ఈ రోజు (నవంబర్ 1) నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్, అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్, సిలిండర్ ధరలలో మార్పు మొదలైనవి వాటిలో కీలకమైన మార్పులను జరగనున్నాయి. ఈ మార్పులు భారతదేశంలోని పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
ప్రతి నెల మాదిరిగానే.. పెట్రోలియం కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సవరిస్తాయి. కమర్షియల్ సిలిండర్‌లపై ఆధారపడే వ్యాపారులు ఈ హెచ్చుతగ్గులను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి సిలిండర్ ధరలలో మార్పు జరుగుతుంది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అప్‌డేట్స్
యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించి కీలకమైన మార్పులు ఈ రోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఇన్ సెక్యూర్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఫైనాన్స్ ఛార్జి నెలకు 3.75 శాతం పెరుగుతుంది. అంతే కాకుండా బిల్లింగ్ వ్యవధిలో యుటిలిటీ చెల్లింపులు మొత్తం రూ. 50వేలు కంటే ఎక్కువ ఉంటే.. 1 శాతం ఛార్జి విధిస్తారు. ఇది డిసెంబర్ 2024 ప్రారంభం నుంచి ప్రారంభమవుతుంది. ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్‌లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీజు
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డ్ ప్రోగ్రామ్ వంటి వాటిని నవీనీకరిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌తో సహా వివిధ సేవలపై ప్రభావం చూపుతుంది. ఈ నియమాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది.
ఆర్‌బీఐ కొత్త డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫ్రేమ్‌వర్క్
డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్స్ (DMT) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు కూడా ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఈ చొరవ దేశీయ నగదు బదిలీలలో భద్రతను మెరుగుపరచడం, నవీకరించబడిన ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. 24 జులై 2024 సర్క్యులర్‌లో బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత, కేవైసీ అవసరాలను సులభంగా నెరవేర్చడంలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించింది.
ఇదీ చదవండి: నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..
ఐఆర్‌సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్
ఐఆర్‌సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు.
Comments
Please login to add a commentAdd a comment