పండగ పోయింది: బంగారం ధర తగ్గింది | Gold and Silver Price Today On November 1st 2024 | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా తగ్గిన ధరలు: సంబరపడుతున్న పసిడి ప్రియులు!

Published Fri, Nov 1 2024 10:29 AM | Last Updated on Fri, Nov 1 2024 10:57 AM

Gold and Silver Price Today On November 1st 2024

ధన త్రయోదశి, దీపావళికి భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 1) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 770 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,560, 22 క్యారెట్ల ధర రూ. 73,850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ. 700, రూ. 770 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 770 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,710 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 74,000 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.

చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుదముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ. 700, రూ. 770 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,560 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,850 వద్ద ఉంది.

ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?

వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న స్థిరంగా ఉన్న సిల్వర్ రేటు ఈ రోజు రూ. 3000 తగ్గింది. దాదాపు వారం రోజుల తరువాత ఇంత పెద్ద మొత్తం వెండి ధర తగ్గడం ఇదే మొదటిసారి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement