మధ్యతరగతి మహిళగా... | Sridevi teams up with Gauri Shinde again | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి మహిళగా...

Published Thu, Apr 3 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

మధ్యతరగతి మహిళగా...

మధ్యతరగతి మహిళగా...

సినిమా పరిశ్రమలో ఎవరైనా సుదీర్ఘ విరామం తీసుకుని, మళ్లీ సినిమాలు చేస్తే ‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటారు. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమా చేసినప్పుడు అందరూ అలానే అన్నారు. కానీ, శ్రీదేవి మాత్రం అలా అంటే ఒప్పుకోరు. ‘‘ఇన్నేళ్లూ నేను తెరపై కనిపించకపోయినప్పటికీ, నా భర్త నిర్మించిన సినిమాల్లో తెర వెనుక పాత్ర పోషించాను. సినిమా వేడుకలకు కూడా హాజరయ్యేదాన్ని. కాబట్టి, సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అవుతుంది?’’ అన్నారు శ్రీదేవి. ఏదేమైనా ఆమె మళ్లీ వెండితెరపై కనిపించినందుకు అభిమానులు ఆనందపడిపోయారు. అలాగే, దర్శకురాలిగా తొలి చిత్రం అయినప్పటికీ ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ని అద్భుతంగా తెరకెక్కించి, భేష్ అనిపించుకున్నారు గౌరీ. శ్రీదేవి, గౌరీ కలిసి మరో సినిమా చేయనున్నారని సమాచారం. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో చూపించినట్లుగా ఇందులోనూ శ్రీదేవిని మధ్యతరగతి మహిళ పాత్రలోనే ఆవిష్కరించనున్నరట గౌరీ. అయితే, ఇది ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కి సీక్వెల్‌కి కాదని బాలీవుడ్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement