Indian players
-
భారత చెస్‌పై ఆనంద్ ఎఫెక్ట్
‘చదరంగపు సంస్కృతి కనిపించని దేశం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రపంచ చాంపియన్ కావడమే కాదు, ఆటపై ఆసక్తి పెంచుకొని దానిని ముందుకు తీసుకెళ్లగలిగేలా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవడం నిజంగా నమ్మలేని విషయం, అసాధారణం. ఆ దిగ్గజమే విశ్వనాథన్ ఆనంద్’... భారత జట్టు ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన తర్వాత టాప్ చెస్ ప్లేయర్, ప్రపంచ 2వ ర్యాంకర్ నకముర ఆనంద్ గురించి చేసిన ప్రశంస ఇది. భారత చెస్ గురించి తెలిసిన వారెవరైనా ఈ మాటలను కాదనలేరు. ఆటగాడిగా మన చదరంగంపై ఆనంద్ వేసిన ముద్ర అలాంటిది. చెస్ క్రీడను పెద్దగా పట్టించుకోని సమయంలో 19 ఏళ్ల వయసులో భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన ఆనంద్... ఇప్పుడు 55 ఏళ్ల వయసులో కొత్త తరానికి బ్యాటన్‌ను అందించి సగర్వంగా నిలిచాడు. ఆనంద్ జీఎంగా మారిన తర్వాత ఈ 36 ఏళ్ల కాలంలో మన దేశం నుంచి మరో 84 మంది గ్రాండ్మాస్టర్లుగా మారగా... ఇందులో 30 మంది తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం. ‘వాకా’తో విజయాలు... నాలుగేళ్ల క్రితం ఆనంద్ తన కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మెల్లగా తాను ఆడే టోర్నీల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయమది. తన ఆట ముగిసిపోయాక భవిష్యత్తులో ప్రపంచ చెస్‌లో భారత్ స్థాయిని కొనసాగించేలా ఏదైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని భావించాడు. ఈ క్రమంలో వచ్చి0దే చెస్ అకాడమీ ఏర్పాటు ఆలోచన. చెన్నైలో వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా)ని అతను నెలకొల్పాడు. ఇక్కడి నుంచి వచ్చిన ఫస్ట్ బ్యాచ్ అద్భుత ఫలితాలను అందించి ఆనంద్ కలలకు కొత్త బాట వేసింది. దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి ఇందులో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశి కూడా ఇక్కడ శిక్షణ పొందాడు. ‘విషీ సర్ లేకపోతే ఇవాళ మేం ఈ స్థాయికి వచ్చేవాళ్లం కాదు’... గుకేశ్, ప్రజ్ఞానంద తరచుగా చెబుతూ రావడం వారి కెరీర్ ఎదుగుదలలో ఆనంద్ పాత్ర ఏమిటో చెబుతుంది. యువ చెస్ ఆటగాళ్ల కెరీర్ దూసుకుపోవడంలో తల్లిదండ్రులు, ఆరంభంలో కోచింగ్ ఇచ్చిన వారి పాత్రను ఎక్కడా తక్కువ చేయకుండా వారిపైనే ప్రశంసలు కురిపించిన ఆనంద్ ‘వాకా’తో తాను ఎలా సరైన మార్గ నిర్దేశనం చేశాడో ఒలింపియాడ్ విజయానంతరం వెల్లడించాడు. జూనియర్ దశను దాటుతూ... యువ ఆటగాళ్లను విజయాల వైపు సరైన దిశలో నడిపించడం అకాడమీ ఏర్పాటులో ముఖ్య ఉద్దేశమని అతను చెప్పాడు. తన కెరీర్ ప్రారంభంలో సోవియట్ యూనియన్‌లో ఉన్న చెస్ సంస్కృతిని చూసి అకాడమీ ఆలోచన వచ్చినట్లు ఆనంద్ పేర్కొన్నాడు. అక్కడ దిగువ స్థాయికి పెద్ద ప్లేయర్‌గా ఎదిగే క్రమంలో ఈ అకాడమీలు సంధానకర్తలుగా వ్యవహరిస్తాయని అతను వెల్లడించాడు. ‘భారత ఆటగాళ్లు ర్యాంకింగ్‌పరంగా తరచుగా టాప్–200లోకి దూసుకొస్తున్నారు.కానీ టాప్–100లోకి మాత్రం రాలేకపోతున్నారు. కాబట్టి ప్రతిభావంతులను ఆ దిశగా సాధన చేయించడం ముఖ్యమని భావించా. వారి విజయాల్లో మా పాత్రను పోషించడం సంతృప్తినిచ్చే విషయం’ అని ఆనంద్ తన అకాడమీ ప్రాధాన్యతను గురించి పేర్కొన్నాడు. 14 ఏళ్ల కంటే ముందే గ్రాండ్మాస్టర్లుగా మారిన ఆటగాళ్లను ఆనంద్ తన అకాడమీలోకి తీసుకున్నాడు. జూనియర్ స్థాయిలో సంచలనాలు సాధించి సీనియర్‌కు వచ్చేసరికి ఎక్కడా కనిపించకపోయిన ప్లేయర్లు చాలా మంది ఉంటారు. అలాంటిది జరగకుండా జూనియర్ స్థాయి విజయాలను సీనియర్‌లోనూ కొనసాగిస్తూ పెద్ద విజయాలు సాధించేలా చేయడమే తన లక్ష్యమని ఆనంద్ చెప్పుకున్నాడు. అనూహ్య వేగంతో... ‘నా తొలి గ్రూప్‌లో ఉన్న ప్లేయర్లంతా గొప్పగా రాణిస్తున్నారు. నిజానికి వీరు తొందరగా శిఖరానికి చేరతారని నేనూ ఊహించలేదు. వారు మంచి పేరు తెచ్చుకుంటారని అనుకున్నా గానీ అదీ ఇంత వేగంగా, నమ్మశక్యం కానట్లుగా జరిగింది’ అంటూ యువ ఆటగాళ్లపై ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ఆనంద్ ఇంకా అధికారికంగా తన రిటైర్మెంట్ను ప్రకటించలేదు. తనకు నచ్చిన, ఎంపిక చేసిన టోర్నీల్లోనూ అతను ఇంకా ఆడుతూనే ఉన్నాడు. కొన్ని నెలల క్రితం స్పెయిన్‌లో జరిగిన లియోన్ మాస్టర్స్‌లో అతను విజేతగా కూడా నిలిచాడు. ఒకవైపు ప్లేయర్‌గా కొనసాగుతూ మరో వైపు యువ ప్లేయర్లకు అతను మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. నిజంగా భారత జట్టుకు ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచే సత్తా ఉందంటే అది ఈ జట్టుతోనే సాధ్యం అని ఒలింపియాడ్‌కు వెళ్లే ముందే ఆనంద్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించాడు. టీమ్‌లోని ఆటగాళ్లపై అతను చూపిన విశ్వాసం అది. దానిని వారంతా నిజం చేసి చూపించారు. ‘భారత చెస్‌లో అద్భుత సమయం నడుస్తోంది. ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మనం కచ్చితంగా మంచి విజయాలు ఆశిస్తాం. ఇప్పుడు అదే జరిగింది. సరిగ్గా చెప్పాలంటే వారు మనందరి అంచనాలకు మించి రాణించారు. మున్ముందు ఇవి కొనసాగాలని కోరుకుంటున్నా’ అని ఆనంద్ భావోద్వేగంతో అన్నాడు.ఒలింపియాడ్ బహుమతి ప్రదానోత్సవంలో ఆనంద్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. అతడిని వేదికపైకి ఆహా్వనిస్తూ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆనంద్‌ను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ చెస్ బూమ్’ అంటూ ప్రశంసలు కురిపించడం అతని విలువను చాటి చెప్పింది. ప్రధానమంత్రి ప్రశంస చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లను దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణాలు సాధించిన పురుషుల, మహిళల జట్ల ఘనతను ఆయన కొనియాడారు. ‘45వ చెస్ ఒలింపియాడ్‌లో అటు ఓపెన్, ఇటు మహిళల విభాగాల్లో టైటిల్స్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ రెండు టీమ్‌లకు కూడా నా అభినందనలు. భారత క్రీడల్లో ఇదో సరికొత్త అధ్యాయం. చెస్‌లో అగ్రస్థానానికి చేరాలని పట్టుదలగా ఉన్న ఉత్సాహవంతులకు కొన్ని తరాల పాటు ఈ ఘనత స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని మోదీ అన్నారు. -
ముమ్మర సాధనలో...
చెన్నై: టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలై శ్రమిస్తోంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తోంది. నిజానికి భారత్ స్థాయితో పోల్చుకుంటే బంగ్లాదేశ్ ఏమంత గట్టి ప్రత్యర్థి కానప్పటికీ... ఇటీవల పాకిస్తాన్లో పర్యటించిన బంగ్లాదేశ్ 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో ఎలాంటి ఆదమరుపునకు తావివ్వకుండా భారత ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. సోమ వారం పూర్తిస్థాయిలో 16 మంది జట్టు సభ్యులంతా ప్రాక్టీస్ చేశారు. కోహ్లి నెట్స్‌లో ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. తర్వాత యువ సంచలనం యశస్వి జైస్వాల్ సాధనకు దిగాడు. ఇద్దరు చాలాసేపు వైవిధ్యమైన బంతుల్ని ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపారు. భారత స్పీడ్‌స్టర్ బుమ్రా, స్థానిక వెటరన్ స్పిన్నర్ అశ్విన్ వాళ్లిద్దరికి బంతులు వేశారు. బుమ్రా బౌలింగ్‌లో షాట్లు ఆడే ప్రయత్నంలో జైస్వాల్ పలుమార్లు బౌల్డయ్యాడు. ఆ తర్వాత కెపె్టన్ రోహిత్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ అయిపోగానే సర్ఫరాజ్ జట్టుతో కలిశాడు. సారథి రోహిత్ శర్మ ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోనేందుకు మొగ్గు చూపాడు. చాలాసేపు స్పిన్ బంతులపైనే ప్రాక్టీస్ చేశాడు. రవీంద్ర జడేజా, రిషభ్ పంత్‌లు కూడా త్రోడౌన్ స్పెషలిస్టుల బంతుల్ని ఆడారు. సోమవారంతో భారత్ జట్టు మూడు ప్రాక్టీస్ సెషన్లను పూర్తి చేసుకుంది. మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండటంతో మరో రెండు సెషన్లు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో గడపనున్నారు. ముగ్గురు స్పిన్నర్లతో... చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం కావడంతో భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అనుభవజు్ఞలైన అశి్వన్, జడేజాలతో కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో దాదాపు బెర్త్ ఖాయమనిపిస్తోంది. దీంతో బ్యాటింగ్‌లోనూ మెరిపిస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు లేనట్లే! పేసర్ల విషయానికొస్తే బుమ్రాతో సిరాజ్ బంతిని పంచుకుంటాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో తొలి టెస్టు ఎంఎ చిదంబరం మైదానంలో గురువారం నుంచి జరుగుతుంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా... ఆదివారం చెన్నై చేరుకున్న బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు కూడా సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. పాక్‌ను వారి సొంతగడ్డపై వైట్‌వాష్ చేసి ఊపు మీదున్న బంగ్లాదేశ్... ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది. బ్యాటర్లు లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్ హసన్, జాకిర్ హసన్, షాద్మన్ ఇస్లామ్‌లు భారీషాట్లపై కసరత్తు చేశారు. త్రోడౌన్ స్పెషలిస్టులపై స్ట్రెయిట్ డ్రైవ్ షాట్లు ఆడారు. స్పిన్నర్లకు కలిసొచ్చే చెన్నై పిచ్‌పై సత్తా చాటేందుకు తైజుల్ ఇస్లామ్, నయీమ్ హసన్‌లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. -
పారిస్ ఒలింపిక్స్ 2024 : ఈసారి పతకాలు తగ్గాయి..! (ఫొటోలు)
-
Paris Olympics 2024: ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం (ఫోటోలు)
-
Paris Olympics: పతకం ఖాయం అనుకుంటే.. నిరాశే మిగిలింది! (ఫొటోలు)
-
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: పీవీ సింధు x ఫాతిమత్ నభా (మాల్దీవులు) మధ్యాహ్నం గం. 12:50 నుంచి. పురుషుల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: హెచ్ఎస్ ప్రణయ్ x ఫాబియన్ రోథ్ (జర్మనీ) రాత్రి గం. 9:00 నుంచిషూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: ఇలవేనిల్ వలారివన్ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి). పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: సందీప్ సింగ్, అర్జున్ బబూతా (మధ్యాహ్నం గం. 2:45 నుంచి). మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి). రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ (రెపిచేజ్ 2): బలరాజ్ పన్వర్ (మధ్యాహ్నం గం. 1:18 నుంచి).టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): ఆకుల శ్రీజ x క్రిస్టియానా క్లెబెర్గ్ (స్వీడన్) (మధ్యాహ్నం గం. 12:15 నుంచి). మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): మనికా బత్రా x అన్నా హర్సే (ఇంగ్లండ్) (మధ్యాహ్నం 12:15 నుంచి). పురుషుల సింగిల్స్ (రెండో రౌండ్): శరత్ కమల్ x డేనీ కోజుల్ (స్లొవేనియా) (మధ్యాహ్నం గం. 3:00 నుంచి).స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ (హీట్–2): శ్రీహరి నటరాజ్ (మధ్యాహ్నం గం. 3:16 నుంచి). మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ (హీట్–1): ధీనిధి (మధ్యాహ్నం గం. 3.30 నుంచి).ఆర్చరీ మహిళల రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్: భారత్ (దీపిక కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్) ్ఠ ఫ్రాన్స్/నెదర్లాండ్స్ (సాయంత్రం గం. 5:45 నుంచి). మహిళల టీమ్ సెమీఫైనల్: (రాత్రి గం. 7:17 నుంచి). మహిళల టీమ్ ఫైనల్: (రాత్రి గం. 8:18 నుంచి). -
‘అడవి’లోకి అభిషేక్ శర్మ.. మృగరాజును చూశారా? (ఫొటోలు)
-
‘అర్జున’తో అందలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. వేర్వేరు క్రీడాంశాల్లో సత్తా చాటి ఈ పురస్కారానికి ఎంపికైన భారత ఆటగాళ్లు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని సగర్వంగా అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతున్న కారణంగా తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఈ అవార్డును అందుకోలేకపోయింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి ఆర్. వైశాలి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, అథ్లెట్ పారుల్ చౌదరి, భారత కబడ్డీ జట్టు కెపె్టన్, తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ప్లేయర్ పవన్ కుమార్ సెహ్రావత్ కూడా అర్జున పురస్కారాన్ని అందుకున్నారు. పారా ఆర్చర్ శీతల్ దేవి అవార్డు అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించగా... వీల్‌చైర్‌లో కూర్చుకున్న పార్ కనోయిస్ట్ ప్రాచీ యాదవ్ వద్దకు వెళ్లి స్వయంగా రాష్ట్రపతి అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంధ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డును అందుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన స్విమ్మర్ మోతుకూరి తులసీ చైతన్య టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు. విజయవాడ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల తులసీ చైతన్య కాటలీనా చానెల్, జిబ్రాల్టర్ జలసంధి, పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్, నార్త్ చానెల్లను విజయవంతంగా ఈది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2023 సంవత్సరానికి ఇద్దరికి ‘ఖేల్ రత్న’... 26 మందికి ‘అర్జున’... ఐదుగురికి ‘ద్రోణాచార్య’ రెగ్యులర్ అవార్డు... ముగ్గురికి ‘ద్రోణాచార్య’ లైఫ్‌టైమ్... ముగ్గురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్’ అవార్డులు ప్రకటించారు. ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న) ఈ అవార్డులను అందజేస్తారు. అయితే ఆ సమయంలో హాంగ్జౌ ఆసియా క్రీడలు జరుగుతుండటంతో అవార్డుల ఎంపికతోపాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. -
డబుల్ ధమాకా...
ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు ఆర్. వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్‌గా నిలిచిన విదిత్‌కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టైటిల్స్‌తో ఓపెన్ విభాగంలో విదిత్... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ కోసం తలపడతారు. -
ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం: ప్రధాని మోదీ
పనాజీ: జాతీయ ఆటల పండగ గోవాలో అట్టహాసంగా మొదలైంది. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ 37వ జాతీయ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భారత క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. మేం వచ్చాక ప్రత్యేకించి క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేశాం. ప్రతిభావంతుల్ని గుర్తించి ఆర్థిక అండదండలు అందజేస్తూనే ఉన్నాం. ఈ ఏడాది క్రీడల బడ్జెట్‌ను భారీగా పెంచాం. గత తొమ్మిదేళ్ల బడ్జెట్‌తో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఆచరణ, అమలు తీరుతెన్నులతో భారత క్రీడల ముఖచిత్రం మారుతోంది. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. చాంపియన్లతో అది ఎప్పుడో నిరూపితమైంది. ఒలింపిక్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల చాంపియన్లు ఎందరో దేశప్రతిష్టను పెంచారు. ఇక మిగిలింది విశ్వక్రీడల ఆతిథ్యమే! 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది’ అని ఆయన అన్నారు. జాతీయ క్రీడలను వచ్చేనెల 9 వరకు 15 రోజుల పాటు 28 వేదికల్లో 43 క్రీడాంశాల్లో నిర్వహిస్తారు. రాష్ట్రాలు, సర్విసెస్‌లకు చెందిన 37 జట్లు బరిలో ఉన్నాయి. 10 వేల పైచిలుకు అథ్లెట్లు పతకాల కోసం శ్రమించనున్నారు. ప్రారం¿ోత్సంకంటే ముందుగానే వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, నెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, బాస్కెట్‌బాల్ క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి. -
దీప్తి ‘పసిడి’ పరుగు
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో రెండో రోజూ భారత క్రీడాకారులు తమ పతకాల వేట కొనసాగించారు. తొలి రోజు సోమవారం 17 పతకాలు నెగ్గిన భారత ప్లేయర్లు... రెండో రోజు మంగళవారం ఏకంగా 18 పతకాలతో అదరగొట్టారు. ఇందులో నాలుగు స్వర్ణ పతకాలు ఉన్నాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి జీవంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 కేటగిరీలో పసిడి పతకాన్ని సాధించింది. వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అందరికంటే వేగంగా 400 మీటర్ల దూరాన్ని 56.69 సెకన్లలో పూర్తి చేసి ఆసియా పారా గేమ్స్‌తోపాటు ఆసియా రికార్డును సృష్టించింది. మహిళల కనోయింగ్ ఎల్2 ఈవెంట్లో ప్రాచీ యాదవ్ 500 మీటర్ల దూరాన్ని 54.962 సెకన్లలో అధిగమించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్54/55/56) కేటగిరీలో నీరజ్ యాదవ్ డిస్క్‌ను 38.56 మీటర్ల దూరాన్ని విసిరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 5000 మీటర్ల (టి13 కేటగిరీ) విభాగంలో శరత్ శంకరప్ప 20ని:18.90 సెకన్లలో రేసును ముగించి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. రెండో రోజుల పోటీలు ముగిశాక భారత్ 10 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 35 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
IPL 2023: అత్యుత్తమ భారత ఆటగాళ్లతో కూడిన జట్టు ఇదే..!
ఐపీఎల్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో ఓ జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా..? అయితే ఈ కింద ఉన్న జాబితాపై ఓ లుక్కేయండి. ఈ జట్టుకు సారధిగా, వికెట్ కీపర్ సంజూ శాంసన్ వ్యవహరించనుండగా.. కీలక ఆటగాళ్లుగా కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ ఉన్నారు. ఈ జట్టు కుడి, ఎడమ చేతి ఆటగాళ్లతో అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. ఐపీఎల్-2023లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా ఈ జట్టు ఎంపిక చేయబడింది. శుభ్‌మన్ గిల్ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లి సంజూ శాంసన్ (వికెట్‌కీపర్/కెప్టెన్) సూర్యకుమార్ యాదవ్ రింకూ సింగ్ రవీంద్ర జడేజా మహ్మద్ షమీ ఆకాశ్ మధ్వాల్ అర్షదీప్ సింగ్ యుజ్వేంద్ర చహల్ * ఐపీఎల్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అప్ కమింగ్ భారత ఆటగాళ్లలతో కూడిన జట్టు.. యశస్వి జైస్వాల్ (21) శుభ్‌మన్ గిల్ (23) (కెప్టెన్) ఇషాన్ కిషన్ (24) (వికెట్‌కీపర్) తిలక్ వర్మ (20) నేహల్ వధేరా (22) రింకూ సింగ్ (25) వాషింగ్టన్ సుందర్ (23) రవి బిష్ణోయ్ (22) అర్షదీప్ సింగ్ (24) యశ్ ఠాకూర్ (24) ఉమ్రాన్ మాలిక్ (23) పైన పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా ఇంకా వేరెవరైనా ఈ జట్లలో ఉండేందుకు అర్హులని అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవండి: IPL 2023: నేనున్నాను.. నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చిన ధోని -
ISSF World Cup Baku: సరబ్జోత్–దివ్య జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్–దివ్య థడిగోల్ సుబ్బరాజు (భారత్) ద్వయం విజేతగా నిలిచింది. స్వర్ణ–రజత పతక ఫైనల్ పోరులో సరబ్జోత్–దివ్య జోడీ 16–14తో జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) ద్వయంపై విజయం సాధించింది. సరబ్జోత్ కెరీర్లో ఇది రెండో ప్రపంచకప్ స్వర్ణంకాగా... బెంగళూరుకు చెందిన దివ్యకు ప్రపంచకప్ టోర్నీలలో తొలి పతకం కావడం విశేషం. మొత్తం 55 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సరబ్జోత్–దివ్య ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. భారత్‌కే చెందిన ఇషా సింగ్–వరుణ్ తోమర్ జంట 578 పాయింట్లు స్కోరు చేసి ఆరో ర్యాంక్‌లో నిలిచి పతక మ్యాచ్‌లకు అర్హత పొందడంలో విఫలమైంది. టాప్–4లో నిలిచిన జోడీలు పతక మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో రెండు పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ఆశల పల్లకిలో...
అల్మాటీ (కజకిస్తాన్): ఈ ఏడాదిని చిరస్మరణీయంగా ముగించాలనే లక్ష్యంతో నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో 2019 ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, 2012 కాంస్య పతక విజేత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితోపాటు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, సవితా శ్రీ, పద్మిని రౌత్, దివ్యా దేశ్‌ముఖ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొదటి మూడు రోజులు ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ర్యాపిడ్ టోర్నీని 11 రౌండ్లపాటు, బ్లిట్జ్ టోర్నీని 17 రౌండ్లపాటు నిర్వహిస్తారు. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, హర్ష భరతకోటిలతోపాటు విదిత్ సంతోష్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, నిహాల్ సరీన్, ఎస్ఎల్ నారాయణన్, అరవింద్ చిదంబరం, అభిమన్యు పురాణిక్, ఆధిబన్, రౌనక్ సాధ్వాని, శ్రీనాథ్ నారాయణన్, వి.ప్రణవ్, అర్జున్ కల్యాణ్, సంకల్ప్ గుప్తా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓపెన్ ర్యాపిడ్ టోర్నీని 13 రౌండ్లు, బ్లిట్జ్ టోర్నీని 21 రౌండ్లు నిర్వహిస్తారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), 30 వేల డాలర్లు (రూ. 28 లక్షల 83 వేలు), 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఓపెన్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 60 వేల డాలర్లు (రూ. 49 లక్షల 67 వేలు), 50 వేల డాలర్లు (రూ. 41 లక్షల 39 వేలు), 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీగా అందజేస్తారు. -
Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో మొదటి రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శన అంచనాలకు అనుగుణంగానే సాగింది. బలహీన జట్లపై భారత బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టీమ్‌లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించగా... హాకీలోనూ ఘన విజయం దక్కింది. ఊహించినట్లుగానే స్విమ్మింగ్, సైక్లింగ్వంటి క్రీడల్లో మనోళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా అగ్ర స్థానంతో రోజును ముగించింది. భారత్ ఫలితాలు మహిళల క్రికెట్: తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (34 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, షఫాలీ వర్మ (33 బంతుల్లో 48; 9 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పేసర్ రేణుకా సింగ్ (4/18) దెబ్బకు ఆసీస్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్నర్ (35 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును గెలిపించారు. బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ 5–0 తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–7, 21–12తో మురాద్ అలీపై, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–7, 21–6తో మహూర్ షహజాద్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడి 21–12, 21–9 మురాద్ అలీ–ఇర్ఫాన్ సయీద్‌ను, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 21–4, 21–5తో మహూర్ షహజాద్–గజాలా సిద్దిఖ్‌ను ఓడించగా... మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–పొన్నప్ప ద్వయం 21–9, 21–12తో ఇర్ఫాన్–గజాలా సిద్ధిక్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ విభాగంలో ముందుగా దక్షిణాఫ్రికాను 3–0తో, ఆపై ఫిజీని 3–0తో భారత్ చిత్తు చేసింది. పురుషుల టీమ్ విభాగంలో ముందుగా 3–0 తేడాతో బార్బడోస్పై నెగ్గింది. ∙ పురుషుల బాక్సింగ్ (63.5 కేజీలు) లో శివ థాపా 5–0తో సులేమాన్ బలూచ్ (పాకిస్తాన్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. స్విమ్మింగ్: పురుషుల స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ (100 మీ. బ్యాక్‌స్ట్రోక్)లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 54.68 సెకన్ల టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేసిన అతను ముందంజ వేశాడు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. సైక్లింగ్: మూడు ఈవెంట్లలోనూ భారత సైక్లిస్ట్‌లు ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు. పురుషుల స్ప్రింట్ టీమ్ ఈవెంట్లో రొనాల్డో, రోజిత్, బెక్‌హామ్, ఎల్కొటొచొంగో బృందం క్వాలిఫికేషన్లో ఆరో స్థానంలో నిలవగా... శశికళ, త్రియాశ, మయూరి సభ్యులుగా ఉన్న మహిళల స్ప్రింట్ టీమ్ కూడా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశ్వజీత్, వెంకప్ప, దినేశ్ సభ్యులైన 4000 మీటర్ల పర్సా్యట్ టీమ్ కూడా ఆరో స్థానంలో నిలిచింది. ట్రయథ్లాన్: భారత్‌నుంచి పేలవ ప్రదర్శన నమోదైంది. పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ఆదర్శ్ మురళీధరన్ 30వ స్థానంలో, విశ్వనాథ్ యాదవ్ 33 స్థానంలో నిలిచి నిష్క్రమించగా... మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ప్రజ్ఞా మోహన్ 26వ స్థానంతో, సంజన జోషి 28వ స్థానంతో సరిపెట్టుకున్నారు. హాకీ: మహిళల లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనాను చిత్తు చేసింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (3వ నిమిషం, 39వ ని.), నేహ (28వ ని.), సంగీతా కుమారి (36వ ని.), సలీమా టెటె (56వ ని.) గోల్స్ సాధించారు. ఇంగ్లండ్ ఖాతాలో తొలి స్వర్ణం బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం ఆతిథ్య ఇంగ్లండ్ ఖాతాలో చేరింది. పురుషుల ట్రయాథ్లాన్లో ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ యీ విజేతగా నిలిచాడు. 50 నిమిషాల 34 సెకన్లలో పరుగు పూర్తి చేసిన యీ అగ్ర స్థానం అందుకోగా...హేడెన్ విల్డ్ (న్యూజిలాండ్), మాథ్యూ హాజర్ (ఆస్ట్రేలియా) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. తొలి రోజు ఆస్ట్రేలియా 2 స్వర్ణాలు, 1 కాంస్యం సాధించగా...ఇంగ్లండ్ 1 స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. స్కాట్లాండ్, బెర్ముడా ఖాతాలో కూడా ఒక్కో స్వర్ణం చేరాయి. -
మీరంతా దేశం గర్వపడేలా చేశారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందించారు. కప్ గెలిచిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన బాడ్మింటన్ టీంతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి దేశాన్ని గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ ముఖాముఖీలో ప్రధాని ఆటగాళ్లందరితో సరదాగా మాట్లాడారు. సింగిల్స్, డబుల్స్ లో అద్భుతంగా రాణించిన భారత్ ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇండోనేషియాపై 3-0తో గ్రాండ్ విక్టరీ సాధించింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో తొలిసారి కప్ అందుకుంది. థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారత ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి నజరానాగా ప్రకటించన సంగతి తెలిసిందే. Interacted with our badminton champions, who shared their experiences from the Thomas Cup and Uber Cup. The players talked about different aspects of their game, life beyond badminton and more. India is proud of their accomplishments. https://t.co/sz1FrRTub8 — Narendra Modi (@narendramodi) May 22, 2022 -
భారత ఆర్చర్లకు ఆరు పతకాలు ఖాయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత ఆర్చర్లకు రెండు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు ఖాయమయ్యాయి. ఇరాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే టీమ్ విభాగంలో భారత్‌కు ఆరు పతకాలు లభించాయి. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత్‌కు చెందిన ప్రథమేశ్, రిషభ్ యాదవ్ ఫైనల్ చేరగా... సమాధాన్ జావ్కర్ కాంస్యం కోసం పోటీపడనున్నాడు. సమాధాన్ గెలిస్తే భారత్ ఈ విభాగంలో క్లీన్‌స్వీప్ చేస్తుంది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు పర్ణీత్ కౌర్, సాక్షి చౌదరీ ఫైనల్లోకి ప్రవేశించారు. -
మార్చి 27 నుంచి ఐపీఎల్ 2022 సీజన్.. ప్రేక్షకులు లేకుండానే!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం సందడి మొదలైంది. 2022 లీగ్ కోసం భారత ఆటగాళ్ల మొదలు అసోసియేట్ టీమ్‌ల క్రికెటర్ల వరకు అందరూ వేలంలో తామూ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేలంలో అవకాశం దక్కించుకునే క్రమంలో తొలి అడుగుగా ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీయులు. ఇందులో గరిష్టంగా ఆస్ట్రేలియానుంచి 59 మంది క్రికెటర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా రెండు టీమ్‌లతో మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. కొత్త సీజన్‌కు ముందు నిబంధనల ప్రకారం గరిష్టంగా నలుగురు ఆటగాళ్లనే టీమ్‌ను కొనసాగించే అవకాశం ఉండటంతో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుల్లో కూడా దాదాపు అందరూ వేలంలోకి రానున్నారు. వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన 896 మంది భారత క్రికెటర్లలో 61 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినవారు ఉన్నారు. ఈ లిస్ట్‌ను బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంపిస్తుంది. వేలంలో తాము కోరుకుంటున్న ఆటగాళ్లతో వివిధ టీమ్‌లు ఇచ్చే పేర్లను బట్టి తుది జాబితా సిద్ధమవుతుంది. అందులో ఉన్న ఆటగాళ్లకే వేలంలో అవకాశం లభిస్తుంది. ఎనిమిది టీమ్‌లు కలిసి 27 మంది ఆటగాళ్లను, రెండు కొత్త టీమ్‌ను ఎంచుకున్న ఆరుగురు ఆటగాళ్లు కలిపితే జట్ల వద్ద 33 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఒక్కో టీమ్‌కు గరిష్టంగా 25 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేలంలో 217 మంది క్రికెటర్లే చివరకు ఎంపికవుతారు. బరిలో వార్నర్, మిచెల్ మార్ష... రూ. 2 కోట్ల కనీస విలువతో మొత్తం 49 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆపై వేలంలో వీరికి ఎంత మొత్తం లభిస్తుందనేది ఆసక్తికరం. ఐపీఎల్ ఆల్‌టైమ్ స్టార్లలో ఒకడు, ఇటీవల టి20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన డేవిడ్ వార్నర్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మిచెల్ మార్‡్ష కూడా లీగ్‌లో తన అవకాశం కోసం చూస్తున్నాడు. రూ. 2 కోట్ల లిస్ట్‌లో ఉన్న భారత క్రికెటర్లలో శ్రేయస్, ధావన్, ఇషాన్ కిషన్, రాయుడులకు మంచి విలువ పలికే అవకాశం ఉంది. విదేశీ క్రికెటర్లలో కమిన్స్, జోర్డాన్, బౌల్ట్, డి కాక్, డుప్లెసిస్, రబడలకు భారీ డిమాండ్ ఖాయం. రూ.1.5 కోట్ల జాబితాలో సుందర్, బెయిర్‌స్టో, మోర్గాన్, హోల్డర్...రూ.1 కోటి జాబితాలో నటరాజన్, మనీశ్ పాండే, రహానే, షమ్సీలకు ఫ్రాంచైజీలకు ఆకర్షించవచ్చు. ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధం పూర్తి చేసుకున్న పేసర్ శ్రీశాంత్ కూడా రూ. 50 లక్షల కనీస విలువతో తన పేరు నమోదు చేసుకోవడం విశేషం. తొలి ఐపీఎల్ మినహా 2009నుంచి లీగ్‌పై తనదైన ముద్ర వేసి దాదాపు అన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న క్రిస్ లీగ్ ఈ సారి లీగ్‌నుంచి తప్పుకోవడంతో తన పేరును నమోదు చేసుకోలేదు. ముంబై, పుణేలలో... ఐపీఎల్–2022ను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై శనివారం బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఫ్రాంచైజీలన్నీ భారత్‌లో జరిపితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రేక్షకులను అనుమతించకుండా ముంబై, పుణేలలోనే అన్ని మ్యాచ్‌లు జరపాలనేది ప్రాథమికంగా బీసీసీఐ ఆలోచన. ముంబైలో మూడు పెద్ద మైదానాలు ఉండగా, సమీపంలోనే పుణేలో మరో స్టేడియం ఉండటంతో బయోబబుల్ తదితర ఏర్పాట్ల విషయంలో ఎలాంటి సమస్య రాదని వారు చెబుతున్నారు. అయితే భారత్‌లో కరోనా కాస్త తగ్గుముఖం పడితేనే ఇది సాధ్యమవుతుందని... లేదంటే ప్రత్యామ్నాయంగా మళ్లీ యూఏఈనే ఉంచాలని బోర్డు భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే మార్చి 27న ఐపీఎల్ మొదలవుతుంది. చదవండి: KL Rahul: కెప్టెన్సీతో పాటు భారీ మొత్తం ఆఫర్ చేసిన లక్నో ఫ్రాంచైజీ -
సింధు శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేయగా... మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ, లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్, ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 21–18తో జూలీ దవాల్ జాకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. సయాకా తకహాషి (జపాన్)తో మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 2–9తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 22–20, 19–21తో పోరాడి ఓడిపోయాడు. మొమోటో చేతిలో శ్రీకాంత్‌కిది 14వ పరాజయం కావడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ 17–21, 21–17, 11–21తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో... ప్రణయ్ 11–21, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్ 21–10, 21–16తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై, సౌరభ్ వర్మ 22–20, 21–19తో వైగోర్ కొహెలో (బ్రెజిల్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–19, 21–15తో మథియాస్ థైరి–మై సురో (డెన్మార్క్) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో టాప్ సీడ్ లీ సోహీ–షిన్ సెయుంగ్‌చన్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 21–17, 21–13తో లీ హుయ్–యాంగ్ సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. -
Davis Cup: పరాజయాలతో మొదలుపెట్టిన భారత ప్లేయర్లు
ఎస్పూ (ఫిన్లాండ్): డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను భారత్ ఓటములతో ఆరంభించింది. వరల్డ్ గ్రూప్–1లో భాగంగా ఫిన్లాండ్తో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లకు నిరాశే ఎదురైంది. ప్రపంచ 165వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 3–6, 6–7 (1/7)తో 419వ ర్యాంకర్ ఒట్టో విర్టనెన్ చేతిలో ఓడాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ 4–6, 5–7తో ఎమిల్ రుసువురి చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో తొలి రోజు ముగిసే సరికి ఫిన్లాండ్ 2–0తో భారత్‌పై ఆధిక్యంలో నిలిచింది. నేడు జరిగే డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఈ ‘టై’లో ఫిన్లాండ్ విజేతగా నిలుస్తుంది. భారత్ గెలవాలంటే మాత్రం వరుసగా మూడు మ్యాచుల్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. డబుల్స్‌లో హ్యారి హెలివోరా–హెన్రీ కొంటినెన్ ద్వయంతో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట ఆడనుంది. అనంతరం జరిగే రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో... ఎమిల్ రుసువురితో ప్రజ్నేశ్; ఒట్టో విర్టనెన్తో రామ్‌కుమార్ తలపడతారు. వరుస సెట్లలో... గంటా 25 నిమిషాల పాటు విర్టనెన్తో జరిగిన పోరులో ప్రజ్నేశ్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్ ఆరో గేమ్‌లో ప్రజ్నేశ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన విర్టనెన్ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఫిన్లాండ్ ప్లేయర్ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను ప్రజ్నేశ్ చేజార్చుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ప్రజ్నేశ్ మెరుగ్గా ఆడాడు. పదునైన సరీ్వస్‌లతో ఏస్‌లను సాధిస్తూ తన సర్వీస్‌ను కోల్పోకుండా చూసుకున్నాడు. అయితే ప్రత్యర్థి సరీ్వస్‌ను ఒకసారి బ్రేక్ చేసేందుకు అవకాశం వచి్చనా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సెట్లో ఇద్దరు కూడా తమ సరీ్వస్‌లను నిలుపుకోవడంతో మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. ఇక్కడ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన 20 ఏళ్ల విర్టనెన్ 7–1తో టై బ్రేక్‌ను సొంతం చేసుకొని విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో అతడు 10 ఏస్‌లను సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లను చేయగా... ప్రజ్నేశ్ 6 ఏస్‌లను సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లను చేశాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లోనూ రామ్‌కుమార్ వరుస సెట్లలోనే ఓడాడు. -
మాజీ క్రీడాకారులకు గావస్కర్ చేయూత
ముంబై: ఆరి్థక కష్టాలతో సతమతమవుతున్న భారత మాజీ క్రీడాకారుల కోసం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ‘ది చాంప్స్ ఫౌండేషన్’ ద్వారా చేయూత అందిస్తున్నారు. సన్నీ 1999 నుంచి ఈ వితరణ చేస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన మాజీ క్రీడాకారులు, బతుకు భారంగా వెళ్లదీస్తున్న అలనాటి ఆటగాళ్లకు తనవంతు సాయం చేస్తున్నారు. ఇన్నాళ్లు మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచి్చన వారికే సన్నీ సేవలందాయి. ఇప్పుడు ఆయన తన సేవా నిరతిని పెంచాలని, స్వయంగా సాదకబాధకాలు తెలియజేసిన వారికీ ఆరి్థక సాయం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన తన ఫౌండేషన్‌ను వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. కష్టాల్లో ఉన్న మాజీలు ఎవరైనా సరే ఛిజ్చిఝpటజీnఛీజ్చీ.ౌటజ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుంటే చేయూత అందిస్తామని సన్నీ చెప్పారు. తమ కార్యకలాపాలు క్రీయాశీలం చేసేందు కు వెబ్‌సైట్‌ను తీసుకొచ్చామని, ఇది తమ ఫౌండేషన్ విస్తృతికి దోహదం చేస్తుందని గావస్కర్ తెలిపారు. -
ఢిల్లీకి చేరిన ఒలింపిక్స్ బృందం.. ఐఓఏ అధికారుల ఘన స్వాగతం
ఢిల్లీ: భారత ఒలింపిక్స్ బృందం సోమవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఒలింపిక్స్ కీడ్రాకారులకు ఐఓఏ అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ ముగిసాయి. కోవిడ్ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహించారు. ఇక ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా పీవీ సింధు రికార్డులకెక్కింది. ఇక ఆర్మీ నాయక్ సుబేదార్ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్ పాజిబుల్’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. రవి దహియా 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. మరోవైపు భారత హకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. మన్‌ప్రీత్ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడ, స్ట్రయికర్ సిమ్రన్‌జీత్ సింగ్ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. దిగ్గజం మేరీకోమ్ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. అంతేకాకుండా ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్యంతో మురిపించాడు. -
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులపై జపాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీని ప్రకారం.. ఒలంపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, కోచ్‌లు, సిబ్బందిపై విధించిన ఆంక్షలను తప్పక పాటించాలని తెలిపింది. టోక్యోకు వచ్చే ముందు అందరూ కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని, వారంపాటు ప్రతిరోజు టెస్టు చేసుకోవాలని ఆదేశించింది. ఇదే క్రమంలో టోక్యో చేరిన తర్వాత 3 రోజులపాటు భారత క్రీడాకారులు ఎవరినీ కలవకూడదని ఆదేశించింది. కాగా జపాన్ ఆంక్షలను భారత ఒలింపిక్ సంఘం( ఐఓఏ) తప్పుపట్టింది. చదవండి: బాటిల్సే కాదు.. ఏం ముట్టుకున్నా మోతే ఇక! -
190 మందితో భారత బృందం
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం భారత బృందం సర్వ సన్నద్ధంగా ఉందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు. ఇప్పటివరకైతే వంద మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. ఇందులో 56 మంది పురుషులు, 44 మంది మహిళలు కాగా... క్వాలిఫికేషన్స్ కటాఫ్ తేదీ వరకల్లా ఈ జాబితాలో మరో 25 నుంచి 35 మంది చేరతారని ఐఓఏ ఆశిస్తోంది. కోచ్, సహాయ సిబ్బంది కలుపుకొని సుమారు 190 మందితో భారత జట్టు టోక్యోకు వెళుతుందని బా త్రా చెప్పారు. క్రీడా శాఖ ఆదేశాల ప్రకారం కోచ్, అధికారులు ఎవరైనా క్రీడాకారుల మొత్తంలో మూడో వంతుకు మించడానికి వీల్లేదని ఆయన తెలిపారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ధరించబోయే కిట్ ను క్రీడా మంత్రి కిరిణ్ రిజిజు ఆవిష్కరించారు. -
భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు
సిడ్నీ: ప్రపంచం ఓ వైపు వైరస్‌తో పోరాడుతోంది. మరోవైపు జాతి వివక్షపై చేయిచేయి కలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా మూకలు బరితెగించాయి. చిత్తుగా తాగిన మద్యం మత్తులో భారత క్రికెటర్లపై చెత్త వాగుడుకు దిగాయి. జాత్యాహంకార దూషణకు తెగబడి టెస్టు మ్యాచ్‌లో అలజడి రేపాయి. శనివారమే (మూడో రోజు ఆటలో) ఇది భారత ఆటగాళ్లను తాకింది. ఆదివారమైతే శ్రుతి మించింది. దీంతో టీమిండియా ఫిర్యాదు చేసింది. అంపైర్లు వెంటనే స్పందించారు. తర్వాత ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూడా సమస్యపై దృష్టి పెట్టాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అయితే ‘వివక్ష’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను నివేదిక కోరింది. భారత ఆటగాళ్లు దీనిపై ఉక్కుపిడికిలి బిగించాల్సిందేనన్నారు. అసలేం జరిగింది? బుమ్రా, సిరాజ్‌లపై శనివారం ఆసీస్ ఆకతాయి ప్రేక్షకులు జాత్యహంకార మాటలతో హేళన చేశారు. ఆదివారం వీరిచేష్టలు మరింత శ్రుతిమించాయి. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద ఉన్న మూకలు అసలే తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని ‘బ్రౌన్ డాగ్’, ‘బిగ్ మంకీ’ అంటూ దూషించారు. దీనిని గమనించిన ఆటగాళ్లంతా సిరాజ్‌ను అనునయించారు. 86వ ఓవర్ ముగిశాక భారత ఆటగాళ్లంతా ఓ చోట చేరుకున్నారు. ఏం చేశారు? ఐసీసీ సీరియస్ క్రికెట్లో జాతి వివక్షను ఉపేక్షించబోమని ఐసీసీ తెలిపింది. సిడ్నీ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉదంతంపై సీఏ వివరణ కోరామని, నివేదిక వచ్చాక పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఐసీసీ పేర్కొంది. సీఏ క్షమాపణ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జరిగిన సంఘటనపై విచారం వెలిబుచ్చింది. భారత ఆటగాళ్లను, క్రికెట్ బోర్డును క్షమాపణ కోరింది. ‘ఇంతటితో దీన్ని విడిచిపెట్టం. ఆకతాయిలను ఇప్పటికే గుర్తించాం. సీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇకపై వారిని మైదానాల్లోకి అనుమతించకుండా నిషేధిస్తాం. చట్టపరమైన చర్యల కోసం న్యూసౌత్‌వేల్స్ పోలీసులకు అప్పగిస్తాం’ అని సీఏ ఉన్నతాధికారి సీన్ కారల్ అన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ‘మన సమాజంలో, క్రీడల్లో జాత్యహంకారానికి చోటులేదు. ఇప్పటికే సీఏతో సంప్రదించాం. దోషులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరాం’ అని ట్వీట్ చేశారు. నాకు ఇది నాలుగో ఆసీస్ పర్యటన. గతంలో ప్రత్యేకించి సిడ్నీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేనూ బాధితుణ్నే. బౌండరీలైన్ వద్ద ఉండే క్రికెటర్లకు ఇలాంటి దూషణలు పరిపాటి. ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఉక్కుపిడికిలి బిగించాల్సిందే. – భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ జాత్యహంకారాన్ని సహించేది లేదు. మైదానాల్లో ఇలాంటి రౌడీ మూకల ప్రవర్తన ఆటగాళ్లను బాధిస్తోంది. నేను 2011–12లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
బ్యాంకాక్‌కు భారత షట్లర్లు
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –1000 బ్యాడ్మింటన్ టోర్నీలలో పాల్గొనేందుకు భారత బృందం బ్యాంకాక్ పయనమైంది. ఈనెల 12–17 వరకు యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీతో పాటు... 19 నుంచి 24 వరకు జరిగే టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు భారత్ నుంచి స్టార్ షట్లర్లు సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్ బయలుదేరారు. వీరి వెంట డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి, సింగిల్స్ ఆటగాళ్లు ప్రణయ్, కశ్యప్, సమీర్ వర్మ, ధ్రువ్ కపిల, మనూ అత్రి కూడా వెళ్లారు. లక్ష్యసేన్ వెన్ను నొప్పి కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్నాడు. లండన్ నుంచి సింధు గత అక్టోబర్ నుంచి లండన్‌లోనే ఉంటూ అక్కడే ప్రాక్టీస్ చేసిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు లండన్ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్ చేరనుంది. హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు సింధుతో కలిసి తీసుకున్న ఫోటోను ఇంగ్లండ్ డబుల్స్ ఆటగాళ్లు బెన్ లేన్, సీన్ వెండీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంగ్లండ్ ఆటగాళ్లతో సింధు -
విజయ మధురం
పది రోజుల్లో ఎంత తేడా... అత్యల్ప స్కోరు సాధించిన అవమాన భారంతో తలవంచుకున్న భారత ఆటగాళ్లు ఇప్పుడు సగర్వంగా నిలబడ్డారు. అడిలైడ్ పరాభవం తర్వాత అన్ని ప్రతికూలతలను అధిగమించిన టీమిండియా మెల్బోర్న్లో మెరిసింది. గత ఓటమి బాధను మరచిపోయేలా చేస్తూ అసాధారణ విజయంతో ఏడాదిని ముగించింది. తొలి రోజు నుంచి ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించిన రహానే సేన చివరి వరకు ఆ పట్టును నిలబెట్టుకుంది. ఫలితంగా ఎప్పటికీ గుర్తుండిపోయే గెలుపుతో సిరీస్‌ను సమం చేసింది. నాలుగో రోజు ఆసీస్ మరో 67 పరుగులు జోడించి ఆలౌట్ కాగా... 70 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శతకంతో జట్టును నడిపించిన సారథి రహానే విన్నింగ్ షాట్‌తో టీమిండియా బృందంలో ఆనందం వెల్లివిరియగా ఆసీస్ పెవిలియన్‌లో నిశ్శబ్దం వినిపించింది. ఇక కొత్త సంవత్సరంలోనూ ఇదే జోరు సాగించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడమే భారత్ తక్షణ లక్ష్యం! మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను భారత్ 1–1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 133/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలవగా, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 35 నాటౌట్; 7 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అజింక్య రహానే (40 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించి జట్టును విజయతీరం చేర్చారు. ఆస్ట్రేలియాతో ‘సెంచరీ’ టెస్టులో భారత్‌కు విక్టరీ అందించారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 7 నుంచి సిడ్నీలో జరుగుతుంది. ఆకట్టుకున్న సిరాజ్ ఆసీస్ చివరి వరుస బ్యాట్స్‌మన్ అంత సులభంగా లొంగలేదు. మిగిలిన నాలుగు వికెట్లు తీసేందుకు భారత్‌కు 37.1 ఓవర్లు పట్టాయి. గ్రీన్, కమిన్స్ (103 బంతుల్లో 22; ఫోర్) కలిసి పోరాడుతూ ఏడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఎట్టకేలకు ఒక షార్ట్ బంతితో కమిన్స్‌ను అవుట్ చేసి బుమ్రా ఈ జోడీని విడదీశాడు. కొద్ది సేపటికి సిరాజ్ బౌలింగ్‌లో పుల్ షాట్‌కు ప్రయత్నించిన గ్రీన్... జడేజా చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత లయన్ (15 బంతుల్లో 3)ను సిరాజ్ అవుట్ చేయగా, హాజల్‌వుడ్ (21 బంతుల్లో 10)ను బౌల్డ్ చేసిన అశ్విన్ ఆసీస్ ఆట ముగించాడు. పుజారా నిరాశ లక్ష్యం చిన్నదే అయినా 19 పరుగుల వద్దే జట్టు రెండు వికెట్లు కోల్పోవడం కొంత ఆందోళన రేపింది. మయాంక్ అగర్వాల్ (5) మరోసారి విఫలమవ్వగా, పుజారా (3) కూడా పేలవ షాట్ ఆడి గల్లీలో క్యాచ్ ఇచ్చాడు. తన సహజ ధోరణికి భిన్నంగా పుజారా కాలితో గ్రౌండ్‌ను తన్ని, ఆపై బౌండరీ వద్ద ప్రకటనల హోర్డింగ్‌ను కూడా బ్యాట్‌తో కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు! అయితే ఆ తర్వాత గిల్, రహానే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు వరుస బౌండరీలతో చకచకా పరుగులు సాధించారు. చివరకు లయన్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా పుల్ షాట్ ఆడి సింగిల్ తీయడంతో భారత్ గెలుపు పూర్తయింది. ఆస్ట్రేలియాపై మరో దెబ్బ! అసలే ఓటమి భారంతో ఉన్న ఆసీస్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించడంతో పాటు కీలకమైన నాలుగు ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లను కూడా తగ్గించింది. నిర్ణీత సమయంకంటే ఆస్ట్రేలియా 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. నిబంధనల ప్రకారం ఒక్కో ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు పాయింట్ల చొప్పున కోత విధిస్తారు. ఆసీస్ దిగ్గజం డేవిడ్ బూన్ ఈ మ్యాచ్ రిఫరీ కావడం విశేషం! సిడ్నీలోనే మూడో టెస్టు భారత్, ఆస్ట్రేలియా మధ్య షెడ్యూల్ ప్రకారం జనవరి 7 నుంచి సిడ్నీలోనే మూడో టెస్టు జరుగుతుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) అధికారికంగా ప్రకటించింది. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ వేదికను సిడ్నీ నుంచి మార్చవచ్చని, అవసరమైతే మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు జరపాలని ఇప్పటి వరకు ప్రతిపాదనలు వచ్చాయి. సిడ్నీలో మంగళవారం మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కొన్ని షరతులతో టెస్టును నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కట్టుదిట్టమైన కోవిడ్–19 ఆంక్షల నేపథ్యంలో ఆటగాళ్లు సిడ్నీకి ప్రయాణించనున్నారు. ► మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్ సాధించిన టెస్టు విజయాల సంఖ్య. విదేశీ గడ్డపై భారత్ అత్యధిక విజయాలు అందుకున్న వేదికగా ఎంసీజీ అవతరించింది. క్వీన్స్‌పార్క్ ఓవల్ (ట్రినిడాడ్), సబీనా పార్క్ (జమైకా), సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (కొలంబో) మైదానాల్లో భారత్ మూడేసి టెస్టుల్లో గెలిచింది. ఇంగ్లండ్, భారత్ మాత్రమే ఎంసీజీలో నాలుగు అంతకంటే ఎక్కువ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై గెలిచాయి. ► అజింక్య రహానే సెంచరీ చేసిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఇప్పటివరకు ఓడిపోలేదు. రహానే 12 సెంచరీలు చేయగా... 8 టెస్టుల్లో భారత్ గెలిచింది (వీటిలో ఓ టెస్టులో అతను రెండు సెంచరీలు చేశాడు). మరో మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ► ఆస్ట్రేలియా గడ్డపై టాస్ ఓడిపోయి టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం 2003 తర్వాత భారత్‌కిదే తొలిసారి. 2003లో అడిలైడ్ టెస్టులో భారత్ ఈ తరహా లోనే గెలిచింది. విదేశీ గడ్డపై మాత్రం 2010 తర్వాత భారత్‌కు ఇలాంటి విజయం దక్కింది. 2010లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ భారత్ టాస్ ఓడాక గెలుపు రుచి చూసింది. ► ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌లోని తొలి టెస్టులో ఓడిపోయి రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేసిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. గతంలో వెస్టిండీస్ (1975–76 సీజన్); న్యూజిలాండ్ (2011లో) ఇలా చేశాయి. ► వరుసగా రెండు పర్యటనల్లో ఎంసీజీ మైదానంలో రెండు వరుస టెస్టులు నెగ్గడం భారత్‌కిది రెండోసారి. 1977, 1980లలో ఇలా నెగ్గిన భారత్ 2018, 2020లో పునరావృతం చేసింది. ► స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ చేయకపోవడం 32 ఏళ్ల తర్వాత జరిగింది. చివరిసారి 1988లో డిసెంబరు 24 నుంచి 29 వరకు ఎంసీజీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఎవరూ అర్ధ సెంచరీ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 285 పరుగుల తేడాతో ఓడిపోయింది. ► లసిత్ మలింగ (శ్రీలంక; 6/92; 2004లో) తర్వాత గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండో బౌలర్‌గా సిరాజ్ (5/77) నిలిచాడు. సిరాజ్‌తోపాటు గతంలో ఫిల్ డిఫ్రిటాస్ (ఇంగ్లండ్; 5/94; 1986లో), అలెక్స్ ట్యూడర్ (ఇంగ్లండ్; 5/108; 1998లో) కూడా ఆస్ట్రేలియాలో తమ అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్లు తీశారు. గర్వంగా ఉంది: రహానే మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. ముఖ్యంగా కొత్త కుర్రాళ్లు సిరాజ్, గిల్ చూపిన పట్టుదలను ఎంత ప్రశంసించినా తక్కువే. సాధారణంగా అరంగేట్ర ఆటగాళ్లు అత్యుత్సాహంతో తమపై నియంత్రణ కోల్పోతారు. కానీ నాలుగైదేళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం ఉన్న వీరిద్దరు అలాంటి అవకాశం ఇవ్వలేదు. దాంతో కెప్టెన్ పని సులువైంది. తొలి రోజు పదో ఓవర్లోనే బౌలింగ్‌కు దిగి అశ్విన్ ఆసీస్‌పై ఒత్తిడి పెంచాడు. ఐదుగురు బౌలర్ల వ్యూహం బాగా పని చేసింది. ఆల్‌రౌండర్‌గా జడేజా తన విలువ చూపించాడు. అడిలైడ్‌లో ఒక్క గంటలో మ్యాచ్ చేజారింది. అయితే దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్లలేకపోయాం. మేం అలా చేయలేదు. మరింత పట్టుదలతో, దూకుడుతో ఇక్కడ బరిలోకి దిగాలని అనుకున్నాం. ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా రాణిస్తే ఫలితం రాబట్టగలమని తెలుసు. –అజింక్య రహానే, భారత కెప్టెన్ స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 195; భారత్ తొలి ఇన్నింగ్స్ 326; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) జడేజా 40, బర్న్స్ (సి) పంత్ (బి) ఉమేశ్ 4, లబ్‌షేన్ (సి) రహానే (బి) అశ్విన్ 28, స్మిత్ (బి) బుమ్రా 8, హెడ్ (సి) మయాంక్ (బి) సిరాజ్ 17, గ్రీన్ (సి) జడేజా (బి) సిరాజ్ 45, పైన్ (సి) పంత్ (బి) జడేజా 1, కమిన్స్ (సి) మయాంక్ (బి) బుమ్రా 22, స్టార్క్ (నాటౌట్) 14, లయన్ (సి) పంత్ (బి) సిరాజ్ 3, హాజల్‌వుడ్ (బి) అశ్విన్ 10, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (103.1 ఓవర్లలో ఆలౌట్) 200. వికెట్ల పతనం: 1–4, 2–42, 3–71, 4–98, 5–98, 6–99, 7–156, 8–177, 9–185, 10–200. బౌలింగ్: బుమ్రా 27–6–54–2, ఉమేశ్ యాదవ్ 3.3–0–5–1, సిరాజ్ 21.3–4–37–3, అశ్విన్ 37.1–6–71–2, రవీంద్ర జడేజా 14–5–28–2. భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) పైన్ (బి) స్టార్క్ 5, గిల్ (నాటౌట్) 35, పుజారా (సి) గ్రీన్ (బి) కమిన్స్ 3, రహానే (నాటౌట్) 27, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 70. వికెట్ల పతనం: 1–16, 2–19. బౌలింగ్: స్టార్క్ 4–0–20–1, కమిన్స్ 5–0–22–1, హాజల్‌వుడ్ 3–1–14–0, లయన్ 2.5–0–5–0, లబ్‌షేన్ 1–0–9–0. -
వన్డేలతో మొదలు...
మెల్బోర్న్: కంగారూ గడ్డపై భారత జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సిరీస్‌కు గురువారం పచ్చజెండా ఊపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తేదీలతో సహా తుది షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదించడం లాంఛనమే. అయితే ఈ పూర్తి స్థాయి పర్యటనలో చిన్న మార్పు చోటుచేసుకుంది. సుదీర్ఘ ద్వైపాక్షిక సమరంలో ఇన్నాళ్లు ముందుగా పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లు జరుగుతాయన్న సీఏ ఇప్పుడు మార్చింది. తొలుత వన్డేలు... ఆ తర్వాతే టి20 జరుగుతాయని ప్రకటించింది. కంగారూ గడ్డపై అడుగుపెట్టగానే సిడ్నీలో భారత ఆటగాళ్లు క్వారంటైన్ అవుతారు. ఇదీ షెడ్యూల్... సిడ్నీలో కరోనా ప్రొటోకాల్ ముగిశాక... అక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోనే వచ్చే నెల 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలు జరుగుతాయి. ఆఖరి వన్డే కాన్‌బెర్రాలోని మనుక ఓవల్ మైదానంలో డిసెంబర్ 1న జరుగుతుంది. ఇదే వేదికపై 4న తొలి టి20 నిర్వహిస్తారు. మిగతా రెండు పొట్టి మ్యాచ్‌ల్ని మళ్లీ సిడ్నీలో నిర్వహిస్తారు. 6, 8 తేదీల్లో ఎస్సీజీలో రెండు, మూడో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక నాలుగు టెస్టుల సిరీస్ పింక్‌బాల్‌తో మొదలవుతుంది. డిసెంబర్ 17 నుంచి 21 వరకు అడిలైడ్ ఓవల్‌లో తొలి డేనైట్ టెస్టు జరుగుతుంది. బాక్సింగ్ డే టెస్టు 26 నుంచి 30 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. అప్పుడు కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విక్టోరియా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తే ‘బాక్సింగ్ డే’ టెస్టు వేదికను అడిలైడ్ ఓవల్‌కు మారుస్తారు. ఇది బ్యాకప్ వేదికైనా డేనైట్ టెస్టు కాదు. మూడో టెస్టు జనవరి 7 నుంచి 11 వరకు సిడ్నీలో, చివరి టెస్టు జనవరి 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్‌లో జరుగుతాయి. -
మీ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కరోనా మహమ్మారిపై మోగిస్తున్న యుద్ధభేరిలో భారత క్రీడాకారుల మద్దతు కోరారు. శుక్రవారం ఆయన క్రీడల మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో క్రీడాకారులతో మాట్లాడారు. కోవిడ్–19పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు, సాయిప్రణీత్, అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష, భారత మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ , టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడా ప్రముఖుల్లో కొందరు. కరోనా వైరస్‌పై విజయం సాధించాలంటే లాక్డౌన్లో అందరూ కచ్చితంగా వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. తమ అభిమాన ఆట గాళ్ల సంకేతాలు భారతీయులు చెవికెక్కించుకుంటే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని ప్రధాని భావిస్తున్నారు. ‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మీ మీ సూచనలు, సలహాలు అవశ్యం. మైదానాల్లో మీలాగే ఇప్పుడు ఇండియా మొత్తం మహమ్మారిపై పోరాడుతోంది. దేశ ప్రతిష్టను పెంచే మీలాంటివారు ముందుకొచ్చి జనాన్ని జాగృతం చేస్తే ఆ స్ఫూర్తితో దేశం వైరస్‌పై పైచేయి సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం’ అని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ఆటగాళ్లతో అన్నారు. వీడియో కాల్‌పై సచిన్ మాట్లాడుతూ... కరోనాపై పోరు ముగిశాక కూడా ఇకపై మనమంతా కరచాలనానికి బదులు మన సంప్రదాయం ప్రకారం నమస్కారంతోనే పలుకరించుకోవాలని సూచించినట్లు చెప్పారు. -
కుదించి... మనవాళ్లతోనే ఆడించాలి
న్యూఢిల్లీ: ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్‌ను కుదించి... కేవలం భారత ఆటగాళ్లతోనే ఆడించాలని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రంజిత్ బర్తకూర్ సూచించారు. ఐపీఎల్–13పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉంది. గతంలో ఈనెల 15 వరకు లీగ్‌ను వాయిదా వేసింది. ఇప్పుడు కరోనా ఉధృతి మరింత పెరిగింది. దీంతో విదేశీ ఆటగాళ్లతో ఆడించే పరిస్థితి లేకపోవడంతో రంజిత్ మాట్లాడుతూ ‘ఇది ఎలాగూ ఇండియన్ ప్రీమియర్ లీగే కాబట్టి ఈసారి పూర్తిగా మన ఆటగాళ్లకే పరిమితం చేసి... కుదించి ఆడించాలి. ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో బీసీసీఐ ఇంతకుమించి ఏం చేయలేకపోవచ్చు. గతంలో కేవలం భారత ఆటగాళ్లతోనే నిర్వహించడం గురించి అసలు ఆలోచించే పరిస్థితే లేదు. కానీ ఇప్పుడు అంతా మారింది. నాణ్యమైన ఆటగాళ్లు ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వీళ్లు కూడా విదేశీ ఆటగాళ్లకు దీటుగా రంజింప చేయగలరు’ అని అన్నారు. ఏదేమైనా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బోర్డేనని అది కూడా ఏప్రిల్ 15 తర్వాతేనని రంజిత్ చెప్పారు. -
‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు
దుబాయ్: జెంటిల్మెన్ క్రికెట్‌కు తమ దురుసు ప్రవర్తనతో మచ్చ తెచ్చిన భారత్, బంగ్లాదేశ్ యువ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విష్ణు–నవనీత్ జంటకు స్వర్ణం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మంగళవారం తెలంగాణకు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్ అండర్–21 బాలుర డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్ గౌడ్–బొక్కా నవనీత్ ద్వయం విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. ఫైనల్లో విష్ణువర్ధన్–నవనీత్ (తెలంగాణ) జంట 18–21, 21–13, 21–15తో మంజిత్–డింకూ సింగ్ (మణిపూర్) జోడీపై గెలిచింది. టెన్నిస్ అండర్–21 బాలుర డబుల్స్ విభాగంలో తీర్థ శశాంక్–గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ద్వయం రజతం నెగ్గింది. ఫైనల్లో శశాంక్–సాయికార్తీక్ జోడీ 3–6, 1–6తో పరీక్షిత్ సోమాని–షేక్ ఇఫ్తెకార్ (అస్సాం) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. టెన్నిస్ అండర్–21 బాలికల సింగిల్స్ విభాగంలో సామ సాత్విక (తెలంగాణ) రజతం దక్కించుకుంది. దక్షిణాసియా క్రీడల మహిళల సింగిల్స్ చాంపియన్ అయిన సాత్విక ఫైనల్లో 3–6, 1–6తో వైదేహి చౌదరీ (గుజరాత్) చేతిలో ఓటమి చవిచూసింది. టెన్నిస్ అండర్–17 బాలికల సింగిల్స్‌లో సంజన సిరిమల్ల (తెలంగాణ) కాంస్యం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో సంజన 6–0, 7–5తో కుందన (తమిళనాడు)పై గెలిచింది. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో 15వ స్థానంలో ఉంది. -
కొత్త శిఖరాలకు...
ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడమే ఘనతగా భావించే భారత క్రీడాకారులు ఇప్పుడు ఏకంగా పతకాలు కొల్లగొడుతున్నారు. క్రీడల్లో అగ్రరాజ్యాల ఆటగాళ్లకు దీటుగా తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఆశల పల్లకీని మోస్తూ అసలు సమరంలోనూ ఔరా అనిపిస్తున్నారు. విశ్వ వేదికపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారత క్రీడారంగం కొత్త శిఖరాలకు చేరింది. బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు విశ్వవిజేతగా అవతరించి గతంలో ఏ భారత షట్లర్కూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. బాక్సింగ్‌లో అమిత్ పంఘాల్, మనీశ్ కౌశిక్ రజత, కాంస్య పతకాలు గెలిచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలు అందించారు. షట్లర్లు, బాక్సర్లకు తోడుగా షూటర్లు, రెజ్లర్లు, ఆర్చర్లు కూడా అత్యున్నత వేదికపై అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ సంవత్సరం అదరగొట్టిన భారత క్రీడాకారులు వచ్చే ఏడాది విశ్వ క్రీడా సంరంభం టోక్యో లింపిక్స్లోనూ తమ అది్వతీయ విజయ విన్యాసాలను పునరావృతం చేయాలని ఆకాంక్షిద్దాం... ఆశీర్వదిద్దాం..! సాక్షి క్రీడావిభాగం విజయాల బాటలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ... తమకంటే మెరుగైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ... ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రస్థానం సాగింది. ఈ క్రమంలో మనోళ్లు కొత్త రికార్డులు సృష్టించారు. భవిష్యత్‌పై కొత్త ఆశలు రేకెత్తించారు. మెరుపుల్లేని టెన్నిస్ రాకెట్... ఈ సంవత్సరం భారత టెన్నిస్‌కు గొప్ప ఫలితాలేవీ రాలేదు. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించినా... ఒక్క దాంట్లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. యూఎస్ ఓపెన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో భారత యువతార సుమీత్ నాగల్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ ఆడాడు. ఫెడరర్‌పై తొలి సెట్ గెలిచిన సుమీత్ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి ఓడిపోయాడు. డబుల్స్‌లో దివిజ్ శరణ్ రెండు ఏటీపీ టోర్నీ టైటిల్స్ (పుణే ఓపెన్, సెయిట్ పీటర్స్బర్గ్ ఓపెన్) సాధించగా... రోహన్ బోపన్న (పుణే ఓపెన్) ఒక టైటిల్ గెలిచాడు. భారత దిగ్గజం, 46 ఏళ్ల లియాండర్ పేస్ 19 ఏళ్ల తర్వాత ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–100 నుంచి బయటకు వచ్చాడు. తటస్థ వేదిక కజకిస్తాన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా ఓసియానియా మ్యాచ్‌లో భారత్ 4–0తో గెలిచి వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించింది. ‘పట్టు’ పెరిగింది... ఈ ఏడాది రెజ్లింగ్‌లో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఏకంగా ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), రాహుల్ అవారే (61 కేజీలు) కాంస్యాలు గెలుపొందగా... దీపక్ పూనియా (86 కేజీలు) రజతం సాధించాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) కాంస్య పతకం దక్కించుకుంది. ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో దీపక్ పూనియా (86 కేజీలు) స్వర్ణం నెగ్గి 18 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లోని ఓ విభాగంలో భారత్‌కు పసిడి పతకం అందించిన రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం ఉత్తమ ప్రపంచ జూనియర్ రెజ్లర్‌గా కూడా దీపక్ పూనియా ఎంపిక కావడం విశేషం. సస్పెన్షన్ ఉన్నా... భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అంతర్గత రాజకీయాల కారణంగా ప్రపంచ ఆర్చరీ సంఘం భారత్‌పై సస్పెన్షన్ విధించింది. దాంతో భారత ఆర్చర్లు భారత పతాకం కింద కాకుండా ప్రపంచ ఆర్చరీ సంఘం పతాకంపై పోటీ పడాల్సి వచి్చంది. జూన్‌లో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్ బృందం రికర్వ్ టీమ్ విభాగంలో రజతం నెగ్గడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్ కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్íÙప్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్లో దీపిక కుమారి మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను సంపాదించింది. జగజ్జేత... గత పదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తమదైన ముద్ర వేస్తున్న భారత షట్లర్లు ఈసారి అద్భుతమే చేశారు. పూసర్ల వెంకట (పీవీ) సింధు రూపంలో భారత బ్యాడ్మింటన్‌కు తొలిసారి ప్రపంచ చాంపియన్ లభించింది. ఆగస్టులో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు మహిళల సింగిల్స్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఇక పురుషుల సింగిల్స్‌లో మరో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రకాశ్ పదుకొనే (1983లో) తర్వాత ప్రపంచ చాంపియన్íÙప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడిగా సాయిప్రణీత్ ఘనత వహించాడు. వీరిద్దరి ప్రతిభ కారణంగా 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలిసారి మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో పతకాలు లభించాయి. ప్రపంచ చాంపియన్íÙప్లో ప్రదర్శనను మినహాయిస్తే వరల్డ్ టూర్ సూపర్ టోర్నమెంట్లలో ఈసారి భారత అగ్రశ్రేణి క్రీడాకారులెవరూ ఆకట్టుకోలేకపోయారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించి మేటి జోడీకి ఉండాల్సిన లక్షణాలు తమలో ఉన్నాయని చాటిచెప్పింది. సీజన్ చివర్లో యువతార లక్ష్య సేన్ ఐదు సింగిల్స్ టైటిల్స్ సాధించి ఊరటనిచ్చాడు. ఏడాది ఆరంభంలో జరిగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు రాప్టర్స్ జట్టు టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. మరింత ‘ఎత్తు’కు... భారత చెస్‌కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందారు. ఈ జాబితాలో విశాఖ్ (తమిళనాడు), గుకేశ్ (తమిళనాడు), ఇనియన్ (తమిళనాడు), స్వయమ్స్ మిశ్రా (ఒడిశా), గిరిశ్ కౌశిక్ (కర్ణాటక), ప్రీతూ గుప్తా (ఢిల్లీ) ఉన్నారు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో డి.గుకేశ్ గ్రాండ్‌మాస్టర్ హోదా పొంది భారత్ తరఫున ఈ ఘనత సాధించిన పిన్న వయసు్కడిగా... ప్రపంచంలో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 2002లో సెర్గీ కర్యాకిన్ (రష్యా) 12 ఏళ్ల 10 నెలల వయస్సులో జీఎం హోదా సాధించాడు. ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టూర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రష్యా గ్రాండ్‌ప్రిలో టైటిల్ సాధించి... మొనాకో గ్రాండ్‌ప్రిలో రన్నరప్‌గా నిలిచింది. ‘పంచ్’ అదిరింది... బాక్సింగ్‌లోనూ ఈ సంవత్సరం భారత క్రీడాకారులు అదరగొట్టారు. రష్యాలో జరిగిన పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్íÙప్లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) రజతం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు) కాంస్యం గెలవడంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలిసారి ఒకేసారి రెండు పతకాలు లభించాయి. సీనియర్ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)తోపాటు జమునా బోరో (54 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కాంస్యాలు సాధించగా... మంజు రాణి (48 కేజీలు) రజత పతకం గెల్చుకుంది. సూపర్ ‘గురి’... షూటింగ్లో మనోళ్లు గురి చూసి పతకాల పంట పండించారు. ఫిబ్రవరిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అపూర్వీ చండేలా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో... సౌరభ్ చౌధరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డులు సృష్టించి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సౌరభ్–మను భాకర్ జోడీ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఏప్రిల్‌లో చైనాలో జరిగిన రెండో ప్రపంచకప్ టోర్నీలోనూ భారత షూటర్లు మెరిశారు. మూడు స్వర్ణాలు, ఒక రజతం సాధించి ‘టాప్’ ర్యాంక్‌ను సంపాదించారు. ఆసియా చాంపియన్íÙప్లోనూ భారత షూటర్లు అదుర్స్ అనిపించారు. ఓవరాల్‌గా ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. చలాకీ... హాకీ సొంతగడ్డపై జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తమ ప్రత్యర్థులను ఓడించిన భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్ బెర్త్‌లను సంపాదించాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో రష్యాపై భారత పురుషుల జట్టు... అమెరికాపై భారత మహిళల జట్టు గెలుపొందాయి. అంతకుముందు సీజన్ ఆరంభంలో భారత పురుషుల జట్టు అజ్లాన్ షా హాకీ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. అదే మందగమనం... ‘ఆసియా’ స్థాయి మినహాయిస్తే అంతర్జాతీయంగా భారత అథ్లెట్స్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చే సత్తా ఉన్న అథ్లెట్స్‌గా నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), హిమ దాస్ (మహిళల 400 మీటర్లు)లపై భారీ ఆశలు పెట్టుకున్నా వారిద్దరూ గాయాల బారిన పడ్డారు. సెపె్టంబర్లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్‌కు దూరమయ్యారు. ఇటలీలో జూలైలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ద్యుతీ చంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. అయితే ప్రపంచ చాంపియన్íÙప్లో ద్యుతీ చంద్ విఫలమైంది. ఆమె హీట్స్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్ అర్హత సమయాన్ని (11.15 సెకన్లు) ఆమె అందుకోలేకపోయింది. దీటుగా... టీటీ... టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ సత్యన్ జ్ఞానశేఖరన్ అద్భుత పురోగతి సాధించాడు. ఈ ఏడాది అతను ప్రపంచ టాప్–20 ర్యాంకింగ్స్‌లోని పలువురు ఆటగాళ్లను ఓడించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ తరఫున పురుషుల సింగిల్స్ ఆటగాడు ఐటీటీఎఫ్ టాప్–25 ర్యాంకింగ్స్‌లో రావడం ఇదే ప్రథమం. సత్యన్, శరత్ కమల్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకుంది. -
భారత్ ‘టాప్’ లేపింది
కఠ్మాండు (నేపాల్): మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నేపాల్‌లో మంగళవారం ముగిసిన ఈ క్రీడల్లో భారత్ అత్యధికంగా 312 పతకాలు సాధించి ‘టాప్’లో నిలిచింది. ఇందులో 174 స్వర్ణాలు, 93 రజతాలు, 45 కాంస్యాలు ఉన్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 309 పతకాలు సాధించింది. ఈసారి ఆ రికార్డును భారత్ బృందం సవరించింది. 1984లో దక్షిణాసియా క్రీడలు మొదలుకాగా... ఇప్పటివరకు జరిగిన అన్ని క్రీడల్లోనూ పతకాల పట్టికలో భారతే అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రీడల ఆఖరి రోజు మంగళవారం భారత్ 15 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం 18 పతకాలు సాధించింది. బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 101–62తో శ్రీలంక జట్టుపై, భారత మహిళల జట్టు 127–46తో నేపాల్‌పై గెలిచి స్వర్ణ పతకాలు నెగ్గాయి. స్క్వాష్ టీమ్ ఈవెంట్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం, పురుషుల జట్టు రజతం సాధించాయి. బాక్సింగ్‌లో ఆరు పసిడి పతకాలు లభించాయి. పురుషుల విభాగంలో వికాస్ కృషన్ (69 కేజీలు), స్పర్శ్ కుమార్ (52 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు)... మహిళల విభాగంలో పింకీ రాణి (51 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), మంజు బొంబారియా (64 కేజీలు) విజేతలుగా నిలిచారు. -
అదే జోరు...
కఠ్మాండు (నేపాల్): తొలి రోజు మొదలైన పతకాల వేటను కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రీడల ఎనిమిదో రోజు భారత్‌కు 22 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 38 పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 132 స్వర్ణాలు, 79 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి మొత్తం 252 పతకాలతో ‘టాప్’లో ఉంది. ఆదివారం టెన్నిస్ డబుల్స్ విభాగాల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మిక్స్డ్, పురుషుల, మహిళల డబుల్స్ విభాగాల్లో భారత్‌కే స్వర్ణాలు, రజతాలు లభించాయి. పతకాలు నెగ్గిన టెన్నిస్ క్రీడాకారుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సౌజన్య బవిశెట్టి, కాల్వ భువన, శ్రావ్య శివాని (తెలంగాణ)... సాకేత్ మైనేని (ఆంధ్రప్రదేశ్), విష్ణువర్ధన్ (తెలంగాణ) ఉన్నారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సౌజన్య బవిశెట్టి–శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6–3, 6–7 (4/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–ప్రార్థన తొంబారే (భారత్) జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్ మైనేని–విష్ణువర్ధన్ (భారత్) జంట 7–5, 3–6, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో శ్రీరామ్ బాలాజీ–జీవన్ నెడుంజెళియన్ ద్వయంపై నెగ్గింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రేరణ బాంబ్రీ–ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 6–3, 6–3తో కాల్వ భువన–చిలకలపూడి శ్రావ్య శివాని (భారత్) జంటను ఓడించింది. కోచ్, భర్త అయిన సురేశ్ కృష్ణ శిక్షణలో రాటుదేలిన సౌజన్య నేడు జరిగే మహిళల సింగిల్స్‌లో పసిడి పతకం కోసం పోరాడనుంది. తెలంగాణకే చెందిన సామ సాత్వికతో సౌజన్య ఫైనల్లో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ పసిడి పోరులో వైజాగ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత్‌కే చెందిన మనీశ్ సురేశ్ కుమార్‌తో తలపడతాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి. మహిళల 62 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్... అన్షు (59 కేజీలు)... పురుషుల 61 కేజీల విభాగంలో రవీందర్... పవన్ కుమార్ (86 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఇక బాక్సింగ్‌లో మొత్తం 15 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లి ఏకంగా 15 స్వర్ణాలపై గురి పెట్టారు. ఫెన్సింగ్‌లో పురుషుల ఇపీ, సాబ్రే... మహిళల ఫాయిల్ టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు వచ్చాయి. స్విమ్మింగ్‌లో ఏడు స్వర్ణాలు వచ్చాయి. జూడోలో భారత్ ‘కనకా’రంభం చేసింది. సుశీలా దేవి (48 కేజీలు), విజయ్ కుమార్ యాదవ్ (60 కేజీలు), జస్లీన్ సింగ్ సైని (66 కేజీలు), సుచిక తరియాల్ (57 కేజీలు), నిరుపమా దేవి (63 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. షూటింగ్లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో శ్రవణ్ కుమార్, రవీందర్ సింగ్, సుమీత్‌లతో కూడిన భారత బృందం స్వర్ణం నెగ్గింది. వ్యక్తిగత విభాగంలో శ్రవణ్ బంగారు పతకం సొంతం చేసుకోగా... రవీందర్‌సింగ్ కాంçస్యం గెలిచాడు. -
స్వర్ణాల్లో సెంచరీ... పతకాల్లో డబుల్ సెంచరీ
కఠ్మాండు (నేపాల్): తమ ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటూ దక్షిణాసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. ఈ క్రీడల చరిత్రలో ఆరోసారి ‘స్వర్ణ’ పతకాల సెంచరీని పూర్తి చేసుకుంది. అదే క్రమంలో మొత్తం పతకాల్లో డబుల్ సెంచరీని దాటింది. ఈ క్రీడల్లో ఏడో రోజు శనివారం భారత్ మొత్తం 49 పతకాలు కొల్లగొట్టగా... అందులో 29 స్వర్ణాలు ఉండటం విశేషం. ప్రస్తుతం భారత్ 110 స్వర్ణాలు, 69 రజతాలు, 35 కాంస్యాలతో కలిపి మొత్తం 214 పతకాలతో ‘టాప్’లో కొనసాగుతోంది. 43 స్వర్ణాలు, 34 రజతాలు, 65 కాంస్యాలతో కలిపి మొత్తం 142 పతకాలతో నేపాల్ రెండో స్థానంలో ఉంది. శనివారం స్విమ్మర్లు, రెజ్లర్లు, షూటర్ల ప్రదర్శనతో భారత పసిడి పతకాల సంఖ్య 100 దాటింది. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్), రిచా మిశ్రా (800 మీ. ఫ్రీస్టయిల్), శివ (400 మీ. వ్యక్తిగత మెడ్లే), మానా పటేల్ (100 మీ. బ్యాక్‌స్ట్రోక్), చాహాత్ అరోరా (50 మీ. బ్యాక్‌స్ట్రోక్), లిఖిత్ (50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్), రుజుతా భట్ (50 మీ. ఫ్రీస్టయిల్) స్వర్ణాలు సాధించారు. రెజ్లింగ్‌లో సత్యవర్త్ కడియాన్ (పురుషుల ఫ్రీస్టయిల్ 97 కేజీలు), సుమీత్ మలిక్ (పురుషుల ఫ్రీస్టయిల్ 125 కేజీలు), గుర్‌శరణ్‌ప్రీత్ కౌర్ (మహిళల 76 కేజీలు), సరితా మోర్ (మహిళల 57 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. 97 కేజీల ఫైనల్లో పాక్ రెజ్లర్ తబియార్ ఖాన్‌ను సత్యవర్త్ చిత్తుగా ఓడించాడు. ఇక షూటింగ్లో మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అనీశ్ భన్వాలా... టీమ్ విభాగంలో అనీశ్, భావేశ్, ఆదర్శ్ సింగ్‌లతో కూడిన భారత జట్టుకు... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో మెహులీ ఘోష్–యశ్ వర్ధన్ జంటకు స్వర్ణాలు దక్కాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 81 కేజీల విభాగంలో సృష్టి సింగ్... 87 కేజీల విభాగంలో అనురాధ బంగారు పతకాలు గెలిచారు. -
ఎఫ్ఐహెచ్ అవార్డు రేసులో మన్‌ప్రీత్
లుసానే (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులను నామినేట్ చేశారు. భారత సీనియర్ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో ఉండగా... వివేక్ ప్రసాద్, లాల్రెమ్సియామి వరుసగా పురుషుల, మహిళల ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు బరిలో ఉన్నారు. 27 ఏళ్ల మన్‌ప్రీత్ భారత్ తరఫున 242 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అతని సారథ్యంలోనే భారత జట్టు ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో రష్యాపై గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 19 ఏళ్ల వివేక్ ప్రసాద్ గత ఏడాది యూత్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు రజతం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 19 ఏళ్ల లాల్రెమ్సియామి ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళల జట్టులో సభ్యురాలిగా ఉంది. జాతీయ సంఘాలు, ఆటగాళ్లు, అభిమానులు, హాకీ జర్నలిస్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఓటింగ్ వచ్చే ఏడాది జనవరి 17 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరిలో విజేతలను ప్రకటిస్తారు. -
భారత్ పసిడి వేట
కఠ్మాండు (నేపాల్): బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్లోనూ పైచేయి సాధిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల వేటను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రీడల ఆరో రోజు శుక్రవారం భారత్ 19 స్వర్ణాలు, 18 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 41 పతకాలు సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ప్రస్తుతం భారత్ 81 స్వర్ణాలు, 59 రజతాలు, 25 కాంస్యాలతో కలిపి మొత్తం 165 పతకాలతో ‘టాప్’లో కొనసాగుతోంది. శుక్రవారం బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ స్వర్ణం నెగ్గాడు. ఫైనల్లో సిరిల్ వర్మ 17–21, 23–21, 21–13తో ఆర్యమాన్ టాండన్ (భారత్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి రజతం దక్కించుకుంది. ఫైనల్లో అషి్మత (భారత్) 21–18, 25–23తో గాయత్రిని ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ గారగ కృష్ణప్రసాద్–ధ్రువ్ కపిల (భారత్) జంట 21–19, 19–21, 21–18తో సచిన్ డయాస్–బువనెక (శ్రీలంక) జోడీపై గెలిచి బంగారు పతకం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో తెలుగమ్మాయి జక్కంపూడి మేఘన–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–16, 21–14తో సచిన్ డయాస్–ప్రమోదిక (శ్రీలంక) జంటపై నెగ్గి పసిడి పతకం సాధించింది. అథ్లెటిక్స్‌లో తేజిందర్ పాల్ పురుషుల షాట్‌పుట్‌లో స్వర్ణం గెలిచాడు. తేజిందర్ ఇనుప గుండును 20.03 మీటర్ల దూరం విసిరి ధక్షిణాసియా క్రీడల రికార్డును నెలకొల్పి విజేతగా నిలిచాడు. మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కే చెందిన అభా ఖతువా పసిడి పతకం గెలిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు స్వర్ణాలు దక్కాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆంథోనీ అమల్‌రాజ్ 4–3తో హరీ్మత్ దేశాయ్ (భారత్)పై, మహిళల సింగిల్స్ ఫైనల్లో సుతీర్థ 4–2తో ఐహిక ముఖర్జీ (భారత్)పై గెలిచారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో అచింత షెయులి (పురుషుల 73 కేజీలు), రాఖీ హల్దర్ (మహిళల 64 కేజీలు), మన్‌ప్రీత్ కౌర్ (మహిళల 71 కేజీలు) స్వర్ణ పతకాలు గెలిచారు. -
పతకాల సెంచరీ
కఠ్మాండు (నేపాల్): పతకాల వేట కొనసాగిస్తూ... దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. ఈ క్రీడల ఐదో రోజు భారత్ తమ విశ్వరూపం ప్రదర్శించింది. ఒకే రోజు 30 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 56 పతకాలు సొంతం చేసుకొని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఐదో రోజు పోటీలు ముగిశాక భారత్ 62 స్వర్ణాలు, 41 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి 124 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆతిథ్య దేశం నేపాల్ 36 స్వర్ణాలు, 27 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 101 పతకాలతో రెండో స్థానంలో ఉంది. గురువారం స్విమ్మింగ్, వుషు, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. వుషులో ఏకంగా ఏడు స్వర్ణాలు లభించాయి. మహిళల సాన్‌సూ 52 కేజీల విభాగంలో వై. సనతోయ్ దేవి... పూనమ్ (75 కేజీలు), దీపిక (70 కేజీలు), సుశీల (65 కేజీలు), రోషిబినా దేవి (60 కేజీలు)... పురుషుల గున్‌షు ఆల్ రౌండ్ ఈవెంట్లో సూరజ్ సింగ్... పురుషుల సాన్‌సూ ఈవెంట్లో సునీల్ సింగ్ (52 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. స్విమ్మింగ్‌లో లిఖిత్ సెల్వరాజ్ (పురుషుల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్), ఆపేక్ష (మహిళల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్), దివ్య (మహిళల 100 మీ. బటర్‌ఫ్లయ్) బంగారు పతకాలు గెలిచారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో జిలిల్ దలబెహెరా (మహిళల 45 కేజీలు), స్నేహా (49 కేజీలు), వింధ్యారాణి దేవి (55 కేజీలు), సిద్ధాంత్ (పురుషుల 61 కేజీలు) స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. తైక్వాండో లో పూర్వ (49 కేజీలు), రుచిక (67 కేజీలు), మార్గరెట్ (73 కేజీలు) బంగారు పతకాలు దక్కించుకున్నారు. ఫైనల్లో పుల్లెల గాయత్రి బ్యాడ్మింటన్‌లో వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి, అషి్మత... పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ, ఆర్యమాన్ టాండన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో గాయత్రి 21–17, 21–14తో దిల్మీ డయాస్ (శ్రీలంక)పై, అష్మిత (భారత్) 21–5, 21–7తో అచిని రత్నసిరి (శ్రీలంక)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో సిరిల్ వర్మ 21–9, 21–12తో దినుక కరుణరత్నె (శ్రీలంక)పై, ఆర్యమాన్ 21–18, 14–21, 21–18తో రత్నజిత్ తమాంగ్ (నేపాల్)పై గెలిచారు. -
భారత్ జోరు
కఠ్మాండు: భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో ‘పసిడి’పట్టు పట్టారు. బుధవారం జరిగిన పలు ఈవెంట్ల ఫైనల్లో భారత ఆటగాళ్లే విజేతలుగా నిలిచారు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఖోఖో పోటీల్లో భారత మహిళలు, పురుషులు బంగారు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో భారత జోడీలే టైటిల్ పోరులో తలపడ్డాయి. దీంతో స్వర్ణాలతోపాటు రజతాలు లభించాయి. టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో హర్మీత్ దేశాయ్–ఆంథోని అమల్‌రాజ్ జోడీ 8–11, 11–7, 11–7, 11–5, 8–11, 12–10తో సానిల్ శెట్టి–సుధాన్షు గ్రోవర్ జంటపై గెలుపొందింది. మహిళల ఫైనల్లో ఆకుల శ్రీజ–మధురిక పాట్కర్ జంట 2–11, 11–8, 11–8, 11–6, 5–11, 11–5తో సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో హర్మీత్–సుతీర్థ ద్వయం 11–6, 9–11, 11–6, 11–6, 11–8తో అమల్‌రాజ్–ఐహిక జంటపై గెలిచింది. ఖోఖో పురుషుల ఫైనల్లో భారత్ 16–9తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించగా, మహిళల తుదిపోరులో 17–5తో ఆతిథ్య నేపాల్‌ను ఓడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి, అష్మిత, పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ, ఆర్యమన్ టాండన్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో భారత కోచ్ గోపీచంద్ తనయ గాయత్రి 21–15, 21–16తో మహూర్ షాజాద్ (పాక్)పై, అష్మిత 21–9, 21–7తో పాల్వశ బషీర్ (పాక్)పై నెగ్గారు. పురుషుల క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ 21–12, 21–17తో మురద్ అలీ (పాక్)పై, ఆర్యమన్ 21–17, 21–17తో రంతుష్క కరుణతిలకే (శ్రీలంక)పై విజయం సాధించారు. దక్షిణాసియా క్రీడల్లో నాలుగో రోజు బుధవారం భారత్ ఏకంగా 29 పతకాలు సాధించింది. ఇందులో 15 స్వర్ణాలున్నాయి. మొత్తంమీద భారత్ 71 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 32 పసిడి పతకాలతో పాటు 26 రజతాలు, 13 కాంస్యాలు గెలిచింది. -
శ్రీశ్వాన్‌కు కాంస్యం
ముంబై: సొంతగడ్డపై జరిగిన ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు మరాలాక్షికరి శ్రీశ్వాన్ అండర్–14 ఓపెన్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత నిజామాబాద్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల శ్రీశ్వాన్ 8 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... శ్రీశ్వాన్‌కు మూడో స్థానం లభించింది. భారత్‌కే చెందిన ఎల్.ఆర్.శ్రీహరి (తమిళనాడు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకున్నాడు. ఈ విభాగంలో అజర్‌బైజాన్‌కు చెందిన ఐదిన్ సులేమాన్లి 9 పాయింట్లతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ టోరీ్నలో శ్రీశ్వాన్ ఏడు గేముల్లో గెలుపొంది, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఈ ఏడాది జూలైలో బార్సిలోనాలో జరిగిన టోరీ్నలో శ్రీశ్వాన్ మూడో అంతర్జాతీయ నార్మ్ (ఐఎం)ను సాధించి... తెలంగాణ తరఫున పిన్న వయస్సులో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అండర్–18 ఓపెన్ విభాగంలో 14 ఏళ్ల తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద ఏడు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అండర్–18 బాలికల విభాగంలో వంతిక అగర్వాల్ భారత్‌కు రజతం అందించింది. అండర్–14 బాలికల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ రెండో స్థానంలో, రక్షిత మూడో స్థానంలో నిలిచి వరుసగా రజత, కాంస్య పతకాలు అందించారు. అండర్–16 ఓపెన్ విభాగంలో అరోన్యాక్ ఘోష్ కాంస్యం గెలిచాడు. -
శివపాల్ సింగ్ విఫలం
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతోంది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత ఆటగాడు శివపాల్ సింగ్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. శివపాల్ సింగ్ ఈటెను 78.97 మీటర్ల దూరం విసిరి గ్రూప్ ‘ఎ’లో పదో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 30 మంది బరిలోకి దిగగా... శివపాల్ సింగ్ 24వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టాప్–12లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. డిఫెండింగ్ చాంపియన్ జొహనెస్ వెటెర్ (జర్మనీ–89.35 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించాడు. పురుషుల 20 కిలోమీటర్ల నడక ఫైనల్లో భారత అథ్లెట్ ఇర్ఫాన్ గంటా 35 నిమిషాల 21 సెకన్లలో గమ్యానికి చేరి 36వ స్థానంలో నిలిచాడు. తొషికాజు (జపాన్–1గం:26ని.34 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో దలీలా (అమెరికా–52.16 సెకన్లు) కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచింది. పురుషుల హైజంప్‌లో ముతాజ్ ఇసా బర్షిమ్ (ఖతర్–2.37 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మహిళల డిస్కస్ త్రోలో వైమి పెరెజ్ (క్యూబా–69.17 మీటర్లు) పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో స్టీవెన్ గార్డ్నర్ (బహమాస్–43.48 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. -
సచిన్ ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు
న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ప్రపంచ కప్ ఆల్ స్టార్స్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. ఈ జాబితాలో ఐదుగురు టీమిండియా సభ్యులకు చోటు దక్కింది. అయితే, వికెట్ కీపర్‌గా భారత వెటరన్ మహేంద్ర సింగ్ ధోనికి బదులుగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను సచిన్ ఎంచుకున్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా మెగా టోర్నీ టాప్ స్కోరర్ రోహిత్ శర్మ, పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు అతడు స్థానం కల్పించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఈ జట్టుకు సారథిగా ఉన్నాడు. సచిన్ వరల్డ్ కప్ జట్టు సభ్యులు: రోహిత్ శర్మ, బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కోహ్లి, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్. -
నేడే ఐపీఎల్ వేలం
జైపూర్: జనరంజక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. 2019 సీజన్‌కు అవసరమైన ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు మంగళవారం ‘పింక్ సిటీ’ జైపూర్ వేదికగా పోటీపడనున్నాయి. తుది వడపోత అనంతరం మిగిలిన 346 మంది నుంచి 70 మందిని ( 20 మంది విదేశీ, 50 మంది స్వదేశీ) లీగ్‌లోని 8 జట్లు ఎంపిక చేసుకోనున్నాయి. ఫ్రాంచైజీలన్నీ జనవరిలో నిర్వహించిన వేలంలో భారీ మార్పుచేర్పులు చేశాయి. దీంతో చిన్నపాటి కసరత్తుతోనే ఈ కార్యక్రమం ముగియనుంది. వచ్చే ఏడాది మే నెలాఖరు నుంచి వన్డే ప్రపంచ కప్ ఉన్నందున... లీగ్ మార్చి 23 నుంచే ప్రారంభమై మే రెండో వారంలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల సన్నాహాలకు, ప్రపంచ కప్ నాటికి క్రికెటర్లు తమ జాతీయ జట్లకు అందుబాటులో ఉండేలా డిసెంబరులోనే వేలం ముగించేస్తున్నారు. విదేశీయుల అందుబాటు ప్రధానం ఐపీఎల్ ముగింపు–ప్రపంచకప్‌నకు పెద్దగా వ్యవధి లేనందున న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ మినహా మిగతా దేశాల బోర్డులన్నీ తమ ఆటగాళ్లకు పరిమితంగానే అనుమతులిచ్చాయి. దీంతో వారు ఏ దశ వరకు అందుబాటులో ఉంటారనేదానిపై ఆయా జట్ల కోచ్‌లు, యజమానులు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. ఇక్కడా? అక్కడా? ఎక్కడ? ఏప్రిల్–మే మధ్య దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఐపీఎల్ నిర్వహణ ఎక్కడ అనేదానిపై జనవరి మూడోవారంలో బీసీసీఐ నుంచి స్పష్టత రానున్నట్లు సమాచారం. యువరాజ్... రూ.కోటికే! అయినా? ఒకనాడు రూ.16 కోట్లు అందుకున్న టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్... ప్రçస్తుతం రూ.కోటి ప్రాథమిక ధరకే వేలానికి వచ్చాడు. అయినప్పటికీ అతడిని ఎవరూ కొనే పరిస్థితి లేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌లోని 9 మంది విదేశీయుల్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్‌పై అందరి దృష్టి ఉంది. 2018 సీజన్లో రూ.11.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన పేసర్ జైదేవ్ ఉనాద్కట్ ఇప్పుడు రూ.కోటిన్నర కనీస మొత్తానికే అందుబాటులోకి వచ్చాడు. ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
భారత ఆటగాళ్లకు నిరాశ
బెన్‌డిగో (ఆస్ట్రేలియా): కొంతకాలంగా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) జూనియర్ సర్క్యూట్లో విశేషంగా రాణిస్తున్న భారత ఆటగాళ్లు ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మాత్రం తడబడ్డారు. జూనియర్ బాలుర సింగిల్స్‌లో భారత ప్లేయర్ మానవ్ ఠక్కర్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించగా... మనుశ్ షా, జీత్ చంద్ర నాకౌట్ దశ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. హైదరాబాద్ ప్లేయర్ సురావజ్జుల స్నేహిత్ గ్రూప్ దశ దాటలేకపోయాడు. గ్రూప్–12లో ఉన్న స్నేహిత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిపోయి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో మానవ్ 6–11, 5–11, 11–7, 16–14, 4–11, 11–8, 8–11తో పెంగ్ జియాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో జీత్ చంద్ర 8–11, 5–11, 8–11, 8–11తో ప్లెటీ (రొమేనియా) చేతిలో... మనుశ్ షా 11–6, 9–11, 11–4, 5–11, 4–11, 7–11తో పాంగ్ కొయెన్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశారు. జూనియర్ బాలికల సింగిల్స్‌లో అర్చన కామత్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. జూనియర్ బాలుర డబుల్స్‌లో స్నేహిత్–జీత్ చంద్ర ద్వయం తొలి రౌండ్లో... మానవ్ –మనుశ్ షా జోడీ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. -
కుక్ ఆల్‌టైం జట్టులో మనోళ్లు లేరు!
సౌతాంప్టన్ : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌పై భారత అభిమానుల ఆగ్రహంగా ఉన్నారు. కోహ్లి సేనతో జరిగే చివరి టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన ఈ ఇంగ్లీష్ ఆటగాడు.. 11 మంది సభ్యులతో కూడిన తన ఆల్‌టైమ్ టెస్ట్ జట్టును ప్రకటించాడు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లు, ప్రత్యర్థి ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టు ఎంపిక చేసినట్లు తెలిపాడు. తన జట్టులో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు మిస్సయ్యారని, వారందరికీ క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ జట్టులో భారత క్రికెటర్ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఇదే భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తన ఆల్‌టైమ్ టీమ్ కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రహమ్ గూచ్ను సూచించిన కుక్.. అతనికి ఓపెనింగ్ జంటగా ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను ఎంపిక చేశాడు. ఇక బ్యాట్స్‌మన్‌గా దిగ్గజ ఆటగాళ్లు బ్రియన్ లారా(వెస్టిండీస్), రికీ పాంటింగ్(ఆసీస్), ఏబీ డివిలియర్స్, జాక్వస్ కల్లీస్ (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర(శ్రీలంక)లను పేర్కొన్నాడు. బౌలర్స్‌గా ఇద్దరు స్పిన్నర్లు ముత్తయ్య మురళిదరణ్(శ్రీలంక), షేన్ వాట్సన్(ఆసీస్)లతో పేసర్స్ జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), గ్లేన్ మెక్‌గ్రాత్ (ఆసీస్)లను ఎంపిక చేశాడు. ఇక ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో 32 సెంచరీలతో అత్యధిక పరుగులు 12,254 చేసిన తొలి ఆటగాడిగా కుక్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లిసేన 5 టెస్టుల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి టెస్ట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. -
రజతం సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తన హవా కొనసాగిస్తోంది. సోమవారం (భారత కాలమానం ప్రకారం) ఉదయం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ రజతం సాధించారు. 105 కేజీల విభాగంలో పాల్గొన్న ప్రదీప్ 352 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చారు. స్నాచ్‌లో 152 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 200 కేజీలు ఎత్తారు. సమోవాకు చెందిన సనేలే మావో 360 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఓయిన్ బాక్సాల్ 351 కేజీల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దీంతో ఇప్పటివరకూ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించింది. -
కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన భారత వనితలు
-
పసిడి కాంతలు...
తొలి రోజు ఒకటి... రెండో రోజు ఒకటి... మూడో రోజు రెండు... నాలుగో రోజు మూడు... మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పసిడి పతకాల వేట మరింత జోరందుకుంది. ఈ ‘పసిడి’ పతకాల విజయ యాత్రలో అమ్మాయిలు తమ అద్వితీయ విన్యాసాలతో భారత్‌ను ముందుండి నడిపిస్తున్నారు. పోటీల నాలుగో రోజు ఆదివారం భారత క్రీడాకారిణులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తొలుత వెయిట్‌లిఫ్టింగ్‌లో పూనమ్ యాదవ్ (69 కేజీలు) ‘లిఫ్ట్’కు బంగారు పతకం ఒడిలోకి చేరగా... ఆ తర్వాత షూటింగ్లో మను భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) గురికి మరో పసిడి పతకం వచ్చేసింది. చివర్లో మహిళల టీటీ జట్టు ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింగపూర్‌ను బోల్తా కొట్టించి ఈ క్రీడల చరిత్రలోనే తొలిసారి స్వర్ణాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించింది. గోల్డ్‌కోస్ట్: భారత్ తరఫున మొదటి మూడు రోజులు వెయిట్‌లిఫ్టర్లు పతకాలు కొల్లగొట్టగా... నాలుగోరోజు వీరి సరసన షూటర్లు, టీటీ క్రీడాకారిణులు కూడా చేరారు. ఫలితంగా కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఒకేరోజు మూడు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్ ఏడు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. మను మళ్లీ మెరిసె... పతకాలు సాధించే విషయంలో తమపై పెట్టుకున్న అంచనాలను భారత షూటర్లు నిజం చేశారు. ఆదివారం మొదలైన షూటింగ్ ఈవెంట్ తొలి రోజే మన షూటర్లు స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హరియణాకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి మను భాకర్ తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో ఆమె 240.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో పిన్న వయసులో స్వర్ణం నెగ్గిన భారత షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. భారత్‌కే చెందిన హీనా సిద్ధూ 234 పాయింట్లు స్కోరు చేసి రజతం గెల్చుకుంది. గత నెలలో మెక్సికో ఆతిథ్యమిచ్చిన సీనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు, సిడ్నీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన మను అదే జోరును కామన్వెల్త్ గేమ్స్‌లోనూ కనబరిచి ప్రపంచకప్‌లలో తాను నెగ్గిన పసిడి పతకాలు గాలివాటమేమీ కాదని నిరూపించింది. క్వాలిఫయింగ్‌లో 388 పాయింట్లు... ఫైనల్లో 240.9 పాయింట్లు స్కోరు చేసి మను కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పడం విశేషం. మరోవైపు మహిళల స్కీట్ ఫైనల్లో భారత షూటర్ సానియా షేక్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ రవి కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో రవి 224 పాయింట్లు సాధించాడు. మరో భారత షూటర్ దీపక్ కుమార్ 162 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో రెండు... వరుసగా నాలుగో రోజు భారత వెయిట్‌లిఫ్టర్లు స్వర్ణం సాధించడం విశేషం. మహిళల 69 కేజీల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల పూనమ్ యాదవ్ మొత్తం 222 కేజీలు (స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 122) బరువెత్తి బంగారు పతకాన్ని గెల్చుకుంది. 2014 గ్లాస్కో గేమ్స్‌లో పూనమ్ 63 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించింది. పురుషుల 94 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల వికాస్ ఠాకూర్ కాంస్య పతకాన్ని సాధించాడు. అతను మొత్తం 351 కేజీలు (స్నాచ్‌లో 159+క్లీన్ అండ్ జెర్క్‌లో 192) బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. 2014 గ్లాస్కో గేమ్స్‌లో వికాస్ 85 కేజీల విభాగంలో రజతం గెలిచాడు. మహిళల 75 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ సీమా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మనిక మెరుపులు... ఆదివారం అన్నింటికంటే హైలైట్ భారత మహిళల టీటీ జట్టు ప్రదర్శన. టీమ్ విభాగంలో వరుసగా ఐదో స్వర్ణం సాధించాలని ఆశించిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సింగపూర్ జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఫైనల్లో భారత్ 3–1తో సింగపూర్‌ను ఓడించి ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సింగపూర్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. ఈసారి విజేతగా నిలిచి బదులు తీర్చుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల మనిక బాత్రా తాను ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలిచి భారత చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ మనిక 11–8, 8–11, 7–11, 11–9, 11–7తో ప్రపంచ 4వ ర్యాంకర్ ఫెంగ్ తియన్వెను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మధురిక ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో మౌమా దాస్–మధురిక ద్వయం 11–7, 11–6, 8–11, 11–7తో యిహాన్ జూ – మెంగ్యు యూ జోడీని ఓడించడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో మనిక 11–7, 11–4, 11–7తో యిహాన్ జూపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు స్వర్ణాన్ని గెల్చుకుంది. ‘‘ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఒలింపిక్ పతక విజేతను నేను ఓడిస్తానని కలలో కూడా ఊహించలేదు. ఆమెపై గెలిచిన క్షణాన నేను ప్రపంచం శిఖరాన ఉన్నట్లు భావించాను’ అని మనిక వ్యాఖ్యానించింది. స్వర్ణ పతకాలతో భారత మహిళల టీటీ బృందం -
గోల్డ్ కోస్ట్ చేరిన భారత క్రీడాకారులు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులు బుధవారం ఆతిథ్య నగరం గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా)కు చేరుకున్నారు. ‘అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, లాన్ బాల్స్, షూటింగ్ క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడా గ్రామంలోకి అడుగు పెట్టారు’ అని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా ఉన్న విక్రమ్ సింగ్ సిసోడియా, మేనేజర్లు నామ్‌దేవ్, అజయ్ నారంగ్, షియాద్ క్రీడా గ్రామంలో ఐఓఏ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. -
మనోళ్లు ఐదుగురు
దుబాయ్: ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటుదక్కింది. కెప్టెన్ పృథ్వీ షాతో పాటు మన్జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, కమలేశ్ నాగర్కోటి, అనుకూల్ రాయ్‌లు ఈ టీమ్‌లో ఉన్నారు. మొత్తం ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకే బెర్తు దక్కగా... నాలుగోసారి చాంపియన్ అయిన భారత ఆటగాళ్లే ఐదుగురు ఉండటం విశేషం. ఐసీసీ జట్టు: రేనార్డ్ వాన్ (కెప్టెన్, దక్షిణాఫ్రికా), పృథ్వీ షా, మన్జోత్ కల్రా, శుభ్‌మన్ గిల్, నాగర్కోటి, అనుకుల్ రాయ్ (భారత్), ఫిన్ అలెన్ (న్యూజిలాండ్), మక్వెటు (వికెట్ కీపర్), కొయెట్జీ (దక్షిణాఫ్రికా), కైయిస్ అహ్మద్ (అఫ్గానిస్తాన్), షహీన్ ఆఫ్రిది (పాకిస్తాన్), 12వ ఆటగాడుగా అలిక్ అథనాజ్ (వెస్టిండీస్). -
లండన్ వీధుల్లో భారత ఆటగాళ్లు..
లండన్: ప్రాక్టీస్ వ్యూహాలకు వర్షం దెబ్బకొట్టడంతో భారత క్రికెటర్లు మంగళవారం లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. జట్టు సభ్యులంతా కలిసి లంచ్, డిన్నర్ చేస్తూ గడిపారు. బర్త్ డే బాయ్ అజింక్యా రహానే మాత్రం తన భార్య రాధికతో ప్రయివేట్‌గా లండన్ వీధులు తిరుగుతూ తన 29 వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. ఆల్ రౌండర్ జడేజా డిపార్ట్ మెంటల్ స్టోర్ లో సందడి చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించిన తర్వాత సోమవారం ఆటగాళ్లు సంతోషంగా కోహ్లీ చారిటీ డిన్నర్ కు హాజరైన విషం తెలిసిందే. మంగళవారం ఉదయం వర్షం కారణంగా హోటల్‌కే పరిమితమైన ఆటగాలళ్లు వర్షం వెలిసిన తర్వాత లండన్ వీధుల్లో షాపింగ్ చేస్తూ.. అభిమానులతో సెల్పీలు దిగారు. ఇక ఆటగాళ్లే ఎంజాయ్ చేస్తున్నారనుకుంటే కోచ్ అనిల్ కుంబ్లే సైతం హోటల్ సమీపంలోని పార్క్‌కు తన భార్యతో జాగింగ్ వెళ్లాడు. వర్షంతో మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొనకపోవడంతో బుధవారం మధ్యాహ్నం తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. పాక్‌పై విజయంతో జోరుమీదున్న కోహ్లీ సేన శ్రీలంకను మాత్రం తక్కువ అంచనా వేయడం లేదు. గురువారం భారత్, శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని టీంఇండియా భావిస్తుంది. ఇక ఆదివారం గ్రూప్ బిలో భారత్‌కు వరల్డ్ నెం1 దక్షిణాఫ్రికాతో గట్టి పోటి ఎదురవ్వనుంది. -
ముగిసిన భారత్ పోరు
బిల్బావో (స్పెరుున్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో బరిలో మిగిలిన చివరి ఆశాకిరణం సాత్విక్ సారుురాజ్-కుహూ గార్గ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్-కుహూ జంట 21-13, 12-21, 19-21తో తాంగ్ జీ చెన్-ఈ వీ తో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోరుుంది. -
ప్రపంచ కప్ వుషులో భారత్‌కు 5 పతకాలు
న్యూఢిల్లీ: సాండా ప్రపంచ కప్ వుషు పోటీల్లో భారత క్రీడాకారులు ఆకట్టుకున్నారు. చైనాలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఐదు పతకాలు లభించారుు. ఈ టోర్నీలో భారత్ నుంచి పాల్గొన్న ఐదుగురూ పతకాలు తేవడం విశేషం. ‘అర్జున అవార్డీ’ వై. సనతోరుు దేవి 52 కేజీల విభాగం ఫైనల్లో లువాన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోరుు రజతాన్ని దక్కించుకుంది. సనతోరుుతోపాటు మోనిక (56 కేజీలు) కూడా రజతం నెగ్గగా... పూజా కడియాన్ (75 కేజీలు) కాంస్యం సాధించింది. పురుషుల విభాగంలో ఉచిత్ శర్మ (52 కేజీలు), సూర్య భాను ప్రతాప్ సింగ్ (60 కేజీలు) రజత పతకాలు గెలిచారు. -
తొలి రోజు స్పెయిన్‌దే
రెండు సింగిల్స్‌లోనూ ఓడిన భారత ఆటగాళ్లు * స్పెయిన్‌కు 2-0 ఆధిక్యం * డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ న్యూఢిల్లీ: పటిష్టమైన స్పెయిన్ అంచనాలకు అనుగుణంగా రాణించి...భారత్‌తో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. శుక్రవారం ఇక్కడ మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో స్పెయిన్‌కు విజయం దక్కింది. ఫలితంగా ఈ మాజీ చాంపియన్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రామ్‌కుమార్ రామనాథన్‌తో తొలి మ్యాచ్‌లో ఆడాల్సిన స్పెయిన్ స్టార్ ప్లేయర్ రాఫెల్ నాదల్ చివరి నిమిషంలో వైదొలగడంతో అతని స్థానంలో ఫెలిసియానో లోపెజ్ బరిలోకి దిగాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్ లోపెజ్ 6-4, 6-4, 3-6, 6-1తో 203వ ర్యాంకర్ రామ్‌కుమార్‌ను ఓడించడంతో స్పెయిన్ శుభారంభం చేసింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్ 6-1, 6-2, 6-1తో భారత నంబర్‌వన్, ప్రపంచ 137వ ర్యాంకర్ సాకేత్ మైనేనిని ఓడించడంతో స్పెయిన్ 2-0తో ముందంజ వేసింది. శనివారం డబుల్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జోడీతో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జట్టు తలపడుతుంది. తొలి మ్యాచ్ నుంచి నాదల్ వైదొలిగినా స్పెయిన్‌కు ఎలాంటి ఇబ్బంది కాలేదు. భారత ప్లేయర్ రామ్‌కుమార్ తన శక్తివంచన లేకుండా కృషి చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఒకసెట్ గెలిచానన్న సంతృప్తి అతను మూటగట్టుకున్నాడు. తొలి రెండు సెట్లలో ఒక్కోసారి రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన లోపెజ్... మూడో సెట్లో మాత్రం తడబడ్డాడు. రామ్‌కుమార్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని మూడో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అరుుతే నాలుగో సెట్లో లోపెజ్ చెలరేగడంతో రామ్‌కుమార్ కేవలం ఒక్క గేమ్ మాత్రమే గెలిచాడు. ఇక రెండో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ సాకేత్ తన ప్రత్యర్థి ఫెరర్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. గంటా 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఓవరాల్‌గా నాలుగు గేమ్‌లు మాత్రమే గెల్చుకోగలిగాడు. నాలుగు ఏస్‌లు సంధించిన సాకేత్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఫెరర్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేయడంలో సఫలమైన ఈ వైజాగ్ ప్లేయర్ తన సర్వీస్‌ను మాత్రం ఎనిమిదిసార్లు కోల్పోయాడు. -
రియోలో మనకు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు?
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధుకు బ్యాడ్మింటన్ లో రజత పతకం, హర్యానా అమ్మాయి సాక్షి మాలిక్‌కు రెజ్లింగ్‌లో కాంస్యం వచ్చినందుకు మనమంతా ఆనందిస్తున్నాం. హర్షిస్తున్నాం. అది సరే, రియో ఒలింపిక్స్‌పై మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం? ఎంత మంది క్రీడాకారులను పంపించాం? ఎన్ని పతకాలను సాధించాం? ఆశించిన స్థాయిలో రాణించామా, లేదా ? లేకపోతే ఎందుకు ? అన్న అంశాలను ఇప్పడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి దాదాపు వంద మంది క్రీడాకారుల బృందాన్ని పంపించినప్పుడు మనవాళ్లు దాదాపు పది నుంచి పన్నెండు పతకాలను సాధించుకొస్తారని మీడియా ప్రచారం చేసింది. మనకు బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు, లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు రాగా ఈసారి కచ్చితంగా రెండంకెల్లో పతకాలు వస్తాయని, 12 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని గత మే నెలలో నాటి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ బల్లగుద్ది మరీ చెప్పారు. ఎప్పటికప్పుడు క్రీడాకారుల ప్రతిభా పాటవాలను అంచనా వేస్తూ వచ్చిన భారతీయ క్రీడల సంఘం (ఎస్ఏఐ) 12 నుంచి 19 పతకాలు వస్తాయని అంచనా వేసింది. మరి జరిగిందేమిటీ? కేవలం రెండు పతకాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? ఆ....అమెరికా లాంటి దేశాలెక్కడా, మన దేశం ఎక్కడ? అక్కడ క్రీడలను ప్రోత్సహిస్తారు, క్రీడా సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. బ్రిటన్ లాంటి దేశాల్లో ఒక్క పతకం రావడానికి సరాసరి 46 కోట్ల రూపాయల చొప్పున క్రీడాకారులపై ఖర్చు పెడతారని అభినవ్ భింద్రా లాంటి వారే కామెంట్ చేశారు. ఆ స్థాయిలో భారత్‌లో క్రీడా సౌకర్యాలు లేవని, నిధులు లేవని చెబుతారు. వాస్తవానికి ఇది అర్ధ సత్యమే. 2016-2017 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో భారత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ నిధులు ఎక్కడికి వెళుతున్నాయో, ఎక్కడ ఖర్చు చేస్తున్నారో, ఆ ఖర్చుకు వస్తున్న ఫలితాలేమిటో, అందుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారో అన్న అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి దేశాల్లో అన్ని క్రీడలను ప్రోత్సహించాల్సిందే. కానీ ఏ క్రీడల్లో మనం రాణించగలం, ఎంత వరకు ప్రపంచ స్థాయిని అందుకోగలం? ముఖ్యంగా ఒలింపిక్స్‌లో మనకు మెడల్స్ దక్కాలంటే మనం ఏ ఆటలపైన ప్రధాన దృష్టిని కేంద్రీకరించాలి? అన్న అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరం. భారతీయులు ఏ ఆటల్లో రాణిస్తున్నారో, వాటి మీదనే దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్‌లో ఆర్చరి, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ క్రీడాకారులు రాణి స్తున్నారు. వాటిలోనే వారిని ప్రోత్సహించేందుకు నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా 2014-2015 సంవత్సరానికి భారత ప్రభుత్వం టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాలకన్నా క్వాష్, యాటింగ్, వాలీబాల్ క్రీడలకు ఎక్కువ నిధులను కేటాయించింది. అమెరికా జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ మీద, దక్షిణ కొరియా ఆర్చరీ మీద, బ్రిటన్ సైక్లింగ్ మీద, చైనా టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ మీద, బెల్జియం హాకీ మీద, జర్మనీ ఫుట్‌బాల్ మీద దృష్టిని కేంద్రీకరించి, ఆ క్రీడల్లో రాణించడమే లక్ష్యంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. మనం దేశం కూడా టార్గెట్ లక్ష్యంగానే కృషి చేయాలి. అభినవ్ భింద్రా, గగన్ నారంగ్, రాజ్యవర్ధన రాథోర్, మైఖేల్ ఫెరీరా, గీత్ సేథి, పంకజ్ అద్వానీ లాంటి క్రీడాకారుల అనుభవాలను ఉపయోగించుకోవాలి. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులపై కాసుల వర్షం కురిపించి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ఎవరికివారు భుజాలు చరచుకుంటే సరిపోదు. ఇచ్చే కాసులకు కూడా క్రీడలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారిని బాధ్యులను చేయాలి. క్రీడాకారులకు వ్యక్తిగత లబ్ధి చేకూర్చడం కన్నా క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల రాణింపునకు ఎక్కువ నిధులను ఖర్చు చేయాలి. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు క్రీడా విభాగాల అధికారులను బాధ్యుల్ని చేయాలి. అంతవరకు ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో మనం రాణించలేం. -
ఆశల పల్లకిలో...119 మందితో
భారత బృందం సిద్ధం రియో: గత ఒలింపిక్స్‌ను మించిన ప్రదర్శనతో, మరిన్ని పతకాలు సాధించే లక్ష్యంతో భారత క్రీడాకారులు రియోలో సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఒలింపిక్స్‌లో తొలి సారి మన దేశంనుంచి వంద మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటుండటం విశేషం. ఈసారి సుమారు 10 పతకాలు వస్తాయని ఆశ. షూటింగ్లో బింద్రా, నారంగ్, రెజ్లింగ్‌లో యోగేశ్వర్, బ్యాడ్మింటన్‌లో సైనా, సింధులకు పతకం సాధించే సత్తా ఉంది. మహిళల ఆర్చరీలో దీపికా కుమారి, బాక్సింగ్‌లో శివ థాపా, మనోజ్ కుమార్ మెడల్ అందుకోగల సమర్థులు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న పురుషుల హాకీ జట్టునుంచి కూడా అభిమానులు పతకం ఆశిస్తున్నారు. టెన్నిస్‌లో మిక్స్డ్ డబుల్స్ జోడి సానియా మీర్జా-రోహన్ బొపన్న పతకం గెలిచేందుకు ఇది సరైన తరుణం. అథ్లెటిక్స్‌లో ఎక్కువ మంది వెళుతున్నా... మెడల్ కోసం ఏదైనా సంచలనం జరగాల్సిందే. -
మనోళ్లు రెండోది సాధిస్తారా...!
మైకేల్ ఫెల్ఫ్స్ 22 ఒలింపిక్ పతకాలు సాధించాడు.. ఒకే ఒలింపిక్స్‌లో ఏకంగా 8 స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇలా ఉంటుంది మెగా ఈవెంట్లో అగ్రరాజ్యాల క్రీడాకారుల హవా. అదే మన దేశం విషయానికొస్తే వ్యక్తిగత విభాగంలో ఏదో ఒక పతకం నెగ్గడమే గొప్ప అనే స్థితిలో ఉన్నాం. అయితే వ్యక్తిగత విభాగంలో రెండో పతకం సాధించిన సుశీల్ కుమార్ గత ఒలింపిక్స్ సందర్భంగా సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ ద్వారా కొంతమంది క్రీడాకారులకు సుశీల్ చేసిన ఫీట్‌ను అందుకునే అవకాశం ఉంది. లియాండర్ పేస్.. (1996లో కాంస్యం) ఎప్పుడో 1952లో కేదార్ జాదవ్ తర్వాత భారత్‌కు వ్యక్తిగత విభాగంలో పతకం అందించిన ఆటగాడు టెన్నిస్ వెటరన్ లియాండర్ పేస్. 1992 ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలోకి దిగిన పేస్.. డబుల్స్ విభాగంలో రమేశ్ క్రిష్ణన్‌తో కలసి క్వార్టర్స్ వరకు చేరుకున్నాడు. ఆ తర్వాత 1996లో నాటకీయ పరిణామాల మధ్య సింగిల్స్ బరిలోకి దిగాల్సి వచ్చింది. అసలు ఆ టోర్నీలో పేస్ ప్రదర్శనే సంచలనం. వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా టోర్నీలో అడుగుపెట్టిన పేస్.. తొలి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో మామూలు ఆటగాళ్లతోనే ఆడినా ఆ తర్వాత సీడెడ్లను మట్టికరిపించాడు. మూడోరౌండ్లో మూడోసీడ్ ఆటగాడు థామస్ ఎంక్విస్ట్ను, క్వార్టర్స్‌లో 12వ సీడ్ రెంజో ఫుర్లాన్ను ఓడించి సెమీస్ చేరాడు. అక్కడ దిగ్గజ ఆటగాడు అండ్రీ అగస్సీ చేతిలో ఓడాడు. కాంస్య పతక పోరులో ఫెర్నాండో మెలిగెనిపై గెలిచి పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత జరిగిన అన్నీ ఒలింపిక్స్‌లోనూ డబుల్స్ విభాగంలో (2000లో చివరిసారి సింగిల్స్‌లో ఆడాడు) బరిలోకి దిగినా ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. 2004లో డబుల్స్ విభాగంలో భూపతితో కలసి కాంస్య పతక పోరువరకు చేరినా.. అక్కడ ఓడాడు. ఈసారి రోహన్ బోపన్నతో పురుషుల డబుల్స్‌లో ఆడబోతున్న పేస్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. పేస్కివి ఏడో ఒలింపిక్స్. అభినవ్ బింద్రా.. (2008లో స్వర్ణం) భారత్‌కు వ్యక్తిగత విభాగంలో ఏకైక స్వర్ణం అందించిన క్రీడాకారుడు షూటర్ అభినవ్ బింద్రా. 2008 ఒలింపిక్స్‌లో 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం నెగ్గిన బింద్రా.. ఈ సారి కూడా అదే విభాగంలో బరిలోకి దిగుతున్నాడు. 2004లో తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బింద్రాకు ఇవి నాలుగో ఒలింపిక్స్. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో కూడా భారత్ ఆశలన్నీ మోసుకెళ్లిన బింద్రా నిరాశ పరిచాడు. 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం పతకం నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. పైగా 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడంతోపాటు, అదే ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గి ఊపుమీదున్నాడు. గగన్ నారంగ్.. (2012లో కాంస్య పతకం) 2008లో జరిగిన ఒలింపిక్స్‌లో 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశ పరిచాడు హైదరాబాద్ షూటర్ నారంగ్. దురదృష్టవశాత్తు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. అయితే 2012లో మాత్రం అంచనాలను అందుకున్నాడు. మూడు విభాగాల్లో బరిలోకి దిగి 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం సాధించాడు. 50మీ. రైఫిల్ ప్రోన్, 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ విభాగాల్లో కూడా పోటీ పడినా పతకం నెగ్గలేదు. ఈసారి కూడా మూడు విభాగాల్లో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన గగన్ పతకం సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 2014 కామన్వెల్త్ క్రీడల్లో 50మీ. రైఫిల్ ప్రోన్ విభాగంలో రజతం, 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించాడు. గగన్‌కు కూడా ఇది నాలుగో ఒలింపిక్స్. సైనా నెహ్వాల్.. (2012లో కాంస్యం) ఈసారి ఒలింపిక్స్‌లో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న క్రీడాకారుల్లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒకరు. 2008లో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన సైనా సంచలన ప్రదర్శన చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. అక్కడ కూడా తొలిసెట్‌ను నెగ్గినా తర్వాత ఒత్తిడికి లోనై మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ మ్యాచ్ నెగ్గితే సైనా పతకం సాధించేదేమో. అయితే 2012లో మాత్రం పట్టువదల్లేదు. చక్కటి ఆటతీరుతో సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఓడిపోయినా.. కాంస్య పతక పోరులో ప్రత్యర్థి తప్పుకోవడంతో పతకం సాధించి సంచలనం సృష్టించింది. భారత్‌కు వ్యక్తిగత విభాగంలో పతకం అందించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. ఈసారి కూడా సైనాకు పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒలింపిక్స్‌లో సైనాకు పడిన ‘డ్రా’లను పరిశీలిస్తే సెమీస్‌కు చేరుకోవడం ఆమెకు చాలా సులవు. అక్కడ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈసారి మెరుగైన పతకంతో తిరిగొచ్చే అవకాశాలున్నాయి. యోగేశ్వర్ దత్.. (2012లో కాంస్యం) భారత్ నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి రెజ్లింగ్‌లో 8 మంది అర్హత సాధించారు. వారిలో భారీ అంచనాలున్నది యోగేశ్వర్ దత్పైనే. 2004 ఒలింపిక్స్‌లో 55 కేజీల విభాగంలో ఆరంభ దశల్లోనే ఓడిన యోగేశ్వర్.. 2008లో 60 కేజీల విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకున్నా పతకం నెగ్గే ప్రదర్శన చేయలేదు. అయితే 2012లో మాత్రం సత్తాచాటాడు. గత రెండు ఒలింపిక్స్‌తో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసి 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గాడు. ఈ సారి కూడా ఆరంభ రౌండ్ మ్యాచ్‌లో ఓడినా.. రెప్‌చేజ్‌లో అదరగొట్టాడు. తన ప్రత్యర్థులందర్నీ ఓడించి పతకం సాధించాడు. యోగేశ్వర్ ఈసారి 65కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడబోతున్నాడు. 2014 ఆసియా క్రీడల్లో, 2014 కామన్వెల్త్ క్రీడల్లో 65 కేజీల విభాగంలోనే బంగారు పతకాలు సాధించిన యోగేశ్వర్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. గతంతో పోలిస్తే ఈ సారి మెరుగైన పతకం సాధించే అవకాశాలున్నాయి. -
‘పసిడి గురి’ అదిరింది
షూటింగ్లో మరో నాలుగు స్వర్ణాలు * బాక్సింగ్‌లో క్లీన్‌స్వీప్ * దక్షిణాసియా క్రీడలు గువాహటి: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో మళ్లీ స్వర్ణ పతకాల మోత మోగించారు. సోమవారం ఒక్కరోజే భారత్‌కు 26 పసిడి పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 181 స్వర్ణాలు, 88 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి మొత్తం 299 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. నేటితో (మంగళవారం) దక్షిణాసియా క్రీడలకు తెరపడనుంది. షూటింగ్ ఈవెంట్ చివరి రోజు భారత్ నాలుగు స్వర్ణాలను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా షూటింగ్లో భారత్‌కు 25 స్వర్ణాలు లభించడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో శ్వేతా సింగ్ (194.4 పాయింట్లు) పసిడి నెగ్గగా... హీనా సిద్ధూ (192.5 పాయింట్లు) రజతం, యశస్విని సింగ్ (171.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో శ్వేతా, హీనా, యశస్వినిలతో కూడిన భారత జట్టు 1133 పాయింట్లతో బంగారు పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో గుర్ప్రీత్ సింగ్ (28 పాయింట్లు) స్వర్ణం సాధించగా... విజయ్ కుమార్ (20 పాయింట్లు) కాంస్యం నెగ్గాడు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో గుర్ప్రీత్ సింగ్, విజయ్ కుమార్, అక్షయ్ సుహాస్‌లతో కూడిన భారత జట్టు 1702 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం గెలిచింది. ‘పంచ్’ అదుర్స్ బాక్సింగ్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల విభాగంలో ఏడింటికి ఏడు స్వర్ణాలను భారత బాక్సర్లు సొంతం చేసుకున్నారు. దేవేంద్రో సింగ్ (49 కేజీలు), మదన్‌లాల్ (52 కేజీలు), శివ థాపా (56 కేజీలు), ధీరజ్ (60 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్దీప్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలను అందించారు. జూడోలోనూ ‘ఏడు’ మరోవైపు షిల్లాంగ్‌లో జరిగిన జూడో ఈవెంట్లో భారత్ ఏకంగా ఏడు స్వర్ణాలు కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో భూపిందర్ సింగ్ (60 కేజీలు), జస్లీన్ సింగ్ సైని (66 కేజీలు), మంజీత్ (73 కేజీలు), కరణ్‌జీత్ సింగ్ మాన్ (81 కేజీలు)... మహిళల విభాగంలో సుశీలా దేవి (48 కేజీలు), కల్పనా దేవి (52 కేజీలు), అనితా చాను (57 కేజీలు) బంగారు పతకాలు సాధించారు. తైక్వాండో ఈవెంట్లో లతికా భండారి (53 కేజీలు), మార్గరీటా రేగీ (62 కేజీలు), నవ్‌జీత్ (80 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలను అందించారు. ‘బంగారు’ కూత... కబడ్డీలోనూ భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచి బంగారు పతకాలను దక్కించుకుంది. పురుషుల ఫైనల్లో భారత్ 9-7తో పాకిస్తాన్‌పై గెలుపొందగా... భారత మహిళల జట్టు 36-12తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. హ్యాండ్‌బాల్‌లో భారత్‌కే రెండు స్వర్ణాలు దక్కాయి. పురుషుల ఫైనల్లో భారత్ 32-31తో పాకిస్తాన్‌పై గెలుపొందగా... మహిళల ఫైనల్లో టీమిండియా 45-25తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఫుట్‌బాల్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలువగా... పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. మహిళల ఫైనల్లో భారత్ 4-0తో నేపాల్‌పై విజయం సాధించింది. భారత పురుషుల జట్టు 1-2 గోల్స్ తేడాతో నేపాల్ చేతిలో ఓడిపోయింది. -
కుర్రాళ్లు హిట్ పెద్దోళ్లు ఫట్
అనూహ్య ఫలితాలు... కష్టపడతారనుకున్న భారత కుర్రాళ్లు శ్రీలంకను చిత్తు చేసి అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరితే... సులభంగా గెలుస్తారనుకున్న ధోనిసేన అదే శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడింది. అటు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో, ఇటు పుణేలో రెండు చోట్లా బ్యాట్స్‌మెన్‌కు గడ్డుకాలం ఎదురైనా... కుర్రాళ్లు తడబాటు లేకుండా పని పూర్తి చేస్తే... అనుభవజ్ఞులు మాత్రం చేతులెత్తేశారు. * అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ * సెమీస్‌లో శ్రీలంకపై విజయం మిర్పూర్: నాలుగో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు యువ భారత్ అడుగు దూరంలో నిలిచింది. అండర్-19 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న కుర్రాళ్లు అదే ఊపులో సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టారు. అన్మోల్ ప్రీత్ సింగ్ (92 బంతుల్లో 72; 6 ఫోర్లు; 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (71 బంతుల్లో 59; 6 ఫోర్లు; 1 సిక్స్) సముచిత ఆటతీరుతో మంగళవారం షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం జరిగే సెమీస్ విజేతతో... 14న భారత్ టైటిల్ కోసం పోరాడనుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులు సాధించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ (14) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా కెప్టెన్ ఇషాన్ (7) మళ్లీ నిరుత్సాహపరిచాడు. దీంతో 27 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించకపోవడంతో అన్మోల్, సర్ఫరాజ్ జోడి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారు.స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారీ సిక్స్‌తో సర్ఫరాజ్ ఈ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే కొద్దిసేపటికే పేలవ పుల్ షాట్‌కు అవుట్ అయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అన్మోల్ కూడా అర్ధ సెంచరీ సాధించి వాషింగ్టన్ సుందర్ (45 బంతుల్లో 43; 3 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచాడు. అర్మాన్ జాఫర్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు. ఫెర్నాండోకు నాలుగు.. కుమార, నిమేశ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక 42.4 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలింది. అయితే భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో విఫలమైనా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో రాణించడంతో ఫలితం అనుకూలంగా వచ్చింది. తొలి ఓవర్లోనే అవేశ్ (2/41) వికెట్ తీసి లంకను దెబ్బతీశాడు. ఆ తర్వాత దాగర్ (3/21) పొదుపుగా బౌలింగ్ చేసి మిగతా పనికానిచ్చాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన లంక తరఫున మెండిస్ (67 బంతుల్లో 39; 4 ఫోర్లు), అషన్ (49 బంతుల్లో 38; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్కోరు వివరాలు:- భారత్ అండర్-19 ఇన్నింగ్స్: రిషబ్ (సి) డి సిల్వ (బి) ఫెర్నాండో 14; ఇషాన్ (సి) డి సిల్వ (బి) కుమార 7; అన్మోల్ ప్రీత్ (సి) డి సిల్వ (బి) నిమేష్ 72; సర్ఫరాజ్ (సి) ఆషన్ (బి) ఫెర్నాండో 59; సుందర్ (సి) డి సిల్వ (బి) నిమేష్ 43; అర్మాన్ (సి) అసలంక (బి) ఫెర్నాండో 29; లొమ్రోర్ (సి) కుమార (బి) ఫెర్నాండో 11; దాగర్ (సి) డి సిల్వ (బి) కుమార 17; బాథమ్ (రనౌట్) 1; అవేశ్ నాటౌట్ 1; ఖలీల్ అహ్మద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1-23, 2-27, 3-123, 4-193, 5-218, 6-241, 7-254, 8-260, 9-264. బౌలింగ్: ఫెర్నాండో 10-0-43-4; కుమార 10-0-50-2; నిమేష్ 10-0-50-2; డి సిల్వ 4-0-20-0; సిల్వ 7-0-31-0; మెండిస్ 1-0-10-0; అసలంక 8-0-59-0. శ్రీలంక అండర్-19 ఇన్నింగ్స్: బండార (రనౌట్) 2; ఫెర్నాండో ఎల్బీడబ్ల్యు (బి) అవేశ్ 4; మెండిస్ (సి) సుందర్ (బి) దాగర్ 39; అసలంక (సి) లొమ్రోర్ (బి) బాథమ్ 6; ఆషన్ (రనౌట్) 38; డి సిల్వ (సి) రిషబ్ (బి) అవేశ్ 28; సిల్వ (బి) సుందర్ 24; హసరంగ డి సిల్వ (సి) అవేశ్ (బి) అహ్మద్ 8; నిమేశ్ (సి) సర్ఫరాజ్ (బి) దాగర్ 7; కుమార నాటౌట్ 0; ఫెర్నాండో (సి) అన్మోల్ (బి) దాగర్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1-5, 2-13, 3-42, 4-91, 5-108, 6-133, 7-149, 8-170, 9-170, 10-170. బౌలింగ్: అవేశ్ 9-0-41-2; ఖలీల్ అహ్మద్ 8-1-34-1; బాథమ్ 6.5-1-19-1; సుందర్ 7-0-27-1; సర్ఫరాజ్ 4.4-0-16-0; దాగర్ 5.4-0-21-3; లొమ్రోర్ 0.3-0-1-0; అన్మోల్ 1-0-6-0. నేలకు దిగారు! ఆస్ట్రేలియాలో అద్భుతం చేసి వచ్చిన భారత జట్టు సొంత మైదానంలో చతికిల పడింది. పరుగుల వరద పారిస్తారనుకున్న స్టార్ క్రికెటర్లంతా చేతులెత్తేశారు. ప్రత్యర్థి జట్టులో ఉంది కుర్రాళ్లే కదా అని ‘లైట్’ తీసుకున్నారేమో... ఘోరంగా భంగపడ్డారు. ఫలితంగా... తొలి టి20లో ధోనిసేన పరాభవాన్ని మూటగట్టుకుంది. * తొలి టి20లో భారత్ ఓటమి * ఐదు వికెట్లతో లంక విజయం * రాణించిన రజిత, షనక * రెండో మ్యాచ్ శుక్రవారం పుణే: అనుభవం లేకపోయినా... పరిస్థితులకు తగ్గట్టుగా చక్కటి ప్రణాళికతో ఆడిన శ్రీలంక జట్టు... ధోనిసేనను నేలకు దించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ (24 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రజిత (3/29), షనక (3/16) భారత్‌ను దెబ్బ తీశారు. అనంతరం శ్రీలంక 18 ఓవర్లలో 5 వికెట్లకు 105 పరుగులు చేసింది. కెప్టెన్ చండీమల్ (35 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. అశ్విన్, నెహ్రా చెరో 2 వికెట్లు తీశారు. ఈ ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది. టపటపా వికెట్లు కెరీర్ తొలి మ్యాచ్‌ను లంక పేసర్ రజిత సంచలన రీతిలో ప్రారంభించాడు. ఇన్నింగ్స్ రెండో, ఆరో బంతులకు అతను రోహిత్ (0), రహానే (4)లను పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే రెండో ఓవర్‌ను తిసార మెయిడిన్‌గా వేయగా, రజిత వేసిన మరుసటి ఓవర్లో సున్నా వద్ద గుణతిలకే సునాయాస క్యాచ్ వదిలేయడంతో రైనా బతికిపోయాడు. కొద్ది సేపటికి రజిత బౌలింగ్‌లోనే మళ్లీ తప్పు చేయని గుణతిలక థర్డ్‌మ్యాన్‌లో క్యాచ్ పట్టడంతో ధావన్ (9) కూడా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 3 వికెట్లకు 40 పరుగులకు చేరింది. ఏ మాత్రం అనుభవం లేని లంక కుర్ర బౌలర్లు టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించాడు. చక్కటి బంతులతో ఒక వైపు వికెట్లు తీస్తూ మరో వైపు పరుగులు కూడా ఇవ్వకుండా నిరోధించారు. షనక ఒకే ఓవర్లో రైనా (20 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), ధోని (2)లను అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లో యువరాజ్ (10) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తొలి సారి బ్యాటింగ్ అవకాశం దక్కిన పాండ్యా (2) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఒక దశలో 35 బంతుల పాటు భారత్ బౌండరీ కొట్టలేకపోయింది! చివర్లో నెహ్రా (6) సహాయంతో అశ్విన్ తొమ్మిదో వికెట్‌కు 28 పరుగులు జోడించడంతో స్కోరు 100 పరుగులు దాటినా ఏడు బంతుల ముందే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఐదో ఓవర్లో 13 పరుగులు మినహా భారత్ ఇన్నింగ్స్‌లో మరే ఓవర్లోనూ కనీసం పది పరుగులు రాలేదు. చండీమల్ దూకుడు నెహ్రా ధాటికి శ్రీలంక కూడా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. డిక్వెలా (4), గుణతిలక (9) వెనుదిరగ్గా...పవర్‌ప్లేలో లంక 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే చండీమల్, కపుగెదెర (26 బంతుల్లో 25; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 42 బంతుల్లో 39 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. జడేజా ఓవర్లో 12 పరుగులు రాబట్టి దూకుడు పెంచిన లంక వేగంగా విజయం దిశగా దూసుకుపోయింది. తక్కువ వ్యవధిలో ఆ జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠను ఎదుర్కొన్నా...లక్ష్యం చిన్నది కావడంతో ఇబ్బంది ఎదురు కాలేదు. సిరివర్దన (14 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ‘గత నెల రోజులుగా మేం ఆడుతున్న పిచ్‌లతో పోలిస్తే ఈ పిచ్ పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడి పేస్, బౌన్స్ చూస్తే భారత్‌లో కంటే ఇంగ్లండ్ తరహా వికెట్‌లాగా కనిపించింది. ఇలాంటి పిచ్‌పై మేం తప్పుడు షాట్లు ఆడాం. ఆరంభంలో బౌలర్లకు అనుకూలించినప్పుడు మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సింది. తర్వాతి మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుంటాం’ - ధోని 2 రైనా కెరీర్లో ఇది 50వ టి20 అంతర్జాతీయ మ్యాచ్. ధోని (56) తర్వాత ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్ రైనా. 0 అంతర్జాతీయ టి20ల్లో 50 ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కనీసం ఒక్క అర్ధ సెంచరీ లేని ఏకైక బ్యాట్స్‌మన్ ధోని ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడింది. లంక టాప్‌లోకి వచ్చింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిస్తే మళ్లీ భారత్ నంబర్‌వన్‌గా నిలుస్తుంది. స్కోరు వివరాలు:- భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) చమీరా (బి) రజిత 0; ధావన్ (సి) గుణతిలక (బి) రజిత 9; రహానే (సి) చండీమల్ (బి) రజిత 4; రైనా (బి) షనక 20; యువరాజ్ (సి) అండ్ (బి) చమీరా 10; ధోని (సి) డిక్వెలా (బి) షనక 2; పాండ్యా (ఎల్బీ) (బి) షనక 2; జడేజా (ఎల్బీ) (బి) సేననాయకే 6; అశ్విన్ (నాటౌట్) 31; నెహ్రా (సి) సిరివర్దన (బి) చమీరా 6; బుమ్రా (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 101. వికెట్ల పతనం: 1-0; 2-5; 3-32; 4-49; 5-51; 6-53; 7-58; 8-72; 9-100; 10-101. బౌలింగ్: రజిత 4-0-29-3; తిసార 3-1-10-0; సేనానాయకే 3-0-18-1; చమీరా 3.5-0-14-2; షనక 3-0-16-3; ప్రసన్న 2-0-11-0. శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి) ధావన్ (బి) నెహ్రా 4; గుణతిలక (సి) ధావన్ (బి) నెహ్రా 9; చండీమల్ (ఎల్బీ) (బి) రైనా 35; కపుగెదెర (ఎల్బీ) (బి) అశ్విన్ 25; సిరివర్దన (నాటౌట్) 21; షనక (సి) రైనా (బి) అశ్విన్ 3; ప్రసన్న (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 105. వికెట్ల పతనం: 1-4; 2-23; 3-62; 4-84; 5-91. బౌలింగ్: నెహ్రా 3-0-21-2; బుమ్రా 4-1-19-0; జడేజా 3-0-18-0; పాండ్యా 3-0-18-0; అశ్విన్ 3-0-13-2; రైనా 2-0-13-1. -
భారత్ ‘కనక’ వర్షం
* రెండో రోజు 16 స్వర్ణాలు * రెజ్లింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట * దక్షిణాసియా క్రీడలు గువాహటి: సొంతగడ్డపై జరుగుతోన్న దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దుమ్మురేపుతున్నారు. బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్లో అదరగొడుతూ పతకాల పంట పండిస్తున్నారు. పోటీల తొలి రోజు శనివారం 14 స్వర్ణాలను సాధించిన భారత ఆటగాళ్లు... రెండో రోజూ మరింత చెలరేగి ఏకంగా 16 పసిడి పతకాలతో అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం భారత్ 30 స్వర్ణాలు, 12 రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు, రజతం దక్కాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో అమిత్ ధన్కర్ (70 కేజీలు), ప్రదీప్ (61 కేజీలు)... మహిళల విభాగంలో మమత (53 కేజీలు), మంజూ కుమారి (58 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. పురుషుల 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ గోపాల్ యాదవ్ రజతంతో సంతృప్తి పడ్డాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో నాలుగు స్వర్ణాలు లభించాయి. మహిళల విభాగంలో సరస్వతి రౌత్ (58 కేజీలు)... రాఖీ హలెర్ (69 కేజీలు)... పురుషుల విభాగంలో సంబూ లాపుంగ్ (69 కేజీలు), అజయ్ సింగ్ (77 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. వుషు క్రీడాంశంలోని చాంగ్‌స్వాన్ ఈవెంట్లో సప్నా దేవి (భారత్) స్వర్ణం దక్కించుకుంది. మహిళల సైక్లింగ్ 40 కిలోమీటర్ల క్రయిటీరియమ్ ఈవెంట్లో లిదియామోల్ సన్నీ భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. స్విమ్మింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సందీప్ సెజ్వాల్... 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అరవింద్... 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో సజన్ ప్రకాశ్... మహిళల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సయానీ ఘోష్ భారత్‌కు బంగారు పతకాలను అందించారు. టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కాయి. మహిళల ఫైనల్లో భారత్ 3-0తో పాకిస్తాన్‌పై, పురుషుల ఫైనల్లో భారత్ 3-0తో శ్రీలంకపై గెలిచాయి. భారత్ 24 - నేపాల్ 0 మహిళల హాకీలో భారత జట్టు గోల్స్ వర్షం కురిపించింది. నేపాల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 24-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తెలంగాణ క్రీడాకారిణి యెండల సౌందర్య (15వ, 52వ, 62వ, 64వ నిమిషాల్లో), పూనమ్ బార్లా నాలుగేసి గోల్స్ చేయగా... రాణి, జస్ప్రీత్ కౌర్, నేహా గోయల్, దీపిక మూడేసి గోల్స్ నమోదు చేశారు. గుర్జీత్ కౌర్, ప్రీతి దూబే రెండేసి గోల్స్ సాధించారు. పురుషుల లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. -
వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన భారత్
గుహవాటి: దక్షిణాసియా క్రీడల్లో తొలిరోజే భారత వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటారు. పురుషుల, మహిళల విభాగాల్లో రెండు స్వర్ణపతకాలు సాధించి శభాష్ అనిపించారు. తొలుత మహిళల 48 కేజీల విభాగంలో సికోమ్ మీరాభాయ్ చాను పసిడిని దక్కించుకోగా, అనంతరం పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా స్వర్ణాన్ని సాధించాడు. గత 2014 కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకం సాధించిన సికోమ్.. దక్షిణాసియా క్రీడలు ఆరంభంలోనే మెరిసి స్వర్ణాన్ని దక్కించుకుంది. సికోమ్ మొత్తంగా 169 కేజీలు(స్నాచ్‌లో 79కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 90 కేజీలు) ఎత్తి ప్రథమ స్థానంలోనిలిచింది. ఇదే విభాగంలో శ్రీలంకకు చెందిన క్రీడాకారిణి దినుషా హన్సానీ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా, బంగ్లాదేశ్ క్రీడాకారిణి మొల్లా షబిరియా మూడో స్థానం దక్కించుకుని కాంస్యంతో సరిపెట్టుకుంది. మరోపక్క పురుషుల విభాగంలో గురురాజ్ 241 కేజీలు ( స్నాచ్ లో 104 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 137 కేజీలు) బరువును ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా సైక్లింగ్ లో భారత ఆటగాళ్లు రాణించిన సంగతి తెలిసిందే. 30 కిలోమీటర్ల సైక్లింగ్ విభాగంలో మణిపూర్ కు చెందిన సైక్లిస్ట్ టీ విజయలక్ష్మీ బంగారు పతకాన్ని సాధించింది. తద్వారా 12వ శాఫ్ గేమ్స్ లో స్వర్ణాన్ని గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నమోదుచేసింది. 30 కిలోమీటర్ల మహిళల సైక్లింగ్ విభాగంలో 49 నిమిషాల 24 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజయలక్ష్మీ తొలి స్థానంలో నిలిచింది. మణిపూర్ కే చెందిన మరో సైక్లిస్ట్ ఛోబా దేవి శనివారం జరిగిన ఫైనల్స్ లో 49 నిమిషాల 31 సెకన్లలో టార్గెట్ చేరుకుని రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. -
ఐపీఎల్ వేలం నేడు
బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేసిన మరుసటి రోజే ధనాధన్ క్రికెట్‌కు సంబంధించి మరో కీలక ఘట్టానికి తెర లేస్తోంది. ఐపీఎల్-9 కోసం 116 మంది ఆటగాళ్లను ఎంచుకునేందుకు నేడు (శనివారం) వేలం జరగనుంది. కొత్తగా వచ్చిన పుణే జెయింట్స్, గుజరాత్ లయన్స్ సహా ఎనిమిది జట్లు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఎనిమిది మంది క్రికెటర్లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకోగా, అతి తక్కువగా రూ. 10 లక్షల బేస్ ప్రైస్‌తో దేశవాళీ కుర్రాళ్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఒక్కరోజులోనే వేలం ముగుస్తుంది. వేలంలో భారత ఆటగాళ్లు యువరాజ్ సింగ్, ఇషాంత్, నెహ్రాలకు మంచి డిమాండ్ ఉంది. భారీ హిట్టర్లుగా పేరున్న విదేశీ ఆటగాళ్లు వాట్సన్, పీటర్సన్, ఫించ్, గప్టిల్, డ్వేన్ స్మిత్ భారీ మొత్తం ఆశిస్తున్నారు. దిల్షాన్, మిషెల్ మార్ష్, స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, తిసార పెరీరా, ముస్తఫిజుర్లను తీసుకునేందుకు జట్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లను విడుదల చేయడం వల్ల అన్ని జట్ల వద్ద పెద్ద మొత్తం అందుబాటులో ఉండటంతో ఈ సారి కూడా క్రికెటర్ల పంట పండవచ్చు! అంచనాలు...అవకాశాలు... ఢిల్లీ డేర్‌డెవిల్స్: ప్రస్తుతం జట్టులో 13 మంది మాత్రమే ఉన్నారు. మరో 14 మంది వరకు కొనుక్కునే అవకాశం ఉంది. గుజరాత్ లయన్స్: పూర్తి స్థాయి జట్టును రూపొందించాల్సి ఉంది. ఒక అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్, ఒక టాప్ బౌలర్ కోసం చూస్తున్నారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్: టాప్ బౌలర్ అవసరం ఉండటంతో స్టెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. జట్టుకు కెప్టెన్ కూడా కావాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్: స్టార్ ఆల్‌రౌండర్ కావాలి. వాట్సన్‌పై దృష్టి పెట్టారు. ఇది మినహా ఈ జట్టు దూసుకెళ్లే ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తిగా లేదు. ముంబై ఇండియన్స్: తరచుగా గాయపడే మలింగకు ప్రత్యామ్నాయంగా ఒక పేసర్ అవసరం. పుణే సూపర్ జెయింట్స్: ప్రస్తుతం ఉన్న ఐదుగురు కాకుండా పూర్తిగా కొత్త జట్టును రూపొందించుకోవాలి. ధోని వ్యూహాల ప్రకారం ఆల్రౌండర్లపై దృష్టి పెట్టవచ్చు. బెంగళూరు: ఆర్సీబీ వద్ద అంతా స్టార్లే ఉన్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈ సారి ఉదారంగా ఖర్చు పెట్టకపోవచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్: హిట్టింగ్ చేయగల భారత ఆటగాళ్లపై దృష్టి. పీటర్సన్పై కూడా ఆసక్తి చూపొచ్చు. -
క్రీడా విజేతలకు జగన్ అభినందనలు
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో అద్వితీయ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. క్రికెట్, టెన్నిస్‌ల్లో విజేతలుగా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గెలుపొందడం ద్వారా మహిళల డబుల్స్ టెన్నిస్‌లో వరసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సానియా మీర్జా, మార్టినా హింగిస్ జంటను, టీ ట్వంటీ క్రికెట్లో సిరీస్‌లు గెలుపొందిన మిథాలీ రాజ్ నేతృత్వంలోని మహిళా క్రికెటర్లను, అలాగే ధోనీ బృందాన్ని వైఎస్ జగన్ అభినందించారు. భారత క్రీడాకారులు భవిష్యత్తులో కూడా తమ విజయాల పరంపరను కొనసాగించాలని జగన్ ఆకాంక్షించారు. -
కొత్త సీజన్‌కు సిద్ధం
నేటి నుంచి మలేసియా మాస్టర్స్ టోర్నీ బరిలో శ్రీకాంత్, సింధు పెనాంగ్ (మలేసియా): రెండు వారాలపాటు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సందడి చేసిన భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. బుధవారం మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’లో పలువురు భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో నందగోపాల్-శ్లోక్ రామచంద్రన్ (భారత్) జోడీ, శైలి రాణే (భారత్) ఓడిపోయారు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టకూమా ఉయెదా (జపాన్)తో జయరామ్; షో ససాకి (జపాన్)తో సమీర్ వర్మ; వీ ఫెంగ్ చాంగ్ (మలేసియా)తో శ్రీకాంత్; షాజాన్ షా (మలేసియా) సాయిప్రణీత్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్)తో సింధు ఆడనుండగా... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మీ కువాన్ చూ-లీ మెంగ్ యిన్ (మలేసియా) జంటతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ తలపడుతుంది. -
భారత్‌కు ఏడు పతకాలు
న్యూఢిల్లీ: ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు రాణించారు. చైనాలోని బీజింగ్‌లో సోమవారం ముగిసిన ఈ ఈవెంట్లో భారత్‌కు ఐదు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు వచ్చాయి. కపిల్ శర్మ, జస్వీందర్ సింగ్, రాజేశ్ వర్మ, మొహమ్మద్ ఆజాద్‌లతో కూడిన భారత బృందం పురుషుల ఫోర్స్ విభాగంలో రజతం నెగ్గింది. పురుషుల సింగిల్ స్కల్ విభాగంలో దత్తూ బబన్ రజతం సాధించాడు. లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో విక్రమ్ సింగ్, షోకిందర్ తోమర్ జంట రజతం సొంతం చేసుకుంది. పురుషుల ఎయిట్, డబుల్ స్కల్స్ ఈవెంట్స్‌లోనూ భారత్‌కు రజతాలు లభించాయి. పెయిర్స్ విభాగంలో దవిందర్ సింగ్, నవీన్ కుమార్... లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్‌లో దుష్యంత్ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. భారత రోయింగ్ జట్టు సభ్యులందరూ హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ జలాల్లో చీఫ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్ పర్యవేక్షణలో సాధన చేస్తారు. -
'మన క్రికెటర్లు పూర్తిగా సన్నద్ధం కాలేదు'
టెస్టు క్రికెట్.. బ్యాట్స్‌మన్, బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తుందని మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నాడు. విజయం సాధించాలంటే ఆటగాళ్లు సహనం కలిగిఉండాలని సూచించాడు. కాగా మన ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌కు తగినంతగా సన్నద్ధం కాలేదని రాజు చెప్పాడు. వెంకటపతి రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్లో భారత్ వైఫల్యాలకు గల కారణాలను వెల్లడించాడు. 'సచిన్, ద్రావిడ్, గంగూలీ వంటి దిగ్గజ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు సమయం కేటాయించేవారు. ఈ రోజుల్లో టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ తక్కువగా ఆడుతున్నారు. తీరికలేని అంతర్జాతీయ షెడ్యూల్, ఐపీఎల్ దీనికి కారణం కావచ్చు. టెస్టు క్రికెట్ ఆడటంలో ప్రస్తుత భారత జట్టుకు అనుభవం తక్కువ. టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు సమయం కేటాయించేలా బీసీసీఐ దృష్టిసారించాలి' అని వెంకటపతి రాజు అన్నాడు. -
‘గాలి’ పోయింది
♦ తొలి టెస్టులో భారత్ ఓటమి ♦ 112 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన ♦ హెరాత్ సంచలన బౌలింగ్ ♦ సిరీస్‌లో శ్రీలంకకు 1-0 ఆధిక్యం గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఆటగాళ్లు విదేశంలోని ఓ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకున్నారు. జెండా ఎగరేశారు. జాతీయ గీతం పాడారు. కానీ ఆ స్ఫూర్తితో మైదానంలో పోరాడలేకపోయారు. కేవలం 176 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. 112 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన జాతీయ పండగరోజు భారత పరువు తీసింది. గాలె : భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున మన క్రికెట్ జట్టు మరచిపోలేని పరాభవాన్ని మూటగట్టుకుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 63 పరుగులతో ఓడిపోయింది. ఆటన్నాక గెలుపోటములు సహజం. కానీ మూడు రోజులు ఆధిపత్యం చూపించిన టెస్టులో కేవలం 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోవడాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. గాలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు శనివారం భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటయింది. అజింక్య రహానే (76 బంతుల్లో 36; 4 ఫోర్లు), శిఖర్ ధావన్ (83 బంతుల్లో 28; 3 ఫోర్లు) మినహా ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కొద్దిసేపైనా నిలబడలేదు. శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ హెరాత్ (7/48) ధాటికి భారత బ్యాట్స్‌మెన్ పోటీ పడుతూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మరో స్పిన్నర్ కౌశల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. చండీమల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు 20 నుంచి కొలంబోని సారా ఓవల్ మైదానంలో జరుగుతుంది. ఒకరి వెనుక ఒకరు... ఓవర్‌నైట్ స్కోరు 23/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 153 పరుగులు చేస్తే గెలిచేది. అయితే ధావన్ పరుగు తీయడానికే ఓ ఎండ్‌లో ఇబ్బంది పడితే మరో ఎండ్‌లో హెరాత్ ధాటికి నైట్ వాచ్‌మన్ ఇషాంత్‌తో పాటు రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లి, ధావన్‌లను కౌశల్ అవుట్ చేశాడు. దీంతో భారత్ 60 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహానే ఒక ఎండ్‌లో నిలబడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్‌లో హెరాత్ నాలుగు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు తీశాడు. దీంతో భారత్ 81 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అమిత్ మిశ్రా (15) కాసేపు రహానేకు అండగా నిలబడ్డాడు. అయితే హెరాత్ స్పిన్ ధాటికి రహానే కూడా పెవిలియన్‌కు చేరాడు. కౌశల్ బౌలింగ్‌లో మిశ్రా అవుట్ కావడంతో భారత్ ఓటమి లాంఛనం ముగిసింది. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 183 ; భారత్ తొలి ఇన్నింగ్స్: 375 శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 367 భారత్ రెండో ఇన్నింగ్స్ : లోకేశ్ రాహుల్ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 5; ధావన్ (సి) అండ్ (బి) కౌశల్ 28; ఇషాంత్ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 10; రోహిత్ (బి) హెరాత్ 4; కోహ్లి (సి) సిల్వ (బి) కౌశల్ 3; రహానే (సి) మ్యాథ్యూస్ (బి) హెరాత్ 36; సాహా (స్టం) చండీమల్ (బి) హెరాత్ 2; హర్భజన్ (సి) సిల్వ (బి) హెరాత్ 1; అశ్విన్ (సి) ప్రసాద్ (బి) హెరాత్ 3; అమిత్ మిశ్రా (సి) కరుణరత్నె (బి) కౌశల్ 15; ఆరోన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 112. వికెట్ల పతనం : 1-12; 2-30; 3-34; 4-45; 5-60; 6-65; 7-67; 8-81; 9-102; 10-112. బౌలింగ్ : ప్రసాద్ 4-2-4-0; హెరాత్ 21-6-48-7; కౌశల్ 17.5-1-47-3; ప్రదీప్ 6-3-8-0; మ్యాథ్యూస్ 1-0-3-0. ‘ఈ ఓటమికి మమ్మల్ని మేమే నిందించుకోవాలి. ఒత్తిడిని జయించడమే సాధారణ జట్టుకు, పెద్ద జట్టుకు తేడా. ఈ మ్యాచ్ ద్వారా తెలుసుకోవాల్సింది అదే. చండీమల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ప్రపంచస్థాయి బౌలర్ హెరాత్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. మేం బ్యాటింగ్ సరిగా చేయక ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం. కాబట్టి డీఆర్ఎస్ లేకపోవడాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం. డీఆర్ఎస్ గురించి సిరీస్ అయిపోయాక ఆలోచిస్తాం.’ -భారత కెప్టెన్ కోహ్లి 18 200 లోపు లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ విఫలం కావడం 18 ఏళ్ల తర్వాత ఇప్పుడే. చివరిసారిగా 1997లో వెస్టిండీస్‌పై 120 పరుగులు ఛేదించలేక ఓడింది. 112 టెస్టుల్లో భారత్‌కు శ్రీలంకపై ఇదే అత్యల్ప స్కోరు 22 టెస్టుల్లో హెరాత్ ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే వికెట్లు తీయడం ఇది 22వ సారి. -
వెళ్లాలి... ‘మన రాకెట్’ పైపైకి...
- నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ - బరిలో సైనా, సింధు, శ్రీకాంత్, కశ్యప్ - తొలిసారి 18 మందితో భారీ బృందం అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచ’ పతకాన్ని సాధించాలనే పట్టుదలతో సైనా నెహ్వాల్... వరుసగా మూడోసారి అద్బుతం చేయాలనే లక్ష్యంతో పీవీ సింధు... 32 ఏళ్ల పురుషుల సింగిల్స్ విభాగంలో పతక నిరీక్షణకు తెరదించాలనే ఆశయంతో శ్రీకాంత్, కశ్యప్... మళ్లీ విజయాలబాట పట్టాలనే సంకల్పంతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... ఇలా ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర చూపించాలనే తాపత్రయంతో అసలు సమరానికి సమాయత్తమయ్యారు. సోమవారం నుంచి మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ అంచనాలతో భారత బృందం బరిలోకి దిగనుంది. జకార్తా (ఇండోనేసియా): బ్యాడ్మింటన్‌లో చైనాకు దీటుగా తాము ఎదుగుతున్నామని ఇటీవల కాలంలో తమ ప్రదర్శనతో నిరూపించిన భారత క్రీడాకారులు ప్రపంచ పరీక్షకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జకార్తాలో మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 18 మంది సభ్యులతో కూడిన భారత బృందం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలిసారి అత్యధిక ఆటగాళ్లతో భారత్ వెళ్లినప్పటికీ... ఆరుగురిపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు.. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం నుంచి పతకాలు ఆశించవచ్చు. సైనా.. ఈసారైనా ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్లో ఐదుసార్లు పాల్గొన్న సైనా ఐదు పర్యాయాల్లోనూ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఈ అవరోధాన్ని దాటితే ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. తన కెరీర్లో ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, సూపర్ సిరీస్, ఉబెర్ కప్, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో పతకాలు నెగ్గిన సైనాకు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం అందని ద్రాక్షగా ఊరిస్తోంది. ఆరో సారైనా సైనాకు అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. ఈసారి రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనాకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో సులువైన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం ఉన్నా... ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ తకహాషి (జపాన్), క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) సైనా దారిలో ఉన్నారు. ఈ రెండు అడ్డంకులను దాటితేనే సైనాకు పతకం దక్కుతుంది. సింధు... హ్యాట్రిక్ సాధించేనా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ (2013, 2014)లలో కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన పీవీ సింధు వరుసగా మూడోసారీ పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. గాయాల కారణంగా ఈ సీజన్లో పెద్దగా విజయాలు సాధించని సింధు ఈ మెగా ఈవెంట్‌కు పక్కాగా సన్నద్ధమైంది. 11వ సీడింగ్ పొందిన సింధుకు తొలి రౌండ్లో ‘బై’ దక్కింది. రెండో రౌండ్‌ను దాటితే ఈ హైదరాబాద్ అమ్మాయికి మూడో రౌండ్లో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. గతంలో లీ జురుయ్‌ను ఓడించిన సింధు ఈసారీ అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయడంపైనే ఆమె ‘హ్యాట్రిక్’ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ‘ప్రస్తుతం నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. సన్నాహాలు కూడా బాగున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా, సహజశైలిలో ఆడతాను. వరుసగా మూడోసారి పతకాన్ని సాధిస్తాను’ అని సింధు వ్యాఖ్యానించింది. మళ్లీ గాడిలో పడేందుకు... ఇటీవలే కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిపించాలనే లక్ష్యంతో ఉన్నారు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించిన జ్వాల-అశ్విని మరోసారి పతకంతో తిరిగి వస్తారో లేదో వేచి చూడాలి. తొలి రౌండ్లో బై పొందిన జ్వాల-అశ్వినిలకు మూడో రౌండ్లో ఎనిమిదో సీడ్ కాకివా-మియుకి మయెదా (జపాన్) జోడీ ఎదురయ్యే అవకాశముంది. మహిళల డబుల్స్‌లోనే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె; మొహితా -ధాన్యా; పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్; మిక్స్డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్; సిక్కి రెడ్డి-కోనా తరుణ్ బరిలో ఉన్నారు. నిరీక్షణకు తెర దించుతారా! పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ఈ మెగా ఈవెంట్లో చివరిసారి 1983లో ప్రకాశ్ పదుకొనే కాంస్య పతకాన్ని అందించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు భారత్‌కు పురుషుల సింగిల్స్‌లో మరో పతకం రాలేదు. అయితే కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్‌లలో ఒకరైనా 32 ఏళ్ల నిరీక్షణకు ఈసారి తెరదించుతారనే ఆశ కనిపిస్తోంది. బ్యాడ్మింటన్ సర్క్యూట్లో అత్యంత దూకుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ గతేడాది చైనా సూపర్ సిరీస్‌లో లిన్ డాన్‌ను మట్టికరిపించి పెను సంచలనమే సృష్టించాడు. ఈ ఏడాది ఇండోనేసియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించిన కశ్యప్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరే కాకుండా కేరళ ప్లేయర్ ప్రణయ్ కూడా సంచలనం సృష్టించే అవకాశముంది. సోమవారం జరిగే తొలి రౌండ్లో ఎరిక్ మెజెస్ (నెదర్లాండ్స్)తో కశ్యప్; అలెక్స్ యువాన్ (బ్రెజిల్)తో ప్రణయ్ తలపడతారు. ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
బయట తిరిగే అవకాశం లేదు!
హోటల్ మార్చండన్న టీమిండియా ఢాకా: గతంలో బంగ్లాదేశ్‌కు ఎప్పుడు వచ్చినా భారత్ అదే హోటల్లో ఉంది. ఆతిథ్య జట్టుతో పాటు ఏ విదేశీ జట్టుకైనా అక్కడే బస. ఇటీవల మన ప్రధాని మోది కూడా అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు మాత్రం తాము ఉంటున్న పాన్ పసిఫిక్ హోటల్ (సొనార్గావ్ ప్రాంతం)నుంచి తమను మార్చమని కోరుతున్నారు. ‘ఈ ఏరియాతోనే అసలు సమస్య. ఇక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారు. మేం బయటికి వెళ్లలేకపోతున్నాం. దగ్గరలోని గుల్షన్ ప్రాంతం అయితే బాగుంటుంది. అక్కడ రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి’... ఇదీ మనవాళ్లు చెబుతున్న కారణం. అయితే ఇప్పటికిప్పుడు మరో హోటల్లో గదులు సమకూర్చడం కష్టమవడంతో పాటు భద్రతా కారణాల వల్ల కూడా ఇది సాధ్యం కాదని బంగ్లా బోర్డు స్పష్టం చేసినట్లు తెలిసింది. అసలు ఫతుల్లా టెస్టు సమయంలోనే భారత్ ఫిర్యాదు చేసినా ఆటగాళ్లు అక్కడే ఉండేందుకు బీసీబీ ఒప్పించింది. భారీ వర్షం కారణంగా టెస్టులో ఎక్కువ భాగం రద్దు కాగా, వన్డేలకు కూడా వాన ముప్పు ఉండటంతో భారత ఆటగాళ్లు హోటల్లో ఉండేందుకు చికాకు పడుతున్నట్లు తెలిసింది. భారత జట్టు తమ హోటల్ మార్చమని కోరడం గతంలో ఎన్నడూ జరగలేదు. -
కబడ్డీలో ఖుషీ...ఖుషీ
ఊహించినట్లుగానే కబడ్డీ కూతలో కనకం మోత మోగింది. పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ చెలరేగిపోయింది. ప్రత్యర్థులను పాతర వేస్తూ రెండు స్వర్ణాలను గెలిచి ఔరా అనిపించింది. ఇంచియాన్: కబడ్డీలో తమ తడాఖా ఎలా ఉంటుందో భారత క్రీడాకారులు మైదానంలో చూపెట్టారు. ప్రత్యర్థుల నుంచి గట్టి సవాలు ఎదురైనా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో అనుకున్నది సాధించారు. ఫలితంగా ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణాలను నిలబెట్టుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల ఫైనల్లో భారత్ 27-25తో ఇరాన్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఏడోసారి పసిడిని సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లో భారత్ 31-21తో ఇరాన్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. పురుషుల ఫైనల్ ఆరంభంలో ఇరాన్ ఆటగాళ్ల బలమైన రైడింగ్, అద్భుతమైన డిఫెండింగ్‌కు భారత్ కాస్త తడబడింది. దీంతో ఓ లోనాను సమర్పించుకోవడంతో ఇరాన్ 17-7 ఆధిక్యంలో నిలిచింది. భారత ప్లేయర్ జస్వీర్ సింగ్ అనాలోచిత ఆటతీరు తో మూల్యం చెల్లించుకున్నాడు. కీలక సమయంలో మూడుసార్లు రైడింగ్‌కు వెళ్లి అవుటై వచ్చాడు. ఈ దశలో అనూప్ కుమార్ రైడింగ్‌లో మూడు పాయింట్లు తేవడంతో ఆధిక్యం 11-18కి తగ్గింది. ఒకటి, రెండు పాయింట్లతో నెట్టుకొచ్చిన భారత్ తొలి అర్ధభాగానికి 13-21తో వెనుకబడింది. రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చిన భారత్ ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రవికుమార్ వీరోచిత ఆటతో వరుస పాయింట్లతో పాటు ‘లోనా’ కూడా లభించింది. దీంతో భారత్ 21-21తో స్కోరును సమం చేసింది. అయితే ఇరానియన్లు కాస్త సంయమనంతో కదలి 24-21తో ముందంజ వేసినా భారత్ సకాలంలో తేరుకుని 24-24తో సమం చేసింది. ఆట మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా అనూప్ అద్భుతమైన రైడింగ్‌కు పాయింట్ రావడం, తర్వాత రైడింగ్‌కు వచ్చిన మెరాజ్ షెకీని సూపర్ క్యాచ్‌తో అవుట్ చేయడంతో భారత్ 26-24 ఆధిక్యంలో వెళ్లింది. చివరి రైడింగ్‌లో అనూప్ విఫలమైనా... మెరాజ్‌ను మరోసారి క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో భారత్ 27-25తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మహిళలదీ అదే జోరు మహిళల విభాగంలో కూడా భారత్ రెండో అర్ధభాగంలోనే సత్తా చాటింది. ఆరంభంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్ ఆ తర్వాత ఏకపక్షంగా మారిపోయింది. మెరుపు కదలికలతో ప్రత్యర్థులకు దొరకకుండా పాయింట్లు నెగ్గిన భారత్... రెండు లోనాలు కూడా నమోదు చేసింది. దీంతో తొలి అర్ధభాగానికి 15-11 ఆధిక్యంలో నిలిచింది. అభిలాష మహాత్రే అటాకింగ్ రైడింగ్‌కు రెండో అర్ధభాగంలో చకచకా పాయింట్లు వచ్చాయి. ఏడో నిమిషంలో మరో లోనా లభించడంతో 25-16తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తర్వాత ఇరాన్ మహిళలు పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తైక్వాండో: ఈ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. 73 కేజీల క్వార్టర్ఫైనల్లో అల్ఫాద్ అబ్రార్‌తో జరిగిన బౌట్లో షాలో రైక్వార్ 3-3తో స్కోరును సమం చేసింది. అయితే బౌట్లో చూపిన ఆధిపత్యానికి అబ్రార్‌ను విజేతగా ప్రకటించారు. మరో బౌట్లో మార్గరెట్ మారియా 1-15తో లీ డాంగుహా (చైనా) చేతిలో ఓడింది. వాలీబాల్: భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 5-6 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 3-2తో ఖతార్‌పై నెగ్గింది. అథ్లెటిక్స్: హ్యామర్ త్రోలో కాంస్యం సాధించిన మంజూ బాలా రజత పతకానికి ప్రమోట్ అయ్యింది. రజతం సాధించిన వాంగ్ జెంగ్ (చైనా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమె పతకాన్ని వెనక్కి తీసుకుని మంజుకు ఇచ్చారు. -
చక్ దే ఇండియా...
ప్రత్యర్థిగా దాయాది దేశం... ముఖాముఖి రికార్డూ అంతగా బాగాలేదు... లీగ్ దశలోనూ ఓటమి... ఎలాగైనా, ఈసారైనా గెలవాలనే ఒత్తిడి... ఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు నరాలు తెగే ఉత్కంఠతను తట్టుకుంది. కొడితే కుంభస్థలం మీద కొట్టాలి అనే విధంగా అంతిమ సమరంలో అద్భుతం చేసింది. కీలక క్షణాల్లో సంయమనం కోల్పోకుండా ఆడింది. 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ‘షూటౌట్’లో బోల్తా కొట్టించి టీమిండియా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో మళ్లీ పసిడి నెగ్గిన భారత్ 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. ఫైనల్లో పాక్‌పై విజయం ►16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం ►2016 ఒలింపిక్స్‌కూ అర్హత ఇంచియాన్: ఆధిక్యంలో ఉండటం... ఆ తర్వాత వెనుకబడిపోవడం... ఇటీవల కాలంలో భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో మాత్రం భారత ఆటగాళ్లు శక్తివంచన లేకుండా పోరాడారు. తొలుత 0-1తో వెనుకబడినా... ఆ తర్వాత బెదరకుండా, నమ్మకం కోల్పోకుండా స్కోరును సమం చేశారు. నిర్ణీత సమయం పూర్తయ్యాక విజేతను నిర్ణయించే ‘షూటౌట్’లోనూ సంయమనం కోల్పోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఫలితంగా 16 ఏళ్ల విరామం తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో మళ్లీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా 2016 ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత్ ‘షూటౌట్’లో 4-2తో పాకిస్థాన్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా, ధరమ్వీర్ సింగ్ సఫలమయ్యారు. మన్‌ప్రీత్ సింగ్ విఫలమయ్యాడు. పాకిస్థాన్ తరఫున మహ్మద్ వకాస్, రసూల్ సఫలంకాగా... హసీమ్ ఖాన్, ఉమర్ విఫలమయ్యారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ శ్రీజేష్ చాకచక్యంగా వ్యవహరించి పాక్ ఆటగాళ్ల రెండు షాట్లను నిలువరించి ‘హీరో’గా అవతరించాడు. అంతకుముందు ఆట మూడో నిమిషంలో మహ్మద్ రిజ్వాన్ గోల్‌తో పాకిస్థాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆట 27వ నిమిషంలో కొత్తాజిత్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును 1-1తో సమం చేసింది. లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత ఆటగాళ్లు ఫైనల్లో బరిలోకి దిగారు. కానీ మూడో నిమిషంలోనే పాక్ గోల్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చింది. అయితే భారత ఆటగాళ్లు వెంటనే ఈ పరిణామం నుంచి తేరుకున్నారు. సమన్వయంతో కదులుతూ పాక్‌పై ఒత్తిడిని పెంచారు. రెండో అర్ధభాగంలో భారత కృషి ఫలించింది. కొత్తాజిత్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. ఆ తర్వాతి రెండు అర్ధ భాగాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడంలో సఫలంకాలేదు. ►ఓవరాల్‌గా ఆసియా క్రీడల హాకీలో భారత్‌కిది మూడో స్వర్ణం. గతంలో టీమిండియా రెండుసార్లు (1966లో, 1998లో) బ్యాంకాక్‌లోనే జరిగిన క్రీడల్లో పసిడి పతకాలు గెలిచింది. ►ఆసియా క్రీడల ఫైనల్లో పాక్‌ను ఓడించడం భారత్‌కిది రెండోసారి మాత్రమే. చివరిసారి 1966 క్రీడల ఫైనల్లో భారత్ 1-0తో పాక్‌పై గెలిచింది. ‘‘ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గడం నా కెరీర్లోనే గొప్ప విజయంగా భావిస్తున్నాను. పసిడి సాధించి రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందాలనే ఏకైక లక్ష్యంతో ఇంచియాన్‌కు వచ్చాం. తుదకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాం. ఈ విజయంలో కోచ్ టెర్రీ వాల్ష్, సహాయక సిబ్బంది పాత్రను మరువలేం.’’ - సర్దార్ సింగ్, భారత కెప్టెన్ -
భారత ఆటగాళ్ల గదుల్లో సిరంజీలు!
►కామన్వెల్త్ క్రీడల్లో మరో వివాదం ►అంగీకరించిన చెఫ్ డి మిషన్ ►విటమిన్ల కోసమేనని వివరణ బెంగళూరు: కామన్వెల్త్ క్రీడలు ముగిసి దాదాపు పది రోజులయ్యాయి. అయితే ఆటతో పాటు అక్కడ చోటు చేసుకున్న మరో వివాదం తాజాగా బయటపడింది. వివరాల్లోకెళితే... గేమ్స్ విలేజ్‌లో భారత ఆటగాళ్లు బస చేసిన గదుల్లో సిరంజీలు లభించినట్లు క్రీడాగ్రామం అధికారులు క్రీడల సమయంలోనే బయటపెట్టారు. అదీ ఏకంగా మూడుసార్లు దొరికాయని వారు వెల్లడించారు. అథ్లెట్లకు బస ఏర్పాటు చేసిన గదులను నిర్వహించే హౌస్ కీపింగ్ సిబ్బంది దీనిని బహిర్గతం చేశారు. మొదటిసారి ఒక పారాథ్లెట్ గదిలో సిరంజీలు దొరికాయని వారు అన్నారు. ఆ తర్వాత లాంజ్‌లో మరికొన్ని పడి ఉన్నాయని, మూడోసారి భారత రెజ్లర్ల గదిలో బయటపడ్డాయని వారు వివరించారు. అయితే మూడు సందర్భాల్లోనూ జట్టు మేనేజ్మెంట్ను హెచ్చరించిన నిర్వాహకులు వదిలిపెట్టారు. సిరంజీలు దొరికిన తర్వాత ‘రెగ్యులర్‌గా గదులు తనిఖీ చేస్తాం. మా ఆటగాళ్లకు డోపింగ్‌పై అవగాహన కల్పిస్తాం’ అని రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే ఇది జరిగింది. అంతకుముందే ఆటగాళ్ల కదలికల గురించి సమాచారం ఇవ్వనందుకు కూడా భారత మేనేజ్మెంట్ చీవాట్లు పడ్డట్లు తెలిసింది. క్రీడా గ్రామం ప్రారంభంనుంచి ముగింపు ఉత్సవం వరకు ఆటగాళ్లు వాడే ప్రతీ ఇంజెక్షన్‌ను పరిశీలించాలని 2012 లండన్ ఒలింపిక్స్ నుంచి నిబంధనలు వచ్చాయి. అయితే గ్లాస్గో అధికారులు వాటిని కఠినంగా అమలు చేయకపోవడంతో భారత ఆటగాళ్లు బయటపడ్డారు. ఆస్ట్రేలియాలో జరిగే తదుపరి కామన్వెల్త్ క్రీడల నుంచి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని కమిటీ ప్రకటించింది. అవును... నిజమే! ఆటగాళ్ల గదుల్లో సిరంజీలు దొరికిన విషయాన్ని భారత చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ నిర్ధారించారు. అయితే ఆటగాళ్లు తప్పేమీ చేయలేదని ఆయన అన్నారు. ‘ఇందులో నిబంధనల ఉల్లంఘన జరగలేదు. మల్టీ విటమిన్లను తీసుకునేందుకే ఆటగాళ్లు సిరంజీలను ఉపయోగించారు. మెడికల్ కమిషన్ ముందు నేను వాంగ్మూలం ఇచ్చాను. వారు మనకు క్లీన్చిట్ కూడా ఇచ్చారు’ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి భారత అధికారుల అరెస్ట్, విడుదల తర్వాత దేశం పరువు పోగొట్టే మరో వివాదం చివరకు సమసిపోవడంతో ఐఓఏ ఊపిరి పీల్చుకుంది. బెంగళూరు: కామన్వెల్త్ క్రీడలు ముగిసి దాదాపు పది రోజులయ్యాయి. అయితే ఆటతో పాటు అక్కడ చోటు చేసుకున్న మరో వివాదం తాజాగా బయటపడింది. వివరాల్లోకెళితే... గేమ్స్ విలేజ్‌లో భారత ఆటగాళ్లు బస చేసిన గదుల్లో సిరంజీలు లభించినట్లు క్రీడాగ్రామం అధికారులు క్రీడల సమయంలోనే బయటపెట్టారు. అదీ ఏకంగా మూడుసార్లు దొరికాయని వారు వెల్లడించారు. అథ్లెట్లకు బస ఏర్పాటు చేసిన గదులను నిర్వహించే హౌస్ కీపింగ్ సిబ్బంది దీనిని బహిర్గతం చేశారు. మొదటిసారి ఒక పారాథ్లెట్ గదిలో సిరంజీలు దొరికాయని వారు అన్నారు. ఆ తర్వాత లాంజ్‌లో మరికొన్ని పడి ఉన్నాయని, మూడోసారి భారత రెజ్లర్ల గదిలో బయటపడ్డాయని వారు వివరించారు. అయితే మూడు సందర్భాల్లోనూ జట్టు మేనేజ్మెంట్ను హెచ్చరించిన నిర్వాహకులు వదిలిపెట్టారు. సిరంజీలు దొరికిన తర్వాత ‘రెగ్యులర్‌గా గదులు తనిఖీ చేస్తాం. మా ఆటగాళ్లకు డోపింగ్‌పై అవగాహన కల్పిస్తాం’ అని రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే ఇది జరిగింది. అంతకుముందే ఆటగాళ్ల కదలికల గురించి సమాచారం ఇవ్వనందుకు కూడా భారత మేనేజ్మెంట్ చీవాట్లు పడ్డట్లు తెలిసింది. క్రీడా గ్రామం ప్రారంభంనుంచి ముగింపు ఉత్సవం వరకు ఆటగాళ్లు వాడే ప్రతీ ఇంజెక్షన్‌ను పరిశీలించాలని 2012 లండన్ ఒలింపిక్స్ నుంచి నిబంధనలు వచ్చాయి. అయితే గ్లాస్గో అధికారులు వాటిని కఠినంగా అమలు చేయకపోవడంతో భారత ఆటగాళ్లు బయటపడ్డారు. ఆస్ట్రేలియాలో జరిగే తదుపరి కామన్వెల్త్ క్రీడల నుంచి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని కమిటీ ప్రకటించింది. అవును... నిజమే! ఆటగాళ్ల గదుల్లో సిరంజీలు దొరికిన విషయాన్ని భారత చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ నిర్ధారించారు. అయితే ఆటగాళ్లు తప్పేమీ చేయలేదని ఆయన అన్నారు. ‘ఇందులో నిబంధనల ఉల్లంఘన జరగలేదు. మల్టీ విటమిన్లను తీసుకునేందుకే ఆటగాళ్లు సిరంజీలను ఉపయోగించారు. మెడికల్ కమిషన్ ముందు నేను వాంగ్మూలం ఇచ్చాను. వారు మనకు క్లీన్చిట్ కూడా ఇచ్చారు’ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి భారత అధికారుల అరెస్ట్, విడుదల తర్వాత దేశం పరువు పోగొట్టే మరో వివాదం చివరకు సమసిపోవడంతో ఐఓఏ ఊపిరి పీల్చుకుంది. -
భారత్ పరువు ‘గ్లాస్గో’లో కలిసింది!
►ఐఓఏ ప్రధాన కార్యదర్శి అరెస్టు ►మరో అధికారిపై లైంగిక ఆరోపణలు గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఒకవైపు భారత ఆటగాళ్లు పతకాల కోసం పోరాడుతుంటే... మరోవైపు అధికారులు దేశం పరువు పోగొట్టే పనిలో పడ్డట్లున్నారు! ఈ క్రీడల్లో భారత్‌కు చెడ్డ పేరు తెచ్చే ఉదంతం శనివారం చోటు చేసుకుంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులో అరెస్టయ్యారు. మరోవైపు రెజ్లింగ్ రిఫరీ వీరేందర్ మాలిక్‌ని కూడా స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిక్‌పై ఏకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పుడు భారత బృందమంతా తలదించుకునే పరిస్థితి తలెత్తింది. ఈ ఇద్దరు అధికారికంగా భారత బృందంతో క్రీడా గ్రామంలో కాకుండా గ్లాస్గోలోని ఒక హోటల్లో ఉంటున్నారు. మాలిక్‌కు అయితే జట్టుతో సంబంధం కూడా లేదు. అరెస్ట్ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించారు. ‘శనివారం 45, 49 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులను వేర్వేరు చోట్ల భిన్నమైన ఆరోపణలతో అరెస్ట్ చేశాం. అయితే పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేం’ అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఎడిన్‌బర్గ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా పోలీసులతో మాట్లాడినట్లు, తదుపరి దర్యాప్తునకు సంబంధించి చర్చిస్తున్నట్లు పేర్కొంది. రాజీవ్, వీరేందర్‌లను సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. రాజీవ్ మద్యం సేవించిన మోతాదును బట్టి శిక్షకు గురయ్యే అవకాశం ఉండగా... వీరేందర్‌పై ఆరోపణలు రుజువైతే కఠిన శిక్ష తప్పకపోవచ్చు. మరోవైపు ఈ సంఘటన గురించి తమకు సమాచారం ఉందని, దీనిపై తదుపరి స్కాట్లాండ్ పోలీసులే స్పందిస్తారని కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య సీఈఓ మైక్ హూపర్ స్పష్టం చేశారు. కఠిన చర్యలు: క్రీడల మంత్రి అరెస్ట్‌కు గురైన ఇద్దరు భారత అధికారులు తప్పు చేసినట్లు రుజువైతే వారిపై తీవ్ర చర్యలు తప్పవని కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. ‘మన అథ్లెట్లు దేశం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ తరహా ఘటన ప్రతీ భారతీయుడిని బాధిస్తుంది. కోర్టులో వారు తప్పు చేసినట్లు నిరూపణ అయితే కఠినంగా శిక్షిస్తాం’ అని మంత్రి చెప్పారు. ఈ ఉదంతం తనను సిగ్గుపడేలా చేసిందని భారత చెఫ్ డి మిషన్ రాజ్ సింగ్ వ్యాఖ్యానించగా, ఐఓఏ మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా.. అరెస్ట్ ఘటన షాక్‌కు గురి చేసిందన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
స్లొవేకియా ఓపెన్ చాంప్ ఐహిక
న్యూఢిల్లీ: స్లొవేకియా ఓపెన్ గ్లోబర్ జూనియర్ సర్క్యూట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఐహిక ముఖర్జీ విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి సెనెక్‌లో జరిగిన ఫైనల్లో ఐహిక 4-2 (11-6, 9-11, 11-4, 6-11, 13-11, 11-6) లీలా ఇమ్రే (హంగేరి)పై గెలిచింది. 40 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఈ పోరులో ముఖర్జీకి ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. నేటి (మంగళవారం) నుంచి జరిగే పోలిష్ జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో ముఖర్జీతో పాటు ఇతర భారత ఆటగాళ్లు పాల్గొననున్నారు. -
ధీమా పెరిగింది
గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో ఎన్నడూలేని విధంగా ఆరు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు ఈ సంవత్సరం కూడా తమ జోరు కొనసాగించారు. విశ్వ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేశారు. ఆర్చరీ నుంచి రెజ్లింగ్ దాకా ప్రతి క్రీడాంశంలో మనోళ్లు మెరిశారు. భారత క్రీడాకారులు ఈ విజయనామ సంవత్సరంలో విజయాలు మోసుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం కోసమే వెళ్లేవారు ఇపుడు పతకాలతో తిరిగి వస్తున్నారు. వివాదాలు వెంటాడుతున్నా... అంచనాలను అందుకుంటూ... ఆశలను నేరవేరుస్తూ... క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకోవచ్చనే ధీమాను పెంచుతూ... అద్వితీయ విజయాలతో క్రీడా ప్రపంచంలో మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది భారత క్రీడారంగంలో గుర్తుంచుకోదగిన క్షణాల సమాహారం... సాక్షి పాఠకుల కోసం. లేటు వయసులో మేటి ఫలితాలు (టెన్నిస్) ఉత్సాహం, పట్టుదల ఉంటే లేటు వయసులోనూ మేటి ఫలితాలు సాధించొచ్చని లియాండర్ పేస్ నిరూపించాడు. రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఈ కోల్‌కతా యోధుడు 40 ఏళ్ల ప్రాయంలో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గాడు. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా పేస్ చరిత్ర లిఖించాడు. వేర్వేరు భాగస్వాములతో కలిసి రోహన్ బోపన్న రెండు డబుల్స్ టైటిల్స్‌ను... మహేశ్ భూపతి ఒక టైటిల్‌ను నెగ్గారు. డబుల్స్‌కే పరిమితమైన హైదరాబాద్ స్టార్ సానియా మీర్జాకు ‘గ్రాండ్‌స్లామ్’ విజయం దక్కకపోయినా స్థిరమైన ప్రదర్శనతో ఐదు టైటిల్స్ సాధించింది. బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్‌లో... జెంగ్ జీ (చైనా)తో కలిసి న్యూ హవెన్ ఓపెన్‌లో... కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టోక్యో ఓపెన్, బీజింగ్ ఓపెన్లలో సానియా డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. గురి అదిరింది (ఆర్చరీ) లండన్ ఒలింపిక్స్‌లో వైఫల్యాన్ని మరిపిస్తూ ఈ ఏడాది భారత ఆర్చర్లు తీపి జ్ఞాపకాలు మిగిల్చారు. దీపిక కుమారి, బొంబేలా దేవి, రిమిల్ బురిలీలతో కూడిన భారత జట్టు పోలండ్, కొలంబియాలలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలో స్వర్ణ పతకాలు గెలిచింది. ఈ క్రమంలో భారత బృందం ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాను, చైనా జట్లను బోల్తా కొట్టించింది. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో భారత జట్టు ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఇక మంగోలియాలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వై.చరణ్ రెడ్డి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. ఉడుంపట్టు (రెజ్లింగ్) గతేడాది లండన్ ఒలింపిక్స్‌లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ విజయాల స్ఫూర్తితో... ఈసారి ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. సెప్టెంబరులో హంగేరిలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో తొలిసారి భారత రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఫ్రీస్టయిల్లో అమిత్ కుమార్ (55 కేజీలు) రజతం నెగ్గగా... బజరంగ్ (60 కేజీలు) కాంస్యం సాధించాడు. గ్రీకో రోమన్ విభాగంలో సందీప్ తులసీ యాదవ్ (66 కేజీలు) కాంస్యం రూపంలో తొలిసారి భారత్‌కు పతకాన్ని అందించాడు. ఈ ‘త్రయం’ ప్రదర్శనతో తొలిసారి భారత్ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ‘పంచ్’ పదును అదుర్స్ (బాక్సింగ్) మనోళ్లపై అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సస్పెన్షన్ కొనసాగుతున్నా... ఈ ప్రభావం భారత బాక్సర్లపై పడలేదు. జూలైలో జోర్డాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో శివ థాపా (56 కేజీలు) స్వర్ణం నెగ్గగా... మన్దీప్ జాంగ్రా (69 కేజీ), దేవేంద్రో సింగ్ (49 కేజీ)లకు రజతాలు, మనోజ్ కుమార్ (64 కేజీలు) కాంస్యం లభించాయి. కజకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. సెర్బియా టోర్నీలో ఏపీ బాక్సర్ లలితా ప్రసాద్ (49 కేజీలు) పసిడి పతకం సాధించగా... సెప్టెంబరులో బల్గేరియాలో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (54 కేజీలు) రజతం గెల్చుకుంది. ‘రాకెట్’తో రఫ్ ఆడించారు (బ్యాడ్మింటన్) బ్యాడ్మింటన్ ప్రపంచంలో తెలుగు తేజం పి.వి.సింధు కొత్త రాకెట్లా దూసుకొచ్చింది. మేలో మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన 18 ఏళ్ల సింధు అదే జోరును కొనసాగించి చైనాలో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. కేంద్ర క్రీడాపురస్కారం ‘అర్జున అవార్డు’ పొందిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి డిసెంబరులో మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. దిగ్గజం ప్రకాశ్ పదుకొనే నుంచి బ్యాడ్మింటన్ భవిష్యత్ తారగా ప్రశంసలందుకుంది. గత ఐదేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా నిలిచిన సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది ఏదీ కలసిరాలేదు. ఆడిన 14 టోర్నమెంట్లలో ఆమె ఒక్కదాంట్లోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ ఆశాకిరణంలా ఎదిగాడు. జూన్‌లో థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన ఈ గుంటూరు జిల్లా క్రీడాకారుడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ రూపంలో మరో భారత ప్లేయర్ సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ టైటిల్ నెగ్గాడు. తెలుగు కుర్రాడు సిరిల్ వర్మ ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్-15 చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు. ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైంది. సైనా నెహ్వాల్ సభ్యురాలిగా ఉన్న ‘పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్’ తొలి ఏడాది చాంపియన్‌గా అవతరించింది. బుల్లెట్ దిగింది (షూటింగ్) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ ఫైనల్స్‌లో సంచలనం సృష్టించింది. నవంబరులో జర్మనీలో జరిగిన సీజన్ ముగింపు టోర్నీలో ఈ పంజాబ్ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకాన్ని నెగ్గింది. పిస్టల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా చరిత్ర సృష్టించింది. పతకం నెగ్గే క్రమంలో హీనా ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్జున్ (చైనా), ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా), రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. ‘లిఫ్ట్’ చేస్తే పతకాలే... (వెయిట్‌లిఫ్టింగ్) భారత వెయిట్లిఫ్టింగ్కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ భవిష్యత్‌పై ఆశలు పెంచాడు. ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా యూత్ క్రీడల్లో, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లలో అతను స్వర్ణ పతకాల పంట పండించాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన శిరీషా రెడ్డి, దీక్షిత కూడా కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు అందించారు. -
భారత్‌కు మరో మూడు పతకాలు
కోల్‌కతా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. చైనీస్ తైపీలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం కాంపౌండ్ ఆర్చర్లు ఒక స్వర్ణం, రజతం, కాంస్యం సాధించారు. ఓవరాల్‌గా రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యంతో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్ టీమ్‌లో అభిషేక్ వర్మ, లిల్లీ చాను పౌనమ్ ఒక్క పాయింట్ తేడాతో ఇరాన్ జోడీని ఓడించి స్వర్ణాన్ని దక్కించుకున్నారు. వ్యక్తిగత విభాగంలో వర్మ 141-144 తేడాతో హమ్జే నెకోయి (ఇరాన్) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడ్డాడు. సెమీస్‌లో ఓడిన సందీప్ కుమార్ 146-141తో చాన్‌చాయ్ వోంగ్ (థాయ్‌లాండ్)ను ఓడించి కాంస్యం సాధించాడు. నేటి (శనివారం)తో ముగిసే ఈ క్రీడల్లో రికర్వ్ విభాగంలో భారత్ బోణీ చేసే అవకాశాలున్నాయి.