
అప్పుడెప్పుడో వచ్చిన 'బద్రి' సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ గా చేసిన అమీషా పటేల్.. తర్వాత తెలుగులో పెద్దగా నటించలేదు. పూర్తిగా బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఈమెపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ చిన్న మెలిక ఉంది.
49 ఏళ్ల అమీషా పటేల్ చివరగా గతేడాది 'తౌబా తేరా చల్వా' సినిమాలో కనిపించింది. అంతకు ముందు గదర్ 2 చిత్రంతో హిట్ అందుకుంది. మూవీస్ పెద్దగా చేయనప్పటికీ ఇన్ స్టాలో మాత్రం ఎప్పుడూ గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటిది రీసెంట్ గా గ్రీన్ కలర్ బికినీతో ఫొటో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ)
ఇందులో ఈమె పొట్ట కాస్త ఎత్తుగా ఉండటంతో అమీషా పటేల్ ప్రెగ్నెన్సీతో ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఈమె.. ప్రస్తుతం ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా అని అనుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ ఏమో అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ ఫొటో పోస్ట్ చేయడానికి ముందు కూడా కొన్ని ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. అందులో లేని బేబీ బంప్.. బికినీ ఫొటోలో కనిపించడం చూస్తుంటే సోషల్ మీడియాలో తన గురించి మాట్లాడుకోవాలని అమీషా చేసిన పనిలా అనిపిస్తుంది. మరి నిజమేంటనేది ఆమె చెబితే తప్ప తెలియదు.
(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)
