ఎప్రిలియా భారతదేశంలోని తన ఆర్ఎస్ 457 బైక్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ. 4.10 లక్షల ధర వద్ద లభించే ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 4.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) చేరింది. దీన్నిబట్టి చూస్తే దీని ధర మునుపటికంటే రూ.10,000 ఎక్కువని తెలుస్తోంది.
డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఆర్ఎస్ 457 బైక్ భారతదేశంలో ఉత్పత్తి అయినా మొదటి ఎప్రిలియా మోటార్‌సైకిల్. ఇది మహారాష్ట్రలోని బారామతిలో పియాజియో గ్రూప్ ఫెసిలిటీలో తయారైంది. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్‌లు, త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.
ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 47 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్, 48 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఏప్రిలియా ట్యూనో 457
ఏప్రిలియా ఇప్పుడు ఆర్ఎస్ 457 నేక్డ్ కౌంటర్‌పార్ట్.. ట్యూనో 457ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్ట్రీట్‌ఫైటర్ EICMA 2024లో వెల్లడైంది. అయితే కంపెనీ బైక్‌కి సంబంధించిన ధరలు రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైక్ కూడా ఆర్ఎస్ 457 వలె అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment