Shreya Ghoshal
-
వారసుడిని రెడీ చేస్తున్న సింగర్ శ్రేయా ఘోషల్ (ఫొటోలు)
-
నేడు శ్రేయా ఘోషల్ లైవ్ కాన్సర్ట్
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టాకీస్ ప్రకటించింది. మై మ్యూజిక్, మై కంట్రీ అందిస్తున్న రెండో లైవ్ షో కోసం శ్రేయా ఘోషల్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, అరిజిత్ సింగ్ వంటి ప్రముఖులు హోస్టింగ్ చేయనున్న ఈ ఈవెంట్లో సంగీతం, ఆహారం, వినోదం వంటి మరపురాని జ్ఞాపకాలను అందిస్తుందని తెలిపారు. -
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ 'నానా హైరానా'
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పిస్తే.. టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించిన సీన్స్‌ను చిత్రీకరించారు. అక్కడ ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునే సీన్స్‌తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే ఈ సన్నివేశాల్లో కేవలం జూనియర్ ఆర్టిస్ట్‌లు మాత్రమే పాల్గొన్నారు. -
పాటలకే కాదు.. ఫ్యాషన్‌కీ క్వీన్‌గా మారిపోతున్న స్టార్ సింగర్ (ఫోటోలు)
-
హీరోయిన్లా మెరిసిపోతున్న టాప్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..? (ఫోటోలు)
-
లైవ్ కన్సర్ట్‌లో లవ్ ప్రపోజల్.. ఇలా ఉన్నారేంట్రా?
ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ తాజాగా కోల్‌కతాలో నిర్వహించిన లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో తన మధురమైన వాయిస్‌తో పాటలు పాడి అలరించారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో పెద్దఎత్తున అభిమానులు హాజరయ్యారు.అయితే లైవ్ కన్సర్ట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రేయా ఘోషల్ కచేరీ జరుగుతుండగా ఓ వ్యక్తి లవ్ ప్రపోజ్ చేసి తన ప్రియురాలికి సర్ప్రైజ్ ఇచ్చాడు. మోకాళ్లపై నిలబడి తన ప్రియురాలికి ప్రేమను వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.అంతకుముందు అతను 'శ్రేయా ఘోషల్..యూ ఆర్ మై సెకండ్ లవ్' అనే ప్లకార్డును ప్రదర్శించాడు. ఇది చూసిన సింగర్ మ్యూజిక్ కాసేపు ఆపేసి నీ ఫస్ట్ లవ్ ఎవరు అంటూ అతన్ని ప్రశ్నించింది. దీంతో అతను తన పక్కనే ఉన్నా అమ్మాయిని చూపిస్తూ ఆమెకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత వెంటనే అందరిముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు.pic.twitter.com/hb7incZSLs— Oindrila💌 (@_pehlanasha_) October 20, 2024 -
ఈ పాటకు చప్పట్లు కొట్టకండి అంటూ ఎమోషనల్ అయిన శ్రేయ ఘోషల్
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనతో దేశ ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత దారణంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు అందరినీ బాధించింది. ఈ ఘటనపై ఇప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన పాట అందరినీ కదిలిస్తుంది.వైద్యురాలిపై హత్యాచార ఘటన జరిగినట్లు వార్తలు వచ్చిన సమయంలో శ్రేయా ఘోషల్ నిర్వహించాలనుకున్న మ్యూజిక్ కాన్సర్ట్ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసుకుంది. దేశంలో ఇంతటి ఘోరం జరిగితే.. తాను ఎలా ఈ కార్యక్రమానికి వెళ్లగలను అంటూ ఆమె భావోద్వేగానికి నాడు లోనైంది. ఈ ఘటన వల్ల తన వెన్నులో వణుకు పుట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రూరమైన చర్య తనపై చాలా ప్రభావం చూపిందని గతంలో ఆమె పర్కొన్నారు.అయితే, తాజాగా ఆమె కాన్సర్ట్‌ను నిర్వహించారు. ఆల్ హార్ట్స్ టూర్లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఒక ఎమోషనల్ సాంగ్‌ను అక్కడ శ్రేయా ఘోషల్ పాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 'గాయపడిన నా శరీర భాధను నేడు మీరందరూ వింటున్నారు' అంటూ సాగే ఈ పాటను ఆమె చాలా ఉద్వేగంతో ఆలపించారు. ఇలాంటి ఘటన సమయంలో బాధితురాలి ఆవేదన ఎలా ఉంటుందో పాట రూపంలో శ్రేయా తెలిపింది. అయితే, ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొదని ప్రేక్షకులను కోరింది. ఆమె పాటకు అక్కడున్న వారందరూ కూడా ఉద్విగ్నం అయ్యారు. ఆమెకు న్యాయం జరగాలి అంటూ స్టేడియం మొత్తం నినాదాలు చేశారు.మహిళల భద్రతపై శ్రేయా ఘోషల్ పాడిన పాటతో నెటిజన్లతో పాటు తృణముల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ ప్రశంసిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. వైద్యురాలి ఘటనపై శ్రేయా ఘోషల్ చాలా బాధపడ్డారని ఆయన తెలిపారు. హత్యాచారాల ఘటనలపై నిరసనలు అవసరమని ఆయన పేర్కొన్నారు. -
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : సింగర్ శ్రేయా మునుపెన్నడూ చూడని లుక్స్
-
సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలుసా? ట్రూ కాలర్ కంపెనీ..
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం మొదలైన భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకున్న 'శ్రేయా ఘోషల్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే సుమారు 200 కంటే ఎక్కువ పాటలు పాడిన ఈమె పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సింగర్‌గా మాత్రమే తెలిసిన చాలా మందికి శ్రేయా ఘోషల్.. వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఈమె భర్త ఓ ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నట్లు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో శ్రేయా ఘోషల్ భర్త ఎవరు?, ఏ సంస్థలో పనిచేస్తారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..సింగర్ శ్రేయా ఘోషల్ భర్త పేరు 'శిలాదిత్య ముఖోపాధ్యాయ' (Shiladitya Mukhopadhyaya). ఈయన సుమారుగా రూ. 1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 2022 నుంచి ట్రూకాలర్‌లో బిజినెస్ గ్లోబల్ హెడ్‌గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.ట్రూకాలర్ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ.. శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు సుమారు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో బాబు దేవయాన్ జన్మించాడు. ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీఈ పట్టా పొందాడు.భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్. అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేసినట్లు సమాచారం.ఇక శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే సింగర్లలో ఒకరైన ఈమె, ఇప్పటికే ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకుంది. ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 180 నుంచి రూ. 185 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే శిలాదిత్య ముఖోపాధ్యాయ మొత్తం ఆస్తికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో వెల్లడికాలేదు. -
ఫ్యామిలీస్టార్ నుంచి టాప్ సింగర్ పాట రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ జోడీగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని రాజు - శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హోలి సందర్భంగా ఒక లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలతో పాటు టీజర్, గ్లింప్స్ విడుదలయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా 'మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా..' అనే మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. గోపి సుందర్ సంగీతానికి ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ గాత్రం తోడు కావడంతో పాటకు మరింత మధురం వచ్చిందని చెప్పవచ్చు. ‘ఫ్యామిలీస్టార్’ విడుదల తేదీ కూడా ఇప్పటికే ఖరారైంది. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్వరమే కాదు.. అందంతో కూడా ఆహా అనిపించే ఈ సింగర్ తెలుసా! (ఫోటోలు)
-
IFFI Goa 2023: గోవా ఇఫి వేడుకల్లో తారాలోకం (ఫొటోలు)
-
చూపున్న పాట
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది. అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు. మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’. -
తమిళ సినిమాకు వచ్చిన జాతీయ అవార్డులు ఇవే
69వ సినీ జాతీయ అవార్డుల వివరాలను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. ఇందులో తమిళ చిత్ర పరిశ్రమ నాలుగు అవార్డులను గెలుచుకోవడం, అవన్నీ చిన్న చిత్రాలు కావడం మరింత విశేషం. మణికంఠన్ దర్శకత్వం వహించిన కడైసి వ్యవసాయి చిత్రం ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. అదే విధంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన (లేట్) నల్లుండికి ప్రత్యేక అవార్డును ప్రకటించింది. పార్తీపన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఇరైవిన్ నిళల్ చిత్రంలోని మాయవా ఛాయవా అనే పాటను పాడిన శ్రేయ ఘోషల్‌ను ఉత్తమగాయని అవార్డు వరించింది. కాగా ఈవీ గణేష్ బాబు దర్శకత్వం వహించిన కరువరై చిత్రానికి గాను సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవాకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది. (ఇదీ చదవండి: 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు) ఈ సందర్భంగా తన చిత్రంలోని పాటకు గాను ఉత్తమ గాయని అవార్డును ప్రకటించిన అవార్డుల కమిటీకి నటుడు పార్తీపన్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలుగు తేజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈసారి ఏకంగా 6 ప్రధాన అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఉత్తమగాయనిగా శ్రేయ ఘోషల్‌కు జాతీయ అవార్డు తెచ్చిన పాట ఇదే... -
వీడియో: హైదరాబాద్‌కు తిరుగులేదన్న శ్రేయా ఘోషల్, ఆమె తెలుగుకు ఆడియన్స్ ఫిదా!
-
‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ పై బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ప్రశంసలు
ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు. పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని 'ఎంకిమీడ నా జతవిడి...' మంచి స్పందన లభించింది. ఆ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న తమన్ ఈ పాట విని.. దీని ఒరిజినల్ వెర్షన్ పాడిన శ్రేయా ఘోషల్‌కు ఇది వినిపిస్తానని మాట ఇచ్చారు. తాజాగా ఈ సాంగ్ చూసిన శ్రేయా ఓ వీడియోను పంపించారు. దీన్ని స్టేజిపై తమన్ చూపించి సౌజన్యకు సర్ప్రైజ్ ఇచ్చారు. సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు. సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని మరియు హిమేష్ రేషిమియా షో కు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా
న్యూఢిల్లీ: విద్యావేత్త, రచయిత్రి, పరోపకారి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి అంటే పరిచయం అక్కర లేని పేరు. ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవ ఈవెంట్లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఉరిమే ఉత్సాహం ఉంటే చాలు సంతోషానికి వయసుతో పని లేదంటూ ఆమె సరదాగా కాలు కదిపిన వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. (10 వేలతో..వేల కోట్లు... మీరూ ఇలా చేయండి!) ఈ ఈవెంట్లో బాలీవుడ్ గాయని, మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్తో కలిసి సుధా మూర్తి చిన్నగా స్టెప్పు లేశారు. బుధారం రాత్రి ఎలక్ట్రానిక్స్ సిటీ బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇన్ఫోసిస్ @ 40 ఈవెంట్లో చాలా చురుగ్గా పాల్గొన్న సుధామూర్తి గురు సినిమాలోని "బర్సో రే మేఘా మేఘా" పాటకు ఉత్సాహంగా పదం కలిపారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ నటించిన ఈ పాటకు సుధామూర్తి ఆనందం ఇంటర్నెట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. Someone just sent this to me. Sudha Murty dancing and singing with @shreyaghoshal as part of the #Infy4Decades celebration in Bengaluru last night. Wholesome 😍 pic.twitter.com/I17Ns49qDR — Chandra R. Srikanth (@chandrarsrikant) December 15, 2022 Omg..!!!🙏🏻 legend's Sudhamurthy amma & Shreyaghoshal di . #SudhaMurty mam @shreyaghoshal #Infosys #ShreyaGhoshal #Legends . (Sudha amma dances her heart out on 'Barso Re Megha' with shreya di💃🏻🔥) pic.twitter.com/MmtT1CvZtt — 💕𝑺𝒉𝒓𝒆𝒚𝒂_𝑺𝒖𝒔𝒉💕 (@Sush36068856) December 15, 2022 -
'నా పేరు సీసా' సాంగ్‌లో అదరగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత స్పీడ్‌గా షూటింగ్‌లను పూర్తి చేస్తూ సినిమాలు వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తోంది. తాజాగా ఆయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటం సాంగ్ రిలీజైంది. నా పేరు సీసా.. నా పేరు సీసా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను శ్రేయ ఘోషల్ పాడింది. సామ్ సీఎస్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. బాలీవుడ్ నటి అన్వేషి జైన్ ఐటంసాంగ్లో స్టెప్పులేసింది. కాగా శ్రీలక్ష్మివెంకటేశ్వర సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా జూలై 29న రిలీజ్ కానుంది. చదవండి: చోళులు వచ్చేస్తున్నారు అంటూ పోస్టర్ రిలీజ్ జనవరి టు జూన్.. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలివే! -
ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలికించేవి: ప్రధాని మోదీ
PM Narendra Modi Akshay Kumar Condolence On Singer KK Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 'కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.' అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్ జోహార్, సింగర్స్ ప్రీతమ్, జుబిన్ నటియాల్, ఆర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 Extremely sad and shocked to know of the sad demise of KK. What a loss! Om Shanti 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) May 31, 2022 Heartbreaking news on the sudden passing away of such an incredible talent…. RIP KK…💔 the entertainment world has lost a true artist today….Om Shanti 🙏 pic.twitter.com/SiKQutPJVO — Karan Johar (@karanjohar) May 31, 2022 In utter shock. Just heard about KK . Someone please tell me it's not true — Pritam (@ipritamofficial) May 31, 2022 Black year for Indian music. Lata didi, bappi da, sidhu paaji and now KK sir. These losses.. all of them feel so personal. — ARMAAN MALIK (@ArmaanMalik22) May 31, 2022 One and only . KK 😔 . — Jubin Nautiyal (@JubinNautiyal) May 31, 2022 My deepest sincerest condolences. His golden, soulful voice echoes in all our hearts. Rest in peace dear #KK🙏🏻💔 — Shreya Ghoshal (@shreyaghoshal) May 31, 2022 Singer KK never smoked or drank! Led the most simple non controversial non media hyped life. Complete family man. Jab bhi mujhe mile he met with so much of love & kindness. God! Too unfair! OM SHANTI. — RAHUL VAIDYA RKV (@rahulvaidya23) May 31, 2022 -
శ్రేయా ఘోషల్‌కు క్షమాపణలు చెప్పిన టాప్ హీరోయిన్
బాలీవుడ్ సినిమా 'ఆత్రంగి రే'లోని ఫస్ట్‌సాంగ్ ‘చకా చక్’ పాట ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సారా అలీ ఖాన్ గ్రీన్, పింక్ కాంబినేషన్ ఉన్న చీర ధరించి మంచి స్టెప్పులేస్తూ అదరగొట్టారు. తాజాగా ఆమె ఒక ఇంటర్య్వూలో పాల్గొన్నారు. అక్కడ 'ఆత్రంగి రే' సినిమాలోని ‘చకా చక్’ పాటను పాడి అక్కడి వారిలో మరింత జోష్‌ను నింపారు. నిజానికి ఈ సినిమాలో చకాచక్ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. దీంతో సారా అలీఖాన్ పాటను పాడిన తర్వాత.. శ్రేయా ఘోషల్‌కి నవ్వుతూ.. క్షమాపణలు తెలిపారు. మీ అంత బాగా పాడలేకపోతున్నా.. అంటూ చమత్కరించారు. మరో ప్రమోషన్ కార్యక్రమంలోనూ సారా అలీఖాన్ ఎంతో జోష్‌గా పాల్గొన్నారు. ఫ్యాన్స్ కోరిక మీద పాట పాడుతూ స్టెప్పులతో అదరగొట్టారు. కాగా ఈ సినిమాలో ధనుష్, అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 'ఆత్రంగి రే' చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. చదవండి: ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్ -
Parag Agrawal : అడిషనల్ పేపర్ కోసం గొడవ.. ఆ సింగర్ క్లోజ్ ఫ్రెండ్ కూడా!
మైక్రో బ్లాగింగ్ సైట్, సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పరాగ్ అగర్వాల్ నియమితుడైనప్పటి నుంచి అతను ఎవరూ? ఎక్కడ చదివాడు ? అతని కుటుంబ వివరాల గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే వ్యక్తిగత వివరాల విషయంలో పరాగ్ అగర్వాల్ చాలా గోప్యతను పాటిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఆయన జీవితానికి సంబంధించి సేకరించిన కొన్ని విశేషాలు... పరాగ్ అగర్వాల్ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. అటామిక్ ఎనర్జీ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పరాగ్ తండ్రి పని చేశారు. తల్లి స్కూల్ టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రి పని చేస్తున్న అటామిక్ ఎనర్జీ నిర్వహిస్తున్న స్కూల్లోనే పరాగ్ చదువుకున్నారు. శ్రేయా ఘోషల్ క్లాస్మేట్ ముంబైలోని అటామిక్ ఎనర్జీస్కూల్‌లో పరాగ్ అగర్వాల్, నేటి ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ కలిసే చదువుకున్నారు. పరాగ్ పుస్తకాల పురుగుగా మారి పరీక్షల్లో టాప్ ర్యాంకులు సొంతం చేసుకుంటుంటే శ్రేయ సంగీత ప్రపంచంలో తిరుగులేని మహారాణిగా ఎదిగింది. ముందుగా శ్రేయా ఇండియన్ సెలబ్రిటీగా మారగా.. ఆ తర్వాత కొంత కాలానికి పరాగ్ ఇంటర్నేషన్ ఫేమస్ పర్సన్‌గా ఎదిగారు. వీరిద్దరి మధ్య ఇప్పటీకీ స్నేహం కొనసాగుతోంది. పరాగ్ ఇండియా వచ్చినా.. శ్రేయా అమెరికా వెళ్లినా కలుస్తుంటారు. ట్విట్టర్లో తరచుగా చాట్ చేస్తుంటారు కూడా. ఇంటర్‌లోనే గోల్డ్ మెడల్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2001లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించారు. జేఈఈ ఎగ్జామ్‌లో గొడవ ఐఐటీలో సీటు లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ వచ్చిన పరాగ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఇన్విజిలేటర్లతో గొడవ పడ్డాడు. పరీక్ష ప్రారంభమైన నలభై నిమిషాల్లోనే తనకు తెలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానం రాసిన పరాగ్.. ఆ తర్వాత అడిషనల్ పేపర్లు కావాలంటూ ఇన్విజిలేటర్‌ని కోరాడు.. ‘ ఈ పరీక్షలో అడిషనల్ పేపర్ల కాన్సెప్ట్ లేదు’ అంటూ ఇన్విజిలేటర్ సమాధానం ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇన్స్ట్రక్షన్ బుక్‌లెట్‌లో ‘‘టై ఆల్ ది సప్లిమెంట్స్ కరెక్ట్‌లీ ఇన్ రైట్ ఆర్డర్’’ అనే నిబంధన ఎందుకు చేర్చినట్టు అంటూ ఎదురు ప్రశ్నించారు. అలా ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో పరీక్షలో విలువైన సమయం వృథా అయ్యిందని ఇప్పటికీ పరాగ్ గుర్తు చేసుకుని బాధపడతారు. ముంబై టూ స్టాన్ఫోర్డ్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో చిన్న గొడవ జరిగినా.. ఆలిండియా 77వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరాడు. 2005లో పట్టా పుచ్చుకుని ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చేరుకున్నాడు. అక్కడే డాక్టరేట్ పట్టా సైతం పుచ్చుకున్నాడు. అప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. మైక్రోసాఫ్ట్‌తో మొదలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పరాగ్ బయటకు వచ్చిన తర్వాత మొదటి సారి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యాహూ, ఏటీ అండ్ టీల మీదుగా 2011లో ట్విట్టర్లో చేరారు పరాగ్. ఆ సమయంలో ట్విట్టర్ మొత్తం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి అటుఇటుగా ఉంది. అప్పటి నుంచి టీమ్ వర్క్ చేస్తూ ట్విట్టర్ ఉన్నతిలో కీలక భూమిక పోషించారు. తొలిచూపులు అక్కడే స్టాన్‌ఫోర్డ్‌లో చదివేప్పుడే వినీతతో పరిచయం. అమె అక్కడ మెడికల్ సైన్స్ విద్యార్థిగా చేరింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి అన్ష్ అగర్వాల్ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం అండర్సన్ హారోవిట్జ్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థలో భాగస్వామిగా ఆమె ఉన్నారు. చదవండి: ట్విటర్ కొత్త సీఈవో పరాగ్.. యంగెస్ట్ సీఈవో ఘనత,కానీ చిన్న మెలిక! -
తొలిసారిగా కుమారుడి ఫొటో షేర్ చేసిన శ్రేయా ఘోషల్
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె చిన్నారి ఫొటోను మాత్రం షేర్ చేయలేదు. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్ప్రైజ్ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన తనయుడికి దేవ్యాన్ ముఖోపాధ్యాయగా నామకరణం చేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఇందులో దేవ్యాన్ ముఖం మాత్రం కనిపించకుండా వారు జాగ్రత్త పడ్డారు. గత నెల మే 22న శ్రేయా ఘోషల్ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రేయా చిన్నారి దేవ్యాన్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇంట్రడ్యూసింగ్ దేవ్యాన్ ముఖోపాధ్యాయ. అతను మే 22న మా జీవితంలోకి వచ్చాడు. అతడి రాకతో మా హృదయాలు ఒక రకమైన ప్రేమను నింపాడు. ఒక తల్లి, ఒక తండ్రి మాత్రమే ఇలాంటి మధురమైన అనుభూతిని పొందగలరు. స్వచ్చమైన, హద్దులు లేని ప్రేమకు ఈ చిన్నారి దేవ్యాన్ నిదర్శనం’ అంటు ఆమె మురిసిపోయారు. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ శ్రేయా ఘోషల్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ సింగర్
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు షేర్ చేస్తు.. ‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంలో మునిగితేలుతున్నాం’ అంటు ఆమె ఈ విషయాన్ని అభిమానులతో, సన్నిహితులతో పంచుకున్నారు. అలాగే తను బిడ్డకు మీరందరు ఇచ్చే లెక్కలేనన్ని ఆశ్వీర్వాదాలకు ధన్యవాదాలు అంటు ఆమె రాసుకొచ్చారు. కాగా శ్రేయా ఇటీవల బేబీ షవర్ కార్యక్రమానికి సంబంధించిన తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే తాను అమ్మని కాబోతున్నానని, ప్రస్తుతం అమ్మ తనాన్ని ఆస్వాధిస్తున్నానంటు శ్రేయా మురిసిపోయింది. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్.. బాలీవుడ్.. మాలీవుడ్.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. ఇటీవలె తెలుగులో ‘ఉప్పెన’, ‘టక్ జగదీశ్’ సినిమాల్లో కూడా ఆమె పాడారు. చదవండి: శ్రేయా ఘోషల్ బేబీ బంప్ ఫోటోలు వైరల్ -
బేబీ బంప్‌తో ఫోటోలకు పోజిచ్చిన శ్రేయా ఘోషల్
ముంబై : ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది. 'నా జీవితంలోనే అద్భుతమైన దశను అనుభవిస్తున్నా. ఇదంతా దేవుడి లీల' అని బేబీ బంప్‌తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీన్ని చూసిన అభిమానులు మరోసారి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శ్రేయా ఘోషల్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలె తాను తల్లి కాబోతున్నట్లు శ్రేయా ఘోషల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) బేబీ శ్రేయాదిత్య (శ్రేయా, ఆమె భర్త శిలాదిత్య పేర్లు కలిసేలా) కమింగ్ అంటూ స్వయంగా మధుర క్షణాలను ఫ్యాన్స్‌కు షేర్ చేశారు. తమ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ .. బాలీవుడ్.. మాలీవుడ్.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. ఇటీవలె తెలుగులో ‘ఉప్పెన’, ‘టక్ జగదీశ్’ సినిమాల్లో పాడారు. చదవండి : శ్రేయా సీమంతం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చింది : యంగ్ హీరో -
శ్రేయా సీమంతం
శ్రేయా ఘోషల్ మంచి గాయని. హిందీ చిత్రాలతో పాటు దక్షిణాదిన పలు పాటలు పాడారు. ఆమె పాడిన పాటల్లో ‘శ్రీరామరాజ్యం’లోని ‘సీతా సీమంతం..’ ఒకటి. సినిమాలో నయనతార సీమంతం వేడుకప్పుడు వచ్చే పాట ఇది. ఇప్పుడు ‘శ్రేయా సీమంతం’ జరిగే వేళ వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘బేబీ.. శ్రేయాదిత్య (శ్రేయా, ఆమె భర్త తమ పేర్లు కలిపి బిడ్డకు పెట్టాలనుకున్నారని ఊహించవచ్చు) ఈజ్ ఆన్ ఇట్స్ వే. నాకు, శిలాదిత్య (శ్రేయా భర్త పేరు)కు చాలా థ్రిల్‌గా ఉంది. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను’’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు శ్రేయా ఘోషల్.