విజయాలతో కొత్త ఉత్సాహం...
‘శ్రీకాంత్ కెరీర్‌లో ఇది అద్భుతమైన క్షణం. ఈ రోజు అతను చాలా బాగా ఆడాడు. దూకుడు మొదటి నుంచి అతనికి అలవాటే కానీ దానికంటే ఫైనల్లో నెట్ వద్ద అతని ఆట, డ్రాప్ షాట్‌లు నన్ను ఆకట్టుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఆటలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు శ్రీకాంత్ ఎంతో కష్టపడ్డాడు.
వంద శాతం పర్‌ఫెక్ట్ అని చెప్పనుకానీ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎవరినైనా ఓడించగల సత్తా తనకు ఉందని అతను నిరూపించాడు. శ్రీకాంత్‌తోపాటు ఇటీవల ప్రణయ్, సాయిప్రణీత్ సాధించిన విజయాలు మాకందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మూడు నెలల క్రితం కేవలం పురుషుల సింగిల్స్ కోసమే నలుగురు కొత్త కోచ్‌లను తీసుకున్నాం. ముల్యో హొండోయో, హరియవన్ (ఇండోనేసియా), అమ్రిష్ షిండే, సిద్ధార్థ్ జైన్ (భారత్) ప్రత్యేకంగా ఈ షట్లర్లపై దృష్టి పెట్టడమే ఇటీవల మనకు వచ్చిన ఫలితాలకు కారణం. వీరి వల్ల నాపై కూడా భారం తగ్గి ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ గురించి శ్రద్ధ తీసుకునేందుకు ఆ సమయం కలిసి వస్తోంది.
– – పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్