కొత్త సీజన్‌కు సిద్ధం | New season starts Premier Badminton League | Sakshi
Sakshi News home page

కొత్త సీజన్‌కు సిద్ధం

Published Wed, Jan 20 2016 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

కొత్త సీజన్‌కు సిద్ధం

కొత్త సీజన్‌కు సిద్ధం

నేటి నుంచి మలేసియా మాస్టర్స్ టోర్నీ
బరిలో శ్రీకాంత్, సింధు
పెనాంగ్ (మలేసియా): రెండు వారాలపాటు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సందడి చేసిన భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. బుధవారం మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’లో పలువురు భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో నందగోపాల్-శ్లోక్ రామచంద్రన్ (భారత్) జోడీ, శైలి రాణే (భారత్) ఓడిపోయారు.

బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో టకూమా ఉయెదా (జపాన్)తో జయరామ్; షో ససాకి (జపాన్)తో సమీర్ వర్మ; వీ ఫెంగ్ చాంగ్ (మలేసియా)తో శ్రీకాంత్; షాజాన్ షా (మలేసియా) సాయిప్రణీత్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్)తో సింధు ఆడనుండగా... మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో మీ కువాన్ చూ-లీ మెంగ్ యిన్ (మలేసియా) జంటతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement