Davis Cup: పరాజయాలతో మొదలుపెట్టిన భారత ప్లేయర్లు | Davis Cup: Finland off to a good start against India | Sakshi
Sakshi News home page

Davis Cup: పరాజయాలతో మొదలుపెట్టిన భారత ప్లేయర్లు

Published Sat, Sep 18 2021 4:59 AM | Last Updated on Sat, Sep 18 2021 10:05 AM

Davis Cup: Finland off to a good start against India - Sakshi

ఎస్పూ (ఫిన్లాండ్‌): డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ను భారత్‌ ఓటములతో ఆరంభించింది. వరల్డ్‌ గ్రూప్‌–1లో భాగంగా ఫిన్లాండ్‌తో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, రామ్‌కుమార్‌ రామనాథన్‌లకు నిరాశే ఎదురైంది. ప్రపంచ 165వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 3–6, 6–7 (1/7)తో 419వ ర్యాంకర్‌ ఒట్టో విర్టనెన్‌ చేతిలో ఓడాడు.

అనంతరం జరిగిన రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 4–6, 5–7తో ఎమిల్‌ రుసువురి చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో తొలి రోజు ముగిసే సరికి ఫిన్లాండ్‌ 2–0తో భారత్‌పై ఆధిక్యంలో నిలిచింది. నేడు జరిగే డబుల్స్, రెండు రివర్స్‌ సింగిల్స్‌లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా ఈ ‘టై’లో ఫిన్లాండ్‌ విజేతగా నిలుస్తుంది. భారత్‌ గెలవాలంటే మాత్రం వరుసగా మూడు మ్యాచుల్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. డబుల్స్‌లో హ్యారి హెలివోరా–హెన్రీ కొంటినెన్‌ ద్వయంతో రోహన్‌ బోపన్న–దివిజ్‌ శరణ్‌ జంట ఆడనుంది. అనంతరం జరిగే రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో... ఎమిల్‌ రుసువురితో ప్రజ్నేశ్‌; ఒట్టో విర్టనెన్‌తో రామ్‌కుమార్‌ తలపడతారు.

వరుస సెట్లలో...
గంటా 25 నిమిషాల పాటు విర్టనెన్‌తో జరిగిన పోరులో ప్రజ్నేశ్‌ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్‌ ఆరో గేమ్‌లో ప్రజ్నేశ్‌ సరీ్వస్‌ను బ్రేక్‌ చేసిన విర్టనెన్‌ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఫిన్లాండ్‌ ప్లేయర్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను ప్రజ్నేశ్‌ చేజార్చుకున్నాడు. రెండో సెట్‌లో మాత్రం ప్రజ్నేశ్‌ మెరుగ్గా ఆడాడు. పదునైన సరీ్వస్‌లతో ఏస్‌లను సాధిస్తూ తన సర్వీస్‌ను కోల్పోకుండా చూసుకున్నాడు.

అయితే ప్రత్యర్థి సరీ్వస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసేందుకు అవకాశం వచి్చనా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సెట్‌లో ఇద్దరు కూడా తమ సరీ్వస్‌లను నిలుపుకోవడంతో మ్యాచ్‌ టై బ్రేక్‌కు దారి తీసింది. ఇక్కడ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన 20 ఏళ్ల విర్టనెన్‌ 7–1తో టై బ్రేక్‌ను సొంతం చేసుకొని విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో అతడు 10 ఏస్‌లను సంధించి నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లను చేయగా... ప్రజ్నేశ్‌ 6 ఏస్‌లను సంధించి రెండు డబుల్‌ ఫాల్ట్‌లను చేశాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లోనూ రామ్‌కుమార్‌ వరుస సెట్లలోనే ఓడాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement