
పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా తదితర వర్ధమాన మార్కెట్లకు ఎగుమతులు చేసేందుకు భారత్‌ను తయారీ హబ్‌గా మార్చుకోనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) మోటర్ ఇండియా ఎండీ అన్సూ కిమ్ తెలిపారు. దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు.
ఆఫ్రికా, మెక్సికో, లాటిన్ అమెరికా మార్కెట్లన్నింటిలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. రిస్కులను తగ్గించుకునేందుకు ఇతర మార్కెట్లపై కూడా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలకు కూడా ఎగుమతులు పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ వాహన ఎగుమతులు 43,650 యూనిట్ల నుంచి 40,386 యూనిట్లకు తగ్గాయి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం 1,58,686 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ అతి పెద్ద ఎగుమతి మార్కెట్లుగా నిలిచాయి.
పేద విద్యార్థులకు సాయం
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ పేరిట స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. తాజాగా ఆ కంపెనీ మొత్తం రూ.3.38 కోట్ల స్కాలర్‌షిప్‌ను అందించింది. దేశంలని 23 రాష్ట్రాల నుండి దరఖాస్తులు వచ్చాయి. 783 మంది ప్రతిభావంత విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లు అందుకున్నారు. వీరిలో 440 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష, క్టాట్‌కి సిద్ధమవుతున్నారు. 343 మంది విద్యార్థులు ఐఐటీల నుండి వచ్చారు. హ్యుందాయ్ ఈ కార్యక్రమాన్ని 2024 ఆగస్టులో ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment