
ఫిన్‌లాండ్‌తో సెప్టెంబర్ 18, 19వ తేదీల్లో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనికి చోటు లభించింది. భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ గాయపడటంతో అతని స్థానాన్ని సాకేత్‌తో భర్తీ చేశారు. డేవిస్ కప్‌లో భారత్ తరఫున సాకేత్ ఆరుసార్లు ఆడాడు. చివరిసారిగా అతడు 2018లో సెర్బియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు.