క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్, సింధు | srikanth and pv sindhu enter to quater final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్, సింధు

Published Thu, Jan 26 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్, సింధు

క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్, సింధు

సయ్యద్‌ మోడి బ్యాడ్మింటన్‌ టోర్నీ

లక్నో: భారత నంబర్‌వన్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్, టాప్‌సీడ్‌ పి.వి.సింధు సయ్యద్‌ మోడి గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరితో పాటు భమిడిపాటి సాయిప్రణీత్, సౌరభ్‌ వర్మ, సమీర్‌ వర్మ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడి కూడా క్వార్టర్స్‌ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ శ్రీకాంత్‌ 21–15, 21–16తో అన్సల్‌ యాదవ్‌పై గెలుపొందగా, సింధు 21–7, 21–12తో లలిత దహియాపై నెగ్గింది. మిగతా మ్యాచ్‌ల్లో శ్రీకృష్ణప్రియ 23–21, 21–19తో ముగ్ధ అగ్రేపై, తొమ్మిదో సీడ్‌ సాయిప్రణీత్‌ 21–17, 21–19తో ఐదో సీడ్‌ అండర్స్‌ అంటన్సెన్‌ (డెన్మార్క్‌)కు షాకిచ్చాడు.

11వ సీడ్‌ సౌరభ్‌ వర్మ 21–14, 21–16తో లక్ష్యసేన్‌పై గెలువగా... ఆరో సీడ్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌కి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్స్‌లో హర్షిల్‌ డాని 21–18, 21–18తో ప్రణయ్‌ని ఇంటిదారి పట్టించాడు. 8వ సీడ్‌ సమీర్‌ వర్మ 21–15, 21–16తో వీ ఫెంగ్‌ చోంగ్‌ (మలేసియా)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్‌ మను అత్రి–సుమిత్‌ రెడ్డి జంట 15–21, 21–17, 17–21తో మహ్మద్‌ ఆరిఫ్‌–కిమ్‌ వా లిమ్‌ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి– అశ్విని జంట 21–7, 21–10తో డింపాల్‌ హజరికా–సంఘమిత్ర జోడీపై గెలిచింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement