
మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,671.65 పాయింట్లు లేదా 2.22 శాతం లాభంతో.. 76,828.91 వద్ద, నిఫ్టీ 513.45 పాయింట్లు లేదా 2.25 శాతం లాభంతో.. 23,342.00 పాయింట్ల వద్ద నిలిచాయి.
ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పాండీ ఆక్సైడ్స్ & కెమికల్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. క్వెస్ కార్ప్, రాజ్ టెలివిజన్ నెట్‌వర్క్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).