సీరియల్ హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్ | Devoleena Bhattacharjee Pregnancy And Baby Bump Latest | Sakshi
Sakshi News home page

Devoleena: ప్రముఖ నటికి ప్రెగ‍్నెన్సీ.. భర్తతో క్యూట్ పిక్స్

Published Sat, Sep 21 2024 1:05 PM | Last Updated on Sat, Sep 21 2024 3:39 PM

Devoleena Bhattacharjee Pregnancy And Baby Bump Latest

సీరియల్ నటి దేవలీనా ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని కొన్నిరోజులు ముందు బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి బేబీ బంప్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో భర్తతో కలిసి క్యూట్ అండ్ స్వీట్ పోజుల్లో కనిపించింది. 2002 డిసెంబరులో ఈమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)

'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' అనే డబ్బింగ్ సీరియల్‌‌తో తెలుగు వాళ్లకు పరిచయమైన నటి దేవలీనా భట్టాచార్జి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. తన జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మతాలు వేరు అయినప్పటికీ చాలా సింపుల్‪‌గా పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి సందర్భం వచ్చిన ప్రతిసారీ భర్తతో ఉన్న ఫొటోలని దేవలీనా పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా ఆగస్టు 15న తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఆ తర్వాత కొన్నిరోజులకు పుట్టినరోజు జరుపుకొంది. ఇలా ప్రతిసారి తన పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు బేబీ బంప్ క్లియర్‌గా కనిపిస్తున్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఈమెకు పలువురు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.

(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో టాలీవుడ్ హీరోయిన్ భర్తకి తీవ్ర గాయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement