Sensex
-
Stock Market: చివరికి నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ( NSE) నిఫ్టీ50 వారాంతపు ట్రేడింగ్ సెషన్‌ను లోయర్ నోట్‌తో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 329.92 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 76,190.46 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,985.95 - 76,091.75 రేంజ్లో ట్రేడయింది.సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 113.15 పాయింట్లు లేదా 0.49 శాతం తగ్గి 23,092.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,347.30 వద్ద నమోదు చేయగా, కనిష్ట స్థాయి 23,050 వద్ద కనిపించింది. నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 31 స్టాక్‌లు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా 4.90 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఇదిలా ఉండగా హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ 2.52 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిసిన 19 స్టాక్‌లలో ఉన్నాయి.స్మాల్-క్యాప్ షేర్లు విస్తృత మార్కెట్లలో అత్యంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 2.35 శాతం దిగువన, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.55 శాతం దిగువన ముగిసింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. కొన్ని ప్రారంభ ఒడిదుడుకుల తర్వాత, బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల ధోరణిని ప్రదర్శించాయి. ఆటో, ఐటీ, సిమెంట్‌తోపాటు కొన్ని హెల్త్‌కేర్ షేర్లపై ఆసక్తిని పెంచాయి.బీఎస్ఈ బెంచ్‌మార్క్ సూచీ అయిన సెన్సెక్స్ (Sensex) ప్రారంభ డీల్స్‌లో 76,202 కనిష్ట స్థాయిని తాకింది. ఆపై స్థిరంగా కనిష్ట స్థాయి నుండి 543 పాయింట్లు పెరిగి 76,743 గరిష్ట స్థాయికి ర్యాలీ చేసింది. చివరకు 115 పాయింట్ల లాభంతో 76,520 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (Nifty) వరుసగా 23,271, 23,091 వద్ద గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. 50 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 23,205 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30లో అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 7 శాతం ఎగబాకి రూ. 11,400 స్థాయిలకు చేరుకుంది. ఇక జోమాటో 2.5 శాతం లాభపడగా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ ప్రధాన లాభపడిన షేర్లలో ఉన్నాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ 1 శాతంపైగా క్షీణించాయి.విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం జంప్ చేయగా, స్మాల్‌క్యాప్ 0.7 శాతం పెరిగింది. మిడ్‌క్యాప్ ఐటీ వంటి కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటివి ఒక్కొక్కటి 10 శాతానికి పైగా పెరిగాయి. రంగాల వారీగా ఆటో, ఐటీ, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1 - 2 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. కాగా బ్యాంకింగ్ సంబంధిత సూచీలు తగ్గుముఖం పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: ఒడిదుడుకులు.. ఎట్టకేలకు లాభాలు
ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం ఇంట్రా-డే డీల్స్‌లో రోలర్-కోస్టర్ రైడ్‌ను తలపించాయి. స్థిరంగా ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు క్రమంగా లాభాలను తగస్తూ నష్టాల్లోకి జారిపోయాయి. తర్వాత ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో లాభాల కారణంగా తిరిగి బలంగా పుంజుకున్నాయి.బీఎస్ఈ (BSE) సెన్సెక్స్ 76,114 వద్ద ప్రారంభమైన తర్వాత, లాభాలను తగ్గించి 75,817 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 76,461 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. 567 పాయింట్ల లాభంతో 76,405 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రా-డేలో వరుసగా రెండో రోజు 23,000 మార్క్ దిగువకు పడిపోయింది. సూచీ 22,981 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే చివరకు 131 పాయింట్ల లాభంతో 23,155 వద్ద ముగిసింది.ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మధ్యాహ్న డీల్స్‌తో పుంజుకుంది .ఇతర సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్క, టీసీఎస్ ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో 1-2 శాతం మధ్య ఎగిశాయి. మరోవైపు టాటా మోటార్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. నష్టాలను చవిచూసిన ఇతర ముఖ్యమైన స్టాక్స్‌లో పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఉన్నాయి. విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ 1.6 శాతం పడిపోయింది. రెండు సూచీలు రోజు ద్వితీయార్ధంలో నష్టాల్లో కొంత భాగాన్ని తిరిగి పొందాయి. సెక్టోరియల్ ఇండెక్స్‌లలో - బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ కూడా దాదాపు 2 శాతం క్షీణించింది. మిగతా వాటిలో బుధవారం ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా ర్యాలీ చేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రంప్ టారిఫ్ టెర్రర్
ముంబై: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య టారిఫ్ పెంపు భయాలకు తోడు అధిక వెయిటేజీ షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకటిన్నరశాతానికి పైగా కుప్పకూలాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మరింత ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 1,235 పాయింట్లు పతనమై 75,838 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 23,025 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఏడు నెలల కనిష్టం. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,432 పాయింట్లు క్షీణించి 75,642 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లు పతనమై 22,976 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి 86.58 వద్ద స్థిరపడింది.⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రియల్టీ ఇండెక్స్ 4.2% క్షీణించింది. కన్జూమర్ డ్యూరబుల్స్ 4%, సర్విసెస్, విద్యుత్, టెలికం, యుటిలిటీ ఇండెక్సులు 2.5% పడ్డాయి.నష్టాలకు 4 కారణాలు⇒ ‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.⇒ దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్ (ఎర్కింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.⇒ జొమాటో (–11%)తో సహా అధిక వెయిటేజీ షేర్లు ఐసీఐసీఐ బ్యాంకు (–3%), ఎస్బీఐ (–2.57%), రిలయన్స్ (–2.50%), ఎంఅండ్ఎం (–2.25%) షేర్లు భారీగా క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ మొత్తం పతనంలో ఈ షేర్ల వాటాయే 640 పాయింట్లు. కాగా ఒక్క జొమాటో షేరు వాటా 150 పాయింట్లు కావడం గమనార్హం.⇒ విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దలాల్ స్ట్రీట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి. ఈ కొత్త ఏడాది జనవరి 20 నాటికి ఎఫ్ఐఐలు మొత్తం రూ.48,023 కోట్ల విలువైన భారత ఈక్విటీలు అమ్మేశారు. 7.5 లక్షల కోట్లు ఆవిరిమార్కెట్ భారీ పతనంతో సోమవారం ఒక్కరోజే రూ.7.52 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.424 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో అల్ట్రాటెక్(0.39%), హెచ్‌సీఎల్ టెక్(0.33%) మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. -
లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,071.98 పాయింట్లు లేదా 1.39 శాతం నష్టంతో 76,001.46 వద్ద, నిఫ్టీ 299.45 పాయింట్లు లేదా 1.28 శాతం నష్టంతో.. 23,045.30 వద్ద నిలిచాయి.ట్రెంట్, అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల విజయ పరంపరకు బ్రేక్ వేస్తూ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వారంలో చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 403.24 పాయింట్లు లేదా 0.52 శాతం క్షీణించి 76,639.58 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 77,069.19-76,263.29 రేంజ్లో ట్రేడయింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 108.60 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 23,203.20 వద్ద ముగిసింది. నిఫ్టీ50 23,292.10 వద్ద గరిష్ట స్థాయికి చేరుకోగా, రోజు కనిష్ట స్థాయి 23,100.35 వద్ద నమోదైంది. నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బిపిసిఎల్, హిందాల్కో, హిందాల్కో, కోల్ ఇండియా నేతృత్వంలోని 29 లాభాలతో గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో వంటి 21 షేర్లు నష్టాల్లో ముగిసి 5.75 శాతం వరకు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ హ్యాట్రిక్
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 గురువారం వరుసగా మూడవ సెషన్లో సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 318.74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 77,042.82 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 77,319.50 నుండి 76,895.51 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 98.60 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 23,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.65కి చేరుకోగా, కనిష్ట స్థాయి 23,272.05 వద్ద నమోదైంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ , అదానీ పోర్ట్స్ ఈరోజు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. వీటి లాభాలు 7.99 శాతం వరకు పెరగడంతో నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 33 గ్రీన్‌లో ముగిశాయి.మరోవైపు ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ నేతృత్వంలోని 17 భాగస్వామ్య స్టాక్‌లు 2.90 శాతం వరకు క్షీణించి నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 1 శాతంపైగా పెరగడంతో విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. ఇదిలా ఉండగా, మార్కెట్ అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ 1.35 శాతం పెరిగి 15.17 పాయింట్ల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 273.66 పాయిట్లు లేదా 0.36 శాతం లాభంతో.. 76,773.30 వద్ద, నిఫ్టీ 51.75 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 23,227.80 వద్ద నిలిచాయి.ట్రెంట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు లాభపడి 23,229కు చేరింది. సెన్సెక్స్(Sensex) 252 పాయింట్లు ఎగబాకి 76,767 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 109.23 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం లాభపడింది. నాస్డాక్ 0.2 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్‌లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్‌లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 631.88 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 76,747.02 వద్ద, నిఫ్టీ 206.50 పాయింట్లు లేదా 0.88 శాతం నష్టంతో 23,225.00 వద్ద కొనసాగుతున్నాయి.ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS), బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, SBI లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, ట్రెంట్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ క్షీణించాయి. శుక్రవారం వారాన్ని ప్రతికూల నోట్‌తో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ (Sensex) 241.30 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 77,378.91 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 77,099.55 - 77,919.70 రేంజ్లో ట్రేడయింది.ఇక ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 (Nifty) 95 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,431.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,596.60 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,426.55 వద్ద ఉంది.శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్ నేతృత్వంలోని నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 36 నష్టాలతో ముగిశాయి. మరోవైపు టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ 6 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిసిన 14 స్టాక్‌లలో ఉన్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 2.08 శాతం నష్టంతో 54,585.75 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 2.61 శాతం నష్టాలతో 17,645.55 వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: 1000 పాయింట్లు దాటిన సెన్సెక్స్
గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,436.30 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 79,943.71 వద్ద, నిఫ్టీ (Nifty) 445.75 పాయింట్లు లేదా 1.88 శాతం లాభంతో 24,188.65 వద్ద నిలిచాయి.ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒడిదుడుకుల్లో స్వల్ప నష్టాలు
ముంబై: స్టాక్ సూచీల లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 78,473 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు పతనమై 23,728 వద్ద నిలిచింది. విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా తరలిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,398–78,877 శ్రేణిలో... నిఫ్టీ 23,868–23,685 రేంజ్లో ట్రేడయ్యాయి.ఫైనాన్సియల్స్, ఐటీ, మెటల్, విద్యుత్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డి్రస్కిషనరీ, ఇంధన, ఫార్మా, టెలికం, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్, సరీ్వసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా బుధవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు సెలవు ప్రకటించాయి. బులియన్, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు. ఐపీఓలకు భారీ స్పందన సెనోరెస్ ఫార్మా ఐపీఓకు చివరిరోజు నాటికి 93.69 రెట్ల స్పందన లభించింది. ఆఫర్లో భాగంగా 85.34 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 79.95 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ విభాగం 90.46 రెట్లు సబ్‌స్రై్కబ్ అయింది. వెంటివ్ హాస్పిటాలిటీ ఐపీఓ 9.82 రెట్ల స్పందన దక్కింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.44 కోట్ల షేర్లను జారీ చేయగా 14.17 కోట్ల ఈక్విటీలకు దరఖాస్తులు వచ్చాయి. రిటైల్ విభాగానికి 5.94 రెట్ల స్పందన లభించింది. ఇక కరారో ఇండియాకు 1.12 రెట్ల స్పందన నమోదైంది. ఆఫర్లో 1.30 కోట్ల ఈక్విటీలను జారీ చేయగా 1.46 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ విభాగం 2.21 రెట్లు, రిటైల్ విభాగం 71% సబ్‌స్క్రైబ్ అయ్యాయి. -
శుభారంభం పలికిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 456.91 పాయింట్లు లేదా 0.59 శాతం లాభంతో 78,498.50 వద్ద, నిఫ్టీ 135.15 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 23,722.65 వద్ద కొనసాగుతున్నాయి.శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్స్, భారతి ఎయిర్టెల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాలను చవి చూశాయి.ఇదీ చదవండి: షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం
గత వారం స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు చుక్కలు చూపించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు 3700 పాయింట్లు నష్టపోయి 78000 పాయింట్ల స్థాయిలో స్థిరపడగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1200 పాయింట్లు కోల్పోయి 23600 దరిదాపుల్లో ముగిసింది. అంటే సెన్సెక్స్, నిఫ్టీలు ఒకవారం రోజుల వ్యవధిలో 5 శాతం నష్టపోయాయన్నమాట.ప్రధాన సూచీలు ఈస్థాయిలో పడిపోవడం మామూలు విషయమేమీ కాదు. పైగా కేవలం గత గురు, శుక్రవారాల్లో భారీగా నష్టపోయాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా. కిందటి బుధవారం రాత్రి (మన కాలమానం ప్రకారం) అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోతలు చాలా పరిమిత సంఖ్యలో ఉంటాయన్న ప్రకటన మార్కెట్లకు నచ్చలేదు. దీంతో అక్కడి డోజోన్స్, నాస్డాక్స్ సూచీలు భారీగా నష్టపోయాయి. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ఆసియా, ఐరోపా మార్కెట్లూ ఊచకోతకు గురయ్యాయి. ఇందుకు మన మార్కెట్లూ మినహాయింపు కాలేదు.విదేశీ మదుపర్లుడిసెంబర్ చివరి వారానికి వచ్చేశాం. సాధారణంగా డిసెంబర్లో విదేశీ మదుపర్ల లావాదేవీలు మందగిస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ వారంలో వీరి కొనుగోళ్ల స్థాయి పడిపోతుంది. దీంతో సూచీలు చాలా స్తబ్దుగా కొనసాగుతాయి. ఇప్పటికే వీరి విధ్వంసాన్ని మార్కెట్లు కళ్లజూశాయి. మళ్ళీ వీళ్ళు జనవరి రెండో వారంలో మార్కెట్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెడతారు. అప్పటి దాకా దూకుడు కొంత తగ్గవచ్చు.గత వారం విదేశీ మదుపర్లు దాదాపు రూ. 20,000 కోట్ల షేర్లను నికరంగా విక్రయించారు. ఈ నెల మొత్తానికి మాత్రం వీరి నికర విక్రయాలు సుమారు రూ.4,100 కోట్లుగా ఉన్నాయి. దీనికి కారణం అంత క్రితం రెండు వారాల్లో వీళ్ళు నికర కొనుగోళ్లు జరపడమే.ఈ వారం అంచనాలుఈ వారం కూడా మార్కెట్లలో జోరు ఉండకపోవచ్చు. కొన్నాళ్ల పాటు నష్టాల బాటలోనే కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. నిఫ్టీకి 23500 వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. ఒకవేళ ఆ స్థాయిని కూడా బ్రేక్ చేసి దిగజారితే 23370 వరకు పడిపోవచ్చు. ఒకవేళ అక్కడి దాకా చేరితే.. మార్కెట్‌కు మద్దతు దొరికి మళ్ళీ సూచీలు బలంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అదీ కాని పక్షంలో 23000 వరకు పతనం కొనసాగవచ్చు. ఒకవేళ సూచీలు ముందుకు కదిలితే 23700 వద్ద మొదటి నిరోధం ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే తదుపరి నిరోధం 23800 వద్దఎదురవుతుంది. దీన్నీ దాటుకుని ముందుకెళ్తే 24000 వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.ఇప్పటికే మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయి. ముఖ్యంగా సూచీల్లో ఎక్కువ స్థాయిలో షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. గత వారమంతా అమ్మకాలు కొనసాగడం, డిసెంబర్ నెల కాంట్రాక్టులకు సంబంధించి ఇదే చివరి వారం కావడం వంటి కారణాల వల్ల వారంలో ఏ సమయంలోనైనా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక బ్యాంకు నిఫ్టీ విషయాని కొస్తే.. 50500 దిగువన కొనసాగితే మాత్రం 49000 వరకు క్షీణించే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్లు ముందుకెళ్తే 52000 వరకు సూచీ దూసుకెళ్ళవచ్చు. షార్ట్ కవరింగ్ లావేదేవీలు సహకరిస్తే 53000 వరకు పరుగులు తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.జీఎస్టీ మండలి నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై విధిస్తున్న పన్ను రేట్ల తగ్గింపు. గత సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం వెలువడవచ్చని భావించినప్పటికీ.. ఇది వాయిదా పడటం ఒక రకంగా ఇన్సూరెన్సు కంపెనీల షేర్లపై స్వల్ప స్థాయిలోనే అయినా ప్రతికూల ప్రభావం చూపించడానికి ఆస్కారంఉంది. ఆటోమొబైల్, చమురు షేర్లు నష్టాల్లోనే కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో ఎలాటి ప్రభావిత వార్తలు లేకపోవడంతో సిమెంట్ షేర్స్ మందకొడిగా కొనసాగవచ్చు.ఇక ఎఫ్ఎంసీజీ, టెలికాం రంగాల షేర్లలోనూ స్తబ్దత తప్పదు. యంత్ర పరికరాల రంగానికి సంబంధించిన షేర్లకు నష్టాల బాట తప్పక పోవచ్చు. సాధారణంగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు సురక్షిత రంగంగా ఫార్మాను భావిస్తూ ఉంటారు. గతవారం లాభాల్లో నడిచిన ఫార్మా షేర్లు ఈ వారం కూడా అదేస్థాయిలో జోరు కొనసాగించవచ్చు. క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు బుధవారం సెలవు.- బెహరా శ్రీనివాసరావు, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు -
ఇన్వెస్టర్లకు ఫ్రై డే
ముంబై: దేశీయ స్టాక్ సూచీలను వరుసగా అయిదో రోజూ నష్టాలు వెంటాడాయి. వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో శుక్రవారమూ కుప్పకూలాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,176 పాయింట్లు క్షీణించి 79 వేల పాయింట్ల స్థాయి దిగువన 78,042 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 364 పాయింట్లు నష్టపోయి 23,588 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ. 10 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. సెన్సెక్స్ 1,344 పాయింట్లు క్షీణించి 77,875 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు కోల్పోయి 23,537 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో ఇండోనేషియా మినహా అన్ని దేశాల సూచీలు 3% వరకు పతనయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి విలువ 9 పైసలు బలపడి 85.04 వద్ద ముగిసింది. 5 రోజుల్లో రూ.18.43 లక్షల కోట్ల నష్టం స్టాక్ మార్కెట్ వరుసగా 5 రోజుల్లో సెన్సెక్స్ 4,091 పాయింట్ల (5%) కుదేలవడంతో రూ.18.43 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.440.99 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,064.12 పాయింట్లు లేదా 1.30 శాతం నష్టంతో 80,684.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 332.25 పాయింట్లు లేదా 1.35 శాతం నష్టంతో 24,336.00 వద్ద నిలిచాయి.సిప్లా, విప్రో, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీసీ కంపెనీ, ఇన్ఫోసిస్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. -
సూచీలు అక్కడక్కడే..!
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు మంగళవారం అక్కడిక్కడే ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ రెండు పాయింట్ల లాభంతో 81,510 వద్ద నిలిచింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 24,610 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రథమార్థంతా లాభాల్లో కదిలాయి. మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణతో నష్టాలు చవిచూశాయి.ట్రేడింగ్ చివర్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు రాణించడంతో నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 543 పాయింట్ల పరిధిలో 81,508 – 81,726 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 24,678 వద్ద కనిష్టాన్ని, 24,511 గరిష్టాన్ని తాకింది. రియలీ్ట, ఐటీ, మెటల్, కమోడిటీ, ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, పవర్, సర్విసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
3 రోజుల్లో 1,802 పాయింట్లు అప్
ముంబై: ప్రధానంగా పీఎస్‌యూ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లకు పెరిగిన డిమాండ్‌తో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ 598 పాయింట్లు జంప్‌చేసి 80,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్ల వృద్ధితో 24,457 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,802 పాయింట్లు జమ చేసుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 701, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున ఎగశాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 81,000 సమీపాని(80,949)కి చేరింది. గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్లు వెలుగులో నిలిచినట్లు పేర్కొన్నారు.బ్లూచిప్స్ బలిమి..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా 2.5 శాతం జంప్‌చేయగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ప్రయివేట్ బ్యాంక్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఆటో, ఐటీ 0.5 శాతం బలపడగా.. ఎఫ్ఎంసీజీ 0.4 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్ 6 శాతం జంప్‌చేసింది. ఎన్టీపీసీ, అదానీ ఎంటర్, యాక్సిస్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, అ్రల్టాటెక్, ఓఎన్జీసీ, సిప్లా, బీఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.7–1 శాతం మధ్య లాభపడ్డాయి.అయితే ఎయిర్టెల్, హీరోమోటో, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ 1.5–0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. మార్కెట్ల బాటలో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1% ఎగశాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి రూ. 3,665 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయడం గమనార్హం! దేశీ ఫండ్స్ రూ. 251 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ⇒ వారాంతాన 40 శాతం ప్రీమియంతో లిస్టయిన ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ ఇంట్రాడేలో మరో 19 శాతం జంప్‌చేసి రూ. 264ను తాకింది. చివరికి ఈ షేరు 16 % లాభంతో రూ. 258 వద్ద ముగిసింది.⇒ గత నెల 27న లిస్టయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 142 వద్ద నిలిచింది. ఈ షేరు ఐపీవో ధర రూ. 108.బంపర్ లిస్టింగ్లుసీ2సీ అడ్వాన్స్డ్ చిన్న తరహా కంపెనీ(ఎస్ఎంఈ).. సీ2సీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ బంపర్ లిస్టింగ్ సాధించింది. ఇష్యూ ధర రూ.226తో పోలిస్తే 90% ప్రీమియంతో రూ.429 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5 శాతం లాభంతో రూ.451 వద్ద ముగిసింది.రాజ్‌పుటానా బయోడీజిల్ ఎస్ఎంఈ సంస్థ రాజ్‌పుటానా బయోడీజిల్ లిస్టింగ్ అదిరింది. ఇష్యూ ధర రూ. 130తో పోలిస్తే 90% ప్రీమియంతో రూ. 247 వద్ద ప్రారంభమైంది. చివరికి 99.5% లాభంతో రూ. 259 వద్ద ముగిసింది. -
రెండో రోజూ మార్కెట్ జోరు
ముంబై: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. గత 7 త్రైమాసికాలలోనే ఆర్థిక వ్యవస్థ కనిష్ట వృద్ధికి పరిమితమైనప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు లాభాలతో నిలిచాయి. ఆర్థిక వృద్ధి మందగించిన కారణంగా స్వల్ప వెనకడుగుతో ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే కోలుకున్నాయి. మిడ్‌సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడింది. 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 145 పాయింట్లు బలపడి 24,276 వద్ద నిలిచింది. రియల్టీ జూమ్..: ఎన్ఎస్ఈలో రియల్టీ అత్యధికంగా 3 శాతం ఎగసింది. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అ్రల్టాటెక్, అపోలో, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, టెక్ఎం, టైటన్, డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎల్, సన్, మారుతీ, హెచ్‌సీఎల్‌టెక్, కోల్ ఇండియా 4–1.3 శాతం మధ్య బలపడ్డాయి.అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ 2.7–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మధ్య, చిన్నతరహా షేర్లలో 463 కౌంటర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ జాబితాలో రామ్‌కో సిస్టమ్స్, గోల్డియామ్ ఇంటర్నేషనల్, అతుల్ ఆటో, కొచిన్ షిప్‌యార్డ్ తదితర కంపెనీలు ఉన్నాయి.అదానీ గ్రూప్ నేలచూపు:మార్కెట్లు లాభపడినప్పటికీ అదానీ గ్రూప్‌లోని ఆరు కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర షేర్లలో ఎన్డీటీవీ, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ 1–0.5 శాతం మధ్య నీరసించాయి. -
సూచీలకు స్వల్ప నష్టాలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 80,004 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 24,194 వద్ద నిలిచింది. యుటిలిటీస్, పవర్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్, సర్వీసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.ఐటీ, టెక్, టెలికమ్యూనికేషన్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రంప్ తన ప్రమాణ స్వీకారం రోజు జనవరి 20న మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25%, చైనాల నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై పది శాతం పన్ను విధింపునకు అవసరమైన పత్రాలపై సంతకం చేస్తానంటూ తెలపడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ ఐపీఓ చివరి రోజు నాటికి 89.90 రెట్ల స్పందన వచ్చింది ఇష్యూలో భాగంగా కంపెనీ 3.07 కోట్ల షేర్లు జారీ చేయగా, 277 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ విభాగం 157 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 378.88 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 77,199.50 వద్ద, నిఫ్టీ 167.85 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో 23,350.65 వద్ద నిలిచాయి.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రా టెక్ సిమెంట్, హిందాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 189.28 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 77,528.29 వద్ద, నిఫ్టీ 46.45 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,500.25 పాయింట్ల వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీకి ఏడోరోజూ నష్టాలే..
ముంబై: ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో నిఫ్టీ ఏడోరోజూ నష్టాలు చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,339 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 23,454 వద్ద నిలిచింది. ప్రథమార్థంలో సెన్సెక్స్ 615 పాయింట్లు క్షీణించి 76,965 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు కోల్పోయి 23,350 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్, రియలీ్ట, ఆటో, సరీ్వసెస్, కన్జూమర్ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర భర్తీ అయ్యాయి. రంగాలవారీగా.., ఐటీ ఇండెక్స్ 2.50%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2%, ఫార్మా, మీడియా సూచీలు 1% చొప్పున పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున తక్షణ వడ్డీరేట్ల తగ్గింపు ఇప్పట్లో అవసరం లేదంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డిసెంబర్లో ఫెడ్ రేట్ల కోత ఉండకపోవచ్చనే సంకేతాలతో టీసీఎస్, ఎంఫసీస్, ఎల్టీఐఎం షేర్లు 3% క్షీణించగా.. ఇన్ఫీ 2.50% విప్రో 2% పడ్డాయి. ⇒ డిసెంబర్ నుంచి చైనా కమోడిటీలకు సంబంధించి ఎగుమ తులపై పన్ను రాయి తీలను తగ్గించడం లేదా రద్దు చేయాలనే ప్రతిపాదనలతో మెటల్ షేర్లు మెరిశాయి. నాల్కో 9 శాతం, హిందాల్కో 4%, వేదాంత 3%, టాటా స్టీల్ 2%, ఎన్ఎండీసీ 1.50%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒకశాతం లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వం నేచరల్ గ్యాస్ సరఫరాను నెలలో రెండోసారి తగ్గించడంతో గ్యాస్ పంపిణీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ 20% క్షీణించి రూ.325 వద్ద, మహానగర్ గ్యాస్ 14% పడి రూ.1,131 వద్ద ముగిశాయి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.39 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,369.92 వద్ద, నిఫ్టీ 72.75 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 23,459.95 వద్ద నిలిచాయి.హిందాల్కో, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ట్రెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)