ఈ క్రెడిట్ కార్డు కోసం 10 లక్షల మంది వెయింటింగ్! | Robinhood Sent to Gold Credit Card For Sam Altman and Waiting For 10 Lakh People | Sakshi
Sakshi News home page

ఈ క్రెడిట్ కార్డు కోసం 10 లక్షల మంది వెయింటింగ్!.. శామ్ ఆల్ట్‌మన్ ఫిదా

Published Thu, Dec 12 2024 7:16 PM | Last Updated on Thu, Dec 12 2024 8:02 PM

Robinhood Sent to Gold Credit Card For Sam Altman and Waiting For 10 Lakh People

చిన్న స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి లక్షల జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకు.. అందరూ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ కూడా ప్లాస్టిక్ లేదా స్టెయిన్ లెస్‌తో తయారైన కార్డులనే వినియోగిస్తుంటారు. కానీ రాబిన్ హుడ్ సంస్థ ఏకంగా గోల్డ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రాబిన్ హుడ్ కంపెనీ తీసుకొచ్చిన గోల్డ్ క్రెడిట్ కార్డులలో ఒకదాన్ని.. సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్'కు పంపించింది. దీని డిజైన్ చూసి ఆల్ట్‌మన్ ఫిదా అయిపోయారు. ఈ విషయాన్నే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఒకప్పుడు గోల్డ్ కార్డు అంటే.. అది మార్కెట్ స్ట్రాటజీ అనుకున్నా, కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నా అన్నారు.

గోల్డ్ క్రెడిట్ కార్డ్ రూపొందించిన కంపెనీ రాబిన్‌హుడ్.. స్టాక్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీతో సహా రిటైల్ బ్రోకరేజ్ సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. దీనిని 2013లో వ్లాదిమిర్ టెనెవ్, బైజు భట్ స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు గోల్డ్ క్రెడిట్ కార్డు రూపొందించింది. ఈ కార్డు ద్వారా చేసే అన్ని లావాదేవీలకు 3 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. దీనికి ఎలాంటి ఫీజు లేకపోవడం మాత్రమే కాకుండా.. విదేశీ లావాదేవీలకు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

నిజానికి రాబిన్‌హుడ్ కంపెనీ రూపొందించిన ఈ గోల్డ్ కార్డు 17 గ్రాముల బరువు ఉంటుంది. ఇది పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైంది. అయితే దీనిపైన 10 క్యారెట్ల గోల్డ్ కోటింగ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్డు కోసం 10 లక్షల మంది ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement