పెళ్లికి ముందే చెట్టాపట్టాల్.. ప్రియురాలితో స్టార్ హీరో | Aamir Khan Spotted With Gauri Spratt At Macau International Comedy Festival | Sakshi

Aamir Khan: కలిసి తిరిగేస్తున్నారు.. మరి పెళ్లెప్పుడు?

Apr 13 2025 1:35 PM | Updated on Apr 13 2025 1:42 PM

Aamir Khan Spotted With Gauri Spratt At Macau International Comedy Festival

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ-పెళ్లి-విడాకులు.. ఇలాంటి మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా లేటు వయసు ప్రేమలు కూడా కనిపిస్తుంటాయి. అలాంటిదే ఆమిర్(Aamir Khan) ప్రేమకథ.

(ఇదీ చదవండి: స్టార్‌ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్‌.. ముద్దు ఫోటోలు వైరల్‌)

ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని.. భార్యలకు విడాకులు ఇచ్చేసిన హీరో ఆమిర్ ఖాన్ కొన్నిరోజుల క్రితం తన 60వ పుట్టినరోజు సందర్భంగా తాను గౌరీ స్ప్రాట్(Gauri Spratt) అనే మహిళతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత గౌరీ ఇంట్లో జరిగిన వేడుకలకు కూడా హాజరయ్యాడు.

తాజాగా ఆమిర్-గౌరీ పబ్లిక్ గా కనిపించారు. మకావు దేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్‌లో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఫొటోలకు పోజులిచ్చారు. పెళ్లికి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్న ఈ సీనియర్ జంట.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement