Gauri
-
సప్త మోక్షపురి..మాంగళ్య గౌరికాలయం..
మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు, ఫల్గుణీ నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. మంగళ గౌరీ ఆలయం గురించిన ప్రస్తావన పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, ఇతర గ్రంథాలు, తాంత్రిక రచనలలో తప్పక కనిపిస్తుంది. మంగళగౌరిని ఉపకార దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఉప–శక్తి పీఠాన్ని కలిగి ఉంది. శ్రీ సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన 108 ప్రదేశాలను శక్తి పీఠాలుగా కొలుస్తారు. వాటిలోని కీలకమైన వాటిని 51 శక్తిపీఠాలుగా, తిరిగి వాటిలోని అత్యంత కీలకమైన వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా పూజిస్తారు. వాటిలో అమ్మవారి ఎడమ స్తనం పడిన ప్రదేశమే గయలోని మాంగళ్య గౌరికా ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, శ్రీ సతీదేవి రొమ్ము భాగం భూమిపై పడిన ప్రదేశం శ్రీ మాంగల్య గౌరీ మందిరం. ఈ మందిరంలో రెండు గుండ్రని రాళ్లు ఉన్నాయి, ఇవి సతీదేవి స్తనాలను సూచిస్తాయి. ఇక్కడ శక్తి రొమ్ము రూపంలో పూజించ బడుతుంది, ఇది పోషణకు చిహ్నం. ఎవరైతే కోరికలు, ప్రార్థనలతో అమ్మ దగ్గరకు వస్తారో, వారు అన్ని కోరికలు తీరి విజయవంతంగా తిరిగి వస్తారని నమ్ముతారు. సతీదేవి మృతదేహంతో శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్ళాడు అంటారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మితమైంది. గుడికి చేరుకోవాలంటే ఆ చిన్న కొండ ఎక్కాలి. మెట్ల మార్గం స్థానిక ప్రజల నివాసాల మధ్య ఉంటుంది. మెట్ల మార్గం ప్రారంభంలో, భీముని ఆలయం ఉంది. అతని మోకాలి ముద్రను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భీముడు శ్రాద్ధకర్మ చేసాడు, అందుకే దీనిని భీమవేది గయ అని పిలుస్తారు.కొండపై కూర్చున్న అమ్మవారిని దయగల దేవతగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్త్రీలు తమ కుటుంబాలు అభివృద్ధి చెందాలని, వారి భర్తలు విజయం, కీర్తిని పొందాలని ఉపవాసం ఉంటారు. ఈ పూజలో మంగళ గౌరీ దేవికి 16 రకాల కంకణాలు, 7 రకాల పండ్లు, 5 రకాల మిఠాయిలు నైవేద్యంగా పెట్టడం మొదటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. మంగళ గౌరీ ఆలయంలో శివుడు, దుర్గ, దక్షిణ–కాళి, మహిషాసుర మర్దిని, సతీదేవి వివిధ రూపాలను చూడవచ్చు. ఈ ఆలయ వివరణ పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, శ్రీ దేవి భాగవత పురాణం, మార్కండేయ పురాణాలలో కూడా ఉంది. ఈ ఆలయ సముదాయంలో కాళి, గణపతి, శివుడు, హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. ఆశ్వీయుజ మాసంలో జరిగే లక్షలాది మంది భక్తులు ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆలయానికి వస్తుంటారు.ఈ క్షేత్రంలోని ప్రసిద్ధ పండుగ ’నవరాత్రి’, ఇది అక్టోబర్‌లో జరుగుతుంది. ఈ మందిరం ‘మరణానంతర క్రతువులకు’ (శ్రాద్ధము) ప్రసిద్ధి చెందింది. ‘మహా–అష్టమి’ (ఎనిమిదవ రోజు), భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఈ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ మంగళ గౌరీ వ్రతం (వ్రతం), దీనిని మహిళలు తమ కోరికల సాఫల్యం కోసం చేస్తారు. మంగళవారాలలో ఉపవాసం ఉండి, స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, ఇతర వివాహిత స్త్రీలందరూ శ్రావణ మాసంలో మాత్రమే వ్రతం చేస్తారు. ఇవే కాకుండా, ఈ ఆలయంలో దీపావళి, హోలీ, జన్మాష్టమి వంటి ఇతర ప్రధాన పండుగలను కూడా బాగా జరుపుకుంటారు. ఆలయం ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఎలా వెళ్లాలి?గచ రైల్వే జంక్షన్ ఆలయానికి 4 కిమీ దూరం, బస్ స్టాండ్ ఆలయం నుండి 4.7 కిమీ దూరంలో ఉంది. -
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్‌కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్‌లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్‌గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్‌లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్‌పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్‌కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్. -
జాను, రామ్‌ల పెళ్లి ఫోటో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు
కోలీవుడ్ హిట్ సినిమా '96'లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఈ సినిమాలో వారిద్దరి చిన్ననాటి పాత్రలో నటించిన గౌరీ కిషన్, ఆదిత్య కూడా చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా హీరో,హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. చిన్నప్పటి త్రిషగా జాను పాత్రలో గౌరీ కిషన్ మెప్పిస్తే.. చిన్నప్పటి విజయ్ సేతుపతి 'రామ్' పాత్రలో ఆదిత్య కనిపించి ప్రేక్షకులను ఫిదా చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో గౌరీ కిషన్ సినిమాలు చేస్తోంది. టాలీవుడ్లో సుస్మిత కొణిదెల నిర్మించిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’లో కూడా ఆమె నటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆధిత్య కూడా కోలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి కోలీవుడ్‌లో 'హాట్ స్పాట్' అనే సినిమాలో నటించారు. తమిళంలో ఆ సినిమా నేడు (మార్చి 29) విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గౌరీ కిషన్ కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఆ ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ కోలీవుడ్‌లో నెట్టింట వార్తలు కూడా వచ్చేశాయ్. దీంతో నెటిజన్లు కూడా షాకయ్యారు. కొందరైతే ఏకంగా వారిద్దరికి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఆ ఫోటోలతో పాటు వారు ఇచ్చిన క్యాప్షన్ చూసిన కొందరు ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం అని చెప్పడంతో కాస్త ఆ ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. సినిమా సెట్స్‌లో తీసిన ఫోటోలు అని తేలడంతో ఇలాంటి షాకులు ఇస్తే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన హాట్ స్పాట్ ట్రైలర్ కూడా కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది. నేడు విడుదలైన ఈ సినిమా ఇంకెన్నీ వివాధాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) -
లక్ష సైనికుల కోటి కన్నుల కెమెరా!
నా చేతిలో కెమెరా ఉంటే నాకు భయమనేదే లేదు’ అనేది ఫొటోగ్రాఫర్ గౌరీ గిల్‌కు ఇష్టమైన మాట. ఈ కారణం వల్లే కావచ్చు ఆమె ఏ భయమూ లేకుండా మారుమూల పల్లెల నుంచి మహా అరణ్యాల వరకు వెళ్లింది. తన భుజాల మీద కెమెరా ఉంటే, తన చుట్టూ లక్షల సైన్యం ఉన్నట్లే. వర్తమాన చరిత్ర, సంస్కృతి, సంబరాన్ని తన కెమెరా కంటితో పట్టుకుంది గౌరీ గిల్. తన ఫొటో సిరీస్ ‘నోట్స్ ఫ్రమ్ ది డిజర్ట్’తో ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్ పిక్టెట్ అవార్డ్ గెలుచుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన మల్టీనేషనల్ ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పిక్టెట్ ‘ప్రిక్స్ పిక్టెట్’ (ఇంటర్నేషనల్ అవార్డ్ ఇన్ ఫొటోగ్రఫీ)కి 2008లో శ్రీకారం చుట్టింది... చండీగఢ్‌లో పుట్టిన గౌరి గిల్ దిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో బీఎఫ్ఏ చేసింది. న్యూయార్క్‌లోని ‘పార్సన్ స్కూల్ ఆఫ్ డిజైన్’లో ఫొటోగ్రఫీలో బీఎఫ్ఏ, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలో ఎంఎఫ్ఏ చేసింది. అమెరికా, ఇండియాలో ఉన్న బంధువులను ఫొటోలు తీయడంతో తన ప్రయాణం మొదలైంది. రాజస్థాన్‌లోని అట్టడుగు వర్గాల జీవితాలను అధ్యయనం చేసిన తరువాత తాను చేసిన ఫొటో ప్రాజెక్ట్ ‘నోట్స్ ఫ్రమ్ ది డెజర్ట్’కు మంచి పేరు వచ్చింది. ‘ది మార్క్ ఆన్ ది వాల్’ ‘జన్నత్’... మొదలైన ఎగ్జిబిషన్లు, ప్రాజెక్ట్‌లతో ప్రశంసలు అందుకుంది. నోట్స్ ఫ్రమ్ ది డెజర్ట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే... ఈ ప్రాజెక్ట్ కోసం రాజస్థాన్‌లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఒక్కొక్క అడుగు వేస్తూ అక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. సంచారుల నుంచి రైతుల వరకు ఎంతోమందితో మాట్లాడింది. కాలాలతో పాటు మారే వ్యక్తుల జీవితాలను గమనించింది. తాను పరిశీలించిన జీవితాల గురించి డైరీలో రాసుకుంది. ఆ తరువాత తన కెమెరా ప్రయాణం రాజస్థాన్ మారుమూల ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ఆదివాసుల ఇళ్ల దగ్గరకు చేరింది. వర్లీ ఆర్ట్‌ను ఒడిసిపట్టుకుంది. ఫలానా ఊళ్లో ఫలానా ప్రత్యేకత ఉందనే మాట చెవికి సోకగానే రెక్కలు కట్టుకొని అక్కడ వాలుతుంది. మోహడా అనే ఊళ్లో గ్రామస్థులు పురాణ పాత్రల మాస్క్‌లను ధరించి పెద్ద ఊరేగింపు తీస్తారు. ఈ మాస్క్‌లనే సబ్జెక్ట్‌గా తీసుకొని ఫొటోప్రాజెక్ట్ చేసింది. ఒకరోజు ఒక గ్రామంలోని పశువుల ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్ లేడు. అయితే ఆ డాక్టర్ సీట్లో దోమ మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి కూర్చున్నాడు. పేషెంట్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఏదో మాస్క్ పెట్టుకున్నాడు. ఆ ఆస్పత్రిలోని పాత సామాను, గోడలకు వేసిన రంగులు, ఆస్పత్రి చుట్టుపక్కల రకరకాల ఆవులు, వాటిని కాచుకు కూర్చున్న రైతులు... ఈ అంశాలన్నీ వచ్చేలా ఫొటోలు తీసింది. ఈ ఫోటోల నుంచి ఆలోచించిన వారికి ఆలోచించినన్ని కోణాలు కనిపిస్తాయి. ఎవరి వ్యాఖ్యానాలూ అవసరం లేకుండానే సమాధానాలు దొరుకుతాయి. మొదట్లో ఒక పక్షపత్రికలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసింది గౌరి. తన ఆసక్తి గ్రామాలు, మారుమూల పల్లెల్లోని స్కూళ్లపై ఉండేది. అయితే తన ఉద్యోగం ద్వారా పల్లెలకు వెళ్లే అవకాశం రాలేదు. దీంతో పల్లెబాట పట్టడానికి ఉద్యోగాన్ని వదిలింది. ఎన్నో స్కూళ్ల చుట్టూ తిరిగింది. ‘ఇది స్కూల్ కాదు. ఇదే అసలు సిసలు ప్రపంచం’ అనుకుంది. ‘ది మార్క్ ఆన్ ది వాల్’ ప్రాజెక్ట్‌తో ప్రభుత్వ పాఠశాలల్లోని గోడలపై ఉన్న రాతలు, చిత్రాలను డాక్యుమెంట్ చేసింది. ‘ట్రేసెస్’ పేరుతో సమాధులపై చేసిన ప్రాజెక్ట్ మరో అద్భుతం. నిజానికి గౌరీ గిల్ అద్భుతాలు సృష్టించడానికి కెమెరా పట్టుకోలేదు. భిన్న సంస్కృతులు, భౌగోళిక అందాలపై ఆసక్తే అద్భుతాలను సృష్టించి ఆమెను అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్‌ని చేశాయి. 2011లో కెనడాలోని ప్రతిష్ఠాత్మకమైన ఫొటోగ్రఫీ అవార్డ్ గ్రాంజ్ గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గౌరికి వినడం ఇష్టమైన పని. విన్న విషయాలను విశ్లేషించుకొని తన కెమెరాకు ముడిసరుకుగా మార్చుకోవడం మరింత ఇష్టమైన పని. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
రంగస్థలం ఏడు ప్రపంచాలు
అక్షరాల్లోని రచనలను రంగస్థలం మీదికి తీసుకురావడం తేలిక కాదు. ఎందుకంటే, రచన చదివేటప్పుడు పాఠకుల మదిలో ఎన్నో రంగస్థలాలు ఆవిష్కారం అవుతాయి. తమ ఊహలకు, రంగస్థలానికి చెలిమి ఏర్పడాలి. ఈ విషయంలో నాటక సమాజం ‘థియేటర్ నిషా’ విజయం సాధించింది. స్త్రీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రచనలు చేసింది ప్రసిద్ధ హిందీ రచయిత్రి గౌర్ పంత్ (శివానీ) ఇది ఆమె శతజయంతి సంవత్సరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంత్ కథలను నాటకంగా మలిచి ప్రదర్శిస్తోంది థియేటర్ నిషా... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించింది గౌర్ పంత్. పన్నెండు సంవత్సరాల వయసులో పంత్ తొలి కథ ఒక పిల్లల పత్రికలో ప్రచురిత మైంది. టాగూర్ ‘శాంతినికేతన్’లో చదువుకోవడం తనలోని సృజనను మెరుగుపెట్టుకోవడానికి కారణం అయింది. శివానీ కలం పేరుతో రాసిన ‘మై ముర్గా హూ’ కథకు ఎంతో పేరు వచ్చింది. ‘లాల్ హవేలి’ పేరుతో తొలి నవల రాసింది. ఆ తరువాత ఎన్నో కథలు, నవలలు రాసింది. అయితే ఆమె ఏది రాసినా స్త్రీ జీవితమే కేంద్రంగా ఉండేది. ఆ స్త్రీ తన కాల్పనిక ఊహాలోకం నుంచి దిగివచ్చిన స్త్రీ కాదు. తనకు పరిచయం ఉన్న స్త్రీలు, తాను చూసిన స్త్రీలు... ఇలా ఎందరో జీవితాల నుంచి ఎన్నో అద్భుతమైన పాత్రలు సృష్టించింది శివానీ. భర్త నుంచి హింసకు గురైన స్త్రీలు, అత్యాచార బాధితులు, కుటుంబ హింస బాధితులు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు... ఎంతోమంది బాధితులు ఆమె రచనల్లో కనిపిస్తారు. శివానీ కూతురు ఐరా పాండే తల్లి రాసిన కొన్ని కథలను ‘అపరాధి: ఉమెన్ వితౌట్ మెన్’ పేరుతో ఇంగ్లీష్‌లోకి తీసుకువచ్చింది. దీనికి రెండవ భాగం కూడా వచ్చింది. ‘అపరాధి’ రెండవ భాగంలోని కథలను థియేటర్ నిషా ‘బిన్ను’ పేరుతో నాటకీకరించింది. ఇందులో బిన్ను, నసీమ్, మిసెస్ ఘోష్, లలిత, పాగలియా, మధుబెన్‌తో పాటు ఒక తల్లి పాత్ర కూడా ఉంటుంది. ఏడుగురి జీవితాలు ఏడు ప్రపంచాలై కనిపిస్తాయి. బిన్ను నుంచి నసీమ్ వరకు ఎవరూ ఊహాల్లో పుట్టిన పాత్రలు కాదు. నిజజీవితంలోని మహిళలు. వారి జీవితాలను శివానీ దగ్గరి నుంచి చూసింది. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత, శైలి, పోరాటరూపం ఉంటాయి. ‘ఏడు పాత్రలను కలిపి నాటకానికి బిన్ను అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగితే ప్లే డైరెక్టర్ బాలక్రిష్ణన్ ఇచ్చిన సమాధానం ఇది... ‘శివానీ రచనల్లో నాకు బాగా నచ్చిన పాత్ర బిన్ను. అందుకే ఆ పేరు పెట్టాను. బిన్ను ఎక్కడా, ఎవరికీ తలవంచదు. పురుషులను సవాలు చేస్తుంది. అడ్డంకుల ముళ్లచెట్లను నరికేస్తూ ముందుకు వెళుతుంది. ఆమె స్వరంలో ధిక్కారం, వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం కనిపిస్తాయి’ కేరళ నాటకోత్సవాలలో భాగంగా థియేటర్ నిషా ప్రదర్శించిన ‘బిన్ను’ నాటకానికి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల్లో శివానీ రచనలతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారితోపాటు ఎంతమాత్రం పరిచయం లేని వారు కూడా ఉన్నారు. అయితే అందరికీ నాటకం నచ్చింది. ‘శివానీ రచనల గురించి తెలియని ఈ తరానికి బిన్ను నాటకం చూస్తే రచయిత్రి దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. శతజయంతి సంవత్సరంలో శివానీకి ఒక ఘనమైన నివాళిగా ఈ నాటకాన్ని చెప్పుకోవచ్చు’ అంటుంది సీమా అనే ప్రేక్షకురాలు. ‘బిన్ను’ నాటకంలో... -
నటిని కావాలనుకోలేదు, సమంతతో పోలుస్తున్నారు: గౌరి
‘‘శ్రీదేవి శోభన్‌బాబు’లో నేను చేసిన జాను పాత్ర మోడ్రన్‌గా ఉంటుంది’’ అని హీరోయిన్ గౌరి జి. కిషన్ అన్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గౌరి జి. కిషన్ మాట్లాడుతూ– ‘‘నేను నటిని కావాలనుకోలేదు. జర్నలిస్ట్ అవుదామనుకున్నా. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తమిళ మూవీ ‘96’ ఆడిషన్స్‌కి వెళ్లి సెలక్ట్ అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ‘ఏమాయ చేసావె’ టైమ్‌లో సమంత ఎలా ఉన్నారో ఇప్పుడు నేను అలా ఉన్నానని చాలామంది అన్నారు. ఆమెలా నాకూ అన్ని భాషల్లో నటించాలనుంది. ఇండస్ట్రీలో మహిళా రచయితలు తక్కువగా ఉన్నారు.. ఎక్కువమంది రావాలి. నేను కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నారు. -
ఉన్నచోటే ఉండిపోకండి కొత్తవి నేర్చుకోండి
గౌరికి నది ఇరుకై పోయింది. సముద్రంలోకి వెళ్లింది. నది అంటే న్యూఢిల్లీ లోని ‘ఎయిమ్స్’. అందులో డెంటిస్ట్ గౌరి. సముద్రం అంటే న్యూయార్క్‌లోని డబ్ల్యూ.ఎం.ఎస్.! పన్నెండేళ్లుగా పసిఫిక్ మహా సముద్రం లాంటి ఆ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇష్టంగా ఈతకొడుతూ ఉన్నారు గౌరీ. అందులోని అన్ని డిపార్ట్మెంట్ల పని నేర్చుకుని, అన్ని డిపార్ట్మెంట్లకు టీమ్ లీడర్‌గా చేశారు. ఆపరేషన్ మేనేజ్మెంట్, హెచ్.ఆర్., ట్రాన్సా్ఫర్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్.. అన్నీ నేర్చుకున్నారు. పసిఫిక్ సముద్రం అన్ని ఖండాలను టచ్ చేస్తూ ఉన్నట్లుగానే సముద్రం లాంటి తన కంపెనీలో అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు గౌరి. ప్రస్తుతం ఆమె ఆ కంపెనీలోనే హెల్త్ కేర్ విభాగానికి బిజినెస్ యూనిట్ లీడర్ గా ఉన్నారు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మనం నిరర్థకంగా ఒడ్డున పడ్డట్లేనని అంటారు గౌరి పురి. ఉన్నచోటే ఉండి పోవద్దంటారు. గౌరీపురి తన ఈడు పిల్లల్లో కాస్త భిన్నంగా ఉన్న అమ్మాయి. కనుక ఇప్పుడూ భిన్నంగానే ఉన్నారని అనుకోవచ్చు. పదేళ్ల వయసులోని ఆమె భిన్నత్వం గురించి మొదట తెలుసుకుందాం. పిల్లలు ఆటలు ఆడే వయసులో కిందపడటం, దెబ్బలు తగలడం, అప్పుడప్పుడు రక్తం వారి కంట పడటం సహజంగా జరిగేదే. అప్పుడు మిగతా పిల్లలు భయంతో కళ్లు మూసుకుంటే గౌరి మాత్రం ఏ మాత్రం బెదురు లేకుండా ఆ దెబ్బలు తగిలిన పిల్లలకు గాయం దగ్గర తుడిచి, శుభ్రం చేసేవారట. ‘‘ప్రాథమిక చికిత్స వంటిది అనుకోండి’’ అని ఇప్పుడా సంగతులను నవ్వుతూ గుర్తు చేసుకుంటారు గౌరి. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఉంటుంది వాళ్ల కుటుంబం. గౌరి అక్కడే పుట్టి పెరిగారు. 21వ యేట న్యూఢిల్లీలోని ‘ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్’లో డెంటల్ సర్జన్‌గా తనకో గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె అక్కడ పని చేసింది రెండున్నరేళ్లే. తర్వాత ఆర్నెల్లు సెలవు పెట్టి.. ‘నది కాదు నాకు కావలసింది, సముద్రం’ అని అనుకుని న్యూ ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లి డబ్లు్య.ఎన్.ఎస్. కంపెనీలో చేరిపోయారు! డబ్లు్య.ఎన్.ఎస్. అంటే వరల్డ్ నెట్వర్క్ సర్వీసెస్. బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్లు 1996లో ముంబైలో ప్రారంభించిన బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ అది. ప్రపంచం అంతటా బ్రాంచీలు ఉన్నాయి. గౌరి కోరుకున్నట్లుగా నిజంగా అది సముద్రమే. 2007లో అందులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. డెంటల్ సర్జన్కి బిజినెస్ మేనేజ్మెంట్తో ఏం పని? యూఎస్ మార్కెట్లో హెల్త్ క్లెయిమ్‌లను చక్కబెట్టడానికి వాళ్లకొక ఇండియన్ మెడికల్ డాక్టర్ కావలసి వచ్చింది. అక్కడ ఆమె 60 మంది డాక్టర్ల బృందాన్ని నడిపించాలి. గౌరి వెంటనే యూఎస్ విమానం ఎక్కేశారు. ఆ తర్వాత ఆమె కెరీర్ అంతా అంత ఎత్తులోనే ఎగురుతూ ఉంది. నేర్చుకోవడం ఆమెకు ఇష్టం. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఏ సబ్జెక్టునూ తనది కాదు అనుకోరు. అక్కడ టీమ్‌ని నడుపుతూనే ఆపరేషన్ థియేటర్స్ అని, బోర్డ్ రూమ్స్ అని లేకుండా అన్ని విభాగాల విధాన నిర్ణయాల గురించి తెలుసుకున్నారు. నిర్ణయ విధానాలను గమనించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా చేరగానే మొదట బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్‌ల నిర్వహణలో శిక్షణ తీసుకున్నారు. మూడేళ్లకే ఆ సముద్రం కూడా బోర్ కొట్టేసింది గౌరికి! సముద్రంలో ఇంకా తనకు తెలియని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని గాలించారు. డబ్లు్య.ఎన్.ఎస్. ఒక పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ అన్ని ఖండాలకూ వ్యాపించినట్లు డబ్లు్య.ఎన్.ఎస్. ఖండాంతర శాఖలుగా విస్తరించి ఉంది. పైగా గౌరికి ఒకే సీట్లో హాయిగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మన కెరీర్ అక్కడితో ఆఖరు అంటారు. తను చేస్తున్న పని చేస్తూనే ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో ఉన్న తమ కంపెనీ వ్యవహారాలను కూడా యూఎస్ నుంచే ఆమె నడిపించారు. రోజుకు కనీసం 18 నుండి 20 గంటలు పని చేస్తారు గౌరి. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ‘‘పనే నా శక్తి’’ అని నవ్వుతారు గౌరి. కష్టం ఊరికే పోతుందా? 2017లో ఆమెకు ఎవరూ ఊహించనంత పెద్ద ప్రమోషన్. డబ్లు్య.ఎన్.ఎస్.లోని హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ యూనిట్లకు ఆమె బిజినెస్ లీడర్ అయ్యారు! ఈ మూడేళ్లలో మళ్లీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హెచ్.ఆర్., ట్రాన్స్ఫార్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్లో పట్టు సాధించారు. గౌరి హెల్త్ కేర్ యూనిట్‌ను చేపట్టినప్పుడు 7 శాతం మాత్రమే ఉన్న ఆ విభాగం రాబడి ఇప్పుడు ఆమె నేతృత్వంలో 20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఆమె మొత్తం కలిపి 4 వేల మంది డాక్టర్లు, కోడర్స్, ఫార్మసిస్టులు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌ను లీడ్ చేస్తున్నారు! వారిలో ఒక్క సీనియర్ కూడా ఇప్పటివరకు ఆమె టీమ్ నుంచి వెళ్లిపోలేదు. ఎందుకు వెళ్లిపోతారు? ఆమె దగ్గర పని చేయడమంటే ఆమెతో సమానంగా పని చేయడమేనన్న గొప్ప గుర్తింపును పొందుతున్నప్పుడు! ‘‘కొత్త విషయాలను నేర్చుకోడానికి యువ వృత్తి నిపుణులు చిన్నతనంగా భావించకూడదు. నేర్చుకోవడం అన్నది నన్ను ఈ వయసులోనూ యవ్వనోత్సాహంతో ఉంచుతోంది.’’ – గౌరి పురి (38), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డబ్లు్య.ఎన్.ఎస్. -
కొంగలు, పిచ్చుకలు ఏ జాతయ్యా?
ఆ చీకట్లో గొడ్లసావిడి దగ్గరకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు పెద్దయ్య.‘‘రేయ్...గొడ్లకు నీళ్లు పెట్టారా లేదా?’’ఎటు నుంచి సమాధానం వినిపించడం లేదు.కాస్త ముందుకు వెళ్లి అక్కడున్న వ్యక్తిని చూసి...‘‘అదేమిటి ఉలుకూపలుకూ లేకుండా నిల్చున్నావు. ఎవరో అనుకుని నేను దడుచుకుచచ్చాను’’ అన్నాడు పెద్దయ్య.ఎల్లయ్య ముఖంలో విషాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.‘‘ఎందుకురా అలా ఉన్నావు?’’ అని అడగక ముందే... ‘‘నా పిల్ల కనబడటం లేదయ్యా’’ అన్నాడు. పిల్ల అంటే ఆయన కూతురు.‘‘పొద్దున్నే లేచి పొరుగూరి సంబంధం చూస్తానన్నావు!’’ అడిగాడు పెద్దాయన.‘‘అది ఉన్న ఊళ్లోనే మొగుడ్ని వెదుక్కుంది సామి’’ బాధగా అన్నాడు ఎల్లయ్య.‘‘ఉన్న ఊర్లోనే మొగుడ్ని వెదుక్కుందా? దాన్ని లేవదీసుకుపోయింది ఎవడో చెప్పు చెట్టుకు కట్టేసి చెప్పుతో కొడతాను’’ కోపంగా అన్నాడు పెద్దాయన.అతడు ఎవరో చెప్పకుండా ఎల్లయ్య మౌనముద్ర దాల్చాడు. ఆ మౌనంలో ఏదో భయం ఉంది.‘‘చెప్పరా?’’ అని గద్దించాడు పెద్దాయన.‘‘సామి! నా నోటి నుంచి ఆ మాట ఎలా చెప్పాలి?’’ అంటూనే ‘‘మీ మేనల్లుడు సిట్టయ్యండి. వాళ్లిద్దరూ కలిసి తిరగడం ఊరందరికీ తెలుసు. నా బిడ్డ వట్టి పిచ్చిదయ్యా. దానికి అన్నెంపున్నెం తెలియదు. అది పారిపోయి నెలతప్పి ఇంటికొస్తే ....’’ ఏడుపు ఆపుకుంటూ మనసులోని బాధని వెళ్లగక్కాడు ఎల్లయ్య.పెద్దయ్య కళ్లలో ఆశ్చర్యం.‘‘చొక్కాయికి బొత్తాలు కూడా పెట్టుకోలేని వెధవ అంత పెద్దవాడయ్యాడా. ఎల్లయ్యా...అలాంటిది ఏం జరగదు. నీ బిడ్డ భద్రంగా ఇల్లు చేరుతుంది పో’’ అంటూ పారిపోయిన జంటను వెదకడానికి బయలుదేరాడు పెద్దాయన. ‘‘ఒరేయ్ పుల్లయ్యా...’’ ‘‘ఏంటయ్యా ఇలా వచ్చారు?’’ ‘‘ఎల్లయ్య కూతురు కనిపించడం లేదు...’’ ‘‘దానికి మీరెందుకయ్యా నేను వెదుకుతాను’’పుల్లయ్య మాటతో సమాధానపడని పెద్దయ్య శరభయ్య ఇంటికి వెళ్లి...‘‘అరే శరభయ్యా...నీ స్నేహితుడు చిట్టయ్య ఆ ఎల్లయ్య కూతురిని ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పు’’ అని గద్దించాడు.‘‘నాకు తెలియదు’’ అని బుకాయించబోయాడు శరభయ్య.‘‘నరికిపోగులు పెడతాను’’ అని పెద్దాయన అరిచేసరికి శరభయ్య వణుకుతూ...‘‘యేటి పక్కకు తీసుకెళ్లాడయ్యా...అంతకుమించి నాకు ఏమీ తెలియదు’’ అని చెప్పాడు.‘‘అక్కడ లేకపోతే నీ సంగతి చెబుతా’’ అని బుసలు కొడుతూ యేటి దగ్గరికి బయలుదేరాడు పెద్దాయన.అక్కడేవో శబ్దాలు వినిపిస్తున్నాయి.‘‘చిట్టెయ్య...మీ మామ వస్తున్నాడు. దోనెలో దాక్కోండి...’’ అంటుంది గౌరి.పెద్దాయన దగ్గరకు రాగానే...‘‘ఈ యేళ ఇక్కడున్నరేమిటీ?’’ అడిగింది గౌరి.‘‘నేను అదే అడుగుతున్నాను. ఈ యేళ నీకు ఇక్కడేం పని?’’ గట్టిగా అడిగాడు పెద్దాయన.గౌరీ ఏదో చెప్పబోయిందిగానీ...అది అక్షరాలా అబద్ధమని తెలిసిపోతూనే ఉంది.గౌరి చెంప చెళ్లుమనిపించి....‘‘ఎవర్నే దోనెలో సాగనంపుతున్నావు? గుట్టుగా ఏరు దాటించి కాపురం చేయించడానికి అక్కడ ఏమైనా మేడ కట్టించావా!’’ అని గర్జించాడు పెద్దాయన.‘‘నన్ను ఏమైనా చేసుకోండి. నాకు బాధ లేదు. నన్ను కొట్టు చంపు...కానీ వాళ్లిద్దరినీ మొగుడు పెళ్లాలుగా అంగీకరిస్తేనే ఒడ్డుకు వస్తారు. లేకపోతే యేట్లో కొట్టుకుపోనీ.... వదలవయ్యా తాడు’’ అన్నది గౌరి.గౌరి మాటలు పట్టించుకోకుండా దోనె తాడును ఒడ్డు వైపు బలంగా లాగుతున్నాడు పెద్దాయన.అయినా గౌరి నోరు ఆగలేదు.‘‘వయసులో ఉన్నవాడు తనకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటే ఏమిటి తప్పు? వరుసైందని, డబ్బు చాలా ఉందని ఎవరినో ఒకరిని చేసుకుని బతికినంత కాలం వాన్ని ఏడ్వమంటావా.’’ అన్నది.గౌరి వైపు కోపంగా చూశాడు పెద్దాయన.‘‘నీకెందుకయ్యా ఉలుకు’’ అని గట్టిగా అంది గౌరి. పెద్దాయన కోపం నషాళానికి ఎక్కింది.‘‘ఏయ్ నోర్మోయ్...కడుపు చేత్తో పట్టుకుని తిరిగేవాళ్లకు కుటుంబ గౌరవం గురించి ఏం తెలుసే..’’ అని అరిచాడు. పెద్దయ్య మాటలకు గౌరి నొచ్చుకుంది.‘‘అవునయ్యా...మేము బతుకుదెరువు కోసం వొచ్చినోళ్లమే. పూరి గుడిసెలో పడుకున్నా, ఏటి ఒడ్డున పడుకున్నా పడుకోగానే నిద్ర పట్టే జాతయ్యా మాది. అంబలి తాగినా, జొన్న కూడు తిన్నా, మట్టి తిన్నా సరే...మళ్లీ ఆకలేసే జాతయ్యా మాది.కొంగలు, పిచ్చుకలు ఏ జాతయ్యా?అవి సంతోషంగా బతకడం లేదా!ఇంకా నయం రామచిలక,ఊరపిచ్చుక,గూడకొంగ అని జాతులు విడదీయలేదు. నీ కోపం కంటే ఏటి కోపం ఎక్కువ. తాడు వదిలేయ్’’ ఆవేశంగా అంది.‘ఏ వేదంబు పఠించె లూత?’ అన్నట్లు గౌరి ఏ వేదాలూ చదవలేదు. ఏ పుస్తకాలూ చదవలేదు. అక్షరజ్ఞానం లేని అమ్మాయి ఎంత లోతుగా మాట్లాడింది!యువజంట ఒడ్డుకు వచ్చి పెద్దాయన కాళ్ల మీద పడ్డారు. కోపంతో కత్తి పైకి లేపాడు పెద్దాయన. కానీ అప్పుడు ఆయన అంతరాత్మ చెవిలో ఇలాగొణికింది:‘‘ఏమాయ్య...నువ్వు నీ పెళ్లాంతో ఎలాగూ సుఖంగా లేవు. వాళ్లనైనా సుఖంగా కాపురం చేసుకోనివ్వు’’అంతే.. పెద్దయ్య బెట్టు చెదిరింది. అప్పుడే సన్నగా వర్షపు చినుకులు మొదలయ్యాయి.ఆచిన్నిచినుకుల్లో పెద్దాయన కోపం చల్లారి పోయింది. అతని పెదాలపై సన్నని నవ్వు. ఆ నవ్వు ఎన్నో చెబుతున్నట్టుగా ఉంది.‘చిన్నదానివైనా పెద్ద మాటలు చెప్పి చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకువచ్చావు’అప్పటి వరకు మంటలా చెలరేగిపోయిన పెద్దాయన మంచులా చల్లబడటంతో గౌరి కళ్లు చెమర్చాయి.‘‘నువ్వెంత కటువుగా మాట్లాడినా నీది చిన్నపిల్లాడి మనసు. రెండు మేకకూనలు వీడిపోతేనే బాధపడతావు...సిన్న పిల్లలు విడిపోతే ఊరుకుంటావా! ప్రాణాలు తీసే యముడి దగ్గర పాశం ఉంటుంది. శివుడి దగ్గర పాశం ఉంటుంది. నువ్వు శివుడివయ్యా...’’ పెద్దాయనను ఆకాశానికెత్తుతూఅన్నది గౌరి సంతోషంగా. -
మిథిలానగరి మైథిలమ్మలు
మిథియాంచల్! పెద్దగా వినని పేరు. కొద్దిగా మార్చి మిథిల అంటే.. అది మనకు బాగా పరిచయమున్న పేరే. ఈ మిథియాంచల్‌లో ‘మైథిలమ్మలు’ అడుగడుగునా కనిపిస్తారు. అందరూ సీతమ్మకు చెల్లెమ్మలే. మిథియాంచల్ మహిళల చేతి కుంచె నుంచి సీతమ్మవారు, ఆమె పాణిగ్రహీత రాముని రూపం రంగుల్లో మధుబని కళగా జాలువారుతుంటాయి. రామాయణ ఘట్టాలు అలవోకగా కాన్వాసుపై పరచుకుంటాయి. కళకు ప్రాణం గౌరీ మిశ్రా ఎంత గొప్ప కళ అయినా.. ఆ కళకు రాజపోషణ ఉన్నంత కాలమే మన్నుతుంది. ఆ కళాకారులకు అన్నం దొరికినంత కాలం బతికి బట్టకడుతుంది. మిథియాంచల్‌లో చేతిలో కళ ఉన్న కళాకారులున్నారు, వారసత్వంగా వస్తున్న కళను బతికించుకోవాలనే తపన ఉన్న వాళ్లూ ఉన్నారు. అయితే తమ చేతిలో ఉన్న కళ గొప్పదనం తెలియని తనం కూడా వారిలో ఎక్కువే. అలాంటి పరిస్థితిలో మధుబని పెయింటింగ్స్‌ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు గౌరీ మిశ్రా. ఆమె 1993లో ‘సేవ’ పేరుతో సంస్థను స్థాపించి మైథిలి మహిళలను ఒక గొడుగు కిందకు చేర్చారు. ‘‘మీ కళకు సమాజంలో గౌరవం ఉంది, ధైర్యంగా పని చేయండి’’ అని ఆ గ్రామీణ మహిళా హస్తకళాకారులకు ఇరవై ఏళ్ల పాటు భరోసా ఇచ్చారు. గౌరీ మిశ్రాకు వార్ధక్యం వచ్చేసింది. ఆ మధుబని మైథిలులకు అండగా నిలిచే వాళ్లు లేరు. వారికి మార్కెట్ నైపుణ్యాలు తెలియచేసి ఆ ఆర్ట్‌ను మోడరన్ సొసైటీకి దగ్గర చేసే ఓ మనిషి కావాలి. ఆ మనిషి మహిళ అయితే మంచిదనుకున్నారు గౌరీ మిశ్రా. మనవరాలికి వారసత్వం 2010 సంవత్సరం. ఓ రోజు మనవరాలు ఐహితశ్రీ శాండిల్యను మిథియాంచల్‌కు తీసుకెళ్లారు గౌరీమిశ్రా. ఐహిత కురుక్షేత్ర ఎన్ఐటిలో చదివింది. అప్పటికి ఐబిఎమ్లో ఉద్యోగం చేస్తోంది. తన మనసులో మాట ఏమీ చెప్పకుండా తనకు తోడుగా రమ్మని తీసుకెళ్లారు గౌరీమిశ్రా. ఆ అమ్మాయికి మధుబని కళ లోతుల్ని చూపించారు. కళాకారుల చేతిలోని గొప్పతనం గురించి చెప్పారు. మధుబని చిత్రలేఖనంలో బొమ్మ గీయడం, రంగులు వేయడం అంతా కుంచెతోనే. స్కేలు, పెన్సిల్ వంటివి వాడరు. వలయాకారాన్ని గీయడానికి కనీసం చేతి గాజునైనా ఆసరాగా తీసుకుంటారేమోనని చూసింది ఐహిత. అలాంటిది కూడా లేదు! కుంచెతోనే వలయాకారాన్ని గీసేస్తున్నారు. దాని వెనుక ఎన్నేళ్ల సాధన దాగి ఉందోనని ఆశ్చర్యపోవడం ఐహిత వంతయింది. ఇరవై ఏళ్లు శ్రమించి పదిహేను వేల మందిని ఒక చోటుకు తెచ్చి, ఉపాధికి నమ్మకం కల్పించిన విషయాన్ని మనవరాలికి గుర్తు చేశారు గౌరీమిశ్రా. తన తర్వాత వాళ్లకు ఒక ఆలంబన కోసం ఎదురు చూస్తున్నానని కూడా ఆ సందర్భంలోనే చెప్పారు. ఆ వచ్చే వ్యక్తి.. మధుబని కళ గొప్పతనాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉండాలి. మహిళల నైపుణ్యానికి పదును పెడుతూ, మార్కెట్ కోరుకునే డిజైన్లను ఈ ప్రక్రియలో మేళవించగలిగిన ఆసక్తి కూడా ఉన్న వ్యక్తి అయితేనే ఈ సామ్రాజ్యం నిలుస్తుందని చెప్పారు. తాను రంగంలోకి దిగినప్పటి పరిస్థితిని, ఆ తర్వాత వచ్చిన మార్పులను కూడా వివరించారు. కాలం వెనుక మధుబని మధుబని ఆర్ట్ గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లో తొలి ఎన్‌జివోను స్థాపించారు గౌరీమిశ్రా. దళారులను తప్పించి ప్రభుత్వ సంస్థలతో కలిసి హస్తకళాకారుల చేత ఎగ్జిబిషన్లలో స్టాళ్లు పెట్టించారు. అనేక మంది ఈ కళను నేర్చుకోవడానికి వేదిక కల్పించారు. ఆ కళకు తగినంత ఆదరణ వచ్చిన తర్వాత, మార్కెట్లో గిరాకీ పెరగడంతోపాటు నకిలీ కళాకృతుల తయారీ కూడా మొదలైంది. చేత్తో వేసే మధుబని డిజైన్ని డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో ప్రింట్ చేస్తున్నారు. అవి తక్కువ ధరకు దొరుకుతాయి. కళను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలంటే, టెక్నాలజీ తెలిసిన కొత్త తరంతోనే సాధ్యమని కూడా గౌరీ మిశ్రా తన మనవరాలికి చెప్పారు. ‘అస్మిత’తో కొత్త కళ! 2012లో ఐహిత ఐబిఎమ్లో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చింది. ‘మధుబని అస్మిత’ పేరుతో మైథిలి మహిళలకు అండగా నిలుస్తానని నానమ్మతో చెప్పింది. ఈ ఐదేళ్లలో ఐహిత మధుబని కళను విదేశాలకు పరిచయం చేసింది. మ్యూజియం పార్ట్నర్షిప్లో భాగంగా న్యూయార్క్‌లోని రుబిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, ముంబయిలోని జీవీకే జయహే మ్యూజియం స్టోర్, బెంగళూరు ఫోక్‌ఆర్ట్ గ్యాలరీలలో ఈ మైథిలీ కళను ప్రదర్శించింది. ఇప్పుడు నెలలో పది రోజులు ఢిల్లీ, చెన్నై, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌లలో ప్రదర్శనల కోసం పర్యటిస్తోంది. టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, ఎమ్ఎస్ఎమ్ఈ వంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి పని చేస్తోంది. అలాగే స్టాల్లో అడిగిన వారికి, అడగని వారికి కూడా అసలైన మధుబని హస్తకళాఖండానికి, నకిలీ ప్రింట్‌కి తేడాను వివరించగలుగుతోంది.మధుబని మన సంస్కృతిలో భాగం. సంస్కృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనడానికి ఈ మైథిలమ్మలే ఉదాహరణ అంటోంది ఐహిత. మైథిలమ్మలు బిహార్ రాష్ట్రంలో ఉత్తర భాగాన ఓ మారుమూల ప్రదేశం మిథియాంచల్. ఇక్కడి మహిళలను మైథిలి అంటారు. మనకు తెలిసిన మైథిలి సీతమ్మ ఒక్కటే. ఇక్కడి మైథిలమ్మలంతా తప్పనిసరిగా సీతారాముల కల్యాణం ఘట్టాన్ని చిత్రించడం నేర్చుకుంటారు. ఈ చిత్రలేఖన ప్రక్రియను మధుబని అని పిలుస్తారు. -
నాయకుడంటే జగనే..
ప్రజల బాగు కోసం నిరంతరం పరితపిస్తున్నారు వైఎస్సార్ సీపీ మహిళానేత, మాజీ కార్పొరేటర్ గరికిన గౌరి విశాఖపట్నం : ప్రజల కోసం నిరంతరం పరితపిస్తుంటారు.. ప్రజల తరపున ప్రభుత్వంపై నిత్యం పోరాడుతున్నారు.. నాయకుడంటే జగనే.. ఆయన నాయకత్వంలో ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీలో చేరాను’’ అని మాజీ కార్పొరేటర్ గరికిన గౌరీ అన్నారు. తన సహచరులతో కలసి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరిన విషయం విదితమే. సోమవారం ఆమె ’సాక్షి’తో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డానని, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని పార్టీలో చేరానని వివరించారు. తనతోపాటు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వార్డు అధ్యక్షురాలు గాలి పార్వతి, యువజన కాంగ్రెస్ నాయకుడు గరికిన కొండబాబు , మైనార్టీ సెల్ ప్రతినిధి భరతుల్లాల, పలువురు కార్యకర్తలు నడిచి వచ్చారని చెప్పారు. మరికొంత మంది వైఎస్సార్ సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. -
స్కూల్ బస్సు - బైక్ ఢీ.. మహిళ మృతి
వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకంది. కడప నుంచి చెన్నూరు వెళ్తున్న స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుభాషిణి(28) అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు గౌరి(5)కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం
లక్షలు కుమ్మరించినా తనయుడికి జబ్బు నయం కాలేదు. క్యాన్సర్ మహమ్మారితో తమ బిడ్డ అనుభవిస్తున్న నరకాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఇక బతుకు వద్దనుకున్నారు. తనయుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడులోని వ్యాసార్పాడిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సాక్షి, చెన్నై: వ్యాసార్పాడి గోపిఖాన్ వీధికి చెందిన కమల కణ్ణన్(54), గౌరి(48) దంపతుల తనయుడు సతీష్‌కుమార్(24). బతుకు తెరువు వెతుక్కుంటూ వచ్చిన కమల కణ్ణన్‌ను మద్రాసు నగరం ఆదరించింది. ఎంకేబీ నగర్లో ఓ జ్యూస్ షాపును నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. బిడ్డను బాగా చదివించాడు. కొడుకు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేదు. అయితే ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే సతీష్‌కుమార్ బోన్ క్యాన్సర్ బారిన పడడం ఆ కుటుంబాన్ని కలచి వేసింది. సతీష్‌కుమార్‌ను కాపాడుకునేందుకు కమలకణ్ణన్, గౌరి దంపతులు ఎంతో శ్రమించారు. చూపించని ఆస్పత్రి అంటూ లేదు. సుమారు రూ.20 లక్షల రూపాయలు కుమ్మరించినా ఫలితం కనిపించలేదు. తనయుడు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుండడాన్ని చూస్తూ తల్లడిల్లారు. ఇక బతుకుపై ఆశ వదులుకున్నారు. ఆత్మహత్య కమల కణ్ణన్ శుక్రవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి చేరుకున్నాడు. తనయుడు పడుతున్న బాధను చూసి తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. భార్య గౌరి, తనయుడు సతీష్‌తో మాట్లాడి ఇక ఈ బతుకు మనకొద్దు అన్న నిర్ణయానికి వచ్చేశారు. ముగ్గురు కలిసి వేర్వేరు నైలాన్ తాళ్లతో ఫ్యాన్‌కు ఉరి పోసుకుని చనిపోయూరు. క్యాన్సర్ మింగేసింది కమలకణ్ణన్ నివసిస్తున్న ప్రదేశానికి కూత వేటు దూరంలో ఆయన సోదరుడు రామకృష్ణ ఉంటున్నారు. అన్నయ్య ఇంటి వైపుగా రామకృష్ణ శనివారం ఉదయం వచ్చాడు. ఇంటి తలుపుకు గడియ పెట్టకుండా ఉండడంతో లోపలకు వెళ్లాడు. అక్కడ అన్న, వదిన, సతీష్‌లు ముగ్గురు ఉరి పోసుకుని వేలాడుతుండడంతో బోరున విలపించేశాడు. ఇంతలో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సెంబియం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో జరిపిన తనిఖీల్లో కమలకణ్ణన్ రాసి పెట్టిన లేఖ బయట పడింది. క్యాన్సర్ మహమ్మారితో తమ బిడ్డ అనుభవిస్తున్న నరకాన్ని చూసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణరుుంచుకున్నట్లు లేఖలో ఉంది. -
మధ్యతరగతి మహిళగా...
సినిమా పరిశ్రమలో ఎవరైనా సుదీర్ఘ విరామం తీసుకుని, మళ్లీ సినిమాలు చేస్తే ‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటారు. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమా చేసినప్పుడు అందరూ అలానే అన్నారు. కానీ, శ్రీదేవి మాత్రం అలా అంటే ఒప్పుకోరు. ‘‘ఇన్నేళ్లూ నేను తెరపై కనిపించకపోయినప్పటికీ, నా భర్త నిర్మించిన సినిమాల్లో తెర వెనుక పాత్ర పోషించాను. సినిమా వేడుకలకు కూడా హాజరయ్యేదాన్ని. కాబట్టి, సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అవుతుంది?’’ అన్నారు శ్రీదేవి. ఏదేమైనా ఆమె మళ్లీ వెండితెరపై కనిపించినందుకు అభిమానులు ఆనందపడిపోయారు. అలాగే, దర్శకురాలిగా తొలి చిత్రం అయినప్పటికీ ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ని అద్భుతంగా తెరకెక్కించి, భేష్ అనిపించుకున్నారు గౌరీ. శ్రీదేవి, గౌరీ కలిసి మరో సినిమా చేయనున్నారని సమాచారం. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో చూపించినట్లుగా ఇందులోనూ శ్రీదేవిని మధ్యతరగతి మహిళ పాత్రలోనే ఆవిష్కరించనున్నరట గౌరీ. అయితే, ఇది ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కి సీక్వెల్‌కి కాదని బాలీవుడ్ టాక్.