Credit card
-
కోట్లు పంచుకుందాం.. టికెట్ ఇవ్వండి
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?. బంధాలు, బంధుత్వాలను తుంచేస్తా అని చెప్పిందట. డబ్బు ఉందన్న అహంతో కొందరు తమ ఆత్మియులను ఆమడ దూరం పెట్టేసిన వైనాలు మనందరం చూశాం. అయితే అదే డబ్బు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని ఫ్రాన్స్‌లోని ఓ ఘటన నిరూపించింది. సాధారణంగా మన పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేసిన వాళ్లు మనకు కనబడితే చితకబాదుతాం. కానీ ఫ్రాన్స్‌లో 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం తన క్రెడిట్ కార్డును కొట్టేసిన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో ఒక ఆర్థిక కోణం, నగదు ప్రేమ దాగి ఉంది. ఈయన దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఒక లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏ లక్షో రెండు లక్షలో కాకుండా ఏకంగా రూ.4,53,00,000ల జాక్‌పాట్ తగిలింది. టికెట్ ఎలా చేజిక్కించుకోవాలి? జాక్‌పాట్ తగిలిన టికెట్‌ను కౌంటర్లో ఇచ్చేసి నగదుగా మార్చుకునే అవకాశం ఆ దొంగలకు లేదు. ఎందుకంటే సంబంధిత టికెట్ కొనుగోలు పత్రాలు వాళ్ల వద్ద లేవు. ఆ టికెట్ కొనేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డ్ వాళ్లది కాదు. దొంగతనం చేశారు కాబట్టి ఒకవేళ టికెట్ పట్టుకుని కౌంటర్ వద్దకు వస్తే పోలీసులు పట్టుకెళ్తారు. దీంతో దొంగలు ఆ రూ. 4.53 కోట్ల విలువైన లాటరీటికెట్ను నగదుగా మార్చుకునే అవకాశం కోల్పోయారు. కానీ ఆ అవకాశం క్రెడిట్ కార్డ్ యజమాని అయిన జీన్ డేవిడ్.ఈ అనే వ్యక్తికి ఉంది. కానీ అతని వద్ద టికెట్ లేదు. ఇందుకు ఆయనో పథకం వేశారు. క్రెడిట్ కార్డ్ కొట్టేసిన దొంగలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు దొంగలించిన మీపై నాకు ఇప్పుడు కోపం లేదు. గతంలో మీపై పోలీస్ కేసు పెట్టాను. కావాలంటే ఆ కేసును ఇప్పుడు ఉపసంహరించుకుంటా. అయితే మీరు ఆ లాటరీ టికెట్‌ను నాకు ఇచ్చేయండి. కావాలంటే అందులో సగం మొత్తాన్ని మీకు వాటాగా ఇచ్చేస్తా’’అని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంకా తమ కౌంటర్ వద్దకు ఎవరూ రాలేదని లాటరీ నిర్వహణ సంస్థ లా ఫ్రాంకైస్ డీస్ జీయక్స్(ఎఫ్‌డీజే) శనివారం ప్రకటించింది. ఆలసించిన ఆశాభంగం క్రెడిట్ కార్డ్ యజమాని జీన్ డేవిడ్ తన లాయర్ ద్వారా మరోసారి ఒక సవివరమైన ప్రకటన ఇప్పించారు. ‘‘ఆ ఇద్దరు దొంగలు లేకుండా ఈ లాటరీ విజయం సాధ్యమయ్యేదే కాదు. వాళ్లు టికెట్ కొన్నారు కాబట్టే ఇవాళ ఇంత సొమ్ము మన పరం అయ్యే సదవకాశం దక్కింది. అందుకే దొంగల్లారా.. దయచేసి ఆ లాటరీ టికెట్ మాకు ఇచ్చేయండి. మీ వద్ద ఉన్నా అది మీకు ఉపయోగపడదు. మాకు ఇచ్చేస్తే మీకూ అందులో వాటా తప్పకుండా ఇస్తాం. డీల్ కుదుర్చుకుందాం. మా ఆఫీస్‌కు వచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే ఆ టికెట్‌ను నగదుగా మార్చుకునే క్లెయిమ్ గడువు తీరిపోతుంది. అప్పుడు మనందరికీ దక్కేది సున్నా. కాలం మించిపోతోంది. సమయం లేదు మిత్రమా. త్వరగా వచ్చి ఒడంబడిక చేసుకుని డబ్బు తీసుకెళ్లండి. ఆ డబ్బుతో మేం సెటిల్ అవుతాం. మీరూ సెటిల్ అవ్వండి’’అని లాయర్ పియరీ డెబూసన్ చెప్పారు. ఈ వింత ప్రకటన చూసి ఫ్రాన్స్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.సిటీలో కొట్టేసి.. టౌలూస్ నగరానికి చెందిన జీన్ డేవిడ్ ఫిబ్రవరి మూడో తేదీన కారులో తన బ్యాక్‌ప్యాక్‌ను ఉంచేసి వెళ్లాడు. కారు తెరచి దొంగలు ఆ బ్యాక్‌ప్యాక్‌ను, అందులోని పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేశారు. ఆ కార్డుతో ఒక చిల్లర దుకాణంలో లాటరీ టికెట్ కొన్నారు. ‘‘ఇల్లూ, చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేని ఇద్దరు వ్యక్తులు మా దుకాణానికి వచ్చి కాంటాక్ట్‌లెస్ విధానంలో 52.50 యూరోలతో ఒక లాటరీ టికెట్, మరికొన్ని సిగరెట్లు కొన్నారు. టికెట్ కొన్న ఆనందంలో వాళ్లు సిగరెట్లు కూడా మర్చిపోయి వెళ్లారు’’అని టబాక్ దిస్ థెర్మాస్ దుకాణ యజమాని చెప్పారు. -
ఫిన్‌టెక్ కొత్త మంత్రం రూపే కార్డ్
ఇప్పుడు దాదాపు అన్ని చెల్లింపులూ యూపీఐ ద్వారానే. లేదంటే పెద్ద లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ వాడుతుంటారు. మరి క్యూఆర్ కోడ్ చెల్లింపులకు బ్యాంక్ ఖాతాలో కచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే యూపీఐ లైట్ వ్యాలెట్‌లో అయినా బ్యాలెన్స్ లోడ్ చేసుకోవాలి. ఈ రెండూ లేకుండా రూపే క్రెడిట్ కార్డుతో క్యూఆర్ కోడ్ చెల్లింపులకు గతేడాదే ఆర్బీఐ వీలు కల్పించింది. ఇప్పటి వరకు ఇదేమంత ప్రచారానికి నోచుకోలేదు. కానీ, ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీలు రూపే క్రెడిట్ కార్డుల మార్కెటింగ్‌ను భుజానికెత్తుకున్నాయి. రియో, కివి, క్రెడిట్పే తదితర ఫిన్‌టెక్ సంస్థలు బ్యాంకులతో టైఅప్ అయి రూపే క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందిస్తూ, వాటిపై కమీషన్ పొందుతున్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థలు, వర్తకులతోనూ చేతులు కలిపి రూపే కార్డు వినియోగంపై చక్కని ఆఫర్లు ఇస్తున్నాయి. యూపీఐకి అనుసంధానించుకుని చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉండడంతో రూపే క్రెడిట్‌కార్డుతో కొత్త యూజర్లకు ఫిన్‌టెక్‌లు సులభంగా చేరువ అవుతున్నాయి. చిన్న వర్తకుల వద్ద పీవోఎస్ యంత్రాలు లేకపోవడంతో క్రెడిట్ కార్డులతో చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు. పీవోఎస్ లేకపోయినా రూపే కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవడం కస్టమర్లను ఆకర్షిస్తోంది. ‘‘పీవోఎస్ మెషిన్ లేని వర్తకుల వద్ద చెల్లింపులకు వీలు కలి్పంచే ఏకైక కార్డ్ రూపే క్రెడిట్ కార్డ్’’అని సూపర్.మనీ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రకాశ్ సికారియా తెలిపారు. పీవోఎస్ లేని వర్తకుల సంఖ్య కోట్లలో ఉంటుంది. దీంతో రూపే కార్డుల రూపంలో ఫిన్టెక్లకు పెద్ద మార్కెట్టే అందుబాటులోకి వచి్చనట్టయింది. కివి సంస్థ వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తోంది. నెలవారీ రూ.300 కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. ‘‘కస్టమర్లు యూపీఐ లావాదేవీలను క్రెడిట్ కార్డ్‌తో చేయడం మొదలు పెడితే, సేవింగ్స్ ఖాతా అనుసంధానిత యూపీఐ నుంచి మారిపోతారన్నది మా నమ్మకం. ఎందుకంటే ఇందులో సౌలభ్యంతోపాటు మెరుగైన అనుభవం లభిస్తుంది’’అని కివి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మోహిత్ బేడి అభిప్రాయపడ్డారు.ఆఫర్లతో గాలం.. ‘‘యూపీఐ చెల్లింపుల పరంగా సౌకర్యవంతమైన సాధనం. క్రెడిట్ కార్డులన్నవి రివార్డులు, ప్రయోజనాలకు పెట్టింది పేరు. ఈ రెండింటి కలయికతో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు, రివార్డులు అందించే ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’అని సికారియా వివరించారు. కివి జారీ చేసే వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్‌పై 40–50 రోజుల వడ్డీ రహిత (క్రెడిట్ ఫ్రీ) కాలం అమలవుతుంది. దీనికి అదనంగా వ్యయంపై రివార్డులను అందిస్తోంది. ఎయిర్‌పోర్టుల్లో యూపీఐ ఆధారిత లాంజ్ ప్రవేశాలకూ వీలు కలి్పస్తోంది. పెద్ద వర్తకులతో టైఅప్ పెట్టుకుని క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను సైతం ఫిన్‌టెక్‌లు ఆఫర్ చేస్తుండడంతో కస్టమర్లు సైతం రూపే క్రెడిట్ కార్డులను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మధ్యవర్తిత్వ పాత్రతో ఆదాయం.. చాలా వరకు ఫిన్‌టెక్‌లు కేవలం మధ్యవర్తిత్వ పాత్రకే పరిమితమవుతున్నాయి. ఇవి నేరుగా క్రెడిట్ కార్డులు జారీ చేయవు. బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుని పంపిణీ, ఇతర సేవలను అందించడానికి పరిమితమవుతున్నాయి. కార్డు యాక్టివేషన్‌పై కొంత మొత్తం చార్జీ కింద, కార్డు వినియోగంపైనా ప్రయోజనాలను అందుకుంటున్నాయి. సంప్రదాయ క్రెడిట్ కార్డులపై యూజర్లు నెలవారీ 8–9 లావాదేవీలు చేస్తుంటే.. యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డుపై దీనికి రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. కివి ప్లాట్‌ఫామ్ ద్వారా జారీ అవుతున్న రూపే క్రెడిట్ కార్డుపై నెలవారీగా ఒక్కో యూజర్ సగటున 22 నుంచి 24 లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. దీనివల్ల కస్టమర్లను నిలుపుకోవడంతోపాటు, అధిక లావాదేవీల రూపంలో ఫిన్టెక్లకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. తొలిసారి క్రెడిట్ యూజర్లకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై సెక్యూర్డ్ రూపే క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. యూపీఐపై క్రెడిట్ లైన్ సేవలను అందిస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రుణబంధం పెరుగుతోంది
నూగూరి మహేందర్: ఒకప్పుడు చేబదులు కావాలంటే బంధువునో, స్నేహితులనో అడగాల్సిందే. లేదంటే తెలిసినవారి నుంచి వడ్డీకి అప్పు తీసుకోవాల్సిందే. వ్యక్తులు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఇప్పుడు ఒకరి ముందు నిలబడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఛాయ్ తాగేలోపు అప్పు పుడుతోంది. డబ్బులు పడ్డాయహో అంటూ ఫోన్ మెసేజ్ మోగుతుంది. ఏదైనా వస్తువు కొనాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా ఖాతాలో, జేబులో డబ్బులు ఉండక్కర్లేదు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు. అంతే కాదు యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలను బట్టి ఇన్స్టంట్ రుణం ఇచ్చేందుకూ బ్యాంకులు క్యూ కడుతున్నాయి. సిబిల్ స్కోర్ లేకున్నా పర్వాలేదంటున్నాయి. అప్పు సరే.. తీర్చేదెలా అన్న సందేహమూ అక్కర్లేదు. సింపుల్‌గా సులభ వాయిదాల్లో (ఈఎంఐ) తీర్చేసే వెసులుబాటూ కల్పిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్‌లో క్రెడిట్ కార్డులు, రుణాల వృద్ధి చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ రుణాల జోరు అభివృద్ధికి సూచికగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన జీవితం కోసం.. దిగువ–మధ్యతరగతి వినియోగదారులలో రుణాలు తీసుకునే విధానంలో గణనీయ మార్పు వచ్చింది. గతంలో మనుగడ కోసమైతే ఇప్పుడు ఆకాంక్షలు, వ్యాపారం, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఈ మార్పు దేశంలో అభివృద్ధి చెందుతున్న సామాజిక–ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోందని బ్యాంకింగ్ రంగ సంస్థలు అంటున్నాయి. కస్టమర్లు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నాయి. రుణ లభ్యత, డిజిటల్ ఆధారిత బ్యాంకింగ్ మారుమూల పల్లెలకూ చొచ్చుకుపోవడం లోన్ పోర్ట్‌ఫోలియో పెరుగుదలకు దోహదం చేస్తోంది. నడిపిస్తున్న ధోరణులు.. కోవిడ్–19 మహమ్మారి రాక షాపింగ్ తీరుతెన్నులను మార్చేసింది. కన్జ్సూమర్ ఫైనాన్స్ రంగంలో ఉన్న హోమ్ క్రెడిట్ అధ్యయనం ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ వాటా 2021లో 69% ఉంటే.. 2023లో ఇది 48%కి, 2024 నాటికి 53%కి చేరింది. మహిళా కస్టమర్లలో 60%, మిలీనియల్స్ 59%, జనరేషన్ జెడ్ 58%, మెట్రోలు, టైర్–2 నగరాల్లో 56% మంది ఆన్లైన్ ట్రెండ్‌ను నడిపిస్తున్నారు. యాప్–ఆధారిత బ్యాంకింగ్‌కు మిలీనియల్స్‌లో 69% శాతం సై అంటున్నారు. జెన్ జెడ్ 65%, జెన్ ఎక్స్‌లో 58% యాప్ బేస్ట్ బ్యాంకింగ్ కోరుకుంటున్నారు. దిగువ–మధ్యతరగతి రుణగ్రహీతలలో 43% మందికి ఈఎంఐ కార్డ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన క్రెడిట్ సాధనంగా మారాయి. క్రెడిట్ కార్డ్‌లను 24%, డిజిటల్ లెండింగ్ యాప్‌లను 12% మంది ఎంచుకుంటున్నారు. వృద్ధిలోనూ ‘క్రెడిట్’వాటికే.. 2024 డిసెంబర్ నాటికి దేశంలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య 10.8 కోట్లు.. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు దాదాపు రెండింతలు అయ్యాయి. డెబిట్ కార్డులు ఐదేళ్లలో 80.53 కోట్ల నుంచి 2024 డిసెంబర్ నాటికి 99.09 కోట్లకు చేరాయి. ఏడాదిలో క్రెడిట్ కార్డుల వృద్ధి 10.31 శాతం ఉంటే డెబిట్ కార్డుల విషయంలో ఇది 3.13 శాతమే. క్రెడిట్ కార్డులతో జరిపిన చెల్లింపులు 2024 డిసెంబర్లో రూ.1,88,086 కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 13.9 శాతం ఎక్కువ. 2024 డిసెంబర్లో కార్డులతో చేసిన మొత్తం చెల్లింపుల విలువలో క్రెడిట్ కార్డుల వాటా 82.22 శాతం ఉండటం గమనార్హం. 2023 డిసెంబర్లో ఇది 77.5 శాతం. క్రెడిట్ కార్డుల విభాగంలో మొత్తం పోర్ట్‌ఫోలియోలో ప్రైవేటు బ్యాంకుల వాటానే 69.8 శాతంగా ఉంది. క్రెడిట్ కార్డు వినియోగదారులు 2024 మార్చి నాటికి చెల్లించాల్సిన మొత్తం 27.7 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరింది. రుణాల వృద్ధి అభివృద్ధికి సూచిక! రుణాలు పెరుగుతుండటం అభివృద్ధికి సూచిక. బ్యాంకుల మద్దతు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. బ్యాంకింగ్ లేకుండా వ్యవస్థ లేదు. వ్యవస్థ తదుపరి స్థాయికి చేరితేనే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరుగుతుంది. బ్యాంకులు లాభాల్లో ఉన్నాయంటే అందుకు కారణం అర్హతగల వారికి రుణాలు జారీ చేయడమే. రుణ మార్కెట్లో మొండి బాకీలు సహజం. అయితే సానుకూల ధోరణితోనే రికవరీ చేయాలి. ఆర్థిక స్థోమత చూసి క్రెడిట్ కార్డులు ఇచి్చనంత వరకు ఎటువంటి సమస్య లేదు. – వి.ఎస్.రాంబాబు, జాతీయ కార్యదర్శి, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
యూపీఐకి క్రెడిట్ కార్డ్ లింక్.. లాభమా.. నష్టమా?
డిజిటల్ చెల్లింపులు విస్తృతమైన నేటి కాలంలో ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి క్రెడిట్ కార్డ్ అనేది శక్తివంతమైన ఆయుధం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చెల్లింపులకు అనువుగా ఉండటమే కాకుండా అనేక రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తుంది.అయితే ఇదే సమయంలో కార్డ్ చెల్లింపుల కంటే యూపీఐ (UPI) చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. యూపీఐ ద్వారా చెల్లింపులు గతేడాది అక్టోబర్‌లో 2.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 37 శాతం పెరినట్లు ఆర్బీఐ (RBI) తాజా డేటా తెలియజేస్తోంది.ఈనేపథ్యంలో క్రెడిట్ కార్డ్ సౌలభ్యాన్ని, యూపీఐ సేవల సౌకర్యాన్ని మిళితం చూస్తూ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అనే సర్వీస్ అందుబాటులో ఉంది. దీన్ని ఇప్పటికే కొంత మంది వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల లాభమా... నష్టమా? ప్రయోజనాలేంటి.. ప్రతికూలతలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం..ప్రయోజనాలుమామూలు యూపీఐ సర్వీస్ లాగా కాకుండా, వినియోగదారులు తమకు కావాల్సినప్పుడే క్రెడిట్ లైన్‌ను ఉపయోగించుకునేలా చేస్తుంది. సాధారణంగా యూపీఐ చెల్లింపు చేసిన ప్రతిసారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో నగదు తరుగుతుంది. కానీ క్రెడిట్ కార్డ్ విషయంలో ఇది జరగదు.ప్రతి చిన్న ఖర్చుకు బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లించినప్పుడు ఆ లావాదేవీకి బ్యాంక్ ఎంట్రీ జరుగుతుంది. అదే లావాదేవీ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగినప్పుడు, క్రెడిట్ కార్డ్‌కి చెల్లింపు మాత్రమే బ్యాంక్ స్టేట్మెంట్పై ప్రతిబింబిస్తుంది. తద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ భారీగా ఉండే ఆస్కారం ఉండదు.సాధారణంగా చాలా మంది యూపీఐ వినియోగదారులు తమ ఉన్న క్రెడిట్ కార్డులను పెద్ద మొత్తంలో చేసే ఖర్చులకు మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి వేర్వేరు ఖర్చుల కోసం వేర్వేరు మార్గాలను ఉపయోగించడం కంటే అన్ని చెల్లింపుల కోసం కేవలం ఒక మార్గాన్ని ఉపయోగించవచ్చు.నష్టాలుక్రెడిట్ లైన్ అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు చేసే ధోరణి వినియోగదారులలో ఉంటుంది. డబ్బు తక్షణమే మీ బ్యాంక్‌కి వెళ్లనప్పుడు, మీరు మీ బడ్జెట్‌ను అధికంగా పెంచుతారు. కాబట్టి, చిన్న, పెద్ద ఖర్చులన్నింటినీ మీ క్రెడిట్ కార్డ్‌కి లింక్ చేయడం వల్ల అధిక ఖర్చులు జరిగే అవకాశం ఉంది.పెరిగిన టెక్నాలజీ కారణంగా చెల్లింపులు చాలా సౌకర్యవంతంగా మారాయి. అయితే ఏదైనా సాంకేతిక లోపం సంభవించినప్పుడు, పనులు నిలిచిపోవచ్చు. అందువల్ల, చెల్లింపులను వివిధ మార్గాల ద్వారా విస్తరించడం మంచిది.ప్రతి బ్యాంక్ కార్డ్ యూపీఐ యాక్టివేషన్‌ను అందించదు. కాబట్టి, మీరు ఒకే కార్డ్, ఒకే సర్వీస్‌కు కట్టుబడి ఉంటే కొన్ని క్యాష్‌బ్యాక్‌లు లేదా ప్రయోజనాలను పొందలేరు. -
నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీ
దేశంలోని బ్యాంకులు 2024 డిసెంబర్ నెలలో సుమారు 8,20,000 కొత్త క్రెడిట్ కార్డు(Credit Cards)లను జారీ చేశాయి. ఇది గడిచిన నాలుగు నెలల్లో అత్యధిక సంఖ్యలో కార్డుల జారీని సూచిస్తుంది. పెళ్లిళ్ల సీజన్, ఇయర్ ఎండ్ ఫెస్టివల్స్ సమయంలో ఖర్చులు అధికమవడం ఈ కార్డుల పెరుగుదలకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు.బ్యాంకుల వారీగా కార్డుల జారీ ఇలా..హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ కార్డుల జారీలో అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం జారీ చేసిన కార్డుల్లో ఈ రెండు సంస్థలే సగానికిపైగా వాటా ఆక్రమించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3,12,000 కార్డులను జోడించగా, ఎస్బీఐ కార్డ్స్ 2,09,000 కార్డులను జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 1,50,000 కొత్త కార్డులు విడుదల చేసింది.దేనికి ఖర్చు చేస్తున్నారంటే..క్రెడిట్ కార్డు వ్యయం గతంలో కంటే దాదాపు 11 శాతం పెరిగి 2024 డిసెంబర్ నాటికి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందించే ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, డీల్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లకు ఆదరణ లభించడం ఈ వ్యయం పెరగడానికి కారణం.ఇదీ చదవండి: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు అప్‌మార్కెట్ వాటా, వృద్ధిచలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 2024 నవంబర్‌లో 107.2 మిలియన్ల నుంచి 2024 డిసెంబర్ చివరి నాటికి 108 మిలియన్లకు చేరుకుంది. అన్ సెక్యూర్డ్ లోన్ల విభాగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత వివాహ సీజన్, రాబోయే వేసవి సెలవులను అందిపుచ్చుకోవడానికి బ్యాంకులు వ్యూహాత్మకంగా కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నారు. -
ఎయిర్టెల్ యాప్‌లో బజాజ్ ఫైనాన్స్.. కొత్త క్రెడిట్ కార్డు
ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఎన్బీఎఫ్సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్, టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా బజాజ్ ఫైనాన్స్ రుణ సంబంధ ఉత్పత్తులను తొలుత ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో అందజేస్తారు. ఆ తరువాత ఎయిర్టెల్ స్టోర్ల ద్వారా ఈ సేవలను విస్తరిస్తారు.ఆర్థిక సేవలు దేశవ్యాప్తంగా విస్తృతం అయ్యేందుకు తమకున్న బలం దోహదం చేస్తుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ‘10 లక్షల మందికిపైగా వినియోగదార్లు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. కస్టమర్ల అన్ని ఆర్థిక అవసరాల కోసం ఎయిర్టెల్ ఫైనాన్స్‌ను వన్–స్టాప్ షాప్‌గా మార్చడమే లక్ష్యం’ అని భారతీ ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. డేటా ఆధారిత రుణ పూచీకత్తు, అందరికీ ఆర్థిక సేవలు చేరేందుకు భారత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ గుండెకాయగా ఉందని బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్ చెప్పారు.కంపెనీ ప్రకటన ప్రకారం.. ఎయిర్టెల్ కస్టమర్లు ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డును (Airtel-Bajaj Finserv EMI) ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ స్టోర్ల నెట్వర్క్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.“ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డు బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆఫర్ల శ్రేణికి యాక్సెస్‌ను అందిస్తుంది. 4,000 కంటే ఎక్కువ నగరాల్లోని 1.5 లక్షల పార్టనర్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా సామాగ్రితో సహా వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి సౌకర్యవంతమైన ఈఎంఐ ఎంపికలు, చెల్లింపు ప్లాన్ల నుండి వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. అదనంగా కో-బ్రాండెడ్ కార్డ్ బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ-కామర్స్ లావాదేవీలకు వర్తిస్తుంది" అని పేర్కొంది. -
కొత్త రకం క్రెడిట్ కార్డు.. ఎఫ్డీ, యూపీఐ లింక్‌తో..
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC FIRST Bank) రూపే (RuPay) భాగస్వామ్యంతో ఫస్ట్ ఎర్న్ (FIRST EARN) పేరుతో కొత్త రకం క్రెడిట్ కార్డును ప్రారంభించింది. యూపీఐ (UPI), ఎఫ్డీ (FD) లింక్‌తో ఈ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించినట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్‌కు అనుసంధానంగా దీన్ని జారీ చేస్తారు. దీంతో యూపీఐ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.ఈ క్రెడిట్ కార్డు దరఖాస్తులోనే ఫిక్స్డ్ డిపాజిట్ తెరిచే అంశాన్ని కూడా ఏకీకృతం చేసి ఉంటారు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఈ కార్డుకు జమవుతుంది. అలాగే కస్టమర్లు ఈ కార్డు ద్వారా యూపీఐలో క్రెడిట్‌ని, రివార్డ్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డును యూపీఐతో సజావుగా అనుసంధానించడం వల్ల దేశం అంతటా 6 కోట్లకుపైగా యూపీఐ అనుసంధానిత మర్చెంట్ల వద్ద దీన్ని వినియోగించవచ్చు. ప్రతి యూపీఐ ఖర్చుపైనా కస్టమర్లు 1 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. దీంతో ప్రతి లావాదేవీ రివార్డ్‌గా మారుతుంది."ఇది ఆర్థిక సేవల ప్రపంచానికి గేట్‌వే ఉత్పత్తిగా మొదటిసారి క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందింది" అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో క్రెడిట్ కార్డ్స్, ఫాస్ట్‌ట్యాగ్, లాయల్టీ ని హెడ్ శిరీష్ భండారి పేర్కొన్నారు. "ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. కార్డ్ ఖాతాకు ఆటోమేటిక్‌గా క్రెడిట్ చేసే 1 శాతం క్యాష్‌బ్యాక్‌తో ప్రతి రోజు యూపీఐ చెల్లింపులను తక్షణమే సూపర్ రివార్డింగ్ చేస్తుందని తెలిపారు.ఫస్ట్ ఎర్న్ క్రెడిట్ కార్డు ముఖ్య ఫీచర్లు» ఈ క్రెడిట్ కార్డ్ 6 కోట్ల కంటే ఎక్కువ క్యూఆర్ కోడ్లలో యూపీఐ లావాదేవీలను అనుమతిస్తుంది .» ఇది వర్చువల్ క్రెడిట్ కార్డ్. తక్షణ ఉపయోగం కోసం యూపీఐ ఇంటిగ్రేషన్‌తో తక్షణమే జారీ చేస్తారు.» ఇది ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా అందించే సురక్షిత క్రెడిట్ కార్డ్. అందరికీ అందుబాటులో ఉంటుంది.» కొత్త కార్డ్ హోల్డర్లు కార్డు జారీ చేసిన 15 15 రోజులలోపు చేసే మొదటి యూపీఐ లావాదేవీపై 100 శాతం రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు.ప్రభావవంతంగా మొదటి సంవత్సరం ఫీజు క్యాష్ బ్యాక్‌గా వెనక్కివస్తుంది.» బ్యాంక్ యాప్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలపై అలాగే బీమా, యుటిలిటీ బిల్లులు, ఈ-కామర్స్ కొనుగోళ్లపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.» జొమాటోకు చెందిన ‘డిస్ట్రిక్ట్’ ద్వారా సినిమా టికెట్లు కొనుగోలు చేస్తే 25% రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది.» బ్యాంక్ 1 సంవత్సరం 1 రోజు ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది.» రూ.1,399 విలువైన కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ సహాయం.» కార్డు పోగొట్టుకున్నప్పుడు రూ.25,000 కార్డ్ లయబిలిటీ కవర్ లభిస్తుంది.» రూ.2,00,000 వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుంది. -
క్రెడిట్ కార్డు పోయిందా? బ్లాక్ చేయండిలా..
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా క్రెడిట్‌కార్డుల వాడకం అధికమవుతోంది. అయితే ప్రయాణాల్లోనో లేదా ఇతర సందర్భాల్లోనో కార్డులను పోగోట్టుకోవడం సహజం. ఇలాంటి సమయాల్లో చాలామంది ఏ చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేస్తూంటారు. ఆ కార్డు స్కామర్ల చేతికి చిక్కితే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సందర్భాల్లో కార్డులు కోల్పోతే వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. వాటిని బ్లాక్ చేయించి కొత్తగా కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒకవేళ తమ కార్డు కోల్పోతే ఎలా బ్లాక్ చేయాలో కింద తెలుసుకుందాం.ఎస్బీఐ కార్డ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. 39 02 02 02 (స్థానిక ఎస్టీడీ కోడను ముందు జత చేయాలి) లేదా 1860 180 1290కు డయల్ చేయాలి. పోయిన లేదా దొంగిలించబడిన కార్డు వివరాలతో ఐవీఆర్ సూచనలను పాటించాలి.ఎస్ఎంఎస్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 5676791కు BLOCKXXXX (XXXX స్థానంలో కార్డు నెంబరు చివరి నాలుగు అంకెలు ఉండేలా చూసుకోవాలి)అని టైప్ చేసి టెక్ట్స్ మెసేజ్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్లో మాత్రమే లాగిన్ అవ్వాలి.ఎన్‌బీఐ కార్డ్స్ వెబ్సైట్(https://www.sbicard.com/)కు లాగిన్ అవ్వాలి.లాగిన్ చేసిన తర్వాత హోం పేజీ ఎడమవైపున ఉన్న ‘రిక్వెస్ట్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.‘రిపోర్ట్ లాస్ట్/ స్టోలెన్ కార్డ్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డును బ్లాక్ చేయడానికి ప్రాంప్ట్‌లను అనుసరించాలి.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్ ద్వారా బ్లాక్ చేయవచ్చు.ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.హోం పేజీ ఎగువ ఎడమ వైపు కార్నర్లో మెనూ మీద ట్యాప్ చేయాలి.‘సర్వీస్ రిక్వెస్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.‘లాస్/ స్టోలెన్ రిపోర్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.కార్డ్ నెంబరు ఎంచుకుని రెక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.పైన చెప్పిన ఏ పద్ధతులు మీకు అందుబాటులో లేకపోతే వెంటనే మీ దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి సమస్యను తెలియజేయాలి. కార్డును బ్లాక్ చేసిన తరువాత ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ధ్రువీకరణ అందుతుంది. -
క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?
షాపింగ్ చేయాలన్నా..నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా.. టికెట్ బుకింగ్స్ కోసం, ఇంటి అద్దె చెల్లించడం కోసం, ఇలా అవీ ఇవీ అని తేడా లేకుండా క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వాడకం మంచిదే కానీ.. కొన్నిసార్లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్రెడిట్ కార్డును ఉపయోగించి రెంట్ (అద్దె) కట్టడం మంచిదేనా? దీని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం.. రివార్డ్ పాయింట్లను కూడబెట్టుకోవడానికి లేదా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి మంచి వ్యూహం కావచ్చు. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపుప్రాసెసింగ్ ఛార్జీలు: మీరు క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించినప్పుడు, కొంతమంది ఓనర్స్ లేదా ఏజెన్సీలు ప్రాసెసింగ్ ఛార్జీలను సైతం వసూలు చేస్తారు. ఈ ఛార్జి మీరు చెల్లించే అద్దెలో రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటుంది.క్యాష్ అడ్వాన్స్ ఫీజు: అద్దె చెల్లింపులను సాధారణ లావాదేవీలుగా పరిగణించడానికి బదులు.. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు వాటిని క్యాష్ అడ్వాన్స్‌లుగా పరిగణిస్తారు. దీనికి సాధారణ వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.గత బకాయి చెల్లింపులపై వడ్డీ: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించకపోతే.. అది తప్పకుండా మీ మీద ఆర్ధిక భారం పెంచుతుంది. కాబట్టి అలాంటి సమయంలో అద్దె చెల్లిస్తే.. వడ్డీ మరింత ఎక్కువవుతుంది.క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించే ముందు తెలుసుకోవసిన అంశాలుఫీజులు: అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల.. ప్రాసెసింగ్ ఫీజు కొంత ఎక్కువగా ఉంటుంది.వడ్డీ ఆధారిత ఫీజులు: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించడాం వల్ల లాభాలురివార్డ్లను సంపాదించవచ్చు: క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లిస్తే.. క్యాష్ బ్యాక్ లేదా క్రెడిట్ కార్డ్ రివార్డ్‌లను పొందవచ్చు. ఇది షాపింగ్ వంటి వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి షాపింగ్ సమయంలో కొంత డబ్బు ఆదా అవుతుంది.క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేయడం వల్ల.. క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.అద్దె చెల్లించడంలో ఆలస్యం నివారించవచ్చు: చేతిలో డబ్బు లేకపోయినా.. మీరు క్రెడిట్ కార్డు ద్వారా సకాలంలో అద్దె చెల్లించవచ్చు. ఒకవేళా ఇంటి ఓనర్.. అద్దె ఆలస్యం చేస్తే విధించే ఫెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు.పేమెంట్ సెక్యూరిటీ: క్రెడిట్ కార్డు హిస్టరీ వల్ల మిమ్మల్ని ఎవరూ మోసం చేసే అవకాశం లేదు. కాబట్టి మీ చెల్లింపులకు ఇక్కడ భద్రత లభిస్తుంది. -
యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపు ఎలాగంటే..
ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రధానంగా యూపీఐని ఎక్కువ మంది వాడుతుండడంతో, క్రెడిట్ కార్డు(credit card) వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఎంచుకుంటున్నారు. తిరిగి కార్డు బిల్లులు చెల్లించేందుకు కూడా యూపీఐను ఎంచుకుంటే మరింత సులువుగా పేమెంట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేయడం ఎలా?మొదటిసారి యూపీఐని ఉపయోగిస్తుంటే, డిజిటల్ చెల్లింపులు చేయడానికి, మీ క్రెడిట్ కార్డు(credit card)లను ఉపయోగించడానికి భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి.క్రెడిట్ కార్డును యూపీఐతో జత చేయాలి. అందుకు యాప్ ఓపెన్ చేసి ‘యాడ్ పేమెంట్ మెథడ్’ విభాగానికి వెళ్లాలి.క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకుని క్రెడిట్ కార్డ్ నంబర్, సివీవీ, ఎక్స్పైరీ తేదీ వంటి వివరాలను ఇవ్వాలి.తర్వాత మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. దాంతో యూపీఐకు కార్డు లింక్ అవుతుంది.క్రెడిట్ కార్డు ఖాతాను లింక్ చేసిన తర్వాత కార్డుతో యూపీఐ ఐడీని సృష్టించాలి. యూపీఐ ఐడీ అనేది సంఖ్యలు, అక్షరాలు, స్పెషల్ సింబల్స్ కలిగిన ఒక ప్రత్యేక గుర్తింపు. మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన ఈ ఐడీ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడానికి, స్వీకరించడానికి సహాయపడుతుంది.యూపీఐ ఐడీ చెక్ చేసుకోవడానికి యాప్‌లోని ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి ‘యూపీఐ ఐడీ’ని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయంక్రెడిట్ కార్డు చెల్లింపులు చేయడం ఎలా?క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదా ‘పే ఫోన్ నంబర్’ లేదా ‘పే కాంటాక్ట్స్’ వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.తర్వాత యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. యాప్ క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్ లేదా కాంటాక్ట్ నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాత, బదిలీ చేయాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి.తర్వాత చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.యూపీఐ పిన్ ఎంటర్ చేసి లావాదేవీ(UPI payments)ని పూర్తి చేయాలి.యాప్‌లో సంబంధిత చెల్లింపు ఎంపికల్లో ‘సెల్ఫ్ ట్రాన్స్ఫర్’ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. -
అపోహలు వీడితేనే మంచి స్కోరు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి స్కోరు(CIBIL score)ను సాధించాలంటే దీనిపై ఉన్న అపోహలు వీడాలని సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు సాలరీ ఆధారంగా క్రెడిట్ కార్డు(Credit Card) ఆఫర్ ఉందని ఫోన్లు వస్తుంటాయి. దాంతో చాలామంది క్రెడిట్‌కార్డును తీసుకుంటున్నారు. తొలి కార్డును సంపాదించడమే కొంత కష్టం. ఆ తర్వాత కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోరును ఆధారంగా చేసుకుని తమ క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ ముందుకు వస్తాయి. అయితే క్రెడిట్ స్కోరును పెంచుకునే దశలో చాలామందికి కొన్ని సందేహాలున్నాయి. వాటిపై స్పష్టత ఉంటే స్కోరు దూసుకెళ్లేలా చేయవచ్చు.ఆదాయం అవసరమా..?క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలంటే రాబడి బావుండాలని అనుకుంటారు. కానీ, ఆదాయంతో సంబంధం ఉండదు. ఏటా రూ.6 లక్షలు ఆదాయం ఉన్నవారికి మంచి క్రెడిట్ స్కోరు ఉండొచ్చు. ఏటా రూ.20 లక్షల ఆదాయం(Income) ఉన్నవారి స్కోరు పేలవంగా ఉండొచ్చు. వారు గతంలో తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపులు సరళి ఎలా ఉందనే దానిపై ఇది ఆధారపడుతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్ వినియోగం వంటివి స్కోరు పెరిగేందుకు దోహదపడుతాయి.కార్డును పూర్తిగా వాడవచ్చా..?క్రెడిట్ కార్డు పరిమితి పూర్తిగా వాడలేదు కదా, స్కోరు పడిపోయిందనే సందేహం వ్యక్తం చేస్తారు. నిజానికి కార్డు మొత్తం పరిమితి మేరకు వినియోగిస్తే స్కోరుపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్(Card Limit) రూ.1 లక్ష అనుకుందాం. మీరు అందులో సుమారు 40 శాతం అంటే రూ.40,000 వినియోగిస్తే మేలు. లిమిట్ ఉందని రూ.90,000 వరకు లిమిట్ వినియోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఏకమొత్తంలో అధికంగా క్రెడిట్ కార్డు వాడితే స్కోరు తగ్గే ప్రమాదం ఉంది.పాత కార్డులను క్లోజ్ చేయాలా..?గతంలో వాడి, ప్రస్తుతం వాడకుండా ఉన్న కార్డులను క్లోజ్ చేస్తే స్కోరు పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇందులో నిజం లేదు. గతంలో మీరు వాడిన కార్డులపై క్రెడిట్ హిస్టరీ జనరేట్ అవుతుంది. మీరు కార్డు క్లోజ్ చేస్తే ఆ హిస్టరీ కూడా డెలిట్ అవుతుంది. సుధీర్ఘ క్రెడిట్ హిస్టరీ ఉంటే స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’స్కోరు పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్(Loans)ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30-40 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. -
ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డులు విస్తృతంగా పెరిగిపోయాయి. వీటికితోడు అనుకూలమైన, సురక్షితమైన చెల్లింపు ఎంపికగా వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఉద్భవించాయి. సాంప్రదాయ భౌతిక క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా చోరీకి గురవ్వడం, పోగొట్టుకోవడం వంటి సమస్యలు వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లతో ఉండవు.ఏమిటీ వర్చువల్ క్రెడిట్ కార్డ్?వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది భౌతిక క్రెడిట్ కార్డుకు డిజిటల్ రూపం. 16-అంకెల కార్డ్ నంబర్, సీవీవీ (CVV), గడువు తేదీతో సహా భౌతిక కార్డుకు ఉన్న అన్ని ముఖ్యమైన వివరాలూ దీనికీ ఉంటాయి. సాధారణంగా వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక కార్డ్. ఇది మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్‌కి యాడ్-ఆన్‌గా పనిచేస్తుంది. పరిమిత సంఖ్యలో లావాదేవీలను అనుమతిస్తుంది.ఎలా పని చేస్తుంది?వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ లాగానే పని చేస్తుంది. అయితే మెరుగైన భద్రతా లక్షణాలను అందిస్తుంది. వర్చువల్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేసినప్పుడు, వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. మోసం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఉపయోగించండిలా..» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం సూటిగా ఉంటుంది. ఫిజికల్ కార్డ్‌ని స్వైప్ చేయాల్సిన అవసరం లేదు.» మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న వెబ్‌సైట్‌కు వెళ్ళండి. » వర్చువల్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.» మీ వర్చువల్ క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, సీవీవీని నమోదు చేయండి.» తర్వాత, మీ రిజిస్టర్డ్ ఫోన్‌కు ఓటీపీ వస్తుతంది. ఇది కొన్ని నిమిషాలే చెల్లుబాటు అవుతుంది.» ఓటీపీని ఎంటర్ చేసి చెక్అవుట్ ప్రక్రియను పూర్తి చేయండి.వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను మీ ఫోన్ లేదా ఆన్లైన్ ఖాతాల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. భౌతిక కార్డ్‌ని తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.» భౌతిక కార్డ్‌ని కోల్పోయే ప్రమాదం ఉండదు. మోసపూరిత లావాదేవీల నుండి వినియోగదారులను రక్షించడానికి అనేక ప్లాట్‌ఫామ్‌లు అంతర్నిర్మిత డిజిటల్ మోస నివారణ సాధనాలను కూడా అందిస్తాయి.» వర్చువల్ క్రెడిట్ కార్డ్ కోసం ఖర్చు పరిమితులు, గడువు తేదీలను సెట్ చేయవచ్చు. ఇది మెరుగైన ఆర్థిక నిర్వహణకు అధిక వ్యయం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.వర్చువల్ క్రెడిట్ కార్డ్ పరిమితులు» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను ప్రధానంగా ఆన్లైన్ చెల్లింపుల కోసం రూపొందించారు. భౌతిక కార్డ్‌ల వంటి ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం వీటిని ఉపయోగించలేరు.» ఆన్లైన్ రిటైలర్లందరూ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను అంగీకరించరు. దీంతో ఆన్లైన్ కొనుగోళ్లకు ఇబ్బంది కలుగుతుంది.» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు సాధారణంగా తాత్కాలిక చెల్లుబాటును కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది 24 నుండి 48 గంటల వరకు ఉంటుంది. అయితే ఇది జారీ చేసే సంస్థను బట్టి మారవచ్చు.టాప్ ఫ్రీ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఇవే..దేశంలో వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను బ్యాంకులు అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) అందిస్తాయి. దేశంలోని ప్రధాన బ్యాంకులు అందించే కొన్ని టాప్ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ హెచ్డీఎఫ్సీ నెట్సేఫ్ వర్చువల్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఫ్రీఛార్జ్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) నెట్ కార్డ్ (Netc@rd), హెచ్ఎస్బీసీ (HSBC) బ్యాంక్ అడ్వాంటేజ్ వర్చువల్ కార్డ్, ఎస్బీఐ (SBI) కార్పొరేట్ వర్చువల్ కార్డ్ పేరుతో వర్చువల్ కార్డులు అందిస్తున్నాయి. -
క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..
నెలవారీ వేతన జీవులతోపాటు చాలామంది వద్ద సాధారణంగా క్రెడిట్ కార్డు ఉండడం గమనిస్తుంటారు. అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఆదుకుంటుందనే ధీమాతో ఈ కార్డును తీసుకుంటారు. బిల్లు జనరేట్ అయ్యాక పూర్తి పేమెంట్ లేదా అత్యవసర సమయాల్లో మినియం బిల్లును చెల్లిస్తుంటారు. క్రెడిట్ కార్డు(Credit Card)లాగే కొన్ని బ్యాంకులు ఛార్జ్ కార్డు(Charge Card)లను జారీ చేస్తాయి. అయితే ఈ రెండింటి వినియోగంలో కొన్ని తేడాలున్నాయి. అసలు ఛార్జ్ కార్డులు ఎవరికి జారీ చేస్తారు.. పేమెంట్ నియమాలు ఎలా ఉంటాయి..ఛార్జ్ కార్డు నిజంగా ఎవరికి అవసరమో తెలుసుకుందాం.ఛార్జ్ కార్డులుఛార్జ్ కార్డు అనేది ఒక రకమైన చెల్లింపు కార్డు. ఎలాంటి ముందస్తు లిమిట్ పరిమితులు లేకుండా దీన్ని జారీ చేస్తారు. ప్రతి బిల్లింగ్ సైకిల్లో కొనుగోళ్లు చేయడానికి క్రెడిట్ కార్డులాగే దీన్ని వినియోగించవచ్చు. అయితే దీని వినియోగంలో పరిమితి ఉండదు కాబట్టి ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు సైకిల్ పూర్తి అయ్యేలోపు మొత్తం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సకాలంలో పూర్తి బ్యాలెన్స్ చెల్లించడంలో విఫలమైతే మాత్రం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. క్రెడిట్ కార్డుల మాదిరిగానే ఛార్జ్ కార్డుల వినియోగంపై ట్రావెల్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, వివిధ రివార్డు పాయింట్లు ఇతర ప్రయోజనాలు అందిస్తారు.క్రెడిట్ కార్డు, ఛార్జ్ కార్డు మధ్య ప్రధాన తేడాలుక్రెడిట్ లిమిట్క్రెడిట్ కార్డులో ముందుగా సెట్ చేసిన లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే తక్కువే వాడుకోవాలి. కానీ ఛార్జ్ కార్డులో వ్యయ పరిమితి ఉండదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ బిల్లు జనరేట్ అయ్యాక మాత్రం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ చేయడంలో విఫలమైతే మాత్రం భారీగా ఛార్జీలు విధిస్తారు.బ్యాలెన్స్ పేమెంట్కనీస నెలవారీ చెల్లింపులకు క్రెడిట్ కార్డులో అవకాశం ఉంటుంది. కానీ ఛార్జ్ కార్డులో ఈ సదుపాయం ఉండదు. ప్రతి బిల్లింగ్ సైకిల్(Billing Cycle)లో పూర్తి బ్యాలెన్స్ చెల్లించాలి.వడ్డీ(Interest)మినిమం బ్యాలెన్స్ చెల్లించిన తర్వాత మిగతా చెల్లించాల్సిన దానికి క్రెడిట్ కార్డులో వడ్డీ విధిస్తారు. ఛార్జ్ కార్డులో అసలు ఆ సదుపాయమే ఉండదు.వార్షిక ఫీజులువార్షిక రుసుములు, ఆలస్య రుసుములు, వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డులకు ఉంటాయి. ఛార్జ్ కార్డులకు కూడా వార్షిక రుసుము ఉంటుంది. అది క్రెడిట్ కార్డు రుసుముతో పోలిస్తే భారీగా ఉంటుంది. ఆలస్య రుసుము కూడా అధికంగానే విధిస్తారు.రివార్డులుక్రెడిట్ కార్డులు, ఛార్జ్ కార్డులు రెండింటిలోనూ క్యాష్ బ్యాక్, ట్రావెల్ పాయింట్స్(Travel Points), రివార్డు ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఛార్జ్ కార్డుల్లో ఇవి కొంత అధికంగా ఉంటాయి. బ్యాంకును అనుసరించి ఈ పాయింట్లు మారుతుంటాయి.ఛార్జ్ కార్డుకు అర్హులెవరు..అద్భుతమైన క్రెడిట్ స్కోర్: ఛార్జ్ కార్డ్ జారీ చేసేవారు సాధారణంగా అద్భుతమైన క్రెడిట్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారుల కోసం చూస్తారు. సాధారణంగా 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే దీన్ని జారీ చేసే అవకాశం ఉంటుంది.స్థిరమైన ఆదాయం: ప్రతి నెలా బ్యాలెన్స్ పూర్తిగా చెల్లించగలరని నిరూపించడానికి స్థిరమైన, గణనీయమైన ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది.స్ట్రాంగ్ క్రెడిట్ హిస్టరీ: సకాలంలో చెల్లింపులు జరిపే ట్రాక్ రికార్డ్ ఉన్న క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యం.తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి: రుణదాతలు తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి(ఆదాయం ఎక్కువ ఉండి రుణాలపై తక్కువగా ఆధారపడడం) ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు.రెసిడెన్సీ స్టేటస్: ఛార్జ్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఏ దేశంలో అప్లై చేస్తున్నారో ఆ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..ఇస్తున్నారు కదా అని..క్రెడిట్ కార్డు, ఛార్జ్ కార్డు.. ఏ కార్డు తీసుకున్నా అప్పు ఎప్పుటికీ మంచిదికాదు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసినా బిల్లు సైకిల్లోపు దాన్ని తిరిగి పూర్తిగా చెల్లించే ఆర్థిక సత్తా సంపాదించాలి. బ్యాంకువారు లేదా వేరొకరు ఇస్తున్నారు కదా అని అప్పు చేస్తే తిరిగి అది చెల్లించలేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
SBI రివార్డ్ పాయింట్ల తనిఖీ & రీడీమ్: ఇలా సింపుల్..
మీరు క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీ జరిపిన ప్రతిసారీ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) ప్రత్యేకమైన రివార్డ్‌లను అందిస్తుంది. ఈ రివార్డ్ పాయింట్లను ఇష్టమైన బ్రాండ్లపై అద్భుతమైన డీల్‌లు లేదా ఆఫర్ల కోసం రీడీమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లతో మీకు కావాల్సిన వాటిని కొనుగోలు చేస్తూ.. ఖర్చులను కూడా ఆదా చేయవచ్చు. అయితే కొందరికి ఈ రివార్డ్ పాయింట్లను ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా రీడీమ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుండకపోవచ్చు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకోవచ్చు..ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, కస్టమర్ కేర్ ద్వారా కూడా రీడిమ్ చేసుకోవచ్చు.ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking)➤కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి ఎస్బీఐ అధికారిక కార్డ్ పోర్టల్ లాగిన్ చేసిన తరువాత.. మెను బార్లో 'రివార్డ్‌లు' ఎంచుకుని, ఆపై 'రివార్డ్‌లను రీడీమ్ చేయి' ఆప్షన్ ఎంచుకోండి.➤రివార్డ్ పాయింట్స్, సిటీ, కేటగిరీ వంటి వాటిని ఎంచుకోవాలి.➤'రివార్డ్స్ కేటలాగ్' నుంచి మీకు కావలసిన వస్తువును ఎంచుకున్న తరువాత.. 'రీడీమ్ నౌ'పై క్లిక్ చేయడం ద్వారా మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు.మొబైల్ యాప్ (Mobile App)●మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ కార్డ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.●యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయాలి.●లాగిన్ పూర్తయిన తరువాత 'రివార్డ్‌లు' విభాగానికి వెళ్లి, ఆపై 'రివార్డ్‌లను రీడీమ్ చేయి' ఎంచుకోవాలి.●రివార్డ్ పాయింట్స్, సిటీ, కేటగిరీ వంటి వాటిని ఎంచుకోవాలి.●'రివార్డ్స్ కేటలాగ్' నుంచి మీకు కావలసిన వస్తువును ఎంచుకున్న తరువాత.. 'రీడీమ్ నౌ'పై క్లిక్ చేయడం ద్వారా మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు.ఇదీ చదవండి: ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?కస్టమర్ కేర్ ద్వారా ఆఫ్‌లైన్▶ఎస్బీఐ కార్డ్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి.. మీ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయడంలో సహాయం కోసం అడగండి.▶కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మీకు రీడీమ్ చేసుకోవడంలో సహాయం చేస్తారు.▶పూర్తిగా రీడీమ్ చేసుకున్న తరువాత మీకు కావలసిన వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు.ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను చెక్ చేసుకోవడం ఎలా?ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను చెక్ చేసుకోవడానికి ఏఐ చాట్‌బాట్‌ను, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కాల్ చేయడం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్స్ సాయంతో చెక్ చేసుకోవచ్చు. -
క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరాలు పుట్టుకొస్తాయో ఎవరమూ చెప్పలేం. అప్పటిదాకా సజావుగా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క కుదుపు చాలు మొత్తం తిరగబడిపోవడానికి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉపద్రవాలు తలెత్తితే కుటుంబాలే కుదేలయిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తగిన ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు తట్టుకునే విధంగా ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. లేదంటే ప్రమాదమే. ఖర్చులు పెరిగిపోయి అరాకొరా జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఈమధ్యన ఎక్కువగా ఆశ్రయిస్తున్న సాధనం క్రెడిట్ కార్డులు. సగటున నెలకు రూ.25000-రూ.30000 ఆర్జించే వ్యక్తులు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొందరు ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులను స్టేటస్ సింబల్ కోసమో, సరదాకో వాడటం కూడా చూస్తూనే ఉన్నాం.ఏదైనా మోతాదు మించకూడదు..అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఎప్పటికే ప్రమాదమే. ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడినా సమస్యలు తప్పవు. ఆ తర్వాత బిల్లులు కట్టలేక నిండా మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది.ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే మొదటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి కదా అని కొంతమంది 4, 5 క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం.కార్డులిస్తున్న సంస్థలివే..దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొన్ని అన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్డులు ఇస్తున్నాయి.క్రెడిట్‌కార్డు పొందాలంటే..క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బావుండాలి. సాధారణంగా 750 -900 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. నెలకు రూ.20000 ఆదాయం పొందే వ్యక్తికి కూడా క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదే ప్రీమియం కార్డుల విషయానికొస్తే రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్డులు జారీ చేస్తున్నాయి.కార్డు జారీకి ఇవి చాలా ముఖ్యంకార్డు జారీ చేయాలంటే క్రెడిట్ హిస్టరీ బావుండాలి. అంటే గతంలో ఏవైనా లోన్లు తీసుకుని ఉంటే అవి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా లోన్లు ఎంత ఉన్నాయి ఎప్పటికి క్లోజ్ అవుతాయనే వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. కార్డు జారీలో మీరు పని చేస్తున్న కంపెనీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? ఆ కంపెనీ స్థాపించి ఎన్నాళ్లయింది? అది స్థిరమైన కంపెనీ యేనా? వంటి అంశాలు కూడా కార్డుల జారీలో బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి.మెరుగైన సిబిల్ ఉంటేనే..కార్డుకు దరఖాస్తు చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్ (దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు) ఎంతుందో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. కార్డు దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ మీరు అప్లై చేసే బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(Payslips) సమర్పించాలి. దీంతోపాటు ఫోటో ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు స్టేట్మెంట్ తదితర డాక్యుమెంట్లను ఇవ్వాలి. నేరుగా బ్యాంకులోగానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు లేదా సంస్థ మీరిచ్చిన పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి మీ అర్హతను బట్టి కార్డు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: త్వరలో టీజీ రెరా యాప్..ఇష్టారాజ్యంగా వాడితే అంతే..కార్డు చేతికొచ్చాక మీరు దాన్ని సరిగా వాడుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అలాకాక చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడితే అదే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. కార్డు బిల్లు వచ్చాక చాలామంది సాధారణంగా ఒక పొరపాటు చేస్తూంటారు. కనీస మొత్తం చెల్లిస్తూ గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల బాకీ ఎప్పటికీ తీరకపోగా తీసుకున్న మొత్తానికి మించి చెల్లిస్తారు. కట్టేది తక్కువేకదా అనే భ్రమ కలిగించేలా ఉన్న ఈ మినిమం పేమెంట్ ఊబిలో పడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఉదా: ఒక వ్యక్తికి రూ.1 లక్ష విలువ చేసే క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. అతను తన అవసరాల కోసం రూ.25,000 కార్డు నుంచి వాడేశాడు. దాని మీద అతను నెలకు కట్టాల్సిన కనీస మొత్తం రూ.1,250 మాత్రమే. కట్టేది తక్కువేగా అని ఆ మొత్తమే కట్టుకుంటూ పోతాడు. దీనివల్ల 6 నెలలు గడిచినా అతను అప్పటికి రూ.7,500 కట్టి ఉన్నా తీరేది అతి స్వల్ప మొత్తమే. ప్రతి నెలా చార్జీలు జత కలుస్తూనే ఉంటాయి. కార్డు వాడేవాళ్లలో నూటికి 95 మంది చేసే తప్పే ఇది.ఏం చేయాలంటే.. క్రెడిట్ కార్డు పేమెంట్ బిల్లు డేట్ జనరేట్ అయిన తర్వాత మళ్లీ బిల్లు వచ్చి దాన్ని చెల్లించేందుకు 45 రోజుల వడ్డీ రహిత సదుపాయం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మొత్తం బాకీ ఒకేసారి తీర్చేసి మళ్లీ కార్డును వాడుకుంటే మీకు వడ్డీల భారం తగ్గుతుంది. మీరు కట్టాల్సిన మొత్తం తీరిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ రికార్డూ పదిలంగా ఉంటుంది. సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు మీపై విశ్వాసం పెరిగి మీ లిమిట్ మొత్తాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధమయింది కదా క్రెడిట్ కార్డును మీరు ఎలా వాడుతున్నారన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే లబ్ది పొందుతారు. లేదంటే మునిగిపోతారు. ఆలోచించుకుని అడుగేయండి.-బెహరా శ్రీనివాస రావు,పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
క్రెడిట్ కార్డు యూజర్లకు అలెర్ట్
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.అసలేం జరిగిందంటే..క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్సీడీఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్సీడీఆర్సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులుఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి. -
ఈ క్రెడిట్ కార్డు కోసం 10 లక్షల మంది వెయింటింగ్!
చిన్న స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి లక్షల జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకు.. అందరూ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ కూడా ప్లాస్టిక్ లేదా స్టెయిన్ లెస్తో తయారైన కార్డులనే వినియోగిస్తుంటారు. కానీ రాబిన్ హుడ్ సంస్థ ఏకంగా గోల్డ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.రాబిన్ హుడ్ కంపెనీ తీసుకొచ్చిన గోల్డ్ క్రెడిట్ కార్డులలో ఒకదాన్ని.. సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్'కు పంపించింది. దీని డిజైన్ చూసి ఆల్ట్‌మన్ ఫిదా అయిపోయారు. ఈ విషయాన్నే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఒకప్పుడు గోల్డ్ కార్డు అంటే.. అది మార్కెట్ స్ట్రాటజీ అనుకున్నా, కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నా అన్నారు.గోల్డ్ క్రెడిట్ కార్డ్ రూపొందించిన కంపెనీ రాబిన్‌హుడ్.. స్టాక్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీతో సహా రిటైల్ బ్రోకరేజ్ సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. దీనిని 2013లో వ్లాదిమిర్ టెనెవ్, బైజు భట్ స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు గోల్డ్ క్రెడిట్ కార్డు రూపొందించింది. ఈ కార్డు ద్వారా చేసే అన్ని లావాదేవీలకు 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనికి ఎలాంటి ఫీజు లేకపోవడం మాత్రమే కాకుండా.. విదేశీ లావాదేవీలకు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.నిజానికి రాబిన్‌హుడ్ కంపెనీ రూపొందించిన ఈ గోల్డ్ కార్డు 17 గ్రాముల బరువు ఉంటుంది. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైంది. అయితే దీనిపైన 10 క్యారెట్ల గోల్డ్ కోటింగ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్డు కోసం 10 లక్షల మంది ఎదురు చూస్తున్నట్లు సమాచారం.a few months ago robinhood sent me a gold credit card with extremely high-quality details. i thought it was a ridiculous marketing stunt at the time but now it’s an example i give when talking about great design. pic.twitter.com/v0VWyJK7PT— Sam Altman (@sama) December 10, 2024 -
క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..
క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్య ఒకప్పటి నుంచి గణనీయంగా పెరుగుతూనే ఉంది. చిన్న స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి.. లక్షలు సంపాదించే పెద్ద ఉద్యోగి వరకు అందరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే గత అక్టోబర్ నెలలో 7.8 లక్షల మంది మాత్రమే క్రెడిట్ కార్డులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఖ్య 2023 అక్టోబర్ (16 లక్షలు) నెలతో పోలిస్తే 45 శాతం తగ్గినట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి చూస్తే క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా? అనే అనుమానం కూడా వస్తోంది.ఆనంద్ రాతీ నివేదిక ప్రకారం, 2024 మే నెలతో పోలిస్తే.. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డులు జారీ కొంత పెరిగిందని తెలుస్తోంది. అక్టోబర్ 2024లో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన మొత్తం ఖర్చు రూ. 1.78 ట్రిలియన్లకు చేరుకుందని, ఇది 13 శాతం వార్షిక వృద్ధిని ప్రతిబింబిస్తుందని సమాచారం. మొత్తం ఖర్చు విలువలో ఈ కామర్స్ వాటా 61 శాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది.గత ఏడాదితో పోలిస్తే.. ఈ అక్టోబర్ నెలలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య తక్కువ అయినప్పటికీ.. ఖర్చులు మాత్రం గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది ఏది కొనాలన్నా.. ఎక్కడ షాపింగ్ వంటివి చేయాలన్నా క్రెడిట్ కార్డులనే వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగుతున్నాయి. మొత్తం మీద క్రెడిట్ కార్డుల జారీ తగ్గినా.. వినియోగంలో మాత్రం ఎవ్వరూ తగ్గేదేలే అనేది స్పష్టంగా అర్దమైపోతోంది. -
క్రెడిట్ కార్డులపై కొత్త చార్జీలు.. డిసెంబర్ 20 నుంచి..
దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ వచ్చే డిసెంబర్ నెల నుండి తన క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో అనేక మార్పులు చేయబోతోంది. వీటిలో కొత్త రిడెంప్షన్ ఫీజులు, సవరించిన వడ్డీ రేట్లు, అదనపు లావాదేవీ ఛార్జీలు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 20 నుండి అమలుకానున్నాయి.ఎడ్జ్ రివార్డ్‌లపై రిడెంప్షన్ ఫీజుయాక్సిస్ బ్యాంక్ ఎడ్జ్ రివార్డ్‌లు లేదా మైల్స్‌ను వినియోగించడం కోసం రిడెంప్షన్ ఫీజులను ప్రవేశపెడుతోంది. క్యాష్ రిడెంప్షన్‌కు రూ. 99 (18 శాతం జీఎస్టీ అదనం), మైలేజ్ ప్రోగ్రామ్‌కు పాయింట్లను బదిలీ చేయడానికి రూ. 199 (18 శాతం జీఎస్టీ అదనం) వసూలు చేయనుంది. డిసెంబర్ 20 లోపు పాయింట్లను రీడీమ్ లేదా బదిలీ చేసుకుంటే ఈ ఛార్జీలను ఆదా చేసుకోవచ్చు.రిడెంప్షన్ ఫీజు వర్తించే కార్డులు ఇవే..» యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ క్రెడిట్ కార్డ్» శామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్» శామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్» యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ » యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్సవరించిన ఇతర ఛార్జీలునెలవారీ వడ్డీ రేటు 3.75 శాతానికి పెరుగుతుంది. ఆటో డెబిట్ రివర్సల్, చెక్ రిటర్న్‌పై చెల్లింపు మొత్తంలో 2 శాతం రుసుము ఉంటుంది. కనిష్ట పరిమితి రూ. 500 కాగా గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు. దీంతో శాఖలలో నగదు చెల్లింపుపైనా రూ.175 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ట బకాయి మొత్తాన్ని చెల్లించడంతో వరుసగా రెండు సార్లు విఫలమైతే రూ. 100 అదనపు రుసుము విధిస్తారు.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!ఇక డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) మార్కప్‌ను డీసీసీని 1.5 శాతానికి సవరించారు. అద్దె చెల్లింపులపై 1 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం, క్రెడ్, గూగుల్ పే వంటి ఏదైనా థర్డ్-పార్టీ యాప్ ద్వారా విద్యా రుసుము చెల్లిస్తే 1 శాతం రుసుము ఉంటుంది. అయితే, విద్యా సంస్థలకు నేరుగా చెల్లించే చెల్లింపులకు మినహాయింపు ఉంటుంది.రూ. 10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడ్‌పై 1% రుసుము చెల్లించాలి. ఒక స్టేట్మెంట్ సైకిల్లో రూ. 50,000 కంటే ఎక్కువ ఇంధన ఖర్చులు, రూ. 25,000 లకు మించిన యుటిలిటీ, రూ. 10,000 కంటే ఎక్కువ గేమింగ్ లావాదేవీలు ఉంటే 1% రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!
ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా లైఫ్ టైమ్ ఫ్రీ ఆఫర్‌తో కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది. యెస్ బ్యాంక్, ఎన్పీసీఐ భాగస్వామ్యంతో ఫిన్ టెక్ సంస్థ రియో.. యెస్ బ్యాంక్ రియో రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించింది.యూపీఐతో మిళితం చేసిన ఈ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా 10 కోట్లకుపైగా వ్యాపార స్థానాల నుండి షాపింగ్ చేయవచ్చు. ఈ కార్డ్ రియో యాప్‌లోని నో యువర్ ఆఫర్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు రూ. 5 లక్షల వరకు క్రెడిట్ పరిమితి, వ్యక్తిగతీకరించిన రివార్డ్‌లు, ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తుంది.ఈ కార్డు కావాలంటే..చిన్న నగరాల వినియోగదారులే ఈ కార్డుపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. దాని బీటా లాంచ్ సమయంలో 60 శాతం అప్లికేషన్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే వచ్చాయి. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు, ఉద్యోగం లేదా స్వంత వ్యాపారం కలిగి ఉన్నవారెవరైనా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తుదారు కనీసం రూ. 25,000 నికర నెలవారీ జీతం లేదా రూ. 5 లక్షల వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్ కలిగి ఉండాలి. అయితే ఇప్పటికే ఉన్న యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఈ కొత్త కార్దుకు అర్హులు కాదు.ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాజీవితకాలం ఉచితంఈ కార్డ్ జీవితకాలం ఉచితం. జాయినింగ్ ఫీజు కూడా లేదు. ఈ కార్డ్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, కొన్ని నిర్దిష్ట లావాదేవీలకు ఛార్జీ ఉంటుంది. ఒక నెలలో రూ. 15,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై 1% రుసుము, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడ్ లేదా ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా ఎడ్యుకేషన్ ఫీజుల చెల్లింపుపై 1% రుసుము, జీఎస్టీ ఉంటుంది. అదేవిధంగా రూ. 10,000లకు మించి ఇంధన లావాదేవీలకు ఒక్కో దానిపై 1% రుసుముతో పాటు జీఎస్టీ విధిస్తారు. -
మ్యూచువల్ ఫండ్ ఎంపిక ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్‌ను దీర్ఘకాలానికి ఎంపిక చేసుకునే సమయంలో గత పనితీరుపై ఆధారపకుండా.. చూడాల్సిన ఇతర అంశాలు ఏవి? – వినుత్ రాయ్ కేవలం గత పనితీరుపైనే ఆధారపడడం తప్పుదోవలో పయనించడమే అవుతుంది. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచి్చందంటే, అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి కారణం అంతర్గతంగా అవి పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీలే. కనుక ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ చేసి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ ఉత్థాన పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గృహ రుణం, కారు రుణం, క్రెడిట్ కార్డు రుణాలున్నాయి. వీటి కోసం ప్రతి నెలా రూ.40,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రుణాలను తీర్చివేసే మార్గాన్ని చూపగలరు? – ప్రేమ్ నాయక్ రుణాలు భవిష్యత్ ఆదాయాన్ని హరించివేస్తాయి. కనుక వీలైనంత వెంటనే వాటిని వదిలించుకోవాలి. ముఖ్యంగా వీటిల్లో ఆర్థిక భారంగా మారిన రుణాన్ని మొదట తీర్చివేయాలి. ముందుగా క్రెడిట్ కార్డు రుణంతో మొదలు పెట్టండి. అధిక వడ్డీ రేటుతో ఖరీదైన రుణం ఇది. అవసరమైతే మీ పెట్టుబడుల్లో కొన్నింటిని ఉపసంహరించుకుని క్రెడిట్‌కార్డు రుణం తీర్చివేయాలి. లేదంటే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అయినా దీన్నుంచి బయటపడే మార్గాన్ని చూడండి. క్రెడిట్ కార్డ్ రుణం చెల్లించిన అనంతరం కారు రుణాన్ని తీర్చివేయడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వాహనాల విలువ స్వల్పకాలంలోనే తగ్గిపోతుంది. కనుక వీలైనంత ముందుగా ఈ రుణాన్ని కూడా తీర్చివేయాలి. గృహ రుణాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో విలువ పెరిగే ఆస్తి ఇది. పైగా గృహ రుణాలపై అన్నింటికంటే తక్కువ వడ్డీ రేటుతోపాటు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. -
మారిన రూల్స్: ఈ రోజు నుంచే అమల్లోకి..
ఈ రోజు (నవంబర్ 1) నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్, అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్, సిలిండర్ ధరలలో మార్పు మొదలైనవి వాటిలో కీలకమైన మార్పులను జరగనున్నాయి. ఈ మార్పులు భారతదేశంలోని పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలుప్రతి నెల మాదిరిగానే.. పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తాయి. కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడే వ్యాపారులు ఈ హెచ్చుతగ్గులను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి సిలిండర్ ధరలలో మార్పు జరుగుతుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్డేట్స్యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించి కీలకమైన మార్పులు ఈ రోజు నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఇన్ సెక్యూర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ఫైనాన్స్ ఛార్జి నెలకు 3.75 శాతం పెరుగుతుంది. అంతే కాకుండా బిల్లింగ్ వ్యవధిలో యుటిలిటీ చెల్లింపులు మొత్తం రూ. 50వేలు కంటే ఎక్కువ ఉంటే.. 1 శాతం ఛార్జి విధిస్తారు. ఇది డిసెంబర్ 2024 ప్రారంభం నుంచి ప్రారంభమవుతుంది. ఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీజుఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డ్ ప్రోగ్రామ్ వంటి వాటిని నవీనీకరిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌తో సహా వివిధ సేవలపై ప్రభావం చూపుతుంది. ఈ నియమాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది.ఆర్బీఐ కొత్త డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ ఫ్రేమ్వర్క్డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్స్ (DMT) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు కూడా ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఈ చొరవ దేశీయ నగదు బదిలీలలో భద్రతను మెరుగుపరచడం, నవీకరించబడిన ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. 24 జులై 2024 సర్క్యులర్‌లో బ్యాంకింగ్ అవుట్లెట్ల లభ్యత, కేవైసీ అవసరాలను సులభంగా నెరవేర్చడంలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..ఐఆర్సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ఐఆర్సీటీసీ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు 120 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఇండియన్ రైల్వే కల్పించింది. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ 120 రోజులను 60 రోజులకు కుదించింది. అంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు రెండు నెలల ముందు మాత్రమే బుక్ చేసుకోగలరు. -
ఎస్బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డ్ రూల్స్ మార్పు
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు నవంబర్ 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డ్ కొత్త నిబంధనలలో మార్పులను ప్రకటించాయి.మీరు కూడా ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే, ఈ మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లో మార్పులుఎస్బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీ మారింది. ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేస్తే, దానిపై కొన్ని అదనపు ఛార్జీలు విధించవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్ లావాదేవీలు మొదలైన వాటిపై ఛార్జీలు వర్తించవచ్చు.ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లో మార్పులుఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఇంధన సర్ఛార్జ్ మినహాయింపులో మార్పులు చేసింది. కొన్ని కార్డ్‌లలో ఈ సదుపాయం పూర్తిగా తొలగించగా కొన్ని కార్డ్‌లలో ఇది పరిమితి ఆధారంగా అందుబాటులో ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను మార్చింది. నిర్దిష్ట కేటగిరీలలో రివార్డ్ పాయింట్ల రీడెంప్షన్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. దానిలో పరిమితులు ఉండవచ్చు. ఇక ఈఎంఐలో చేసిన కొనుగోళ్లకు వడ్డీ రేట్లు మారాయి. కార్డ్ రకం, లావాదేవీని బట్టి కొత్త వడ్డీ రేట్లు మారవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
రూపే క్రెడిట్ కార్డులకు ప్రత్యేక సౌకర్యాలు
రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ఎన్పీసీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. కార్డ్ హోల్డర్లకు విమానాశ్రయాలలో ఉన్న ప్రత్యేక రూపే లాంజ్లలో ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. కొత్త నియమాలు వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి.“ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టీ3 డిపార్చర్ టెర్మినల్‌లో రూపే ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. బోర్డింగ్ గేట్ నంబర్ 41 వద్ద డిపార్చర్ పీర్ 11, టీ3డీ దగ్గర ఇది రూపే మొట్టమొదటి ప్రత్యేక లాంజ్. రూపే ప్రత్యేక లాంజ్ అనేక రకాల ఆహారం, పానీయాలు, వినోదాలను అందిస్తుంది" అని ఎన్పీసీఐ పేర్కొంది.నూతన మార్గదర్శకాల ప్రకారం, రూపే క్రెడిట్‌కార్డు యూజర్లకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ చేసే వ్యయం ఆధారంగా నిర్ణయించారు. రూ.10,000 నుంచి రూ.50,000 ఖర్చు చేస్తే మూడు నెలల్లో లాంజ్‌ను రెండు సార్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.50,001 నుంచి రూ.లక్ష వరకూ వ్యయంపై నాలుగు సార్లు ఉచిత యాక్సెస్ ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు వరకూ అయితే 8, రూ.5 లక్షలకుపైన ఖర్చే చేస్తే అపరిమిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: మామూలు బ్యాంక్ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!ఇటీవల పలు విమానాశ్రయ లాంజ్‌లు రూపే కార్డులను స్వీకరించడం ప్రారంభించాయి. యూపీఐలో క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించిన తర్వాత రూపే కార్డ్‌ల జారీ పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 3లో రూపే తన మొదటి ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. -
క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించలేకనే...
దుగ్గొండి: క్రెడిట్ కార్డులపై తీసుకు న్న రుణం చెల్లించాలని బ్యాంకర్లు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగ ల్ జిల్లా నాచినపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నాచినపల్లికి చెందిన దార ప్రసాద్ (35) కాకతీయ వర్సిటీలో డిగ్రీ పూ ర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేశాడు. ఈ క్రమంలోనే వివిధ బ్యాంకులకు చెందిన 10 క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి ద్వారా రుణం తీసుకొని హైదరాబాద్‌లోనే చిట్టీ వేశాడు. చిట్‌ఫండ్ కంపెనీ దివాలా తీయడంతో ఆ డబ్బులు రాలేదు. దీంతో క్రెడిట్ కార్డుల కిస్తీ లు చెల్లించలేక ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఆయా బ్యాంకుల రికవరీ బృందా లు నాచినపల్లికి వచ్చి ప్రసాద్‌ను నిలదీయగా, ఈ నెల 19న చెల్లిస్తానని చెప్పాడు. వాయిదా సమయం రావడం.. డబ్బు చేతిలో లేక భయపడి ఇంట్లో ఉరివేసుకున్నాడు. ప్రసాద్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది. వివిధ కార్డ్ కేటగిరీల్లో రివార్డ్ పాయింట్లు, లావాదేవీల రుసుములు, ప్రయోజనాల్లో ఈ మార్పులు ఉన్నాయి. కొత్త నవంబర్ 15 నుండి అమలులోకి వస్తాయి.బీమా, యుటిలిటీ బిల్లులు, ఇంధన సర్‌ఛార్జ్‌లు, కిరాణా కొనుగోళ్లపై ప్రయోజనాలను తగ్గించడమే కాకుండా విమానాశ్రయ లాంజ్‌లను ఉపయోగించడం కోసం ఖర్చు పరిమితిని కూడా ఐసీఐసీఐ బ్యాంక్ రెట్టింపు చేసింది. కొత్త మార్పుల గురించి తెలియజేస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు మెసేజ్‌లు పంపింది.మారిన రూల్స్ ఇవే..క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి బ్యాంక్ అనేక నిబంధనలను మార్చింది. క్రెడిట్ కార్డుల ద్వారా స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించే లావాదేవీల రుసుమును కూడా పెంచింది. కొత్త నిబంధనలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్లన్నింటికీ వర్తిస్తాయి.కొత్త నిబంధనల ప్రకారం, క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్-పార్టీ చెల్లింపు యాప్‌ల ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించినట్లయితే, 1 శాతం లావాదేవీ రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుమును నివారించాలనుకుంటే నేరుగా పాఠశాల/కళాశాల వెబ్సైట్లో లేదా పీఓఎస్ మెషీన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.బ్యాంక్ లావాదేవీల రుసుములను పెంచడమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా తొలగించింది. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన యుటిలిటీ, బీమా చెల్లింపులపై లభించే రివార్డ్‌లను బ్యాంక్ తగ్గించింది. ప్రీమియం కార్డుదారులకు, రివార్డ్ పాయింట్ల పరిమితి నెలకు రూ. 80,000 కాగా, ఇతర కార్డుదారులకు ఈ పరిమితి రూ.40,000. -
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని క్రెడిట్ కార్డ్‌లకు లాయల్టీ ప్రోగ్రామ్ సవరించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఈ అప్డేట్తో ప్రభావితమైన కస్టమర్లకు బ్యాంక్ ఈమెయిల్ పంపింది.అక్టోబర్ 1 నుండి స్మార్ట్‌బై ప్లాట్ఫామ్లో యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై రివార్డ్ పాయింట్ల రిడీమ్‌ను ఒక క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరిమితం చేసింది. అలాగే తనిష్క్ వోచర్లపై రివార్డ్ పాయింట్ల రిడీమ్‌ను కూడా ఒక క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్లకు పరిమితం చేసింది. ఈ మార్పులు ఇన్ఫినియా , ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి: వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇన్ఫినియా మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసిన కస్టమర్లకు ఆహ్వానం ద్వారా మాత్రమే అందిస్తారు. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఈ కార్డు జాయినింగ్/రెన్యూవల్ మెంబర్షిప్ ఫీజు రూ. 12,500. దీనికి పన్నులు అదనం. ఫీజు రియలైజేషన్, కార్డ్ యాక్టివేషన్ తర్వాత వెల్కమ్, రెన్యూవల్ బెనిఫిట కింద 12,500 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఏడాదిలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవారికి వచ్చే ఏడాది రెన్యూవల్ మెంబర్షిప్ ఫీజు ఉండదు. -
క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. రేపటి నుంచే అమలు
సెప్టెంబర్ 1నుంచి వివిధ బ్యాంకులు కొన్ని గణనీయమైన అడ్జెస్ట్మెంట్స్ చేయనున్నాయి. ఈ ప్రభావం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్ వంటి వాటిని ప్రభావితం చేస్తాయి.రూపే క్రెడిట్ కార్డ్రేపటి నుంచి (సెప్టెంబర్ 1) రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మెరుగైన రివార్డ్ పాయింట్ సిస్టమ్ నుంచి ప్రయోజనాలను పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. రూపే క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. మొత్తం మీద రూపే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇకపై ఎక్కువ రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా సెప్టెంబర్ 1నుంచి రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులను ప్రవేశపెడుతుంది. బ్యాంక్ యుటిలిటీ, టెలికామ్ లావాదేవీల నుంచి సంపాదించిన రివార్డ్ పాయింట్లను నెలకు 2000 పాయింట్లకు పరిమితం చేస్తుంది. అయితే క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసిన లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చెల్లింపు నిబంధనలుసెప్టెంబర్ 1 నుంచి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా చెల్లింపులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయనుంది. చెల్లింపు గడువు తేదీ.. స్టేట్మెంట్ జనరేషన్ డేట్ నుంచి (18 నుంచి 15 రోజులకు) కుదించారు. అంటే కార్డు హోల్డర్లు మూడు రోజులు ముందుగానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే వడ్డీ చార్జీలు కొంత తగ్గించడం జరిగింది. -
గ్యాస్ నుంచి ఆధార్ వరకు.. వచ్చే నెలలో మార్పులు
ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుండి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు మీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం..ఎల్పీజీ ధరలుప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య, డొమెస్టక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.సీఎన్జీ, పీఎన్జీ రేట్లుఎల్పీజీ ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా సవరిస్తాయి. అందువల్ల, ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ కార్డ్‌లను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్ కార్డ్‌లకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.క్రెడిట్ కార్డ్ నియమాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుండి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్లను మాత్రమే పొందగలరు. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు.మోసపూరిత కాల్స్ నియమాలుమోసపూరిత కాల్స్, సందేశాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.డియర్నెస్ అలవెన్స్కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
క్రెడిట్ కార్డ్‌లు లేకుండానే చెల్లింపులు
న్యూఢిల్లీ: కర్ణాటక బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నవీ టెక్నాలజీస్ తాజాగా క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలను ఆవిష్కరించాయి. వినియోగదారు యూపీఐ ఖాతాకు క్రెడిట్ లైన్‌ను అనుసంధానించడం ద్వారా విభిన్న క్రెడిట్ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు.ఇక కస్టమర్ యూపీఐ లావాదేవీల ఆధారంగా బ్యాంకులు ప్రీ–సాంక్షన్డ్ క్రెడిట్ లైన్ ఆఫర్ చేస్తాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రీ–క్వాలిఫైడ్ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదార్ల అభిప్రాయం మేరకు మరింత మందికి విస్తరిస్తామని వివరించింది. స్వల్పకాలిక నెలవారీ రుణ ఉత్పత్తితో ఈ సేవలు ప్రారంభించినట్టు బ్యాంక్ తెలిపింది.భవిష్యత్తులో కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఈఎంఐ సౌకర్యాలు, వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ లైన్ల వంటి ఇతర వేరియంట్లను జోడించడం కోసం చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది. యూపీఐ ద్వారా ప్రజలు కార్డ్‌లు లేకుండా చెల్లించే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని భావిస్తున్నామని కర్ణాటక బ్యాంక్ ఎండీ, సీఈవో శ్రీకృష్ణన్ హెచ్ అన్నారు. -
చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపు
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ఏదైనా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే లోన్లు మరింత సులభంగా లభించే వీలుంటుంది. అప్పు ఇచ్చే ముందు ప్రతి ఆర్థిక సంస్థ సిబిల్‌ను చెక్ చేస్తుంది. సిబిల్ 750 కంటే ఎక్కువ ఉంటే లోన్లు జారీ చేయడం సులభం. మరి ఈ సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలుసా.. ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. కార్డు బకాయిలు చెల్లించే సమయంలో చిన్న కిటుకు ఉపయోగిస్తే సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’క్రెడిట్‌కార్డు బిల్లు జనరేట్ అయ్యాక చెల్లింపు కోసం కొన్నిరోజులు గడువు ఇస్తారు కదా. అయితే కార్డు బిల్లును గడువులోపు ఒకేసారి పూర్తిగా చెల్లించకుండా, రెండు లేదా మూడు సార్లు చెల్లిస్తే సిబిల్ పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ నెల 15వ తేదీన రూ.10,000 కార్డు బిల్లు వచ్చిందనుకుందాం. చెల్లింపు గడువు తేదీ 30 అనుకుందాం. అయితే ఈ 15 రోజుల్లో రెండుసార్లు అంటే ఒకసారి రూ.6000, మరో 5-6 రోజులకు మిగతా రూ.4000 చెల్లించాలి. దీనివల్ల పేమెంట్ రికార్డు పెరుగుతుంది. దాంతో సిబిల్ అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకోవాలి. గడువులోపు కచ్చితంగా పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. -
క్రెడిట్ కార్డ్ క్లోజింగ్.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
ఈరోజుల్లో చాలా మందికి ఒకటి మించి క్రెడిట్ కార్డులు ఉండటం సాధారణమైపోయింది. బ్యాంకులు, ప్రవేటు సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో అవసరం లేకున్నా కొన్ని సార్లు క్రెడిట్ కార్డులు తీసుకుంటుంటారు. వీటికి వార్షిక రుసుములు లేకపోతే సమస్య లేదు కానీ, ఒక వేళ రుసుము చెల్లించాల్సి ఉంటే అవసరం లేనివాటిని క్లోజ్ చేసుకోవడం మంచిది. అయితే వీటిని ఎలా క్లోజ్ చేసుకోవాలి.. ఆర్బీఐ నిబంధనలు ఏమిటీ అన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..ఆర్బీఐ నిబంధనలురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాలి. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయలేకపోతే, 7 రోజుల వ్యవధి తర్వాత, దానిపై రోజుకు రూ. 500 జరిమానాను కస్టమర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి బకాయిలు ఉండకూడదు.క్రెడిట్ కార్డును క్లోజ్ చేయండిలా..» ఏదైనా క్రెడిట్ కార్డ్‌ని మూసివేసే ముందు దాని బకాయిలన్నింటినీ చెల్లించాలి. బకాయిలు ఎంత చిన్న మొత్తం అయినప్పటికీ, బకాయి మొత్తాన్ని చెల్లించే వరకు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేందుకు వీలుండదు.» క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలనే తొందరలో చాలా మంది తమ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయడం మర్చిపోతుంటారు. కార్డ్‌ను మూసివేసేటప్పుడు రివార్డ్ పాయింట్లను తప్పనిసరిగా రీడీమ్ చేసుకోండి» కొంతమంది బీమా ప్రీమియం, ఓటీటీ నెలవారీ ఛార్జ్ వంటి పునరావృత చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌పై స్టాండింగ్ సూచనలను పెట్టుకుంటుంటారు. కార్డ్‌ను మూసివేయడానికి ముందు, దానిపై అలాంటి సూచనలేవీ లేవని నిర్ధారించుకోండి.» అన్నీ సరిచూసుకున్నాక క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌ను సంప్రదించాలి. క్రెడిట్ కార్డ్ మూసివేయడానికి గల కారణాన్ని అడిగితే తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం క్రెడిట్ కార్డ్ క్లోజింగ్ అభ్యర్థన తీసుకుంటారు. ఒకవేళ బ్యాంక్ ఈమెయిల్ పంపమని అడగవచ్చు. కత్తిరించిన కార్డ్ ఫోటోను కూడా ఈమెయిల్ చేయమని అడగవచ్చు.» క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే దానిని ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రాస్‌గా కత్తిరించడం. అలా కాకుండా కార్డును ఎక్కడపడితే అక్కడ పడేయకండి. మీ కార్డు తప్పుడు చేతుల్లోకి వెళితే, దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. -
క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిగే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు రూ.10,000 కోట్లకు చేరాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ, సీఈఓ దిలీప్ అస్బే తెలిపారు. అందులో యూపీఐ సేవలందించే బ్యాంకులు తమ వినియోగదారులకు సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.200 కోట్ల వరకు లోన్లు అందిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ..‘యూపీఐ ద్వారా చేసే క్రెడిట్ కార్డుల వినియోగం రూ.10వేల కోట్లకు చేరింది. కార్డు లావాదేవీలను అసరాగా చేసుకుని బ్యాంకులు దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రి అప్రూవ్డ్ లోన్లు ఇస్తున్నాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంక్ ముందంజలో ఉంది. దాంతోపాటు స్వల్ప కాల వ్యవధి కలిగిన రుణాలను కూడా బ్యాంకులు విడుదల చేస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై చిన్నమొత్తంలో రుణాలను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించాలని భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!క్రెడిట్‌కార్డు లావాదేవీలపై యూపీఐ ద్వారా లోన్లు ఇవ్వడం బ్యాంకులకు కొంత లాభాలు చేకూర్చే అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సర్వీసులను వినియోగదారులకు చేరవేసేందుకు బ్యాంకులు ఎన్బీఎఫ్సీలు, ఇతర ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి యూపీఐ ద్వారా బ్యాంకులు మాత్రమే లోన్లు ఇవ్వగలవు. ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్‌లు కూడా బ్యాంకుల మాదిరి లోన్లు ఇచ్చేలా వెసులుబాటు పొందాలని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఆర్బీఐ అనుమతులు కావాల్సి ఉంటుంది. -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్‌లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్‌యాక్టివ్‌గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
చిన్న పేమెంట్ ఆలస్యం.. ఎంత పెద్ద నష్టం..!!
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు అన్నది ప్రతిఒక్కరికీ అనివార్యంగా మారింది. చిన్నా, పెద్ద అన్ని పేమెంట్లకు క్రెడిట్ కార్డునే వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులను సక్రమంగా వినియోగించపోతే పెద్ద నష్టమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘ది బీ, ది బీటిల్ అండ్ ది మనీ బగ్’ అనే పుస్తకంలో 844 క్రెడిట్ స్కోర్ ఉన్న సయ్యద్ అనే వ్యక్తి గురించి ఒక కేస్ స్టడీ ఉంది.ఒకసారి విదేశాలకు వెళ్తుండగా సయ్యద్ తన క్రెడిట్ కార్డుతో ఎయిర్‌పోర్టులోని స్టోర్ నుంచి ఓ పుస్తకం కొన్నాడు. అతను విదేశాల్లో ఉన్నప్పుడు, క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయింది. అంతలోనే చెల్లింపు గడువు వచ్చింది. విదేశాల్లో ఉన్న సయ్యద్ సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత తేదీకి పేమెంట్ గేట్ వేను యాక్సెస్ చేయలేకపోయాడు. దీంతో అతడు పేమెంట్ మిస్ అయ్యాడు. దీని తీవ్ర పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..పేమెంట్ చేయాల్సిన మొత్తం రూ.250లే అయినప్పటికీ, క్రెడిట్ స్కోర్ నష్టం ఎక్కువగా ఉంది. మొదటి నెలలో అతని స్కోరు 776 కు పడిపోయింది. సయ్యద్ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, అతను తన బకాయిలను ఆలస్య చెల్లింపు రుసుముతో పాటు రూ.300 + వడ్డీ, జీఎస్టీ చెల్లించాడు. పూర్తి మొత్తం చెల్లించినప్పటికీ, అతని స్కోరు రెండవ నెలలో మరో 49 పాయింట్లు పడిపోయి 727 కు పడిపోయింది.దీంతోనే అయిపోలేదు. ఇంకా ఉంది.. సరిగ్గా ఇదే సమయంలో సయ్యద్ హోమ్ లోన్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని క్రెడిట్ స్కోర్ గణనీయంగా క్షీణించినందున, ఇకపై మార్కెట్లో తక్కువ వడ్డీ రేట్లకు అర్హుడు కాదు. గతంలో ఉన్న 844 క్రెడిట్ స్కోరు ఉంటే 8.60 శాతం వడ్డీతో ఆఫర్ వచ్చేది. కానీ 727 స్కోర్‌కు 9.30 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు పొందలేడు.ఆయన మొత్తం రూ .50 లక్షలు అప్పు తీసుకుంటున్నందున, అధిక రేటుకు రుణంపై వడ్డీ వ్యత్యాసం 20 సంవత్సరాలలో రూ .5.40 లక్షలు. కేవలం రూ.250 ఒక్క క్రెడిట్ కార్డు పేమెంట్ మిస్ కావడం వల్ల జరిగిన నష్టమిది. వడ్డీ రేట్లు, రుణ ఆఫర్లు మీ క్రెడిట్ స్కోర్‌తో ముడిపడి ఉన్నందున, మీ స్కోరును తెలుసుకోవడం, దానిని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడం చాలా ముఖ్యం. -
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..
నెలవారీ వేతనం ఈఎంఐలు, ఇంటిఖర్చులు, ఇతర పెట్టుబడులు, పొదుపు..ఇలా బ్యాంకులో జమైన కొద్దిరోజులకే ఇట్టే ఖర్చయిపోతోంది. నెలాఖరు వరకు చాలామంది చేతిలో డబ్బులేని పరిస్థితి ఏర్పడుతోంది. దాంతో క్రెడిట్ కార్టులకు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పటిలా కాకుండా బ్యాంకులు కూడా వీటిని సులువుగా జారీ చేస్తున్నాయి. క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు ఉండటంతో వీటిని వినియోగించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా..వంటి కొన్ని కార్పొరేట్ సంస్థలతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అసలు ఏమిటీ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్టులు? వీటి ఉపయోగం ఏమిటనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డువినియోగదారుల అవసరాలు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేలా ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యేకంగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు..వంటి వాటితో అనుబంధంగా వీటిని ఇస్తున్నారు. అయితే, ఈ కార్డుల ద్వారా సాధారణ క్రెడిట్ కార్డుల కంటే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి తమ అనుబంధ బ్రాండ్లతో చేసిన లావాదేవీల ఈఎంఐలపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు రాయితీ వంటి ప్రయోజనాలు కల్పిస్తాయి. ఉదాహరణకు..ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్‌కార్డు అందిస్తోంది. వినియోగదారులు దీనితో ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే నిబంధనల ప్రకారం అదనంగా రాయితీలుంటాయి. దానివల్ల అటు వినియోగదారులకు, ఇటు క్రెడిట్‌కార్డు సంస్థలకు లాభం చేకూరుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ప్రయోజనాలు..కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి లావాదేవీలు చేసే వారు నిబంధనల ప్రకారం టార్గెట్ చేరుకుంటే వార్షిక రుసుము మినహాయింపు పొందొచ్చు.ప్రతి లావాదేవీలో రివార్డు పాయింట్లు అందుతాయి.కార్డు ఇస్తున్న సంస్థలు సూచించిన మర్చంట్స్ నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీకి రుణాల్ని పొందవచ్చు.కొత్తగా ఈ కార్డులను తీసుకున్న వారికి వెల్కమ్ ఆఫర్ కింద షాపింగ్ కూపన్లు, డిస్కౌంట్లు ఉంటాయి.ఇదీ చదవండి: ఈపీఎస్‌లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టంకార్డు ఎంపిక ఇలా..కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు దేనిపై ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవాలి. ఒకవేళ నిత్యం ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తే దానికి అనుబంధంగా ఉన్న సంస్థ కార్డును ఎంచుకోవాలి. లేదంటే అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ఆ సంస్థతో భాగస్వామ్యంగా ఉన్న కార్డును సెలక్ట్ చేసుకోవాలి. కార్డు ఎంచుకునేముందు ఫీచర్లు, రుసుములు, వడ్డీ రేట్లు, ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు వంటి ప్రయోజనాలు ఏ మేరకు ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. -
ఆన్లైన్ మోసాలకు అంతేలేదు
దేశంలో ఆర్థిక మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. వినియోగదారుల ఆర్థిక డేటా వివరాలు అంగట్లో సరుకులా అమ్ముడవుతున్నాయి. గడిచిన మూడేళ్లలో పట్టణ భారతీయుల్లో అధిక శాతం మంది క్రెడిట్ కార్డు మోసాలకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఆ తర్వాత.. నిత్యం లావాదేవీలకు కోసం వాడే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సరికొత్త చోరీలు తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలోని వేలాది మంది డేటా విక్రేతల ద్వారా దేశీయ వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారం మార్కెట్లో సులభంగా లభిస్తోందని సోషల్ మీడియా రీసెర్చ్ ఫ్లాట్‌ఫారం సంస్థ లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. సాక్షి, అమరావతిక్రెడిట్ కార్డుల ద్వారా 43శాతం మోసాలు..దేశవ్యాప్తంగా గడిచిన 36 నెలల్లో ఏకంగా 47 శాతం మంది పట్టణ భారతీయులు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక మోసాల బారినపడినట్లు నివేదిక పేర్కొంది. 43 శాతం మంది తమ క్రెడిట్ కార్డు ద్వారా.. 30 శాతం మంది యూపీఐ లావాదేవీల ద్వారా మోసపోయారు. క్రెడిట్ కార్డు ద్వారా జరిగిన మోసాల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు దేశీయ, అంతర్జాతీయ వ్యాపారులు వెబ్సైట్ల ద్వారా అనధికారిక చార్జీల మోతను భరించాల్సి వచి్చంది. బ్యాంకర్ల పేరుతో ఫోన్లుచేసి ఓటీపీలు ద్వారా డెబిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలంటూ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఇక యూపీఐ ద్వారా ఆన్లైన్ దోపిడీ విషయంలో ప్రతి పదిమంది బాధితుల్లో నలుగురు చెల్లింపునకు అంగీకరించడానికి పంపించే లింక్‌ను క్లిక్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డబ్బులను పోగొట్టుకున్నారు. ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆరి్థక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేలి్చచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.అమ్మకానికి క్రెడిట్ కార్డు డేటా.. మరోవైపు.. దేశంలోని వినియోగదారుల క్రెడిట్ కార్డు డేటా సులభంగా అమ్మకానికి అందుబాటులో ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. పాన్‌కార్డు, ఆధార్, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారంతో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్, ఇతర చిరునామాతో క్రెడిట్ కార్డుల వివరాలు కూడా అందుబాటులో ఉండటం సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఒక్క ఏడాదిలో రూ.13,930 కోట్ల దోపిడీ.. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 36వేల కంటే ఎక్కువ ఆర్థిక మోసాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది గత ఆరి్థక ఏడాదితో పోలిస్తే 166 శాతం మేర గణనీయంగా పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో ఈ మోసాల కేసులు 2022–23లో 13,564 నుంచి 2023–24లో 36,075కి చేరుకున్నాయి. అయితే, ఈ మోసాల విలువ 2023–24లో రూ.13,930 కోట్లకు చేరాయి. అయితే, ఇక్కడ ప్రతి పది మంది బాధితుల్లో ఆరుగురు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. -
అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!
అదానీ గ్రూప్‌కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అదానీ వన్ (Adani One).. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఎయిర్పోర్ట్ -లింక్డ్ ప్రయోజనాలతో దేశీయ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్, అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనే రెండు ఆప్షన్లలో ఈ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంది.ఫీజు వివరాలుఅదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వార్షిక ఛార్జీ రూ .5,000. దీనికి జాయినింగ్ బెనిఫిట్స్ రూ .9,000 ఉంటాయి. అలాగే అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు వార్షిక ధర రూ .750 కాగా జాయినింగ్ బెనిఫిట్స్ రూ .5,000.ప్రయోజనాలు (అపరిమిత అదానీ రివార్డు పాయింట్లు)అదానీ వన్, విమానాశ్రయాలు, గ్యాస్, విద్యుత్, ట్రైన్‌మ్యాన్ సహా అదానీ సంస్థలలో 7 శాతం వరకు తగ్గింపు.ఇతర స్థానిక, విదేశీ ఖర్చులపై 2 శాతం వరకు తగ్గింపుఎయిర్పోర్ట్ బెనిఫిట్స్ ప్రీమియం లాంజ్ లతో సహా దేశీయ లాంజ్ లకు సంవత్సరానికి 16 వరకు యాక్సెస్లుసంవత్సరానికి రెండు వరకు ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్లు8 వరకు వాలెట్, ప్రీమియం ఆటోమొబైల్ పార్కింగ్ స్థలాలకు యాక్సెస్లుఇతర ప్రయోజనాలువిమానాలు, హోటళ్లు, విహార యాత్రలకు కూపన్లతో సహా రూ.9,000 వరకు వెల్మమ్ బెనిఫిట్.సినిమా టిక్కెట్లు ఒకటి కొంటే ఒకటి ఉచితం1 శాతం ఇంధన సర్ ఛార్జీ రద్దుఅదానీ వన్ రివార్డ్స్ అల్ట్రా లాయల్టీ స్కీమ్ కు ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ -
ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఆఫర్లు
భారత్‌లో క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య పెరుగుతోంది. 2023 ఏప్రిల్ నాటికి 8.60 కోట్ల క్రెడిట్ కార్డులు వాడకంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 ప్రారంభం నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు వీటిని అందిస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక అవసరాలకే ఈ కార్డులను వాడుతుంటారు. బ్యాంకులు ఆయా కార్డులపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్, వోచర్లు, సర్ఛార్జ్ మినహాయింపులు.. వంటి ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తాయి. కానీ వీటికి సంబంధించి చాలామంది వినియోగదారులకు సరైన అవగాహన ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని బ్యాంకులు అందిస్తున్న క్రెడిట్ కార్డులపై ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.కొటక్ ఫార్చ్యూన్ గోల్డ్ క్రెడిట్ కార్డుఈ కార్డును బిజినెస్ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇంధనం, టికెట్ బుకింగ్ మొదలైన వాటిపై ప్రాథమిక క్రెడిట్ కార్డు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కార్డుతో ఒక సంవత్సరంలో రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తే, నాలుగు పీవీఆర్ టికెట్లు లేదా రూ.750 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. రూ.500-రూ.3,000 ఇంధన లావాదేవీలపై 1% సర్ఛార్జ్ మినహాయింపును పొందే అవకాశం ఉంది.అమెజాన్ పే-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుషాపింగ్ అవసరాలకు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ఎక్కువగా వాడుతుంటారు. రోజువారీ కొనుగోళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ కార్డు ఉన్న కస్టమర్లు కలినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్ ద్వారా భారత్‌లోని 2,500 కంటే ఎక్కువ రెస్టారెంట్స్‌లో డైనింగ్ బిల్లులపై 15% ఆదా చేసుకోవచ్చు. 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు పొందే అవకాశముంది. పొందిన రివార్డులపై పరిమితి, గడువు తేదీ లేదు. అమెజాన్‌లో రివార్డు పాయింట్లను రెడీమ్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటే అమెజాన్ ఇండియాలో కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.ఏయూ ఎల్ఐటీ క్రెడిట్ కార్డుఏయూ స్మాల్‌ఫైనాన్స్ బ్యాంక్ అందిస్తున్న ఈ కార్డు వల్ల దేశీయ, అంతర్జాతీయ ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ లావాదేవీలపై 5X, 10X రివార్డు పాయింట్లను పొందొచ్చు. 90 రోజుల కాలవ్యవధిలో మూడుసార్లు 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డు పాయింట్‌తో పాటు మీ రిటైల్ లావాదేవీల కోసం 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి అవకాశముంది. రూ.400-రూ.5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు పొందొచ్చు. ప్రతి 3 నెలలకు నాలుగు సార్లు విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్ పొందేవీలుంది.షాపర్స్ స్టాప్-హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుఈ కార్డుతో ప్రతి కొనుగోలుపై రివార్డ్స్ పొందొచ్చు. కార్డుదారులు షాపర్స్ స్టాప్ ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.150 కొనుగోలుపై 6 ఫస్ట్ సిటిజన్ పాయింట్లు వస్తాయి. రూ.500 విలువైన షాపర్స్ స్టాప్ వోచర్‌ను పొందొచ్చు. దీంతో షాపర్స్ స్టాప్ స్టోర్‌లో కనీసం రూ.3000 కొనుగోలు చేసినప్పుడు ఆ వోచర్‌ను రెడీమ్ చేసుకోవచ్చు. కార్డుపై ఒక సంవత్సరంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే, 2000 ఫస్ట్ సిటిజన్ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. రూ.400-5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ఉంది.యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డుఈ కార్డు ద్వారా చేసే అన్ని కొనుగోళ్లపై ఎడ్జ్ రివార్డ్ పాయింట్లను పొందడంతో పాటు పేటీఎం, మింత్ర, జొమాటో వంటి భాగస్వామ్య బ్రాండ్లపై రాయితీలు ఉంటాయి. బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు కొనుగోలు చేస్తే, 10% డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతి రూ.200 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్ పొందవచ్చు. -
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.ఇటీవల ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.దీంతో మీరు ఎస్‌బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి నెలవారీ కరెంట్ బిల్లు రూ.1500 చెల్లిస్తుంటే అదనంగా రూ.15 చెల్లించాల్సి ఉంటుంది.అయితే, వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.15,000, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 20,000 ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే పైన పేర్కొన్న వన్ (ఒకశాతం) పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. -
పొరపాటు జరిగింది.. నష్టపోతే రండి.. డబ్బు తీసుకోండి
ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన దాదాపు 17 వేల క్రెడిట్‌కార్డుల సమాచారం ఇతరుల ఖాతాకు పొరపాటున లింక్ అయినట్లు బ్యాంక్ తెలిపింది. సాంకేతికత లోపం వల్ల ఈ తప్పిదం జరిగిందని బ్యాంక్ అంగీకరించింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే వారి డబ్బు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది.డిజిటల్ మాధ్యమాల్లో తమ క్రెడిట్‌కార్డుల వివరాలు పొరపాటున ఇతర ఖాతాకు అనుసంధానమైనట్లు గుర్తించిన వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. అయితే ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం అయినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పింది.సాంకేతికలోపం వల్ల ఆన్లైన్లో ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డ్‌లు వివరాలు పొరపాటున లింక్ అయ్యాయి. దాంతో పాత కస్టమర్లు కొత్తవారి కోసం కేటాయించిన కార్డుల వివరాలు తెలుసుకునేలా వీలు కల్పించనట్లయింది. ఆన్లైన్లో లాగిన్ అవ్వగానే తాము కొత్తగా దరఖాస్తు చేయకపోయనా కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన బ్యాంక్ అధికారులు వెంటనే సమస్యను గుర్తించి సవరించినట్లు తెలిసింది. తర్వాత పొరపాటు జరిగినట్లు అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు.ఇదీ చదవండి: కేంద్రం నిబంధనలకు ‘నో’ చెప్పిన వాట్సప్ఈ సంఘటనలో ప్రభావితమైన వివరాలు, కార్డులను బ్లాక్ చేస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. తిరిగి కొత్తకార్డులు జారీ చేస్తామని చెప్పింది. ఇప్పటివరకైతే ఆర్థిక నష్టానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ఒకవేళ తాము ఈ సంఘటన ద్వారా నష్టపోయినట్లు గుర్తించి ఎవరైనా కస్టమర్లు బ్యాంక్‌ను సంప్రదిస్తే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. -
క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? కొత్త ఫీచర్లు మీ కోసమే..
రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొన్ని కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఈమేరకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి వీటిని త్వరలో అమలు చేయబోతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. రూపే క్రిడిట్ కార్డును వినియోగించి యూపీఐ లావాదేవీలు జురుపుతుంటారు. అయితే సంబంధిత యూపీఐ యాప్‌లోనే ఆ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకునే సదుపాయం కల్పిస్తున్నారు. క్రెడిట్ అకౌంట్ బిల్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఆప్షన్, లిమిట్ మేనేజ్మెంట్ వంటి ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. రూపే కార్డు అందిస్తున్న బ్యాంకులు లేదా ఇతర సంస్థలు మే 31 కల్లా ఈ ఫీచర్లను అమలులోకి తీసుకురావాలని ఎన్పీసీఐ తెలిపింది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ లావాదేవీల కోసం అనుసంధానం చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్‌తో కార్డులను లింక్ చేసుకోవచ్చు. ఎన్పీసీఐ తాజా నిర్ణయం వల్ల ఇకపై రూపే క్రెడిట్ కార్డుల వినియోగం మరింత సులభతరం కానుంది. లింక్ చేసిన యూపీఐ యాప్‌లోనే లావాదేవీలను ఈఎంఐగా మార్చుకోవచ్చు. చెల్లింపులు చేసే సమయంలోనే ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈఎంఐ రేట్లకు సంబంధించిన జాబితా కూడా అక్కడే కనిపిస్తుంది. ఇదీ చదవండి: త్వరలో ఆర్బీఐ కొత్త మొబైల్ యాప్.. ఎందుకంటే.. క్రెడిట్ అకౌంట్ బిల్‌పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫీచర్ ద్వారా యూపీఐ యాప్‌లోనే కార్డు బిల్లు చెల్లించొచ్చు. కావాలనుకుంటే ఆటో పే ఆప్షన్ కూడా వినియోగించుకోవచ్చు. ఎప్పుడైనా అవసరం అయితే క్రెడిట్ లిమిట్ పెంచమని బ్యాంక్‌ను నేరుగా యూపీఐ యాప్ ద్వారానే కోరే వెసులుబాటు ఉండనుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ బిల్, మినమిమ్ బిల్, టోటల్ అమౌంట్, బిల్ డేట్ వంటివి యూపీఐ యాప్‌లోనే తెలుసుకోవచ్చు. -
పర్సు పక్కన పెట్టి క్రికెట్.. రూ. 6.72 లక్షలు గోవిందా!
ముంబై: పర్సు పక్కన పెట్టిన క్రికెట్ ఆడిన వ్యక్తి రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేకుంది. దక్షిణ ముంబైలోని క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన 28 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ తన క్రెడిట్, డెబిట్ కార్డులు దొంగతనానికి గురై రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మార్చి 30 న జరిగిన ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి చెప్పారు. ఎలా జరిగిందంటే.. ముంబై క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన బాధితుడు వివేక్ దవే క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్న వ్యాలెట్, మొబైల్ ఫోన్ సహా ఇతర వస్తువులను పక్కన పెట్టి ఆటలో నిమగ్నమయ్యాడు. ఆట ముగించుకుని బోరివలికి రైలులో ఇంటికి వెళుతుండగా తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ లావాదేవీ సందేశాలను గమనించాడు. వాటి ప్రకారం అతని బ్యాంక్ ఖాతా నుండి సుమారు లక్ష రూపాయలు కట్ అయ్యింది. దుండగులు అతని క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 5 లక్షలకు పైగా కొనుగోళ్లు చేసినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, బాధితుడు మూడు గంటల పాటు క్రికెట్ ఆడుతుండగా, గుర్తు తెలియని నిందితులు అతని క్రెడిట్, డెబిట్ కార్డులను దొంగిలించారు, ఏటీఎం నుండి రూ. 1 లక్ష నగదును విత్‌డ్రా చేశారు. నాలుగు నగల దుకాణాల్లో షాపింగ్ చేశారు. దీంతో బాధితుడు ఆ నగల దుకాణాలను సంప్రదించగా వారు సీసీ ఫుటీజ్ అందించారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్‌తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్‌వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది. ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది. ఫ్రీలాంజ్ యాక్సెస్.. ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి. ఇదీ చదవండి: ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే..! పాలసీ డిజిటలైజేషన్ ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
ప్రభుత్వ బ్యాంక్ ప్రత్యేక క్రెడిట్‌కార్డు.. భారీ రాయితీలు
మహిళల అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్‌తో ఓ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పిల్లల నుంచి మహిళలు, సీనియర్ సిటిజన్స్ వరకు అన్ని వర్గాల్లోని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కొన్ని సర్వీసులను తీసుకొస్తాయి. అలా మహిళా వినియోగదారుల కోసం యూనియన్ బ్యాంక్ ఇటీవల ‘దివా’ పేరుతో ఓ ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగనున్నాయో బ్యాంక్ వర్గాలు తెలిపాయి. దివా క్రెడిట్ కార్డ్ 18 నుంచి 70 ఏళ్ల వయసులోని మహిళలకు కేటాయిస్తారు. వారి కనీస సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలుగా ఉండాలి. ఆదాయ రుజువు లేనిపక్షంలో ఫిక్స్డ్ డిపాజిట్ భద్రతపై కూడా ఈ దివా కార్డును జారీ చేస్తారు. దీని నుంచి యాడ్ఆన్ కార్డులను కూడా మహిళలకే అందిస్తారు. దరఖాస్తు సమయంలో శాలరీ స్లిప్, ఫామ్ 16, ఐటీ రిటర్నులతో పాటు పాన్, ఆధార్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కార్డు ద్వారా ఏడాదికి 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లను పొందవచ్చు. వార్షిక రక్త పరీక్షలతో కూడిన హెల్త్ ప్యాకేజీని పొందే వీలుంది. ఈ కార్డును రూపే నెట్‌వర్క్‌లో జారీ చేయడంతో వివిధ వ్యాపార ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, యూపీఐ బెనిఫిట్స్ వర్తిస్తాయి. రూ.100 గరిష్ఠ మొత్తంతో 1 శాతం ఇంధన సర్ఛార్జ్ రీయింబర్స్మెంట్ లభిస్తుంది. 24/7 ట్రావెల్, హోటల్ రిజర్వేషన్లు, కన్సల్టెన్సీ సేవలపై రాయితీలు పొందవచ్చు. లాక్మీ సెలూన్, నైకా, ఇక్సిగో, మింత్రా, ఫ్లిప్‌కార్డ్, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, అర్బన్ క్లాప్ వంటి సైట్లలో స్పెషల్ డిస్కౌంట్ కూడా లభించనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ప్రతి రూ.100 ఖర్చుకు రూ.2కు సమానమైన రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కార్డు వార్షిక రుసుము రూ.499 కాగా.. ఓ ఏడాదిలో 30 వేలు ఖర్చు చేస్తే అది కూడా మినహాయిస్తారు. ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే.. -
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు
మారుతున్న జీవనప్రమాణాల కారణంగా చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. సమయానికి ఆన్లైన్లో వస్తువులు కొనడం, ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయడం, కరెంట్ బిల్లులు పే చేయడం, పెట్రోల్‌బంక్‌లో స్వైప్ చేయడం.. వంటి చాలాపనులకు నిత్యం క్రెడిట్‌కార్డులు వాడుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేకకార్డుల్లో ఆయా క్రెడిట్‌కార్డు సంస్థలు రివార్డు పాయింట్లు ఇస్తూంటాయి. వాటిని క్లెయిమ్ చేసుకుని ఇతర వస్తువులు వంటివి ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. తాజాగా కొన్ని బ్యాంక్‌లు అందిస్తున్న క్రెడిట్‌కార్డు లాంజ్ యాక్సెస్, రివార్డ్పాయింట్ల విషయంలో కీలక మార్పులు చేస్తున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్బీఐ అందిస్తున్న ఆరమ్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని సవరించింది. రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్ క్రెడిట్ కార్డ్, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. యస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తరహాలోనే యస్ బ్యాంక్ కూడా లాంజ్ యాక్సెస్‌లో నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో లాంజ్ సదుపాయం పొందాలన్నా అంతకు మునుపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్‌పై రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్‌తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. బీమా, గోల్డ్/ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టంచేసింది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో దొంగగా మారిన జూనియర్ ఆర్టిస్ట్
సీతమ్మధార : ఇన్‌స్ట్రాగాం ఇన్ఫ్లుయన్సర్గా యువతితో పరిచయం చేసుకుంది. స్నేహం పెరగడంతో ఇంటికి వెళుతూ వచ్చేది. ఈ క్రమంలో ఇంట్లో బంగారం ఉన్నట్లు కనిపెట్టింది. బాత్రూమ్ పేరుతో బెడ్రూమ్లోకి వెళ్లి నాలుగు దఫాలలో 74 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. దొండపర్తిలో జరిగిన ఈ చోరీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చాకచక్యంగా కిలేడిని పట్టుకొని కటకటాల్లోకి పంపించారు. వివరాల్లోకి వెళితే.. దొండపర్తి ప్రాంతంలో బాలాజీ మెట్రో రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 102లో రిటైర్డ్ పోస్టల్ అధికారి జనపాల ప్రసాద్‌బాబు కుటుంబంలో కలిసి నివాసముంటున్నారు. అతని కుమార్తెకు ఇన్‌స్ట్రాగాంలో రీల్స్ చేయడంపై ఆసక్తి ఉండేది. ఈ క్రమంలో 2016లో ఇన్‌స్ట్రాగాం ద్వారానే కిళ్లంపల్లి సౌమ్యశెట్టి పరిచయమైంది. సౌమ్య కూడా ఇన్‌స్టా, యూట్యూబ్ వీడియోలు చేస్తుండేది. అలాగే జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసేది. దీంతో కొన్నాళ్లు ఇద్దరూ వీడియో చేసేవారు. అయితే సౌమ్య సినిమాల్లో బిజీ అవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అయితే కొద్ది నెలల క్రితమే సదరు యువతికి సౌమ్య నుంచి ఇన్‌స్టా మళ్లీ మెసేజ్ వచ్చింది. దీంతో మళ్లీ ఇద్దరు మాట్లాడుకోవడంతో పాటు ఒకరి ఇంటికి వెళుతూ వచ్చేవారు. నాలుగు దఫాలలో 74 తులాల చోరీ ప్రసాద్‌బాబు ఇంట్లో బంగారు నగలు ఉన్నట్లు సౌమ్య గుర్తించింది. వాటిని కాజేయడానికి ఎత్తు వేసింది. ఈ ఏడాది జనవరి 29న అతని ఇంటికి వెళ్లి బెడ్ రూమ్‌లో ఉన్న బాత్రూమ్కు వెళ్లాలని చెప్పి రూమ్ గడియ పెట్టుకుంది. బాగా పరిచయమవడంతో వారు పెద్దగా పట్టించుకోలేదు. ఆమె బీరువాలో ఉన్న బంగారు నగల్లో కొన్నింటిని దుస్తుల్లో పెట్టుకొని తీసుకెళ్లిపోయింది. ఇలా ఫిబ్రవరి 2, 6, 19 తేదీల్లో వారి ఇంటికి వెళ్లి అవకాశం ఉన్నంత వరకు నగలను తస్కరించింది. ఇలా మొత్తంగా 74 తులాలు చోరీ చేసింది. అప్పటికీ ప్రసాద్‌బాబు కుటుంబ సభ్యులు గుర్తించలేదు. గత నెల 23వ తేదీన పెళ్లికి వెళ్లేందుకు బీరువా తీసి నగలు చూడగా కనిపించలేదు. వెంటనే ప్రసాద్‌బాబు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డీసీపీ(క్రైమ్) వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏడీసీపీ గంగాధర్, ఇతర పోలీస్ అధికారులు వారి ఇంటికి వెళ్లి బీరువా పరిశీలించారు. బ్యాంక్ లావాదేవీలు పట్టించాయి.. ఇంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంటికి ఎవరెవరు వచ్చారన్న విషయాన్ని ఆరా తీశారు. వారందరిపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా సౌమ్యను కూడా విచారించారు. ముందు ఎటువంటి ఆధారాలు లభించలేదు.అయితే అందరి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు పరిశీలిస్తే.. సౌమ్య బ్యాంక్ ఖాతాలో జరిగిన లావాదేవీలపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆమెను తమ పద్ధతిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించింది. ఆ నగల్లో కొన్నింటిని విక్రయించి కుటుంబంతో కలిసి గోవా వెళ్లి ఎంజాయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కార్ లోన్, క్రెడిట్ కార్డుల బ్యాలెన్సులు కట్టడంతో పాటు షేర్మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుసుకున్నారు. ఆమె వద్ద ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని శనివారం అరెస్టు చేశారు. -
బ్యాంకులే కస్టమర్లకు ఫైన్ కట్టాలి.. ఎందుకో తెలుసా?
సాధారణంగా బ్యాంకులకు కస్టమర్లకు పైన్ కడుతుంటారు. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెన్ టైన్ చేయకపోవడమో లేదా తీసుకున్న లోన్ సరైన సమయంలోగా చెల్లించకపోయిన బ్యాంకులు పెనాల్టీ వేస్తుంటాయి. మరి బ్యాంకుల నుంచి కస్టమర్లు కూడా ఫైన్ కట్టించుకోవచ్చని తెలుసా ? నిబంధనలు పాటించకపోతే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు కూడా ఫైన్ కట్టాల్సిందే. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ వాడకం బాగా విస్తృతం అయింది. దాదాపు అందరూ వీటిని ఉపయోగిస్తుంటారు. చేతిలో డబ్బు లేనప్పుడు వాటిని ఉపయోగించి వస్తువులు కొనుకోవడం, ఇతరత్రా అవసరాలకు డబ్బు వాడుకుంటుంటారు. క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న అమౌంట్ సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాడుకున్న డబ్బు సరైన సమయానికి చెల్లించని పక్షంలో పెనాల్టీల ద్వారా బాంకులు కస్టమర్ల నుంచి అధిక ఫైన్ వసూలు చేస్తుంటాయి. అయితే ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉన్నవారు, వాటి అవసరం లేదనుకున్నవారు క్లోజ్ చేస్తుంటారు. ఇలా క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తుంటాయి. ఎందుకంటే వాటి నుంచి ఫీజ్ ల ద్వారా వచ్చే ఆదాయం పోతుందనే భావనతోనో లేదా మరేదైనా కారణంతో బ్యాంకులు కొంత ఆలస్యం చేస్తుంటాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలని బ్యాంకును ఆశ్రయించిన తరువాత వారం రోజుల్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వారం రోజులు దాటినప్పటికి ఆ బ్యాంకు నిర్లక్ష్యం వహిస్తే ఆ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు సంబంధిత బ్యాంక్ పై ఫిర్యాదు చేయవచ్చు. అలా చేస్తే ఆ బ్యాంకు నిర్లక్ష్యం చేసిన రోజులన్నిటికి రోజుకు రూ. 500 చొప్పున పెనాల్టీ రూపంలో బాధిత కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది. -
వాలెంటైన్స్ డే: ఈ క్రెడిట్ కార్డుల ఆఫర్లతో మరింత ఆనందంగా..
ప్రేమ పక్షులు ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. ఆ రోజున తమ ప్రేమను తెలియజేసేందుకు, ఆనందంగా గడిపేందుకు ఏడాదంతా ఎదురు చూస్తారు. ప్రత్యేకమైన ఈరోజున ప్రేమికులు ప్రధానంగా డైనింగ్ కోసం రెస్టారెంట్లకు వెళ్తుంటారు లేదా నచ్చిన ఫుడ్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉంటే మరింతగా ఆనందించవచ్చు కదా.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందించే కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. బజాజ్ ఫిన్సర్వ్కు అనుబంధ సంస్థ అయిన బజాబ్ మార్కెట్స్ డైనింగ్‌పై డిస్కౌంట్లు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి తెలియజేసింది. ప్రేమికుల రోజును మరింత ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నవారు బజాబ్ మార్కెట్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి వీటి గురించి తెలుసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ అందిస్తున్నాం.. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు క్యాండిల్ లైట్ డిన్నర్లు ప్లాన్ చేస్తున్నవారికి ఈ క్రెడిట్ ఉపయోగపడుతుంది. ఇది స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్ డెలివరీలపై తక్షణ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ కార్డుకు రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లాటినమ్ ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వాలైంటైన్స్ పార్టీలకు చేసే రెస్టారెంట్ బిల్లులపై 1.5 సేవింగ్ పాయింట్లు లభిస్తాయి. ఇక్కడ మరో ప్రయోజనకర విషయం ఏమిటంటే దీనికి ఎలాంటి వార్షిక ఫీజు లేదు. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ దీనిపై ఏకంగా 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డు పార్ట్నర్ రెస్టారెంట్లలో చేసే డిన్నర్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డుకు రూ.250 జాయినింగ్ ఫీజు ఉంటుంది. -
ఆర్బీఐ రూల్స్ : క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తున్నారా?,అయితే ఇది మీకోసమే!
ఎప్పుడు బ్యాంకులు సామాన్యుల దగ్గరి నుంచి పెనాల్టీల మీద పెనాల్టీలు వసూలు చేస్తుంటాయి. కానీ బ్యాంకులు చేసే తప్పులకు కూడా కస్టమర్లు పెనాల్టీల రూపంలో డబ్బుల్ని వసూలు చేయోచ్చు. ఎలా అంటారా? ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ‘ఏ’ అనే బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తున్నాడు. దానిని ఆగస్ట్ 2023లో క్లోజ్ చేయాలని సదరు బ్యాంక్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. బ్యాంక్ వాళ్లు మాత్రం నవంబర్ 2023కి క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. జూలై 01, 2022 నుండి అమల్లోకి వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ - ఇస్సుఎన్స్ అండ్ కండక్ట్ ) ఆదేశాల ప్రకారం.. కస్టమర్ తన క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని బ్యాంక్‌కు రిక్వెస్ట్ పెట్టిన వారం రోజుల వ్యవధిలో క్లోజ్ చేయాలి. అలా చేయకపోతే.. ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే అన్ని రోజులకు గాను ప్రతి రోజు రూ.500 చొప్పున బ్యాంక్ నుంచి వసూలు చేయోచ్చు. బ్యాంకులు సకాలంలో స్పందించకపోవడం, ఆర్బీఐ కంప్లెయిట్ విభాగంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ విధించిన కొన్ని నియమ, నిబంధనలు ఇలా ఉన్నాయి. వాటిల్లో.. ►ఆర్బీఐ ఆదేశాలు ప్రకారం, క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని కోరిన అభ్యర్ధనను బ్యాంక్‌లు ఏడు వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలి. కార్డ్ హోల్డర్ సైతం బకాయిలన్నింటిని చెల్లించాలి. ►క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నట్లు కార్డ్ హోల్డర్‌కు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందివ్వాలి. ►క్రెడిట్ కార్డ్ జారీచేసిన బ్యాంక్‌లు క్రెడిట్ కార్డ్‌ను మూసివేస్తూ చేసే రిక్వెస్ట్‌ను బ్రాంచ్, మొబైల్, ఆన్లైన్, కాల్ సెంటర్, ఏటీఎం ఇలా అన్నీ విభాగాలకు తక్షణమే తెలపాలి. ►క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలనే అభ్యర్ధనను పోస్ట్ లేదా ఇతర మార్గాల ద్వారా పంపాలని ఎట్టిపరిస్థితుల్లో కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ►ఏడు పనిదినాల్లోగా క్రెడిట్ కార్డ్‌ను మూసివేసే ప్రక్రియలో బ్యాంకులు విఫలమైతే.. కస్టమర్ ఇప్పటికే బాకీలన్ని చెల్లించినట్లైతే సదరు కార్డు దారులకు రోజుకు రూ.500 అదనపు ఛార్జీలు చేయాలి. ►ఏడాది అంతకంటే ఎక్కువ రోజుల పాటు క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకుని ఉంటే సంబంధిత కార్డ్ క్లోజింగ్ సమాచారాన్ని యూజర్‌కు అందించి అప్పుడు క్లోజ్ చేయొచ్చు. ►30 రోజుల వ్యవధిలోగా కార్డ్ హోల్డర్ నుండి ఎటువంటి ప్రత్యుత్తరం రాకపోతే, బ్యాంక్‌లు క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయొచ్చు. ►కార్డ్ జారీచేసేవారు 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేతను అప్డేట్ చేయాలి. ►క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను క్లోజ్ చేసిన తర్వాత, క్రెడిట్ కార్డ్ ఖాతాలో ఏదైనా క్రెడిట్ బ్యాలెన్స్ అందుబాటులో ఉంటే, అది కార్డ్ హోల్డర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. -
క్రెడిట్ కార్డ్‌తో బోలెడన్ని లాభాలు.. అవేంటో మీకు తెలుసా?
ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు వినియోగదారులకు ఎయిర్ మైళ్లు, ఉచిత విమాన ప్రయాణం, హోటెల్ బసపై డిస్కౌంట్, కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లకు సభ్యత్వం వంటి అనేక ఇతర ప్రయాణ ప్రయోజనాల్ని పొందవచ్చు. కానీ, మార్కెట్లో అనేక ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు అందుబాటులో ఉన్నందున, వాటిల్లో ఏ కార్డ్ వినియోగిస్తే ఎంత ప్రయోజనం చేకూరుతుందో గుర్తించడం కష్టం. అలా మీరు ట్రావెలింగ్ చేస్తూ ఏ క్రెడిట్ కార్డ్‌ను ఎలా ఉపయోగించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారా? అయితే ఇది మీకోసమే. కో-బ్రాండెడ్ లేదా జనరల్ ట్రావెల్ కార్డ్‌లు విమానయాన సంస్థలు, హోటల్ చైన్లు లేదా ట్రావెల్ పోర్టల్‌ల సహకారంతో అనేక ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు అందించబడతాయి. అయితే, అటువంటి కార్డ్‌లపై పొందిన రివార్డ్‌లు సాధారణంగా అనుబంధిత బ్రాండ్‌తో మాత్రమే రీడీమ్ చేయబడతాయి. మరోవైపు, సాధారణ ప్రయాణ క్రెడిట్ కార్డ్‌లు, బ్రాండ్‌కు పరిమితం చేయకుండా విమాన టిక్కెట్లు లేదా హోటల్ బస వంటి ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి మీకు మరింత సౌలభ్యాన్ని అందిస్తాయి. ఎలాంటి క్రెడిట్ కార్డ్ పొందాలంటే అధిక వ్యయం చేసేవారు అధిక రివార్డులు, ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలి. చాలా ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు రివార్డ్ పాయింట్లు లేదా ఎయిర్ మైల్స్ రూపంలో వాల్యూ-బ్యాక్‌ను అందిస్తాయి, ఇది ఒక్కో కార్డుకు భిన్నంగా ఉంటుంది. తమ క్రెడిట్ కార్డ్‌లపై ఎక్కువ ఖర్చు పెట్టే వినియోగదారులు అధిక రివార్డ్ రేట్‌తో ట్రావెల్ కార్డ్ కోసం వెతకాలి. ట్రావెల్ బెన్ఫిట్స్ పరిగణలోకి తీసుకోండి ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, తక్కువ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్క్-అప్ ఫీజు, డాక్యుమెంట్ల నష్టాన్ని కవర్ చేసే ప్రయాణ బీమా, చెక్-ఇన్ లగేజీ మొదలైన అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకునే ముందు, మీరు తప్పనిసరిగా ఈ అదనపు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, సరైన రివార్డ్‌లు మరియు అదనపు ప్రయోజనాల కలయికను అందించేదాన్ని ఎంచుకోవాలి. సరైన ఇంధన క్రెడిట్ కార్డ్‌తో రోడ్డు ప్రయాణాలను చౌకగా చేయండి ట్రావెల్ కార్డ్‌లు ఎక్కువగా ఎయిర్‌లైన్ కార్డ్‌లకు పర్యాయపదాలుగా ఉంటాయి కాబట్టి, రోడ్ ట్రిప్, వారాంతపు విహారయాత్రలను ఇష్టపడే ప్రయాణికులు ఇంధన క్రెడిట్ కార్డ్ నుండి గణనీయమైన విలువను పొందవచ్చు.చివరగా, ఏ ట్రావెల్ కార్డ్ సరైనది అనే నిర్ణయం మీ ప్రయాణ అలవాట్లు మరియు ట్రావెల్ కార్డ్‌లో మీరు వెతుకుతున్న ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. -
ఇక పాకెట్లోనే డేటా వ్యాలెట్!
కేజీ రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : ♦ ప్రతి వ్యక్తి సగటున రోజుకు 3.5 గిగాబైట్స్ (జీబీ)ని వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ♦ 2021 నాటి గణాంకాల ప్రకారం.. రోజూ 2.5 క్విన్ టిలియన్ (18 జీరోలు) డేటా ఉత్పత్తి అవుతోంది. ..ఇలా ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మనకు ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్‌పైనే ఆధారపడుతున్నాం. దాని నుంచి పొందిన డేటాను భద్రపర్చడం, అవసరమైనప్పుడు తిరిగి అందుబాటులోకి తేవడం కష్టంగా మారుతోంది. మూడు దశాబ్దాల క్రితం మెమొరీ స్టోరేజ్.. ఫ్లాపీతో మొదలైంది. ఆ తర్వాత సీడీ, డీవీడీ, మెమొరీ కార్డు, పెన్ డ్రైవ్ ఇలా విభిన్న రూపాలను సంతరించుకుంది. ఈ కోవలో ఇప్పుడు డేటా సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటికి కూడా భారీ స్థలం, వ్యయం, అధిక విద్యుత్ వినియోగం అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన బయోమెమొరీ అనే ఒక స్టార్టప్ సంస్థ.. డీఎన్ఏ డిజిటల్ డేటా స్టోరేజీ విధానంపై పలు పరిశోధనలు చేసింది. మన ప్యాకెట్లో పట్టే వ్యాలెట్ సైజులో ఉంచుకునే క్రెడిట్ కార్డు తరహాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. వ్యాలెట్ సైజులోనే.. ఇకపై సొంత డేటా, కంపెనీ డేటా.. ఇలా ఏదైనా ఇక ఏ డేటా సెంటర్ నుంచో బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ కంపెనీ సీఈవో మీరే అయితే.. సంస్థకు సంబంధించిన మొత్తం సమాచారం మీ జేబులో ఉంచుకునే రోజులు రాబోతున్నాయి. కొత్త తరహా డేటా సెంటర్లను అభివృద్ధి చేసే ప్రక్రియపై బయో మెమొరీ స్టార్టప్ సంస్థ ప్రయోగాలు దాదాపు సఫలీకృతమయ్యాయి. సుమారు వెయ్యి డాలర్ల ధరకే ఈ డీఎన్ఏ డేటా స్టోరేజీని అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. 150 ఏళ్లపాటు సురక్షితం.. కేవలం డేటా స్టోరేజీ విషయంలోనే కాకుండా.. భద్రంగా దాచుకునేందుకు కూడా ఈ డీఎన్ఏ డేటా ఉపయుక్తం కానుంది. వాస్తవానికి హార్డ్ డిస్క్‌లకు 5 ఏళ్లు, ఫ్లాష్ డ్రైవ్స్‌కు 10 ఏళ్ల మన్నిక ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యాలెట్ సైజులో ఉండే డేటా బ్యాంకు 150 ఏళ్ల పాటు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా వైరస్ల బెడద కూడా ఉండదు. అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. ఇతరులెవరూ దీన్ని యాక్సిస్ చేయలేరు. ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు జరిగినప్పుడు కూడా సమాచారం చెక్కుచెదరకుండా ఉండేలా రూపుదిద్దుకుంటోంది. ఎంత పెద్ద డేటానైనా కేవలం నానో సెకన్లలోనే చెక్ చేసుకునే సదుపాయం కూడా ఈ డీఎన్ఏ డేటా బ్యాంకుల ద్వారా అందుబాటులోకి రానుంది. డేటా సెంటర్ల కేంద్రంగా.. విశాఖ ఇంటర్నెట్ద్వారా సమాచార సేవలు నిరంతరాయంగా అందాలంటే డేటా సెంటర్లే కీలకం. అటువంటి డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా విశాఖపట్నంలోనూ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే నిక్సీ ఓ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా.. రూ.21,844 కోట్ల పెట్టుబడితో దిగ్గజ సంస్థ ఆదానీ సైతం డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఓవైపు.. డేటా సెంటర్ల ఏర్పాటులో ఆయా దేశాలు పోటీపడుతుండగా.. బయోమెమొరీ స్టార్టప్ సంస్థ చేస్తున్న ప్రయోగాలతో వ్యాలెట్ రూపంలో డేటా బ్యాంక్ మార్కెట్లోకి వస్తే సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు ఖాయమంటున్నారు. భారత్‌లో భారీ డేటా సెంటర్లు.. ప్రస్తుతం హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ఆపరేషన్స్ జరుగుతున్న దేశాల్లో 44 శాతంతో యూఎస్ మొదటి స్థానాన్ని ఆక్రమించగా.. చైనా 8 శాతం, జపాన్, యూకే 6 శాతం చొప్పున, ఆస్ట్రేలియా, జర్మనీ 5 శాతం చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా భారత్‌లోనూ అడుగులు పడుతున్నాయి. మొత్తం డేటా ట్రాఫిక్ 2025 నాటికి నెలకు 7 ఎక్సాబైట్స్ నుంచి 21 ఎక్సాబైట్స్కు పెరుగుతుందని ఒక అంచనా. డేటా వ్యాపారం 2022లో 4.9 బిలియన్ డాలర్లుండగా.. 2027 నాటికి ఇది 10.09 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. 25 ఎకరాల స్థలంలో మహారాష్ట్రలోని పూణే సమీపంలోని పింప్రీలో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు అమెజాన్, గూగుల్ సైతం డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. -
ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్!
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతోపాటు ఇతర ఫైనాన్స్ సంస్థలు సైతం క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. దీనిపై ప్రమాద బీమాతో పాటు ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఎన్నింటినో అందిస్తోంది. ఎల్ఐసీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, మాస్టర్ కార్డులు కలిసి సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డులను ప్రారంభించాయి. ఎల్ఐసీ క్లాసిక్, ఎల్ఐసీ సెలక్ట్ పేరుతో రెండు క్రెడిట్ కార్డులు లాంచ్ అయ్యాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. వీటి ద్వారా బీమా ప్రీమియం చెల్లిచిందనందుకు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. రూ. 5 లక్షల ప్రమాద బీమా ఉచితంగా లభిస్తుంది. వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ కూడా ఎల్ఐసీ తక్కువగానే వసూలు చేస్తోంది. బెనిఫిట్స్‌లో కొన్ని.. ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డుకు ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు ఉండవు. 48 రోజుల వరకు అన్ని ఏటీఎంలలో క్యాష్ విత్‌డ్రాయల్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ క్రెడిట్ కార్డుతో తొలి ఈఎమ్ఐపైన 5 శాతం క్యాష్‌బ్యాక్. రూ. 399 విలువైన 6 నెలల ఫార్మ్ఈజీ ప్లస్ మెంబర్ షిప్. ట్రావెల్లో డొమెస్టిక్ ఫైట్లను బుక్ చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్. లెన్స్‌కార్ట్ గోల్డ్ సభ్యత్వం ఉచితంగా పొందొచ్చు. భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్స్‌లో ప్రతి నెల రూ. 300 ఇంధన సర్‌ఛార్జ్‌పై 1 శాతం రాయితీ. ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డుపై రూ.2 లక్షల ప్రమాద బీమా ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డుకు కూడా ప్రవేశ, వార్షిక ఛార్జీలు లేవు. ప్రతి మూడు నెలలకు రెండుసార్లు కాంప్లమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డుపై రూ. 5 లక్షల ప్రమాద బీమా. -
యాపిల్ కార్డులు నిలిపివేయనున్న దిగ్గజ సంస్థ.. కారణం ఇదేనా?
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి యాపిల్ సంస్థ యాపిల్కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కార్డ్‌ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేయడానికి గోల్డ్‌మన్ సాక్స్ మంతనాలు జరుపుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దాంతో వారి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలని యాపిల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు సంస్థలు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. యాపిల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి వచ్చే 12-15 నెలల్లో యాపిల్ కార్డు నిలిపేయనుంది. 2019లో ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ సేవలతోపాటు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన పొదుపు ఖాతాలను యాపిల్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి నిర్వహిస్తోంది. అయితే యాపిల్కార్డును అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేయాలని గోల్డ్‌మన్ సాక్స్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దాంతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేయమని కోరుతూ యాపిల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో యాపిల్ తన వినియోగదారులకు అధిక ఈల్డ్ ఇచ్చే పొదుపు ఖాతాలు ప్రారంభించింది. అది యాపిల్కార్డుకు అనుసంధానం చేసింది. అందులో దాదాపు రూ. 83 వేల కోట్ల డిపాజిట్లను సేకరించింది. దానికి 4.15 శాతం ఈల్డ్ అందిస్తుంది. గోల్డ్‌మన్ సాక్స్‌తో 2029 వరకు ఈ ఒప్పందం ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల ద్వారా ఈ డీల్‌ను రద్దుచేసుకోవాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సేవింగ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 97 శాతం మంది కస్టమర్లు రోజువారీ నగదును వారి ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు యాపిల్ తెలిపింది. ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు! యాపిల్ అమెరికాలో ‘బైనౌ..పే లేటర్’ విధానాన్ని మాస్టర్‌కార్డ్ ఇన్స్టాల్మెంట్స్ ప్రోగ్రామ్‌తో కలిసి ప్రారంభించింది. గోల్డ్‌మన్ సాక్స్ ఆ మాస్టర్‌కార్డ్ చెల్లింపుల క్రెడెన్షియల్స్‌ను జారీ చేస్తోంది. -
కార్డులు ఎక్కువైతే చిక్కులేనా..?
ఆరాధన (31) ఐటీ ఉద్యోగి. ప్రయాణాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పర్యటనకు సిద్ధమైపోతుంది. ఇటీవల ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన సందర్భంలో క్రెడిట్ కార్డ్ కంపెనీ సేల్స్ ఉద్యోగి ఆమెకు ఎదురుపడ్డాడు. మంచి ఫీచర్స్‌తో కూడిన క్రెడిట్ కార్డ్ అంటూ.. అందులోని ఉపయోగాలు చదివి వినిపించే ప్రయత్నం చేశాడు. నిజానికి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్న ఆసక్తి ఆరాధ్యకు ఎంతమాత్రం లేదు. కానీ, ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదని, దేశీయంగా ప్రీమియం ఎకానమీ విమాన టికెట్ల కొనుగోలుపై మూడు రెట్లు అధికంగా రివార్డు పాయింట్లు ఆఫర్ చేస్తుందని చెప్పగా, ఆ పాయింట్ ఆమెకు ఎంతో నచి్చంది. దీనికితోడు షాపింగ్ చేసిన ప్రతి సందర్భంలో సాధారణ రివార్డ్ పాయింట్లు వస్తాయని చెప్పాడు. దీంతో అప్లికేషన్‌పై సంతకం చేసి ఇచ్చేసింది. కార్డు చేతికి వచి్చన ఏడాది తర్వాత కానీ, వాస్తవాలు ఆమెకు తెలియలేదు. కార్డ్ కంపెనీ వార్షిక రుసుము అంటూ రూ.3,000 చార్జ్ చేసింది. సేల్స్ ఏజెంట్ చెప్పినట్టు సదరు క్రెడిట్ కార్డ్ జీవిత కాలం ఉచితమేమీ కాదని అర్థమైంది. అప్పుడు కార్డ్ నిబంధనలు, షరతులు చదివిన తర్వాత కానీ ఆమెకు అర్థం కాలేదు ఆ కార్డ్ తన అవసరాలను తీర్చేది కాదని. వార్షిక ఫీజు మినహాయించాలంటే కార్డ్ కంపెనీ పెట్టిన లక్ష్యం మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఆర్థిక సంబంధ నిర్ణయం తీసుకునే ముందు (కొనుగోళ్లు, పెట్టుబడులు) పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఆరాధ్యకు ఎదురైన అనుభవమే నిదర్శనం. తమ అవసరాలకు అనుకూలమైన క్రెడిట్ కార్డ్‌కే పరిమితం కావాలని ఇది సూచిస్తోంది. క్రెడిట్ కార్డ్‌తో వచ్చే ప్రయోజనాలు చూసి చాలా మంది ఒకటికి మించిన కార్డులు తీసుకుంటూ ఉంటారు. అసలు ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి..? క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు ఏం చూడాలి? ఒకటికి మించిన కార్డులు ఉంటే ఎలా నడుచుకోవాలి..? ఈ విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశం. ఏ అవసరం కోసం..? కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వారు ముందు తమ అవసరాలు ఏంటో తేల్చుకోవాలి. రుణాలకు కొత్త వారు అయి, మంచి క్రెడిట్ స్కోరును నిర్మించుకోవాలని అనుకునే వారు తక్కువ ఫీజుతో కూడిన ప్రాథమిక స్థాయి క్రెడిట్ కార్డ్‌కు పరిమితం కావాలి. అప్పటికే దెబ్బతిన్న క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవాలని అనుకుంటే, అప్పుడు సెక్యూర్డ్ కార్డ్‌ను తీసుకుని వినియోగించుకోవడం సరైనది. ఒకటికి మించి కార్డులు ఉంటే, అప్పుడు అవి తీర్చలేని అవసరాలతో కూడిన కొత్త కార్డ్‌ను తీసుకోవచ్చు. కొన్ని కార్డ్‌లు రివార్డ్ పాయింట్లు, ఎయిర్‌మైల్స్ లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, అన్నీ కలిపి బండిల్‌గా ఇస్తుంటాయి. ఈ రివార్డ్‌లు తమకు ఎంత వరకు ఉపయోగమన్నది ఆలోచించుకోవాలి. తమ అవసరాలకు అనుకూలమంటే తీసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లలో లాంజ్ సేవలను ఉచితంగా అందించే కార్డులు కూడా ఉన్నాయి. విదేశీ లావాదేవీలపై ఫీజుల్లేని, సినిమా టికెట్లపై, రెస్టారెంట్ చెల్లింపులపై అదనపు డిస్కౌంట్లు ఆఫర్ చేసే కార్డుల్లో తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. వినియోగం ముఖ్యం.. కార్డుతో వినియోగం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ప్రతి నెలా వినియోగించుకున్నంత మేర పూర్తిగా తిరిగి చెల్లిస్తారా..? లేక బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేస్తారా.? కనీస మొత్తాన్ని చెల్లించి, మిగిలిన బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వారు తక్కువ వడ్డీ రేటును చార్జ్ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. పరిమిత బడ్జెట్‌తో కుటుంబాన్ని నడిపించే వారికి తక్కువ రేటు వసూలు చేసే కార్డ్‌లు అనుకూలం. దీర్ఘకాలంలో వీటితో ఎంతో ఆదా చేసుకోవచ్చు. యూజర్లు కార్డ్‌తో ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారన్నది విశ్లేíÙంచుకోవాలని మై మనీ మంత్ర మార్కెట్ ప్లేస్ ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు. కార్డుల మధ్య ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉంటుందన్నారు. ‘‘తరచూ ప్రయాణించే వారు ఎయిర్‌మైల్స్ లేదా హోటల్ పాయింట్లను ఆఫర్ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. కార్డుపై అయ్యే వ్యయాలతో పోలిస్తే ప్రయోజనాలు మెరుగ్గా ఉండాలన్నది మర్చిపోవద్దు. ఒకటికి మించిన ప్రయోజనాలు ఆఫర్ చేసే కార్డులకు వార్షిక ఫీజు ఉంటుంది. కనుక ఆయా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేట్టు అయితేనే సదరు కార్డులు తీసుకోవాలి. అప్పుడే వార్షిక ఫీజు చెల్లించడం ప్రయోజనకరంగా అనిపిస్తుంది’’అని రాజ్ ఖోస్లా సూచించారు. ఖర్చులు–ప్రయోజనాలు కార్డు వార్షిక ఫీజు కంటే వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉండాలి. ఏటా ఇంత ఖర్చు చేస్తేనే వార్షిక రుసుము మినహాయింపు అనే షరతు ఉంటే.. మీ వినియోగం అదే స్థాయంలో ఉంటుందా? అన్నది చూసుకోవాలి. కార్డ్‌ను తక్కువగా వినియోగించుకునే వారికి వార్షిక రుసుముతో వచ్చేవి అనుకూలం కాదు. కార్డులు సాధారణంగా వార్షిక రుసుం, యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్), బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ఫీజు, విదేశీ లావాదేవీల రుసుంతో వస్తాయి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ అంటే.. ప్రతి నెలా కార్డ్ బిల్లుపై కొంత మొత్తం చెల్లించి, క్యారీ ఫార్వార్డ్ చేసుకునే మిగిలిన బ్యాలన్స్‌పై అమలు చేసే వడ్డీ రేటు. క్రెడిట్ స్కోరు, కార్డు ఏ రకం అన్న దాని ఆధారంగా ఈ వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. కనుక ప్రతి నెలా పూర్తి బిల్లు చెల్లించలేని వారికి తక్కువ ఏపీఆర్ ఉండే కార్డు అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం అధిక శాతం మంది కార్డ్ కస్టమర్లు తాము పొందే రివార్డులతో పోలిస్తే కార్డు కంపెనీకి చెల్లించే ఫీజులు, వడ్డీయే ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ‘‘కార్డ్ సంస్థ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు ఫీజుల కంటే మెరుగ్గా ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలి. తక్కువ రివార్డులు, అధిక వార్షిక ఫీజుతో కూడిన ప్రాథమిక క్రెడిట్ కార్డ్ ఏమంత ఉపయోగకరం కాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో తక్కువ వార్షిక ఫీజుతో లేదా అసలు వార్షిక ఫీజు లేని కార్డులు ఎన్నో ఉన్నాయి’’అని పైసా బజార్ క్రెడిట్ కార్డుల విభాగం హెడ్ రోహిత్ చిబ్బార్ పేర్కొన్నారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారు అంతర్జాతీయ లావాదేవీలకు చార్జ్ వసూలు చేయని కార్డులు తీసుకోవడం లాభదాయకమని సూచించారు. అలాగే, రివార్డుల శాతాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అన్ని రకాల కొనుగోళ్లపై ఫ్లాట్ 2 శాతం చొప్పున రివార్డులు ఆఫర్ చేస్తుంటే, అది మంచి డీల్ అవుతుంది. ఎన్ని కార్డులు..? ఒకరికి ఎన్ని కార్డులు ఉండాలన్న దానికి ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఎక్కువ కార్డ్‌లు ఉంటే, వాటితో పాటు రిస్‌్కలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. ‘‘ఒకటికి మించి క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, విడిగా ఒక్కో దానిని సరైన రీతిలో వినియోగిస్తూ గరిష్ట స్థాయిలో ఆదా చేసుకోవాలి’’ అని చిబ్బార్ పేర్కొన్నారు. ప్రతి కార్డ్‌కు ఉండే బిల్లింగ్ సైకిల్‌కు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. అప్పుడు నెలవారీ నగదు ప్రవాహాలను తెలివిగా వినియోగించుకోవచ్చన్నారు. విడిగా ఒక్కో కార్డ్‌లో వినియోగించకుండా మిగిలిపోయిన లిమిట్, అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుంది. ఒకటికి మించిన కార్డులు కలిగిన వారు, సరైన రీతిలో ఉపయోగించుకోకుండా, ఎక్కువగా వాడేస్తే అది రుణ ఊబిలోకి తీసుకెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక లిమిట్‌తో ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం, అన్నింటినీ గరిష్ట పరిమితి మేరకు వినియోగిస్తుంటే అది క్రెడిట్ స్కోర్‌కు మంచిది కాదు. ఎందుకంటే అది అధిక రిస్క్‌కు దారితీస్తుంది. సంఖ్యతో సంబంధం లేకుండా తమ అవసరాలకు పక్కాగా నప్పే కార్డ్ ఉండాలన్నది ప్రాథమిక నియమం. ఎక్కువగా ప్రయాణించని వారికి ట్రావెల్ ప్రయోజనాలతో కూడిన క్రెడిట్ కార్డుతో వచ్చేదేమీ ఉండదు. కార్డులు ఎక్కువైతే వార్షికంగా చెల్లించే ఫీజులు, నికరంగా ఒరిగే ప్రయోజనం ఎంతన్న విశ్లేషణ అవసరం. ఎన్ని కార్డులు ఉన్నా, ఎంత వినియోగించుకున్నా, గడువులోపు పూర్తి బిల్లు చెల్లించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అది రుణ పరపతిపై ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. కార్డును సమీక్షించుకోవాలి.. క్రెడిట్ కార్డ్ తీసుకునే సమయంలో చెప్పిన ప్రయోజనాలు ఎప్పటికీ కొనసాగుతాయని అనుకోవద్దు. కార్డ్ సంస్థ ఎప్పుడైనా అందులోని ప్రయోజనాల్లో మార్పులు చేయవచ్చు. ఈ విషయాలను ఈ మెయిల్ రూపంలో తెలియజేస్తాయి. కార్డ్ కంపెనీల నుంచి వచ్చే మెయిల్స్‌ను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకని ఏడాదిలో రెండు సార్లు అయినా, క్రెడిట్ కార్డు నియమ, నిబంధనలు, ప్రయోజనాలను సమీక్షించుకోవాలి. రివార్డ్ పాయింట్లను కూడా రెడీమ్ చేసుకోవాలి. లేదంటే అవి కాలం చెల్లిపోయే ప్రమాదం ఉంటుంది. మారిన నియమ, నిబంధనల ప్రకారం ఇక మీదట సంబంధిత క్రెడిట్ కార్డ్ ప్రయోజనకరం కాదని గుర్తిస్తే, దాన్ని రద్దు చేసుకోవడం మంచిది. క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేసుకుంటే, అది తాత్కాలికంగా క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుందని గుర్తు పెట్టుకోవాలి. అనుకూలతలు ► ఒకటికి మించి క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, అప్పుడు ఒక్కో కార్డు వారీ వినియోగించుకునే పరిమితి 50 శాతం మించకుండా చూసుకోవచ్చు. ఇది క్రెడిట్ స్కోర్‌కు అనుకూలం. ►ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతూ, అన్ని బిల్లులను గడువులోపు చెల్లించేట్టు అయితే క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు దారితీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు వేగంగా, ఆకర్షణీయమైన రేటుకు లభిస్తాయి. ►క్రెడిట్ కార్డ్ సంస్థలు ట్రాక్ రికార్డ్ మెరుగ్గా ఉన్న వారికి అదనపు లిమిట్ ఆఫర్ చేస్తుంటాయి. అత్యవసరాల్లో ఈ అదనపు పరిమితి ఉపయోగపడుతుంది. మరిన్ని రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు అందుకోవచ్చు. ప్రతికూలతలు ►ఒకటే కార్డ్ ఉంటే వినియోగ నిష్పత్తి (కార్డ్ యుటిలైజేషన్ రేషియో) గరిష్ట స్థాయిలో ఉంటుంది. ►ఒకటికి మించి కార్డులు ఉంటే ప్రతీ కార్డ్ బిల్లును పరిశీలిస్తూ, గడువులోపు వాటి బిల్లులు చేయడం కొంత అదనపు శ్రమతో కూడినది. కార్డ్‌లు ఎక్కువై, సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమైతే అది స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ►ఒకటికి మించి కార్డ్‌లు ఉంటే, క్రమశిక్షణతో, వివేకంగా వినియోగించుకోకపోతే అది రుణ ఊబిలో చిక్కుకునేందుకు కారణమవుతుంది. ►అవసరం లేకుండా ఎక్కువ కార్డులు నిర్వహిస్తుంటే, వాటికి చెల్లించే ఫీజుల రూపంలో నష్టపోవాల్సి వస్తుంది. -
'క్రెడిట్ కార్డు' కోసం.. ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా.. జర జాగ్రత్త! లేదంటే..
సాక్షి, మహబూబాబాద్: క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతోంది.. వెంటనే అప్ డేట్ చేసుకోవాలని ఓ వ్యక్తి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీనిని చూసి ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే తనకొచ్చిన మెసేజ్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేసి అప్డేట్ చేశాడు. అనంతరం ఫోన్‌కు ఓటీపీ రాగా టైప్ చేశాడు. అప్డేట్ అయిన తర్వాత నిమిషాల వ్యవధిలో రూ.64 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన మానుకోట పట్టణంలో జరిగింది. జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు కేజీఆర్ కాలనీకి చెందిన చీదరి సతీష్ కుమార్ ఫోన్‌కు ఈ నెల 3వ తేదీన క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతుంది.. వెంటనే అప్ డేట్ చేసుకోవాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పంపించాడు. ఇందుకు స్పందించిన సతీష్‌కుమార్ వెంటనే ఆ మెసేజ్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేసి యూనియన్ బ్యాంక్ ప్రొఫార్మా రాగానే అప్ డేట్ చేశాడు. ఆ వెంటనే అతడి ఫోన్‌కు ఒటీపీ వచ్చింది. దానిని టైప్ చేసిన తర్వాత అప్ డేట్ అయింది. నిమిషాల వ్యవధిలో బాధితుడి ఖాతా నుంచి రూ.64 వేలు డెబిట్ అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వై.సతీష్ ఆదివారం తెలిపారు. ఇవి చదవండి: కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం! -
దీపావళికి ముందే అంబానీ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పండగ ముందే రిలయన్స్ రిటైల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా క్రెడిట్‌కార్డులను తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు కోబ్రాండెడ్ రిలయన్స్ ఎస్బీఐ కార్డులను విడుదల చేయనుంది. వీటిని 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు సమాచారం. రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో వస్తున్న కొత్త క్రెడిట్ కార్డులను రిలయన్స్ ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ పేరుతో విడుదల చేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో లావాదేవీలపై వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు, ఆఫర్లను అందించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కిరాణా వస్తువులపై ఆఫర్లు పొందనున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రయోజనాలు: ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.499. ఏడాదిలో కార్డు ద్వారా రూ.1,00,000 ఖర్చు చేసిన వినియోగదారులకు వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్ మినహా ఇతర కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కి ఒక రివార్డు పాయింట్ అందించబడుతుంది. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై రూ.500 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ కార్డు పొందుతారు. రిలయన్స్ రిటైల్ స్టోర్లలో, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేసిన చెల్లింపులపై ప్రతి రూ.100కి 5 రివార్డు పాయింట్లు అందించబడతాయి. వివిధ రిలయన్స్ రిటైల్ స్టోర్ల నుంచి రూ.3,200 విలువైన అదనపు తగ్గింపు వోచర్లు అందించబడుతున్నాయి. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపును కార్డు అందిస్తోంది. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ప్రయోజనాలు: ఈ కార్డ్ వార్షిక రుసుం రూ.2,999. రూ.3,00,000 వార్షిక ఖర్చు చేసిన వారికి వార్షిక రుసుం మినహాయింపు ఉంటుంది. కార్డు హోల్డర్లు రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చేసే కార్డు కొనుగోళ్లపై ప్రతి రూ.100కి 10 రివార్డు పాయింట్లను అందుకుంటారు. డైనింగ్, సినిమాలు, దేశీయ విమానయాన సంస్థలు, అంతర్జాతీయ వ్యయంపై ఖర్చు చేసిన రూ.100 ఖర్చుకు 5 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. ఇంధనం, ఇంటి అద్దె, వాలెట్ అప్లోడ్ మినహా.. ఇతర రిటైల్ కొనుగోళ్లపై రూ.100 ఖర్చుకు 2 రివార్డ్ పాయింట్లు అందించబడతాయి. జాయినింగ్ ఫీజు చెల్లింపుపై కార్డు హోల్డర్లు రూ.3,000 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ అందుకుంటారు. అన్ని పెట్రోల్ పంపుల్లో 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. బుక్‌మైషోలో ప్రతి నెలా రూ.250 విలువైన 1 సినిమా టిక్కెట్ కార్డు అందిస్తున్నారు. -
ఎస్బీఐ కార్డ్ క్యూ2 ఫర్వాలేదు
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు వ్యాపారంలోని ఎస్బీఐ కార్డ్ సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.603 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.526 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 22 శాతం పెరిగి రూ.4,221 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధి చెంది రూ.1,902 కోట్లకు చేరింది. ఇతర వనరుల రూపేణా ఆదాయం 21 శాతం అధికంగా రూ. 2,186 కోట్లు సమకూరింది. కంపెనీ రుణ ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల రుణాల్లో వసూలు కాని నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2.43 శాతానికి పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.14 శాతంగానే ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 0.78 శాతం నుంచి రూ.0.89 శాతానికి పెరిగాయి. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 23.3 శాతంగా ఉంది. సెపె్టంబర్ చివరికి నికర విలువ 11,130 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ చివరికి వినియోగంలో ఉన్న కార్డులు 1.79 కోట్లుగా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ కార్డ్ షేరు 2 శాతానికి పైగా లాభపడి రూ.791 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!
ఖాతాదారులకు యాక్సిస్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారి ఫిన్‌టెక్ సంస్థ ఫైబ్(Fibe)తో కలిసి నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది. చూడటానికి ఎలా ఉంటుందంటే? ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్లలలో 16 అంకెల నెంబర్, సీఈవో, కార్డుదారు పేరుతో పాటు ఇతర వివరాలు ఉంటాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ - ఫైబ్ క్రెడిట్ కార్డ్‌పై పైన పేర్కొన్నట్లు కస్టమర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండదు. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్‌లో కేవలం ఒక చిప్ మాత్రమే ఉంటుంది. కార్డ్ వివరాలు కావాలంటే ఫైబ్ మొబైల్ యాప్‌లో లభ్యమవుతాయి. నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుందంటే? సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారు. దీంతో కస్టమర్ల శ్రేయస్సు కోసం ఈ నెంబర్‌లెస్ క్రిడెట్ కార్డ్‌ను వినియోగంలోకి తెస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అండ్ పేమెంట్ అధినేత సంజీవ్ మోఘే తెలిపారు. ఈ కొత్త క్రెడిట్ కార్డ్‌తో వినియోగదారుల కార్డ్‌ల సమాచారం, వారి డేటా అగంతకులు సేకరించలేరని అన్నారు. బోలెడన్ని లాభాలు యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసిన నెంబర్‌లెస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీస్, ఆన్లైన్ టికెటింగ్ వంటి సర్వీసుల వినియోగంలో 3 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. ఆన్లైన్,ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్లలో 1 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్న యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఈ రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు త్రైమాసికానికి నాలుగు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ చేయొచ్చు. రూ.400 నుంచి రూ.5000 వరకు పెట్రోల్, డీజిల్‌పై విధించే సర్‌ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే యాక్సిస్ డిన్నింగ్ డిలైట్ పేరుతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది. మీరు నంబర్‌లెస్ కార్డ్‌ని ఎక్కడ పొందవచ్చు? ఫైబ్ యాప్‌లో కస్టమర్లకు ఈ కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త యాక్సిస్ బ్యాంక్-ఫైబ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లో జీరో జాయినింగ్ ఫీజు, జీవితకాలం జీరో వార్షిక రుసుము ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు తెలిపింది. -
క్రెడిట్ కార్డ్.. లిమిట్ పెంచుకుంటున్నారా?
క్రెడిట్ కార్డ్ వినియోగం మన దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2023 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 8.6 కోట్ల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. 2022 ఏప్రిల్ నాటికి ఉన్న 7.5 కోట్లతో పోలిస్తే ఏడాదిలో 15 శాతం పెరిగాయి. 2024 ఆరంభం నాటికి వీటి సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్ చేస్తే తగ్గింపులతో పాటు, రివార్డులు, ఉచిత మూవీ టికెట్లు ఇలా ఎన్నో ఆఫర్లు వినియోగాన్ని పెంచుతున్నాయి. క్రెడిట్ కార్డ్‌లు తీసుకున్న తర్వాత దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని, క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలంటూ బ్యాంక్‌లు కోరుతుండడం చాలా మందికి అనుభవమే. చాలా మంది తమ కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం లేదంటే క్రెడిట్ లిమిట్ (అప్పు పరిమితి) పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కార్డ్ అప్‌గ్రేడ్ లేదా క్రెడిట్ లిమిట్ పెంపుతో ప్రయోజనాలున్నట్టే.. కొన్ని రిస్క్‌లు లేకపోలేదు. కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఓకే చెప్పడానికి ముందు ఇందులో ఉండే చిక్కుల గురించి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత దీనిపై నిర్ణయానికి రావాలి.. ‘‘క్రెడిట్ పరిమితి (లిమిట్) పెంపు లేదా క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్ ఆఫర్‌ను, కార్డుదారుడి ఇటీవలి రుణ చరిత్ర ఆధారంగానే బ్యాంక్‌లు ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్రస్తుత కార్డుపై ఉన్న పనితీరును చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటుంటాయి. కార్డుదారుడి ఆదాయ స్థాయి పెరిగినట్టు బ్యాంక్ భావించిన సందర్భాల్లోనూ ఈ ఆఫర్లు ఇస్తుంటాయి’’అని విష్ఫిన్ సీఈవో రిషి మెహ్రా తెలిపారు. బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడ్ లేదా లిమిట్ పెంపు ఆఫర్ వచి్చందంటే అది కచి్చతంగా రుణ పరపతి పెరిగిన దానికి సంకేతంగా చూడొచ్చు. అయితే, సంబంధిత ఆఫర్ లేదా అభ్యర్థనను ఆమోదించే ముందు తప్పకుండా సానుకూలతలు, ప్రతికూలతల గురించి విశ్లేíÙంచుకోవాలని రిషి మెహ్రా సూచించారు. అప్‌గ్రేడ్ మంచికేనా..? ఉన్నత శ్రేణి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే, దానిపై రుణం రేటు, రివార్డులు, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు, డీల్స్ కూడా మెరుగ్గానే ఉంటుంటాయి. దీంతో కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల అధిక రివార్డులు, క్యాష్‌బ్యాక్, ఇతర ప్రయోజనాలు లభిస్తుంటాయి. కాకపోతే కార్డ్‌పై నిర్ధేశిత వ్యయాలు చేయాలనే నిబంధనలు ఉంటాయని మర్చిపోవద్దు. అప్‌గ్రేడెడ్ కార్డుకు వెళ్లకుండా, ఎన్నేళ్లు గడిచిన అదే పాత కార్డ్‌లోనే కొనసాగే వారు మంచి డీల్స్‌ను కోల్పోవాల్సి రావచ్చు. ‘‘పాతబడిన క్రెడిట్ కార్డ్ ఆధునిక ఫీచర్లు, ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు. నేడు దాదాపు చాలా క్రెడిట్ కార్డ్ సంస్థలు అర్హులైన కస్టమర్లకు ఉచిత ఎయిర్పోర్ట్ లాంజెస్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ప్రతీ లావాదేవీపై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, క్రెడిట్ లిమిట్‌ను పెంచుతున్నాయి. పాత కార్డ్‌లోనే కొనసాగడం వల్ల.. బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల లభించే నూతన, అదనపు ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి వివరించారు. అధిక లిమిట్ లాభమేనా? క్రెడిట్ లిమిట్ కంటే తక్కువ ఖర్చు చేసే వారి పట్ల క్రెడిట్ బ్యూరోలు సానుకూలంగా వ్యవహరిస్తాయి. ‘‘క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోరును ఎన్నో అంశాల ఆధారంగా లెక్కిస్తుంటాయి. అందులో క్రెడిట్ వినియోగం ఒకటి. తక్కువ క్రెడిట్ వినియోగ రేషియో (సీయూఆర్) అన్నది.. లిమిట్‌ను వినియోగించుకునే విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నదీ తెలియజేస్తుంది. క్రెడిట్‌పై ఎక్కువగా ఆధారపడడం లేదని సంకేతం ఇస్తుంది. ఇది ఒకరి క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుంది’’అని ఆదిల్ శెట్టి వివరించారు. కార్డుపై ఉన్న మొత్తం లిమిట్లో ఎంత శాతం ప్రతి నెలా వినియోగిస్తున్నారన్నది క్రెడిట్ వినియోగ రేషియో రూపంలో తెలుస్తుంది. ఇది తక్కువగా ఉంటే సానుకూలం అవుతుంది. ‘‘ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై క్రెడిట్ లిమిట్ రూ.లక్షగా ఉంటే, ప్రతి నెలా వినియోగిస్తున్నది రూ.50,000గా ఉంటే అప్పుడు సీయూఆర్ 50 శాతం అవుతుంది. అదే క్రెడిట్ లిమిట్ రూ.1,50,000 అయి ఉండి, వినియోగించే మొత్తం ప్రతి నెలా రూ.50,000 స్థాయిలోనే ఉంటే, అప్పుడు వినియోగ రేషియో 33 శాతం అవుతుంది’’అని శెట్టి తెలియజేశారు. క్రెడిట్ స్కోర్ సగటున 700–750 మధ్య ఉంటే, దీన్ని పెంచుకునేందుకు అధిక క్రెడిట్ లిమిట్ సాయపడుతుంది. ‘‘సగటు స్కోరులో ఉన్న వ్యక్తి (750లోపు) క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల అప్పుడు వారి క్రెడిట్ స్కోరు సైతం 750 ఎగువకు చేరుతుంది. అప్పటికే ఎక్కువ స్కోర్‌లో ఉన్న వారు క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం వల్ల అదనంగా పొందేదేమీ ఉండదు’’అని మెహ్రా సూచించారు. తక్కువ సీయూఆర్ వ్యక్తి ఆర్థిక ఆరోగ్యంపైనా సానుకూల ప్రభావం చూపిస్తుందని ఆదిల్‌శెట్టి సూచించారు. ‘‘సీయూఆర్ తక్కువగా ఉంటే మీరు మీ ఆర్థిక వ్యవహారాలను ఎంతో క్రమశిక్షణగా నిర్వహిస్తున్నట్టు తెలియజేస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు దాదాపు తక్కువగా ఉంటాయని సంకేతమిస్తుంది. రుణాల విషయంలో సరైన నడవడిక, సకాలంలో చెల్లింపులు, రుణాల్లో సరైన సమతుల్యం (వివిధ రుణాలు) అనేవి మంచి క్రెడిట్ స్కోరుకు దారితీస్తాయి’’అని శెట్టి తెలిపారు. రిస్‌్కలు ఇవీ.. అధిక క్రెడిట్ లిమిట్‌తో ఉండే అతిపెద్ద రిస్క్ పరిమితికి మించి ఖర్చు చేయడం. ‘‘ఎక్కువ లిమిట్ ఉంటే, అవసరాలు ఏర్పడినప్పుడు ఆలోచించకుండా ఖర్చు చేస్తుంటారు. సకాలంలో చెల్లింపులు చేయలేకపోతే అది భారంగా మారుతుంది. క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ కార్డ్ నిర్వహణ భద్రంగా లేకపోతే అది దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు. మోసపూరిత లావాదేవీలకు ఆస్కారం ఉంటుంది’’అని మెహ్రా పేర్కొన్నారు. కార్డు వినియోగం విషయంలో జాగ్రత్తగా, నియంత్రణతో వ్యవహరించకపోతే అది ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. అధికంగా వినియోగించడం వల్ల అప్పుడు క్రెడిట్ వినియోగ రేషియో (సీయూఆర్) పెరిగేందుకు దారితీస్తుంది. సీయూఆర్ ఎక్కువ అయితే అది క్రెడిట్ స్కోర్‌ను వెనక్కి లాగేస్తుంది. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉంటే, అప్పటికే ఉన్న క్రెడిట్ లిమిట్లో అధిక శాతం వినియోగించాల్సి వస్తుంటే.. అప్పుడు క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవాలి. సీయూఆర్ 30 శాతం మించకుండా చూసుకోవాలి. దీనితోపాటు క్రమశిక్షణతో కార్డును వినియోగించడం, సకాలంలో చెల్లింపులు చేయడం చాలా కీలకమవుతుంది. ఆఫర్‌కు ఓకే చెప్పాలా..? బ్యాంక్‌లు, లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీలు తరచుగా కార్డ్ అప్‌గ్రేడ్ లేదా లిమిట్ పెంచుకోవాలంటూ ఆఫర్లు ఇస్తుంటాయి. అప్పుడు తమ వైపు నుంచి సమీక్షించుకోవాలి. ఖర్చు చేసేందుకు అదనపు వెసులుబాటు ఉందా? రివార్డుల పరంగా ఆ కార్డ్ మెరుగైనదా? లేదంటే తమ అవసరాలకు ఉపయోగపడే ప్రత్యేక కార్డా? సెక్యూరిటీ ఫీచర్లు ఏ మేరకు? ఇవన్నీ చూడాలి. ముఖ్యంగా ఒక క్రెడిట్ కార్డ్‌తోనే ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ పరిమితం కాదు. ఇతర బ్యాంక్‌ల నుంచి రుణాలు, కార్డ్‌లు తీసుకోవాల్సి వస్తే, మీ పరిస్థితి ఏంటన్నది కూడా చూడాలి. మంచి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ ఉంటే ఇతర కార్డ్ కంపెనీలు సైతం ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తుంటాయి. ‘‘బ్యాంక్ ఇచి్చన ఆఫర్ తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగానే ఉందా? ఖర్చు చేసే ధోరణికి అనుకూలంగా ఉందా?మరిన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయా? వీటికి అవుననే సమాధానం వస్తే, అప్పుడు ఆ కార్డ్ ఆఫర్‌ను ఆమోదించొచ్చు. తాజా ఆఫర్‌కు సంబంధించి షరతులు మీకు అనుకూలంగా లేకపోతే, మీ లక్ష్యాలకు అనుకూలమైన ఇతర కార్డ్‌ను పరిశీలించొచ్చు’’అని ఆదిల్ శెట్టి సూచించారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంపు లేదా కార్డ్ అప్‌గ్రేడేషన్ అదనపు సదుపాయాలతో రావడమే కాదు, వార్షిక ఫీజు కూడా అధికంగా ఉంటుంది. అందుకని అప్‌గ్రేడ్‌ను ఎంపిక చేసుకునే ముందు పడే భారం ఎంత, ప్రయోజనాలు ఏ మేరకో చూడాలి. చాలా వరకు బ్యాంక్‌లు కార్డ్‌పై వార్షికంగా ఇంత వ్యయం చేస్తే, వార్షిక నిర్వహణ చార్జీని మాఫీ చేస్తున్నాయి. దీంతో సులభంగానే ఈ భారం పడకుండా చూసుకోవచ్చు. ఇలా అయితే సమ్మతి.. క్రెడిట్ కార్డ్ సంస్థ నుంచి ఎలాంటి ఆఫర్లు రానప్పుడు.. ఇంతకంటే మెరుగైన కార్డ్‌కు తాను అర్హుడినని భావిస్తే, అప్పుడు కార్డుదారుడే స్వయంగా లిమిట్ పెంచాలని లేదా కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని కోరొచ్చు. ‘‘క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత తమ ఆదాయం పెరిగితే అప్పుడు క్రెడిట్ లిమిట్ పెంపునకు అర్హత లభించినట్టుగా భావించొచ్చు. క్రెడిట్ కార్డ్ కంపెనీతో దీర్ఘకాల బంధం ఉన్నవారు తమ లిమిట్ పెంచుకునే అనుకూలతతో ఉంటారు. కొన్ని ప్రయోజనాలు ప్రీ అప్రూవ్డ్ (ముందే ఆమోదించినది)గా ఉంటాయి’’అని శెట్టి వివరించారు. అప్‌గ్రేడ్ చేసుకోవడం, క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం పూర్తిగా అవసరాల ప్రాతిపదికనే ఉండాలన్నది మర్చిపోవద్దు. ఆదాయం పెరిగినప్పుడు, మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడే క్రెడిట్ లిమిట్, క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడేషన్‌కు వెళ్లాలని మెహ్రా సూచిస్తున్నారు. ‘‘ఒక వ్యక్తి ఖర్చులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. కొంత కాలానికి ఇందులో మార్పు వస్తుంటుంది. అలాంటప్పుడు కార్డ్‌ను మార్చుకోవచ్చు. ప్రస్తుత కార్డ్ ప్రయోజనాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు, అవి తమకు అనుకూలంగా లేకపోతే కార్డ్ అప్గ్రేడేషన్ను కోరొచ్చు. ఉదాహరణకు ఒక బ్యాంక్ ఒక కార్డ్‌ను ఉపసంహరించి, దాని స్థానంలో వేరేది ఇస్తున్నట్టు అయితే, అందులో ప్రయోజనాలు అంత ఆకర్షణీయంగా లేవనిపిస్తే అప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని కోరొచ్చు’’అని మెహ్రా సూచించారు. అప్‌గ్రేడ్ ద్వారా తీసుకునే కార్డులో ప్రయోజనాలు తమకు అనుకూలంగా, ఆకర్షణీయంగా ఉన్నాయేమో చూసుకోవాలి. అంతేకానీ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. -
ప్రాభవం కోల్పోతున్న డెబిట్ కార్డ్
న్యూఢిల్లీ: యూపీఐ అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపుల సాధనంగా మారిపోవడంతో, ఇంత కాలం సంపద్రాయ చెల్లింపుల్లో సింహభాగం ఆక్రమించిన డెబిట్ కార్డ్ చిన్నబోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాతి నుంచి డిజిటల్ చెల్లింపుల్లో సమూల మార్పు కనిపిస్తోంది. వర్తకుల చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలకు సైతం యూపీఐని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2020 జూలైలో డెబిట్ కార్డులపై చేసిన చెల్లింపుల విలువ రూ.2.81 లక్షల కోట్లు. 2023 జూలైలో డెబిట్ కార్డుల చెల్లింపుల విలువ రూ.3.15 లక్షల కోట్లుగా ఉంది. అంటే మూడేళ్లలో వృద్ధి 12 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో యూపీఐ చెల్లింపుల్లో ఎన్నో రెట్ల వృద్ధి నమోదైంది. ఈ కాలంలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.15.33 లక్షల కోట్లకు దూసుకుపోయింది. ఇది 428 శాతం వృద్ధికి సమానం. చిన్న మొత్తాల చెల్లింపుల్లో యూపీఐకి ఉన్న సౌలభ్యంతో డెబిట్ కార్డు చెల్లింపులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఎన్నో సానుకూలతలు.. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో యూపీఐ లావాదేవీలు మొదటి సారి 1000 కోట్లను అధిగమించాయి. విలువ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. 2020 జూలై నాటికి బ్యాంకులు 85 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. వీటి సంఖ్య తాజాగా 97 కోట్లను అధిగమించాయి. ఈ వృద్ధి కూడా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలకు అనుబంధంగా ఉచితంగా డెబిట్ కార్డులు జారీ చేయడం వల్లేనని చెప్పుకోవాలి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి చార్జీల్లేకపోవడం, వేగంగా, సౌకర్యంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం విస్తరణ ఇందుకు దోహదం చేసినట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. కేంద్రం డిజిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడంతో యూపీఐ చెల్లింపులు ఇక ముందూ జోరుగా కొనసాగుతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. వచ్చే 18–24 నెలల్లో 2,000 కోట్ల నెలవారీ యూపీఐ లావాదేవీలు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డుకూ ఆదరణ మరోవైపు క్రెడిట్ కార్డు చెల్లింపులు కూడా గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2020 జూలైలో 0.45 లక్ష కోట్ల విలువైన లావాదేవీలు నమోదు కాగా, 2023 జూలై నెలకు రూ.1.45 లక్షల కోట్ల వినియోగం నమోదైంది. ‘‘రివార్డుల రూపంలో వచ్చే ప్రయోజనాలను పొందేందుకు, క్యాష్ బ్యాక్ లేదా తగ్గింపు ప్రయోజనాల కోసం ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రోసరీ, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు తదితర పెద్ద చెల్లింపులకు క్రెడిట్ కార్డుల రూపంలో చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల వారు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం వారిని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది’’అని పైసాబజార్ క్రెడిట్ కార్డ్ హెడ్ రోహిత్ చిబార్ తెలిపారు. కో బ్రాండెడ్ కార్డులు సైతం మొత్తం మీద క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధికి దోహదపడుతున్నాయి. కరోనా అనంతరం వినియోగదారుల వ్యయాల్లో వచి్చన మార్పులను గమనించిన బ్యాంకర్లు పలు రకాల ఆకర్షణీయమైన రివార్డులతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుండడం కూడా ఈ వృద్ధిని ప్రోత్సహిస్తోంది. -
క్రెడిట్ కార్డుతో జాగ్రత్త
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డు.. అదిరిపోయే ట్రావెల్ బెనిఫిట్లు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారియట్ బాన్వాయ్ కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీనికి రూ. 3,000 వార్షిక ఫీజు ఉంటుంది. ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్, గోల్ఫ్ సెషన్లు, హోటళ్లలో కాంప్లిమెంటరీ బస తదితర ప్రయోజనాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చని సంస్థలు తెలిపాయి. ఏటా 25–30 శాతం కొత్త కార్డులను జారీ చేస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ బిజినెస్ హెడ్ పరాగ్ రావు తెలిపారు. ఇతర పోటీ ఆర్థిక సంస్థలు మొండి బాకీల సమస్యలు ఎదుర్కొంటున్నా తమ అసెట్స్ నాణ్యత మాత్రం మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023 జూన్ ఆఖరు నాటికి మార్కెట్లో 1.83 కోట్ల పైచిలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు ఉన్నాయి. -
ఎస్బీఐ కార్డ్ వినియోగదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ఎస్బీఐ కార్డ్ తన కస్టమర్లకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది. రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో లింకింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో ఎస్బీఐ రూపే కార్డుదారులు తమ క్రెడిట్ కార్డు నుంచి కూడా వర్తకులకు యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐ యాప్ లతో (పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తదితర) అనుసంధానం చేసుకోవాలని ఎస్బీఐ కార్డ్ సూచించింది. ఎస్బీఐ కార్డు బ్యాంకింగ్ దిగ్గ జం ఎస్బీఐ అనుబంధ సంస్థ అని తెలిసిందే. తాజా నిర్ణయంతో తమ కార్డ్ కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా, అవాంతరాల్లేని చెల్లింపుల అనుభవాన్ని పొందొచ్చని వివరించింది. -
టిమ్ కుక్కి చేదు అనుభవం - క్రెడిట్ కార్డుకి అప్లై చేస్తే..
ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువైంది.. సర్వ సాధారణమైపోయింది. నేడు చిన్న జాబ్ చేసే ఉద్యోగి నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల వరకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు సంపాదనను బేస్ చేసుకుని ఈ కార్డులను ప్రొవైడ్ చేస్తాయి. అయితే ప్రముఖ వ్యాపార వేత్తకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడర్ గోల్డ్‌మన్ సాచ్స్‌తో ఆపిల్ క్రెడిట్ కార్డు అందిస్తుంది. ఇలాంటి క్రెడిట్ కార్డు కోసం ఆపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది. ఆపిల్ అండ్ గోల్డ్‌మన్ సాచ్స్ కలిసి 'ఆపిల్ క్రెడిట్' ఒకే సమయంలో ప్రారంభించాయి. ఆ సమయంలో చాలామంది ప్రముఖులు కూడా దీని కోసం అప్లై చేసుకున్నారు. వారివి కూడా చాలా వరకు రిజెక్ట్ అయ్యాయి. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! టిమ్ కుక్ ధరఖాస్తుని తిరస్కరించడానికి ప్రధాన కారణం అయన పేరుని ఉపయోగించి ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసి ఉండవచ్చనే అనుమానమే అని తెలుస్తోంది. ప్రస్తుతం కుక్ నికర సంపద విలువ 2 మిలియన్ డాలర్లని సమాచారం. -
మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె క్రెడిట్ కార్డు చోరీ
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): నమ్మిన యజమానురాలిని మోసం చేసిన డ్రైవర్ ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డును చోరీ చేసి డబ్బులు డ్రా చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాలివీ.. మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ కూతురు డీకే శృతిరెడ్డి బంజారాహిల్స్ రోడ్ నంబర్.14లోని ప్రేమ్‌పర్వత్ విల్లాస్‌లో నివసిస్తుంది. గతేడాది డిసెంబర్ నుంచి చిన్నా అలియాస్ కె. బీసన్న ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆమెకు చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించి శ్రీమహవీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ. 11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శృతిరెడ్డి సదరు డ్రైవర్‌ను ప్రశ్నించింది. చదవండి: హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్ అబద్దాలు చెప్పడమే కాకుండా రకరకాల కథలతో ఆమెను నమ్మించాలని చూసినా చివరకు తన క్రెడిట్ కార్డును దొంగిలించి డబ్బు వాడుకున్న విషయం వెల్లడైంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు చిన్నా అలియాస్ బీసన్నపై ఐపీసీ 420, 408ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్‌లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్‌తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట
కొత్త టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) రేటు అమలుపై కేంద్రం వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. టీసీఎస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి అమల్లోకి రావాల్సిన టీసీఎస్ రేట్ల అమలును మరో 3 నెలలు వాయిదా వేసింది. అలాగే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులతో విదేశాల్లో చేసే వ్యయాలపై టీసీఎస్ లేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 30, 2023న వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్ పరిధి దాటితే చెల్లించాల్సిన కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త సవరణ ప్రకారం తదుపరి ఆర్డర్ వరకు విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఖర్చుపై టీసీఎస్ వర్తించదు. అలా అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై వివాదానికి స్వస్తి పలికింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ సరళీకృత చెల్లింపు పథకం (ఎన్ఆర్ఎస్) నిర్వహించే అన్ని లావాదేవీలకు టీసీఎస్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. విదేశీ టూర్ ప్యాకేజీలకూ ఏడాదికి రూ. 7 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కింద రూ. 7 లక్షలకు మించిన టీసీఎస్ చెల్లింపులు 30 సెప్టెంబర్ 2023 తరువాత చేస్తే (ఒక్క విద్య తప్ప, మిగతా ప్రయోజనంతో సంబంధం లేకుండా) 0.5 శాతం రేటు వర్తిస్తుంది. (గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్) ఎల్ఆర్ఎస్ కింద ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకు డబ్బులు విదేశాలకు పంపొచ్చు. ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం, మెడికల్ అవసరాలు, విద్యా, డొనేషన్, బహుమతులు, వలస పోవడం, బంధువుల మెయింటెనెన్స్ లాంటి చెల్లింపులు చేయవచ్చు. ఇంతకుమించి పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) -
వామ్మో! క్రెడిట్ కార్డు రుణాలు.. ఒక్క ఏప్రిల్‌లోనే అన్ని లక్షల కోట్లా!
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఏడాదిలో క్రెడిట్‌కార్డ్ రుణాలు ఏకంగా 30 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. క్రెడిట్ కార్డు రుణ బకాయిలు అమాంతంగా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. ► దేశంలో క్రెడిట్ కార్డ్ రుణ బకాయిలు 2023 ఏప్రిల్‌లో ఏకంగా రూ.2.05 లక్షల కోట్లకు చేరాయి. 2022, ఏప్రిల్‌లో ఉన్న బకాయిల కంటే ఇవి 30 శాతం అధికం కావడం గమనార్హం. 2023, ఏప్రిల్‌లోనే రూ.1.3 లక్షల కోట్ల మేరకు క్రెడిట్ కార్డ్ రుణాలు తీసుకోవడం విస్మయపరుస్తోంది. ► ఇక బ్యాంకులు ఇస్తున్న మొత్తం రుణాల్లో క్రెడిట్ కార్డ్ రుణాలు 1.4 శాతానికి చేరాయి. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో దేశంలో క్రెడిట్ కార్డ్ రుణాలు అత్యధికంగా 1.2 శాతానికి చేరాయి. అనంతరం దశాబ్దం పాటు క్రెడిట్ కార్డ్ రుణాలు ఒక్క శాతం కంటే తక్కువే ఉంటూ వచ్చాయి. కానీ 2023 ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డ్ రుణాలు 1.4 శాతానికి చేరుకోవడం గమనార్హం. కాగా విశ్వసనీయమైన ఖాతాదారులకే క్రెడిట్ కార్డ్ రుణాలిస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. దేశ జనాభాలో ఇంకా కేవలం 5 శాతం మందే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారని కూడా ఆర్బీఐ తెలిపింది. ► దేశంలో వ్యక్తిగత రుణాల్లో క్రెడిట్ కార్డ్ రుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. వ్యక్తిగత రుణాల్లో గృహ రుణాలు మొదటి స్థానంలో ఉన్నాయి. బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో గృహ రుణాల వాటా 14.1 వాటా ఉంది. 3.7శాతం వాటాతో వాహన రుణాలు రెండో స్థానంలో ఉన్నాయి. 1.4 శాతంతో క్రెడిట్ కార్డు రుణాలు మూడో స్థానంలో ఉన్నాయి. ► బ్యాంకులు జారీ చేస్తున్న పారిశ్రామిక రుణాల వాటా 2022–23లో తగ్గింది. 2021–22లో పారిశ్రామిక రుణాలు 26.3శాతం ఉండగా.. 2022–23లో 24.3 శాతానికి తగ్గాయి. చదవండి: గుడ్‌న్యూస్: ఈపీఎఫ్‌వో అధిక పింఛన్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు -
భారత్‌లో యాపిల్ క్రెడిట్ కార్డ్.. విడుదల చేసేందుకు కసరత్తు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో ఆర్ధిక రంగంలోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది యాపిల్ తన స్టోర్లను భారత్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశాన్ని సందర్శించిన ఆ కంపెనీ సీఈవో టిమ్‌కుక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ శశిధర్ జగదీషన్‌తో భేటీ అయ్యారు. వారిద్దరి భేటీలో యాపిల్ క్రెడిట్ కార్డ్ విడుదలతో పాటు ఇతర అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. తాజాగా,యాపిల్..నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)తో సంప్రదింపులు జరిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, టెక్ దిగ్గజం ‘యాపిల్ పే’ పేరుతో క్రెడిట్ కార్డ్‌ను తేనుందని, ఈ కార్డ్ సాయంతో రూపే ప్లాట్ ఫామ్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ చేసుకునేలా చర్చలు జరిపినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. భారత్‌లోని బ్యాంక్‌లు తన కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేస్తున్నాయి. అయితే, వినియోగదారులు ట్రాన్సాక్షన్లను మరింత వేగంగా, సులభతరం చేసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డబ్బుల్ని సెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు యాపిల్ఏ తరహా క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేయనుందనే ఆసక్తికరంగా మారింది. ఇక, ఈ క్రెడిట్ కార్డ్ విడుదలపై టెక్ దిగ్గజం ఆర్బీఐని సంప్రదించగా.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల కోసం నిర్ధిష్ట నిబంధనలను అనుసరించాలని ఆర్బీఐ సూచించింది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ -
ఫోన్‌పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా..
Phonepe Link 2 Lakh Rupay Credit Cards To Upi : ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు’ అని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ టోటల్ పేమెంట్ వ్యాల్యూ (టీపీవీ) రూ. 150 కోట్ల వరకు చేరుకోగా.. తొలిసారి క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం తొలి సంస్థగా గుర్తింపు పొందింది. చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్‌పే వెల్లడించింది. యూజర్లు, వ్యాపారులు రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సూచించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్ అవుట్ లెట్లలో ఆమోదం పొందినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫోన్‌పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేలా క్రెడిట్ కార్డ్ ఈకో సిస్టంను అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఫోన్‌పే కన్జ్యూమర్ ప్లాట్‌ఫామ్ అండ్ పేమెంట్స్ వైస్‌ప్రెసిడెంట్ సోనికా చంద్రా తెలిపారు. చదవండి👉 చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
కొత్త రూల్ : క్రెడిట్‌కార్డుదారులకు అలర్ట్.. అలా వాడితే ట్యాక్స్ కట్టాల్సిందే!
న్యూఢిల్లీ: విదేశాల్లో క్రెడిట్ కార్డులపై చేసే ఖర్చుల మీద 20 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధింపుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఒక ఏడాదిలో రూ. 7 లక్షల వరకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే వ్యయాలపై టీసీఎస్ విధించబోమని పేర్కొంది. ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? విదేశాల్లో క్రెడిట్ కార్డుతో చేసే వ్యయాలను కూడా కేంద్రం ఇటీవల రెమిటెన్స్ స్కీమ్–ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తెచ్చింది. దీంతో జూలై 1 నుంచి విదేశాల్లో క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలపై 20% పన్ను వర్తించనుంది. అయితే ఇది ట్యాక్స్ టెర్రరిజం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్థిక శాఖ తాజా ప్రకటన చేసింది. చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షి,బిజినెస్ -
పేటీఎం బంపరాఫర్.. యూజర్లకు 75వేల వరకు స్పెషల్ బెన్ఫిట్స్!
ముంబై: రూపే నెట్‌వర్క్‌పై కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టే దిశగా పేటీఎం, ఎస్బీఐ కార్డ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) చేతులు కలిపాయి. రూపే ఆధారిత పేటీఎం ఎస్బీఐ కార్డ్‌ను ఆవిష్కరించాయి. యూపీఐ క్యూఆర్ కోడ్లపై కూడా రూపే క్రెడిట్ కార్డులు పని చేయనున్నందున మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు మరింతగా పెరగగలవని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఇందులో ప్లాటినం కేటగిరీ కార్డుహోల్డర్లకు 1 శాతం ఇంధన సర్‌చార్జి మినహాయింపు, రూ. 1,00,000 వరకు సైబర్ ఫ్రాడ్ బీమా కవరేజీ ఉంటుంది. వెల్కం ఆఫర్ కింద పేటీఎం ఫస్ట్ సభ్యత్వం, ఓటీటీ ప్లాట్‌ఫాం మెంబర్షిప్ సహా రూ. 75,000 వరకు విలువ చేసే ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే పేటీఎం యాప్‌లో ఈ కార్డుతో సినిమా, ట్రావెల్ టికెట్లపై 3 శాతం, ఇతర కొనుగోళ్లపై 2 శాతం, బైట జరిపే లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. -
అదిరిపోయే క్రెడిట్ కార్డ్, భారీ డిస్కౌంట్లు.. ఉచితంగా రైల్వే సదుపాయాలు!
హైదరాబాద్: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. వ్యాపారస్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. కార్డు ద్వారా కొనుగోళ్లపై 2 శాతం వరకు క్యాష్‌బ్యాక్, 48 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయం, తక్షణ రుణ సదుపాయం ఈ కార్డులో భాగంగా ఉంటాయని ప్రకటించింది. అలాగే అగ్ని ప్రమాదాలు, దోపిడీలు, ఇళ్లు బద్ధలు కొట్టడం తదితర వాటికి కార్డులో భాగంగా బీమా కవరేజీ పొందొచ్చని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఎన్పీసీఐ సీఈవో దిలీప్ ఆస్బే సమక్షంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ ఈ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుపై లైఫ్‌స్టయిల్, ట్రావెల్ ప్రయోజనాలు కూడా ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది. 300కు పైగా రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపు, ఏడాదికి 8 సార్లు రైల్వే లాంజ్‌లను ఉచితంగా వినియోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది. చదవండి👉 240 ఏళ్ల చరిత్రలో మ్యాన్ గ్రూప్ సంచలనం.. తొలిసారి మహిళా సీఈవో నియామకం! -
సిటీ గ్రూపు నుంచి డిజిటల్ క్రెడిట్ కార్డ్.. లాభాలేంటో తెలుసా?
పెద్ద మొత్తంలో రిటైల్ కొనుగోళ్లు జరిపే కస్టమర్ల కోసం సిటీ గ్రూపు సరికొత్త డిజిటల్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. సిటీ పే క్రెడిట్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ క్రెడిట్ కార్డు కేవలం డిజిటల్ రూపంలోనే ఉంటుందని సిటీ గ్రూపు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డ్ కోసం రిటైల్ భాగస్వాములను ఏర్పాటు చేస్తోన్న సిటీ గ్రూపు వ్యాపారుల కోసం ఇన్స్టాల్మెంట్-లోన్ ఉత్పత్తిని కూడా జోడించాలని యోచిస్తోంది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు సిటీ గ్రూప్ రిటైల్ సర్వీసెస్ యూనిట్ మాసీస్,వేఫైర్ వంటి రిటైలర్ల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ లేబుల్ కోబ్రాండ్ క్రెడిట్ కార్డ్‌లను అందిస్తుంది. సాధారణంగా ప్రైవేట్ లేబుల్ కార్డ్‌లు అనేవి కేవలం సదరు రిటైల్ సంస్థ వద్ద మాత్రమే ప్రత్యేకంగా పని చేస్తాయి. దాని స్టోర్లలో ఖర్చుతో ముడిపడి ఉన్న ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తాయి. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ కొత్త కార్డ్ సైన్ అప్ చేసే ఏ రిటైలర్ వద్దనైనా పని చేస్తుంది. దీని ద్వారా రిటైల్ సంస్థలు తమ కస్టమర్లకు ప్రమోషనల్ ఫైనాన్సింగ్‌ను అందించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కార్డ్ ఇండిపెండెంట్ క్రెడిట్ లైన్ వినియోగదారులకు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడంలో సహాయపడుతుందని న్యూయార్క్ ఆధారిత సిటీ గ్రూప్ తెలిపింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..
ఆధునిక కాలంలో CIBIL స్కోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సిబిల్ స్కోర్ అనేది లోన్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కోర్ మీద ఆధారపడే మనకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. అలాంటి సిబిల్ స్కోర్ ఏవిధంగా పెంచుకోవాలి? పెంచుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. అయితే 300 వద్ద ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని, 900 వరకు ఉంటే మంచి స్కోర్ అని పరిగణిస్తారు. తక్కువ వడ్డీతో లోన్ కావాలనుకునేవారికి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలి. లేదంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో లావాదేవీలు సరిగ్గా నిర్వహించే వ్యక్తి సిబిల్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా వున్న వ్యక్తులకు బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్కోర్ ఎక్కువగా ఉండే వ్యక్తుల డాక్యుమెంట్స్ కూడా పరిశీలించకుండా బ్యాంకు లోన్ వెంటనే అందిస్తుంది. ఒక వేళా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేటు ఎక్కువతో లోన్ అందించే అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి? నిర్దిష్ట సమయంలో బకాయిలు చెల్లించడం మీరు బకాయిలను తప్పకుండా సకాలంలో క్లియర్ చేసుకోవాలి. ఒక వేళా గడువు తేదీలను మర్చిపోయినప్పుడు, రిమైండర్ వంటివి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మీరు ఆలస్యంగా బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మీ సిబిల్ స్కోర్ పెంచడంలో సహాయపడుతుంది. క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయితే మళ్ళీ మళ్ళీ అప్లై చేయకూడదు మీకు లోన్ లేదా క్రెడిట్ కార్డు కావాలనుకున్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. అయితే అది రిజెక్ట్ అయితే దాని కోసం పదే పదే అప్లై చేసుకోకూడదు. ఒక బ్యాంకు రిజెక్ట్ చేసిన తరువాత వేరే బ్యాంకులో అప్లై చేసుకుంటే అక్కడ మీ స్కోర్ తగ్గుతుంది, కావున ఒకసారి రిజెక్ట్ అయిన తరువాత స్కోర్ మళ్ళీ పెరిగే వరకు వేచి చూడాలి. (ఇదీ చదవండి: మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!) క్రెడిట్ కార్డు రేషియో గమనించండి మీ క్రెడిట్ కార్డుని అన్ని లావాదేవీలకు ఉపయోగించకుండా చూసుకోవాలి. అంతే కాకుండా క్రెడిట్ కార్డు రేషియో 30 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇలా చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఒకే సమయంలో రకరకాల లోన్స్ తీసుకోవడం మానుకోండి మీరు ఒక లోన్ తీసుకున్నప్పుడు అది పూర్తయిన తరువాత తీసుకోవడం మంచిది. అలా కాకుండా లోన్ పూర్తికాకముందే మరో లోన్ తీసుకుంటే సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. దీనిని తప్పకుండా గమనించాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ చూసారా..!
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ తరుణంలో ఎన్నెన్నో కొత్త రూల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డులలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. ఇందులో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు చేసిన మార్పులను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) తమ AURUM కార్డ్‌లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆరమ్ కార్డు కలిగిన వారు RBL Luxeకి బదులుగా టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతున్నారు. గతంలో రూ.5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వారికి ఆర్బీఎల్ లగ్జరీ నుంచి ఈ వోచర్ వచ్చేది. ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను తొలగించింది. అయితే ఈ కార్డు మీద ప్రైమ్ అండ్ లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ బెనిఫిట్ ఇకపై అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) 2023 మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏటీఎమ్ నుంచి అమౌంట్ డ్రా చేసుకోవడం వంటి లావాదేవీలపైన రూ. 10 + జీఎస్టీ విధిస్తోంది. అంతే కాకుండా డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు వంటి వాటికి కూడా కొంత రుసుము అమలు చేసే ప్రక్రియలో బ్యాంకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే, ఇది 2023 మే 23 నుంచి డెబిట్ కార్డు చార్జీలను రూ. 259తో పాటు GST పెంచనున్నట్లు తమ కస్టమర్లకు ఒక మెయిల్ ద్వారా తెలిపింది. గతంలో ఈ చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్టీతో ఉండేది. కావున ఈ బ్యాంకు కూడా త్వరలోనే కొత్త రూల్స్ ద్వారా కస్టమర్ల మీద పెను భారాన్ని మోపే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయిందా.. జాగ్రత్త!
మీ ఏటీఎం కార్డు ఎప్పుడైనా మెషిన్లో ఇరుక్కుపోయిందా.. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు.. తోటివారిని సాయం అడుగుతారు. మెషిన్లో ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని బ్యాంకును సంప్రదిస్తారు.ఇలాంటి సందర్భంలోనే మోసగాళ్లు పొంచి ఉంటారు. సాయం చేసే నెపంతో కార్డులు మార్చి డబ్బులు కాజేస్తారు. కాపలా లేని ఏటీఎం సెంటర్ల వద్ద ఇలాంటి మోసగాళ్లు మాటు వేస్తున్నారు. ఏటీఎం మెషిన్లలో సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న కార్డుదారులను ఏమార్చి వారి కార్డులను క్లోనింగ్ చేయడమో మార్చేయడమో చేసి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. ఈ మోసం ఇక్కడితో ఆగిపోదు. మీ కార్డ్‌ని మార్చేసిన కేటుగాళ్లు ఆ కార్డును ఉపయోగించి అకౌంట్లోని డబ్బు మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో కొట్టేస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. ఇటువంటి అనేక ముఠాలు దేశంలోని అనేక ప్రాంతాలలో సంచరిస్తున్నాయి. డబ్బులు విత్‌డ్రా చేయడానికి ఏటీఎం మెషిన్లో కార్డ్ పెట్టి పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బు బయటకు రాగానే ఏటీఎం కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోతుంది. ఏటీఎం స్క్రీన్‌పై అకౌంట్ బ్యాలెన్స్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు కన్పిస్తాయి. మెషిన్లో ఏదో సమస్య తలెత్తిందని మీరు గ్రహించేలోపే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తారు. వారిలో ఒకరు మిమ్మల్ని మాటల్లో పెడతారు. మరొకరు మీ కార్డును వేరే కార్డుతో మార్చేసి కాజేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. తర్వాత కొద్ది సమయానికే డబ్బు విత్ డ్రా చేసినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. భయాందోళనకు గురైన కస్టమర్లు బ్యాంకుకు కాల్ చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జరగాల్సిన మోసం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. కార్డ్ డియాక్టివేషన్ అనేది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఎందుకంటే అటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. అనేక మంది బాధితులు ఇలాంటి మోసాలకు గురైన కస్టమర్లు చాలా మందే ఉన్నారు. ఢిల్లీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంకు వెళ్లగా తన కార్డ్ మెషిన్లో ఇరుక్కుపోయింది. సహాయం చేసే నెపంతో దుండగులు తన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకు కార్డుతో మార్చేశారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే తన మొబైల్లో విత్‌డ్రా నోటిఫికేషన్లు రావడంతో మోసపోయానని గ్రహించి వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేయాలని కోరాడు. అయినా అకౌంట్ నుంచి డబ్బు పోవడం ఆగలేదు. ఎందుకంటే కార్డ్ డీయాక్టివేట్ చేసేందుకు సమయం పట్టింది. అలాగే తూర్పు ఢిల్లీలో జరిగిన మరో ఘటనలో ఓ గృహిణి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏటీఎంకి వెళ్లింది. ఆమె కార్డ్ కూడా ఇలాగే ఇరుక్కుపోయింది. ఆ కార్డును మోసగాళ్లు మార్చేసి షాపింగ్ చేశారు. ఆమె వెంటనే ఫిర్యాదు చేసినా దాదాపు రూ.1 లక్ష కోల్పోయిన తర్వాత ఆ కార్డ్ డీయాక్టివేట్ అయింది. ఇలాంటి మోసాలు జరగినప్పుడు ఏకకాలంలో బ్యాంక్ బ్రాంచ్ని సంప్రదించి, సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడతారని ఆర్బీఐ చెబుతోంది. అయితే బ్యాంకులు మాత్రం ఈ పిన్ నంబర్ మోసగాళ్లకు తెలిసి ఉండవచ్చని ఎప్పుడూ చెప్పే సమాధానమే చెబుతాయి. ఇక సైబర్ క్రైమ్ బ్రాంచ్ వద్ద ఇలాంటి కేసులు వేలల్లో ఉంటాయి. 65,893 మోసాలు ఆర్బీఐ డేటా ప్రకారం.. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లకు సంబంధించి 2021-22లో 65,893 మోసాలు జరిగాయి. కస్టమర్లు నష్టపోయిన డబ్బు రూ.258.61 కోట్లు. మోసగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని కనిపెట్టి కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నివారించడానికి డిజిటల్, తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించడానికి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
పర్సనల్ లోనే కావాలి!
ముంబై: డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణాలకు డిమాండ్ తగ్గింది. కానీ, అదే కాలంలో అన్సెక్యూర్డ్ రుణాలైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తెలిపింది. క్రెడిట్ కార్డులు మాదిరి వినియోగ ఆధారిత ఉత్పత్తులను ఎక్కువ మంది వినియోగిస్తుండంతో అన్సెక్యూర్డ్ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! రుణానికి దరఖాస్తు వచ్చిన తర్వాత, సంబంధిత దరఖాస్తు దారుడి క్రెడిట్ స్కోరు కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రిడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలను సంప్రదిస్తుంటాయి. డిసెంబర్ త్రైమాసికంలో తన వద్దకు గృహ రుణాల కోసం వచ్చిన విచారణలు ఒక శాతం తగ్గినట్టు సిబిల్ తెలిపింది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులకు సంబంధించి వచ్చిన విచారణలు 50 శాతం, 77 శాతం మేర పెరిగినట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు! ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం ఫలితంగా గృహ రుణాలకు విచారణలు తగ్గి ఉండొచ్చని సిబిల్ తెలిపింది. రుణాలు తీసుకుంటున్న వారిల్లో 43 శాతం మంది 18–30 ఏళ్లలోపు ఉన్నారని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వీరి శాతం 40 శాతంతో పోలిస్తే పెరిగినట్టు సిబిల్ తన నివేదికలో వెల్లడించింది. మెట్రోలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే విచారణలు పెరిగినట్టు పేర్కొంది. -
క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!
ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో యుపిఐ చెల్లింపులతో పాటు క్రెడిట్ కార్డు వినియోగం కూడా ఎక్కువవుతోంది. అయితే చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులకు కార్డ్ ద్వారా బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ చేయవచ్చనే విషయం తెలిసుండకపోవచ్చు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం.. డైరెక్ట్ ట్రాన్స్ఫర్: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు పంపించుకోవడానికి స్మార్ట్‌ఫోన్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక్కో బ్యాంకు రోజువారీ లిమిట్ కలిగి ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సక్షన్ కొంత ఆలస్యం అవ్వొచ్చు, కొన్ని సార్లు వెంటనే కూడా పూర్తయిపోవచ్చు. ఇవన్నీ దేశం, కరెన్సీ, బ్యాంక్ రూల్స్ మొదలైన వాటిపైన ఆధారపడి ఉంటాయి. నెట్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి నగదు జమచేసుకోవచ్చు. దీని కోసం ఈ కింది రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మొదట మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి వెబ్సైట్ క్రెడిట్ కార్డ్ ఏరియా సెలక్ట్ చేసుకుని, ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఎంత మొత్తానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకునేది ఎంటర్ చేయండి. అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి, మొత్తం ట్రాంసెక్షన్ పూర్తయ్యే వరకు అవసరమైన సమాచారం అందించి పూర్తి చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మరో సులభమైన మార్గం ఫోన్ కాల్స్. మొదట మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి కాల్ చేసి వారు అడిగే వివరాలు తెలియజేయండి. డబ్బు పంపాలన్న విషయం కూడా వారికి తెలపాలి. మీరు ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న విషయం ద్రువీకరించి పూర్తి చేసుకోవచ్చు. చెక్కును అందించడం ద్వారా: చెక్ ఇస్యూ చేయడం ద్వారా కూడా డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొదటి తీసుకునే లేదా గ్రహీత పేరు దగ్గర 'సెల్ఫ్' అని వ్రాయండి చెక్కుపై రాయాల్సిన మిగిలిన వివరాలను కూడా పూర్తి చేయండి. దగ్గరగా ఉన్న బ్యాంక్ లొకేషన్లో చెక్కును డిపాజిట్ చేయాలి. ఏటీఎమ్ ద్వారా: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడానికి మీరు ఏటీఎమ్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఏటీఎమ్ క్యాష్ విత్‌డ్రా చేయడానికి క్యాష్ అడ్వాన్స్ ఫీచర్ ఎంచుకోవాలి. తరువాత పంపాలనుకున్న మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి. ఈ విధంగా డబ్బు జమచేయడానికి బ్యాంకులు కొంత చార్జెస్ నిర్ణయిస్థాయి. ఇది కూడా ఒక్కో బ్యాంకుకి ఒక్కోలాగా ఉంటుంది. మొబైల్ యాప్‌లు ఉపయోగించి: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎక్కువవ్వడం వల్ల ఏదైనా దాదాపు ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకుంటున్నారు. కావున స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి బ్యాలెన్స్‌లను బదిలీ చేయవచ్చు.