ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు షేర్ చేస్తు.. ‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంలో మునిగితేలుతున్నాం’ అంటు ఆమె ఈ విషయాన్ని అభిమానులతో, సన్నిహితులతో పంచుకున్నారు. అలాగే తను బిడ్డకు మీరందరు ఇచ్చే లెక్కలేనన్ని ఆశ్వీర్వాదాలకు ధన్యవాదాలు అంటు ఆమె రాసుకొచ్చారు.
కాగా శ్రేయా ఇటీవల బేబీ షవర్ కార్యక్రమానికి సంబంధించిన తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే తాను అమ్మని కాబోతున్నానని, ప్రస్తుతం అమ్మ తనాన్ని ఆస్వాధిస్తున్నానంటు శ్రేయా మురిసిపోయింది. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్.. బాలీవుడ్.. మాలీవుడ్.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. ఇటీవలె తెలుగులో ‘ఉప్పెన’, ‘టక్ జగదీశ్’ సినిమాల్లో కూడా ఆమె పాడారు.
Comments
Please login to add a commentAdd a comment