Stock Market
-
ఇన్వెస్టర్లకు ఫ్రై డే
ముంబై: దేశీయ స్టాక్ సూచీలను వరుసగా అయిదో రోజూ నష్టాలు వెంటాడాయి. వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో శుక్రవారమూ కుప్పకూలాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,176 పాయింట్లు క్షీణించి 79 వేల పాయింట్ల స్థాయి దిగువన 78,042 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 364 పాయింట్లు నష్టపోయి 23,588 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ. 10 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. సెన్సెక్స్ 1,344 పాయింట్లు క్షీణించి 77,875 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు కోల్పోయి 23,537 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో ఇండోనేషియా మినహా అన్ని దేశాల సూచీలు 3% వరకు పతనయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి విలువ 9 పైసలు బలపడి 85.04 వద్ద ముగిసింది. 5 రోజుల్లో రూ.18.43 లక్షల కోట్ల నష్టం స్టాక్ మార్కెట్ వరుసగా 5 రోజుల్లో సెన్సెక్స్ 4,091 పాయింట్ల (5%) కుదేలవడంతో రూ.18.43 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.440.99 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,176.45 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 78,041.59 వద్ద, నిఫ్టీ 364.20 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టంతో 23,587.50 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరెటరీస్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్ మహీంద్రా, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 23,911కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు దిగజారి 79,027 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.43 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.09 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.12 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘ఫెడ్’ పంజా!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 964 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 79,218 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 23,952 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు.అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు గురువారం ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,153 పాయింట్లు పతనమై 79,029 వద్ద, నిఫ్టీ 322 పాయింట్లు పతనమై 23,877 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. రోజంతా భారీ నష్టాలతో ట్రేడయ్యాయి. ముఖ్యంగా వడ్డీరేట్ల ఆధారిత బ్యాంకులు, రియల్టీ షేర్లతో పాటు ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.30%, 0.28 శాతం బలహీనపడ్డాయి.ప్రపంచ మార్కెట్లపై ఫెడ్ ఎఫెక్ట్...ఆశించినట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ.. వచ్చే ఏడాది నుంచి రేట్ల తగ్గింపులో దూకుడు ఉండదంటూ సంకేతాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలో అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లు కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో యూరప్ మార్కెట్లు ఒక శాతం పతనమయ్యాయి. ఫెడ్ రిజర్వ్ ప్రకటన రోజు (బుధవారం రాత్రి) 3% నష్టపోయిన అమెరికా మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో రికవరీ బాటపట్టాయి. యూఎస్ స్టాక్ సూచీలు నాస్డాక్ 1%, డోజోన్స్ అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో సన్‌ఫార్మా(1%), హెచ్‌యూఎల్ (0.11%), పవర్‌గ్రిడ్(0.09%) మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 2.50% – 2% నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 1.20% అత్యధికంగా పడింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.25%, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 1% నష్టపోయాయి. రిలయన్స్ (–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (–1%), టీసీఎస్(–2%), ఐసీఐసీఐ బ్యాంక్ (–2%), ఇన్ఫీ(1.50%), ఎల్అండ్టీ (1%) నష్టపోయి సూచీల పతనాన్ని శాసించాయి.నాలుగు రోజుల్లో రూ.9.65 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,915 పాయింట్ల (3.54%) పతనంతో రూ.9.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.449.76 లక్షల కోట్ల (5.29 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 964.16 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 79,218.05 వద్ద, నిఫ్టీ 236.90 పాయింట్లు లేదా 0.98 శాతం నష్టంతో 23,961.95 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, సిప్లా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.03 సమయానికి నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 23,959కు చేరింది. సెన్సెక్స్ 790 పాయింట్లు దిగజారి 79,396 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.78 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.95 శాతం నష్టపోయింది. నాస్డాక్ 3.56 శాతం దిగజారింది.యూఎస్ ఫెడ్ వడ్డీ కోతఅంచనాలకు అనుగుణంగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో తాజాగా 0.25 శాతం కోత పెట్టింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.25–4.5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేటు తగ్గింపునకే మరోసారి మొగ్గు చూపింది. ఈ క్యాలండర్ ఏడాదిలో ఇది చివరి పాలసీ సమావేశంకాగా.. జో బైడెన్ హయాంలో పావెల్ చేపట్టిన చివరి సమీక్షగా నిపుణులు పేర్కొన్నారు. కాగా.. కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన వెంటనే చేపట్టిన సెప్టెంబర్ సమావేశంలో ఎఫ్‌వోఎంసీ 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. తదుపరి తిరిగి గత(నవంబర్) సమావేశంలో మరో పావు శాతం వడ్డీ రేటును తగ్గించింది. అయితే భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అంతలా ఉండకపోవచ్చంటూ బలమైన సంకేతాలు ఇచ్చింది. దాంతో మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కీలక వడ్డీరేట్లపై త్వరలో నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 24,198 వద్దకు చేరింది. సెన్సెక్స్ 502 పాయింట్లు దిగజారి 80,182 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.ఇదీ చదవండి: వింటేజ్ కారు ధర రూ.3,675!భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగియడానికి కారణాలను నిపుణులు విశ్లేషించారు.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ: వడ్డీరేట్ల తగ్గింపుపై దిశానిర్దేశం చేసే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు రాత్రి దీనికి సంబంధించి వివరాలు వెల్లడికానున్నాయి. రేపు మన మార్కెట్లో దీని ప్రభావం ఉండనుంది.చైనా ఆర్థిక మందగమనం: చైనా తాజా గణాంకాలు ఊహించిన దానికంటే బలహీనమైన ఆర్థిక పనితీరును చూపించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌ను ప్రభావితం చేసింది. భారతదేశ మెటల్, ఆటో స్టాక్లను ప్రభావితం చేసింది.యూఎస్ డాలర్ బలపడటం: బలమైన డాలర్ భారతీయ ఈక్విటీల వైపు విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. డాలర్ డినామినేషన్ చెల్లించే రుణాలు కంపెనీలకు భారంగా మారుతాయి.వాణిజ్య లోటు పెరుగుదల: నవంబర్‌లో వాణిజ్య లోటు గణనీయంగా పెరగడంతో రూపాయిపై ఒత్తిడి అధికమైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
వివేక్ ఒబెరాయ్ ప్రముఖ నటుడిగానే అందరికి తెలుసు. కానీ, తన పదహారో ఏటే స్టాక్ మార్కెట్లో శిక్షణ తీసుకుని కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చాలా మందికి తెలియకపోవచ్చు. అలా స్టాక్ మార్కెట్, నట జీవితంలో వచ్చిన డబ్బుతో పాటు విభిన్న వ్యాపారాల వల్ల తాను ప్రస్తుతం రూ.1,200 కోట్ల సంపదను సృష్టించుకున్నారు. అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన తన సంపదను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇటీవల తెలియజేశారు.వివేక్ ఒబెరాయ్ చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించడంతోపాటు దాన్ని సమర్థంగా ఎలా నిర్వహించాలనే దానిపై దృష్టి సారించేవారు. తాను సినిమాల్లోకి రాకముందే వాయిస్ఓవర్ అసైన్మెంట్లు, హోస్టింగ్ షోలు చేసేవారు. అందులో వచ్చిన డబ్బును సమర్థంగా పెట్టుబడి పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. దాంతో విభిన్న వ్యాపార ఆలోచనలను అన్వేషిస్తూ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి స్టాక్ బ్రోకర్లతో శిక్షణ తీసుకున్నట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. తన పదహారో ఏట మార్కెట్లో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నారు. ఎక్కువగా కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చెప్పారు. 19 ఏళ్ల వయసులోనే ఒక టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 22 సంవత్సరాల వయసులో మంచి లాభంతో దాన్ని ఓ బహుళజాతి సంస్థకు విక్రయించినట్లు తెలిపారు.వ్యూహాత్మక పెట్టుబడులుముంబయిలోని మిథిబాయి కాలేజీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో పట్టా పొందిన వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం తన వద్ద ఉన్న సంపదను రెండు భాగాలు విభజించినట్లు చెప్పారు. 60 శాతం సంపదను స్థిరంగా ఆదాయం సమకూర్చే విభాగాల్లో పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. మరో 40 శాతం సంపదను ప్రైవేట్ ఈక్విటీ, రియల్ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నట్లు, ఆకర్షణీయ స్టార్టప్‌ల్లో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాలతో ప్రయోగాత్మక పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: రైల్వే కొత్త రూల్.. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..రియల్ ఎస్టేట్: వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో దృష్టి సారించి కర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్థాపించారు.డైమండ్ బిజినెస్: దేశవ్యాప్తంగా 18 స్టోర్లతో సోలిటారియో అనే డైమండ్ కంపెనీని స్థాపించారు.ఈవెంట్ మేనేజ్మెంట్: వివేక్ ‘మెగా ఎంటర్టైన్మెంట్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించారు.ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్: సుమారు రూ.3,400 కోట్ల (సుమారు 400 మిలియన్ డాలర్లు) విలువైన ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు.ఫ్యామిలీ కార్యాలయం: ‘ఒబెరాయ్ ఫ్యామిలీ ఆఫీస్’ ద్వారా పెట్టుబడులను మేనేజ్ చేస్తున్నారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య బెంచ్‌మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 101.13 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 80,582.97 వద్ద, నిఫ్టీ 36.85 పాయింట్లు లేదా 0.15 శాతం క్షీణించి 24,299.15 వద్ద ఉన్నాయి.సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 18 నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ నేతృత్వంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్ & టూబ్రో, మారుతీ సుజుకి ఇండియా, అదానీ పోర్ట్స్& సెజ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఐటీసీ, టైటాన్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా నేతృత్వంలోని 22 లాభాలతో ట్రేడవుతున్నాయి. వీటిలో నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కాంకర్డ్ ఎన్విరో ఐపీవో ఎప్పుడంటే?
కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీవో డిసెంబర్ 19, 2024న ప్రారంభమవుతుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.500.33 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఫ్రెష్ షేర్ల ఇష్యూ మాత్రమే కాకుండా.. ఆఫర్ ఫర్ సేల్ (OFS) కూడా ఉంటుంది.ఐపీవో కోసం సబ్స్క్రిప్షన్ విండో 2024 డిసెంబర్ 19న ప్రారంభమై.. డిసెంబర్ 23తో ముగుస్తుంది. పెట్టుబడిదారులు షేర్ల కేటాయింపు డిసెంబర్ 24న ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఈ ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ. 665 నుంచి రూ. 701 వరకు ఉండవచ్చు. పెట్టుబడిదారులు కనీసం 21 షేర్లను కలిగి ఉన్న ఒక లాట్‌కి వేలం వేయవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లకు కనీస పెట్టుబడి రూ.14,721. చిన్న నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కనీసం 14 లాట్ల (294 షేర్లు) కోసం దరఖాస్తు చేసుకోవాలి.జూలై 1999లో ప్రారంభమైన కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్.. జీరో-లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) వంటి సాంకేతికతలతో సహా నీరు, మురుగునీటి శుద్ధి కోసం పరిష్కారాలను అందిస్తుంది. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని కలిగి ఉంది. ఇది నీటి పునర్వినియోగం కోసం స్థిరమైన పరిష్కారాలను అందించడం ద్వారా పరిశ్రమలకు సేవలు అందిస్తుంది. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,064.12 పాయింట్లు లేదా 1.30 శాతం నష్టంతో 80,684.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 332.25 పాయింట్లు లేదా 1.35 శాతం నష్టంతో 24,336.00 వద్ద నిలిచాయి.సిప్లా, విప్రో, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీసీ కంపెనీ, ఇన్ఫోసిస్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీఓ గురించి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది.పబ్లిక్ ఇష్యూ విషయానికొస్తే...పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి. ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది.పబ్లిక్ ఇష్యూకి వచ్చే కంపెనీలు తమ షేర్లకు ఒక ముఖవిలువ (ఫేస్‌వాల్యూ) నిర్ధారిస్తాయి. అప్పటికి ఆ కంపెనీస్థాయి, అది చేస్తున్న వ్యాపారం, మార్కెట్లో దాని ఉత్పత్తులకు ఉండే డిమాండ్ వంటి విభిన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని సంస్థకు ఒక విలువను నిర్ధారిస్తాయి. కంపెనీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ని షేర్లు జారీ చేయాలో (కంపెనీలో ఎంత వాటా అమ్మకానికి పెట్టాలో) నిర్ణయించుకుంటాయి. దానికి అనుగుణంగా సెబీని సంప్రదించి తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఒకసారి సెబీ ఇష్యూకి క్లియరెన్స్ ఇచ్చి, ఎక్స్ఛేంజీల ఆమోదం పొందిన తర్వాత మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా 3-5 రోజులపాటు ఇష్యూ అందుబాటులో ఉంటుంది. వివిధ సందర్భాలు, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10 రోజులలోపు ఇష్యూ పూర్తి చేయవచ్చు.ఇన్వెస్టర్లు పరిగణించాల్సిన విషయాలు..1. ఇష్యూ లాట్ సైజ్ 2. ఇష్యూధర.. అంటే కంపెనీ ఒక్కో లాట్‌కు ఎన్ని షేర్లు ఆఫర్ చేస్తుంది.. ఎంత ధరకు ఆఫర్ చేస్తుంది అనే వివరాలు. ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ (సాధారణ ఇన్వెస్టర్లు) ఒక్కొక్కరు రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఉదా: x అనే కంపెనీ రూ.100-120 ధరల శ్రేణితో ఇష్యూకి వచ్చింది అనుకుందాం. సాధారణంగా గరిష్ట ధరకే షేర్ల కేటాయింపు జరుగుతూ ఉంటుంది కాబట్టి రూ.120 పరిగణనలోకి తీసుకుందాం. అలాగే 100 షేర్లను ఒక లాట్‌గా నిర్ధారించి జారీ చేస్తుంది అనుకుంటే మనం రిటైల్ ఇన్వెస్టర్లం కాబట్టి రూ.120 గరిష్ట ధరకు మనకు షేర్లు అలాట్ అవ్వాలంటే గరిష్టంగా 16 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో ఆ ఇష్యూకి ఉండే డిమాండ్, దానికి అనుగుణంగా సబ్స్క్రిప్షన్ ఏ స్థాయిలో జరిగింది అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని మనకు షేర్ల అలాట్మెంట్ జరుగుతుంది. 10 రెట్లు, 20 రెట్లు.. ఇలా సబ్‌స్రైబ్ అయితే మనకు కేటాయించే లాట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి ఒకటే లాట్ అలాట్ కావొచ్చు. ఒక్కోసారి అది కూడా కాకపోవచ్చు.షేర్లు అలాంట్ అవ్వాలంటే..మీరు దరఖాస్తు చేసుకోవాలనుకునే కంపెనీ ఇష్యూకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిసి, ఎలాగైనా కొన్ని షేర్లు మీకు అలాట్ అవ్వాలంటే మీ కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ప్యాన్ వివరాలతో ఇలా వివిధ అకౌంట్లతో దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో షేర్లు అలాట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అంతే తప్పా మీపేరుపైనే ఒకటి కంటే ఎక్కవ లాట్ల కోసం దరఖాస్తు చేసుకోకూడదు. అలా చేస్తే మొదటికే మోసం జరుగుతుంది. అధికమొత్తంలో షేర్లు అలాట్ అవ్వకపోగా, కనీసం ఒక లాట్కూడా వచ్చే అవకాశం ఉండదని గుర్తుంచుకోవాలి.రిస్కులులేవా..?ఇష్యూ పూర్తయిన మూడు రోజుల తర్వాత బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో సదరు కంపెనీ షేర్లు లిస్ట్ అవుతాయి. ఐపీఓకి దరఖాస్తు చేయడం వల్ల రిస్కులు, ప్రయోజనాలూ ఉంటాయి. ఐపీఓలో అలాట్ అయినా షేర్లు లిస్టింగ్ రోజున పడిపోతే ఆ నష్టాన్ని భరించడంకానీ, వాటిని కొనసాగించడంగానీ చేయాల్సి ఉంటుంది. అదే లాభాల్లో ట్రేడ్ అవుతుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!త్వరలో ఐపీఓకి రానున్న కంపెనీలు..వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ఇష్యూ ప్రారంభం 20 డిసెంబర్ఇష్యూ ముగింపు 24 డిసెంబర్ మమతా మెషినరీ లిమిటెడ్ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్ఇష్యూ ముగింపు 23 డిసెంబర్ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెట్ఇష్యూ ప్రారంభం 19 డిసెంబర్ఇష్యూ ముగింపు 23 డిసెంబర్-బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్, నిపుణులు -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 24,563కు చేరింది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 81,402 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.78 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 1.24 శాతం ఎగబాకింది.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవో బాటలో 3 కంపెనీలు
ప్రస్తుత కేలండర్ ఏడాది(2024)లో ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. గత వారం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ వారం మరో 4 కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో తాజాగా లక్ష్మీ డెంటల్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో 2 కంపెనీలు లిస్టింగ్‌కు అనుమతించమంటూ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. మరోపక్క ఎన్లాన్ హెల్త్‌కేర్ అక్టోబర్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. వివరాలు చూద్దాం..ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకరేజీ కంపెనీ.. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 745 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. వీటిలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బ్రోకింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్టుల పంపిణీ తదితర విస్తారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఆనంద్ రాఠీ బ్రాండుతో కంపెనీ ఆఫర్ చేస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్, హెచ్ఎన్ఐలకు సేవలు సమకూర్చుతోంది. గతేడాది(2023–24) ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 682 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా దాదాపు రెట్టింపై రూ. 77 కోట్లను దాటింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 442 కోట్ల ఆదాయం, రూ. 64 కోట్ల నికర లాభం అందుకుంది.జీకే ఎనర్జీసౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్ కంపెనీ.. జీకే ఎనర్జీ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 84 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 422 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సౌర విద్యుత్ వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్‌కు సంబంధించి ఈపీసీ సేవలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పీఎం–కేయూఎస్యూఎం పథకంలో భాగంగా సర్వీసులు సమకూర్చుతోంది. జల్‌జీవన్ మిషన్కింద నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. 2024 అక్టోబర్‌కల్లా రూ. 759 కోట్ల ఆర్డర్‌బుక్‌ను సాధించింది. గతేడాది(2023–24) ఆదాయం 44 శాతం ఎగసి రూ. 411 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 36 కోట్లకు జంప్‌చేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 422 కోట్ల ఆదాయం, రూ. 51 కోట్ల నికర లాభం అందుకుంది.లక్ష్మీ డెంటల్ రెడీసెప్టెంబర్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన లక్ష్మీ డెంటల్ తాజాగా అనుమతి పొందింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ బిజ్డెంట్ డివైసెస్‌లో పెట్టుబడులకు, కొత్త మెషీనరీ కొనుగోలుకి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎండ్టుఎండ్ సమీకృత డెంటల్ ప్రొడక్టుల కంపెనీ ఇది. ఎలైనర్ సొల్యూషన్స్, పీడియాట్రిక్ డెంటల్ తదితర పలు ఉత్పత్తులను రూపొందిస్తోంది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 384.55 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 81,748.57 వద్ద, నిఫ్టీ 100.05 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 24,668.25 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. సెషన్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 63.95 పాయింట్లు లేదా 0.08 శాతం క్షీణించి 82,069 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 24,770 వద్ద చలిస్తున్నాయి.ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నందున భారతదేశంలోని స్టాక్ మార్కెట్లు జాగ్రత్తగా కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లకు ఈ వారం.. ఇవే కీలకం!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు దిక్సూచిగా నిలిచే అవకాశముంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు.వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. వెరసి విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు.ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి. రేపు(17న) యూఎస్ రిటైల్ సేల్స్, 18న జపాన్ వాణిజ్య గణాంకాలు తెలియనున్నాయి. వారాంతాన(20న) నవంబర్ ద్రవ్యోల్బణ రేటును జపాన్ ప్రకటించనుంది.ఆర్థిక గణాంకాలునేడు(16న) దేశీయంగా నవంబర్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ 2.36 శాతం పెరిగింది. ఇదే రోజు వాణిజ్య గణాంకాలు సైతం విడుదల కానున్నాయి. అక్టోబర్‌లో వాణిజ్య లోటు 24.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్‌లో త యారీ పీఎంఐ 57.5కు చేరగా, సర్వీసుల పీఎంఐ 58.5ను తాకింది. గత వారమిలా శుక్రవారం(13)తో ముగిసిన గత వారం దేశీ స్టాక్ ఇండెక్సులు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 424 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 82,133 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు(0.4 శాతం) మెరుగై 24,768 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.2 శాతం బలపడితే.. స్మాల్ క్యాప్ ఇదేస్థాయిలో నీరసించింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో 5 కంపెనీలు బలపడగా.. మరో 5 దిగ్గజాలు నీరసించాయి.దీంతో వీటి మార్కెట్ విలువ నికరంగా రూ. 1.13 లక్షల కోట్లమేర బలపడింది. ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 47,837 కోట్లు, ఇన్ఫోసిస్ విలువ రూ. 31,827 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 11,888 కోట్లు చొప్పున ఎగసింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ విలువకు రూ. 11,761 కోట్లు, టీసీఎస్‌కు రూ. 9,805 కోట్లు చొప్పున జమయ్యింది. అయితే ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ. 52,032 కోట్లు, ఎల్ఐసీ విలువ రూ. 32,068 కోట్లు, హెచ్‌యూఎల్ విలువ రూ. 22,561 కోట్లు చొప్పున క్షీణించింది. -
ఐపీవో బాటలో రెండు కంపెనీలు
వినియోగించిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను పునరుద్ధరించే జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 825 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 97 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 320 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 260 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండుతో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్లు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తదితరాల పునర్వినియోగానికి వీలైన వేల్యూ చైన్‌ను నిర్వహిస్తోంది. విక్రయాలు, అమ్మకాల తదుపరి సర్వీసులు, వారంటీ సేవలు అందిస్తోంది. కొత్త ప్రొడక్టులతో పోలిస్తే 35–50 శాతం తక్కువ ధరలకే అందిస్తోంది. భారత్‌సహా యూఎస్, యూరప్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఎలిగంజ్ ఇంటీరియర్స్ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్ఎస్ఈ ఎమర్జ్ వద్ద ఎలిగంజ్ ఇంటీరియర్స్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 60.05 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఐపీఓ అనంతరం షేర్లను ఎన్ఎస్ఈ ఎమర్జ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో నమోదు చేస్తామని పేర్కొంది.సమీకరించిన నిధుల్లో రూ.25 కోట్లు రుణాలను చెల్లించేందుకు, రూ.30 కోట్లు మూలధన వ్యయానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని వివరించింది. ఈ ఇష్యూకు వివ్రో ఫైనాన్సియల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. ఎలిగంజ్ ఇంటీరియర్స్ దేశవ్యాప్తంగా కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు ఇంటీరియర్ ఫిట్ అవుట్ సేవలు అందిస్తోంది. -
పెట్టుబడులకు మరోమార్గం... మ్యూచువల్ ఫండ్స్
విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి. చెట్లుగా.. ఆపై వృక్షాలుగా ఎదుగుతాయి. పూలు, పళ్ళు ఇస్తాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదు.డబ్బులకూ అదే సూత్రం వర్తిస్తుంది. డబ్బులు నాటితే డబ్బులు మొలకెత్తుతాయి. ఆపై అవి లక్షలు, కోట్లుగా రూపాంతరం చెందుతాయి. ఇది కూడా ఒక్ కరోజులో జరిగే పని కాదు. మన కష్టార్జితాన్ని ఇంతలింతలు చేసుకోవడానికి ఎలాంటి సాధనాలు ఎంచుకోవాలి అన్నదే ప్రధాన ప్రశ్న.మీరు అధ్యయనం చేసి... నిపుణుల సలహా తీసుకుని..తెలివి తేటలతో వ్యవహరించి పెట్టుబడులు పెట్టగలిగితే.. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మన సొమ్ములు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే సాధనాలు ఏవో తెలిసి ఉండాలి. దాని కంటే ముందే మీదగ్గరున్న డబ్బుల నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో కూడా మీకు తెలిసి ఉండాలి. లేదంటే ఏళ్ళుగడిచినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరి మీ జీవితం ఎదుగూ బొదుగూ ఉండదు.తాము చేసే పొదుపు బాగా పెరగాలని, రెట్టింపు అవ్వాలని ఎవరు అనుకోరు చెప్పండి. మీరూ ఇందుకు మినహాయింపు కాదంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... కాస్త రిస్క్ తీసుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉండటం. కొద్దిగా రిస్క్ తీసుకోగలిగి... దీర్ఘకాలంపాటు వేచిఉండేవాళ్ళకు అనువైన పెట్టుబడి సాధనంగా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు.స్టాక్ మార్కెట్లో 100% రిస్క్ తీసుకోలేనివాళ్లకు ఉపయుక్తమైన పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్స్. మనం ఈ ఫండ్స్‌లో సరైన వాటిని ఎంచుకుని పెట్టుబడి పెడితే కొన్నాళ్ళకు అవి మంచి రాబడి అందిస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి.1. సిప్స్2. పెద్దమొత్తంలో ఒకేసారి పెట్టుబడిమీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీను ఎంచుకుని నెలకు కొంత మొత్తం చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఇదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). అధిక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టలేని వాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మీచేతిలో తగినంత మొత్తం ఉండి పెద్దమొత్తంలో పెట్టి దీర్ఘకాలం వేచి ఉంటే మంచి రాబడి పొందడం రెండో మార్గం.ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి?మ్యూచువల్ ఫండ్స్‌ను వివిధ టాటా, బిర్లా, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రముఖ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే మనపెట్టుబడికి తగ్గట్టు, స్థిరంగా రాబడి అందివ్వగల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. యాంఫి (AMFI) వెబ్సైటులో ఫండ్స్ కు సంబంధించిన యావత సమాచారం దొరుకుతుంది.ప్రస్తుతం దేశంలో వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తున్న స్కీంల్లో ప్రధానమైనవాటిగా ఈకింది వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. » ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్» ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ & మిడ్ క్యాప్ ఫండ్» టాటా ఈక్విటీ పీఈ ఫండ్» హెచ్డీఎఫ్సీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్» ఎల్&టీ టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్» ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్» కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్» కెనరా రోబెకో గిల్టీ పీజీఎస్» డీఎస్పీ బ్లాక్‌రాక్ బ్యాలెన్స్డ్ ఫండ్» యాక్సిస్ లిక్విడ్ ఫండ్వీటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి ఎంతెంత రాబడి అందిస్తున్నాయి, రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది, పెట్టుబడి ఎలా పెట్టాలి, కాలావధి, వివిధ రేటింగ్ సంస్థలు ఇచ్చిన రేటింగ్, గతకాలపు పనితీరు.... ఇత్యాది అంశాలు సంపూర్ణంగా విశ్లేషించుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.ఇక అధిక రిస్క్‌తోపాటు అధికరాబడి ఇస్తున్న ఫండ్స్ విషయానికొస్తే... » హెచ్ఎస్బీసీ మిడ్ క్యాప్ ఫండ్» కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్» ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్» యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్» ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్» మిరే అసెట్ మిడ్ క్యాప్ ఫండ్» టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌పై వాటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు, ఇక మహీంద్రా మేన్యూ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్, సుందరం మిడ్ క్యాప్ ఫండ్ లు 30 శాతంపైగా వార్షిక రిటర్న్ లు అందిస్తున్నాయి. సిప్ పెట్టుబడుల విషయానికొస్తే... గత అయిదేళ్లుగా ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 30 శాతంపైగా రాబడి ఇస్తోంది.మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి?మ్యూచువల్ ఫండ్స్ మీ దగ్గర సమీకరించిన సొమ్ముల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాచేయడానికి ముందే మీ రిస్క్ కెపాసిటీ, మీ ఆలోచనలు, రాబడి అంచనాలు... వంటి సమాచారాన్ని మీ దగ్గర నుంచి సేకరిస్తాయి. తదనుగుణంగా మీ సొమ్ముల్ని వివిధ పెట్టుబడి మార్గాల్లోకి మళ్లిస్తాయి.» సెక్టోరియల్ ఫండ్స్» టాక్స్ సేవింగ్ ఫండ్స్» ఇండెక్స్ ఫండ్స్» డెట్ ఫండ్స్» స్మాల్ క్యాప్ ఫండ్స్» మిడ్ క్యాప్ ఫండ్స్» లార్జ్ క్యాప్ ఫండ్స్ఇలా భిన్నమైన మార్గాల్లో మీ సొమ్ములను ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా వచ్చే రాబడిని మీకు బదిలీ చేస్తాయి (ట్యాక్స్‌లు, కమీషన్లు, చార్జీలు వసూలు చేసుకుని).స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తక్కువే ఉంటుంది. కానీ రాబడి కూడా అదేస్థాయిలో ఉంటుంది. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఫండ్ స్కీంలకు సంబంధించిన సమాచారాన్ని మదింపు చేసిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. వివిధ ఫండ్లకు సంబంధించి విశ్లేషణాత్మక సమాచారాన్ని రాబోయే రోజుల్లో తెలుసుకుందాం.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి!
స్టాక్ మార్కెట్లో మదుపర్లు శుక్రవారం ప్రారంభ సమయం నుంచి తమ షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. దాంతో ఉదయం 11.45 సమయం వరకు సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పడిపోయింది. గత సెషన్ ముగింపు వరకు మార్కెట్ విలువ మొత్తంగా రూ.458 లక్షల కోట్లు ఉండగా, ఈరోజు సూచీలు నేల చూపులు చూస్తుండడంతో పెట్టుబడిదారుల సంపద రూ.4 లక్షల కోట్లు తగ్గి రూ.454 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ 368 పాయింట్లు జారి 24,180 వద్దకు పడిపోయింది.స్టాక్ మార్కెట్ పతనానికిగల కారణాలు..విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలు: ఎఫ్ఐఐలు నిన్నటి మార్కెట్ సెషన్లో రూ.3,560 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. ఇటీవల కాలంలో కొంత తక్కువ మొత్తంలో అమ్మకాలు చేసిన ఎఫ్ఐఐలు తిరిగి భారీగా విక్రయాలకు పూనుకోవడం మార్కెట్ నెగెటివ్‌గా పరిగణించింది.బలహీనమైన రూపాయి: రూపాయి జీవితకాల కనిష్టాన్ని తాకింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 84.83కు చేరింది. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలను మరింత పెంచింది.గ్లోబల్ మార్కెట్ బలహీనత: అమెరికా, యూరప్, జపాన్, చైనా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. వాటి ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై పడినట్లు నిపుణులు చెబుతున్నారు.రంగాలవారీ క్షీణత: బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ వంటి రంగాలకు సంబంధించి మార్కెట్లో అధిక వాటాలున్న ప్రధాన షేర్లు భారీగా పతనమయ్యాయి.పారిశ్రామికోత్పత్తి సూచీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈసారి భారీగా కొలుకుంటుందని మార్కెట్ ఊహించింది. అయితే, ఈ సూచీ గతంలో కంటే కోలుకున్నా కాస్త నెమ్మదించింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐరిలయన్స్ షేర్లు ఢమాల్..నిఫ్టీలో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ వారంలో భారీగా క్షీణించింది. గడిచిన ఐదు సెషన్‌ల్లో 4.47 శాతం, అదే ఆరునెలల్లో 14.55 శాతం పడిపోయింది. అందుకుగల కారణాలను మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్, ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ) సెగ్మెంట్లు ఊహించిన దానికంటే బలహీనమైన పనితీరును కనబరిచినట్లు నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుకోవడం కాస్తా నెమ్మదించింది. అంతకుముందు వీటి సంఖ్యను గణనీయంగా పెంచుతామని కంపెనీ పేర్కొంది. దానికితోడు ఏడాది కాలంలో పుంజుకున్న మార్కెట్లో క్రమంగా లాభాల స్వీకరణ పెరుగుతోంది. రిలయన్స్ వంటి కంపెనీల్లో ఎఫ్ఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగానే పెట్టుబడి పెట్టారు. వీరిలో చాలామంది ఇటీవల ప్రాఫిట్బుక్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 843.16 పాయింట్లు లేదా 1.04 శాతం లాభంతో 82,133.12 వద్ద, నిఫ్టీ 219.60 పాయింట్లు లేదా 0.89 శాతం లాభంతో 24,768.30 వద్ద నిలిచాయి.భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ కంపెనీ, హిందూస్తాన్ యూనీలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ 161 పాయింట్లు నష్టపోయి 24,382కు చేరింది. సెన్సెక్స్ 581 పాయింట్లు దిగజారి 80,688 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.9 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.66 శాతం దిగజారింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రాన్స్‌రైల్ లైటింగ్ ఐపీవో 19న..
న్యూఢిల్లీ: ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధిత ఈపీసీ కంపెనీ ట్రాన్స్‌రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ఆజన్మా హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది.ప్రస్తుతం ప్రమోటర్లకు 83.22 శాతం వాటా ఉంది. ఈ నెల 18న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. స్ట్రక్చర్స్, కండక్టర్స్, మోనోపోల్స్ తదితర సమీకృత తయారీ సౌకర్యాలను కంపెనీ కలిగి ఉంది.రూ. 2,000 కోట్లపై కన్ను విమానాశ్రయాలలో ట్రావెల్ క్విక్ సర్వీసు రెస్టారెంట్లు, లాంజ్ బిజినెస్ నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రధా నంగా భారత్, మలేషియాలో కంపెనీ సర్వీసులు అందిస్తోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ కపూర్ కుటుంబ ట్రస్ట్ రూ. 2,000 కోట్ల విలువైన వాటాను విక్రయానికి ఉంచనుంది.దీంతో ఐపీవో ద్వారా కంపెనీ కాకుండా ప్రమోటర్ సంస్థ నిధులు సమకూర్చుకోనుంది. ప్రమోటర్లలో ఎస్ఎస్పీ గ్రూప్‌సహా.. కపూర్ కుటుంబ ట్రస్ట్, వరుణ్ కపూర్, కరణ్ కపూర్ ఉన్నారు. ఎస్ఎస్పీ లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ లిస్టయిన కంపెనీ. ఆదాయంరీత్యా 2024లో గ్లోబల్ ట్రావెల్ ఫుడ్, పానీయాల విభాగంలో దిగ్గజంగా నిలిచినట్లు రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. -
షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టాలపాలై చివరకు ప్రాణాలు వదులుతున్న ఘటనలు చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ నిజంగానే అంత ప్రమాదకరమా? మార్కెట్లో అడుగుపెట్టిన వారికి ఈ పరిస్థితి రావాల్సిందేనా? మార్కెట్ ముంచేస్తుందా? మరి లాభాలు ఎవరికి వస్తున్నాయి? నష్టాలు వస్తున్నవారు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? అనే చాలా ప్రశ్నలొస్తాయి. వీటిని విశ్లేషించి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.స్టాక్ మార్కెట్ అద్భుత సాధనంస్టాక్ మార్కెట్ ఎప్పటికీ ప్రమాదకరం కాదు. పైగా మంచి రాబడి ఇవ్వడానికి మనకు అందుబాటులో ఉన్న ఒక అద్భుత సాధనం. ఓ పక్క కుటుంబం ప్రాణాలు వదులున్న ఘటనలున్నాయని చెప్పారు కదా. మరి స్టాక్ మార్కెట్ బెటర్ అని ఎలా చెబుతారు? అని ప్రశ్నించొచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వెంటనే రాబడి రావాలంటే చాలా కష్టం. మార్కెట్ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంటుంది. కాబట్టి సరైన సమయం ఇచ్చి రాబడి ఆశించాలి. లార్జ్ క్యాప్ స్టాక్ల్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే దాదాపు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు తొందరగానే రావొచ్చు. నష్టాలు కూడా తీవ్రంగానే ఉండొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తకొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్(అంతర్గత సమాచారంతో చేసే ట్రేడింగ్) జరుగుతుంటుంది. అది నిబంధనలకు విరుద్ధం. అది సాధారణ ఇన్వెస్టర్లకు తెలియక పోవచ్చు. దాంతో పెన్నీ స్టాక్ బాగా ర్యాలీ అవుతుందనే ఉద్దేశంతో అందులో పెట్టుబడి పెట్టి చివరకు నష్టాలతో ముగించాల్సి ఉంటుంది. కాబట్టి పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు వాటి వైపు చూడకపోవడం ఉత్తమం.ఎవరో చెప్పారని..చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే వెంటనే లాభాలు వచ్చేయాలి.. తక్కువ మొత్తం పెట్టుబడితో అధికంగా లాభాలు ఆర్జించాలనే ఆశతో మార్కెట్లోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారు తొందరగానే నష్టాలు మూటగట్టుకుంటారు. కాసింత లాభం కళ్ల చూడగానే మార్కెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని అనుకుంటారు. కానీ చాలామందికి స్టాక్స్‌కు సంబంధించి సరైన అవగాహన ఉండడం లేదు. ఎవరో చెప్పారని, ఏదో ఆన్లైన్లో వీడియో చూశారని, వాట్సప్, టెలిగ్రామ్.. వంటి ఛానల్లో ఎవరో సజెస్ట్ చేశారని పెట్టుబడి పెడుతున్నవారు చాలా మంది ఉన్నారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిస్టాక్ మార్కెట్లో తాము ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఎందుకు పెరుగుతోందో చాలామందికి తెలియదు. అది ఇంకెంత పెరుగుతుందో అవగాహన ఉండదు. ఎప్పుడు పడుతుందో తెలియదు. నిన్నపెరిగింది కదా.. ఈరోజు పడుతుందిలే.. లేదంటే.. నిన్న పడింది కదా.. ఈరోజు పెరుగుతుందిలే..అని సాగిపోతుంటారు. దాంతో భారీగా క్యాపిటల్ కోల్పోవాల్సి వస్తుంది. అప్పటికీ తేరుకోకపోగా ఫర్వాలేదు.. పూడ్చేద్దాం అనుకుంటారు. ఆ నష్టం పూడకపోగా.. మరింత పెరుగుతుంది. అప్పు చేస్తారు. ఎలాగైనా సంపాదించి తీర్చేద్దాం అనుకుంటారు. అదీ జరగదు. క్రమంగా అప్పులు పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది. చివరకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..దీర్ఘకాలిక దృక్పథం అవసరంట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయాలి. స్టాక్మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అనేది నిజం. కానీ నిమిషాల్లో సంపాదించేయలేం. ఓపిక ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం అవసరం. అప్పుడే ఎవరైనా మార్కెట్లో రాణించగలుగుతారు. లేదంటే ఆషేర్లే మెడకు ఉరితాళ్ళుగా మారి కుటుంబాల్ని విషాదాల్లో నింపేస్తాయి.డబ్బు ఎవరు సంపాదిస్తున్నారంటే..మార్కెట్ తీరుతెన్నులను ఓపిగ్గా గమనిస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేరుగా డబ్బు పెట్టి ట్రేడింగ్ చేయడం కంటే కనీస ఆరు నెలలపాటు పేపర్ ట్రేడింగ్ చేయాలి. దాంతో అవగాహన వస్తుంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా కంపెనీలు కాన్కాల్ ఏర్పాటు చేస్తాయి. అందులో పాల్గొనాలి. ఒకవేళ అవకాశం లేకపోతే తర్వాత రెగ్యులేటర్లకు ఆయా వివరాలను అప్డేట్ చేస్తాయి. ఆ డాక్యుమెంట్లు చదవాలి. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..రెవెన్యూ అంశాలు ఎలా ఉన్నాయి.. క్యాష్‌ఫ్లోలు ఎలా ఉన్నాయి.. అనుబంధ సంస్థలతో జరిపే రిలేటెడ్ పార్టీ లావాదేవీలు ఎలా ఉన్నాయి.. కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు.. పోటీలో ఉన్న కంపెనీలు, వాటి విధానం.. కాలానుగుణంగా సరైన సెక్టార్‌లోని స్టాక్‌లనే ఎంచుకున్నామా.. వంటి చాలా అంశాలను పరిగణించి పెట్టుబడి పెట్టాలి. అలా చేసిన తర్వాత దీర్ఘకాలంపాటు వేచిచూస్తేనే మంచి రాబడులు అందుకోవచ్చు.- బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్ నిపుణులు -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 236.18 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 81,289.96 వద్ద, నిఫ్టీ 93.10 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 24,548.70 వద్ద నిలిచాయి.అదానీ ఎంటర్ప్రైజెస్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో నిలువగా.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), హిందూస్తాన్ యూనీలీవర్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 24,646కు చేరింది. సెన్సెక్స్ 53 పాయింట్లు ఎగబాకి 81,591 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.63 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.82 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం పుంజుకుంది.దేశీయంగా అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 53.82 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 81,563.87 వద్ద, నిఫ్టీ 4.10 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 24,614.15 ప్రారంభమయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభంతో 24,641 వద్దకు, సెన్సెక్స్ 16 పాయింట్లు పుంజుకుని 81,526 వద్దకు చేరింది.మార్కెట్ ముగింపు సమయానికి బ్యాంకింగ్ రంగ స్టాక్‌లు నష్టల్లోకి వెళ్లాయి. ఐటీ స్టాక్‌లు రాణించాయి. కెమికల్ స్టాక్‌లో ఒకే రేంజ్బౌండ్లో కదలాడాయి. స్టీల్ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock market: ఈ ట్రాప్‌లో పడకండి
స్టాక్ మార్కెట్లో ఏమాత్రం అనుభవం లేకుండా డబ్బులు సంపాదించేయాలి అనుకుంటే అంతకుమించిన బుద్ధి పొరపాటు మరోటి ఉండదు. మిమ్మల్ని ఎలా ట్రాప్ లో ఇరికించి పబ్బం గడుపుకొంటారో మీకు అర్ధమయ్యేలా చెబుతా.. దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. నాకు తెల్సిన ఒక మిత్రుని కథ అనుకోండి... వ్యథ అనుకోండి... అదెలాగో చెబుతా...నాకు బాగా కావాల్సిన మిత్రుడే... అతనికి అంతో ఇంతో స్టాక్ మార్కెట్ నాలెడ్జి ఉంది.. తన దగ్గరున్న డబ్బులతో కాస్తో కూస్తో బాగానే సంపాదించుకుంటున్నాడు. ఎప్పటినుంచో సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక.అందుకు తగ్గట్టే నాలుగు రూపాయలు రెడీ చేసుకుని... బ్యాంకు లోన్ కూడా తీసుకుని ఇంటి పనులు మొదలెట్టాడు. అవి చివరి దశకు వచ్చాయి. ఓ 3 లక్షలు ఎక్సట్రా కావాల్సి వస్తే ఓ మిత్రుడి దగ్గర 3 రూపాయల వడ్డీకి చేబదులు తీసుకున్నాడు. అంటే నెలకు రూ.9,000 వడ్డీ.కూలీల సమస్యో, తగిన మెటీరియల్ దొరక్కో మధ్యలో పనులు ఓ 15 రోజులు ఆగిపోయాయి. ఇదే అతని కొంప ముంచింది... ఇప్పుడతను... రూ. 4 వడ్డీకి (అంటే నెలకు రూ. 12,000) అప్పు తెచ్చి ఆ పాత బాకీ తీర్చి కొత్త బాకీ నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే...అసలేం జరిగి ఉంటుందో తెలియాలి. ముందే చెప్పానుగా...మనవాడికి స్టాక్ మార్కెట్ గురించి కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉందని. ఇంటి పనులకు 15 రోజులు గ్యాప్ రావడం కూడా అతని బుర్రని ఖరాబు చేసింది. ఆ 3 లక్షలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టాడు. కనీసం ఓ పాతిక వేలు అయినా సంపాదించుకుందామని. అతని ప్లాన్ బాగానే పనిచేసింది.కేవలం పది రోజుల్లోనే పాతిక కాదు... 50 వేలు పైనే సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతలో... ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. అవతలివైపు నుంచి...హలో సర్..చెప్పండి..మేము xyz ట్రేడింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండీ ... మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారా...? అవతలి వ్యక్తి ప్రశ్న. మనవాడు కూడా మార్కెట్ పండితుడిగా... వాళ్ళేం చెబుతారో విందామని...అవునండీ చేస్తున్నా...ఎందులో చేస్తారు... ఇండెక్స్ లోనా... స్టాక్స్ లోనా...రెండూ..మీ క్యాపిటల్ ఎంతో తెలుసుకోవచ్చా...3 లక్షలు..ట్రేడింగ్ లో రోజుకెంత సంపాదిస్తారు...?4000 -5000 దాకా...అంత తక్కువా...? మీదగ్గరున్న క్యాపిటల్ కి రోజుకు పాతిక వేలు అయినా సంపాదించొచ్చు... మీరు మంచి అవకాశం వదులుకుంటున్నారన్న మాట...(అవతలి వ్యక్తి అన్న మాటకి మనవాడిలో ఎక్కడో అహం దెబ్బతింది. మరోపక్క రోజుకు పాతిక వేలు సంపాదించొచ్చు అన్న మాట ఎక్కడో సూటిగా గుచ్చుకుంది. ఆ క్షణం లోనే అతని మనసు రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. అసలే ఫ్రెండ్ దగ్గర అప్పుచేసి ఉన్నాడు.. రోజుకు పాతిక వేలు అంటే 15 రోజులు తిరిగేసరికి అప్పు మొత్తం తీర్చేయొచ్చు. ఇప్పుడు చేతిలో ఉన్న మూడు లక్షలు ఎటూ ఉండనే ఉంటాయి... ఇలా ఆనుకుంటూనే...అంత ఆశ లేదులెండి... నాకు వచ్చేది చాలు అని చెప్పబోయాడు..అదేంటి సర్... అలా అంటారు.. మార్కెట్ గురించి మీకు నేను చెప్పాలా...? రోజుకి కనీసం పాతిక వేలు దాకా సంపాదించొచ్చు... మీరు సరేనంటే అదెలాగో చెబుతా..(మనవాడిలో ఆశ బలపడింది.) అయితే చెప్పండి..మీరు ఏ బ్రోకరేజ్ సంస్థలో ట్రేడింగ్ చేస్తారు...?ఫలానా దాంట్లో...మీరు మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే చాలు... మేము ఇక్కడ మా సిస్టం నుంచి లాగిన్ అవుతాం. మీ తరపున మేం ట్రేడ్ చేస్తాం. మీ సిస్టం లో లాగిన్ అయ్యి ట్రేడింగ్ ను మీరు కూడా గమనించొచ్చు. వచ్చే లాభాల్లో 30% మాకు, 70% మీకు.. ఏమంటారు?ఇలా అనేసరికి కాస్త ఆలోచనలో పడ్డాడు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇమ్మంటున్నారు... దానివల్ల ప్రమాదం ఏమీ లేదులే... ఎందుకంటే మన ఫండ్స్ మన అకౌంట్ లోనే ఉంటాయి. ఒకవేళ వాడు విత్ డ్రా పెట్టినా... పడేది నా అకౌంట్ లోనే... వాడు చేసే మోసమేమీ లేదు.. పైగా ఇక్కడ నేను కూడా చూసుకుంటూనే ఉంటానుగా.. అని అనుకుంటూనే... ఎందుకైనా మంచిదని... మీ ఆఫీస్ ఎక్కడ ? అని అడిగాడు...హైదరాబాద్ లో సర్.. కూకట్ పల్లి.అడ్రస్ చెబుతారా...? అని అడిగితే అతను అడ్రస్ కూడా చెప్పాడు.అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటూ... అవతలి వ్యక్తి ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఒప్పుకున్నాడు. వెంటనే ఆ డీటెయిల్స్ అవతలివాని చేతిలో పెట్టాడు. అప్పటికి అతని డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న మొత్తం రూ.. 3,55,000. ఫోన్ కట్ అయింది.. ట్రేడింగ్ మొదలైంది. ఆరోజు రూ. 10,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. బాగానే ఉంది అనిపించింది. సాయంత్రం అవతలి వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు.చూశారుగా మా ట్రేడింగ్... మొదటిరోజు కదా ఎక్కువ చేయలేదు.. రేపటి నుంచి మనం టార్గెట్ తో పనిచేద్దాం సర్... అని చెప్పేసరికి.. మనవాడు ఆనందం తో సరే అంటూ ఫోన్ పెట్టేశాడు.తెల్లారింది.. ట్రేడింగ్ మొదలైంది. కొన్న షేర్లలో లాభాలు వస్తున్నట్లే కనిపించింది.. అంతలోనే నష్టాల్లోకి జారుతున్నట్లు అనిపించింది. ఫర్వాలేదులే అనుకున్నాడు. అలా... అలా... 30,000... 40,000 .... నష్టాల్లోకి కూరుకుపోతున్నట్లే ఉంది.. అవతలివాళ్ళకు ఫోన్ చేస్తే... కంగారుపడకండి సర్... మేమున్నాముగా.. అని చెప్పేసరికి కాస్త ధైర్యం వచ్చింది...ఆ షేర్ కాస్త కోలుకున్నట్లు అనిపించినా.. మళ్ళీ అంతలోనే భారీగా పడిపోయింది. కట్ చేస్తే... సాయంత్రానికి మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయింది.. మధ్యమధ్యలో ఫోన్ చేస్తున్నా... కంగారు పడకండి అన్న సమాధానమే...పోనీ అకౌంట్ తన చేతిలోనే ఉందిగా.. ఇక్కడితో లాస్ బుక్ చేసేసి బయటకు వచ్చేద్దామన్న సాహసం చేయలేకపోయాడు. పైగా అవతలివాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్లకు తెలుసులే... అని చూస్తూ ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా అవతలినుంచి సమాధానమే లేదు.. మర్నాడు కూకట్ పల్లి లో వాడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అలాంటి సంస్థే లేదు. పిచ్చెక్కి పోయింది. ఈ షాక్ నుంచి తేరుకునేసరికి దాదాపు ఆరు నెళ్ళు పట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళ్లట్లేదు కానీ... ఇదీ మావాడి విషాదాధ్యాయం.పొరపాటున కూడా ఇలాంటి ట్రాప్ లో చిక్కుకోకండి..మిమ్మల్ని మీరు నమ్ముకోండి... ీకు తెలిస్తే ట్రేడింగ్ చేయండి... లేదంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి.. అంతవరకు మంచి షేర్లు సెలెక్ట్ చేసుకుని దీర్ఘకాలానికి పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఇవే మీకు భవిష్యత్ లో లాభాలు పూయిస్తాయి.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
నిలకడగా మార్కెట్ సూచీలు
మంగళవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1.59 పాయింట్లు లేదా 0.0019 శాతం లాభంతో 81,510.05 వద్ద, నిఫ్టీ 8.95 పాయింట్లు లేదా 0.036 శాతం నష్టంతో 24,610.05 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,599కు చేరింది. సెన్సెక్స్ 81 పాయింట్లు దిగజారి 81,426 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.61 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.62 శాతం దిగజారింది.దేశీయంగా అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 200.66 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 81,508.46 వద్ద, నిఫ్టీ 58.80 పాయింట్లు లేదా 0.24 శాతం నష్టంతో 24,619.00 వద్ద నిలిచాయి.విప్రో, లార్సెన్ & టూబ్రో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో.. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందూస్తాన్ యూనీలివర్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 24,674కు చేరింది. సెన్సెక్స్ 17 పాయింట్లు దిగజారి 81,682 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.97 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.21 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం లాభపడింది. నాస్డాక్ 0.81 శాతం పుంజుకుంది.దేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)