Davis Cup tennis tournament
-
Davis Cup: భారత్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించలేకపోయింది. నార్వే జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్–1 పోటీలో భారత్ 1–3తో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌గా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 3–6, 6–3, 3–6తో కాస్పర్ రూడ్–విక్టర్ దురాసోవిచ్ (నార్వే) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 1–6, 4–6తో దురాసోవిచ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఫలితం తేలిపోయాక నాలుగో మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 6–2, 6–1తో లుకాస్ హెలమ్ (నార్వే)ను ఓడించాడు. తుది ఫలితంతో మార్పు ఉండే అవకాశం లేకపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. భారత్ వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్–1లో చోటు కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుంది. -
Davis Cup: పరాజయాలతో మొదలుపెట్టిన భారత ప్లేయర్లు
ఎస్పూ (ఫిన్లాండ్): డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను భారత్ ఓటములతో ఆరంభించింది. వరల్డ్ గ్రూప్–1లో భాగంగా ఫిన్లాండ్తో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లకు నిరాశే ఎదురైంది. ప్రపంచ 165వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 3–6, 6–7 (1/7)తో 419వ ర్యాంకర్ ఒట్టో విర్టనెన్ చేతిలో ఓడాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ 4–6, 5–7తో ఎమిల్ రుసువురి చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో తొలి రోజు ముగిసే సరికి ఫిన్లాండ్ 2–0తో భారత్‌పై ఆధిక్యంలో నిలిచింది. నేడు జరిగే డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఈ ‘టై’లో ఫిన్లాండ్ విజేతగా నిలుస్తుంది. భారత్ గెలవాలంటే మాత్రం వరుసగా మూడు మ్యాచుల్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. డబుల్స్‌లో హ్యారి హెలివోరా–హెన్రీ కొంటినెన్ ద్వయంతో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట ఆడనుంది. అనంతరం జరిగే రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో... ఎమిల్ రుసువురితో ప్రజ్నేశ్; ఒట్టో విర్టనెన్తో రామ్‌కుమార్ తలపడతారు. వరుస సెట్లలో... గంటా 25 నిమిషాల పాటు విర్టనెన్తో జరిగిన పోరులో ప్రజ్నేశ్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్ ఆరో గేమ్‌లో ప్రజ్నేశ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన విర్టనెన్ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఫిన్లాండ్ ప్లేయర్ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను ప్రజ్నేశ్ చేజార్చుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ప్రజ్నేశ్ మెరుగ్గా ఆడాడు. పదునైన సరీ్వస్‌లతో ఏస్‌లను సాధిస్తూ తన సర్వీస్‌ను కోల్పోకుండా చూసుకున్నాడు. అయితే ప్రత్యర్థి సరీ్వస్‌ను ఒకసారి బ్రేక్ చేసేందుకు అవకాశం వచి్చనా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సెట్లో ఇద్దరు కూడా తమ సరీ్వస్‌లను నిలుపుకోవడంతో మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. ఇక్కడ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన 20 ఏళ్ల విర్టనెన్ 7–1తో టై బ్రేక్‌ను సొంతం చేసుకొని విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో అతడు 10 ఏస్‌లను సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లను చేయగా... ప్రజ్నేశ్ 6 ఏస్‌లను సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లను చేశాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లోనూ రామ్‌కుమార్ వరుస సెట్లలోనే ఓడాడు. -
భారత డేవిస్ కప్ జట్టులో సాకేత్ మైనేని
ఫిన్లాండ్తో సెప్టెంబర్ 18, 19వ తేదీల్లో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనికి చోటు లభించింది. భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ గాయపడటంతో అతని స్థానాన్ని సాకేత్‌తో భర్తీ చేశారు. డేవిస్ కప్‌లో భారత్ తరఫున సాకేత్ ఆరుసార్లు ఆడాడు. చివరిసారిగా అతడు 2018లో సెర్బియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. -
భారత్ 0 – సెర్బియా 2
క్రాల్‌జివో (సెర్బియా): యూఎస్ ఓపెన్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ లేకపోయినా ఆ అవకాశాన్ని భారత జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. డేవిస్ కప్ టెన్నిస్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా సెర్బియా జట్టుతో శుక్రవారం మొదలైన పోటీలో తొలి రోజు రెండు సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ఓటమి పాలయ్యారు. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 4–6, 6–7 (2/7), 2–6తో ప్రపంచ 86వ ర్యాంకర్ లాస్లో జెరె చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 3–6, 3–6తో ప్రపంచ 56వ ర్యాంకర్ దుసాన్ లాజోవిచ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో మిలోజెవిచ్–పెట్రోవిచ్ జోడీతో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ జంట ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం గెలిస్తేనే ఈ పోటీలో భారత ఆశలు సజీవంగా ఉంటాయి. -
చండీగఢ్‌లో భారత్, కొరియా డేవిస్ కప్ మ్యాచ్
న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా భారత్, దక్షిణ కొరియాల మధ్య జరిగే పోటీకి చండీగఢ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 15 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీకి చండీగఢ్ క్లబ్ గ్రాస్ కోర్టులు వేదికగా నిలువనుందని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) వెల్లడించింది. చివరిసారి 2012లో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య డేవిస్ కప్ మ్యాచ్‌కు చండీగఢ్ వేదికగా నిలిచింది.