హీరోయిన్ అమీషా పటేల్‌కు (Ameesha Patel).. ఈ ఏడాది జూన్ నెల వస్తే 50 ఏళ్లు వస్తాయి. హాఫ్ సెంచరీకి చేరువైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది. కెరీర్ మొదట్లో దర్శక నిర్మాత విక్రమ్ భట్ (Vikram Bhatt)తో డేటింగ్ చేసింది. ఐదేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన వీరు తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ ప్రేమ కూడా మధ్యలోనే..
2008లో బిజినెస్‌మెన్ కనవ్ పూరితో లవ్‌లో పడింది. అతడు తనకెంతో స్పెషల్ అని.. తమ మధ్య మూడో వ్యక్తికి చోటు లేదని మీడియాకు చెప్పింది. తర్వాత వీరిద్దరికీ పెళ్లయినట్లు వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని ఆమె కొట్టిపారేసింది. చివరకు ఈ ప్రేమ కూడా ఎంతోకాలం నిలవలేదు. 2010లో అతడికి బ్రేకప్ చెప్పేసింది. తాను సింగిల్ అని.. ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్నా అంటూ అప్పట్లో ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
తనకంటే 20 ఏళ్లు చిన్నవాడితో లవ్?
ఇలా ఏ ప్రేమా పెళ్లిదాకా రాలేదు. ఇటీవల అమీషా పటేల్ ఓ 30 ఏళ్ల యువకుడితో దుబాయ్‌లో విహరించింది. ఆ సమయంలో అతగాడితో క్లోజ్‌గా ఉన్న ఫోటోను అమీషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'నా డార్లింగ్ నిర్వాన్ బిర్లాతో.. లవ్లీ సాయంత్రం' ఆ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. వ్యాపార కుటుంబంలో జన్మించిన 'నీరవ్ బిర్లా' (Nirvaan Birla).. అమీషా పటేల్ కంటే సుమారు 20 ఏళ్ల చిన్నవాడు. వయసులో ఇంత చిన్నవాడితో డేటింగ్ చేయడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
(చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు!)
అలాంటిదేం లేదు
తాజాగా ఈ రూమర్లపై నీరవ్ బిర్లా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. అమీషా, నేను ప్రేమించుకోవట్లేదు. తను మా ఫ్యామిలీ ఫ్రెండ్. మా నాన్న, అమీషా చిన్నప్పటినుంచి స్నేహితులు. నేను దుబాయ్‌లో మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నాను. ఆ సాంగ్‌లో అమీషా కనిపించనుంది. అప్పుడు దిగిన ఫోటో చూసి మీ అందరూ ఏదేదో అనుకుంటున్నారు అని క్లారిటీ ఇచ్చాడు.
ఎవరీ అమీషా పటేల్?
ముంబైలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ కహో నా.. ప్యార్ హై (2000) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. అదే ఏడాది బద్రి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మరుసటి ఏడాది గదర్: ఏక్ ప్రేమ్ కథ చిత్రంతో స్టార్ స్టేటస్ అందుకుంది. దీంతో వరుసగా హిందీలో అవకాశాలు క్యూ కట్టాయి. యే జిందగీ కా సఫర్, క్రాంతి, హమ్రాజ్, ఆప్ ముజే అచ్చే లగ్నే లగ్నే, తథాస్తు, మంగళ్ పాండే, వాదా, భూల్ భులయ్యా, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, రేస్ 2.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది.
తెలుగులోనూ..
తెలుగులో మహేశ్‌బాబు సరసన నాని (Naani Movie), బాలకృష్ణతో నరసింహుడు (Narasimhudu Movie), పరమవీరచక్ర (Parama Veera Chakra) మూవీస్‌లో నటించింది. 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. గదర్ 2తో 2023లో రీఎంట్రీ ఇచ్చింది.
చదవండి: డాకు మహారాజ్‌లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment