Robinhood
-
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
కొన్నిసార్లు అనుకోకుండా సినిమాలు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాయి. అలా ఓ స్టెప్పు కారణంగా కాంట్రవర్సీల్లో నిలిచిన 'రాబిన్ హుడ్' మూవీ.. మార్చి 28న థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ కారణంగా అడ్డంగా బోల్తా కొట్టింది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)వివాదానికి కారణమైన 'అదిదా సర్ ప్రైజ్' పాటని థియేటర్లలో చూసిన ప్రేక్షకులు షాకయ్యారు. ఎందుకంటే సదరు స్టెప్పు తీసేశారు. తాజాగా యూట్యూబ్ లో ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇందులో ఆ స్టెప్ కనిపించకుండా మతలబు చేశారు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం) -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. లాలీ పాప్ డైలాగ్ అదిరిపోయింది!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. aఅయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రత్యేకమైన కెమియో పాత్రలో వార్నర్ మెరిశారు. ఈ సినిమాలో డ్రగ్ డీలర్‌గా కనిపించారు. అయితే కేవలం 2 నిమిషాల 51 సెకన్లపాటు మాత్రమే కనిపించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 20 సెకన్ల పాటు ఉన్న వీడియోను పంచుకున్నారు. ఇందులో డేవిడ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'లాలీ పాప్స్ ఆర్ రెడ్.. ఎనిమీస్ ఆర్ డెడ్' అంటూ డైలాగ్ చెప్పిన తీరు వార్నర్ ఫ్యాన్స్‌కు జోష్ నింపింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.DAVID BHAI 💥💥Enjoy @davidwarner31's MASS & SWAG on the big screens 🤩🔥Book your tickets for #Robinhood now!🎟️ https://t.co/ogblfmwZTd@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @davidwarner31 @gvprakash #RajendraPrasad @vennelakishore @DevdattaGNage #SaiSriram… pic.twitter.com/PsMo0emXl4— Mythri Movie Makers (@MythriOfficial) March 31, 2025 -
ఇక్కడ తెలివిగా మిస్.. అక్కడ దెబ్బ పడింది!
చాలామంది హీరోయిన్లతో పోలిస్తే రష్మికది ఇంకా చిన్న వయసే. కానీ సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. అందుకే ఇప్పడు పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన రష్మిక జోరుకి 'సికిందర్'తో ఇప్పుడు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి)అసలు విషయానికొస్తే ఈద్ సందర్భంగా సికందర్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజైంది. సల్మాన్ ఖాన్ హీరో కాగా రష్మిక హీరోయిన్. తొలి ఆట నుంచే దీనికి నెగిటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందే పైరసీ అవడం మరో మైనస్. సోషల్ మీడియా ట్రెండ్ చూస్తుంటే సినిమా గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది.మరోవైపు తెలుగులో రాబిన్ హుడ్ మూవీ తాజాగా రిలీజైంది. దీనికి కూడా మొదటి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. సోమవారం వస్తే అసలు ఫలితం తేలుతుంది. తొలుత ఈ మూవీలో రష్మికనే హీరోయిన్. కానీ కొన్ని కారణాలతో ఈమె తప్పుకోవడంతో శ్రీలీలకు ఛాన్స్ వచ్చింది. కాకపోతే హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో రష్మిక ఇక్కడ తప్పించుకుంది గానీ బాలీవుడ్ లో సికిందర్ దెబ్బకు దొరికేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్) -
ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి: ‘రాబిన్‌హుడ్’ నిర్మాత
‘‘రాబిన్‌హుడ్’ (Robinhood Movie ) క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మేం థియేటర్స్‌కి వెళ్లి చూశాం. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి, సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత యలమంచిలి రవిశంకర్. (చదవండి: రాబిన్‌హుడ్ మూవీ రివ్యూ)నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇతర ΄ాత్రలు పోషించారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. (చదవండి: 'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!)ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘రాబిన్ హుడ్’లో మంచి కథతో పాటు వినోదం, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో పాటు యువత వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అన్నారు. ‘‘మేము రెండు థియేటర్స్‌ని విజిట్ చేశాం. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుండటం సంతోషంగా అనిపించింది. ఈ ఉగాదికి మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది’’ అన్నారు వెంకీ కుడుముల. -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. రెండు నిమిషాలకే ఇంత హంగామా చేశారా?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు. దీంతో రాబిన్‌హుడ్‌లో డేవిడ్ రోల్‌పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెమియో రోల్ అయినప్పటికీ ట్రైలర్ ఎంట్రీ ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ అభిమానులు ఊహించినంత స్థాయిలో మాత్రం డేవిడ్ పాత్ర కనిపించలేదు. కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించి ఉస్సురుమనిపించారు. రాబిన్‌హుడ్‌లో కొద్దిసేపే కనిపించడంపై డేవిడ్ వార్నర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అది కూడా కేవలం డ్రగ్ డీలర్ పాత్రలో కనిపించడం.. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో మైనస్‌గా మారింది.మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వార్నర్ రోల్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం, స్వయంగా అతను కూడా మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం పది నిమిషాల పాటైనా వార్నర్ స్క్రీన్‌పై సందడి చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం. -
ఈసారి సక్సెస్ ప్రసాదించు స్వామీ.. తిరుమలలో నితిన్ (ఫోటోలు)
-
Robinhood: ‘రాబిన్‌హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ
హీరో నితిన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఆయన ఖాతాలో ఇటీవలి కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘మాస్ట్రో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో నితిన్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హీస్ట్ కామెడీ చిత్రంలో నితిన్‌కి జోడీగా శ్రీలీల నటించింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.రాబిన్‌హుడ్ చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొందరు అంటుంటే...యావరేజ్ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Done with my show,good 2nd half, where each & every episode worked out except cringe Leela portions. David Bhai cameo at the end is hilarious!!adidha suprisu song is good..!! Overall a decent commercial entertainer 2.5/5 #Robinhood— Peter Reviews (@urstrulyPeter) March 27, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్ బాగుంది. శ్రీలీల పోర్షన్ మినహా ప్రతి ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చివరిలో వచ్చి నవ్వులు పూయిస్తోంది. అదిదా సర్ప్రైజ్ సాంగ్ బాగుంది. ఓవరాల్‌గా ఇది డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు.#RobinhoodGood 1st half and a bad second half.Not better than bheeshma(as compared by hero). @actor_nithiin @sreeleela14 @VenkyKudumula pic.twitter.com/hZHFLIoHA5— Nenu (@nenuneneh) March 28, 2025 ‘ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ బాగోలేదు. భీష్మతో పోలిస్తే మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025‘సమ్మర్ ఫుల్‌ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. రాజేంద్రప్రసాద్, నితిన్ పాత్రలు పండించిన కామెడీ సినిమాకు ప్రధాన బలం. ఓ సింపుల్‌స్టోరీని వెంకీ కుడుముల తనదైన కామెడీ సీన్లతో, స్క్రీన్ ప్లేతో చక్కగా తీర్చిదిద్దాడు’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్‌చ్చాడు.#Robinhood Bagundhi 2nd half >>>> 1st half David Bhai entry ki theaters resound aeeeComedy bagundhi Songs placement worst except adhi dha suprise song.Overall ga good film😂— NAvANeETh (@Navaneethkittu) March 28, 2025రాబిన్‌హుడ్ బాగుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్. డేవిడ్ భాయ్ ఎంట్రీకి థియేటర్స్‌లో రీసౌండే. కామెడీ బాగుంది. అదిదా సర్ప్రైజ్ మినహా మిగతా పాటల ప్లేస్‌మెంట్స్ బాగోలేవు. ఓవరాల్‌గా గుడ్ మూవీ అని ఓ వ్యక్తి ట్విటర్లో రాసుకొచ్చాడు. Done with 1st Half of #Robinhood !Here is the #Review so far:Strictly Average!! As a commercial cinema, plot and treatment is quite routine, but the comedy by #VennelaKishore & #RajendraPrasad garu worked out to an extent! Generated good laughs in the theatre! Needs a very… https://t.co/3yhnScEFtP— FILMOVIEW (@FILMOVIEW_) March 27, 2025POSITIVE REPORTS 💥 from the Premiere Shows #Robinhood. Congratulations💐 #teamRobinhood @actor_nithiin @VenkyKudumula @sreeleela14 @gvprakash @MythriOfficial pic.twitter.com/Du6ClOcmao— Mallesh Chetpally (@Mallesh_Nithiin) March 28, 2025#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025Show completed:- #Robinhood Fun entertainer 👍Above average movie 2.75/5 First half is good Okayish Second half Not a story based film ... go with the flow Go with your family , have fun#Robinhood series will continue... 2nd part villain @davidwarner31 pic.twitter.com/yrd3PGpsl6— venkatesh kilaru (@kilaru_venki) March 27, 2025#Robinhood2.75/5A good entertainer with loads of fun😀Nithiin & Venky Kudumula's combo generates a laugh riot in 1st half and the second half is a mix of emotion & entertainment.Vennela Kishore and RP comedy worked well. The pre-climax and climax are the heart of the film.— BioScope Telugu (@BioScope_Telugu) March 28, 2025 -
ఆ సినిమా తొలి రోజే అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది: నిర్మాత రవిశంకర్
టాలీవుడ్ నిర్మాత వై.రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి వ్యాఖ్యానించారు. అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మొదటి రోజే రికార్డులు కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లోనే ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ సృష్టిస్తుందని మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చేనెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో అజిత్ కుమార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది.కాగా.. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. భీష్మ సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించడం మరో విశేషం. ఇటీవల ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సందడి చేశారు. శ్రీలీల, కేతికా శర్మతో కలిసి అది దా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులు కూడా వేశారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. తమిళ ఇండస్ట్రీలో #GoodBadUgly DAY 1 రికార్డులు కొడుతుంది - #RaviShankar#AjithKumar #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/90DmdTZclA— Telugu FilmNagar (@telugufilmnagar) March 26, 2025 -
రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీతో రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie)కు కొత్త జోష్ వచ్చినట్లయింది. అతడి స్పెషల్ ఎంట్రీ సినిమాలోనే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఉండటంతో అభిమానులు సంతోషపడ్డారు. కానీ ఇదే ఈవెంట్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ వార్నర్‌పై నోరు జారాడు. రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే కుప్పిగంతులు వేస్తున్నావ్.. అంటూ అతడిని వెక్కిరిస్తూ ఓ బూతు మాట కూడా అన్నాడు.క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్అంత పెద్ద క్రికెటర్‌ను పట్టుకుని ఇలాంటి చవకబారు వ్యాఖ్యలేంటని జనం మండిపడ్డారు. దీంతో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు తెలిపాడు. వార్నర్ అంటే తనకిష్టమని, ఉద్దేశపూర్వకంగా అలాంటి మాట అనలేదన్నాడు. పొరపాటున నోరు జారానని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. తన మాట తీరు వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి అని కోరాడు.వార్నర్ రియాక్షన్ ఇదీ!ఈ విషయంలో వార్నర్ (David Warner) రియాక్షన్ ఎలా ఉందో బయటపెట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula). వెంకీ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మేమందరం కలిశాం. అప్పుడు రాజేంద్రప్రసాద్‌గారు, వార్నర్ బాగా క్లోజ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌గారు చాలా పెద్దాయన, కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదనిపిస్తే అది మాట్లాడతారు. నువ్వు యాక్టింగ్‌కు వచ్చావ్ కదా.. చూసుకుందాం అని రాజేంద్రప్రసాద్.. నువ్వు క్రికెట్‌కు రా.. చూసుకుందాం అని వార్నర్ ఒకరినొకరు టీజ్ చేసుకున్నారు.నోరు జారాడుదాన్ని స్టేజీపై ఫన్ చేసే క్రమంలో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా ఓ మాట తూలారు. అందుకు ఆయన కూడా బాధపడ్డారు. ఈ విషయం గురించి వార్నర్‌తో మాట్లాడా.. కాస్త నోరు జారాడు, ఏమీ అనుకోకు అని చెప్పాను. అందుకు వార్నర్.. క్రికెట్లో పెద్ద పెద్ద స్లెడ్జింగ్‌లు (కావాలని తిట్టుకోవడం) చూశాను. మా స్లెడ్జింగ్‌లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్.. ఇట్స్ ఓకే.. అని పాజిటివ్‌గా మాట్లాడారు. ఆయన చాలా మంచి మనిషి అని వెంకీ చెప్పుకొచ్చాడు. నితిన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన రాబిన్‌హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ఇందులో వార్నర్ ముఖ్య పాత్ర పోషించాడు.చదవండి: 15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అదంతా టైం వేస్ట్ -
ఎక్కడికెళ్లినా గర్వంగా ఇక్కడికే వస్తా!: శ్రీలీల
‘‘ఒక సినిమాతో ప్రేక్షకులకు వినోదం పంచితే, మరో సినిమాతో సందేశం ఇవ్వాలి. ఇలా నా సినిమాలను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిగా, హీరోయిన్గా నాపై ఆ బాధ్యత ఉంటుంది’’ అని హీరోయిన్ శ్రీలీల అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక శ్రీలీల పంచుకున్న విశేషాలు. ⇒ ‘రాబిన్‌హుడ్’ సినిమాలో ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చిన నీరా వాసుదేవ్ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తన ప్రపంచంలో తను ఉంటుంది. ఈ ప్రపంచం అంతా తన చుట్టూనే ఉంటుందని అనుకుంటుంది. నా కెరీర్లో నీరా వాసుదేవ్ లాంటి ఫన్ రోల్‌ను ఇప్పటివరకూ చేయలేదు. నితిన్‌గారితో వర్క్ చేయడం ఇది రెండోసారి (గతంలో ‘ఎక్స్ట్రా’ మూవీలో కలిసి నటించారు). చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఓ ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు. ఈ సినిమాతో మాకు హిట్ పెయిర్‌గా పేరు వస్తుంది. ‘రాబిన్‌హుడ్’ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ⇒ నీరా వాసుదేవ్ పాత్రకు రష్మికా మందన్నాను అనుకున్నారు. రష్మికకు కూడా నచ్చిన పాత్ర ఇది. కానీ కాల్షీట్స్ విషయంలో సమస్యలు రావడం వల్ల రష్మిక తప్పుకున్నారు. ఆ సమయంలో వెంకీగారు నాకు ఫోన్ చేసి, ఈ రోల్ గురించి చెప్పారు. నాకు నచ్చి ఓకే అన్నాను. ఇటీవల ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో మేం కలుసుకున్నప్పుడు రష్మిక నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను మైత్రీ ఫ్యామిలీలో ఉన్నానని గర్వంగా చెప్పగలను. మన ఫ్యామిలీతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో, వారితో మూవీ చేస్తే అలా ఉంటుంది. ⇒ ‘పుష్ప ది రూల్’ సినిమాలో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ చేశాను. ఈ సాంగ్ సక్సెస్ తర్వాత ఆ తరహా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ‘పుష్ప: ది రూల్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన భారతీయ సినిమా. సో... ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశాను. అయితే ఇకపై ఇలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్స్‌కి బదులుగా మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. ⇒ 2023లో నావి ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో త్రీ షిఫ్ట్స్ కూడా వర్క్ చేశాను. అయితే గత ఏడాది హీరోయిన్గా ఒకే ఒక్క సినిమా (‘గుంటూరు కారం) లో కనిపించాను. నా ఫైనల్ ఇయర్ మెడికల్ ఎగ్జామ్స్ వల్ల ఎక్కువ సినిమాలు చేయలేదు. ఈ గ్యాప్‌లో ఎన్నో మంచి రోల్స్, మంచి చిత్రాలు వదులుకున్నాను.⇒ ప్రస్తుతం రవితేజగారితో ‘మాస్ జాతర’, శివ కార్తికేయన్గారితో ‘పరాశక్తి’, కన్నడ–తెలుగు భాషల్లో ‘జూనియర్’ సినిమా చేస్తున్నాను. ‘రాబిన్ హుడ్’లో కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ ‘అదిదా సర్ప్రైజ్’లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌కి భిన్నాబిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీరు అద్భుతమైన డ్యాన్సర్. ఆ తరహా డ్యాన్స్ మూవ్స్, కొరియోగ్రఫీ గురించి ఓ హీరోయిన్గా ఏం చెప్తారు? ‘‘ఒక అమ్మాయి దృష్టి కోణంలో చెప్పాలంటే... మనం కంఫర్టబుల్‌గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం. స్టెప్స్ అనేవి చేసేవారి కంఫర్ట్ లెవల్స్‌పై ఆధారపడి ఉంటాయి. కంఫర్ట్ జోన్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. అయితే... అమ్మాయి ఇబ్బంది పడలేదు అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా నేను ఎన్నో సాంగ్స్ చేశాను. శేఖర్ మాస్టర్‌తో కూడా చేశాను. అందరం హ్యాపీ’’ అంటున్న శ్రీలీలతో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలోని డ్యాన్స్ మూవ్స్, అలాగే వేరే సినిమాల్లోని ఈ తరహా డ్యాన్స్ మూవ్స్‌పై మహిళా కమిషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరేం అంటారు? అన్న ప్రశ్నకు శ్రీలీల బదులిస్తూ... ‘‘మహిళా కమిషన్‌కి మంచి స్థాయి ఉంది. ఏది సరైనదో వారికి తెలుసు. పాత సినిమాల పట్ల కూడా వారికి నాలెడ్జ్ ఉంది. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు.హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్నారు... అక్కడికే వెళ్లిపోతారని కొందరు అంటున్నారు.. అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ శ్రీలీల అంటే ఎవరు? తెలుగింటి అమ్మాయి. తెలుగు∙చిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటిది. ఒకవేళ బయటకు వెళ్లినా గర్వంగా ఇక్కడికే (తెలుగు) తిరిగి వస్తాను. మన పిల్లలు చదువుకోవడానికి మరొక చోటుకు వెళతారు. కానీ మళ్లీ మన ఇంటికే వస్తారు కదా! సరిహద్దులు మారినంత మాత్రాన గాలి మారదు. నేను అన్ని భాషలనూ బ్యాలెన్స్ చేస్తూ, సినిమాలు చేయాలనుకుంటున్నాను. -
'రాబిన్ హుడ్' టికెట్ రేట్ల పెంపు.. కొన్ని చోట్ల మాత్రమే
ఒకప్పటితో పోలిస్తే జనాలు ఇప్పుడు థియేటర్ కి రావడం బాగా తగ్గించేశారు. సమ్ థింగ్ డిఫరెంట్ లేదా మూవీ హిట్ అనిపించుకుంటేనే వస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ వారం రాబోతున్న రెండు మీడియం బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లు కూడా పెంచారు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. దీంతో ఓ నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: క్రికెటర్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్)ఈ శుక్రవారం నితిన్ 'రాబిన్ హుడ్', మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిపై ఓ మాదిరి హైప్ ఉంది. అలా అని ఇవేం భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ తో తీసిన సినిమాలైతే కాదు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేదు కానీ ఆంధ్రాలో మాత్రం సింగిల్ స్క్రీన్ కి రూ.50, మల్టీప్లెక్స్ కి రూ.75 పెంపు ఇచ్చారు. దీంతో ఈ సినిమాలకు పెంపు అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి.దీంతో 'రాబిన్ హుడ్' నిర్మించిన మైత్రీ మూవీస్ ఓ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ అంతా టికెట్ రేట్ల పెంపు లేదని, కొన్నిచోట్ల మాత్రం ఈ రేట్స్ అమల్లోకి వస్తాయన చెప్పింది. వీళ్లు చెప్పిన దానిబట్టి వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి కొన్నిచోట్ల మాత్రమే పెంపు ఉండొచ్చు. మిగిలిన చోట్ల సాధారణ ధరలే ఉండనున్నాయి.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య) -
'నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు'.. వార్నర్ మామ తెలుగు ప్రాక్టీస్ చూశారా?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రాబిన్‌హుడ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డేవిడ్ వార్నర్ సందడి చేశారు. అంతేకాదు తెలుగులోనూ ఏకంగా డైలాగ్స్ కూడా చెప్పి అలరించారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డేవిడ్ వార్నర్‌కు తెలుగు నేర్పించే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు నితిన్, శ్రీలీల. వార్నర్ మామకు తెలుగు నేర్పిద్దామని నితిన్ చెప్పారు. నాకు తెలుగు సినిమాలో నితిన్ అంటే పిచ్చి అని వార్నర్‌తో చెప్పించగా.. ఆ తర్వాత నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు.. అంటూ వార్నర్‌తో శ్రీలీల తెలుగు ప్రాక్టీస్ చేయించారు. అయితే ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు సరదాగా చేసినట్లు తెలుస్తోంది. ప్రీరిలీజ్ వేడుకకు ముందు డేవిడ్ వార్నర్‌కు తెలుగు నేర్పిస్తున్న ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Secret behind @davidwarner31's Telugu or actually not 😅Book your tickets for #Robinhood now!🎟️ https://t.co/ogblfmwZTd#RobinhoodTrailer TRENDING on YouTube.▶️ https://t.co/h2nhPhMrqEGRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/7rdEnEeoPT— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025 -
క్రికెటర్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్
సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. తిరిగి క్షమాపణలు చెబుతుంటారు. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలానే క్రికెటర్ వార్నర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో వార్నర్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్.. బహిరంగంగా సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: స్టేజీపైనే స్టార్ సింగర్ కి అవమానం.. గో బ్యాక్ నినాదాలు)ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్.. నితిన్ హీరోగా నటించిన 'రాబిన్ హుడ్' మూవీతో నటుడిగా మారాడు. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... వార్నర్ ని దొంగ ముం* కొడుకు అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఈవెంట్ కి తాగొచ్చారా అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. త్వరలో రిలీజ్ పెట్టుకుని ఇలాంటివి సరికాదని అర్థం చేసుకున్నారేమో రాజేంద్రప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పారు.తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదని, నితిన్- వార్నర్ తనకు పిల్లల్లాంటి వారని.. సరదాగా చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందిపడుంటే క్షమించమని రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)డేవిడ్ వార్నర్ కు సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్#DavidWarner #RajendraPrasad #Robinhood pic.twitter.com/TxOFoaVdt3— Milagro Movies (@MilagroMovies) March 25, 2025 -
'రాబిన్‌హుడ్' టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల( Sreeleela) జోడీగా నటించిన చిత్రం 'రాబిన్‌హుడ్'(Robinhood).. ఉగాది కానుకగా మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. గతంలో భీష్మ సినిమాతో నితిన్ - వెంకీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాబిన్‌హుడ్ కూడా భారీగా క్లిక్ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.రాబిన్‌హుడ్ చిత్ర మేకర్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 , మల్టీప్లెక్స్ లలో టికెట్‌కు రూ.75 ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.రేట్లు పెంపు సరే.. తేడా వస్తే..భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే గతంలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేవి. అయితే, ఇప్పుడు మీడియమ్ బడ్జెట్ చిత్రాలకు కూడా ఇలా రేట్లు పెంచడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో గేమ్ ఛేంజర్, డాకూమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలకు టికెట్ ధరలు పెంచారు. అయితే, ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడం బాగా తగ్గిపోయింది. దీంతో వెంటనే ఆ ధరలను మళ్లీ తగ్గించేశారు. ఇప్పుడు రాబిన్‌హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం సరైంది కాదని విమర్శలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే సరే.., ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం రిస్క్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెంపు వల్ల థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండకపోవచ్చని చెప్పవచ్చు. -
‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ కేతిక శర్మ (ఫొటోలు)
-
మా కెరీర్లో రాబిన్ హుడ్ బెస్ట్: వెంకీ కుడుముల
‘‘అవసరం ఉన్న వారి కోసం నిలబడే హీరో ‘రాబిన్‌హుడ్’. మా చిత్ర కథకి ఈ టైటిల్ యాప్ట్. ఈ మూవీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. నితిన్, నా కెరీర్లో ‘రాబిన్ హుడ్’ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది’’ అని డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ సినిమా తర్వాత చిరంజీవిగారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎగై్జట్ అయ్యారు. అయితే ఎక్కడో ఓ దగ్గర చిరంజీవిగారిని సంతృప్తి పరచలేకపోయాను. దీంతో మరో కథతో వస్తానని ఆయనకి చెప్పాను. కచ్చితంగా చిరంజీవిగారితో సినిమా చేస్తాను. నేను చెప్పిన ‘రాబిన్ హుడ్’ ఐడియా నితిన్‌కి నచ్చింది. ‘భీష్మ’ సినిమాతో నాకు, నితిన్‌కి మధ్య మంచి బంధం ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు’’ అని తెలిపారు.వార్నర్ సరదాగా తీసుకున్నారుఇదిలా ఉంటే... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అబీప్రాయం ఏంటి? అని వెంకీని అడిగితే... ‘‘ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్‌గారి మాటలకు అర్థం ఏమిటనేది నేను వార్నర్గారికి చెప్పాను. ఆయన నవ్వి.. క్రికెట్లో కూడా ఇలాంటివి సహజమే అన్నారు. సీనియర్ ఆర్టిస్టుగా రాజేంద్ర ప్రసాద్‌గారు తన కోస్టార్స్ని చిన్న పిల్లల్లా అనుకుని, అలా సరదాగా అంటుంటారు. వార్నర్గారిని కూడా అలా సరదాగా అన్నారు’’ అని పేర్కొన్నారు. -
బౌలర్‌గా శ్రీలీల .. బ్యాట్స్‌మెన్‌గా ఎవరంటే?.. రాబిన్‌హుడ్ టీమ్ ప్రకటించిన నితిన్!
టాలీవుడ్ హీరో నితిన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తోన్న రాబిన్‌హుడ్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నితిన్‌కు యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. రాబిన్‌హుడ్ టీమ్ నుంచి క్రికెట్ జట్టును తయారు చేయాలంటే ఎవరూ దేనికి సూట్ అవుతారో చెప్పాలంటూ హీరోను అడిగింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. మా క్రికెట్ టీమ్‌లో శ్రీలీల బౌలర్.. ఎందుకంటే ఆమె వయ్యారంగా బౌలింగ్ చేస్తే ఎవరైనా అవుట్ కావాల్సిందే.. వికెట్ కీపర్‌గా మా మైత్రి నిర్మాత రవిశంకర్.. అంపైర్‌గా వెంకీ కుడుముల.. బ్యాట్స్‌మెన్‌గా నేనే.. మా టీమ్‌లో క్యాచ్‌లో పట్టేది నవీన్.. మా టీమ్ ఓనర్‌గా డేవిడ్ వార్నర్ అంటూ ఫన్నీగా తమ రాబిన్‌హుడ్ టీమ్‌ను ప్రకటించారు. -
రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రెచ్చిపోయిన రాజేంద్రప్రసాద్
కథల ఎంపికలో తడబడి ట్రాక్ తప్పాను. కానీ ఈసారి కచ్చితంగా హిట్ కొడతాను అని గట్టి నమ్మకంతో ఉన్నాడు హీరో నితిన్ (Nithiin). భీష్మ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood Movie). శ్రీలీల కథానాయిక. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషించారు. కేతిక శర్మ ఐటం సాంగ్‌లో మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వార్నర్ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గెస్ట్‌గా విచ్చేశాడు. అయితే వార్నర్‌ను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసినప్పుడు లేడీస్ టైలర్ నుంచి హీరోగా నటించిన రోజులు గుర్తుకొచ్చాయి. ప్రతి ఇంట్లో ఒక రాబిన్‌హుడ్ ఉండాలనే కథ ఇది. వార్నర్‌పై సెటైర్లుసినిమాలో అదిదా సర్ప్రైజు అనే పాట ఉన్నట్లే.. మా వెంకీ కుడుముల, నితిన్ ఇద్దరూ డేవిడ్ వార్నర్‌ను పట్టుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ వార్నర్‌ను.. క్రికెట్ ఆడవయ్యా అంటే డ్యాన్సులేశాడు అంటూ మూతి అష్టవంకర్లు తిప్పుతూ అతడిపై సెటైర్లు వేశాడు. చివర్లో వీడు మామూలోడు కాదు.. రేయ్ వార్నరూ.. నువ్వొక దొంగ.... అంటూ ఒక బూతుపదం కూడా వాడాడు.రాజేంద్రప్రసాద్‌పై అభిమానుల ఆగ్రహంఅది అర్థం కాని వార్నర్ నవ్వుతూ కనిపించాడు. ఇది చూసిన అభిమానులు రాజేంద్రప్రసాద్‌పై మండిపడుతున్నారు. వార్నర్ సినిమా పాటలకు స్టెప్పులేయడం చూసే కదా సినిమాలోకి తీసుకున్నారు.. అలాంటప్పుడు అతడి డ్యాన్స్ గురించి వంకరగా మాట్లాడటం దేనికని విమర్శిస్తున్నారు. వయసులో పెద్దవాడివైన నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదని నటుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: 'పుష్ప' ఫస్ట్ ఛాయిస్ సమంత కాదు.. సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత -
‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్..డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదుర్స్ (ఫొటోలు)
-
రాబిన్‌హుడ్ వచ్చేశాడు.. ట్రైలర్ రిలీజ్ చేసిన డేవిడ్ వార్నర్
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రాబిన్‌హుడ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే నితిన్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. వెన్నెల కిశోర్, నితిన్ మధ్య వచ్చే సన్నివేశాలతో థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఓ రేంజ్లో అదిరిపోయింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు. -
హైదరాబాద్ చేరుకున్న డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ మ్యాచ్ కోసం కాదు!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటేస్ట్ మూవీ రాబిన్‌హుడ్. ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్‌తో అదరగొట్టేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల్లో ఈవెంట్స్ నిర్వహించారు.అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా హాజరు కానున్నారు. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా వార్నర్ పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న వార్నర్‌కు ఘనస్వాగతం లభించింది. డైరెక్టర్ వెంకీ కుడుముల స్వయంగా పూల బొకే అందించి డేవిడ్‌కు వెల్కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే గతంలోనే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నారని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ రివీల్ చేశారు. ఈ మూవీ ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పుష్ప మేనరిజంతో అభిమానులను అలరించిన క్రికెటర్.. ఇప్పుడు ఏకంగా సినిమాతోనే ఫ్యాన్స్ ముందుకు రానున్నారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రాబిన్‌హుడ్ మూవీ ఈవెంట్.. ముఖ్య అతిథిగా సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా.. మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో దూసుకెళ్తోంది. కాలేజీల్లో వరుస ఈవెంట్లతో నితిన్ టీమ్ సందడి చేస్తోంది.అయితే ఈ మూవీలో పుష్ప మేనరిజంతో అభిమానులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ పాత్రలో కనిపించనున్నారు. ఓ సినిమా ఈవెంట్లో ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టీమ్‌కు కెప్టెన్‌గా పనిచేశారు. దీంతో వార్నర్‌కు టాలీవుడ్ ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడేమో ఏకంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.టతాజాగా రాబిన్‌హుడ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ హాజరు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు అనుమతుల కోసం చిత్రబృందం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే పనిలో రాబిన్‌హుడ్ టీమ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు సినిమా ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ హాజరైతే మాత్రం ఓ రేంజ్లో ఉంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది. -
రాబిన్హుడ్తో మల్లారెడ్డి.. అదిదా సర్ప్రైజ్ అంటోన్న మల్లన్న!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించారు. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించారు. ఈ మూవీ ద్వారా వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.ప్రస్తుతం రాబిన్‌హుడ్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లా రెడ్డి కూడా హాజరయ్యారు. ఇంకేముంది మల్లన్న తన టాలెంట్‌ను మరోసారి ప్రదర్శించారు. వేదికపై నితిన్‌తో కలిసి స్టెప్పులు వేశారు. రాబిన్‌హుడ్ మూవీలోని అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ మల్లన్నా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రాబిన్‌హుడ్ చిత్రం ఉగాది కానుకగా ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది.Moment of the day 💥💥💥#MallaReddy Garu and @actor_nithiin dance to the trending #AdhiDhaSurprisu songduring team #Robinhood's visit to Malla Reddy Institute of Medical Sciences ❤🔥❤🔥GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula… pic.twitter.com/oqq8l3HZh2— Mythri Movie Makers (@MythriOfficial) March 19, 2025 -
నీ గూబ పగిలిపోతుందంటూ నితిన్‌కు వార్నింగ్
'ఛాట్ జీపీటీ'కి పోటీగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన ‘గ్రోక్’ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ కూడా తమ మూవీ ప్రమోషన్ల కోసం గ్రోక్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రశ్న ఏదైనా సరే దానిని అడిగిన వెంటనే అదే స్టైల్ల్లో సమాధానం వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్లు వాడిన బూతు మాటల్ని తిరిగి వాళ్ల మీదే ప్రయోగిస్తూ బోలెడంత వినోదాన్ని పంచుతోంది. అందుకే ఇప్పుడు నెట్టింట గ్రోక్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే నితిన్ 'రాబిన్‌హుడ్' సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించేందుకు గ్రోక్‌ను సంప్రదించారు. దాని నుంచి వచ్చిన సమాధానాలు విన్న అందరిలోనూ నవ్వులు తెప్పిస్తున్నాయి.దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ ఇద్దరూ కలిసి రాబిన్‌హుడ్ ట్రైలర్ లాంచ్ ముహూర్తం కోసం ఒక సిద్ధాంతిని కలవాలని అనుకుంటారు. ఈరోజుల్లో సిద్ధాంతి ఏంటి బ్రో అంటూ.. గ్రోక్‌ను సంప్రదించాలని నితిన్ సలహా ఇస్తాడు.. అక్కడి నుంచి మొదలౌతుంది అసలు కథ. ట్రైలర్ లాంచ్ కోసం ఒక సరైన ముహూర్తం చెప్పాలని వెంకీ కుడుముల ఇంగ్లీష్‌లో టైప్ చేస్తాడు. అప్పుడు పంచ్ డైలాగ్‌తో గ్రోక్ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన దర్శకుడు వెంటనే నితిన్‌ను డీల్ చేయమంటాడు. ఆ సమయంలో దానిని నువ్వే డీల్ చేయ్ అని నితిన్ అనడంతో.. గ్రోక్ నుంచి అదే రేంజ్లో సమాధానం వస్తుంది. నువ్వు దాన్ని, దీన్నీ అంటే నీ గూబ పగిలిపోతుందని సమాధానం ఇస్తుంది. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు సరదాగా గ్రోక్తో రాబిన్‌హుడ్ టీమ్ ముచ్చట్లు కొనసాగుతాయి.‘రాబిన్‌హుడ్’ సినిమా ట్రైలర్ మార్చి 21న సాయింత్రం 4గంటల 5నిమిషాలకు విడుదలౌతుందని మేకర్స్ ప్రకటంచారు.వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సినిమాలో అతిథిగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కనిపించనున్నడం విశేషం. -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. లక్షల్లో కాదు కోట్లల్లో పారితోషికం!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner).. మైదానంలో ఎంత ఫేమస్సో, సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్.. టాలీవుడ్ చిత్రాల డైలాగులతో రీల్స్ చేస్తూ తెలుగువారి మనసు గెలుచుకున్నాడు. ఈసారి ఏకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించాడు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.కోట్ల పారితోషికం?అందులో వార్నర్.. షార్ట్ హెయిర్, కూల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో వావ్ అనిపించాడు. ఇక పోస్టర్ రిలీజైనప్పటినుంచి ఈ దిగ్గజ క్రికెటర్ రాబిన్‌హుడ్ (Robinhood Movie)కు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సినిమాలో నటించినందుకుగానూ రూ.3 కోట్లు తీసుకున్నాడట. ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు మరో రూ.1 కోటి అదనంగా అడిగాడట! ఇది విన్న అభిమానులు.. స్టార్ క్రికెటర్ అంటే ఆమాత్రం ఇచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: రైతు అంటేనే ఛీ అనేలా చేసిన వెధవ.. ఈ దొంగ రైతుబిడ్డ: అన్వేష్ ఫైర్)అప్పుడలా.. ఇప్పుడిలా.. గతంలోనూ వార్నర్ పారితోషికం (David Warner Remuneration for Robinhood) గురించి కొన్ని వార్తలు వెలువడ్డాయి. కేవలం సరదా కోసమే ఆయన ఈ పాత్ర ఎంచుకున్నారని, డబ్బు గురించి ఆలోచించలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాతలు రూ.50 లక్షలను అతడికి అందించినట్లుగా ప్రస్తావించారు. ఇప్పుడేమో ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. వార్నర్ స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు!సినిమారాబిన్హుడ్ సినిమా విషయానికి వస్తే.. భీష్మ వంటి హిట్ మూవీ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయికగా నటించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు -
ఐటం సాంగ్‌లో మల్లెపూలతో హీరోయిన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్
దొంగలందరూ చెడ్డవారే కాదు.. దొంగల్లోనూ మంచివాళ్లుంటారు. అలాంటి ఓ వ్యక్తి కథే రాబిన్‌హుడ్ (Robinhood Movie). నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు. నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలవుతోంది.విషయం బయటపెట్టిన డైరెక్టర్శనివారం ఈ సినిమా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకీ కుడుముల (Venky Kudumula) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. రాబిన్‌హుడ్‌లో అదిదా సర్ప్రైజ్ అని ఓ ఐటం సాంగ్ ఉంది. కేతిక శర్మ (Ketika Sharma) ఈ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. అయితే అందర్నీ సర్ప్రైజ్ చేసిన మరో విషయం ఈ పాటలో కేతిక మల్లెపూల డ్రెస్‌తో కనిపించింది. అసలీ ఐడియా ఎవరిది? అని చాలామంది మదిలో మెదిలిన ప్రశ్న.మల్లెపూల వెనక ఇదా మ్యాటర్ఇదే ప్రశ్న దర్శకుడు వెంకీకి ఎదురైంది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అమ్మాయి ఇంట్రో స్పెషల్‌గా ఉండాలి. తన కాస్ట్యూమ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలని అని బాల్కనీలో ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎవరో వీధిలో మల్లెపూలు.. అని అమ్ముకుంటూ వెళ్లాడు. అది కాస్ట్యూమ్ చేస్తే ఎలా ఉంటుందా? అనుకున్నాను. అదే ఆచరణలో పెట్టాం అని చెప్పుకొచ్చాడు. అదిదా సర్ప్రైజు పాట విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాశాడు. నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. చదవండి: ఛాతి నొప్పి.. ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ -
శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా?
👉: చాలా ఏళ్ళ క్రితం ఏ హీరోయిన్ని అడిగినా, ‘డాక్టర్ కాబోయి యాక్టర్‌ని అయ్యాను’ అని చెప్పేవారు. ఇప్పటి పాపులర్ హీరోయిన్లలో చాలామంది డాక్టర్లే! సాయి పల్లవి , మీనాక్షి చౌదరి , శ్రీ లీల.. తన తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్ కావడంతో డాక్టర్ కావాలనుకున్నానని శ్రీ లీల చెప్పింది. విజయవాడ మూలాలు ఉన్నా, పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో.👉: కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్– శ్రీలీలకి ఫ్యామిలీ ఫ్రెండ్. యశ్ భార్య రాధికా పండిట్‌కి డెలివరీ చేసిన డాక్టర్ శ్రీ లీల వాళ్ళ తల్లే! అలా రెండు కుటుంబాలకి పరిచయం!👉: యశ్ని సూపర్ స్టార్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ మురళితో కన్నడంలో ఓ సినిమాలో నటించింది. యశ్‌తో నటించే చాన్స్ కోసం శ్రీ లీల ఎదురు చూస్తోంది.👉: దగ్గుబాటి ఫ్యామిలీకి శ్రీ లీల దూరపు బంధువు. రానా దగ్గుబాటి ఆ మధ్య తన రియాలిటీ షోలో– తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్ళినా, శ్రీ లీల కనబడుతుందని కామెంట్ చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా శ్రీ లీలకి బంధుత్వం ఉంది.👉: పుష్ప –2లో కిస్సిక్ సాంగ్‌తో ఆడియన్స్‌ని వెర్రెక్కించిన శ్రీ లీలకి ఐటమ్ సాంగ్స్ కొత్త కాదు. పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది.👉: డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. మంచి బీట్ ఉన్న సాంగ్ వినబడితే చాలు– బాడీ ఆటోమేటిక్‌గా డాన్స్ చేస్తుంది. ఆ క్వాలిటీయే– ఆది కేశవ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కి పెట్టారు.👉: పుష్ప –2లో ఐటమ్ సాంగ్ చేసి, సమంతని రీ ప్లేస్ చేసింది. కిస్సిక్ సాంగ్‌కు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.👉: తను ఇంత వరకూ చేసిన క్యారెక్టర్స్‌లో భగవంత్ కేసరిలోని పాత్ర, సాంగ్స్‌లో కిస్సిక్ సాంగ్ బాగా ఇష్టమని శ్రీ లీల చెప్పింది.👉: నితిన్‌తో రాబిన్‌హుడ్ సినిమాలో నటిస్తోంది. నితిన్‌తో రెండో సినిమా. నిజానికి రాబిన్‌హుడ్‌లో రష్మిక మందన్నా హీరోయిన్గా చేయాలి. మొదట షూటింగ్ మొదలైనప్పుడు– రష్మిక హీరోయిన్. తర్వాత శ్రీ లీల రష్మికని రీ ప్లేస్ చేసింది.👉: పుష్ప–2 ఐటమ్ సాంగ్ షూటింగ్లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్ రీ ప్లేస్మెంట్ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల తనే రాబిన్‌హుడ్ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల.👉: బై టూ లవ్ అనే కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు– ఓ అనాథ శరణాలయానికి వెళ్లింది. అక్కడి అనాథలను చూసి చలించి, బుద్ధిమాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తన జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే అని చెప్పింది శ్రీ లీల.👉: తను చేసిన గుంటూరుకారం, పుష్ప–2, ధమాకా సాంగ్లా కోట్లాది వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉండటం బాగా కిక్కు ఇచ్చిన మేటర్ అంటుంది శ్రీ లీల. -
రాబిన్‌హుడ్‌కి అతిథి
‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’(Robinhood). శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్ డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. ఆయన ఫస్ట్ లుక్‌ని శనివారం రిలీజ్ చేశారు. షార్ట్ హెయిర్ కట్, ట్రెండీ దుస్తులు, చిరునవ్వు, కూల్ ఎక్స్ప్రెషన్తో ఉన్న వార్నర్ లుక్ అదుర్స్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.‘‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్‌ది అతిథి పాత్ర అయినప్పటికీ ఆయనకు ఉన్న ప్రపంచ ప్రజాదరణ, మ్యాసీవ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ సినిమాపై స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: చెర్రీ, కెమేరా: సాయి శ్రీరామ్, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: హరి తుమ్మల, లైన్‌ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి. -
నాని కాన్ఫిడెన్స్.. పేరు మార్చుకుంటానన్న రాజేంద్రప్రసాద్.. అదే కారణమన్న కిరణ్
సీన్ 1: కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అన్నాడు నాని (Nani). ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్‌కు రెండురోజుల ముందే మీడియాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ బయటపెట్టుకున్నాడు. నాని నమ్మకమే నిజమవుతూ కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.సీన్ 2: దిల్రూబా సినిమా (Dilruba Movie)లో హీరో కిరణ్ అబ్బవరం ఫైట్స్ నచ్చకపోతే నెక్స్ట్ ప్రెస్మీట్లో నన్ను చితక్కొట్టండి. అతడి ఫైట్స్ మీకు నచ్చలేదంటే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను అన్నాడు చిత్రనిర్మాత రవి. మార్చి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది.సీన్ 3: రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie) చూశాక మన ఇంట్లో కూడా ఓ రాబిన్‌హుడ్ ఉంటే బాగుండనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మేం నలుగురం మాత్రమే గుర్తుంటాం. సినిమా లేదంటే నేను నా పేరుమార్చేసుకుంటాను అన్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. ఈ మూవీ మార్చి 28న విడుదలవుతోంది.కిరణ్ రియాక్షన్ ఇదే!అందరూ ఇలా తెగించి మాట్లాడటానికి ప్రధాన కారణం.. జనాల్ని థియేటర్‌కు రప్పించడమే! ఓటీటీలకే రుచి మరిగిన ఆడియన్స్‌ను థియేటర్‌వైపు చూసేలా చేసేందుకే ఇలాంటి ప్రమోషన్ స్టంట్స్.. దీని గురించి హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని బలంగా వ్యక్తపరిస్తేనే జనాలు థియేటర్‌కు వస్తారని అలా చేసుండొచ్చు.నా ఫైట్ సీన్లు బాగోకపోతే తనను కొట్టమని నిర్మాత అన్నారు. మీరెవరూ ఆయన్ని కొట్టొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సరిగా చేయకపోతే దొరికిపోతాను. ఫైట్స్ బాగానే చేశాను.. ఆయన్ను మీరు కొట్టరనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్ -
సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న కేతిక శర్మ స్టెప్స్..
-
నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ ట్రెండింగ్ లో కేతిక శర్మ (ఫొటోలు)
-
‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్మీట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
-
నితిన్ ‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
రాబిన్ హుడ్ నా పుట్టిన రోజు కానుక: నితిన్
‘‘నేను, వెంకీ కుడుముల కలిసి సోమవారం రాత్రి ‘రాబిన్‌హుడ్’(Robinhood) సినిమా చూశాం. ఈ మూవీ మా కెరీర్లో పెద్ద సినిమా కాబోతుందని చాలా నమ్మకం ఉంది. ఈ నెల 30న నా బర్త్‌డే. ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న వస్తుంది. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు’’ అని హీరో నితిన్ చెప్పారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో నితిన్ మాట్లాడుతూ–‘‘నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్‌గారు, ‘వెన్నెల’ కిషోర్... మా మధ్య వచ్చే సన్నివేశాలు పోట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చేది కాదు’’ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను చేసిన మీరా పాత్ర చాలా ప్రత్యేకం. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు.వెంకీ కుడుముల మాట్లాడుతూ–‘‘సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాను. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఈ సినిమాలో అతిథిగా చేసిన డేవిడ్ వార్నర్ గారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘అద్భుతమైన కథకి వినోదం మిక్స్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్ ని అలరిస్తుంది’’అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో వినోదం, మంచి యాక్షన్‌తో పాటు అన్ని వాణిజ్య అంశాలుఉన్నాయి. మూవీ మంచి సక్సెస్ అవుతుందని మేమంతా నమ్మకంతో ఉన్నాం’’ అని చెప్పారు. -
నితిన్ రాబిన్‌హుడ్.. అది దా సర్ప్రైజ్ అంటోన్న కేతిక శర్మ
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. 'అది దా సర్ప్రైజ్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ కేతిక శర్మ తన డ్యాన్స్‌తో అలరించింది. ముఖ్యంగా కేతిక శర్మ అందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ పాట రాబిన్ హుడ్‌లో మూవీలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. అంతుకుముందే కేతిక శర్మ తెలుగులో రంగరంగ వైభవంగా, లక్ష్య లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు. This summer heat is here with the sizzling moves and the blazing beats 🔥🔥#Robinhood third single #AdhiDhaSurprisu ft. @TheKetikaSharma out now ❤️🔥▶️ https://t.co/GvczL8HezzA @gvprakash musical.Lyrics by Academy Award Winner @boselyricistSung by @neetimohan18 &… pic.twitter.com/fRkw35ndnO— Mythri Movie Makers (@MythriOfficial) March 10, 2025 -
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆ హీరో సినిమాతో అరంగేట్రం
పుష్ప డైలాగ్స్‌తో టాలీవుడ్ ప్రియులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బన్నీకి అభిమాని అయిన ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ టాలీవుడ్ సినిమా డైలాగ్స్‌తో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో అల్లు అర్జున్ పుష్ప మూవీ డైలాగ్స్‌తో తగ్గేదేలా అంటూ అభిమానులను అలరించాడు. ఆయన తాజాగా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి.నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న తాజా చిత్రం రాబిన్ హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా కింగ్స్టన్ మూవీ ఈవెంట్‌కు హాజరైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ చిన్న రోల్ చేశారని తెలిపారు. దీంతో నితిన్ ఫ్యాన్స్‌తో పాటు వార్నర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గతంలో అల్లు అర్జున్ మూవీ పుష్ప డైలాగ్‌లో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చాలాసార్లు బన్నీ డైలాగ్స్ చెబుతూ తనదైన స్టైల్లో అలరించాడు. తాజాగా రాబిన్ హుడ్ మూవీతో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో అటు క్రికెట్ ఫ్యాన్స్.. ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. డేవిడ్ వార్నర్ గతంలో ఐపీఎల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. -
రాబిన్‌హుడ్ డేట్ ఫిక్స్
‘భీష్మ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం చిత్రయూనిట్ ప్రకటించింది.‘‘ఈ మూవీలో నితిన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం కేతికా శర్మ చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
పండుగ రేసు నుంచి తప్పకున్న నితిన్ 'రాబిన్‌హుడ్'
క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాబిన్‌హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్‌లాల్ బరోజ్ తెలుగు వర్షన్‌ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.రాబిన్ హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. -
రాబిన్ హుడ్ పై పుష్పరాజ్ ఎఫెక్ట్?
-
ఈ క్రెడిట్ కార్డు కోసం 10 లక్షల మంది వెయింటింగ్!
చిన్న స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి లక్షల జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకు.. అందరూ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ కూడా ప్లాస్టిక్ లేదా స్టెయిన్ లెస్తో తయారైన కార్డులనే వినియోగిస్తుంటారు. కానీ రాబిన్ హుడ్ సంస్థ ఏకంగా గోల్డ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.రాబిన్ హుడ్ కంపెనీ తీసుకొచ్చిన గోల్డ్ క్రెడిట్ కార్డులలో ఒకదాన్ని.. సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్'కు పంపించింది. దీని డిజైన్ చూసి ఆల్ట్‌మన్ ఫిదా అయిపోయారు. ఈ విషయాన్నే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఒకప్పుడు గోల్డ్ కార్డు అంటే.. అది మార్కెట్ స్ట్రాటజీ అనుకున్నా, కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నా అన్నారు.గోల్డ్ క్రెడిట్ కార్డ్ రూపొందించిన కంపెనీ రాబిన్‌హుడ్.. స్టాక్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీతో సహా రిటైల్ బ్రోకరేజ్ సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. దీనిని 2013లో వ్లాదిమిర్ టెనెవ్, బైజు భట్ స్థాపించారు. ఆ సంస్థ ఇప్పుడు గోల్డ్ క్రెడిట్ కార్డు రూపొందించింది. ఈ కార్డు ద్వారా చేసే అన్ని లావాదేవీలకు 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనికి ఎలాంటి ఫీజు లేకపోవడం మాత్రమే కాకుండా.. విదేశీ లావాదేవీలకు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.నిజానికి రాబిన్‌హుడ్ కంపెనీ రూపొందించిన ఈ గోల్డ్ కార్డు 17 గ్రాముల బరువు ఉంటుంది. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైంది. అయితే దీనిపైన 10 క్యారెట్ల గోల్డ్ కోటింగ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్డు కోసం 10 లక్షల మంది ఎదురు చూస్తున్నట్లు సమాచారం.a few months ago robinhood sent me a gold credit card with extremely high-quality details. i thought it was a ridiculous marketing stunt at the time but now it’s an example i give when talking about great design. pic.twitter.com/v0VWyJK7PT— Sam Altman (@sama) December 10, 2024 -
క్రిస్మస్ కాదు టాలీవుడ్‌కి మినీ సంక్రాంతి
మరో నాలుగు రోజుల్లో 'పుష్ప 2' రిలీజ్ కానుంది. దీంతో ఈ వారం.. రిలీజైన తర్వాత వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కానీ క్రిస్మస్కి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కుప్పలతెప్పలుగా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఏకంగా డజను సినిమాలు క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి వాటి సంగతేంటి?తెలుగు సినిమాల విషయానికొస్తే డిసెంబరు 20న అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' వస్తుంది. రీసెంట్గా రిలీజైన రా అండ్ రస్టిక్ టీజర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. దీనిపై అల్లరి నరేశ్ అంచనాలు పెట్టుకున్నారు. ప్రియదర్శి 'సారంగపాణి' కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది. సున్నితమైన కామెడీ సినిమాలు తీస్తాడనే పేరున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇది హిట్ అవ్వడం వీళ్ల కెరీర్‌కి కీలకం.(ఇదీ చదవండి: నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్)20నే 'మ్యాజిక్' అనే తెలుగు సినిమా కూడా రాబోతుంది. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీన్ని తీశారు. అనిరుధ్ మ్యూజిక్. ఇప్పటికైతే ఎలాంటి అంచనాల్లేవు. అదే రోజున విజయ్ సేతుపతి-వెట్రిమారన్ తమిళ డబ్బింగ్ మూవీ 'విడుదల 2' కూడా రానుంది. దీనికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. అలానే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర 'యూఐ' కూడా ఇదే రోజున థియేటర్లలోకి రానుంది.హాలీవుడ్ నుంచి 'ముఫాసా' అనే కార్టూన్ మూవీ కూడా 20వ తేదీనే థియేటర్లలోకి రానుంది. సిటీల్లో మాత్రం పెద్ద చిత్రాలకు ఇది కాంపిటీషన్ అని చెప్పొచ్చు. మహేశ్ బాబు, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు.. దీనికి ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. ఇది ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.(ఇదీ చదవండి: అఫీషియల్: చరణ్ సినిమాలో 'మీర్జాపుర్' మున్నా భయ్యా)డిసెంబరు 25న అంటే క్రిస్మస్ రోజున రాబోతున్న తెలుగులో సినిమాల్లో కాస్త చెప్పుకోదగింది నితిన్ 'రాబిన్ హుడ్'. శ్రీలీల హీరోయిన్, 'భీష్మ' లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ చేసిన మూవీ కావడంతో ఓ మాదిరి అంచనాలున్నాయి. ఈ రోజున రిలీజయ్యే వాటిలో ఇదొక్కటే తెలుగు మూవీ. ఇది కాకుండా మ్యాక్స్ (కన్నడ డబ్బింగ్), మార్కో (మలయాళ డబ్బింగ్), బరోజ్ (మలయాళ డబ్బింగ్), బేబీ జాన్ (హిందీ) చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. డిసెంబరు 27న 'పతంగ్' అనే తెలుగు సినిమా కూడా ఉందండోయ్.ఇలా క్రిస్మస్ వీకెండ్లో ఏకంగా 12 వరకు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓ రకంగా చూసుకుంటే 'పుష్ప 2' తర్వాత, సంక్రాంతికి ముందు ఇన్ని మూవీస్ రావడం సాహసమనే చెప్పాలి. మినీ సంక్రాంతికి అని చెప్పొచ్చేమో!(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
నితిన్ 'రాబిన్‌హుడ్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
డబ్బు కోసం ఏమైనా చేసే 'రాబిన్ హుడ్' టీజర్ విడుదల
'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
ఆస్ట్రేలియాలో ఆటా పాటా
ఆస్ట్రేలియా వెళ్లింది ‘రాబిన్‌హుడ్’ టీమ్. ‘భీష్మ’ (2020) వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్–దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. నితిన్, శ్రీలీల కాంబినేషన్లో ఓ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.మెల్బోర్న్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్‌తో పాటు కొంత టాకీపార్టు చిత్రీకరణ కూడా ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. -
టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‌హుడ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి నితిన్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నితిన్ వృద్ధుడి గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. వాస్తవంగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆయన గెటప్ ఉంది. ఫేస్ యాప్, ఏఐ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగించి అలా వీడియోను క్రియేట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. రాబిన్‌హుడ్ సినిమాలో నితిన్ ఇలాగే కనిపించనున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబిన్‌హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.Pulling each other's legs is our daily routine on #Robinhood sets..@actor_nithiin anna & @sreeleela14 😂🙈 pic.twitter.com/pTp4yiO32o— Venky Kudumula (@VenkyKudumula) July 11, 2024 -
నా ముందు సైలెంట్‌గా ఉండాలి!
తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా దూసుకెళుతున్నారు యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’, రవితేజ ‘ఆర్టీ 75’ (వర్కింగ్ టైటిల్) వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం (మే 14) శ్రీలీల బర్త్‌డే. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘రాబిన్‌హుడ్’లో ఆమె చేస్తున్న లేడీ బాస్ నీరా వాసుదేవ్ ΄పాత్ర లుక్, టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘జ్యోతీ... సునామీలో టి సైలెంట్ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి’ అంటూ శ్రీలీల చెప్పిన డైలాగ్ టీజర్లో ఉంది. ‘ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్’ (2023) చిత్రం తర్వాత హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.‘యునిక్ యాక్షన్, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ‘రాబిన్‌హుడ్’ రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్ పాత్రకు శ్రీలీల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్ కేర్ తీసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రాబిన్‌హుడ్ డేట్ ఫిక్స్
నితిన్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలతో పాటు వినోదంతో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు. తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు పూర్తిగా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు వెంకీ కుడుముల. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు మా సినిమాకి కలిసి రానున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్. -
నితిన్ రాబిన్ హుడ్
‘భీష్మ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘రాబిన్ హుడ్’ టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారట. శుక్రవారం (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మేకర్స్. ‘డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే... అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది.. అన్నట్టే చేసింది... దేశమంత కుటుంబం నాది... ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు... ఆభరణాలేసుకున్నోళ్లంత నా అక్క చెల్లెళ్ళు... అవసరం కొద్ది వాళ్ల జేబుల్లో చేతులు పెడితే... ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు... అయినా నేను హర్ట్ అవ్వలేదు... ఎందుకంటే అయినవాళ్ల దగ్గర తీసుకోవడం నా హక్కు... మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
రాబిన్‌హుడ్ టైటిల్ గ్లింప్స్
-
మంచోడే.. కానీ.. దొంగోడు!
హైదరాబాద్: దొంగలందు ఈ దొంగ వేరయా.. అన్నట్టు.. పెద్దలను దోచి పేదలకు పంచిపెడుతుంటాడు. చోరీ చేసిన సొత్తులో కొంత భాగాన్ని తన గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తాడు. కేవలం బంగారం, నగదు మాత్రమే తస్కరిస్తూ వెండి వస్తువుల జోలికి వెళ్లడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా పక్కా ప్రణాళికతో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతూ జారుకుంటాడు. జూబ్లీహిల్స్లోనే దొంగతనాలకు పాల్పడతాడు తప్ప నగరంలోని మరో ప్రాంతంపై దృష్టి పెట్టడు. పోలీసులకు ఏమాత్రం క్లూ దొరక్కుండా సెల్‌ఫోన్ సిమ్ వేసుకోకుండా కేవలం నెట్‌తో వాట్సాప్ కాల్స్ మాత్రమే వాడుతూ అత్యంత పకడ్బందీగా హైదరాబాద్, ముంబై మధ్య రాకపోకలు సాగిస్తున్నాడు. నాలుగేళ్లుగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్న ఈ అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సీసీ కెమెరాకు చిక్కి.. బిహార్‌కు చెందిన మహ్మర్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్‌హుడ్ అలియాస్ ఉజ్వల్ (33) ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నెల 9న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10సిలోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసించే ధృవ అనురాగ్‌రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. బంగారు నగలు తస్కరించి అదే రోజు రాత్రి ఇక్కడి నుంచి ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగారు. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నాలుగైదు రోజులపాటు 75కిపైగా సీసీ కెమెరాలను వడపోసినా ఎక్కడా ఇర్ఫాన్ ఆనవాళ్లు చిక్కలేదు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ వెళ్తుండగా వెంకటగిరి సమీపంలో ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కాడు. లక్డీకాపూల్‌లోని హోటల్లో మకాం.. పాత నేరస్తుల ఫొటోలను, సీసీటీఎన్ఎస్ పరిశీలనలో రాబిన్‌హుడ్ మామూలోడు కాదని, కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. నగరానికి దొంగతనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో తనకు అచ్చొచ్చిన గదిలో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారం రోజులపాటు ఆ హోటల్ వద్ద కాపు కాశారు. రాబిన్‌హుడ్ రాకను గుర్తించిన పోలీసులు అతన్ని అదే హోటల్ గదిలో అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేయగా ఈ నెల 8న దొంగతనానికి ఇక్కడికి వచ్చానని, ఓ ఖరీదైన కారులో జూబ్లీహిల్స్ ప్రాంతంలో తిరుగుతూ తనకు అనుకూలంగా ఏ ఇల్లు దొంగతనానికి సరిపోతుందో రెక్కీ నిర్వహించినట్లుగా చెప్పాడు. ఓ ఇంటిపైనుంచి మరో ఇంటిపైకి దూకుతూ.. ఓ ప్రముఖ నటుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో చూడగా అక్కడ ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ధృవ అనురాగ్‌రెడ్డి ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించాడు. అదే రోజు రాత్రి ముంభైలోని తన రెండో భార్య బార్ గర్ల్ గుల్షన్ ఇంటికి వెళ్లానని, మళ్లీ దొంగతనం చేయడానికి రెండు రోజుల క్రితం అదే హోటల్‌కు వచి్చనట్లు తెలిపాడు. ప్రముఖులు, బడాబాబులు నివసిస్తున్న జూబ్లీహిల్స్‌లోని దొంగతనాలు చేస్తుంటానని, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి 15 నుంచి 20 ఇళ్ల పైకప్పులు దూకుతూ వెళ్తుంటానని చెప్పాడు. తాను చోరీ చేసిన సొత్తులో 50 శాతం పేదలకు ఆహారం, స్కూల్ ఫీజులు, దుస్తులు, ఆసుపత్రుల ఫీజులు కడుతుంటానని చెప్పాడు. అందుకే తనకు రాబిన్ హుడ్ పేరు వచ్చినట్లు వెల్లడించాడు. ఇప్పటికే ముగ్గురు భార్యలు.. మరో యువతితో ప్రేమాయణం చోరీ సొత్తుతో స్వగ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో ఉజ్వల్ అని పేరు పెట్టారని వెల్లడించారు. తన మొదటి భార్య పర్వీన్ బిహార్‌లో జెడ్పీ చైర్పర్సన్ అని.. రెండో భార్య ముంబైలో బార్‌గర్ల్ అని.. మూడో భార్య కోల్‌కతాలో ఉంటోందన్నాడు. ఇటీవలే పూజ అనే యువతితో ప్రేమలో పడ్డట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడిపై హైదరాబాద్‌లో నాలుగు కేసులు, బెంగళూరులో 7, న్యూఢిల్లీలో 4 కేసులు నమోదై ఉన్నాయి. ఇళ్ల తాళాలు పగులగొట్టి తనతో తీసుకెళ్లే స్రూ్కడ్రైవర్లు, రాడ్లతో అల్మారాలు తెరుస్తుంటాడని వాటిని స్వాదీనం చేసుకున్నట్లు జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ తెలిపారు. -
వెండితెరపై ‘టైగర్ నాగేశ్వరరావు’
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. పెద్దలను కొట్టి పేదలకు పంచిన రాబిన్‌హుడ్‌గా ఫ్యాన్ పాలోయింగ్ కలిగిన నేరస్తుడు. పోలీసు అధికారులకు ముందుగా చెప్పి జైలు నుంచి తప్పించుకున్న ‘టైగర్’. పట్టుకోలేరంటూ సవాల్ చేసి మరీ నేరాలు చేసిన తెంపరి. పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమాన జనంతో ఆయన అంతిమ యాత్రకు మూడు రోజులు పట్టింది. మృతి చెందిన 43 ఏళ్లకు నాగేశ్వరరావు జీవిత కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గజదొంగ హీరోయిజమే ఈ పాన్ఇండియా సినిమాకు ప్రేరణ. ‘మాస్ మహరాజ్’ రవితేజ ఈ చిత్ర హీరో. గుంటూరు డెస్క్ : విజయవాడ– చైన్నె రైలు మార్గంలో బాపట్ల సమీపంలో ఉంటుంది స్టువర్టుపురం. 1874 సెటిల్మెంట్ చట్టం ప్రకారం ఏర్పడిన గ్రామం. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారిని, ఇతర నేరస్తులను గుర్తించి నిఘా ఉంచేందుకని ఇక్కడ నివాసం కల్పించారు. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్ పేరుతో గ్రామానికి నామకరణం చేశారు. నేరాల్లో ఆరితేరిన వారు ముఠాలుగా వివిధ రాష్ట్రాల్లో దోపిడీ, దొంగతనాలకు పాల్పడేవారు. స్టువర్టుపురం దొంగలంటేనే జనంలో ఒకరకమైన భీతి ఉండేది. టైగర్ నాగేశ్వరరావు తెర పైకి వచ్చాక ఆ గ్రామం పేరు మరింతగా కలకలం రేపింది. తోటి దొంగలకు హీరోగా, పేదలకు ఆపద్బాంధవుడిగా, పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. దొంగతనాలు వారసత్వంగా కలిగిన కుటుంబంలో ఇద్దరు అన్నల తర్వాత గరిక నాగేశ్వరరావు జన్మించాడు. జనన సంవత్సరం 1953–56 మధ్య. సోదరులు ప్రసాద్, ప్రభాకర్. వీరి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. మరికొన్నేళ్లకు తండ్రినీ కోల్పోయారు. తండ్రి బాటలోనే దొంగతనాలు చేస్తున్న ప్రభాకర్ ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమైన పోలీసులు, సోదరుడైన నాగేశ్వరరావును తీసుకెళ్లి, తీవ్రంగా హింసించారు. ఏ నేరం చేయకుండానే పోలీసుల చిత్రహింసలు అనుభవించిన 15 ఏళ్ల నాగేశ్వరరావు తండ్రి, అన్న బాటలోనే నేరస్తుల జత కట్టాడు. 1970లో తమిళనాడు వెళ్లి మారుపేర్లతో నివాసముంటూ దొంగతనాలు ఆరంభించాడు. అన్న ప్రభాకర్ జైలు నుంచి విడుదలై వచ్చాక అతడి ముఠాలో పని చేయసాగాడు. ‘ఆంధ్రా టైగర్రా’... ఒక పర్యాయం తమిళనాడు పోలీసులు అన్నదమ్ములను అరెస్టు చేశారు. తిరువాళ్లూరు జైలులో ఉన్న నాగేశ్వరరావును అప్పటి ఐజీ అరుళ్ విచారించారు. తనను చిత్రహింసలు పెడితే రెండు రోజుల్లో జైలు నుంచి పారిపోతానని నాగేశ్వరరావు ఐజీతో స్పష్టంగా చెప్పాడు. అన్న వద్దని చెప్పినా వినకుండా, సబ్‌జైలు నుంచి పోలీసులను కొట్టి మరీ పరారయ్యాడు. తనను వెతుక్కుంటూ స్టువర్టుపురం వచ్చిన పోలీసులనూ కొట్టాడు. ‘వచ్చే నెలలో మద్రాస్ సిటీలోనే నేరం చేస్తాను... దమ్ముంటే పట్టుకోమను’ అంటూ వారిని పంపేశాడు. అన్నట్టుగానే మద్రాస్ సిటీలో వరుసగా మూడు నెలలు దొంగతనాలు చేసి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. విసుగెత్తిపోయిన ఐజీ అరుళ్ నిజంగా వాడు ‘ఆంధ్రా టైగర్రా’ అన్నాడు. అప్పట్నుంచి నాగేశ్వరరావు ఇంటి పేరు టైగర్ అయింది. ఏపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 15 ఏళ్లపాటు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన టైగర్ నాగేశ్వరరావు పోలీసులకు సింహస్వప్నంగా మారాడు. 1974లో జరిగిన బనగానపల్లె బ్యాంకు దోపిడీ అందులో ఒకటి. పోలీస్‌స్టేషనుకు అత్యంత సమీపంలో ఉండే బ్యాంకును నాగేశ్వరరావు ముఠా కొల్లగొట్టింది. సేఫ్‌ను పగులగొట్టి వెంట తీసుకెళ్లారు. గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులకు ప్రభాకరరావు దొరికాడు మినహా నాగేశ్వరరావు ఆచూకీ దొరకలేదు. ఒక బిస్కట్ కంపెనీ అధినేత, అప్పటి హోంశాఖ సహాయమంత్రి వియ్యంకుడి కుటుంబాన్ని దారికాచి దోచారు. పట్టుకునేందుకు పోలీసుల వ్యూహం ... తలనొప్పిగా మారిన నాగేశ్వరరావును ఎలాగైనా మట్టుపెట్టాలని పోలీస్ శాఖలోని కొందరు అధికారులు సిద్ధమయ్యారు. మరొక దొంగ ఇచ్చిన సమాచారంతో నాగేశ్వరరావు తరచూ ఒక మహిళ ఇంటికి వచ్చి వెళుతుంటాడని తెలుసుకున్నారు. డబ్బాశ చూపారు. పాలల్లో మత్తుమందు కలిపి, తమకు సంకేతం ఇవ్వాలని, లేకుంటే తనను చంపేస్తామని బెదిరించారు. భయపడిపోయిన ఆ మహిళ తర్వాత నాలుగు రోజులకు 1980 మార్చి 24న తెల్లవారుజామున ఇంటికి వచ్చిన నాగేశ్వరరావుకు పోలీసులు చెప్పినట్టే మత్తుమందు కలిపిన పాలు తాగించింది. మత్తులో నిద్రపోతున్న అతడిపై పోలీసు అధికారి తుపాకీ కాల్పులు జరిపాడు. ఎన్‌కౌంటరులో హతమైనట్టు ప్రకటించారు. శవపరీక్ష నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి ఆరంభమైన అంతిమయాత్ర స్టువర్టుపురం కాలనీకి చేరేందుకు మూడురోజులు పట్టిందట! మూడు రాష్ట్రాల్నుంచి ఎందరో అభిమానులు ఆ యాత్రలో పాల్గొన్నారు. చదువులు, వైద్యం, పెళ్లిళ్లకు సాయం ... ఇన్ని దొంగతనాలు, దోపిడీలు చేసినా నాగేశ్వరరావు మిగుల్చుకుంది ఏమీ లేదంటారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు చీరాల, చుట్టుపక్కల పల్లెల్లోనే తలదాచుకునే వాడు. ఆశ్రయం ఇచ్చినవారికి, సహాయం కోరిన ఇతరులకు ఆర్థిక సహాయం చేసేవాడు. ముఖ్యంగా పిల్లల చదువులు, వైద్యం, పెళ్లిళ్లకు తప్పకుండా సాయం చేసేవాడు. పొగాకు కంపెనీ యజమాని అరాచకంపై మహిళల్ని పోరుబాటకు సిద్ధం చేయటమే కాదు... అతడికి వత్తాసుగా వచ్చిన ఎస్ఐపైనా మహిళలతో దాడి చేయించాడు. మహిళలంటే గౌరవం... మేం ఒకప్పుడు దొంగతనాలు చేసినా, మహిళలంటే మాకెంతో గౌరవం...ఒంటరిగా ఉన్నా బంగారం, డబ్బు దోచుకునేవాళ్లం మినహా ఎలాంటి అకృత్యాలకు పాల్పడేవాళ్లం కాదు... నేటికాలంలో ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలు వింటుంటే బాధ కలుగుతోంది. నా సోదరుడు నాగేశ్వరరావు ఆర్థికసాయం కూడా చేసేవాడు. సినిమా తీస్తున్నారు. నన్ను కూడా వివరాలు అడిగారు. – గరిక ప్రభాకరరావు, నాగేశ్వరరావు సోదరుడు సుదీర్ఘ పరిశోధన చేశాం... ‘దొంగాట’ సినిమా చేసేటపుడు ఒక పెద్దాయన ద్వారా టైగర్ నాగేశ్వరరావు గురించి తెలిసింది. దొంగైనా అతడు రాబిన్‌హుడ్ అని చెప్పటంతో ఆసక్తి కలిగింది. వైవిధ్యమైన సినిమాలు, అందులోనూ ఏదైనా బయోపిక్ కూడా తీయాలనుకున్న నాకు, అతడి జీవితంలోని కమర్షియల్ ఎలిమెంట్ నచ్చింది. అప్పట్నుంచి పరిశోధన మొదలైంది. ఎన్నో ఆసక్తిదాయకమైన అంశాలతో సినిమా తీస్తున్నాం. – వంశీకృష్ణ, సినీదర్శకుడు -
ఉద్యోగులకు భారీ షాక్, వందల మంది తొలగింపు!
ఆర్ధిక మాద్యం దెబ్బకు మరో సంస్థ వందలాది ఉద్యోగులపై వేటు వేసింది. సిలికాన్ వ్యాలీకి చెందిన ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ రాబిన్ హుడ్ 23 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు 23శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపగా.. మూడునెలల ముందు 9శాతం వర్క్ ఫోర్స్‌ను తగ్గించింది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఆర్ధిక మాద్యంతో పాటు ఇతర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేడయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫిన్ టెక్ కంపెనీ రాబిన్ హుడ్ 713 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. 2,400మంది ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు ట్రెక్ క్రంచ్ నివేదించింది. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ సీఈవో అండ్ కో-ఫౌండర్ వ్లాడ్ టెనెవ్ మాట్లాడుతూ..కంపెనీ పునర్నిర్మించాలని భావిస్తున్నాం. అందుకే మా వర్క్ ఫోర్స్‌ను సుమారు 23 శాతం తగ్గించుకుంటున్నాం. తద్వారా సంస్థ ఆపరేషన్స్, మార్కెటింగ్, ప్రోగ్రామింగ్ వంటి ఇతర కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుందని అన్నారు. తొలగించిన వారి స్థానాల్లో కొత్తవారిని నియమించుకుంటాం. వారితో కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తాం. ఆ బాధ్యత తనపై ఉంటుందని వ్యాఖ్యానించారు. క్యూ2 ఎఫెక్ట్ ఇటీవల ఫిన్‌టెక్ సంస్థ రాబిన్ హుడ్ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ ఫలితాల్లో నెట్ రెవెన్యూ 318 మిలియన్ డాలర్లు ఉండగా 295 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపింది. అదే సమయంలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నియమాల్ని రాబిన్ హుడ్ ఉల్లంఘించిందంటూ న్యూయార్క్ ఫైనాన్షియల్ రెగ్యులరేటర్ 30మిలియన్ల ఫైన్ విధించింది. వెరసీ ఈ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకే సంస్థ సీఈవో వ్లాడ్ టెనెవ్ ఉద్యోగుల్ని తొలగించారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
రాబిన్‌హుడ్ గర్ల్
గూగుల్ కంటే పదిహేనేళ్లు వెనకొచ్చిన కంపెనీ రాబిన్‌హుడ్. అయితే గూగుల్‌లో పన్నెండేళ్లు పని చేసిన అపర్ణ.. గూగుల్‌ని వదిలి, రాబిన్‌హుడ్‌లో చేరారు. స్టాక్ ట్రేడింగ్లను జరుపుతుండే రాబిన్‌హుడ్ తొలి చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్‌గా (సి.పి.వో) గురువారం బాధ్యతలు చేపట్టారు. రాబిన్ హుడ్‌లో ఇంతవరకు సి.పి.వో పోస్టు లేదు. ఇలాంటి పోస్ట్ ఒకటి ఉండాలని ఉండాలని అనుకున్నాక రాబిన్ హుడ్కు అపర్ణ తప్ప మరొకరు కనిపించలేదు. రాబిన్‌హుడ్ ఎంపిక చేసుకుంది కనుక ఆమెను రాబిన్‌హుడ్ గర్ల్ అనొచ్చు. అపర్ణ పూర్తి పేరు అపర్ణ చెన్నాప్రగడ. అయితే ఆమె పూర్తి ప్రొఫైల్ గురించి చెప్పడం, పేరు చెప్పుకున్నంత సులభమైతే కాదు! టెక్ ఇండస్ట్రీలో ఆమెకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. ప్రాడక్ట్‌ను డెవలప్ చెయ్యడం, డిజైన్ చెయ్యడం, వ్యూహరచన ఆమె పనులు. గూగుల్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా వివిధ నాయకత్వ స్థాయిలలో పని చేశారు. అపర్ణ మద్రాస్ ఐ.ఐ.టిలో (1993–97) చదివారు. యూఎస్‌లోని మాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంత చదివారంటే అంతకు అంతా నైపుణ్యాలను ఆమె తను పనిచేసిన కంపెనీలకు అందించకుండా ఉంటారా! రాబిన్‌హుడ్ ఇప్పుడు అపర్ణను సి.పి.వో.గా నియమించుకోడానికి కూడా పూర్తిగా ఆమె ప్రతిభా సామర్థ్యాలే కారణం. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉంటున్న అపర్ణ.. టెక్నాలజీ రంగంలోకి వెళ్లడానికి తల్లే తనకు ప్రేరణ, ప్రోత్సాహం అని అంటున్నారు. -
ఫ్లాప్ డైరెక్టర్లకు చాన్స్ ఇస్తున్నాడట..!
బెంగాళ్ టైగర్ సినిమాతో డిసెంట్ హిట్ సాధించిన మాస్ మహరాజ రవితేజ, ఆ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చక్రి అనే కొత్త దర్శకుడితో రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలకు ఓకె చెప్పాడు రవితేజ. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి అంగీకరించాడు మాస్ మహరాజ. తనకు పవర్ లాంటి హిట్ సినిమా అందించిన బాబీతో మరొక సారి కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు గతంలో రవితేజ హీరోగా వీర అనే డిజాస్టర్‌ను తెరకెక్కించిన రమేష్ వర్మకు కూడా రవితేజ మరో చాన్స్ ఇస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. -
మాస్ మహరాజ ఎప్పుడు మొదలెడతాడో..?
మాస్ మహరాజ రవితేజ హీరోగా తెరకెక్కిన బెంగాల్ టైగర్ విడుదలై చాలాకాలమే అవుతోంది.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను స్టార్ట్ చేయలేదు. బెంగాల్ టైగర్ డీసెంట్ కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్నా.. రవితేజ నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొంతకాలంగా భారీ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న రవితేజ, తన రేంజ్ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఓ పక్కా మాస్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన రవితేజ, జూలైలోనే ఈ సినిమాను ప్రారంభించాలని భావించాడు. అయితే కథా కథనాల విషయంలో ఇంకా పూర్తి నమ్మకం రాకపోవటంతో ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది ఈ సినిమా. తను చేయబోయే నెక్ట్స్ సినిమా రాబిన్ హుడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన రవితేజ, ఆ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం చెప్పలేకపోతున్నాడు. -
అలాంటి సినిమాలు...హిందీలో చేస్తా!
చంటిగాడు లోకల్... నేను కాలు పెడితే మీ దరిద్రం దూల తీరిపోద్ది... వంటి డైలాగులు థియేటర్లో వినపడితే మాస్ ప్రేక్షకుల సందడికి కొదవ ఉండదు. చప్పట్లు, విజిల్స్ హోరుతో హాలు మార్మోగిపోతుంది. ఆ రేంజ్లో మాస్‌ని ఆకట్టుకునే ఏ ఆర్టిస్ట్‌కైనా తిరుగుండదు. అందుకే మాస్లో రవితేజ తిరుగులేదనిపించుకున్నారు. వెరైటీ స్టైల్లో డైలాగులు చెప్పడం, వెరైటీ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకోవడం రవితేజకు బాగా తెలుసు. ఇంతకీ ఈ హీరోగారు ఇప్పుడేం చేస్తున్నారు? నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాతో రెడీ అవుతున్నారు. తెలుగులో రకరకాల పాత్రలు చేసి, మెప్పించిన రవితేజకు వేరే భాషలో సినిమా చేసే ఉద్దేశం లేదా? ‘బాహుబలి’ ద్వారా ప్రభాస్, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పవన్ కల్యాణ్ పరిచయమైనట్లు హిందీ తెరకు పరిచయం కావాలని అనుకోవడం లేదా? అసలు హిందీలో స్ట్రయిట్ సినిమాకి అవకాశం వస్తే చేస్తారా? ‘చేస్తా’ అంటున్నారు రవితేజ. అయితే ఇప్పటివరకూ తెలుగులో చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రలైతేనే హిందీ చిత్రాలు చేస్తానని రవితేజ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మధ్య విడుదలైన ‘కీ అండ్ కా’, ‘కపూర్ అండ్ సన్స్’ వంటి సినిమాలైతేనే హిందీకి ‘సై’ అంటానని స్పష్టం చేశారు. తెలుగులో చేసినట్లుగానే రెగ్యులర్ యాక్షన్, కామెడీ మూవీస్ చేయాల్సి వస్తే... అదేదో ఇక్కడే చేయొచ్చు కానీ, ఇలాంటి చిత్రాలే చేయడానికి హిందీ రంగానికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. సో.. హిందీలో వెరైటీ సబ్జెక్ట్‌తో ఎవరైనా మాస్ మహరాజ్‌ని సంప్రతిస్తే.. హిందీకి ఎగరేసుకు పోవచ్చన్న మాట! -
టాలీవుడ్ 'రాబిన్‌హుడ్'
-
టాలీవుడ్ 'రాబిన్‌హుడ్'
బెంగాల్ టైగర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితో 'ఎవడో ఒకడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఎవడో ఒకడు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు రవితేజ. తన మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్‌గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్న ఈ సినిమాను ఎవడో ఒకడు పూర్తి కాగానే సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో కలెక్షన్లపరంగా పరవాలేదనిపించిన మాస్ మహరాజ్, తరువాత చేయబోయే సినిమాలతో అయినా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. -
రాబిన్ హుడ్ కాదు...రాబింగ్ హుడ్...
-
రాబిన్ హుడ్ కాదు...రాబింగ్ హుడ్...
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్లా వ్యవహరిస్తోందని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ఆమె గురువారం అసెంబ్లీలో డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్ పెంపు గురించి మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ రాష్ట్రప్రభుత్వం వ్యాట్ విధించడం సామాన్యులపై పెనుభారం పడుతోందన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా వ్యాట్ విధిస్తున్నారని అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు నుంచి రైతులు వరకూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఉదంతాన్నిను అఖిలప్రియ సభలో ప్రస్తావించారు. రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకొని...ఆ సంపదను పేదలకు పంచితే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని... ఆ సందపను సంపన్నులకు పెడుతోందని అన్నారు. సర్కార్ రాబింగ్ హుడ్ అని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే...మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సరికాదన్నారు. రైతులు ట్రాన్స్‌పోర్టు ఖర్చులను భరించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేకహోదా కోసం అధికార, ప్రతిపక్షంతో పాటు స్పీకర్ సహా ...కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామని అఖిలప్రియ కోరారు.