
హ్యుందాయ్ ఎలంత్రాను ఆవిష్కరించిన గోపీచంద్
హ్యుందాయ్ తాజా కారు సిక్స్త్ జనరేషన్ ఎలంత్రాను శుక్రవారం హైదరాబాద్‌లోని లక్ష్మి హ్యుందాయ్ షోరూంలో ఆవిష్కరించారు.
హ్యుందాయ్ తాజా కారు సిక్స్త్ జనరేషన్ ఎలంత్రాను శుక్రవారం హైదరాబాద్‌లోని లక్ష్మి హ్యుందాయ్ షోరూంలో ఆవిష్కరించారు. దీన్ని ఆవిష్కరించిన సందర్భంగా భారత బ్యాండ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌కు తొలికారును బహుమతిగా అందజేశారు. లక్ష్మి హ్యందాయ్ గ్రూప్ ఛైర్మన్ కె.రామ్మోహనరావు, డెరైక్టర్లు జైరాం, స్వాతిలతో కలసి గోపిచంద్ కేక్‌ను కట్ చేశారు. నాలుగేళ్ల కిందట సైనా కాంస్యం సాధించినప్పుడు ఓ కారును అందుకున్నానని, ఇపుడు ఈ కారును అందుకున్నానని గోపీచంద్ వ్యాఖ్యానించారు. కంపెనీ రీజనల్ మేనే జర్ సలీం మాట్లాడుతూ ఈ కారు సామర్థ్యం 2వేల సీసీ అని చెప్పారు. - హైదరాబాద్, సాక్షి