
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner).. మైదానంలో ఎంత ఫేమస్సో, సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్.. టాలీవుడ్ చిత్రాల డైలాగులతో రీల్స్ చేస్తూ తెలుగువారి మనసు గెలుచుకున్నాడు. ఈసారి ఏకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించాడు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.
కోట్ల పారితోషికం?
అందులో వార్నర్.. షార్ట్ హెయిర్, కూల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో వావ్ అనిపించాడు. ఇక పోస్టర్ రిలీజైనప్పటినుంచి ఈ దిగ్గజ క్రికెటర్ రాబిన్‌హుడ్ (Robinhood Movie)కు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సినిమాలో నటించినందుకుగానూ రూ.3 కోట్లు తీసుకున్నాడట. ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు మరో రూ.1 కోటి అదనంగా అడిగాడట! ఇది విన్న అభిమానులు.. స్టార్ క్రికెటర్ అంటే ఆమాత్రం ఇచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: రైతు అంటేనే ఛీ అనేలా చేసిన వెధవ.. ఈ దొంగ రైతుబిడ్డ: అన్వేష్ ఫైర్)
అప్పుడలా.. ఇప్పుడిలా..
గతంలోనూ వార్నర్ పారితోషికం (David Warner Remuneration for Robinhood) గురించి కొన్ని వార్తలు వెలువడ్డాయి. కేవలం సరదా కోసమే ఆయన ఈ పాత్ర ఎంచుకున్నారని, డబ్బు గురించి ఆలోచించలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాతలు రూ.50 లక్షలను అతడికి అందించినట్లుగా ప్రస్తావించారు. ఇప్పుడేమో ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. వార్నర్ స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు!
సినిమా
రాబిన్‌హుడ్ సినిమా విషయానికి వస్తే.. భీష్మ వంటి హిట్ మూవీ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయికగా నటించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
చదవండి: థియేటర్‌లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు
Comments
Please login to add a commentAdd a comment