
ఫోటో కర్టసీ: బీసీసీఐ
క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ కొత్త సీజన్ (IPL 2025) మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మొదటగా స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ప్రసంగించాడు. అనంతరం సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అందరినీ మైమరిపించింది. బ్లాక్‌బస్టర్ హిందీ సాంగ్స్‌తో ఆడియన్స్‌లో జోష్ నింపింది. అలాగే అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)లోని సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ.. పాటను తెలుగులో పాడి అదరగొట్టింది.
టాప్ సింగర్..
శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. ఈమె ఏ భాషలోనైనా ఇట్టే పాటలు పాడగలదు. తెలుగులో.. నువ్వేం మాయ చేశావో గానీ.. (ఒక్కడు), నమ్మిన నా మది.. (రాఘవేంద్ర), కోపమా నాపైనా.. (వర్షం), నీకోసం నీకోసం..(నేనున్నాను), అందాల శ్రీమతికి (సంక్రాంతికి), పిల్లగాలి అల్లరి (అతడు), జలజలజలపాతం నువ్వు.. (ఉప్పెన), సూసేకి అగ్గిరవ్వమాదిరి (పుష్ప 2), హైలెస్సో హైలెస్సా.. (తండేల్).. ఇలా చెప్పుకుంటూ పోతే వందలకొద్దీ పాటలు పాడింది.
Comments
Please login to add a commentAdd a comment