Pullela Gopichand
-
ఆటలకు ఆస్తులతో పనేంటి?
న్యూఢిల్లీ: క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే ముందు మధ్య తరగతి వర్గాల వారు తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని... ఆర్థికపరంగా మంచి స్థాయిలో ఉన్నవారి పిల్లలే ఆటల వైపు రావాలంటూ భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గోపీచంద్ మాటలతో ఏకీభవిస్తుండగా, మరికొందరు వాటిని తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, స్టార్ షట్లర్ పీవీ సింధు తండ్రి పీవీ రమణ దీనిపై స్పందించారు. ఆటగాడిగా ఎదిగేందుకు ధనవంతులు కావడం ముఖ్యం కాదని... ప్రతిభ ఉంటే దూసుకుపోవచ్చని అభిప్రాయపడ్డారు. తానూ దిగువ స్థాయి నుంచే వచ్చి ఆటగాడిగా ఎదిగానని... సింధును క్రీడల వైపు మళ్లించినప్పుడు కూడా తన వద్ద పెద్దగా డబ్బేమీ లేదని ఆయన స్వీయానుభవాన్ని పంచుకున్నారు. ‘నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. 10 మంది సంతానంలో నేను అందరికంటే చిన్నవాడిని. కానీ అన్నలు, అక్కలు నాకు ఎంతో అండగా నిలిచి జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడేందుకు సహకరించారు. ఆట కారణంగానే నాకు రైల్వేస్‌లో ఉద్యోగం వచ్చింది. మీరు దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతికి చెందినా... ఆటల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. చిన్నారులు అన్ని రకాలుగా ఎదిగేందుకు కూడా క్రీడలు ఉపయోగపడతాయి’ అని రమణ వివరించారు. 1986 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో రమణ సభ్యుడిగా ఉన్నారు. తన పెద్ద కూతురు చదువులో చురుగ్గా ఉందని ఆమెను డాక్టర్ అయ్యేలా ప్రోత్సహించానని, సింధుకు బ్యాడ్మింటన్‌లో ఎంతో ప్రతిభ ఉందనే విషయం ఆరంభంలో గుర్తించామని ఆయన అన్నారు. ‘ప్రతిభ ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తుంది. దానిని ఎవరూ దాచి ఉంచలేరు. తల్లిదండ్రులు తగిన రీతిలో మార్గనిర్దేశనం చేయాలి. ఒక క్రీడాకారుడు మరొకరిని క్రీడల్లోకి రావద్దంటూ హెచ్చరించడం సరైంది కాదని నా అభిప్రాయం’ అని గోపీచంద్ వ్యాఖ్యలను రమణ వ్యతిరేకించారు. తనకు రైల్వేలో ఉద్యోగం ఉండటం వల్లే సింధు కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘క్రీడల ద్వారా ఉద్యోగం తెచ్చుకోవడం మధ్యతరగతి వారి దృష్టిలో పెద్ద ఘనత. అలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రైల్వేలోనే వేలాది మంది క్రీడాకారులు ఉద్యోగాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పెద్ద చదువులు చదివే అవకాశం కూడా లభిస్తుంది. కోచ్‌లు ఈ విషయంలో వారికి సరైన దారి చూపిస్తే చాలు’ అని రమణ పేర్కొన్నారు. ఇటీవల ఒక యువ షట్లర్‌కు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం లభించే విధంగా తాను తగిన విధంగా మార్గనిర్దేశనం చేసినట్లు రమణ వెల్లడించారు. డబ్బున్న వారే ఆటల్లోకి రావాలంటూ సూచించడం సరైంది కాదని ఆయన అన్నారు. సింధు కెరీర్ ఆరంభంలో తాము రైలు ప్రయాణాలు చేస్తే కొందరు విమానాల్లో వచ్చేవారని... ఇప్పుడు సింధు ఏ స్థాయికి చేరుకుందో చూడాలని రమణ వ్యాఖ్యానించారు. -
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్‌లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్‌గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్‌పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్ -
చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం
గతేడాదిలో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తిని చిరంజీవి అభినందించారు. ఈ విషయన్ని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇలా తెలిపారు.'ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ అనే చిన్న గ్రామంలో జన్మించిన జీవాంజీ దీప్తి దేశానికి ఎంతో పేరు తెచ్చింది. అయితే, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవి గారిని కలవాలని ఉందని చెప్పారు. ఇటీవల నేను చిరంజీవిగారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జవాంజి గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్మెంట్ చేసినప్పుడు, ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు. అన్నట్లుగానే చిరంజీవిగారు మా అకాడమీకి వచ్చి, అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. రెండు గంటల పాటు అక్కడే గడిపారు. అలాగే ప్రతి ప్లేయర్‌ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తికి అందించటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా క్రీడాకారులకు చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్స్పిరేషన్తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను.' అని ఆయన అన్నారు.దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు రూ. కోటి2024లో పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో జీవాంజీ దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి కాంస్యం సాధించారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆమె విజయంలో పుల్లెల గోపీచంద్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. ఆపై దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.కూతురి కోసం పొలం అమ్మేసిన తండ్రిజీవాంజీ దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మిల శ్రమ ఆమె విజయంలో ఎక్కువగా ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన దీప్తి మానసిక వైకల్యంతో చాలా ఇబ్బందులు పడింది. మేధోపరమైన బలహీనత ఉండడంతో ఆమె కోసం తండ్రి యాదగిరి చాలా తల్లడిల్లిపోయారు. చిన్నతనంలో కూతురుకు ఫిట్స్ వస్తే వారు విలవిలలాడిపోయేవారు. అయితే, దీప్తి క్రీడల్లో మాత్రం చాలా చురుకుగా ఉండేది. దీంతో ఆమె సంతోషం కోసం ఆ తండ్రి డబ్బులకు వెనకాడలేదు. తనకున్న ఎకరం పొలాన్ని కూతురి కోసం అమ్మేశారు. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దీప్తి తిరుగులేని విజయాన్ని దేశానికి అందించింది. -
డాక్టర్ పుల్లెల గోపీచంద్!
బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు మరో గౌరవం దక్కింది. కర్ణాటకకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. మంగళవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. జాతీయ అభివృద్ధిలో క్రీడల ద్వారా తనదైన పాత్ర పోషించినందుకు గోపీచంద్‌ను డాక్టరేట్ కోసం ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. గోపీచంద్‌తో పాటు మరో నలుగురు కూడా దీనిని అందుకున్నారు. -
Gymnastics: విజేతగా నిషిక ప్రవీణ్ అగర్వాల్
CBSE Gymnastics Championship 2022: హైదరాబాద్‌లోని గాడియమ్ స్కూల్లో సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా 750 పాఠశాలలకు చెందిన 1700 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అండర్–17 ఆల్‌రౌండ్ కేటగిరీలో గాడియమ్ స్కూల్‌కే చెందిన నిషిక ప్రవీణ్ అగర్వాల్ మొదటి స్థానంలో, నారాయణి మూడో స్థానంలో నిలిచారు. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో అరవిందో ఫార్మా డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు! -
‘ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా అవసరం’
సాక్షి, హైదరాబాద్: పాఠశాల, కళాశాలలో యోగా నేర్చుకొనేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని హైకోర్టు జడ్జీ వేణుగోపాల్ కోరారు. ఈ సందర్భంగా ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం నిర్మాణం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. 2050 భారతదేశం గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో వేణుగోపాల్ పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అందించే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన యోగాథాన్ కార్యక్రమంలో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగథాన్‌లో 108 సూర్య నమస్కారాల ఛాలెంజ్ నిర్వహించారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం నిరంతరం యోగా చేయటాన్ని అలవాటుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేకమైన పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వేలాదిమంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు. నగరంలోని ప్రముఖ కళాశాలల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు గోల్డ్ ఛాలెంజ్ విభాగంలో 108 సార్లు, సిల్వర్ ఛాలెంజ్ విభాగంలో 54 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. -
నా విజయం వెనుక గోపిచంద్ కృషి ఎంతో ఉంది
-
అమిత్‌షాతో పుల్లెల గోపీచంద్ భేటీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ భేటీ అయ్యారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌షా బిజీ షెడ్యూల్ మధ్య శనివారం గోపీచంద్‌ను ప్రత్యేకంగా కలుసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భేటీ అనంతరం గోపీచంద్ స్పందిస్తూ ఇద్దరం మర్యాదపూర్వకంగా కలిశామని.. తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. కేవలం క్రీడా పథకాలు, ప్రోత్సాహకాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ముందస్తు షెడ్యూల్ లేకుండానే ఈ భేటీ జరగడం గమనార్హం. గోపీచంద్ మాజీ శిష్యురాలు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రెండేళ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రజల్లో ఆదరణ, గుర్తింపు ఉన్న వివిధ రంగాల వారిని బీజేపీలో చేర్చుకోవడం, వారితో ఎన్నికలప్పుడు ప్రచారం లేదా వారి అభిమానులు, ఇతర వర్గాల వారికి దగ్గరయ్యేందుకే వరస భేటీలు జరుగుతున్నాయని చెబుతున్నారు. -
అమిత్ షాతో పుల్లెల గోపీచంద్ భేటీ.. పొలిటికల్ మీటింగ్?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. గత పర్యటనలో కూడా అమిత్ షా.. సినీ నటులతో సమావేశమయ్యారు. కాగా, అమిత్ షా పర్యటన సందర్భంగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ఆయనను కలిశారు. వీరి భేటీ అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ.. క్రీడలకు కేంద్రం సహకారంపైనే అమిత్ షాతో చర్చించాను. అమిత్ షాతో రాజకీయం అంశాలు చర్చకు రాలేదు. క్రీడాకారులకు వర్తించే కేంద్ర పథకాలపైనే చర్చించినట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా అమిత్ షా పలువురిని కలిశారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: టాలీవుడ్ హీరోలతో బీజేపీ అగ్ర నేతల భేటీలు.. అందుకేనా? -
అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి. మరొకరి తల్లిదండ్రులు రోజూవారీ కార్మికులు. ఇంకొకరిది కూడా కడు పేదరికం. కానీ ఇలాంటి స్థితినుంచి వచ్చి కూడా వారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే మన అథ్లెట్లను చూస్తే నాకు గౌరవం, గర్వం కలుగుతాయి. వారి శ్రమను ప్రత్యేకంగా అభినందించాలని అనిపిస్తుంది’ అని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. బ్యాడ్మింటన్ సహా కొన్ని ఇతర క్రీడల్లో కనీస స్థాయినుంచి మొదలు పెట్టి మరింతగా పైకి ఎదుగుతారని... కానీ కనీస సౌకర్యాలు లేని నేపథ్యంనుంచి వచ్చి అథ్లెట్లు సాధించే సాధారణ విజయాలను కూడా చాలా గొప్పగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గోపీచంద్–మైత్రా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లను సన్మానించారు. దాదాపు ఏడేళ్ల క్రితం.. యువ క్రీడాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘మైత్రా ఫౌండేషన్’తో జత కట్టానని, అది మంచి ఫలితాలు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్... ప్రభుత్వ సంస్థలు ‘సాయ్’, ‘శాట్స్’ అధికారికంగా ఇచ్చే సౌకర్యాలతో పాటు కీలక సమయాల్లో ఆటగాళ్లకు డైట్, ఫిట్నెస్, ఫిజియో తదితర అంశాల్లో ‘మైత్రా’ సహకారం అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన యెర్రా జ్యోతి, ద్యుతీచంద్లతో పాటు అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన ఎ.నందిని, కె.రజితలకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఇతర అథ్లెట్లు జ్యోతికశ్రీ, ఎన్.ఎస్. శ్రీనివాస్, ప్రణయ్, అనూష, దిల్ఖుష్ యాదవ్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌లతో పాటు ‘మైత్రా’ గ్రూప్ చైర్మన్ రవి కైలాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు' KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు.. -
Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు బహుమతిగా కారు
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక బహుమతిగా కారును ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా దీనిని అందజేశారు. కాగా తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 52 కేజీల ఫ్లయ్ వెయిట్ విభాగంలో ఆమె జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌తో జరిగిన టైటిల్ పోరులో 5–0తో గెలుపొంది ‘స్వర్ణ’ చరిత్ర లిఖించింది. యావత్ భారతావని పులకించేలా ‘పసిడి పంచ్’తో మెరిసింది. చదవండి 👇 IPL 2022 Prize Money: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే! IPL 2022 Final - Hardik Pandya: శెభాష్.. సీజన్ ఆరంభానికి ముందు సవాళ్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు! -
థామస్ కప్ విజయంపై పుల్లెల గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు
థామస్ కప్ 2022లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్య పౌరుల దాకా అందరూ టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. టీమిండియా సాధించిన అపురూప విజయంపై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందిస్తూ.. బ్యాడ్మింటన్‌కు ఈ విజయం 1983 క్రికెట్ వరల్డ్‌కప్ విజయం కంటే గొప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిస్తే.. తాజాగా కిదాంబి శ్రీకాంత్ నేతృత్వంలోని టీమిండియా సైతం 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో చిత్తు చేసి బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసిందని అన్నాడు. 1983 వరల్డ్‌కప్ గెలిచాక భారత క్రికెట్ రూపురేఖలు ఎలా మారిపోయాయో.. థామస్ కప్ గెలుపుతో భారత బ్యాడ్మింటన్‌కు కూడా శుభ ఘడియలు మొదలయ్యాయని తెలిపాడు. థామస్ కప్ విజయం ఇచ్చిన స్పూర్తితో భారత షట్లర్లు మున్ముందు మరిన్ని సంచనాలు నమోదు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత బృందానికి నాయకత్వం వహించిన కిదాంబి శ్రీకాంత్‌ను గోపీచంద్ ప్రత్యేకంగా అభినందించాడు. చదవండి: Thomas Cup 2022: షటిల్ కింగ్స్ -
భారత బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడిగా పుల్లెల గోపీచంద్
జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ‘బాయ్’ సాధారణ సర్వ సభ్య సమావేశంలో హిమంత బిశ్వశర్మను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2026 వరకు కొనసాగనున్న ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శలు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్‌దాస్ లఖాని ఎన్నికయ్యారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
స్క్రీన్ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు
సినిమాకి ఓ కథ ఉంటుంది. ఆ కథకు ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అదే స్క్రీన్ పై ఓ ‘ప్లే’ ఉంటే... స్క్రీన్ పై ఆట ఆడేవారికి ఓ కిక్కు.. చూసేవారికి మరింత కిక్కు. అలాంటి కిక్ ఇవ్వడానికి తెలుగు స్పోర్ట్స్ మూవీస్ కొన్ని రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలేంటో ఓసారి చదివేద్దాం. ప్రొఫెషనల్ బాక్సర్‌గా.. ఇప్పటివరకూ లవర్ బాయ్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ వెండితెరపై తన పంచ్ పవరేంటో చూపించేందుకు ‘లైగర్’లో బాక్సర్‌గా మారారు. హీరోలను తనదైన శైలిలో పవర్‌ఫుల్‌గా చూపించే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్‌లా కనిపించేందుకు విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్‌తో ఈ సినిమాలో ఢీ కొట్టారు విజయ్. టైసన్ నటించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. థాయిల్యాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు సినీ లవర్స్ అటు బాక్సింగ్ లవర్స్ ఈ స్క్రీన్ ప్లేని ఆగస్ట్ 25న చూడనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్‌లో గని పంచ్ వేసవిలో తన పంచ్ పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు గని. బాక్సర్ గని పాత్రలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గని’. ఇప్పటివరకూ లవ్‌స్టోరీలు, ఫ్యామిలీ మూవీస్ చేసిన వరుణ్ ‘గని’లోని పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. ‘గని’ పంచ్ పవర్ ఎలా ఉంటుందో చూడాలంటే ఏప్రిల్ 8 వరకూ ఆగాల్సిందే. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఇందులో సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రధారులు. ఈసారి గోల్‌పై గురి ‘మజిలీ’లో క్రికెటర్‌గా కనిపించి, మంచి కలెక్షన్ల స్కోర్ తెచ్చుకున్న నాగచైతన్య తన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’లో గోల్‌పై గురి పెట్టారు. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇది. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చైతూ మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నారని టాక్. వాటిల్లో ఒకటి హాకీ ప్లేయర్ అని తెలుస్తోంది. నాగచైతన్య హాకీ ఆడుతున్న సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అయింది కూడా. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మిల్కీ బ్యూటీ.. బబ్లీ బౌన్సర్ ఓ వైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘బబ్లీ బౌన్సర్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపిస్తారు. అయితే బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. బౌన్సర్ నుంచి బాక్సర్‌గా మారే క్యారెక్టర్లో తమన్నా కనిపిస్తారని సమాచారం. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. బ్యాడ్మింటన్ నేపథ్యంలో.. సుధీర్‌బాబు డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ప్రముఖ బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఒకటి. సుధీర్–గోపీచంద్ ఇద్దరూ కలిసి బ్యాడ్మింటన్ ఆడారనే విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ నుంచి సినిమాల్లోకి వచ్చారు సుధీర్. ఇక పుల్లెల బయోపిక్‌ని ఎప్పుడో ప్రకటించినా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే సుధీర్ బ్యాడ్మింటన్ రాకెట్‌తో షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. -
తప్పులు సరిదిద్దుకోవాలి: గోపీచంద్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్‌పై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకుని వరుస మ్యాచ్‌లలో విజయం సాధించడం శుభపరిణామం అన్నాడు. అయితే, ఈ ఏడాది ఆరంభంలో శ్రీకాంత్‌లో ఆత్మవిశ్వాసం తక్కువగా కనిపించిందన్న గోపీచంద్.. టోర్నీలు ఆడుతున్నకొద్దీ ఆట మెరుగు కావడంతో తనపై తనకు నమ్మకం పెరిగిందని తెలిపాడు. సరైన సమయంలో చెలరేగి విజయం సాధించాడని... అయితే వచ్చే ఏడాది మరిన్ని టోర్నీలు గెలవాలంటే శ్రీకాంత్ తాను చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని గోపీచంద్ సూచించాడు. ఏదేమైనా ఈ టోర్నీలో శ్రీకాంత్‌తో పాటు లక్ష్య సేన్, ప్రణయ్‌ల ప్రదర్శన పట్ల కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించగా.. లక్ష్యసేన్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! Kidambi Srikanth 🇮🇳 and Loh Kean Yew 🇸🇬 are as cool as cucumbers in this spectacular rally.#TotalEnergiesBadminton #BWFWorldChampionships #Huelva2021 pic.twitter.com/0FS7OzBCb1 — BWF (@bwfmedia) December 20, 2021 -
అలా సిద్ధమయ్యాకే సినిమా చేస్తా: హీరో శర్వానంద్
Sharvanand Interesting Comments In Lakshya Pre Release Function: యంగ్ హీరో నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. క్రీడా నేపథ్యంతో వస్తోన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం (డిసెంబర్ 5) జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపించద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ 'క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ జోనర్లో వచ్చిన సినిమాలు ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోంది. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస్తా. అఖండ విజయం సీజన్‌కు మంచి సంకేతం. నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలి. బాలీవుడ్‌కు కూడా వెళ్లిపోవాలి.' అని తెలిపారు. లక్ష్య సినిమా చేస్తూ ఎంతో నేర్చుకున్న అని హీరో నాగశౌర్య అన్నారు. ఏ సమస్య వచ్చినా సరే నిర్మాతలు తనకోసం నిలబడ్డారని తెలిపారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త, అందులోనే విజయం ఉందన్నారు. భారతీయ క్రీడా సినిమాల్లో నిలిచిపోయే మరో చిత్రం 'లక్ష్య' కావాలని కోరుకుంటున్నా అని పుల్లెల గోపించంద్ అన్నారు. 'నా తొలి సినిమా సుబ్రమణ్యపురం. తర్వాత సునీల్ నారంగ్ నన్ను పిలిచి ఈ అవకాశమిచ్చారు. ఏడున్నర గంటలు కథ విని ఈ సినిమా చేశారు నాగశౌర్య. సినిమా అనేది కళారూపం. దానికి ఆక్సిజన్ థియేటర్ వ్యవస్థ. ఆ ఆక్సిజన్ అందజేసే వ్యక్తి నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్.' అని లక్ష్య చిత్రం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘గోపీచంద్ మరిన్ని విజయాలు అందించాలి’
సాక్షి, హైదరాబాద్: భారత క్రీడారంగంలో ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కొందరు మాత్రమే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆట కోసమే శ్రమించారని... వారిలో పుల్లెల గోపీచంద్‌ది ప్రత్యేక స్థానమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ప్రశంసించారు. బ్యాడ్మింటన్ పట్ల గోపీచంద్‌కు ఉన్న అంకితభావం నేడు ప్రపంచం గర్వించదగ్గ చాంపియన్లను తయారు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్లేయర్‌గా, కోచ్‌గా గోపీచంద్ కెరీర్‌లోని కొన్ని కీలక అంశాలు, విశేషాలతో రాసిన ‘షట్లర్స్ ఫ్లిక్: మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్’ పుస్తకాన్ని శుక్రవారం కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గోపీచంద్ శ్రమ, ప్రణాళిక కారణంగానే బ్యాడ్మింటన్ క్రీడకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం తర్వాత భారత క్రీడాకారులు సాధించిన విజయాలన్నీ వ్యక్తిగత ప్రతిభతోనే వచ్చాయని, ప్రభుత్వ వ్యవస్థ ఎవరినీ తయారు చేయలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్వయంగా తమ ప్రభుత్వం కూడా క్రీడలను ప్రాధాన్యత అంశంగా గుర్తించలేదని, ఇకపై పరిస్థితి మారుతుం దని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గోపీచంద్ ఆలోచనలకు రచయిత్రి ప్రియా కుమార్ పుస్తక రూపం ఇచ్చారు. ఇది పూర్తిగా తన ఆటోబయోగ్రఫీ కాదని గోపీచంద్ స్పష్టం చేశారు. ‘ఇది జీవిత చరిత్రలాంటి పుస్తకం కాదు. ఆటగాడిగా, కోచ్‌గా కెరీర్లో విభిన్న రకాల అనుభవాలు ఎదుర్కొన్నాను. ఇందులో పలు సవాళ్లు కూడా ఉన్నాయి. వాటిని ఆయా సందర్భాలకు తగినట్లుగా వ్యవహరించి ఎలా అధిగమించానో, వాటిలో స్ఫూర్తిగా నిలిచే అంశాలు ఈతరం క్రీడాకారులకు పనికొస్తాయనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశాం. ఇది బ్యాడ్మింటన్‌కు సంబంధించింది మాత్రమే కాదు. అన్ని రకాల క్రీడాంశాలకు కూడా ఈ పుస్తకంలో తగిన సమాధానాలు లభిస్తాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో బ్యాడ్మింటన్ బాగా అభివృద్ధి చెందింది. శిక్షకుడిగా నా వృత్తిలో పలువురు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచే ఎదురైన ప్రశ్నలకు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను’ అని ఆయన వెల్లడించారు. రచయిత్రి ప్రియా కుమార్ మాట్లాడుతూ... ‘ఒక సాధారణ వ్యక్తి విజేతగా నిలిచేందుకు ఎంత గా కష్టపడ్డాడో, దాని నుంచి ఎలా స్ఫూర్తి పొంద వచ్చో అనే విషయాన్నే ఇందులో ప్రముఖంగా ప్రస్తావించాం. రచనా శైలి కూడా అంశాల వారీగా ఉంటుంది. అనేక అంశాలపై గోపీచంద్ ఆలోచనలను పుస్తకంగా మార్చేందుకు మూడేళ్లు పట్టింది’ అని పేర్కొంది. సైమన్ అండ్ షుస్టర్ పబ్లిషర్స్ ఈ ‘షట్లర్స్ ఫ్లిక్’ను ప్రచురించింది. -
స్వర్ణ పతకం ఫేవరెట్స్‌లో సింధు: గోపీచంద్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు స్వర్ణ పతకం గెలిచే సత్తా ఉందని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. సింధుతోపాటు ఇతర క్రీడాంశాల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని గోపీచంద్ అభిప్రాయపడ్డారు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి క్రీడాకారులకు కావాల్సినంత మద్దతు లభించిందని... ఈసారి భారత్‌కు రెండంకెల్లో పతకాలు వస్తాయని తాను ఆశిస్తున్నాననని గోపీచంద్ పేర్కొనాడు. -
పుల్లెల గోపిచంద్ అకాడమీతో పనిచేయనున్న కోటక్ బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: టోక్యోలో జరగబోయే ఒలంపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి భారత బృందం సిద్ధమవుతుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎమ్‌బిఎల్), పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (గోపిచంద్ అకాడమీ) సంయుక్తంగా ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఒలంపిక్స్‌లో పాల్గొనే మహిళా అథ్లెట్లలో స్పూర్తిని నింపడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశ్యం. భారత అత్యుత్తమ మహిళా అథ్లెట్లకు, వారి అడుగుజాడల్లో నడుచుకోవాలని కలలు కనే యువతులందరికీ ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్ ప్రత్యేక సందేశాన్ని అందిస్తోంది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్-2010లో గోల్డ్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప, సౌత్ ఏసియన్ గేమ్స్-2016లో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సిక్కిరెడ్డి ప్రచార వీడియోలో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఒక నిమిషంపాటు ఉన్న ఈ వీడియోలో.. తమ కలలను అనుసరించే యువతులను గౌరవించడంతోపాటు, వారి కలలను నిజం చేయడానికి కృషి చేసిన వ్యక్తులను గౌరవిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ జాయింట్ ప్రెసిడెంట్ & గ్రూప్ చీఫ్ సిఎస్ఆర్ ఆఫీసర్ రోహిత్ రావు మాట్లాడుతూ... కోటక్ మహీంద్రా బ్యాంక్ సామాజిక బాధ్యతగా భావించి కోటక్ కర్మను ప్రకటించాము. కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద కోటక్ మహీంద్రా బ్యాంక్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనుంది. ఆధునాతన మౌలిక సదుపాయాలను, ఆత్యాధునిక బాడ్మింటన్ శిక్షణా సదుపాయాలను కోటక్ కర్మ అభివృద్ది చేసింది. క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలను కల్పిండంతో భారత్‌ను క్రీడా రంగంతో గర్వించదగిన దేశంగా చూడవచ్చునని పేర్కొన్నారు. -
టోక్యో ఒలింపిక్స్‌కు కోచ్ గోపీచంద్ దూరం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈసారి ఒలింపిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే శిక్షణ సహాయ సిబ్బందిని అనుమతిస్తుండటంతో ఆయన గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. జాతీయ కోచ్‌గా ఆయనకు అవకాశమున్నప్పటికీ సింగిల్స్ ప్లేయర్ సాయిప్రణీత్ వ్యక్తిగత కోచ్ అగుస్ వి సాంటోసాకు చాన్స్ ఇవ్వాలని గోపీ తప్పుకున్నారు. ఒక్కో క్రీడాంశానికి గరిష్టంగా ఐదుగురు (ముగ్గురు కోచ్‌లు, ఇద్దరు ఫిజియోలు) సహాయ సిబ్బంది మాత్రమే టోక్యోకు వెళ్లేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అనుమతిస్తోంది. పీవీ సింధు వెంట వ్యక్తిగత కోచ్ తే సాంగ్ పార్క్... డబుల్స్ జంట సాతి్వక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి వెంట కోచ్ మథియాస్ బో... ఇద్దరు ఫిజియోలు (సుమాన్ష్ శివలంక, బద్దం ఇవాంజలైన్) వెళ్లనున్నారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఏడుగురు కోచ్‌లు వెళ్లేందుకు అవకాశమివ్వాలని ఐఓఏకు లేఖ రాసింది. కానీ ప్రస్తుత కరోనా ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్ల సంఖ్యలో 33 శాతానికి మించి సహాయ సిబ్బందిని పంపే వీలులేకపోవడంతో ‘బాయ్’ వినతిని ఐఓఏ తోసిపుచ్చింది. -
విదేశీ కోచ్‌లు కాదు... వ్యవస్థ బాగుండాలి
న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విదేశీ కోచ్‌ల రాకతో మొత్తం మారిపోతుందనుకుంటే పొరపాటని... ముందు వ్యవస్థ బాగుంటేనే అన్ని బాగుంటాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ‘మన క్రీడా ప్రగతికి విదేశీ కోచ్‌లు కీలక భూమిక పోషిస్తారు. నిజానికి వారి సేవలు అవసరం కూడా.... భిన్నదేశాలకు చెందిన కోచ్‌ల మేళవింపు మనకు మేలు చేస్తుంది. క్రీడల్లో మనకు నైపుణ్యం లేని చోట ప్రారంభ దశలో విదేశీ సహాయ బృందాలు కావాల్సిందే. అయితే విజయవంతంగా రాణిస్తున్న జట్లకూ విదేశీ కోచ్‌లే ఉండాలంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. దీని వల్ల మన వ్యవస్థకు న్యాయం జరగదు. విదేశీ కోచ్‌లను సలహాదారులుగా వినియోగించుకోవచ్చు. కానీ ముఖ్యమైన కోచింగ్ బాధ్య తలు, అధికారాలు స్వదేశీ కోచ్‌లకే అప్పజెప్పాలి. ఆటగాళ్లు విదేశీ కోచ్‌ల నుంచి నేర్చుకోవడం ముఖ్యమే. అలాగే ఎప్పుడో ఒకప్పుడు వాళ్లను వదులుకోవాలి. ఎందుకంటే వాళ్లు మనల్ని ద్వితీయ శ్రేణి జట్టుగానే తయారు చేస్తున్నారు. కారణం వాళ్లూ ద్వితీయ శ్రేణి కోచ్‌లే! వాళ్ల దేశంలోని అత్యుత్తమ కోచ్‌లు వారి ఆటగాళ్లకు సేవలందిస్తారు. రెండో ఉత్తమ కోచ్‌లు ఇతర దేశాలకు తరలి వెళతారు’ అని ఆయన వివరించారు. -
క్రీడాకారులందరికీ టీకాలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ కోచ్ గోపీచంద్ పర్యవేక్షణలో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న క్రీడాకారులు సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలతోపాటు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఇతర క్రీడాకారులతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడాకారులకు కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని.... క్రీడాకారుల జాబితాను సిద్ధం చేసి వారికి లాల్‌బహదూర్ స్టేడియంలో టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలలో జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. చదవండి: BAN Vs SL: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్; అలా అయితే ఇంకా సంతోషించేవాడిని! -
‘షటిల్’ ఎగరడమే ముఖ్యం!
కరోనా కారణంగా ఆగిపోయిన క్రీడా ప్రపంచం మళ్లీ దారిలోకి పడుతున్న వేళ వచ్చే జనవరిలో ఒకే వేదికపై మూడు టోర్నీలు ఆడేందుకు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఆట జరగడమే సంతోషించదగ్గ పరిణామమని, అంతా బాగున్నట్లు అనిపిస్తేనే మరిన్ని టోర్నమెంట్లకు అవకాశం ఉంటుందని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. కోవిడ్–19 కారణంగా స్తబ్దత ఏర్పడినా... అగ్రశ్రేణి ఆటగాళ్లు దానిని తట్టుకోగలిగారని, తర్వాతి స్థాయిలోని ప్లేయర్ల కెరీర్‌పై మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన అన్నారు. తాజా పరిణామాలపై ‘సాక్షి’తో గోపీచంద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... –సాక్షి, హైదరాబాద్ మన ఆటగాళ్లలో దాదాపు అందరికీ మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీనే చివరిది. శ్రీకాంత్ సహా మరికొందరు మాత్రం ఆ తర్వాత డెన్మార్క్ ఓపెన్‌లో ఆడారు. అయితే భారత షట్లర్లందరూ కరోనా కష్టకాలం తర్వాత మొదటిసారి ఒక మేజర్ టోర్నీలో ఆడనున్నారు. బ్యాంకాక్‌లో రెండు సూపర్–1000 టోర్నీలు, ఆ తర్వాత బీడబ్లూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ ఉన్నాయి. అక్కడ కోవిడ్–19 కేసుల సంఖ్య ఇతర బ్యాడ్మింటన్ దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండటంతో ఒకే చోట మూడు టోర్నీలకు అవకాశం కల్పించారు. 2020లో తక్కువ టోర్నమెంట్లు జరిగినా... వాటి ఆధారంగానే ఫైనల్స్ కోసం పాయింట్లు తీసుకుంటున్నారు. జనవరి 3న షట్లర్లు థాయ్‌లాండ్ చేరుకొని వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. ఆ తర్వాత బయో బబుల్ వాతావరణంలోనే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే ఫుట్‌బాల్, టెన్నిస్‌లాంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక బ్యాడ్మింటన్ మాత్రం ఎందుకు ఆగాలి? కొంత ‘రిస్్క’ ఉన్న మాట వాస్తవమే అయినా ఎంత కాలం ఆడకుండా ఉండగలరు? సన్నాహాలపై... మా అకాడమీకి చెందిన ఆటగాళ్లు అన్ని జాగ్రత్తలతో సాధన చేస్తున్నారు. సీనియర్లు రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌కు హాజరవుతున్నారు. వీరిపై దృష్టి పెట్టేందుకు అకాడమీలో ఇతర ఆటగాళ్ల సంఖ్యను ప్రస్తుతానికి బాగా తగ్గించాం. హాస్టల్లో కూడా తక్కువ వయసువారిని ఎవరినీ అనుమతించడం లేదు. సింధు కూడా లండన్‌లో తన ప్రాక్టీస్ బాగా సాగుతోందని సమాచారమిచ్చింది. అయితే ఇప్పుడున్న స్థితిలో అద్భుత ప్రదర్శనలు వస్తాయని ఆశించరాదు. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో కోర్టులో ఆడటం అంత సులువు కాదు. ఫలితాలకంటే ఆట జరుగుతోందని సంతోషించాల్సిన సమయమిది. చీఫ్ కోచ్ బాధ్యతల నిర్వహణపై... ఎప్పటి వరకు కోచ్‌గా కొనసాగాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారికంగా 2022 వరకు నా పదవీ కాలం ఉంది. ప్రత్యేకంగా విదేశీ కోచ్‌లను నియమించుకున్న తర్వాత నాపై కొంత భారం తగ్గింది. ప్రస్తుతం ముగ్గురు ఇండోనేసియన్లు, ఒక కొరియన్ కోచ్ మన జట్టుతో పని చేస్తున్నారు. టోర్నీలకు కూడా వారే వెళ్తుండటంతో ఇతర ఆటగాళ్లపై మరింతగా దృష్టి పెట్టేందుకు నాకు తగినంత సమయం లభిస్తోంది. కరోనా తర్వాత ఆట పరిస్థితి... ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. అందులో క్రీడలు కూడా ఒకటి. అయితే వ్యక్తిగత క్రీడ అయిన బ్యాడ్మింటన్‌ను విడిగా చూస్తే... అగ్రశ్రేణి షట్లర్లకు పెద్దగా సమస్యలు రాలేదు. నా విశ్లేషణ ప్రకారం ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది స్పాన్సర్‌షిప్‌లు కోల్పోయారు. పలువురిని కంపెనీలు ఉద్యోగాల్లోంచి తొలగించాయి. కొన్నాళ్ల క్రితం వరకు క్రీడాకారులకు అమిత గౌరవం ఇచ్చిన కార్పొరేట్ కంపెనీలు కూడా తమ నష్టాలు చూపిస్తూ వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాయి. 2021లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. గోపీచంద్‌పై డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆధ్వర్యంలోని అధికారిక ఓటీటీ సంస్థ ‘ఒలింపిక్ చానల్’ పుల్లెల గోపీచంద్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్ కొనసాగుతోంది. గోపీచంద్ ఇస్తున్న శిక్షణ, ఆటగాళ్లు సాధించిన ఫలితాలు, ఆయన ఇద్దరు శిష్యులు (సైనా, సింధు) ఒలింపిక్ పతకాలు గెలుచుకోవడం వరకు వివిధ అంశాలు ఇందులో ఉంటాయి. -
భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల కొత్త ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడాకారులు కీలక మ్యాచ్‌లకు ముందు తీవ్ర ఒత్తిడికి లోను కావడం, మ్యాచ్‌లో ఒకవేళ ఓటమి ఎదురైతే కుంగిపోవడం తరచుగా జరుగుతుంది. ఎలాంటి ఆందోళనకు లోను కాకుండా ఆటను ఆటగానే చూడాలంటే మానసికంగా ఎంతో దృఢత్వం అవసరం. ఇందు కోసం ధ్యానం ఎంతో సహకరిస్తుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చెబుతున్నారు. అందు కోసం స్వయంగా తానే మెంటల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా మారి సూచనలివ్వబోతున్నారు. ఇందు కోసం ఆయన ‘ధ్యాన ఫర్ స్పోర్ట్స్’ అనే యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఏడాది క్రితం గోపీచంద్ స్వయంగా ప్రారంభమైన ‘ధ్యాన’ యాప్‌లోనే ఇప్పుడు ప్రత్యేకంగా క్రీడాకారుల కోసం మెడిటేషన్ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. దేశంలోని ప్రఖ్యాత షట్లర్లు ఇప్పటికే దీనిని అనుసరిస్తున్నారని, ఇతర క్రీడాకారులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గోపీచంద్ వెల్లడించారు. ఒక ఆటగాడిగా తాను అన్ని అంశాలపై అధ్యయనం చేసిన తర్వాత ఈ మెడిటేషన్ యాప్‌ను రూపొందించామని, చాంపియన్లుగా మారే క్రమంలో మానసిక ప్రశాంతత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన అన్నారు. ‘ధ్యాన ఫర్ స్పోర్ట్స్’లో పది రకాల వేర్వేరు సెషన్లు అందుబాటులో ఉన్నాయి. ‘ధ్యాన’ ద్వారా మెడిటేషన్లో భాగమయ్యేందుకు ఉపయోగించాల్సిన ప్రత్యేక కిట్ అమెజాన్‌లో లభిస్తుందని గోపీచంద్ చెప్పారు. మీడియా సమావేశంలో గోపీతో పాటు అవంతరి టెక్నాలజీస్ ఎండీ భైరవ్ శంకర్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ పాల్గొన్నారు. -
టాప్ షట్లర్లకు లీగ్ నిర్వహించాలి
న్యూఢిల్లీ : త్వరలోనే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పునరుద్ధరణ కానుందనే వాస్తవాన్ని మన షట్లర్లు అంగీకరించాల్సిందేనని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ఇప్పటికీ ప్రాక్టీస్ ప్రారంభించడంలో మన క్రీడాకారులు వెనుకబడ్డారని... కలిసి ప్రాక్టీస్ చేయడానికి ఆటగాళ్లు ఇంకా సంకోచిస్తున్నారన్నాడు. ఇటీవల ‘సాయ్’ క్వారంటైన్ నిబంధనల ప్రకారం ప్రాక్టీస్ చేసేందుకు భారత షట్లర్లు తిరస్కరించడంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘థామస్ కప్–ఉబెర్ కప్’ జాతీయ శిక్షణా శిబిరాన్ని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ‘అతి త్వరలో అంతర్జాతీయ టోర్నీలు జరుగుతాయనే విషయాన్ని మన ఆటగాళ్లు ఇంకా గుర్తించడం లేదు. కరోనా గురించే ఆలోచిస్తూ కలిసి ప్రాక్టీస్ చేసేందుకు ఇంకా సంకోచిస్తున్నారు. ప్రాక్టీస్ అంశంలో ఆటగాళ్ల తరఫు నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని గోపీచంద్ చెప్పాడు. టాప్ షట్లర్లు లయ కోల్పోకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారికి ఒక లీగ్ నిర్వహించాలని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ప్రారంభమయ్యాయి. దీనర్థం మనం కూడా వారితో సమానంగా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలి. లేదంటే రేసులో వెనకబడతాం. గతం తరహా పరిస్థితులు ఇప్పుడు ఉండబోవు. దీన్ని అర్థం చేసుకొని అలవాటు పడాలి. దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లను ఎంపిక చేసి వారికో లీగ్ నిర్వహించాలి. ఇలా చేస్తే అంతర్జాతీయ ఆటగాళ్లతో సమానంగా మనవాళ్లు సన్నద్ధంగా ఉంటారు’ అని 46 ఏళ్ల గోపీచంద్ వివరించాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కంటే జూనియర్ స్థాయి క్రీడాకారుల గురించే తాను ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడు. ఎదిగే దశలో ఈ విరామం వారికి చేటు చేస్తుందని అన్నాడు. -
పీవీ సింధూ బయోపిక్‌లో దీపిక పదుకొనే!?
సాక్షి, హదరాబాద్: పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్... వెండితెరపై సందడి చేయనున్నారు. అదేంటి.. వీరంతా సినిమాల్లో నటిస్తున్నారా..! అని అనుకోకండి. వీరి జీవిత కథలతో సినిమాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అప్పుడే పట్టాలపై కూడా ఎక్కేశాయి. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ స్టార్స్ పి.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌లకు సంబంధించిన బయోపిక్‌లు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్ బయోపిక్కు ‘శభాష్ మిత్తూ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది. గల్లీ గ్రౌండ్ నుంచి అంతర్జాతీయ గ్రౌండ్ వరకు తమ సత్తా చాటిన మన హైదరాబాదీ క్రీడాకారుల బయోపిక్‌లు వెండితెరలపై కనువిందు చేయనున్నాయి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారి బయోపిక్‌లకు సంబంధించిన వివరాలతో గల్లీ గ్రౌండ్ టూ బయోపిక్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులు మన హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం. క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ దొరై, బ్యాడ్మింటన్ స్టార్స్ పీ.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌ల బయోపిక్‌లు నిర్మించేందుకు బాలీవుడ్ ముందుకొచ్చింది. ఒకప్పుడు గల్లీ గ్రౌండ్లో మొదలైన వీరి ప్రస్థానం దశల వారీగా అంతర్జాతీయ గ్రౌండ్లపై తమ సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. మారోసారి వీరికి సంబంధించిన బయోపిక్‌లతో వెండితెరపై కూడా వీరి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నారు. సింధూగా దీపిక? సింధూ బయోపిక్‌లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్‌కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్ లేని కారణంగా బయోపిక్ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత.. సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్ “సాక్షి’కి తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక నటించే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చారు సోనుసూద్.! మిథాలీ, సింధు, సైనాలపై బాలీవుడ్, పుల్లెలపై టాలీవుడ్ ఇటీవల కాలంలో మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌ల ఆటకు యావత్ భారతం ఫిదా అయ్యింది. సింధూని ప్రపంచస్థాయి పోటీల్లో నిలబెట్టిన ఘనతను కోచ్ పుల్లెల గోపిచంద్ సొంతం చేసుకున్నారు. వీరి జీవిత చరిత్రలను బయోపిక్‌గా తీసేందుకు బాలివుడ్, టాలివుడ్ ముందుకొచ్చింది. సింధూపై బయోపిక్‌ని నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్, మిథాలీరాజ్‌పై ‘వయోకామ్–18’, సైనా నెహ్వాల్‌పై సినిమా నిర్మించేందుకు ‘టీ సిరీస్’ సంస్థలు ముందుకు రాగా..కోచ్ పుల్లెల గోపిచంద్పై నిర్మించేందుకు టాలివుడ్‌కు చెందిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ముందుకొచ్చారు. లాక్డౌన్ ఎఫెక్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంత షూటింగ్ జరిగి నిలిచిపోయాయి. లాక్డౌన్ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్ టైంకి ఈ మూడు బయోపిక్‌లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 సమ్మర్లో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్ ‘సాక్షి’తో చెప్పారు. శ్రద్థా టు పరిణీతి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించేందుకు 2018లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కసరత్తులు చేసింది. తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కూడా సైనా బయోపిక్‌లో నటిస్తున్నట్లు వెల్లడించింది. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఆమె స్థానంలో పరిణీతిచోప్రా చేరి శ్రద్ధ పక్కకు తప్పుకుంది. శ్రద్ధ కపూర్ కంటే పరిణీతి చోప్రానే సైనాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. ప్రొఫెషన్ టూ పర్సనల్ లైఫ్ మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌లు చిన్నతనం నుంచి వారికి ఆయా ఆటలపై మక్కుల ఎలా వచ్చింది. ఆ సమయాల్లో వీరికి ఎవరెవరు ఏ విధమైన సాయం చేశారు, ఎవరెవరు విమర్శించారు, సంతోషాలు, విచారాలు ఇలా అన్ని అంశాలను పొందుపరుస్తూ ఈ బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని గల్లీల్లో ఆడుకునే వీరు ప్రపంచస్థాయికి ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. పుల్లెల గోపీచంద్ చిన్న పాటి గ్రౌండ్ నుంచి అర్జున అవార్డు స్థాయి వరకు ఎలా వచ్చాడు, సింధూను ప్రపంచ పోటీలకు ఎలా తీసికెళ్లగలిగాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని బయోపిక్‌లో చూపించనున్నారు. వారి ప్రొఫెషనల్ ఆటనే కాదు పర్సనల్ లైఫ్‌ని ఎంతవరకు పక్కన పెట్టారు, చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్న సందర్భాలను కూడా ప్రేక్షకులకు ఈ బయోపిక్‌ల ద్వారా తెలపనున్నారు. తాప్సీ, పరిణీతిచోప్రా, సుధీర్బాబులే యాప్ట్ ఇటీవల విడుదలైన మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిత్తూ’లో హీరోయిన్ తాప్సీ పొన్ను అచ్చుగుద్దినట్లు మిథాలీరాజ్లాగానే ఉంది. సైనా నెహ్వాల్‌తో కలసి నెట్ ప్రాక్టీస్ చేసిన బాలీవుడ్ నటి పరిణీతిచోప్రా సేమ్ సైనాను దించేసింది. ఇక పుల్లెల గోపీచంద్ పాత్రలో మన టాలివుడ్ హీరో సుధీర్‌బాబు కనువిందు చేయనున్నారు. ఈ ముగ్గురి క్రీడాకారుల ముఖాలకు ఇంచుమించు మ్యాచ్ అవుతున్న తాప్సీ, పరిణీతి, సుధీర్‌బాబులను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో రావడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. చక్కగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్లను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో పొగడ్తల వెల్లువెత్తుతున్నాయి. ఆమె చెప్పిన వన్వర్డ్ ఆన్సర్‌తో ఫిదా అయ్యా మహిళల ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మిథాలీరాజ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి యావత్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. ఇదే క్వశ్చన్‌ను మీరు మేల్ క్రికెటర్‌ను ఎందుకడగరంటూ ప్రశ్నించింది. ఆ సన్నివేశం ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆమె డేర్, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నాకెంతో నచ్చాయి. మిథాలీలా నటించమని నన్ను అడగ్గానే యస్ చెప్పేశా. ఆ ఒక్క ఆన్సర్‌తో ఫిదా అయ్యాను. శభాష్ మిత్తూలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – తాప్సీ పొన్ను, బాలీవుడ్ నటి తనలా చేయడం గొప్ప అనుభూతి గ్రౌండ్లో సైనా నెహ్వాల్ ఆడుతున్న ఆటకు బాగా కనెక్ట్ అవుతాను. నేను అసలు ఎప్పుడూ ఉహించలేదు సైనాపై బయోపిక్ వస్తుందని..అందులో నేనే నటిస్తానని. తనతో కలసి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ నటించడం చాలా అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా అందర్నీ మెప్పిస్తాననే ధీమా ఉంది. – పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి గోపి.. నా ఇన్స్పిరేషన్ గోపి (గోపీచంద్) నా ఇన్స్పిరేషన్.. ఒక వ్యక్తిగా నేను పరిణితి చెందడంలో గోపి పాత్ర చాలా ఉంది. అతనితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుంది. ఆరోజుల్లో ఇద్దరం కలసి ఆడటం, ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాం. అతని బయోపిక్ ద్వారా రాబోయే తరం గోపిని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే వచ్చే ఏడాది చివర్లో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధీర్‌బాబు, సినీ హీరో కలసి ఆడాం.. అతనే చెయ్యడం హ్యాపీ ఒకప్పుడు నేనూ, హీరో సుధీర్‌బాబు కలసి విజయవాడలో బ్యాడ్మింటన్ ఆడాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు అతనే నా బయోపిక్‌లో నటించడం ఆనందంగా ఉంది. ప్రారంభ దినాల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఈ స్థాయికి ఎలా వచ్చేమనే విషయాలు ఈనాటి యువతకు బయోపిక్‌ల ద్వారా తెలపడం ఆనందంగా ఉంది. – పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్. చాలా హ్యాపీగా ఉన్నా నా మీద బయోపిక్ రావడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పరిణీతి చోప్రా నాలా నటిస్తుంది. నానుంచి ఆమెకు కావల్సిన టిప్స్ అన్నీ ఇచ్చాను. షూటింగ్ అంతా పూర్తయ్యి రిలీజ్ అయితే ప్రేక్షకులతో కలసి చూడాలనిపిస్తుంది. – సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కష్టానికి గుర్తింపు బయోపిక్ చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి వరకు నేను పడిన కష్టం, శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రజల మన్నలను అందుకున్నాను. కానీ నేను పడిన కష్టం, ఆరోజుల్లో ఏ విధమైన వసతులు లేకుండా పట్టుబట్టి మరీ ఆటపై పట్టు సాధించడాన్ని ఇప్పుడు బయోపిక్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరగడం ఆనందంగా ఉంది. విదేశీ గడ్డపై నా గెలుపు అనంతరం మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన సమయంలో ఎంత సంతోషంగా ఉందో..ఇప్పుడు బయోపిక్ ద్వారా నా జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. – పీ.వి.సింధూ, బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ రావడం ఆదర్శమనిపిస్తుంది ఒకప్పుడు క్రికెట్ అంటే అమ్మాయిలకెందుకు అనేవాళ్లు. మేం ప్రపంచకప్ పోటీల్లో ఆడిన ఆటకు తతి ఒక్కరూ ఫిదా అయ్యారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా తమ అమ్మాయిలను క్రికెట్ కెరీర్‌గా మలుచుకోమని పంపండం సంతోషంగా ఉంది. నా గురించి బయోపిక్ రావడం నిజంగా నేటితరం వారికి ఆదర్శమనిపిస్తుంది. – మిథాలీరాజ్ దొరై, ఇండియన్ క్రికెటర్ -
గోపీచంద్ అకాడమీలో కరోనా కలకలం
హైదరాబాద్: నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కరోనా కలకలం రేగింది. గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న షట్లర్ సిక్కిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆమెతో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్ జార్జ్‌కు సైతం కరోనా వైరస్ సోకింది. వీరికి కరోనా లక్షణాలు కన్పించడంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో వీరిద్దరూ హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అదే సమయంలో గోపీచంద్ అకాడమీని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. శానిటైజ్ చేశారు. కాగా, అదే అకాడమీలో స్టార్ షటర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్‌లు ప్రాక్టీస్ చేస్తూ ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. శాయ్ నిబంధనల మేరకు అకాడమీలోని అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి కరోనా టెస్టులు చేయనున్నారు. అయితే సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లను కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరితో ఎవరు ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారో వారి వివరాలు సేకరిస్తున్నారు. సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లకు మరొకసారి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయనున్నారు.ఇప్పటికే పలువురు హాకీ ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకగా, క్రికెట్లో కూడా కరోనా కలవరం మొదలైంది. తాజాగా సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌లు కరోనా వైరస్ సోకడం క్రీడాకారుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. -
ప్రభుత్వం విప్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పుల్లెల
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్వీకరించారు. గ్రీన్ ఇండియా మిషన్ మూడో విడత కార్యాక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహోద్యమంలా సాగుతోంది. ఈ నేపథ్యంలో గువ్వుల ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గచ్చిబౌలిలలోని తన అకాడమీ ప్రాంగణంలో పుల్లెల గోపిచంద్ శనివారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లతో రాష్ట్రంలో పచ్చదనం బాగా పెరిగిందన్నారు. అంతేగాక ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో కూడా పచ్చదనంపై చాలా అవగాహన పెరిగిందన్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సిక్కిరెడ్డి, మేఘన, అరుణ్, విష్ణులు మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. -
బయో పీక్
రెండేళ్లుగా వెండితెరపై బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఈ ఏడాది కూడా కొన్ని బయోపిక్‌లు థియేటర్స్‌కు రావాల్సింది కానీ కరోనా కారణంగా ఆగాయి. షూటింగ్‌లకు ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో సెట్స్‌పైకి వెళ్లేందుకు కొన్ని బయోపిక్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మరికొన్ని బయోపిక్‌లు ముస్తాబు అవుతున్నాయి. ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన ఈ ఏడాది బయోపిక్‌ల హవా పీక్‌లో ఉంది. 20 సినిమాల వరకూ ఉండటం విశేషం. ఇక ప్రముఖుల జీవితాల ఆధారంగా రానున్న ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. విశ్వదర్శనం ‘స్వాతిముత్యం, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వయంకృషి , శృతిలయలు’.... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఘనవిజయాల జాబితాకు ఫుల్స్టాప్ పెట్టడం కాస్త కష్టమే. ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించారు. ఆయన గురించి ఎవరికీ తెలియని తెరవెనక దాగి ఉన్న సంగతులు, ఆయన గుండెల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు ‘విశ్వదర్శనం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విశ్వనాథ్ జీవితం ఆధారంగా ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ ‘విశ్వదర్శనం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాళన్న సాహిత్యానికి కాళోజీ నారాయణరావు చేసిన కృషి అక్షరాలతో కుదించి రాయలేనిది. తెలుగులోనే కాదు ఉర్దూ, హిందీ, కన్నడ, ఇంగ్లిష్.. ఇలా పలు భాషల్లో రచనలు చేసిన ఘనత కాళోజీది. కాళన్నగా సుపరిచితులైన కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సామాజిక కార్యక్రమల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్న కాళోజీ స్వాతంత్య్ర పోరాటంలోనూ పాలుపంచుకున్నారు. ఇన్ని గొప్ప విశేషాలు దాగి ఉన్న కాళోజీ జీవిత చరిత్ర వెండితెరకు రానుంది. ‘కాళన్న’ టైటిల్‌తో డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహిస్తున్నారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేపర్‌బాయ్ నుంచి ప్రెసిడెంట్ స్థాయి వరకూ ఎదిగిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన మన దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచారు. డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థల్లో ఆయన పోషించిన పాత్ర విశ్వానికి మనల్ని దగ్గర చేసింది. కలాంను ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారంటే ఆయన గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా స్ఫూర్తిదాయకంగా సాగిన కలాం జీవితం ఆధారంగా ‘కలాం: ది మిస్సైల్ మ్యాన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. దర్శక ద్వయం జగదీష్ తానేటి, జానీ మార్టిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కలాం పాత్రలో అలీ నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ దర్శక–నిర్మాత వివేక్ అగ్నిహోత్రి కూడా కలాం బయోపిక్‌ను ప్రకటించారు. చాంపియన్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (2001)ను సాధించి, చరిత్ర సృష్టించారు పుల్లెల గోపీచంద్. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ వ్యక్తి (తొలి వ్యక్తి ప్రకాష్ పదుకొనే) ఆయనే కావడం విశేషం. గోపీచంద్ జీవితం కూడా తెరకు రానుంది. ఆయన బయోపిక్‌లో సుధీర్‌బాబు నటిస్తారు. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సినిమాల్లోకి రాకముందు సుధీర్‌బాబు బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం విశేషం. శభాష్ మిథూ ఇల్లు వదిలి గ్రౌండ్లోకి అడుగుపెట్టి తమలో దాగి ఉన్న క్రీడా సత్తాను నిరూపించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఆ కష్టాలను ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్ అవతలికి కొట్టారు క్రికెటర్ మిథాలీ రాజ్. భారతీయ మహిళా క్రికెట్లో తన పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా కొన్ని రికార్డులను సాధించారు. భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’గా తెరపైకి రానుంది. మిథాలీ రాజ్‌గా తాప్సీ నటిస్తారు. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారు. సైనా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్‌వన్ స్థాయికి చేరుకున్న ఘనత సైనా నెహ్వాల్‌ది. అంతేకాదు.. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన సైనా ఓ ఒలింపిక్ మెడల్‌ను కూడా సాధించారు. సైనా జీవితం ‘సైనా’ పేరుతో ఆవిష్కృతం కానుంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతీ చోప్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. తలైవి తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె బయోపిక్ తలైవి (హిందీలో ‘జయ’)గా తెరకెక్కుతోంది. జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకుడు. జయలలిత జీవితంపై రూపొందనున్న మరో చిత్రం ‘ది ఐరన్ లేడీ’లో జయలలితగా కనిపించనున్నారు నిత్యామీనన్. దర్శకురాలు ప్రియదర్శిని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే జయలలిత జీవితంపై రూపొందిన వెబ్‌సిరీస్ ‘క్వీన్’లో జయలలితగా నటించారు రమ్యకృష్ణ. తొలి పార్ట్ విడుదలైంది. రెండో భాగానికి రంగం సిద్ధమౌతోంది. మల్లేశ్వరి తొలి ఒలింపిక్ మెడల్ (వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో) సాధించిన కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కనుంది. ఒలిపింక్స్‌లో మెడల్ సాధించక ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను దర్శకురాలు సంజన తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ ఓ నిర్మాత కావడం విశేషం. ప్యాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. మరికొన్ని... ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్‌ను నిర్మించనున్నారు రోనీ స్క్రూవాలా. నటుడు, నిర్మాత సోనూ సూద్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ‘కలియుగ భీమ, ఇండియన్ హెర్క్యూలెస్’ కోడి రామ్మూర్తి బయోపిక్‌లో రానా నటించబోతున్నారు. ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్’గా చెప్పుకునే పీటీ ఉష బయోపిక్ గురించి గతంలో ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో పోరాడి మరణించిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’గా తెరపైకి వస్తోంది. సందీప్ పాత్రను అడివి శేష్ చేస్తున్నారు. పుట్టుకతోనే అంధుడైనా ఉన్నత చదువులు చదివి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు మచిలీపట్నంకు చెందిన బొళ్ల శ్రీకాంత్. ఆయన బయోపిక్‌ను బాలీవుడ్ దర్శక–నిర్మాత తుషార్ హీరానందన్ రూపొందించనున్నారు. ‘ఎల్టీటీఈ’ ప్రభాకరన్ బయోపిక్ ‘సీరుమ్ పులి’గా రూపొందనుంది. జి. వెంకటేష్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా టైటిల్ రోల్ చేస్తున్నారు. భారతీయ మొదటి ఫీల్డ్ మార్షల్ శ్యాం మానెక్ షా బయోపిక్‌లో నటిస్తున్నారు విక్కీ కౌశల్. ‘రాజీ’ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకురాలు. పరమ్‌వీర చక్ర విక్రమ్ బాత్ర జీవితం ఆధారంగా విష్ణువర్ధన్ తెరకెక్కిస్తోన్న ‘షేర్షా’లో నటిస్తున్నారు సిద్దార్ధ్ మల్హోత్రా. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి విజయ్ కార్నిక్‌గా నటించారు అజయ్ దేవగన్. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ బయోపిక్‌ను తెరకెక్కించునున్నట్లు నిఖిల్ ఆనంద్ తెలిపారు. అలాగే సుశాంత్ జీవితం ఆధారంగా ఒక సినిమాను సంజోయ్ మిశ్రా, మరో సినిమాను నిర్మాత విజయ్‌శేఖర్ గుప్తా రూపొందించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు పలువురు ప్రముఖుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో క్రికెటర్ కపిల్ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ (’83), ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్‌గా అజయ్ దేవగన్ (‘మైదాన్’), కింగ్ పృథ్వీరాజ్ చౌహాన్‌గా అక్షయ్ కుమార్ (‘పృథ్వీరాజ్’), పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దామ్సింగ్గా విక్కీ కౌశల్ (‘సర్దార్ ఉద్దామ్సింగ్’) నటిస్తున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. గుంజన్ పాత్రను జాన్వీ కపూర్ చేశారు. ఈ చిత్రం త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని బయోపిక్స్ కూడా తెరపైకి వచ్చేందుకు ముస్తాబు అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
‘అర్జున’కు ప్రణయ్ నామినేట్
చీఫ్ కోచ్ గోపీచంద్ ‘అర్జున’ అవార్డు కోసం హెచ్ఎస్ ప్రణయ్‌ని నామినేట్ చేశారు. ఈ నెల 2న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మలను ఆ అవార్డు కోసం సిఫార్సు చేయగా... తనను విస్మరించడంపై ప్రణయ్ బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆ మరుసటి రోజే (3న) గోపీచంద్ అతని పేరును క్రీడాశాఖకు ప్రతిపాదించారు. ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డీ హోదాలో గోపీచంద్ ఈ సిఫార్సు చేశారని, చీఫ్ కోచ్ హోదాలో కాదని ‘బాయ్’ వర్గాలు తెలిపాయి. కాగా బహిరంగ విమర్శలపై ‘బాయ్’ ప్రణయ్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
ఇలా అయితే కష్టమే
మ్యాచ్ ప్రాక్టీస్‌కు దూరమయ్యేకొద్దీ క్రీడాకారులు తిరిగి గాడిన పడటం కష్టమవుతుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు. తన కెరీర్లో ఆటకు ఇలాంటి ఎడబాటు ఎప్పుడూ లేదన్నారు. ఇది ఆటగాళ్ల ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. న్యూఢిల్లీ: సుదీర్ఘ లాక్డౌన్ ఆటగాళ్ల ఆటతీరును ప్రభావితం చేసే ప్రమాదముందని, ఇన్ని నెలలుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోతే మళ్లీ పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావడం చాలా కష్టమవుతుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఇది ప్లేయర్లకే కాదు... ద్వితీయశ్రేణి కోచ్‌లు, క్రీడా పరికరాల దుకాణాలకు నష్టాలనే తెచ్చిపెట్టిందన్నారు. మీడియాకిచ్చిన ఇంటర్వూ్యలో ఈ 46 ఏళ్ల చీఫ్ కోచ్ పలు అంశాలపై స్పందించారు. ఇలాగే కొనసాగితే... ఆటలు, పోటీలు లేకపోవడం ఇప్పటికైతే ఫర్వాలేదు కానీ ఇదే పరిస్థితి ఇంకో నెల, నెలన్నర కొనసాగితే మాత్రం ఆటగాళ్లకు కష్టమే! వాళ్ల సహనానికి ఇది కచ్చితంగా విషమ పరీక్షే అవుతుంది. లాక్డౌన్ మొదటి నెలంతా విశ్రాంతి తీసుకున్నారు. కొందరైతే గతంలో చేయని పనుల్ని సరదాగా చేసి మురిశారు. తర్వాత రెండు నెలలు కసరత్తు ప్రారంభించారు. ఆన్లైన్ ట్రెయినింగ్‌లో నిమగ్నమయ్యారు. ఇక్కడ ఆటగాళ్లకు శారీరక, మానసిక సవాళ్లు ఎదురవుతాయి. విశ్రాంతితో మానసిక బలం చేకూరుతుందేమో కానీ... నెలల తరబడి ఇలాగే ఉంటే ఫిట్నెస్ (శారీరక), ఫామ్ సమస్యలు తప్పవు. పైగా ఒలింపిక్స్‌కు ముందు ఇది మరింత ప్రమాదకరం కూడా! తొలిసారి ఈ ఎడబాటు... నా కెరీర్లో నేనెప్పుడూ ఇన్ని నెలలు బ్యాడ్మింటన్‌కు దూరం కాలేదు. ఆటగాడి నుంచి కోచ్ అయ్యేదాకా ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి. ఆన్లైన్ కోచింగ్, ఫిట్నెస్ సెషన్లతో అందుబాటులో ఉండటం ద్వారా ఆ వెలితిని కాస్త పూడ్చుకోగలుగుతున్నా. నా వరకైతే ఇది ఓకే. ఈ తీరిక సమయాన్ని చదివేందుకు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేందుకు వినియోగించుకుంటున్నా. కోచింగ్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లతో బిజీగా మారుతున్నా. ఎటొచ్చి మ్యాచ్ ప్రాక్టీస్ లేని ఆటగాళ్లకే ఇది నష్టం. మారే క్రీడా క్యాలెండర్... కరోనా పరిస్థితులతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టోర్నీలన్నీ వాయిదా వేసింది. కొన్ని రద్దు చేసింది. సాధారణంగా ప్రత్యేకించి ఏదైనా దేశం, టోర్నీ వాయిదా పడితే అందులో ఆడేవారిపై ప్రభావం పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా వేరు. ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలు, వీసాలతో ఇపుడు ఏ టోర్నీ అయినా ఆగొచ్చు. క్రీడా క్యాలెండర్ మరిన్ని మార్పులకు గురికావొచ్చు. కోచ్‌లకూ కష్టకాలం... ఈ ప్రతిష్టంభనతో ఒక్క ఆటగాళ్లే కాదు దీన్ని నమ్ముకున్న కోచ్‌లు, క్రీడా పరికరాల షాపులకు నష్టాలే. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు సెలవులతో ఉంటాయి. అప్పుడు పిల్లలంతా ఆటలపై మరలుతారు. క్రీడా వస్తువులు కొంటారు. స్థానిక కోచ్‌లతో తమ ఆటల ముచ్చట తీర్చుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి తిరగబడింది. ప్రొఫెషనల్ కోచ్‌లకు ఏ ఇబ్బంది లేకపోయినా ఢిల్లీలోని సిరిఫోర్ట్, త్యాగరాజ్ స్టేడియాల్లో స్వతంత్రంగా పనిచేసే కోచ్‌లకు జీవనాధారం కరువైంది. ఇలాంటి వారి కోసం అర్జున అవార్డీలు అశ్విని నాచప్ప, మాలతి హోలలతో కలిసి ‘రన్ టు ద మూన్’ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించాం. -
బ్రిటిష్ గడ్డపై తెలుగుబిడ్డ గర్జించిన వేళ...
గతేడాది సింధు ప్రపంచ చాంపియన్. ఈ ఘనతకంటే మూడేళ్ల ముందు రియో ఒలింపిక్స్‌లో రన్నరప్. సింధు కంటే ముందే సైనా నెహ్వాల్ ఒలింపిక్ మెడలిస్ట్. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ రజత పతక విజేత. మరెన్నో సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా ఆమె గెలిచింది. కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సిక్కి రెడ్డి తదితర చాలామంది షట్లర్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఇప్పుడు మెరికలు. వీరందరికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పుల్లెల గోపీచంద్ అకాడమీ ఉంది కాబట్టి విజయాలు లభిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ పాతికేళ్ల క్రితం ఇలాంటి పేరెన్నికగల అకాడమీ ఏదీ మన దేశంలో లేదు. అయినప్పటికీ ఎన్నో ప్రతికూలతల నడుమ స్వయంకృషితో గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయ్యాడు. అది కూడా క్రీడాకారుల కెరీర్‌ను దాదాపు సమాప్తం చేసే మోచిప్ప గాయం నుంచి కోలుకొని అతనీ విజయం సాధించడం గొప్ప విశేషం. పుల్లెల గోపీచంద్ ఆడే రోజుల్లో బెంగళూరులో ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ తప్ప వేరే చోట అకాడమీలు ఏవీ లేవు. ఉన్నంతలో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) లేదంటే చిన్నా చితకా శిక్షణ కేంద్రాలతోనే నెట్టుకురావాలి. అక్కడా అరకొరే సౌకర్యాలే. ఇలాంటి అత్తెసరు శిక్షణతోనే నెట్టుకొని, తట్టుకొని, నెగ్గుకొచ్చిన వారిలో అగ్రగణ్యుడు కచ్చితంగా మన తెలుగు తేజం గోపీచందే! ఎంటెరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) ఇది మోచిప్పకు అయ్యే అరుదైన గాయం. ఇది క్రీడాకారులకు శాపం. దీనికి గురైతే ఆటే కాదు... పూర్వపు నడక కూడా కష్టమే. ఇలాంటి గాయాలకు ఇప్పుడైతే స్పోర్ట్స్ మెడిసిన్, అత్యాధునిక ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) తేలిగ్గా బయట పడింది. మళ్లీ రాకెట్ పట్టింది. అయితే ఆ గాయానికి అప్పట్లో కెరీర్‌నే మూల్యంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. కానీ గోపీచంద్ పట్టుదల ముందు ఏసీఎల్ ఓడింది. అతని అంకితభావానికి ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్ చేరింది. ‘సిడ్నీ’ చెదిరినా... వరుసగా ఐదేళ్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన గోపీచంద్ సిడ్నీ ఒలింపిక్స్–2000 ఆరు నెలలపాటు తీవ్రంగా శ్రమించాడు. కానీ సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు సిమెంట్ కోర్టులపై నిర్వహించడం గోపీచంద్‌కు మైనస్ పాయింట్ అయ్యింది. అప్పటికే మోకాలికి శస్త్ర చికిత్సలు జరిగి ఉండటంతో గోపీచంద్ గాయం తిరగబెట్టింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన గోపీచంద్ రెండో రౌండ్లో సుదీర్ఘ పోరులో ఉక్రెయిన్ ప్లేయర్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ తర్వాత గోపీచంద్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. మోకాలిలో వాపు కూడా వచ్చింది. రెండో సీడ్ హెంద్రావాన్ (ఇండోనేసియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వరంతోనే ఆడిన గోపీచంద్ వరుస గేముల్లో ఓడిపోవడంతో అతని ఒలింపిక్ కల చెదిరిపోయింది. ఒక్కో అడ్డంకి దాటుకుంటూ... ఏదైతే తాము కోరుకుంటామో దాని కోసం కష్టపడితే ఆలస్యమైనా మనకు కచ్చితంగా లభిస్తుందని అంటారు. సిడ్నీ ఒలింపిక్స్ వైఫల్యాన్ని తన మదిలో నుంచి తీసేసిన గోపీచంద్ ఏడాది తిరిగేసరికి ఎలాంటి అంచనాలు లేకుండా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీకి వెళ్లాడు. 2001కు ముందు గోపీచంద్ 1997, 1998లలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడినా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. 1999, 2000లలో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగలేకపోయిన గోపీచంద్ ఈసారి ఎవరూ ఊహించని అద్భుతం చేశాడు. సిడ్నీ ఒలింపిక్స్ మాదిరిగానే ఆల్ ఇంగ్లండ్ టోర్నీని కూడా సిమెంట్ కోర్టులపైనే నిర్వహించారు. ఈసారి మాత్రం గోపీచంద్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. మోకాలిని సంరక్షించుకుంటూనే ఒక్కో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. మ్యాచ్‌లు కాగానే వెంటనే ఐస్బాత్కు వెళ్లేవాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని ఫిట్నెస్ కాపాడుకుంటూనే ప్రాక్టీస్ చేసేవాడు. చివరకు ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే విజయతిలకం దిద్దుకున్నాడు. తొలి రౌండ్లో గోపీ 15–11, 15–12తో రొనాల్డ్ సుసీలో (సింగపూర్)ను ఓడించాడు. రెండో రౌండ్లో 15–7, 15–4తో కొలిన్ హాటన్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. మూడోరౌండ్లో గోపీ ప్రత్యర్థిగా సిడ్నీ ఒలింపిక్స్ చాంపియన్ జీ జిన్‌పెంగ్ (చైనా) నిలిచాడు. కానీ గోపీచంద్ దూకుడుకు జిన్‌పెంగ్ చేతులెత్తేశాడు. గోపీ 15–3, 15–9తో జిన్పెంగ్ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో 15–11, 15–7తో ఆండెర్స్ బోసెన్ (డెన్మార్క్)పై గెలిచిన గోపీచంద్... సెమీఫైనల్లో డెన్మార్క్ స్టార్ ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్ పీటర్ గేడ్పై హోరాçహోరీ పోరులో 17–14, 17–15తో గెలిచాడు. ౖచైనా ప్లేయర్ చెన్ హాంగ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. మార్చి 11న బర్మింగ్హమ్లోని జాతీయ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గోపీచంద్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 15–12, 15–6తో చెన్ హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించాడు. 1980లో ప్రకాశ్ పదుకొనే తర్వాత ఈ టైటిల్‌ను నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా చరిత్రలో స్థానం సంపాదించాడు. గాయాలు వెంటాడినా... కోర్టులో గోపీ రాకెట్‌కు జోరెక్కువ. అతని శరీరానికి దూకుడెక్కువ. ఈ దూకుడైన శైలి అప్పుడప్పుడూ సమస్యలు తెచ్చేది. అయినా సరే గోపీ తన శైలితోనే గాయాలకు ఎదురెళ్లాడు తప్ప ఆటతీరు ఎనాడూ మార్చుకోలేదు. చాలా మంది గోపీచంద్‌ను ఆడేతీరును మార్చుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరించారు కూడా! 1994లో పుణే జాతీయ క్రీడల్లో గోపీచంద్ ఊహించనిరీతిలో గాయపడ్డాడు. టీమ్ విభాగంలో పురుషుల డబుల్స్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సమన్వయ లోపంతో గోపీచంద్‌ను అతని భాగస్వామి ఢీకొట్టాడు. దాంతో కిందపడ్డ గోపీచంద్ మోకాలికి తీవ్ర గాయమైంది. వైద్యులను సంప్ర దించగా ఆ గాయాన్ని ఎంటెరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్)గా తేల్చారు. మోకాలికి శస్త్ర చికిత్స తప్పదని చెప్పారు. ఢిల్లీలోని డాక్టర్ అశోక్ రాజ్‌గోపాలన్... గోపీచంద్ మోకాలికి ఆపరేషన్ చేశారు. మళ్లీ గాయమైతే శస్త్ర చికిత్స చేసేందుకు నేనున్నానంటూ గోపీచంద్‌కు భరోసా ఇచ్చారు. నీదైన ఆట, నీకున్న సహజశైలినే నమ్ముకొని ఆడాలని చెప్పారు. శస్త్ర చికిత్స తర్వాత గోపీచంద్ వరుసగా ఐదేళ్లపాటు 1996 నుంచి 2000 వరకు జాతీయ సింగిల్స్ చాంపియన్ అయ్యాడు. ఆ మధ్యలో మరో రెండుసార్లు అతని మోకాలికి చిన్నపాటి ఆపరేషన్లు జరిగాయి. తన మాటలతో గోపీచంద్‌లో ధైర్యం నింపిన డాక్టర్ అశోక్ రాజగోపాలన్ మాత్రం ఫీజు రూపంలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్ ఇవ్వాలని గోపీని కోరారు. -
టోర్నీల ఫార్మాట్ మార్చాలి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చాక ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆట పునరుద్ధరణలో కీలక మార్పులు చేయాలని భారత జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తరచూ ప్రయాణించే వీలు లేకుండా... ఒకే వేదికపై అనేక టోర్నీలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించాడు. కరోనా కారణంగా బీడబ్లూఎఫ్ జూలై చివరి వరకు అన్ని ముఖ్యమైన టోర్నీలను వాయిదా వేసింది. అయితే పరిస్థితులు సద్దుమణిగాక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకోవాలని గోపీచంద్ పేర్కొన్నాడు. ‘కరోనా అనంతర పరిస్థితులకు అనుగుణంగా బీడబ్ల్యూఎఫ్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. టోర్నీల నిర్వహణ, ఫార్మాట్ ఇలా అవసరమున్న అన్ని అంశాల్ని సవరించాలి’ అని గోపీ అన్నాడు. వాయిదా పడిన థామస్ ఉబెర్ కప్ ఫైనల్, ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించాలని ఆతిథ్య దేశాలను ప్రపంచ సమాఖ్య కోరింది. దీనిపై స్పందించిన గోపీ ‘మీరు టోర్నీ తేదీల మార్పు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ టోర్నీల నిర్వహణపై ఆలోచనా విధానం మారాలి. ఆటగాళ్లంతా ఒకే వేదికపై ఎక్కువ టోర్నీలు ఆడేలా ప్రణాళికలు రచించాలి. వేర్వేరు టోర్నీల కోసం వారానికో దేశం ప్రయాణించడం వారి ఆరోగ్యానికి చేటు కలిగించొచ్చు. ప్రేక్షకుల్ని ఎలాగూ అనుమతించే పరిస్థితి లేదు కాబట్టి పురుషుల సింగిల్స్ ఒక దేశంలో, మహిళల సింగిల్స్ మరో దేశంలో, డబుల్స్ ఇంకో దేశంలో నిర్వహిస్తే... ఒకే సమయం లో మూడు ఈవెంట్లలో పోటీలూ జరుగుతాయి, ప్రతీ ఆటగాడు ప్రతీ దేశం తిరిగే బాధ కూడా తప్పుతుంది. కేవలం రెండు, మూడు కోర్టుల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తే సరిపోతుంది. ఆటను పునరుద్ధరించాలనుకుంటే ఇలాంటి పద్ధతులు పాటిస్తే మంచిది’ అని తన ఆలోచనను పంచుకున్నాడు. -
ఆన్లైన్ పాఠాల్లో అశ్లీల చిత్రాల కలకలం..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ను విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆన్లైన్ పాఠాలకు డిమాండ్ పెరిగిపోయింది. అటు స్కూలు పిల్లలు దగ్గర్నుంచి, ఇటు క్రీడాకారుల వరకూ అంతా ఆన్లైన్లో తమ ట్రైనింగ్ క్లాస్‌ను వింటున్నారు. ఇలా ఆన్లైన్ పాఠాలు నిర్వహించడానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ( సాయ్), భారత బ్యాడ్మింటన్ అసోసియన్(బాయ్)లు నడుంబిగించగా మధ్యలో అశ్లీల చిత్రాలు ప్రత్యక్షం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బాయ్, సాయ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ ఆన్లైన్ శిక్షణలో 500 నుంచి 700 వరకూ పాల్గొన్నారు. ఇది బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగుతోంది. దీనికి ఇండోనేసియా కోచ్‌లు అగుస్ దివి సాంటోసో, నమ్రి సురోటో మార్గ నిర్దేశకం చేస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న వేళ.. ఒక్కసారిగా స్క్రీన్‌పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో కోచ్ సాంటోసో క్లాస్ చెబుతున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సెషన్లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న గోపీచంద్ వెంటనే లాగౌట్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాయ్’ ఐటీ వింగ్ విచారణ జరుపుతోంది. ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతున్న సమయంలో అశ్లీల చిత్రాలు రావడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. తమ జూమ్ సెషన్ హ్యాక్ కాకపోయినా అశ్లీల చిత్రాలు రావడం సాయ్ ఐటీ డిపార్ట్మెంట్కు తలపోటుగా మారింది. -
ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోన్న సమయంలో క్రీడల ప్రాధాన్యత సహజంగానే వెనక్కి వెళ్లిపోయింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడగా, ఇతర ప్రధాన ఈవెంట్లు అదే బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటప్పుడు వారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా చేయడంలో కోచ్‌ల పాత్ర కూడా కీలకం. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా దీనినే అనుసరిస్తున్నారు. కరోనా విపత్కర స్థితిని అందరూ సమష్టిగా ఎదుర్కోవడం ముఖ్యమని చెబుతున్నారు. హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్వారంటైన్ ఇటీవలే ముగిసింది. అయితే లాక్డౌన్ కారణంగా తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన గోపీచంద్... తాజా పరిణామాలను విశ్లేషించారు. ఒక క్రీడాకారుడికి టోర్నీలు ప్రాధాన్యతాంశమే అయినా ప్రాణాలకంటే ఎక్కువేమి కాదని ఆయన అన్నారు. గోపీచంద్ ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... లాక్డౌన్ ప్రభావం... వ్యక్తిగతంగా చూస్తే దేవుని దయవల్ల లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడని వారిలో నేనూ ఉన్నాను. మధ్యతరగతి వారికి కూడా ఎలాగో గడిచిపోతుంది. అయితే చేతుల్లో డబ్బులు ఉండని రోజూవారీ శ్రామికులు, రైతు కూలీలు నిజంగా తీవ్ర సమస్యలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉండే వీరిని ఆదుకోవడం మన బాధ్యత. తొందరలోనే అంతా సాధారణంగా మారిపోతే సమస్య తీరుతుంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నా. యోగా, ధ్యానం చేస్తూ నా ఫిట్నెస్ను కాపాడుకునే పనిలో ఉన్నా. ఆటగాళ్లతో కూడా మాట్లాడుతున్నా. నాకు లభించిన ఈ విరామాన్ని ఎక్కువ భాగం ఉపయోగించుకుంటున్నా కాబట్టి లాక్డౌన్ గురించి ఫిర్యాదేమీ లేదు. ఆటగాళ్లు ఏం చేస్తున్నారంటే... ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా వారందరికీ అందుబాటులోనే ఉన్నా. మా ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ వీడియో కాల్ ద్వారా వారందరికీ రోజుకు రెండుసార్లు ఫిట్నెస్ పాఠాలు ఇస్తుంది. దానిని అందరూ అనుసరిస్తారు. ఇక చాలా మంది షట్లర్లు తమ కెరీర్లో ఎప్పుడో గాయాలకు గురై విరామం తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. దీనిని కూడా అలాంటి సుదీర్ఘ విరామంగానే భావించాలి. జూలై వరకు టోర్నీల రద్దుపై... వచ్చే మూడు నెలల పాటు ఎలాంటి టోర్నీలు ఉండవని బీడబ్ల్యూఎఫ్ స్పష్టం చేసేసింది. అయితే అసలు ఈ లాక్డౌన్ ఎంత కాలం కొన సాగుతుందో, ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో చూడాలి. ఆ తర్వాతే ఆట గురించి ఆలోచించవచ్చు. ఒలింపిక్స్ సన్నాహాలపై... ఆందోళన అనవసరం. ఒలింపిక్స్ కొన్ని నెలలకు వాయిదా పడితే ఆటగాళ్ల ప్రాక్టీస్ గురించి ఆలోచించాల్సి వచ్చేది. అయితే ఏడాది పాటు వాయిదా పడ్డాయి కాబట్టి వాటికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ప్రపంచ వ్యా ప్తంగా ఆటగాళ్లందరి పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం లేదు. ప్రస్తు తం మన, మన కుటుంబసభ్యుల, మిత్రుల, దేశప్రజల ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం. క్రీడల గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. కరోనా సమయంలో టోర్నీలపై... ఆల్ ఇంగ్లండ్ టోర్నీని నిర్వహించడంపై బీడబ్ల్యూఎఫ్‌ను చాలా మంది విమర్శించారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే వారు చివరి క్షణం వరకు సాగదీసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్‌లో పరిస్థితి చూస్తుంటే మేం సరైన సమయంలో అక్కడి నుంచి బయట పడ్డామనిపిస్తోంది. ఒలింపిక్స్‌కు అర్హత అంశంపై... మనం అనుకుంటున్నంత తొందరగా పరిస్థితులు మెరుగుపడవని నా అభిప్రాయం. అయితే పరిస్థితులను సానుకూలంగా చూస్తే మీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టమని మాత్రమే ఆటగాళ్లకు చెబుతున్నా. చాలా మంది మాకు కుటుంబంతో గడిపే సమయం దొరకడం లేదంటూ ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు దానిని ఉపయోగించుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది క్రీడలకంటే పెద్ద సమస్య. అది ఏ దేశాన్ని వదిలిపెట్టడంలేదు. ఎవరూ ఊహించనిది. ఎవరి చేతుల్లోనూ లేనిది. కాబట్టి అన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఒకసారి క్వాలిఫయింగ్ ప్రమాణాలు ఏమిటో తెలిస్తే అప్పుడు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. చేదు గుళికలా భరించాల్సిందే.... ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ప్రభావం రాబోయే రోజుల్లో ప్రతీ రంగంపై ఉంటుంది. క్రీడారంగం మినహాయింపు కాదు. ఆర్థికంగా చాలా మంది దీని బాధితులుగా మారతారు. అందరికీ ఇది కఠిన సమయం. ఇలాంటి సమయంలోనే మానసికంగా కూడా దృఢంగా మారాల్సి ఉంటుంది. క్రీడా రంగానికి కూడా భారీ నష్టం జరుగుతుందనేది వాస్తవం. దీంతో సంబంధం ఉన్న అనేక మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. లేదా జీతాల్లో కోత పడవచ్చు. దీనిని అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఈ ఆరు నెలల కాలాన్ని లెక్కలోంచి తీసేయాలి. గత వందేళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. దీనిని ఎదుర్కోవడం అందరికీ కష్టంగా మారింది. అయితే చేదు గుళికలా దీనిని భరించక తప్పదు. త్వరలోనే అంతా మెరుగుపడాలని కోరుకుందాం. -
ఒలింపిక్స్ వాయిదా వేస్తే మంచిది
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే మంచిదని భారత చీఫ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ఒలింపిక్స్‌ను తొలుత అనుకున్న ప్రకారం షెడ్యూల్ టైమ్‌లోనే నిర్వహిస్తామని బుధవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) స్పష్టం చేసింది. దీంతో ఐఓసీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ వాయిదా వేయాలనే వారికి గోపీ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ‘ఒలింపిక్స్ నిర్వహణపై నాకు సందేహాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సమయం లేదు. గేమ్స్ జరపాలనుకుంటే ఇప్పటికే అందుకు సన్నాహాలు మొదలవ్వాల్సింది. కాబట్టి ఐఓసీ దీనిపై పునరాలోచించి తన నిర్ణయాన్ని తొందరగా ప్రకటిస్తే ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితులు, ఆరోగ్య భద్రత, ప్రయాణ ఆంక్షలు బట్టి చూస్తే గేమ్స్ నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్నది. వాటిని వాయిదా వేస్తేనే మంచిది’ అని గోపీ వివరించాడు. ఆల్ ఇంగ్లండ్ కూడా నిలిపివేయాల్సింది... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో తాజాగా జరిగిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ కూడా నిలిపివేయాల్సిందని గోపీచంద్ అన్నాడు. ‘కచ్చితంగా బీడబ్ల్యూఎఫ్ తప్పు నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇంగ్లండ్‌ను నిర్వహించడం ద్వారా ఆటగాళ్లను ప్రమాదంలోకి నెట్టేసింది’ అని 2001 ఆల్ ఇంగ్లండ్ టైటిల్ విజేత గోపీ పేర్కొన్నాడు. కఠిన పరిస్థితుల్లో బీడబ్ల్యూఎఫ్... ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఏప్రిల్ 28 తుది గడువు కాగా కరోనా కారణంగా బీడబ్ల్యూఎఫ్ అర్హత పోటీలన్నీ రద్దు చేయడంపై కూడా ఆటగాళ్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ గడువును పొడిగించాలని వారు కోరుతున్నారు. అయితే ఇది అనుకున్నంతా సులభంగా తీసుకునే నిర్ణయం కాదని గోపీచంద్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎటు తేల్చుకోలేని సంకట స్థితిలో బీడబ్ల్యూఎఫ్ ఉందని చెప్పాడు. ‘ఈ పరిస్థితి ఎవరూ ఊహించనిది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మెరిట్‌తో పాటు డీమెరిట్ కూడా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చే విధంగా వ్యవహరించడం ఎవరి వల్లా కాదు. బీడబ్ల్యూఎఫ్ ఇప్పుడు ఇదే పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శల పాలవుతుంది. క్వాలిఫయింగ్ గడువు పెంచితే టోర్నీల నిర్వహణ, వీసా, సహాయక సిబ్బంది ఇలా చాలా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆమోదించాల్సిందే. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా బీడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకోవాలని కోరుకోవాలి’ అని గోపీచంద్ వివరించాడు. ఒలింపియన్లకు నష్టమేం ఉండదు ఈనెల 31 వరకు ‘సాయ్–గోపీచంద్ అకాడమీ’ మూసేయడం ద్వారా ఒలింపిక్స్ ఆశావహుల ప్రాక్టీస్‌కు నష్టమేం ఉండదని గోపీ చెప్పాడు. ‘కేవలం రెండు వారాలు అకాడమీకి రాకుంటే పోయేదేం ఉండదు. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఆడి ఆటగాళ్లు వివిధ ప్రాంతాల్లో ప్రయాణించి వచ్చారు. వారు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందే. ఏప్రిల్‌లో ఆడాల్సిన టోర్నీలు కూడా లేవు. ఆటగాళ్లకు కూడా విశ్రాంతి అవసరం. ఈ సమయంలో వారు ఫిట్‌నెస్‌పై శ్రమిస్తే మంచిది’ అని అన్నాడు. -
అనూప్ శ్రీధర్ అకాడమీకి మెంటార్‌గా గోపీచంద్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని ‘ద స్పోర్ట్స్ స్కూల్’ అనూప్ శ్రీధర్ బ్యాడ్మింటన్ అకాడమీతో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ జత కట్టాడు. విద్యార్థులకు విద్యతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులు కల్పించి దేశం గర్వించదగిన క్రీడాకారులుగా తయారు చేయడమే లక్ష్యంగా ఏర్పడిన ఈ స్కూల్లోని బ్యాడ్మింటన్ అకాడమీకి గోపీచంద్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నుంచి అకాడమీకి మెంటార్‌గా సేవలందిస్తానని గోపీచంద్ తెలిపాడు. ‘చిన్నారుల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోన్న ‘ద స్పోర్ట్స్ స్కూల్’ను నేను చాలాకాలంగా గమనిస్తున్నా. ఆట పట్ల నా దృక్పథంతో సరితూగేలా స్పోర్ట్స్ స్కూల్ తన కార్యక్రమాల్ని కొనసాగిస్తోంది. అందుకే వీరితో కలిసి పనిచేసేందుకు సంతోషంగా అంగీకరించా. రెండు దశాబ్దాలుగా ఆటగాడిగా, కోచ్‌గా నాకు అనూప్ శ్రీధర్ గురించి బాగా తెలుసు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించడమే మా ఇద్దరి లక్ష్యం. ఇదే లక్ష్యంతో ద స్పోర్ట్స్ స్కూల్లో మెంటార్‌గా సేవలందిస్తా’ అని గోపీచంద్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌లోనూ ద స్పోర్ట్స్ స్కూల్ బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ చెన్రాజ్ తెలిపారు. -
కఠినమైనా... అలవాటు పడాల్సిందే
కోల్‌కతా: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్దేశించిన షెడ్యూల్ కఠినమైనప్పటికీ సింధు దానికి అలవాటు పడాలని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఇటీవల అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నప్పటికీ సింధుకు టోక్యోలో పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర భారత టాప్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ కూడా ‘టోక్యో’కు అర్హత సాధిస్తారని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జూనియర్ స్థాయిలోనూ భారత ప్లేయర్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్న ఆయన భవిష్యత్‌లో భారత బ్యాడ్మింటన్ గొప్ప విజయాలు సాధిస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ‘డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అలవాటు పడాల్సిందే... బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడుతు న్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లు ఈ సమస్య ను ఎదుర్కొంటున్నారు. ఒక అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఈ షెడ్యూల్‌కు అలవాటు పడటం సింధు బాధ్యత. ఈ పరిస్థితికి ఆమె అలవాటు పడాలి. ‘టోక్యో’ పతకం ఖాయం... ఒలింపిక్స్ ముందు మంచి ప్రిపరేషన్‌పైనే మేం దృష్టి సారించాం. కొన్ని అంశాలపై మేం మరింత శ్రమించాల్సి ఉంది. సింధు తన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో ఉంది. త్వరలోనే మేం వాటిని అధిగమిస్తాం. కోచ్ తు సంగ్ పార్క్, ట్రెయినర్ శ్రీకాంత్‌లతో కూడిన మా టీమ్ దానిపైనే పని చేస్తోంది. సింధు కచ్చితంగా ‘టోక్యో’లో పతకం సాధిస్తుంది. మంచి సన్నాహంతో ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం కనబరిచే వీలుంటుంది. శ్రీకాంత్, సైనాపై నమ్మకముంది... ఒలింపిక్స్‌కు ముందు ఇంకా 7 టోర్నమెంట్లు ఉన్నాయి. సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ అర్హతకు సరిహద్దుల్లో ఉన్నారు. ఒకట్రెండు మంచి ప్రదర్శనలు వారి అవకాశాలను మెరుగుపరుస్తాయి. రాబోయే టోర్నీల్లో వారు అద్భుతంగా ఆడాల్సి ఉంది. వ్యవస్థ ముఖ్యం... భారత్ డబుల్స్‌లో రాణించాలంటే ఒక పక్కా ప్రణాళికతో పాటు వ్యవస్థ ముఖ్యం. ఇక్కడికి వచ్చిన విదేశీ కోచ్‌లు కూడా ఇదే కోరుకుంటున్నారు. డబుల్స్ ఆటగాళ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. జూనియర్లూ రాణిస్తున్నారు... తర్వాతి తరాల కోసం ఇప్పటి వరకు మనం పెద్దగా పెట్టుబడి పెట్టింది లేదు. కానీ యువ క్రీడాకారులు అంతర్జాతీయ ప్లేయర్లుగా ఎదగాలంటే వారికి మంచి అవకాశాలు, సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం జూనియర్ స్థాయిలో చాలా మంది క్రీడాకారులు మెరుగ్గా రాణిస్తున్నారు. 15–19 వయో విభాగంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. వీరంతా భవిష్యత్‌లో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారనడంలో సందేహం లేదు. -
‘అంతా సైనా నిర్ణయమే’
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం తన అకాడమీని వదిలి సైనా నెహ్వాల్ బెంగళూరు వెళ్లిపోవడం తనను తీవ్రంగా బాధించిందని... ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్ ఆమెకు నచ్చజెప్పి ఉండాల్సిందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ) స్పందించింది. సైనా తన ఇష్ట్రపకారమే వ్యవహరించింది తప్ప తమ పాత్ర ఏమీ లేదని ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచి్చంది. ‘గోపీచంద్ అకాడమీని వదిలి పీపీబీఏలో శిక్షణ పొందాలనేది పూర్తిగా సైనా నెహా్వల్ సొంత నిర్ణయం. అందులో మా పాత్ర అసలేమాత్రం లేదు. అయితే కష్టకాలంలో విమల్ కుమార్ కోచింగ్ ఆమెకు ఉపకరించిందనేది వాస్తవం. ఆయన మార్గనిర్దేశనంలోనే సైనా వరల్డ్ నంబర్‌వన్‌గా నిలవడంతో పాటు ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ చాంపియన్ షిప్‌లలో ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఆటగాడిగా, కోచ్‌గా గోపీచంద్ ఘనతలపై మాకు అపార గౌరవం ఉంది. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారు మంచి ఫలితాలు సాధించినప్పుడు అభినందించాం. ఆయనతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. గత 25 ఏళ్లుగా పీపీబీఏ షట్లర్లను తీర్చిదిద్దుతోంది. వారిని ప్రోత్సహించడమే తప్ప కెరీర్లో వేర్వేరు దశల్లో ఎక్కడైనా వెళ్లిపోతామంటే ఎప్పుడూ ఆపలేదు. అది మా విధానం కూడా. అంతర్జాతీయ ప్రొఫెషనల్ క్రీడాకారుల కెరీర్ చాలా చిన్నది. తమ లక్ష్యాలు చేరుకునే క్రమంలో దక్కిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం కాబట్టి ఏం చేయాలనేది ఆటగాళ్లే నిర్ణయించుకోవాలి’ అని పీపీబీఏ స్పష్టం చేసింది. -
గోపీచంద్‌ను ఎందుకు ప్రశ్నించరు: జ్వాల
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గతంలో దిగ్గజ బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్ ప్రకాశ్ పదుకొనే వద్దకు శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తి, ఇప్పుడు అతన్నే తప్పుబడుతున్నాడంటూ మండిపడ్డారు. గోపీచంద్‌పై ‘డ్రీమ్స్ ఆప్ ఎ బిలియన్, ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్’ అనే పుస్తకం వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సైనా నెహ్వాల్‌తో గతంలో వచ్చిన మనస్పర్థలను వివరించాడు. తన అకాడమీ నుంచి సైనా వెళ్లిపోవడం ఇష్టంలేదని చెప్పినప్పటికీ తన మాట వినిపించుకోలేదని తెలిపాడు. ఈ విషయంలో ఒలింపిక్స్ గోల్డ్‌క్వెస్ట్ (ఓజీక్యూ) సభ్యులైన ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్, వీరేన్ రస్కినా సైనాను హైదరాబాద్ వీడేందుకు ప్రోత్సహించారని విమర్శించాడు. అంతేకాక ప్రకాశ్ పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పడానికి సానుకూల విషయమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించాడు. దీనిపై గుత్తా జ్వాల స్పందిస్తూ ‘ఇక్కడ ఏడుస్తున్న వ్యక్తి.. ప్రకాశ్ సర్ దగ్గర శిక్షణ తీసుకోడానికి హైదరాబాద్‌ను వదిలి వెళ్లాడు. మరి దీన్ని ఎందుకు ఎవరూ ప్రశ్నించట్లేదు’ అని ట్వీట్ చేశారు. ఈ వివాదంపై ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ స్పందిస్తూ.. రియో ఒలింపిక్స్‌లో భాగంగా సైనాను హైదరాబాద్‌లోని పుల్లెల అకాడమీ నుంచి బెంగళూరుకు తరలించడంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వెల్లడించింది. కాగా 2014 ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత సైనా నెహ్వాల్ హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీని వీడి బెంగళూరులో ప్రకాశ్ పదుకొనే అకాడమీలో చేరింది. అక్కడే రెండేళ్లపాటు కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా.. ఆపై మళ్లీ తిరిగి గోపీచంద్ అకాడమీకి చేరింది. ఇక కోచ్ గోపీచంద్ కూడా ప్రకాశ్ పదుకొనే దగ్గర శిక్షణ తీసుకున్నవాడే కావడం గమనార్హం. చదవండి: వెళ్లొద్దన్నా... వెళ్లిపోయింది -
సింధు ఆట మళ్లీ గాడి తప్పింది
కోల్‌కతా: తీరికలేని షెడ్యూల్, ఎడతెరిపి లేని ప్రయాణాల కారణంగానే సింధు ఆట మళ్లీ గాడి తప్పిందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచాక ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగతా టోరీ్నల్లో ఆరంభ రౌండ్లలోనే విఫలమవుతోన్న ఆమెపై కోచ్ నమ్మకం ఉంచారు. గత రెండు నెలల్లో సింధు అనుకూల ఫలితాలు సాధించలేదన్న ఆయన... త్వరలోనే ఆమె గెలుపు బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నీ తర్వాత సింధుకు తీరికలేని షెడ్యూల్ ఎదురైంది. చైనా, కొరియా, డెన్మార్క్, హాంకాం గ్ ఇలా ప్రతి టోర్నీ కోసం సుదూర ప్రయాణాలు చేసింది. ఇదంతా ఆమె ఆటపై ప్రభావం చూపింది. తీరిక లేని షెడ్యూల్ కారణంగానే ఆమె విఫలమవుతోంది. గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తనే కాదు మరికొంత మంది ప్రపంచ స్థాయి ప్లేయర్లు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ త్వరలోనే సింధు మళ్లీ విజయాల బాట పడుతుంది’ అని గోపీ వివరించారు. రానున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు పతకం గెలిచే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం డేనైట్ టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలి రోజు ప్రముఖ క్రీడాకారులను బీసీసీఐ సత్కరించనుంది. ఈ జాబితాలో గోపీచంద్, పీవీ సింధు కూడా ఉన్నారు. -
ఆత్మీయ స్వాగతాలు... అభినందనలు..!
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు... మంత్రి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరి అభినందనల వర్షంలో పూసర్ల వెంకట సింధు తడిసి ముద్దయింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్వదేశం తిరిగొచ్చిన ఆమెకు ముందుగా దేశ రాజధానిలో, ఆ తర్వాత హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ముందుగా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజుతో భేటీ జరగ్గా... దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ఆమెను ఆశీర్వదించారు. అనంతరం స్వస్థలంలో సహచర పతక విజేత సాయిప్రణీత్‌తో కలిసి సింధు మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సింధు, సాయి, కోచ్ గోపీచంద్ స్పందనలు వారి మాటల్లోనే... దేశం గర్వపడే చాంపియన్ పీవీ సింధు: ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్ సింధు అంటూ పొగడ్తలు కురిపించారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పీవీ సింధుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, తండ్రి పీవీ రమణ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలసి ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా సింధు సాధించిన స్వర్ణ పతకాన్ని ఆమె మెడలో వేసి మోదీ అభినందించారు. ‘బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్ సింధు. ఆమెను కలవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ మోదీ ట్వీట్ చేసి ఫోటోను పంచుకున్నారు. అంతకుముందు సింధుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఎన్నాళ్లో వేచిన విజయం... వరల్డ్ చాంపియన్‌గా నిలవడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదు. ఎంతో కాలంగా ఆశించిన ఈ విజయాన్ని ఎట్టకేలకు సాధించాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. అందుకు సహకరించిన నా కోచింగ్ బృందానికి కృతజ్ఞతలు. కాంస్య, రజతాలు సాధించినప్పుడు కూడా సంతోషం కలిగింది కానీ ఇంకా సాధించాల్సి ఉందని అనిపించింది. గత రెండు ఫైనల్స్‌లో ఓడినప్పుడు కొంత నిరాశ చెందినా నా ఆటను నేను నమ్మాను. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ దూసుకొచ్చాను. అంతిమ లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే అయినా అంతకుముందు నేను ఇంకా చాలా గెలవాల్సి ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను ప్రతీ మ్యాచ్‌కు ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. ప్రత్యర్థులకు నా ఆట గురించి బాగా తెలుసు కాబట్టి ఒకే తరహా ఆటతో విజయాలు సాధించలేం. ఇకపై కూడా కొత్త అంశాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఓడిపోతాననే భయం లేకుండా ఆడాను కాబట్టే ఫైనల్ ఏకపక్షంగా గెలవగలిగాను. –పీవీ సింధు, ప్రపంచ బ్యాడ్మింటన్ స్వర్ణ పతక విజేత ఒలింపిక్స్ క్వాలిఫయింగే లక్ష్యం... వారం రోజుల వ్యవధిలో అర్జున పురస్కారానికి ఎంపిక కావడం, ఇటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం నా ఆనందాన్ని రెట్టింపు చేశాయి. క్వార్టర్స్‌లో క్రిస్టీపై గెలవగానే కాంస్యం ఖాయమైందని తెలుసు కాబట్టి గొప్పగా అనిపించింది. ఆ సమయంలో ప్రకాశ్ సర్ 36 ఏళ్ల రికార్డులాంటి విషయాలు ఏవీ నా మనసులోకి రాలేదు. ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో కీలక సమయంలో గోపీ సర్ చేసిన సూచనల వల్లే గెలవగలిగాను. మొమోటాతో గతంలోనూ ఆడిన అనుభవం ఉంది కాబట్టి సెమీస్‌లో ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగాను. అయితే అతను నాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి ఈవెంట్లో మనం 100 శాతం శ్రమించినా కొంతయినా అదృష్టం కూడా కలిసి రావాలి. గతంలో అనేక మందికి సాధ్యం కానిది నేను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదు. ఇప్పుడు నా తదుపరి లక్ష్యం వచ్చే టోర్నీలలో బాగా ఆడి ప్రస్తుత ర్యాంక్ (15)ను నిలబెట్టుకోవడం, టోక్యోకు అర్హత సాధించడం. –సాయిప్రణీత్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ప్లాన్ ‘బి’ అవసరం రాలేదు... నాకు వ్యక్తిగతంగా ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మన ప్లేయర్ స్వర్ణం సాధించాలనేది చాలా కాలంగా నా కల. అది ఇప్పుడు నెరవేరింది. నా దృష్టిలో రెండు పతకాలు అమూల్యమైనవే. సింధు అంచనాలను నిజం చేస్తే, సాయిప్రణీత్ అద్భుతం చేసి చూపించాడు. 2013లో సింధు తొలిసారి కాంస్యం గెలిచినప్పుడు ఎంతో సంతోషించాం. ఆ తర్వాత మరో కాంస్యం, రెండు రజతాలు వచ్చినప్పుడు కూడా ఎంతో సాధించిన సంతృప్తి కలిగింది. అయితే అదే సమయంలో స్వర్ణం సాధించగలమనే విశ్వాసం కూడా ఏర్పడింది. సింధు సూపర్ ఫిట్నెస్ కూడా ఆమె గెలుపునకు ఒక కారణం. ఆమె అన్ని మ్యాచ్‌లు చాలా తెలివిగా ఆడింది. యమగూచి ఆరంభంలోనే వెనుదిరగ్గా... తైజుపై క్వార్టర్స్‌లో గెలవడంతోనే స్వర్ణంపై నమ్మకం ఏర్పడింది. మొదటి నుంచి అటాక్ మాత్రమే చేయాలనేది కొత్త వ్యూహం. ఇది విఫలమైతే ఏం చేయాలో ఆలోచించేవాళ్లం. కానీ సింధు దీనిని సమర్థంగా అమలు చేయడంతో ప్లాన్ ‘బి’ అవసరమే లేకపోయింది. –పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
ఈ విజయం ఎంతో ప్రత్యేకం
న్యూఢిల్లీ: పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలవడంతో అందరికంటే అమితానందం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్. తన శిష్యురాలి తాజా ప్రదర్శన గోపీచంద్‌ను గర్వపడేలా చేసింది. స్వర్ణం సాధించడంతో ఒక పనైపోయిందని ఆయన అన్నారు. ‘నాకు సంబంధించి ఇది చాలా పెద్ద విజయం. వరల్డ్ చాంపియన్ అనిపించుకోవడం నిజంగా చాలా గొప్ప ఘనత. దీనిని ఆమె సాధించిన తీరు ఇంకా అపూర్వం. రెట్టింపు గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మన దేశం నుంచి ఇప్పటికే కాంస్యం, రజతం చూశాం. ఇప్పుడు స్వర్ణం కూడా దక్కింది’ అని గోపీచంద్ భావోద్వేగంతో చెప్పారు. ఒకుహారాతో జరిగిన మ్యాచ్‌పై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగాల్సిన అవసరం లేకపోయిందని, ఒక్కసారి మ్యాచ్‌లో పట్టు చిక్కితే ఆమె దూసుకుపోతుందనే విషయం తనకు తెలుసని కోచ్ వ్యాఖ్యానించారు. ‘ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... ఇలా అన్ని చోట్లా సింధు రాణించింది. బయటి వారి సంగతి ఎలా ఉన్నా ఆమె ఆటపై నాకు మాత్రం ఎలాంటి సందేహాలు లేవు. ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా వచ్చినా నేను బాధపడకపోయేవాడిని. మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం’ అని మాజీ ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్కే అభినందన... సింధు విజయంపై భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ క్రమంలో గోపీచంద్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు ‘సింధు కఠోర శ్రమ, అంకితభావం, నైపుణ్యానికి దక్కిన ఫలితమిది. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. భారత బ్యాడ్మింటన్‌కు వెన్నెముకలా నిలిచి శ్రమించిన గోపీచంద్‌కు కూడా నా అభినందనలు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. ఇంతటి అంకితభావం ఉన్న కోచ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు’ అని ప్రసాద్ అన్నారు. చాముండేశ్వరీనాథ్ కారు కానుక... వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు అత్యాధునిక హై ఎండ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని అందజేసే అవకాశం ఉంది. -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
జకార్తా: అంచనాలకు తగ్గ ప్రదర్శన చేస్తూ భారత అగ్రశ్రేణి సింగిల్స్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 11–21, 21–15, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయా ఒహోరిపై సింధుకిది వరుసగా ఏడో విజయం కాగా... నిషిమోటోపై శ్రీకాంత్‌కిది ఐదో గెలుపు. మరోవైపు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌ల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సాయిప్రణీత్ 15–21, 21–13, 10–21తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో... ప్రణయ్ 21–19, 18–21, 20–22తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 13–21, 11–21తో తొంతోవి అహ్మద్–విన్నీ కండౌ (ఇండోనేసియా) జంట చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జోడీ 11–21, 17–21తో లియావో మిన్ చున్–సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. గురువారం జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సింధు; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) శ్రీకాంత్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మార్కస్ గిడియోన్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జోడీతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట తలపడతాయి. ప్రతీసారి ఆటగాళ్లతో వెళ్లడం కుదరదు! అలా చేస్తే కొత్తవాళ్లను తయారు చేయలేం భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మేజర్ టోర్నీ బరిలోకి దిగినా దాదాపు ప్రతీసారి వారి వెంట చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కనిపించేవారు. కోర్టు పక్కన కోచ్ స్థానం లో కూర్చొని ఆయన ఇచ్చే అమూల్య సలహాలతో షట్లర్లు అద్భుత ఫలితాలు సాధించారు. అయితే ఇటీవల గోపీచంద్ వారితో తరచుగా ప్రయాణించడం లేదు. ఈ ఏడాది అయితే గోపీ ఎక్కువగా అకాడమీలో శిక్షణకే పరిమితమయ్యారు. దీనిపై స్పందిస్తూ ఆయన... ఆటగాళ్లతో ప్రతీ టోర్నీకి వెళ్లడం సాధ్యం కాదని, ప్రణాళిక ప్రకారమే తన ప్రయాణాలు తగ్గించానని స్పష్టం చేశారు. ‘నేను టాప్ క్రీడాకారులతో టోర్నీలకు వెళుతుంటే వారి తర్వాతి స్థాయిలో ఉన్న ఇతర షట్లర్ల పరిస్థితి ఏమవుతుంది? టోర్నీల కోసం ప్రయాణించడమే పనిగా పెట్టుకుంటే ఒక సింధు వెలుగులోకి వచ్చేదా? వాస్తవానికి మనకు ఎక్కువ కోచ్‌ల అవసరం ఉంది. నేను ఒక్కడినే అన్నీ చేయలేను. నాకు ఇతరత్రా సహాయం, మద్దతు అవసరం’ అని గోపీచంద్ స్పష్టం చేశారు. గత పదేళ్లుగా కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ ఉన్న ఏడాదిలోనే తాను ఆటగాళ్లతో కలిసి టోర్నీలకు వెళ్లానని ఆయన గుర్తు చేశారు. ‘ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా సూచనలు తీసుకోవాలని, నేను వారికి ఎక్కువ సేపు కోచింగ్ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ అది ప్రతీసారి సాధ్యం కాదు. నేను అక్కడ లేను కాబట్టి తాము ఓడామని, ఉంటే గెలిచేవాళ్లమని కొందరు షట్లర్లు చెబుతూనే ఉంటారు’ అని గోపీచంద్ వివరించారు. 2019 చివరి వరకు ఆటగాళ్లతో ప్రయాణించే ఆలోచన లేదని... వచ్చే ఏడాది మాత్రం ఒలింపిక్స్ ఉండటంతో కొన్ని టోర్నీలకు వెళ్లి తన ప్రణాళికను రూపొందించుకుంటానని గోపీ వెల్లడించారు. -
పుల్లెల గోపీచంద్‌కు డాక్టరేట్
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. శుక్రవారం విద్యా సంస్థ 52వ స్నాతకోత్సవంలో... గోపీకి ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కె.రాధాకృష్ణన్ రజత ఫలకం అందివ్వగా, ఐఐటీ డైరెక్టర్ ప్రొ. అభయ్ కరన్‌దికర్ డాక్టరేట్ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు. -
మరో అకాడమీ కోసం గోపీచంద్ భూమిపూజ
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడలో దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ మరో అకాడమీ నిర్మాణానికి పూనుకుంది. కొటక్ మహీంద్ర బ్యాంక్ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తంగా పీజీబీఏ ప్రాంగణంలోనే మరో అకాడమీని నెలకొల్పనుంది. ఈ మేరకు బుధవారం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో భూమి పూజ చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ కూడా పూజలో పాల్గొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ప్రోగ్రామ్‌లో భాగంగా గోపీచంద్ అకాడమీతో కొటక్ మహీంద్ర బ్యాంక్ జతకట్టింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న ఈ అకాడమీలో 6 ఏసీ కోర్టులు, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ ఉండనున్నాయి. ఈ సందర్భంగా భారత జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ క్రీడాకారుల ఉన్నతి కోసం నూతన అకాడమీ నిర్మాణానికి కొటక్ మహీంద్ర బ్యాంక్ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి ఆటగాళ్లుగా ఎదగాలంటే ఆటపట్ల ఇష్టం, అంకితభావం, నిరంతర శిక్షణతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కూడా అవసరమని అన్నారు. ‘కొటక్ మహీంద్ర ప్రోత్సాహంతో అకాడమీలో ప్రపంచ స్థాయి సదుపాయాలు సమకూరనున్నాయి. ఇది చాంపియన్ క్రీడాకారుల క్రీడా ప్రమాణాలను మరింతగా పెంచుతుంది. ఏసీ కోర్టుల్లో ప్రాక్టీస్ వారికి ప్రపంచస్థాయి వేదికల్లో పోరాటాలను తేలిక చేస్తుంది. ఎందుకంటే చాలావరకు మెగా ఈవెంట్స్ అన్నీ ఏసీ కోర్టుల్లోనే జరుగుతాయి. ఇక్కడ ప్రాక్టీస్ నుంచే ఏసీ కోర్టులు అందుబాటులో ఉండటం ఆటగాళ్లకు మేలు చేస్తుంది’ అని వివరించారు. -
ఆటాడిస్తా!
బ్యాడ్మింటన్ గేమ్ రూల్స్ తెలుసుకుంటున్నారు సోనూ సూద్. ఎందుకంటే త్వరలో బ్యాడ్మింటన్ కోర్టులో ప్లేయర్స్‌తో ఆట ఆడిస్తారట. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ సిల్వర్ మెడల్ విజేత పీవీ సింధు జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని సోనూ సూద్ నిర్మిస్తారు. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో కూడా నటించనున్నారు. గోపీచంద్ దగ్గర పీవీ సింధు బ్యాడ్మింటన్ నేర్చుకున్న విషయం తెలిసిందే. ‘‘గోపీచంద్ పాత్రలో నటించడాన్ని గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఈ విషయం గురించి గోపీచంద్‌గారితో మాట్లాడాను’’ అని పేర్కొన్నారు సోనూ సూద్. పీవీ సింధు పాత్రలో దీపికా పదుకోన్ నటించబోతున్నరనే వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, త్వరలో ప్రకటిస్తామని సోనూ సూద్ పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీలో తీయనున్న చిత్రంలో సుధీర్‌బాబు నటిస్తున్నారు. -
వయసును తక్కువగా చూపిస్తే...
న్యూఢిల్లీ: ఆటగాళ్లు తమ వయోధ్రువీకరణను తప్పుగా వెల్లడించి పోటీల్లో పాల్గొంటే నిషేధం విధించాల్సిందేనని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచించారు. ‘వయస్సును తక్కువ చేసి చూపించే ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మరొకరు ఆ తప్పుచేయకుండా నిరోధించాలంటే నిషేధం అమలు చేయాలి’ అని గోపీచంద్ అన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)లు అలాంటి ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నాయి. అయితే భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్ మాత్రం నిషేధం సరికాదని అంటున్నారు. రెండు మూడేళ్లు సస్పెన్షన్ వేటు వేస్తే సదరు ఆటగాళ్ల ప్రతిభను చంపేసినట్లే అవుతుందని అన్నారు. అలా కాకుండా అండర్–15, 17, 19లలో పెద్ద వయస్సు వారు తప్పుడు ధ్రువీకరణతో పాల్గొంటే వాళ్లకు శిక్షగా ఈ వయోవిభాగాల నుంచి తప్పించి నేరుగా సీనియర్స్ కేటగిరీలో ఆడించడమే ఉత్తమమైన పరిష్కారమన్నారు. 2016లో కొందరు ఆటగాళ్లు తప్పు వయో ధ్రువీకరణతో పోటీల్లో పాల్గొన్న కేసు విషయంలో విచారణ జరిపిన సీబీఐ నలుగురు ఆటగాళ్లు వయస్సు ధ్రువీకరణ పత్రాలను దిద్దినట్లు తేల్చింది. పలువురు జూనియర్ ఆటగాళ్ల తల్లిదండ్రులు వయసు ధ్రువీకరణ అంశంపై, తప్పుడు ధ్రువీకరణపై చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు చర్యలు చేపట్టే విధాన నిర్ణయం తీసుకోవాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘాన్ని (బాయ్) ఆదేశించింది. -
గోపీ అకాడమీకి ఐఐటీ సహకారం
కోల్‌కతా: బ్యాడ్మింటన్‌లో సాంకేతిక అంశాల్లో సహకారం అందించే విషయంలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ)తో ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ జతకట్టింది. క్రీడాకారులకు ఇచ్చే కోచింగ్‌తో పాటు సాంకేతిక రంగాల్లో సహకారం అందించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి, పీజీబీఏ వ్యవస్థాపకుడు పుల్లెల గోపీచంద్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం క్రీడాకారులకు అందించే కోచింగ్‌లో వినూత్న పద్ధతులు రూపొందించే విషయంలో ఐఐటీ ఖరగ్‌పూర్ సహాయపడుతుంది. క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచేలా శిక్షణలో ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలనే అంశాలపై కోచ్‌లకు సహకరిస్తుంది. దీనితో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రాంగణంలో మరో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయనుంది. దీనిపై గోపీచంద్ స్పందిస్తూ ‘ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అకాడమీ అందుబాటులోకి రానుండటం శుభపరిణామం. ఈ అకాడమీ అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని’ పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై ప్రొఫెసర్ చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్‌తో సమన్వయం చేసుకుంటూ బ్యాడ్మింటన్ క్రీడకు మరింత ప్రాచుర్యం తీసుకువస్తామని ఆయన అన్నారు. -
నిరీక్షణ ముగిసేనా?
బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్లోని అతి పురాతన టోర్నమెంట్లలో ఒకటైన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ పోటీలకు నేడు తెరలేవనుంది. 2001లో పుల్లెల గోపీచంద్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్లో భారత క్రీడాకారులకు టైటిల్ లభించలేదు. 2015లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గతేడాది పీవీ సింధు పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అయితే కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శనను లెక్కలోకి తీసుకుంటే... ఈసారి కూడా మనోళ్లు టైటిల్ రేసులో ఉన్నారు. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్లపై భారీ అంచనాలు ఉన్నాయి. మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడం... ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ఫామ్‌లో లేకపోవడం.. జపాన్ క్రీడాకారిణులు నొజోమి ఒకుహారా, అకానె యామగుచిలపై మంచి రికార్డు ఉండటంతో... సింధు, సైనాలు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే వారికి ఈసారి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పదో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో ఐదో ర్యాంకర్ పీవీ సింధు... కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో సింధు 8–6తో సుంగ్ జీ హున్‌పై... సైనా 6–0తో గిల్మోర్‌పై ఆధిక్యంలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా నలుగురు బరిలో ఉన్నారు. మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో శ్రీకాంత్; ప్రణయ్‌తో సాయిప్రణీత్; అక్సెల్సన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఒయు జువాని–రెన్ జియాంగ్యు (చైనా) జోడీతో సుమీత్ రెడ్డి–మను అత్రి జంట... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో షిమో తనాకా–కొహారు యోనెమోటో (జపాన్) ద్వయంతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ తలపడతాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో చాంగ్ తక్ చింగ్–ఎన్జీ వింగ్ యుంగ్ (హాంకాంగ్)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ఆడతారు. -
గోపీచంద్ అకాడమీలో మరో శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో క్రీడాకారుల కోసం మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆవరణలో అదనంగా ఆరు ఎయిర్ కండిషన్డ్ కోర్టుల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల కాలంలో రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్లు వెచ్చించి ఈ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. ఈ కేంద్రంలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను కూడా నెలకొల్పుతామని, కోచ్‌లకు శిక్షణ కా ర్యక్రమాలు ఉంటాయని అన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సౌకర్యాలు లభిస్తే భారత ఆటగాళ్లు మున్ముందు మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్‌లను ఎయిర్ కండిషన్డ్ కోర్టులలో నిర్వహిస్తారు. అకాడమీలో ఎయిర్ కండిషన్డ్ కోర్టులు ఉండాలని కోరుకున్నాం. త్వరలోనే వీటి నిర్మాణ పనులు మొదలవుతాయి. ఇందులో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తారు’ అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. -
ఆ ప్రశ్న ఇక అడగరేమో!
పక్కా ప్రణాళిక... సరైన వ్యూహాలు... చెక్కు చెదరని ఏకాగ్రత... కీలక దశలో ఒత్తిడికి లోనుకాకుండా దృఢచిత్తంతో ఉండటం... వెరసి ఈ సీజన్లో తనకు లోటుగా ఉన్న అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ అందడంలో ముఖ్యపాత్ర పోషించాయని పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన అనంతరం చైనాలోని గ్వాంగ్జౌ నుంచి సింధు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించింది. కెరీర్‌లోని గొప్ప విజయంపై వెల్లడించిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ప్రత్యేక వ్యూహాలు... వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ముందు భారత్‌లో జరిగిన సయ్యద్ మోదీ టోర్నమెంట్లో బరిలోకి దిగకపోవడం మేలు చేసింది. ఆ సమయాన్ని నేను ఈ మెగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు వినియోగించుకున్నాను. ఈ ఏడాది నాకు ఇబ్బంది కలిగించిన, నన్ను ఓడించిన క్రీడాకారిణులు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పాల్గొన్నారు. వారిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఐదుగురికి ఐదు ప్రత్యేక వ్యూహాలు రచించాం. మ్యాచ్‌ల్లో వాటిని అమలుచేసి అనుకున్న ఫలితాన్ని సాధించాం. ఎంతో ప్రత్యేకం... వరల్డ్ టూర్ ఫైనల్స్ విజయం నాకెంతో ప్రత్యేకం. ఈ ఏడాది నేను సాధించిన తొలి టైటిల్ ఇదే కావడం... వరుస ఫైనల్స్ పరాజయాలకు బ్రేక్ పడటంతో నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. కొంతకాలంగా ఎక్కడి వెళ్లినా తరచూ ఫైనల్స్‌లో ఓడిపోతున్నావెందుకు అనే ప్రశ్న ఎదురైంది. ఇక మీదట నాకు అలాంటి ప్రశ్న మళ్లీ ఎదురుకాదేమోనని భావిస్తున్నాను. గతేడాది ఇదే టోర్నీ ఫైనల్స్‌లో విజయం అంచుల్లో నిలిచి ఓడిపోయాక ఎంతో బాధపడ్డాను. ఈసారి మాత్రం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. తేలిగ్గా తీసుకోలేదు... జపాన్ క్రీడాకారిణులు ఒకుహారా, యామగుచిలతో ఆడే మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగుతాయి. ఎక్కువగా ర్యాలీలు ఉంటాయి. ఈసారీ అదే జరిగింది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి విజయాన్ని అందుకున్నాను. ఈ టోర్నీలో ఎవరినీ తేలిగ్గా తీసుకోలేదు. తదుపరి లక్ష్యం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్... ఈ విజయంతో సింధు మదిలో నుంచి ఫైనల్లో ఓడిపోతున్నాననే అంశం వెళ్లిపోతుందని అనుకుంటున్నా. టోర్నీ మొత్తం సింధు ఆటతీరు అద్భుతంగా ఉంది. ఎంతో నాణ్యమైన క్రీడాకారిణులపై ఆమె గెలిచింది. వచ్చే ఏడాది మా ప్రధాన లక్ష్యం ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించడమే. 2001లో నేను టైటిల్ సాధించాక భారత్ నుంచి మరో ప్లేయర్‌కు ఈ టైటిల్ లభించలేదు. వచ్చే ఏడాది ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్నాం. అనంతరం 2020 టోక్యో ఒలింపిక్స్, 2022 కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించడం మా భవిష్యత్ లక్ష్యాలుగా నిర్దేశించుకున్నాం. – పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ ‘సిల్వర్ సింధు’ కాదు... సింధు విజయం అద్భుతం. ఏడాది చివరికొచ్చేసరికి ‘సిల్వర్ సింధు’ కాదు భారత బ్యాడ్మింటన్ ‘గోల్డెన్ గర్ల్’ అని తన గెలుపుతో సింధు నిరూపించింది. ఈసారి టైటిల్‌తో తిరిగొస్తాననే విశ్వాసంతో ఆమె వెళ్లింది. తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించింది. సింధు ప్రదర్శనపట్ల ఎంతో గర్వంగా ఉన్నాను. అన్ని మ్యాచ్‌లను సింధు ఎంతో ఓపికతో, పక్కా ప్రణాళికతో ఆడింది. కొత్త చరిత్రను లిఖించింది. – పీవీ రమణ (సింధు తండ్రి) ప్రశంసల వెల్లువ... వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ విజేత పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె విజయాన్ని కొనియాడారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదితరులు సింధుకు అభినందనలు తెలిపారు. ‘బాయ్’ నజరానా రూ. 10 లక్షలు వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన పీవీ సింధును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అభినందించింది. విజేతగా నిలిచిన సింధుకు రూ. 10 లక్షల నగదు పురస్కారం... పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన సమీర్ వర్మకు రూ. 3 లక్షలు అందజేయనున్నట్లు ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. -
రన్నరప్ తరుణ్ జంట
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక దుబాయ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో హైదరాబాద్ ఆటగాడు కోన తరుణ్ ఆకట్టుకున్నాడు. తన భాగస్వామి లిమ్ ఖిమ్ వా (మలేసియా)తో కలసి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీకి చెందిన కోన తరుణ్–లిమ్ ఖిమ్ వా జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో తరుణ్ (భారత్)–లిమ్ ఖిమ్ వా (మలేసియా) ద్వయం 16–21, 9–21తో కిమ్ సంగ్ సో–యో యోంగ్ సియోంగ్ (కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీస్‌లో 21–16, 21–13తో డెన్నిస్ గ్రాచెవ్–పావెల్ కోస్టారెంకో (రష్యా) జంటపై గెలుపొందింది. క్వార్టర్స్‌లో ఈ జంటకు వాకోవర్ లభించింది. ప్రిక్వార్టర్స్‌లో 14–21, 21–18, 21–18తో సి సుంగ్–జిన్ సో లిమ్ (కొరియా)పై విజయం సాధించింది. -
మనవాళ్ల ప్రదర్శన సంతృప్తినిచ్చింది
ముంబై: భారత బ్యాడ్మింటన్‌కు ఈ ఏడాది క్లిష్టంగా గడిచిందని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. కఠిన పరిస్థితుల్లోనూ భారత క్రీడాకారుల ప్రదర్శన సంతృప్తినిచ్చిందని అన్నారు. అనుకూల పరిస్థితుల్లోనూ మన ప్లేయర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని కితాబిచ్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన నగర స్థాయి మల్టీ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ‘ముంబై గేమ్స్’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ క్రీడ ప్రస్తుత స్థితిగతులపై మాట్లాడారు. ‘బ్యాడ్మింటన్‌కు ఈ ఏడాది చాలా క్లిష్టంగా గడించింది. అయినప్పటికీ చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇంత కఠిన పరిస్థితుల్లో మన క్రీడాకారులు గొప్పగా ఆడారు. సింధు, శ్రీకాంత్ తమ స్థాయి నిలబెట్టుకుంటూ టాప్–10 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి మూడు మెగా ఈవెంట్లు జరిగాయి. ఇందులో పతకం సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ మా వద్ద అంత సమయం లేదు. ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకుంటూ ఈ మూడు పెద్ద ఈవెంట్లలోనూ పతకాలు సాధించాలన్నదే మా లక్ష్యంగా ఈ ఏడాది బరిలో దిగాం. అనుకున్నది సాధించాం. ఇక వచ్చే ఏడాది కోసం ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంది’ అని వివరించారు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ దొరకడం లేదని అన్నారు. ముఖ్యమైన టోర్నీలో దీని ప్రభావం కనబడుతుందని చెప్పారు. ప్రాక్టీస్‌లోనే ప్రతీ ప్లేయర్ తమ తప్పిదాలను సరిదిద్దుకుంటాడని వివరించారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం చాలా మెరుగవ్వాల్సి ఉంది. శ్రీకాంత్‌నే చూసుకుంటే అతను ఈ మధ్య ఇద్దరి చేతుల్లోనే ఎక్కువగా ఓడిపోతున్నాడు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో చూసి వారిపై గెలిచేలా మేం తయారవ్వాలి. వెంటవెంటనే టోర్నమెంట్లలో పాల్గొనాల్సి రావడంతో సరైన ప్రాక్టీస్ లేకుండా పోతోంది’ అని గోపీచంద్ వివరించారు. -
బ్యాక్ టు ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ అంటోన్న సుధీర్ బాబు!
‘సమ్మోహనం’, ‘నన్ను దోచుకుందువటే’ లాంటి కూల్ సినిమాలతో హిట్ కొట్టాడు సుధీర్ బాబు. ఇక ఈ యంగ్ హీరో తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టిసారించాడు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితాన్ని వెండితెరపై అవిష్కరించబోయే చిత్రంలో సుధీర్ బాబు నటించనున్నాడు. ఈ విషయం గురించి ట్వీట్ చేస్తూ.. ‘బ్యాక్ టు ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ (బ్యాడ్మింటన్). జనాలు చెప్పినట్లుగా.. తొలిప్రేమ ఎప్పటికీ జీవించే ఉంటుంది.. ప్రిపరేషన్ ఫర్ పుల్లెల గోపీచంద్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. సినిమాల్లోకి రాకముందు సుధీర్ బాబు బాడ్మింటన్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. Back to my first girlfriend 😜 #Badminton ... As people say, "First love is always alive" 😊 !! Preparation time for #PullelaGopichand pic.twitter.com/ayfkfnlLiT — Sudheer Babu (@isudheerbabu) November 13, 2018 -
పుల్లెల గోపిచంద్, నాగ్ అశ్విన్‌లకు విశిష్ట పురస్కారం
అమరావతి : వివిధ రంగాల్లో రాణిస్తూ సమాజానికి విశేష సేవలందిస్తున్న పలువురికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు అందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌లో ఈ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డాక్టర్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ ప్రవచనకారుడు డాక్టర్ గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ రెడ్డి(మహానటి ఫేం), ప్రముఖ తెలుగు రచయిత చొక్కాపు వెంకటరమణలకు ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యుఎస్ఎ) తరఫున ప్రతి ఏడాది ఈ విశిష్ట, విశేష పురస్కారాలను అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సాక్షి మీడియా గ్రూప్ ఈడీ రామచంద్రమూర్తి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
7న డా.రామినేని ఫౌండేషన్ పురస్కారాలు ప్రదానం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు ఈ నెల 7న మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో అందజేస్తామని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో గురు వారం ఫౌండేషన్ బ్రోచర్‌ను ఆవిష్క రించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు విశిష్ట పురస్కారం, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌రెడ్డి, మెజీషియన్ చొక్కాపు వెంకట రమణకు విశేష పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. -
ఆ సవాల్‌కు సింధు, సైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారత టాప్‌స్టార్స్‌కు మింగుడు పడని చైనీస్ తైపీ ప్రత్యర్థి తై జు యింగ్‌ను త్వరలోనే ఓడిస్తామని బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆసియా గేమ్స్‌లో సింధు, సైనాలిద్దరు రజత, కాంస్య పతకాలు సాధించారు. వీరిద్దరిని ప్రపంచ నంబర్‌వన్ తై జునే ఓడించింది. భారత బ్యాడ్మింటన్ బృందం స్వదేశం చేరాక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోచ్ మాట్లాడుతూ ‘సింధు, సైనాలిద్దరు మేటి షట్లర్లు. మానసిక, శారీరక స్థైర్యంతో ఉన్నారిద్దరు. ఎవరికి తీసిపోరు. అంత తేలిగ్గా ఓడిపోరు. త్వరలోనే తైపీ మిస్టరీని ఛేదిస్తారు. రచనోక్ ఇంతనోన్‌ను ఓడించినట్లే తై జుపై గెలుస్తారు. ఏటా చాలా టోర్నీలు జరుగుతున్నాయి. ఇందులో ఆడటం ద్వారా ప్రదర్శన, పోటీతత్వం మరింత మెరుగవుతాయి. అప్పుడు ఆమెను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు’ అని అన్నారు. టాప్‌స్టార్స్ ఇద్దరు కలిసి ఆమె చేతిలో మొత్తం 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. దీనిపై గోపీ మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే ఆమె ఓ లేడీ తౌఫిక్ హిదాయత్ (మాజీ ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్). అన్నింటా మెరుగైన ప్రత్యర్థి. కోర్టుల్లో చురుగ్గా కదం తొక్కుతుంది. తనకెదురైన ప్రత్యర్థికి దీటుగా బదులిస్తుంది. స్మార్ట్‌గా స్పందిస్తుంది. అన్ని రంగాల్లోనూ బలంగా ఉంది. ప్రస్తుతం తై జు, మారిన్ (స్పెయిన్) ప్రపంచ టాప్ షట్లర్లు. వీరిని ఓడించే వ్యూహాలతో సిద్ధమవుతాం’ అని వివరించారు. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌లో తొలిసారి రెండు పతకాలు గెలవడం ఆనందంగా ఉందన్నారు. 23 ఏళ్ల సింధు మాట్లాడుతూ ‘పోడియం ఫినిష్ ఎప్పటికీ చిరస్మరణీయమే. పతక విజేతగా నిలబడి మనముందు జాతీయ జెండా ఎగురుతుంటే ఆ ఆనందాన్ని వర్ణించలేను. అయితే ఈ పతకాలను ఆస్వాదించే సమయం కూడా మాకు లేదు. జపాన్ ఓపెన్ (సెప్టెంబర్ 11 నుంచి) కోసం వెంటనే సన్నాహకాల్లో పాల్గొనాలి’ అని చెప్పింది. తన ఆసియా గేమ్స్ పతకాన్వేషణ ఎట్టకేలకు జకార్తాలో ముగిసిందని సైనా తెలిపింది. ‘నాకు ఇది నాలుగో ఏషియాడ్. గత మూడు ఈవెంట్లలోనూ ఎంతో కష్టపడ్డా సాధ్యం కాలేదు. చివరకు ఇక్కడ సాకారమైంది’ అని చెప్పింది. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్ పుల్లెల గోపీచంద్
-
కన్నుల పండువగా‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డులు
-
ప్రతిభకు పట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభకు ‘సాక్షి’పట్టం కట్టింది. భవిష్యత్ తరాల స్ఫూర్తిదాతలను సమున్నతంగా సత్కరించింది. ఎక్స్‌లెన్స్ అవార్డులతో గౌరవించింది. సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అందజేసే ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ అవార్డుల నాలుగో ఎడిషన్ వేడుకలకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, పల్సెస్ హెల్త్‌టెక్ సీఈవో శ్రీను బాబు, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్య, రఫీ ఫుడ్స్ ప్రతినిధి రఫతుల్లా విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. శనివారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డులకు హాజరైన సినీ ప్రముఖులు ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్, సినీనటులు కోట శ్రీనివాసరావు, అలీ, జ్యూరీ చైర్పర్సన్ ప్రణతీరెడ్డి, సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు వేడుకలకు హాజరయ్యారు. విద్యావేత్త చుక్కా రామయ్యతోపాటు సినీరంగ ప్రముఖులు కృష్ణ, విజయనిర్మల దంపతులకు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’అవార్డును అందజేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోటీ పరీక్షల కోసం ఎంతో మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్న దివ్యాంగురాలైన విద్యావేత్త మల్లవరపు బాలలత ‘యంగ్ అచీవర్ అఫ్ ది ఇయర్’అవార్డును అందుకున్నారు. సామాజిక సేవా విభాగంలో గ్రాఫిటీ చిత్రాల ద్వారా కృషి చేస్తున్న స్వాతి, విజయ్ దంపతులు, స్పోర్ట్స్ విభాగంలో టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్, అజయ్కుమార్రెడ్డిలు జ్యూరీ స్పెషల్ అవార్డును అందుకున్నారు. వ్యవసాయరంగంలో ఎక్స్‌లెన్స్ ఫార్మింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గుండ్లపల్లి సుజాత, సేంద్రియ వ్యవసాయరంగంలో జగదీశ్ యాదవ్‌లకు అవార్డులు లభించాయి. వైద్య రంగంలో నైస్ ఫౌండేషన్, బిజినెస్ ఆఫ్ ద ఇయర్‌గా చీకోటి వెంకటేశ్వర్రావు, సోషల్ డెవలప్మెంట్ విభాగంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా అలోల దివ్యారెడ్డి, ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో వి.కిషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టర్ రెడ్డీ ల్యాబొరేటరీస్, తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా సురేష్, తదితరులు ‘ఎక్స్‌లెన్స్’అవార్డులను అందుకున్నారు. సినీరంగంలోనూ వివిధ విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఉర్రూతలూగించిన ఆటపాటలు.. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అదరహో అనిపించాయి. ఆ పాత సుమధుర గీతాలు ఆçహూతులను వీనుల విందు చేశాయి. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ఆదర్శ సినీ జంట కృష్ణ, విజయనిర్మల సినిమాల నుంచి పాడిన హిట్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినీ సంగీత ప్రముఖులు ఆర్పీ పట్నాయక్‌తోపాటు గాయకులు సింహా, అంజనా సౌమ్య, రక్షిత తమ గాన లాహిరితో ఆహూతులను అలరించారు. స్టార్ సింగర్స్ రేవంత్, మధుప్రియలు సైతం పాటలతో అబ్బురపరిచారు. ఎన్జీ డ్యాన్స్ అకాడమీ యువ డ్యాన్సర్లు తమ తుఫాన్ నృత్యాలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. నవ్వుల పువ్వులు పూయించి రచ్చ రవి (జబర్దస్త్ ఫేం) బృందం ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది. చుక్కా జీవితం స్ఫూర్తిదాయకం సామాజిక రంగాల్లో అపారమైన సేవలు అందజేసిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు జస్టిస్ నర్సింహారెడ్డి సాక్షి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నేత చుక్కా రామయ్య అని, విద్యారంగంలో ఆయన అపారమైన సేవలు అందజేశారని కొనియాడారు. వేలాది మంది జీవితాలను, వారి కుటుంబాలను గొప్పగా ప్రభావితం చేసిన రామయ్యకు అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘సాక్షి’చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు స్ఫూర్తినిస్తాయన్నారు. మంచిని గుర్తించి ప్రోత్సహించడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. శిశువులకు స్వచ్ఛమైన పాలు పాల కల్తీపై చాలా ఆందోళన చెందా. కేవలం నా పిల్లలకే కాదు చిన్నారులందరికీ స్వచ్ఛమైన పాలు అందించాలని భావించా. ఆ మేరకు గుజరాత్ నుంచి ఆవులను తెప్పించి డెయిరీ నడుపుతున్నా. పిల్లలకు కల్తీలేని నాణ్యమైన పాలను సరఫరా చేయగలుగుతున్నాం. దేశీ ఆవుల ప్రాముఖ్యత తెలుసుకున్నాం. వాటిని పెంచుతున్నాం. మంచి ఫలితాలు పొందుతున్నాం. – ఎ.దివ్యారెడ్డి, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది స్టార్టప్ అవార్డీ పది మందిని నడిపించలేకపోతేనే బాధ మా నాన్న విలువలతో కూడిన జర్నలిస్ట్. ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన స్ఫూర్తితోనే ఇదంతా చేస్తున్నా. జీవితంలో కష్టాలకు ఎప్పుడూ వెరవలేదు. అందరిలా నడవలేకపోతున్నానని ఏనాడూ బాధపడలేదు. పదిమందిని జీవితంలో ముందుకు నడిపించలేనప్పుడే నిజంగా బాధే స్తుంది. ఏనాడైతే తోటివారికి సహాయపడలేనో.. ఆ రోజే వికలాంగురాలిగా భావిస్తాను. సమాజానికి సేవచేసే అదృష్టం చాలా తక్కువ మందికే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలి. అంగవైఖల్యంతో బాధపడుతున్న నాకు అండగా నిలిచి, నన్నెంతగానో ప్రోత్స హించిన నాన్నతో పాటు దీపంవెలుగులో చదువుకుని సివిల్స్‌లో రాణిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. – బాలలత, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అవార్డు గ్రహీత గౌరవంగా భావిస్తున్నా ఇంటి నుంచి పారిపోయిన పిల్లలను ఆశ్రిత ఫౌండేషన్ ద్వారా పోలీసుల సహకారంతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నాం. చదువు ఆపేసిన వారికి, భిక్షాటన చేస్తున్న పిల్లలకు విద్యను అందిస్తున్నాం. నేషనల్ రెయిన్ బో సహకారంతో హోం నిర్వహిస్తున్నాం. మా సేవను గుర్తించి సాక్షి అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా. – నాగరాజు, ఆశ్రిత ఫౌండేషన్,ఎక్స్‌లెన్సీ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు ‘సాక్షి’మీడియాకు కృతజ్ఞతలు వివిధ రంగాల్లో సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డులు ఇవ్వడం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూ విద్యార్థుల మెరుగైన చదువు కోసం తీసుకుంటున్న చర్యలకు అవార్డు ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చింది. – వల్గోట్ కిషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ జీరో నాలెడ్జ్‌తో సాగు మొదలు పెట్టా రైతులంటే మగవారు మాత్రమే కాదు. మహిళలు కూడా వ్యవసాయం చేయగలరు అని చాటి చెప్పాలని భావించా. జీరో నాలెడ్జ్‌తో ప్రకాశం జిల్లాలో నాకున్న 40 ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలు పెట్టా. సంప్రదాయ పద్ధతులకు ఆధునికత జోడించా. మంచి ఫలితాలు సాధిస్తున్నా. రైతులు విషరహిత పంటలనే సాగు చేయాలి. – సుజాత, మహిళారైతు, ప్రకృతి వ్యవసాయం మా బాధ్యతను మరింత పెంచింది రెండేళ్ల క్రితం ఇద్దరం కలిసి ఇదే హాల్ పక్కన అర్ధరాత్రి ఓ పెయింటింగ్ వర్క్ చేశాం. అదే వర్క్‌ను ప్రస్తుత వేడుకలో ప్రదర్శించడం గర్వకారణంగా ఫీలవుతున్నాం. మేం అందుకున్న తొలి అవార్డు ఇదే. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. – స్వాతి, విజయ్, యంగ్ అచీవర్ ఆఫ్ ది సోషల్ సర్వీసెస్ మట్టినే మందుగా పిచికారీ చేశా చాలా మంది రైతులు సాగుపై అవగాహన లేక అడ్డగోలుగా రసాయన పురుగుమందులు వాడి దిగుబడి రాక నష్టపోతుంటా రు. సేంద్రియ వ్యవసాయం చాలా మందికి తెలియదు. భూమిలోనే పంటకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మట్టినే మందుగా శనగపై పిచికారీ చేశాను. మంచి ఫలితం వచ్చింది. – తుమ్మల జగదీష్ యాదవ్, సేంద్రియ వ్యవసాయం వెలుగులు నింపినప్పుడే సంతృప్తి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంతోపాటు ఆ రంగంలో ఆధారపడిన కార్మికుల జీవితాల్లోనూ వెలుగులు నింపినప్పుడే నిజమైన సంతృప్తి. గోదావరి పైప్స్ సంస్థను వ్యాపారపరంగా విస్తరింపజేయడమే కాదు అనేక మందికి ఉపాధి కల్పించింది. – చీకోటి వెంకటేశ్వరరావు,బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గ్రహీత రైతు కష్టం చూడలేక రైతు సంక్షోభంలో ఉండటం ఎంతగానో కలిచివేసింది. వారికి నా వంతు సహాయ, సహకారాలు అందజేస్తున్నా. రైతు కష్టపడితే కానీ మనం మూడు పూటలా భోజనం చేయలేం. కానీ అదే రైతు తన కుటుంబానికి రెండు పూటలు కూడా తిండి పెట్టలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలి. – సురేష్ ఏడిగ, తెలుగు ఎన్ఆర్ఐ అవార్డు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు నాపై నమ్మకం ఉంచి నాకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సంస్థలకు, వ్యక్తులకు కృతజ్ఞతలు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయను. – పుల్లెల గోపీచంద్,తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ‘సాక్షి’ ప్రేరణతో మరింత ముందుకెళ్తా నాన్న జహీర్ ఇచ్చిన ప్రోత్సాహంతో టెన్సిస్‌లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నా. నా కోసం ఇల్లు తాకట్టు పెట్టి మరీ వెన్నుతట్టారు. సాక్షి ఇచ్చిన ప్రేరణతో మరిన్ని పతకాలు సాధిస్తా. – షేక్ జాఫ్రీన్, జ్యూరీ స్పెషల్ రికగ్నేషన్ అవార్డు స్పోర్ట్స్ బాధ్యతను పెంచింది సంపాదించిన డబ్బులో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే విధానంతో అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. వారికి మెరుగైన విద్యను అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఈ అవార్డు మాపై మరింత బాధ్యతను పెంచింది. – వి.నారాయణరెడ్డి,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ కష్టానికి తగిన గుర్తింపు ఇది చిన్నప్పుడు జరిగిన ప్రమాదంతో ఒక కన్ను పూర్తిగా కనిపించకుండా పో యింది. మరో కన్ను పాక్షికంగా కనిపిస్తుంది. అయినా క్రికెట్‌పై ఉన్న మక్కు వను చంపుకోలేదు. 2010 నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత అంధుల క్రికెట్‌కు ఆడుతున్నా. 2016లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాను. నా కష్టాన్ని గుర్తించి సాక్షి గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. – అజయ్ కుమార్ రెడ్డి, జ్యూరీ స్పెషల్ రికగ్నేషన్ అవార్డు స్పోర్ట్స్ సేవకు తగిన గుర్తింపు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద బాలికలు, గర్భిణులకు ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. కమ్యూనిటీ హెల్ప్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాం. నవజాత శిశువుల ఆరోగ్యం కోసం తక్కువ ఖర్చుకే సేవలందిస్తున్నాం. – డాక్టర్ పద్మనాభరెడ్డి,నైస్ ఫౌండేషన్, ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సింధుకు ఏదీ కలిసి రాలేదు...
ఫైనల్లో సింధు ఆశించినట్లుగా ఆడలేకపోయింది. చాలా ఒత్తిడికి లోనైంది. ఎక్కువ సంఖ్యలో పొరపాట్లు చేసింది. నిజానికి ఈ ఫైనల్లో ఆమెకు ఏదీ కలిసి రాలేదు. టైటిల్ పోరుకు గత మ్యాచ్‌కు మధ్య విరామం కూడా తక్కువే. ఇటీవల కాలంలో ఆమెకు ఎదురైన ఫైనల్స్ పరాజయాల్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. ఎందుకంటే వరుసగా రెండు ప్రపంచ చాంపియన్ షిప్‌లలో ఫైనల్ చేరడం ఆషామాషీ కాదు. స్వర్ణం చేజారినా... ఓవరాల్‌గా సింధు ప్రదర్శన బాగుంది. తర్వాత జరిగే టోర్నీల్లో మెరుగైన నియంత్రణ, ఆటపై పట్టు సాధించే అంశాలపై మేం దృష్టి సారిస్తాం. – చీఫ్ కోచ్ గోపీచంద్ -
సంఖ్యే కాదు..పతకాలూ పెరుగుతాయి
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. 2018లో దాదాపు ఏడు నెలలు ముగిసినా అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో ఒక్క పెద్ద టోర్నీ కూడా (కామన్వెల్త్ క్రీడలను మినహాయిస్తే) మన షట్లర్లు గెలవలేదు. ఇక ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. ఈ నెల 30 నుంచి చైనాలోని నాన్జింగ్ నగరంలో జరగబోయే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 మంది షట్లర్ల బృందం ఇందులో పాల్గొంటుండటం విశేషం. 40 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ మొత్తం కలిపి 7 పతకాలు గెలుచుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఈసారి మన షట్లర్లు ఎన్ని పతకాలు సాధిస్తారనేది ఆసక్తికరం. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది గ్లాస్గోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి. అయితే ఈసారి మన ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి ఎక్కువ పతకాలు సాధించగలరని జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా, మనకు వేర్వేరు విభాగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 2018లో వరల్డ్ టూర్ టోర్నీల్లో మన షట్లర్ల ప్రదర్శన ప్రభావం దీనిపై ఉండదన్న గోపీచంద్... భారత్ సన్నాహాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే... వరల్డ్ చాంపియన్‌షిప్‌కు సన్నద్ధత... పోటీ చాలా తీవ్రంగా ఉండే ఇలాంటి పెద్ద టోర్నీకి సరైన రీతిలోనే మా సన్నద్ధత సాగుతోంది. అయితే వరుస టోర్నీల వల్ల మాకు తగినంత సమయం లభించలేదు. అనేక మంది ఆటగాళ్లు ఇప్పుడు సర్క్యూట్లోనే ఉన్నారు. ఈ జులై నెలలోనే చాలా మంది వరుసగా మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, సింగపూర్, ప్రస్తుతం రష్యా (24–29) టోర్నీ లలో ఆడుతూ వచ్చారు. దాంతో క్యాంప్‌లో ఒకేసారి శిక్షణ సాధ్యం కాలేదు. అయితే అంతా ఫిట్‌గా ఉన్నారు కాబట్టి సమస్య లేదు. మెరుగైన ప్రదర్శన ఇవ్వగలమని నమ్మకముంది. జట్టు సంఖ్యపై... మొత్తం 25 మంది సభ్యులతో భారత్ బరిలోకి దిగుతుండటం సంతోషకర పరిణామం. ఇంత పెద్ద సంఖ్యలో మనోళ్లు ఒకేసారి వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆడలేదు. కటాఫ్ తేదీ నాటికి ఉన్న ప్రపంచ ర్యాంక్‌ను బట్టి ఆటగాళ్లు అర్హత సాధిస్తారు. అంటే మనోళ్ల ప్రదర్శన వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో చాలా మెరుగ్గా ఉందనే అర్థం. వరల్డ్ ర్యాంక్ ద్వారా క్వాలిఫై అయ్యారంటే వారి ఆటను ప్రశంసించాల్సిందే. దీని వల్లే నాకు నమ్మకం మరింత పెరిగింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మన షట్లర్లు పతకం గెలవడం కొత్త కాదు. ఈసారి మరిన్ని పతకాలు గెలుస్తామనే నమ్మకం ఉంది. కేవలం సంఖ్యతో సరిపెట్టకుండా విజయాలు కూడా సాధించాలని పట్టుదలగా ఉన్నాం. 2018లో మన ఆటగాళ్ల ప్రదర్శనపై... వాస్తవంగా చెప్పాలంటే అంత గొప్పగా ఏమీ లేదు. సూపర్ సిరీస్ స్థాయి విజయాలు దక్కలేదనేది వాస్తవం. అయితే మరీ నిరాశాజనకంగా ఏమీ లేదు. కామన్వెల్త్ క్రీడల్లో మన జట్టు అద్భుతంగా ఆడి 6 పతకాలు సాధించింది. నా అభిప్రాయం ప్రకారం కొన్ని టోర్నీల్లో బాగా ఆడినా అదృష్టం కలిసి రాక ఓడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటిపైనే ఫోకస్ చేస్తూ దాని ప్రకారమే ట్రైనింగ్ సాగడంతో ఇతర పెద్ద టోర్నమెంట్లలో ఫలితాలు సానుకూలంగా రాలేదు. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఏడాదికి 12 తప్పనిసరి టోర్నీల కొత్త నిబంధన కూడా కొంత ఇబ్బంది పెట్టింది. అయితే ఈ ప్రదర్శన ప్రభావం వరల్డ్ చాంపియన్‌షిప్‌పై మాత్రం ఉండదని నా నమ్మకం. సింధు, సైనా ఫామ్‌పై... వీళ్లిద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. ఎప్పుడైనా, ఎలాంటి స్థితిలోనైనా సత్తా చాటగల సమర్థులు కాబట్టి రాబోయే టోర్నీల్లో వారి గురించి ఆందోళన లేదు. ఈ సంవత్సరం సింధు రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి మరో రెండు టోర్నీల్లో సెమీస్ వరకు వచ్చింది. కామన్వెల్త్ ఫైనల్లో సింధును ఓడించిన సైనా, ఇండోనేసియా మాస్టర్స్‌లో ఫైనల్ చేరింది. వారిలో ఆత్మవిశ్వాసానికి లోటు లేదు కాబట్టి మెగా టోర్నీలో మళ్లీ సత్తా చాటగలరు. గత ఏడాది కూడా సింధు (రజతం), సైనా (కాంస్యం) పతకాలు సాధించిన విషయం మరచిపోవద్దు. శ్రీకాంత్ ఆటతీరుపై... ఆందోళన పడాల్సిందేమీ లేదు. అతని ఆటలో లోపాలు లేవు. అన్ని విధాలా బాగానే ఆడుతున్నాడు. అయితే ఒక ఏడాది గెలిచిన టోర్నీలను మరుసటి ఏడాది వరుసగా నిలబెట్టుకోవడం అంత సులువు కాదు. శ్రీకాంత్ విషయంలో కూడా అదే జరుగుతోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఇండోనేసియా ఓపెన్ తొలి రౌండ్లో ఓడిపోవడం కొంత అనూహ్యం. వారం రోజుల వ్యవధిలో కెంటో మొమోటా (జపాన్) చేతిలోనే అతను రెండు సార్లు ఓడిపోవడమే ఆశ్చర్యపరచింది. మేం కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాం. మళ్లీ అది జరగకుండా కొత్త వ్యూహంతో శ్రీకాంత్ సిద్ధమవుతున్నాడు. కశ్యప్ కెరీర్‌పై... వరుస గాయాలు అతని కెరీర్‌పై ప్రభావం చూపించాయి. సర్క్యూట్లో చురుగ్గానే ఉన్నాడు కానీ గాయాల వల్ల పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. కోలుకొని ప్రయత్నిస్తున్నా ఆశించిన విజయాలు దక్కడం లేదు. సింగపూర్ ఓపెన్‌లో అతను 15 నిమిషాల్లోనే ఓడిపోయిన తొలి రౌండ్ మ్యాచ్ అసలు ఆడకుండా ఉండాల్సింది. ప్రత్యర్థి భారత్‌కే చెందిన ఆటగాడు (సౌరభ్ వర్మ) కావడం వల్ల నిబంధనల ప్రకారం వాకోవర్ ఇవ్వకూడదు. దాంతో ఏదోలా బరిలోకి దిగి మ్యాచ్ ముగించాడు. మన్ముందు అతని కెరీర్ గురించైతే ఇప్పుడే చెప్పలేను. వరల్డ్ చాంపియన్‌షిప్ బరిలో భారత షట్లర్లు ►పురుషుల సింగిల్స్: శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ. ►మహిళల సింగిల్స్: పీవీ సింధు, సైనా నెహ్వాల్. ►పురుషుల డబుల్స్: సుమీత్ రెడ్డి–మను అత్రి, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అర్జున్–శ్లోక్ రామచంద్రన్, తరుణ్ కోన–సౌరభ్ శర్మ. ►మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప; కుహూ గార్గ్– నింగ్షి హజారికా; మేఘన–పూర్వీషా; సంయోగిత–ప్రజక్తా సావంత్. ►మిక్స్డ్ డబుల్స్: సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సాత్విక్–అశ్విని పొన్నప్ప; సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్; రోహన్ కపూర్–కుహూ గార్గ్. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన ►1983: ప్రకాశ్ పదుకోన్ ( పురుషుల సింగిల్స్‌లో కాంస్యం) ►2011: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్‌లో కాంస్యం) ►2013, 2014: పీవీ సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యాలు) ►2015: సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్‌లో రజతం) ►2017: పీవీ సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం), సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్‌లో కాంస్యం). ►మొత్తం: 2 రజతాలు, 5 కాంస్యాలు -
పుల్లెల గాయత్రికి సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి విజేతగా నిలిచింది. కొచ్చిలో జరిగిన ఈ టోర్నీలో గాయత్రి అండర్–19 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 11–21, 21–16, 21–14తో నాలుగో సీడ్ అశ్విని భట్ (కర్ణాటక)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో గాయత్రి 21–16, 21–11తో టాప్ సీడ్ మాల్విక బన్సోద్ (మహారాష్ట్ర)కు షాకిచ్చింది. బాలుర సింగిల్స్ విభాగంలో మణిపూర్‌కు చెందిన మైస్నమ్ మీరాబా విజేతగా నిలిచాడు. తుది పోరులో మైస్నమ్ 21–10, 21–7 సిద్ధాంత్ గుప్తా (తమిళనాడు)ను ఓడించాడు. బాలుర డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణ ప్రసాద్ జోడీ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 21–15, 21–11తో టాప్ సీడ్ నవనీత్ (తెలంగాణ)–సాయి పవన్ (ఏపీ) జోడీపై గెలుపొందింది. బాలికల డబుల్స్‌లో తమిళనాడు జోడీ నీల–వర్షిణి విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఏపీకి చెందిన సాయి పవన్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో నాలుగో సీడ్ సాయి పవన్ (ఏపీ)–రియా అరోల్కర్ (మహారాష్ట్ర) జంట 14–21, 15–21తో అక్షన్ శెట్టి–రాశి లాంబే (మహారాష్ట్ర) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
పట్టాలెక్కనున్న గోపీచంద్ బయోపిక్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ బయోపిక్ ను తెరకెక్కించేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కారణాలు వెల్లడించకపోయినా ప్రాజెక్ట్ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ లో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాదాస్పద అంశాల జోలికి పోకుండా కేవలం ఆటకు సంబంధించిన అంశాలతోనే సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, గోపీచంద్ పాత్రలో నటించేందుకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో అదితిరావు హైదరి హీరోయిన్గా నటించారు. -
ఒడిశా బ్యాడ్మింటన్‌కు గోపీచంద్ సేవలు
ఒడిశా: భారత బ్యాడ్మింటన్‌కు ముఖచిత్రంగా మారిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ) ఒడిశా రాష్ట్రంలో తన సేవల్ని విస్తరించనుంది. ఈ మేరకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (పీబీఎంఎఫ్)తో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఒడిశా క్రీడా, యువజన శాఖ మంత్రిత్వశాఖ శుక్రవారం ఒప్పం దం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒడిశాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి పీజీఎంఎఫ్ సహకరించనుంది. అక్కడి అకాడమీల్లో శిక్షణ పొందే వర్ధమాన క్రీడాకారులకు కోచింగ్‌తో పాటు సాంకేతికంగా సహకరించనుంది. గోపీచంద్ పర్యవేక్షణలో శిక్షణా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ పీజీఎంఎఫ్ సహకారంతో ఒడిశాలో బ్యాడ్మింటన్ త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో తమ క్రీడాకారులు భారత్‌కు పతకాలు అందించే రోజు త్వరలోనే రానుందన్నారు. ఒడిశా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామన్న గోపీచంద్ ఒడిశా నుంచి ప్రపంచ స్థాయి షట్లర్లను తయారుచేస్తామని హామీ ఇచ్చారు. -
సైనా, సింధులను ‘సెపరేట్’ చేశారు?
హైదరాబాద్: ‘ఒక కోచ్‌గా సైనా, సింధులను ఒకేలా చూస్తా. వీళ్లిద్దరూ రెండు వజ్రాల లాంటి వారు. హైదరాబాద్‌లోని అకాడమీలో ఇద్దరి మధ్య ప్రతీరోజు గెలుపోటములు సహజమే. ఓడినా, గెలిచినా వారిని ప్రోత్సహిస్తూ మరింత ముందుకు వెళ్లాలని సూచిస్తుంటా. టోర్నమెంట్లు జరిగే సమయంలో మాత్రం కఠినంగా ఉంటా. నా శిష్యులు ఒలింపిక్ స్వర్ణం గెలవడమే నా లక్ష్యం’ అని కోచ్ పుల్లెల గోపీచంద్ గత నెల్లో చెప్పిన మాట. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి తిరిగి వచ్చిన సైనా, సింధూలకు కోచ్ గోపిచంద్ రెండు వేర్వేరు అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నారు. దీనిపై జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ.. ‘వీరికి వేర్వేరుగా శిక్షణ ఇవ్వాలని కోచింగ్ బృందం నిర్ణయించింది. గతంలో వేర్వేరు షెడ్యూళ్లలో సైనా, సింధూలకు శిక్షణ ఇచ్చాం. క్రీడాకారిణుల ఆసక్తి, మా కోచింగ్ జట్టు నిర్ణయంతో వారికి వేర్వేరు అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్‌లోని అకాడమీలో ఇద్దరి మధ్య ప్రతీరోజు గెలుపోటములు సహజమేనని నెలరోజుల క్రితమే వ్యాఖ్యానించిన గోపీచంద్.. ఇంతలోనే వారికి వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం ఏమిటనేది అభిమానుల ప్రశ్న. వేర్వేరుగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినా సైనా-సింధులకు విడిగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ఒకేచోట శిక్షణ ఇస్తే వారు మరింతగా రాటుదేలే అవకాశం ఉంటుంది కదా. సైనా-సింధులకు పొసగడం లేని కారణంగానే వేర్వేరు శిక్షణకు దారి తీసి ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ‘ఒక వరలో రెండు కత్తులు ఇమడవు’ అనే సామెత కూడా వారికి సెపరేట్‌గా శిక్షణ ఇవ్వడంతో మరోసారి నిజమైంది. 2014 సెప్టెంబరులో సైనా.. గోపిచంద్ అకాడమీని వదలి బెంగళూరులోని విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందింది. కాగా, గత ఏడాది సైనా నెహ్వాల్ తిరిగి గోపీచంద్ గూటికి చేరింది. -
గోపీచంద్ మరో అకాడమీ
నయా రాయ్‌పూర్: బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ పేరును విశ్వవ్యాప్తం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో కొత్త అకాడమీని ప్రారంభించారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వంటి ఆణిముత్యాలను తీర్చిదిద్దిన ఆయన టాటా ట్రస్ట్స్ సహాయంతో రాయ్‌పూర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో ‘పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ’ని నెలకొల్పారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ చేతుల మీదుగా ఈ అకాడమీ భూమి పూజ సోమవారం చేశారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్‌తో పాటు కోచ్ సంజయ్ మిశ్రా, భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, టాటా ట్రస్ట్స్ ప్రతినిధులు ఆనంద్, నీలమ్, ఐటీఎం యూనివర్సిటీ చాన్స్‌లర్ పీవీ రమణ, వైస్ చాన్స్‌లర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ అకాడమీలో అత్యాధునికమైన బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, ఫిజియోథెరపీ న్యూట్రిషన్ ల్యాబ్, బయో మెకానిక్స్ ల్యాబ్స్‌తో పాటు కోచ్‌లు, సిబ్బందికి నివాస వసతిని ఏర్పాటు చేస్తారు. భారత జాతీయ జూనియర్ కోచ్ సంజయ్ మిశ్రా అకాడమీ బాధ్యతలను చూసుకుంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాట్లాడుతూ ఛత్తీస్‌గడ్‌లో క్రీడాభివృద్ధికి గోపీచంద్ అకాడమీ దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడా ప్రతిభకు లోటు లేదన్న రమణ్ సింగ్ సరైన సమయంలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారని అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి అకాడమీ ఉండటంతో విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందుతారని అన్నారు. త్వరలోనే ఈ అకాడమీ నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రమణ్ సింగ్ మాటలతో ఏకీభవించిన కోచ్ గోపీచంద్ వచ్చే తరంలో స్టార్ ప్లేయర్లంతా ఛత్తీస్‌గఢ్ నుంచే వస్తారని అన్నారు. ఐటీఎం సహకారంతో చదువుతో పాటు సమాంతరంగా క్రీడలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో దూసుకుపోతున్న శ్రీకాంత్, ప్రణయ్ ఐటీఎం యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్లు కావడం విశేషం. యూనివర్సిటీలో అకాడమీ ఏర్పాటు చేయడం ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని వారన్నారు. గోపీచంద్‌లాంటి గురువు పర్యవేక్షణలో ఐటీఎం యూనివర్సిటీ నుంచి చాంపియన్లు పుట్టుకొస్తారని విశ్వాసం కనబరిచారు. ప్రస్తుతం గోపీచంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తోపాటు పశ్చిమ గోదావరిలోని తణుకు, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, వడోదరల్లో అకాడమీలు నడుస్తున్నాయి. -
సింధు, సైనాలపై పుల్లెల ఆశ్చర్యకర వ్యాఖ్యలు
సాక్షి , న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్‌లో భారత సత్తాను ప్రపంచానికి చాటిన సైనా నెహ్వాల్, పీవీ సింధూలను ఫిక్కీ మహిళా విభాగం గోల్డెన్ గర్ల్స్ ఆఫ్ బాడ్మింటన్ పేరుతో ఘనంగా సన్మానించింది. వారిని ఉన్నత స్థానానికి తీసుకురావడానికి కారణమైన పుల్లెల గోపీచంద్‌ను సైతం నిర్వాహకులు సన్మానించారు. ఈసందర్భంగా పుల్లెల మాట్లాడుతూ సైనా, సింధూ ఇద్దరూ వజ్రాల్లాంటి వారని, తన దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్‌కు బాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు వస్తాయని అన్నారు. సింధూ హార్డ్ వర్కర్ అని, సైనా ఎనర్జీ అమోఘమని గోపీచంద్ కితాబిచ్చారు. జీవితంలో విజయం సాధించిన మహిళలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముందని అందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పింకీరెడ్డి తెలిపారు. అనంతరం బాడ్మింటన్‌లో తమ అనుభవాలను సైనా, సింధూ వారితో పంచుకున్నారు. రియో ఒలంపిక్స్‌లో బాడ్మింటన్ పతకం వచ్చిందని, రానున్న ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు వస్తాయని వారు మీడియాకు చెప్పారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపటంతో పాటు సినిమాలు చూస్తానని సింధూ తెలిపారు. సైనా మాట్లాడుతూ తనకు బాలీవుడ్ చిత్రాలంటే పిచ్చంటూ ముచ్చటించారు. -
కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్ విజేతలు
-
కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్ విజేతలు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శనివారం ప్రగతిభవన్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని కేసీఆర్ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌ను కూడా కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్ సాధించడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారన్నారు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం వెల్లడించారు. కాగా, ఈ నెల 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నారు. సీఎంను కలిసిన వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్, పుల్లెల గోపిచంద్ పాటు పలువురు ఉన్నారు. -
ఇది గర్వించాల్సిన సమయం
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో మునుపెన్నడూ లేని విధంగా గోల్డ్‌కోస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత బ్యాడ్మింటన్ జట్టుపై జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రశంసల జల్లు కురిపించారు. పటిష్టమైన మలేసియా జట్టును ఓడించి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలవడమే మన సత్తాను చాటుతోందని అన్నారు. విజయాల కోసం కేవలం ఒకరిద్దరిపై మాత్రమే ఆధారపడే స్థాయి నుంచి, ప్రతి ఒక్కరూ పతకాలు గెలిచే స్థాయికి భారత బ్యాడ్మింటన్ ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత్ 6 పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్‌లో సైనా (స్వర్ణం), సింధు (రజతం)... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (రజతం), డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట (రజతం), మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (కాంస్యం) ద్వయంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ మనోళ్లు స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం మంగళవారం గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ... ‘బ్యాడ్మింటన్‌లో టీమ్ ఈవెంట్ స్వర్ణాన్ని అందుకుంటామని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది అందరి సమష్టి విజయం. గతంలో పతకం కోసం ఒక్కరో, ఇద్దరో ఆటగాళ్లపై మాత్రమే ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరూ తమ అత్యుత్తమ ఆటతో భారత్‌కు పతకాన్ని అందించారు. బ్యాడ్మింటన్‌లో మన దశ మారింది. ఒక మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు భారతీయులే తలపడేంతగా మన ఆట మెరుగైంది. ఇది గర్వించాల్సిన అంశం. నేను బ్యాడ్మింటన్ ఆడిన కాలంతో పోలిస్తే ఇప్పుడున్న పోటీ, ఆటగాళ్లపై అంచనాలు, బాధ్యతలు చాలా ఎక్కువ. అయినప్పటికీ వీరంతా నన్ను ఎప్పుడో దాటేశారు. భవిష్యత్‌లో ఇంకా చాలా సాధిస్తారు. గోల్డ్‌కోస్ట్ ఘనతంతా డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్పకే దక్కుతుంది. ఒకే రోజు వరుసగా ప్రాముఖ్యత కలిగిన 4 మ్యాచ్‌లాడి ఆమె మన పతకాల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించింది. సాత్విక్, చిరాగ్, సిక్కి రెడ్డి కూడా అద్భుతంగా ఆడారు’ అని గోపీచంద్ విశ్లేషించారు. -
ఆల్ ఇంగ్లండ్ వేటలో...
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో 1980లో ప్రకాశ్ పడుకొనే చాంపియన్... ఆ తర్వాత 21 ఏళ్ల విరామం తర్వాత విజేతగా పుల్లెల గోపీచంద్... ఆ అరుదైన విజయం దక్కి కూడా 17 సంవత్సరాలు అవుతోంది. ఈ మధ్యలో సైనా నెహ్వాల్ రెండో స్థానంలో నిలవడమే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అత్యుత్తమ ప్రదర్శన. బ్యాడ్మింటన్ చరిత్రలో అతి పురాతన టోర్నీగా గుర్తింపు ఉన్న ఈ మెగా ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణ ఉంది. గత కొన్నేళ్లలో మన షట్లర్లు ప్రపంచ వ్యాప్తంగా అన్ని పెద్ద స్థాయి టోర్నీలలో సత్తా చాటినా... ఆల్ ఇంగ్లండ్ మాత్రం వారికి కొరుకుడు పడలేదు. ఈ నెల 14 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగబోయే ఈ టోర్నీ కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ టోర్నీ బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్‌లో భారత్ తరఫున మను అత్రి–సుమీత్ రెడ్డి, సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి, మేఘన–పూర్వీ షా జోడీలు బరిలో నిలిచాయి. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జంట తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఒత్తిడి పెంచట్లేదు... ఆల్ ఇంగ్లండ్ టోర్నీ కోసం గత రెండు వారాలుగా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఇతర సూపర్ సిరీస్ టోర్నీలతో పోలిస్తే ఆల్ ఇంగ్లండ్‌కు అందరి దృష్టిలో క్రేజ్ ఉన్నా... ఆ పేరుతో ఆటగాళ్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో సన్నాహాలు జరిపి ఆడుతున్న తొలి టోర్నీ ఇదే. మంచి ఫలితాలు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ముఖ్యంగా సింధు, శ్రీకాంత్‌లకు మంచి అవకాశం ఉందని చెప్పగలను. సానుకూల ఫలితాలు ఆశిస్తున్నాం. అయితే డు ఆర్ డై లాంటి మాటలు చెప్పి ఆటగాళ్ళలో అనవసరంగా ఆందోళన పెంచాలని అనుకోవడం లేదు. ఆల్ ఇంగ్లండ్ తర్వాత వెంటనే కామన్వెల్త్ క్రీడలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా కూడా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాం. బీడబ్ల్యూఎఫ్ కొత్త షెడ్యూల్ కారణంగా మన ఆటగాళ్లకే ఎక్కువగా నష్టం జరగనుంది. 2018కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆటగాళ్లకు ఇప్పటికే అందించాను. కొత్త షెడ్యూల్ పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఏడాదికి 12 టోర్నీల్లో కచ్చితంగా ఆడాల్సిన స్థితిలో టోర్నీ, ప్రిపరేషన్ కలిపి కామన్వెల్త్, ఆసియా క్రీడలకు రెండు నెలల టైమ్ పోతుంది. బ్యాడ్మింటన్ ప్రపంచంలో భారత్‌కు, మలేసియాకు మాత్రమే ఇప్పుడు సమస్య ఉంది. దేశం తరఫున పతకం కోసం కాబట్టి మా ఆటగాళ్లెవరూ పెద్ద ఈవెంట్లకు దూరం కావడం లేదు. అందుకే ప్రతీ షట్లర్ గురించి నాకున్న అవగాహన ప్రకారం వారు ఏయే టోర్నీల్లో ఆడాలో, ఆడకూడదో స్పష్టంగా వారికి షెడ్యూల్ ఇచ్చేశాను. –పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ 1.15 మీటర్ల నిబంధనతో.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కొత్తగా రూపొందించిన ‘1.15 మీటర్ల సర్వీస్ నిబంధన’ను తొలిసారి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ లో ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం సర్వీస్ చేసే సమయంలో కోర్టు నుంచి 1.15 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే షటిల్‌ను ఉంచాలి. అది దాటితే ఫౌల్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు షట్లర్లు దాదాపు తమ నడుము భాగం వద్ద షటిల్ ఉంచి నేరుగా ప్రత్యర్థిపైకి దూసుకుపోయేలా వేగంగా సర్వీస్ చేస్తూ అదనపు ప్రయోజనం పొందుతున్నారు. నిబంధనల్లో సమానత్వం కోసం 1.15 మీటర్ల పరిమితిని విధించారు. పొడువైన ఆటగాళ్లకు ఇది సమస్యే. వారు బాగా కిందికి వంగాల్సి ఉంటుంది. భారత ఆటగాళ్లు ఫౌల్ కాకుండా ప్రత్యేక పరి కరంతో రోజూ దీనిపై ప్రాక్టీస్ చేస్తున్నారు. స్మాష్‌కు అవకాశం ఇవ్వడం లేదు... ఇటీవల నా ఆటలో కొన్ని మార్పులు చేయడం తప్పనిసరిగా మారిపోయింది. తై జు లాంటివాళ్లు తెలివిగా తప్పు దోవ పట్టించే షాట్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా జపాన్ క్రీడాకారిణులు కూడా సుదీర్ఘ ర్యాలీలపైనే దృష్టి పెట్టారు. గతంలో నా బలం స్మాష్‌ను సమర్థంగా ఉపయోగించుకునేదాన్ని. అయితే నా ప్రత్యర్థులు షటిల్‌ను ఏమాత్రం పైకి లేపకుండా ఆడుతూ స్మాష్‌కు అవకాశం ఇవ్వడం లేదు. దాంతో నేను కూడా కొత్తగా ఆలోచించాల్సి వచ్చింది. ఆల్ ఇంగ్లండ్‌లో గెలవాలనే నా కోరిక ఈ సారి తీరుతుందని ఆశిస్తున్నా. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు ఇటీవలే కొత్తగా సొంత ఫిజియోను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ముంబైకి చెందిన గాయత్రి నాతో కలిసి పని చేస్తోంది. గాయత్రి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు కూడా వచ్చింది. శరీరంపై అధిక భారం పడకుండా, అదే విధంగా ఎలాంటి లోపాలు లేకుండా ప్లానింగ్‌తో ఫిట్నెస్ ట్రైనింగ్ చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మానసికంగా కూడా మరింత దృఢంగా మారాను. – పీవీ సింధు పూర్తి ఫిట్నెస్తో ఉన్నా... గత ఏడాది నాకు అద్భుతంగా గడిచింది. ఈ సంవత్సరం ఇండియా ఓపెన్‌లో సానుకూల ఫలితం రాలేదు కానీ ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నా. ఫిట్నెస్ పరంగా ప్రస్తుతం 100 శాతం బాగున్నాను. ప్రత్యేకంగా సన్నాహాలు లేకపోయినా గత రెండు వారాలుగా బాగా శ్రమించాను. ఈ కష్టం ఫలితాల రూపంలోకి మారాలని కోరుకుంటున్నా. సింగిల్స్ కోచ్‌గా మంచి ఫలితాలు అందించిన ముల్యో జట్టుకు దూరం కావడంతో మరీ పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఆయన శిక్షణ సమయంలో కొన్ని రకాల ఆలోచనలు, ప్రత్యర్థిని ఎదుర్కొనే విషయంలో కొన్ని వ్యూహాలకు అలవాటు పడ్డాం. ఇప్పుడు మళ్లీ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే గోపీ సర్ ఉన్నారు కాబట్టి సమస్య లేదు. – కిడాంబి శ్రీకాంత్ -
ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు
గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం... ఈ ఏడాది ఆగస్టులో వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి... ఇప్పుడు తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో అదే ఫలితం.... పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో విక్టరీకి ‘ఫినిషింగ్ టచ్’ ఇవ్వలేకపోయింది. ఫైనల్లో పరాజయం అనంతరం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఓటమికంటే ఓడిన తీరు తనను ఎక్కువగా బాధ పెట్టిందని తెలిపింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే... ఫైనల్ పరాజయంపై... చాలా బాధగా ఉంది (ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ)... వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా ఇలాగే జరిగింది. మ్యాచ్ ముగిశాక చాలా సేపు వరకు కూడా కోలుకోలేదు. నా బాధను దాచుకోలేక ఒంటరిగా వెళ్లి ఏడ్చేశాను. చాలా కష్టపడి చాలా బాగా ఆడిన మ్యాచ్ ఇది. అసలు ఎలా ఓడానో అర్ధం కావడం లేదు. 19–19 వద్ద ఉన్నప్పుడు కూడా పరాజయం గురించి భయపడలేదు. నా వైపు నుంచి ఎలాంటి అనవసర తప్పిదాలు చేయలేదు. ఆఖరి రెండు పాయింట్లపై... నిజానికి ఆ రెండు కూడా నేను ర్యాలీలుగానే ఆడాలని భావించాను. దురదృష్టవశాత్తూ షటిల్స్ నెట్‌ను దాటలేకపోయాయి. వాటిలో ఒక్క పాయింట్ వచ్చినా ఫలితం భిన్నంగా ఉండేదేమో. మ్యాచ్ నాణ్యత గురించి చెప్పాలంటే అంతా గొప్పగా సాగింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే లీగ్ మ్యాచ్‌లో నేను ఓడించిన యామగుచి వేరు. ఫైనల్లో ఆడిన యామగుచి వేరు. ఫిట్నెస్పరంగా సమస్యలు... ఇంత సుదీర్ఘమైన మ్యాచ్‌లో అలసిపోవడం, మధ్యలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం సహజం. ఆమెకు కూడా అలాగే అయింది. ఇటీవల చాలా మంది ర్యాలీలు ఎక్కువగా ఆడుతున్నారు. దానికి నేను కూడా సిద్ధమయ్యే వచ్చాను. అయితే డిఫెన్స్ కూడా బలంగా ఉండటం ముఖ్యం. ఆటపరంగా గెలిచేందుకు నేను ఏం చేయగలనో అంతా చేశాను కానీ చివర్లో అంతా చేజారింది. కీలక ఫైనల్ మ్యాచ్‌లలో ఓటములపై... నాకు కూడా ఫైనల్ ముగిశాక ఒకుహారా మ్యాచే గుర్తుకొచ్చింది. ఆటలో గెలుపోటములు సహజం కానీ కొన్ని విషయాల్లో నేను మరింత మెరుగు పడాల్సి ఉంది. 2017 సంవత్సరం చాలా బాగా సాగింది. నా కెరీర్లో ఒకే ఏడాది ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన సంవత్సరం ఇది. ఫైనల్స్‌లో గెలిస్తే ఇంకా బాగుండేది కానీ రన్నరప్ కూడా మంచి ఫలితమే. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ మొదలు పెడతాను. వరల్డ్ నంబర్‌వన్ కూడా సాధించే అవకాశం ఉంటుంది కదా. ‘చాలా హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఇద్దరూ బాగా ఆడారు. ఇద్దరూ గెలిచేలా కనిపించారు. అయితే యామగుచి కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించింది. చివర్లో సింధు కొంత అలసిపోవడంతో కొన్ని సార్లు అనుకున్న రీతిలో సరైన షాట్లతో స్పందించలేదు. కాస్త జలుబుతో కూడా బాధపడుతుండటంతో పదే పదే విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆటపరంగా నేను సంతృప్తి చెందాను. గత మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి సింధు గర్వపడవచ్చు. ఈ ఓటమితో ఆమె బాధ పడటం సహజం. 2017లో ఆమె వరుసగా పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడింది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండానే గెలిచింది. సుదీర్ఘ ర్యాలీలు సహజంగా మారుతున్నాయి కాబట్టి సమస్య లేదు. ఇక్కడ కొంత అలసట కనిపించినా... నా దృష్టిలో ఫిట్నెస్పరంగా బ్యాడ్మింటన్ సర్క్యూట్లో ఆమె అత్యుత్తమ క్రీడాకారిణులలో ఉంటుంది. కాబట్టి నాకు ఆమె ఫిట్నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆమె తన తప్పులు సరిదిద్దుకొని మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. – ‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత కోచ్ -
సింధు సగర్వంగా...
ప్రత్యర్థితో గట్టి పోటీ ఎదురైనా... అలసట తన కదలికలపై ప్రభావం చూపిస్తున్నా... ఎక్కడా తగ్గకుండా ఆడిన పీవీ సింధు అనుకున్న ఫలితాన్ని సాధించింది. మధ్యలో రిఫరీ హెచ్చరికలు ఇబ్బంది పెట్టినా... అశేష అభిమానుల అండ, కోచ్ గోపీచంద్ ప్రోత్సాహం ఈ తెలుగు అమ్మాయిని మరింత ముందుకు దూసుకుపోయేలా చేశాయి. అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిన ఆమె తొలిసారి వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా మహిళల సింగిల్స్‌లో ఒకే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్, బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ తుది పోరుకు అర్హత సాధించిన మూడో షట్లర్‌గా నిలిచింది. అరుదైన ఘనత సాధించేందుకు మరో విజయం దూరంలో ఉన్న సింధు నేడు జరిగే అంతిమ సమరంలో అకానె యామగుచితో తలపడుతుంది. దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి : సూపర్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు తన అద్భుతమైన ఆటతో 2017కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–15, 21–18 స్కోరుతో చెన్ యుఫె (చైనా)ను చిత్తు చేసింది. 59 నిమిషాలపాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒక్కో పాయింట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. ఫలితంగా సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. చివరకు సింధుదే పైచేయి అయింది. గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా సింధు దూకుడుగా ఆటను ప్రారం భించింది. ప్రత్యర్థి పొరపాట్లు కూడా కలిసి రావడంతో 5–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ దశలో కోలు కున్న యుఫె చెలరేగింది. ఆమె కూడా ఐదు పాయింట్లు కొల్లగొట్టి స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత కూడా వరుసగా స్మాష్‌లతో చెలరేగి ఒక దశలో ప్రత్యర్థి 8–6తో ఆధిక్యంలో నిలిచింది. అయితే యుఫె తప్పులతో మళ్లీ 9–8తో ముందంజ వేసిన సింధు, అదే ఆధిక్యాన్ని 15–11 వరకు కొనసాగించింది. స్కోరు 16–14 వద్ద ఉన్నప్పుడు సింధు కొట్టిన అద్భుతమైన స్మాష్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వరుసగా మూడు సార్లు షటిల్‌ను నెట్‌కు కొట్టిన యుఫె, సింధు రిటర్న్‌ను అందుకోలేక గేమ్‌ను అప్పగించింది. హోరాహోరీ.. రెండో గేమ్ మాత్రం పోటాపోటీగా సాగింది. ఈసారి యుఫె మెరుగ్గా ఆడటంతో సింధు శ్రమించక తప్పలేదు. అయితే ఏ దశలోనూ ప్రత్యర్థి తనను దాటిపోయే అవకాశం మాత్రం సింధు ఇవ్వలేదు. 6–3, 7–3, 9–4, 10–7... ఇలా సింధు తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ప్రత్యర్థికి పొరపాటున పాయింట్ ఇచ్చినా, ఆ వెంటనే కోలుకోగలిగింది. చూడచక్కటి ఆటతో అలరించిన సింధు మధ్యలో తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. పాయింట్లు సాధించాలనే పట్టుదలతో వరుసగా రెండు సార్లు అంపైర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసి రెండు సార్లూ ప్రతికూల ఫలితాన్ని పొందింది. అద్భుతమైన ర్యాలీ తర్వాత స్కోరు 15–15తో సమమైంది. సింధు అలసిపోవడాన్ని గుర్తించిన యుఫె వరుస స్మాష్‌లతో దాడి చేసింది. అయితే 16–16 వద్ద సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి దూసుకుపోయింది. ర్యాలీ సుదీర్ఘ సమయం పాటు సాగడంతో ఒక దశలో సింధు నిస్సత్తువగా కనిపించి గేమ్ కోల్పోతుందేమో అనిపించింది. అయితే ఆమె పట్టుదలగా నిలబడగా, యుఫె రెండు స్మాష్‌లు నెట్‌కు తగలడంతో గెలుపు సింధు వశమైంది. మరో సెమీఫైనల్లో యామగుచి 17–21, 21–12, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. మొత్తానికి ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు బాగా మద్దతిచ్చారు. ముఖ్యంగా స్టేడియానికి వచ్చిన తెలుగువారంతా చప్పట్లతో నన్ను ప్రోత్సహించారు. ఆదివారం జరిగే ఫైనల్‌పై దృష్టిపెట్టాను. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతాను. యామగుచిపై విజయాల పైచేయి ఉన్నప్పటికీ... ఆమె అంత సులువైన ప్రత్యర్థి కాదు. హోరాహోరీ తప్పదు. – ‘సాక్షి’తో సింధు ఇది క్లిష్టమైన మ్యాచ్. ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. రెండో గేమ్‌లో ఒక దశలో సింధు తీవ్రంగా అలసిపోయింది. జలుబుతో ఇబ్బంది పడింది. కానీ ఏ దశలోనూ మ్యాచ్‌పై పట్టు సడలించలేదు. నిజానికి ఈ టోర్నీలో సింధు అద్భుతంగా ఆడుతోంది. ఫైనల్ చేరడం ఆనందంగా ఉంది. టైటిల్ పోరులో నిలిచిన యామగుచిపై ఇప్పటిదాకా సింధుదే ఆధిపత్యమైనప్పటికీ ఫైనల్... ఫైనలే! అక్కడ ఎవరినీ అంతా తేలిగ్గా తీసుకోలేం. – ‘సాక్షి’తో కోచ్ గోపీచంద్ ►నేటి ఫైనల్ సింధు(vs)యామగుచి మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఐదింటిలో గెలిస్తే! ఈసారి వదలను!
ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన జోరులో ఒకరు... రెండు సూపర్ సిరీస్ విజయాలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం ఇచ్చిన ఉత్సాహంతో మరొకరు... సంవత్సరం ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి ఇప్పుడు దానికి మరో చక్కటి ముగింపు ఇవ్వాలనే ప్రయత్నం ఇద్దరిదీ. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సత్తా చాటేందుకు భారత టాప్ షట్లర్లు, తెలుగు తేజాలు కిడాంబి శ్రీకాంత్ , పీవీ సింధు సన్నద్ధమయ్యారు. టాప్–8 మంది ఆటగాళ్లు మాత్రమే తలపడే ఈ టోర్నీ రేపటి నుంచి ఆదివారం వరకు జరుగుతుంది. సోమవారం టోర్నీ ‘డ్రా’ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో తమ ఇటీవలి ప్రదర్శన, టోర్నీలో విజయావకాశాలపై వారిద్దరితో దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది ప్రత్యేక ఇంటర్వ్యూ... కెరీర్లో 2017 ముద్ర... ఆటగాడిగా ఇన్నేళ్లలో ఇంత గొప్ప సంవత్సరం రాలేదు. చాలా సంతోషంగా ఉంది అనడం చిన్న మాట అవుతుంది. ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్... ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుసగా సూపర్ సిరీస్ టైటిల్స్ సాధిస్తూ పోవడం గొప్పగా అనిపించింది. రెండేసి వారాల చొప్పున వరుసగా రెండు టైటిళ్లు సాధించడం కూడా అద్భుతంలా సాగింది. నా ఆటను మరింత మెరుగుపర్చడంతో పాటు గోపీ సర్ ప్రణాళికల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పగలను. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఓడినా... అది మన సాయిప్రణీత్తోనే కాబట్టి ఎక్కువగా బాధించలేదు. సూపర్ సిరీస్ ఫైనల్స్ సన్నద్ధత, విజయావకాశాలపై... సర్క్యూట్లో పెద్ద టోర్నీగా ఫైనల్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానికి అనుగుణంగానే గట్టిగా సిద్ధమయ్యాను. గత రెండు టోర్నీలు ఆడకపోవడం వల్ల కూడా వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టి పెట్టేందుకు తగిన సమయం లభించింది. ఒక్క మాట మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ నాలుగు సూపర్ సిరీస్ టోర్నీల విజయాలు ఇచ్చిన జోష్ మాత్రం తప్పనిసరిగా నా ఆటలో కనిపిస్తుంది. నా ఆటతీరు (యాటిట్యూడ్)లో మార్పు, షాట్ల ఎంపికలో కూడా ఆ మార్పును చూడవచ్చు. అదే ఉత్సాహంతో ఫైనల్స్‌లో కూడా ఆడగలనని నమ్ముతున్నా. ‘డ్రా’ కఠినంగా అనిపిస్తుందా... బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌లో సులువైన డ్రా గురించి ఆలోచించవద్దు. తొలి మ్యాచ్‌లోనే అక్సెల్సన్తో తలపడుతున్నాను. ఇది ఒకందుకు మంచిదే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లీగ్ దశలో తర్వాతి రెండు మ్యాచ్‌లకు కూడా ఊపు కొనసాగుతుంది. షి యుఖితో ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో గెలిచాను. అక్సెల్సన్ను డెన్మార్క్‌లో ఓడించాను. చౌ టీన్‌తో ఒక్కసారే తలపడ్డాను. అయితే ప్రత్యర్థులు ఎవరనేదానికంటే నా ఆటనే నేను ఎక్కువగా నమ్ముకున్నాను. సరిగ్గా చెప్పాలంటే ఇంత బాగా సాగిన సంవత్సరంలో మరో ఐదు మంచి రోజులు చాలు. ఈ ఐదు రోజుల్లో జరిగే ఐదు మ్యాచ్‌లను గెలిస్తే తిరుగుండదు. ఫిట్నెస్ సమస్య తగ్గినట్లేనా... ఇప్పుడు 100 శాతం ఫిట్‌గా ఉన్నాను. తొడ గాయం తగ్గిపోయింది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. నిజానికి హాంకాంగ్ ఓపెన్‌కు కూడా నేను ఆడగల స్థితిలోనే ఉన్నాను. కానీ పెద్ద టోర్నీ ముందుంది కాబట్టి రిస్క్ చేయదల్చుకోలేదు. కానీ నంబర్‌వన్ అవకాశం చేజారిందిగా... అలా ఏమీ అనుకోవడం లేదు. నంబర్‌వన్ కోసం చైనా ఓపెన్ ఆడితే పొరపాటున గాయం పెరిగి అది మరింత సమస్యగా మారిపోయేదేమో. అయితే ర్యాంకింగ్‌ను దృష్టిలో పెట్టుకొని, దాని గురించి ఆలోచిస్తూ టోర్నీలు ఆడరాదని నిర్ణయించుకున్నాము. విజయాలు సాధిస్తే ర్యాంక్ ఎలాగూ వస్తుంది. అయినా బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ గెలిస్తే నేను నంబర్‌వన్ అవుతాను కదా. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంపై... నన్ను నియమిస్తున్నట్లు ప్రకటన మాత్రమే వచ్చింది. ఇంకా అధికారికంగా ఉత్తర్వులు అందుకోలేదు. అప్పుడే బాధ్యతల గురించి ఆలోచిస్తా. అయితే ఇలా ఎంపిక కావడం మాత్రం సంతోషంగా ఉంది. ఇద్దరికీ సత్తా ఉంది. సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు సింధు, శ్రీకాంత్ అన్ని విధాలా సన్నద్ధమై వచ్చారు. వారి తాజా ఫామ్, ప్రత్యర్థులను బట్టి చూస్తే ముందైతే సెమీఫైనల్ కచ్చితంగా చేరగలరని నమ్ముతున్నాను. ‘డ్రా’ గురించి ఆందోళన అనవసరం. ఇలాంటి పెద్ద టోర్నీలో అది సహజం. గతంలో అనేక మంది బలమైన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించిన రికార్డు వీరిద్దరికీ ఉంది. 2017లో మనం అలాంటి మ్యాచ్‌లు చాలా చూశాం. కాబట్టి భారత షట్లర్లు ఇద్దరికీ ఫైనల్స్ గెలిచే సామర్థ్యం ఉందని భావిస్తున్నా. – పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఒకే గ్రూప్‌లో శ్రీకాంత్, అక్సెల్సన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్, వరల్డ్ చాంపియన్, నంబర్‌వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో తలపడనున్నాడు. వీరిద్దరూ గ్రూప్ ‘బి’లో ఉన్నారు. ఇదే గ్రూప్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్ చౌ టీన్ చెన్ (చైనీస్ తైపీ), ఎనిమిదో ర్యాంకర్ షి యుఖి (చైనా) ఉన్నారు. గ్రూప్ ‘ఎ’లో స్టార్ ఆటగాళ్లు చెన్ లాంగ్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), సన్ వాన్ హో (కొరియా), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) తలపడుతున్నారు. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’లో హి బింగ్ జియావో (చైనా)ను మొదటి మ్యాచ్‌లో పీవీ సింధు ఎదుర్కొంటుంది. ఈ గ్రూప్‌లోనే సయాకా సాటో, అకానె యామగుచి (జపాన్) ఉన్నారు. గ్రూప్ ‘బి’లో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో పాటు ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), సుంగ్ జీ హున్ (కొరియా), చెన్ యుఫె (చైనా) ఉన్నారు. ఒక్కో గ్రూప్‌లో ప్లేయర్ తమ గ్రూప్‌లోని మిగతా ముగ్గురితో తలపడతారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీస్‌కు చేరతారు. ఈసారి వదలను 2017లో ఆటతీరుపై... గత ఏడాది రియో ఒలింపిక్స్ రజతం అంతులేని ఆనందాన్ని మిగిల్చితే ఈ సంవత్సరం కూడా బాగా సాగింది. ఇండియన్ ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలుచుకోగలిగాను. హాంకాంగ్‌లో రన్నరప్‌గా నిలిచాను. డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్ పరాజయం కూడా ఉంది. కానీ వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్లో పరాజయం మాత్రం చాలా కాలం బాధించింది. అంత గొప్ప మ్యాచ్ ఆడి ఓడిపోయాను. అయితే నా కాంస్యాన్ని రజతంగా మార్చుకోగలగడం ఆనందమే. చాలా కాలం తర్వాత నేషనల్స్‌లో కూడా బరిలోకి దిగడం చెప్పుకోదగ్గ విశేషం. రేపటి నుంచి జరిగే ఫైనల్స్‌పై... ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్స్ నా ఖాతాలో ఉన్నాయి. ఇక బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఇది అతి పెద్ద టోర్నీ కాబట్టి కచ్చితంగా విజేతగా నిలవాలని పట్టుదలగా ఉన్నా. 2016లో బాగానే ఆడినా సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాను. ఈసారి అవకాశం పోగొట్టుకోను. అంతకంటే మెరుగ్గా ఆడగలనన్న విశ్వాసం ఉంది. తగినంత సమయం దొరకడంతో చాలా బాగా సన్నద్ధమయ్యా. కలిసొచ్చిన ఈ సంవత్సరాన్ని మరింత సంతోషంగా ముగించాలని భావిస్తున్నా. ‘డ్రా’ గురించి... ప్రపంచంలో టాప్–8 షట్లర్లు మాత్రమే బరిలోకి దిగుతారు కాబట్టి డ్రా సులువా, కఠినమా అనే విషయంపై అతిగా ఆలోచించలేదు. ఇతర టోర్నీలలో ఆరంభ మ్యాచ్‌లు కాస్త సులువుగా ఉంటాయి. ఇక్కడ ఆ అవకాశం లేదు. పైగా పాయింట్లు సమంగా ఉన్నప్పుడు గెలిచిన గేమ్‌లు, సాధించిన పాయింట్లు కూడా పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి గెలుపు మాత్రమే కాదు... ప్రతీ పాయింట్, ఎంత తేడాతో గెలిచామన్నది కూడా ముఖ్యం. నా తొలి లక్ష్యం సెమీస్ చేరుకోవడమే. ఫిట్‌నెస్‌పై... ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ కంటే మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పగలను. ఇటీవల బ్యాడ్మింటన్‌లో సుదీర్ఘ సమయం మ్యాచ్‌లు సాగుతున్నాయి. శారీరకంగా మేం చేసే శ్రమ దీనికి సరిపోతుంది. కానీ మానసికంగా అంత సేపు ఓపిగ్గా, ఏకాగ్రతతో ఉండటం కష్టమైపోయింది. పాయింట్ కచ్చితంగా వస్తుందని భావించిన చోట పొరపాటు జరిగితే అసహనం పెరిగిపోతుంది. అది చివరకు ఒక్క పాయింట్ నుంచి మ్యాచ్‌పై ప్రభావం చూపించే వరకు వెళుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీనిపై నేను, గోపీ సర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కోర్టులో ఓపిగ్గా ఆడే తత్వం ఇక ముందు నానుంచి కనిపిస్తుంది. వచ్చే ఏడాది బిజీ షెడ్యూల్‌పై... టాప్ ప్లేయర్లు 12 టోర్నీల్లో పాల్గొనాలంటూ కొత్తగా తెచ్చిన నిబంధన ఎలా అమలవుతుందో చెప్పలేను. ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. దీనిపై కోచ్‌తో చర్చించి ప్లానింగ్ చేసుకోవచ్చు. భారత్‌కు సంబంధించి 2018లో ఆసియా, కామన్వెల్త్ క్రీడలు కూడా ఉన్నాయి కాబట్టి అది అదనపు సమస్యగా మారవచ్చు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతల నిర్వహణపై... కొత్తగా ఉంది. ఎక్కువ రోజులు ఆఫీస్‌కు ఏమీ వెళ్లలేదు. కానీ బాధ్యతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం సెలవులో ఉన్నాను. టోర్నీలు ముగిశాక మళ్లీ వెళతాను. -
పుల్లెల గోపీచంద్ అకాడమీ ప్రతిభాన్వేషణ కార్యక్రమం
బ్యాడ్మింటన్ క్రీడలో ఓనమాలు దిద్దుతోన్న చిన్నారులకు మంచి అవకాశం. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సంయుక్తంగా కొత్త టాలెంట్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టాయి. దీని ప్రకారం అండర్–10 స్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి గోపీచంద్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు ఎంపికవ్వాలంటే చిన్నారులు బ్యాడ్మింటన్ ఆడుతున్న 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను ఈనెల 28వ తేదీలోపు ఫేస్బుక్, ట్విట్టర్‌లోని ‘ఐడీబీఐ ఫెడరల్ క్వెస్ట్ ఫర్ ఎక్స్‌లెన్స్’ పేజీల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫుట్‌వర్క్, స్పీడ్, ఆడే తీరు, రాకెట్ సమన్వయం తదితర అంశాలను పరిశీలించి 10–15 మంది చిన్నారులను ఎంపిక చేస్తామని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ తెలిపారు. -
జీఈఎస్‌లో సానియా, పుల్లెల
సాక్షి, న్యూఢిల్లీ: ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్’(జీఈఎస్)లో పాల్గొనేందుకు 1,500 మంది ప్రతినిధులను ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో ఈ సదస్సు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దక్షిణాసి యాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ ఈ సదస్సులో పాల్గొంటారు. ఇందులో క్రీడారంగానికి చెందిన పుల్లెల గోపీచంద్, సానియా మీర్జా తమ కెరీర్ వివరాలను పంచుకుంటారు. ఈ సదస్సుకు అమెరికా సహ ఆతిథ్యం ఇస్తోంది. సదస్సులో పాల్గొనే ప్రతినిధుల్లో మూడో వంతు అమెరికా నుంచి, మూడోవంతు మన దేశం నుంచి ఉన్నారు. మరో మూడో వంతు ఇతర దేశాల నుంచి ఉన్నారు. మొత్తం 1,500 మంది ప్రతినిధుల్లో దాదాపుగా 300 మంది పెట్టుబడిదారులు ఉంటారు. 35 దేశాలకు చెందిన విభిన్న రంగాల్లో ఖ్యాతి గాంచిన వారు, విభిన్న నేపథ్యాలున్నవారు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సాంకేతిక రంగం, సృజనాత్మక రంగం, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు జాన్ చాంబర్స్, ప్రేమ్ వత్స, మార్కస్ వాలెన్‌బెర్గ్ తదితరులు విభిన్న అంశాలపై ప్రసంగిస్తారు. అంతరిక్ష యాత్రికు రాలు అనౌషే అన్సారీ తన అనుభవాలు పంచుకుంటారు. తిరస్కరణకు గురైన విమాన సహాయకురాలి నుంచి సొంత విమానయాన సంస్థను నెలకొల్పే స్థాయికి ఎదిగిన సిబొంగైల్ సాంబో తన జీవన యానాన్ని వివరించను న్నారు. ప్రముఖ ఎంఐటీ ప్రొఫెసర్లు కార్లో రాటి, డేనియల్ వుడ్ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ధోరణులను పంచుకుంటారు. భారతదేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అనూ ఆచార్య, రాధికా అగర్వాల్ స్టార్టప్స్‌పై మాట్లాడుతారు. ఇన్వెస్టర్లుగా రాణిస్తున్న తెలుగు వ్యక్తి వాణి కోలా, శాంతిమోహన్ ఎంట్రప్రెన్యూర్షిప్లో తమ అనుభవాలు పంచుకుంటారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా న్యూయార్క్‌లో రెస్టారెంట్ చైన్‌ను అభివృద్ధి చేసిన తీరును వివరిస్తారు. ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు 24 ఏళ్ల రితేష్ అగర్వాల్, 3 ఇడియట్స్ సినిమాలోని ఫున్‌షుఖ్ వాంగ్డు క్యారెక్టర్‌కు స్ఫూర్తి అయిన ప్రముఖ ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్, పద్మశ్రీ గ్రహీత పీయూష్ పాండే ఈ వేదికపై ప్రసంగిస్తారు. 52.5 శాతం మంది మహిళలే.. వాషింగ్టన్: ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు హాజరవుతున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు అమెరికా తెలిపింది. అమెరికా బృందానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ లాంటి సుమారు 10 దేశాల నుంచి కేవలం మహిళలే హాజరు కానున్నారని పేర్కొంది. మొత్తంగా చూస్తే సదస్సుకు హాజరవుతున్న వారిలో మహిళా పారిశ్రామికవేత్తల శాతం 52.5 శాతమని తెలిపింది. జీఈఎస్ సదస్సుకు వస్తున్న వారిలో మహిళలు మెజారిటీగా ఉండటం ఇదే తొలిసారి కావడం విశేషం. -
గోపీచంద్ గూటికి సైనా
-
గోపీచంద్ గూటికి సైనా
మళ్లీ అకాడమీలో చేరిక సాక్షి, హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మరోసారి కలిసి పని చేయనున్నారు. మూడేళ్ల క్రితం అభిప్రాయ భేదాల కారణంగా గోపీచంద్‌తో విడిపోయిన సైనా... బెంగళూరులో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ గోపీచంద్ అకాడమీలో కోచింగ్‌కు ఆమె సన్నద్ధమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేసింది. ‘కొంత కాలంగా నా శిక్షణను గోపీచంద్ అకాడమీకి మార్చే విషయం గురించి ఆలోచిస్తున్నాను. దీని గురించి గోపీ సర్‌తో చర్చించాను. నాకు మళ్లీ సహకరించేందుకు అంగీకరించిన ఆయనకు కృతజ్ఞతలు. కెరీర్‌లోని ఈ దశలో నా లక్ష్యాలు అందుకునేందుకు ఆయన సహకారం అవసరమని భావిస్తున్నా. సొంత నగరం హైదరాబాద్‌కు తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని సైనా వ్యాఖ్యానించింది. 2014 సెప్టెంబర్ నుంచి తనకు శిక్షణ ఇచ్చి రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు గెలుచుకోవడంతో పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా ఎదిగేందుకు సహకరించిన విమల్ కుమార్‌కు కూడా ఈ సందర్భంగా సైనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సైనా రాకను గోపీచంద్ కూడా నిర్ధారించారు. ‘సైనా తిరిగి రావడం మంచి పరిణామం. ఆమె రాకపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గత శుక్రవారం నుంచే ఆమె అకాడమీలో ట్రైనింగ్ ప్రారంభించింది. ఇకపై మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తాం’ అని గోపీచంద్ అన్నారు. మరోవైపు జాతీయ సింగిల్స్ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన ముల్యో హండోయో ఎంపిక కూడా సైనా పునరాగమనానికి కారణమైంది. ‘బాయ్’ సింగిల్స్ శిబిరానికి గోపీచంద్ అకాడమీనే కేంద్రం కావడంతో... ముల్యో వద్ద శిక్షణ పొందాలంటే సైనా తప్పనిసరిగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత సైనా తనతో ఈ విషయం గురించి చర్చించిందని... మంచి ఫలితాల కోసం ఎక్కడికి వెళ్లినా తప్పు లేదంటూ తాను ఆమెను ప్రోత్సహించినట్లు విమల్ వెల్లడించారు. -
మళ్లీ గోపీచంద్ అకాడమీకి సైనా
హైదరాబాద్: గడిచిన కొంత కాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ గురువు గోపీచంద్ వద్దకే తిరిగి రానున్నట్లు, ఇందుకు ఆయన కూడా సమ్మతించినట్లు సైనా సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూడేళ్ల కిందట.. మనస్పర్థల కారణంగా గోపీచంద్ అకాడమీని వీడిన సైనా.. బెంగళూరుకు చెందిన విమల్ వద్ద శిక్షణ తీసుకున్నారు. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆమె ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయారు. దీంతో తిరిగి గోపీ వద్దకే రావలనే నిర్ణయం తీసుకున్నారు. ‘‘గోపీచంద్ అకాడమీలో తిరిగి చేరాలని కొంతకాలంగా అనుకుంటున్నాను. ఇదే విషయాన్ని గోపీ సార్‌తో చెబితే, ఆయన మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ప్రస్తుత తరుణంలో ఆయన శిక్షణ నా లక్ష్యాలకు నన్ను దగ్గర చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని సైనా తెలిపారు. గడిచిన మూడేళ్లలో విమల్సార్ శిక్షణలోనూ తాను రాణించానని, వరల్డ్ నంబర్1 ర్యాంకును కైవసం చేసుకోవడమే కాక రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలు, పలు సూపర్‌సిరీస్ టైటిల్స్ గెలుచుకున్నానని సైనా నెహ్వాల్ గుర్తుచేశారు. -
22 ఏళ్లకే ఇన్ని సాధిస్తే...
♦ ఇకపైనా సింధుకు తిరుగుండదు ♦ కోచ్ గోపీచంద్ ఆశాభావం సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలతో మన జట్టు మరో మెట్టు ఎక్కిందని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ఈ మెగా ఈవెంట్లో రజత, కాంస్యాలు సాధించిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించగల సత్తా సింధులో ఉందని ఆయన అన్నారు. ఇంకా గోపీచంద్ ఏమన్నారంటే... ఇలాంటి మ్యాచ్ జీవితంలో చూడలేదు... సింధు వయసు కేవలం 22 ఏళ్లు. ఇప్పటికే 3 ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు, ఒలింపిక్ మెడల్‌తో పాటు రెండు సూపర్ సిరీస్ టోర్నీలలో విజేతగా నిలిచింది. ఇది చాలా పెద్ద ఘనత. ఇక ముందు ఆమె ఇదే తరహాలో కష్టపడితే పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరతాయి. సింధు ఆడిన ఫైనల్ మ్యాచ్‌లాంటిది నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కోచ్ స్థానంలో కూర్చున్న నాతో పాటు దేశంలో ఎంతో మంది ఈ మ్యాచ్‌ను ఊపిరి బిగబట్టి చూడటమే ఈ మ్యాచ్ గొప్పతనం గురించి చెబుతోంది. షెడ్యూల్‌ను సాకుగా చూపించలేము... అంపైర్ నిబంధనల ప్రకారమే సింధును ఎల్లో కార్డుతో హెచ్చరించారు. మ్యాచ్‌ల సందర్భంగా ఇలాంటివి చిన్న విషయాలే. మ్యాచ్ సమయాలను ప్రసారకర్తలు నిర్ణయించడం సరైంది కాకపోయినా... భారత్‌లోని ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకోవడం వల్ల కొన్ని సార్లు ఇది తప్పదు. అయితే మ్యాచ్ తుది ఫలితానికి దీనిని సాకుగా చూపించలేము. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకోవాలి... ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఫిట్నెస్ ప్రమాణాలు ఎంతో పెరిగాయి. ఆ స్థాయికి చేరడంపై మనం కూడా దృష్టి పెట్టాం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించకపోయినా శ్రీకాంత్, సాయిప్రణీత్ చక్కటి ప్రదర్శన కనబర్చారు. మొత్తంగా మన షట్లర్ల ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాను. మెరుగైన స్థితిలో ఉన్నా... ప్రస్తుత భారత క్రీడారంగం గతంలోకంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. భారత ప్రధాన మంత్రి ఒకరు క్రీడల గురించి, క్రీడలను ప్రోత్సహించడం గురించి ఇంత తరచుగా మాట్లాడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అత్యున్నత స్థాయి అధికారులు ఆటలు, సౌకర్యాల గురించి ఇంత ఎక్కువగా చర్చించడం కూడా ఇప్పుడే కనిపిస్తోంది. ఇది మన ఆటలకు మేలు చేసే అంశం. ఇప్పటి వరకైతే క్రీడలు సరైన దిశలో సాగుతున్నాయి. ఇక ముందు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. -
షట్లర్స్ ఫ్యాక్టరీ
చాంపియన్లను తయారు చేస్తున్న పుల్లెల గోపీచంద్ అకాడమీ - అన్ని స్థాయిలలో విజేతలుగా నిలుస్తున్న ఆటగాళ్లు - సంవత్సరాల శ్రమకు లభిస్తున్న ఫలితాలు - భవిష్యత్తులో మరింత మంది స్టార్లు అది హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ప్రాంగణం... సుదీర్ఘంగా సాగిన ప్రాక్టీస్ తర్వాత లభించిన కొద్ది పాటి విరామ సమయం... ఆ కొద్ది సమయంలోనే తమ పరిచయం, తాము వచ్చిన కారణం, తమ ఆలోచనలను గోపీచంద్‌తో పంచుకునేందుకు పలువురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అందులో ఎక్కువ మంది ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు. గోపీచంద్ అనుమతిస్తే అకాడమీతో జత కూడేందుకు... ఏదో రూపంలో స్పాన్సర్షిప్ అందజేసేందుకు వచ్చిన వారే. దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను వారు చర్చిస్తున్నారు. మరికొందరు ఆటగాళ్ల బ్రాండింగ్ గురించి, ఇతర ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాలని ఆశిస్తున్నారు. గోపీచంద్‌కు ఇటీవల ఇది రొటీన్‌గా మారిపోయింది. రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం నెగ్గిన తర్వాత ఇలాంటి వాటి కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. ఒకప్పుడు ఇదే అకాడమీ నిర్మాణం కోసం సహకారం కావాలంటూ ఆయన ఎక్కని, దిగని మెట్టు లేదు. అడగని కార్పొరేట్ సంస్థ లేదు. ఒక రకమైన లెక్కలేనితనంతో చిన్న చూపు చూసినవారు కొందరైతే... అసలు బ్యాడ్మింటన్‌ను ఎవరు పట్టించుకుంటారంటూ మొహం మీదే అనేసిన వారు మరెందరో. అయితే వారి మాటలు గోపీచంద్ లక్ష్యాన్ని మార్చలేదు. చాంపియన్లను తయారు చేయాలన్న తన పట్టుదల ముందు అవన్నీ చిన్న చిన్న విఘ్నాలుగా కనిపించాయే తప్ప... మనకెందుకులే ఇదంతా అంటూ కాడి పడేయాల్సినంతగా భయపెట్టలేదు. కష్టాలు, సమస్యలు ఎన్ని చెప్పుకున్నా... చివరకు ఫలితాలతోనే తనను ప్రపంచం అంచనా వేస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే వెనకడగు వేయలేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ తన కలను నిజం చేసుకున్నారు. అకాడమీ నుంచి అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేయడంలో విజయవంతమయ్యారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్, సిక్కి రెడ్డి... ఈ జాబితా ఇంతటితో ఆగిపోలేదు. రుత్విక శివాని, మేఘన, రాహుల్ యాదవ్... తదితరులు దీనికి కొనసాగింపు... గాయత్రి, సామియా, విష్ణు...ఇది రాబోయే విజేతల వరుస... ఒకరా, ఇద్దరా బ్యాడ్మింటన్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న వారిలో ఎక్కువ మంది గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చినవారే. భారత బ్యాడ్మింటన్‌కు కేంద్రంగా మారిన ఈ అకాడమీపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.... మొహమ్మద్ అబ్దుల్ హాది గోపీచంద్ 2004 నవంబర్‌లో ఆటగాడిగా ఆఖరి సారిగా ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ బరిలోకి దిగారు. హైదరాబాద్‌లోనే జరిగిన ఆసియా శాటిలైట్ టోర్నీలో విజేతగా నిలిచారు. అప్పటికే వరుస గాయాలకు పదే పదే జరిగిన శస్త్ర చికిత్సల తర్వాత పునరాగమనంలో గెలిచిన టైటిల్ అది. ఈ విజయం తర్వాత ప్రధాన టోర్నీలలో మళ్లీ గెలవడం సాధ్యం కాదని ఆయనకు అర్థమైంది. దాంతో ప్లేయర్‌గా కెరీర్ ముగిసింది. అదీ ఆరంభం... 2001లో గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలిచే సమయానికి భారత్‌లో బ్యాడ్మింటన్‌కు సౌకర్యాల పరంగా అనుకూల వాతావరణం ఏమీ లేదు. తర్వాతి మూడేళ్లలో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్‌లో కూడా ఎల్బీ ఇండోర్ స్టేడియం మినహా మరో చెప్పుకోదగ్గ వేదిక లేదు. ఇలాంటి స్థితిలో ఆడిన గోపీచంద్... మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది బ్యాడ్మింటన్‌లో వెలుగులోకి రావొచ్చని నమ్మారు. అదే ఆలోచనతో కోచ్‌గా మారి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సహకారంతో... 2004లోనే అప్పటి ‘శాప్’ మేనేజింగ్ డైరెక్టర్ సుమితా దావ్రా చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గోపీచంద్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చారు. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం వైపు నుంచి ఏడాదికి రూ. 10 లక్షల చొప్పున ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. ఇందులో పెద్ద మొత్తం ఇండోనేసియా కోచ్‌కే చెల్లించాల్సి వచ్చేది. కొంత మంది వర్ధమాన షట్లర్లు, కొత్తవారితో కలిసి 30 మందితో అకాడమీ ప్రారంభమైంది. సంవత్సరం పాటు ప్రభుత్వ నిధులతో అకాడమీ నడిచింది. కానీ ఆ తర్వాత ఆ మొత్తాన్ని కొనసాగించేందుకు వేర్వేరు కారణాలతో ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ దశలో గోపీచంద్ సొంత డబ్బులతోనైనా అకాడమీని నడిపించాలని పట్టుదల ప్రదర్శించారు. 2008 వరకు సొంత డబ్బును ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అత్యుత్తమంగా... ప్రపంచ స్థాయి కోర్టులు, శిక్షణ, జిమ్, ఫిజియోలు, డైటింగ్... ఇలా ప్రతీ అంశంలో గోపీచంద్ అకాడమీ సౌకర్యాలపరంగా ‘ది బెస్ట్’గా నిలుస్తుంది. పదేళ్ల వయసు ఉన్న చిన్నారుల నుంచి రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు వరకు ప్రస్తుతం అందరికీ ఇక్కడ శిక్షణ కొనసాగుతోంది. 2008లో ఏర్పాటైన అకాడమీకి తోడు అవుటర్ రింగ్‌రోడ్ జంక్షన్ సమీపంలో 2016లో భారత క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో గోపీచంద్ రెండో అకాడమీ కూడా ఏర్పాటైంది. రెండు అకాడమీల్లో కలిపి 150 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఆటగాళ్లందరినీ మొత్తం 6 గ్రూప్‌లుగా విభజించారు. సింధు, శ్రీకాంత్ తదితర ఆటగాళ్ల కోచింగ్ గోపీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. గోపీ కాకుండా మరో 15 మంది కోచ్‌లు పని చేస్తున్నారు. వీరంతా మిగతా గ్రూప్‌లలోని ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తారు. నోయిడాలో కూడా... హైదరాబాద్‌లో గోపీచంద్ అకాడమీ సూపర్ సక్సెస్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా తమ వద్ద అలాంటి అకాడమీలు ఏర్పాటు చేయాలని, ఎంత డబ్బయినా వెచ్చిస్తామని ఆయనకు అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే అందులో చాలా వాటిని గోపి తిరస్కరించారు. ‘వీళ్లంతా ఇలా పెట్టుబడి పెట్టగానే అలా లాభం మొదలు కావాలని భావించేవాళ్లే. క్రీడల్లో అది సాధ్యం కాదు. దానిని పక్కా వ్యాపార దృష్టితో వారు చూశారు. అందుకే అంగీకరించలేదు’ అని గోపీచంద్ చెప్పారు. తన ఆలోచనలకు తగినట్లుగా, కేవలం మంచి ఫలితాలు రావాలనే నమ్మకంతో ముందుకు వచ్చిన వారితో కలిసి న్యూఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆయన అకాడమీని ఏర్పాటు చేశారు. గోపీచంద్ పేరును జోడిస్తూ గ్వాలియర్, వడోదర, తణుకు, సేలంలలో కూడా అకాడమీలు ఉన్నా... వాటిలో ఆయన భాగస్వామ్యం లేదు. అవసరమైనప్పుడు ఆయన తగిన మార్గనిర్దేశనం చేస్తుంటారు. లండన్ ఒలింపిక్స్ తర్వాతే 2008లో అకాడమీ ప్రారంభమైనా నిర్వహణ కోసం చెప్పుకోదగ్గ మద్దతు లభించలేదు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఇక్కడ మెరికల్లాంటి షట్లర్లను తయారు చేసే అవకాశం ఉందని అంతా గుర్తించారు. భవిష్యత్తు విజయాల్లో తాము కూడా భాగం కావాలని అనేక కంపెనీలు భావించాయి. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కూడా ఆ తర్వాత భాగంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆసక్తి కనబర్చాయి. ఇక స్పోర్ట్స్ అథారిటీ, భారత బ్యాడ్మింటన్ సంఘం రెగ్యులర్‌గా జాతీయ జట్టు శిక్షణ శిబిరాలు ఇక్కడే ఏర్పాటు చేయడంతో అకాడమీకి ఆర్థిక భారం తగ్గింది. ఇక గత ఏడాది ‘రియో’లో సింధు పతకం తర్వాతనైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీర్ఘకాలిక లక్ష్యాలు... ఇప్పుడు అకాడమీ నుంచి వరుస విజయాలతో కీర్తి కనకాదులు సొంతం చేసుకుంటున్నవారు ఒక్క రోజులో స్టార్లుగా మారిపోలేదు. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల వాటి వెనక ఉన్నాయి. గోపీచంద్ కూడా అందరికీ ఇదే చెబుతారు. కఠోర ప్రాక్టీస్, సరైన డైట్, రోజూవారీ క్రమశిక్షణ... ఈ మూడింటిని ఒక వారమో, నెల రోజులో కాకుండా కనీసం పదేళ్ల పాటు ఒకే తరహాలో కొనసాగించగలవారు మాత్రమే ఆటలోకి అడుగు పెట్టాలి. ఇన్‌స్టంట్‌గా కాకుండా సుదీర్ఘ లక్ష్యాలతో శ్రమిస్తేనే ఫలితాలు ఆశించవచ్చు. అంతే కానీ ఉత్సాహంతో రావడం, కొద్ది రోజులకే ఇంకా చాంపియన్ కావడం లేదని భావిస్తే ఏ అకాడమీ కూడా ఏమీ చేయలేదు అని ఆయన అంటారు. నిధుల వేటలో... అకాడమీ నిర్మాణం కోసం అప్పటికే గోపీచంద్‌కు ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కేటాయించినా... ఆర్థిక సమస్యలతో అటువైపు దృష్టి పెట్టలేదు. అయితే 2006లో జాతీయ జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపికయ్యాక శిక్షణ పరిధి మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి అకాడమీలో నిర్వహణ గురించి కొన్ని సమస్యలు తలెత్తాయి. దాంతో అన్ని సౌకర్యాలతో కొత్త అకాడమీని నిర్మించాలని గోపీచంద్ నిర్ణయించుకున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అప్పటికి కొద్ది రోజుల క్రితమే కట్టుకున్న ఇల్లును గోపీచంద్ కుదువ పెట్టారు (2012లో ఈ అప్పు తీరింది). అయితే ఆ మొత్తం ఏమాత్రం సరిపోలేదు. చివరకు ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అండగా నిలవడంతో గోపీచంద్ కల సాకారమైంది. ఆయన రూ. 4.5 కోట్లు అకాడమీ కోసం ఇచ్చారు. చివరకు 2008లో నిమ్మగడ్డ ఫౌండేషన్–పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభమైంది. క్రీడా పరికరాల ఉత్పత్తుల్లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘యోనెక్స్’ మొదటి నుంచీ అకాడమీకి అండగా నిలుస్తోంది. ఇక్కడి ఆటగాళ్ల శిక్షణ కోసం పెద్ద సంఖ్యలో అవసరమైన షటిల్స్‌ను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు గుర్తింపు తెచ్చుకున్న షట్లర్లకు పూర్తి స్థాయిలో కిట్ కూడా అందజేస్తోంది. ఇది తమపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని గోపీచంద్ చెబుతారు. అంతా బాగున్న సమయంలో కొంత మంది తప్పుదోవ పట్టించిన కారణంగా మధ్యలో ఒకసారి భూమి వెనక్కి ఇమ్మంటూ ప్రభుత్వం నుంచి నోటీసు వచ్చింది. దాని కోసం కోర్టులో పోరాడాల్సి వచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు అధికారికంగా పూర్తి స్థాయిలో అకాడమీ భూమి మా చేతికొచ్చింది. సమస్యలను అధిగమించి దీనిని సమర్థంగా నడిపించడంలో గవర్నర్ నరసింహన్‌తో పాటు ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కమల్‌వర్ధన్ రావు ఎంతో సహకరించారు అని గోపీచంద్ అన్నారు. ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు... ‘సొంత అకాడమీ ఉంటూ జాతీయ జట్టు చీఫ్ కోచ్‌గా ఎలా పని చేస్తావు’ అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. నిజానికి అది నాకు ఒక పదవి మాత్రమే. హోదా ఎలా ఉన్నా అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేయడమే నా పని. ఏ అకాడమీ నుంచి ఆటగాళ్లు వచ్చినా చివరకు వారు భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తారు. దేశం కోసం పతకం గెలుస్తారు. అది ముఖ్యం. అకాడమీ కోచ్, భారత కోచ్ రెండింటినీ నేను సమన్వయపరుస్తూ వెళ్లానే తప్ప ప్రత్యేకంగా సొంత ప్రయోజనాలకు వాడుకోలేదు. అజయ్ జయరామ్ అగ్రశ్రేణి ఆటగాడు. అతను నా అకాడమీలో కాకుండా సొంతంగా ముంబైలో ప్రాక్టీస్ చేసుకుంటాడు. కానీ భారత కోచ్‌గా అతడికి నేను నా వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తాను. అంతే గానీ నా అకాడమీ షట్లర్ కాదని నేను భావించను. అన్నింటికి మించి అందరికి తెలియని విషయం ఏంటంటే నేను గత 11 ఏళ్లలో భారత కోచ్ హోదాలో ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. ఇండియన్ ఆయిల్లో ఉద్యోగిగా నాకు వచ్చే జీతం, నా భార్య లక్ష్మి జీతంతో పాటు మా నాన్నగారి ఆదాయాన్ని మేం పూర్తిగా వాడుకున్నాం. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొంతున్న వారిలో 70 శాతం మంది నుంచి నేను ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు. కార్పొరేట్లు ఇచ్చే సహకారంతోనే దానిని భర్తీ చేస్తున్నాను. అకాడమీ నిర్వహణ అనేది నాకు ఎప్పుడూ ఆదాయ వనరు కాదు. అలా ఆలోచించి దీనిని మొదలు పెట్టలేదు. ఆయన పిల్లలు కూడా... తల్లిదండ్రుల బాటలోనే గోపీచంద్, లక్ష్మీల ఇద్దరు పిల్లలు కూడా బ్యాడ్మింటన్‌పైనే దృష్టి పెట్టారు. ఇతర ట్రైనీలతో పాటు వీరిద్దరు కూడా అకాడమీలోనే శిక్షణ తీసుకుంటున్నారు. నిబంధనల విషయంలో వారికీ ఎలాంటి వెసులుబాటు ఉండదని గోపి చెప్పారు. కూతురు గాయత్రి జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక టైటిల్స్ సాధించి తన ప్రత్యేకత ప్రదర్శించగా... కుమారుడు సాయి విష్ణు కూడా అదే బాటలో ఉన్నాడు. ప్రపంచంలో నంబర్‌వన్... గోపీచంద్ అకాడమీ నుంచి పెద్ద ఎత్తున ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. సైనా నెహ్వాల్, పీవీ సింధులు ఒలింపిక్ పతకాలతో చెలరేగితే... మిగతా వారంతా అనేక పెద్ద స్థాయి అంతర్జాతీయ టోర్నీలలో విజేతలుగా నిలిచి సత్తా చాటారు. ఈ విజయాల వరుసకు బ్రేక్ రాకుండా గోపీచంద్ జాగ్రత్త తీసుకుంటారు. అగ్రశ్రేణి ఆటగాళ్ల శిక్షణపైనే పూర్తిగా దృష్టి పెట్టకుండా తర్వాతి స్థాయి బృందంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఒకవేళ సీనియర్లు విఫలమైనా ఆ లోటు కనిపించకుండా... తర్వాతి వారు దానిని అందుకునే విధంగా వారికి కోచింగ్ ఇస్తారు. దాని వల్ల మళ్లీ అండర్–13 నుంచి సీనియర్ విభాగం వరకు ఎక్కడా విజయాలకు విరామం లభించదు. చైనాలో 50 అకాడమీలు ఎంతో మంది ఆటగాళ్లను తయారు చేస్తున్నాయి. కానీ ఒకే అకాడమీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ షట్లర్లు రావడం ఎక్కడా జరగలేదు. సౌకర్యాలు, ఫలితాలపరంగా ప్రపంచంలోనే మా అకాడమీ నంబర్‌వన్ అని గట్టిగా చెప్పగలను. ఆ విషయంలో నేను గర్వపడుతున్నాను అని గోపీచంద్ చెబుతారు. గోపీ పరీక్ష తర్వాతే... సహజంగానే గోపీచంద్ అకాడమీకి ఇప్పుడు ఉన్న గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దాంతో తమ పిల్లలు అక్కడ చేరితే చాంపియన్లుగా మారతారనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే నేరుగా తీసుకొచ్చి అకాడమీలో చేర్పించేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. అయితే గోపీచంద్ చెప్పిన దాని ప్రకారం... గత మూడేళ్లుగా అకాడమీలో దాదాపుగా అడ్మిషన్లు ఆగిపోయాయి. బేసిక్స్ నేర్చుకునే లెర్నర్స్ విభాగంలోనైతే ఎవరినీ తీసుకోవడం లేదు. కొంత మంది పెద్ద స్థాయి సిఫారసులతో వచ్చినా సరే వారికి కూడా నో ఎంట్రీనే. అయితే ప్రాథమిక స్థాయిలో అప్పటికే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన వారిని తీసుకొని మరింతగా సానబెట్టే అవకాశం మాత్రం ఇక్కడ ఉంది. అదీ గోపీచంద్ స్వయంగా తనదైన శైలిలో ఆటలో పరీక్ష నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వారికి అవకాశం లభిస్తుంది. అసాధారణ ప్రతిభ ఉందంటూ వచ్చే కొందరికి కూడా ఇదే వర్తిస్తుందని ఆయన అంటున్నారు. క్రమశిక్షణకు కేరాఫ్... అగ్రశ్రేణి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకొని ఉండవచ్చు... అప్పటికే పెద్ద టోర్నీలలో వరుస విజయాలు సాధిస్తూ ఉండవచ్చు... కానీ అకాడమీలో క్రమశిక్షణ విషయానికి వచ్చేసరికి మాత్రం అంతా ఒక్కటే. ఏ ఒక్కరూ తమ పరిధి దాటి ప్రవర్తించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. తమకు ఇచ్చిన షెడ్యూల్‌ను కచ్చితంగా, సమర్థంగా పాటించాల్సిందే. ఇన్నేళ్లలో క్రమశిక్షణకు సంబంధించి అకాడమీ నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం విశేషం. తాను కూడా ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తానని గోపీచంద్ అన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యవస్థలో వాతావరణం చెడగొట్టేవారు ఒకరో, ఇద్దరో కచ్చితంగా ఉంటారు. అలాంటి వారిని గుర్తించి పక్కన పెట్టేయడం చాలా అవసరం. ఇక్కడ ట్రైనింగ్ కూడా పూర్తిగా నేను ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే సాగాలి. కొంత మంది ఆటగాళ్లు బయట గెలిచి రాగానే ఇలా కాదు అలా ఆడాలి అన్నట్లుగా తమ షెడ్యూల్ తామే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. లేదంటే జూనియర్లకు సలహాలిస్తూ మాస్టర్లా మారే ప్రయత్నం చేస్తారు. కానీ అలా ప్రవర్తిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించే అవకాశం నేను అసలే ఇవ్వను అని ఆయన చెప్పారు. -
శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
విజయవాడ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండు టైటిల్స్ సాధించిన శ్రీకాంత్‌కు వెయ్యి గజాల స్థలం, రూ. 50 లక్షల నగదు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ. 15 లక్షల బహుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శ్రీకాంత్‌ను ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా షటిల్ బ్యాట్‌ను సీఎంకు శ్రీకాంత్ అందజేశారు. అతడితో చంద్రబాబు సరదాగా షటిల్ ఆడారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన క్రీడాకారుడు శ్రీకాంత్ అని ప్రశంసించారు. శ్రీకాంత్ ఇక ఏపీ తరపున ఆడతారని తెలిపారు. విదేశీ కోచ్‌ను పెట్టుకునేందుకు అతడికి సహాయం అందిస్తామన్నారు. అమరావతిలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
విజయాలతో కొత్త ఉత్సాహం...
‘శ్రీకాంత్ కెరీర్లో ఇది అద్భుతమైన క్షణం. ఈ రోజు అతను చాలా బాగా ఆడాడు. దూకుడు మొదటి నుంచి అతనికి అలవాటే కానీ దానికంటే ఫైనల్లో నెట్ వద్ద అతని ఆట, డ్రాప్ షాట్లు నన్ను ఆకట్టుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఆటలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు శ్రీకాంత్ ఎంతో కష్టపడ్డాడు. వంద శాతం పర్ఫెక్ట్ అని చెప్పనుకానీ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎవరినైనా ఓడించగల సత్తా తనకు ఉందని అతను నిరూపించాడు. శ్రీకాంత్‌తోపాటు ఇటీవల ప్రణయ్, సాయిప్రణీత్ సాధించిన విజయాలు మాకందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మూడు నెలల క్రితం కేవలం పురుషుల సింగిల్స్ కోసమే నలుగురు కొత్త కోచ్‌లను తీసుకున్నాం. ముల్యో హొండోయో, హరియవన్ (ఇండోనేసియా), అమ్రిష్ షిండే, సిద్ధార్థ్ జైన్ (భారత్) ప్రత్యేకంగా ఈ షట్లర్లపై దృష్టి పెట్టడమే ఇటీవల మనకు వచ్చిన ఫలితాలకు కారణం. వీరి వల్ల నాపై కూడా భారం తగ్గి ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ గురించి శ్రద్ధ తీసుకునేందుకు ఆ సమయం కలిసి వస్తోంది. – – పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ -
గోపీచంద్ అధికారాలకు కత్తెర?
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌కు ఎన్నో అద్వితీయ విజయాలు అందించి, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అధికార పరిధిని తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నూతన అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ‘బాయ్’ నియామావళిలో పలు మార్పులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘జాతీయ చీఫ్ కోచ్’ అనే పదవిని తొలగించి, దాని స్థానంలో రెండేళ్ల పదవి కాలంతో జాతీయ కోచ్‌ల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో పాటు సింగిల్స్, డబుల్స్, జూనియర్స్ విభాగాలకూ ప్రత్యేకంగా వేరు వేరు కోచ్‌ల నియామకానికి ఆయన మొగ్గుచూపుతున్నారు. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం కోచ్‌లు మరే ఇతర రాష్ట్ర సంఘాలలో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. గోపీచంద్ 2006 నుంచి జాతీయ చీఫ్ కోచ్‌గా కొనసాగుతున్నారు. గోపీచంద్ పర్యవేక్షణలో ఇతర జాతీయ కోచ్‌లు పనిచేస్తున్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి ఆయన కార్యదర్శి కూడా. తాజా ప్రతిపాదనల ప్రకారం కోచ్‌ల బృందానికి ప్రత్యేక పర్యవేక్షణాధికారి ఉండరు. రాష్ట్ర సంఘంలోనూ ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఈ అంశంపై జూన్ 11న బెంగళూరులో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటు ఇన్స్టిట్యూషన్ జట్లు అయిన ఎయిరిండియా, పీఎస్‌పీబీ, రైల్వేస్, కాగ్, ఇంటర్ యూనివర్సిటీ కంట్రోల్ బోర్డులకు ఓటింగ్ హక్కును తొలగించాలని కూడా ప్రతిపాదించారు. -
గుర్తింపు కోసమే అలా చేస్తున్నారు
కోచ్‌ల పరిస్థితిపై గోపీచంద్ వ్యాఖ్య న్యూఢిల్లీ: సరైన గుర్తింపు దక్కడం లేదనే భావనతో చాలామంది కోచ్‌లు ఆటగాళ్లను తమ దగ్గరే చాలా కాలం ఉంచుకుంటున్నారని బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ఓ ఆటగాడిని వెలుగులోకి తీసుకొచ్చే కోచ్‌లు, సహాయక సిబ్బంది కృషిని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘నిజం చెప్పాలంటే కోచ్‌లు పడే తపన, కృషి ఎక్కువగా హైలైట్ కావడం లేదు. శిక్షణ శిబిరాలకు హాజరయ్యే కోచ్‌లకు మంచి వేతనాలు లభించడం లేదు. సహాయక సిబ్బంది పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆటగాళ్ల వెనకాల ఉన్న వారిని మనమంతా గుర్తించాలి. విద్యలో కేజీ, డిగ్రీ, పీజీ వర్గీకరణ ఉన్నట్టు శిక్షణలో అలాంటిదేమీ ఉండదు. ఆటగాళ్ల ప్రదర్శనతో కోచ్‌ల గుర్తింపు అనుసంధానమై ఉంటుంది. అందుకే ఆటగాళ్లు రాటుదేలే వరకు తమ దగ్గరే అట్టిపెట్టుకుంటున్నారు. ఇదంతా వారు తమ గుర్తింపు కోసమే చేస్తున్నారు’ అని గోపీచంద్ వివరించారు. కొన్నేళ్లుగా దేశంలో బ్యాడ్మింటన్ చాలా అభివృద్ధి చెందిందని, అయితే మున్ముందు ఇదే స్థాయిలో ఉండడం సవాల్‌గా మారిందని అన్నారు. -
అదే తదుపరి లక్ష్యం...
►సుదిర్మన్, థామస్ కప్‌లు గెలుస్తాం ►కోచ్ పుల్లెల గోపీచంద్ ఆశాభావం ►సాయిప్రణీత్, శ్రీకాంత్‌పై ప్రశంసలు హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ ప్రస్తుతం అద్భుత దశలో ఉందని, భవిష్యత్‌లో మరిన్ని పెద్ద విజయాలు సాధించగలమని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచామని, మున్ముందు మరింత మెరుగైన ఫలితాలు రాబడతామని ఆయన అన్నారు. సింగపూర్ ఓపెన్ విజేత సాయిప్రణీత్, రన్నరప్‌గా నిలిచిన కిడాంబి శ్రీకాంత్‌లతో పాటు ఇండియా ఓపెన్ చాంపియన్ పీవీ సింధులకు మంగళవారం ఆయన అకాడమీలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘భారత షట్లర్లు సాధించిన విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నా. అయితే ఇదే జోరు మరింత పెద్ద ఈవెంట్లలో కూడా కొనసాగించాల్సి ఉంది. ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లలో మరింత మెరుగైన ప్రదర్శన రావాలి. అదే విధంగా టీమ్ ఈవెంట్లు అయిన సుదిర్మన్ కప్, థామస్, ఉబెర్ కప్‌లలో కూడా భారత్ విజయాలు సాధించాల్సి ఉంది’ అని గోపీచంద్ విశ్లేషించారు. కొన్నాళ్ల క్రితం సైనా, సింధు వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో పురుషుల విభాగం సంగతేమిటని తనను కొందరు ప్రశ్నించారని, ఇప్పుడు సింగపూర్ ఓపెన్ ఫలితం దానికి సమాధానమని గోపీచంద్ చెప్పారు. సూపర్ సిరీస్ స్థాయి టోర్నీ ఫైనల్లో ఇద్దరు భారతీయులు తలపడాలన్న తన కల నెరవేరిందన్న గోపీచంద్... మొదటిసారి తాను ఫైనల్ ఫలితం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండగలిగానన్నారు. ప్రతిభ ఉన్నంత మాత్రాన ఫలితాలు రావని, తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్న కోచ్... సాయిప్రణీత్ తన టైటిల్ విజయానికి ముందు రెండు నెలల పాటు కఠోర సాధన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫిట్‌నెస్‌పైనే దృష్టి... ‘సింగపూర్’ విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, మున్ముందు ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెడతానని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. ‘సూపర్ సిరీస్ స్థాయి విజయం ఎప్పుడైనా మధురమే. దీని కోసం చాలా కాలంగా కలగన్నాను. రాబోయే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కూడా సత్తా చాటుతా. నా ఫిట్‌నెస్‌లో ఎలాంటి లోపం లేకుండా శ్రమిస్తా. ఇటీవలి కాలంలో నాతో పాటు పురుషుల విభాగంలో సమీర్ వర్మ, అజయ్ జయరామ్ కూడా నిలకడగా ఆడుతున్నారు. ఇది మంచి పరిణామం’ అని ప్రణీత్ అన్నాడు. ప్రణీత్‌తో తనకు పదేళ్లుగా స్నేహం ఉందని, ఫైనల్లో ఓడటం తనకు నిరాశ కలిగించలేదని శ్రీకాంత్ చెప్పాడు. ‘సింగపూర్‌లో ప్రేక్షకులంతా భారత్ గెలిచింది అంటూ హోరెత్తించడమే నాకు గుర్తుంది. నేను ఓడినా మనవాడే గెలవడం ఆనందకరం. గత కొంత కాలంగా నా ప్రదర్శనతో పోలిస్తే ఈ ఫైనల్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. పురుషుల విభాగంతో తనను తాను పోల్చుకోవడం లేదన్న సింధు... ఇండియా ఓపెన్ గెలుపు కూడా తనకు ప్రత్యేకమైందని వెల్ల డించింది. ఈ సందర్భంగా ఈ ముగ్గురు ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న పలువురు భారత షట్లర్లకు ఐడీబీఐ ఫెడరల్ ప్రత్యేక నగదు పురస్కారాలు అందించింది. మరోవైపు జూనియర్ స్థాయిలో ఆకట్టుకున్న ఐదుగురు ఆటగాళ్లు గాయత్రి, సామియా, మేఘనా రెడ్డి, కవిప్రియ, వికాస్ యాదవ్‌లకు హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక నగదు అందజేశారు. -
నవంబర్ 4న సీబీఎల్ షురూ
సాక్షి, హైదరాబాద్: సీడీకే గ్లోబల్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్) నవంబర్ 4నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సీడీకే గ్లోబల్ కంపెనీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ) సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. పీజీబీఏలో మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో దాదాపు 200 కార్పొరేట్ కంపెనీలకు చెందిన 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. -
శ్రీవారికి సింధు తులాభారం...
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సింధు 68 కిలోల బెల్లంతో తులాభారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. గోపీచంద్ తలనీలాలు సమర్పించారు. తల్లిదండ్రులు విజయ, రమణ, సోదరి దివ్యతో సింధు రాగా, సతీమణి పీవీవీ లక్ష్మీతో కలిసి పుల్లెల గోపీచంద్ ఆలయానికి వచ్చారు. వీరి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. - సాక్షి, తిరుమల -
సింధుకు సచిన్ 'బీఎండబ్ల్యూ' కానుక!
-
గోపిచంద్పై మోదీ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అని, ఒక మంచి టీచర్ ఏం చేయగలరో ఆయన నిరూపించాడని అన్నారు. గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందిన పీవీ సింధూ ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో వెండిపతకాన్ని తీసుకొచ్చి దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గోపిచంద్ ను ఓ క్రీడాకారుడిగా కంటే టీచర్ గా గుర్తిస్తేనే మంచిదని తన అభిప్రాయంగా చెప్పారు. ఒలింపిక్స్ లో ఇండియన్ డాటర్స్ మంచి విజయాలు అందించారిన పొగిడారు. ఈ సందర్భంగా పీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తోపాటు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఇతర క్రీడాకారులకు మోదీ అభినందనలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలు స్పృషించారు. గంగా నది శుభ్రత కోసం ముందుకొచ్చి గొప్ప ప్రమాణం చేసిన నదీ పరిహవాక ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన మోదీ మురుగునీటిని గంగానదిలోకి వదిలేయడం వెంటనే ఆపేయాలని కోరారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, గణేశ్, దుర్గా ఉత్సవాలకు మట్టితో చేసిన వినాయకులను ఉపయోగించాలని, ప్లాస్టిక్ మిళిత రసాయనలతో చేసిన విగ్రహాలను వాడొద్దని చెప్పారు. దేశ ప్రజలందరిలో ఐక్యతా భావం పురికొల్పేందుకు నాడు బాలగంగాదర్ తిలక్ ఈ గణేశ్ ఉత్సవాలు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇక భారత రత్న మదర్ థెరిసాను కూడా ప్రధాని మోదీ జ్ఞప్తికి తెచ్చారు. ఆమె సేవలు అపురూపం అని కొనియాడారు. ఈ సెప్టెంబర్ 4న ఆమెను దైవ దూత(సెయింట్ హుడ్)గా ప్రకటించనున్నారని, ప్రతి భారతీయుడు ఈ విషయాన్ని గౌరవంగా భావించాలని చెప్పారు. ఇక కశ్మీర్లో ఆందోళనకర పరిస్థితులపై కూడా మాట్లాడిన మోదీ అక్కడి యువతను రెచ్చగొడుతున్న వారు వారికి సరైన సమాధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ లో ఒక్క ప్రాణనష్టం జరిగినా అది దేశం మొత్తానికి నష్టం జరిగినట్లేనని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి యువత అనవసర ప్రలోభాలకు గురికావొద్దని చెప్పారు. -
' పుల్లెల గోపిచంద్ రియల్ హీరో: సచిన్'
-
'ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు'
-
పుల్లెల గోపిచంద్ రియల్ హీరో: సచిన్
♦ గోపిచంద్ గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారుడు: సచిన్ ♦ పీవీసింధు, సాక్షిమాలిక్, దీపాకర్మాకర్, గోపిచంద్‌లకు బీఎండబ్ల్యూ కార్ల బహుమానం ♦ ఒలింపిక్ విజేతలతో సెల్ఫీ దిగిన సచిన్ హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్ 'రియల్ హీరో' అంటూ దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఆదివారం గోపిచంద్ అకాడమీలో సచిన్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గోపిచంద్ అకాడమీకి చేరుకున్న సచిన్.. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్ లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ వారిని హృదయపూర్వకంగా అభినందించారు. వీరితో పాటు కోచ్ గోపిచంద్‌కు కూడా బీఎండబ్ల్యూ కారును సచిన్ బహుకరించారు. ఈ సందర్భంగా సచిన్ సింధు, గోపిచంద్, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్లతో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం సచిన్ మాట్లాడుతూ.. కఠోర సాధనతోనే మెడల్స్ సాధించగలిగారని ప్రశంసించారు. వీరిని చూసి భారత్ ఎంతో గర్విస్తోందని కొనియాడారు. మరిన్ని మెడల్స్ సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పీవీ సింధు, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్, గోపిచంద్‌లకు సచిన్ కారు తాళాలు అందజేశారు. కాగా, రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తామని ముందే బ్యాడ్మింటన్ వైస్ ప్రెసెడెంట్ చాముండేశ్వరినాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రజత పతకం సాధించిన తెలుగు అమ్మాయి, షెట్లర్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ.. నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒలింపిక్ మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరెన్నీ పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో వచ్చినా.. ఇంత ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటానని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చెప్పింది. -
'మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉంది'
-
హ్యుందాయ్ ఎలంత్రాను ఆవిష్కరించిన గోపీచంద్
హ్యుందాయ్ తాజా కారు సిక్స్త్ జనరేషన్ ఎలంత్రాను శుక్రవారం హైదరాబాద్‌లోని లక్ష్మి హ్యుందాయ్ షోరూంలో ఆవిష్కరించారు. దీన్ని ఆవిష్కరించిన సందర్భంగా భారత బ్యాండ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌కు తొలికారును బహుమతిగా అందజేశారు. లక్ష్మి హ్యందాయ్ గ్రూప్ ఛైర్మన్ కె.రామ్మోహనరావు, డెరైక్టర్లు జైరాం, స్వాతిలతో కలసి గోపిచంద్ కేక్‌ను కట్ చేశారు. నాలుగేళ్ల కిందట సైనా కాంస్యం సాధించినప్పుడు ఓ కారును అందుకున్నానని, ఇపుడు ఈ కారును అందుకున్నానని గోపీచంద్ వ్యాఖ్యానించారు. కంపెనీ రీజనల్ మేనే జర్ సలీం మాట్లాడుతూ ఈ కారు సామర్థ్యం 2వేల సీసీ అని చెప్పారు. - హైదరాబాద్, సాక్షి -
తెలుగువారికి గర్వకారణం సింధు
ముఖ్యమంత్రి చంద్రబాబు సింధు, గోపీచంద్, శ్రీకాంత్ తదితరులకు ఘనంగా సన్మానం విజయవాడ స్పోర్ట్స్: ఒలింపిక్స్‌లో దేశం పరువు కాపాడిన సింధు తెలుగువారందరికీ అత్యంత గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. దేశ క్రీడా రంగానికి వైభవం రావాలంటే ఒలింపిక్స్ నిర్వహణ ఒక్కటే మార్గమని తాను 2000 సంవత్సరంలో దేశ రాష్ట్రపతి, ప్రధానికి సలహా ఇచ్చినట్లు చెప్పారు. రియో ఒలింపిక్స్ సిల్వర్ స్టార్ సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, ట్రిపుల్ ఒలింపియన్, శాప్ పాలకమండలి సభ్యురాలు సత్తి గీత, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిలను స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మంగళవారం ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోనూ.. తర్వాత జరిగిన పుష్కరాల ముగింపు వేడుకల్లోనూ చంద్రబాబు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ నిర్వహణ వల్ల దేశంలో క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కుతుందని, ప్రపంచస్థాయి క్రీడాకారులు పుట్టుకొస్తారని చెప్పారు. తమ్ముళ్లూ... అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించాలని కృష్ణా పుష్కరాలు సందర్భంగా సంకల్పం చేయండి... అవి నిర్వహించే బాధ్యత నేను తీసుకుంటానని ప్రకటించారు. సింధును ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దడంలో కోచ్ గోపీచంద్, ఆమె తల్లిదండ్రులు రమణ, విజయల ప్రోత్సాహం వెలకట్టలేనిదన్నారు. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం ఖాయం.. తాను ప్రోటోకాల్ పక్కన పెట్టి సింధుకు స్వాగతం పలకడానికి ఒలింపిక్స్‌లో ఆమె సాధించిన ఘనతే కారణమని బాబు అన్నారు. చిన్నారులకు స్ఫూర్తినివ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని తెలిపారు. అమరావతిలో నిర్మించే తొమ్మిది నగరాల్లో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ ఉందన్నారు. గోపీచంద్ అకాడమీ పెడితే అందులో 15 ఎకరాలు స్థలం ఇస్తామని ప్రకటించారు. విజయవాడలోనే కాకుండా విశాఖపట్నం, తిరుపతిలో కూడా స్పోర్ట్స్ సిటీలు నిర్మిస్తామని వెల్లడించారు. ఎంతోమందిని బ్యాడ్మిం టన్ స్టార్లుగా తీర్చిదిద్దుతున్న కోచ్ గోపీచంద్‌కు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. సింధుకు ఘనస్వాగతం అంతకుముందు పీవీ సింధుకు విజయవాడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉదయం సింధు విజయోత్సవ సభ మున్సిపల్ స్టేడియంలో జరిగింది. చంద్రబాబు స్వయంగా స్టేడియం మెయిన్ గేటు వద్దకు వెళ్లి ఘన స్వాగతం పలికి వేదికపైకి తోడ్కోని వచ్చారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు రెండు షటిల్ బ్యాట్లు తీసుకొచ్చి సీఎంకు, సింధుకి ఇచ్చి వేదికపై బ్యాడ్మింటన్ ఆడించారు. అటు పుష్కరాల ముగింపునకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, గణపతి సచ్చిదానందస్వామిజీ, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ముందుగా సీఎం దంపతులు, కేంద్ర మంత్రులు సింధును సన్మానించారు. మూడు కోట్ల చెక్‌ను, అభినందన పత్రాన్ని అందజేశారు. తరువాత కోచ్ గోపీచంద్‌కు రూ. 50 లక్షల చెక్, క్రీడాకారుడు కె.శ్రీకాంత్‌కు రూ. 25 లక్షలు చెక్‌ను అందజేశారు. సింధు వచ్చే ఒలంపిక్స్‌లో స్వర్ణ సింధుగా రావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. సింధు అందించిన స్ఫూర్తిని క్రీడల్లో కొనసాగిస్తామని సురేష్ ప్రభు చెప్పారు. -
ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు:గోపిచంద్
-
తెరపై పుల్లెల గోపీచంద్ ప్రయాణం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా బయో పిక్ తెరకెక్కనుంది. రియో ఒలింపిక్స్‌లో పివి సింధు వెండి పతకం గెలవడంతో ఆమె గురువైన గోపీచంద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఎంతోమంది క్రీడాకారుల కెరీర్‌ను తీర్చిదిద్దిన కోచ్ గోపీచంద్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇప్పుడు తెరపై ఆవిష్కరించనున్నారు. గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషించనున్నారు. ఈ మేరకు సుధీర్ బాబు మాట్లాడుతూ.. 'గోపీచంద్ నిజమైన హీరో. అతని కథ ప్రపంచానికి తప్పకుండా తెలియాలి. అతన్ని నేను దగ్గర నుంచి చూశాను. గోపీతో కలిసి డబుల్స్ కూడా ఆడాను. ఆయన పాత్రకు సరిపోతానని భావిస్తున్నాను' అని చెప్పారు. గోపీచంద్‌కు ఈ విషయం తెలిపినప్పుడు ఆయన అయిష్టంగా ఉన్నారని, అయితే తప్పకుండా అందరికీ తెలియజేయాల్సిన ప్రయాణం అని అందరూ చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నారని సుధీర్ బాబు తెలిపారు.18 నెలల క్రితమే కథపై కసరత్తు మొదలుపెట్టగా.. ఈ నవంబరులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. షూటింగ్ మొత్తం హైదరాబాద్, లక్నో, బెంగుళూరు, బర్మింగ్ హామ్లలో జరగనుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'బయో పిక్' ట్రెండ్ నడుస్తుంది. ప్రముఖుల జీవితాలను, లక్ష్య సాధనలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
ఛాంపియన్స్ అకాడమి
-
సింధుకు రూ.3 కోట్లు
-
సింధుకు రూ.3 కోట్లు
- ఒలింపిక్ పతక విజేతకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నజరానా - అమరావతిలో వెయ్యి గజాల స్థలం - కోరుకున్న శాఖలో గ్రూప్-1 పోస్టు - పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదు - నేనిచ్చిన సౌకర్యాలతోనే సింధూకు ఒలింపిక్స్‌లో పతకం - అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడమే మా లక్ష్యం - ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంపు - మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు వెల్లడించిన ముఖ్యమంత్రి సాక్షి, అమరావతి: పుల్లెల గోపీచంద్‌తో హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీని తానే పెట్టించానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గతంలో ఆ అకాడమీకితాను ఐదెకరాల స్థలం ఇవ్వకపోతే పీవీ సింధూకు రియో ఒలింపిక్స్‌లో పతకం వచ్చేదే కాదన్నారు. తానిచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకొని ఆమె ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిందని పేర్కొన్నారు. ఆమెకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 కోట్ల నగదు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం, కోరుకున్న శాఖలో గ్రూపు-1 అధికారి ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాడ్మింటన్‌లో సింధూకు శిక్షణ ఇచ్చి విజయానికి కారణమైన పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాకు వివరించారు. హైదరాబాద్‌కి ఐఎంజీ వస్తే ఇప్పుడు ఒలింపిక్స్‌లో మనకు స్వర్ణం వచ్చేదని, గతంలో ఆ సంస్థను అడ్డుకున్నారని విమర్శించారు. అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే... ► వెలగపూడిలో భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ మొదటివారంలో హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించాం. కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన జీఎస్టీ బిల్లు కోసం సమావేశాలు నిర్వహిస్తున్నాం. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2015 జూలై ఒకటో తేదీ నుంచి 3.144 శాతం ఒక కిస్తు డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాది జూలై వరకూ ఎరియర్స్‌ను వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తాం, ఆగస్టు నుంచి నగదు రూపంలో ఇస్తాం.ప్రభుత్వంపై నెలకు రూ.98.23 కోట్లు, సంవత్సరానికి రూ.1178.76 కోట్ల అదనపు భారం పడుతుంది. ► ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ సంవత్సరం వరకూ ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇస్తాం. భవిష్యత్తులో పీఆర్సీకి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంబంధం ఉండదు. వారికి విడిగా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తాం. ► ఐటీ విధానంలో రాయితీల నిర్వహణ ఇబ్బందికరంగా మారడంతో దాన్ని సవరించాలని నిర్ణయించాం. భూమితో కలిపి పెద్ద ప్రాజెక్టు చేపట్టిన ఐటీ కంపెనీకి ఒక్కొక్క ఉద్యోగానికి రూ.50 వేల చొప్పున రాయితీ, భూమి లేకుండా పెద్ద ప్రాజెక్టు చేపట్టిన ఐటీ కంపెనీకి ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష చొప్పున రాయితీ ఇస్తాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు నిర్వహించే కంపెనీలైతే ఒక్కో ఉద్యోగానికి రూ.1.50 లక్షల చొప్పున రాయితీ కల్పిస్తాం. ►కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికిచ్చే నిధులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పమని అడుగుతున్నాం. ►రాజధానికి రూ.450 కోట్లు, లోటు బడ్జెట్ కింద కొంత మొత్తాన్ని కేంద్రం ఇచ్చింది. లోటు బడ్జెట్ మొత్తంపైనా స్పష్టత రావాల్సి ఉంది. కేంద్రం ఇచ్చిన డబ్బులకు యుటిలిటీ సర్టిఫికెట్లు త్వరలో ఇస్తాం. వెమ్ టెక్నాలజీస్‌కు 350 ఎకరాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు ప్రభు త్వ, ప్రైవేట్ సంస్థలకు భారీగా భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాలకు సంబం ధించి పలు పోస్టులు మంజూరు చేసింది. మంత్రివర్గ సమావేశంలో చేసిన కేటాయింపులను చంద్రబాబు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు, పెదవేగి మండలం భోగాపురం గ్రామాల్లో 350 ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయింపు. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ వాహనాలు తయారు చేసే వెపన్స్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం ఈ భూముల వినియోగం. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎకరం రూ.50 లక్షల చొప్పున 200 ఎకరాలు కేటాయింపు. కృష్ణా-గోదావరి సంగ మం ప్రాంతం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి 25 ఎకరాలు కేటాయింపు. -
ఆ అరుదైన ఘనత గోపీచంద్‌దే
ఒలింపిక్స్ చరిత్రలో భారత క్రీడాకారిణులు ఇప్పటి వరకు ఐదుగురు మాత్రమే పతకాలు సాధించారు. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తెలుగుతేజం కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మల్లీశ్వరి కాంస్యం సాధించింది. 12 ఏళ్ల తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కాంస్యాలతో మెరవగా.. తాజా రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం, తెలుగుతేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు రజత పతకాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఒలింపిక్ పతకాలు సాధించిన భారత క్రీడాకారిణులుగా మల్లీశ్వరి, సైనా, మేరీ కోమ్, సాక్షి, సింధు చరిత్రలో చోటు సంపాదించారు. ఈ ఐదుగురు మహిళలల్లో సైనా, సింధు సాధించిన పతకాలకు ఎంతో ప్రత్యేక ఉంది. వీరిద్దరూ హైదరాబాదీలే. సైనా, సింధు ఇద్దరూ బ్యాడ్మింటన్‌లో దేశానికి పతకాలు అందించారు. మరో విశేషమేంటంటే వీరిద్దరూ కోచ్ గోపీచంద్ శిష్యరికంలోనే పతకాలు సాధించారు. అంటే ఐదుగురు భారత క్రీడాకారిణులు ఒలింపిక్ పతకాలు సాధిస్తే.. ఇందులో రెండు గోపీచంద్ శిష్యురాళ్లు గెలిచారన్నమాట. ఈ అరుదైన ఘనత గోపీచంద్‌దే. -
'మూడు నెలలుగా ఫోనే వాడలేదు'
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు విజయం వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి వెలకట్టలేనిది. తనకు తెలిసిన విద్యతోనే ప్రపంచాన్ని గెలవాలనే కోరికను సింధు ద్వారా గురువు గోపీచంద్ నెరవేర్చుకున్నాడనంలో ఎటువంటి సందేహం లేదు.అయితే రియోలో సింధు రాణించడం వెనుక ఆమె విశేష కృషితో పాటు పట్టుదలే కారణమన్నాడు గోపీచంద్. తాను కొన్ని నిబంధనలను విధిస్తే వాటిని తూచా తప్పకుండా పాటించడమే సింధు విజయం వెనుక రహస్యమంటున్నాడు. 'ఆట గురించి కొన్ని కఠినమైన నిబంధనలను ఆమె అవలంభించక తప్పలేదు. చివరకు సింధుకు ఇష్టమైన తియ్యటి పెరుగును కూడా ఆమెకు అందకుండా చేశా. దాదాపు 12-13 రోజుల నుంచి ఇదే చేశా. దాంతో పాటు గత మూడు నెలల నుంచి సింధు ఫోన్ వాడటమే మానేంది. ఫోన్ కాల్స్ కూడా దూరంగా ఉండమని చెప్పి ఆమె ఫోన్ ను నేను తీసుకున్నా. ఆమె ఫోన్ ను తిరిగి ఇవ్వడమే నేను చెసే మొదటి పని . ఇప్పుడు సింధు ఏమి కావాలనుకుంటే అది తినొచ్చు'అని గోపీ చంద్ పేర్కొన్నాడు. -
'పీవీ సింధు, గోపిచంద్‌లకు అభినందనలు'
ప్రకాశం: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పీవీ సింధు రజత పతకాన్ని సాధించడంపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో భారత జెండాను రెపరెపలాడించిన పీపీ సింధూకు నా అభినందనలు' అంటూ ఆయన ప్రశంసించారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. అద్భుతమైన ప్రతిభ కనపర్చేలా సింధూను తీర్చిదిద్దిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌కు శుభాభివందనాలు' అని కొనియాడారు. దేశంలో ప్రతి యువతీయువకులకు సింధూనే స్ఫూర్తి అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
‘ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది’
రియో డీ జనీరో: గత కొద్ది రోజులుగా పీవీ సింధు అద్భుతంగా ఆడుతోందని, ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ లో ఆమె ఆటతీరు తాను గర్వించేలా ఉందని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు వెండి పతకం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్టులో ఆమె కదిలిన తీరు, పోరాట పటిమ నిరుపమానమని కొనియాడాడు. తమ కష్టానికి ఫలితం దక్కిందని, సింధు అత్యుత్తమంగా ఆడిందన్నాడు. తన కంటే బాగా ఆడిన క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిందని, దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. సింధు మళ్లీ పుంజుకుంటుందని, ఏదోక రోజు మారిన్ ను ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండో గేమ్ మొదట్లో సింధు తడబడిందని, మూడో గేమ్ కొన్ని అనవసర తప్పిదాల వల్ల సింధు మ్యాచ్ కోల్పోయిందని విశ్లేషించాడు. చిన్నవయసులోనే సింధు ఒలింపిక్ పతకం సాధించిందని, ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని చెప్పాడు. సింధు బాగా శ్రమిస్తుందని, భవిష్యత్ లో ఆమె అగ్రశేణి క్రీడాకారిణి అవుతుందని గోపీచంద్ అన్నాడు. -
‘ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది’
-
ఆచార్యదేవోభవ...
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు, మరెన్నో విజయాలు... ఆటగాడిగా సాధించిన విజయాలతో సంతృప్తి చెంది ఆ ఘనత చెప్పుకొని కాలం గడిపేయలేదు. ఇంకా ఏదో సాధించాలనే తపన, పట్టుదల... తనకు తెలిసిన విద్యతోనే ప్రపంచాన్ని గెలవాలనే కోరిక. అందుకు ఎంచుకున్న మార్గం కోచ్‌గా మారిపోవడం. 2004లో సొంతగడ్డపైనే తన ఆఖరి టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత పుల్లెల గోపీచంద్ మరో కొత్త అవతారంతో కోర్టులోకి వచ్చాడు. శిక్షకుడిగా గత పుష్కర కాలంలో ఎన్నో అద్వితీయ విజయాలను అందుకున్నాడు. సైనా, సింధు, శ్రీకాంత్‌లే కాదు... పెద్ద సంఖ్యలో అతని శిష్యులు ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. తండ్రి పాత్రలో ‘గోపీచంద్ చెప్పినట్లు చేయమ్మా, గోపీ వల్లే ఇది సాధ్యమైంది, ఎలా ఆడాలో, ఏం చేయాలో గోపీకే తెలుసు’... సింధు ఫైనల్‌కు చేరిన సందర్భంగా ఆమె తండ్రి పీవీ రమణ ఎన్నో సార్లు చెప్పిన మాట ఇది. ఒక వైపు కూతురి విజయాన్ని ఆస్వాదిస్తూనే, మరో వైపు అందుకు కారకుడైన వ్యక్తిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే రమణ, తన బిడ్డను గోపీ చేతుల్లో పెట్టేశారు. కోచ్‌ను ఆయన అంతగా నమ్మారు. సాధారణంగా తమ జీవితంలో ఎంతో ఆశపడి, శ్రమపడి కూడా అందుకోలేని లక్ష్యాలను అదే రంగంలో తమ పిల్లల ద్వారా సాధించి ఆ సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించడం ఎంతో మంది తల్లిదండ్రులు చేస్తుంటారు. ఇక్కడ ఇదే విషయాన్ని మరో రకంగా చెప్పుకుంటే తండ్రి పాత్రలో కోచ్ కనిపిస్తారు. గోపీ ఆటగాడిగా తన కెరీర్లో ఒలింపిక్స్ పతకం గెలుచుకోలేదు. ఆ ఆనందాన్ని ఆయన అనుభవించలేదు. అందుకే తన శిష్యుల ద్వారా దానిని సాధించాలని ఆయన భావించారు. అనుకోవడమే కాదు... ఆటగాళ్లతో సమంగా శ్రమించారు. గత ఒలింపిక్స్‌లో సైనా, ఈ సారి సింధు తమ కోచ్ కలను నిజం చేశారు. శ్రామికుడిలా... రియో సన్నాహకాల్లో శ్రమిస్తున్న సింధు శిక్షణను చూసినప్పుడు గోపీచంద్ ఒక మిలిటరీ అధికారిని తలపించాడు. స్మాష్ కొట్టేటప్పుడు ఆమె మోకాలు సరిగ్గా వంచడం మొదలు మెషీన్ గన్‌నుంచి తూటాల్లా ప్రతీ కార్నర్‌నుంచి దూసుకొచ్చే షటిల్స్‌ను సమర్థంగా ఎదుర్కోవడం వరకు... కోర్టులో ఆమె ప్రతీ కదలికపై గోపీచంద్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒలింపిక్స్ కోసం సింధు, శ్రీకాంత్‌లను తీర్చి దిద్దే క్రమంలో తాను కూడా ఒక యువ ఆటగాడిలా గోపీచంద్ సిద్ధమయ్యాడు. వారికి కోచింగ్ ఇచ్చేందుకు కావాల్సిన ఫిట్నెస్ కోసం తాను మూడు నెలలుగా సాధారణ ఆహారం పక్కన పెట్టేసి కేవలం కార్బొహైడ్రేట్లతోనే నడిపించాడు. డోపింగ్, ఇన్ఫెక్షన్ భయంతో బయటి ఆహారం, నీటికి వారిద్దరిని దూరంగా ఉంచడం మొదలు దేవుడి ప్రసాదాలు కూడా దగ్గరికి రానివ్వకుండా, తనతో కలిసి మాత్రమే డైనింగ్ హాల్లో భోజనం చేసే ఏర్పాట్లు చేశాడు. ‘కారణం ఏదైనా కావచ్చు... కానీ సైనా నెహ్వాల్ వెళ్లిపోయాక మరొకరిని ఆ స్థాయిలో తీర్చి దిద్దాలని, ఫలితాలు సాధించి చూపాలనే మొండి పట్టుదల అతనిలో వచ్చేసింది. అందుకే అతను ఈ కఠోర శ్రమకు సిద్ధమయ్యాడు’ అని గోపీచంద్ సన్నిహితుడొకరు చెప్పడం విశేషం. బ్యాడ్మింటన్ బంగారుమయం మన దేశంలో బ్యాడ్మింటన్‌కు ఏం భవిష్యత్తు ఉంటుందండీ... అకాడమీ ఏర్పాటుకు ఆర్థిక సహాయం కోసం ఒక కార్పొరేట్‌ను కదిలిస్తే గోపీచంద్‌కు వచ్చిన జవాబిది. కానీ గోపీచంద్ తాను అనుకున్నది చేసి చూపించాడు. అందుకు తన శక్తియుక్తులు, సర్వం ధారబోశాడు. చాంపియన్లను తయారు చేయడం అంటే పార్ట్‌టైమ్ బిజినెస్ కాదని నమ్మిన మనిషి అతను. కొన్నేళ్ల క్రితం సైనా విజయాలతో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు సింధు గెలుపుతో మరింత ఎగసింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు చోట్ల గోపీచంద్ అకాడమీలు వచ్చేశాయి. తాజాగా రాజధాని ఢిల్లీ శివార్లలో కూడా కొత్త అకాడమీ వస్తోంది. దీనికి స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ మాకెంత లాభం అంటూ అడిగేసింది. అంతే గోపీచంద్ వారిని వద్దనేశాడు. అయితే అప్పుడూ ఇప్పుడూ గోపిచంద్ చెప్పే మాట ఒక్కటే. ‘నేను అకాడమీల పేరుతో వ్యాపారం చేయడం లేదు. అత్యుత్తమ ఫలితాలు రాబట్టడం, గొప్ప ఆటగాళ్లను తయారు చేయడం నా లక్ష్యం. అందుకోసమే శ్రమిస్తాను. లెక్కలు రాసుకొని కోర్టులో దిగితే ఎన్నడూ పతకాలు రావు’ అని తన విజయ రహస్యాన్ని ఆయన చెప్పేశాడు. -
క్రీడాకారులు నైపుణ్యం పెంచుకోవాలి
బ్యాడ్మింటన్ ఇండియా జట్టు కోచ్ గోపిచంద్ రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాకారులు తాము ఎంచుకున్న ఆటలో నైపుణ్యం పెంచుకుని సత్తాచాటాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ ఇండియా జట్టు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–17, 19 జూనియర్ బ్మాడింటన్ మెయిన్ పోటీలు శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో ప్రారంభమయ్యాయి. పోటీలను గోపిచంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పింగిళి రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపిచంద్ పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో జరిగే తప్పిదాలను సవరించుకునేందుకు టోర్నమెంట్లు వేదికగా నిలుస్తాయన్నారు. 1989లో మొదటిసారిగా తాను హన్మకొండ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నానని తెలిపారు. తర్వాత 1994లో మరోసారి జరిగిన పోటీలకు హాజరైనట్లు చెప్పారు. చిన్న, చిన్న టోర్నమెంట్లలో తెలియని ఆనందం ఉంటుందన్నారు. టోర్నమెంట్లు అనుభవ పాఠాలను నేర్పడంతోపాటు మధుర జ్ఞాపకాలను అందిస్తాయన్నారు. ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహిస్తున్న అండర్–17, 19 జూనియర్ టోర్నమెంట్ ప్రారంభానికి రావడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ వాతావరణం క్రీడాకారులకు మంచి ఎనర్జీని ఇవ్వడంతోపాటు పాజి టివ్ దృక్పథాన్ని అందిస్తుందన్నారు. పోటీల్లో ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా విజయానికి బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మొదటి చాంపియన్‌షిప్ కోసం తలపడుతున్న జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సమావేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ గండ్ర సత్యనారాయణ రెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ పాణిరావు, జిల్లా అధ్యక్షుడు టి. రవీందర్రావు, కోశాధికారి నాగకిషన్, బాడ్మింటన్ జాతీయ అంపైర్ కొమ్ము రాజేందర్, అంపైర్లు శ్రీధర్, కిశోర్, హన్మంతరావు, శ్యామ్, మల్లికార్జున్, పీవీఎల్ కుమార్, పీసీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా గోపిచంద్ కూతురు అండర్–17 విభాగంలో కోచ్ పుల్లెల గోపిచంద్ కూతురు గాయత్రి రంగారెడ్డి జిల్లా తరపున పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి వర్సెస్ నిజామాబాద్ జిల్లా (పూర్వీసింగ్ క్రీడాకారిణి)తో ఆమె సింగిల్స్‌లో తలపడింది. కాగా, గోపిచంద్ కూతురును ఆటను క్రీడాభిమానులు ఆసక్తిగాతిలకించారు. -
రియో ఒలింపిక్స్ లో సత్తా చాటుతాం
వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ అంతటా అకాడమీలు ‘సాయ్’ సహకారంతో 30 మందికి ఉచిత శిక్షణ 1989లో వరంగల్‌లో మెుదటిసారి ఆడాను ఇక్కడి వాతావరణం క్రీడాకారులకు శక్తి ఇస్తుంది బ్యాడ్మింటన్ ఇండియన్ టీం కోచ్ పుల్లెల గోపిచంద్ వరంగల్ స్పోర్ట్స్ : ఆగస్టు 8 నుంచి రియోలో జరగనున్న ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతారని ఇండియన్ బ్యాడ్మింటన్ టీం కోచ్ పుల్లెల గోపీచంద్ దీమా వ్యక్తం చేశారు. హన్మకొండలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్–17, 19 బాలబాలికల టోర్నమెంట్‌ను శుక్రవారం గోపిచంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రియోలో సింధు మొదటిసారిగా పాల్గొంటున్నదని, సింధు ఆట పాజిటివ్‌గా ఉందన్నారు. ఒలంపిక్స్ అంటేనే చాలా టఫ్ ఆ దిశగా మరింత సాధన చేస్తున్నారు. సింధు సింగిల్స్‌లో రాణిస్తుందనే నమ్మకం ఉందని, సింధుతో పాటు సైనా, జ్వాలా, అశ్వినిలు సైతం దూకుడుపైనే ఉన్నారని, ఒలంపిక్స్‌లో సత్తా చాటడం ఖాయమన్నారు. గతంలో జరిగిన నాలుగు ఒలంపిక్స్లను స్పెయిన్, జపాన్, కొరియా, ఇండియా ఇలా ఒక్కోసారి ఒక్కో దేశం విజయం పరంపర కొనసాగిందని, అందులోనూ ఒక్క ప్లేయరే అన్ని ఒలింపిక్స్ ఆడలేదని, ఒక్కో ఒలింపిక్స్‌లో ఒక్కొక్కరు ఆడారు కాబట్టి మన క్రీడాకారులు నెగ్గుతారని గట్టి చెప్పొచ్చన్నారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని అకాడమీలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని గోపీచంద్ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని అకాడమీ లో 125 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సహకారంతో తన అకాడమీలో 30 మంది క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. వరంగల్ లో ప్రతిభ గల క్రీడాకారులు ఉంటే వారికి సైతం అవకాశం ఉంటుందన్నారు. కాగా, గోపీచంద్ కూతురు గాయత్రి అండర్–17 విభాగంలో రంగారెడ్డి జిల్లా తరఫున ఆడుతున్నది. కూతురు ఆటను గోపీచంద్ ఇతర క్రీడాకారులు, అధికారులతో కలిసి వీక్షించారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న రాష్ట్రస్థాయి అండర్–17, 19 జూనియర్ బాడ్మింటన్ పోటీల్లో భాగంగా గురువారం క్రీడాకారులకు క్వాలీ ఫైయింగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ సం ద ర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పింగిళి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ హన్మకొండ సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో రెండు రోజుల పాటు జరిగే పోటీలను పద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపిచంద్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్వాలీ ఫైయింగ్ మ్యాచ్‌లకు పది జిల్లాల నుంచి 115 మంది క్రీడాకారులు హాజరైనట్లు చెప్పారు. ఇందులో అర్హత సాధించిన క్రీడాకారులు మెయిన్ డ్రాకు ఎంపికై పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, కోశాధికారి నాగకిషన్, జాతీయ అంపైర్ కొమ్ము రాజేందర్, అంపైర్లు కిశోర్, హన్మంతరావు, శ్యాం, శ్రీధర్, మల్లికార్జున్, పీవీఎల్ కుమార్, పీసీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
చలో రియో
కిత్నే ఆద్మీ థే..? 121 సర్కార్..! ఎవరు వాళ్లు... లిస్ట్ ఇచ్చాం సర్కార్... ఇంత మంది ఎలా పెరిగారు..? కింద స్టోరీ ఉంది సర్కార్... చరిత్రలో తొలిసారి భారత్ నుంచి 121 మంది అథ్లెట్ల భారీ బృందం ఒలింపిక్స్‌కు వెళుతోంది. భారత్ నుంచి రియోకు అర్హత సాధించిన అథ్లెట్లు... గత ఒలింపిక్స్‌తో పోలిస్తే భారీగా పెరిగారు. ఎనిమిదేళ్ల క్రితం బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల సంఖ్య 56. నాలుగేళ్ల క్రితం లండన్‌లో ఈ సంఖ్య 83కు పెరిగింది. ఈ సారి రియోలో మన సంఖ్య సెంచరీ దాటింది. అనూహ్యంగానో, అదృష్టవశాత్తో అవకాశం దక్కించుకున్నవారు వీరిలో ఎవరూ లేరు. గత రెండేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి తమ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్‌కు వీరంతా అర్హత సాధించారు. ఆ ఆటతీరే ఇప్పుడు భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందనే ఆశలు పెంచుతోంది. ‘గతంలో మన అథ్లెట్లు ఒలింపిక్స్‌నుంచి జ్ఞాపికలు తెచ్చుకోవడంతోనే సంబరపడేవారు. కానీ ఈతరం ఆటగాళ్లలో దూకుడు పెరిగింది. వారు సరదా కోసం కాకుండా పతకమే లక్ష్యంగా ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నారు’... భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన ఈ వ్యాఖ్య ఇటీవలి పరిణామాలు, మారిన మన ఆలోచనా తీరుకు నిదర్శనం. ఈ సారి ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల సంఖ్య పెరగడం మన క్రీడారంగంలో వచ్చిన మార్పుకు సంకేతం. మహిళా హాకీ పునరాగమనం... 2012 ఒలింపిక్స్‌తో పోలిస్తే అదనంగా 38 మంది అథ్లెట్లు ఈ సారి ప్రపంచ క్రీడా సంబరానికి అర్హత సాధించారు. ఇందులో 16 మంది సభ్యుల మహిళా హాకీ జట్టు కూడా ఉంది. నిలకడైన ప్రదర్శనతో జట్టు 36 ఏళ్ల తర్వాత మరో సారి అవకాశం దక్కించుకుంది. రియోలో మొత్తం 121 మంది భారత అథ్లెట్లు 15 క్రీడల్లో కలిపి మొత్తం 72 ఈవెంట్లలో పోటీ పడనున్నారు. తొలి సారి షూటింగ్లో 12 మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు అర్హత సాధించడం విశేషం. అథ్లెటిక్స్‌లో ఏకంగా 23 మంది పెరిగారు. లండన్‌కంటే మరో ముగ్గురు రెజ్లర్లు అదనంగా క్వాలిఫై అయ్యారు. అండగా నిలిచిన ప్రభుత్వం లండన్ ఒలింపిక్స్ అనంతరం కేంద్ర ప్రభుత్వం తదుపరి క్రీడల లక్ష్యంతో కొత్త ప్రణాళికలను రూపొందించడం ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడింది. వాస్తవానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగా 2020 టోక్యో క్రీడలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే రియోలో మన సంఖ్య పెరిగింది. ముఖ్యంగా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం మాత్రం చాలా మందికి ఉపయోగ పడింది. గతంలో నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఆటగాళ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేది. అయితే ఇది సుదీర్ఘ ప్రక్రియ కావడంతో పాటు ముందుగా సొంత డబ్బు ఖర్చు చేసి తర్వాత ప్రభుత్వంనుంచి తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల అథ్లెట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే కొత్తగా తీర్చిదిద్దిన టాప్ పథకం ఆటగాళ్లను ఆదుకుంది. ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన 75 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు రూ. 25 లక్షలనుంచి రూ. కోటి వరకు ప్రభుత్వం అందజేసింది. దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. రియోకు అర్హత సాధించినవారిలో కొందరు మినహా దాదాపు అంతా దీనిని బాగా ఉపయోగించుకున్నారు. సుశీల్, నర్సింగ్ వ్యక్తిగత వివాదం మినహా అన్ని క్రీడల్లో ఆయా సమాఖ్యలకు తమ ఈవెంట్ సన్నాహకాలపై మొదటినుంచి మంచి స్పష్టత ఉంది. అందు వల్ల అర్హత కోసం పాల్గొనాల్సిన టోర్నీలు, ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రొఫెషనల్ పద్ధతిలో ప్రభుత్వం కూడా జాతీయ క్రీడా సమాఖ్యలతో కలిసి మంచి సమన్వయంతో పని చేసింది. వెన్నంటి నిలుస్తూ... ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయమే కాకుండా గత కొన్నేళ్లుగా కొన్ని ఇతర సంస్థలు అండగా నిలవడం కూడా ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను చేకూర్చింది. క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు వచ్చిన ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ), లక్ష్య, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ అథ్లెట్లు ఇతర అంశాల గురించి ఆలోచించకుండా తమ ఆటపైనే దృష్టి పెట్టేలా చేయడంలో సఫలమయ్యాయి. ఓజీక్యూ అండగా నిలిచిన ఆటగాళ్లలో సైనా నెహ్వాల్, సింధు, శివ థాపా, దీపికా కుమారి, గగన్ నారంగ్, జీతూరాయ్, యోగేశ్వర్ దత్ కొందరు. లక్ష్య సంస్థ ఈ సారి బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి సుమీత్ రెడ్డి- మను అత్రిలకు అండగా నిలుస్తోంది. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ అందించిన సహకారం వల్లే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి నర్సింగ్ యాదవ్ రియోలో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ సహకారం అంతా ఒలింపిక్స్‌లో మన సంఖ్య పెరిగేందుకు దోహదపడింది. కార్పొరేట్ కాంబినేషన్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఒలింపిక్ సంఘం ఈ సారి కార్పొరేట్లతో జత కట్టి పెద్ద ఎత్తున జట్టుకు స్పాన్సర్‌షిప్‌లు రాబట్టడంలో సఫలమైంది. ఇందు కోసం ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రధాన స్పాన్సర్లు అమూల్, జియో మొబైల్ భారత బృందంతో జత కట్టాయి. ఎడిల్వీజ్, టాటా సాల్ట్, హెర్బలైఫ్ తదితర సంస్థలు ఇందులో భాగమయ్యాయి. మొత్తం 10 సంస్థలు అండగా నిలిచేందుకు ముందుకు రావడం విశేషం. ఎన్నో ఏళ్లుగా భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా శివ్ నరేశ్ వ్యవహరిస్తోంది. ఈ సారి చైనాకు చెందిన లీ నింగ్ భారత ఆటగాళ్లకు కిట్లు అందజేసింది. అథ్లెటిక్స్ (37) ధరమ్‌బీర్ సింగ్ (పురుషుల 200 మీటర్లు), మొహమ్మద్ అనస్ (400 మీటర్లు, 4ఁ400 మీటర్ల రిలే), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు), అయ్యసామి ధరుణ్, మోహన్ కుమార్, సుమిత్ కుమార్, మొహమ్మద్ కున్హి, అరోకియా రాజీవ్ (4ఁ400 మీటర్ల రిలే), తొనకల్ గోపీ, ఖెటా రామ్, నితేందర్ సింగ్ రావత్ (మారథాన్) బల్జీందర్ సింగ్, గుర్మీత్ సింగ్, ఇర్ఫాన్ థోడి (20 కిలోమీటర్ల నడక), సందీప్ సింగ్, మనీశ్ సింగ్ (50 కిలోమీటర్ల నడక), అంకిత్ శర్మ (లాంగ్‌జంప్), రంజిత్ మహేశ్వరీ (ట్రిపుల్ జంప్), ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్) వికాస్ గౌడ (డిస్కస్ త్రో) ద్యుతీ చంద్ (మహిళల 100 మీటర్లు) శ్రాబణి నందా (200 మీటర్లు) నిర్మలా షెరాన్ (400 మీటర్లు, 4ఁ400 మీటర్ల రిలే) టింటూ లూకా (800 మీటర్లు) లలితా బాబర్ (3000 మీటర్ల స్టీపుల్‌చేజ్) సుధా సింగ్ (3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, మారథాన్) అశ్విని అకుంజి, దేబశ్రీ మజుందార్, జిష్నా మాథ్యూస్, ఎం.ఆర్.పూవమ్మ, అనిల్డా థామస్ (4ఁ400 మీటర్ల రిలే) ఓపీ జైషా, కవితా రౌత్ (మారథాన్) ఖుష్బీర్ కౌర్, సప్నా పూనియా (20 కిలోమీటర్ల నడక) మన్‌ప్రీత్ కౌర్ (షాట్‌పుట్) సీమా అంటిల్ (డిస్కస్ త్రో). బ్యాడ్మింటన్ (7) సైనా నెహ్వాల్, పీవీ సింధు (మహిళల సింగిల్స్), కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్), సుమిత్ రెడ్డి, మనూ అత్రి (పురుషుల డబుల్స్), గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్). టెన్నిస్ (4) లియాండర్ పేస్, రోహన్ బోపన్న (పురుషుల డబుల్స్/మిక్స్డ్ డబుల్స్), సానియా మీర్జా, ప్రార్థన తొంబ్రే (మహిళల డబుల్స్/మిక్స్డ్ డబుల్స్). ఆర్చరీ (4) అతాను దాస్ (పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం), దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి మాఝీ (మహిళల రికర్వ్ టీమ్, వ్యక్తిగత విభాగం). టేబుల్ టెన్నిస్ (4) ఆచంట శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్ (పురుషుల సింగిల్స్), మనికా బాత్రా, మౌమా దాస్ (మహిళల సింగిల్స్). బాక్సింగ్ (3) శివ థాపా (బాంటమ్ వెయిట్-56 కేజీలు), మనోజ్ కుమార్ (లైట్ వెల్టర్ వెయిట్-64 కేజీలు), వికాస్ క్రిషన్ యాదవ్ (మిడిల్ వెయిట్-75 కేజీలు). గోల్ఫ్ (3) అనిర్బన్ లాహిరి, శివ్ చౌరాసియా (పురుషుల విభాగం), అదితి అశోక్ (మహిళల విభాగం). వెయిట్‌లిఫ్టింగ్ (2) సతీశ్ శివలింగం (పురుషుల 77 కేజీలు), మీరాబాయి చాను (మహిళల 48 కేజీలు). రెజ్లింగ్ (8) సందీప్ తోమర్ (పురుషుల ఫ్రీస్టయిల్-57 కేజీలు), యోగేశ్వర్ దత్ (65 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), రవీందర్ ఖత్రీ (పురుషుల గ్రీకో రోమన్-85 కేజీలు), హర్దీప్ సింగ్ (98 కేజీలు), వినేశ్ ఫోగట్ (మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీలు), బబితా కుమారి (53 కేజీలు), సాక్షి మలిక్ (58 కేజీలు). రోయింగ్ (1) దత్తూ బబన్ భోకనాల్ (పురుషుల సింగిల్ స్కల్స్). షూటింగ్ (12) అభినవ్ బింద్రా (పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్) కైనన్ చెనాయ్, మానవ్‌జిత్ సింగ్ సంధూ (ట్రాప్) మేరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్) ప్రకాశ్ నంజప్ప (50 మీటర్ల పిస్టల్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), జీతూ రాయ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్), చెయిన్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), గుర్ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), అపూర్వీ చండేలా, అయోనికా పాల్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), హీనా సిద్ధూ (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్). హాకీ (32) పురుషుల జట్టు: సురేందర్ కుమార్, డానిష్ ముజ్తబా, రఘునాథ్, ఆకాశ్‌దీప్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, కొతాజిత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, రూపిందర్‌పాల్ సింగ్, సర్దార్ సింగ్, శ్రీజేష్, ఎస్వీ సునీల్, నికిన్ తిమ్మయ్య, ఎస్కే ఉతప్ప, దేవిందర్ వాల్మీకి. మహిళల జట్టు: సవితా పూనియా, దీప్గ్రేస్ ఎక్కా, దీపికా ఠాకూర్, నమితా టొప్పో, సునీతా లాక్రా, సుశీలా చాను, లిలిమా మింజ్, రేణుకా యాదవ్, నిక్కీ ప్రధాన్, మోనికా మలిక్, నవ్‌జ్యోత్ కౌర్, అనురాధ దేవి, పూనమ్ రాణి, వందన కటారియా, ప్రీతి దూబే, రాణి రాంపాల్. స్విమ్మింగ్ (2) సజన్ ప్రకాశ్ (పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్), శివాని కటారియా (మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్). జిమ్నాస్టిక్స్ (1) దీపా కర్మాకర్ (మహిళల విభాగం). జూడో (1) అవతార్ సింగ్ (పురుషుల 90 కేజీలు). సైనాకు ఐదో సీడ్ న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగబోతోంది. మరో స్టార్ షట్లర్ పీవీ సింధుకు తొమ్మిదో సీడ్ లభించింది. స్పెయిన్‌కు చెందిన కరోలినా మరిన్ టాప్ సీడ్. ఇక పురుషుల విభాగంలో శ్రీకాంత్‌కు తొమ్మిదో సీడ్ లభించింది. లీ చోంగ్ వీ టాప్ సీడ్. -
పతకమే లక్ష్యమైతే... ‘డ్రా’తో పనేంటి!
► ‘రియో’కు దీటుగా సన్నద్ధమయ్యాం ► ఒత్తిడినెదుర్కొంటే చాలు : చీఫ్ కోచ్ గోపీచంద్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో మన షట్లర్ల గురి పతకంపై ఉంటే ఎలాంటి డ్రానైనా ఎదుర్కొంటారని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. తీవ్ర ఒత్తిడిలో రెండు వరుస మ్యాచ్‌లన్ని గెలిచేస్తే పతకం చేజిక్కుతుందని చెప్పారు. భారత్ నుంచి తొలిసారి అత్యధికంగా ఏడుగురు షట్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న బ్యాడ్మింటన్ ‘డ్రా’ను విడుదల చేస్తారు. గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ అకాడమీని ఏర్పాటు చేసేందుకు బుధవారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ దళానికి డ్రాపై బెంగలేదన్నారు. ఆటగాళ్లంతా బాగా సన్నద్ధమయ్యారని చెప్పారు. ‘ఒలింపిక్స్ డబుల్స్‌లో 16 మంది ఆటగాళ్లతో కూడిన డ్రానే ఉంటుంది. ఇందులో తమదైన రోజు బాగా శ్రమిస్తే గెలుపేమంత కష్టం కాబోదు’ అని గోపీ వివరించారు. గత ఈవెంట్ కంటే ఈసారి ఎక్కువమంది అర్హత పొందారని... సైనాలాంటి అనుభవజ్ఞులైన ప్లేయర్‌తో పాటు పురుషుల, మహిళల డబుల్స్ జోడీలు సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘సైనాతో పాటు కిడాంబి శ్రీకాంత్, పి.వి.సింధులకూ పతకావకాశాలున్నాయి. లండన్ గేమ్స్ అనుభవంతో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడి రాణిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. చాలా మందికి ఒలింపిక్స్ అనుభవలేమి నిజమే అయినప్పటికీ కామన్వెల్త్, ఆసియాలాంటి మేటి ఈవెంట్లలో సత్తాచాటిన సంగతి మరువొద్దని గోపీ గుర్తుచేశారు. పురుషుల సింగిల్స్‌లో ప్రధాన ప్రత్యర్థులు లీ చోంగ్ వీ, లిన్ డాన్, చెంగ్ లాంగ్లేనని భారత కోచ్ విశ్లేషించారు. ఎటొచ్చి మహిళల సింగిల్సే క్లిష్టంగా ఉందని చెప్పారు. చైనా ఆధిపత్యంతో పాటు కరోలినా మారిన్, రచనోక్లతో పాటు జపాన్, కొరియన్ల నుంచి కూడా గట్టి పోటీ ఉంటుందని తెలిపారు. అయితే అగ్రశ్రేణి క్రీడాకారిణిలెవరూ ఈ ఏడాది నిలకడను చూపెట్టలేదని... ఈ నేపథ్యంలో ఫలానా ప్లేయర్ ఫేవరెట్ అని చెప్పడం కష్టమని గోపీ చెప్పుకొచ్చారు. ఉత్తర భారతదేశంలోనూ అకాడమీని నెలకొల్పాలని భావించిన గోపీచంద్... గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అధునాతన అకాడమీని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. గ్రేటర్ నోయిడా డెవలప్మెంట్ అథారిటీ, స్పోర్ట్స్లైవ్లతో కలిసి ఈ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదివరకే ఆయనకు హైదరాబాద్‌లో రెండు అకాడమీలతో పాటు గ్వాలియర్, వడోదరల్లో ఒక్కో అకాడమీ ఉంది. -
‘ఖేలో ఇండియా’ సభ్యులుగా గోపీచంద్, అంజూ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పతక విజేత అంజూ బాబీ జార్జిలను ‘ఖేలో ఇండియా’లో సభ్యులుగా నియమించారు. దేశంలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. గోపీ, అంజూ రూపంలో ఇద్దరు క్రీడాకారులకు చోటు లభించింది. హైదరాబాద్‌కు చెందిన గోపీచంద్ 2006 నుంచి జాతీయ కోచ్‌గా పని చేస్తున్నారు. ఆయన శిక్షణలోనే సైనా, సింధు, శ్రీకాంత్‌లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. మరోవైపు లాంగ్ జంపర్‌గా అసాధారణ విజయాలు సాధించిన అంజూ... ఇటీవల కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రీడా మంత్రి ఈపీ జయరాజన్ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా మొత్తం 13 మంది సభ్యులు తమ రాజీనామాలు సమర్పించారు. -
నేడు కొల్లాపూర్ మినీస్టేడియం ప్రారంభోత్సవం
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన మినీ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పద్మారావుతో పాటు ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ హాజరుకానున్నారు. -
ట్రంప్ మ్యాచ్‌తో ఆసక్తి పీబీఎల్‌పై గోపీచంద్
ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ప్రవేశపెట్టనున్న ట్రంప్ మ్యాచ్‌ల వల్ల మరింత ఉత్సాహం వస్తుందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ‘లీగ్‌కు ఇదో అదనపు ఆకర్షణ. ఈ మ్యాచ్‌ల వల్ల ఉత్సాహం పొంగిపొర్లుతుంది. ప్రతి జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఒకదాన్ని ట్రంప్ మ్యాచ్‌గా ప్రతిపాదిస్తుంది. కేవలం అర్ధగంట ముందు దీనికి సంబంధించిన లైనప్‌ను ప్రకటిస్తారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారికి అదనపు పాయింట్ లభిస్తే, ఓడిన వారికి ఓ పాయింట్ కోత పడుతుంది. రెండు జట్లు ఒకే మ్యాచ్‌ను ట్రంప్‌గా ప్రకటించొచ్చు. 3-0 ఆధిక్యం ఉన్నా చివరి రెండు మ్యాచ్‌లు కచ్చితంగా ఆడాల్సిందే. కాబట్టి అభిమానుల ఆసక్తిని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గోపీచంద్ పేర్కొన్నారు. -
సిరిల్ వర్మ కొత్త చరిత్ర
ప్రపంచ జూ. బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్లోకి బాలుర సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు హైదరాబాద్: తన కోచ్ పుల్లెల గోపీచంద్, అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, అజయ్ జయరామ్‌లాంటి వారితో సాధ్యంకానిది తెలుగు తేజం అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ సాధించాడు. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలుర సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా అతను గుర్తింపు పొందాడు. పెరూ రాజధాని లిమాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో 15 ఏళ్ల సిరిల్ వర్మ నిలకడగా రాణిస్తూ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో సిరిల్ వర్మ 21-15, 21-14 స్కోరుతో 14వ సీడ్ అదుల్రాచ్ నమ్కుల్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. అన్‌సీడెడ్‌గా ఈ పోటీల్లో బరిలోకి దిగిన సిరిల్ ఫైనల్ చేరుకునే క్రమంలో నలుగురు సీడెడ్ క్రీడాకారులను ఓడించడం విశేషం. ఫైనల్లో ఆరో సీడ్ చియా హుంగ్ లూ (చైనీస్ తైపీ)తో సిరిల్ తలపడతాడు. 1992లో మొదలైన ప్రపంచ జూనియర్ బ్యాడ్మిం టన్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఓవరాల్‌గా భారత్‌కు ఇప్పటి వరకు ఆరు పతకాలు వచ్చాయి. బాలుర సింగిల్స్ విభాగంలో గురుసాయిదత్ (2008లో), భమిడిపాటి సాయిప్రణీత్, ప్రణయ్ (2010లో)... సమీర్ వర్మ (2011లో) సెమీఫైనల్లో నిష్ర్కమించి కాంస్య పతకాలు నెగ్గారు. బాలికల సింగిల్స్ విభాగంలో 2008లో సైనా నెహ్వాల్ విజేతగా నిలువగా... 1996లో అపర్ణ పోపట్ రన్నరప్‌గా నిలిచింది. -
నవంబర్ 16న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు మీనాక్షీ శేషాద్రి (నటి), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్ కోచ్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శని సంఖ్య కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా జరిగినప్పటికీ ఆయా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరత్వాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయవాద వృత్తిలోని వారు, మేనేజిమెంట్ రంగంలోని వారు, వైద్యవిద్యార్థులు, వైద్యులు రాణిస్తారు. వీరు పుట్టిన తేదీ 16. ఇది కేతు సంఖ్య కావడం వల్ల వీరికి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువులను, స్నేహితులను కలుస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల తోటివారితో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,3,6,7,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి రుద్రాభిషేకం, కేతు గ్రహ జపం చేయించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, వృద్ధులను, వికలాంగులను ఆదరించడం, మాటలలో సంయమనం పాటించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
హైదరాబాద్ లో మరో బ్యాడ్మింటన్ అకాడమీ!
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హైదరాబాద్ లో మరో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు. సైబారాబాద్ ఏరియాలోని గచ్చిబౌలిలో తొమ్మిది కోర్టులతో కూడిన బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా స్సష్టం చేశాడు. వచ్చే రెండు నెలల్లోపే అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నాడు. అకాడమీ ప్రారంభోత్సవానికి కేంద్ర క్రీడామంత్రి సర్బానంద్ సోనావాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఆహ్వానించనున్నట్లు గోపీచంద్ పేర్కొన్నాడు. వారు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ కార్యక్రమం తేదీని ఖరారు చేస్తామన్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రస్తుతం ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీలో చాలా మందికి శిక్షణ ఇచ్చినా.. రానురాను శిక్షణ తీసుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నాడు. దీనిలో భాగంగానే కొత్త అకాడమీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నాడు. అంతకుముందు 2003లో గోపీచంద్ ఎనిమిది కోర్టులతో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆసియాలో ఉన్న అత్యుత్తుమ బ్యాడ్మింటన్ అకాడమీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే బ్యాడ్మింటన్ అకాడమీలో పలువురు తెలుగు తేజాలు శిక్షణ తీసుకుని అంతర్జాతీయం విశేషంగా రాణిస్తున్నారు. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
గోపీచంద్, చాగంటిలకు గౌరవ డాక్టరేట్లు
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవం ఈనెల 29న నిర్వహించనున్నట్లు వీసీ డాక్టర్ సి.తంగరాజ్ తెలిపారు. స్నాతకోత్సవానికి డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.క్రిస్టోఫర్ ముఖ్య అతిథిగా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విశిష్ట అతిథులుగా హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా తమ యూనివర్సిటీ తరఫున గోపీచంద్, చాగంటి కోటేశ్వరరావులకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. గతేడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 16లోపు ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులంతా తమ డిగ్రీల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఆ ఇద్దరికి.. గోపిచంద్ సలహా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వంతో పాటు బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)నుంచి కూడా గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు తగిన సహకారం అందుతోందని, వివాదాలు మాని ఆటపై దృష్టి పెడితే మంచిదని భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయ పడ్డారు. ఇకనైనా విమర్శలు కట్టి పెట్టాలని ఆయన సూచించారు. 'మాకు మద్దతు ఇవ్వడం లేదని వారిద్దరూ తరచుగా అంటున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదు. వారి సమస్య ఏమిటో సరిగ్గా, కచ్చితంగా చెబితే దానిపై ఆలోచించవచ్చు. ఇది పునరావృతం కావడం దురదృష్టకరం. నాకు తెలిసి దీనికి ముగింపు పలికి మన శ్రమను ఆటలో ఎదిగేందుకు వాడాల్సిన అవసరం ఉంది' అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. జ్వాల, అశ్విని ఆడే అన్ని టోర్నీలకు ‘సాయ్’, ‘బాయ్’ అండగా నిలిచాయని, డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్‌లతో శిక్షణ ఇప్పించామన్న గోపీచంద్... గత కొన్నేళ్లలో వారు ఏది అడిగినా అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు. -
పుల్లెల గోపీచంద్‌గా నటిస్తా!
‘‘మా మామయ్య కృష్ణగారు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఎవర్గ్రీన్ మూవీ. ఆ టైటిల్‌తో సినిమా చేయడమంటే సాహసమే. అయితే క్రేజ్ కోసం ఈ టైటిల్ పెట్టలేదు. కథానుగుణంగా ఇదే కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి, పెట్టాం’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. బోస్ నెల్లూరి దర్శకత్వంలో సుధీర్‌బాబు, నందిత జంటగా చక్రి చిగురుపాటి నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా విషయంలో నాకు సవాలుగా అనిపించింది ఏంటంటే.. ‘పోకిరి’లో మహేశ్‌బాబు చేసినట్లుగా చాలా సటిల్ పెర్ఫార్మెన్స్ చేయాలి. పెద్దగా అరవకుండా, చిన్న చిన్న సంభాషణలతో, కూల్‌గా నటించాలి. సరిగ్గా కుదురుతుందో లేదోనని భయం ఓ వైపు, ఉద్వేగం ఇంకో వైపు కలిగాయి. చివరికి బాగా చేయగలిగాను’’ అన్నారు. ‘మీ డ్రీమ్ రోల్స్ అంటూ ఏమైనా ఉన్నాయా?’ అనడిగితే - ‘‘ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాలనుకుంటున్నా. కష్టపడి పైకొచ్చిన గోపీచంద్ జీవితం చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ బయోపిక్ విషయంలో గోపీచంద్‌కి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన జీవితం ఆధారంగా తీసే సినిమాలో నేను నటిస్తే బాగుంటుందని అన్నారు. కాకపోతే మంచి టీమ్‌తో చేయాలి. అలాంటి టీమ్ కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. -
‘భారత బ్యాడ్మింటన్‌కు ఇది
గొప్ప రోజు. ఒకే టోర్నీలో మన ఇద్దరు ప్లేయర్లు టైటిల్స్ నెగ్గడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ సమయంలో భారత జాతీయ గీతం వినేందుకు నేను అక్కడ ఉంటే బాగుండేదనిపిస్తోంది. రెండూ ప్రత్యేకమైన విజయాలే. సైనా ఈ టోర్నీలో తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. ఇటీవల ఆమె చాలా మంచి ఆటతీరు కనబర్చినా విజేతగా నిలువలేదు. ఈ విజయం ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. కొంత మంది తక్కువ స్థాయి చైనా క్రీడాకారిణులు ఉన్నా... ఇది ఆమె సూపర్ సిరీస్ విజయాన్ని తక్కువ చేయలేదు. ఇక శ్రీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నా పుట్టిన రోజునాడు అతను అపురూపమైన కానుక ఇచ్చాడు. లిన్ డాన్లాంటి ఆటగాడిని ఫైనల్లో ఓడించి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గడం అసాధారణం. విజయంతో పాటు అతని ఆటతీరును ప్రత్యేకంగా ప్రశంసించాలి. శ్రీకాంత్ వయసు 21 ఏళ్లే. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు ఈ గెలుపు సూచనగా చెప్పగలను.’ - ‘సాక్షి'తో పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్ బహుమతిగా కారు కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కారును బహుమతిగా ప్రకటించారు. శ్రీకాంత్‌కు ‘ఫోర్డ్ ఫిగో స్పోర్ట్’ కారును ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. -
గో స్పోర్ట్స్ ఫౌండేషన్ బోర్డులో గోపీచంద్
ముంబై: లాభాపేక్షలేని క్రీడా సంస్థ ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సలహా మండలిలో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేరాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఇప్పటికే ఈ బోర్డులో ఉన్నారు. సలహా మండలి సభ్యుడి హోదాలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేస్తాడు. చిరుప్రాయంలోనే ప్రతిభావంతులను గుర్తించడం, కోచ్‌లకు మరింత మెళకువలు నేర్పించడం, యువ క్రీడాకారులకు ఆటకు సంబంధించిన విషయాలపై వర్క్‌షాప్‌లను నిర్వహించడం వంటి అంశాల్లో గోపీచంద్ కీలకపాత్ర పోషిస్తాడు. దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో 9 నుంచి 13 సంవత్సరాలలోపు ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తాజాగా వచ్చిన మార్పులపై కోచ్‌లకు అవగాహన కల్పిస్తారు. ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో భాగస్వామిగా అయినందుకు సంతోషంగా ఉన్నాను. ఈ సంస్థతో కలిసి నేను దేశంలో బ్యాడ్మింటన్ మరింతగా అభివృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను’ అని గోపీచంద్ వ్యాఖ్యానించాడు. -
గోస్పోర్ట్స్ ఫౌండేషన్ లో చేరిన గోపిచంద్, ద్రావిడ్!
ముంబై: భారత బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, షూటర్ అభినవ్ బింద్రాలు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ లో చేరారు. బాడ్మింటన్ క్రీడ అభివృద్ధికి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలను గోపిచంద్ పర్యవేక్షించనున్నారు. టాలెంట్ ను గుర్తించడం, బాడ్మింటన్ క్రీడకు ప్రోత్సాహం అందించడం, కోచ్ లకు శిక్షణ, యువ అథ్లెట్లకు శిక్షణ శిబిరాలను నిర్వహించడం లాంటి కార్యక్రమాలను గోస్పోర్స్ ఫౌండేషన్ చేపడుతోంది. దేశవ్యాప్తంగా 9-13 వయస్సు ఉన్న ప్రతిభ గల అథ్లెట్స్ ను గుర్తించి వారికి శిక్షణను అందించేందుకు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. గోస్పోర్ట్స్ సంస్థకు సేవలందించడానికి గోపిచంద్ తీసుకున్న నిర్ణయంపై సంస్థ నిర్వాహకులు నందన్ కామత్ స్వాగతించారు. -
జట్టు ప్రదర్శనతో గర్వంగా ఉన్నా!
మా వ్యూహాలు ఫలించాయి భవిష్యత్తులో మరిన్ని పతకాలు పుల్లెల గోపీచంద్ విజయానందం సాక్షి, హైదరాబాద్: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్లో తమ వ్యూహాలు ఫలించాయని, ఫలితంగా నాలుగు పతకాలు గెలుచుకోగలిగామని ఆయన అన్నారు. కామన్వెల్త్లో విజయానంతరం స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్, కాంస్యం గెలిచిన గురుసాయిదత్, పీవీ సింధులతో కలిసి గోపీచంద్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో గోపీచంద్ తన విజయానందాన్ని పంచుకున్నారు. అంతకు ముందు శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు గోపీచంద్ బృందానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత గోపీచంద్ అకాడమీలో కూడా వేడుకలు జరిగాయి. ఆటగాళ్లను ప్రత్యేక రథంపై ఊరేగిస్తూ తీసుకు రాగా... బాణాసంచా కాల్చి వర్ధమాన ఆటగాళ్లు, అకాడమీ స్టాఫ్ సంబరాలు నిర్వహించారు. కశ్యప్‌పై నమ్మకం నిజమైంది బ్యాడ్మింటన్ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తే ఎప్పుడైనా భారీ విజయాలు దక్కుతాయని, ఇప్పుడు కశ్యప్ విషయంలో అది రుజువైందని గోపీచంద్ అన్నారు. ‘ఫైనల్లో మేం అనుకున్న వ్యూహం ప్రకారమే కశ్యప్ ఆడాడు. ఎక్కడా దానిని తప్పలేదు. ఈ పెద్ద విజయం కశ్యప్‌కు చాలా అవసరం. దానిని అతను సాధించాడు’ అని ఆయన చెప్పారు. సెమీస్‌లో ఓడిన కొద్ది సేపటికే మూడో స్థానం కోసం ఆడాల్సి వచ్చిందని, ఆ సమయంలో ఓటమిని మరచి, తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులువు కాదని... గురుసాయిదత్, సింధు ఈ ఘనత సాధించడం విశేషమన్నారు. జ్వాల- అశ్వినిలు కూడా బాగా ఆడారని, తన దృష్టిలో వారి సెమీఫైనల్ మ్యాచ్ ప్రదర్శన అత్యుత్తమమని గోపీచంద్ చెప్పారు. క్వార్టర్స్ ఉత్తమం: గురుసాయి తొలి సారి పెద్ద ఈవెంట్లో పతకం గెలవడం పట్ల గురుసాయిదత్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘గెలుపు అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. నిజానికి ఫైనల్‌కు కూడా చేరగలననే భావించాను. ఇప్పుడు సాధ్యం కాకపోయినా వచ్చేసారి సాధిస్తాను. ముఖ్యంగా క్వార్టర్స్‌లో టాప్ సీడ్‌ను ఓడించడం ప్రత్యేకంగా అనిపించింది. అకాడమీలో సహచరులతో శిక్షణ వల్లే నా విజయం సాధ్యమైంది’ అని అతను చెప్పాడు. అసంతృప్తి లేదు: సింధు తొలిసారి కామన్వెల్త్లో పాల్గొన్న సింధు కాంస్య పతకం గెలుచుకుంది. ‘స్వర్ణం గెలుచుకోకపోవడం సహజంగానే కొంత నిరాశకు గురి చేసింది. అయితే కాంస్యంతో సంతృప్తిగా ఉన్నా. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలవాల్సింది. కాంస్యం కోసం మానసికంగా సిద్ధం కాలేదు. అయితే కోచ్ ప్రోత్సాహంతో మ్యాచ్ గెలుచుకోగలిగాను’ అని సింధు పేర్కొంది. -
లక్ష్మణ్ బౌలింగ్ లో గోపిచంద్ బ్యాటింగ్!
హైదరాబాద్: వివిఎస్ లక్ష్మణ్ బౌలింగ్‌లో పుల్లెల గోపిచంద్ బ్యాటింగ్... గోపిచంద్ బౌలింగ్‌లో లక్ష్మణ్ బ్యాటింగ్...ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారు కదూ .. బుధవారం నాడిది సాధ్యమైంది. హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో బుధవారం ఆలిండియా స్పోర్ట్స్ జర్నలిస్టుల క్రీడల ప్రారంభోత్సంలో వీరిద్దరు సరదాగా క్రికెట్ ఆడారు. లక్ష్మణ్ బౌలింగ్‌లో గోపిచంద్ బ్యాటింగ్ చేస్తే, గోపిచంద్ బౌలింగ్‌లో లక్ష్మణ్ బ్యాటింగ్ చేశారు. వీరితో పాటు సైబరాబాద్ పోలీసు కమీషనర్ సివి ఆనంద్ కూడా సరదాగా ఆడారు. లక్ష్మణ్, గోపిచంద్ లకు బౌలింగ్ చేసి అలరించారు. దేశ వ్యాప్తంగా నాలుగు జోన్ల నుండి క్రికెట్ టీమ్‌లతో పాటు అనేక రాష్ట్రాల టేబుల్ టెన్నిస్ టీమ్‌లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంకా అర్జున అవార్డీ ఖాసిం అలీ, 1983 విన్నింగ్ వల్డ్ కప్ మేనేజర్ పీఆర్ మాన్సింగ్, హైదరాబాద్ క్రికెట్ సెక్రటరీ వెంకటేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మణ్ బౌలింగ్.. గోపీచంద్ బ్యాటింగ్
-
తెరపై బ్యాడ్మింటన్ స్టార్ కథ
పేరొందిన నిజజీవిత వ్యక్తుల కథలు ఎప్పుడూ ఆసక్తికరమే. అందులోనూ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులకు లోనై, కష్టపడి పైకొచ్చి, తరువాతి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన క్రీడాజ్యోతుల విషయమైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి కథలను కమర్షియల్‌గా అందించడానికి వెండితెర ఎప్పుడూ ఉత్సాహం చూపుతుంటుంది. ‘ఫ్లయింగ్ సిక్కు’గా పేరొందిన భారతీయ పరుగుల వీరుడు మిల్ఖాసింగ్ మీద ఆ మధ్య వచ్చిన హిందీ హిట్ ‘భాగ్ మిల్ఖా భాగ్’ అందుకు తాజా ఉదాహరణ. భారతీయ సైన్యంలో పనిచేసి, భారతీయ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం కూడా సాధించిన పాన్ సింగ్ తోమర్ జీవితంపై ఆయన పేరు మీదే సినిమా వచ్చి, అవార్డులు అందుకొంది. అయిదుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన మణిపూర్ క్రీడాకారిణి మేరీ కోమ్ జీవితం ఆధారంగా ప్రియాంకా చోప్రా నటిస్తున్న సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ స్ఫూర్తితో ఇప్పుడు తెలుగులో కూడా ఓ ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా సినిమా రూపకల్పనకు సన్నాహాలు సాగుతున్నాయి. సాక్షాత్తూ గోపీచంద్ శిష్యుడైన యువ హీరో సుధీర్‌బాబు ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు భోగట్టా. కాగా, పలువురు బ్యాడ్మింటన్ తారలను దేశానికి అందించిన గోపీచంద్ సైతం తన కథతో సినిమా తీయడానికి అంగీకరించారు. ఇటీవలే ‘చందమామ కథలు’ చిత్రం ద్వారా అందరి దృష్టినీ మరోసారి ఆకర్షించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ క్రీడా నేపథ్య చిత్రానికి దర్శకత్వం వహిస్తారని విశ్వనీసయ వర్గాల కథనం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ‘భాగ్ మిల్ఖా భాగ్’ లాగా ఆసక్తికరంగా స్క్రిప్టును తీర్చిదిద్దడానికి ప్రవీణ్ శ్రమిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే, స్క్రిప్టు పని పూర్తవగానే మరికొద్ది నెలల్లో సినిమా సెట్స్‌పైకి వస్తుంది. పరుగుల రాణి అశ్వినీ నాచప్ప జీవిత కథను కొంత ఆధారంగా చేసుకొని, చాలా ఏళ్ళ క్రితం తెలుగులో ‘అశ్విని’ సినిమా వచ్చింది. అప్పట్లో స్వయంగా అశ్వినీ నాచప్పే ఆ పాత్రను పోషించడం దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. మరి, ఇప్పుడు ఈ చిత్రం కూడా అలాగే సంచలనమవుతుందా? స్వయంగా నటించకపోయినా పుల్లెల గోపీచంద్ కూడా తళుక్కున తెరపై మెరుస్తారా? చూడాలి. ఆల్ ది బెస్ట్ టు డెరైక్టర్ ప్రవీణ్ సత్తారు, హీరో సుధీర్‌బాబు అండ్ టీమ్. -
‘షటిల్’ స్పీడ్‌తో....
సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్....అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ జాబితా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ఎక్కడ బ్యాడ్మింటన్ టోర్నీ జరిగినా మన ఆటగాళ్లదే హవా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున సాధించే పతకాలన్నీ మన రాష్ట్ర క్రీడాకారులు అందించినవే. సీనియర్ స్థాయిలో ఒలింపిక్ మెడల్ వరకు మన ప్రభ వెలిగితే...జూనియర్ స్థాయిలోనైతే అనేకానేక విజయాలు దక్కాయి. ఒక వైపు స్టార్ ప్లేయర్లు తమ జోరును కొనసాగిస్తుంటే...మరో వైపు వర్ధమాన, యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. గత కొన్నేళ్లుగా మన వద్ద బ్యాడ్మింటన్ ఒక్కసారిగా పాపులర్ క్రీడగా మారిపోయింది. ఆట నేర్చుకునేందుకు, మెరుగుపర్చుకునేందుకు అవకాశాలు పెరగడం కూడా అందుకు కారణం. మన రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ అకాడమీలు, కేంద్రాల్లో బ్యాడ్మింటన్‌లో చక్కటి శిక్షణ లభిస్తోంది. మన రాష్ట్రంలో ఈ ఆటలో అందుబాటులో ఉన్న శిక్షణా సౌకర్యాలపై ఒక దృష్టి... - మొహమ్మద్ అబ్దుల్ హాది పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ... దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ నంబర్‌వన్‌గా ఉన్న అకాడమీ ఇది. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో సంచలన విజయాలు సాధిస్తూ రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లంతా ఇక్కడ శిక్షణ పొందుతున్నవారే. భారత జట్టు చీఫ్ కోచ్ గోపీచంద్ నేతృత్వంలో సైనా, సింధు, కశ్యప్‌లాంటి ఎందరో ఆటగాళ్లు వరుస విజయాలు సాధించారు. అనేక మంది వర్ధమాన షట్లర్లు ఇక్కడినుంచే వెలుగులోకి వస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, కోర్టులు, శిక్షణతో ఈ అకాడమీ తిరుగులేని ఫలితాలు కనబరుస్తోంది. ప్రవేశం గోపీచంద్ అకాడమీలో ప్రధానంగా అగ్రశ్రేణి ఆటగాళ్లే శిక్షణ పొందుతున్నారు. ప్రాథమిక లేదా జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచినవారు ఇక్కడ చేరితే మరింత మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. వారి పూర్వ ప్రదర్శనను బట్టి ఇక్కడ ప్రవేశానికి అవకాశం ఉంటుంది. మరోవైపు పూర్తిగా కొత్తవారికి కూడా పరిమిత సంఖ్యలో శిక్షణ లభిస్తుంది. అయితే అందుకోసం ఇక్కడి నిపుణులైన కోచ్‌లు నిర్దేశించిన ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుంది. వారి ప్రాథమిక పరిజ్ఞానం, చురుకుదనాన్ని బట్టి ఎంపిక చేస్తారు. వివరాలకు గచ్చిబౌలిలోని అకాడమీ కేంద్రంలో సంప్రదించవచ్చు. నంద్యాల అకాడమీ... జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో ఈ ప్రైవేట్ అకాడమీ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఈ అకాడమీకి చెందిన ఆటగాళ్లు నిలకడగా విజయాలు సాధిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో నంది పైప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రైవేట్ అకాడమీలో ప్రస్తుతం 60 మంది ఆటగాళ్లకు ఇద్దరు కోచ్‌లు శిక్షణనిస్తున్నారు. ఇతర వివరాలకు నంది స్పోర్ట్స్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇతరత్రా... మే నెలలో కొత్తగా మరో 3 ప్రైవేట్ బ్యాడ్మింటన్ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి. పుల్లెల గోపీచంద్ సహకారంతోనే, చిట్టూరి సుబ్బారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొత్తగా అకాడమీ ప్రారంభం కానుంది. గతంలో శాప్‌లో కోచ్‌గా పని చేసిన గోవర్ధన్ హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో (షేక్‌పేట్, ఏఎస్‌రావునగర్)లలో కొత్తగా అకాడమీలను ప్రారంభిస్తున్నారు. మరో వైపు దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం ఆరిఫ్ కూడా అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఏడాది తర్వాత ఇది నగరంలోని బండ్లగూడలో పూర్తి స్థాయిలో ఏర్పాటు కావచ్చు. ప్రభుత్వం తరఫున... ఖమ్మం శాప్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ పూర్తి స్థాయిలో హాస్టల్ సదుపాయంతో నిర్వహిస్తున్న ఒకే ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఖమ్మంలో ఉంది. ఇక్కడినుంచి కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో షట్లర్లు వెలుగులోకి వచ్చారు. 12-18 ఏళ్ల మధ్య వయసువారికి అవకాశం కల్పిస్తారు. గరిష్టంగా 20 మందిని తీసుకుంటారు. ఒక కోచ్ అందుబాటులో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ఎంపిక చేయడంతో పాటు అప్పటికే జూనియర్ స్థాయిలో రాణిస్తున్న చిన్నారులను అకాడమీలోకి తీసుకుంటారు. అయితే గత కొన్నాళ్లుగా టాలెంట్ సెర్చ్ కార్యక్రమం నిలిచిపోయింది. సాధారణంగా జూన్‌లో ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలకు ఖమ్మంలోని జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో గానీ హైదరాబాద్‌లోని శాప్ ప్రధాన కార్యాలయంలో గానీ సంప్రదించవచ్చు. స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ (సరూర్‌నగర్) రాజధాని నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో ఒక బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 50 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే హాస్టల్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ అకాడమీలో 12-18 ఏళ్ల మధ్య వయసు ఆటగాళ్లను కోచింగ్ కోసం ఎంపిక చేస్తారు. ముగ్గురు కోచ్‌లు పని చేస్తున్నారు. కనీసం జిల్లా స్థాయిలో ఆడిన షట్లర్లను వివిధ దశల్లో వడపోతల అనంతరం ఎంపిక చేస్తారు. అయితే పూర్తిగా కొత్తగా ఉండే లెర్నర్స్ను కూడా 6-8 ఏళ్ల మధ్య వయసు వారిని ఎంపిక చేసి శిక్షణనిస్తారు. వివరాలకు సరూర్‌నగర్ స్టేడియంలో సంప్రదించవచ్చు. ఎల్బీ స్టేడియం... శాప్ ప్రధాన కార్యాలయం ఉన్న లాల్‌బహదూర్ స్టేడియంలో కూడా బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి ఇండోర్ స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. బేసిక్స్ నేర్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఆడుతున్న ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడ సాధన చేస్తారు. ఎల్బీ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. ఈ చిన్నారులకు శాప్ నియమించిన కోచ్ శిక్షణ ఇస్తారు. శాప్ పరిధిలోని యూసుఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో కూడా పే అండ్ ప్లే పథకం కొనసాగుతోంది. అయితే ఎల్బీ స్టేడియంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో కోచ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి గలవారు స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించవచ్చు. విజయవాడలో.... ఒకప్పుడు అత్యుత్తమ క్రీడాకారులను అందించిన విజయవాడలో ఇప్పుడు బ్యాడ్మింటన్ కళ తప్పింది. కొన్నాళ్ల క్రితం చేతన్ ఆనంద్ అకాడమీని ప్రారంభించినా... వివిధ కారణాలతో అందులో శిక్షణ ఆగిపోయింది. ప్రస్తుతం మున్సిపల్ స్టేడియంలో చిన్నారులకు కోచింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున ఇక్కడ ఒక కోచ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నారులకు ఆటలో బేసిక్స్ నేర్పించేందుకు అవకాశం ఉంది. -
ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు
-
కమల్ హసన్, గోపీచంద్ కు పద్మభూషణ్ ప్రదానం
-
కమల్ హసన్, గోపీచంద్ కు పద్మభూషణ్ ప్రదానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను బహూకరించారు. దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ను శాస్త్రవేత్త రఘునాథ్ అనంత్ మషేల్కర్‌కు అందజేశారు. ఇక ప్రముఖ సినీ నటుడు కమల్ హసన్, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ సహా 12 మంది ప్రమఖులు పద్మభూషణ్ అవార్డులు స్వీకరించారు. ఇక 53 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. వీరిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పాల్గొన్నారు. -
వాళ్లిద్దరి మధ్య మరిన్ని ఫైనల్స్: గోపీచంద్
లక్నో: హైదరాబాదీ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధుల మధ్య ఇకపై మరిన్ని ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడి ఇండియన్ గ్రాండ్ ప్రి టైటిల్ పోరులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు తలపడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్’కు ఎంపికైన గోపీచంద్ తన శిష్యురాళ్ల ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘చైనా ఆటగాళ్ల ఆధిపత్యానికి మనవాళ్లు గండికొట్టారు. ఇండి గ్రాండ్ ప్రి ఫైనల్లో ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ కష్టపడి బాగా ఆడారు. అందుకే సుదీర్ఘ ర్యాలీలు సాగాయి’ అని గోపీ చెప్పారు. సైనా, సింధు ఫైనల్‌కు చేరడంతో తన బాధ్యత పూర్తయిందని, అందుకే తుది పోరుకు కోచింగ్‌కు దూరంగా ఉన్నానని తెలిపారు. ‘ఈ టోర్నీలో సింధు బాగా ఆడింది. అయితే సైనాకు మాత్రం తీపిగుర్తునిచ్చిన ఈవెంట్ ఇది. వైఫల్యాలకు తెరదించుతూ సాధించిన టైటిల్ విజయం నిజంగా ఆమె ప్రగతికి నిదర్శనం’ అని 40 ఏళ్ల గోపీచంద్ అన్నారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో చేజేతులా ఓడిన మరో ఏపీ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు ఈ టోర్నీ ఓ పాఠంలాంటిదన్నారు. అనుభవలేమితోనే చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. ఏదేమైనా శ్రీకాంత్ గతేడాది నుంచి నిలకడైన ఆటతీరుతో మంచి విజయాలు సాధించాడని ప్రశంసించారు. -
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు
నాగండ్ల (ఇంకొల్లు), న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన పుల్లెల గోపీచంద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును శనివారం ప్రకటించడంతో ఆయన స్వగ్రామం ఇంకొల్లు మండలం నాగండ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ కీర్తి కిరీటంలో ఇప్పటికే ఎన్నో అవార్డులున్నాయి. గతంలో అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్త్న్ర, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డులు ఆయనకు లభించాయి. గోపీచంద్ ప్రాథమిక విద్య ఒంగోలులోనే పద్మభూషణుడు పూర్తిచేశారు. ఉన్నత విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. పిన్ని మాంచాల ప్రోద్బలంతో అన్నదమ్ములు బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచారు. గోపీచంద్, ఆయన అన్న రాజశేఖర్ ఇద్దరూ డబుల్స్ ఆడుతూ జాతీయ క్రీడాకారులుగా మంచి గుర్తింపు పొందారు. రాజశేఖర్‌కు ఐటీఐ సీటు లభించడంతో క్రీడలకు స్వస్తి పలికారు. తల్లి సుబ్బరావమ్మ గృహిణి కాగా తండ్రి పుల్లెల శుభాష్‌చంద్రబోస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. గోపీచంద్‌కు పద్మభూషణ్ అవార్డు లభించడంతో ఆయన స్వగ్రామంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలు గోరంట్ల వీరయ్య, ఆదిలక్ష్మిలతో పాటు ఆలిండియా బ్యాడ్మింటన్ కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, బాబాయిలు సోమేపల్లి రామ్మోహన్రావు, మార్కండేయులు, కొరిటాల శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
పుల్లెల గోపీ మనోడే
నిజామాబాద్‌స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఈరోజు దేశంలో బ్యాడ్మింటన్ అంటే గోపీచంద్. ఆ క్రీడకే వన్నెతెచ్చిన గొప్ప ఆటగాడు. అంతర్జాతీయంగా ఆటలో రాణించి దేశ కీర్తిని ఇనుమడింపజేశాడు. ఇప్పుడు బ్యాడ్మింటన్ కోచ్‌గా క్రీడలో శిక్షణ ఇస్తూ సైనానెహ్వాల్, పి.వి. సింధూలాంటి ఎంతోమంది క్రీడాకారులను తయారుచేశాడు. అందరితో శభాష్ అనిపించుకుంటూ.. అందరి మన్ననలను పొందుతున్న గోపీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడలతో దేశానికి సేవచేస్తున్న ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగినట్లుండే గోపీ మనోడే. డిచ్పల్లి మండలం ధర్మారం(బి)కి చెందిన సుభాష్‌చంద్రబోస్, సుబ్బారావమ్మల ముద్దుల కుమారుడే పుల్లెల గోపీచంద్. ఆయనకు అన్న రాజశేఖర్, చెల్లె సుమబిందు ఉన్నారు. కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేసే తమ పిన్ని షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుండటాన్ని చిన్నప్పటి నుంచి ఆసక్తిగా చూసిన గోపీ ఆ ఆటపై మక్కువ పెంచుకున్నారు. నిత్యసాధనతో దానిపై పట్టుసాధించారు. ఐవోబీ బ్యాంక్ ఉద్యోగి అయిన సుభాష్‌చంద్రబోస్ ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాలకు బదిలీ అయ్యారు. అలా వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ప్రభుత్వం శనివారం రాత్రి పద్మభూషణ్‌కు గోపీచంద్‌ను ఎంపికచేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తంచేశారు. ఎంతోమందిని తయారు చేశారు.. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అలవర్చుకొన్న గోపీచంద్ ఉత్తమ క్రీడాకారుడిగా, ఉత్తమ శిక్షకుడిగా ఎదిగారు. సైనానెహ్వాల్, సింధూ, కశ్యప్ తదితర క్రీడాకారులు ఆయన శిష్యులే. ఈరోజు ఆయనకు పద్మభూషణ్ రావడంతో జిల్లా క్రీడాకారులు, ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. -కర్నేటి వాసు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యువక్రీడాకారులకు ఆదర్శం.. క్రీడాకారుడిగా, కోచ్‌గా పుల్లెల గోపీచంద్ అందనంత ఎత్తుకు ఎదిగారు. పద్మభూషణ్ పొందిన ఆయన మన జిల్లావాసి కావడం గర్వకారణం. టీవీల్లో ఆయన ఆడిన ఆటను చూసి నేను బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా ముందుకెళ్తున్నాను. నాలాంటి యువ క్రీడాకారులందరికీ గోపీ ఆదర్శం. -నవీన్, పాలిటెక్నిక్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆలస్యంగా వచ్చిన ఆనందమే.. గోపీచంద్‌కు చాలా కాలం క్రితమే ఈ అవార్డు రావాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చినా చాలా ఆనందంగా ఉంది. బ్యాడ్మింటన్ క్రీడలో తాను ఎదగడమే కాకుండా ఎంతోమంది క్రీడాకారులను ఆయన తయారు చేశారు. -సంఘమిత్ర, క్రీడాకారుడు, నిజామాబాద్ -
అనుమోలు రామకృష్ణ, పుల్లెల గోపీచంద్‌కు పద్మభూషణ్
ఏడుగురు తెలుగువారికి పద్మశ్రీ ‘పద్మ’ అవార్డుల ప్రకటన.. ఇద్దరికి పద్మవిభూషణ్ కమల్‌హాసన్‌కు పద్మభూషణ్ న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను శనివారం ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి ఈ అవార్డులను అందించనున్నారు. ఈ పురస్కారాల్లో 2 పద్మ విభూషణ్, 24 పద్మ భూషణ్, 101 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మార్చి, లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. పద్మ పురస్కారాలు లభించిన తెలుగువారిలో.. పద్మభూషణ్ పొందిన దివంగత అనుమోలు రామకృష్ణ( సైన్స్, ఇంజనీరింగ్), పుల్లెల గోపీచంద్(క్రీడలు- బ్యాడ్మింటన్) సహా 9 మంది ప్రముఖులున్నారు. పద్మవిభూషణ్ పురస్కారం మహారాష్ట్రకు చెందిన డాక్టర్ రఘునాథ్ ఎ.మషేల్కర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), బి.కె.ఎస్. అయ్యంగార్ (యోగా, ఇతరము) లకు లభించింది. పద్మభూషణ్ అవార్డ్ లభించిన ఇతర ప్రముఖుల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్, దివంగత న్యాయమూర్తి జె.ఎస్.వర్మ, ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయని బేగం పర్వీన్ సుల్తానా, సాహితీవేత్త రస్కిన్ బాండ్, తమిళ రచయిత వైరముత్తు తదితరులున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్, సీనియర్ నటుడు పరేశ్‌రావల్, క్రికెటర్ యువరాజ్ సింగ్, సినీ రంగానికి చెందిన సంతోష్ శివన్, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ .. తదితరులను పద్మశ్రీ వరించింది. ప్రవాసాంధ్రుడు డాక్టర్ వంశీ మూట (మెడిసిన్- బయోమెడికల్ రీసెర్చ్)కు ఎన్ఆర్ఐ విభాగంలో పద్మశ్రీ లభించింది. డా. అనుమోలు రామకృష్ణ (పద్మభూషణ్)(మరణానంతరం) పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన డాక్టర్ అనుమోలు రామకృష్ణకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. 1939 డిసెంబర్ 20న జన్మించిన రామకృష్ణ ప్రాథమిక విద్యాభాసం కొవ్వూరులోనే కొనసాగింది. విశాఖపట్నంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రామకృష్ణ.. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ చెన్నైలోని గుండిలో పూర్తి చేశారు. 1962లో ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఈసీసీ) ద్వారా ఆయన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. ఈసీసీ తర్వాత ఎల్ అండ్ టికి పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా మారింది. వివిధ స్థాయిల్లో పనిచేసిన తర్వాత 1992లో ఆయన ఎల్ అండ్ టీ డెరైక్టర్ల బోర్డులో డెరైక్టర్ అయ్యారు. తర్వాత ఈసీసీ నిర్మాణ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. సిమెంటు కర్మాగారాలు, రహదారులు భవనాలు, పోర్టులు, విమానాశ్రయాలు తదితరాలను ఈయన నాయకత్వలో ఈసీసీ నిర్మించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను అందించాయి. కాంక్రీట్ డిజైన్ అవార్డుతోపాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను రామకృష్ణ పొందారు. గత ఏడాది ఆగస్టు 20న రామకృష్ణ మృతి చెందారు. పద్మశ్రీ పొందిన తెలుగువారు 1. మొహ్మద్ అలీ బేగ్ (ఆర్ట్-థియేటర్) ఆంధ్ర ప్రదేశ్ 2. డాక్టర్ రామారావు అనుమోలు (సోషల్ వర్క్) ఆంధ్రప్రదేశ్ 3. డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ (సైన్స్, ఇంజనీరింగ్) ఆంధ్రప్రదేశ్ 4. డాక్టర్ గోవిందన్ సుందరరాజన్ (సైన్స్, ఇంజనీరింగ్) ఆంధ్రప్రదేశ్ 5. రవికుమార్ నర్ర (ట్రేడ్ ఇండస్ట్రీ) ఆంధ్రప్రదేశ్ 6. డాక్టర్ సరబేశ్వర్ సహార్య (వైద్యం, సర్జరీ) ఆంధ్రప్రదేశ్ 7. ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ (సాహిత్యం, విద్య) ఆంధ్రప్రదేశ్ పద్మ భూషణ్ పొందిన ప్రముఖుల జాబితా-(తెలుగువారిని మినహాయించి) ప్రొఫెసర్ గులాం మహ్మద్ షేక్ (ఆర్ట్- పెయింటింగ్) గుజరాత్; బేగం ప్రవీన్ సుల్తానా (ఆర్ట్-శాస్త్రీయ గానం) మహారాష్ట్ర; టి.హెచ్. వినాయక్రామ్ (ఆర్ట్- గాత్రం కళాకారుడు) తమిళనాడు; కమల్‌హాసన్ (ఆర్ట్-సినిమా) తమిళనాడు; జస్టిస్ దల్వీర్ భండారీ (ప్రజా వ్యవహారాలు) ఢిల్లీ; పద్మనాభన్ బలరామ్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కర్నాటక; ప్రొఫెసర్ జయేష్త్రాజ్ జోషి (సైన్స్, ఇంజనీరింగ్) మహారాష్ట్ర; డాక్టర్ మాడప్ప మహదేవప్ప (సైన్స్, ఇంజనీరింగ్) కర్నాటక; డాక్టర్ తిరుమలాచారి రామసామి (సైన్స్, ఇంజనీరింగ్) ఢిల్లీ; డాక్టర్ వినోద్ ప్రకాశ్ శర్మ (సైన్స్, ఇంజనీరింగ్) ఢిల్లీ; డాక్టర్ రాధాకృష్ణన్ కొప్పిల్లి (సైన్స్, ఇంజనీరింగ్) కర్నాటక; డాక్టర్ మృత్యుంజయ్ ఆత్రేయ (సాహిత్యం ,విద్య) ఢిల్లీ; అనితా దేశాయ్ (సాహిత్యం, విద్య) ఢిల్లీ; డాక్టర్ ధీరూభాయ్ థాకర్ (సాహిత్యం, విద్య) గుజరాత్; వైరముత్తు రామస్వామి తేవర్ (సాహిత్యం, విద్య) తమిళనాడు; రుస్కిన్ బాండ్ (సాహిత్యం, విద్య) ఉత్తరాఖండ్; లియాండర్ పేస్ (క్రీడలు-టెన్నిస్) మహారాష్ట్ర; విజేంద్ర నాథ్ కౌల్ (సివిల్ సర్వీస్) ఢిల్లీ; దివంగత జగదీశ్ శర్మ వర్మ (ప్రజా వ్యవహారాలు) ఉత్తర ప్రదేశ్; ప్రొఫెసర్ అనీసుజ్జమన్ (సాహిత్యం, విద్య) బంగ్లాదేశ్; ప్రొఫెసర్ లాయడ్ రుడోల్ఫ్, ప్రొఫెసర్ హెచ్.రుడోల్ఫ్ (సంయుక్తంగా)(సాహిత్యం, విద్య) యూఎస్ఏ; డాక్టర్ నీలం క్లెర్ (మెడిసిన్, నియోనాటాలజీ) ఢిల్లీ. పద్మశ్రీ’లు... డాక్టర్ సరబేశ్వర్ సహర్యా మూత్రపిండాల శస్త్రచికిత్స నిపుణుడైన డాక్టర్ సహార్యా హైదరాబాద్‌లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (కిమ్స్) ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అనేక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. ఈయన 1945 ఏప్రిల్ ఒకటో తేదీన అస్సాం రాష్ట్రం డరంగ్ జిల్లా మంగల్డాయి అనే మారుమూల గ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబానికి చెందిన సహరయ్య ఈబీసీ స్కాలర్ఫిప్పుతో 1967లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఛండీఘర్‌లో జనరల్ సర్జరీలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేశారు. విదేశాలకు వెళ్లి వచ్చిన తరువాత ఆయన మూత్రపిండాలు, క్లోమ గ్రంధి మార్పిడి శస్త్రచికిత్సలను ప్రయోగాత్మకంగా చేపట్టారు. 1981లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో వైద్యుడిగా చేరారు. మహావీర్, నిమ్స్ ఆస్పత్రుల్లో పని చేశారు. డాక్టర్ ఎం వైఎస్ ప్రసాద్(సైన్స్, ఇంజనీరింగ్) పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన మలపాక సూర్యనారాయణ, భాస్కరమ్మ దంపతుల మూడవ కుమారుడైన ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 1953 మే 4వ తేదీన మొగల్తూరులో పుట్టిన ప్రసాద్ 1968లో మొగల్తూరు పెన్మత్స రంగరాజా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ చదివారు. కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ విధ్యనభ్యసించారు. అనంతరం తిరువనంతపురంలో ఇస్రో కేంద్రంలో జూనియర్ సైంటిస్ట్‌గా ఉద్యోగజీవితం ప్రారంబించారు. ఇస్రోలో దేశ విదేశాల్లో అనేక హోదాల్లో పనిచేశారు. చంద్రయాన్-1 ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన ప్రసాద్ ఇటీవల మార్స్ ఉపగ్రహ ప్రయోగంలోనూ ముఖ్యభూమిక పోషించారు. నర్రా రవికుమార్(ట్రేడ్, ఇండస్ట్రీ) వాణిజ్యం, పారిశ్రామిక రంగంలో చేసిన సేవకు గానూ నర్రా రవికుమార్(51)కు పద్మశ్రీ లభించింది. ఎల్ఎల్ఎం చదివిన రవికుమార్ డిక్కి ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. కొలకలూరి ఇనాక్(సాహిత్యం) సాహిత్యరంగంలో గుంటూరు జిల్లా వాసి డాక్టర్ కొలకలూరి ఇనాక్‌ను పద్మశ్రీ వరించింది. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన ఇనాక్ రామయ్య, విశ్రాంతమ్మ దంపతులకు 1939, జూలై 1న జన్మించారు. ఇనాక్ ఇప్పటివరకు 72 గ్రంథాలు రచించారు. వాటిలో ఊరబావి, సూర్యుడు తలెత్తాడు, కట్టడి, కొలుపులు, కాకి వంటి కథాసంపుటాలు, మునివాహనుడు, దిక్కులేనివాడు, ఇడిగో క్రీస్తు తదితర నాటికలు ఉన్నాయి. ఆది ఆంధ్రుడు, త్రిద్రవ పతాకం, చెప్పులు వంటి కవితా సంపుటిలను వెలువరించారు. ‘నిబిడిత సిద్ధాంతం’ పేరిట ఆధునిక సాహిత్య విమర్శన సూత్రాన్ని ప్రతిపాదించారు. డాక్టర్ సుందరరాజన్( సైన్స్, ఇంజనీరింగ్) సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రంగంలో విశేష సేవలందించిన డాక్టర్ గోవిందన్ సుందరరాజన్‌కు పద్మశ్రీ లభించింది. లోహ శాస్త్రంలో వినూత్న ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించి ఉత్తమ ఫలితాలను రాజన్ సాధించారు. ముఖ్యంగా మిసైల్, ఉపగ్రహాల తయారీకి వినియోగించే లోహాలు వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా రూపొందించడంలో ఆయన ప్రయోగాలు ఉపయోగపడ్డాయి. లేజర్‌తో లోహాలను కత్తిరించే పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేశారు. 1953లో తమిళనాడులోని మధురై సమీప గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం మెటీరియల్స్ రీసెర్చి సొసైటీ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఎస్ఐ) అధ్యక్షునిగా, ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (బెంగళూరు) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మహ్మద్ ఆలీబేగ్ (నాటకరంగం) హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆలీబేగ్(42)కు నాటకరంగంలో అందించిన సేవలకు గానూ ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. తండ్రి పేరుతో‘ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్’ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 200పైగా రంగస్థల నాటకాలను ప్రదర్శించారు. సొంత దర్శకత్వంలో 10కిపైగా నాటకాలను ప్రదర్శించారు. ఆయన స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన ‘కులీ’ః దిలోంకా షాహ్ జాదా’ ప్రదర్శించారు. -
‘పద్మభూషణ్’ గోపీచంద్
లియాండర్ పేస్ కూడా... యువరాజ్ సహా ఏడుగురికి పద్మశ్రీ న్యూఢిల్లీ: తన సుశిక్షణతో మేటి క్రీడాకారులను అందిస్తోన్న భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, తెలుగు తేజం పుల్లెల గోపీచంద్‌కు ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ పురస్కారం లభించింది. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కూ దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్’ దక్కింది. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఈ జాబితాలో క్రీడారంగం నుంచి మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. ఇందులో ఏడుగురికి ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్, స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌తో పాటు మరో ఐదుగురికీ ఈ పద్మశ్రీ అవార్డు దక్కింది. గతేడాది యూఎస్ ఓపెన్‌లో భాగస్వామి స్టెపానెక్‌తో కలిసి 40 ఏళ్ల లియాండర్ పేస్ కెరీర్లో 14వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు. ఈ క్రమంలో పెద్ద వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. డేవిస్ కప్‌లో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన పేస్ వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. గతంలో పేస్‌కు ‘అర్జున అవార్డు’, ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’, ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. మరో కలికితురాయి... క్రీడాకారుడిగా గొప్ప విజయాలు సాధించి... ఆ తర్వాత కోచ్‌గా మారిన 40 ఏళ్ల గోపీచంద్ కెరీర్లో ‘పద్మభూషణ్’ రూపంలో మరో కలికితురాయి చేరింది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన గోపీచంద్ క్రీడాకారుడిగా ఉన్నపుడు 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో సింగిల్స్ విభాగంలో కాంస్యం... 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. మొత్తానికి గోపీచంద్ కెరీర్లో ఇది నాలుగో కేంద్ర పురస్కారం. 1999లో ‘అర్జున అవార్డు’, 2001లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’, 2005లో ‘పద్మశ్రీ’, 2009తో ‘ద్రోణాచార్య’ పురస్కారం గోపీచంద్‌కు లభించాయి. గచ్చిబౌలిలో అకాడమీని నిర్వహిస్తున్న గోపీచంద్ శిక్షణలోనే సైనా, సింధు సహా పలువురు క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. -
కోచ్‌లకు ‘కోచింగ్’
తణుకు, న్యూస్‌లైన్: నైపుణ్యం గల కోచ్‌లు అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఏ క్రీడలోనైనా మంచి ఫలితాలు వస్తాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన దేశంలో కోచ్‌ల కొరత ఉన్నందున శిక్షణ ద్వారా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోచ్‌ల శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 300 బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులో ఉన్నా నైపుణ్యం కలిగిన కోచ్‌లు 50కి మించి లేరని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్‌లో రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లే అద్భుతంగా రాణిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల కోచ్‌లకు ఈ ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో ఈ తరహాలో కోచింగ్ ఇవ్వడం దేశంలో ఇదే మొదటి సారి కావడం విశేషం. గతంలో చీరాలలో రెండు సార్లు శిబిరాలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ అనంతరం ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో పురస్కారాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి కేసీ పున్నయ్యచౌదరి కూడా పాల్గొన్నారు. -
గోపీచంద్ మాట్లాడడేం: జ్వాల
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌పై డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల మరోసారి విరుచుకుపడింది. ఐబీఎల్‌లో ఢిల్లీ జట్టు ఆటగాళ్లను మ్యాచ్ ఆడకుండా అడ్డుకుందనే ఆరోపణలపై భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) జ్వాలపై జీవిత కాల నిషేధం విధించాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో తన సొంత రాష్ట్రానికే చెందిన గోపీచంద్ ఎందుకు స్పందించడం లేదని మరోమారు ప్రశ్నించింది. ‘నా విషయంలో చీఫ్ కోచ్ ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాడో అర్థం కావడం లేదు. మాజీ కోచ్‌లు ఆరిఫ్, బంగా బీట్స్ కోచ్ విమల్ తమ వాదనను బయటికి వినిపించారు. వారు మాట్లాడినప్పుడు గోపీచంద్ ఎందుకు మాట్లాడడు? నా ఉద్దేశంలో ఆయన అకాడమీకి మాత్రమే కోచ్ కాడు. భారత బ్యాడ్మింటన్‌కు కూడా కోచ్ ఆయనే. ఏదో ఒక వైఖరి మీద ఆయన ఉండాలి’ అని జ్వాల సూచించింది. మరోవైపు తనపై విచారణ కోసం బాయ్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై స్టే విధించాలని కోరిన జ్వాల వినతిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. -
సైనాకు అవార్డు
గుర్గావ్: ఒలింపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. అలాగే యువ ఆటగాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేశారు. యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా... అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, అథ్లెట్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లి నిలిచారు. క్రికెట్‌కు తమ సేవలను అందించినందుకు గత ఏడాది రిటైర్ అయిన రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లను జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించారు. మిగతా అవార్డులు దక్కిన వారిలో ఐసీసీ ప్రపంచకప్ గెలుచుకున్న అండర్-19 భారత క్రికెట్ జట్టు, రెజ్లర్ సుశీల్ కుమార్, పారాలింపిక్ అథ్లెట్ హెచ్ఎన్ గిరీశ, స్వరణ్ సింగ్ (రోయింగ్), ఉత్తమ్ రాయ్ (ఫుట్‌బాల్) ఉన్నారు. -
కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభం
సెంట్రల్ యూనివర్శిటీ, న్యూస్‌లైన్: దేశంలో మొదటిసారిగా కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్)కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శుక్రవారం ఈ టోర్నీ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో 68 కార్పొరేట్ సంస్థలకు చెందిన దాదాపు 400 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ క్రీడలను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరగడం మంచి పరిణామమని అన్నారు. ఈ క్రీడలకు ఏర్పడిన క్రేజ్ కుర్రాళ్లకు స్ఫూర్తినిస్తుందన్నారు. సీబీఎల్‌కు దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు హాజరవ్వడం అభినందనీయమని ఆయన చెప్పారు. సీబీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో టెక్ మహేంద్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర తునుగుంట్ల, లొకేషన్ కౌన్సిల్ హెడ్ బీకే మిశ్రా, హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌లతో పాటు స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్ పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలైన టీసీఎస్, క్వాల్కామ్, వెల్స్‌ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, విప్రో, ఐబీఎం, హెచ్ఎస్బీసీ, డెలాయిట్, మైక్రోసాఫ్ట్, అసెంచర్, జీఈ తదితర జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. -
ఒత్తిడి పెంచకూడదు
పుల్లెల గోపీచంద్ ఆటలంటే ఇష్టంలేని పిల్లలు ఎవరూ ఉండరు. ఎవరైనా తొలుత సరదా కోసమే ఆడతారు. అంతే గానీ ప్రపంచ చాంపియన్ కావాలనే కోరికతో అడుగుపెట్టరు. ఇలాంటి వారి నుంచి చాంపియన్లు వస్తారు. అయితే పిల్లాడి ఇష్టాయిష్టాలతో పాటు తల్లిదండ్రులు, కోచ్ కీలకం. పిల్లలందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. సాధారణంగా చాలామంది గెలవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తారు. అతడు పడుతున్న కష్టాన్ని విస్మరిస్తారు. ఇది చాలా తప్పు. కష్టపడమని వెంటపడొచ్చుగానీ... నైరాశ్యంలో వెళ్లే స్థాయిలో ఒత్తిడి పెంచకూడదు. ఓడిపోయినా కష్టపడ్డప్పుడు అభినందించాలి. సమతుల్యత పాటిస్తేనే ఈతరం పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. కోచ్‌గా చాలాకాలంగా అనేక విషయాలు పరిశీలించాను. సాధారణంగా కుర్రాళ్లలో కొంత మంది ఒక్క మాటలో చెబితే వినేస్తారు. మరొకరికి గట్టిగా మందలించాల్సి ఉంటుంది. ఇంకొందరికి సుదీర్ఘ ప్రసంగం ఇస్తే గానీ అర్థం కాదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటూ మందు వేయాల్సి ఉంటుంది. లేదంటే చక్కటి ప్రతిభ వృథా అయ్యే ప్రమాదం ఉంది. అండర్-14 లేదా అండర్-16 కేటగిరీలలో మంచి విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లు ఆ తర్వాత వెనుకబడిపోతున్నారు. సీనియర్ స్థాయిలో గెలవడం తన వల్ల కాదేమోననే భయం వారిలో పెరుగుతోంది. పెద్ద ఆటగాళ్లతో పోటీ పడాలన్న పట్టుదల, చిన్న ఆటగాళ్లను గౌరవించే వారికే విజయాలు దక్కుతాయి. గెలిస్తే నా అంతటోడు లేడని తలెగరేసే వాళ్లు, ఓడితే కుంగిపోయే వాళ్లు కెరీర్లో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. క్రీడాకారుడిగా ఎదగడంలో ఎంతో శ్రమ, కష్టం ఉంటుంది. కానీ ఒక్కసారి దేశానికి ఆడిన తర్వాత కలిగే గర్వానికి ఏదీ సాటిరాదు. ఎప్పుడూ సాధారణ చదువులకన్నా, కొంత మందైనా తమ పిల్లలను ఆటగాళ్లుగా మార్చాలని భావిస్తే భారత్‌లో క్రీడలకు ఉండే విలువ ఎప్పటికీ తగ్గదు. -
శ్రీవారిని దర్శించుకున్న పుల్లెల గోపిచంద్