Ameesha Patel
-
రూ.100 కోట్లిచ్చినా ఆ పాత్ర చేయను: హీరోయిన్
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన చిత్రాల్లో గదర్ 2 ఒకటి. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల మేర రాబట్టింది. అయితే ఈ సినిమాలో అత్త పాత్ర పోషించేందుకు హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు ఒప్పుకోలేదంటున్నాడు డైరెక్టర్ అనిల్ శర్మ.అమీషా ఒప్పుకోలేదుఓ ఇంటర్వ్యూలో అనిల్ శర్మ మాట్లాడుతూ.. vఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం కావాలి. తన ఇమేజ్ ఎక్కడ పాడవుతుందో అని భయపడింది. అయినా అమీషాపై నాకెలాంటి కోపం లేదు, తను కూడా గదర్ సినీ ఫ్యామిలీలో ఒక భాగమే! అని చెప్పుకొచ్చాడు.అది నా ఇష్టంఈ వ్యాఖ్యలపై హీరోయిన్ అమీషా పటేల్ మండిపడింది. డియర్ అనిల్ గారు. ఇది సినిమా మాత్రమే, వ్యక్తిగత జీవితం కాదు! కాబట్టి ఏ సినిమాలు చేయాలి? ఎటువంటి పాత్రలు పోషించాలి? అనేది పూర్తిగా నా ఇష్టం. మీపై నాకు పూర్తి గౌరవం ఉంది. అయితే రూ.100 కోట్లు ఇచ్చినా సరే.. గదర్ సినిమాలోనే కాదు మరే సినిమాలోనూ అత్త పాత్ర పోషించలేను అని ఎక్స్ (ట్విటర్) వేదికగా క్లారిటీ ఇచ్చింది.గతంలోనూ వివాదంకాగా గదర్ ఫస్ట్ పార్ట్‌లో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. సీక్వెల్లో హీరో ఉత్కర్ష్ శర్మకు సన్నీ- అమీషా తల్లిదండ్రులుగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ అనిల్ శర్మ తనయుడే ఉత్కర్ష్ శర్మ. గతంలోనూ అమీషా.. అనిల్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. గదర్ 2 షూటింగ్లో తనకు కనీస వతి కల్పించలేదని ఆరోపించింది. అలాగే కుమారుడి పాత్రను పవర్‌ఫుల్‌గా మార్చడం కోసం సినిమా క్లైమాక్స్‌నే మార్చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజులకే డైరెక్టర్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఈ వివాదానికి ముగింపు పలికింది.చదవండి: ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు -
20 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న టాప్ హీరోయిన్
బాలీవుడ్లో ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్గా అమీషా పటేల్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో కూడా బద్రి, నరసింహుడు, నాని సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీకి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, లేటు వయసులో ఈ బ్యూటీ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా అమీషా పటేల్ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆమెకు భారీగా పాపులారిటీ ఉంది. అలా స్టార్ డమ్ ఉన్నప్పుడే బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్‌తో అమీషా ప్రేమలో పడింది. సుమారు కొన్నేళ్లపాటు వారిద్దరూ డేటింగ్ కూడా చేశారు. అయితే, ఇద్దరి మధ్య పలు విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే, మళ్లీ వారిద్దరూ కలిసింది లేదు. కొద్దిరోజుల్లో అమీషా పటేల్ వయసు 50 ఏళ్లకు చేరుకుంటుంది. అయినా, ఆమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చిందని ఆమె అభిమానులు కూడా చెబుతున్నారు.విక్రమ్ భట్‌తో బ్రేకప్ చెప్పిన తర్వాత అమీషా పటేల్ మరో ఎన్ఆర్ఐతో ప్రేమాయాణాన్ని సాగించింది. అదీ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. అయితే, తాజాగా ఓ 30 ఏళ్ల యువకుడితో దుబాయ్‌లో విహరిస్తూ అమీషా కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆమె కూడా అతగాడి కౌగిలిలో ఒదిగిపోతూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'నా డార్లింగ్ నిర్వాన్ బిర్లాతో.. లవ్లీ సాయంత్రం' అంటూ ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా జత చేసింది. వ్యాపార కుటుంబంలో జన్మించిన 'నీరవ్ బిర్లా'.. అమీషా పటేల్ కంటే సుమారు 20 ఏళ్ల చిన్నవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నాటికి ఇతగాడి వయసు 6 ఏళ్లు మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అమీషా అందం అలాంటిదంటూనే ఆమె ఎవరినైనా ఫిదా చేస్తుందని చెప్పుకొస్తున్నారు. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. ‘గదర్ 2’. గతేడాదిలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) -
ఆ నిర్మాతకు రూ. 2.75 కోట్లు రిటర్న్ చేస్తున్న స్టార్ హీరోయిన్
రాంచీకి చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ నుంచి తాను తీసుకున్న రూ.2.50 కోట్లకు వడ్డీతో కలిపి రూ. 2.75 కోట్లు తిరిగి చెల్లిస్తానని బాలీవుడ్ నటి అమీషా పటేల్ తెలిపింది. చెక్ బౌన్స్, మోసం కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి అమీషా పటేల్ చిత్ర నిర్మాత అజయ్ కుమార్ సింగ్‌కు డబ్బు చెల్లించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. రాంచీ కోర్టు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆమె ఒప్పుకుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త అజయ్ కుమార్ ఓ సినిమా విషయంలో చాలా నెలల క్రితం అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు వేశారు. సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5కోట్లు అప్పుగా అమీషా పటేల్ తీసుకున్నారని.. ఆ తర్వాత సినిమా పూర్తిచేయకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొంటు రాంచీలోని సివిల్ కోర్టులో పిటిషన్ ఆయన వేశారు. వడ్డీతో కలిసి మొత్తం రూ.3కోట్లు అయిందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బును ఇప్పించాలని కోర్టును కోరారు. ఈ కేసు విషయంలో తాజాగా అమీషా పటేల్ తన లాయర్ ద్వారా డబ్బు చెల్లించేందుకు అంగీకరించింది. అయితే మొదటి విడతగా రూ.20 లక్షలు చెల్లిస్తామని లాయర్ ద్వారా కోర్టుకు తెలిపింది. కోర్టు వర్గాల సమాచారం ప్రకారం, అమీషా పటేల్ మొదటి విడత మొత్తాన్ని మరో రెండు మూడు రోజుల్లో అందించనున్నట్లు తెలిపింది. అంతకుముందు, కోర్టు స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించింది. అయితే వ్యక్తిగత విధుల కారణంగా కోర్టుకు హాజరుకాలేనని అమీషా పేర్కొంది. -
Ameesha Patel: గదర్ 2 సినిమాతో రూ.300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ (ఫోటోలు)
-
చెక్ బౌన్స్ కేసులో స్టార్ హీరోయిన్‌కు రూ.500 ఫైన్
ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుపై రాంచీ కోర్టులో పలుమార్లు విచారణ కూడా జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇదే ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్‌కు న్యాయస్థానం వారెంట్ ఇష్యూ చేసింది. దీంతో ఆమె రాంచీలోని సివిల్ కోర్టులో లొంగిపోయింది. ఈ మేరకు అప్పట్లో విచారణ జరిపిన కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇదే కేసుకు సంబంధించి ఆమె తరపున కేసు వాధించే లాయర్ రాకపోవడంతో అమీషా పటేల్‌కు రాంచీ కోర్టు 500 రూపాయల జరిమానా విధించింది. అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్‌కు కారణం ఇదే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అజయ్ కుమార్ ఓ సినిమా విషయంలో అమీషా పటేల్‌పై చెక్ బౌన్స్ కేసు వేశారు. సినిమా నిర్మిస్తానంటూ తన దగ్గర నుంచి రూ. 2.5కోట్లు అమీషా పటేల్ తీసుకున్నారని. ఆ తర్వాత సినిమా పూర్తిచేయకపోగా తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పేర్కొంటు రాంచీలోని సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) పిటిషనర్ అజయ్ కుమార్ సింగ్ తరపున సాక్షిగా కంపెనీ మేనేజర్ టింకు సింగ్ తాజాగా విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు. కానీ అమిషా పటేల్ తరపు న్యాయవాది అతన్ని క్రాస్ ఎగ్జామినేట్ చేయలేదు. బదులుగా, ఆమె న్యాయవాది దాని కోసం మరింత సమయం కోరారు. అప్పుడు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డిఎన్ శుక్లా కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు. దీంతో అమిషా పటేల్‌కు కోర్టు రూ. 500 జరిమానా విధించింది. తదుపరి విచారణను ఆగష్టు 7కి వాయిదా వేసింది. -
డైరెక్టర్‌తో మొన్న గొడవ.. ఇప్పుడేమో రోజంతా ఆయనతోనే!
హీరోయిన్ అమీషా పటేల్ యూటర్న్ తీసుకుంది. సరిగ్గా కొన్నిరోజుల ముందు ఏ దర్శకుడిపై అయితే ఆరోపణలు చేసిందో ఇప్పుడు అతడితోనే రోజంతా గడిపింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు బ్యూటీనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇద్దరు కలిసి నవ్వుతున్న ఫొటోని కూడా పోస్ట్ చేసింది. దీంతో.. అసలేం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ తల గోక్కుంటున్నారు. (ఇదీ చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?) తెలుగు, హిందీలో హీరోయిన్ గా ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. ప్రస్తుతం హిందీలో నటిస్తోంది. త్వరలో 'గదర్ 2'తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. అయితే ఈ చిత్ర షూటింగ్ లో తనకు ఫుడ్, వసతి, ట్రాన్స్పోర్ట్ లాంటి వాటికి ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. ఈ జూన్ 30న వరస ట్వీట్స్ చేసింది. ఇప్పుడేమో సడన్‌గా ఆ దర్శకుడు మంచోడు అని మాట మార్చేసింది. 'దర్శకుడు అనిల్ శర్మతో ఆయన ఆఫీసులోనే రోజంతా టైమ్ స్పెండ్ చేశాను. గత 24 ఏళ్ల నుంచి ఆయన నాకు బాగా తెలుసు. ఎప్పటికీ ఆయన్ని గౌరవిస్తాను. కైరాత్ సాంగ్ చూస్తూ టీమ్ అంతా ఎంజాయ్ చేశాం' అని హీరోయిన్ అమీషా పటేల్ తన తాజా ట్వీట్లో రాసుకొచ్చింది. దీంతో తను చేసిన ఆరోపణలని తానే ఖండించినట్లు అయింది. Spent the entire day today with @Anilsharma_dir at his office .. a director who I have known and respected for 24 years n counting now !! Enjoyed seeing KHAIRAYAT SONG With him and the entire team 💖💖🙏🏻🙏🏻👍🏻 pic.twitter.com/4VAFGOIFnk — ameesha patel (@ameesha_patel) July 18, 2023 (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) -
ఆ ఫోటోలు వైరల్ చేయకండి.. ప్లీజ్ సాటి ఆడదానిగా కోరుతున్నా: హీరోయిన్
అమీషా పటేల్- సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' ఆగస్ట్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ నటించిన 'OMG 2' తో ఢీకొంటుంది. 'గదర్ 2'ను తాజాగా ఓ వివాదం వెంటాడుతుంది. ఈ సినిమాలో కనిపించనున్న నటి సిమ్రత్ కౌర్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గదర్-2 సినిమాలో బెడ్రూమ్లోని హాట్ ఫోటోలు అంటూ కొన్ని ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. దీంతో గదర్ లాంటి క్లీన్ సినిమాలో ఇలాంటి సీన్లు ఎలా పెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు సిమ్రత్ కౌర్‌ను ఈ సినిమాలోకి ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) దీనిని అమీషా పటేల్ ఖండించింది. ఆ లీక్ అయిన చిత్రాలు తమ రాబోయే చిత్రానికి సంబంధించినవి కావని స్పష్టం చేసింది. సిమ్రత్ కౌర్‌పై కావాలనే ఎవరో నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారని అమిషా తెలిపింది. ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి అంటూ ఒక ఆడదానిగా రిక్వెస్ట్ చేస్తున్నానని అమీషా పేర్కొంది. సినిమాల్లో కేవలం ఆమె టాలెంట్‌ను మాత్రమే గుర్తించండి. కానీ ఇలా ఆ అమ్మాయిని అవమానించవద్దని, కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిద్దామని అమిషా తెలిపింది. సినిమాల్లో రొమాన్స్ ఉండటం తప్పులేదు కానీ అది లిమిట్స్‌లో మాత్రమే ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని సినిమాలు నిర్మించాలని ఆమె కోరింది. ఇంతటితో ఈ ఊహాగానాలు దయచేసి ఆపేయండి. ఆగస్ట్ 11న గదర్ 2ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండని ఆమె తెలిపింది. These are not images from GADAR 2!! 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/sHdSNpbrlh — ameesha patel (@ameesha_patel) July 12, 2023 (ఇదీ చదవండి: తొలి పారితోషికంపై సితార కామెంట్స్.. నెట్టింట ప్రశంసల జల్లు) -
25 ఏళ్ల నుంచి అవకాశాలే రాలే, అందుకే ఇలా తయారైంది: ఉర్ఫీ
ఓటీటీలో ఏముందని? అంతా గే, స్వలింగ సంపర్కానికి సంబంధించిన కంటెంట్‌తోనే నిండిపోయింది. అంతకుమించి అక్కడేం లేదు అని నటి అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా నటి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావెద్ ఫైర్ అయింది. 'అసలు గేయిజం, లెస్బియినిజం అంటే అర్థం తెలుసా? మీ పిల్లలను వాటికి దూరంగా ఉంచాలనుకుంటున్నారా? ఇలాంటి తారలు ఇటువంటి సున్నితమైన అంశాల గురించి ముందుగా కొంత చదువుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా ఏదీ తెలియకపోయినా ఏదో ఒకటి వాగితే నాకు చెడ్డ చిరాకు పుడుతుంది. బహుశా 25 ఏళ్లుగా ఏ పనీ దొరక్కపోవడం వల్ల ఆమె ఇలా తయారైనట్లుంది' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా అమీషా పటేల్ త్వరలో గదర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండట్లేదు. కానీ మా సినిమా మాత్రం అమ్మమ్మ-తాతయ్యలతోనూ కలిసి చూడవచ్చు. జనాలు ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో కలిసి సినిమా చూసే రోజులు పోయాయి. ఓటీటీలో అయితే అసలే చూడలేం. ఓటీటీలో స్వలింగ సంపర్కం, గేకు సంబంధించిన సన్నివేశాలే ఉంటున్నాయి. పిల్లలతో కలిసి చూడలేని అభ్యంతరకర రీతిలో కంటెంట్ ఉంటోంది. ఒక మంచి సినిమా కావాలని కోరుకుంటున్న ప్రేక్షకులకు గదర్ 2 తప్పకుండా ఒక మంచి సమాధానం అవుతుంది అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావెద్. కాగా 2001లో వచ్చి గదర్: ఏక్ ప్రేమ్ కథ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. చదవండి: నైట్ క్లబ్లో హీరోయిన్‌తో ముద్దులాట.. హీరో ప్రైవేట్ వీడియో లీక్ -
ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్
సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. ‘గదర్ 2’. 1971లో ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీషా పటేల్ టాలీవుడ్‌కి కూడా సుపరిచితమే. మహేష్ బాబు,ఎన్టీఆర్,బాలకృష్ణ , పవన్ వంటి స్టార్ హీరోలతో మెప్పించింది ఈ బ్యూటీ. బాలీవుడ్ నిర్మాత,డైరెక్టర్ విక్రమ్ భట్‌తో తన రిలేషన్షిప్ గురించి గతంలో బహిరంగంగా మాట్లాడటం వల్ల తన కెరీర్ ఎలా దెబ్బతిందో తాజాగా తెలిపింది. (ఇదీ చదవండి: కిచ్చా సుదీప్ చేసిన మోసాన్ని బయటపెట్టిన నిర్మాత) తనతో రిలేషన్షిప్ వల్ల కెరీర్ నాశనం అయిందని చెప్పింది. దాని వల్ల ఒక దశాబ్దానికి పైగా పురుషులకు దూరంగానే ఉంటూ వస్తున్నానని ఆమె చెప్పింది. అమీషా,విక్రమ్ విడిపోవడానికి ముందు చాలా సంవత్సరాలు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. విక్రమ్‌తో అమీషా పటేల్ సంబంధం బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో ప్రేమాయణం నడిపాడు విక్రమ్. ఆమెతో విడిపోయిన వెంటనే అమీషా పటేల్‌తో డేటింగ్ ప్రారంభించాడు. వారిద్దరూ Ankahee (2006)లో వచ్చిన సినిమా సమయంలో డేటింగ్ ప్రారంభించారు. కానీ తదుపరి చిత్రం 1920 (2008) విడుదలకు ముందే వారు విడిపోయినట్లు సమాచారం. అమీషా కెరీర్‌పై ప్రభావం విక్రమ్‌తో ఉన్న సంబంధం వల్ల తన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో అమీషా ఇలా తెలిపింది. 'ఈ పరిశ్రమలో, నిజాయితీకి విలువ లేదు. నేను చాలా నిజాయితీగానే ఉన్నాను. కానీ నేను ఎవరినైతే హృదయానికి దగ్గరకు చేర్చుకున్నానో అదే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అయింది. ఒకరకంగా అలాంటి గుణం ఉండటం అతిపెద్ద లోపమని కూడా భావిస్తున్నాను. పబ్లిక్‌గా మరో వ్యక్తితో సంబంధాన్ని కలిగి ఉండటం వల్లే నా కెరీర్ దెబ్బతింది. దీని వల్ల 12-13 ఏళ్ల వరకు పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇలాగే ఉన్నాను. దీంతో నా జీవితంలోకి మరో పురుషుడికి చోటు ఇవ్వలేదు. శాంతి మాత్రమే నాతో ఉంది. నా జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు' అని పేర్కొంది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) అమీషాపై విక్రమ్ గతంలో అమీషాతో ఉన్న బంధం గురించి విక్రమ్ పలు కామెంట్లు చేశాడు. ఆమెను వివాహం చేసుకోవాలని ఎప్పుడూ కోరుకోలేదని ఆయన ఓపెన్‌గానే చెప్పాడు. అమీషా పటేల్ వంటి వారు ఆలోచించకుండా తమ మనసులోని మాటను పబ్లిక్‌గా బయటపెట్టేస్తారు. అలాంటి వారు అపరిపక్వంగానే ఆలోచిస్తారు. కాబట్టి ఆమెలాంటి వారు తమ మనసులోని మాటను బయటపెట్టడానికి భయపడరు అని చెప్పాడు. View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) -
షూటింగ్లో కనీసం ఫుడ్ బిల్లు కూడా చెల్లించలేదు.. హీరోయిన్ ఆగ్రహం!
తెలుగులో చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అమీషా పటేల్. 2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. హిందీ, తెలుగులో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో స్టార్ హీరోలందరితో టాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. పంజాబీలో మూవీస్‌లోనూ నటిస్తోంది. తాజాగా గదర్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి ) అయితే ఇటీవలే గదర్-2 మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్లో పాల్గొన్న భామ చిత్ర యూనిట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మే నెల చివర్లో జరిగిన గదర్-2 షూటింగ్లో నిర్మాణ సంస్థ తీరు పట్ల అమీషా పటేల్ వరుస ట్వీట్లు చేసింది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తమకు ఆహారం, వసతి, రవాణా కోసం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. తాము పడిన కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ వారు ఆహారం, వసతి, రవాణా కోసం బిల్లులు చెల్లించేదని అమీషా పటేల్ ఆరోపించింది | అమీషా ట్వీట్లో రాస్తూ..' మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి సరైన వేతన బకాయిలు చెల్లించలేదు. షూటింగ్ చివరి రోజున చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు, ఆహార బిల్లులకు కూడా డబ్బులు చెల్లించలేదు. నటీనటులు, సిబ్బందికి కార్లు కూడా సమకూర్చలేదు. అక్కడే ఒంటరిగా వదిలిలేశారు. కానీ వెంటనే జీ స్టూడియోస్ వారు రంగంలోకి దిగి అన్ని బకాయిలు చెల్లించారు. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ తప్పులను వారు సరిదిద్దారు. గదర్ 2 అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోందని అందరికీ తెలుసు. ఈ సమస్యను పరిష్కరించిన షరీక్ పటేల్, నీరజ్ జోషి, కబీర్ ఘోష్, నిశ్చిత్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. జీ స్టూడియోస్ టీమ్ ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటుంది.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సన్నీ డియోల్ సరసన గదర్ 2లో అమీషా పటేల్ నటించింది. (ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) All involved in the film are aware that the production of GADAR 2 was being handled by ANIL SHARMA PRODUCTIONS which unfortunately misfired numerous times but @ZeeStudios_ always rectified issues!! A special thanks to them especially Shariq Patel,Neeraj Joshi, Kabeer Ghosh and… — ameesha patel (@ameesha_patel) June 30, 2023 -
కోర్టులో లొంగిపోయిన హీరోయిన్ అమీషా పటేల్!
ఆమె తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం హిందీ, పంజాబీలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గానే 'గదర్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇలా కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. తాజాగా ఓ కేసు విషయమై కోర్టులో లొంగిపోయింది. 2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. హిందీ, తెలుగులో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అడపాదడపా మూవీస్ చేస్తూ వస్తోంది. కొన్నేళ్ల ముందు ఓ సినిమా విషయమై ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అజయ్ కుమార్ దగ్గర రూ.2.5 కోట్ల వరకు డబ్బు తీసుకుంది. ఆ తర్వాత సదరు సినిమా పూర్తి చేయలేదు సరికదా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. ఓసారి చెక్ ఇస్తే అది బౌన్స్ అయింది. దీంతో అజయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఈమెపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్ కు కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో రాంచీలోని సివిల్ కోర్టులో ఈమె శనివారం లొంగిపోయింది. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ భామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన టైంలో తలకు పూర్తిగా ముసుగు వేసుకుని మీడియా ప్రతినిధుల నుంచి ముఖం దాచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?) -
బాలీవుడ్ నటి అమిషా పటెల్‌పై అరెస్ట్ వారెంట్
బాలీవుడ్ బ్యూటీ అమిషా పటెల్‌పై రాంచి సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కింద ఆమెపై 420, 120 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అమిషా, అమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్‌కు వ్యతిరేకంగా సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాలు.. అమీషా పటేల్‌కు చెందిన ‘దేశీ మ్యాజిక్’ చిత్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్‌గా రాంచీ జిల్లాలోని హర్ము ప్రాంత నివాసి అజయ్ కుమార్ సింగ్‌ను ఆమె సంప్రదించింది. చదవండి: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘పుష్ప 2’ టీజర్.. హిందీలోనే ఎక్కువ వ్యూస్.. దీంతో అజయ్ కుమార్ రూ.2.5కోట్లను అమీషా ఖాతాకు బదిలీ చేశాడు. మేకింగ్‌తో పాటు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని ఆయన అమిషాను కోరాడు. ఈ ఒప్పందం ప్రకారం ఆమె 2013లో ప్రాజెక్టును పట్టాలెక్కించింది. సినిమా షూటింగ్‌ను మాత్రం పూర్తి చేయలేదు. ఫలితంగా అజయ్ డబ్బును వెనక్కి ఇవ్వాలని నటిని పలు మార్లు కోరాడు. అక్టోబర్ 2018లో అమీషా రూ.2.5కోట్లకు ఒకటి, రూ.50లక్షలకు మరో చెక్‌ను ఇచ్చింది. చదవండి: ‘మీటర్’ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే కానీ, ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయి. దీంతో అజయ్ సింగ్ ఆమెపై రాంచీ సివిల్ కోర్టులో అమిషా, ఆమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్పై కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు విచారణకు అమిషా హజరు కాగా ఆమె తరపు న్యాయవాది మాత్రం కోర్టుకు ముందు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అలాగే గతంలో రూ. 32.25 లక్షల చెక్ బౌన్స్ కేసులో భోపాల్ కోర్టు అమిషాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
తారక్‌పై ట్వీట్ చేసి పప్పులో కాలేసిన నటి, అసలేం జరిగిందంటే..
జూనియర్ ఎన్టీఆర్ గురించి ట్వీట్ చేస్తూ పప్పులో కాలేసింది బాలీవుడ్ నటి అమీషా పటెల్. తారక్ సరసన ఆమె నరసింహుడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు త్రోబ్యాక్ వీకెండ్ అంటూ ట్వీట్ చేసింది. ‘తారక్‌తో నేను నటించిన చిత్రంలోని(నరసింహుడు) క్యూట్ పిక్ ఇది. అప్పుడు తెలుగు సూపర్ స్టార్స్‌లో ఒకరైన ఆయన ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను పొందుతున్నారు. చదవండి: రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం చిత్రం, 3 రోజుల్లోనే ఎంతంటే.. ఇది నాకు చాలా సంతోషాన్నిఇస్తుంది. లవ్లీ కో-స్టార్. ఒదిగిపోతూ కష్టపడే వ్యక్తిత్వం ఆయనది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్న.. ఆమె చేసిన పోరపాటుతో నెటిజన్లు తనని ట్రోల్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తొలుత ఆమె ట్వీట్ చేస్తూ తారక్(@tarak999) అసలు ట్వీట్‌కు బదులు తారక్ ఫ్యాన్స్‌తో ఉన్న @jrntrఫేక్ ప్రోఫైల్‌ను ట్యాగ్ చేసింది. అయితే ఇది గమనించిన ఆయన ఫ్యాన్స్ ఏంటీ మేడమ్ కాస్తా చూసుకోవాలి కదా’ అంటూ ఆమె ట్వీట్‌పై కామెంట్స్ చేశారు. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ మేడం ఇది తారక్ అన్న అసలు ప్రోఫైల్ కాదు.. తప్పు ఖాతా ట్యాగ్ చేశారు. సరి చూసుకోండంటూ నెటిజన్లు అమీషాకు సూచించారు. దీంతో తన తప్పు చేసుకున్న ఆమిషా ఆ ట్వీట్‌ను తొలగించి మరో ట్వీట్ చేసింది. అయితే రెండొసారి కూడా తప్పుగా ట్యాగ్ చేయడంతో ట్రోల్స్ బారిన పడింది. దీంతో మూడోసారి కేవలం తారక్ పేరు మాత్రమే ఉంచి ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వకుండ జాగ్రత్త పడింది. కాగా అమీషా తెలుగులో పవన్ కల్యాణ్‌తో బద్రి, మహేశ్ బాబు సరసన నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. THROWBACK WEEKEND.. a cute pik from my Telugu film w/ junior NTR .. he was a huge TELUGU SUPERSTAR then as well n today seeing him getting such PAN INDIA love with the film RRR makes me soo happy .. lovely co star .. hardworking and humble 💖💖👍🏻👍🏻💯 pic.twitter.com/sCcfrmVvis — ameesha patel (@ameesha_patel) September 18, 2022 -
అమీషాపై చీటింగ్, క్రిమినల్ కేసు.. కీలక ఆదేశం ఇచ్చిన సుప్రీం కోర్టు
బాలీవుడ్ నటి అమీషా పటెల్ చీటింగ్ కేసులో జార్ఖండ్ ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్‌ను సుప్రీం కోర్టు నిలివేసింది. అమీషా పటెల్ తనని మోసం చేసిందంటూ నిర్మాత వేసిన పటిషన్‌పై జార్ఖండ్ కోర్టు ఆమెకు మేలో సమన్లు ఇచ్చింది. దీంతో తనపై ఈ క్రిమినల్ ప్రొసీడింగ్‌ను నిలివేయాలని కోరుతూ అమీషా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చదవండి: నటుడు బ్రహ్మాజీ సటైరికల్ ట్వీట్.. అనసూయను ఉద్ధేశించేనా? తన పటిషన్‌పై విచారణ జరిపిన బిఆర్ గవాయ, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తాజాగా జార్షండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ ఇచ్చింది. అమీషాపై క్రిమినల్ ప్రొసీడింగ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 (చెక్ బౌన్స్) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించిన చర్యలు చట్టానికి అనుగుణంగానే కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కాగా అజయ్ సింగ్ అనే నిర్మాత అమీషా పటెల్‌పై జార్ఖండ్ ట్రయల్ కోర్టులో ఇటీవల చీటింగ్ కేసు నమోదు చేశారు. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ ‘దేశీ మ్యాజిక్’ అనే సినిమా కోసం అమీషాకు రూ. 2.5 కోట్లు ఇచ్చానని, కానీ ఆ సినిమాలో ఆమె చేయలేదన్నాడు. అడ్వాన్స్‌గా ఇచ్చిన ఆ డబ్బును అమీషా తిరిగి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇక దీనిపై విచారించిన జార్ఖండ్ ట్రయల్ కోర్టు అమీషాపై చీటింగ్(420), నేరపూరిత విశ్వాస ఉల్లంఘన(420) సెక్షన్ల కింద ఆమెకు సమన్లు ఇచ్చింది. దీంతో అమీషా జార్ఖండ్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా దానిని విచారించిన ధర్మాసనం సెక్షన్ 138 ప్రకారం ప్రొసీడింగ్‌లు జరపాలని జార్ఖండ్ కోర్టును ఆదేశించింది. చదవండి: చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్, వీడియో షేర్ చేసిన మెగాస్టార్ -
హీరోయిన్‌పై చీటింగ్ కేసు అయినా బికినీలో రిలాక్స్ అవుతున్న బ్యూటీ!
బద్రి, నాని సినిమాలతో తెలుగువారికి పరిచయమైంది హీరోయిన్ అమీషా పటేల్. బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించిన అమీషా మీద తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులకందిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం నిర్వాహకులు అమీషా పటేల్‌ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్లో పాల్గొనేందుకు ఆమె రూ.4 లక్షలు వసూలు చేసింది. తీరా ప్రాగ్రామ్‌కు వచ్చిన తర్వాత కేవలం మూడు నిమిషాలే స్టేజీపై కనిపించి మాయమైంది. దీంతో అమీషా మోసం చేసిందంటూ ప్రోగ్రాం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అమీషా ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించింది. ఏప్రిల్ 23వ తారీఖు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు హాజరయ్యాను. స్టార్ ఫ్లాష్ ఎంటర్టైన్మెంట్, అరవింద్ పాండే ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా నిర్వహించారు. నాకు ప్రాణభయం పట్టుకుంది, కానీ స్థానిక పోలీసులు నా రక్షణ బాధ్యతలు చూసుకున్నారు అని ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గడర్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న అమీషా ఢిల్లీలో ఎంజాయ్ చేస్తోంది. ఓ చెట్టు కింద బికినీ ధరించి నిల్చున్న ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. Attended the Navchandi Mahostav 2022 yesterday 23 rd April in Khandwa city ,Madhva Pradesh … v v v v badly organised by Star Flash Entertainment and Mr Arvind Pandey .. I feared for my life but I want to thank the local police for taking care of me v well ..🙏🏻🙏🏻 — ameesha patel (@ameesha_patel) April 24, 2022 చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్ -
అమీషా.. నన్ను పెళ్లి చేసుకుంటావా?
Late Congress Leader Ahmed Patel Son Proposes To Heroine Ameesha Patel: బద్రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ అమీషా పటేల్. నాని, నరసింహుడు చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈమె గత కొంతకాలంగా ఈమె దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్‌తో ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తమ ప్రేమ బంధంపై వీరిద్దరు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఫైజల్ 41వ బర్త్‌డే సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. 'హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..అంటూ అమీషా సైతం ట్విట్టర్లో ప్రియుడికి బర్త్‌డే విషెస్ తెలిపింది. దీనికి ఫైజల్ మాత్రం ఆసక్తికరంగా స్పందించాడు. థ్యాంక్యూ అమీషా పటేల్. ఈ సందర్భంగా పబ్లిక్‌గా నీకు ప్రపోజ్ చేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ సోషల్ మీడియాలో పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అయితే కాసేపటికే ఫైజల్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే నెటిజన్లు ఈ చాట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. కాగా గతంలో ఫైజల్ జైనాబ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ గుండెపోటుతో ఈమె 2016లో చనిపోయింది. అనంతరం ఫైజల్ అమీషా ప్రేమలో పడ్డాడు. ఫైజల్ కంటే అమీషా పటేల్ నాలుగేళ్లు పెద్దది. -
హల్చల్: అమీషా ఫ్లయింగ్ కిస్, హెబ్బా రాకింగ్ లుక్స్
► చిరునవ్వుల చిలక నజ్రియా ► అభిమానులకు అమీషా పటేల్ ఫ్లయింగ్ కిస్ ► చీరకట్టుతో చంపేస్తోన్న ఊర్వశి రౌతేలా ► యోగాసనం వేసిన కృతి కర్బందా ► జలకాలాట ఆడుతున్న శ్రియా ► వీకెండ్లో ఏం చేస్తుందో వీడియోతో సహా చెప్పేసిన రాశీ ఖన్నా ► మేడ మీద కీర్తి సురేశ్ యోగాసనాలు ► పక్క టేబుల్ మీద స్నాక్స్ ఉన్నాయంటూ దానివంకే చూస్తున్న హెబ్బా పటేల్ ► రష్యా వీధుల్లో చీరకట్టుతో తాప్సీ చక్కర్లు View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
భార్యకు విడాకులు, ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం!
‘ఒక అమ్మాయి కలలు కనే ప్రేమికుడిని కాను.. కోరుకునే భర్తను అంతకన్నా కాను. ప్రయత్నించాను కాని వల్ల కాలేదు. అనుబంధం అవగాహనను, రాజీపడడాన్ని ఆశిస్తుంది. ఆ రెండూ నాకు లేవు. అందుకే ప్రేమ, పెళ్లి రెండిట్లో ఫెయిల్ అయ్యాను. తోడు కన్నా ఏకాంతాన్నే ఎక్కువ కోరుకుంటుంది నా మనసు’ అంటూ తనను తాను విశ్లేషించుకుంటాడు బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్. సుష్మితా సేన్ ఆయన జీవన వైఫల్య చిత్రమే ఇది... విశ్వసుందరి సుష్మితా సేన్ మొదటి సినిమా ‘దస్తక్’. దానికి దర్శకుడు విక్రమ్ భట్. అప్పుడు సుష్మితకు 20 ఏళ్లు. విక్రమ్‌కు 27. ఈ ప్రస్తావన ఎందుకంటే ఆ లవ్ ఫెయిల్యూర్‌కి విక్రమ్ తమ వయసునే కారణంగా చూపాడు కాబట్టి. ‘దస్తక్’ సినిమా సెట్స్‌లో విక్రమ్‌ను బాగా పరిశీలించింది సుష్మిత. పని పట్ల అతనికున్న నిబద్ధత ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అతణ్ణి సమ్మోహనపరిచింది. ప్రేమ మొదలవడానికి ఈ ప్రారంభం చాలు కదా! ఒకరికోసం ఒకరన్నట్టుగా అయిపోయారు. బాలీవుడ్లో గుసగుసలు పత్రికల్లో గాసిప్స్ కాలమ్‌ను నింపేశాయి. దస్తక్ షూటింగ్ కోసం యూనిట్ అమెరికా వెళ్లింది. అక్కడ స్వేచ్ఛను ఆస్వాదించిందీ జంట. ఆ కబురును ఇక్కడ అందుకుంది అదితి భట్. భార్య అదితితో విక్రమ్ సహించలేదు.. క్షమించలేదు విక్రమ్ భార్య అదితి.. బచ్పన్ కీ దోస్త్.. ఫస్ట్ క్రష్. సుష్మితా సేన్‌తో అతను ప్రేమలో పడేనాటికే రెండేళ్ల వైవాహిక బంధం వాళ్లది. ఒక కూతురు కూడా. ఎన్నో ఆశలతో విక్రమ్ జీవిత భాగస్వామిగా అత్తింట్లోకి అడుగుపెట్టింది అదితి. అత్త, మామలు ఆమెను ఆహ్వానించిన తీరుకు నివ్వెరపోయింది. తన పట్ల వాళ్ల ప్రవర్తనకు నిర్ఘాంతపోయింది. తల్లిదండ్రుల పద్ధతిని విక్రమ్ విమర్శించకపోయినా తనకే అండగా ఉన్నాడు.. ఉంటాడు అన్న భరోసాతో ఆ ఇబ్బందులను భరించింది. బిడ్డ కోసం భర్త నిర్లక్ష్యాన్నీ క్షమించింది. కానీ ఎప్పుడైతే సుష్మితా సేన్‌తో అతని వ్యవహారం తెలిసిందో అప్పుడు సహించలేక ప్రశ్నించింది. ఆమెతో రాజీపడే ప్రయత్నం అతనూ చేయలేదు. దాంతో విడాకులతో వేరైంది ఆ జంట. ప్రేమికుడిగానూ ఓడిపోయాడు ఇటు సుష్మితా సేన్ మీద ప్రేమనూ గెలిపించుకోలేకపోయాడు విక్రమ్. ఆ లవ్ స్టోరీ ఎంత వేగంగా మొదలయిందో అంతే వేగంగా ముగిసిపోయింది. ఎవరికోసం భార్య, బిడ్డను వదులుకున్నాడో ఆ తోడునూ నిలుపుకోలేకపోయాడు. ఒంటరివాడయ్యాడు. నిరాశ పట్టుకొని పీడించసాగింది. నిస్పృహతో తనుండే ఆరవ అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుంచి దూకేయాలనుకున్నాడు. విచక్షణ ఒళ్లు విరుచుకోకపోతే దూకేసేవాడే. సుష్మితాను మరచిపోయి బతుకు మీద ప్రీతి కలగాలంటే పనిమీద దృష్టి పెట్టాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అమీషా పటేల్ ఆంఖే... ఆ సమయంలోనే ‘ఆంఖే’ సినిమాకు సిద్ధమయ్యాడు. కథానాయికగా అమీషా పటేల్ సైన్ చేసింది. సెట్స్‌లో ఇద్దరూ స్నేహితులయ్యారు. అతని గుండెలో గూడుకట్టుకున్న దిగులుకు ఆమె సాంత్వన అయింది. ఆమె కెరీర్ సమస్యలకు అతను శ్రోతలా మారాడు. నెమ్మదినెమ్మదిగా అమీషా పటేల్ నవ్వు విక్రమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపసాగింది. మనసు ఎంత చెడ్డదంటే.. కాస్త ఆప్యాయంగా పలకరించే మనిషి కనపడితే చాలు అల్లుకుపోదామని చూస్తుంది.. మునుపటి అనుభవాల చేదు ఇంకా వీడకున్నా సరే! విక్రమ్.. అమీషాను ప్రేమించసాగాడు. అమీషా కూడా విక్రమ్‌ను ఇష్టపడింది. ఆ ప్రేమ అయిదేళ్ల కాలాన్ని ఇట్టే చుట్టేసింది. ఆ ఇద్దరూ పెళ్లాడతారనే అనుకున్నారు బాలీవుడ్లో అంతా! కానీ వాళ్లిద్దరూ తమ ప్రేమను బ్రేక్ చేసుకున్నారు. అమీషా, విక్రమ్ దీనికి కారణం.. అమీషా తల్లిదండ్రులు పెట్టిన ఒత్తిడి కావచ్చు అంటారు ఆ ఇద్దరికీ సంబంధించిన సన్నిహితులు. విక్రమ్ భట్ మాత్రం ‘ఆమె తన కెరీర్ కోసం తపన పడింది.. నేను తన కోసం తపన పడ్డాను. ఆమె కోసమే ఉన్నాను. ఇంతకన్నా ఏం చేయాలి? అల్రెడీ ఒక రిలేషన్‌ను మనసు మీదకు తీసుకుని కోలుకోలేనంతగా దెబ్బతిన్నాను. ఇప్పుడు మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లదలచుకోలేదు’ అంటాడు. సుస్మితాసేన్ విషయంలో ‘తప్పు మా ఇద్దరిదీ కాదు. మా వయసులది. పరిపక్వతలేని మా మనస్తత్వాలది’ అని చెప్తాడు. భార్య, కూతురికి తను మిగిల్చిన బాధ గురించి ‘జీవితంలో నాకున్న రిగ్రెటల్లా అదొక్కటే. వాళ్లనలా వదిలేయాల్సింది కాదు. ధైర్యం లేని వాడే జిత్తులు పన్నుతాడు. నేను అలాంటి పిరికివాడినే. అదితిని వదిలేసి నేనెంత తప్పు చేశానో, ఎంత వేదనను అనుభవించానో ఆమెతో చెప్పే ధైర్యం నాకు లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ పాఠాలే నాకు’ అంటాడు విక్రమ్ భట్. ప్రస్తుతం అతని కూతురు కృష్ణ.. తండ్రికి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. కూతురికి ప్రొడక్షన్ మెళకువలు నేర్పిస్తూ ఆమె కెరీర్‌ను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు విక్రమ్ భట్. - ఎస్సార్ చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ నా మాజీ భర్త వల్లే సినిమాలకు దూరం: నటి -
సోషల్ హల్చల్: పాట పాడిన శృతి, దెబ్బలు తిన్న హన్సిక
♦ ఇది ఏ ప్రదేశమో గుర్తుపట్టారా? అంటున్న అనుపమ పరమేశ్వరన్ ♦ తల్లి చేతిలో దెబ్బలు తిన్న హన్సిక ♦ వర్షం పడుతున్నప్పుడు కాఫీ తాగితే ఉంటది అసలైన మజా అంటున్న నభా నటేశ్ ♦ అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నానంటోన్న అమీషా పటేల్ ♦ పాట పాడిన శృతీ హాసన్ ♦ పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా సంతోషం, బలం అన్నీ వస్తాయంటున్న మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
సోషల్ హల్చల్: షాకింగ్ లుక్‌లో శ్రద్దా, మతిపోగొడుతున్న నభా
► ఎర్ర చీరలో మెరిసిపోయిన ఈషా రెబ్బా.. అభిమానులకు కరోనా సందేశం ► ఈ కఠిన పరిస్థితుల్లో మనకు సహాయపడేవి ఆ రెండే అంటున్న సమంత ► సన్యాసిని గేటప్‌లో శ్రద్దాదాస్, అసలు విషయం చెప్పెసిన ముద్దుగుమ్మ ► అభిమానులకు అమిషా సందేశం, అతనేవరో తెలియదంటున్న భామ ► ఫొటో షేర్ చేసి కుర్రకారు మతి పోగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ ► ఎల్లప్పుడు మీరు నాకు ప్రత్యేకమంటు మొదటి సారి పరిచయం చేసిన నాగశౌర్య ► తెలివైన నిర్ణయం తీసుకొమ్మంటున్న బిగ్‌బాస్ భామ మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) -
అత్యాచారం చేసి చంపేసేవాడు: అమీషా పటేల్
ముంబై: బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని.. ఒకానొక సమయంలో తనపై అత్యాచారం చేసి చంపేస్తారేమో అని భయపడ్డానని తెలిపారు బాలీవుడ్ నటి అమీషా పటేల్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ జన్‌శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర తరఫున బిహార్‌లోని దౌద్‌నగర్‌లో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవటానికి.. క్షేమంగా బయటపడటానికి వారు చెప్పినట్లు ఆడాల్సి వచ్చింది అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్‌ని విడుదల చేశారు. తనకు ఎదురయిన భయానక అనుభావాలను ఓ పీడకలగా వర్ణించారు అమీషా పటేల్. (చదవండి: ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!) ఈ సందర్భంగా అమీషా మాట్లాడుతూ.. ‘దౌద్ నగర్లో ప్రకాశ్ చంద్ర కోసం ప్రచారం చేస్తున్నప్పుడు అతడు నన్ను బెదిరించాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. నిన్న సాయంత్రం ముంబై వచ్చాక కూడా అతడు బెదిరింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేశాడు. తన గురించి గొప్పగా మాట్లాడాలని కోరాడు. అతని వల్ల నిన్న సాయంత్రం నాకు ఫ్టైట్ మిస్ అయ్యింది. దాంతో అతడు నన్ను ఓ గ్రామంలో ఉంచాడు. తను చెప్పినట్లు వినకపోతే అక్కడే వదిలేసి వెళ్తానని బెదిరించాడు. ఆ సమయంలో అతడు చెప్పినట్లు వినకపోతే నాపై అత్యాచారం చేసేవాడు.. చంపేసేవాడు. నా కారును అతడి మద్దతుదారులు అడ్డగించేవారు. అతడి మాట వినేంతవరకు నా కారును కదలనిచ్చేవారు కాదు. అతడు నన్ను ట్రాప్ చేసి నా జీవితాన్ని ప్రమాదంలో పెట్టాడు ఇది అతడి ఆపరేటింగ్ సిస్టం’ అంటూ అమీషా ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు) అయితే ఈ వ్యాఖ్యలను ఎల్జేపీ అభ్యర్థి ప్రకాశ్ చంద్ర ఖండించారు. ఆమె కార్ షో కోసం అన్ని రకాల భద్రతా నిబంధనలు చేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో నేను గెలవాలనుకున్నాను. కానీ నా బంధువుల్లో ఒకరు ఒబ్రాలో అమీషా పటేల్ ర్యాలీ నిర్వహించారు. దౌద్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అమీషా పటేల్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె ఆరోపించిన సంఘటనలు ఏవి జరగలేదు. బిహార్‌లో ఆర్టిస్టులు లేరా.. సోనాక్షి సిన్హా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. అమీషా విమానాశ్రయంలో పప్పు యాదవ్‌ను కలిశారు. వారు 15 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు” అని తెలిపాడు. అంతేకాక తనకు అనుకూలంగా వీడియో చేయడానికి అమీషా పటేల్ ఎక్కువ డబ్బు కోరినట్లు ప్రకాశ్ చంద్ర పేర్కొన్నారు. ‘నా డ్రైవర్ ఈ రోజు అమీషా పటేల్ పీఏతో మాట్లాడాడు. ఆమె నాకు అనుకూలంగా మరో వీడియో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దాని కోసం ఆమె 10 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. నేను చదువుకున్న వ్యక్తిని, చదువుకున్న సంస్థ నుంచి వచ్చాను. ఆమెకు ఇక్కడ పూర్తి రక్షణ లభించింది. అమీషా ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి’ అన్నారాయన. -
విలేకరులపై చిటపటలాడిన హీరోయిన్!
'కల్ హో నా హో' సినిమాతో 16 ఏళ్ల కిందట హృతిక్ రోషన్, అమీషా పటేల్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హీరోగా హృతిక్ తన ప్రస్థానం కొనసాగిస్తుండగా.. 'బద్రి' తార అమీషా మాత్రం కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. దాదాపు మూడేళ్ల తర్వాత 'భయ్యాజీ సూపర్‌హిట్' సినిమాతో ఆమె వెండితెరను పలుకరించబోతున్నది. తాజాగా 'భయ్యాజీ సూపర్‌హిట్' చిత్రయూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన అమీషా విలేకరులపై తీవ్రస్థాయిలో మండిపడిందట. ముంబై మీడియా కథనం ప్రకారం చిటపటలాడుతూ ఈ ప్రెస్మీట్లో పాల్గొన్న అమీషా.. విలేకరులు కుర్చీలలో కూర్చుంటుడగానే 'సైలెన్స్' అంటూ గద్దించింది. మూడేళ్లుగా ఎందుకు సినిమాల్లో నటించడం లేదని ఓ విలేకరి అడుగగా.. 'నన్ను అమీషా అని కాదు.. అమీషాజీ అని పిలువండి' అంటూ గట్టిగా సూచించింది. అదేవిధంగా మీరు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారా? అని అడిగిన విలేకరిపైనా ఆమె ఆగ్రహం ప్రదర్శించింది. మీకు మెదడు ఉందా? అంటూ ఆ విలేకరిపై విరుచుకుపడింది అమీషా. ఈ ప్రెస్‌మీట్ గురించి చిత్రయూనిట్ ముందుగానే తెలుపలేదట. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న మరో నటి ప్రీతి జింతా ప్రెస్‌మీట్‌కు డుమ్మ కొట్టగా.. అమీషా తన ఆగ్రహాన్ని విలేకరులపై చూపిందని చిత్రవర్గాలు అంటున్నాయి. సన్నీ డియోల్, అర్షద్ వార్సీ, ప్రీతి జింతా, అమీషా పటేల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'భయ్యాజీ సూపర్‌హిట్' సినిమాపై ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్లు అయిన అమీషా, ప్రీతి భారీ అంచనాలే పెట్టుకున్నారు. -
షూటింగ్లో గాయపడిన అమీషా పటేల్
కహోనా ప్యార్ హై చిత్రంతో తెరంగేట్రం చేసిన అమీషా పటేల్.. తాజాగా ఓ చిత్రం షూటింగులో యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటూ గాయపడింది. 37 ఏళ్ల అమీషా పటేల్, గత వారం ఓ సినిమా కోసం ఫైటింగు చేస్తుండగా ఆమె మోకాలికి దెబ్బ తగిలింది. కొన్ని రోజుల క్రితం ఈ గాయం తగిలిందని, ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తుంటే పడిపోయానని, మోకాలుకు దెబ్బ తగిలిందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. Thank u my tweethearts 4 all the concern..got injured a few days ago.fell v badly during an action sequence..knee is hurt but recovering — ameesha patel (@ameesha_patel) January 29, 2014 ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నానని, తనను పలకరించిన వారందరికీ కృతజ్ఞతలని కూడా ఆమె చెప్పింది. తాను గాయపడిన వెంటనే సెట్ వద్దకే డాక్టర్‌ను పిలిపించారని, తనకు వెంటవెంటనే మందులు, ఇంజెక్షన్లు ఇచ్చారని అంది. గత వారమే ఇదంతా జరిగినా అప్పుడే ఎవరికీ చెప్పనందుకు క్షమాపణలు కూడా కోరింది. Doctor was called n I was administered medicines n injections immediately — ameesha patel (@ameesha_patel) January 29, 2014 Sorry didn't tell u all last week when it happened but didn't want it to worry anyone.. — ameesha patel (@ameesha_patel) January 29, 2014