Automobile
-
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్‌ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్‌తో భర్తీ చేశారు.2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతాయి.సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. -
కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?
-
రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!
కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత చాలామంది సొంతగా కారు ఉంటే బాగుంటుందని భావించారు. ఆ తరువాత కొంతమంది కార్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో కొందరు రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు రూ. 20 లక్షల లోపు ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేయడానికి మక్కువ చూపించారు. మనం ఈ కథనంలో రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు ఏవి? వాటి వివరాలు ఏమిటనే విషయాలను తెలుసుకుందాం.హోండా సిటీహోండా అంటే ముందుగా గుర్తొచ్చే కారు 'సిటీ'. ఈ కారు ప్రారంభ ధర రూ. 11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 117 Bhp పవర్, 145 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. హోండా సిటీ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్తో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటితో పాటు.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాంకర్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.స్కోడా స్లావియాస్కోడా స్లావియా ప్రారంభ ధర రూ.10.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్‌తో పాటు.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ఫోక్స్వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు కూడా రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ మోడల్. ఈ కారు ప్రారంభ ధర రూ.10 .89 లక్షలు. ఇది కూడా రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.హ్యుందాయ్ వెర్నారూ. 11 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ వెర్నా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఈ కారు కూడా క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి.. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.ఇదీ చదవండి: భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!మారుతి సుజుకి సియాజ్2014లో మొదటిసారి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన 'సియాజ్' ఆ తరువాత కాలంలో అనేక అప్డేట్స్ పొందింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.9.40 లక్షల నుంచి రూ.12.30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. సియాజ్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ కే15 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
త్వరలో న్యూ ఇయర్ వచ్చేస్తోంది, ఆ తరువాత సంక్రాతి సెలవులు రానున్నాయి. సెలవుల్లో చాలామంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేలా కొత్త కారు కొనాలంటే.. ఎలాంటి మోడల్ ఎందుకోవాలి? దాని ధర ఎంత? ఇతర వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.ఎంజీ హెక్టర్ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కార్లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్ హెక్టర్. రూ.13.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఏకంగా 587 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది. ఇందులో 14 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో డిజిటల్ బ్లూటూత్ కీ, 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైనవన్నీ ఉన్నాయి.ఎంజీ విండ్సర్ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కూడా.. లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). 604 లీటర్ బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జితో 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులోని లేటెస్ట్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు బెస్ట్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.హోండా సిటీరూ.11.88 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే హోండా సిటీ.. 506 లీటర్ బూట్ స్పేస్ పొందుతుంది. ఇది మంచి డిజైన్ కలిగి.. ఉత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హోండా కంపెనీ ఎక్కువగా విక్రయించిన కార్ల జాబితాలో సిటీ సెడాన్ చెప్పుకోదగ్గ మోడల్.రెనాల్ట్ కైగర్మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో రెనాల్ట్ కైగర్ కూడా ఒకటి. దీని ధరలు రూ.6 లక్షల నుంచి రూ. 11.23 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారులోని బూట్ స్పేస్ 405 లీటర్లు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు ఉత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' కూడా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఓ బెస్ట్ మోడల్. 460 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు ప్రారంభ ధర రూ. 13.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులోని ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఇందులో వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. -
టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకులు: తక్కువ ధర.. ఎక్కువ పర్ఫామెన్స్
భారతదేశంలో 400సీసీ బైకులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీ ఈ విభాగంలో కూడా బైకులు లాంచ్ చేశాయి. ఈ బైకులు ధరలు సాధారణ బైక్ ధరల కంటే కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకుల గురించి తెలుసుకుందాం.బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్400 సీసీ విభాగంలోని సరసమైన బైకుల జాబితాలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ ఒకటి. దీని ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.ట్రయంఫ్ స్పీడ్ టీ4మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ టీ4 ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ట్రయంఫ్ లైనప్‌లో అత్యంత సరసమైన 400సీసీ బైక్. ఇందులో హజార్డ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. ఈ బైకులోని 398 సీసీ ఇంజిన్ 30 Bhp పవర్, 36 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411400 సీసీ విభాగంలో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటి 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411'. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైకులో అనలాగ్ స్పీడోమీటర్లు, హజార్డ్ ల్యాంప్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులోని 411 సీసీ ఇంజిన్ 24 Bhp పవర్, 32 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.బజాజ్ డామినార్ 400బజాజ్ డామినార్ 400 కూడా 400 సీసీ విభాగంలో లభిస్తున్న ఓ సరసమైన బైక్. దీని ధర రూ. 2.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 Nm టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ డ్యూయల్ డిస్ప్లేలు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివన్నీ పొందుతుంది.ఇదీ చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్హార్లే డేవిడ్సన్ ఎక్స్440హార్లే డేవిడ్సన్ అంటే ధరల భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ బ్రాండ్ అంటే ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ ఎక్స్440 బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 440 సీసీ ఇంజిన్ 27 Bhp పవర్, 38 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. -
2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే (ఫోటోలు)
-
వెచ్చగా ఉంచే ‘ఊలీ’ క్యాంపర్ వ్యాన్
-
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్‌కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్‌తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్‌లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్‌గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్‌వేర్‌పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. -
టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్‌ఆర్‌టీసీకి 1,297 బస్ ఛాసిస్‌లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్‌కు ఇది మూడవది.మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్‌లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్ఆర్టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.టాటా ఎల్‌పీవో 1618 బస్టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్పీ, 675 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు. -
ఇది కదా అసలైన రికార్డ్!.. ఒక ఏడాదిలో 20 లక్షల కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్‌లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. -
సెకెండ్ హ్యాండ్ వాహనాలపై భారీ పన్ను?
పాత, వాడిన ఎలక్ట్రిక్ వాహనాలు (EV), తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాలపై వస్తు సేవల పన్ను (GST) పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు ఆధారంగా పన్ను రేటు 12 శాతం నుండి 18 శాతానికి పెంచవచ్చని సీఎన్‌బీసీ టీవీ 18 రిపోర్ట్ పేర్కొంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో డిసెంబర్ 20-21 తేదీలలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఈవీలకు రాయితీపై 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. అలాగే పాత, వాడిన విద్యుత్ వాహనాలపై 12 శాతం పన్ను అమలవుతోంది. దీన్ని 18 శాతానికి తీసుకెళ్లాలని తద్వారా రీసేల్ మార్కెట్ సౌలభ్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై విధించే జీఎస్టీ సరఫరాదారు మార్జిన్‌కు మాత్రమే వర్తిస్తుంది.ప్రస్తుత విధానంలో 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన పెట్రోల్ వాహనాలపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. అదేవిధంగా 1500 సీసీ పైగా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన డీజిల్ వాహనాలు, అలాగే 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్లు కలిగిన ఎస్‌యూవీలపై కూడా 18 శాతం పన్ను విధిస్తున్నారు.ఇదీ చదవండి: ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..ఇక ఈవీలు, చిన్న కార్లతో సహా అన్ని ఇతర వాహనాలు ప్రస్తుతం 12 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈవీలతో సహా 12 శాతం కేటగిరీలోని అన్ని వాహనాలకూ 18 శాతం పన్ను విధించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇది ఆమోదం పొందితే అన్ని పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై ఏకరీతిలో 18 శాతం పన్ను అమలవుతుంది. -
సూపర్ స్టైలిష్ బైకులు.. కాలేజ్ స్టూడెంట్స్ కోసం!
భారతదేశంలో లాంగ్ రైడ్ చేయడానికి, రోజువారీ ప్రయాణానికి, మహిళలు కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం.. ఇలా వివిధ రకాల టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్లకు అనువైన ఐదు బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.యమహా ఎంటీ-15యమహా అంటే ముందగా గుర్తొచ్చేది స్టైల్. కాబట్టి ఇవి యువతను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటాయి. కాలేజ్ స్టూడెంట్లు బాగా ఇష్టపడే యమహా బైకులలో ఒకటి.. ఏంటీ-15. రూ.1.78 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.కేటీఎం 125 డ్యూక్యువత ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బైకులతో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ బ్రాండ్ కేటీఎం. ఈ కంపెనీకి చెందిన 125 డ్యూక్ కాలేజ్ విద్యార్థులకు కూడా మొదటి ఎంపిక. దీని ధర రూ.1.78 లక్షలు. ఈ బైకులో 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ ఎన్ఎస్200రూ.1.40 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్200' బైక్ కూడా కాలేజ్ స్టూడెంట్లకు నచ్చిన బైకులలో ఒకటి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అందించే ఈ బైకును స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తారు.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు మాత్రమే. ఇది స్టైలిష్ స్ట్రీట్ బైక్. ఇందులో 349.34 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 Bhp, 27 Nm టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 96,781 ప్రారంభ ధర వద్ద లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన 'ఎక్స్ట్రీమ్ 125ఆర్'. ఇందులోని 124.7 సీసీ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి స్టైలిష్‌గా కనిపించే ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. -
ఆస్టన్ మార్టిన్ ఫస్ట్ హైబ్రిడ్ కారు 'వల్హల్లా' ఇదే (ఫోటోలు)
-
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్‌వర్క్‌ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్‌ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్‌ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్‌లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్‌లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్‌లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్‌ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్‌లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్‌లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్‌లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్‌లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
మంచి స్టైల్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు.. కొంత ఎక్కువ డబ్బు వెచ్చించి బైక్ కొనాలని చూస్తారు. అలాంటి వారి కోసం ఈ కథనంలో రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 'కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 210 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 9250 rpm వద్ద 25.1 Bhp పవర్, 7250 rpm వద్ద 20.4 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్.. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ వంటి వాటితో పాటు టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.యమహా ఆర్15 వీ4రూ.1.82 లక్షల నుంచి రూ.1.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే 'యమహా ఆర్15 వీ4' మన జాబితాలో చెప్పుకోడదగ్గ బైక్. ఈ బైకులోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 Bhp పవర్, 7500 rpm వద్ద 14.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.యమహా ఆర్15 వీ4 బైక్ 282 మిమీ ఫ్రంట్ డిస్క్, 220 మిమీ రియర్ డిస్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా కలిగి ఉంది.బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్. ఈ బైక్ మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతోంది. బజాజ్ ఆర్ఎస్ 200 ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 24.1 Bhp పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి పొందుతుంది.కేటీఎమ్ ఆర్సీ 125రూ.2 లక్షల కంటే తక్కువ ధర వద్ద కేటీఎమ్ బైక్ కావాలనుకునేవారికి.. ఆర్సీ 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైకులోని 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9250 rpm వద్ద 14.34 Bhp పవర్, 8000 rpm వద్ద 12 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ హ్యాండిల్‌బార్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఎక్కువమందికి ఇష్టమైన మోడల్. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.45000 డిస్కౌంట్
2024 ముగుస్తోంది. ఈ తరుణంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇందులో టూ వీలర్ బ్రాండ్ 'కవాసకి' కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు నింజా 500కొనుగోలుపైన రూ.15,000, నింజా 650 బైక్ కొనుగోలుపై రూ.45,000 తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.కవాసకి నింజా 650 బైకులో 649 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 67 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ లైట్స్, టీఎఫ్టీ డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.నింజా 650 బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ వంటివి పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది 300 మిమీ డ్యూయల్ ఫ్రంట్, 220 మిమీ రియర్ సింగిల్ డిస్క్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 120/70, వెనుక 160/60 టైర్లు ఉన్నాయి. ఇవి 17 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. కాబట్టి ఇది రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు! -
బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు!
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల స్కూటర్ లభిస్తోంది. రూ.14.90 లక్షలకు కూడా స్కూటర్ లభిస్తోంది. దేశీయ విఫణిలో ఎన్నెన్ని స్కూటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలుదారులు మాత్రం తక్కువ ధర వద్ద లభించే స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కథనంలో సరసమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.హీరో ప్లెజర్ ప్లస్మహిళలకు ఇష్టమైన స్కూటర్ల జాబితాలో ఒకటైన 'హీరో ప్లెజర్ ప్లస్' సరసమైన స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 70577. రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్, 8.7 Nm టార్క్ అందిస్తుంది. దీనిని మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తారు.టీవీఎస్ జెస్ట్ 110టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన జెస్ట్ 110 స్కూటర్ ధర మార్కెట్లో రూ. 73728 మాత్రమే. ఇది కూడా రెండు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.7 Bhp పవర్, 8.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది.హోండా డియోఅతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన స్కూటర్ల జాబితాలో ఒకటి ఈ హోండా డియో. ఈ స్కూటర్ ధర రూ. 75409. ఇది మూడు వేరియంట్లు, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్కూటర్లోని 109 సీసీ ఇంజిన్ 7.75 Bhp, 9.03 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెట్లో ఇప్పటికి 30 లక్షల కంటే ఎక్కువ హోండా డియో స్కూటర్లు అమ్ముడైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే దీనికి భారతదేశంలో ఎంత డిమాంద్ ఉందో అర్థం చేసుకోవచ్చు.హీరో జూమ్ (Hero Xoom)హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన జూమ్ స్కూటర్ 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.05 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 75656. ఈ స్కూటర్ చూడటానికి కొంత ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇది నాలుగు వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లుహీరో డెస్టినీ ప్రైమ్ఇక చివరగా మన జాబితాలో చివరి సరసమైన స్కూటర్ 'హీరో డెస్టినీ ప్రైమ్'. ఈ స్కూటర్ ధర రూ. 76,806. ఇందులో 124.6 సీసీ ఇంజిన్ 9 Bhp పవర్, 10.36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కానీ మూడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. -
తక్కువ ధరతో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సీఎన్జీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థలు, తమ కార్లను సీఎన్జీ విభాగంలో లాంచ్ చేశాయి. ఈ కథనంలో రూ.8 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం.టాటా పంచ్అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచిన టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో సీఎన్జీ విభాగంలో.. ఓ సరసమైన కారుగా లభిస్తోంది. ఇది ప్యూర్, అడ్వెంచర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 7.22 లక్షలు, రూ. 7.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ఫ్యూయెల్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో సీఎన్జీ బ్యాడ్జెస్ చూడవచ్చు.టాటా పంచ్ సీఎన్జీ కారులో 3.5 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫోర్ స్పీకర్ ఆడియో సెటప్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ సీఎన్జీ కారు 6000 rpm వద్ద 72.4 Bhp పవర్, 3250 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఇది పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీ కారు ప్రారంభ ధర రూ. 7.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ (రూ. 5.92) వేరియంట్ ప్రారంభ ధర కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇది 68 బీహెచ్పీ పవర్, 95.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి ఉన్నాయి.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్ 6000 rpm వద్ద 72.4 Bhp, 3500 rpm వద్ద 103 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారులో 4 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.హ్యుందాయ్ ఆరాహ్యుందాయ్ ఆరా సీఎన్జీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ రెండు కలర్ ఆప్షన్స్ పొందుతాయి. ఇందులోని ఇంజిన్ 68 Bhp, 95.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో 3.5 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టిల్ట్ స్టీరింగ్ వీల్, ముందు భాగంలో పవర్ విండోస్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, అడ్జస్టబుల్ రియర్ సీటు హెడ్రెస్ట్ వంటివి ఉన్నాయి.మారుతి సుజుకి సెలెరియోమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.6.73 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 5300 rpm వద్ద 55.9 Bhp పవర్.. 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. -
వాహనాల విక్రయాలు అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా తయారీ కంపెనీల నుండి డీలర్‌షిప్‌లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య గతేడాదితో పోలిస్తే 2024 నవంబర్‌లో 4 శాతం పెరిగి 3,47,522 యూనిట్లకు చేరుకున్నాయి. భారత పీవీ రంగంలో నవంబర్ నెలలో ఇవే ఇప్పటి వరకు అత్యధికం.అక్టోబర్‌లో పండుగ తర్వాత డిమాండ్ ఊపందుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో మొత్తం ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 3,33,833 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా గత నెల హోల్‌సేల్ అమ్మకాలు 5 శాతం వృద్ధితో 1,41,312 యూనిట్లను తాకాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి డీలర్లకు చేరిన వాహనాల సంఖ్య 49,451 నుంచి 48,246 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 46,222 యూనిట్లకు ఎగశాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్స్ 2023 నవంబర్‌లో 16,23,399 యూనిట్లు నమోదు కాగా, గత నెలలో 1 శాతం తగ్గి 16,04,749 యూనిట్లకు చేరుకున్నాయి.స్కూటర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 5,68,580 యూనిట్లకు చేరుకున్నాయి. మోటార్‌సైకిల్స్ 7.5 శాతం తగ్గి 9,90,246 యూనిట్లకు పడిపోయాయి. గత నెలలో మోపెడ్ హోల్‌సేల్స్ 6 శాతం పెరిగి 45,923 యూనిట్లు నమోదయ్యాయి. త్రీ–వీలర్స్ 1 శాతం క్షీణించి 59,350 యూనిట్లకు వచ్చి చేరాయి. దీపావళి కాని నవంబర్‌లో మొదటిసారిగా టూవీలర్స్ హోల్‌సేల్ విక్రయాలు 16 లక్షల యూనిట్ల మార్కును దాటింది. -
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
కాలం మారింది.. నేడు ఇంటికో వాహనం కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ కొందరు కేవలం టూ వీలర్స్ మాత్రమే వినియోగిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు కొత్త కారు కొనాలని యోచించవచ్చు. అయితే కొత్త కారు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ పాటించాలన్నది బహుశా తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.ముందుగా సెర్చ్ చేయండిమార్కెట్లో లెక్కకు మించిన కార్లు నేడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏది మంచి కారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లను లేదా డీలర్‌షిప్‌లను సందర్శించండి. కస్టమర్ల రివ్యూలను బేరీజు వేసుకోవాలి. మీరు కొనాలనుకే కారు వాస్తవ ప్రపంచంలో ఎలాంటి పనితీరును అందిస్తుందనే విషయంపై కూడా అవగాహన పెంచుకోవాలి.బడ్జెట్ సెట్ చేసుకోవాలికారు కొనాలనుకోవడం సులభమే.. అయితే ఎంత బడ్జెట్లో కొనుగోలు చేయాలి? మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అనేదాన్ని కూడా ఆలోచించాలి. కేవలం కారు కొనాలంటే కేవలం ఎక్స్ షోరూమ్ ధరలను మాత్రమే కాకుండా.. లోన్ తీసుకుంటే కట్టాల్సిన వడ్డీ, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటివి చాలానే ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటికి బడ్జెట్ సెట్ చేసుకోవాలి.ఫైనాన్సింగ్ ఆప్షన్స్కారు కొనాలంటే.. అందరూ మొత్తం డబ్బు చెల్లించి కొనుక్కోలేరు. కాబట్టి ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఇది మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా చేస్తుంది. బ్యాంకులు, క్రెడిట్ యూనియన్లు, కార్ ఫైనాన్స్ కంపెనీలు అందించే వడ్డీ రేట్లతో పాటు.. ఇతర నిబంధనలను కూడా సరిపోల్చుకోండి. ఏదైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ లేదా తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి.తెలివిగా చర్చించండికారు కొనడానికి డీలర్‌షిప్‌కు వెళ్తే.. అక్కడ తెలివిగా చర్చించాల్సి ఉంటుంది. మార్కెట్లో ఆ కారు ధర ఎంత, అప్పటికి ఏదైనా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలను కూడా ముందుగానే తెలుసుకుని ఉండాలి. మీ డీల్ అంచనాలకు దగ్గరగా లేకపోతే అక్కడ నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఇయర్ ఎండ్, ఫెస్టివల్ డిస్కౌంట్స్, డీలర్షిప్ ప్రోత్సాహకాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి సమయంలో కారు కొనుగోలు సిద్దమవ్వండి.బీమా కవరేజ్బహుళ ప్రొవైడర్ల నుంచి బీమా ప్రీమియంలను సరిపోల్చండి. అందులో మీ వాహనానికి తగిన కవరేజీని అందిస్తూ చట్టపరమైన అవసరాలను తీర్చే ప్లాన్‌ను ఎంచుకోండి. యాడ్ ఆన్ కవర్లు, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తులు వంటి అంశాలను పరిగణించండి. అలారం, ఇమ్మొబిలైజర్లు, ట్రాకింగ్ పరికరాల వంటి భద్రతా ఫీచర్లను ఇన్స్టాల్ చేయడం వల్ల బీమా ప్రీమియంలు కూడా తగ్గుతాయి. వీటన్నింటిని గురించి తెలుసుకోండి.క్రెడిట్ స్కోర్కారు కొనుగోలు చేయాలంటే.. దాని కోసం లోన్ తీసుకోవాలంటే, మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. మీకున్న సిబిల్ స్కోరును బట్టి మీకు లోన్ లభిస్తుంది. వడ్డీ రేటు తగ్గాలంటే.. సిబిల్ స్కోర్ తప్పకుండా కొంత ఎక్కువగానే ఉంటుంది.ప్రభుత్వ ప్రోత్సాహకాలుఎలక్ట్రిక్ కారు, హైబ్రిడ్ కారు కొనుగోలు చేస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను ప్రయోజనాలు వంటివి లభిస్తాయి. కాబట్టి దీని గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఇలాంటి ప్రోత్సాహకాలు గురించి తెలుసుకుంటే.. ఖర్చులు కొంత తగ్గుతాయి.ఇంధన సామర్థ్యంకారు ఎంచుకునే ముందే.. ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగిన కారును కొనుగోలు చేయాలి. పెట్రోల్ ఇంజిన్ కారును ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుంది? డీజిల్ ఇంజిన్ ఎంచుకుంటే.. అది ఎంత మైలేజ్ అందిస్తుందనేది తెలుసుకోవాలి. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేస్తే.. ఇంధన ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఇంధన సామర్థ్యాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. -
10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఇటీవలే మార్కెట్లో 'కైలాక్' పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేసింది. అయితే 10 రోజుల ముందే దీని కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పటికి ఈ ఎస్యూవీ బుకింగ్స్ 10,000 దాటినట్లు సమాచారం. కాగా బుక్ చేసుకున్న కస్టమర్లకు 2025 జనవరి 27న డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా కైలాక్ అనేది MQB A0-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన మొదటి కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కుషాక్ కింద ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ , మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలుఫీచర్స్ విషయానికి వస్తే.. కైలాక్ 8 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
8 వేల మారుతీ సుజుకీ సర్వీసింగ్ కేంద్రాలు
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశవ్యాప్తంగా సర్వీసింగ్ కేంద్రాలను విస్తరిస్తోంది. 2030–31 నాటికి మొత్తం 8,000 టచ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. నెక్సా 500వ టచ్ పాయింట్‌ను కంపెనీ తాజాగా ప్రారంభించింది.నెక్సా, అరీనా బ్రాండ్లలో మారుతీ సుజుకీ ఇండియాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,240 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి. ‘కస్టమర్లకు సౌలభ్యం, అత్యుత్తమ కారు యాజమాన్య అనుభవాన్ని స్థిరంగా అందించడమే మా లక్ష్యం. వినియోగదార్లకు దగ్గరవ్వాలి. తద్వారా సమీపంలో మారుతీ సుజుకీ సర్వీస్ టచ్పాయింట్ని కనుగొనగలమన్న భరోసా వారికి ఉంటుంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక చేస్తున్నందున సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏకకాలంలో బలోపేతం చేస్తాం’ అని టాకేయూచీ వివరించారు.మారుతీ సుజుకీ తన మొదటి నెక్సా సర్వీస్ సెంటర్‌ను 2017 జూలైలో ప్రారంభించింది. 2023–24లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక సంవత్సరంలో ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ కొత్తగా 78 నెక్సా సర్వీస్ టచ్పాయింట్లను తెరిచింది. 500ల సర్వీస్ టచ్పాయింట్ల మైలురాయిని 7 సంవత్సరాల 5 నెలల వ్యవధిలో చేరుకుంది. -
భారత్‌లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలు
ఒకప్పటి నుంచి భారతదేశంలో డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే వాయు కాలుష్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఉద్గార ప్రమాణాలు కఠినంగా మారాయి. దీంతో కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని చాలా వరకు తగ్గించేసాయి. అయితే ఇప్పటికి కూడా కొన్ని డీజిల్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.10 లక్షల లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన డీజిల్ కారు. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 Bhp పవర్, 200 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.మహీంద్రా బొలెరోరూ. 9.79 లక్షల ధర మధ్య లభించే మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' (బిఎస్4 మోడల్) మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ కారు. దీనిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 76 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.కియా సోనెట్కియా సోనెట్ అనేది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 Bhp పవర్, 253 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).మహీంద్రా బొలెరో నియోమహీంద్రా బొలెరో నియో.. చూడటానికి కొంత బొలెరో మాదిరిగానే అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే కొన్ని తేడాలను గమనించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 100 Bhp పవర్, 210 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇదీ చదవండి: టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలుమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ కూడా మన జాబితాలో ఒకటి. రూ. 9.98 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 115 Bhp పవర్, 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్.. నితిన్ గడ్కరీ
వచ్చే ఐదేళ్లలో భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ.. ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుందని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ రంగంలో అమెరికా, చైనాలను సైతం అవలీలగా దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ ఖర్చులు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.అమెజాన్ సంభవ్ సమ్మిట్ (Amazon Smbhav Summit)లో గడ్కరీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన వృద్ధిని సాధించింది. తాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, తరువాత స్థానంలో చైనా (రూ. 47 లక్షల కోట్లు) ఉంది. భారత్ మూడో స్థానంలో (రూ. 22 లక్షల కోట్లు) ఉంది. కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలనీ, తప్పకుండా అవుతుందని గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను 2 సంవత్సరాలలోపు సింగిల్ డిజిట్‌కు తగ్గించాలనే మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని గడ్కరీ వివరించారు. మన దేశంలో లాజిస్టిక్ ధర 16 శాతం ఉంది, ఇది చైనాలో 8 శాతం, అమెరికా & యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. -
టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు
టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 9వ తరం 'క్యామ్రీ'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.సరికొత్త టయోటా క్యామ్రీ TNGA-K ప్లాట్‌ఫామ్‌పై ఆధారంగా నిర్మితమైంది. ఇది యూ షేప్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్, వెనుక వైపు కొత్త టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్టయోటా క్యామ్రీలోని 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 227 బీహెచ్పీ, 220 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈసీవీటీ (ఎలక్ట్రిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ సేడం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.