
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మాకు బాబు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న దేవోలీనా భట్టాచార్జీ తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. డిసెంబర్ 2022లో తన జిమ్ ట్రైనర్ షానవాజ్ షేక్‌ను వివాహం చేసుకుంది.
బాలీవుడ్‌లో దేవోలీనా భట్టాఛార్జీ పలు సీరియల్స్‌లో నటించింది. తాను చివరిసారిగా 'కూకి' అనే సీరియల్‌లో కనిపించింది. అంతకుముందు హిందీ బిగ్‌బాస్ సీజన్-2006లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. హిందీలో సాత్ నిబానా సాథియా అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు దేవోలీనా. ఆ తర్వాత యో హై మోహబ్బతీన్, స్వీట్ లై, చంద్రకాంత, తేరే షహర్ మే, శుభ్ వివాహ్ లాంటి సీరియల్స్‌లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment