November 1
-
పండగ పోయింది: బంగారం ధర తగ్గింది
ధన త్రయోదశి, దీపావళికి భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (నవంబర్ 1) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 770 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 80,560, 22 క్యారెట్ల ధర రూ. 73,850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ. 700, రూ. 770 తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 700 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 770 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,710 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 74,000 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుదముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ. 700, రూ. 770 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,560 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ. 73,850 వద్ద ఉంది.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న స్థిరంగా ఉన్న సిల్వర్ రేటు ఈ రోజు రూ. 3000 తగ్గింది. దాదాపు వారం రోజుల తరువాత ఇంత పెద్ద మొత్తం వెండి ధర తగ్గడం ఇదే మొదటిసారి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మారిన రూల్స్: ఈ రోజు నుంచే అమల్లోకి..
ఈ రోజు (నవంబర్ 1) నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్, అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్, సిలిండర్ ధరలలో మార్పు మొదలైనవి వాటిలో కీలకమైన మార్పులను జరగనున్నాయి. ఈ మార్పులు భారతదేశంలోని పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలుప్రతి నెల మాదిరిగానే.. పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తాయి. కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడే వ్యాపారులు ఈ హెచ్చుతగ్గులను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి సిలిండర్ ధరలలో మార్పు జరుగుతుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్డేట్స్యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించి కీలకమైన మార్పులు ఈ రోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఇన్ సెక్యూర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ఫైనాన్స్ ఛార్జి నెలకు 3.75 శాతం పెరుగుతుంది. అంతే కాకుండా బిల్లింగ్ వ్యవధిలో యుటిలిటీ చెల్లింపులు మొత్తం రూ. 50వేలు కంటే ఎక్కువ ఉంటే.. 1 శాతం ఛార్జి విధిస్తారు. ఇది డిసెంబర్ 2024 ప్రారంభం నుంచి ప్రారంభమవుతుంది. ఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీజుఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డ్ ప్రోగ్రామ్ వంటి వాటిని నవీనీకరిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌తో సహా వివిధ సేవలపై ప్రభావం చూపుతుంది. ఈ నియమాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది.ఆర్బీఐ కొత్త డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ ఫ్రేమ్వర్క్డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్స్ (DMT) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు కూడా ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఈ చొరవ దేశీయ నగదు బదిలీలలో భద్రతను మెరుగుపరచడం, నవీకరించబడిన ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. 24 జులై 2024 సర్క్యులర్‌లో బ్యాంకింగ్ అవుట్లెట్ల లభ్యత, కేవైసీ అవసరాలను సులభంగా నెరవేర్చడంలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..ఐఆర్సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ఐఆర్సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు. -
రేపు రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి : నవంబర్ 1వ తేదీని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగుతల్లికి పూలమాల వేసి అమరజీవి పొట్టిశ్రీరాములుకు నివాళులర్పించనున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, పాల్గొననున్నారు. కాగా ఆయా జిల్లాల్లో ఇంచార్జి మంత్రులు, కలెక్టర్లు ఆద్శర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీంతో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ లో అవతరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
వారోత్సవం!
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌కి ఇది ఫన్ టైమ్. ఆల్రెడీ ఐశ్వర్యారాయ్ ఇంట జరిగిన దీపావళి వేడుకలు బాలీవుడ్ వీధుల్లో బాగానే ప్రతిధ్వనించాయి. ఇంతటితో ఐశ్వర్య సెలబ్రేషన్స్‌కు ఫుల్స్టాప్ పడలేదు. ఎందుకంటే నవంబర్ 1న ఆమె పుట్టినరోజు. ఈ వేడుకల కోసం భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యలతో కలిసి రోమ్ వెళ్లనున్నారామె. అక్కడ దాదాపు వారం రోజుల పాటు ఉండేలా అభిషేక్ ఈ హాలిడేని ప్లాన్ చేశారు. పనిలో పనిగా తాను ప్రచారకర్తగా ఉన్న ఓ ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రీ–బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తారు ఐశ్వర్య. ఇలా నవంబర్ మొదటి వారం అంతా ఐశ్వర్య సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. తిరిగొచ్చాక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో తాను చేయనున్న పాత్ర కోసం కసరత్తులు మొదలుపెడతారామె. అభిషేక్ బచ్చన్ కూడా ‘బిగ్ బుల్’ సినిమాతో బిజీ అవుతారు. -
నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం
-
వైఎస్సార్సీపీ ఆఫీస్‌లో రాష్ట్రావతరణ వేడుకలు
-
నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర సాధనకు అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించడమే సముచితమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రావతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించడం దురదృష్టకరమని, దీనిని పార్టీ ఖండిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. తమ పార్టీ రాష్ట్రావతరణ వేడుకలను నవంబర్ ఒకటవ తేదీనే జరుపుకుంటుందని చెప్పారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ వేరుపడినప్పటికీ మధ్యప్రదేశ్ అంతకు మునుపు జరుపుకునే తేదీనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటుందని చెప్పారు. జార్ఖండ్ నుంచి వేరు పడిన బీహార్, ఉత్తరాఖండ్ నుంచి వేరుపడిన ఉత్తరప్రదేశ్ అంతకుముందు జరుపుకున్న తేదీలనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటున్నాయని తెలిపారు. ఈ సంప్రదాయాలనే ఏపీ పాటించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం జూన్ రెండో తేదీన రాష్ట్రావతరణ వేడుకలు జరపాలన్న నిర్ణయం చేయడమంటే వారు రాష్ట్ర విభజనకు అంగీకరించారని భావించాలన్నారు. సమైక్యంగా ఉండాలని కోరుకున్న తమ పార్టీ కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో శనివారం రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. నేడు వేడుకలో జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించే రాష్ట్రావతరణ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని పార్టీ తెలియజేసింది. కేబినెట్ నిర్ణయం సరికాదు: లక్ష్మణ్ రెడ్డి ఏపీ అవతరణ దినోత్సవం జూన్ 2న నిర్వహిం చాలని మంత్రి మండలి నిర్ణయించటం సరికాదని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఆమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 2 అనేది ఒక దుర్దినమన్నారు. గతంలో లాగా నవంబర్1న నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి మండలి నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించాలన్నారు. జూన్ 2 నిర్ణయం ఉపసంహరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న కాకుండా తెలంగాణ ఏర్పడిన జూన్ 2న నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించడం పట్ల ఆంధ్రా మేధావుల, విద్యావంతుల వేదిక తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీన్ని భావ దారిద్య్రంగా వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలసాని శ్రీనివాస్, పీఎస్ఎన్ మూర్తి, కార్యదర్శి టి. నరసింహారావు విమర్శించారు. ‘మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను చీల్చి ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఈ మాతృ రాష్ట్రాలేవీ కొత్తగా చీలిన దినాలను అవతరణ దినోత్సవాలుగా మార్చుకోలేదు. నవంబర్ 1ని మార్చాలనుకుంటే అమరజీవి పొట్టి శ్రీరాములుతోపాటు 1913 నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరు సల్పి సాధించుకున్న అక్టోబర్ 1ని ఏపీ అవతరణ దినోత్సవంగా ప్రకటించాల్సింది. సీమాం ధ్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర విభజనను ప్రజలు నిరసించారు. సీఎం వాస్తవాలు గమనించి ప్రకటనను ఉపసంహరించుకోవాలి’ అని డిమాండు చేసింది. -
నవంబర్ 1 వరకు వేచిచూస్తా: మంత్రి విశ్వరూప్
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని హైకమాండ్ వెనక్కి తీసుకుంటుందని నమ్మకం తనకుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తన ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. తమ ప్రాంతానికి సానుకూల నిర్ణయం కోసం నవంబర్ 1 వరకు వేచిచూస్తానని అన్నారు. విభజన నిర్ణయాన్ని హైకమాండ్ వెనక్కి తీసుకోకుంటే 2న రాజీనామా చేస్తానని విశ్వరూప్ వెల్లడించారు. రాష్ట్ర విభజనే జరిగితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని, రాష్ట్ర విభజన జరిపితే తానే మొదటిగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. విభజన జరగకుండా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన పలుమార్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రావులపాలెంలో లక్షగళ గర్జన నిరసన కార్యక్రమంలో ప్రధానపాత్ర పోషించారు.