price
-
మరింత పెరిగిన ఎప్రిలియా ఆర్ఎస్ 457 ధర
ఎప్రిలియా భారతదేశంలోని తన ఆర్ఎస్ 457 బైక్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ. 4.10 లక్షల ధర వద్ద లభించే ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 4.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) చేరింది. దీన్నిబట్టి చూస్తే దీని ధర మునుపటికంటే రూ.10,000 ఎక్కువని తెలుస్తోంది.డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఆర్ఎస్ 457 బైక్ భారతదేశంలో ఉత్పత్తి అయినా మొదటి ఎప్రిలియా మోటార్‌సైకిల్. ఇది మహారాష్ట్రలోని బారామతిలో పియాజియో గ్రూప్ ఫెసిలిటీలో తయారైంది. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్లు, త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 47 బిహెచ్పి పవర్ అవుట్‌పుట్, 48 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఏప్రిలియా ట్యూనో 457ఏప్రిలియా ఇప్పుడు ఆర్ఎస్ 457 నేక్డ్ కౌంటర్పార్ట్.. ట్యూనో 457ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్ట్రీట్‌ఫైటర్ EICMA 2024లో వెల్లడైంది. అయితే కంపెనీ బైక్‌కి సంబంధించిన ధరలు రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైక్ కూడా ఆర్ఎస్ 457 వలె అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం. -
ఉన్నట్టుండి పెరిగిన బంగారం ధరలు
కొత్త ఏడాది ప్రారంభం నుంచి పెరిగిన బంగారం ధరలు.. గత మూడు రోజులుగా స్థిరంగా ఉండి, మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. గోల్డ్ రేటు (Gold Price) రూ. 78,820కు చేరింది. ఈ కథనంలో నేటి (జనవరి 8) బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.బంగారం ధరలుహైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 78,820 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు రూ.100, రూ.110 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.72,400 వద్ద.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.78,970 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 పెరిగినట్లు స్పష్టమవుతోంది.చైన్నైలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 72,250 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,820 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 పెరిగినట్లు తెలుస్తోంది.వెండి ధరలు2025 ప్రారంభంలో రూ.98,000 వద్ద ఉన్న వెండి ధర (Silver Price).. ప్రస్తుతం లక్ష రూపాయలకు చేరి స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 92,500 వద్ద ఉంది.పెరగనున్న బంగారం కొనుగోళ్లువిలువ పరంగా దేశీయ బంగారు ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పటిష్టంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' పేర్కొంది. విలువ రూపంలో వినియోగం 14 శాతం నుంచి 18 శాతం వృద్ధి చెందుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. 2023 - 24లో ఈ వృద్ధి రేటు 18 శాతంగా నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: మరింత పెరగనున్న బంగారం కొనుగోళ్లు: సంచలన రిపోర్ట్ఇక్రా నివేదిక ప్రకారం.. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గలేదు. పండుగ నేపథ్యంలో.. ఇటీవలి నెలల్లో మరింత పెరిగిందని తెలిసింది. 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 9% మేర (15 నుంచి 6 శాతానికి) దిగుమతుల సుంకం తగ్గడం, బంగారం ధరల్లో తాత్కాలిక ధరల కట్టడికి దారితీసిందని ఇది రెండవ త్రైమాసికంలో భారీ కొనుగోళ్లకు దారితీసిందని నివేదిక వివరించింది. ప్రత్యేకించి ఆభరణాలతోపాటు, నాణేలు, కడ్డీల కొనుగోళ్లూ పెరిగా యని వివరించింది. పండుగల సీజన్ కూడా పసిడి డిమాండ్‌కు కలిసి వచ్చిన అంశంగా పేర్కొంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
టమాట ధర ఢమాల్ : 7500 కిలోల టమాటాను తగులబెట్టిన రైతు
నిన్నటి దాకా సెంచరీ దాటేసి మంట మండించిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. 50 రూపాయలకు 5 కిలోల చొప్పున విక్రయిస్తున్నా డిమాండ్ లేని పరిస్థితి. ఈనేపథ్యంలో టమాట దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో సరియైన ధర లభించక పంటను తగుల బెట్టుకుంటున్నాడు రైతన్న.శివ్వంపేట(నర్సాపూర్): టమాటాకు మార్కెట్లో ధర లేకపోవడంతో ఒక రైతు పంటను తగులబెట్టాడు. మండల పరిధి నవాబుపేట గ్రామానికి చెందిన రవిగౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా పంటను సాగు చేస్తున్నాడు. ప్రస్తు తం పొలం నుంచి పంటను సేకరించి మార్కె ట్‌కు తరలిస్తే.. ఒక్కొక్క బాక్స్‌కు రూ.50 మించి ధర రావడం లేదు. రవాణాకు ఒక్కో బాక్స్‌కు రూ.30 పోగా రూ.20 వస్తున్నాయని, కూలీల డబ్బులు సైతం చేతికి అందడం లేదని రైతు వాపోయాడు. దీంతో గురువారం రెండు ఎకరాల్లోని 7500 కిలోల టమాటా పంటను తొలగించి తగులబెట్టాడు. ఇదే గ్రామంలో 25 మంది రైతులు సుమారు 60 నుంచి 70 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో వీరంతా తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి నెలకొంది. -
చాన్నాళ్లకు తగ్గిన బంగారం ధర!.. తులం ఎంతంటే?
మూడు రోజులు వరుసగా పెరిగిన బంగారం ధరలు (Gold Price) ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నేడు (డిసెంబర్ 28) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.160 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరులలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.77,840 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,350 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 160 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్స్ 10గ్రా గోల్డ్ రేటు రూ.71,350 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.77,840 వద్ద ఉంది.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ (Delhi) విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు తగ్గింది. కాబట్టి ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 77,990 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,500 వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. ఈ రోజు వెండి ధరలు (Silver Price) కూడా పతనమయ్యాయి. కాబట్టి కేజీ వెండి రూ. 92400 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు రూ.100 తగ్గినట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
కొత్త ఏడాది బంగారం కొనడం కష్టమే!.. ఎందుకో తెలుసా?
దేశంలో బంగారం ధరలు మరోమారు పెరిగాయి. నేడు (డిసెంబర్ 27) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.270 పెరిగింది. దీంతో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఈ రోజు బంగారం ధరలను గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 78,150 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,650.పసిడి ధరలు చెన్నైలో కూడా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.71,500 వద్ద ఉంది. ధరలు ఎలా ఉన్నా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు కొంత పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,00,000 వద్ద నిలిచింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల.. కొత్త ఏడాది ప్రారంభంలో గోల్డ్, సిల్వర్ కొనాలనుకునే.. కొనుగోలుదారులు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం ఇప్పుడు కొనండి!.. ఎందుకంటే?
డిసెంబర్ నెల ప్రారంభం నుంచి పడుతూ.. లేస్తూ.. వస్తున్న బంగారం ధరలు నేడు (డిసెంబర్ 23) స్థిరంగా ఉన్నాయి. కాబట్టి పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ నగరంలో ధరలు ఎక్కువగా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ (విజయవాడ), తెలంగాణ (హైదరాబాద్)లలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 77,450 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 77,600 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,150. ధరలు ఎలా ఉన్నా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.చెన్నైలో పసిడి ధరలు నిశ్చలంగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.77,450 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.71,000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ వెండి ధరలు కూడా రూ.1,00 మాత్రమే తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ. 98,900 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలు
మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాల ధరలను 2025 జనవరి ప్రారంభం నుంచే పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా చేరింది.టాటా మోటార్స్ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ధరలు 2025 జనవరి నుంచే అమలులోకి వస్తాయి. కానీ ఏ వేరియంట్ ధర ఎంత అనేది త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా కంపెనీ వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా కొత్త ఉత్పత్తులు కనువిందు చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారువాహన తయారీ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా.. ఏడాది చివరలో లేదా పండుగ సీజన్లలో ధరలను పెంచుతాయి. ఇప్పుడు కూడా ఇదే విధానం అనుసరించి.. పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా?.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
జనవరి నుంచి పెరగనున్న కార్ల ధరలు: ఎంతంటే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' జనవరి 2025లో తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు.. నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోడల్ వారీగా ధర పెరుగుదలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.మారుతి తన కొత్త కార్లను నెక్సా & అరేనా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తుంది. నెక్సా అవుట్లెట్లలో ఇగ్నీస్, బాలెనొ, సియాజ్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్6, ఇన్విక్టో కార్లను విక్రయిస్తోంది. అరేనా అవుట్లెట్ల ద్వారా ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, ఈకో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా కార్లను విక్రయిస్తోంది.మారుతి సుజుకి కొత్త ధరలను 2025 జనవరి నుంచే ప్రారంభించనుంది. ధరల పెరుగుదల.. కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ సేల్స్ వచ్చే ఏడాదిలో ఎలా ఉండనున్నాయనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.వాహనాల ధరలను పెంచిన సంస్థల జాబితాలో ఇప్పటికే హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, నిస్సాన్ మోటార్ వంటి కంపెనీలు చేరాయి. ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి కూడా ఈ జాబితాలోకి చేరింది. -
అసలే ఖరీదైన బైకులు.. మరింత పెరగనున్న ధరలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్.. తన బైకుల ధరలను 2.5 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు 2024 జనవరి 1నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ఏప్రిల్ 2017లో బీఎండబ్ల్యూ ఇండియా అనుబంధ సంస్థగా, తన కార్యకలాపాలను ప్రారంభించిన బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఖరీదైన బైకులను, స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ జీ310 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ310 ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ సీఈ 02, బీఎండబ్ల్యూ సీఈ 04 మొదలైనవి ఉన్నాయి.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా బీఎండబ్ల్యూ సీఈ 04 (రూ. 14.90 లక్షలు). ప్రస్తుతం, దేశంలో విక్రయించే అన్ని బీఎండబ్ల్యూ బైక్‌లు, స్కూటర్లు ప్రామాణికంగా 3 సంవత్సరాల, అపరిమిత మైలేజ్ వారంటీతో వస్తున్నాయి. బీఎండబ్ల్యూ ఇండియన్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 27 మోడల్స్ ఉన్నట్లు సమాచారం. వీటి ధరలన్నీ జనవరి 1నుంచి గణనీయంగా పెరుగుతాయి. -
ఇక సబ్బులు మరింత ఖరీదు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న హెచ్‌యూఎల్, విప్రో వంటి ప్రముఖ సంస్థలు సబ్బుల ధరలను దాదాపు 7–8 శాతం పెంచాయి. సబ్బుల తయారీలో కీలక ముడిసరుకు అయిన పామాయిల్ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడంతో హెచ్‌యూఎల్, టాటా కంజ్యూమర్ వంటి కంపెనీలు ఇటీవల టీ ధరలను పెంచాయి.సెప్టెంబరు త్రైమాసికం ఎర్నింగ్ కాల్స్ సందర్భంగా అనేక లిస్టెడ్ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి ప్రస్తుత త్రైమాసికంలో సబ్బుల ధరల సవరణ ఉంటుందని సూచనగా తెలిపాయి. పామాయిల్, కాఫీ, కోకో వంటి ముడిసరుకు ప్రియం కావడమే ఇందుకు కారణం. పామాయిల్ డెరివేటివ్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 30 శాతం దూసుకెళ్లాయని విప్రో కంజ్యూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ ఖత్రీ తెలిపారు. ఇతర ఉత్పత్తులు సైతం.. దిగుమతి సుంకం అధికం కావడం, అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా సెప్టెంబర్ మధ్య నుండి పామాయిల్ ధరలు దాదాపు 35–40 శాతం ఎగశాయి. హెచ్‌యూఎల్ కంపెనీకి చెందిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు సైతం ప్రియం అయ్యాయి. టీ వంటి విభాగాలలో దశలవారీగా ధరలను 25–30 శాతం పెంచినట్టు టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజా గత వారం వెల్లడించారు.వినియోగదార్లపై ఒకేసారి భారం మోపకూడదని తమ యాజమాన్యం నిర్ణయించినట్టు గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ వెల్లడించింది. 5 యూనిట్ల ప్యాక్ లక్స్ సబ్బుల ధర రూ.145 నుంచి రూ.155కి, లైఫ్‌బాయ్ రూ.155 నుంచి రూ.165కి చేరాయి. 4 యూనిట్ల పియర్స్ ప్యాక్ రూ.149 నుండి రూ.162కి దూసుకెళ్లింది. -
ఒక్కసారిగా పెరిగిన సీఎన్జీ ధరలు..
సాధారణంగా పెట్రోల్, డీజల్ ధరలే ప్రజలకు షాకిస్తుంటాయి. కానీ ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. కేజీ సీఎన్జీ ధర ఉన్నట్టుండి.. ఏకంగా రెండు రూపాయల పెరిగింది.ముంబైతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సీఎన్జీ ధరలు పెరిగాయి. అయితే ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరగలేదని సమాచారం. దీనికి కారణం దేశ రాజధానిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే అని తెలుస్తోంది. కాబట్టి ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ. 75.09 వద్ద ఉంది.ధరల పెరుగుదల తరువాత ముంబైలో కేజీ సీఎన్జీ 77 రూపాయలు దాటేసింది. నోయిడా, ఘజియాబాద్‌లలో కేజీ సీఎన్జీ ధరలు వరుసగా రూ. 81.70, రూ. 82.12గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీతో పోలిస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సీఎన్జీ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికఎన్నికలు ముగియడంతో.. ముంబైలోని సిటీ గ్యాస్ రిటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) ముంబై, పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలను కిలోపై రూ. 2 చొప్పున పెంచినట్లు వెల్లడించింది. గత రెండు నెలలుగా ధరలను పెంచని అదానీ టోటన్ గ్యాస్ కూడా సీఎన్జీ రేటును పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ ధర రూ. 96వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్‌లోనే సీఎన్జీ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు
దీపావళి ముగియగానే బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర రెండో రోజు గరిష్టంగా రూ. 160 తగ్గింది. దీంతో ఈ రోజు (నవంబర్ 2) మళ్ళీ గోల్డ్ రేటు పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ.150, రూ.160 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 160 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న రూ. 3000 తగ్గిన వెండి ఈ రోజు ఎలాంటి పెరుగుదలను, తగ్గుదలను నమోదు చేయలేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పండగ పోయింది: బంగారం ధర తగ్గింది
ధన త్రయోదశి, దీపావళికి భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 1) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 770 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,560, 22 క్యారెట్ల ధర రూ. 73,850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ. 700, రూ. 770 తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 770 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,710 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 74,000 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుదముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ. 700, రూ. 770 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,560 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,850 వద్ద ఉంది.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న స్థిరంగా ఉన్న సిల్వర్ రేటు ఈ రోజు రూ. 3000 తగ్గింది. దాదాపు వారం రోజుల తరువాత ఇంత పెద్ద మొత్తం వెండి ధర తగ్గడం ఇదే మొదటిసారి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మళ్ళీ షాకిచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు
ధన త్రయోదశి.. బంగారం కొనుగోలు చేస్తే శుభమని చాలామంది భావిస్తారు. అయితే నేడు పసిడి ధరలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి. కాబట్టి దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (మంగళవారం) గోల్డ్ రేట్లు గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,450 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 73,750 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేడు ధరలు రూ. 600, రూ. 650 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధర రూ. 600, రూ. 650 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,750 వద్ద ఉంది.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగానే పెరిగాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో ధరలు కొంత ఎక్కువ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,900 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 80,600 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు వరుసగా రూ. 600, రూ. 650 పెరిగింది.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో బంగారు, వెండి నాణేల డెలివరీ..సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,900 వద్ద నిలిచింది. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 మాత్రమే తగ్గింది. ఇదే ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఆ మందులు ఇక మరింత ఖరీదు.. ధర పెరగనున్న 8 మెడిసిన్లు!
ఆస్తమా, గ్లకోమా, తలసేమియా, క్షయతోపాటు బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడేవారికి మందుల భారం మరింత పెరగనుంది. ఆయా చికిత్సలకు వినియోగించే ఎనిమిది సాధారణ మందుల ధరలు మరింత ఖరీదు కానున్నాయి.ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ ఔషధాల 11 షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల ధరలను వాటి ప్రస్తుత సీలింగ్ ధరపై 50 శాతం పెంచడానికి ఆమోదించినట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్పత్తి వ్యయం, మారకపు ధరలు పెరగడం వంటి కారణాలతో ఔషధ తయారీదారులు ధరలను పెంచడానికి దరఖాస్తు చేసుకోగా ఎన్పీపీఏ ఆమోదించినట్లు తెలుస్తోంది.పెరగనున్న మందులు ఇవే..» బెంజిల్ పెన్సిలిన్ 10 లక్షల IU ఇంజెక్షన్» అట్రోపిన్ ఇంజెక్షన్ 06.mg/ml» ఇంజెక్షన్లో వాడే స్ట్రెప్టోమైసిన్ పౌడర్ 750 mg, 1000 mg» సాల్బుటమాల్ టాబ్లెట్ 2 mg, 4 mg, రెస్పిరేటర్ ద్రావణం 5 mg/ml» పిలోకార్పైన్ 2% డ్రాప్స్» సెఫాడ్రోక్సిల్ టాబ్లెట్ 500 mg» ఇంజెక్షన్లో వినియోగించే డెస్ఫెర్రిఆక్సమైన్ 500 mg» లిథియం మాత్రలు 300 mgడ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO), 2013 నిబంధనల ప్రకారం 20 కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయించింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన సెఫురోక్సిమ్ ఆక్సెటిల్ టాబ్లెట్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఎల్-కార్నిటిన్ మెకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రిటైల్ ధరను కూడా నిర్ణయించింది. -
ఆలూ, ఉల్లి ధరలు తీవ్రం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 1.84 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆగస్టులో ఇది 1.31 శాతం కాగా, 2023 సెప్టెంబర్‌లో అసలు పెరుగుదల లేకపోగా -0.07 శాతం క్షీణించింది. కూరగాయల ధరలు ప్రత్యేకించి ఆలూ, ఉల్లి ధరల తీవ్రత అధికంగా ఉంది. సమీక్షా నెల్లో మూడు ప్రధాన విభాగాలు చూస్తే..ఫుడ్ ఐటమ్స్ టోకు ద్రవ్యోల్బణం 11.53 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.11 శాతం కావడం గమనార్హం. ఆగస్టులో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా -10.01 శాతం తగ్గుదల నమోదయ్యింది. అయితే సమీక్షా నెల సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు ఏకంగా 48.73 శాతంగా ఉంది. ఆలూ ధరలు 78.13 శాతం పెరిగితే, ఉల్లి ధరలు ఏకంగా 78.82 శాతం ఎగశాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ధరలు 4.05 శాతం తగ్గాయి. రిటైల్ ధరలూ భారమే..! ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబర్‌లో తీవ్రంగా ఉండడం గమనార్హం. సమీక్షా నెల్లో ఈ స్పీడ్ ఏకంగా 9నెలల గరిష్ట స్థాయిలో 5.49 శాతంగా నమోదయ్యింది. ఆగస్టులో ఈ రేటు కేవలం 3.65 శాతం. అధిక కూరగాయల ధరలు దీనికి కారణమని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జాతీయ గణాంకాల కార్యాలయం వివరాల ప్రకారం ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.24 శాతంగా ఉంది. ఆగస్టులో ఈ రేటు 5.66 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే నెల్లో 6.62 శాతం. -
బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?
దీపావళి సమీపిస్తున్న తరుణంలో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు పసిడి ధరలు కొంత మేర తగ్గాయి. దీంతో నేటి (మంగళవారం) బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 70,950 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.77,400 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.దేశ రాజధానిలో కూడా 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గాయి. దీంతో నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 71,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 77,550 వద్ద ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధర కొంత ఎక్కువనే తెలుస్తోంది.చెన్నైలో 10 గ్రామ్స్ గోల్డ్ రేటు నిన్నటికంటే రూ. 200, రూ. 220 తక్కువ. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,950 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 77,400 వద్ద ఉంది.వెండి ధరబంగారం ధర స్వల్ప తగ్గుదలను నమోదు చేసినప్పటికీ.. గత మూడు రోజులుగా వెండి ధరలు తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ. 1.03 లక్షల వద్ద ఉంది. ఇదే ధరలు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ధర దడ
తెనాలి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది. శరన్నవరాత్రుల సంబరాల హోరులో టమాటా, ఉల్లి సహా అనేక నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ‘కొనబోతే కొరివి..’ అన్నట్లుగా ఉన్నాయి. ముందుముందు ఇవి ఇంకెంత భారమవుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఉదా.. బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, వంట నూనెలు, నిమ్మకాయ, పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రైతుబజారులో టమాటా కిలో ధర గురువారం రూ.64 ఉంటే, శుక్రవారానికి రూ.73కు చేరుకుంది. బహిరంగ మార్కెట్లో రూ.80లకు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం వరకూ రూ.40–45 పలికిన టమాటా ఇప్పుడు రెట్టింపు కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా కొంచెం అటూఇటుగా అదే పరిస్థితి. ఘాటెక్కిన ఉల్లి..వెల్లుల్లి ధరలు..ఉల్లిపాయలైతే కర్నూలువి రూ.45 పైమాటే. మహారాష్ట్ర నుంచి వచ్చే ఆరుదల పాయ కిలో రూ.70 పైమాటగానే ఉంది. వెల్లుల్లి ధర చుక్కలనంటింది. నాణ్యత ప్రకారం కిలో రూ.250 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. ఇక అన్ని రకాల నూనెలూ లీటరుకు రూ.20 పెరిగాయి. అయిదు లీటర్ల డబ్బాలు దాదాపు అన్నీ కొంచెం అటూఇటుగా రూ.680లకు అమ్ముతున్నారు.బియ్యం ధరలూ పైపైకి..బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. 25 కిలోల బియ్యం బస్తా రూ.1,450–1,600లకు అమ్ముతున్నారు. ఎగుమతులకు అనుమతివ్వడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. స్థానిక నిమ్మ మార్కెట్లో నిమ్మకాయలు కిలో రూ.70 ఉంటే రిటైల్ మార్కెట్లో డజను రూ.70కి తక్కువకు దొరకటంలేదు. అలాగే, పూల ధరలు ఠారెత్తిస్తున్నాయి. హోల్‌సేల్‌లో మల్లెపూలు కిలో రూ.1,500 కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా రిటైల్‌లో మూర రూ.100లకు అమ్ముతున్నారు. సన్నజాజులు కిలో రూ.1,000, కనకాంబరాలు కిలో రూ.2,000గా ఉంది. ఇతర రకాలైనా కనీసం రూ.50–60 పెట్టనిదే మూర పూలు లభించడంలేదు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏర్పడిన డిమాండ్‌తో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వరదలే కారణమట..మరోవైపు.. ధరల పెరుగుదలకు ఇటీవల వచ్చిన వరదలను కారణంగా చెబుతున్నారు. ధరలను నియంత్రించే యంత్రాంగమేదీ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనిపించటంలేదు. పండుగ రోజుల్లో ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు పండగ గట్టెక్కేదెలా అని మథనపడుతున్నారు. -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటిన ఉదయాన్నే వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కిలోల గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.2024, అక్టోబర్ ఒకటి నుండి, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ముంబైలో రూ. 1,692.50, కోల్‌కతాలో రూ. 1,850.50, చెన్నైలో రూ. 1,903కు చేరింది. దీనికిముందు సెప్టెంబర్‌లో కూడా ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది. కోల్‌కతాలో మంగళవారం నుంచి 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
థార్ రాక్స్ 4x4 ధరలు ఇవే
థార్ రాక్స్ 4x4 వేరియంట్ ధరలను మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ SUV ధరలు రూ. 14.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎడిషన్ ఎంఎక్స్5, ఏఎక్స్5 ఎల్, ఏఎక్స్7 ఎల్ అనే మూడు వేరియంట్లలో కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.మహీంద్రా థార్ రాక్స్ 4x4 ఎడిషన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 330 Nm టార్క్ 150 Bhp పవర్ అందిస్తుంది. అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 172 Bhp పవర్, 370 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్నో, సాండ్, మడ్ అనే మూడు పవర్ మోడ్స్ పొందుతుంది.ఇదీ చదవండి: పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్థార్ రాక్స్ ఎంఎక్స్5 4x4 ఎడిషన్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రివర్స్ కెమెరా, సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఆటో హెడ్‌లైట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఏఎక్స్5 ఎల్ వేరియంట్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, లెవల్ 2 ఏడీఏఎస్ టెక్ వంటివి పొందుతుంది. ఏఎక్స్7 ఎల్ పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటివి పొందుతాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!.. ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులకు ముందు ఒక బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది. అయితే ఉప్పుడు ఈ ధర 70 డాలర్ల నుంచి 72 డాలర్ల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో మనదేశంలో లీటరు ధర రూ. 2 నుంచి రూ. 3 వరకు తగ్గే అవకాశం ఉంది.ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ 'గిరీష్ కుమార్ కదమ్' ఇంధన ధరల గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు పెట్రోల్.. డీజిల్ ధరలపై లీటర్‌కు వరుసగా రూ.15, రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు.2024 మార్చి15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 2 తగ్గింది. ఆ తరువాత ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల తగ్గుదల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలకు కారణమవుతాయని తెలుస్తోంది. అయితే ధరలు ఎప్పుడు తగ్గుతాయనేది తెలియాల్సి ఉంది. -
వంట నూనె ధరల మంటలు
-
మెరుపు తగ్గిన ‘మిరప’
సాక్షి, అమరావతి: మిరప మెరుపు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. వర్షాలు, వరదలతో పంటలు భారీగా దెబ్బతినడంతో పాటు నల్లతామరతో సహా చీడపీడలు, తెగుళ్ల ప్రభావానికి తోడు మార్కెట్లో ధర లేకపోవడం మిరప రైతులను కలవర పెడుతోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.95 లక్షల ఎకరాలు కాగా, 2022లో 5.70 లక్షల ఎకరాల్లో సాగవగా, 2023లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 3.36లక్షల ఎకరాల్లో మాత్రమే మిరప నారు వేయగలిగారు. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 15 వేల ఎకరాలకు పైగా వర్షాలు, వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. సీజన్ ముగిసే నాటికి 4.50 లక్షల ఎకరాలు దాటడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.అవగాహన కల్పించే వారేరి?సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు కాస్త కలవరపెట్టాయి. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసినా ఎరువుల కొరత తీవ్రంగా వేధించింది. తెల్లతామర తెగులుతో పాటు ఇతర చీడపీడలపై గడచిన నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రొటోకాల్ మేరకు ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేవారు. ఫలితంగా నల్లతామరతో సహా ఇతర చీడపీడలు, తెగుళ్ల జాడ కనిపించలేదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా మచ్చుకైనా కన్పించడంలేదు. నల్లతామర నివారణకు ఉద్యాన శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు పూజ్యమనే చెప్పాలి.భారీగా పతనమైన ధర2022–23లో క్వింటాకు గరిష్టంగా రూ.27వేల ధర పలకగా, 2023–24 సీజన్లో గరిష్టంగా రూ.29 వేల వరకు పలికింది. అలాంటిది ప్రస్తుతం గుంటూరు మిర్చియార్డులో క్వింటాకు గరిష్టంగా రూ.18,600, కనిష్టంగా రూ.9,500 చొప్పున ధర పలకడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది క్వింటా రూ.50వేలకుపైగా పలికిన బాడిగ రకం మిరపకు ఈసారి రూ.10వేలకు మించి పలకని పరిస్థితి నెలకొంది. మరొక పక్క 2022–23 సీజన్లో ఎకరాకు 18–23 క్వింటాళ్ల చొప్పున 11.50లక్షల టన్నుల దిగుబడి రాగా, 2023–24లో 20–25 క్వింటాళ్ల చొప్పున 12.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుండడంతో 10లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదని అధికారులు చెబుతున్నారు. -
ఇది సాయమా? మరో గాయమా!?
సాక్షి, అమరావతి: అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. అన్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే. విజయవాడను వరదలు ముంచెత్తి 15 రోజులు పూర్తయినా బాధితులకు చిల్లిగవ్వ సాయం కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వారి జేబులకు చిల్లులుపడే బాధ్యతను మాత్రం భుజానికెత్తుకుంది. బాధితులకు మేలు చేస్తున్నట్లు ఓ వైపు బిల్డప్ ఇస్తూనే మరోవైపు ఓ కార్పొరేట్ సంస్థకు మేలు చేకూర్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా.. బాధితుల ఇళ్లలో పనికిరాకుండా పోయిన గృహోపకరణాలతోపాటు ఇళ్లలో నీటి పైపులైన్లు, నీటి కుళాయిలు వంటి ప్లంబింగ్ పనులకు నిర్ణీత రేట్లతో మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మరమ్మతుల రేట్లు అవాక్కయ్యేలా ఉండడం ముంపు ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉదా.. స్విచ్‌బాక్స్ బిగించడానికి రూ.279, ఫ్యాన్ రెగ్యులేటర్ మార్చడానికి రూ.99, ఫ్యాన్ రిపేరుకు రూ.199, ఫ్యాన్ మార్చడానికి రూ.239, గీజర్ చెక్ చేయడానికి రూ.299, వాష్ బేసిన్ లీకేజీ రిపేరుకు రూ.169, సింక్ డ్రెయిన్ పైపు రిపేరుకు రూ.209, డ్రెయిన్ పైపులో అడ్డుతొలగించేందుకు రూ.169, వాటర్ ట్యాప్ రిపేరుకు రూ.139, ఫ్లష్ ట్యాంకు రిపేరుకు రూ.299, వెస్ట్రన్ టాయిలెట్ రిపేరుకు రూ.799, వెస్ట్రన్ టాయిలెట్ మార్చడానికి రూ.1,499, ఇండియన్ టాయిలెట్ బిగించడానికి రూ.1,699.. అంటూ సదరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ధరలను నిర్ణయించింది. అంటే.. ఈ ధరలను బాధితులు స్వయంగా డబ్బులు చెల్లించి రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి.. బయట మార్కెట్లో ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని బాధితులే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు.. ఈ కార్పొరేట్ సంస్థకు అదనంగా అవసరమయ్యే టెక్నీíÙయన్లను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారిని ప్రభుత్వమే కేటాయించడం గమనార్హం. బాధితులకు యాప్ బాధ్యత ప్రభుత్వ సిబ్బందికి.. ఇదిలా ఉంటే.. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9–12 వరకు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించింది. ఏ ఇంట్లో ఏ వస్తువులు పాడయ్యాయో వివరాలను సేకరించింది. ఇప్పుడు వీరి సమాచారం పరోక్షంగా ఆ సంస్థ చేతిలో ప్రభుత్వం పెట్టేసింది. అలాగే, పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే ఉన్నతాధికారులు ఇటీవలే విజయవాడ పరిధిలోని మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి ముంపు ప్రాంతాల్లోని పొదుపు మహిళల ఫోన్లలో సదరు కార్పొరేట్ సంస్థ యాప్‌ను డౌన్లోడ్ చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులు ఈ బాధ్యతను చేపట్టినట్లు సమాచారం. అంతేకాక.. ‘మీ ఇంట్లో పాడైన వాటిని సంబంధిత కంపెనీతో తక్కువ ఖర్చుతో బాగుచేయించుకోండి’ అంటూ ఆ సంస్థ క్యూఆర్ కోడ్‌తో ప్రభుత్వమే కరపత్రాలను బాధితులకు అందిస్తూ ఆ సంస్థను ప్రోత్సహిస్తోంది.కళ్లుచెదిరేలా రిపేరింగ్ రేట్లు.. నిజానికి.. పాడైన వస్తువులను ఇంటి చుట్టుపక్కల ఉండే టెక్నీషియన్‌తో బాగుచేయించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ, ప్రభుత్వ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన రేట్లు చూస్తే బయట మార్కెట్ రేట్లు లేదా ఆ కార్పొరేట్ సంస్థ తన యాప్‌లో ప్రదర్శించే ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయి. వీరిని ఆశ్రయిస్తే బాధితుల ఖర్చులు తడిసిమోపెడవడం ఖాయం. ఎందుకంటే.. ఒకే ఇంట మూడు ట్యూబ్లైట్లను ఆ కంపెనీ ద్వారా మార్చుకుంటే మొత్తం రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, బయట మెకానిక్‌లో చేయిస్తే 150–200 మించి కావు. అలాగే.. ఎలక్ట్రికల్ స్విచ్ బాక్స్ బిగించడానికి రూ.239లు అని యాప్‌లో పేర్కొనగా, వరద ప్రాంతాల్లో ఇదే సేవకు రూ.279లుగా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లోకల్‌గా ఉండే మెకానిక్‌లు ఇదే పనికి రూ.100 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు.. ఫ్యాన్ మార్చడానికి యాప్ ధర రూ.199లు ఉంటే వరద ప్రాంతాల్లో రూ.239లుగా నిర్ణయించారు. అదే స్థానిక మెకానిక్‌లు ఈ పనికి కేవలం రూ.100–150ల చొప్పున తీసుకుంటామని చెబుతున్నారు. నీటి కుళాయి మార్చడానికి రూ.50 అని యాప్‌లో ఉంటే ఇదే పనికి వరద ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.139లు నిర్ణయించింది. స్థానిక మెకానిక్‌లు ఈ పనికి రూ.100 తీసుకుంటున్నారు. వాస్తవానికి.. అనేక ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఉచితంగా సేవలందిస్తుంటే ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకుండా కార్పొరేట్ సంస్థకు కొమ్ముకాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక.. విపత్తు సమయంలో నిండా మునిగిన బా«ధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా బాధితుల నుంచి కార్పొరేట్ కంపెనీలు అధిక ధరలు వసూలుచేసుకునేలా వీలు కల్పించడం విడ్డూరంగా ఉందని బాధితులు వాపోతున్నారు. ఆదుకుంటామని చెప్పి ఇలా చేస్తారా!? ఇక వరద తగ్గిన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతో నీట మునిగిన ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లోని సామాన్లు, దుస్తులు, గృహోపకరణాలు పాడైపోయిన వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా ప్రకటిస్తామన్నారు. తీరా ఇప్పుడు బాధితులే డబ్బులు కట్టి బాగుచేయించుకోవాలని సూచించడంతో పాటు ఆయా పనులకు ప్రభుత్వం ధరలు నిర్ణయించి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు. సాయం మాట దేవుడెరుగు ఇది తమను మరింత గాయపర్చేలా ఉందని వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
తగ్గిన బంగారం, వెండి ధరలు: ఎంతంటే?
సెప్టెంబర్ నెలలో మొదటిసారి పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తులం బంగారం రేటు రూ. 440 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.72870 వద్ద నిలిచింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో శనివారం బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 400 తగ్గి రూ. 66800 వద్దకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 440 తగ్గి రూ.72870 వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ.దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 66,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73020 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న కొంత పెరిగిన పసిడి ధరలు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నయని స్పష్టంగా తెలుస్తోంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధర రూ. 2500 తగ్గింది. నిన్న రూ. 2000 పెరిగిన కేజీ వెండి ధర ఈ రోజు రూ. 2500 తగ్గింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 84500 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.ఇదీ చదవండి: అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).