షెన్‌జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్‌లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) ద్వయం 15–21, 9–21తో షు జియాన్ జాంగ్–యు జెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment