా నుంచి టర్కీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కొనడం అమెరికాకు నచ్చలేదు. చర్చలే చర్చలు నాటోలో చేరాలని నిర్ణయించిన స్వీడన్, ఫిన్లాండ్ ప్రధానులతో త్వరలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చర్చిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు టర్కీ విదేశాంగ మంత్రి కవుసోగ్లు అమెరికాకు పయనమ్యారు. ఈ రెండు దేశాలు ఏళ్లుగా తటస్థంగా ఉంటున్నాయి. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలుంటాయని వాటిని రష్యా పలుమార్లు హెచ్చరించింది. మంగళవారం ఇద్దరు ఫిన్లాండ్ దౌత్యాధికారులను రష్యా బహిష్కరించింది. చదవండి: (ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు) నార్డిక్ దేశాలు నాటోలో చేరడంపై టర్కీ అభ్యంతరాలు త్వరలో సమసిపోతాయని నాటో అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి చేరికను పలు యూరప్ దేశాలు స్వాగతించాయి. తమ దేశం కోరిన ఒక్క కుర్దిష్ నాయకుడిని కూడా నార్డిక్ తమకు దేశాలు అప్పగించలేదని టర్కీ ఆరోపించింది. నాటోలో కొత్తగా సభ్యత్వం పొందాలంటే ప్రస్తుతమున్న 30 సభ్యదేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాల్సిఉంది. స్టీల్ ప్లాంట్ ఫైటర్ల తరలింపు మారియుపోల్‌లో చిక్కుకున్న తమ సైనికులను రక్షించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. 264 మందిని తరలించామని తెలిపింది. మరోవైపు డోన్బాస్లో పలు నగరాలపై రష్యా బాంబింగ్ కొనసాగుతూనే ఉంది. సివియర్డొనెట్స్క్లో 10మంది మరణించారు. పశ్చిమాన లివివ్పైనా రష్యా దాడులు చేసింది. ఖార్కివ్‌లో మాత్రమే ఉక్రెయిన్ సేనలకు కొంత ఊరట లభించింది. నగరానికి సమీపంలోని రష్యా సరిహద్దు వద్దకు ఉక్రెయిన్ సేనలు చేరుకున్నాయి. ఇకపై డోన్బాస్ నగరాలపై రష్యా తీవ్రంగా విరుచుకుపడవచ్చని బ్రిటన్ ఇంగ్లండ్ హెచ్చరించింది. -
స్వీడన్ నాటో బాట
స్టాక్‌హోమ్: నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్ సోమవారం ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను తటస్థ వైఖరికి స్వీడన్ ముగింపు పలుకుతోంది. ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్డలీనా అభివర్ణించారు. నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమన్నారు. నాటోలో చేరికపై ఫిన్లాండ్తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయానికి స్వీడన్ పార్లమెంట్ రిక్స్డగెన్లో భారీ మద్దతు లభించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. రెండు దేశాల్లో కూడా నాటో చేరికపై ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వీడన్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. నాటోలో చేరినా తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో శాశ్వత బేస్‌లను అంగీకరించబోమని మగ్డలీనా చెప్పారు. డొనెట్స్క్పై దాడులు ఉధృతం తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్పై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. మారియుపోల్‌లోని స్టీల్ ప్లాంట్ చుట్టూ వైమానిక దాడులు కొనసాగాయి. పలు పట్టణాలలోని పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఖర్కివ్ చుట్టూ రష్యన్ దళాలు తమను నిరోధించే యత్నాల్లో ఉన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. అయితే సరిహద్దులో బెలరాస్ బలగాలున్నందున ఉక్రెయిన్ సేనలు ఉన్నచోటే ఉండి పోరాడడం మేలని బ్రిటీష్ సైన్యం సూచించింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఒక ఆస్పత్రిపై జరిపిన దాడిలో ఇద్దరు మరణించారని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యాలో వ్యాపారాల అమ్మకం పలు పాశ్చాత్య కంపెనీలు రష్యాలోని తమ వ్యాపారాలను తెగనమ్ముకుంటున్నాయి. రష్యాలో వ్యాపార విక్రయ ప్రక్రియను ఆరంభించామని మెక్‌డొనాల్డ్స్ తెలిపింది. సంస్థకు రష్యాలో 850 రెస్టారెంట్లున్నాయి. వాటిలో 62 వేల మంది పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సంస్థ లాభాలపై ప్రభావం పడే అవకాశముందని తెలిపింది. ఇదే బాటలో కార్ల తయారీ సంస్థ రెనో సైతం రష్యాలో తమ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థకు స్థానిక అవటోవాజ్ కంపెనీలో ఉన్న 67.69 శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇదే కోవలో పలు పాశ్చాత్య కంపెనీలు పయనించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. (చదవండి: పుతిన్ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?) -
ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ
నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్) ఆపరేటర్ ఒకరు ధృవీకరించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో చేరేందుకు ఫిన్లాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆలస్యం చేయకుండా తమకు సభ్యత్వం ఇవ్వాలంటూ నాటోకు విజ్ఞప్తి చేసింది ఫిన్లాండ్. ఈ పరిణామం రష్యాకు మంట పుట్టించింది. దీన్నొక ‘బెదిరింపు’ చర్యగా అభివర్ణిస్తూనే.. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా. ఈ మేరకు మే 14 నుంచి(శనివారం) విద్యుత్ సరఫరాను ఫిన్లాండ్కు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రష్యా విద్యుత్ సరఫరాదారు కంపెనీ రావో నోర్డిక్ మాత్రం చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంతోనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చెల్లింపుల వ్యవహారంపై స్పష్టత ఏంటన్నది ఇటు రావో నోర్డిక్ కంపెనీగానీ, అటు ఫిన్గ్రిడ్ మాత్రం వెల్లడించలేదు. ఫరక్ పడదు ఇరవై ఏళ్ల ఇరు దేశాల వర్తక వాణిజ్యంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే.. విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఫిన్లాండ్ స్పందించింది. రష్యా విద్యుత్ సరఫరా నిలిపివేసినంత మాత్రాన ఫరక్ పడదని ప్రకటించుకుంది. సరఫరా చేసుకునేది కొద్ది శాతమే కాబట్టి ఇబ్బంది ఏం ఉండబోదని ఫిన్నిష్ గ్రిడ్ ఆపరేటర్ ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఫిన్లాండ్కు సరఫరా అయ్యేది పది శాతం విద్యుత్ మాత్రమే. ఆ లోటును స్వీడన్ నుంచి దిగుమతి చేయడమో లేదంటే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమో చేస్తామని ఫిన్లాండ్ ప్రకటించుకుంది. కానీ, రష్యా విద్యుత్ చౌకదనంతో పోలిస్తే.. ఫిన్లాండ్ భరించాల్సిన ఖర్చు ఎక్కువే కానుంది. ఇదిలా ఉంటే.. రష్యా ఫిన్లాండ్తో 1,300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. నాటోలో చేరాలని ఫిన్లాండ్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కేవలం రష్యా బెదిరింపుల మేరకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యం, ప్రజా ఒత్తిడి నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. చదవండి👉🏼: ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కీలక నిర్ణయం -
నాటో దిశగా ఫిన్లాండ్ అడుగులు
కీవ్: నాటో సభ్యత్వం కోసం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు ఫిన్లాండ్ నాయకులు చెప్పారు. దీంతో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇకపై రష్యా వ్యతిరేక కూటమిలో చేరబోతున్నట్లవుతోంది. నాటోలో చేరడం ఫిన్లాండ్ రక్షణను బలోపేతం చేస్తుందని, అదేవిధంగా నాటో కూటమి దేశాలకు బలాన్నిస్తుందని ఆదేశ అధ్యక్షుడు సౌలి నినిస్టో, ప్రధాని సన్నా మరిన్ చెప్పారు. నాటోలో వెంటనే చేరాలని, ఇందుకు అవసరమైన చర్యలను రాబోయే రోజుల్లో చేపడతామని తెలిపారు. ఫిన్లాండ్ ప్రకటనపై రష్యా హెచ్చరిక స్వరంతో స్పందించింది. ఆ దేశం నాటోలో చేరితే రష్యాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని, ఉత్తర యూరప్‌లో స్థిరత్వం నాశనమవుతుందని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. తమ భద్రతకు ముప్పు తెచ్చే చర్యలకు తాము తగిన మిలటరీ చర్యలతో స్పందిస్తామన్నారు. రష్యాతో ఫిన్లాండ్ ఎందుకు ఘర్షణ కోరుతుందో, ఎందుకు స్వతంత్రాన్ని వద్దనుకొని వేరే కూటమిలో చేరుతుందో భవిష్యత్ చరిత్ర నిర్ధారిస్తుందన్నారు. నాటో పొరుగుదేశం స్వీడన్ సైతం త్వరలో నాటోలో చేరడంపై నిర్ణయం తీసుకోనుంది. నాటోలో చేరికకు ఈ దేశాలు దరఖాస్తు చేసుకుంటే వాటిని నాటో దేశాల పార్లమెంట్లు ఆమోదించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాటోలో చేరాలన్న ఫిన్లాడ్ నిర్ణయాన్ని నాటో సభ్యదేశాలు స్వాగతించాయి. మీ వల్లనే...: నాటోలో చేరాలని తాము భావించేందుకు రష్యానే కారణమని ఫిన్లాండ్ నాయకులు ఆరోపించారు. తమకు హెచ్చరికలు చేసేముందు రష్యా అద్దంలో చూసుకోవాలన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పరోక్షంగా చెప్పారు. ఉక్రెయిన్‌కు మద్దతుపై ఇటీవలే ఫిన్లాండ్ నేతలు జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై దాడి వల్లనే ఇంతకాలం తటస్థంగా ఉన్న స్వీడన్, ఫిన్లాండ్ నాటోవైపు మొగ్గు చూపాయి. ఆదేశాల్లో ప్రజానీకం కూడా నాటోలో చేరడంపై సుముఖంగా స్పందించింది. రష్యా దాడి మొత్తం యూరప్ భద్రతను సంశయంలో పడేసిందని ఈ దేశాలు ఆరోపించాయి. ఈ దేశాలు నాటోలో చేరితే తమకు మరింత బలం చేకూరుతుందని నాటో అధిపతి జనరల్ స్టోల్టెన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. దరఖాస్తు చేసిన రెండువారాల్లో వీటి అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని నాటో అధికారులు చెప్పారు. దాడులే దాడులు..: ఒకపక్క అనుకున్న విజయం దక్కకపోవడం, మరోపక్క తటస్థ దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరాలనుకోవడం.. రష్యాకు అసహనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తూర్పుప్రాంతంపై రష్యా తన దాడులు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో మారియుపోల్‌లో మిగిలిన ఉక్రెయిన్ సేనలను తుడిచిపెట్టేందుకు వాయుదాడులు కూడా జరిపింది. ఇది కూడా చదవండి: ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం -
Russia War: మరో రెండు దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఓడరేవు నరగం మరియుపోల్‌పై రష్యా దాడుల కారణంగా వేల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. మారియుపోల్ నుండి ఉక్రెయిన్ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి రష్యా ఒప్పుకున్నట్టు ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్చుక్ టెలిగ్రామ్‌లో స్పష్టం చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం మానవతా కారిడార్‌పై రష్యాతో ప్రాథమిక ఒప్పందాన్ని పొందినట్టు ఆమె వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మరియుపోల్ నుంచి ఉక్రెయిన్ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించనున్నట్టు ఇరినా తెలిపారు. కాగా, ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుండి మానవతా కారిడార్ల ద్వారా సుమారు 3,00,000 మంది ఉక్రెయిన్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. #Ukrainian Deputy Prime Minister Iryna #Vereshchuk announced that a preliminary agreement on the organization of a humanitarian corridor for the residents of #Mariupol had been reached. pic.twitter.com/WTa57olA3O — NEXTA (@nexta_tv) April 20, 2022 మరోవైపు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికల పర్వం కొనసాగుతూనే ఉంది. నాటోలో చేరడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఫిన్లాండ్, స్వీడన్లను తాజాగా రష్యా హెచ్చరించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రకటించారు. ఇక, యుద్దం వేళ పుతిన్, జెలెన్ స్కీ మధ్య జెరూసలెంలో శాంతి చర్చల సమావేశాన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ ఓ ప్రకటనలో తెలిపింది. ‼️#Russia warned #Finland and #Sweden about the consequences of joining #NATO. This was declared by spokeswoman of the Ministry of Foreign Affairs Maria #Zakharova. pic.twitter.com/zt6RqQ7i3T — NEXTA (@nexta_tv) April 20, 2022 ఇదిలా ఉండగా.. బుధవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన 1053 సైనిక కేంద్రాలను తమ దళాలు అటాక్ చేసినట్టు పేర్కొన్నది. ఉక్రెయిన్‌కు చెందిన 73 మిలిటరీ సంస్థలపై తమ దళాలు ఫైరింగ్ చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన 106 ఆర్టిల్లరీ ఫైరింగ్ పొజిషన్స్‌తో పాటు ఆరు పైలెట్ రహిత విమానాలను కూల్చినట్లు వెల్లడించింది. హై ప్రిషిషన్ మిస్సైల్ దాడి వల్ల 40 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు రష్యా తెలిపింది. ఇది చదవండి: బుధవారం రికార్డు స్థాయిలో ఎండలు.. ఆందోళనలో భారత సైంటిస్టులు -
Russia Warns: ఆ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
మాస్కో: నాటో కూటమిలో చేరాలని స్వీడన్, ఫిన్లాండ్ నిర్ణయించుకుంటే తమ అణ్వాయుధాలను స్కాండినేవియన్ దేశాలకు సమీపంగా మోహరించాల్సిఉంటుందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెద్వదేవ్ హెచ్చరించారు. ఈ దేశాలు నాటోలో చేరితే రష్యాకు నాటో సభ్యదేశాలతో ఉన్న సరిహద్దు రెట్టింపవుతుందని, అలాంటప్పుడు తాము సరిహద్దు భద్రతను పెంచుకోవాల్సిఉంటుందని టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ దేశాలు నాటో కూటమిలో చేరితే బాల్టిక్ పరిధిలో నాన్ న్యూక్లియర్ స్థితి ఉండదనానరు. గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్లోకి యుద్ధ నౌకలు కూడా పంపాల్సివస్తుందన్నారు. డిమిట్రీ వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రతినిధి పెస్కోవ్ సమర్ధించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం ఎలాంటి మిలటరీ కూటమిలో చేరకూడదన్న స్కాండినేవియన్ దేశాల ధృక్పథంలో మార్పు వస్తోంది. నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేయడంపై చర్చిస్తామని ఫిన్లాండ్, స్వీడన్ తెలిపాయి. మరోవైపు జపాన్ సముద్రంలో రష్యా మిసైల్పరీక్షలు నిర్వహించడాన్ని గమనిస్తున్నామని జపాన్ తెలిపింది. సీ ఆఫ్ జపాన్‌లో అమెరికా, జపాన్ సంయుక్త విన్యాసాలు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజు రష్యా జలాంతర్గాముల ద్వారా మిసైల్ పరీక్షలు నిర్వహించింది. చదవండి: (రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం) అమెరికాపై ఒత్తిడి రష్యాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉక్రెయిన్‌కు మరింత అందజేయాలని అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. రష్యాపై యూఎస్ సేకరించిన సమాచారం ఒక్కోమారు ఉక్రెయిన్‌కు అందజేస్తుండగా, కొన్నిమార్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. రష్యాతో అణుయుద్ధ ప్రమాదం పెరగకుండా ఉండేలా, ఇంటిలిజెన్స్ సోర్సులను రక్షించేలా సమాచారం అందించాల్సిఉంటుందని యూఎస్ వర్గాలు తెలిపాయి. గతంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేటప్పుడు అమెరికాకు ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. గతంలో పోగొట్టుకున్న భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే యత్నం చేస్తుందన్న అనుమానం వచ్చినప్పుడు సమాచారాన్ని పరిమితం చేస్తున్నారు. -
ఫిన్లాండ్.. అంత సంతోషంగా ఎలా ఉంటుందో తెలుసా?
ఫిన్లాండ్.. మరోసారి హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలిచింది. వరుసగా ఐదవ ఏడాది ఈ ఘనత సొంతం చేసుకుంది ఈ యూరోపియన్ కంట్రీ. ఐక్యరాజ్య సమితి వార్షిక సూచీ వివరాల ప్రకారం.. ఈ భూమ్మీద ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. వరుసగా ఐదో ఏడాది World's Happiest Nation సూచీలో తొలిస్థానం సంపాదించుకుంది. సెర్బియా, బల్గేరియా, రొమేనియా సైతం ఈ లిస్ట్‌లో పుంజుకుని ముందుకు ఎగబాకాయి. ► ఇక ఈ సూచీలో ఘోరంగా పతనం అయ్యింది లెబనాన్, వెనిజులా, అఫ్గనిస్థాన్ దేశాలు. లెబనాన్.. ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలో చివరి నుంచి రెండో ప్లేస్‌లో నిలిచింది. ► ఇక చివరిస్థానంలో ఉంది అఫ్గనిస్థాన్. గత ఆగష్టులో తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక మానవ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ► వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్.. 2022లో వరుసగా పదవ ఏడాది రిలీజ్ అయ్యింది. ఆర్థిక, సోషల్ డేటా, ప్రజల ఆనందం యొక్క స్వంత అంచనా ఆధారంగా ఈ సూచీలో స్థానం కల్పిస్తారు. సూచీ స్కేల్ సున్నా నుంచి పది మధ్యగా ఉంటుంది. సగటున మూడేళ్ల కాలానికి గణిస్తారు. ఇదిలా ఉంటే.. తాజా నివేదిక ఉక్రెయిన్-రష్యా యుద్దం కంటే ముందుగానే రూపొందించారు. ► ఉత్తర యూరప్ దేశాల డామినేషన్ ఈ సూచీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ స్విట్జార్లాండ్, ఐస్‌ల్యాండ్, నెదర్లాండ్స్(హాల్యాండ్), నార్వే, స్వీడన్ ఉన్నాయి. ప్రత్యేక గౌరవం భూటాన్‌కు దక్కింది. భారత్ 136వ స్థానంలో నిలిచింది. ► ఫిన్లాండ్ జనాభా.. దాదాపు 5.5 మిలియన్. ఇక్కడి ప్రజల లైఫ్‌స్టయిల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజలు సంతోషం వచ్చినా.. దుఖం వచ్చినా గోల చేయరు. ఒక డిగ్నిటీతో సాగిపోతుంటుంది వాళ్ల లైఫ్. ► ముఖ్యంగా కరోనా టైంలో ఫిన్లాండ్ ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది. బహిరంగ వేడుకలను పరిమితంగా చేసుకోవాలన్న ప్రభుత్వ పిలుపును తూచా తప్పకుండా పాటించి క్రమశిక్షణలో తమకు తామే సాటని ప్రపంచానికి చాటి చెప్పారు. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ► విస్తారమైన అడవులు, సరస్సుల దేశం అది. బాగా పనిచేసే ప్రజా సేవలు, అధికారంపై విస్తృత విశ్వాసం ఉంటుంది అక్కడి ప్రజలకు. అలాగే నేరాలు తక్కువ. పైగా అసమానతలకు తావు ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తుంటారు అక్కడి ప్రజలు. ► నాణ్యత విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం, స్వచ్ఛమైన స్వభావం, అధిక వ్యక్తిగత స్వేచ్ఛ, బాగా పనిచేసే సమాజం.. Finland ప్రజల సంతోషానికి కారణాలు. ► కరోనా టైంలో ప్రపంచంలో చాలా దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిపోయాయి. ప్రజలు మానసికంగా కుంగిపోయారు. అయితే ఫిన్లాండ్లో మాత్రం కరోనా ప్రభావం.. వాళ్ల సంతోషాన్ని దూరం చేయలేకపోయింది. -
జియో సంచలన నిర్ణయం.. ఏకంగా 6జీపై ఫోకస్!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో కు చెందిన జియో ఈస్తోనియా, ఫిన్‌ల్యాండ్ యూనివర్సిటీ ఓలు 6జీ టెక్నాలజీ వి షయంలో సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో తమ 5జీ సామర్థ్యాలు మరింత పెరగడంతోపాటు, 6జీకి సంబంధించి వినియోగ అవకాశాల అన్వేషణకు వీలు కలుగుతుందని జియో ప్రకటన విడుదల చేసింది. ‘ప్రపంచంలో తొలి 6జీ పరిశోధన కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఓలు యూనివర్సిటీ.. 6జీకి సంబంధించి వైర్లెస్ కమ్యూనికేషన్‌పై దృష్టి సారించింది. జియో ఈస్తోనియా, రిలయన్స్ గ్రూపుతో కలసి పరిశోధనకు ఆసక్తిగా ఉన్నాం’ అని ఓలు యనివర్సిటీ 6జీ ఫ్లాగ్షిప్ ప్రొఫెసర్ మట్టి లాత్వ పేర్కొన్నారు. చదవండి: స్టార్ లింక్‌కు షాక్.. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక అడుగు..! -
30 కేజీల డైనమెట్తో బ్లాస్ట్.. కారు ఆనవాలు లేకుండా పాయే!
Tesla Car Exploding Broken Down Video: టెస్లా.. ప్రపంచంలోనే ఆటోమొబైల్ దిగ్గజంగా పేరున్న అమెరికన్ కంపెనీ. ముఖ్యంగా ఈవీ సెక్టార్ ఆవిష్కరణలతో, కొత్త సాంకేతికతను ప్రొత్సహిస్తూ ఆటో సెక్టార్లో సంచలనాలకు నెలవైంది. అలాంటి కంపెనీ ఆసియాలో అతిపెద్ద మార్కెట్ చైనాలో అడుగుపెట్టగా.. ఇప్పుడు భారత్‌పై కన్నేసింది. అయితే ఈ కంపెనీ కార్లు రకరకాల సమస్యలతో వార్తల్లోకి కూడా ఎక్కుతుంటాయి. ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లా వాహనాలకు ఎంత మంచి ఫీడ్ బ్యాక్ ఉంటుందో.. ఒక్కోసారి అంతే వరెస్ట్ ఫీడ్‌బ్యాక్ కూడా వాహనదారుల నుంచి వస్తుంటుంది. తాజాగా ఓ టెస్లా వాహనదారుడు ఒకరు ఏకంగా టెస్లా కారును పేల్చేశాడు. అదీ 30 కేజీల డైనమైట్ సాయంతో. అందుకు కారణం దానిని రిపేర్ చేయించుకునే స్తోమత అతనికి లేకపోవడమే!. ఫిన్లాండ్ దక్షిణ ప్రాంతానికి చెందిన కైమెన్లాక్సో రీజియన్‌లో జాలా అనే చిన్న ఊరు ఉంది. మంచుతో కప్పబడిన ఈ ప్రాంతంలో తాజా ఘటన చోటు చేసుకుంది. టెస్లా మోడల్ ఎస్(2013)కు ఓనర్ టువోమాస్ కటాయినెన్. 1500 కి.మీ. తిరిగిన తర్వాత కారు కోడ్‌లో ఎర్రర్లు రావడం మొదలైంది. దీంతో సర్వీస్ స్టేషన్‌కు తరలించగా.. రిపేర్ తమ వల్ల కాదని, మొత్తం బ్యాటరీ సెల్‌ను మార్చేయాలని సూచించారు. అందుకు 20 వేల యూరోలు(మన కరెన్సీలో 17 లక్షలపైనే) ఖర్చు అవుతుందని చెప్పారట. దీంతో కారును బాగు చేయంచడం కంటే.. నాశనం చేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు టువోమాస్. ఊరికి దూరంగా మంచుకోండల్లోకి తీసుకెళ్లి.. కారును పేల్చేసే ప్లాన్ చేశాడు. ఇందుకు స్థానిక ప్రభుత్వ సిబ్బందితో పాటు యూట్యూబ్ ఛానెల్ పొమ్మిజట్కట్(Pommijatkat) సాయం చేసింది. డైనమైట్లను అమరుస్తున్న టైంలో ఇంతలో పైన ఓ హెలికాఫ్టర్ వచ్చింది. దాని నుంచి ఓ దిష్టిబొమ్మను కిందకు దించారు. అది టెస్లా సీఈవో ఎలన్ మస్క్ దిష్టిబొమ్మ. ఆ బొమ్మను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి, సిబ్బంది అంతా దూరంగా పరిగెత్తి.. బంకర్లో దాక్కున్నారు. కాసేపటికే ఆ కారు భారీ విస్పోటనంతో పేలి ముక్కలైపోగా.. ఆనవాలు లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను రకరకాల యాంగిల్స్‌లో, ఎఫెక్ట్స్‌తో యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ బ్లాస్ట్‌తో అక్కడున్నవాళ్లంతా తెగ ఎంజాయ్ చేశారు. బహుశా ప్రపంచంలో టెస్లా కారును ఇలా ముక్కలు చేసిన తొలి ఘనత టువోమాస్కే చెందుతుందేమో!. దీనికి మస్క్ స్పందిస్తాడా? లేదా? అనేది చూడాలి. హెచ్చరికేనా?.. ఈ మధ్యకాలంలో టెస్లా కారులు తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. దీనికి తోడు సాంకేతిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఘటనలో ఏకంగా ఎలన్ మస్క్ దిష్టిబొమ్మను పెట్టిన పరిణామం.. వాహన దారుడిలో ఎంత మంట పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోపై ఎలన్ మస్క్‌కు టెక్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈవీ వెహికిల్స్ మార్కెట్ విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందులు.. కొత్త వాహనదారులను వెనకడుగు వేసేలా చేస్తుందని, ఆ సమస్యల పరిష్కారానికి తగు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. చదవండి: ఎలన్‌మస్క్‌కు ఊహించని దెబ్బ -
ఎలన్ మస్క్ వెటకారం! ప్రధానిని సైతం వదల్లేదు
Elon Musk Tweet On Finland PM: బిలియనీర్ ఆఫ్ ది ఎర్త్ ఎలన్ మస్క్ మరోసారి తన వెటకారం ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా ఓ దేశ ప్రధానినే టార్గెట్ చేశాడు ఆయన. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్(36)ను ఉద్దేశిస్తూ తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ని ఉద్దేశిస్తూ.. మస్క్ చేసిన ట్వీట్ ఇదే. pic.twitter.com/5LE1PjFwgS — Elon Musk (@elonmusk) December 12, 2021 కారణం ఇదేనా? ఫిన్లాండ్లో ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో కొవిడ్ 19 నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సన్నా మారిన్ శనివారం ఓ నైట్‌క్లబ్ పార్టీకి వెళ్లారు. అయితే అంతకంటే ముందు ఫారిన్ మినిస్టర్ పెక్కా హవిస్టోతో భేటీ అయ్యారు. కాసేపటికే పెక్కాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో సన్నా.. తనకు తాను ఐసోలేట్ కాకుండా అలా పార్టీకి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లు.. పాజిటివ్ పేషెంట్‌ను కలిసినా ఐసోలేషన్ రూల్ పాటించాలనే రూల్ ఏం లేదు. కానీ, ప్రజారోగ్యం దృష్ట్యా పబ్లిక్ ప్లేసుల్లోకి మాత్రం వెళ్లకూడదు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో.. సన్నా మారిన్ ఫేస్బుక్ సాక్షిగా క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో ఎలన్ మస్క్ ఆమెపై చేసిన ట్వీట్లో మాత్రం ఆంతర్యం బోధపడడం లేదు. ఆమెను పవర్ఫుల్ అని పొగుడుతున్నాడా?.. లేదంటే అధికారం చేతిలో ఉందని అలా చేస్తోందంటూ విమర్శించాడా? అనేది ఫాలోవర్స్కే వదిలేశాడు మస్క్. మరోవైపు రెడ్డిట్ వెబ్సైట్లో ఈ ట్వీట్‌పై పెద్ద రచ్చే నడుస్తోంది మరి! చదవండి: ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. టెస్లాకు గుడ్‌బై? -
34 ఏళ్లు.. లక్షన్నర కోట్ల నిధి!
జానపద కథల నుంచి మొన్నటి కేజీఎఫ్దాకా గుప్తనిధుల సినిమాలంటే జనంలో క్రేజ్ అంతాఇంతా కాదు. దాన్ని దక్కించుకోవడం కోసం జరిగే పోరును ఆసక్తికరంగా చూస్తారు. నిధుల గురించిన సమాచారం అంటే ఆత్రుతగా ఉంటుంది. ఆసక్తి, ఆత్రుత ఓకే. కానీ ఆ నిధులను గుర్తించడం కోసం జీవితంలో విలువైన 34 ఏళ్లు కేటాయించడమంటే.. ఊహించడానికే కష్టంగా ఉంది కదా! ఆ కష్టమైన పనిని ఇష్టంగా చేయడానికి కారణం ఆ నిధి విలువ అక్షరాలా లక్షన్నర కోట్లు. అన్వేషణ కొనసాగిస్తున్న టీమ్ ‘టెంపుల్‌ట్వెల్వ్’. మూడు దశాబ్దాలుగా ఈ ‘లెమ్మిన్‌కినెన్ హోర్డ్’ కోసం వేటను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఆ రహస్య నిధికి దగ్గర్లోనే ఉన్నామని తాజాగా వెల్లడించిందీ బృందం. ఎవరీ లెమ్మిన్‌కినెన్? ఫిన్నిష్ పురాణాల్లో ప్రముఖ వ్యక్తి లెమ్మిన్‌కినెన్. ఆయన మీద అనేక పురాణగాథలు, కావ్యాలున్నాయి. ఫిన్లాండ్ రాజధాని హేల్సింకికి 20 మైళ్ల దూరంలో ఉన్న సిబ్బోస్బర్గ్ గుహల్లో ఆయన పేరుతో దేవాలయం ఉందట. అందులోనే లెమ్మిన్కినెన్కు సంబంధించిన నిధులు ఉన్నాయట. అయితే, ఆ నిధులకు సంబంధించిన ఆనవాళ్లను లెమ్మిన్‌కినెన్ వారసుడు యోగి ఓర్బాక్ 1987లో తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించాడు. ఆ భూమి వారసత్వంగా తమ పూర్వీకుల నుంచి తనకు వచ్చిందని ఆ ప్రాంతంలో గుప్త నిధులున్నాయని తెలిపాడు. గుడి ద్వారానికి అడ్డుగా పెద్దపెద్ద బండరాళ్లుపెట్టారని, నాటినుంచి ఆ నిధులకు రక్షకులం తామేనని చెప్పాడు. ఈ నేపథ్యంలో పై వివరాలతో కార్ల్ బోగన్ రాసిన పుస్తకంలోని సమాచారం ఆధారంగా అన్వేషణ మొదలైంది. లక్షల కోట్ల సంపద!? నిజానికి అక్కడ నిధులున్నాయని ఆధారాలేం లేవు. అయినా ‘ప్రపంచంలోనే అతిపెద్ద నిధి’గా పిలువబడే దీని విలువ లక్షన్నర కోట్లకుపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. నిధుల్లో 50వేల దాకా కెంపులు, పగడాలు, నీలమణులు, వజ్రాలు, మరో వెయ్యి అద్భుత కళాఖండాలు ఉంటాయని వారి నమ్మకం. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన మానవ విగ్రహాలు కూడా ఉన్నాయని విశ్వాసం. బాక్తోపాటు 1987లో ‘టెంపుల్‌ట్వెల్వ్’ బృందం ఆ నిధుల కోసం వేట మొదలుపెట్టింది. దాతల సహాయంతో తవ్వకాలు జరుపుతోంది. ట్యునెలా నది తీరాన ఉన్న ఈ పర్వత ప్రాంతంలో చలికాలంలో మంచు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. వేసవిలో కరిగి ఆ నీరు గుహ అంతా నిండిపోతుంది. వేసవి దాకా ఎదురుచూసి పదిహేను లక్షల లీటర్ల నీటిని తోడేసి... తవ్వకాలు జరుపుతున్నారు. ముప్పై ఏళ్లుగా.. ఏటా ఇదే తంతు. ‘టెంపుల్ ట్వెల్వ్’ అంటే ఏమిటి? ఒకే భావజాలాలు కలిగిన పన్నెండుమంది మహిళలు, పన్నెండు మంది పురుషులతో మొదలైందీ ‘టెంపుల్ ట్వెల్వ్’ బృందం. ఈ మూడు దశాబ్దాల్లో కొందరు చనిపోయారు. కొందరు రిటైర్ అయ్యారు. పాతవాళ్లు ఇద్దరే మిగిలారా బృందంలో. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు చేరుతున్నారు. ఇదిలా ఉండగా లెమ్మిన్‌కినెన్ యజమాని ఓర్ బాక్ 2010లో తన వ్యక్తిగత సహాయకుని చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సంబంధం ఉందని ఇద్దరు భారతీయులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ఇద్దరూ విడుదలయ్యారు. అయితే ఈ హత్యకు కారణాలేమీ తెలియలేదు. దానికంటే ముందు పెనుగులాట జరిగిందని వైద్య నివేదిక తెలిపింది. కొన్ని నెలల్లో ముగింపు.. 34 ఏళ్ల ప్రయత్నాలు ఫలించాయని, ఆ నిధికి ఇంకా కొన్ని నెలల దూరంలోనే ఉన్నామని చెబుతోంది బృందం. గుడి ద్వారానికి అడ్డంగా ఉన్న పెద్ద బండరాయిని తొలగిస్తే అందులో ఉన్న నిధులు తమ చేతికొస్తాయని ఈ బృందం చెబుతోంది. ‘34 ఏళ్ల అన్వేషణకు ఇంకొన్ని నెలల్లో ముగింపు వస్తుంద’ని బృందానికి నేతృత్వం వహిస్తున్న బోరెన్ తెలిపారు. -
అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!
ఫిన్ల్యాడ్: మనం చాలా నిధుల గురించి విని ఉంటాం అయితే ఈ ఫిన్ల్యాండ్లోని లెమ్మిన్కైనెన్ అనే నిధి నిక్షేపం కోసం 30 ఏళ్లుగా పరిశోధిస్తునే ఉన్నారంటా. అంతేకాదు ఈ లెమ్మిన్కైనెన్ అనే నిధి కోసం "ట్వెల్వ్ టెంపుల్" పేరుతో పన్నెండు మంది బృందం 1987 నుండి అన్వేషిస్తోందట. (చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !) పైగా ఈ నిధిలో 1500 కోట్లు పైన ఉండచ్చని భావిస్తున్నారు. అంతేకాదు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వజ్రాలు, నీలమణులు, పురాతన కళాఖండాలు వంటివి 50వేలుకు పై చిలుకే ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వెయ్యేళ్లనాటి నిధిని చేధించేందకు ఈ పన్నెండు బృందాలు 30 ఏళ్లుగా అన్వేషిస్తునే ఉంది. ఈపరిశోధనల్లో భాగంగా వాళ్ల చాలా కష్ట నష్టాలను చవిచూశారు. అయితే ఇంతవరకు ఎవరు ఈ నిధిని కనుగొన లేకపోయారు. ఈ మేరకు ఆ పన్నెండు మంది బృందం తాము కొద్ది దూరంలో ఉన్నామని త్వరలోనే ఈ నిధిని కనుగొన గలమంటూ విశ్వాసం వ్యక్తం చేసింది. లెమ్మిన్కైనెన్ నిధి అన్వేషణాధికారి మాట్లాడుతూ...గణనీయమైన పురోగతి సాధించాం. త్వరలోనే మా బృందం ఆ నిధిని గుర్తించ గలదు" అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: కాప్ 26 సదస్సులో జోబైడెన్ కునికిపాట్లు) -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు.
నల్లరాజుపాలెం(అనంతసాగరం): ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి గారు తెలియజేసారు. విదేశాల్లో ఉన్నప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ నిచ్చి మన తెలుగు వాళ్లు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారని అన్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చిందని అన్నారు. దసరా పాటలతో, నృత్యాలతో కూడిన ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిందని అన్నారు. కార్యక్రమం కొనసాగటానికి సంస్థ నిర్వాహకులు సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి తదితరులు కృషిచేశారని తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి బతుకమ్మ పండుగ సందర్బంగా వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మని తయారు చేయించి, పిల్లలు, ఆడపడుచులందరు పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా, ఇక ముందు కూడా ఫిన్లాండ్లో మరిన్నికార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇక్కడున్న మన తెలుగు వాళ్లకి అండగా ఉంటామని తెలుగు సంఘం ఉపాధ్యాక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి గారు, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి గారు, సత్యనారాయణ గారు తెలియజేశారు. -
ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే!
Finlands Use of eight slips vs England XI: యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏ ఫార్మాట్లోనైనా బ్యాటర్లపై ఒత్తిడి పెంచేందుకు స్లిప్స్‌లో.. కెప్టెన్ ఫీల్డర్లను పెట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో మూడు లేక నలుగురు ఫీల్డర్లను స్లిప్స్‌లో పెడతారు. అయితే, టీ10 మ్యాచ్ సందర్భంగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో ఫిన్‌ల్యాండ్ బౌలర్ అమ్జద్ షేర్ వేసిన తొలి బంతికే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 8 మంది ఫీల్డర్లను కెప్టెన్ జోనాథన్ స్కామన్స్ స్లిప్స్‌లో పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఎలెవన్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫిన్‌ల్యాండ్ నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 100 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ ఎలెవన్ 14 పరుగుల తేడాతో ఫిన్‌ల్యాండ్‌పై విజయం సాధించింది. చదవండి: Poonam Raut: పూనమ్ క్రీడా స్ఫూర్తికి ఆసీస్ క్రికెటర్ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’ Just one normal day of European Championship Cricket 🙏 Finland start the game against England with EIGHT in the slips, and a leg slip for good measure 😂#ECC21 pic.twitter.com/lnuTv2RwMt — Cricket on BT Sport (@btsportcricket) September 30, 2021 -
Sudirman Cup: విజయంతో ముగింపు
వాంటా (ఫిన్లాండ్): సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఫిన్లాండ్ను ఓడించింది. థాయ్‌లాండ్, చైనాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. ఫిన్లాండ్తో మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పైచేయి సాధించారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 16–21, 21–14, 21–11తో కాలీ కొల్జోనన్‌ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ లో అశ్విని–అర్జున్; పురుషుల డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల; మహిళల డబుల్స్‌లో తనీషా–రితూపర్ణ జోడీలు, మహిళల సింగిల్స్‌లో మాళవిక విజయాలు నమోదు చేశారు. -
Sudirman Cup: చైనా చేతిలో ఓటమి.. లీగ్ దశలోనే అవుట్
వాంటా (ఫిన్లాండ్): వరుసగా రెండో పరాజయంతో సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనాపై కచ్చితంగా గెలవాల్సిన భారత జట్టు 0–5తో దారుణంగా ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌మ్యాచ్‌లో అర్జున్ –ధ్రువ్ కపిల జంట 20–22, 17–21తో లియు చెంగ్–జౌ హావో డాంగ్ జోడీ చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో అదితి భట్ 9–21, 8–21తో చెన్ యు ఫె చేతిలో... పురుషుల సింగిల్స్‌లో 15వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 10–21, 10–21తో షి యుకీ చేతిలో... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 16–21, 13–21తో జెంగ్ యు–లి వెన్ మె చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో కిడాంబి శ్రీకాంత్–రితూపర్ణ 9–21, 9–21తో డు యు–ఫెంగ్ యాన్ జె చేతిలో ఓడిపోయారు. చదవండి: Formula 1: హామిల్టన్ ‘విక్టరీల సెంచరీ’.... -
Davis Cup: పరాజయాలతో మొదలుపెట్టిన భారత ప్లేయర్లు
ఎస్పూ (ఫిన్లాండ్): డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను భారత్ ఓటములతో ఆరంభించింది. వరల్డ్ గ్రూప్–1లో భాగంగా ఫిన్లాండ్తో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లకు నిరాశే ఎదురైంది. ప్రపంచ 165వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 3–6, 6–7 (1/7)తో 419వ ర్యాంకర్ ఒట్టో విర్టనెన్ చేతిలో ఓడాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ 4–6, 5–7తో ఎమిల్ రుసువురి చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో తొలి రోజు ముగిసే సరికి ఫిన్లాండ్ 2–0తో భారత్‌పై ఆధిక్యంలో నిలిచింది. నేడు జరిగే డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఈ ‘టై’లో ఫిన్లాండ్ విజేతగా నిలుస్తుంది. భారత్ గెలవాలంటే మాత్రం వరుసగా మూడు మ్యాచుల్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. డబుల్స్‌లో హ్యారి హెలివోరా–హెన్రీ కొంటినెన్ ద్వయంతో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట ఆడనుంది. అనంతరం జరిగే రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో... ఎమిల్ రుసువురితో ప్రజ్నేశ్; ఒట్టో విర్టనెన్తో రామ్‌కుమార్ తలపడతారు. వరుస సెట్లలో... గంటా 25 నిమిషాల పాటు విర్టనెన్తో జరిగిన పోరులో ప్రజ్నేశ్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్ ఆరో గేమ్‌లో ప్రజ్నేశ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన విర్టనెన్ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఫిన్లాండ్ ప్లేయర్ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను ప్రజ్నేశ్ చేజార్చుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ప్రజ్నేశ్ మెరుగ్గా ఆడాడు. పదునైన సరీ్వస్‌లతో ఏస్‌లను సాధిస్తూ తన సర్వీస్‌ను కోల్పోకుండా చూసుకున్నాడు. అయితే ప్రత్యర్థి సరీ్వస్‌ను ఒకసారి బ్రేక్ చేసేందుకు అవకాశం వచి్చనా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సెట్లో ఇద్దరు కూడా తమ సరీ్వస్‌లను నిలుపుకోవడంతో మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. ఇక్కడ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన 20 ఏళ్ల విర్టనెన్ 7–1తో టై బ్రేక్‌ను సొంతం చేసుకొని విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో అతడు 10 ఏస్‌లను సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లను చేయగా... ప్రజ్నేశ్ 6 ఏస్‌లను సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లను చేశాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లోనూ రామ్‌కుమార్ వరుస సెట్లలోనే ఓడాడు. -
ఫార్ములా వన్‌కు రైకొనెన్ గుడ్‌బై ..
హెల్సింకీ: 2007 ప్రపంచ డ్రైవర్ చాంపియన్, ఆల్ఫా రొమెయో డ్రైవర్ కిమీ రైకొనెన్ (ఫిన్లాండ్) తన 19 ఏళ్ల ఫార్ములా వన్ (ఎఫ్1) రేసింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఎఫ్1 సీజనే తనకు చివరిదని అతడు గురువారం ప్రకటించాడు. ఎఫ్1 చరిత్రలో అత్యధిక గ్రాండ్‌ప్రిల్లో (344) పాల్గొన్న రేసర్‌గా ఉన్నాడు. 21 గ్రాండ్‌ప్రిల్లో కిమీ రైకొనెన్ విజేతగా నిలిచాడు. చదవండి: Tokyo Paralympics 2021: ప్రవీణ్ కూమార్‌కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు -
భారత డేవిస్ కప్ జట్టులో సాకేత్ మైనేని
ఫిన్లాండ్తో సెప్టెంబర్ 18, 19వ తేదీల్లో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనికి చోటు లభించింది. భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ గాయపడటంతో అతని స్థానాన్ని సాకేత్‌తో భర్తీ చేశారు. డేవిస్ కప్‌లో భారత్ తరఫున సాకేత్ ఆరుసార్లు ఆడాడు. చివరిసారిగా అతడు 2018లో సెర్బియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. -
డెన్మార్క్‌కు షాక్
కొపెన్‌హగన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తొలిసారి ఆడుతున్న ఫిన్లాండ్ జట్టు... తమ మొదటి మ్యాచ్‌లోనే మాజీ చాంపియన్ డెన్మార్క్‌కు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఫిన్లాండ్ 1–0తో డెన్మార్క్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫిన్లాండ్ ఆటగాడు పొహాన్పొలావో ఆట 60 నిమిషంలో గోల్ చేశాడు. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బెల్జియం 3–0తో రష్యాపై నెగ్గింది. గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1–0తో క్రొయేషియాపై... గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆస్ట్రియా 3–1తో నార్త్ మెసడోనియాపై నెగ్గాయి. -
మైదానంలో ఆటగాడికి గాయం.. ప్రత్యర్ధి అభిమానులు ఏం చేశారో తెలుసా..?
కోపెన్‌హెగెన్: ఆట శత్రువులను సైతం దగ్గరికి చేస్తుందనటానికి ఇప్పుడు మనం చూడబోయే వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. యూరోకప్ 2020 ఫుట్‌బాల్ పోటీల్లో భాగంగా ఫిన్లాండ్, డెన్మార్క్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అపురూప ఘట్టం చోటు చేసుకుంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన క్రీడా ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో డెన్మార్క్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ గాయపడ్డాడు. గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఎరిక్సన్ కెమెరా కంట పడకుండా డెన్మార్క్ ఆటగాళ్లంతా చుట్టూ రక్షణగా నిలిచారు. ఇది గమనించిన ఫిన్లాండ్ అభిమానులు తమ చేతుల్లోని జాతీయ జెండాలను డెన్మార్క్ ఆటగాళ్లకు ఇచ్చారు. Prayers for Christian Eriksen 🙏 Finland fans gave their flags after Christian Eriksen collapsed during the match 🇫🇮 Wishing him speedy recovery. pic.twitter.com/LZ3hSn4Gka — Nigel D'Souza (@Nigel__DSouza) June 12, 2021 వాటి సాయంలో డెన్మార్క్ క్రీడాకారులు ఎరిక్సన్ను మైదానం బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరు దేశాల అభిమానులు క్రిస్టియన్ ఎరిక్సన్ పేరును స్మరిస్తూ.. హర్షధ్వానాలు చేశారు. కాగా, ఫిన్లాండ్ అభిమానులు చూపిన ఔదార్యం క్రీడాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. నిజమైన క్రీడా ప్రేమికులు తమ అభిమానాన్ని ఇలానే చాటుతారంటూ కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఫిన్లాండ్ 1-0 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించింది. సెకండాఫ్‌లో ఫిన్లాండ్ ప్లేయర్ జోయెల్ పోజాన్పాలో గోల్ చేసి, తమ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. చదవండి: పాపం మనీశ్ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు! -
బ్రేక్‌ఫాస్ట్ బిల్: చిక్కుల్లో ఫిన్లాండ్ ప్రధాని
హెల్సింకి: అధికారంలోకి రాగానే అనేక సంస్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ చిక్కుల్లో పడింది. ఫ్యామిలీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆమె నెలకు 300 యూరోల అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్.. కెసరంటాలోని అధికారిక నివాసంలో కుటుంబంతో సహా ఉంటోంది. అయితే బ్రేక్‌ఫాస్ట్ కోసం నెలకు 300 యూరోలు(365 డాలర్లు) ఖర్చు అవుతున్నట్లు చూపిస్తూ.. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ఆమె క్లెయిమ్ చేస్తోంది. ఈ మేరకు లోకల్ టాబ్లాయిడ్ ఒకటి కథనం ప్రచురించడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో సన్నా మారిన్ స్పందించారు. ఒక ప్రధానిగా తాను ఎలాంటి సౌకర్యాలు కోరుకోలేదని, అలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె ట్వీట్ చేశారు. On hyvä, että menettely selvitetään. Olen luottanut asiassa virkamiehiltä saamaani tietoon ja ohjeistukseen. En ole itse tehnyt hankintoja, vaan kaikki hankinnat on tehty valtioneuvoston kanslian virkakunnan ja työntekijöiden toimesta. — Sanna Marin (@MarinSanna) May 28, 2021 కాగా, రీఎంబర్స్మెంట్ గురించి చట్టంలో ఎక్కడా లేదన్న పోలీసులు.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిన్నిష్ చట్టాలకు విరుద్ధంగా సన్నా వ్యవహరించారని, ఆమె ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాగా, పోలీస్ విచారణను సన్నా స్వాగతించారు. కాగా, 35 ఏళ్ల సన్నా మారిన్ డిసెంబర్ 2019లో ఫిన్లాండ్కు ప్రధాని అయ్యింది. పాలనతో పాటు కరోనా కట్టడిలో మిగతా యూరోపియన్ దేశాల నుంచి శెభాష్ అనిపించుకుందామె. కానీ, తర్వాతి నుంచి ఆమె క్రేజ్ పడిపోతూ వస్తోంది. ఈ మేరకు జూన్ 13న జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష రైట్ వింగ్ పార్టీ ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. View this post on Instagram A post shared by Sanna Marin (@sannamarin) -
ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్ ఉగాది పండగ శుభాకాంక్షలు
హెల్సింకి: ఫిన్లాండ్ దేశంలో ‘ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్’ రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు తెలుగు పండగలను నిర్వహిస్తోంది. తెలుగు పండగల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేస్తోంది. ఫిన్లాండ్ దేశంలో సుమారు వెయ్యికి పైగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏడాది రఘునాథ్ పర్లపల్లి ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్(ఎఫ్ఐటీఏ)కి నూతన అధ్యక్షుడిగా నియమించడ్డారు. ఆయన ఈ పదవిలో మర్చి 2023 వరకు కొనసాగుతారు. ఉగాది పండగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిన్లాండ్లో నివసించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ‘శ్రీ ప్లవ నామ తెలుగు నూతన సంవత్సరం( ఉగాది) పండగ’ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసే ఓ ప్రత్యేక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ వీడియోలో చిన్నారులు శ్రీ ప్లవ నామ సంవత్సర(ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ఎఫ్ఐటీఏ నిర్వహించిన పలు కార్యక్రమాలకు సహకారం అందించిన న్యూస్‌పేపర్లు, టీవీ చానళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్ఐటీఏ తరపున తెలుగు ప్రజలందరికీ ఈ ఉగాది పండగ నుంచి శుభం జరగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం -
పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకంజ
వరల్ఢ్ హ్యాపినెస్ రిపోర్ట్‌లో ఫిన్లాండ్ వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 149 దేశాలకు చెందిన ప్రజలు ఎంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారనే దానిపై జరిపిన సర్వేలో ఫిన్లాండ్ మరొకసారి టాప్‌లో నిలిచింది. ఈ మేరకు వరల్ఢ్ హ్యాపినెస్ రిపోర్ట్- 2021ను యూఎన్ సస్టేనబుల్ డెవలప్మెంట్ సోల్యూషన్స్ నెటెవర్క్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 139వ స్థానంలో నిలిచింది. కాగా, గత ఏడాది కంటే భారత్ హ్యాపినెస్ ఇండెక్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , చైనాల కంటే హ్యాపినెస్ ఇండెక్స్‌లో భారత్ వెనుకంజలో ఉండడం గమనార్హం. నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ 105, బంగ్లాదేశ్ 101, చైనా 84 వ స్థానంలో నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో ఆఫ్ఘనిస్తాన్ 149, జింబాబ్వే 148, రవాండా 147, నిలిచాయి.ప్రతి ఏడాది యూఎన్ హ్యాపినెస్ ఇండెక్స్‌ను విడుదల చేస్తోంది. ఈ ఇండెక్స్‌ను గాలప్ వరల్డ్ పోల్ నిర్వహించే ప్రశ్నల ఆధారంగా ప్రపంచ దేశాలకు ర్యాంకులను నిర్ణయిస్తోంది. దాంతో పాటుగా దేశాల జీడిపీ, సామాజిక భద్రతను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ సూచీను ఆయా దేశాల జీడీపీ, సామాజిక భద్రత, దాతృత్వం, ప్రజల ఆరోగ్య స్థితిగతులు, లంచగొండితనం , ప్రజల నిర్ణయాల్లో స్వతంత్రత వంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటుంది. 2021 ప్రపంచంలోనే సంతోషకరమైన మొదటి 20 దేశాల జాబితా... 1. ఫిన్ లాండ్ 2. డెన్మార్క్ 3. స్విట్జర్లాండ్ 4. ఐస్ లాండ్ 5. నెదర్లాండ్స్ 6. నార్వే 7. స్వీడన్ 8. లక్సెంబర్గ్ 9. న్యూజిలాండ్ 10. ఆస్ట్రియా 11. ఆస్ట్రేలియా 12. ఇజ్రాయెల్ 13. జర్మనీ 14. కెనడా 15. ఐర్లాండ్ 16. కోస్టా రికా 17. యునైటెడ్ కింగ్డమ్ 18. చెక్ రిపబ్లిక్ 19. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 20. బెల్జియం -
5జీ : రేసులో దిగ్గజ ఐటీ కంపెనీలు
న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి పలు కంపెనీలు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా భారత్‌కు చెందిన పలు దిగ్గజ ఐటీ కంపెనీలు 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి రంగంలోకి దిగాయి. భారత్‌లో 5జీ, 6జీ టెక్నాలజీల అభివృద్ధి, విస్తరణ కోసం భారత కంపెనీలు విప్రో ,టెక్ మహీంద్రా ఫిన్‌ల్యాండ్ కంపెనీల సహకారంతో కలిసి పనిచేస్తాయని భారత సీనియర్ అధికారి మంగళవారం తెలియజేశారు. 5జీ సేవలను విస్తరించడానికి ఫిన్లాండ్ కు చెందిన నోకియా కంపెనీ ఇప్పటికే భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తోందని సెంట్రల్ యూరప్ ఇన్చార్జి జాయింట్ సెక్రటరీ నీతా భూషణ్ మంగళవారం విలేకరులతో అన్నారు. ‘2 జీ, 3జీ, 4జీ టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో ఫిన్ లాండ్ ప్రముఖ పాత్ర వహించింది. విప్రో , టెక్ మహీంద్రా కంపెనీలు ఫిన్లాండ్ సంస్థలతో కలిసి 5జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం పనిచేస్తాయని అంతేకాకుండా, భవిష్యత్తులో 6జీ టెక్నాలజీను అందించడంలో పనిచేస్తాయని’ నీతా భూషణ్ తెలిపారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్, ఇరు దేశాల్లో ఆవిష్కరణ, పరిశోధన , సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులతో సహా ఇంధన రంగాలలో కొనసాగుతున్న సహకారంపై సమీక్ష నిర్వహించారు. ఇరు దేశాల ప్రధానులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్వాంటం కంప్యూటర్ను అభివృద్ధికి ఇరుదేశాలు పాటుపడతాయని మార్చి 16 న జరిగిన వర్చువల్ సమావేశంలో తెలిపారు. దేశంలో 5జీ టెక్నాలజీకి ఆదరణ పెరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు 5జీ బాటపడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: రష్యాను అధిగమించిన భారత్..!) -
భారీగా ఉద్యోగాల కోతను విధించనున్న నోకియా
ఫిన్‌ల్యాండ్: ఫిన్నిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా పొదుపు మంత్రాన్ని పాటిస్తోంది. ఇందులో భాగంగా 600 మిలియన్ యూరోల (715 మిలియన్ డాలర్లు) ఖర్చును తగ్గించేలా 2023 నాటికి 11 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కొత్తగా వచ్చిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ నేతృత్వంలోని నోకియా తన విస్తృత పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రాబోయే రెండేళ్ళలో మార్కెట్ పరిస్థితులను అనుసరించి ఉద్యోగ కోతలు ఉంటాయని తెలపింది.. ప్రణాళికాపరంగానే ఉద్యోగుల కోతలు రానున్న 18-24 నెలల వ్యవధిలో 80,000-85,000 ఉద్యోగులు మాత్రమే సంస్థలో ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నోకియాలో సుమారు 90,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ 5జి పరికరాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడంలో తన పోటీదారులైన ఎరిక్సన్, హువాయ్లతో జరిగిన రేసులో నోకియా కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. కాక గత ఏడాది లో జరిగిన ముఖ్యమైన వెరిజోన్ ఒప్పందాన్ని కోల్పోయి చైనాలోకి అడుగుపెట్టలేకపోయింది.గత ఏడాది ఆగస్టులో లండ్మార్క్ అధికారంలోకి వచ్చిన తరువాత, మాజీ సిఈఓ రాజీవ్ సూరి"ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్" వ్యూహాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో మరింత కేంద్రీకృత విధానాన్ని తీసుకొచ్చాడు. ఆల్కాటెల్-లూసెంట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఫ్రాన్స్‌లో 1,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో సహా, 2018 లో వ్యయ కోతలో భాగంగా విధించిన ఉద్యోగుల తొలగింపులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. -
భారత్ సహా 4 దేశాలపై నిషేధం ఎత్తివేత
మాస్కో: మహమ్మారి కరోనా ప్రవేశంతో అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడం.. వ్యాక్సిన్ కూడా రావడంతో క్రమేణా ప్రపంచ దేశాలు ఇతర దేశాలకు రాకపోకలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారతదేశం షరతులతో రాకపోకలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా ఇప్పుడు పలు దేశాలకు విధించిన రాకపోకల నిషేధాన్ని ఎత్తివేసింది. భారతదేశంతో పాటు ఫిన్‌ల్యాండ్, వియత్నాం, ఖతార్ దేశాలకు అంతర్జాతీయ ప్రయాణాలు కొనసాగించవచ్చని రష్యా నిన్న ప్రకటించింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. మార్చి 16, 2020లో విధించిన నిషేధం దాదాపు పది నెలల తర్వాత జనవరి 25న ఎత్తివేశారు. దీంతో ఈ దేశాల మధ్య రాకపోకలు పునరుద్ధరిస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యాలో 36, 79, 247 కరోనా కేసులు నమోదవగా, 68, 397 మంది మృత్యువాత పడ్డారు. ఆ దేశంలో తాజాగా సోమవారం 19,290 కేసులు నమోదవగా.. 456 మృతులు నమోదయ్యాయి. -
కరోనా: వీటి పనితీరుతో ‘ఔరా’ అనాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతను, అంటే జ్వరం వచ్చిందా, లేదా తెలుసుకునేందుకు శరీరంలోని నరాల్లో పల్స్ రేటును, ఆక్సిజన్ రేటును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పలు వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ పనులన్నీ ఒకే పరికరం చేయడమే కాకుండా, మరింత సమర్థంగా పనిచేసే తల రింగు మార్కెట్లోకి వచ్చింది. ఫిన్లాండ్ కంపెనీ తయారు చేసిన ఈ తల రింగును 65 వేల మందిపైన ప్రయోగించి కాలిఫోర్నియా యూనివర్శిటీ, ఎంఐటీ లింకన్ ల్యాబ్‌కు చెందిన పరిశోధకులు పరీక్షించి చూశారు. జ్వరం వచ్చిన తర్వాత జ్వరం ఉన్నట్లు చూపిస్తున్న వైద్య పరికరాలకన్నా ఈ పరికరాలు మరింత సమర్థంగా పనిచేస్తున్నాయని, జ్వరం రావడానికి ముందే జ్వరం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతుందని పరిశోధకులు తేల్చారు. ఈ తల రింగులను ధరించి 50 మందికి కరోనా వైరస్ వచ్చిందని, వారిలో వైరస్ లక్షణాలను ఈ తల రింగులోని సెన్సార్లు ముందుగానే గ్రహించాయని తెలిపారు. దీని పనితీరును గమనిస్తే ఎవరైనా దీనిని ‘ఔరా’ అనాల్సిందేనని పరిశోధకులు వ్యాఖ్యానించారు. అందుకేనేమో దీనికి కంపెనీ వారు ‘ఔరా’ రింగులు అని నామకరణం చేశారు. ఫిన్లాండ్లోని ఫిన్నీష్ హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ ‘ఔరా హెల్త్’ తయారు చేసిన ఈ ‘ఔరార రింగు’ల ధరను 299 పౌండ్లు (దాదాపు 29 వేల రూపాయలు). (చదవండి: కరోనా వ్యాక్సిన్ ధరలు ఎందుకెక్కువ?) -
ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు
అబుధాబి: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కొన్ని దేశాలు శునకాల సాయం తీసుకుంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ వాసనని శునకాలు పసిగడతాయని ఇప్పటికే అధ్యయనాల్లో తేలిన విషయం తెలిసిందే. యూఏఈ, ఫిన్‌ల్యాండ్, లెబనాన్ దేశాల్లో రోగుల్లో కరోనా లక్షణాలు బయటపడక ముందే శునకాలు రోగుల్ని గుర్తిస్తున్నాయి. లెబనాన్ విమానా శ్రయానికి వచ్చిన 1,680 మంది ప్రయాణికుల్లో 159 మందిని కరోనా రోగులుగా శునకాలు గుర్తిస్తే, వారిలో 92 శాతం మందికి కరోనా ఉన్నట్టుగా ఆ తర్వాత తేలిందని అధికారులు చెప్పారు. (కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత) -
సనాను ప్రధాని అనుకోలేదు
ఫిన్లాండ్: ఎంతటి గంభీరమైన విధి నిర్వహణలలో ఉన్న స్త్రీలైనా కానివ్వండి, ఫ్యాషన్ గా ఉండే దుస్తుల ఎంపికలో చిన్న పిల్లలు అయిపోతారు. బహుశా అది ప్రకృతి చేత వారికి అనుగ్రహించబడిన ఉత్సాహం కావచ్చు. లేదా ఇంకొకటి అయి ఉండాలి. ఎంతటి గంభీరమైన స్త్రీనైనా స్త్రీ గా చూపించడానికి ప్యాషన్ కంపెనీలు పన్నుతున్న కుట్లు అల్లికలు అయినా అయి ఉండాలి. ఏమైనా ఈ భూమి మీద ఫ్యాషన్ బతికి బట్ట కట్టడానికి మహిళలే ‘మాతా కబళం!’. సనా మారిన్ ఫిన్లాండ్ ప్రధాని. 34 ఏళ్లు. ప్రపంచ ప్రధానులలో అందరికన్నా చిన్న. వయసు చిన్నదే కానీ ఆమె పోస్టు గంభీరాలలోకి గాంభీర్యం. ఆమెను మోడల్‌గా పెట్టి అంతర్జాతీయంగా పేరున్న ఒక పెద్ద ఫ్యాషన్ దుస్తుల కంపెనీ, పేరున్న ఒక ఫ్యాషన్ మ్యాగజీన్ ఫొటో షూట్ చేసి, స్పెషల్ స్టోరీ వేశాయి. చదవండి: బైడెన్ గెలిచాడని ఒప్పుకున్న ట్రంప్! ఫొటోలలో సనా రిచ్‌గా, ఫ్యాషనబుల్‌గా, ప్రధాని కంటే పెద్ద పోస్టులో ఉన్నట్లుగా ఉన్నారు. కంఠాభరణం కనిపించేలా ఆమె ధరించిన లో–కట్ జాకెట్ అయితే ఫిన్లాండ్ మహిళలకు భలే నచ్చేసింది. ‘వాహ్.. మేడమ్, సూపర్ గా ఉన్నారు’ అని కాంప్లిమెంట్స్ కురిపించారు. పురుషులకు ఇలాంటివి ముందే నచ్చుతాయి. నచ్చుతాయి కానీ ‘వావ్‘ అంటూ ముందుకు వచ్చేయకుండా వాళ్లను కొన్ని స్వీయ నియంత్రణ శక్తులు కాపాడుతుంటాయి. విమర్శించడానికి మళ్లీ అంత ఆలోచించరు. ‘ఒక దేశానికి ప్రధానిగా ఉండి ఈ డ్రెస్ ఏమిటి?’ అని సనా పై కొందరు పురుషులు సంప్రదాయాన్ని ప్రదర్శించారు. అమ్మాయిలు ఊరుకుంటారా! ‘ఐయామ్ విత్ సనా’ అనే హ్యాష్ టాగ్‌తో తమ ఫొటోలను (లో–కట్ జాకెట్ తో ఉన్నవి) కుమ్మరింపుగా పోస్ట్ చేస్తూ ఆమె వైపు నిలబడ్డారు. సనాను వాళ్లు పీఎం అనుకోలేదు. సాటి అమ్మాయి అనుకున్నారు. అందుకే అంత సపోర్టు. -
ప్రధానమంత్రివా.. మోడల్‌వా?
హెల్సింకి: ఆడపిల్ల అంటే చాలు సుద్దులు, బుద్ధులు నేర్పడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది సమాజం. ఈ విషయంలో సాధారణ మహిళ, సెలబ్రిటీ అనే తేడా ఏం ఉండదు. ఆఖరికి ఆమె ప్రధాని పీఠం అధిరోహించినా సరే.. హద్దులు నేర్పిస్తుంటారు. ఆడవారు వేసుకునే బట్టలు, ఉండే తీరు అన్నింటికి ఓ కొలతలు గీసి పెడతారు. అవి ఏ మాత్రం తగ్గినా ఇక దాడి మొదలు పెడతారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఓ ఫోటోపై నెటిజనులు అభ్యంతరకర కామెంట్స్ పెట్టడం ప్రారంభించారు. ప్రధానివా.. మోడల్‌వా అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో చాలా మంది ఆడవారు ప్రధానికి మద్దతుగా నిలవడమే కాక ఈ ట్రోల్స్‌ని తిప్పికొట్టారు. వారు కూడా అలాంటి దుస్తులే ధరించి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంతలా విమర్శలు ఎదుర్కొంటుంది అంటే ఆమె మరి ఏ రేంజ్లో దుస్తులు ధరించిందో అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఆమె బ్లేజర్ ధరించారు.. కాకపోతే దాని నెక్ కాస్త డీప్‌కట్ ఉంది. దాంతో ఈ దుమారం. (చదవండి: ఆమె ఓ సేల్స్‌గర్ల్; క్షమించండి!) View this post on Instagram Ylpeänä esittelemme: lokakuun Trendin kannessa loistaa mieletön @sannamarin 💪🖤⠀ ⠀ Pääministeri Sanna Marinilla on eturivin paikka esimerkkinä, esikuvana, asioiden muuttajana ja vaikuttajana. Työ on paineistettua, mutta hyvät unenlahjat ja rautaiset hermot auttavat. Mutta Marin tunnustaa myös, että uupumuksen tunteet saattavat tulla myöhemmin:⠀ ⠀ ”On selvää, että nämä vuodet jättävät jälkensä. Tämä ei ole tavallista työtä eikä tavanomaista elämää vaan raskasta monellakin tavalla. Voi olla, että paine ja uupumus kertyvät ja tulevat myöhemmin. Tilanteissa on ollut pakko laittaa tunteet sivuun, mutta kyllähän ne kasautuvat.” ⠀ ⠀ Lue kiinnostava haastattelu kokonaisuudessaan tänään lehtihyllyille saapuneesta Trendistä! Antoisia lukuhetkiä! 💎 ⠀ ⠀ Kuva: @jonaslundqvist⠀ Tyyli: @suvipout A post shared by Trendi & Lily (@trendimag) on Oct 8, 2020 at 2:00am PDT వివరాల్లోకి వెళితే... 34 ఏళ్ల ఎంఎస్ మారిన్ ఈ నెల ప్రారంభంలో ఫ్యాషన్ మ్యాగజైన్ ట్రెండికి పోజులిచ్చారు. కవర్ ఫోటోషూట్ కోసం, ఆమె లో కట్ నెక్లైన్ ఉన్న బ్లాక్ బ్లేజర్‌ను ధరించారు. ఈ ఫోటోని ట్రెండి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో దుమారం రేగింది. దాంతో ఇంటర్నెట్లోని ఓ విభాగం ‘ప్రధాని లాంటి ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇలా చేయడం తగదు.. మీరు ప్రధానా లేక మోడలా.. మీ విశ్వసనీయత క్షీణించింది’ అంటూ విమర్శించడం ప్రారంభించారు. కానీ చాలా మంది మహిళలలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. ఇలా వ్యాఖ్యానించడం తగదన్నారు. బట్టలు కాదు ఆమె సాధించిన విజయాలు చూడాలని సూచించారు. అంతేకాక ప్రధానమంత్రికి మద్దతుగా వందలాది మంది మహిళలు లోనెక్ బ్లేజర్ ధరించిన ఫోటోలను ట్విట్టర్, సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ డెమొక్రాట్ అయిన సన్నా మారిన్ 2019 డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు, దేశ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ప్రధానిగా నిలిచారు. ఆమె ఐదు పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. #supportsanna #kalevalakoru @trendimag @MarinSanna pic.twitter.com/vdw5nDc1Z9 — Sari Viinikainen (@SariViinikainen) October 10, 2020 -
పండగలా పని చేయాలంటే..!
వెబ్ స్పెషల్ : తక్కువ పనిగంటలు..ఎక్కువ ఉత్పాదకత అంటూ ఫిన్లాండ్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటే, ఆడుతూ..పాడుతూ ఉల్లాసంగా పనిచేస్తేనే ఉత్పాదకత మెరుగవుతుందని పలు దేశాలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వారానికి నాలుగు రోజుల పనిదినాల వైపు యూరప్‌లో అడుగులు పడుతున్న వేళ మళ్లీ ఉద్యోగుల పనిదినాలు, పనిసంస్కృతి, ఇంటి నుంచే పనిపై ఆసక్తికర చర్చకు తెరలేచింది. అసలు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజంతో ఉరకలు వేయాలంటే కీలకమైన ఉపాథి, ఉత్పాదకతకు ఊతమివ్వాలి. మెరుగైన పని సంస్కృతే నాణ్యమైన ఉత్పాదకతకు బాటలువేస్తుందని పలు అథ్యయనాలు, పరిశోధనల్లో స్పష్టమవగా తాజాగా కరోనా వైరస్‌తో పని స్వభావమే సమూల మార్పులకు లోనవుతోంది. కోవిడ్-19తో ప్రపంచం వణికిపోతున్న క్రమంలో కోట్లాది ఉద్యోగాలు ఏకంగా డ్రాయింగ్ రూమ్లకే చేరాయి. ఆన్లైన్లోనే ఉద్యోగులు పనులను చక్కబెడుతుండగా గతంలో పరిమిత ఉద్యోగులకే అందుబాటులో ఉన్న ‘ఇంటి నుంచే పని’ ఇప్పుడు అధిక శాతం ఉద్యోగులకు అందివచ్చింది. కరోనా వైరస్ కట్టడికి మార్చి నెలాఖరు నుంచి దేశంలో లాక్డౌన్ అమలవడంతో ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకునే విధానానికి సంస్థలు అనివార్యంగా ఓటేశాయి. వర్క్ ఫ్రం హోంకి సంస్థలు మొగ్గుచూపడంతో ఈ తరహా జాబ్లిస్టింగ్స్ గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగినట్టు నౌకరీ.కాం నివేదిక పేర్కొంది. చదవండి : ‘ఆస్ట్రాజెనెకా’ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన ఉద్యోగులిలా..ఉన్నతాధికారులిలా..! ఇంటి నుంచి పని పద్ధతిపై అక్కడక్కడా కొన్ని ఫిర్యాదులు, అసంతృప్తులున్నా స్ధూలంగా ఉత్పాదకత మెరుగైనట్టు వెల్లడైంది. బాసులు తమపై ఒత్తిళ్లు పెంచారని, టార్గెట్లతో వేధించారని, జీతాల్లో కోత విధించారని ఉద్యోగులు వాపోతే..ఇంటర్నెట్ పనిచేయడం లేదని, పవర్ లేదంటూ ఉద్యోగులు తప్పించుకుని తిరిగారని ఉన్నతాధికారులు తలపట్టుకున్నట్టు మరికొన్ని సర్వేలు చెప్పుకొచ్చాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో అత్యధికంగా ఇంటి నుంచి పని పద్ధతిని ఉద్యోగులు, సంస్ధలు అనుసరిస్తుండటంతో ఐటీ సేవల పరంగా ఉత్పాదకత పరంగా ఏమాత్రం ప్రతికూల ప్రభావం పడలేదని నిపుణులు వెల్లడించారు. మరో సర్వే సైతం ఇంటి నుంచి పని మెరుగైన ఫలితాలనే రాబట్టిందని వెల్లడైంది. ఇంటి నుంచి పని చేయటానికి ఒత్తిడికి గురి కాలేదని 62 శాతం అభిప్రాయపడగా.. వర్క్ ఫ్రం హోంలో భాగంగా రోజులో 12 గంటల కంటే ఎక్కవగా పని చేశామని 8.3 శాతం మంది చెప్పుకొస్తే. 8 నుంచి పది గంటలు పని చేశామని 48.9 శాతం తెలిపారు. రోజుకు ఏకంగా పది నుంచి పన్నెండు గంటల పాటు పనిచేశామని 28.1 శాతం మంది చెప్పారంటే ఉత్పాదకత ఏమాత్రం తగ్గకపోగా మరింత ఇనుమడించినట్టు వెల్లడైంది. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిగత జీవితాన్నీ మెరుగ్గా ఆస్వాదిస్తున్నామని ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి పనివిధానం పలు రంగాల్లో కొనసాగే అవకాశం ఉంది. రిమోట్ వర్కింగ్ అంటూ పలు సంస్ధలు ఈ పద్ధతికి ఓటేస్తున్నాయి. తక్కువ పనిగంటలే మేలు యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో పలు స్టార్టప్‌లు వారానికి నాలుగు పనిదినాలనే ఉద్యోగులకు ఆఫర్ చేస్తూ మెరుగైన ఉత్పాదకత సాధిస్తున్నాయి. గతంలో మైక్రోసాఫ్ట్్ సైతం వారానికి నాలుగురోజుల పనివిధానంలో ఉత్పాదకత 40 శాతం పెరిగినట్టు గుర్తించింది. బ్రిటన్‌లో నాలుగు రోజుల పనిదినాలు కలిగిన మూడోవంతు వాణిజ్య సంస్థల్లో ఉత్పాదకత మెరుగైందని హెన్లీ బిజినెస్ స్కూల్ చేపట్టిన పరిశోధన వెల్లడించింది. ఈ పద్ధతితో ఉద్యోగులు నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించారని వారిలో సంతోషం వెల్లివిరియడంతో పాటు తక్కువగా ఒత్తిడికి , అనారోగ్యానికి గురయ్యారని వెల్లడైంది. నాలుగు రోజుల పనివిధానంతో సిబ్బంది, కార్యాలయాలపై వెచ్చించే ఖర్చు భారీగా తగ్గడంతో పాటు మౌలిక వసతులు, ఇతర వ్యయాలూ తగ్గి ఉద్యోగాల కోతను అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారానికి నాలుగు రోజుల పని అన్ని సంస్ధలకూ మెరుగైన ఫలితాలనే రాబట్టలేదని, ఉత్పాదకత పడిపోతుందని మరికొన్ని సంస్ధలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా కోవిడ్-19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పని పద్ధతులపై ఆసక్తికర చర్చకు తెరలేచింది. -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన ప్రధాని
హెల్సెంకీ: ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ఓ ఇంటివారయ్యారు. తన చిరకాల స్నేహితుడు, సాకర్ ఆటగాడు మార్కస్ రాయ్కెన్ను వివాహమాడారు. ఈ విషయాన్ని సనా మారిన్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నేను ప్రేమించే వ్యక్తితో జీవితం పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. సుఖ దుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలబడ్డ తాము ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సనా మారిన్- మార్కస్ల వివాహం ప్రధాని అధికారిక నివాసం(కేసరంట)లో అత్యంత నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం. శనివారం జరిగిన ఈ వేడుకలో వధూవరులకు అత్యంత సన్నిహితులైన 40 మంది అతిథులు పాల్గొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇక ఫిన్లాండ్ ప్రభుత్వం సైతం కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్లో ఫొటోను షేర్ చేసింది. పెళ్లిలో వధువు సనా మారిన్ పొడవాటి తెలుపు రంగు గౌనులో తళుకులీనగా.. వరుడు మార్కస్ క్లాసిక్ టక్సిడో సూట్లో హుందాగా కనిపించారు. కాగా పదహారేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరికి ఎమ్మా అమైలా మారిన్ అనే రెండేళ్ల కూతురు ఉంది. తమ పద్దెనిమిదవ ఏటనే ప్రేమలో పడిన వీరు శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక గతేడాది డిసెంబరులో ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్.. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో(34) అత్యున్నత పదవి అలంకరించిన మహిళగా చరిత్రకెక్కారు. సోషల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆమె.. కాట్రీ కుల్ముని(32-సెంటర్ పార్టీ), లీ అండర్సన్(32- లెఫ్ట్ అలయన్స్), మారియా ఓహిసాలో(34- గ్రీన్ లీగ్), అన్నా మజా హెర్నిక్సన్(55- స్వీడిష్ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారు. -
ఫిన్లాండ్లో భారత రాయబారిగా రవీష్ కుమార్
ఢిల్లీ/హెల్సింకి : ఫిన్లాండ్లో భారత రాయబారిగా రవీష్ కుమార్‌ను భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1995 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి అయిన రవీష్ కుమార్.. ప్రస్తుతం విదేశాంగమంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు. 2017 జూలై నుంచి 2020 ఏప్రిల్ వరకు విదేశీమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా ఉన్న రవీష్ కుమార్.. ఈ సమయంలో అతి సున్నితమైన బాలాకోట్ స్ట్రైక్స్‌తోపాటు జమ్ముకశ్మీర్ పునర్వవస్థీకరణ, ఎన్నార్సీపై భారతదేశం యొక్క విధానాన్ని ప్రపంచానికి విడమరిచి చెప్పారు. ('అంకుల్.. 80 ఏళ్ల వయసులోనూ ఇరగదీశారు') అంతకుముందు ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కౌన్సిల్ జనరల్‌గా కూడా సేవలందించారు. జకర్తాతో పాటు థింపూ, లండన్‌లోని ఇండియన్ మిషన్‌లో పనిచేశారు. 25 ఏండ్ల ఐఎఫ్ఎస్ సర్వీసు కలిగివున్న రవీష్ కుమార్.. ప్రస్తుతం ఫిన్లాండ్లో భారత రాయబారిగా ఉన్న వాణిరావు స్థానంలో నియమితులయ్యారు. ఫిన్లాండ్లో భారత్‌కు చెందిన దాదాపు 35 కంపెనీలు ఐటీ, ఆరోగ్యం, ఆతిథ్యం, ఆటోమోటీవ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టగా.. ఫిన్లాండ్కు చెందిన దాదాపు 100 సంస్థలు భారత్‌లో విద్యుత్, టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ రంగాలలో పెట్టుబడులు పెట్టాయి.(అన్‌లాక్ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు) -
స్వీయ నిర్బంధంలోకి సనా మారిన్
హెల్సింకీ : మహమ్మారి కరోనా వైరస్ భయం ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ను వెంటాడుతోంది. ప్రధాని కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రధాని మారిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అంతేకాకుండా ప్రధాని కార్యాలయంలోని చాలామంది సిబ్బంది కూడా నిర్బంధంలోకి వెళ్లారు. దీంతో మారిన్ ఇంటి నుంచే తన కార్యక్రమాలను కొనసాగిస్తారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. (వుహాన్’ డైరీలో సంచలన విషయాలు) ఇక ఫిన్లాండ్ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4284 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 172 మంది మృత్యువాత పడ్డారు. కాగా 34 ఏళ్ల సనా మారిన్ ప్రపంచంలో ప్రధాని పదవి చేపట్టిన అతి చిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. మొత్తం మహిళల సారథ్యంలోనే గల ఐదు పార్టీల వామపక్ష కూటమికి సనా మారిన్ సారథ్యం వహిస్తారు. -
‘వరల్డ్ హ్యాపియెస్ట్ కంట్రీ’గా ఫిన్లాండ్
బ్లూమ్‌బర్గ్: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం (హ్యాపీయెస్ట్ కంట్రీ)గా ఫిన్లాండ్ వరుసగా మూడోసారి రికార్డుల్లోకి ఎక్కింది. మార్చి 20న వరల్డ్ హ్యాపినెస్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సుమారు 156 దేశాల ప్రజల జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవనశైలిని పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి అంశాల్లో ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని పరిశోధనలో వెల్లడైంది. చదవండి: కరోనా: 'నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి' సంతోషకర నగరాల జాబితాలో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి టాప్‌లో నిలిచింది. ఇక అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా విషయానికి వస్తే అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. అయితే అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా నగరాల విషయానికి వస్తే అతి తక్కువ సంతోషకర నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ ఏడవ స్థానంలో నిలిచింది. కాగా.. ఫిన్లాండ్లో ఉండే విస్తారమైన అడవులు, వేల సంఖ్యలో సరస్సులు అక్కడి వాసులు ఆహ్లాదకర, సంతోషకరమైన వాతావరణంలో ఉండేలా ఉపకరించాయని తెలిసింది. ఇక జింబాబ్వే, సౌత్ సూడాన్, అప్ఘనిస్తాన్ ప్రపంచలోనే అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ? -
ఇక నాలుగు రోజులే పని దినాలు
ప్రస్తుతం అమల్లో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాలను నాలుగు రోజులకు కుదిస్తానని ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మేరిన్ సోమవారం ప్రకటించారు. కార్మికులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఈ నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. పైగా రోజుకు ఆరు గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది గంటల పని వేళలు అమల్లో ఉన్నాయి. 34 ఏళ్ల సన్నా మేరిన్ ప్రపంచంలోనే పిన్న వయస్సుగల ప్రధాన మంత్రి. మహిళలే నాయకత్వం వహిస్తున్న మరో నాలుగు రాజకీయ పార్టీలతో కలిసి ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్నారు. మిగతా మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తోన్న మహిళలు 35 ఏళ్ల లోపువారే అవడం మరో విశేషం. మేరిన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు దేశ రవాణా మంత్రిగా పనిచేశారు. కార్మికులు కుటుంబ సభ్యులు మరింత సమయం గడపడంతోపాటు జీవితానికి సంబంధించిన సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నా మేరిన్ తెలిపారు. తమ నిర్ణయం వల్ల కార్మికులు మరింత చురుగ్గా పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే అమల్లోకి రానున్న నాలుగు రోజుల పని దినాల పట్ల వామపక్ష పార్టీలు హర్శం వ్యక్తం చేశాయి. -
ఆమె ఓ సేల్స్‌గర్ల్; క్షమించండి!
హెల్సెంకి: ఫిన్లాండ్ ప్రధాని సనా మారినాపై ఇస్టోనియా దేశపు మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. ఆ దేశ అధ్యక్షురాలు కెర్ట్సీ కాల్జులాద్ క్షమాపణలు చెప్పారు. ఇస్టోనియా హోంమంత్రి మార్ట్ హెల్మె తరఫున మారినా, ఆమె ప్రభుత్వాన్ని క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫిన్లాండ్ కేబినెట్‌కు తెలియజేయాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలీ నినిస్టోకు ఆమె విఙ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధాన మంత్రిగా ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు తన కేబినెట్లోనూ అత్యధికంగా 12 మంది మహిళలకు స్థానం కల్పించారు. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 30-35 ఏళ్ల మధ్య వయసున్న గలవారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ కొత్త ప్రధాని, ఆమె ప్రభుత్వం గురించి ఇస్టోనియా హోం మంత్రి మార్ట్ హెల్మె మాట్లాడుతూ.. ‘సేల్స్ గర్ల్ సనా మారిన్‌కు నార్డిక్ దేశాన్ని పాలించే సామర్థ్యం ఉందా’ అని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడు ఓ సేల్స్ గర్ల్ ప్రధాని అయ్యింది. గల్లీల్లో తిరిగే కార్యకర్తలు, చదువు లేని వాళ్లు ఆమె కేబినెట్లో మంత్రులుగా చోటు దక్కించుకున్నారు’ అని తమ పార్టీ రేడియో టాక్‌షోలో వ్యాఖ్యానించారు. దీంతో మార్ట్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. మహిళలపై, ఏకంగా దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానిని కించపరిచిన మార్ట్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ అధ్యక్షుడితో మాట్లాడిన ఇస్టోనియా అధ్యక్షురాలు.. తమ దేశం తరఫున సనా మారిన్, ఫిన్లాండ్ ప్రభుత్వాన్ని క్షమాపణ కోరారు.(‘వాటి గురించి అసలు ఆలోచించలేదు’) కాగా ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన సనా మారిన్... విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఓ సంస్థలో క్యాషియర్‌గా పనిచేశారు. సామాజిక కార్యకర్తగా ఎదిగి సోషల్ డెమొక్రాట్ పార్టీ తరఫున ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ విషయం గురించి మారిన్ ట్విటర్లో ప్రస్తావిస్తూ.. ‘ ఫిన్లాండ్ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ ఉన్న పేద పిల్లలందరినీ విద్యావంతులను చేసి... వారి జీవితంలో విజయవంతం అయ్యేలా చేస్తాం. ఇక్కడ ఓ క్యాషియర్ కూడా ప్రధాని అవ్వగలరు’ అని పేర్కొన్నారు. -
ఫిన్‌ల్యాండ్ కేబినెట్లో 12 మంది మహిళలు
హెల్సింకి: ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ తన కేబినెట్లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30–35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఆమె కేబినెట్లో ఏడుగురు పురుషులు కూడా ఉన్నారు. ఆర్థికం, విద్య, అంతర్గత వ్యవహారాలు వంటి ముఖ్యశాఖలన్నీ మహిళలకే అప్పగించారు. 34 ఏళ్ల వయసున్న సన్నా మారిన్ మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కొని నెగ్గారు. మారిన్‌కు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి. ఫిన్‌ల్యాండ్‌లో అధికారంలో ఉన్న సెంటర్ లెఫ్ట్ సంకీర్ణ సర్కార్‌ను నడపడం ఆమె ముందున్న అతి పెద్ద సవాల్. ‘‘మర్యాద మన్ననల మధ్య ప్రతీ చిన్నారి ఎదుగుదల ఉండాలి. ఎవరైనా ఏదైనా సాధించేలా సమాజాన్ని నిర్మించడమే నా ధ్యేయం‘‘అని మారిన్ ట్వీట్ చేశారు. దేశంలో పోస్టల్ సమ్మెను ఎదుర్కోవడంలో విఫలమైనందుకు గతవారంలో అంటి రిన్నె ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మారిన్ పగ్గాలు తీసుకున్నారు. సెంటర్ పార్టీకి చెందిన కత్రి కులుమణి (32)కి ఆర్థిక శాఖ, గ్రీన్ పార్టీ నాయకురాలు మారియా ఒహిశాలో (34)కు అంతర్గత వ్యవహారాలు, లెఫ్ట్ కూటమి చైర్‌వుమెన్ లీ అండెర్సన్ (32)కు విద్యాశాఖ అప్పగించారు. కార్మికుల అసంతృప్తి జ్వాలలు, ఎటు చూసినా సమ్మెలు నడుస్తున్న వేళ ప్రధానిగా మారిన్ తన ఎదుట ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. -
‘వాటి గురించి అసలు ఆలోచించలేదు’
హెల్సెంకీ: ఫిన్లాండ్లో రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ సనా మారిన్ దేశ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అంటీ రిన్నే ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సనాను సోషల్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో(34) అత్యున్నత పదవి అలంకరించిన మహిళగా సనా చరిత్రకెక్కారు. కాగా పోస్టల్ ఉద్యోగుల జీతాల కోతలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో సోషల్ డెమొక్రాట్లు- సెంటర్ పార్టీ నేత్వత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రిన్నే తీరుపై విమర్శలు గుప్పించింది. దీంతో రినే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ప్రధానిగా ఎన్నికైన అనంతరం సనా మాట్లాడుతూ... ‘ తిరిగి నమ్మకాన్ని సంపాదించడానికి ఎంతగానో కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేనెప్పుడూ వయస్సు గురించి గానీ, మహిళను అనే విషయం గురించి గానీ ఆలోచించలేదు. ప్రజల నమ్మకాన్ని చూరగొని వారికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేస్తాం’ అని పేర్కొన్నారు. కాగా మంగళవారం ఆమె ఫిన్లాండ్ ప్రధానిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఇక సనా కంటే ముందు ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ హాంచరుక్(35) అత్యంత పిన్న వయస్సులో అత్యున్నత పదవి దక్కించుకున్న మహిళగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. కాగా ఫిన్లాండ్లోని సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలన్నీ మహిళల నేతృత్వంలోనివే(సనా మారిన్(34)- సోషల్ డెమొక్రటిక్ పార్టీ, కాట్రీ కుల్ముని(32)- సెంటర్ పార్టీ, లీ అండర్సన్(32)- లెఫ్ట్ అలయన్స్, మారియా ఓహిసాలో(34)- గ్రీన్ లీగ్, అన్నా మజా హెర్నిక్సన్(55)- స్వీడిష్ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్) కావడం విశేషం. -
నోకియా 2.3 ఆవిష్కరణ
కైరో/ఈజిప్టు: ఫిన్లాండ్కు చెందిన నోకియా బ్రాండ్ ఫోన్స్ విక్రయ సంస్థ హెచ్ఎమ్డీ గ్లోబల్.. నోకియా 2.3 పేరిట అధునాతన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదలచేసింది. దీని ధర 109 యూరోలు కాగా, భారత్‌లో రూ. 8,600 వరకు ఉండే అవకాశం ఉంది. 6.2 అంగుళాల డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు అధునాతన ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ గ్లోబల్ జనరల్ మేనేజర్ ప్రణవ్ ష్రాఫ్ అన్నారు. -
వింత పోటీలో గెలిచిన లిథువేనియా జంట
ఫిన్లాండ్ : ఫిన్లాండ్ దేశం నిర్వహించిన 'వైఫ్ క్యారీంగ్' పోటీ టైటిల్‌ను లిథువేనియా దేశానికి చెందిన జంట గెలుచుకుంది. సొంకాజర్వీలో ఈ పోటిలో ఫ్రాన్స్, జర్మని ఆస్ట్రేలియాతో పాటు 12 దశాల నుంచి 12 జంటలు పాల్గొన్నాయి. వైటాటాస్ కిర్క్లియాస్కాస్, భార్య నెరింగా కిర్క్లియాస్కీన్లు 253.5 మీటర్ల దూరాన్నికేవలం 1 నిమిషం 6.72 సెకన్లలోనే పూర్తి చేసి చాంపియన్‌గా నిలిచారు. గెలిచిన ఈ జంటకి భార్య బరువుకు సమానంగా ఉండే బీరు బాటిల్‌ను హుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా కిర్క్లియాస్కాస్ మాట్లాడుతూ మేము గెలుస్తామని అనుకోలేదని, ఇది ఊహించని విజయమని అన్నారు. పోటిలో సెకండ్ స్టెజీకి వెళ్లాక నేను పరుగెత్తలెనేమో అనుకున్నాను, కాని నా భార్య ఇచ్చిన పోత్సాహంతోనే ఈ గెలుపు సాధ్యమైందని, తను ఏప్పుడూ నాకు ఉత్తమమైన భార్య అని అన్నారు. ఈ పోటిలో భర్త భార్యను ఎత్తుకుని ఓ పెద్ద కర్రపై నుంచి దూకుతూ వచ్చి నడుము లోతు వరకు ఉన్న నీటిలో పరుగెత్తాలి. అలాగే ఇందులో పోటి చేసే భార్య 17 ఏళ్ల వయస్సు ఉండి 49 కిలోల బరువు మాత్రమే ఉండాలి. ఇందులో పోటి చేసే జంట కచ్చితంగా వివాహితులై ఉండాలన్న నిబంధన లేదు, అవివాహితులు కూడా ఈ పోటిలో పాల్గోనవచ్చని ఈవెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. -
గుండె వ్యాధులను పసిగట్టే సరికొత్త వ్యవస్థ
లండన్: ప్రస్తుతం ప్రతీ రంగంలో టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైద్యరంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. తాజాగా ఫిన్లాండ్కి చెందిన శాస్త్రవేత్తలు హృదయ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించే ఓ సరికొత్త వ్యవస్థను రూపొందించారు. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో వచ్చే గుండె వ్యాధులను డాక్టర్ల కంటే కచ్చితంగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సుమారు 950 మంది రోగులపై ఏకంగా ఆరేళ్లపాటు పరిశోధన జరిపిన అనంతరం వైద్యులు ఈ టెక్నాలజీ పనితీరు పట్ల నిర్ధారణకు వచ్చారు. గుండె కొట్టుకునే తీరు, వేగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేస్తూ... భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పసిగడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల రోగికి ముందుగానే సరైన చికిత్స అందించడం వల్ల మెరుగైన ఫలితాన్ని పొందవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. -
ఉర్రూతలూగించే ‘ఏర్ గిటార్’
-
ఉర్రూతలూగించే ‘ఏర్ గిటార్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఏర్ గిటార్ కాంపిటేషన్’ పేరు వింటేనే అర్థం అవుతుంది గాలిలో గిటార్ వాయించడమని. బ్యాక్ గ్రౌండ్లో మెటాలిక్ గిటార్ సంగీతం హోరెత్తుతుంటే దానికి అనుగుణంగా ‘ఏర్ గిటార్ కాంపిటేటర్’ తానే నిజంగా గిటార్ వాయిస్తున్నట్లు గాలిలో చేతులు, వేళ్లూ కదుపుతూ, అనుగుణంగా అడుగులేస్తూ రెచ్చిపోవాలి. ప్రేక్షకులను ఉర్రూతలూగించాలి. అదెంత పని అని అనుకోవద్దు! గాలిలో గిటార్ వాయించడానికి కూడా ఎంతో అనుభవం కావాలి. అలాంటి వారి కోసం ప్రతియేటా ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు కూడా జరుగుతున్నాయని తెలిస్తే కించిత్తైన ఆశ్చర్యం కలగకమానదు. ఫిన్లాండ్లోని ఒవులూ నగరంలో ప్రతిఏటా ఆగస్టు నెలలో ‘గాలిలో గిటారు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. వీటికి ప్రపంచంలోని 20 దేశాల నుంచి ఛాంపియన్లు హాజరవుతున్నారు. వాటిలో భారత్ కూడా ఉండడం విశేషం. ముంబైలోని ‘ఏర్ గిటార్ ఇండియా’ సంస్థ ప్రతి ఏటా జాతీయ ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించి అందులో గిలిచిన వారిని ఫిన్లాండ్ పోటీలకు పంపిస్తోంది. వారి ఖర్చులను పూర్తిగా భరిస్తుంది. దేశంలోని పలు నగరాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణంగా జూన్, జూలై నెలల్లో నిర్వహిస్తుంది. తుది పోటీలు ముంబైలోనే జరుగుతాయి. ఫిన్లాండ్లో మొదటిసారి 1996లో ఏర్ గిటార్ పోటీలు నిర్వహించారు. అప్పుడు ‘ఒవులూ మ్యూజిక్ వీడియో ఫెస్టివల్’లో భాగంగా దీన్ని నిర్వహించారు. నాటి నిర్వాహకులు సరదాగా ఆ పోటీలను ‘ఏర్ గిటార్ వరల్డ్ ఛాంపియన్షిప్’ అని అభివర్ణించారు. ఈ పోటీల గురించి విన్న అమెరికాలోని ఔత్సాహికులు 2003లో ఓ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఫిన్లాండ్, అమెరికా బృందాల సంయుక్త కృషితో ఆ సంవత్సరం నుంచే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈసారి జరగబోతున్నది 17వ ఛాంపియన్షిప్ పోటీలు. 2006లో అమెరికాలో విడుదలైన ‘ఏర్ గిటార్ నేషన్’ డాక్యుమెంటరీ, ‘టూ ఏర్ ఈజ్ హ్యూమన్’ అనే చిత్రం ద్వారా ఈ పోటీలకు ప్రాముఖ్యత పెరిగింది. ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ కోసం తపించిపోయే జర్నలిస్ట్ డాన్క్రేన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘టూ ఏర్ ఈజ్ హ్యూమన్’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కుర్రకారులో క్రేజీ పెరిగిపోవడంతో అమెరికాలో కూడా జాతీయ ఏర్ గిటార్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆదరణ పెరిగింది. ఫోనోగ్రామ్తోనే పుట్టుక పాశ్చాత్య దేశాల్లో 1950లోనే ఈ కళ పుట్టగా 1980 ప్రాంతంలో బాగా రాణించింది. నాటి గ్రామ్‌ఫోన్, నేటి ఫోనోగ్రామ్ రాజ్యమేలుతున్న కాలంలో సంగీతానికి అనుగుణంగా పెదాలు ఆడించడం, చేతులు కలపడం, అడుగులు వేస్తూ చిందులు తొక్కడం నుంచి ఈ కళ పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. 1980 ప్రాంతంలో ప్రేక్షకులను మరింత అలరించడం కోసం పాశ్చాత్య సంగీత కచేరీల్లో కూడా ఈ కళను ప్రవేశపెట్టారు. ఓ పక్క కచేరీ కళాకారులు నిజమైన గిటార్ వాయిస్తూ, పాడుతూ ఉంటే పక్కనే ఉండే పెదవులు ఆడించే కళాకారులు, గాలి గిటారిస్టులు సంగీతానికి అనుగుణంగా చిందులేస్తూ రెచ్చిపోయేవారు. గొంతుతో పాడేవారు, నిజమైన గిటారుతో వాయించేవారు అంతగా ఎగరలేరు, దూకలేరు కనుక వీరి అవసరం పడింది. ఒకసారి గాలిలో గిటారు వాయిస్తే, మరోసారి పియానో, వాయించడం, మరో సారి డ్రమ్స్ కొట్టినట్లు నటించడం, అన్నీ కలిపి ఒక్కరే నటించడం లాంటి ప్రయోగాలు కూడా వచ్చాయి. నిజమైన కచేరీల్లోనూ నటన 1957లో అమెరికాలో జరిగిన స్టీవ్ అలెన్ షో, 1969లో వుడ్‌స్టాక్‌లో జో కాకర్ కచేరీలో వీరి ప్రదర్శన కనిపిస్తుంది. 20వ శతాబ్దంలో జిమ్మీ హెడ్రిక్స్, జిమ్మీ పేజ్, ఎడ్డీవాన్ హాలెన్, రిక్ నీల్సన్, లీటా ఫోర్డ్ లాంటి రాక్, పాప్ స్టార్లు ఈ గాలి గిటారిస్టులతో కలిసి కచేరీలు నిర్వహించారు. ‘సిండర్ఫెల్లా, బిల్ అండ్ టెడ్స్ ఎక్సలెంట్ అడ్వెంచర్, రిస్కీ బిజినెస్’ లాంటి హాలివుడ్ చిత్రాల్లో కామిక్ పాత్రల్లో గాలి గిటారిస్టులు కనిపిస్తారు. అమెరికాలోని జాన్ మ్యాకెన్నా, మైఖేల్ మోఫిట్ 1983లో రాసిన ‘ది కంప్లీట్ ఏర్ గిటార్ హ్యాండ్‌బుక్’లో కొంత చరిత్ర ఉంది. ఫిన్లాండ్లో 2018లో జరిగిన 16వ ప్రపంచషిప్ పోటీల్లో జార్జియా లంచ్ అనే అమెరికా ఏర్ గిటారిస్ట్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈసారి ఆమెతో సహా పోటీదారులందరిని ఓడించిన వారే విజేత. జార్జియా లంచ్ లావు దక్కడం కోసం గాలి గిటార్‌ను ప్రాక్టీస్ చేసిందట. అయినా ఆమె లావు తగ్గలేదు. ఆమె పేరులోనే లంచ్ ఉంది మరి. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న వారు ప్రపంచ శాంతికి సందేశం ఇస్తూ తిరగాలట! -
సంతోషంలో వెనకబడ్డాం
ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడు స్థానాలు దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. 2018లో మన ర్యాంకు 133. ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 156 దేశాలకు సంబంధించి బుధవారం విడుదల చేసిన ‘హ్యాపినెస్ రిపోర్ట్’లో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. భారత్ కన్నా పాకిస్తాన్ మెరుగైన ర్యాంకు సాధించి 67వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. అలాగే బంగ్లాదేశ్(125), చైనా(93) కూడా భారత్ కన్నా ముందంజలో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు 19వ ర్యాంకు దక్కింది. యుద్ధ ప్రభావిత దక్షిణ సూడాన్ ఈ సూచీలో అట్టడుగున నిలిచింది. -
క్వార్టర్స్‌లో దినేశ్
న్యూఢిల్లీ: గీబీ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ దినేశ్ డాగర్ శుభారంభం చేశాడు. ఫిన్లాండ్లో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల 69 కేజీల విభాగం తొలి రౌండ్లో దినేశ్ 3–2తో 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్డస్ పెట్రాస్కాస్ (లిథువేనియా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 64 కేజీల విభాగంలో అంకిత్ ఖటానా 0–5తో ల్యూక్ మెక్కార్మక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు), గోవింద్ సాహ్ని (49 కేజీలు)లకు నేరుగా సెమీఫైనల్లోకి ‘బై’ లభించడంతో కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి.ఈ టోర్నీలో 15 దేశాల నుంచి 100 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. -
పుతిన్‌ను చూసి వణికిపోయిన ట్రంప్ భార్య..!
ఫిన్లాండ్: అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిత్ పుతిన్‌ను చూసి భయంతో వణికిపోయారు. అతనితో కరచాలనం చేయగానే ఒక్కసారిగా భయంతో బిక్కచచ్చిపోయారు. రష్యా, అమెరికా దౌత్య సంబంధాల బలోపేతానికి ఇరు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ ఫిన్లాండ్లో మంగళవారం సమావేశమయ్యారు. కార్యక్రమంలో భాగంగా పుతిన్‌తో చేయికలిపిన అనంతరం మెలానియా ముఖంలో అదో రకమైన హావభావాలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్విటర్లో కామెంట్ల వర్షం కురుస్తోంది. బహుశా పుతిన్‌కి షేక్ హాండ్ ఇవ్వడం ఆమెకు ఇష్టం లేదేమోనని కొందరు ట్వీట్ చేయగా.. క్షణ కాలంలో ముఖంలో ఎన్ని భావాలు వ్యక్తం చేయొచ్చో మెలానియాను చూసి నేర్చుకోవచ్చని మరికొందరు అంటున్నారు. తనను పుతిన్ చంపేస్తాడా అన్నంత భయంగా మెలానియా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయని ఇంకో ట్విటరటీ పేర్కొన్నారు. తన చేతిలో ఉన్న చాకొలేట్‌ను పుతిన్ లాక్కొంటాడేమోనని మెలానియా భయపడుతోంది కావొచ్చని మరో వ్యక్తి జోక్ పేల్చారు. కాగా, ట్వీటర్లో ఈ వీడియో వైరల్ అయింది. ఫ్రీమెలానియా అనే హాష్టాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. -
పుతిన్ పాచికకు ట్రంప్ చిత్తు...!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర భేటీ ద్వారా కొంత సానుకూల ఇమేజి పొందాలనుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫిన్లాండ్లోని హెల్సెంకీలో జరిగిన భేటీలో పుతిన్ ముందు ట్రంప్ తేలిపోయారని, గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ స్థాయిలో అణిగిమణిగి, దిగజారిపోలేదంటూ కొందరు అమెరికన్ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు దుమ్మెత్తిపోసాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదంటూ పుతిన్ ఇచ్చిన స్వయం దృవీకరణకు ట్రంప్ వంతపాడడాన్ని అమెరికన్ రాజకీయ నేతలు, మీడియా తూర్పారపడుతున్నాయి. ట్రంప్ ఇష్టపడే ‘ఫాక్స్’ నెట్వర్క్ సైతం పుతిన్‌తో కలిసి ఆయన నిర్వహించిన వివాదాస్పద మీడియా సమావేశాన్ని ఎండగట్టింది. అమెరికా నిఘా వ్యవస్థపై కంటే కూడా పుతిన్ చెప్పిన మాటలనే తాను నమ్ముతున్నానని ట్రంప్ పేర్కొనడాన్ని సీఎన్ఎన్, ఫాక్స్ ఇతర సంస్థలు తప్పుబట్టాయి. టీవీ చర్చలతో పాటు, ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా ట్రంప్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రెండు పెద్ద దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశమంటే అంతర్జాతీయ సమాజంపై ప్రభావం చూపే నిర్ణయాలు ఏవైనా వెలువడతాయా అన్న భావనకు భిన్నంగా అమెరికా స్థానిక రాజకీయాలు అక్కడ చర్చనీయాంశం కావడాన్ని పరిశీలకులకు సైతం మింగుడుపడడం లేదు. గత ఎన్నికల్లో తాను హిల్లరీ క్లింటన్‌ను సులభంగా ఓడించానని, అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై స్పెషల్ ప్రాసిక్యూటర్ రాబర్ట్ మలర్ విచారణ అవమానకరమైనదిగా ట్రంప్ అభివర్ణించడాన్ని తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ అంశాలపై, రెండు దేశాల సంబంధాలపై కూలంకశంగా చర్చించాల్సిందిపోయి పుతిన్ పన్నిన రాజకీయ ఉచ్చులో ట్రంప్ సులభంగా పడిపోయారని వారి అభిప్రాయం. అమెరికా ఎన్నికల్లో 12 మంది రష్యన్ మిలటరీ అధికారుల ప్రమేయం ఉందంటూ ఇటీవలే మల్లర్ నిగ్గుతేల్చారు. సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ, ఇతర సంస్థలు కూడా దీనిని నిర్థారించాయి. అయితే తమ నిఘా సంస్థల విచారణను తిరస్కరించేలా ట్రంప్ చేసిన ప్రకటన వల్ల అమెరికన్ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్టుగా మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు. ట్రంప్ వేసిన తప్పటడుగు వల్ల పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి రావచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. రష్యా జోక్యంపై మల్లర్ నిర్థారణ నేపథ్యంలో అసలు పుతిన్‌తో శిఖరాగ్ర భేటీనే రద్దు చేసుకోవాలనే వత్తిడి ట్రంప్‌పై వచ్చింది. అయినా ఖాతరు చేయకుండా అమెరికా గత విధానాలను బహిరంగంగా విమర్శించారు. కొన్నేళ్ల అమెరికా మూర్ఖత్వం, అవివేకం కారణంగా రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు ఎన్నికల ఫలితాలను ఆ దేశం ప్రభావితం చేసిందనే ఆరోపణలతో అవి మరింత దిగజారాయని ఈ భేటీకి ముందు ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా రష్యా కంటే కూడా ఐరోపా సంఘం (ఈయూ)మే పెద్ద శత్రువు అన్న ఆయన మాటలూ అమెరికన్లకు రుచించడం లేదు. విభేదాలను మరిచిపోయారా ? రష్యా వైఖరిపట్ల అమెరికాకు అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆ దేశం క్రీమియాను కైవసం చేసుకోవడం, ఉక్రేయిన్‌పై ఆధిపత్యం చెలాయించడం, సిరియా విషయంలో రెండు దేశాలు పరస్పరభిన్నమైన వైఖరి తీసుకోవడం, అమెరికా వ్యతిరేకిస్తున్న ఇరాన్ ప్రభుత్వానికి రష్యా మద్దతు కొనసాగింపు, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ఉన్ను తనపావుగా అమెరికాపై పుతిన్ ప్రయోగిస్తున్నాడనే అనుమానాలు, నాటో దేశాల విస్తరణను రష్యా వ్యతిరేకించడం వంటివి కొంతకాలంగా ఈ రెండుదేశాల మధ్యనున్న వైరం కొనసాగడానికి కారణమవుతున్నాయి. శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాలపై చర్చించకుండా రష్యాకు వత్తాసు పలకడం ఎవరికీ కొరుకున పడడం లేదు. ఈ స్థాయిలో భేదాభిప్రాయాలున్నప్పటికీ పుతిన్ తానా అంటే ట్రంప్ తందానా అనడం అమెరికన్ల వ్యతిరేకతకు కారణమవుతోంది. -
ట్రంప్, పుతిన్‌ను ఆ దేశం నవ్వించలేకపోయింది!
ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిర్వేదం ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండే కావొచ్చు. ట్రంప్, పుతిన్‌లను మాత్రం ఆ దేశం కనీసం నవ్వించలేక పోయింది. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ఇరువురి మొహాల్లో సంతోషమే కనిపించలేదు. తొలుత భేటీ కోసం ఎదురెదురుగా వచ్చినప్పుడు వారు ఒకరికొకరు చేతులు కూడా కలుపుకోలేదు. ఏ కోలాహలం లేకుండా నిశ్శబ్ధంగానే చర్చల గదిలోకి వెళ్లారు. తర్వాత తమ తమ కుర్చీల్లో కూర్చున్నాకనే ముభావంగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అమెరికా అధికారులు కూడా అంతా గంభీరంగానే కనిపించారు. శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో కూడా.. పుతిన్ తల దించుకుని నీరసంగా కూర్చోగా ట్రంప్ కూడా నిరుత్సాహంగా, కోపంగా కనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌లో మాత్రం పుతిన్‌కు ట్రంప్ కన్ను కొడుతున్నట్లుగా కనిపించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను ట్రంప్ సింగపూర్‌లో కలిసినప్పుడు ఉన్న సందడి ఫిన్లాండ్లో ఏ మాత్రం కనిపించలేదు. కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు కలిసినా ఫిన్లాండ్‌నే అందుకు వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్లు హెల్సింకిలోనే భేటీ అయ్యారు. ఈ భేటీపై వార్తలనందించేందుకు వివిధ దేశాల నుంచి 2 వేల మంది విలేకరులు కూడా హెల్సింకికి వచ్చారు. హెల్సింకి: 18 నెలల క్రితం దేశాధ్యక్షుడయిన వారొకరు, 18 సంవత్సరాలుగా దేశాన్ని నడుపుతున్న వారొకరు. ఆ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండు దేశాలకు అధిపతులు. అనేక అంశాల్లో పోటీ కారణంగా ఈ రెండు దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ఘర్షణాత్మక వాతావరణమే నెలకొంది. అయితే ఇప్పడు కొత్తగా మైత్రి కోసం ఇరు దేశాధినేతలూ ప్రయత్నించారు. ఆ ఇద్దరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వివిధ అంశాలపై చర్చల కోసం వీరిద్దరూ తొలిసారిగా ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో సోమవారం భేటీ అయ్యారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంలోని మిగతా దేశాలపై కూడా ఉంటుంది కాబట్టి వీరి భేటీకి అంత ర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ అనంతరం ఇద్దరు నేతలూ సానుకూలంగా స్పందించారు. పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర భేటీ సోమవారం ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరిగింది. సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఆరంభమని నేననుకుంటున్నా. అందరికీ చాలా చాలా మంచి ఆరంభం’ అని అన్నారు. అటు పుతిన్ కూడా ట్రంప్‌తో తన చర్చలు ‘చాలా విజయవంతంగా, ఉపయోగకరంగా’ సాగాయని తెలిపారు. ఫిన్లాండ్ అధ్యక్ష భవనంలోని ఓ గదిలో ఇద్దరు నేతలు రహస్యంగా భేటీ అయ్యి రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో గదిలో అనువాదకులు తప్ప మరెవరూ లేరు. ట్రంప్, పుతిన్‌లు ఒకరితో ఒకరు ఏకాంతంగా మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పుతిన్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్.. భేటీ కోసం గదిలోకి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ‘రష్యాతో అమెరికా సంబంధాలు ప్రస్తుత అధమ స్థాయికి పడిపోవడానికి గత అమెరికా ప్రభుత్వాలే కారణం’ అని నిందించారు. చర్చల ప్రారంభానికి లోనికి వెళ్లే ముం దు ఇద్దరూ ముభావంగానే మీడియాతో మాట్లాడారు. ఇద్దరి ముఖాల్లోనూ పెద్ద ఉత్సాహం కనిపించలేదు. బంధాల బలోపేతానికి కృషి అమెరికా, రష్యా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం తాము కృషి చేస్తామని ట్రంప్, పుతిన్‌లు భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను అధిగమించడం కోసం సహకారంతో పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సిరియా, ఉక్రెయిన్, చైనా, అంతర్జాతీయ వ్యాపారంలో సుంకాలు, అణ్వాయుధ సంపత్తి తదితరాలపై తాము చర్చించామన్నారు. ‘మా బంధాలు ఇప్పుడున్నంత బలహీనంగా గతంలో ఎప్పుడూ లేవు. అయితే నాలుగు గంటల క్రితం పరిస్థితి మారిందని నేను నమ్ముతున్నా. ఇదొక మలుపు’ అని ట్రంప్ అన్నారు. రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పడంలో ఇది ఆరంభం మాత్రమేనన్నారు. పుతిన్ మాట్లాడుతూ ‘మా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేవన్నది అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత ఉద్రిక్త వాతావరణానికి పెద్ద కారణాలేవీ లేవు’ అని అన్నారు. రష్యా నుంచి గ్యాస్, ముడి చమురును జర్మనీకి తరలించేందుకు నార్డ్ స్ట్రీమ్2 పైప్‌లైన్‌ను నిర్మించినప్పటికీ ఉక్రెయిన్ మీదుగా తమ గ్యాస్ సరఫరా కొనసాగుతుందని ట్రంప్‌కు తాను హామీనిచ్చినట్లు చెప్పారు. నార్డ్ స్ట్రీమ్2 వల్ల అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు దెబ్బతింటాయా? అన్న ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు. జోక్యంపై చాలా సేపు మాట్లాడాం: ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం గురించి కూడా తాము చాలా సమయమే మాట్లాడామని ట్రంప్ చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి ఇతర వివరాలను వెల్లడించని ఆయన.. రష్యా జోక్యం లేదంటూ బహిరంగంగా చెప్పనూలేదు. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారంటూ ఇటీవల అమెరికా 12 మంది రష్యా నిఘా అధికారులపై అభియోగం మోపడాన్ని విలేకరులు ప్రస్తావించగా, రష్యా జోక్యం ఎంత మాత్రం లేనట్లు పుతిన్ తనకు చెప్పారనీ, ఈ అంశంలో రాబర్ట్ ముల్లర్ చేసిన విచారణ విఫలమైందని ట్రంప్ పేర్కొన్నారు. తన ప్రచార బృందానికి రష్యాతో ఏ సంబంధాలూ లేవని ట్రంప్ పునరుద్ఘాటించారు. అటు పుతిన్ కూడా ‘అమెరికా అంతర్గత వ్యవహారాల్లో రష్యా ఎప్పడూ తలదూర్చలేదు. భవిష్యత్తులో ఆ పని చేసే ప్రణాళికలూ లేవు’ అని తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను, ముడి చమురు ధరలను నియంత్రించడం కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని పుతిన్ ప్రకటించారు. ట్రంప్‌కు సంబంధించిన రహస్య సమాచారమేదో రష్యా వద్ద ఉందన్న వాదనలను పుతిన్ కొట్టిపారేశారు. ట్రంప్ తన వ్యాపార అవసరాల కోసం మాస్కోకు వచ్చినప్పుడు ఆ విషయం కూడా తనకు తెలిసేది కాదన్నారు. ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిర్వేదం ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండే కావొచ్చు. ట్రంప్, పుతిన్‌లను మాత్రం ఆ దేశం కనీసం నవ్వించలేక పోయింది. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ఇరువురి మొహాల్లో సంతోషమే కనిపించలేదు. తొలుత భేటీ కోసం ఎదురెదురుగా వచ్చినప్పుడు వారు ఒకరికొకరు చేతులు కూడా కలుపుకోలేదు. ఏ కోలాహలం లేకుండా నిశ్శబ్ధంగానే చర్చల గదిలోకి వెళ్లారు. తర్వాత తమ తమ కుర్చీల్లో కూర్చున్నాకనే ముభావంగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అమెరికా అధికారులు కూడా అంతా గంభీరంగానే కనిపించారు. శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో కూడా.. పుతిన్ తల దించుకుని నీరసంగా కూర్చోగా ట్రంప్ కూడా నిరుత్సాహంగా, కోపంగా కనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌లో మాత్రం పుతిన్‌కు ట్రంప్ కన్ను కొడుతున్నట్లుగా కనిపించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను ట్రంప్ సింగపూర్‌లో కలిసినప్పుడు ఉన్న సందడి ఫిన్లాండ్లో ఏ మాత్రం కనిపించలేదు. కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు కలిసినా ఫిన్లాండ్‌నే అందుకు వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్లు హెల్సింకిలోనే భేటీ అయ్యారు. ఈ భేటీపై వార్తలనందించేందుకు వివిధ దేశాల నుంచి 2 వేల మంది విలేకరులు కూడా హెల్సింకికి వచ్చారు. ఆధిపత్యం.. నిస్సహాయత లండన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల భేటీ సందర్భంగా వారి శరీర కదలికలు, హావభావాలపై ఓ బ్రిటన్‌కు చెందిన సైకాలజిస్ట్ పీటర్ కొల్లెట్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హెల్సింకీలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు కొద్దిసేపు ఆధిపత్య ధోరణితో ప్రవర్తించారనీ, మరికాసేటికే నిస్సహాయంగా కన్పించారని వెల్లడించారు. ‘ఇద్దరు నేతలు ఒకరి సమక్షంగా మరొకరు అంత రిలాక్స్‌గా కన్పించలేదు. చర్చల గదిలోకి ట్రంప్ దర్జాగా ప్రవేశిస్తే, పుతిన్ మాత్రం గొప్ప ఆత్మవిశ్వాసంతో లోపలకు వచ్చారు. ఈ సమావేశం లో కుడివైపు కూర్చున్న ట్రంప్.. పుతిన్‌కు తలొగ్గుతున్నట్లు అరచేతిని సాధారణం కంటే కొంచెం పైకెత్తి ఆయనతో కరచాలనం చేశారు. తద్వారా చర్చల్లో మరింత చొరవ తీసుకోవాలని పుతిన్‌ను పరోక్షంగా కోరినట్లయింది. అంతలోనే పుతిన్‌ను కూర్చోవాల్సిందిగా కుర్చీ చూపించడం ద్వారా మొత్తం పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు ట్రంప్ యత్నించారు’ అని కొల్లెట్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ చేతుల్ని గోపురం ఆకారంలో ఉంచడంపై స్పందిస్తూ.. ‘చుట్టూ ఉన్నవారి కంటే తాను గొప్పవాడినని భావించే లేదా ఆత్మన్యూనతాభావంతో ఉండే వ్యక్తులే ఇలా చేతుల్ని పెడతారు. పుతిన్‌తో కరచాలనం సమయంలో ట్రంప్ ఇబ్బందిగా కన్పించారు. సమావేశంలో అధిక్యం ప్రదర్శించేందుకు అవకాశం రాకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు. భేటీ సందర్భంగా ట్రంప్ మాటలు, హావభావాలకు పుతిన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు’ అని అన్నారు. -
మరో శిఖరాగ్ర భేటీకి సిద్ధమైన ట్రంప్
హెల్సింకి: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సింగపూర్‌లో చారిత్రక శిఖరాగ్ర భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి మరో సమావేశానికి సిద్ధమయ్యారు. అమెరికాతో అత్యంత బలహీన సంబంధాలు ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ సోమవారం ఫిన్లాండ్లో భేటీ కానున్నారు. ట్రంప్, పుతిన్ ఏకాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోనుండటం (వన్ టు వన్) ఇదే తొలిసారి. వీరు భేటీ అయ్యే గదిలో అనువాదకులు తప్ప మరెవరూ ఉండరు. ఫిన్లాండ్ అధ్యక్ష భవనంలోని గోథిక్ హాల్లో ట్రంప్, పుతిన్‌లు సమావేశమవుతారు. ప్రస్తుతం అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు ఏ మాత్రం బాగా లేవనీ, బలమైన బంధం కోసం ప్రయత్నం ప్రారంభిస్తున్నామని రష్యా ప్రభుత్వ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ట్రంప్‌ను ‘సంప్రదింపులు జరిపే నేత’గా తాము పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు గతంలో రష్యా కోసమే పనిచేసిన ఓ గూఢచారిపై రష్యానే బ్రిటన్‌లో విషప్రయోగం చేసిందన్న ఆరోపణలు, సిరియా అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి రష్యా మద్దతు, క్రిమియాను ఆక్రమించుకోవడం, రష్యాతో ట్రంప్ కఠినంగా వ్యవహరించట్లేదంటూ నాటో సభ్య దేశాల భయాలు తదితర అంశాల నేపథ్యంలో ట్రంప్, పుతిన్‌ల శిఖరాగ్ర భేటీపై ఉత్కంఠ నెలకొంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్లతో ఘర్షణాత్మక వాతావరణం నుంచి స్నేహం వైపు మళ్లిన ట్రంప్, ఇప్పుడు పుతిన్‌తో కూడా అదే రీతిలో వ్యవహరిస్తారో లేదోనని అమెరికా, రష్యాల మిత్రదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్‌తో సన్నిహిత బంధానికే పుతిన్ మొగ్గు చూపొచ్చనీ, ట్రంప్ కూడా అందుకు సానుకూలంగానే స్పందిస్తారని నిపుణులు అంటున్నారు. భారీ అంచనాలేమీ లేవు: ట్రంప్ పుతిన్‌తో భేటీపై ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ ‘నేనేమీ భారీ అంచనాలతో ఈ సమావేశానికి వెళ్లడం లేదు. కానీ ఈ భేటీ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం ఉంది. ఆ ఫలితాలు సానుకూలంగా ఉండొచ్చు తప్ప చెడు జరగదు’ అని అన్నారు. తాను రష్యాతో తొలి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తున్నాననీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశాన్ని కూడా పుతిన్‌తో చర్చల్లో కచ్చితంగా ప్రస్తావనకు తెస్తానని ట్రంప్ చెప్పారు. 12 మంది రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాట్ల అకౌంట్లను హ్యాక్ చేశారంటూ వారిపై ఇటీవలే అమెరికా నేరాభియోగాలు మోపింది. ఆ 12 మందిని తమకు అప్పగించాలని కూడా తాను పుతిన్‌ను కోరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. నేరాభియోగాలు నమోదైన నేపథ్యంలో పుతిన్‌తో భేటీని రద్దు చేసుకోవాలని డెమొక్రాట్లు నాలుగు రోజుల క్రితం ట్రంప్‌ను కోరినా, శ్వేతసౌధం తిరస్కరించింది. కాగా, రష్యాను తిరిగి జీ–7 కూటమిలో చేర్చి, మళ్లీ జీ–8గా మార్చాలని కూడా ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇప్పుడు వారు చర్చిస్తే ఫలితం ఎలా ఉంటుందోనని అమెరికా మిత్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. శత్రువులే కానీ..: రష్యాతోపాటు చైనా, యూరోపియన్ యూని యన్ (ఈయూ) అమెరికాకు శత్రువులని ట్రం ప్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మాకు చాలా మంది శత్రువులున్నారని నేననుకుంటాను. ఈయూ ఒక శత్రువు. వాణిజ్యంలో వారు మాకు ఏం చేస్తున్నారు? కొన్ని అంశాల్లో రష్యా కూడా శత్రువే. ఆర్థికాంశం పరంగా చైనా మాకు కచ్చితంగా శత్రువే. అయితే వీళ్లంతా చెడ్డవాళ్లని కాదు. పోటీ తత్వం ఉన్నవారు మాత్రమే’ అని ట్రంప్ చెప్పారు. కాగా, బ్రిట న్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. ఫిన్లాండ్లోనూ ట్రంప్ అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు. -
16న ట్రంప్, పుతిన్ భేటీ
వాషింగ్టన్/మాస్కో: అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ఇరుదేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జూలై 16న ఈ భేటీ జరగనుందని శ్వేతసౌధం, క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) గురువారం ప్రకటించాయి. ‘పరస్పర జాతీయ భద్రతాంశాలతో సహా ద్వైపాక్షికాంశాలపై ట్రంప్, పుతిన్‌లు చర్చలు జరుపుతారు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. ‘ట్రంప్, పుతిన్‌లు అమెరికా–రష్యా సంబంధాల్లోని ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, పలు కీలక అంతర్జాతీయ అంశాలను చర్చిస్తారు’ అని క్రెమ్లిన్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం మాస్కోలో పుతిన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ల సమావేశం తర్వాతే జూలై 16న సమావేశం తేదీ ఖరారైంది. ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య చర్చలు, అనంతరం సంయుక్త మీడియా సమావేశం ఉంటుంది. వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా ప్రకటన కూడా విడుదల చేస్తారని క్రెమ్లిన్ వెల్లడించింది. బోల్టన్‌తో సమావేశం సుహృద్భావపూర్వకంగా జరిగిందని.. అమెరికా–రష్యాల ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతితోపాటు.. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వానికి ఈ సమావేశం బాటలువేస్తుందని భావిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. జూలై 11,12 తేదీల్లో బెల్జియంలోని బ్రసెల్స్‌లో నాటో సదస్సు జరిగిన నాలుగురోజుల తర్వాత వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది. 2017 జూలైలో జీ–20 సదస్సు సందర్భంగా జర్మనీలో ట్రంప్, పుతిన్‌లు తొలిసారి కలుసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో చర్చలు జరగలేదు. -
మహిళలకు మాత్రమే!
ఫిన్లాండ్ తీరానికి ఆవల ఉన్న ఈ దీవి మహిళలకు మాత్రమే! ఇందులో అడుగుపెట్టడానికి పురుషులకు అనుమతి లేదు. క్రిస్టినా రోత్ అనే అమెరికన్ మహిళా వ్యాపారవేత్త ఆలోచన ఫలితంగా ఈ దీవి మహిళలకు విడిది కేంద్రంగా రూపుదిద్దుకుంది. వెకేషన్ కాలాన్ని ప్రశాంతంగా గడపడానికి క్రిస్టినా ఒకసారి రాంచ్ మాలిబు సమీపంలోని ఒక ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ పురుషుల ఉనికి కారణంగా మహిళల ఏకాగ్రతకు, ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులను గమనించారు. పురుషుల వల్ల మహిళలు ఇబ్బంది పడకుండా, కేవలం మహిళల కోసమే ఒక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నారు. ఫిన్లాండ్ తీరానికి ఆవల ఎనిమిదిన్నర ఎకరాల దీవి అమ్మకానికి సిద్ధంగా ఉండటంతో, దీనిని తానే కొనేసి, అన్ని సౌకర్యాలతో మహిళల విడిది కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ దీవిలో సేదదీరడానికి దేశ దేశాల నుంచి మహిళలు వస్తున్నారు. -
ఎడమచేతి వాటం ఉంటే అలా మారతారు!
లండన్: ఎడమచేతి వాటం కలిగిన వాళ్లు నాస్తికులుగా మారే అవకాశాలు ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఎడమచేతి వాటం అబ్బుతుందని, ఇదే నాస్తికత్వానికి దారి తీయవచ్చని గుర్తించారు. ఆస్తికుల్లోనూ కొన్ని జన్యుపరమైన ప్రభావాలు ఉంటాయని కూడా తేల్చారు. ప్రపంచం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకముందు మనుషుల్లో మత ప్రభావం అధికంగా ఉండేదని ఫిన్లాండ్లోని ఓలూ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. మత నియమాలు పాటించడం వల్ల సత్ప్రవర్తన అలవడటం, మానసిక ఆరోగ్యం లభిస్తుంది కాబ ట్టే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండేవారని తెలిపారు. దాదాపు 40 శాతం మందిలో ఆధ్మాత్మిక జన్యుపరంగానే అలవడుతుందని ఇది వరకటి అధ్యయనాలు కూడా తేల్చాయి. -
విరుష్క... ఆ స్వర్గమేంటో తెలిసిపోయింది
సాక్షి, స్పోర్ట్స్/సినిమా : డిసెంబర్ 11న వివాహం తర్వాత అనుష్క-కోహ్లి హనీమూన్ ఎక్కడికి వెళ్లారంటూ ఆరాలు తీయటం కొందరి వంతు అయ్యింది. ఇంతలో అనుష్క స్వర్గంలో ఉన్నామంటూ ఓ ఫోటోను షేర్ చేయటంతో ఆ ఆత్రుత మరింతగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో ఎవరికి తోచిన రీతిలో వారు కథనాలు, మరికొందరు కామెంట్లతో సెటైర్లు పేల్చారు. సౌతాఫ్రికా, ఆస్టేలియా గోల్డ్ కోస్ట్, ఫ్రెంచ్ రివరియా, మాల్దీలు ఇలా ఎవరికి తోచిన పేర్లను వారు చెప్పేశారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఫిన్లాండ్లో ఉన్నట్లు చేస్తున్నారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. మొన్న ప్రచురించిన ఫోటో కూడా అక్కడిదేనని.. రోవనేమి, ల్యాప్‌లాండ్ ప్రాంతంలో వీరు బస చేశారని అందులో పేర్కొంది. ఫిన్లాండ్లో వీరిద్దరి స్వేచ్ఛా విహారం గురించి అక్కడి మీడియా సంస్థ కూడా కథనం ప్రచురించింది కూడా. ఇటలీలోని 13వ శతాబ్దానికి చెందిన బోర్గో ఫినోచ్చిటో రిసార్ట్‌లో వైభవంగా ఈ జంట వివాహం చేసుకున్న వివాహం తెలిసిందే. In heaven, literally 😇😍 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Dec 15, 2017 at 12:25am PST