Devoleena Bhattacharjee
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మాకు బాబు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న దేవోలీనా భట్టాచార్జీ తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. డిసెంబర్ 2022లో తన జిమ్ ట్రైనర్ షానవాజ్ షేక్‌ను వివాహం చేసుకుంది.బాలీవుడ్లో దేవోలీనా భట్టాఛార్జీ పలు సీరియల్స్‌లో నటించింది. తాను చివరిసారిగా 'కూకి' అనే సీరియల్లో కనిపించింది. అంతకుముందు హిందీ బిగ్‌బాస్ సీజన్-2006లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. హిందీలో సాత్ నిబానా సాథియా అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు దేవోలీనా. ఆ తర్వాత యో హై మోహబ్బతీన్, స్వీట్ లై, చంద్రకాంత, తేరే షహర్ మే, శుభ్ వివాహ్ లాంటి సీరియల్స్‌లో నటించారు. View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
సీరియల్ హీరోయిన్ దేవలీనా మెటర్నిటీ ఫొటోషూట్ (ఫొటోలు)
-
సీరియల్ హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్
సీరియల్ నటి దేవలీనా ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని కొన్నిరోజులు ముందు బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి బేబీ బంప్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో భర్తతో కలిసి క్యూట్ అండ్ స్వీట్ పోజుల్లో కనిపించింది. 2002 డిసెంబరులో ఈమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' అనే డబ్బింగ్ సీరియల్‌తో తెలుగు వాళ్లకు పరిచయమైన నటి దేవలీనా భట్టాచార్జి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. తన జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మతాలు వేరు అయినప్పటికీ చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి సందర్భం వచ్చిన ప్రతిసారీ భర్తతో ఉన్న ఫొటోలని దేవలీనా పోస్ట్ చేస్తూనే ఉంటుంది.తాజాగా ఆగస్టు 15న తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఆ తర్వాత కొన్నిరోజులకు పుట్టినరోజు జరుపుకొంది. ఇలా ప్రతిసారి తన పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు బేబీ బంప్ క్లియర్‌గా కనిపిస్తున్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఈమెకు పలువురు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో టాలీవుడ్ హీరోయిన్ భర్తకి తీవ్ర గాయాలు) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన బుల్లితెర నటి
బుల్లితెర నటి దేవలీన భట్టాచార్జి త్వరలో తల్లి కాబోతుందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. తాజాగా ఈ రూమర్స్‌పై నటి స్పందించింది. 'నేను ప్రెగ్నెంటా? అని అడుగుతూ చాలాకాలంగా మెసేజ్‌లు వస్తున్నాయి. అది నాకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్తాను. అయినా ఇలాంటిదేదైనా ఉంటే నా అంతట నేనే చెప్తా. అప్పటివరకు నన్ను వదిలిపెట్టండి.నేను ప్రెగ్నెంటో? కాదో? తెలుసుకుని మీరేం చేస్తారు? నాకేదైనా మంచి విషయాలు, సూచనలు చెప్తారా? లేదా ట్రోల్ చేస్తారా? ఇప్పుడవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. ఇది నా జీవితం. నాకు నచ్చినట్లు బతకనివ్వండి. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా దేవలీనా.. షానవాజ్ షైఖ్‌ను 2022 డిసెంబర్లో పెళ్లి చేసుకుంది.చదవండి: కల్కిపై తారల రివ్యూ.. నాగ్, రజనీ, దేవరకొండ ఏమన్నారంటే? -
బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో అయినా ఈ షో సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. తాజాగా హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ -3 ప్రారంభమైంది. ఈ షోలోకి పలువురు కంటెస్టెంట్స్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్‌పైనే అందరిదృష్టి పడింది. ఎందుకంటే అతను తన ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆర్మాన్తో వారి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అయితే ఇది చూసిన మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దేవోలీనా భట్టాచార్జీ విమర్శలు గుప్పించింది. వీరిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. అసలు ఇది వినోదం కోసం తీసుకొచ్చిన షోలా లేదని మండిపడింది. రియాలిటీ షో ద్వారా బహుభార్యత్వాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ట్విటర్లో రాసుకొచ్చింది.దేవోలీనా తన ట్విటర్లో రాస్తూ..' ఇదేంటి వినోదం అని మీరు అనుకుంటున్నారా? దీన్ని ఎలా పిలుస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి గురించి వినగానే నాకు అసహ్యం అనిపిస్తోంది. బిగ్ బాస్ మీకేమైంది? బహుభార్యత్వంతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటున్నారా? ఈ షోను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరు వీక్షిస్తున్నారు. ఇలాంటి వాటితో మీరు కొత్త తరానికి ఏమి నేర్పించాలనుకుంటున్నారు? వీరిని చూసిన అందరూ 2, 3, 4 వివాహాలు చేసుకోవచ్చా? అందరూ కలిసి సంతోషంగా జీవించగలరా? రోజు ఇలాంటి సంఘటనలతో బాధపడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని వెళ్లి అడగండి.' అని చురకలు అంటించింది.'అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. చట్టం అందరికీ ఒకటే. అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది. మొదటి భార్య ఉండగా రెండో భార్య. ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తలను కలిగి ఉంటే.. మీరు చూస్తూ కాలక్షేపం చేస్తారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను ఏ కారణంతో ఫాలో అవుతారు? కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవాలని ఈ షో ద్వారా నేర్పిస్తున్నారా? ఇది తలచుకుంటేనే భయమేస్తోంది. ' అని రాసుకొచ్చింది.అంతేకాకుండా.. 'మీకు 2-3 పెళ్లిళ్లు చేసుకోవడం అంత అవసరం అయితే చేసుకుని ఇంట్లోనే ఉండండి. మీ నీచమైన మనస్తత్వాన్ని ప్రపంచానికి చూపకండి. ఇలాంటి వాటితో సమాజం విధ్వంసం వైపు వెళ్తుంది. మరి బిగ్ బాస్.. మీకు ఏమైందో నాకు తెలియడం లేదు' అంటూ ట్విటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చూసిన నెటిజన్స్ దేవోలీనాను ప్రశంసిస్తున్నారు. ఆ ముగ్గురిని రియాల్టీ షోలోకి తీసుకొచ్చినందుకు బిగ్ బాస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. ఈ రియాలీటి షోకు అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-3 జియో సినిమాలో ప్రసారమవుతోంది.Do you think this is entertainment? This is not entertainment, it's filth. Don't make the mistake of taking this lightly because it's not just a reel, it's real. I mean, I can't even understand how anyone can call this shamelessness entertainment ? I feel disgusted just hearing… https://t.co/BVeVjGrTm2— Devoleena Bhattacharjee (@Devoleena_23) June 22, 2024 -
గర్భవతి అయ్యాక సడన్‌గా పెళ్లి! స్పందించిన నటి
'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది హిందీ బుల్లితెర నటి దేవలీనా భట్టాచార్జి. ఇటీవల సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసిందామె. ఆర్భాటంగా చేసుకోవాల్సిన పెళ్లిని అంత నిరాండబరంగా హడావిడిగా పూర్తి చేసేసిందంటే దీని వెనక ఏదో జరిగిందని కొందరు అనవసర అపోహలకు పోయారు. బహుశా తను గర్భం దాల్చి ఉంటుందని అందుకే గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందంటూ ఆమెను నిందించారు. తాజాగా ఈ విమర్శలపై నటి దేవలీనా స్పందించింది. 'ఎవరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ గర్భం దాల్చడం వల్లే ఇలా సడన్‌గా పెళ్లి చేసుకున్నానని అంటుంటే షాకింగ్‌గా ఉంది. మరీ ఇంత దారుణంగా మాట్లాడతారా అని బాధేసింది. అవతలి వాళ్ల సంతోషాన్ని నాశనం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారా? కొన్నిసార్లు ఇలాంటి మాటల వల్ల కోపం, బాధ రెండూ వస్తాయి. ఒకరి జీవితాన్ని చెదరగొట్టడానికి ఎలా మనసొప్పుతుందో? అయినా వీటిని నేను పెద్దగా పట్టించుకోను' అని చెప్పుకొచ్చింది దేవలీనా. కాగా డిసెంబర్ 14న ఆమె జిమ్ ట్రైనర్ షాన్వద్ షైఖ్‌ను పెళ్లాడింది. చదవండి: ఇక నా పని అయిపోందనుకున్నా.. : తమన్నా హరిహర వీరమల్లులో బాలీవుడ్ స్టార్