Nifty
-
ఇన్వెస్టర్లకు ఫ్రై డే
ముంబై: దేశీయ స్టాక్ సూచీలను వరుసగా అయిదో రోజూ నష్టాలు వెంటాడాయి. వచ్చే ఏడాదిలో ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలతో శుక్రవారమూ కుప్పకూలాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,176 పాయింట్లు క్షీణించి 79 వేల పాయింట్ల స్థాయి దిగువన 78,042 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 364 పాయింట్లు నష్టపోయి 23,588 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ. 10 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. సెన్సెక్స్ 1,344 పాయింట్లు క్షీణించి 77,875 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు కోల్పోయి 23,537 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో ఇండోనేషియా మినహా అన్ని దేశాల సూచీలు 3% వరకు పతనయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి విలువ 9 పైసలు బలపడి 85.04 వద్ద ముగిసింది. 5 రోజుల్లో రూ.18.43 లక్షల కోట్ల నష్టం స్టాక్ మార్కెట్ వరుసగా 5 రోజుల్లో సెన్సెక్స్ 4,091 పాయింట్ల (5%) కుదేలవడంతో రూ.18.43 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.440.99 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,064.12 పాయింట్లు లేదా 1.30 శాతం నష్టంతో 80,684.45 పాయింట్ల వద్ద, నిఫ్టీ 332.25 పాయింట్లు లేదా 1.35 శాతం నష్టంతో 24,336.00 వద్ద నిలిచాయి.సిప్లా, విప్రో, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటీసీ కంపెనీ, ఇన్ఫోసిస్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. -
సూచీలు అక్కడక్కడే..!
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు మంగళవారం అక్కడిక్కడే ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ రెండు పాయింట్ల లాభంతో 81,510 వద్ద నిలిచింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 24,610 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రథమార్థంతా లాభాల్లో కదిలాయి. మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణతో నష్టాలు చవిచూశాయి.ట్రేడింగ్ చివర్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు రాణించడంతో నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 543 పాయింట్ల పరిధిలో 81,508 – 81,726 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 24,678 వద్ద కనిష్టాన్ని, 24,511 గరిష్టాన్ని తాకింది. రియలీ్ట, ఐటీ, మెటల్, కమోడిటీ, ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, పవర్, సర్విసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
రెండో రోజూ మార్కెట్ జోరు
ముంబై: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. గత 7 త్రైమాసికాలలోనే ఆర్థిక వ్యవస్థ కనిష్ట వృద్ధికి పరిమితమైనప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు లాభాలతో నిలిచాయి. ఆర్థిక వృద్ధి మందగించిన కారణంగా స్వల్ప వెనకడుగుతో ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే కోలుకున్నాయి. మిడ్‌సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడింది. 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 145 పాయింట్లు బలపడి 24,276 వద్ద నిలిచింది. రియల్టీ జూమ్..: ఎన్ఎస్ఈలో రియల్టీ అత్యధికంగా 3 శాతం ఎగసింది. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అ్రల్టాటెక్, అపోలో, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, టెక్ఎం, టైటన్, డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎల్, సన్, మారుతీ, హెచ్‌సీఎల్‌టెక్, కోల్ ఇండియా 4–1.3 శాతం మధ్య బలపడ్డాయి.అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ 2.7–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మధ్య, చిన్నతరహా షేర్లలో 463 కౌంటర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ జాబితాలో రామ్‌కో సిస్టమ్స్, గోల్డియామ్ ఇంటర్నేషనల్, అతుల్ ఆటో, కొచిన్ షిప్‌యార్డ్ తదితర కంపెనీలు ఉన్నాయి.అదానీ గ్రూప్ నేలచూపు:మార్కెట్లు లాభపడినప్పటికీ అదానీ గ్రూప్‌లోని ఆరు కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర షేర్లలో ఎన్డీటీవీ, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ 1–0.5 శాతం మధ్య నీరసించాయి. -
సూచీలకు స్వల్ప నష్టాలు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 80,004 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 24,194 వద్ద నిలిచింది. యుటిలిటీస్, పవర్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్, సర్వీసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.ఐటీ, టెక్, టెలికమ్యూనికేషన్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రంప్ తన ప్రమాణ స్వీకారం రోజు జనవరి 20న మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25%, చైనాల నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై పది శాతం పన్ను విధింపునకు అవసరమైన పత్రాలపై సంతకం చేస్తానంటూ తెలపడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ ఐపీఓ చివరి రోజు నాటికి 89.90 రెట్ల స్పందన వచ్చింది ఇష్యూలో భాగంగా కంపెనీ 3.07 కోట్ల షేర్లు జారీ చేయగా, 277 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ విభాగం 157 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 378.88 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 77,199.50 వద్ద, నిఫ్టీ 167.85 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో 23,350.65 వద్ద నిలిచాయి.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రా టెక్ సిమెంట్, హిందాల్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 189.28 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 77,528.29 వద్ద, నిఫ్టీ 46.45 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,500.25 పాయింట్ల వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీకి ఏడోరోజూ నష్టాలే..
ముంబై: ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో నిఫ్టీ ఏడోరోజూ నష్టాలు చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,339 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 23,454 వద్ద నిలిచింది. ప్రథమార్థంలో సెన్సెక్స్ 615 పాయింట్లు క్షీణించి 76,965 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు కోల్పోయి 23,350 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్, రియలీ్ట, ఆటో, సరీ్వసెస్, కన్జూమర్ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర భర్తీ అయ్యాయి. రంగాలవారీగా.., ఐటీ ఇండెక్స్ 2.50%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2%, ఫార్మా, మీడియా సూచీలు 1% చొప్పున పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున తక్షణ వడ్డీరేట్ల తగ్గింపు ఇప్పట్లో అవసరం లేదంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డిసెంబర్లో ఫెడ్ రేట్ల కోత ఉండకపోవచ్చనే సంకేతాలతో టీసీఎస్, ఎంఫసీస్, ఎల్టీఐఎం షేర్లు 3% క్షీణించగా.. ఇన్ఫీ 2.50% విప్రో 2% పడ్డాయి. ⇒ డిసెంబర్ నుంచి చైనా కమోడిటీలకు సంబంధించి ఎగుమ తులపై పన్ను రాయి తీలను తగ్గించడం లేదా రద్దు చేయాలనే ప్రతిపాదనలతో మెటల్ షేర్లు మెరిశాయి. నాల్కో 9 శాతం, హిందాల్కో 4%, వేదాంత 3%, టాటా స్టీల్ 2%, ఎన్ఎండీసీ 1.50%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒకశాతం లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వం నేచరల్ గ్యాస్ సరఫరాను నెలలో రెండోసారి తగ్గించడంతో గ్యాస్ పంపిణీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ 20% క్షీణించి రూ.325 వద్ద, మహానగర్ గ్యాస్ 14% పడి రూ.1,131 వద్ద ముగిశాయి. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.39 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,369.92 వద్ద, నిఫ్టీ 72.75 పాయింట్లు లేదా 0.31 శాతం నష్టంతో 23,459.95 వద్ద నిలిచాయి.హిందాల్కో, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ట్రెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69.52 పాయింట్లు లేదా 0.089 శాతం నష్టంతో 77,621.44 వద్ద, నిఫ్టీ 9.75 పాయిట్లు లేదా 0.041 శాతం నష్టంతో 23,549.30 వద్ద నిలిచాయి.ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), నెస్లే వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 23,622కు చేరింది. సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగబాకి 77,825 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం పెరిగింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది. శుక్రవారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
24,000 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. దేశీయ అక్టోబర్ ద్రవ్యల్బోణ, సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి దిగిరావడమూ ఒత్తిడి పెంచింది. ఫలితంగా సెన్సెక్స్ 821 పాయింట్లు నష్టపోయి 79 వేల దిగువన 78,675 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 258 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువన 23,883 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, ఐటీ మినహా అన్ని రంగాల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆటో, విద్యుత్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 948 పాయింట్లు క్షీణించి 78,548 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 23,839 వద్ద కనిష్టాలు తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.25%, 1% నష్టపోయాయి. సెమికండక్టర్ల షేర్లతో పాటు చైనా మార్కెట్ వరుస పతనంతో ఆసియా మార్కెట్లు 3% పడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.5% క్షీణించాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఎస్బీఐ 2.50%, ఏషియన్ పెయింట్స్ 2%, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్ 1% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళలనల తో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీఐ 10% పతనమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గెయిల్ 4.50%, భెల్, ఎన్ఎల్సీ 4%, ఎన్సీఎల్ 3.50% క్షీణించాయి. ⇒ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.437.24 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ సాగిలిటీ ఇండియా లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.30)తో పోలిస్తే 3.50% ప్రీమియంతో రూ.31 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% పెరిగి, చివరికి 2% నష్టంతో రూ.29.36 వద్ద ముగిసింది. -
మిశ్రమ ఫలితాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 9.83 పాయింట్లు లేదా 0.012 శాతం లాభంతో 79,496.15 వద్ద, నిఫ్టీ 6.90 పాయింట్లు లేదా 0.029 శాతం నష్టంతో 24,141.30 వద్ద నిలిచాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలను పొందగా.. నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ముగిసింది.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, సిప్లా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 55.47 పాయింట్లు లేదా 0.070 శాతం నష్టంతో 79,486.32 వద్ద, నిఫ్టీ 51.15 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 24,148.20 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మోస్తరు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో భారతీయ బెంచ్ మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 328.04 పాయింట్లు లేదా 0.41% నష్టంతో 79,213.75 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112.30 పాయింట్లు లేదా 0.46% నష్టపోయి 24,087.05 వద్ద చలిస్తున్నాయి.ట్రెంట్, కోల్ఇండియా, బీపీసీల్, రిలయన్స్, టాటా మోటర్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఐటీ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 849.86 పాయింట్లు లేదా 1.06 శాతం తగ్గి 79,528.27 వద్ద, నిఫ్టీ 289.45 పాయింట్లు లేదా 1.18 శాతం తగ్గి 24,194.60 వద్ద నిలిచాయి.అపోలో హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, లార్సెన్ & టూబ్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందాల్కో, ట్రెంట్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 గంటలకు సెన్సెక్స్ 97.18 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 79,573.81 వద్ద, నిఫ్టీ 34.85 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,279.70 వద్ద ముందుకు సాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో అపోలో హాస్పిటల్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, డీఎల్ఎఫ్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. టైటాన్ కంపెనీ, హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల బాట పట్టాయి.యూఎస్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డోజోన్స్, నాస్డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్న సమయంలో స్టాక్ మార్కెట్ జోరందుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 649.37 పాయింట్ల లాభంతో.. 79,431.61 వద్ద, నిఫ్టీ 202.95 పాయింట్ల లాభంతో 24,198.30 పాయింట్ల వద్ద నిలిచాయి.జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ మొదలైనవి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ కంపెనీ, జేకే సిమెంట్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యూఎస్ ఎలక్షన్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 964.41 పాయింట్ల నష్టంతో.. 78,759.70 వద్ద, నిఫ్టీ 314.00 పాయింట్ల నష్టంతో 23,990.35 వద్ద నిలిచాయి. అమెరికాలో రేపు జరగనున్న ఎన్నికల కారణంగానే స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూస్తోంది.'మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, సిప్లా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. హీరో మోటోకార్ప్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) వంటి సంస్థలు నష్టాలను చవిచూసాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీగా పడుతున్నాయి. ఉదయం 11:25 నిమిషాల సమయం వరకు ఏకంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైనట్లు తెలిసింది. మార్కెట్లు పడిపోతుండడంపై నిపుణులు కొన్ని అంతర్జాతీయ అంశాలు కారణమని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.అమెరికా ఎన్నికలుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు(మంగళవారం 5న) జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.యూఎస్ ఫెడ్ సమావేశంమరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధ, గురువారాల్లో(6–7వ తేదీన) మానిటరీ పాలసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నాయి. 7న యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం(2.4 శాతం), అక్టోబర్ ఉపాధి గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్లలో సవరణలకు తెరతీయనుంది. గత సమావేశంలో నాలుగేళ్ల తదుపరి ఎఫ్‌వోఎంసీ తొలిసారి 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతంగా అమలవుతున్నాయి.క్యూ2 ఫలితాలుఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ వేడెక్కింది. పలు దిగ్గజాలు పనితీరును వెల్లడిస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మార్కెట్లు కింది చూపులు చూస్తున్నాయి. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాల జాబితాలో డాక్టర్ రెడ్డీస్, టైటన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. దేశ, విదేశీ గణాంకాలను ఈ వారం స్టాక్ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నాయి.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్దేశీ స్టాక్స్‌లో ఉన్నట్టుండి గత నెలలో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త చరిత్రకు తెరతీశారు. అక్టోబర్‌లో నికరంగా రూ.94,000 కోట్ల(11.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నెలవారీగా దేశీ స్టాక్ మార్కెట్లలో ఇవి అత్యధిక అమ్మకాలుకాగా..కొవిడ్–19 ప్రభావంతో ఇంతక్రితం 2020 మార్చిలో ఎఫ్‌పీఐలు రూ.61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీయంగా ఒక నెలలో ఇవి అత్యధిక విక్రయాలుగా నమోదయ్యాయి. ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌లో రూ.57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇవి గత 9 నెలల్లోనే గరిష్టంకావడం గమనార్హం. అయితే చైనాలో ఆకర్షణీయ ఈక్విటీ విలువలు, ప్రభుత్వ సహాయక ప్యాకేజీలు ఎఫ్‌పీఐలను అమ్మకాలవైపు ఆకర్షిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
పదేళ్లలో భారీగా మార్కెట్లు పడింది ఎప్పుడంటే..
గడిచిన పదేళ్లలో మార్కెట్లు భారీగా కుదుపులకు లోనయ్యాయి. ఈక్విటీ మార్కెట్లంటేనే ఒడిదొడుకులు సహజం. వాటికి దూరంగా ఉంటూ లాభాలు పొందాలంటే ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. అయితే మార్కెట్లు పడుతున్నప్పుడు దాన్నో అవకాశంగా మలుచుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మరింత ఎక్కవ రాబడులు పొందే వీలుంటుందని సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో మార్కెట్లు ఏయే నెలలో భారీగా కుదేలయ్యాయో.. తర్వాత ఎంత పుంజుకున్నాయో కింద తెలియజేస్తున్నాం.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు? -
లాభాలతో ముగిసిన ముహూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా ఈరోజు జరిగిన స్టాక్ మార్కెట్ ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 7 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 335.06 పాయింట్లు లేదా 0.42% లాభపడి 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు బలపడి 24,34.35 వద్ద స్థిరపడ్డాయి.సాయంత్రం 6 గంటలకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాలు గ్రీన్‌లో ట్రేడయ్యాయి. కంపెనీలు తమ నెలవారీ విక్రయాల సంఖ్యను విడుదల చేయడంతో ఆటో స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి. ముహూరత్ ట్రేడింగ్ అనేది హిందూ క్యాలెండర్ సంవత్సరం (సంవత్ 2081) ప్రారంభాన్ని సూచిస్తూ దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్. సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కొసాగింది.మహీంద్రా అండ్ మహీంద్రా, ఒఎన్‌జిసి, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. నష్టపోయిన స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సిఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, విప్రో ఉన్నాయి. ఆటో ఇండెక్స్ 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం చొప్పున పెరిగాయి. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 తమ రెండు రోజుల విజయ పరంపరను ముగించాయి. ప్రపంచ మిశ్రమ సూచనల మధ్య బుధవారం నష్టాల్లో స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 426.85 పాయింట్లు లేదా 0.53 శాతం క్షీణించి 79,942.18 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ కూడా 125.99 పాయింట్లు లేదా 0.51 శాతం క్షీణించి 24,340.85 వద్ద ముగిసింది.50 షేర్లలో 31 నష్టాల్లో ముగిశాయి.సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ట్రెంట్ టాప్ లూజర్స్‌గా 4.03 శాతం వరకు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 24,466 వద్దకు చేరింది. సెన్సెక్స్ 363 పాయింట్లు ఎగబాకి 80,369 వద్ద ముగిసింది.వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు గడిచిన రెండు సెషన్లలో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. బారీగా పడిన మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా మారడంతో రిటైల్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడి పెడుతున్నట్లు తెలిసింది. రానున్న యూఎస్ ఎన్నికలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, టీసీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)