
PM Narendra Modi AP Tour Updates
వెలగపూడి:
02-05, 5.10 PM
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ
- మీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉంది
- ఏపీకి కేంద్రం సంపూర్ణం సహకారం అందిస్తుంది
- మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం
- ఏపీలో కనెక్టవిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది
- కనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు లబ్ధి
- దీంతో రవాణా రంగం అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుంది
- రైల్వే బడ్జెట్ లో ఏపీ వాటా 10 రెట్లు పెరిగింది
- కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది
- రూ. 9 వేల కోట్లకు పైగా ఏపీకి కేటాయిస్తున్నాం
- ఏపీలో వందశాతం రైల్వేల విద్యుదీకరణ జరిగింది
- మౌలిక సదుపాయాల కల్పనతో ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నాం
- నిర్మాణ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి
- గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు నిర్మించాం
- ఏపీకి వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాం
- హైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుంది
- పంట బీమా యోజన కింద రైతులకు ఇప్పటివరకూ రూ. 5,500 కోట్లు ఇచ్చాం
- అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తాం
- జూన్ 21 యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఏపీకి వస్తా
- నాగాయలంక క్షిపణి కేంద్రంతో దేశ రక్షణకు కొత్త శక్తి వస్తుంది
- యూనిటీ మాల్ తో స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి
- యూనిటీ మాల్ లో హస్త కళాకారుల ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉంటాయి
- రైతుల వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది
- పథకాలు, పరిహారం కింద రైతులకు రూ. 17 వేల కోట్లు ఇచ్చాం
- పీఎం సమ్మాన్ నిధి ద్వారా రైతులకు సాయం చేస్తున్నాం
02-05, 4.55 PM పలు ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపనలు
వేదికపై నుంచి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేసిన మోదీ
మొత్తం 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు
- అమరావతిలో రూ. 49 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారం
- రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపనలు
- రాజధాని సహా రూ. 58 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు
02-05, 2:50PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ,. ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు.
అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెలగపూడి సభా ప్రాంగణానికి బయల్దేరి వెళ్లారు. పలు కేంద్ర ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్ట్ లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
భారీ భద్రత ఏర్పాట్లు..
ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. అమరావతిలోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాలను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది.
