Sri Sathya Sai
-
పశువుల నీటి తొట్టెల నిర్మాణం పూర్తి చేయాలి
పుట్టపర్తి అర్బన్: వేసవి తీవ్రమవుతున్న తరుణంలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన.. పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో పశువుల నీటి తొట్టెకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాకు 1,362 నీటి తొట్టెలు మంజూరయ్యాయన్నారు. డ్వామా ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. వేసవిలో పశువులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రామంలో అందరి సహకారంతో అనువైన చోట నీటి తొట్టెను నిర్మించాలన్నారు. ఒక్కో నీటి తొట్టెకు ప్రభుత్వం ‘ఉపాధి హామీ’ ద్వారా రూ.33 వేలు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, పశు సంవర్ధక శాఖ అధికారి శుభదాస్, డీపీఓ సమత, పలువురు అధికారులు పాల్గొన్నారు. హంద్రీ–నీవా కాలువకు గండిసోమందేపల్లి: హంద్రీ–నీవా కాలువకు గండి పడింది. మంగళవారం తెల్లవారుజామున మండల పరిధిలోని కాలువ కట్ట తెగిపోయింది. దీంతో నీరంతా వృథాగా పొలాల్లో పారింది. నీటి ఉధృతి ఎక్కువ కావడంతోనే కట్ట తెగినట్లు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న హంద్రీ–నీవా అధికారులు అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ‘డైట్’ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంపుట్టపర్తి టౌన్: బుక్కపట్నంలోని విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న 17 అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిప్యూటేషన్ పద్దతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జెడ్పీ స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు, ఎంఈఓలు అర్హులు. జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ ఐదేళ్ల పైబడిన సర్వీసు కలిగిన 58 సంవత్సరాల్లోపు వయసున్న వారు, ఈ నెల 10 తేదీ లోపు అనంతపురంలోని డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 16, 17 తేదీల్లో రాత పరీక్ష, 19న మౌఖిక పరీక్షలు నిర్వహించి జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు డైట్ కళాశాల ప్రినిపాల్‌ను సంప్రదించవచ్చు. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ధర్మవరం వాసిధర్మవరం అర్బన్: జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో ధర్మవరానికి చెందిన కార్తీక్నాయక్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మంగళవారం కార్తీక్ నాయక్‌ను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని బాస్కెట్‌బాల్ కోర్టులో ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి అభినందించారు. జాతీయ స్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు చిత్తూరులో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారని, ఈ శిక్షణలో రాణించి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ధర్మాంబ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్‌తుల్లా, కోచ్ సంజయ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీడీ నాగేంద్ర పాల్గొన్నారు. -
గంజాయిని సిగరెట్లో ఉంచి పీల్చినప్పుడు వెలువడే పొగతో ఘాటైన వాసన వెలువడి అందరికీ తెలిసిపోతుంది. దీంతో అందరి దృష్టి తమపై పడుతుందని భావిస్తోన్న యువత... ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. ఫలితంగా జిల్లాలోని మందుల దుకాణాల్లో మత్తును కలిగించే ఔషధాల విక్రయం పెరిగి
● మత్తు కోసం కొత్త పంథాను ఎంచుకున్న యువత ● గంజాయి, హెరాయిన్‌కు ప్రత్యామ్నాయంగా మెడికల్ స్టోర్‌లో దొరికే మందుల వినియోగం ● యువత బలహీనతలపై మెడికల్ స్టోర్ నిర్వాహకుల అక్రమ దందా ● ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు కలిగించే మందుల విక్రయాలు హిందూపురం టౌన్: మత్తు కోసం యువత అడ్డదారులు తొక్కుతోంది. మందుల దుకాణంలో దొరికే సాధారణ రుగ్మతలు, శస్త్రచికిత్స చేసిన తర్వాత, అత్యవసర సమయాల్లో వినియోగించే ఔషధాలను విచ్ఛలవిడిగా వాడుతూ మత్తుకు బానిసవుతోంది. యువత బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మెడికల్ స్టోర్ నిర్వాహకులు మాదకద్రవ్యాలు కాని ఇలాంటి మందుల విక్రయాలతో అక్రమ సంపాదనకు తెరతీశారు. డాక్టర్స్ ప్రిస్కిప్షన్ లేకుండానే మత్తు కలిగించే మాత్రలు విక్రయిస్తుండడంతో చాలా మంది యువకులు వాటిని వినియోగిస్తూ మత్తులో మునకలేస్తున్నారు. మద్యపానానికి, గంజాయికి ప్రత్యామ్నాయంగా రసాయనాలు, జెల్లు, మాత్రల వినియోగం ఇటీవల జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతోంది. మచ్చుకు కొన్ని.. ● హిందూపురంలోని శంకర్ మెడికల్స్‌లో గత ఏడాది డిసెంబర్ 21న డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న, డీఎస్పీ మహేష్, సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఇవ్వకూడని మందులను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రిస్కిప్షన్ లేకుండా అమ్ముతున్న ప్రాస్మో ప్రాక్స్ మందులను గుర్తించి సీజ్ చేశారు. ● ఈ నెల 21న డ్రగ్ ఇన్స్పెక్టర్, విజిలెన్స్ అధికారులు హిందూపురంలోని పలు మెడికల్ స్టోర్లలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నిద్రమాత్రలు, నొప్పి తగ్గించే మాత్రలను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న మూడు మెడికల్ షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రిస్కిప్షన్ లేకుండానే విక్రయాలు హిందూపురం పట్టణంలో సుమారు 160కు పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వీటిలో చాలా వాటిలో డాక్టర్ ప్రిస్కిష్పన్ లేకుండానే మందులను విక్రయిస్తున్నారు. కొన్ని మెడికల్ షాపుల్లో అయితే ఓ వ్యక్తి తనకు ఫలానా సమస్య ఉందని చెబితే చాలు వారే డాక్టర్లుగా మారి మందులను అంటకడుతున్నారు. ఇలాంటి వ్యవస్థీకృత ముఠాలు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మత్తును కలిగించే మందులు, ట్రమడాల్, ఆల్ఫ్రాజోలమ్, ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్, నిద్రమాత్రలు తదితర మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా దొరుకుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీల్లో వెల్లడైంది. ముఖ్యంగా స్పాస్మో ప్రాక్సివాన్ ప్లస్ మాత్రలను యువత ఎక్కువగా కొనుగోలు చేస్తూ మత్తు కోసం వాడుతున్నట్లు సమాచారంసంసారానికి పనికి రారు మత్తును కలిగించే మాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తే యువతలోని సహజ శక్తిసామర్థ్యాలు సన్నగిల్లుతాయి. రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. ముఖ్యంగా సంసారానికి పనికిరాకుండా పోతారు. దుష్పరిణామాలపై ఎలాంటి అవగాహన లేకుండా మందులు ఉపయోగిస్తే ప్రాణాలతో చెలగాటమాడినట్లవుతుంది. వైద్యుల సలహా లేనిదే ఏ మాత్రలనూ వాడకూడదు. – డాక్టర్ శివకుమార్, ప్రభుత్వాస్పత్రి వైద్యుడు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు కలిగించే టాబ్లెట్లు, సిరప్‌లను విక్రయించే మెడికల్ షాప్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టి కొన్నింటిని సీజ్ చేశాం. మరి కొందరికి నోటీసులు జారీ చేశాం. మత్తు కలిగించే మాత్రలు, ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్‌ను, శాంపుల్ డ్రగ్‌ను అమ్మరాదు. – హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్, హిందూపురం ఇన్చార్జ్ -
ఎండలకు రాలేం సారూ
పుట్టపర్తి: భానుడి భగభగలతో జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కుకు చేరుకుంటున్నాయి. ఉదయం 10 తర్వాత కాలు బయటపెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్ బోర్డు విద్యార్థులను ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకుంది. ఏటా జూన్‌లో ప్రారంభించే సెకండ్ ఇంటర్ తరగతులను ఈసారి ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభించింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు ఒక్కరూ రాలేదు సెకండ్ ఇంటర్ తరగతులను ప్రభుత్వం మంగళవారం అట్టహాసంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా జిల్లాలో ఒక్కరంటే ఒక్కరూ తరగతులకు హాజరు కాలేదు. జిల్లాలో 70 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 42 ప్రైవేట్ కళాశాలలు ఉండగా... 13,083 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు. అయితే తీవ్రమైన ఎండలు, మంగళవారం సెంటిమెంట్ నేపథ్యంలో తొలిరోజు చాలా కళాశాలలు కూడా తెరుచుకోలేదు. కళాశాలల్లో సౌకర్యాలు ఎక్కడ? వేసవిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ ఇంటర్ తరగతులు ప్రారంభించిన ప్రభుత్వం కళాశాలల్లో కనీస సౌకర్యాలపై మాత్రం దృష్టి సారించలేదు. చాలా కళాశాలల్లో ఇప్పటికే ఫర్నీచర్ కొరత వేధిస్తోంది. ఇక తాగునీరు, ఫ్యాన్ లాంటి సౌకర్యాలు ఎన్ని కళాశాలల్లో ఉన్నాయో ఇంటర్ బోర్డు అధికారులకే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా హడావుడిగా తరగతులు ప్రారంభించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఏ రాష్ట్రంలోనైనా కళాశాలలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయా.. అని ప్రశ్నిస్తున్నారు. సెకండ్ ఇంటర్ తరగతులు ప్రారంభం తొలిరోజు ఒక్కరూ హాజరుకాని వైనం చాలా ప్రాంతాల్లో తెరచుకోని కళాశాలలు సర్కారు నిర్ణయంపై భగ్గుమంటున్న తల్లిదండ్రులు జూన్ నుంచి ప్రారంభించాలి మేం మొదటి సంవత్సరం పరీక్షలు రాసి 15 రోజులు కూడా కాలేదు. అప్పుడే సెకండ్ ఇంటర్ తరగతుల ప్రారంభించడం సరికాదు. ఎండలు మండుతున్న తరుణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు చాలా దారుణం. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి. – పవన్, సెకండ్ ఇంటర్ విద్యార్థి, బుక్కపట్నం కార్పొరేట్ కళాశాలల లబ్ధికే వేసవిలోనే తరగతులు ప్రారంభించడం వల్ల నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు ఇబ్బందులు ఉండవు. అందుకోసమే ప్రభుత్వం ఇంటర్ తరగతుల నిర్వహణ చేపట్టింది. ఇందుకోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. – అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ ఎస్‌యూ -
రైతుకు తీరని అన్యాయం
రబీ పంటలన్నీ తుడిచిపెట్టుకు పోయినా జిల్లాకు చెందిన రెండు మండలాలనే కరువు జాబితాలో చేర్చడం అన్యాయం. ఈ ప్రభుత్వానికి రైతులపై కరుణ కలగలేదు. పంట నష్టాన్ని అంచనా వేయడంలో శాసీ్త్రయత లోపించింది. కూటమి సర్కార్ ఇంతవరకూ రైతులకు ఎలాంటి సాయం అందించలేదు. ఎన్నికల హామీలైన అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అందజేయలేదు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై రైతాంగాన్ని సమీకరించి ఉద్యమిస్తాం. – అడపాల వేమనారాయణ, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, పుట్టపర్తి -
వర్గకక్షలకు ఆజ్యం పోసిన అధికారులు
పుట్టపర్తి అర్బన్: టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ప్రశాంత గ్రామంలో వర్గ కక్షలకు ఆజ్యం పోశారు. ఏకపక్ష నిర్ణయాలతో ఓ వర్గానికి వత్తాసు పలకడం వివాదాస్పందమైంది. వివరాలు.. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు గ్రామంలోని చెరువులో చేపల పెంపకాన్ని చేపట్టి వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామంలో మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేసి 41 మందిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఇందులో ఒకే కులానికి చెందిన టీడీపీ కార్యకర్తలతో పాటు వైఎస్సార్సీపీ సానుభూతిపరులూ ఉన్నారు. ఇటీవల చెరువులో రెండు వర్గాలకు చెందిన సభ్యులు చెరువులో చేప పిల్లలను వదిలారు. ప్రస్తుతం చేపలు పట్టడానికి అనువుగా ఉండడంతో రెండు రోజుల క్రితం పూజలు నిర్వహించి చేపల వేటను ప్రారంభించారు. ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇది కాస్త వివాదానికి దారితీయడంతో మత్స్యకార సహకార సంఘం అధికారులు, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. హైడ్రామాకు తెరతీసి చేపలను టీడీపీకి చెందిన 25 కుటుంబాల వారు మాత్రమే పడతారని నిర్ణయించారు. అప్పటి నుంచి తమ కళ్ల ముందే చేపలన్నింటినీ టీడీపీ సభ్యులు పట్టుకుని వెళుతుంటే మిగిలిన మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. దీనిపై బాధితులు కలెక్టర్‌కు, సహకార సంఘం అధికారికి ఫిర్యాదు చేయడానికి వెళితే.. అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి వెనుదిరిగారు. గతంలోనూ అధికారులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఇబ్బంది పెట్టినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘మీ మేలు మరువలేం’
కదిరి అర్బన్: తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాము జీవితాతం గుర్తు పెట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మణికాంత్, కార్యదర్శి లింగాల కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రెగ్యులరైజ్ చేసి ఏడాది గడిచిన సందర్భంగా వారు మంగళవారం ఓ ప్రకటనలో వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమకు న్యాయంగా దక్కాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీం, నోషనల్ ఇంక్రిమెంట్లను అందజేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఫారం పాండ్లు నిర్మించుకోండి పెనుకొండ రూరల్: పంటల సాగుకు దోహదపడే ఫారం పాండ్ల నిర్మాణానికి రైతులు ముందుకు రావాలని జిల్లా ప్రత్యేకాధికారి హరినారాయణ పిలుపునిచ్చారు. పెనుకొండ మండలం రాంపురంలో ఉపాధీ హమీ పథకం కింద చేపట్టిన ఫారం పాండ్, మినీ గోకులాల పనులను మంగళవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. సాగుభూములును సారవంతం చేయడంలోను, ఏటా రైతులు విభిన్న పంటల సాగు చేపట్టేలా ఫారం పాండ్లు దోహదపడతాయన్నారు. అనంతరం రాంపురం గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, ఆర్డీఓ ఆనంద్‌కుమార్, డ్వామా పీడీ నరసయ్య, సెరికల్చర్ జేడీ పద్మావతి, తహసీల్దార్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. యువకుడిపై టీడీపీ కార్యకర్తల దాడి పుట్టపర్తి అర్బన్: మండలం వెంగళమ్మచెరువులో ఓ యువకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన మేరకు.. గతంలో గ్రామంలో టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఓ పంచాయితీలో అదే గ్రామానికి చెందిన వడ్డె బాలాజీ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అనుకూలంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకుల కక్ష కట్టి మంగళవారం సాయంత్రం బాలాజీ ఇంటి తలుపులు బద్ధలుగొట్టి లోపలకు చొరబడి చితకబాదారు. కుటుంబసభ్యుల కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని టీడీపీ నాయకులకు సర్దిచెప్పి పంపారు. ఘటనలో బాలాజీకి మూగదెబ్బలు తగిలాయి. బాధితుడి సమాచారంతో పుట్టపర్తి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. -
చౌడేశ్వరీ.. నమోస్తుతే
హిందూపురం: మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వరీ దేవి రథోత్సవం మంగళవారం కమనీయంగా సాగింది. ఏటా ఉగాది పండుగ అనంతరం అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం అనవాయితీ సాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన అమ్మవారి రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిమంది తరలివచ్చారు. దీంతో కొటిపి గ్రామం కిక్కిరిసింది. సారె సమర్పించి...మొక్కులు తీర్చుకుని ఉత్సవాల సందర్భంగా మంగళవారం తెల్లవారుజామునే మూలవిరాట్ చౌడేశ్వరీదేవి అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలతో పాటు పుష్పాలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికు ఒడిబియ్యం, సారె సమర్పించారు. మొక్కులో భాగంగా పలువురు భక్తులు ఆలయం వద్ద కోళ్లు, మేకలను అమ్మవారికి బలి ఇచ్చారు . జాతర సందర్భంగా గ్రామ ప్రజలు బంధువులు, సన్నిహితులను పిలిచి విందు భోజనం పెట్టారు. వైభవంగా రథోత్సవం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు చేసి అత్యంత శోభాయమానంగా ముస్తాబుచేశారు. అనంతరం అర్చకులు మేళతాళాలతో రథంపై కొలువుదీర్చి కొటిపి గ్రామ వీధులు గుండా ఊరేగించారు. అనంతరం రథాన్ని ఆలయం వద్దకు చేర్చారు. ఉత్సవాన్ని తిలకించేందుకు హిందూపురం చుట్టుపక్కల గ్రామాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ముగిసిన పదో తరగతి పరీక్షలు
పుట్టపర్తి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ముగ్గురిపై వేటు మార్చి 17న పరీక్షలు ప్రారంభం కాగా, చివరి రోజు నాటికి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఇన్విజిలేటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్‌కాపీయింగ్ చేస్తూ దొరికిపోయిన ఓ విద్యార్థి డీబార్ అయ్యారు. గణితం పరీక్ష రోజున పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రత్యేకాధికారి సుబ్బారావు కదిరి నియోజకవర్గంలో పర్యటించి... విధుల్లో నిర్లక్ష్యం వహించిన కదిరి బాలికల ఉన్నత పాఠశాల ఇన్విజిలేటర్లు రుద్రమరెడ్డి, డి.కృష్ణప్పను సస్పెండ్ చేశారు. అలాగే ముదిగుబ్బ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి మాస్ కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్‌కు దొరికిపోయాడు. దీంతో విద్యార్థిని డీబార్ చేశారు. విద్యార్థి మాస్‌కాపీయింగ్ చేస్తున్నా.. చర్యలు తీసుకోని ఇన్విజిలేటర్ మహమ్మద్ రఫీని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఆ పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చివరి రోజు 240 మంది గైర్హాజరు చివరి రోజు మంగళవారం నిర్వహించిన సోషల్ పరీక్షకు 240 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాఽధికారి కృష్ణప్ప తెలిపారు. 21,448 మందికి గాను 21,248 మంది మాత్రమే హాజరయ్యారని ఆయన వివరించారు. చివరిరోజు సోషల్ పరీక్షకు 240 మంది గైర్హాజరు ముగ్గురు ఇన్విజిలేటర్ల సస్పెన్షన్, ఓ విద్యార్థి డీబార్ -
మద్యం మత్తులో ఘర్షణ – ఒకరి మృతి
సోమందేపల్లి: మద్యం మత్తులో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమందేపల్లిలోని సాయినగర్‌కు చెందిన ఎరికల నారాయణప్ప (35), మారెప్ప బంధువులు. మంగళవారం నారాయణప్ప ఇంటి వద్ద ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో మారెప్ప చెయ్యి చేసుకోవడంతో నారాయణప్ప అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా, ఘర్షణలో గాయపడిన మారెప్పను స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ఢీ – వ్యక్తి మృతిసోమందేపల్లి: మండలంలోని తుంగోడు క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న చాకిల నారాయణప్ప(65) మృతి చెందాడు. లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన నారాయణప్ప మంగళవారం ఉదయం సోమందేపల్లి మండలం కొలింపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన తుంగోడు క్రాస్ వద్దకు చేరుకోగానే కదిరి వైపు వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి గొంతు కోసిన జనసేన కార్యకర్త సోమందేపల్లి: గంజాయి మత్తులో జనసేన పార్టీ కార్యకర్త రెచ్చిపోయాడు. కత్తితో ఓ యువకుడి గొంతు కోశాడు. సోమవారం రాత్రి సోమందేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి గ్రామంలో డ్రామా జరుగుతుండగా నితీష్ అనే యువకుడు అక్కడకు చేరుకున్నాడు. ఆ సమయంలో నితీష్‌తో అక్కడే ఉన్న ఈదుళబలాపురానికి చెందిన జనసేన కార్యకర్త విక్రాంత్ అకారణంగా గొడవకు దిగాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న విక్రాంత్ తన వద్ద ఉన్న కత్తితో నితీష్ గొంతు కోసి, వీపుపై కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన మరో యువకుడి చేతి వేళ్లను కోశాడు. క్షతగాత్రలను స్థానికులు హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలుడిపై వీధికుక్కల దాడి వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్లలోని గడ్డం వీధిలో మంగళవారం సాయంత్రం మూడేళ్ల వయసున్న బాలుడు పోతప్పపై నాలుగు వీధికుక్కలు దాడిచేశాయి. తన ఇంటి సమీపంలో బాలుడు ఆడుకుంటూ ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు తలతో పాటు కడుపు, వీపు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు సుంకన్న, సుజాత, కాలనీ వాసులు వెంటనే అక్కడకు చేరుకుని కుక్కలను అదిలించారు. తీవ్రంగా గాయపడిన పోతప్పను తొలుత స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం గుంతకల్లుకు, అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. -
వీఆర్ఏ హత్య కేసులో తమ్ముడి అరెస్ట్
హిందూపురం: లేపాక్షి పంచాయతీ పరిధిలో వీఆర్ఏగా పనిచేస్తున్న రామాంజినప్ప(42) హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలను హిందూపురం రూరల్ సీఐ కె.జనార్ధన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్ర మంగళవారం వారు వెల్లడించారు. ఆదివారం రాత్రి తన సోదరుడు అశ్వత్థప్పతో గొడవ జరిగిన సమయంలో ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి ఆయన కిందపడి మృతి చెందాడు. మృతుని భార్య రాధమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం కల్లూరు క్రాస్ వద్ద తచ్చాడుతున్న అశ్వత్థప్పను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో గత నెల 30న అన్న రామాంజినప్ప తలపై బండరాయితో మోదీ, ఆపై మిద్దైపె నుంచి కిందికి తోసి హతమార్చినట్లు నిందితుడు అంగీకరించడంతో కేసు నమోదుచేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
ధర్మవరం రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం
ధర్మవరం: అత్యాధునిక సౌకర్యాలు కల్పించి ధర్మవరం రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతామని గుంతకల్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ విల్సన్‌బాబు తెలిపారు. మంగళవారం వారు ధర్మవరం రైల్వేస్టేషన్లో జరుగుతున్న ఫ్లాట్‌ఫారం, విశ్రాంతి గది, బుకింగ్ కౌంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ధర్మవరం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కోసం కేంద్రం రూ.7.50 కోట్లు ప్రకటించిందన్నారు. ఇందులో తొలివిడతగా రూ.3.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాల కోసం నూతన భవనాలు నిర్మించేందుకు కూడా నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపడతామన్నారు. అలాగే రైల్వే ఆస్పత్రి నిర్మాణానికీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గూడ్స్‌షెడ్ కొట్టాల వైపు నుంచి వచ్చే ప్రయాణికుల కోసం బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రైల్వేస్టేషన్ మేనేజర్ చల్లా నరసింహ నాయుడు, కమర్షియల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, బాబూజీరావు, సీనియర్ సెక్షన్ సివిల్ ఇంజినీర్ ఉమేష్‌కుమార్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. గుంతకల్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి -
లింగమయ్య హత్య కేసులో టీడీపీ నేతలు అరెస్ట్
సాక్షి, అనంతపురం: కురుబ లింగమయ్య హత్య కేసులో వైఎస్సార్సీపీ పోరాటం కొంతమేర ఫలించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శ్, మంజునాథ్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు రమేష్, అనుచరులపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడితో కొందరిని కేసు నుంచి తప్పించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. రామచంద్రపురం మండలం రేఖల చేనులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూపతిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. తీవ్ర గాయపడిన ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. వినాయకస్వామి ఆలయం వద్ద టీడీపీ కార్యకర్త లీలా ప్రకాష్ దేవుడు భజన చేస్తుంటే అడ్డుకోవడంతో స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్త భూపతి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అడ్డుకున్న భూపతి రెడ్డిని ఇంటి వద్ద నిద్రిస్తుంటే కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రామచంద్రపురం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రామచంద్రపురం మండలంలో రౌడి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
విరిగిన విద్యార్థిని భుజపుటెముక
‘కర్ర’ పెత్తనం.. ఆత్మకూరు: పరీక్ష కేంద్రం చీఫ్ సాగించిన ‘కర్ర’ పెత్తనం ఓ గిరిజన విద్యార్థిని ఉజ్వల భవితకు ఆటంకంగా మారింది. చీఫ్ సూపరింటెండెంట్ విచక్షణ కోల్పోయి కర్రతో కొట్టడంతో విద్యార్థిని భుజపుటెముక విరిగి చివరి పరీక్ష రాయలేక సతమతమవుతోంది. ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ‘శ్రీనివాసా! ఇదెక్కడి ‘కర్ర’పెత్తనం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. ఆత్మకూరు మండలం వేపచెర్ల ఎగువతండాకు చెందిన రవినాయక్ కుమార్తె శ్రావణి స్థానిక కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లోని కేంద్రంలో ఆమె పరీక్షలు రాస్తోంది. శనివారం పరీక్ష రాస్తూ జవాబు తోచక దిక్కులు చూస్తున్న శ్రావణిని అక్కడకు చేరుకున్న ఆ కేంద్రం చీఫ్ శ్రీనివాసప్రసాద్ (ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం) కర్రతో కొట్టాడు. నొప్పి తాళలేక ఆమె విలవిల్లాడుతూ.. ‘సార్ కొట్టకండి’ అంటూ ప్రాధేయపడిన వినకుండా పదేపదే కర్రతో కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పరీక్ష ముగిసిన తర్వాత కేజీబీవీకి చేరుకున్న ఆమె జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలపడంతో ఆయన ఆదివారం వచ్చి కుమార్తెకు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. ఆ సమయంలో తాను పరీక్ష రాయనంటూ బాలిక మొండికేయడంతో మంగళవారం చివరి పరీక్ష ఒక్కటి రాయాలని తండ్రి సముదాయించడంతో సరేనని ఒప్పుకుంది. అయితే రాత్రికి నొప్పి తీవ్రత మరింత ఎక్కువ కావడంతో సమాచారం అందుకున్న రవినాయక్ సోమవారం ఉదయం కుమార్తెను అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి పిలుచుకెళ్లాడు. అనుమానం వచ్చిన వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కుడిచేతి భుజపుటెముక విరిగినట్లుగా స్పష్టంగా కనిపించింది. దీంతో శ్రావణి కుడి చేతికి కట్టు కట్టి పంపించారు. చివరి పరీక్ష రాసేందుకు వీలు కాని పరిస్థితిలో ఉన్న బాలిక దుస్థితిపై ఎంఈఓ నరసింహారెడ్డిని వివరణ కోరగా... 9వ తరగతి విద్యార్థిని సహాయకురాలిగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా, శ్రీనివాస ప్రసాద్ వారం రోజుల క్రితం కూడా కురుగుంటకు చెందిన పదో తరగతి విద్యార్థినిని కొట్టారని, మరో ఇద్దరు విద్యార్థులు అత్యవసరంగా బాత్రూమ్కు వెళ్లి వస్తుండగా వారిని పరీక్ష రాయనీయకుండా దాదాపు అరగంటకు పైగా తన గదిలోనే నిలబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రావణి విషయం తెలియగానే ఆత్మకూరు వాసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు తప్పు చేస్తే సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా ఎముకలు విరిగేలా కర్రతో కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో ఘటన పదో తరగతి పరీక్షలు రాస్తుండగా గిరిజన విద్యార్థినిని కర్రతో కొట్టిన కేంద్రం చీఫ్ ఎక్స్‌రేలో బహిర్గతమైన దుర్మార్గం -
ప్రశ్నిస్తే చంపేస్తారా?
● పరిటాల సునీత, శ్రీరామ్ డైరెక్షన్లోనే లింగమయ్య హత్య ● అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం ● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ● అంత్యక్రియలకు వెళ్తున్న మాధవ్‌ను అడ్డుకున్న పోలీసులు అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. కురుబ లింగమయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సోమవారం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి బయలుదేరిన ఆయనను అనంతపురంలోని ఇంటివద్ద పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టు చేసి నోటీసు అందజేశారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విలేకరులతో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ గత ఐదేళ్లూ రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గొడవలు, హత్యా రాజకీయాలను ప్రోత్సహించకుండా పాలన సాగిస్తే పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత హత్యా రాజకీయాలకు తెర లేపారని విమర్శించారు. ఒక బీసీ నాయకుడిని అత్యంత దారుణంగా కొట్టి హతమార్చారన్నారు. వీటన్నింటికీ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ‘మళ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడేదీ లేదు, చంద్రబాబు గెలిచేదే లేదు’ అని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు.. ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన రామరాజ్యం గుర్తుకు తెచ్చిందని మాధవ్ పేర్కొన్నారు. అలాంటి రామరాజ్యాన్ని చంద్రబాబు సీఎం అయిన తర్వాత రావణకాష్టంగా మార్చారన్నారు. హత్యలు, దాడులు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తూ అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులపై, ప్రశ్నించేవారిపై, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జ న్యాలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ ప్రజాస్వామ్యవాదుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు. పరిటాల సునీత, శ్రీరామ్ డైరెక్షన్లో హత్యలు రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ డైరెక్షన్లో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని మాధవ్ అన్నారు. ఇటీవల ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో బాలన్న అనే వ్యక్తిని పరిటాల సునీత సమీప బంధువులు హత్య చేసేందుకు యత్నించారని, ఆ ఘటన మరువకముందే పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను సునీత దగ్గర బంధువులు హత్య చేశారన్నారు. లింగమయ్య కుమారులను కూడా హత్య చేయాలని చూస్తే వారు తప్పించుకున్నారన్నారు. ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని స్పష్టం చేశారు. -
పోలీసులు నిశ్చేష్టులై..
జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ పడగ విప్పింది. రాజకీయ పబ్బం కోసం పచ్చని పల్లెల్లో అగ్గి రాజేస్తూ.. నిత్యం గొడవలు సృష్టిస్తున్న వైనం పాత ‘రక్తచరిత్ర’ రోజులను గుర్తుకు తెస్తోంది. రెండు దశాబ్దాల క్రితం పరిటాల రవి ఆధ్వర్యంలో ఆర్ఓసీ పేరుతో జరిగిన దమనకాండ మళ్లీ ఇప్పుడు జరుగుతోందనే చర్చ జనంలో మొదలైంది. తాజాగా పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్య హత్య ఉమ్మడి జిల్లాను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. లింగమయ్యను స్వయానా పరిటాల సునీత బంధువులే చంపినట్టు తేలింది. 2019–2024 మధ్య వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ఫ్యాక్షన్ ఛాయలనేవే లేకుండా చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వంలో ‘పచ్చ’ నేతలు ఊరూరా గ్రూపులను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థులను మట్టుబెట్టే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.అరాచకాలు అంతులేని విధంగా జరుగుతున్నా ఇటు అనంతపురం, అటు శ్రీ సత్యసాయి జిల్లాల పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినా ఎస్పీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతల అడుగులకు ఖాకీలు మడుగులొత్తుతున్నారన్న విమర్శలున్నాయి. రెండు జిల్లాల్లోనూ ఏమాత్రమూ సాధారణ పరిస్థితులు లేవని, పోలీసులు రాజకీయ నాయ కులకు జీ హుజూర్ అంటుండటంతో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో పరిటాల సునీత ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో అరాచకాలకు అంతు లేకుండా పోయింది. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా, సెటిల్మెంట్లు ఉన్నా పరిటాల అనుచరులు వాలిపోతున్నట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. భూముల కబ్జాలు, బెదిరింపులు, వసూళ్లు ఒకెత్తయితే... హత్యలు మరోఎత్తు. తమకు ఎదురుతిరిగితే చాలు కొడవళ్లు, గొడ్డళ్లతో దాడులు చేస్తూ భయకంపితుల్ని చేస్తున్నారు. అప్పట్లో ఆర్వోసీ పేరుతో.. పరిటాల సునీత భర్త పరిటాల రవి బతికున్న కాలంలో ఆర్ఓసీ (రీ ఆర్గనైజేషన్ కమిటీ) పేరుతో జరిగిన హత్యలకు లెక్కలేదు. వందల మందిని చంపేసి ఆచూకీ లేకుండా చేశారన్న ఆరోపణలున్నాయి. రవిని ఎదిరించడం కాదు, ఆ ఆలోచన వచ్చినా అలాంటి వారిని తెల్లారేసరికి లేకుండా చేసేవారని, ‘ఆర్వోసీ’ దాష్టీకానికి 700 మందికి పైగా బలై ఉంటారని అప్పుట్లో రవి అనుచరులుగా ఉన్న వాళ్లే చెబుతున్నారు. ఈ హత్యల వెనుకా పరిటాల అనుచరులే! ● 2015 ఏప్రిల్ 29న పట్టపగలే రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ భూమిరెడ్డి ప్రసాదరెడ్డిని దారుణంగా నరికి చంపారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ హత్య అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయంగా అడ్డుగా ఉన్నాడని ప్రసాద్ రెడ్డిని పరిటాల అనుచరులు మట్టుబెట్టినట్టు విమర్శలున్నాయి. ● 2018 మార్చి 30న అనంతపురం రూరల్ మండలం కందుకూరులో శివారెడ్డిని దారుణంగా నరికి చంపారు. గ్రామంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసి మంచి పేరు తెచ్చుకున్న శివారెడ్డిని చంపడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోయారు. ఈ కేసులో ఇటీవలే ఐదుగురు ముద్దాయిలకు జిల్లా కోర్టు ‘డబుల్’ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కేసులో రాజీకి రావాలని మృతుడి బంధువులను బెదిరించారంటే ఏస్థాయిలో బరితెగించారో అంచనా వేయొచ్చు. ● గత ఏడాది అక్టోబర్ 10న వైఎస్సార్సీపీకి చెందిన గూలి కేశవరెడ్డిని హత్య చేశారు. హత్యలు చేస్తే తమకు ఇక ఎవరూ ఎదురు రారనే ఉద్దేశంతో దారుణానికి ఒడిగట్టారని తెలిసింది. ఇటీవల ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో బాలన్న అనే వ్యక్తిపై పరిటాల సునీత సమీప బంధువులు హత్యాయత్నం చేశారు. తాజాగా పాపిరెడ్డి పల్లికి చెందిన లింగమయ్యపై దాడి చేసి చంపారు. హంతకులు సునీతకు దగ్గరి బంధువులు కావడం గమనార్హం. రామగిరి ఎంపీపీ ఎన్నికల విషయంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా లింగమయ్య ఉన్నాడనే అక్కసుతో హతమార్చారని తేలింది. అడ్డొస్తే హతమే.. వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లూ ప్రశాంతంగా పల్లెలు కూటమి సర్కారులో దమనకాండ గ్రామాల్లో పరిటాల అనుచరుల వీరంగం ఎదురు తిరిగితే గొడ్డళ్లు, వేటకొడవళ్లతో దాడులు పరిటాల రవి హయాంలో జరిగిన హత్యాకాండను గుర్తుకు తెస్తున్న వైనం -
●కనిపించని కన్నీటి వ్యథ
ఊరు కాని ఊరు! రాష్ట్రం కాని రాష్ట్రం... బతుకు తెరువు కోసం వలస వచ్చారు. మండుటెండలోనే కంపచెట్ల నీడనే ఆవాసంగా మార్చుకున్నారు. కంపచెట్లను నరికి బొగ్గుగా మార్చి జీవనోపాధి పొందుతున్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన 50 కుటుంబాల దీనగాథ. శెట్టూరు మండలం కనుకూరు గ్రామ శివారున చిట్టడవిని తలపిస్తున్న కంపచెట్లలో పాములు, తేళ్లు.. అడవి జంతువులతో సహవాసం సాగిస్తున్నారు. వీరిని పని కోసం పిలుచుకొచ్చిన వారు... కూలీలు ఉండేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయలేదు. ఎంత కూలి ఇస్తున్నారో కూడా తెలియదు. రాత్రయితే ఓ చిన్నపాటి గుడారం వేసుకుంటారు. చీకట్లోనే ఆ పూట గడిపేస్తున్నారు. ఇది వలస కూలీల దీనగాథ.. పాలకులకు కనిపించని కన్నీటి వ్యథ. – శెట్టూరు: -
‘ఏడు’పిస్తున్న బాబు
అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు గత పది నెలలుగా ఎలాంటి సాయం చేయకుండా రైతులను ఏడిపిస్తోంది. గత ఖరీఫ్‌లో జిల్లా అంతటా 3.20 లక్షల హెక్టార్లలో పంటలు దారుణంగా దెబ్బతిన్నా... కరువు జాబితాలో కేవలం ఏడు మండలాలను ప్రకటించి రైతును దగాకు గురి చేశారు. తాజాగా ప్రస్తుత రబీకి సంబంధించి ఏడు మండలాలను కరువు జాబితాలో చేరుస్తూ సోమవారం రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, చీడపీడలు తదితర కొలమానాల ఆధారంగా జాబితా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలో 51 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అందులో 37 మండలాలు తీవ్ర కరువు, మరో 14 మండలాలు సాధారణ కరువు (మోడరేట్) జాబితాలోకి చేర్చి ఉత్తర్వులు ఇచ్చారు. ‘శ్రీ సత్యసాయి’లో ఒకటే.. అనంతపురం జిల్లాకు సంబంధించి బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, యల్లనూరు, యాడికి మండలాలు తీవ్ర కరువు జాబితాలో ఉండగా విడపనకల్లును సాధారణ కరువు జాబితాలో చేర్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కేవలం రొద్దం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఉరవకొండ, వజ్రకరూరు, పుట్లూరు తదితర మండలాల్లో పప్పుశనగ అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అలాంటి మండలాలను పక్కన పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. ఓవరాల్‌గా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్‌లో 100.9 మి.మీ గానూ 135.1 మి.మీ వర్షం కురిసింది. నవంబర్‌లో 28.6 మి.మీ గానూ 18.1 మి.మీ, డిసెంబర్లో 9.8 మి.మీ గానూ 17.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తమ్మీద రబీలో 139.3 మి.మీ గానూ 22.5 శాతం అధికంగా 170.6 మి.మీ వర్షం పడింది. వర్షపాతం కాస్తంత అధికంగా నమోదైనా వర్షపు రోజులు (రెయినీడేస్) కేవలం 13 నమోదు కావడం గమనార్హం. దీంతో పంటల సాగు అతికష్టమ్మీద సాగింది. రబీలో 1,18,330 హెక్టార్లకు గానూ 67 శాతంతో 79,360 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. అందులో ప్రధానపంట, వర్షాధారంగా వేసే పప్పుశనగ 50 వేల హెక్టార్లలో సాగైంది. ఆ తర్వాత జొన్న, మొక్కజొన్న, ఉలవ తదితర పంటలు కొంత విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. పంట దిగుబడుల విషయంలో జిల్లా అంతటా ఒకే రకంగా ఉన్నా... కరువు జాబితాలో మాత్రం కేవలం ఏడింటిని చేర్చడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా.. 2023 రబీలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 17 కరువు మండలాలకు సంబంధించి రూ.37 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. అలాగే గత రబీ అంటే చంద్రబాబు సర్కారు హయాంలో ఏడు మండలాల రైతులకు రావాల్సిన రూ.20 కోట్లు కూడా అందించ లేదు. ఈ రెండు జాబితాలకు సంబంధించి కేంద్ర కరువు బృందాలు జిల్లాకు వచ్చి వెళ్లినా పైసా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. ఇదే కాదు...‘అన్నదాత సుఖీభవ’ లేదు, పంటల బీమా కింద పరిహారం అందలేదు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. ఇలా గత 10 నెలల నుంచి నయాపైసా ఇవ్వకండా నిలువునా మోసం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంది. అలాగే క్రమం తప్పకుండా రైతు భరోసా, ఉచిత పంటల బీమా కింద పరిహారం పెద్ద ఎత్తున అందించి చేయూతనిచ్చింది. రబీ కరువు జాబితాలో ఈ సారీ ఏడు మండలాలే ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం గత ఖరీఫ్, రబీలో పంటల నష్టానికి ఇప్పటికీ ‘ఇన్పుట్’ ఇవ్వని వైనం -
‘ఫ్యాప్టో’ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నట్లు సమాఖ్య ప్రతి నిధులు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా గజ్జల హరి ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గౌస్ లాజం, కోశాధికారిగా భాస్కర్‌రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యవర్గంలో వివిధ సంఘాల నేతలకు చోటు కల్పించామన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలి.. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు బకాయిగా ఉన్న రూ.20 వేల కోట్లను వెంటనే జమ చేయాలని ఫ్యాప్టో జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై రాబోవు రోజుల్లో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. నూతన పీఆర్సీ కోసం కమిటీ వేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, జీఓ 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేపు కలెక్టర్ వద్ద ధర్నా.. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇందుకు నిరసనగా ఈ నెల 2వ తేదీ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం తలపెట్టినట్లి ఫ్యాప్టో నూతన జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి నుంచి సీనియర్ ఇంటర్ తరగతులు ● మండుటెండల్లో కళాశాలల నిర్వహణపై సర్వత్రా విమర్శలు పుట్టపర్తి: భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కు దాటగా జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లోంచి కాలు బయటపెట్టేందుకు జనం భయపడిపోతున్నారు. పాఠశాల విద్య అధికారులు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్ బోర్డు అధికారులు సెకండ్ ఇయర్ తరగతులు మంగళవారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మొదటి సంవత్సరం మూల్యాంకనం ఇంకా పూర్తి కాకుండానే రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకూ మంగళవారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కళాశాలలు నడుస్తాయన్నారు. జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న 13,083 మంది విద్యార్థులు కళాశాలకు హాజరు కావాల్సి కావాల్సి ఉంటుందన్నారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కూడా ప్రారంమవుతాయన్నారు. -
బీసీలపై దాడులకు మంత్రి సమాధానం చెప్పాలి
● బీసీలకు రక్షణ కల్పించలేని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ● వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి ● జిల్లాలో కురుబలపై వరుస దాడులు దుర్మార్గం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ సాక్షి పుట్టపర్తి: జిల్లాలో బీసీలపై జరుగుతున్న దాడులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ లేఖను విడుదల చేశారు. జిల్లాలో వరుసగా బీసీలపై, ముఖ్యంగా కురుబలపై దాడులు జరగడం దారుణమన్నారు. ఇటీవల పేరూరుకు చెందిన లాయర్ కురుబ నాగిరెడ్డిపై కొందరు అనాగరికంగా దాడి చేశారన్నారు. అలాగే సిద్దరాంపురంలో కురుబ బాలన్నపై దాడి చేసిన ఘటన గుర్తు చేశారు. రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలోనూ ఆదివారం కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులపై అనాగరికంగా దాడి చేస్తే, లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు కురుబ సామాజిక వర్గానికి చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు పట్టవా...అని ప్రశ్నించారు. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక కూడా ఆమెకు లేకపోవడం అన్యాయమన్నారు. జిల్లాలో కురుబలపై జరుగుతున్న అనాగరికమైన ఘటనలకు మంత్రి సవిత బాధ్యత వహించాలన్నారు. కురుబ కులస్తులపై ఏ మాత్రం ప్రేమ, బాధ్యత ఉన్నా .. మంత్రి తన పదవికి రాజీనామా చేసి బాధితుల తరఫున నిలబడాలని డిమాండ్ చేశారు. -
నేత్రపర్వం.. నెట్టికంటుడి రథోత్సవం
గుంతకల్లు రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. సోమవారం వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, విశేష అలంకరణ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాది మంది భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాన్ని నిలిపి రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆలయ ఈఓ కె.వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ.. నారికేళాలను సమర్పించి రథాన్ని ముందుకు లాగి ఉత్సవాని ప్రారంభించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సమేతంగా సోమవారం సాయంత్రం స్వామిరి వారిని దర్శించుకున్నారు. -
కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పండ్ల తోటలు ఎండుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు రైతుల ఆశలను చిదిమేశాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయబోర్లు ఒట్టిపోతున్నాయి. పంటలను రక్షించుకునేందుకు కొత్తగా బోర్లు వేద్దామనుకుంటే నిరాశే ఎదురవుతోంది. వెయ్యి అడుగుల ద
కునుకుంట్ల వద్ద సాగునీరు చాలక వాడుపట్టిన చీనీ తోటతాడిమర్రి: ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో ఉద్యాన పంటలు విరివిగా సాగవుతున్నాయి. ఇక్కడి ఎర్రనేలల్లో పండే చీనీ, అరటి, మామిడి, దానిమ్మ తదితర పంటలు నాణ్యతతో పాటు రుచికరంగా ఉంటుండటంతో వ్యాపారులే తోటల వద్దకు వచ్చి కొంటుంటారు. గత కొన్నేళ్లుగా కునుకుంట్ల, రామాపురం, శివంపల్లి, చిల్లకొండయ్యపల్లి, తాడిమర్రి, మోదుగులకుంట, ముద్దులచెరువు, పుల్లానారాయణపల్లి గ్రామాల్లో చీనీ, దాడితోట, చిల్లవారిపల్లి, నాయనిపల్లి, తురకవారిపల్లి, ఏకపాదంపల్లి తదితర గ్రామాల్లో అరటి సాగు చేస్తున్నారు. వ్యవసాయబోర్ల ద్వారా నీటిని అందిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తూ వస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు అమాంతం పడిపోయాయి. బోర్లల్లో నీరు తగ్గిపోవడంతో తోటలు ఎండుముఖం పట్టాయి. 20 ఏళ్లపాటు ఫలసాయం అందిస్తున్న తోటలను కాపాడుకోవడానికి రైతులు కొత్తగా బోర్లు వేస్తున్నారు. ఒక దాని తర్వాత మరొకటి వేసుకుంటూ పోతున్నారు. రైతుల శక్తి మేరకు 800 నుంచి 1000 అడుగుల వరకు తవ్వించినా నీరు పడటం లేదు. బోర్ల తవ్వకం కోసం చేసిన అప్పులు ఒక వైపు.. ఎండిపోతున్న పంటలు మరోవైపు రైతులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. పంట కోత.. గుండె కోత.. వ్యవసాయ బోర్లు వట్టి పోతుండటంలో మిశ్రమ పంటలు వేసిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఒక పంటకు నీరందించాలంటే మిగిలిన పంటలను ఎండబెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కునుకుంట్లలో ఓ రైతు తనకున్న ఐదెకరాల్లో చీనీ, 4 ఎకరాల్లో అరటి, రెండెకరాల్లో కళింగర సాగుచేశాడు. ఉన్నట్టుండి రెండు బోర్లల్లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో ఆ రైతు చీనీ చెట్లను కాపాడుకునేందుకు మిగిలిన రెండు పంటలను వదిలేశాడు. ● మరో రైతు రెండెకరాల్లో చీనీ, రెండెకరాల్లో అరటి సాగు చేశాడు. రెండు బోర్ల ద్వారా పంటలకు నీరందించేవాడు. అయితే కొంతకాలంగా బోర్లలో నీరు తగ్గడంతో రెండు పంటలకు చాలడం లేదు. దీంతో ఆ రైతు చీనీ పంటను కాపాడుకోవడానికి అరటికి నీరు పెట్టడం మానేశాడు. ఇలా ఈ ఇద్దరే కాదు వందలాది మంది రైతులు చీనీ, అరటితో పాటు అంతర పంటలుగా టమాట, దోస, కళింగర, మిరప సాగు చేశారు. భూగర్భజలాలు అడుగంటిన తరుణంలో చీనీ కోసం ఇతర పంటలకు నీటి తడులు ఇవ్వలేకపోతున్నారు. మరికొందరు రైతులు ట్యాంకరు నీటికి రూ.700 చొప్పున చెల్లించి పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 5 ఎకరాలు ఉన్న రైతు రోజుకు రూ.4,200 ఖర్చు చేసి ఆరు ట్యాంకర్లతో నీరు తోలిస్తున్నారు. భూగర్భజలాలు పడిపోయాయిలా.. తాడిమర్రి మండలంలో భూగర్భజలాలు దారుణంగా పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత ఏడాది జూన్ నుంచి మార్చి వరకు 431.5 మి.మీ. సాధారణ వర్షానికి గాను 518 మి.మీ కురిసింది. అయితే ఒకే విడతలో వర్షం కుమ్మేసింది. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. ఫలితంగా భూగర్భజలాలు ఎక్కువ కాలం నిల్వ ఉండలేక పోయాయి. దీంతో బోరుబావుల్లో నీరు అడుగంటి పంటలకు పూర్తిస్థాయిలో చేరని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పంటలు కాపాడుకోవడం రైతులకు కష్టతరమైంది. తాడిమర్రి మండలంలో పండ్ల తోటల వివరాలు (ఎకరాల్లో) వర్షాభావంతో అడుగంటుతున్న భూగర్భజలాలు వెయ్యి అడుగులు తవ్వినా కనిపించని నీటిజాడ ఎండుతున్న చీనీ, మామిడి, అరటి తోటలు పంటలు కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు ఎడాపెడా బోర్లు వేయొద్దు పంటను కాపాడుకోవాలనే తాపత్రయంతో రైతులు ఎడాపెడా బోర్లు తవ్వించరాదు. ప్రభుత్వ జియాలజిస్ట్ల ద్వారా పాయింట్లను ఏర్పాటు చేసి బోర్లు వేయించుకోవాలి. అలాగే చీనీ చెట్లను మరికొంత కాలం కాపాడుకునేందుకు చెట్లకు ఉన్న కాయలను వెంటనే తొలగించాలి. అలాగే నీటిలో యూరియాను కలిపి పిచికారీ చేస్తే మరింత కాలం కాపాడుకోవచ్చు. – అమరేశ్వరి, ఉద్యాన అధికారి, ధర్మవరం 5008,580500100 -
ఐదు బోర్లు వేసినా చుక్కనీరు లేదు
నేను 5 ఎకరాల్లో చీనీ, 4 ఎకరాల్లో అరటి, 2 ఎకరాల్లో కళింగర పంటలు సాగు చేశాను. అయితే ఉన్నఫళంగా బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. పంటలను కాపాడుకోవాలని రూ.5లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేయించాను. చుక్కనీరు పడలేదు. అరటి, కళింగర పంటలకు నీరందకపోవడంతో రూ.10 లక్షల వరకు నష్టపోయాను. చెట్లను కాపాడుకునేందుకు రోజుమార్చిరోజు రూ.4,200 ఖర్చు చేసి ట్యాంకర్‌తో నీటిని తోలిస్తున్నాను. – సల్లాపురం బాల రమణారెడ్డి, రైతు, కునుకుంట్ల -
ఆరు జిల్లాల్లో కరువు
సాక్షి, అమరావతి: వర్షాలు లేక, పంటలు పండక ఆరు జిల్లాల్లో కరువు తాండవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేల్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఖరీఫ్ సీజన్లోనూ ప్రభుత్వం 49 కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్లో వాటి సంఖ్య ఇంకా పెరిగింది. ప్రస్తుతం ఆరు జిల్లాల పరిధిలోని 51 మండలాల్లో కరువు ఉన్నట్లు నిర్ధారించింది. వాటిలోని 37 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా.. 14 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఈ మండలాలు ఉన్నాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్ జిల్లాలో 10 తీవ్ర కరువు, కరువు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే అనంతపురం జిల్లాలో 7, నంద్యాల జిల్లాలో 5, శ్రీ సత్యసాయి జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర కరువు, కరువు పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. లోటు వర్షపాతం, ఎండిపోయిన పంటల పరిస్థితితో పాటు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెవెన్యూ శాఖ కరువు మండలాలను నిర్ధారించింది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. -
పోలీసు ఆంక్షల నడుమ.. లింగమయ్య అంత్యక్రియలు
సాక్షి, పుట్టపర్తి/రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య (58) అంత్యక్రియలను పోలీసుల ఆంక్షల నడుమ ఆయన స్వగ్రామంలో సోమవారం నిర్వహించారు. పాపిరెడ్డిపల్లిలో స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో లింగమయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు, కురుబ సంఘం నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లి లింగమయ్య మృతదేహానికి నివాళులర్పించారు. పోలీసు బందోబస్తుతో మృతదేహం తరలింపు పోస్టుమార్టం అనంతరం లింగమయ్య మృతదేహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య ఆయన స్వగ్రామం పాపిరెడ్డిపల్లికి తరలించారు. అనంతపురం నుంచి రామగిరి వెళ్లే మార్గంలోని రాప్తాడు, ఎన్ఎస్ గేట్, చెన్నేకొత్తపల్లి సర్కిళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. మృతుడి కుటుంబ సభ్యులను మాత్రమే పాపిరెడ్డిపల్లికి వెళ్లేలా అనుమతించారు. లింగమయ్య మృతదేహం గ్రామానికి చేరిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని వెంటనే శ్మశానవాటికకు తరలింపజేశారు. మృతుడి భార్య రామాంజినమ్మ, కుమారులు మనోహర్, శ్రీనివాసులు, వారి కుటుంబ సభ్యుల చేత అంత్యక్రియలు త్వరత్వరగా పూర్తి చేయించారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అనంతపురంలోని ఆయన ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని శ్రీ సత్యసాయి జిల్లాలోకి రాకుండా పోలీసులు కాపు కాశారు. దీంతో కేవలం మృతుడి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచి్చంది. హత్య చేయించి.. పరామర్శకు వస్తారా?టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిపై కురుబ లింగమయ్య తనయుడు మనోహర్ ఆగ్రహం ‘పరిటాల సునీత మా నాన్నను హత్య చేయించారు. మీ (టీడీపీ) పార్టీ వాళ్లే హత్య చేయిస్తే... ఖండించకుండా పరామర్శకు ఎలా వస్తారు?’ అని హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథిని కురుబ లింగమయ్య కుమారుడు మనోహర్ నిలదీశారు. కురుబ లింగమయ్య మృతదేహాన్ని సోమవారం అనంతపురం నుంచి పాపిరెడ్డిపల్లికి తీసుకువెళుతుండగా మార్గంమధ్యలో ఎంపీ బీకే పార్థసారథి పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రిని హత్య చేసిన, చేయించిన టీడీపీలో ఉన్న పార్థసారథి తమను పరామర్శించేందుకు ఎలా వస్తారని మనోహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిటాల సునీత నుంచి మాకు హాని ఉందిమాజీ మంత్రి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కురుబ మనోహర్ కోరారు. బీసీ కులాలకు చెందిన వారెవరూ రాజకీయంగా ఎదగకూడదన్న ఉద్దేశంతో పరిటాల కుటుంబం ఉందని చెప్పారు. అందువల్లే వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న తమతో పరిటాల బంధువులు లేనిపోని గొడవలకు దిగి.. తన తండ్రిని హత్య చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. -
యువకులకు తీవ్ర గాయాలు
ధర్మవరం అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వివరాలు... ధర్మవరానికి చెందిన అజయ్, రాము.. ఆదివారం ఉదయం రాప్తాడు మండలం మరూరులో వెలసిన చిన్నకదిరయ్యస్వామి దర్శనానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గొల్లపల్లి వంక దాటుతున్న సమయంలో రోడ్డుకు అడ్డుగా జింకలు రావడంతో సడన్ బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్షతగాత్రులను అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే అంబులెన్స్ ద్వారా ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
●ఆకట్టుకున్న గ్రామీణ క్రీడాపోటీలు
తాడిపత్రి టౌన్/గార్లదిన్నె: ఉగాది పర్వదినం సందర్భంగా స్థానిక పెన్నానది ఒడ్డున ఆదివారం సాయంత్రం నిర్వహించిన గ్రామీణ క్రీడా పోటీలు ఆకట్టుకున్నాయి. ఇరుసు, రాతిగుండ్లు, ఇసుక బస్తాలు ఎత్తు పోటీల్లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్‌లను అందజేసారు. అలాగే గార్లదిన్నె మండలం కల్లూరు ఇసుక మూట మోసే పోటీలు నిర్వహించారు. పోటీలు ఆరంభం నుంచే హోరాహోరీగా సాగాయి. ఎక్కువ దూరం ఇసుక మూటను మోసుకెళ్లిన యువకుడికి నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. -
‘ఉగాది’కి వచ్చారు!
హిందూపురం టౌన్: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బాల నటుడు రేవంత్ ఉగాది పండుగ రోజున హిందూపురం వచ్చి సందడి చేశారు. పట్టణంలో ఓ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్, రేవంత్ డైలాగ్‌లతో అభిమానులను అలరించారు.జిల్లాను ప్రగతిపథంలో నిలపాలి● కలెక్టర్ చేతన్ ఆకాంక్షప్రశాంతి నిలయం: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ ప్రజలందరికీ శుభాలు చేకూర్చాలని, జిల్లాను అన్ని రంగాల్లో విజయపథంలో నిలపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వేద పండితులు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వేద పండితులు పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సాంకేతిక పరిజ్ఞానం బాగా వృద్ధి చెందుతుందని తద్వారా మానవశ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం ధర్మవరానికి చెందిన మనస నృత్య కళానిలయం బృందం సంప్రదాయ, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. జిల్లాకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి చాంద్‌బాషా, డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, డాక్టర్ శివన్న, కవయిత్రి కొండసాని రజిత, తెలుగు పండితులు అమర చంద్రబాబు, మాణిక్యం ఇసాక్ ఉగాది కవితలను శ్రావ్యంగా గానం చేశారు. ప్రతిభ చాటిన కవులకు, వేదపండితులకు కలెక్టర్ సన్మాన చేశారు. అలాగే 62 సంవత్సరాల పూర్తి చేసుకున్న పలువురు పండితులకు దేవదాయ శాఖ ద్వారా ఒక్కొక్కరికి రూ.10,116 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ, పర్యాటక శాఖ జిల్లా ఇన్చార్జ్ నరసయ్య, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, దేవదాయ శాఖ అధికారి నరసింహరాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తచరిత్రను ప్రజలు హర్షించరు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేరూరు డ్యాంను నీటితో నింపితే... నేడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ రక్తంతో నింపాలని చూస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. రక్తచరిత్రను జిల్లా ప్రజలు ఎన్నటికీ హర్షించరనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. పరిటాల సునీత బంధువుల దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య మృతి చెందాడు. ఈ క్రమంలో లింగమయ్య మృతదేహాన్ని మాధవ్ పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పరిటాల కుటుంబం ఖూనీ చేస్తోందన్నారు. లింగమయ్య, ఆయన కుమారుడిపై పరిటాల వర్గీయులు అత్యంత దుర్మార్గంగా హత్యాయత్నానికి పాల్పడడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాడ్లు, కొడవళ్లతో వెంటాడి లింగమయ్య తలపై దాడి చేశారన్నారు. ఓ వైపు దాడులకు తెగబడుతూనే మరో వైపు బాధితులపైనే దుర్మార్గంగా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ కూడా నేరస్తులకు అండగా నిలవడం సిగ్గుచేటన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మరో రక్తచరిత్రను సృష్టించాలని పరిటాల శ్రీరామ్ చూస్తున్నాడని, ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజాతిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పక ముందే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ -
●ఆకట్టుకున్న గ్రామీణ క్రీడాపోటీలు
తాడిపత్రి టౌన్/గార్లదిన్నె: ఉగాది పర్వదినం సందర్భంగా స్థానిక పెన్నానది ఒడ్డున ఆదివారం సాయంత్రం నిర్వహించిన గ్రామీణ క్రీడా పోటీలు ఆకట్టుకున్నాయి. ఇరుసు, రాతిగుండ్లు, ఇసుక బస్తాలు ఎత్తు పోటీల్లో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్‌లను అందజేసారు. అలాగే గార్లదిన్నె మండలం కల్లూరు ఇసుక మూట మోసే పోటీలు నిర్వహించారు. పోటీలు ఆరంభం నుంచే హోరాహోరీగా సాగాయి. ఎక్కువ దూరం ఇసుక మూటను మోసుకెళ్లిన యువకుడికి నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. -
ప్రాణం మీదకు తెచ్చిన హెడ్‌ఫోన్
గుత్తి: హెడ్‌ఫోన్ పెట్టుకుని పాటలు వినాలనే మోజు.. చివరకు ప్రాణం మీదకు తెచ్చింది. వివరాలు... గుత్తి మండలం బాచుపల్లి గ్రామానికి చెందిన యువకుడు సూర్య శనివారం రాత్రి హెడ్‌ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని లచ్చానుపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే హెడ్‌ఫోన్ పెట్టుకోవడంతో అప్పటికే పట్టాలపై వేగంగా దూసుకువస్తున్న రైలును గమనించలేకపోయాడు. చివరిక్షణంలో అప్రమత్తమయ్యేలోపు రైలు ఢీకొనడంతో ఎగిరి పట్టాల అవతల పడ్డాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో గాలింపు చేపట్టారు. పట్టాల పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న సూర్యను గమనించి వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి పెనుకొండ: అతిగా మద్యం సేవించిన ఓ వ్యక్తి డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండలో నివాసముంటున్న రాము (49) చిన్నాచితక పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతిగా మద్యం సేవించిన ఆయన దర్గాసర్కిల్ సమీపంలోని డ్రెయినేజీలో పడ్డాడు. పైకి రాలేక డ్రెయినేజీలోనే కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. ఆదివారం ఉదయం సమీప ప్రాంత ప్రజలు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన నవీన్ (31), జయశ్రీ దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఓబుళాపురంలోనే నివాసముంటూ కళ్యాణదుర్గంలో డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కళ్యాణదుర్గంలోని తన వ్యాపార కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమైన నవీన్.. బాత్రూమ్లో స్నానం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. బాత్రూమ్ నుంచి గట్టిగా శబ్ధం రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే తలుపు బలవంతంగా తీసి పరిశీలించారు. విద్యుత్ ప్రసరిస్తుండడంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయించి క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నవీన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ‘శ్రీనివాసా’.. ఇదెక్కడి కర్రపెత్తనం! ● పరీక్ష కేంద్రంలో విద్యార్థులను కర్రతో కొడుతున్న వైనం ● కేంద్రం చీఫ్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం ఆత్మకూరు: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పదో తరగతి విద్యార్థులను ఆ కేంద్రం చీఫ్ కర్రతో చితకబాదుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి శనివారం వరకూ దాదాపు ఐదారుగురు విద్యార్థులను ఆయన చితకబాదినట్లుగా బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు... ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసప్రసాద్‌కు పరీక్ష కేంద్రం చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. సాధారణంగా పరీక్షలనగానే విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉంటారు. మార్కుల ఒత్తిళ్ల నేపథ్యంలో పోటీని తాళలేక పలువురు విద్యార్థులు ఇప్పటికే బలవంతంగా తనువు చాలించిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిస్తూ పరీక్షలపై ఉన్న భయాన్ని పొగొట్టాల్సిన ప్రధానోపాధ్యాయుడు గాడి తప్పి ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. శనివారం పరీక్ష రాస్తున్న స్థానిక కేజీబీవీ విద్యార్థినిని అకారణంగా కర్రతో కొట్టడంతో ఆమె చెయ్యి పూర్తిగా వాచిపోయింది. ఆదివారం చికిత్స కోసం స్థానిక పీహెచ్‌సీకి చేరుకున్న బాధితురాలు తాను పరీక్ష రాసేందుకు వెళ్లనంటూ ఏడుస్తూ కనిపించింది. తల్లిదండ్రులు, కేజీబీవీ ఉపాధ్యాయులు నచ్చచెప్పడంతో అప్పటికి సర్దుకుపోయింది. వారం రోజుల క్రితం కూడా కురుగుంటకు చెందిన విద్యార్థినిని హెచ్ఎమ్ కొట్టినట్లుగా సమాచారం. పరీక్ష రాసే విద్యార్థులు తప్పు చేస్తే దండించాలి కానీ, చేతులు వాచేలా కర్రతో కొట్టడాన్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
తాడిపత్రిలో చైన్‌స్నాచింగ్
తాడిపత్రి టౌన్: దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చేలోపు మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించారు. వివరాలు... తాడిపత్రిలోని జయనగర్ కాలనీకి చెందిన లక్ష్మీగోవిందమ్మ ఆదివారం సుంకులమ్మపాలెం వద్ద వున్న సుంకులమ్మ ఆలయానికి వెళ్లింది. ఉగాది పర్వదినం కావడంతో అప్పటికే ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీలోనే దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం తమన మెడలోని 4 తులాల బరువున్న బంగారం గొలుసు కనిపించలేదు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర హాకీ జట్టులో ధర్మవరం వాసులుధర్మవరం: హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్నీలో జరిగే 15వ పురుషుల జాతీయ సీనియర్ హాకీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో ధర్మవరానికి చెందిన ప్రశాంత్, లోకేష్‌కు చోటు దక్కింది. ప్రతిభ చాటి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్న స్థానిక క్రీడాకారులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బంధనాథం సూర్యప్రకాష్, జిల్లా గౌరవాద్యక్షుడు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, బీవీ శ్రీనివాసులు, ఉడుముల రామచంద్ర, గౌరీప్రసాద్, ఊకా రాఘవేంద్ర, మహమ్మద్ అస్లాం, అంజన్న తదితరులు అభినందించారు. బావిలో పడిన జింక పిల్ల అగళి: నీటి కోసం వెదుకులాడుతూ వచ్చిన ఓ జింక పిల్ల చివరకు నీరు లేని బావిలో పడింది. అగళి మండలం కసాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన లైన్మెన్ నరసింహమూర్తి గమనించి సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 20 అడుగుల లోతున ఉన్న భావిలోకి స్థానిక యువకులు నాగరాజు, కుమార్ దిగి జింక పిల్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి అటవీశాఖ అధికారులు సంజీవరాయుడు, భీమన్న, నాగరాజుకు అప్పగించారు. నీళ్లు తాపిన అనంతరం కోలుకున్న జింకపిల్లను సురక్షితంగా వదిలేశారు. -
హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన
చెన్నేకొత్తపల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నేకొత్తపల్లిలో ఆదివారం నిర్వహించిన వృషభాల బల ప్రదర్శన హోరాహోరీగా సాగింది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన పోటీలకు పలు గ్రామాలకు చెందిన రైతులు తమ వృషభాలను తీసుకువచ్చారు. తోపుదుర్తికి చెందిన రైతు చెన్నప్ప వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో గార్లదిన్నెకు చెందిన రైతు నరేష్ వృషభాలు, మూడో స్థానంలో బళ్లారికి చెందిన రైతు ఆనందరెడ్డి వృషభాలు, నాల్గో స్థానంలో సోములదొడ్డికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు, ఐదో స్థానాన్ని హుస్సేనాపురం రైతు వెంకటసుబ్బారెడ్డి వృషభాలు దక్కించుకున్నాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. గ్రామాల్లో ఉత్సాహంగా ఉగాది సేద్యం గుత్తి రూరల్: మండలంలోని గొందిపల్లి, తురకపల్లి, కరిడికొండ, తొండపాడు, అబ్బేదొడ్డి, బేతాపల్లి, కొత్తపేట, వన్నేదొడ్డి, మాముడూరు, అనగానదొడ్డి, బసినేపల్లి, లచ్చానపల్లితో పాటు ఇతర గ్రామాల్లో రైతులు ఉగాది సేద్యం చేశారు. ఉగాది రోజు గుంటకతో పొలం దున్ని సంప్రదాయ, ఆచారాలను పాటిస్తూ కల్మషం లేని చిన్నారులతో సేద్యం పనులను ప్రారంభిస్తే పంటలు బాగా పండుతాయని నమ్మకం. దీంతో ఆదివారం వేకువజామునే పిల్లలకు నూతన వస్త్రాలను ధరింపజేసి పొలాలకు తీసుకెళ్లారు. గొర్రు, నాగలికి పసుపు కుంకుమ పూసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి చిన్నారుల చేతుల మీదుగా సేద్యం పనులను ప్రారంభించారు. అనంతరం పొలాల్లో రైతులు గుంటక పాశారు. ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఆలయాల చుట్టూ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు తిప్పారు. -
తాడిపత్రికి చేరుకున్న ఫయాజ్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ప్రారంభంపుట్టపర్తి టౌన్: బుక్కపట్నంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏప్రిల్ 2 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్టార్ కృష్ణకుమారి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చేవారు వేచి ఉండే పని లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజలు ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల్లోపు రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చునన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్: స్థానిక దుర్గానగర్‌లోని నెం.1 ఏటీఎం వద్ద ముగ్గురిపై దాడి చేసి గాయపరిచిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. దుర్గానగర్‌లో ఉన్న షో ఆఫ్ ఫ్యాషన్ షాపులో శనివారం సాయంత్రం దుస్తుల కొనుగోలు విషయంగా ఇషాక్, హరీష్ వాదించుకున్నారు. దీంతో హరీష్ స్నేహితులు కాటమయ్య, రాజేష్, రాజాను పిలిపించడంతో వారు ఇషాక్‌కు సర్దిచెప్పి పంపించారు. రాత్రి 9గంటల సమయంలో దుర్గానగర్ ఏటీఎం సమీపంలో కాటమయ్య, రాజా, రాజేష్ ఉండగా ఇషాక్, అతని అన్న అబ్దుల్ రెహమాన్, మరో ఇద్దరు కలసి కట్టెలతో దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు ఆదివారం ఉదయం ఇషాక్, అతని అన్న అబ్దుల్‌రెహమాన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాడిపత్రి టౌన్: భారీ పోలీసు బందోబస్తు మధ్య తాడిపత్రి వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్‌బాషా తన ఇంటికి ఆదివారం చేరుకున్నారు. ఈ నెల 29న వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకట్రామిరెడ్డి.. అనంతపురంలో ఎస్పీ జగదీష్‌ను కలసి సమస్యను వివరించిన విషయం తెలిసిందే. దీంతో తాడిపత్రికి వెళ్లేందుకు ఫయాజ్‌బాషాకు ఎస్పీ అనుమతించారు. ఈ నెల 23న తన నూతన గృహంలో ఇఫ్తార్ విందును ఫయాజ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది గిట్టని జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో ఫయాజ్ ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడికి తెగబడ్డారు. దాడి చేసింది టీడీపీ వారైతే... పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు 17 మందిపై కేసులు బనాయించారు. అనంతరం ఈ నెల 26న అర్ధరాత్రి ఫయాజ్‌బాషాను గుట్టుచప్పుడు కాకుండా అనంతపురానికి తరలించారు. రంజాన్ వేళ కుటుంబసభ్యులతో కలసి పండగ జరుపుకోవాలనే ఆయన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరిస్తూ వచ్చారు. ఆంక్షలు విధిస్తూ 4 రోజుల పాటు కుటుంబసభ్యులకు దూరం చేశారు. దీంతో ఈ నెల 29న అంజాద్‌బాషా, అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్, కర్నూల్ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసుల్ అజామ్ తదితరులు ఎస్పీ జగదీష్‌ను కలసి తాడిపత్రిలో జేసీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసారు. ఫయాజ్‌బాషాను తాడిపత్రికి వెళ్లకుండా అంక్షలు విధించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసారు. దీంతో స్పందించిన ఎస్పీ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు మధ్య ఆదివారం సాయంత్రం తాడిపత్రిలోని తన ఇంటికి ఫయాజ్‌బాషా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ రోహిత్‌కుమార్, సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసులు తాడిపత్రిలోని పలు కూడళ్లు, ఫయాజ్ ఇంటి వద్ద బందోబస్తు చేపట్టారు. పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు -
అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలి
మడకశిర: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మడకశిర నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజును వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప డిమాండ్ చేశారు. ఆర్భాటాలు చేయడం, ప్రగల్భాలు పలకడమే అభివృద్ధి కాదని విమర్శించారు. పట్టణ సుందరీకరణ జరగలేదని సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలడాన్ని ఖండించారు. మీడియాన్ని భయపెట్టాలని చూస్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు. ఆదివారం మడకశిర ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కుంచిటి వక్కలిగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్తో కలిసి ఈరలక్కప్ప మాట్లాడారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వారానికి ఒకసారి అనంతపురం నుంచి మడకశిరకు వచ్చి వెళ్తారన్నారు. అభివృద్ధి జరగడం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని కథనాలు ప్రచురిస్తున్న సాక్షిపై చిందులు వేయడం పరిపాటిగా మారిందని, ఎమ్మెల్యే తాటాకు చప్పుళ్లకు ఎవ్వరూ భయపడరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించాలని చూడడం తగదన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, పత్రికను, పాత్రికేయులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ బోర్డు సభ్యుని నోటి నుంచి ఇలాంటి మాటలు రాకూడదన్నారు. విమర్శలు మాని మడకశిర నియోజకవర్గంలో మట్కా, గ్యాంబ్లింగ్, మద్యం బెల్ట్ షాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు అరికట్టడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. గడిచిన తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వ శాఖలపై ఏమాత్రం పట్టు సాధించలేదని, కనీసం రెగ్యులర్ అధికారులను నియమించుకోవడానికి కూడా నీ చేతకాలేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఓట్ల కోసం హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే మోసం చేయడమే మీ పార్టీ పని అని ధ్వజమెత్తారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఉగాదిని కూడా సంతోషంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్సీపీ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని, అనవసరంగా మీడియాపై చిందులు తొక్కడం, వైఎస్జగన్ను దుర్భాషలాడడాన్ని మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు శేషు, హరి తదితరులు పాల్గొన్నారు. ఆర్భాటాలు, ప్రగల్భాలు వద్దు వారానికోసారి వచ్చి వెళ్తే సరిపోతుందా? రెగ్యులర్ అధికారులను వేయించడంలో విఫలం మీడియాను భయపెట్టాలని చూస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే మడకశిర ఎమ్మెల్యేపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజం -
ఉట్టిపడిన తెలుగు సంస్కృతి
ప్రశాంతి నిలయం: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగాయి. వేలాదిమంది భక్తులు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ఆశీనులుగా కాగా.. వేడుకలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించాయి. వేదపండితులు డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగ పఠనం చేశారు. శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో సత్యసాయి, దేవదేవుని ఆశీస్సులు విశ్వమానవాళిపై ఉంటాయని, వర్షాలు సకాలంలో కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండి సకల మానవులు సుభిక్షంగా ఉంటారని వివరించారు. అనంతరం భక్తులు సంగీత కచేరి నిర్వహించారు. ఇటీవల మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగిన యజ్ఞంలో పాల్గొనలేని భక్తుల కోసం సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్లో శ్రీరుద్రం పఠించి యజ్ఞంలో భాగస్వాములయ్యే అవకాశం కల్పించింది. 113 దేశాలకు చెందిన 15 వేల మందికి పైగా భక్తులు శ్రీరుద్రం పఠించారు. ఇంతమంది అన్లైన్ ద్వారా విన్నందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇప్పటికే నమోదైంది. తాజాగా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా రికార్డు సాధించడంలో ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్, సిగ్మా హెల్త్ కేర్ సీఈఓ డాక్టర్ ప్రదీప్ భరద్వాజ్ రికార్డుకు సంబంధించి సర్టిఫికెట్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో సత్యసాయి మీడియా సెంటర్ ప్రతినిధులకు అందజేశారు. అలాగే సత్యసాయి మీడియా సెంటర్ ‘శ్రీ సత్యసాయి సాహిత్య’ పేరుతో రూపొందించిన వెబ్‌పోర్టల్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు ట్రస్ట్ సభ్యులతో కలసి ప్రారంభించారు. సాయంత్రం ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసురాలు గుడిపాటి శ్రీలలితా బృందం సంగీత కచేరీ నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఉగాదికి ఘన స్వాగతం విశ్వ శ్రేయస్సును కోరే శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతించారు. పండుగ సందర్భంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పండితుల పంచాంగ పఠనాన్ని శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ఆటలు, పందేలు, శక్తి ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. – పుట్టపర్తి -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసుల సెల్యూట్
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలిని ఎత్తుకెళ్లిన టీడీపీ నేతలను వదిలేసి.. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ కీలక నేతలపై ఎస్సైతో కేసు పెట్టించడం చర్చనీయాంశమైంది. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక రోజున వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు భారతిని టీడీపీ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారు.టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోగా.. చివరకు పోలీసులతోనే ఫిర్యాదు చేయించి వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఓ దళిత మహిళను టీడీపీ నేతలు కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశి్నంచిన వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఎస్ఐ ఫిర్యాదుతో.. ఉప ఎన్నిక రోజున వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బాగేపల్లి టోల్‌ప్లాజా నుంచి రామగిరి తీసుకెళ్లాల్సిన పోలీసులు.. మార్గంమధ్యలోని చెన్నేకొత్తపల్లి నుంచి తిరుగు పయనమయ్యారు. ఎంపీటీసీ సభ్యులను సకాలంలో సమావేశ మందిరానికి తీసుకురాలేకపోవడానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కారణమంటూ చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుకొండలో కిడ్నాప్‌నకు గురైన ఎంపీటీసీ సభ్యురాలు రామగిరిలోనే తప్పిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి ఎస్సై ఫిర్యాదు మేరకు పెనుకొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. 25 మందిపై ఎఫ్ఐఆర్ శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి సహా రాప్తాడుకు చెందిన శేఖర్, మరూరు వెంకటేశ్, డోలా రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, యలక్కుంట్ల అమర్నాథ్రెడ్డి, నరసింహారెడ్డి, కురుబ నాగిరెడ్డి, రామాంజినేయులు, ఓబుగారి హరినాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మీనుగ నాగరాజు, బాబురెడ్డి, ఎం.గోవిందరెడ్డి, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, మాధవరాజు, రఘునాథరెడ్డి, సుబ్బిరెడ్డి, ఎస్టీడీ శ్రీనివాసరెడ్డి, నీరుగంటి నరసింహులు, చీమల కేశవయ్య, ఎస్.రవీంద్రరెడ్డిపై కేసు నమోదు చేశారు. వీరందరిపైనా బీఎన్ఎస్ సెక్షన్లు 192, 132, 125, 351 (2), 79, 223 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణహత్య
సాక్షి టాస్క్ ఫోర్స్/అనంతపురం ఎడ్యుకేషన్: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య (56)ను టీడీపీ కార్యకర్తలు ఆదివారం నాడు దారుణంగా హత్య చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులైన టీడీపీ నేతలు ఆదివారం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో లింగమయ్యతో పాటు అతని ఇద్దరు కుమారులపై దాడి చేశారు. ఈ దాడిలో లింగమయ్య తలకు బలమైన గాయం కావడంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.చిన్న కుమారుడు శ్రీనివాసులు ముఖంపైనా బలమైన గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు... రామగిరి ఎంపీపీ ఉపఎన్నిక నేపథ్యంలో 2 రోజుల క్రితం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత జయచంద్రారెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు రమేశ్ కుటుంబ సభ్యులు రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో జయచంద్రారెడ్డి ఊర్లో లేరు. కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇలా ఇంటిపై దాడి చేయడం తగదని, జయచంద్రారెడ్డి రాగానే సామరస్యంగా మాట్లాడుకుందామని వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య వారికి సర్దిచెప్పి పంపేశారు. దీన్ని పరిటాల బంధువులు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే కారణంతో లింగమయ్య కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఆదివారం లింగమయ్య పెద్దకుమారుడు మనోహర్ బైక్‌పై అత్తారింటికి వెళుతుండగా.. దారిలో ధర్మవరపు రమేశ్, ఆదర్శ్, అభిలా‹Ù, నాయుడు, నవకాంత్, రామానాయుడు, మాదిగ సురేశ్ రాళ్ల దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని ముందుకెళ్లిన మనోహర్..తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అంతలోనే వారు మరో పది మందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో వచ్చి ఇంట్లో ఉన్న లింగమయ్య, చిన్న కుమారుడు శ్రీనివాసులుపై దాడి చేశారు.ఈ దాడిలో లింగమయ్య తలకు బలమైన గాయమై చికిత్స పొందుతూ మృతి చెందాడు.కాగా, పరిటాల శ్రీరామ్ అభయంతోనే లింగమయ్య హత్య జరిగిందని రాప్తాడు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఇటీవల పరిటాల శ్రీరామ్ పాపిరెడ్డిపల్లిలో మాట్లాడుతూ మండలానికి ఒకడిని చంపితే కానీ వైఎస్సార్సీపీ వాళ్లకు భయం పుట్టదని అన్నారని గుర్తు చేశారు. వారి అరాచకాలకు రామగిరి ఎస్ఐ ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నాడని ఆరోపించారు. -
చేదు మిగిల్చిన ఉగాది
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఉగాది పండుగ నాడు ఒక స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు కుమారులు మృతి చెందడం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. మడకశిర గాందీబజార్లో సొంతింట్లో స్వర్ణకారుడు క్రిష్ణాచారి కుటుంబం నివాసం ఉంటోంది. ఏమైందో ఏమో కానీ క్రిష్ణాచారి (45), భార్య సరళ (38), పెద్ద కుమారుడు సంతోష్ (15), రెండో కుమారుడు భువనేష్ (13) మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వెలుగులోకి వచి్చంది. మృతుడు క్రిష్ణాచారికి తండ్రితోపాటు గోపి, సురేష్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్న సోదరుడు సురేష్ ఇంట్లో ఉంటున్న తండ్రి ఉదయాన్నే క్రిష్ణాచారికి ఫోన్ చేశారు. ఫోన్ తీయకపోవడంతో సురేశ్ తన అన్న కిృష్ణాచారి ఇంటి వద్దకు వెళ్లి చూడగా లోపల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు. క్రిష్ణాచారి జేబులో సైనేడ్ డబ్బా.. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఇంటిని క్షుణ్నంగా పరిశీలించింది. క్రిష్ణాచారి జేబులో సైనేడ్ డబ్బా ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే క్రిష్ణాచారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్రిష్ణాచారి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు ముందు బెంగళూరులో ఉన్న తన అక్కతో ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయ్యో పిల్లలు.. ఉగాదికి ఇంటికొచ్చి.. క్రిష్ణాచారి పెద్ద కుమారుడు సంతోష్ మడకశిర సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ.. పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేష్ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ పాఠశాల హాస్టల్లో ఉంటూ.. ఉగాది సందర్భంగా ఇంటికొచ్చారు. వీరిద్దరూ తల్లిదండ్రులతోపాటు ప్రాణాలు కోల్పోయారు. -
అదే దౌర్జన్యం.. అడుగడుగునా బెదిరింపుల పర్వం
సాక్షి, పుట్టపర్తి/సాక్షి, భీమవరం/నరసరావుపేట రూరల్/కారంపూడి/ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డగింతలను నమ్ముకునే ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, హెచ్చరికలు, గొడవల కారణంగా గురువారం ఏడు చోట్ల వాయిదా పడిన ఎన్నికలు... శుక్రవారం కూడా వాయిదా పడ్డాయి. అధికార పార్టీ నేతల నిర్వాకంతో ఉమ్మడి అనంతపురం జిల్లా గాండ్లపెంట, రామగిరి, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, యలమంచిలిలో ఎంపీపీ, పల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడిలో వైస్ ఎంపీపీ, వైఎస్సార్ జిల్లా గోపవరంలో ఉప సర్పంచ్ పదవులకు శుక్రవారం ఎన్నిక నిర్వహించలేకపోయారు.గురువారం రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 స్థానాల్లో (ఒక రెబల్‌తో కలిపి) తన హవాను చాటుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఏడు చోట్ల శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఎన్నిక నిర్వహించే కార్యాలయం వద్దకు రాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు ఇందుకు వారికి సహకరించారు. వాస్తవానికి కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికలు సాగాల్సి ఉంది. అయితే ఈ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ వశమైతే ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకత మరింత ప్రబలుతుందని అధికార పార్టీ పెద్దలు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోవాలంటూ స్థానిక నేతలకు కనుసైగ చేశారు. దీంతో శుక్రవారం కూడా ఉప ఎన్నికలు నిర్వహించలేకపోయారు. టీడీపీ నేతల దౌర్జన్యకాండ..టీడీపీ నేతల దాష్టీకంతో శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలు తిరిగి వాయిదా పడ్డాయి. నిర్ణీత సమయంలోగా మూడింట రెండు వంతుల సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలంలో ఏడుగురు సభ్యులకు గాను ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు రెండు రోజులుగా టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నిక సజావుగా జరిగితే వైఎస్సార్సీపీకి ఎంపీపీ పదవులు దక్కుతాయని భావించి గాండ్లపెంటలో టీడీపీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, రామగిరిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ ఎన్నిక జరగకుండా గురువారం ఆటంకాలు సృష్టించిన విషయం తెలిసిందే.ఉప ఎన్నికల వాయిదా.. ఎంపీపీ: 4 వైస్ ఎంపీపీ: 2 ఉప సర్పంచ్: 1 మొత్తం: 7 పశ్చిమలో కూటమి అధికార మదంపశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీకి ఏకపక్షం కావాల్సిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలను రెండో రోజైన శుక్రవారం కూడా కూటమి నేతలు తమ అధికార మదాన్ని చూపించి అడ్డుకున్నారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, అత్తిలిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెరవెనుక నుంచి తంతు నడిపించారు. సమావేశం ఉందని చెప్పి మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలు, డ్వాక్రా మహిళలను అత్తిలికి తరలించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద మహిళలను మోహరించారు. ఒక్కొక్కరికి రూ.500 నగదు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తామని చెప్పి ఉంచారు. కొందరు టీడీపీ కార్యకర్తలు కారుమూరి నివాసం చుట్టూ మోటారు సైకిళ్లపై హల్చల్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను కవ్వించే ప్రయత్నాలు చేశారు. 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు గురువారం రాత్రి రహస్య ప్రదేశంలో ఉండిపోయారు. శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల్లో పాల్గొనాలని భావించారు. అయితే ఎంత ప్రయత్నించినా వైఎస్సార్సీపీ సభ్యులు ఎక్కడున్నదీ తెలియకపోవడంతో ఏ రోడ్డు నుంచైనా వచ్చేస్తారని ఉదయం నుంచి అత్తిలి గ్రామానికి వచ్చే రోడ్లన్నింటినీ కూటమి నేతలు దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామానికి వచ్చే బస్సులు, ఆటోలు, ఇతర అన్ని వాహనాలను తనిఖీ చేసి వైఎస్సార్సీపీ సభ్యులు లేరని నిర్ధారించుకున్న తర్వాతే వదిలారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కూటమి మూకలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు చేష్టలుడిగి చూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ సభ్యులను పోలీసు రక్షణతో ఎన్నికలకు హాజరు పర్చేందుకు మాజీ మంత్రి కారుమూరి పోలీస్ అధికారులను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల నిర్వాకంపల్నాడు జిల్లా నరసరావుపేట, కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక రెండోసారీ వాయిదా పడింది. టీడీపీ నేతల దౌర్జన్యం కారణంగా కోరం లేకపోవడంతో ఈ రెండు చోట్ల ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో కేవలం నలుగురు ఎంపీటీసీ సభ్యులు, కారంపూడిలో ఒకే ఒక్కరు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ సభ్యులు రాకుండా టీడీపీ నేతలు ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. దీంతో కోరం లేదన్న విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబుకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించి ఎన్నికను వాయిదా వేశారు. తదుపరి ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. బలం లేకపోయినా సరికొత్త నాటకంపశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఎన్నిక ప్రారంభానికి ముందే కూటమి నాయకులు నాటకీయ పరిణామాలకు తెరలేపారు. గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంభాల సత్యశ్రీ కనిపించడం లేదని ఆమె కుమార్తె ఫిర్యాదు చేసిందంటూ పోలీసులు వచ్చి సత్యశ్రీని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కూటమి నాయకులు ఆమె కుమార్తె ద్వారా సత్యశ్రీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రాణం పోయినా వైఎస్సార్సీపీని వీడేది లేదని ఆమె స్పష్టం చేయడంతో పోలీసులు తిరిగి ఆమెను మండల పరిషత్ కార్యాలయానికి తీసుకు వచ్చి దించడం గమనార్హం.అనంతరం నిర్ణీత సమయానికి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్సీపీ నుంచి 12 మంది, కూటమికి చెందిన నలుగురు సభ్యులు హాజరయ్యారు. అటెండెన్స్ ప్రక్రియ పూర్తయ్యాక కూటమి సభ్యులు లేచి తమను వైఎస్సార్సీపీ సభ్యులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎన్నిక ఏ విధంగా జరిపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. సంగతి తేల్చాలంటూ ఘర్షణ వాతావరణం, గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో తనకు గుండెల్లో దడగా ఉందంటూ రిటర్నింగ్ అధికారి ఎం.శ్రీనివాస్ బయటకు వెళ్లిపోయారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నిక నిర్వహించడానికి సరైన వాతావరణం లేనందున వాయిదా వేస్తున్నట్టు ఎంపీడీఓ ఎ.ప్రేమాన్విత్ ప్రకటించారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉండగా కూటమి సభ్యులను భయపెట్టాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించినా వారు స్పందించలేదు. వాళ్లలో వాళ్లే గొడవ పడుతూ హైడ్రామావైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీ వార్డు సభ్యులపై దౌర్జన్యం, దాడులకు దిగటంతో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు హైడ్రామాకు తెర తీశారు. ఎన్నికల కార్యాలయంలో.. పథకం ప్రకారం టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉప సర్పంచ్ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు.ఒకరినొకరు ద్వేషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్ బుక్‌ను లాక్కొని చించేశారు. ఈ సందర్భంగా 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా కలిసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని కుర్చీలో కూర్చుండిపోయారు. అంబులెన్స్‌ను పిలిపించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకే ఇక్కడ ఈ హైడ్రామా చోటుచేసుకుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎన్నిక బాయ్ కాట్👉వైఎస్సార్ సీపీ ఎమ్పీటీసీలకు భద్రత కల్పించటంలో పోలీసులు విఫలం👉టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులపై పోలీసుల మౌనం👉నిన్న పేరూరు ఎమ్పీటీసీ భారతిని కిడ్నాప్ చేసిన పరిటాల వర్గీయులు👉గాండ్లపెంట ఎమ్పీడీవో కార్యాలయంలో కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రలోభాలు👉పోలీసుల ఏకపక్ష వైఖరిపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్ ఆగ్రహంప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్👉వైఎస్సార్ జిల్లా: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహా పలువురి నేతల హౌస్ అరెస్ట్👉నేడు నిన్న వాయిదా పడిన గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక👉నిన్నటి ఎన్నికకు వైఎస్సార్సీపీ సభ్యులు హాజరుకాకుండా రాళ్ళ దాడి చేసిన ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు👉కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నిక👉నేడు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు రాకుండా ముందస్తు అరెస్టులు👉ఎన్నిక జరగకుండా అడ్డుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ👉వైఎస్సార్సీపీ సభ్యులకు రక్షణ కల్పించి ఎన్నిక సజావుగా జరపడంలో పోలీసుల వైఫల్యం👉దాడులకు దిగుతున్న టీడీపీ వారిని వదిలేసి వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్👉వైఎస్సార్సీపీ సభ్యులకు రక్షణ కల్పించి ఎన్నిక సజావుగా జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్టీడీపీ కుట్ర రాజకీయాలు👉పశ్చిమ గోదావరి జిల్లా: వాయిదా పడిన అత్తిలి, యలమంచిలి ఎంపీపీ స్థానాలకు నేడు ఎన్నికలు👉సంఖ్యాబలం లేకపోయినా.. కుయుక్తులు పన్నుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ👉అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు👉యలమంచిలి మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినగుంపర్రు ఎంపిటిసి కంబాల సత్య శ్రీనీ అరెస్టు చేసిన పోలీసులు👉ఆమెపై కిడ్నాప్ కేసు పెట్టారంటూ కొత్త డ్రామాలకు తెర లేపిన పోలీసులు👉ఎంపీటీసీ అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులుస్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి కుట్రలు👉అక్రమ కేసులు, కిడ్నాపులను ఎదుర్కొని వైసీపీ విజయకేతనం👉వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేని చోట ఎన్నికలను నేటికి వాయిదా వేయించిన కూటమి నేతలు👉నేడు జరగనున్న ఎంపీపీ ఉప ఎన్నికలు: యలమంచిలి, అత్తిలి, గాండ్లపెంట, రామగిరి👉వైస్ ఎంపీపీ ఎన్నికలు : అత్తిలి, ఏలూరు రూరల్, కైకలూరు, కారంపూడి, నరసరావుపేట, దగదర్తి👉వైఎస్సార్ సీపీ సభ్యులను ఎన్నికలకు హాజరుకాకుండా చేసేందుకు టీడీపీ నేతల ప్రయత్నం👉అవసరమైతే కోర్టులను ఆశ్రయించే యోచనలో వైఎస్సార్ సీపీ👉ఏమాత్రం బలం లేకపోయినా కుటిల రాజకీయంతో ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేశారు. రొద్దంలో వారి పాచిక పారకపోగా.. గాండ్లపెంట, రామగిరి ఎంపీపీలను తమ ఖాతాలోకి వేసుకోవాలని అరాచకానికి తెరతీశారు. ఇందులో భాగంగానే ఆ రెండు ఎన్నికలు నేటికి వాయిదా పడ్డాయి.👉ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక ‘పరిటాల’ కుటుంబం పైశాచిక రాజకీయం చేసింది. రౌడీయిజం చేస్తూ.. దౌర్జన్యకాండ సృష్టించి.. అధికారులను అడ్డు పెట్టుకుని ఎంపీపీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రయత్నించింది. సజావుగా ఎన్నిక జరిగితే ఓడిపోతామని తెలిసే ఎమ్మెల్యే పరిటాల సునీత దిగజారుడు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అధికారులను పావులుగా వాడుకొని వైఎస్సార్సీపీ సభ్యులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి, పదవులను ఆఫర్ చేసి లాక్కోవాలనే ప్రయత్నం చేశారు. ప్లాన్ ఫలించకపోయేసరికి ఎన్నికను వాయిదా వేయించారు.👉అభ్యర్థి లేకున్నా.. రామగిరి ఎంపీపీ పదవి మహిళకు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తరఫున ఒక్క పురుషుడు మాత్రమే గెలిచారు. పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు కూడా పురుషులే కావడంతో రామగిరి నుంచి టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థి లేరు. అయితే ప్రలోభాలకు గురి చేసి వైఎస్సార్సీపీ సభ్యులను లాక్కొని టీడీపీ కండువా వేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని పరిటాల సునీత వేసిన ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయింది.👉రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. అందులో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ మరణించారు. ఎంపీపీ పదవి దక్కాలంటే కనీసం ఐదుగురు మద్దతు అవసరం. ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున ఐదుగురు సభ్యులు బెంగళూరు క్యాంపులో ఉన్నారు.👉వైఎస్సార్సీపీ సభ్యులు గురువారం బెంగళూరు నుంచి రామగిరికి ఎన్నికల కోసం వస్తుండగా.. బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరి తీసుకెళ్తామని.. మిగతా వాళ్లు రాకూడదని సూచించారు. ఏడు వాహనాల్లో వైఎస్సార్సీపీ సభ్యులతో రామగిరికి బయలుదేరారు. అయితే కాన్వాయ్ చెన్నేకొత్తపల్లి దాటే సమయానికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సమయానికి రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి ముగ్గురు సభ్యులు మాత్రమే చేరుకోవడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు మీరింది. దీంతో ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంజీవయ్య ప్రకటించారు. 👉రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడినట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ సభ్యులను తిరిగి కర్ణాటక సరిహద్దు దాటించే వరకూ పోలీసులు బందోబస్తులో ఉండాలి. అయితే ఎస్ఐ సుధాకర్‌యాదవ్ కల్పించుకుని వైఎస్సార్సీపీ సభ్యులతో వీడియో కాల్స్ ద్వారా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌తో మాట్లాడించారు. పదవులు ఆఫర్ చేసి.. డబ్బు ద్వారా ప్రలోభాలకు గురి చేశారు. పార్టీ మారకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులందరూ ఒకే మాటపై నిలబడి.. పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.👉లీగల్ ప్రొసీజర్ ప్రకారం వైఎస్సార్సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి తరలించాలని పోలీసులు సూచించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే పక్కా ప్లాన్‌తో వచ్చిన టీడీపీ నేతలు వాహనాల్లో వచ్చి పేరూరు –2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచినా పోలీసులు అడ్డుకున్నారు.👉వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు. మహిళా అభ్యర్థి ఉంటే.. నామినేషన్ దాఖలు చేసి.. ఏదో విధంగా బెదిరించి పార్టీ మార్చుకోవచ్చనే ఆలోచనతో పరిటాల సునీత దళిత మహిళను ఇరకాటంలో పడేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించారు.👉ఇక.. గాండ్లపెంటలో బలంలేకపోయినా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుటిల యత్నాలకు తెరలేపింది. మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒకచోట మాత్రమే టీడీపీ గెలుపొందింది. అయితే, గురువారం ఎంపీడీఓ కార్యాల యంలో ఎంపీపీ ఎన్నిక కోసం వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కదిరి నుంచి గాండ్లపెంటకు బయలు దేరగా.. మార్గమధ్యలో కదిరి–రాయచోటి ప్రధాన రహదారిలో పోలీసులు సోదాల పేరుతో అడ్డుకున్నారు. దీంతో ఆలస్యం జరిగి ఎన్నికల అధికారి ఎన్నికను నేటికి(శుక్రవారం) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
పని భారం.. తాళలేం!
పుట్టపర్తి అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజురోజుకూ పనిభారం పెరిగిపోతుండడంతో గ్రామ పంచాయతీల కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఆస్తి పన్ను వసూళ్లు, సర్వేలు, రోజు వారీ విధులు, పారిశుధ్య నిర్వహణ వంటి పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సమీక్షల పేరుతో గంటల తరబడి జూమ్ మీటింగ్‌లు, తరచూ నిర్వహించే సమావేశాలతో రోజూ నిర్వహించే పనులు చతికిలబడుతున్నాయి. అధికారులు ఇచ్చిన లక్ష్యాలను చేరుకోకపోవడంతో నిత్యం ఏదో ఒక పంచాయతీ కార్యదర్శికి మెమోలు అందుతున్నాయి. సర్వేలతో ముప్పుతిప్పలు.. జిల్లాలో 457 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపు అన్ని పంచాయతీల్లో కార్యదర్శులు ఉన్నారు. నిత్యం పంచాయతీలకు వెళ్లి సంతకాలు చేసిన అనంతరం రోజు వారీ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను వసూలు చేయడానికి గతంలో బిల్ కలెక్టర్ ఉండేవారు. ప్రస్తుతం ఈ విధులు కూడా పంచాయతీ కార్యదర్శులే నిర్వర్తిస్తున్నారు. నెలలో మొదటి రెండు మూడు రోజులు పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలి. మిగిలిన మొత్తాలను సెర్ప్‌కు పంపాల్సి ఉంటుంది. ప్రజలు అడిగిన పంచాయతీ పనులను ఠంచన్‌గా చేసిపెట్టాలి. లేదంటే వారి నుంచి వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. సిటిజన్ సర్వే, మిస్సింగ్ ఎంప్లాయీస్ సర్వే, పీ4 సర్వే, విలేజ్ సర్వేలను కార్యదర్శులకు అప్పగించారు. ట్యాంక్ క్లీనింగ్, క్లోరినేషన్, స్వర్ణాంధ్ర–స్వచ్చాంద్ర కార్యక్రమాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, చెత్తతో సంపద తయారీ, నీటి సమస్యలు, రికార్డుల నిర్వహణ, సర్టిఫికెట్ల జారీ, సచివాలయ సిబ్బందితో పనులు చేయించడం, లీజు వసూళ్లు, వేలం పాటలు, పిల్లల మిస్సింగ్ ఆధార్ సర్వే, డెత్ రీ వెరిఫికేషన్ సర్వే తదితర సర్వేలతో ముప్పుతిప్పలు పడుతున్నారు. పస్తులతో విధుల నిర్వహణ.. ప్రభుత్వ నిర్దేశిత సర్వేల కోసం సెలవు దినాల్లోనూ కార్యదర్శులు పనిచేయాల్సి వస్తోంది. లేదంటే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయలేక అధికారులతో చీవాట్లు తినాల్సి వస్తుంది. సర్వే సమయంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పనిచేసే కార్యదర్శులు నెట్వర్క్ సమస్యతో ఒకే ఇంటి వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో సకాలంలో భోజనాలు కూడా చేయలేక పస్తులతోనే పూట గడపాల్సి వస్తోంది. ప్రతి సోమవారం మండల కార్యాలయాలతో పాటు కలెక్టరేట్లో అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేయాల్సి ఉంది. అక్కడ ఇరువర్గాల వాగ్వాదంతో సమస్య జఠిలమై మరింత ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. దీంతో పాటు కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం అర్జీలు ఇచ్చేందుకు వచ్చేవారికి సేవలు చేయడానికి వారానికి కొందరు చొప్పున విధులో పాల్గొనాల్సి వస్తోంది. సర్దుకుపోండి.. గతంలో నాయకులకు, కార్యకర్తలకు సిబ్బందిపై గౌరవం ఉండేది. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత పంచాయతీ కార్యదర్శుల విధులు అడకత్తెరలో పోకచెక్కలా మారాయి. సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నా నాయకుల ఒత్తిళ్లతో అధికారుల చివాట్లు తినాల్సి వస్తోంది. దీంతో తమ సమస్యను తొలి విడతలో ఆయా మండలాల ఎంపీడీఓల దృష్టికి కార్యదర్శులు తీసుకెళ్లారు. దీనిపై తామేమీ చేయలేమంటూ ఎంపీడీఓలు చేతులెత్తయడంతో పాటు సర్దుకుపోవాలంటూ ఉచిత సలహా ఇస్తుండడం గమనార్హం. దీంతో ఇటీవల జేసీ అభిషేక్‌కుమార్‌ను కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. పని ఒత్తిడితో కుటుంబసభ్యులు, పిల్లలతో సరదాగా గడ లేక పోతున్నట్లు వాపోయారు. ఆస్తి పన్ను వసూళ్లు, సర్వేలతో పాటు గ్రీవెన్స్ సమస్యలతో సతమతం లక్ష్యాలు పూర్తి కాకపోతే ఎంపీడీఓలతో చివాట్లు పనిభారం తగ్గించాలంటూ కార్యదర్శుల గగ్గోలు సర్వేలతో సతమతం ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో లేకుండా ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది. కొన్ని సర్వేలకు ప్రజల నుంచి ఓటీపీలు తీసుకోవాలి. ఆ సమయంలో చాలా మంది ఓటీపీలు చెప్పడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమవుతోంది. మా బాధలు వర్ణానాతీతం. – రామ్మోహన్, ఏపీ గ్రామ కార్యదర్శుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్పని భారం పెరిగింది పంచాయతీ పరిధిలో ప్రతి పనినీ కార్యదర్శులకు అప్పగిస్తున్నారు. దీంతో పని భారం పెరిగింది. సుమారు 35 రకాలకు పైగా సేవలందిస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యతో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పని పూర్తి కాకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాల్సి ఉంటుంది. – ఓంప్రసాద్, ఏపీ పంచాయతీ కార్యదర్శుల పబ్లిసిటీ సెక్రటరీ -
ఆకట్టుకున్న మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పో
అనంతపురం: నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న బీవీఆర్‌కే ఫంక్షన్ హాలు వేదికగా రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన మెగా ఎడ్యుకేషన్ ఎక్స్పో గురువారం ప్రారంభమైంది. తొలి రోజే విశేష స్పందన లభించింది. ఎడ్యుకేషన్ ఎక్స్‌పోలో అనేక విద్యా సంస్థలు ప్రాతినిథ్యం వహించాయి. బెంగళూరుకి చెందిన హిందూస్తాన్ ఏవియేషన్ అకాడమీ (మారతహళ్లి), సంభ్రమ్ ఇనిస్టిట్యూట్ (జాలహళ్లి ఈస్ట్), ఎస్ఈఏ(సీ) ఇంజినీరింగ్ కళాశాల (కృష్ణరాజపురం)ల్లో అందించే కోర్సులు, ఫీజులు, అడ్మిషన్ల ప్రక్రియ, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా అందించే కోర్సులు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన వినూత్న కోర్సులపై విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పించారు. ప్రత్యేక స్టాళ్లను విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలించి .. కళాశాలల గురించి వివరాలు సేకరించారు. బెంగళూరులో చదవాలనుకునే విద్యార్థులకు ఇదొక చక్కని అవకాశమని పేర్కొన్నారు. కాగా, శుక్రవారంతో ఈ ఎక్స్పో ముగియనుంది. -
కర్బూజ పంటల పరిశీలన
పుట్టపర్తి రూరల్: ‘చేదు మిగిల్చిన తీపి పంట’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఉద్యాన అధికారులు స్పందించారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు మండల హెచ్ఓ నవీన్‌కుమార్ బృందం గురువారం ఎనుములపల్లి పర్యటించి, రైతులు సాగు చేసిన కర్బూజ పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలు, ఎంత మేర నష్టం వాటిల్లింది తదితర వివరాలు సేకరించారు. 10 నుండి 15 శాతం వరకు కాయల్లో చీలికలు ఏర్పడిందని, 30 శాతం వరకు పంట నష్టం జరిగినట్లుగా గుర్తించినట్లు నవీన్‌కుమార్ తెలిపారు. నూట్రీన్స్ బోరాన్, క్యాల్షియం తగిన మోతాదులో సరైన నీటి తడులు అందిస్తే చీలికలు ఏర్పడకుండా ఉంటాయని వివరించారు. మార్కెటింగ్ సతదుపాయం రైతుల అభ్యర్థనను ఉన్నతాధికారులకు నివేదిస్తామని భరోసానిచ్చారు. -
క్యాబ్‌ను ఢీ కొన్న కారు
బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు సమీపంలోని అనంతపురం నగరంలో నివాసముంటూ రోజూ విధులకు వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు వీలుగా ఓ ప్రైవేట్ క్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గురువారం విధులకు హాజరైన ఉపాధ్యాయులు సాయంత్రం పాఠశాలల వేళలు ముగిసిన తర్వాత క్యాబ్‌లో అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. చిత్రావతి నది బ్రిడ్జి దాటిన తర్వాత ఉప్పర్లపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే ముదిగుబ్బ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి క్యాబ్‌ను ఢీ కొంది. దీంతో క్యాబ్ అదుపు తప్పి డివైడర్ ఎక్కి బోల్తాపడింది. ఘటనలో ఉపాధ్యాయులు ఆనందరెడ్డి, బిల్లే ఉమాదేవి, పి.ఉమాదేవి, పార్వతమ్మకు తీవ్రగాయాలయ్యాయి. రామచంద్ర, మహబూబ్‌బాషా, చాంద్‌బాషా, విశాల, అనురాధ, రికార్డు అసిస్టెంట్ పార్వతమ్మ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాద విషయం తెలుసుకున్న ఎంఈఓలు చాముండేశ్వరి, సుధాకర్‌నాయక్, నల్లబోయనపల్లి హెచ్ఎం ప్రహ్లాదనాయుడు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ మాజీ చైర్మన్ హరినాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, ఓబిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంజీవరెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, నాగేశ్వరయ్య, అనిల్‌చౌదరి, నాగరాజు, ముదిగుబ్బ మండల నాయకులు సి.రామకృష్ణారెడ్డి, చంద్రమోహన్, చిట్టిబాల ఓబిరెడ్డి, ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఫోన్ ద్వారా క్షతగాత్రులతో డీఈఓ కిష్టప్ప మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు. నలుగురు ఉపాధ్యాయులకు తీవ్రగాయాలు మరో ఆరుగురికి స్వల్పగాయాలు -
ప్రత్యామ్నాయంపై పరిశీలకుల బృందం
అనంతపురం అగ్రికల్చర్: గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగులోకి రావడంతో గత సెప్టెంబర్‌లో ప్రఽత్యామ్నాయ విత్తనాల కింద జిల్లా రైతులకు ఉలవ, పెసర, అలసంద, కొర్ర తదితర వాటిని 80 శాతం రాయితీతో అందించారు. ఇందులో ప్రధానంగా మండలాల వారీగా ఎంత మంది రైతులు ప్రత్యామ్నాయం కింద ఉలవ విత్తనాలు తీసుకున్నారు, వారు విత్తనాలు సాగు చేశారా? పంటలను ఈ–క్రాప్‌లోకి నమోదు చేశారా? తదితర అంశాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి బృందాలు (వెరిఫికేషన్ టీమ్స్) ఏర్పాటు చేస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు ప్రత్యామ్నాయం కింద 27 వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయించగా... ఆలస్యంగా పంపిణీ మొదలు పెట్టడంతో 80 శాతం రాయితీతో 10 వేల క్వింటాళ్ల విత్తనాన్ని అందించారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ), అగ్రికల్చర్స్ ఆఫీసర్ల (ఏఓ)తో కూడిన 8 మందితో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు తమకు కేటాయించిన మండలాల్లో పర్యటించి డీ–కృషి యాప్‌లో విత్తన పంపిణీ డేటా ఆధారంగా రాండమ్‌గా 150 మంది రైతులను కలసి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. డీ–కృషి యాప్, ఈ–క్రాప్ డేటా క్రాస్ చెక్ చేసుకుని 10 ఫార్మాట్ల కింద సమగ్ర నివేదిక సమర్పించాలి. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో పరిశీలనకు అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు ఏడీఏలు, నలుగురు ఏఓలతో నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం లేపాక్షి: మండలంలోని పులమతి పంచాయతీ పరిధిలోని పి.సడ్లపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి బాబు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన మేరకు... పులమతిలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న బాబు.. ఇటీవల వార్షిక పరీక్షలు సక్రమంగా రాయలేకపోతున్నానని తరచూ బాధపడేవాడు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లి ఇంటి బయట శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పి వేశారు. 108 అంబులెన్స్ ద్వారా హిందూపురంలోని జిల్లాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై ఎస్ఐ నరేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చేనేత కార్మికుడి ఆత్మహత్యాయత్నం ధర్మవరం అర్బన్: స్థానిక సుందరయ్యనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు ముద్దుకృష్ణ గురువారం తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను కాపాడు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కాగా, ఆయన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ధర్మవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ధర్మవరం అర్బన్: మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ధర్మవరం ఒకటో పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ధర్మవరంలోని ఓ కాలనీకి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అదే వీధికి చెందిన యువకుడు లక్ష్మణ్... మూడు వారాలుగా బాలికను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. పలుమార్లు బాలిక తల్లిదండ్రులు దండించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో గురువారం రాత్రి 10.30 గంటలకు పోలీసులకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ట్రాక్టర్ బోల్తా ... డ్రైవర్ మృతి
సోమందేపల్లి: మండలంలోని మేకలపల్లి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ నాగేంద్రబాబు(20) మృతిచెందాడు. గురువారం ఇసుక లోడ్‌తో పెనుకొండకు వెళ్లి అన్లోడ్ చేసిన అనంతరం తన స్వగ్రామమైన రొద్దం మండలం నల్లూరుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ‘ఎస్ఐ సుధాకర్‌యాదవ్‌ను సస్పెండ్ చేయాలి’ అనంతపురం కార్పొరేషన్: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పీఎస్ ఎస్ఐ సుధాకర్‌యాదవ్‌ను సస్పెండ్ చేయాలంటూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా వారి పనితీరులో మార్పు రావడం లేదన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన న్యాయవాది నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు ఈ నెల 26న ఎంపీడీఓ కార్యాలయానికి వెళితే వారిపై దాడులకు తెగబడిన టీడీపీ గుండాలపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్ఐ సుధాకర్‌యాదవ్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. సమావేశంలో లీగల్ సెల్ నగరాధ్యక్షుడు ఎస్ వెంకటరాముడు, తదితరులు పాల్గొన్నారు. ‘ఏపీ సూపర్ కప్’ విజేత గోదావరి క్లబ్ అనంతపురం: రాష్ట్రంలో తొలిసారిగా అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా నిర్వహించిన ఏపీ సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా గోదావరి క్లబ్ జట్టు నిలిచింది. గురువారం కొల్లేరు ఫుట్‌బాల్ క్లబ్ (ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు) – గోదావరి ఫుట్‌బాల్ క్లబ్ (తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 2–1 గోల్స్ తేడాతో గోదావరి క్లబ్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బాబోయ్.. దోపిడీ దొంగలు
ఉరవకొండ: నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు, ఆమిద్యాల గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ కత్తులు, రాడ్లతో హల్చల్ చేశారు. ఆమిద్యాలలోని రంగమ్మ ఫిల్లింగ్ స్టేషన్ బంక్ వద్దకు బొలెరో వాహనంలో చేరుకున్న ఏడుగురు యువకులు ముఖానికి కర్ఛీప్లు కట్టుకుని అక్కడ నిద్రిస్తున్న సిబ్బందిని లేపి కత్తులు, రాడ్లతో బెదిరిస్తూ ఓ మూలన కూర్చొబెట్టారు. మేనేజర్ గదిలోకి చొరబడి రూ.2.80 లక్షలు అపహరించారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లారు. అనంతరం వజ్రకరూరులోని శివశక్తి పెట్రోల్ బంకులోనూ సిబ్బందిని బెదిరించి రూ1.20 లక్షలను అపహరించారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ రూరల్ సీఐ సయ్యద్ చిన్నగౌస్, అర్బన్ సీఐ మహనంది, ఎస్ఐ జనార్థన్‌నాయుడు, వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి, క్లూస్ టీం సభ్యులు అక్కడకు చేరుకుని నిందితుల వేలిముద్రలు సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకుని ఆమిద్యాల పెట్రోల్ బంకు మేనేజర్ పెద్దన్న, వజ్రకరూరు బంకు మేనేజర్ రామాంజినేయలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, దోపిడీ దొంగలు హిందీలో మాట్లాడడంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
దౌర్జన్యం.. దుర్మార్గం
సాక్షి, పుట్టపర్తి/ పెనుకొండ రూరల్/ పెనుకొండ: ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక ‘పరిటాల’ కుటుంబం పైశాచిక రాజకీయం చేసింది. రౌడీయిజం చేస్తూ.. దౌర్జన్యకాండ సృష్టించి.. అధికారులను అడ్డు పెట్టుకుని ఎంపీపీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రయత్నించింది. మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఆదేశాలతో రామగిరి ఎస్ఐ సుధాకర్‌యాదవ్ తాను ఓ పోలీసు అధికారి అనే విషయం మర్చిపోయారు. పచ్చ కండువా వేసుకున్న కార్యకర్త తరహాలో చక్రం తిప్పడం చర్చనీయాంశమైంది. మొన్నటి వరకూ సెలవులో ఉన్న ఎస్ఐ సుధాకర్‌యాదవ్ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధుల్లో చేరడం పలు అనుమానాలకు తావిస్తోంది. సజావుగా ఎన్నిక జరిగితే ఓడిపోతామని తెలిసే ఎమ్మెల్యే పరిటాల సునీత దిగజారుడు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అధికారులను పావులుగా వాడుకొని దొడ్డిదారిన వైఎస్సార్సీపీ సభ్యులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి, పదవులను ఆఫర్ చేసి లాక్కోవాలనే ప్రయత్నం చేశారు. ప్లాన్ ఫలించకపోయేసరికి ఎన్నికను వాయిదా వేయించారు. అభ్యర్థి లేకున్నా కక్కుర్తి రాజకీయం.. రామగిరి ఎంపీపీ పదవి మహిళకు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తరఫున ఒక్క పురుషుడు మాత్రమే గెలిచారు. పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు కూడా పురుషులే కావడంతో రామగిరి నుంచి టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థి లేరు. అయితే ప్రలోభాలకు గురి చేసి వైఎస్సార్సీపీ సభ్యులను లాక్కొని టీడీపీ కండువా వేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని పరిటాల సునీత వేసిన ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయింది. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. అందులో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ మరణించారు. ఎంపీపీ పదవి దక్కాలంటే కనీసం ఐదుగురు మద్దతు అవసరం. ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున ఐదుగురు సభ్యులు బెంగళూరు క్యాంపులో ఉన్నారు. కావాలనే కాలయాపన.. వైఎస్సార్సీపీ సభ్యులు ఆరుగురు గురువారం బెంగళూరు నుంచి రామగిరికి ఎన్నికల కోసం వస్తుండగా.. బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరి తీసుకెళ్తామని.. మిగతా వాళ్లు రాకూడదని సూచించారు. బాగేపల్లి నుంచి ఏడు వాహనాల్లో వైఎస్సార్సీపీ సభ్యులతో రామగిరికి బయలుదేరారు. అయితే కాన్వాయ్ చెన్నేకొత్తపల్లి దాటే సమయానికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ సమయానికి రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి ముగ్గురు సభ్యులు మాత్రమే చేరుకోవడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు మీరింది. ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంజీవయ్య ప్రకటించారు. ఎమ్మెల్యేతో వీడియో కాల్స్.. రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడినట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ సభ్యులను తిరిగి కర్ణాటక సరిహద్దు దాటించే వరకూ బందోబస్తులో ఉండాలి. అయితే ఎస్ఐ సుధాకర్‌యాదవ్ కల్పించుకుని వైఎస్సార్సీపీ సభ్యులతో వీడియో కాల్స్ ద్వారా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌తో మాట్లాడించారు. పదవులు ఆఫర్ చేసి.. డబ్బు ద్వారా ప్రలోభాలకు గురి చేశారు. పార్టీ మారకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులందరూ ఒకే మాటపై నిలబడి.. పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. సీకే పల్లి నుంచి పెనుకొండ వెళ్లే లోపు ఎస్ఐ సుధాకర్‌యాదవ్ మూడు వాహనాలు మారడం అనుమానాలకు తావిస్తోంది. మహిళా ఎంపీటీసీ కిడ్నాప్.. లీగల్ ప్రొసీజర్ ప్రకారం వైఎస్సార్సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి తరలించాలని పోలీసులు సూచించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే పక్కా ప్లాన్‌తో వచ్చిన టీడీపీ నేతలు వాహనాల్లో వచ్చి పేరూరు –2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి యత్నించారు. మహిళా అభ్యర్థి ఉంటే.. నామినేషన్ దాఖలు చేసి.. ఏదో విధంగా బెదిరించి పార్టీ మార్చుకోవచ్చనే ఆలోచనతో పరిటాల సునీత ప్లాన్ చేసి దళిత మహిళను ఇరకాటంలో పడేశారు. మాజీ మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ నిరసన.. పోలీసుల తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలసి అంబేడ్కర్ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించారు. ఎంపీటీసీ భారతిని పోలీసులు టీడీపి వర్గీయులకు అప్పజెప్పారని, ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాసే కుట్ర అని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పెనుకొండలో మళ్లీ ఫ్యాక్షన్ బీజాలు వేస్తున్నారని విమర్శించారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినదించారు. అనంతరం పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. ప్రశాంత ప్రాంతాల్లో కల్లోల వాతావరణం.. కొన్నేళ్లుగా ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పెనుకొండలో పరిటాల అనుచరుల వికృత చేష్టలతో నాడు పరిటాల రవీంద్ర చేసిన అరాచకాలు గుర్తొచ్చాయి. ముందు రోజు రామగిరి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అల్లర్లు.. ఎన్నికల రోజున పెనుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ సభ్యురాలు భారతి కిడ్నాప్ ఉదంతంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఏమాత్రం బలం లేకపోయినా కుటిల రాజకీయంతో ఎంపీపీ స్థానాలను కై వసం చేసుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేశారు. రొద్దంలో వారి పాచిక పారకపోగా.. గాండ్లపెంట, రామగిరి ఎంపీపీలను తమ ఖాతాలోకి వేసుకోవాలని అరాచకానికి తెరతీశారు. ఇందులో భాగంగానే ఆ రెండు ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ముఖ్యంగా రామగిరిలో ‘పరిటాల’ కుటుంబం దౌర్జన్యకాండ అందరినీ బెంబేలెత్తిస్తోంది. రామగిరి ఎంపీపీ ఎన్నికలో పరిటాల కుటిల రాజకీయం ప్లాన్ ప్రకారం ఎన్నిక వాయిదా వేయించిన వైనం వైఎస్సార్సీపీ సభ్యురాలు భారతి కిడ్నాప్ గాండ్లపెంటలోనూ సమయం దాటిందని ఎన్నిక వాయిదా రొద్దంలో బెడిసికొట్టిన టీడీపీ ప్లాన్ అధికారం ఉందనే అరాచకం గత ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని అధికార మదంతో ఇప్పుడు అరాచకం చేస్తున్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకొని ఎంపీపీ స్థానాలను కై వసం చేసుకునేందుకు యత్నించడం సిగ్గుచేటు. రొద్దంలో టీడీపీ ప్రలోభాలకు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు తలొగ్గలేదు. రామగిరి, గాండ్లపెంటలో వైఎస్సార్సీపీకి బలమున్నా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం కూడా అధికార పార్టీ నేతలకు సపోర్ట్ చేయడం బాధాకరం. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం దుర్మార్గం. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు పరిటాల కోసమే పని చేస్తున్నారా? హైకోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పరిటాలకు అనుకూలంగా పని చేయడం దారుణం. పోలీసులు తమ పని తాము చేస్తే.. ఓ దళిత మహిళ ఎలా కిడ్నాప్‌కు గురవుతుంది. మా ఎంపీటీసీ సభ్యులతో పరిటాల సునీతతో ఫోన్ కాల్స్ ఎలా మాట్లాడిస్తారు? పరిటాల కుటుంబానికి అనుకూలంగా పని చేసేందుకే వచ్చి ఉంటే యూనిఫాం తీసి.. పచ్చ కండువా వేసుకుని తిరగండి. బందోబస్తులో ఉండాల్సిన పోలీసులు పరిటాల సునీతతో ఫోన్ కాల్స్ మాట్లాడించాల్సిన అవసరం ఏముంది. మొన్నటి దాకా సెలవులో ఉన్న ఎస్ఐ సుధాకర్‌యాదవ్ ఉన్నఫలంగా డ్యూటీకి ఎందుకొచ్చాడు. పరిటాల సునీతకు ఊడిగం చేసేందుకే వచ్చాడా? – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే జేబుల్లో కారం.. చేతిలో రాళ్లు అనంతపురం జిల్లా కంబదూరు ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు పన్నింది. ఎన్నిక సందర్భంగా ‘పచ్చ’ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేశారు. ఒక్కొక్కరికి రూ.3 నుంచి రూ.4 లక్షలు ఇస్తామని బేరసారాలు చేశారు. ఈ క్రమంలోనే ఏకంగా డీఎస్పీ, ఆర్డీఓ వాహనాలపై రాళ్ల దాడికి యత్నించారు. జేబుల్లో కారం పొడి.. రాళ్లతో వచ్చి వీరంగం సృష్టించారు. అరగంట పాటు విద్యుత్‌కు అంతరాయం కలిగించారు. మండలంలోని ఒంటారెడ్డి పల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ఏనుముల సోమశేఖర్‌ను ఎన్నికకు అరగంట ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆయన ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని తిరిగి ఎన్నిక ప్రక్రియలో పాల్గొనడం గమనార్హం. ఇక.. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల ఎంపీపీగా రాళ్ల అనంతపురం ఎంపీటీసీ కే. లక్ష్మీదేవి ఎన్నుకుంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మాన ప్రతిని ములకనూరు ఎంపీటీసీ తిమ్మరాజమ్మ చింపివేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు ఎన్నిక మధ్యలో ప్రిసైడింగ్ ఆఫీసర్ మద్దిలేటి అనారోగ్యం పాలవడం కలకలం రేపింది. వెంటనే ఆయన్ను కంబదూరు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ వెంటనే అక్కడకు చేరుకుని ఎన్నికల అధికారిగా శెట్టూరు తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టిని నియమించి.. ప్రక్రియను పూర్తి చేయించారు. ఎంపీపీగా కే. లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎంపికై నట్లు జేసీ శివ్ నారాయణ శర్మ ప్రకటించారు. -
అడ్డుకొని.. వాయిదా వేయించి
● గాండ్లపెంటలో అడుగడుగునా పచ్చ ఆటంకంగాండ్లపెంట: బలంలేకపోయిన ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుటిల యత్నాలకు తెరలేపింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో సోమయాజులపల్లి స్థానంలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. మిగిలిన 6 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. అయితే వేపరాల ఎంపీటీసీ టీడీపీకి మద్దతు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ వైపు ఐదుగురు ఎంపీటీసీలు ఉన్నారు. సభలో టీడీపీకి ఇద్దరు సభ్యులు ఉండగా సంఖ్యా బలం లేకపోవడంతో పాటు బలపరిచే వారు కూడా లేరు. ఎంపీపీ ఎన్నికలో పాల్గొనాల్సిన ఎంపీటీసీలు 11 గంటలకు కార్యాలయానికి చేరుకోవాల్సి ఉన్నా టీడీపీ ఇద్దరు ఎంపీటీసీలు చేరుకోగా .. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కదిరి నుంచి గాండ్లపెంటకు వస్తుండగా మార్గమధ్యలో కదిరి–రాయచోటి ప్రధాన రహదారిలో ఫ్రెండ్స్ పంక్షన్ హాల్ వద్ద పోలీసులు సోదాల పేరుతో గంటల కొద్దీ అడ్డుకున్నారు. దీంతో ఆలస్యం జరిగింది. అక్కడి నుంచి కదిరి టౌన్ సీఐ ఎంపీటీసీలను తన వాహనంలో తీసుకువచ్చారు. ప్రధాన రహదారిలో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే సమయంలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు సీఎస్ అబ్దుల్‌రవూఫ్ ఎంపీటీసీలను పిలుచుకు వస్తుండగా పోలీసులు రవూఫ్‌ను లోపలికి పోకుండా అడ్డుకున్నారు. పార్టీ విప్ అధికారికంగా ఇచ్చిందని, పీఓతో మాట్లాడిన అనంతరం లోపలికి పంపారు. అయితే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు ఆలస్యంగా వచ్చారంటూ ఎన్నికల అధికారి ఎన్నికను శుక్రవారం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభను వాయిదా వేయకూడదని వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు సమావేశ భవనంలోనే బైఠాయించారు. ఎంపీటీసీలను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు అందరిని అక్కడి నుంచి పంపివేశారు. -
పడిపోయిన చింత పండు ధర
హిందూపురం అర్బన్: హిందూపురం మార్కెట్లో చింత పండు ధరలు తగ్గుముఖం పట్టాయి. గత రెండు వారాలతో పోలిస్తే క్వింటాపై రూ.6,000 తగ్గుదల కనిపించింది. గురువారం మార్కెట్‌కు 1,700 క్వింటాళ్ల చింత పండు రాగా ఈ నామ్ పద్ధతిలో మార్కెట్లో వేలం పాట నిర్వహించారు. కరిపులి రకం గత రెండు వారాల క్రితం గరిష్టంగా క్వింటా రూ.33 000 పలుకగా ఈవారం 27,000 పలికింది. కనిష్టం రూ. 8,100గా పలికింది. సగటున రూ.13,500 పలికింది. ఇక.. ప్లవర్ రకం క్వింటా గరిష్ట ధర రూ. 12,500 పలుకగా కనిష్ట ధర రూ.4,500 పలికింది. సగటు ధర రూ.7,500 పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. గత వారం అక్కడక్కడా వడగండ్ల వర్షం కురవడం, వాతావరణ మార్పులు ధరలపై ప్రభావం చూపాయన్నారు. -
రొద్దం ఎంపీపీగా నాగమ్మ
రొద్దం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లూరు పంచాయతీ ఎంపీటీసీ సభ్యురాలు నాగమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం 15 మంది ఎంపీటీసీ స్థానాలు ఉండగా 15 స్థానాలూ వైఎస్సార్సీపీ సభ్యులు గెలుపొందారు. గత ఏడాది ఎంపీపీ చంద్రశేఖర్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 14కు చేరింది. నాగమ్మకు మద్దతుగా మిగిలిన వారంతా చేతులెత్తారు. ఎన్నిక అధికారులు నాగమ్మను ఎంపీపీగా ప్రకటించారు. ఎన్నికల అధికారులు చేతుల మీదుగా ఆమె డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల ప్రొసిడింగ్స్ అధికారి విజయప్రసాద్, ఎంపీడీఓ రామ్‌కుమార్ పాల్గొన్నారు. -
జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు
అనంతపురం:టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిబలం లేకపోయినా రామగిరి ఎంపీపీ ఎన్నిక లో పోటీకి దిగారుపేరూరు ఎమ్పీటీసీ భారతిని కిడ్నాప్ చేశారుకొందరు సీఐలు, ఎస్సైలు పరిటాల సునీత కు తొత్తుగా వ్యవహరిస్తున్నారువందలాది మంది టీడీపీ గూండాలను రామగిరి లోకి ఎలా అనుమతించారు?పరిటాల హింసా రాజకీయాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం విజయనగరం జిల్లాభోగాపురం మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంవైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ పచ్చిపాల నాగలక్ష్మిని వైస్ ఎంపీపీగా ప్రకటించిన ఎన్నికల అధికారి. చిత్తూరు జిల్లా:కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు: ఎమ్మెల్సీ భరత్ఎంపీటీసీ లను ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నారుపోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారుమా ఎంపీటీసీ వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారుపోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారుటిడిపి సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలు ను బెదిరించారురాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోంది అని చెప్తున్న చంద్రబాబు కుప్పం లో ఏం జరుగుతుందో అందరు చూశారువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ లను భయబ్రాంతులకు గురి చేశారుఈ రోజు మా పై దాడి కూడా చేయాలని కుట్ర చేశారుఈ ఎన్నికలు పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం,కోరం లేకుండా ఎంపిపి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..గోవింధప్ప శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ప్రజాస్వామ్య వాదులు కుప్పం వైపు ఒకసారి చూడండి..ఇక్కడ ఏం జరుగుతుందో..కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారుటిడిపి నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారుకుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ను ఖూనీ చేశారుఅధికారులు చేసిన తీరుపై హైకోర్టు లో ఈ కేసు సూటిగా తీసుకోవాలిటిడిపి కు కుట్ర రాజకీయాలు చేస్తోంది కుందనందన రెడ్డి, రామకుప్పం ఎంపీటీసీఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడు జరగ లేదుసిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలివైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపిటిసి అందరినీ తప్పుడు కేసులు పెడతామని బెదిరించడంమా పై కేసులు పెడతాం అని బెదిరించారురామకుప్పం వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ అందరినీ బెదిరించారుదీనిపై న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం ఏలూరు: కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూక👉ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత👉కూటమికి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో👉గెలుపు కోసం ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి👉మాజీ మంత్రి కారుమూరి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు👉ఎన్నికకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూకవైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉పల్నాడు జిల్లా: నరసరావుపేట రూరల్ మండలం వైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ దారుణాలకు ఒడిగట్టింది: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి👉పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తోంది👉రెండు రోజుల నుంచి మా ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు👉పోలీసులతో కేసులు పెడతావని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు👉ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ భర్తను రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు👉పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని పోలీసులు తీసుకువెళ్లారు👉పోలీసులే వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను తీసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు👉టీడీపీ నాయకులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం👉వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేయరు👉లోకేష్ పోలీసులను అడ్డంపెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడుకుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం👉కుప్పం మెయిన్ రోడ్డు అన్నవరం క్రాస్ వద్ద ఎంపీటీసీలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించిన టీడీపీ శ్రేణులు👉రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు. పరిస్థితి ఉద్రిక్తం👉ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవని రామకుప్పం మండలంలో ఎంపీపీ ఎన్నిక కోసం అడ్డదారుల్లో ప్రయత్నాలుటీడీపీ అరాచకం.. ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీతూర్పుగోదావరి: అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీపీ స్థానాన్ని అడ్డగోలుగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ👉బిక్కవోలు మండలంలో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేని టీడీపీ👉బెదిరింపులు, ప్రలోభాలు చూపి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను తమ వైపుకు తిప్పుకున్న టీడీపీ నేతలు👉టీడీపీ వ్యవహార శైలితో ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలువైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులుచిత్తూరు జిల్లా: వి.కోట మండలం పట్రపల్లి గ్రామం జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు నివాసం నుంచి పోలీస్ భద్రత నడుమ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను రామకుప్పం ఎంపీడీవో కార్యాలయానికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో వి.కోట వద్ద టీడీపీ శ్రేణులు అడ్డగించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. హైకోర్టు ఆదేశాలతో బందోబస్తుతో తరలిస్తుండగా.. పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు.తాడేపల్లి: జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు తెరతీసింది. బలం లేకున్నా దొడ్డిదారిన పదవులు దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. వైఎస్సార్సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు భారీఎత్తున ప్రలోభాలకు పాల్పడుతోంది. తమ దారికి రాకుంటే కిడ్నాప్‌లు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం చేస్తూ.. నిన్నటి నుంచే అనేకచోట్ల టీడీపీ నేతలు భీతావాహ వాతావరణం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపికి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్ చేశారు.తూర్పు గోదావరి జిల్లా జిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర వేశారు. ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగించింది. ఒకే సభ్యుడు ఉన్న వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ వేసింది. టీడీపీ, జనసేన అరాచకాలను చూసి ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.👉శ్రీ సత్యసాయి జిల్లా: ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపారు. బలం లేకపోయినా ఎంపీపీ స్ధానాలు కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతల దౌర్జన్యాలకు దిగుతున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో విప్ జారీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలపై దాడి చేసిన పరిటాల వర్గీయులు.. వైఎస్సార్ సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు.👉వైఎస్సార్సీపీ నేతల వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయంటూ పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. కదిరి వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు కిడ్నాప్ కేసులు నమోద చేయగా, తాము సురక్షితంగా ఉన్నామని చామలగొంది, కటారుపల్లి ఎంపీటీసీలు సెల్ఫీ విడియో విడుదల చేశారు. అయినప్పటికీ కదిరి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా సహా ఆరుగురిపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.👉చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రామకుప్పం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రామకుప్పం ఎంపీడీవో కార్యాలయం బి. ఫార్మ్ తీసుకునేందుకు వెళ్లిన మురుగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌ను పోలీలసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏ స్టేషన్‌కు తీసుకువెళ్లారో కూడా పోలీసులు చెప్పలేదు. మురుగేశ్తో పాటు సర్పంచ్‌లు మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మురుగేష్, సర్పంచ్ మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు విడిచి పెట్టారు.👉ఏలూరు జిల్లా: నేడు కైకలూరు మండలం వైస్ ఎంపీపీ-2 ఎన్నిక జరగనుంది. వైఎస్ ఎంపీపీ-2 ఎన్నికకు సైతం అధికారి ప్రలోభాలకు తెరతీసింది. బలం లేకపోయినా ప్రలోభాలతో వైస్ ఎంపీపీ- 2 స్థానాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. ఉదయం 11 గంటలకు కైకలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నిక జరగనుంది. చేతులు ఎత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించనున్నారు.👉కృష్ణా జిల్లా: రామవరప్పాడు ఉపసర్పంచ్‌కు ఎన్నిక ఇవాళ జరగనుంది. వార్డు సభ్యురాలు రాజీనామా చేయడంతో ఉపసర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ చీప్ పాలిటిక్స్ తెరతీసింది. 11వ వార్డు సభ్యుడు కత్తుల శ్రీనివాస్‌కు వైఎస్సార్సీపీ వార్డు సభ్యుల మద్దతు, ఆరో వార్డు సభ్యుడు అద్దెపల్లి సాంబశివనాగరాజుకు కూటమి మద్దతు ఉంది. కత్తుల శ్రీనివాస్‌కే మెజారిటీ మద్దతు ఉంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.👉వైఎస్సార్ జిల్లా: నేడు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మూడు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. రాయచోటి, ఖాజీపేట, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీలను పాలకవర్గాలు ఎన్నుకోనున్నాయి. పూర్తి స్థాయి బలం ఉండటంతో మూడు చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశం ఉంది. పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది.👉తిరుపతి జిల్లా: తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠత కొనసాగుతోంది. పటిష్ట బందోబస్తు నడుమ తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కోసం ముందుగానే వైఎస్సార్‌షీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్యాంప్ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.విమానాశ్రయం నుంచి తుమ్మలగుంట వరకు ఎంపీటీసీల బస్సులను భారీ భద్రత నడుమ పోలీసులు తరలించారు. మరి కాసేపట్లో తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీలు పాల్గొననున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థిగా పేరూరు-1 ఎంపీటీసీ మూలం చంద్రమోహన్‌రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎంపీపీ ఎన్నికల్లో బలం లేనందున పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నట్లు సుమాచారం. వైఎస్సార్సీపీకి వన్ సైడ్ మెజారిటీ ఉండటంతో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి.టీడీపీ ద్వంద్వనీతి👉 వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.👉జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.👉బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
టీడీపీ నేత అండతో మత్తు మందు విక్రయం
రాయదుర్గంటౌన్: మత్తు కలిగించే టోసెక్స్ సిరప్‌ను అనధికారికంగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రాయదుర్గంలోని బళ్లారి రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న శ్రీవిజయలక్ష్మి మెడికల్ స్టోర్‌ను జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హనుమన్న బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. టీడీపీ నాయకుడు చదం పశుపతనాథరెడ్డి అండతో ఆయన సోదరుడు హనుమానరెడ్డి అక్రమ దందా కొనసాగిస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన దాదాపు వెయ్యికిపైగా టోసెక్స్ సిరప్ బాటిళ్లను బల్క్‌గా అమ్ముతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అలాగే వైద్యుడి స్కానింగ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తుండడం, ఫార్మాసిస్ట్ లేకపోవడం లాంటి మరో రెండు కేసులనూ నమోదు చేసి యజమాని హనుమారెడ్డికి నోటీసు జారీ చేశారు. అనంతరం పోలీసులు, సచివాలయ వీఆర్ఓల సమక్షంలో పంచనామా చేసి నివేదిక సిద్ధం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెడికల్ షాపును సీజ్ చేయనున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా, రెండు వారాల క్రితం కర్ణాటకలోని చిత్రదుర్గలో కాలేజీ విద్యార్థులకు టోసెక్స్ సిరప్ విక్రయిస్తూ ముగ్గురు వ్యక్తులు అక్కడి పోలీసులకు పట్టుపడ్డారు. విచారణలో తాము రాయదుర్గంలోని విజయలక్ష్మి మెడికల్ స్టోర్‌లో కొనుగోలు చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. దీంతో అప్పట్లో హనుమారెడ్డిని చిత్రదుర్గ పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవల బెయిల్‌పై విడుదలై వచ్చాడు. కర్ణాటక పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే విజయలక్ష్మి మెడికల్ స్టోర్‌ను తనిఖీ చేసినట్లుగా సమాచారం. రాయదుర్గంలోని శ్రీవిజయలక్ష్మి మెడికల్ స్టోర్‌లో అమ్మకాలు డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీల్లో బయటపడిన టోసెక్స్ సిరప్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు -
రామగిరిలో రౌడీరాజ్యం
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి సాక్షి, పుట్టపర్తి : మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు రెచ్చిపోయారు. ‘రామగిరి అంటే రౌడీ రాజ్యం.. పరిటాల రాజ్యాంగం అమల్లో ఉంటుంది’ అన్న రీతిలో కల్లోలం సృష్టించారు. నేడు (మార్చి 27) జరగబోయే రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అనెక్సర్ 1, 2 ఇచ్చేందుకు బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీకి చెందిన న్యాయవాది కురుబ నాగిరెడ్డి, రాప్తాడు వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, పార్టీ వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డిపై టీడీపీ అల్లరిమూకలు దాడికి దిగాయి. రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోగానే.. పక్కా ప్రణాళికతో కొందరు గుంపుగా వచ్చి భౌతికదాడికి దిగారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి తోసుకెళ్లి బంధించారు. లోపల ఎంపీడీఓను సైతం చితకబాదినట్లు సమాచారం. అనెక్సర్ 1, 2 పత్రాలను చించేశారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న వైఎస్సార్సీపీ నేతల వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. వాహనాల్లోకి మారణాయుధాలు విసిరి.. అక్రమ కేసులు బనాయించాలనే యత్నం చేశారు. అనంతరం పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ దాడి చేసిన వారిని వదిలేసి..అనుమతి లేనిదే ఎందుకొచ్చారంటూ బాధితులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ రత్న రామగిరికి చేరుకుని..విచారణ చేపట్టారు. మెజార్టీ లేకపోయినా.. రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా... నసనకోట మినహా తొమ్మిదింట (పేరూరు–1, పేరూరు–2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, రామగిరి, పోలేపల్లి, గంతిమర్రి, మాదాపురం, కుంటిమద్ది) వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలిచాడు. రామగిరి ఎంపీపీ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో వైఎస్సార్సీపీకి చెందిన మీనుగ నాగమ్మ ఆ పదవిలో కొనసాగారు. అయితే..ఆమె ఈ ఏడాది జనవరిలో అకాల మరణంతో ప్రస్తుతం ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. మండలంలో ఐదుగురు మహిళా ఎంపీటీసీ సభ్యులుండగా.. అందరూ వైఎస్సార్సీపీ వారే. అయినప్పటికీ ఎంపీపీ పదవిని టీడీపీ పరం చేయాలని పరిటాల సునీత తాపత్రయ పడుతున్నట్లు స్పష్టమవుతోంది. అక్రమ కేసులు.. అరెస్టులకు ప్లాన్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి.. అరెస్టు చేయించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేసినట్లు బుధవారం రామగిరి ఘటనా దృశ్యాలను బట్టి స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలను ఎంపీడీఓ కార్యాలయంలో బంధించి.. బయట ఉన్న వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాటిలోకి మారణాయుధాలు చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. ‘తోపుదుర్తి’ని అడ్డగించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి సమాచారం అందుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రామగిరి బయలుదేరారు. అయితే..మార్గ మధ్యంలో సోమందేపల్లి క్రాస్ వద్ద పెనుకొండ డీఎస్పీ వై.వెంకటేశ్వర్లు అడ్డుకుని సోమందేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మూడు గంటల సేపు స్టేషన్లోనే కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న ఉషశ్రీచరణ్ అక్కడికి చేరుకుని.. పోలీసులతో వాగ్వాదం చేశారు. ప్రశాంతి నిలయం/సోమందేపల్లి: గాండ్లపెంట, రామగిరి, రొద్దం ఎంపీపీ స్థానాలకు గురువారం నిర్వహించనున్న ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె పార్టీ శ్రేణులలో కలసి కలెక్టరేట్‌కు విచ్చేసి జేసీని ఆయన చాంబర్లో కలసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె పుట్టపర్తిలో, సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎంపీపీ ఎన్నికలు జరగనున్న మూడుచోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, కూటమి పార్టీలకు ఒక్క చోట కూడా అవకాశం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఆ స్థానాలన్నీ వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంటుందన్నారు. దీంతో దొడ్డిదాడిలో ఎంపీపీ పీఠాలు దక్కించుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ నేతలు జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్‌కు ఊపిరి పోస్తున్నారని మండిపడ్డారు. రామగిరి మండలంలో టీడీపీ నాయకులు అల్లర్లు సృష్టించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిస్థితిని సమీక్షించడానికి వెళ్తున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే న్యాయ స్థానం ముందు నిలవాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి పార్టీల నాయకులు, ఎమ్మెల్యేల కుట్రలను చట్టపరిధిలో ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు పార్టీ బలపరచిన అభ్యర్థికి మద్దతు తెలిపి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆమె కోరారు. ఎంపీపీ పదవి ఆశించడం హాస్యాస్పదం తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలకు గానూ ప్రజలు కేవలం ఒక్క సీటు మాత్రమే టీడీపీకి ఇచ్చారు. అయినా ఎంపీపీ పదవి ఆశించడం హాస్యాస్పదం. ప్రజాక్షేత్రంలో గెలవడం చేతకాక.. దొడ్డిదారిలో పదవులు కావాలనే ఆశ ఎందుకు? మెజారిటీ సీట్లు లేనప్పుడు ఎన్నికలకు రావడమే అనవసరం. ప్రత్యర్థి పార్టీ నేతలను బెదిరింపులకు గురి చేయడం రాజకీయం కాదు. ఎస్పీ నిష్పక్షపాతంగా పని చేస్తారనే నమ్మకం ఉన్నప్పటికీ రామగిరి ఎస్ఐ సుధాకర్‌యాదవ్ మాత్రం పూర్తిగా పరిటాల సునీత కనుసన్నల్లోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. రామగిరి వెళ్లాల్సిన ప్రతిసారీ పోలీసుల అనుమతి తీసుకోవాలని ఏ రాజ్యాంగంలోనూ లేదు. రామగిరి మండలం పాకిస్తాన్లో లేదు కదా?! ప్రశాంతంగా ఉండే ప్రాంతాలను దోపిడీ, రౌడీరాజ్యంగా మార్చడమే పరిటాల కుటుంబం పని. ఎంపీటీసీ సభ్యుల పిటిషన్ మేరకు ఎన్నిక పూర్తయ్యే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి. ఎంపీపీ ఎన్నికతో పరిటాల సునీతకు ఏం అవసరం ఉంది? మహిళా అభ్యర్థులు టీడీపీలో లేరు. ఎన్నికల హాలులో కూర్చుని వెళ్లకుండా.. కొట్లాట, గలాట ఎందుకు? గతంలో సునీత మంత్రిగా ఉన్న సమయంలోనూ కనగానపల్లి ఎంపీపీ ఎన్నిక విషయంలో ఇద్దరు మహిళా సభ్యులపై చేయి చేసుకున్న ఘటన అందరికీ గుర్తుంది. ఎంపీపీ పదవి కోసం వీధికెక్కుతోన్న పరిటాల సునీతను చంద్రబాబు నియంత్రించాలి. రెచ్చిపోయిన పరిటాల అనుచరులు వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీడీఓపై దాడి వాహనాల అద్దాలు ధ్వంసం ఎంపీపీ ఎన్నికను కల్లోలం చేయాలని కుట్రలు ‘పరిటాల’ రాజ్యాంగం అమలు చేస్తున్న సునీత జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన ఉషశ్రీ చరణ్ పీఠాలు దక్కించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపాటు -
రూ.వెయ్యి కంతు కట్టనందుకు.. ఇంటికి తాళం
● ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ దౌర్జన్యం పెనుకొండ రూరల్: ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల దౌర్జన్యాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. చిన్నపాటి కంతు చెల్లించడంలో జాప్యం చోటు చేసుకోవడంతో ఓ మహిళ ఇంటికి తాళం వేసిన ఘటన పెనుకొండ మండలంలో చోటు చేసుకొంది. వివరాలు.. మండలంలోని కొండంపల్లి గ్రామానికి చెందిన నాగమ్మ... ఫ్యూజిన్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రూ.40 వేల రుణం తీసుకుంది. నిబంధనల మేరకు ప్రతి రెండు వారాలకు ఒకసారి కంతు చెల్లిస్తూ వచ్చారు. ఈ వారం కంతు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉండగా డబ్బు సమకూరక ఇబ్బంది పడుతున్న నాగమ్మ తన కుమారుడు వడ్డె అంజితో కలసి ఒక రోజు గడువు ఇవ్వాలని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులను కోరారు. దీనిపై కంపెనీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడుతూ ఇంటి నుంచి బలవంతంగా నాగమ్మను బయటకు పంపి తాళం వేశారు. దీంతో చేసేదేమీ లేక ఇంటి ముందే బాధితులు ఉండిపోయారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై కంపెనీ బ్రాంచ్ మేనేజర్ మంజులను ఫోన్లో వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. -
బలం లేకున్నా.. బరితెగింపు
సాక్షి, పుట్టపర్తి ప్రజా క్షేత్రంలో ఓడిపోయినా.. అధికార బలంతో పదవులు దక్కించుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగానే దౌర్జన్యాలకు దిగుతూ.. బెదిరింపు రాజకీయాలకు తెరలేపారు. జిల్లాలో రామగిరి, గాండ్లపెంట, రొద్దం మండలాల పరిషత్ అధ్యక్షులకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఏ మండలంలోనూ టీడీపీకి మెజారిటీ లేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున టీడీపీ మూడు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అయితే వివిధ కారణాలతో ఎంపీపీ స్థానాలకు ఎన్నిక జరగనుండటంతో పీఠం కోసం కూటమి పార్టీల నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చెప్పిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే చాలామంది ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులు వెళ్లినట్లు తెలిసింది. రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరులు, కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వర్గీయులు, పెనుకొండలో మంత్రి సవిత వర్గం.. ప్రత్యర్థి వైఎస్సార్సీపీ సభ్యులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. అయితే ఏ ఒక్క మండలంలో కూడా టీడీపీ గెలిచేందుకు సరిపడా సంఖ్యాబలం లేదు. దీంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయించి మరో ఆరు నెలల పాటు ఎంపీపీ పదవి ఎవరికీ లేకుండా చేయాలని కూటమి పార్టీల నేతలు కుట్రలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎంపీపీ ఎన్నికకు హాజరు కావొద్దని ఎంపీటీసీ సభ్యులకు వార్నింగ్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులంతా పార్టీ క్రమశిక్షణకు లోబడి ఎన్నికల్లో పాల్గొనేందుకు సంసిద్ధమయ్యారు. మండలానికి ఒక సీటు కూడా లేదాయె.. రామగిరిలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది. మిగతా 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించి ఎంపీపీ పీఠం కై వసం చేసుకుంది. అయితే రామగిరి ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక రొద్దం మండలంలో 15 స్థానాలకు గానూ టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. రొద్దం ఎంపీపీగా ఉన్న చంద్రశేఖర్ అకాల మరణంతో అక్కడ ఎన్నిక జరగనుంది. గాండ్లపెంట మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీడీపీ ఒక్క చోట మాత్రమే గెలిచింది. ఎంపీపీగా ఉన్న జగన్మోహన్ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సంఖ్యా బలం ఐదుగా ఉంది. రామగిరిలో ఒక్క సీటుతో రాజకీయం.. రామగిరిలో పది సీట్లకు గానూ టీడీపీ ఒక్కచోటే గెలిచింది. రామగిరి ఎంపీపీ జనరల్ మహిళకు రిజర్వు చేశారు. టీడీపీ తరఫున మహిళలు గెలవలేదు. అయినా.. ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని దాడులకు తెగబడుతున్నారు. రొద్దంలో వైఎస్సార్సీపీకే మళ్లీ పట్టం! మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం ఎంపీపీ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 15 స్థానాలనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల ఓ సభ్యుడు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించాడు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గాండ్లపెంట్లలో ఫిరాయింపు కుట్రలు.. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నేతృత్వంలో గాండ్లపెంట ఎంపీపీ పదవి చేజిక్కించునేందుకు ఫిరాయింపు కుట్రలు చేస్తున్నారు. ఈ స్థానం జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒకరు మాత్రమే గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నుంచి ఒకరు ఫిరాయించారు. దీంతో మిగతా ఐదుగురి మద్దతుతో మరోసారి మండల పరిషత్ స్థానాన్ని వైఎస్సార్సీపీ గెలుచుకోవడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు హాజరు కాకుండా కట్టడి చేసి ఎన్నికను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనుచరులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఎంపీపీ స్థానాల కోసం కూటమి సర్కారు కుట్ర మెజారిటీ లేకున్నా ఫిరాయింపులకు ప్రోత్సాహం ఒక్క సీటు ఉన్న చోటా పీఠం కోసం తీవ్ర యత్నం రిజర్వేషన్ కేటగిరీ సభ్యులు లేకున్నా తాపత్రయం నేడు రామగిరి, గాండ్లపెంట, రొద్దం ఎంపీపీ ఎన్నికలు -
చమురు కొలతల్లో తేడాలుంటే చర్యలు
● నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలి ● పెట్రోల్ బంకును తనిఖీ చేసిన ఆర్డీఓ, డీఎస్ఓ ధర్మవరం అర్బన్: చమురు కొలతల్లో తేడాలుంటే చర్యలు తప్పవని ఆర్డీఓ మహేష్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి హెచ్చరించారు. వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలన్నారు. బుధవారం వారు పట్టణంలోని దుర్గమ్మ ఆలయం వెనుకవైపు ఉన్న భారత్ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకులోని రికార్డులు పరిశీలించారు. రోజువారీ వివరాలను రిజిస్టర్లో నమోదు చేయలేదని గుర్తించారు. స్టాకు విక్రయానికి, మిగిలిన స్టాకు సరిగ్గా రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. పెట్రోలు బంకులో తాగునీరు సదుపాయం, గాలిపంపు లేకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో పెట్రోల్ బంకు నిర్వాహకులను మందలించారు. అగ్నిమాపక పరికరాలన్ని మూలన పెట్టడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్ రీడింగ్, ట్యాంకు రీడింగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ కల్తీ ఉందా లేదా అని ఫిల్టర్ పేపర్ ద్వారా పరిశీలించారు. మరోసారి తనిఖీకి వచ్చే సమయానికి రికార్డులన్ని కరెక్ట్‌గా ఉండాలని ఆదేశించారు. తనిఖీల్లో సీఎస్‌డీటీ సురేంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం ఎన్పీకుంట/గాండ్లపెంట: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని, ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఫైరోజాబేగం సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నిర్దిష్ట సమయంలో తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయాలన్నారు. బుధవారం ఆమె ఎన్పీకుంట, గాండ్లపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పీహెచ్‌సీల్లోని రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. పీహెచ్‌సీల్లోని ల్యాబ్ గదులను, కాన్పుల గదులను తనిఖీ చేశారు. ఎన్పీకుంటలో వ్యాక్సిన్ వేసే సిబ్బంది సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదు వస్తున్నాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ వెంట అసిస్టెంట్ మలేరియా అధికారి లక్ష్మేనాయక్, వైద్యాధికారులు డాక్టర్ ఆనంద్వర్దన్, మహేశ్వరమారుతి, సీహెచ్ఓ నాగలక్ష్మి ఉన్నారు. అంతకుముందు ఎన్పీకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేస్తున్న సమయంలో తలకు తీవ్ర గాయమై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం స్వయంగా చికిత్స చేశారు. -
పేదల భూమిపై కూటమి నేతల కన్ను
బత్తలపల్లి: ప్రభుత్వ భూ పంపిణీలో భాగంగా నిరుపేదలకు అందజేసిన అసైన్డు భూమిని కూటమి నేతలు తమ అనుచరులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. సదరు భూమిలో రాత్రికి రాత్రే మామిడి మొక్కలు నాటారు. వివరాలు... బత్తలపల్లి మండలం దంపెట్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్107 లో 26.80 ఎకరాల భూమిని 2012లో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరవతో సూర్యచంద్రాపురం గ్రామానికి చెందిన 11 మంది ఎస్టీలకు రెండు ఎకరాల చొప్పున 22 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మిగిలిన 4.80 ఎకరాల భూమితో పాటు 11 మంది రైతులకు పంపిణీ చేసిన భూమిని ఆక్రమించుకునేందుకు కూటమి పార్టీల నేతలు కుట్రకు తెరదీశారు. గత 15 రోజులుగా ఆ భూమిని కబ్జా చేసేందుకు ముళ్లచెట్లు తొలగించడం, భూమిని చదును చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను రాత్రికి రాత్రే చేపట్టారు. తమకు పంపిణీ చేసిన భూమిలో సాగు ఎలా చేస్తారంటూ హక్కుదారులు కూటమి నేతలను అడ్డుకుని, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల వారు భూమి తమదంటే తమదంటూ వాగ్వాదానికి దిగడంతో అందరినీ పిలుచుకెళ్లి తహసీల్దార్ ఎదుట పోలీసులు బైండోవర్ చేయించారు. ఈ భూ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఎవరూ అందులోకి వెళ్లకూడదని, సాగు చేయరాదని, ఘర్షణలకు పాల్పడరాదంటూ ఎస్ఐ సోమశేఖర్ సూచించారు. కాగా, తమకు గతంలోనే ప్రభుత్వం భూ పంపిణీ చేస్తూ హక్కు పట్టాలు ఇచ్చిందని తహసీల్దార్ స్వర్ణలత దృష్టికి లబ్ధిదారులు తీసుకెళ్లగా.. ఆ భూములు సాగులో లేనందున పట్టాలను రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్ బెదిరింపు ధోరణిలో మాట్లాడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం, కరువు పరస్థితుల కారణంగా తాము భూమిని సాగు చేయలేకపోయామని, అంతమాత్రాన సాగు హక్కులు పొందిన భూమి తమకు కాకుండా పోతుందా? అంటూ బాధిత రైతులు వాపోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పట్టాలను రద్దు చేయించి తమకు అనుకూలమైన వారికి పట్టాలు ఇప్పించేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్‌ను కలసి న్యాయం కోరనున్నట్లు తెలిపారు. కాగా, దంపెట్ల రెవెన్యూ పొలం సర్వే నంబర్ 107లోని వివాదాస్పద భూమిలోకి ఎవరూ వెళ్లరాదని బత్తలపల్లి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తహసీల్దారు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రాత్రికి రాత్రే అసైన్డ్ భూమిలో మామిడి మొక్కలు నాటిన వైనం ఇరువర్గాలను బైండోవర్ చేసిన పోలీసులు సాగులో లేనందున పట్టాలు రద్దు చేస్తానంటూ తహసీల్దార్ బెదిరింపు -
నెట్టికంటుడి హుండీ ఆదాయం లెక్కింపు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా సమకూరిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మొత్తం 103 రోజులకు గానూ రూ.66,85,838 లక్షల నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.63,447 నగదు, 37 అమెరికన్ డాలర్లు, నాలుగు గ్రాముల బంగారు, 1.900 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ కె.వాణి తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరభద్రసేవా సమితి, హనుమాన్ సేవా సమితి, రాఘవేంద్ర సేవా సమితి, శ్రీరామ సేవాసమితి సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. మూల్యాంకన కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి మూల్యాంకనం కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి కోరారు. ఈ మేరకు డీఈఓ కిష్టప్పను బుధవారం కలసి వినతిపత్రం అందజేశారు. 58 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్రాల్లో ఫ్యాన్లు, లైటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయుల సౌకర్యార్థం సాయంత్రం 4గంటలకు ఈ ప్రక్రియను ముగించాలని కోరారు. వ్యక్తిపై బీరు బాటిళ్లతో దాడి ధర్మవరం రూరల్: స్థానిక దుర్గా బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఘర్షణ చోటు చేసుకుంది. ధర్మవరం మండలం రావులచెరువు గ్రామానికి చెందిన బోగం మహేంద్రపై ధర్మపురి గ్రామానికి చెందిన విష్ణు, మారుతి బీరు సీసాలతో దాడి చేశారు. వీపు, చేతిపై గాజు పెంకులతో బలంగా పొడిచారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
చేదు మిగిల్చిన తీపి పంట..
తీపి పంచాల్సిన కర్బూజ ఈ సారి రైతన్నలకు చేదు రుచి చూపిస్తోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా కాయ నిట్టనిలువునా చీలి పోతోంది. ఫలితంగా పెట్టుబడులు సైతం చేతికి అందక రైతులు కుదేలవుతున్నారు. పుట్టపర్తి రూరల్: సంప్రదాయ పంటల సాగులో నష్టపోయిన పలువురు రైతులు ఈ సారి మార్పు కోసం కర్బూజ సాగు చేపట్టారు. సరికొత్త ఆశలతో సాగు చేసిన తీగజాతి పంట ఊహించని విధంగా వాతావరణంలో మార్పుల కారణంగా రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. పంట ఏపుగా పెరిగింది... ఆశించిన మేర దిగుబడి ఉంది... అయినా కాయ నిట్టనిలువునా చీలి పోవడంతో కనీస పెట్టుబడులు సైతం చేతికి అందని పరిస్థితి నెలకొంది. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి.. కర్బూజ సాగుకు పెట్టుబడి ఎక్కువే అయినా రైతులు వెనుకంజ వేయలేదు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 300 హెక్టార్లలో కర్బూజ సాగులోకి వచ్చింది. సేంద్రియ ఎరువులతో పంట సాగు చేపట్టారు. సేద్యం, సాలు తీత, మల్చింగ్ షీట్, ఎకరాకు 300 గ్రాముల చొప్పున విత్తనాలు, 15వ రోజు నుంచి లీఫ్ మైనర్, దోమ, ఊజీ ఈగ, లద్దె పురుగు, పచ్చపురుగు వంటి కీటకాలతో పాటు వేరుకుళ్లు, బూడిద, ఆకుముడత తెగులు, సస్యరక్షణకు మందుల పిచికారీకి మొత్తం కలిపి ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడులయ్యాయి. మూడు నెలల్లో పంట కాపునకు వచ్చి దాదాపు 10 టన్నుల దిగుబడినిస్తుంది. కాయ నాణ్యత బాగుంటే ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు కచ్చితమైన లాభం ఉంటుందని రైతులు ఆశపడ్డారు. ఫ్రూట్ సెట్టింగ్‌లో లోపం.. పసి పిల్లల పోషణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో... అన్నే జాగ్రత్తలను కర్బూజ పంట సాగులోనూ రైతులు తీసుకుంటుంటారు. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు పంట తట్టుకోలేక పోయింది. విత్తనం నాటిన 30 నుంచి 40 రోజులలోపే పూత – పిందె (ఫ్రూట్ సెట్టింగ్) జరగాలి. కానీ అలా జరగకపోవడంతో మందుల పిచికారీ, సూక్ష్మపోషకాలు వంటివి మరింతగా డ్రిప్ ద్వారా అందించాల్సి వచ్చింది. దీంతో 40 నుంచి 55 రోజుల వరకు వివిధ దశల్లో ఫ్రూట్ సెట్టింగ్ జరిగింది. పండిన కాయలు ఉరుములు, మెరుపులు, వర్షాల ధాటికి నిలువునా చీలాయి. దీనికి తోడు వాతావరణంలో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను కాయలు తట్టుకోలేకపోయాయి. తీగలపైనే చీలిన కాయలు కుళ్లిపోతున్నాయి. మార్కెటింగ్ సౌకర్యం లేక అవస్థలు.. అసలే పచ్చి సరుకు.. రెండు రోజుల వ్యవధిలోనే విక్రయించుకోవాలి. లేదంటే కర్బూజా రైతుల పరిస్థితి అథోగతే అవుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే కర్బూజా పంటకు బెంగళూరు, తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్రల్లో మంచి గిరాకీ ఉంది. స్థానికంగా మార్కెటింగ్ అవకాశం లేకపోవడంతో 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు మార్కెట్‌కు రైతులు తరలిస్తున్నారు. మూడు టన్నుల కాయలను తరలించేందుకు వాహనానికి రూ.7వేల నుంచి రూ.10వేలు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం కిలో ధర మొదటి రకం రూ.40 పలుకుతోంది. మిగిలిన రెండు, మూడవ రకం ధర రూ.10– రూ.20 మధ్యన ఉంటోంది. ఇక ఏజెంట్‌కు 10 శాతం కమీషన్ పోను రైతులకు మిగిలేది అరకొరనే. నష్టాలతో కుదేలైన కర్బూజ రైతు దెబ్బతీసిన వాతావరణ మార్పులు కాయ నిలువునా చీలి.. కుళ్లిపోతున్న వైనం పెట్టుబడులు సైతం తిరిగిరాని పరిస్థితి ప్రభుత్వం ఆదుకోవాలి నేను రెండున్నర ఎకరాల్లో కర్బూజ సాగు చేశాను. పెట్టుబడి రూ.2.5 లక్షలు అయింది. పంట ఏపుగానే పెరిగింది కానీ, కాయలో చీలికలు ఏర్పడి కుళ్లిపోతున్నాయి. చేతికొచ్చిన అరకొర కాయలు అమ్మితే పెట్టుబడి సైతం దక్కడం లేదు. ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. కర్బూజా పంటకు స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. – కుళ్లాయప్ప, రైతు, ఎనుములపల్లి, పుట్టపర్తి మండలం సస్యరక్షణ చేపట్టాలి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల కారణంగా కర్బూజ ఫ్రూట్ సెట్టింగ్‌లో తేడాలు వచ్చాయి. కాసిన కాయ చీలిపోతోంది. సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే వీలైనంత వరకు పంటను కాపాడుకోవచ్చు. – చంద్రశేఖర్, ఉద్యాన శాఖాధికారి ఊహించని నష్టం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని కర్బూజ పెట్టాను. రెండు విడతల్లో మొత్తం పది ఎకరాల్లో సాగు చేశాను. ఐదు ఎకరాల్లో రూ.3లక్షల రాబడి వచ్చింది. మిగిలిన ఐదు ఎకరాల్లో రాబడి చేతికి అందే పరిస్థితి లేదు. వాతావరణ మార్పులతో ఊహించని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. లేకపోతే అప్పుల నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. – నంజిరెడ్డి, ఎనుములపల్లి, పుట్టపర్తి మండలం -
బావిలో వ్యక్తి మృతదేహం
కదిరి అర్బన్: మండలంలోని బాలప్పగారిపల్లి సమీపంలో ఉన్న బావిలో బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాదాపు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసున్న వ్యక్తిగా అంచనా వేశారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 94409 01882కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. కర్ణాటక మద్యం కేసులో ఇద్దరికి జైలు పెనుకొండ: కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ పెనుకొండ జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... 2020, ఫిబ్రవరి 20న పెనుకొండలోని దర్గాపేటకు చెందిన మహబూబ్‌బాషా, వహబ్ కర్ణాటక మద్యం తరలిస్తూ అప్పటి ఎస్ఐ హరూన్బాషాకు పట్టుబడ్డారు. ఈ కేసు వాదనలు అప్పటి నుంచి పెనుకొండలోని జేఎఫ్‌సీఎం న్యాయస్థానంలో కొనసాగుతూ వచ్చాయి. నేరం చేసినట్లుగా అంగీకరించడంతో ముద్దాయిలకు ఏడాది జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బొజ్జప్ప తీర్పు వెలువరించారు. దీంతో ముద్దాయిలను కోర్టు వద్ద నుంచి నేరుగా సబ్‌జైల్‌కు పోలీసులు తరలించారు. జూదరుల అరెస్ట్ తలుపుల: మండలంలోని నూతనకాల్వ సమీపంలో పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన సమయంలో 8 మంది పేకాట ఆడుతూ పట్టుపడ్డారన్నారు. వీరి నుంచి రూ.7,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సెంట్రల్ వర్సిటీలో సమస్యలు పరిష్కరించండి బుక్కరాయసముద్రం: మండలంలోని జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాల నాయకుడు యశ్వంత్ డిమాండ్ చేశారు. సమస్యలపై బుధవారం వర్సిటీ వద్ద విద్యార్థులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ వర్సిటీలో నెలకొన్న సమస్యలపై ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఇప్పటి వరకూ నాలుగు దఫాలుగా వినతి పత్రాలు సమర్పించినా ఫలితం దక్కలేదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఫీజులు తగ్గించాలని అనేక మార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు ఒకే పరిధిలో ఉంటాయని, అయితే ఇతర ప్రాంతాల్లోని వర్సిటీల్లోని ఫీజులకు అనంతపురంలోని వర్సిటీలోని ఫీజులకు రూ.వేలల్లో వ్యత్యాసం ఉంటోందని తెలిపారు. హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్‌ను మార్చాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల హాస్టల్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు వెంకట్రావ్, యశ్వంత్, విలియం, ధనరాజ్, రాము, అమరేష్, అమర్, ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల వర్గీయుల హల్చల్.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి
సాక్షి, శ్రీ సత్యసాయి: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే అహంతో వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల హల్చల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల దారుణాలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లాలోని రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల తాజాగా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వెళ్లిన లాయర్ కురుబ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు రామాంజనేయులు, హరిలపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పరిటాల వర్గీయులు.. వాహనం ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇక, రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్సీపీ-8, టీడీపీ-1 ఒక్క స్థానంలో విజయం సాధించగా.. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో దాడులు, దౌర్జన్యంతో ఎంపీపీ పదవి కైవసం చేసుకోవాలని టీడీపీ కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. -
జగనన్నను విమర్శించే స్థాయి నీకెక్కడిది?
పరిగి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి అడ్డదారిలో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సవితకు లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. మంగళవారం పరిగి మండలం తిరుమలదేవరపల్లిలో పర్యటించిన ఆమె స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సోమవారం కాంగ్రెస్ పార్టీ వైపు వైఎస్ జగన్ చూస్తున్నారంటూ మంత్రి సవిత మాట్లాడిన తీరును ఆక్షేపించారు. సవిత ఎన్నటికీ రాజకీయాలకు పనికిరారన్నారు. అవగాహన లేకుండా మాట్లాడితే ఉన్న పరువు కాస్త పోతుందని గ్రహించాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ఎప్పటికీ సింగిల్‌గానే వస్తారని, ఆయనకు ఎవరి మద్దతూ అవసరం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో అంటకాగి వైఎస్ జగన్‌ను అణగదొక్కాలని చూసిన చంద్రబాబు కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలియనివి కావన్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ఎదుర్కొలేరన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత... బీసీలకు చేసిన మేలు ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పాలని, ఆమెలో ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా... బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని సవాల్ విసిరారు. పరిగి మండలం కొడిగెనహళ్లి ప్రీకాట్ స్పిన్నింగ్ మిల్లు మూసివేతతో రోడ్డున పడిన కార్మిక కుటుంబాలకు చేనేత జౌళీ శాఖ మంత్రిగా ఆమె చేసిన న్యాయమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా పరిగి, పెనుకొండ, మడకశిర, హిందూపురం ప్రాంతాలతో పాటూ బిహార్, ఒడిశా రాష్ట్రాల వలస కార్మికులకు జీవనోపాధిని అందించిన ఫ్యాక్టరీ నేడు మూత పడడానికి కూటమి ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. తన ఇలాఖాలో ఓ మిల్లు మూతపడిదంటే జౌళీ శాఖ మంత్రిగా ఆమె సిగ్గుపడాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామంటూ ఉన్న పరిశ్రమలను మూత పడేలా చేయడం చంద్రబాబు సర్కార్కే సాధ్యమన్నారు. కురుబ కులంలో పుట్టిన సవిత... గుడికట్ల పూజారులకు నెలకు రూ.5వేలు గౌరవవేతనం చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం మాని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. మంత్రి సవితపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజం -
ఎస్టీలైనా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందే
ధర్మవరం రూరల్: ఎస్టీలైనా సరే కరెంటు బిల్లులు చెల్లించాల్సిందేనని, లేకపోతే విద్యుత్ సర్వీసు వైర్లను తొలగిస్తామని విద్యుత్ శాఖ అధికారులు మండలంలోని ధర్మపురి కాలనీ వాసులను హెచ్చరించారు. అంతేకాకుండా పోలీసులను రంగంలోకి దించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బకాయిల పేరుతో భయపెడుతూ... ధర్మవరం మండలం ధర్మపురి గ్రామంలోని ఎస్టీ కాలనీకి మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు వెళ్లారు. కాలనీకి చెందిన 40 మంది విద్యుత్ బకాయిలు ఉన్నారని, వెంటనే చెల్లించకపోతే సర్వీసులు తొలగిస్తామన్నారు. దీంతో ఎస్టీలంతా అధికారులతో వాగ్వాదం చేశారు. ప్రభుత్వం ఎస్టీలకు ఉచిత కరెంటు ఇస్తుంటే...మీరొచ్చి బిల్లులు చెల్లించాలని బెదిరించడం అన్యాయమన్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, విద్యుత్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ధర్మవరం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని కాలనీ వాసులకు సర్ది చెప్పారు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ జానకి రామయ్య మాట్లాడుతూ.. ఎస్టీ కాలనీలోని 40 మంది సర్వీసులపై రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు బిల్లులు బకాయి ఉన్నాయన్నారు. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా విద్యుత్ ఇస్తుందన్నారు. ఆ తర్వాత బిల్లు వేస్తుందన్నారు. ఈ క్రమంలోనే వేలకు వేలు బిల్లులు పెండింగ్‌లో ఉన్న వారితో బిల్లులు వసూలు చేయాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అనంతరం అధికారులతో చర్చల తర్వాత ఏప్రిల్ 10వ తేదీలోపు కొంత మొత్తం చెల్లిస్తామని గిరిజనులు చెప్పడంతో విద్యుత్ శాఖ అధికారులు వెళ్లిపోయారు. కాగా, మొదటి నుంచి ప్రభుత్వమే ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా...తాము బకాయి ఎందుకు ఉన్నామో అర్థం కావడం లేదని పలువురు వాపోయారు. ధర్మపురి ఎస్టీ కాలనీ వాసులతో విద్యుత్ శాఖ అధికారుల వాగ్వాదం -
గ్రామీణ విద్యార్థులు... పతకాల వీరులు
జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తా.. వెయిట్ లిప్టింగ్లో జాతీయ స్థాయిలో రాణించి బంగారు పతకాన్ని సాధించాలని ఉంది. ఆ దిశగా సాధన చేస్తున్నా. పాఠశాలలో సౌకర్యాలు లేకపోయినప్పటికీ హెచ్ఎం జగదీశ్వర్, పీడీ నాగరాజు ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నా. – సుభాష్, విద్యార్థి బంగారు పతకం నాదే ఇప్పటికే పవర్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాన్ని సాధించాను. త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ బంగారు పతకం నాదే అవుతుంది. ఈ కలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా సాధన చేస్తున్నా. – గణేష్‌రెడ్డి, విద్యార్థి పుట్టపర్తి: వసతులు లేవు... క్రీడా సామగ్రి లేదు... సాధన చేసేందుకు సరైన మైదానమూ లేదు. అయినా వారు పట్టు వీడలేదు. గత ఐదేళ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విశేష ప్రతిభతో రాణిస్తున్నారు. బుక్కపట్నంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు. పట్టుదల.. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు. ఏటా పతకాల వర్షం బుక్కపట్నంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఏటా క్రమం తప్పకుండా క్రీడా పోటీల్లో పాల్గొంటూ పతకాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు గణేష్‌రెడ్డి, సుభాష్, ముక్తియార్, చరణ్ ప్రకాష్, శ్రీనాథ్‌రెడ్డి తదితరులు జాతీయ స్థాయి పవర్ లిప్టింగ్, వెయిట్ లిప్టింగ్, హాకీ, ఏపీ స్కూల్ గేమ్స్‌లలో రాణించి, పతకాలతో మెరిసారు. 2019లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో 65, 95, 125 కిలోల బరువెత్తి తొలిసారిగా రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థి ప్రకాష్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి మొదలైంది. దీంతో విద్యార్థులకు ఆసక్తి ఉన్న వివిధ క్రీడల్లో వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ వచ్చారు. 2022–23లో విజయవాడ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గణేష్‌రెడ్డి, చరణ్, ముక్తియార్ ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిలో సుభాష్ బంగారు పతకాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం విశేషం. ఈ విద్యా సంవత్సరంలో పవర్ లిప్టింగ్లో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గణేష్ రెడ్డి అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాన్ని సాధించి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. క్రీడల్లో రాణిస్తున్న బుక్కపట్నం విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాల కై వసందాతల సహకారంతోనే.. పాఠశాలలో క్రీడా సామగ్రి కొరత చాలా ఉంది. సరైన మైదానం కూడా లేదు. దాతల సహకారంతో క్రీడా సామగ్రిని కొనుగోలు చేసి విద్యార్థులకు రోజూ శిక్షణ ఇస్తున్నాం. ఫలితంగా వారు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చారు. – నాగరాజు, పీడీ, బాలుర ఉన్నత పాఠశాల, బుక్కపట్నంచాలా ఆనందంగా ఉంది మా పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో రాణిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. దాతల సహకారంతో క్రీడా సామగ్రిని సమకూర్చుకొని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. – జగదీశ్వర్, హెచ్ఎం, బాలుర ఉన్నత పాఠశాల, బుక్కపట్నం. -
‘విజన్–2047’ ఓ మాయ
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి విజన్ –2047 పేరుతో మాయ చేసేందుకు పూనుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం బకాయిలు చెల్లించాలని, హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలని, హిందూపురంలోని ప్రీకాట్ మిల్లు కార్మికులను ఆదుకోవాలంటూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయని సీఎం చంద్రబాబు పీ–4 అంటూ కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. పేదలు గుడిసెలు వేసుకుంటే జేసీబీలతో తొలగించే ప్రభుత్వం.. కూటమి నాయకులతో మాత్రం విచ్చలవిడిగా భూ కబ్జాలకు తెరతీసిందన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపడితే అడ్డుకుంటామన్నారు. ప్రీకాట్ మిల్లు కార్మికులు వీధిన పడకుండా ఆదుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు శ్మశాన వాటికలు కేటాయించాలన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, పంటల సాగుకు నీరు అందివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదిర్శ వర్గ సభ్యుడు ఈఎస్ వెంకటేషులు, నాయకులు హరి, జంగాలపల్లి పెద్దన్న, దిల్షాద్, జెడ్పీ శ్రీనివాసులు, ప్రవీణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, పెద్దన్న, పవన్, పైపల్లి గంగాధర్, పెడపల్లి బాబా, పలువురు మహిళలు పాల్గొన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ -
30 గ్రామాలకు సత్యసాయి నీరు బంద్
బత్తలపల్లి: సత్యసాయి తాగునీటి పథకం...ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పైప్‌లైన్ లీక్ కావడంతో బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం మండలాల్లోని 30 గ్రామాలక నీటి సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది మూడు రోజులుగా శ్రమిస్తున్నా ఫలితం లేకపోయింది. వేసవి ప్రారంభమవడంతో పలు గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో సత్యసాయి నీరు కూడా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు. కప్లింగ్ విరిగిపోవడంతో సమస్య చిత్రావతి నది నుంచి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి సత్యసాయి తాగునీటి పథకం ద్వారా నీరు సరఫరా అవుతోంది. ఈ పథకం ప్రధాన పైపులైన్ బత్తలపల్లి మీదుగా నాలుగు లేన్ల జాతీయ రహదారి కింద వెళ్తోంది. బత్తలపల్లి పోలీస్ స్టేషన్ సమీపాన జాతీయ రహదారి కల్వర్టు కింద ప్రధాన పైపులైను జాయింట్ కప్లింగ్ విరిగిపోవడంతో సత్యసాయి నీరు లీకేజీ అవుతున్నట్లు మూడు రోజుల క్రితం సిబ్బంది గుర్తించారు. సత్యసాయి తాగునీటి పథకం సూపర్వైజర్లు శంకరయ్య, రాజారెడ్డి పర్యవేక్షణలో దాదాపు 20 మంది సిబ్బంది జాతీయ రహదారి మధ్యలో సుమారుగా 20 అడుగుల లోతు తవ్వి కప్లింగ్ వేసేందుకు మూడు రోజులుగా శ్రమిస్తున్నారు. మంగళవారం రాత్రికి పైపులైనుకు జాయింట్ కప్లింగ్ తొడిగించి పనులు పూర్తి చేసి బుధవారం సత్యసాయి నీరు అందేలా చూస్తామని సత్యసాయి మంచినీటి పథకం సూపర్వైజర్లు వెల్లడించారు. మెయిన్ పైపు లీక్ కావడమే కారణం మూడు రోజులుగా శ్రమిస్తున్నా దక్కని ఫలితం -
ట్రాక్టర్ దూసుకెళ్లి చిన్నారి దుర్మరణం
పావగడ: ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఓ చిన్నారి దుర్మరనం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పావగడ తాలూకా వైఎన్ హొసకోట పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిక్కజాలోడు గ్రామానికి చెందిన వరుణ్ (6) తిమ్మమ్మనహళ్లిలోని తన అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అటుగా మట్టి లోడుతో వచ్చిన ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మీదుగా దూసుకెళ్లింది. ఘటనలో ట్రాక్టర్ చక్రాల కింద నలిగి వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వైఎన్ హొసకోట పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ మాళప్ప నాయక్కొడి తెలిపారు. కానిస్టేబుల్ మురళి ఆత్మహత్యాయత్నం కదిరి టౌన్: స్థానిక పీఎస్‌లో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మురళి మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. రాప్తాడు మండలం జంగాలపల్లికి చెందిన మురళి... కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లి సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తున్న ఓడీసీ మండలం డబురువారిపల్లికి చెందిన కల్పనను ప్రేమించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధమైన ఆమెను కోచింగ్ కోసం రెండు నెలల క్రితం అనంతపురానికి పంపాడు. పరీక్ష రాసిన తర్వాత నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్తతో దూరంగా ఉంటూ వచ్చింది. పలుమార్లు కాపురానికి రావాలని పిలిచినా ఆమె అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన మురళి... మంగళవారం రాత్రి వైఎస్సార్ నగర్లో తాను నివాసముంటున్న ఇంట్లోనే పురుగులు మందు సేవించాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను పక్కింటి వారు గమనించి, వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
‘మార్కెటింగ్’ టార్గెట్ రూ.19.79 కోట్లు
● ఉమ్మడి జిల్లా మార్కెట్ కమిటీలకు లక్ష్యం నిర్దేశించిన ఆర్జేడీ అనంతపురం అగ్రికల్చర్: ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి అనంతపురం జిల్లా మార్కెట్ కమిటీలకు రూ.19.79 కోట్ల పన్ను వసూళ్లను లక్ష్యంగా మార్కెటింగ్‌శాఖ నిర్ధేశించింది. మంగళవారం అనంతపురంలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజినేయులు సమక్షంలో రెండు జిల్లాల ఏడీఎంలు పి.సత్యనారాయణచౌదరి, ఎల్ఎన్ మూర్తి, 17 మార్కెట్ కమిటీల సెక్రటరీలు, సూపర్వైజర్లు సమావేశమయ్యారు. 2024–25లో నిర్దేశించిన టార్గెట్లు, సాధించిన ప్రగతిపై సమీక్షిస్తూనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు, బడ్జెట్ తదితర అంశాలపై మార్కెట్ కమిటీల వారీగా చర్చించారు. అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 9 మార్కెట్ కమిటీకు రూ.13.93 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్న 8 మార్కెట్ కమిటీలకు రూ.5.86 కోట్లు టార్గెట్ నిర్ధేశించారు. ప్రస్తుత 2024–25లో రూ.5.31 కోట్లకు గానూ వంద శాతం సాధించే దిశగా మార్కెట్ కమిటీలు పయనిస్తున్నట్లు తెలిపారు. దీంతో రెండు జిల్లాలకు అదనపు టార్గెట్లను కలిసి రూ.19.79 కోట్లు నిర్ధేశిస్తున్నట్లు ఆర్జేడీ తెలిపారు. ఎక్కడా లీకేజీలు లేకుండా వంద శాతం ఫీజు వసూళ్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటికే వంద శాతం పూర్తయిన మార్కెట్ కమిటీ సెక్రటరీలను అభినందించారు. -
నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
లేపాక్షి: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షకు 7,987 మంది దరఖాస్తు చేసుకోగా, 5,492 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 80 మంది అర్హత సాఽధించారని పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థుల రోల్ నంబర్లు ఇలా... జే1000385 జే1000012 ఐ1005931 ఎన్1006682 ఎల్1002764 ఐ1000356 పి1006428 జే 1007240 జి 1005236 ఎం1000576 ఎల్1006502 జే1007407 ఎన్1005523 జే1000580 జే1006568 జే1007799 ఐ1007174 ఎం1001453 ఐ1007079 జే1007932 ఎం1007585 ఎం1001799 ఎం1007255 ఎన్1007950 ఎన్1007629 ఐ1001845 ఎం1007263 కే1000027 పీ1007898 ఐ1002891 ఎన్1007529 కే1000637 జే1000718 కే1002923 ఎన్1007595 కే1001782 జే1002993 ఐ1003540 ఎన్1007952 కే1003235 బి1004210 ఎం1003662 జే1000812 ఓ1003503 జే1005888 ఐ1003860 జే1001555 ఓ1006002 జే1007359 ఎన్1003984 జే1003446 కే1006268 కే1003679 ఎన్1004015 జే1003577 కే1007104 కే1004027 ఓ1004216 జే1003625 ఓ1007896 సీ1005172 జే1004436 జే1003688 ఎల్1000099 ఐ1002639 జే1004527 జే1004148 ఎల్1000449 ఎం1002714 ఎల్1005290 ఎన్1004227 ఎల్1000743 ఎం1007958 ఎల్1005445 జే1004523 ఎల్1001221 ఎల్1000114 జే1005880 ఎన్1005013 ఎల్10071229వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికై న విద్యార్థుల రోల్ నంబర్లు ఇలా... 100327 100349 100403 100636 100675 100731 100741 100109 100561 100217 -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం: అంతర్జిల్లా దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.16 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. అనంతపురంలోని భవానీనగర్‌లో నివాసముంటున్న వనరస జితేంద్ర అలియాస్ సిద్ధు, షేక్ తౌహిద్ అలియాస్ సోనూ, ఇందిరానగర్‌కు చెందిన మైనర్ బాలుడు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామానికి చెందిన నల్లనాచప్పగారి గణేష్, ముత్యాలచెరువు గ్రామానికి చెందిన నూర్ మహమ్మద్ వ్యసనాలకు బానిసలుగా మారి, తమ జల్సాలు తీర్చుకునేందుకు మూడు బృందాలుగా ఏర్పడి అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించేవారు. వీరిలో జితేంద్రపై అనంతపురం రెండు, మూడు, రూరల్, గుత్తి పీఎస్ పరిధిలో మొత్తం 8 కేసులున్నాయి. ఇది వరకే సాగించిన దొంగతనాలకు సంబంధించి 2 కేసులున్నాయి. కార్పెంటర్‌గా పనిచేస్తున్న తౌహిద్, తన స్నేహితుడు (మైనర్)తో కలసి ముఠాగా ఏర్పడి ద్విచక్రవాహనాలను అపహరించేవాడు. వీరిపై అనంతపురం వన్‌టౌన్, ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో చెరో 6 కేసులున్నాయి. మైనర్‌పై రెండు బైక్ చోరీ కేసులున్నాయి. బేల్దారి నల్లనాచప్పగారి గణేష్, బైక్ మెకానిక్ నూర్ మహమ్మద్ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో మంచి స్నేహితులయ్యారు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించేవారు. వీరిపై మొత్తం ఆరు కేసులుండగా ఇందులో వైఎస్సార్ జిల్లాలో ఐదు, అనంతపురం జిల్లాలో ఒకటి ఉన్నాయి. నిందితులు మంగళవారం అనంతపురంలోని ఎస్జేఆర్ ఫంక్షన్ హాలు వద్ద తచ్చాడుతుండగా అనంతపురం వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, త్రీ టౌన్ సీఐ శాంతిలాల్, సీసీఎస్ సీఐలు ఇస్మాయిల్, జైపాల్‌రెడ్డి గుర్తించి అరెస్ట్ చేశారు. మైనర్‌ను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచారు. మిగిలిన వారిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
గైనకాలజిస్ట్‌కు ‘షోకాజ్’
కదిరి అర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రి గైనకాలజిస్ట్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసును ఉన్నతాధికారులు జారీ చేశారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులను స్కానింగ్‌ల కోసం ప్రైవేట్ సెంటర్లకు రెఫర్ చేస్తున్న వైనంపై ఈ నెల 25న ‘తీరు మారదు.. కక్కుర్తి తీరదు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గైనకాలజిస్టుకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఈ గ్రామాల్లో కొత్త బోరుబావుల తవ్వకంపై నిషేధం
అనంతపురం అగ్రికల్చర్: ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, వృక్షముల చట్టం–వాల్టా (ఏపీ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్–2002) ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 64 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ జారీ చేసింది. ఆయా గ్రామాల్లో అత్యధిక నీటి వినియోగం ఉన్నట్లు గుర్తించారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితోనే తాగునీటి అవసరాల కోసం మాత్రమే బోరుబావుల తవ్వకం చేయాలని స్పష్టం చేసింది. ● పుట్లూరు మండలం కోమటికుంట్ల, మడుగుపల్లి, తాడిపత్రి మండలం బోడాయిపల్లి, బొందలదిన్నె, హుస్సేనాపురం, సజ్జలదిన్నె, తాడిపత్రి రూరల్ పంచాయతీ, యల్లనూరు మండలం అరవేడు, బొప్పేపల్లి, మేడికుర్తి, పెద్దమల్లేపల్లి, తిరుమలాపురం, వేములపల్లె గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ● రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల పరిధిలో 300 గ్రామ పంచాయతీలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 94 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకాకుళం– 76, శ్రీ సత్యసాయి–51, వైఎస్సార్ కడప– 32, చిత్తూరు– 18, పల్నాడు– 16, అనంతపురం –13, అన్నమయ్య జిల్లాలో ఒక గ్రామం... ఇలా మొత్తం 300 గ్రామాల్లో ‘వాల్టా’ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు భూగర్భజలశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.తిప్పేస్వామి తెలిపారు. ‘అనంత’లో 13 గ్రామాలు, ‘శ్రీ సత్యసాయి’లో 51 గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్జిల్లా పరిధిలో.. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో అత్యధికంగా 51 గ్రామాల్లో ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అగళి మండలం హుళ్లికెరదేవరహళ్లి, ఇనగలూరు, మధూడి, నరసంబూడి, పి.బ్యాడిగేరె, రావుడి, అమడగూరు మండలం కరిణిరెడ్డిపల్లి, లోకోజిపల్లి, అమరాపురం మండలం తమ్మిడేహళ్లి, చిలమత్తూరు మండలం ధేమకేతేపల్లి, హుస్సేనాపురం, గాండ్లపెంట మండలం చామచాయనబైలు, చామలగొంది, గాండ్లపెంట, జీనుగులకుంట, కురుమామిడి, మడుగువానిగొంది, సోమయాజుపల్లి, గుడిబండ మండలం జి.మోరుబాగల్, కేకాతి, ఎస్.రాయాపురం హిందూపురం మండలం దేవరపల్లె, గోళ్లాపురం, కిరికెర, కొటిపి, కొట్నూరు, మలుగూరు, మణేసముద్రం, శ్రీకంఠాపురం రూరల్, లేపాక్షి మండలం చోళసముద్రం, ఎన్పీ కుంట మండలం ఎదురుదొన, గూటిబయలు, గౌకనపల్లి, ముడుపలజూవి, రొద్దం మండలం చెరకూరు, రొళ్ల మండలం బొమ్మగుండనహళ్లి, దొడ్డేరి, కాకి, ఎం.రాయాపురం, రొళ్ల, తాడిమర్రి మండలం దాడితోట, తలుపుల మండలం పులిగుండ్లపల్లె, తనకల్లు మండలం అగ్రహారంపల్లె, బాలసముద్రం, బొంతలపల్లె, చీకటిమానిపల్లి, దిగువమందలపల్లి, గుర్రంబయలు, కోటపల్లె, మద్దినాయనిపాలెం, టి.సదుంలు ఉన్నాయి. -
అట్రాసిటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జిల్లాలో పక్కాగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం అమలుపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులు.. పరిష్కరించిన కేసుల వివరాలను సంబంధిత శాఖల అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ... ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరానికి మానిటరీ రిలీఫ్ రూ.4.35 కోట్లు మంజూరైందని, ఇప్పటివరకు రూ.2.41 కోట్లు బాధితుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లో బాధితుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. భూతగాదాలు పరిష్కరించేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. అనంతరం పోలీస్, డీఆర్డీఏ, రెవెన్యూ శాఖల అధికారులు తమ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పురోగతి, బాధితులకు అందించిన పరిహారం వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల ఘటనలను వివరించారు. సమావేశంలో పుట్టపర్తి, పెనుకొండ ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్, పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి పద్మమ్మ, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వీరనారాయణ, శ్రీనివాస్ నాయక్, ఉమాశంకర్, కృష్టమూర్తి, రామాంజినప్ప తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో స్కావెంజర్ పనితీరుపై త్రైమాసిక జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులకు గ్లౌజులు, మాస్కులు వంటి అత్యవసర సామగ్రి తప్పక అందించాలన్నారు. పారిశుధ్య కార్మికులకు క్రమం తప్పకుండా అరోగ్య పరీక్షలు చేయించేందుకు జిల్లా పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లు కృషి చేయాలన్నారు. పారిశుధ్య కార్మికుల నూతన జాబితాను రూపొందించి అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎల్డీఎం రమణకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాధిక, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రావు, మున్సిపల్ కమిషనర్లు ప్రహ్లాద్, శ్రీనివాసులు, రంగస్వామి, కిరణ్‌కుమార్, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశం -
96 జిల్లాలో మద్యం దుకాణాలు
10 జిల్లాలోని బార్ల సంఖ్య రూ.293.15 కోట్లు 2024 అక్టోబరు 16 నుంచి ఈనెల 24 వరకు మద్యం అమ్మకాలు● ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద కనిపించిన దృశ్యం. ఓ వ్యక్తి తప్ప తాగి నడిరోడ్డుపై కుక్కతో ఆడుకుంటూ నానా రభస చేశాడు. ప్రశాంతి నిలయం నిబంధనల ప్రకారం పుట్టపర్తికి చుట్టుపక్కల మద్యం దుకాణాలు నిర్వహించరాదు. అయితే నిబంధనలు తుంగలో తొక్కి అక్కడే మద్యం దుకాణం.. పక్కనే రూములు, అడిగిన చోటకు మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక కేంద్రాన్ని మందుబాబుల అడ్డాగా మార్చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఇది హిందూపురం సమీపంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ నేతృత్వంలో నిర్వహిస్తోన్న అనధికారిక బార్లా పిలిచే బెల్టు షాపు. దర్జాగా ఫ్రిజ్ ఏర్పాటు చేసి మరీ కూలింగ్ బీర్లు అమ్ముతున్నారు. పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. డిజిటల్ పేమెంట్లకు ఫోన్ పే స్కానర్ కూడా అందుబాటులో ఉంచారు. ఆంధ్ర మద్యంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బ్రాండ్లు కూడా దొరుకుతున్నాయని మందుబాబులు ఎగబడుతున్నారు.37,78,227లీటర్లు వివిధ బ్రాండ్ల మద్యం విక్రయాలుసాక్షి, పుట్టపర్తి కాసులకోసం కూటమి పార్టీల నేతలు జనానికి అక్రమ కిక్కు ఎక్కిస్తున్నారు. ఊరూరా ‘బెల్టు’ షాపులు ఏర్పాటు చేసి తాగినోళ్లకు తాగినంత తాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీంతో గుడి, బడి తేడా లేకుండా జిల్లాలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపులు దర్శనం ఇస్తున్నాయి. ప్రధాన రహదారులు, పట్టణాల్లో సైతం బార్లను తలపించే విధంగా బెల్టు దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఇక లైసెన్సు పొందిన మద్యం దుకాణాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా రూములు ఏర్పాటు చేశారు. క్వార్టర్‌పై రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా పిండుకుంటున్నారు. లేబుల్ మార్చి దోపిడీ లోకల్‌గా మద్యం తయారు చేసి.. సీసాలపై ఆర్మీ లేబుళ్లు.. ఇతర రాష్ట్రాల మద్యం బ్రాండ్ల పేర్లతో కూడిన లేబుళ్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఎక్కువగా లేబుల్ మార్చి దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల మద్యాన్నీ భారీగా డంప్ చేసి విచ్చల విడిగా విక్రయాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇతర రాష్ట్రాల మద్యాన్ని పట్టుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్న క్రమంలో లేపాక్షిలోని షాపునకు రూ.5 లక్షల జరిమానా విధించారు. అదేవిధంగా అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో చిలమత్తూరులోని వైన్ షాపును సీజ్ చేశారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగిన ప్రతిసారీ కొత్త ఘటన వెలుగు చూస్తుండటం గమనార్హం. పర్మి(నెం)ట్ కిక్కు జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల వద్ద నిబంధనలకు విరుద్ధంగా తాగేందుకు రూములు ఏర్పాటు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో అక్కడే తినుబండారాలు తయారీ చేసి.. సిట్టింగ్‌లకు అనుమతులు ఇస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న మద్యం దుకాణాల్లో అయితే మందుబాబుల కోసం ఏకంగా కొట్టాలు వేసి ఏర్పాట్లు చేయడాన్ని చూసి జనమే ముక్కున వేలేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఇంటి వద్దకే మద్యం డెలివరీ చేసే వ్యవస్థను తీసుకొచ్చారు. బార్లా తెరిచేశారు12,68,152 లీటర్లు బీర్ల విక్రయాలుఉపేక్షించేది లేదు లైసెన్సు పొందిన దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరగాలి. ఎమ్మార్పీకి మించి అమ్మితే చర్యలు తప్పవు. కేవలం ఆంధ్ర మద్యం మాత్రమే అమ్మాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వబోం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే తనిఖీలు చేసి బెల్టు షాపుల ఆట కట్టిస్తున్నాం. – గోవిందనాయక్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పుట్టపర్తి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు గుడి, బడి తేడా లేకుండా అమ్మకాలు అక్రమార్జనే ధ్యేయంగా కూటమి నేతలు ఆధ్యాత్మిక కేంద్రాలనూ వదలని ‘తమ్ముళ్లు’ బార్లను తలపించేలా బెల్టు షాపులు ఇష్టారాజ్యంగా పర్మిట్ రూముల ఏర్పాటుఆలయ సమీపంలోనే... రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయానికి స్థానికులతో పాటు కర్ణాటక నుంచి భక్తులు వస్తారు. ముత్యాలమ్మపల్లిలో ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో జాతరను తలపిస్తుంది. మొక్కుచెల్లింపులో భాగంగా వందలాది యాటలు తెగుతాయి. ఇక మందుబాబుల డిమాండ్‌కు అనుగుణంగా కూటమి నేతలు ఆలయ సమీపంలోనే బెల్టు షాపు తెరిచారు. పూటుగా తాగుతున్న మందుబాబులు పవిత్రమైన స్థలంలో నానా హంగామా చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. మద్యం మత్తులో కొందరు ఆలయంలో ప్రవేశించి హుండీ చోరీ చేశారు. -
పెరిగిన ఎండుమిర్చి ధర
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధర పెరిగింది. మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 159 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో క్వింటా గరిష్టంగా రూ.15,400, కనిష్టంగా రూ.7,500, సరాసరిన రూ.13,500 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. గత వారంతో పోలిస్తే క్వింటాపై రూ.500 మేర పెరిగిందని ఆయన వెల్లడించారు. బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక రైలు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 28, 29వ తేదీల్లో బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరనున్న రైలు మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరిగి 29వ తేదీ ఉదయం 9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు బెంగళూరు జంక్షన్ చేరుకుంటుందన్నారు. యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, యాద్గిరి, షాహాబాద్ రైల్వేస్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి ● చిన్న పొరపాటు కూడా జరగకూడదు ● జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో ఈ నెల 27న జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఆర్.రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సీఈఓ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొద్దం, గాండ్లపెంట, రామగిరి, కణేకల్లు, కంబదూరు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు, ఉరవకొండ, పెద్దపప్పూరు, యల్లనూరు, రాయదుర్గం మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ఎన్నుకునే హక్కు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మండల కో–ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ ఉండదన్నారు. మెజారిటీ సభ్యులు చేతులెత్తి మద్దతు తెలిపిన వారే ఎంపీపీ, వైస్ ఎంపీపీగా ఎన్నికవుతారన్నారు. ఎన్నికల రోజున బందోబస్తు కూడా ఉంటుందన్నారు. -
సత్యసాయిజిల్లా: కదిరి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. చామలగొంది ఎంపీటీసీ లక్ష్మీదేవిని కిడ్నాప్ చేశారంటూ ఎఫఐఆర్ నమోదు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇప్పటికే ఎంపీటీసీ లక్ష్మీదేవి ఓ సెల్ఫీ విడియో విడుదల చేశారు. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.గుత్తిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలుకాగా, అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ కోన మురళీధర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్ధాలు, వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. -
విద్యార్థిని అదృశ్యం
బత్తలపల్లి: సర్టిఫికెట్లు జిరాక్స్ చేయించుకుని వస్తానంటూ వెళ్లిన విద్యార్థిని కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలోని పీవీకేకేలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు సెలవుల నేపథ్యంలో వారం రోజులుగా ఇంటి పట్టునే ఉన్న ఆమె శనివారం తన ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుని, సర్టిఫికెట్లు జిరాక్స్ చేయించుకుని వస్తానంటూ కుటుంబసభ్యులకు తెలిపి వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి రాలేదు. గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివాహిత బలవన్మరణం గాండ్లపెంట: జీవితంపై విరక్తితో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గాండ్లపెంట మండలం వంకపల్లికి చెందిన వద్దిరెడ్డి రాజేశ్వరి (30) వేపరాల గ్రామ సచివాలయంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్‌గా, భర్త ఈశ్వరరెడ్డి ఎఫ్ఈఎస్ స్వచ్ఛంద సంస్ధలో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం వ్యక్తిగత పనిపై ఈశ్వరరెడ్డి అనంతపురానికి వెళ్లాడు. చిన్న కుమారుడు అభిలాష్ పాఠశాలకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజేశ్వరి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి చేరుకున్న అభిలాష్ ఇంట్లో ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతున్న తల్లిని గమనించి పక్కింటి వారికి తెలపడంతో వారి సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అల్లుడు ఈశ్వరరెడ్డి వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వలీబాషా కేసు నమోదు చేశారు. లారీల ఢీ – డ్రైవర్ దుర్మరణం కనగానపల్లి: మండలంలోని 44వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొన్నాయి. ఘటనలో నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పెదరాజుపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ప్రసాద్ (45) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు... సోమవారం తెల్లవారుజామున అనంతపురం వైపు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న లారీ పర్వతదేవరపల్లి వద్దకు చేరుకోగానే డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. దీంతో వెనుకనే వస్తున్న లారీ డ్రైవర్ వేగాన్ని నియంత్రించుకునే సమయం కూడా లేకపోవడంతో నేరుగా వెళ్లి ముందున్న లారీని ఢీకొన్నాడు. ఘటనలో వెనుక ఉన్న లారీ క్యాబిన్‌లోనే డ్రైవర్ ప్రసాద్ చిక్కుకున్నాడు. స్థానికులు గమనించి అతి కష్టంపై ఆయనను వెలికి తీశారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణకు పోరుబాట ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హిందూపురం టౌన్: ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణకు పోరుబాట పడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ‘రాజ్యాంగ పరిరక్షణ’ అంశంపై సోమవారం హిందూపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ స్ఫూర్తితో సీపీఐ పోరాటాలను ఉధృతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిరక్షణకు లౌకికవాదులంతా ఏకం కావాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య మాట్లాడుతూ... హంద్రీనీవా ద్వారా తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్, సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆటో నుంచి కిందపడి బాలిక మృతి చిలమత్తూరు: హిందూపురం పరిధిలోని కొట్నూరు సమీపంలో వేగంగా వెళుతున్న ఆటో నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి కొట్నూరుకు చెందిన వైష్ణవి(13) మృతి చెందింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో కిందపడడంతో తీవ్ర గాయాలైన వైష్ణవిని స్థానికులు వెంటనే హిందూపురంలోని జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స మొదలు పెట్టే లోపు ఆమె మృతి చెందింది. ఘటనపై ఎస్ఐ శ్రీధర్ దర్యాప్తు చేపట్టారు. -
సారా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
పుట్టపర్తి టౌన్: నాటు సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య తెలిపారు. సోమవారం పుట్టపర్తిలోని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన నేర సమీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నాటుసారా, నవోదయం, అక్రమ మద్యం రవాణాపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నాటుసారా తయారీదారులు, విక్రయ దారులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. నవోదయం 2.0లో భాగంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. పన్ను చెల్లించని మద్యం అమ్మకం దారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్లు దుకాణాల్లో కల్తీ జరగకుండా నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఎకై ్సజ్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య -
‘పోలీస్ స్పందన’కు 60 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, హోళీ సందర్భంగా ఈ నెల 14న కదిరిలోని ఎస్కేఎల్ఎన్ఎస్ అమృతవళ్లి మహిళా డిగ్రీ కళాశాలలో చోటు చేసుకున్న ఘటనపై న్యాయం చేయాలంటూ డీఎస్పీ విజయ్‌కుమార్‌కు విద్యార్థినులు వినతి పత్రం అందజేశారు. తమ అభ్యర్థన మేరకే హోళీ జరుపుకునేందుకు ప్రిన్సిపాల్ వెంకటపతి అనుమతించారని, అంతేకాక తన సతీమణితో కలసి వేడుకల్లో ఆయన పాల్గొన్నారని వివరించారు. సరదాగా కేరింతలు కొడుతున్న సమయంలో గిట్టని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రి లాంటి వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలను తాము ఆక్షేపిస్తున్నామని, ఈ అంశంలో సమగ్ర విచారణ చేపట్టి ప్రిన్సిపాల్‌కు న్యాయం చేయాలంటూ కోరారు. -
క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు
పుట్టపర్తి అర్బన్: క్షయ వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకంగా మారుతుందని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం అన్నారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య, జిల్లా క్షయ నివారణ శాఖల ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి క్షయ పోషణ పథకంలో భాగంగా క్షయ చికిత్స చేయించుకున్న వారికి నెలకు రూ.1000 అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ తిప్పయ్య, డీఎస్పీ విజయ్‌కుమార్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్‌రెడ్డి, ధర్మవరం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవరెడ్డి, టీబీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 29 పంచాయతీలకు కలెక్టరేట్లో అవార్డులను అందజేశారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలి ● ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తి టౌన్: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపి కాలువ వెడల్పు చేయాలని, లైనింగ్ పనులు ఆపకపోతే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో యంత్రాలు ధ్వంసం చేస్తామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం పుట్టపర్తిలోని కార్మిక కర్షక భవనంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు గిరీషం, సీపీఐ జిల్లా నాయకులు కాటమయ్య, మహదేవ పాల్గొని ప్రసంగించారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులతో భూగర్భజలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. జీఓ నంబర్ 404, 405ను తక్షణమే రద్దు చేయాలని, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సోముశేఖర్, రమణ, లక్ష్మీనారాయణ, రాజా రామిరెడ్డి, సిద్ధారెడ్డి, కదిరెప్ప, మారుతి, శ్రీరాములు,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సవితా.. నీ స్థాయి తెలుసుకో
పెనుకొండ రూరల్: ‘‘మంత్రి సవిత నోటికి ఏది వస్తే అది మాట్లాడుతోంది. నాలుక ఉంది కదా అని ఇష్టానుసారం విమర్శలు చేస్తోంది. కానీ ఆమె తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలి. ఇంకోసారి తమ పార్టీనిగానీ, తమ అధినేత వైఎస్ జగన్‌పై గానీ నోరుజారితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హెచ్చరించారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓ జాతీయ పార్టీని రాష్ట్రంలో నామరూపాల్లేకుండా చేసిన ఘనత తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిదని గుర్తించుకోవాలన్నారు. సింహంలా ఎవరి పొత్తు లేకుండా సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్ సీపీకి 40 శాతం మంది ఓటు వేసిన విషయం తెలుసుకోవాలన్నారు. తాము టీడీపీలాగా... రోజుకో పార్టీతో జతకట్టి దిగజారుడు రాజకీయాలు చేయలేమన్నారు. ఇప్పటికైనా మంత్రి సవిత వాస్తవాలు తెలుసుకుని తన స్థాయి గుర్తించుకుని మాట్లాడాలన్నారు. నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్నారు. దందాలు నిజం కాదా? పెనుకొండ నియోజకవర్గంలోని క్రషర్ల యజమానులపై మంత్రి, ఆమె అనుచురులు అజమాయిషీ చేస్తున్న విషయం నిజం కాదా అని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. ఇందులో మంత్రికి ఏమైనా సందేముంటే ఆమైపె ఆమె ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మంత్రి అనుచరులు రొద్దం, పరిగి మండలాల నుంచి ఇసుక దందాలకు తెర లేపారని, గోరంట్ల, పాలసముద్రం, గొందిపల్లి, గ్రామాల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తు సొమ్ము చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాదనే దమ్ము సవితకు ఉంటే నిరూపించుకోవాలన్నారు. మరోసారి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ హెచ్చరిక -
ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి
● అధికారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘‘తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రం వరకూ వచ్చి అర్జీ ఇస్తున్నారు. ఇందుకోసం వారు పనులు మానుకోవడంతో పాటు చార్జీల కోసం డబ్బు వెచ్చిస్తున్నారు. దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి’’ అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 227 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. అర్జీలకు పరిష్కారం చూపే క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఒకే ఫిర్యాదు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీల పరిష్కారం పురోగతిని కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఎల్డీఎం రమణకుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భార్యపై హత్యాయత్నం.. భర్తకు పదేళ్లజైలుఅనంతపురం/పుట్టపర్తి టౌన్: భార్యను వేధించడంతో పాటు హత్య చేసేందుకు యత్నించిన భర్తకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం నాలుగో జిల్లా కోర్టు న్యాయమూర్తి శోభారాణి సంచలన తీర్పు వెలువరించారు. వివరాలు.. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన కిష్టప్ప కుమారుడు చాకలి రాజశేఖర్‌కు, పుట్టపర్తి మండలం వెంకటగారి పల్లికి చెందిన చాకలి సావిత్రికి 2016లో వివాహమైంది. దంపతులిద్దరూ ముదిగుబ్బలో కాపురం పెట్టారు. ఆరు నెలల్లోనే భార్య సావిత్రిపై రాజశేఖర్ అనుమానం పెంచుకున్నాడు. తరచూ దూషించేవాడు. చంపుతానని బెదిరించేవాడు. వేధింపులు తట్టుకోలేక సావిత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అక్కడికే వెళ్లిన రాజశేఖర్ ఆమెను కొట్టడమే కాకుండా తండ్రి ఓబులేసు ఫోన్ తీసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే 2017 అక్టోబర్ 11న మధ్యాహ్నం 3 గంటల సమయంలో భార్యకు ఫోన్ చేసి.. తాను అరటికాయ లోడు తీసుకెళ్లడానికి వెళ్తున్నానని, వెంకటగారిపల్లి క్రాస్ వద్దకు వస్తే సెల్‌ఫోన్ ఇస్తానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అక్కడికి సావిత్రి వెళ్లగా.. కంపచెట్లలో దాక్కుని ఉన్న రాజశేఖర్ ఉన్నపలంగా సావిత్రిపై దాడికి పాల్పడ్డాడు. ఎడుమ భుజం వెనుక, కుడిపక్క గొంతు కింద రెండు పోట్లు పొడిచాడు. అంతలోనే సావిత్రి అక్క కుమారుడు సాయి కృష్ణ, అతని స్నేహితుడు సాయి కుమార్, బావ రాము అక్కడికి రావడం చూసి పారిపోయాడు. గాయపడిన సావిత్రిని వెంటకగారి పల్లి సర్పంచ్ చిన్న రామప్ప 108 అంబులెన్స్‌లో పుట్టపర్తి సూపర్‌స్పెషాలిటీకి తరలించారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు విచారించిన అనంతపురం నాలుగో జిల్లా కోర్టు న్యాయమూర్తి శోభారాణి సోమవారం తీర్పు వెలువరించారు. ముద్దాయి చాకలి రాజశేఖర్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున సుజన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ధనుంజయ, పుట్టపర్తి రూరల్ ఎస్ఐ కేఎం లింగన్న, హెడ్ కానిస్టేబుల్ డి. శివ, మనోహర్, కోర్టులైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు (ఏఎస్ఐ)ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
తాగునీటి కోసం ‘ధర్మా’గ్రహం
ధర్మవరం: నెలరోజులైనా తాగునీరు సరఫరా చేయని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్మవరంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఎల్–4 కాలనీకి చెందిన మహిళలు సోమవారం ఎన్ఎస్ గేటుకు వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. దీంతో రెండు గంటలకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ... తమ కాలనీకి రెండు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని, మున్సిపల్ డీఈకి పలుమార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లో తామంతా రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. తమ కాలనీకి తాగునీరు అందించేదాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని మహిళలకు సర్ది చెప్పారు. వెంటనే తాగునీరు సరఫరా చేస్తామని చెప్పడంతో వారు రాస్తారోకోను విరమించారు. -
మూగజీవి ఆరోగ్యానికి ముప్పు!
త్వరలోనే సేవల పునరుద్ధరణ ప్రస్తుతం జిల్లాలోని ఆరు సంచార పశు ఆరోగ్య వాహనాలు నిలిచాయి. ఈ వాహనాల బాధ్యతలను కొత్త సంస్థకు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం సేవలను నిలుపుదల చేసింది. పూర్తి స్థాయిలో అగ్రిమెంట్, టెండర్ పూర్తయ్యాక వాహన సేవలు అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే సంచార పశువైద్య సేవలు పునరుద్ధరిస్తాం. – శుభదాస్, పశుశాఖ జేడీ రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులపై ఆధారపడి బతుకుతున్నారు. అలాగే గొర్రలపై ఆధారపడి కాపర్లు జీవిస్తున్నారు. మూగజీవాలకు ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా రైతులు, కాపర్లు తీవ్ర ఇబ్బందులు పడతారు. అత్యవసర సమయంలో వైద్యం అందక పోతే రూ.లక్షలు నష్టపోతాం. అందువల్ల ప్రభుత్వం వెంటనే సంచార పశువైద్య సేవలందించే వాహనాలు అందుబాటులోకి తేవాలి. – రామన్న, పైడేటి, పరిగి మండలం రాత్రికి రాత్రే తొలగింపు ఉత్తర్వులు సంచార పశు ఆరోగ్య వాహనంలో సేవలు అందించే ఉద్యోగులను ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించింది. పశువులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయంటూ ప్రతి రోజూ రైతుల నుంచి ఫోన్లు వస్తున్నా...మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుంటేనే రైతులకు, జీవాల కాపర్లు మేలు జరుగుతుంది. – పవన్, సంచార పశు ఆరోగ్య ఉద్యోగి ● పెనుకొండ మండలం మావటూరుకు చెందిన మల్లికార్జున ఎద్దులపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఓ ఎద్దు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఈనెల 15న సంచార పశువైద్యసేవల కోసం డయల్ 1962కు ఫోన్ చేశాడు. అదిగో..ఇదిగో అని చెప్పిన సిబ్బంది ఆ తర్వాత ఫోన్ తీయడం మానేశారు. తనకు తెలిసిన వారి ద్వారా సిబ్బంది పర్సనల్ నంబర్ తీసుకుని ఫోన్ చేయగా..తమను ఉద్యోగాల నుంచి తొలగించారని, సంచార పశువైద్య సేవలు బంద్ చేశారని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని మల్లికార్జున రూ.2 వేలు చెల్లించి ప్రైవేటు వాహనంలో హిందూపురం పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించుకున్నాడు. ..ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. సంచార పశువైద్యం కోసం ఏర్పాటు చేసిన 1962 నంబర్‌కు ఫోన్ చేస్తే సమాధానం చెప్పేవారే లేకుండా పోయారు. జిల్లాలోని 6 వాహనాల్లో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం నెలరోజుల క్రితం తొలగించడంతో పశువైద్యం దైవాదీనంగా మారింది. పెనుకొండ: పశువులు జబ్బుబారిన పడినా, ప్రమాదాలకు గురైనా ఆస్పత్రుల వరకూ తీసుకువెళ్లేందుకు రైతులకు ఇబ్బందులు లేకుండా గత వైఎస్ జగన్ సర్కార్ సంచార పశువైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 1962 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు పశువుల అంబులెన్స్‌లో వైద్యుడు, సిబ్బంది ఇంటివద్దకే వచ్చి పశువులకు వైద్యం అందించేవారు. దీంతో రైతులకు ఎంతో మేలు జరిగేది. కానీ ఇప్పుడా సంచార పశు వైద్య సేవలందించే వాహనాలు నెలరోజుల క్రితం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అత్యవసర వైద్య సేవలు అందక మూగజీవాలు అల్లాడి పోతుంటే రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు.. సంచార పశువైద్య సేవల కోసం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 175, రెండో దశలో మరో 175 సంచార వాహనాలను జగనన్న ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సంచార పశువైద్య బాధ్యతలను జీవికే సంస్థకు అప్పగించింది. దీంతో సదరు సంస్థ ఒక్కో సంచార వైద్యం సేవందించే వాహనంలో వైద్యుడితో పాటు డ్రైవర్ కమ్ అటెండర్, మరో సహాయకుడి చొప్పున నియమించింది. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలిదశలో 13 వాహనాలు అందుబాటులోకి రాగా 39 మందిని నియమించింది. ఇందులో శ్రీసత్యసాయి జిల్లాకు 6 వాహనాలు, 18 మంది సిబ్బందిని కేటాయించారు. దీంతో వారంతా మారుమూల పల్లెలు, పొలాల వద్దకే వెళ్లి పశువులకు వైద్య సేవలు అందించేవారు. అవసరమైతే వాహనంలోనే ఆస్పత్రికి తరలించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పశు సంచార వైద్యసేవల బాధ్యతలను చూస్తున్న జీవీఆర్ సంస్థను తొలగించింది. అంతేకాకుండా జిల్లాలోని సంచారవాహనాల్లో పనిచేస్తున్న 18 మంది సిబ్బందిని తొలగిస్తూ ఫిబ్రవరి 15న ఉత్తర్వులు జారీ చేసింది. నేటికీ మరో సంస్థకు కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో సంచార వైద్య సేవలు అందక రైతులు, పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన సంచార పశువైద్య వాహనాలు రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు నెలరోజులుగా అందని వైద్య సేవలు -
తీరు మారదు.. కక్కుర్తి తీరదు
కదిరి అర్బన్: కమీషన్ల మోజులో వైద్య సేవలను నిర్లక్ష్యం చేస్తూ వృత్తికి మాయని మచ్చను తెస్తున్నారు కొందరు డాక్టర్లు. రూ.లక్షల్లో ప్రభుత్వ జీతం తీసుకుంటూనే అడ్డగోలు సంపాదనపై మోజుతో రోగులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సేవలూ ఉచితం కాగా, కొందరు డాక్టర్ల తీరుతో ఆ సేవలు కాస్త అభాసుపాలవుతున్నాయి. ఇందుకు నిదర్శనమే కదిరిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి. ఇక్కడ సేవ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఇక్కడి వైద్యుల కాసుల కక్కుర్తి కారణంగా రూ.వేలల్లో ఆర్థిక భారాన్ని నిరుపేద రోగులు భరించాల్సి వస్తోంది. కాసుల కక్కుర్తికి పరాకాష్టగా... ఈ నెల 7న కదిరి మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన గర్భిణి అంజలి పురిటి నొప్పులతో కాన్పు కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి రాగా, ఆమెకు గర్భంలో సమస్య ఉందని నాలుగు స్కానింగ్‌లను చేయించుకుని రావాలంటూ గైనకాలిజిస్టు ఒకరు ఆస్పత్రి పక్కనే ఉన్న ప్రైవేట్ ల్యాబ్‌కు రెఫర్ చేశారు. ఆస్పత్రిలో స్కానింగ్ చేయరా? అని అంజలి బంధువులు అడిగితే ఇక్కడ అలాంటి సౌకర్యం లేదని బుకాయించడంతో గత్యంతరం లేని స్థితిలో అంజలి కుటుంబసభ్యులు రూ.4,500 ఫీజు చెల్లించి ప్రైవేట్ ల్యాబ్‌లో స్కాన్ చేయించారు. ఈ అంశంపై ఈ నెల 11న ‘ప్రభుత్వ డాక్టర్ అత్యాశ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంటనే సదరు డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆస్పత్రిలో రూ. 45 లక్షలు విలువ చేసే అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు ఉన్నా... గర్భంలో సమస్య ఉందంటూ భయబ్రాంతులకు గురి చేస్తూ కమీషన్ల కోసం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేస్తున్న ప్రభుత్వ వైద్యుల కాసుల కక్కుర్తికి ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. నాటి ఘటన మరువకనే.. ఈ నెల 10న వెలుగు చూసిన కదిరి ఏరియా ఆస్పత్రి వైద్యుల కాసుల కక్కుర్తి ఘటన మరువకనే మరో ఘటన వెలుగు చూసింది. తన నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా ఈ నెల 22న కదిరిలోని మగ్గాల క్వాటర్స్‌కు చెందిన ఓ గర్భిణి కదిరి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన డ్యూటీ గైనకాలజిస్ట్... గర్భస్థ శిశువు ఎదుగుదలపై స్కానింగ్ చేయించుకుని రావాలంటూ ఆర్ఎస్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు రెఫర్ చేశారు. ఇప్పటికే ప్రతి నెలా పలు రకాల వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రూ.వేలల్లో ఫీజులు చెల్లించుకున్న సదరు గర్భిణి కుటుంబసభ్యులకు ఇది అదనపు ఆర్థిక భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ వైద్య పరీక్షల కోసం ఆరా తీస్తే గర్భంలో సమస్య ఉందంటూ భయభ్రాంతులకు గురి చేశారు. తప్పని పరిస్థితుల్లో సదరు గర్భిణిని పిలుచుకుని ఆర్ఎస్ రోడ్డులోని స్కానింగ్ సెంటర్‌కు కుటుంబసభ్యులు చేరుకున్నారు. విషయం కాస్త బయటకు పొక్కడంతో ఈ అంశాన్ని విజయవాడకు వ్యక్తిగత పనిపై వెళ్లిన ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి పాత్రికేయులు ఫోన్లో తీసుకెళ్లారు. దీంతో ఆయన అసహనానికి గురై వెంటనే సదరు గైనకాలజిస్ట్‌కు ఫోన్ చేసి మందలించడంతో ఆమె స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్ చేసి తాను పంపిన గర్భిణికి స్కానింగ్ చేయకుండా వెనక్కు పంపాలని అభ్యర్థించినట్లు తెలిసింది. స్పందించని అధికారులు.. ఈ నెల 7న పురిటి నొప్పులతో ఏరియా ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి గర్భంలో సమస్య ఉందంటూ నాలుగు స్కానింగ్‌లకు ప్రైవేట్ ల్యాబ్‌కు రెఫర్ చేసిన గైనకాలజిస్ట్‌కు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ మెమో జారీ చేశారు. ఇది జరిగి రెండు వారాలకు పైగా అవుతున్నా... ఇప్పటి వరకూ సదరు గైనకాలజిస్ట్‌పై ఎలాంటి చర్యలూ లేవు. ఇదే అంశంపై సదరు గర్భిణి మామ రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా జరిగిన ఘటనలో సంబంధిత గైనకాలజిస్ట్ మాట్లాడుతూ.. హిందూపురానికి చెందిన తన బంధువుల అమ్మాయికి రాసిన స్కానింగ్ ప్రిస్కిప్షన్‌ను పొరపాటున అదే పేరుతో ఉన్న కదిరికి చెందిన గర్భిణి తీసుకెళ్లిందన్నారు. విషయం ఆలస్యంగా గుర్తించిన వెంటనే స్కానింగ్ సెంటర్ డాక్టర్‌కు ఫోన్ చేసి ఆ స్కానింగ్ చేయొద్దని తెలిపి, ఆమెను తిరిగి ఆస్పత్రికి పిలిపించి ఇక్కడే స్కానింగ్ చేయించినట్లు వివరించారు. మెమోలిచ్చినా తీరు మార్చుకోని ప్రభుత్వ వైద్యులు రూ.లక్షల్లో ప్రభుత్వ జీతం అయినా అడ్డగోలు సంపాదనపై మోజు కమీషన్ల కోసం రోగులపై అదనపు ఆర్థిక భారం వీళ్లింతే మారరు రోగ నిర్ధారణ, గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలన తదితర అంశాలపై ప్రైవేట్ ల్యాబ్‌లకు రెఫర్ చేయరాదని పలుమార్లు ఇక్కడి డాక్టర్లకు చెబుతూనే ఉన్నాం. అయినా వారి పని తీరు మారలేదు. ఇక నాతో కాదు. వీరు మారరు. నేనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోతా. ఈ నెల 7న బయటకు స్కానింగ్ రాసిన డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశాను. ఆమె వివరణను ఉన్నతాధికారులకు పంపాను. – డాక్టర్ హుస్సేన్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ముగ్గురు ఇన్విజిలేటర్ల సస్పెన్షన్
● పదో తరగతి పరీక్షల విధుల్లో అలసత్వానికి ఫలితం పుట్టపర్తి: పదో తరగతి పరీక్షల విధుల్లో అలసత్వం వహించిన ముగ్గురు ఇన్విజిలేటర్లు సస్పెండ్ అయ్యారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం గణితం పరీక్ష నిర్వహించారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రత్యేకాధికారి సుబ్బారావు కదిరి నియోజకవర్గంలో పర్యటించి 10 కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన కదిరి బాలికల ఉన్నత పాఠశాల ఇన్విజిలేటర్లు రుద్రమరెడ్డి, డి.కృష్ణప్పను సస్పెండ్ చేయాలని డీఈఓను ఆదేశించగా...ఆయన ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అలాగే ముదిగుబ్బ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి మాస్ కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్‌కు దొరికిపోయాడు. దీంతో సదరు విద్యార్థిని డీబార్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి మాస్‌కాపీయింగ్ చేస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోని ఇన్విజిలేటర్ మహమ్మద్ రఫీని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. అంతేకాకుండా సదరు పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించామని వెల్లడింతారు. పరీక్షకు 145 మంది విద్యార్థుల గైర్హాజరు సోమవారం జరిగిన పదో తరగతి గణితం పరీక్షకు 145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 104 కేంద్రాల్లో సోమవారం గణితం పరీక్షకు 21,629 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 21,484 మంది మాత్రమే హాజరయ్యారన్నారు. మరో 145 మంది గైర్హాజరయ్యారని డీఈఓ వివరించారు. 108.5 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం పుట్టపర్తి అర్బన్: అకాల వర్షాలతో జిల్లాలో 108.5 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న అకాలవర్షంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. దీంతో రెవెన్యూ, ఉద్యానశాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి పంటనష్టంపై ప్రాథమిక అంచనా రూపొందించినట్లు వెల్లడించారు. ఇందులో తాడిమర్రి మండలంలోని దాడితోట, ముదిగుబ్బ మండలంలోని కొడవాండ్లపల్లి, కొండగుట్టపల్లి ,మర్తాడు గ్రామాల్లో సుమారు 115 మంది రైతులకు చెందిన 108.5 హెక్టార్లలో అరటి తోటలు నేలకొరిగినట్లు గుర్తించామన్నారు. పంటనష్టానికి సంబంధించినన నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.29లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలి ప్రశాంతి నిలయం: జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఈ నెల 29వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ–కేవైసీ పూర్తి చేసుకోని వారికి రేషన్ సరుకులు అందే అవకాశం లేదన్నారు. జిల్లాలోని 5 లక్షలకుపైగా ఉన్న రేషన్‌కార్డుల్లో 16,89,531 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. వారిలో ఇప్పటి వరకు 15,17,689 మంది ఈ–కేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇంకా 1,71,842 మంది ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. వారంతా వెంటనే గ్రామ/వార్డు సచివాలయాలు, మొబైల్ యాప్, రేషన్ షాపుల్లోని ఈ–పాస్ పరికరాల ద్వారా ఈ–కేవైసీ ఆప్డేట్ చేయించుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు మినహా కార్డుల్లో పేర్లున్న వారంతా ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని జేసీ సూచించారు. ఖాద్రీశుడి హుండీ ఆదాయం రూ.82.64 లక్షలు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన 15 రోజులకు గానూ హుండీల ద్వారా రూ.82,64,892 నగదు, 12 గ్రాముల బంగారం, 302 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే 21 అమెరికా డాలర్లు, 20 కెనడా, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 7 ఓమన్ రియాల్ వచ్చినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం పెరిగిందన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణాధికారి ఎన్.ప్రసాద్, కెనరా బ్యాంక్ మేనేజర్ అనంతబాబు, బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
తేలికపాటి ఆహారం మంచిది
● ఏప్రిల్ 23 వరకూ ఒంటి పూట బడులు ● మధ్యాహ్నం 12:30 గంటలకే ఇంటికి చేరుతున్న విద్యార్థులు ● సరదాల మాటున పొంచి ఉన్న ప్రమాదాలు ● కనిపెట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదురాయదుర్గం: ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించింది. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ నిబంధన పాటించేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. త్వరగా నిద్ర లేచి ఉరుకులు పరుగులతో బడికి వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు చేరుకోగానే ఆటపాటలకు ప్రాధాన్యమివ్వడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ, నగర ప్రాంతాల్లోనూ వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఈతకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆటలు, ఈత శారీరక వ్యాయామంగా మంచిదే అయినా... ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సరదా మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణ తాపం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిల్లలకు అవగాహన కల్పించాలని చెబుతున్నారు. 4 లక్షలకు పైగా విద్యార్థులు మండుటెండలోనే.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 5,036 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 7,03,094 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 54,402 మంది మినహా మిగిలిన వారంతా ఒంటిపూట బడులకు హాజరవుతున్నారు. అలాగే 4,72,860 మందికి పైగా విద్యార్థులు ఇతర గ్రామాలకు, పట్టణాల్లో ఉండే ప్రైవేటు పాఠశాలలకు వాహనాలు, కాలినడకన వెళ్లి వస్తుంటారు. వీరంతా మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత పాఠశాల నుంచి మండుటెండలో ప్రయాణం చేయాల్సి ఉంటోంది. ఇలాంటి తరుణంలో పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకునేలా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులూ చొరవ చూపాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ ధరించడం లేదా, తల.. ముఖ భాగం పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రం కట్టుకుంటే మరీ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్ర సూర్యరశ్మితో ప్రమాదం.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు నిటారుగా భూమిపై పడుతుంటాయి. ఈ సమయంలో ఎక్కువగా బయట తిరిగితే అతినీలలోహిత కిరణాలు నేరుగా శరీరాన్ని తాకడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. మరోవైపు అంతర్గతంగా కూడా ఈ కిరణాల ప్రభావం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బడి ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న పిల్లలను తప్పనిసరి అయితే తప్పా బయటకు పంపకూడదని సూచిస్తున్నారు. ప్రయాణాల సమయంలో ద్విచక్ర వాహనంపై పిల్లలను ముందు భాగంలో కూర్చోబెట్టుకుంటే వడగాలుల తీవ్రతకు వడదెబ్బ సోకే ప్రమాదం ఉందంటున్నారు. బోర్ అనిపించకుండా.. ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉంటే చాలా బోర్‌గా ఫీలవుతారు. దీంతో సెల్ఫోన్లకు అలవాటు పడితే మరింత ప్రమాదం. పిల్లలు బోర్ ఫీల్ కాకుండా ఉండేందుకు నీడ పట్టున వారికి కొత్త ఆటలు గాని, విజ్ఞానాన్ని పంచే అంశాలపై ఆసక్తి పెంపొందించాలి. వీలైనంత మేర తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. పాఠశాలల్లో ఇచ్చిన హోమ్‌వర్క్ మధ్యాహ్నం చేసుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత ఆడుకునే వెసులుబాటు కలుగుతుంది. వేసవి తాపం కారణంగా పిల్లలు తొందరగా అలసిపోతారు కావున, మధ్యాహ్నం కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా చూడాలి. మృతుడు అయాన్ (ఫైల్)మృతుడు రిహాన్ (ఫైల్ వేసవిలో పిల్లలకు తేలికపాటి ఆహారం చాలా మంచిది. త్వరగా జీర్ణమయ్యే ఉప్మా, ఇడ్లీ వంటివి అల్పాహారంగా ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత తేలికగా ఉండే ఆహారం ఇవ్వాలి. వేపుళ్లు, మాంసాహారం వంటి వాటికి వేసవి పూర్తయ్యే వరకూ స్వస్తి చెప్పడం మేలు. రాత్రి పూట త్వరగా నిద్రించేలా అలవాటు చేయాలి. నిద్రలేచిన తర్వాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. – డాక్టర్ మెర్సీ జ్ఞానసుధ, మెడికల్ సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, రాయదుర్గం హిందూపురంలోని ఆటోనగర్‌లో నివాసముంటున్న జహీర్ కుమారుడు రిహాన్ (14), సుహేల్, ఉమేరా దంపతుల కుమారుడు అయాన్ (12) స్థానిక పాఠశాలలో 7, 6 తరగతులు చదువుకుంటున్నారు. ఈ నెల 9న ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తోటి స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలోని నీటి కుంటకు వెళ్లారు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగిపోయారు. తోటి స్నేహితుల కేకలతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని నీట మునిగిన ఇద్దరినీ వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. చికిత్సకు స్పందించక రిహాన్, అయాన్ మృతి చెందారు. ... ఇలాంటి దుర్ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతున్నాయి. సెలవుల్లో పిల్లలను ఓ కంట కనిపెట్టకపోతే ఎంత అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. -
ఎస్సీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లు కట్
బత్తలపల్లి: ఎస్సీ కాలనీల్లో గృహావసరాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. అయితే.. 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించారంటూ అధికారులు కనెక్షన్లు కట్ చేసిన సంఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని పోట్లమర్రి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోట్లమర్రి ఎస్సీ కాలనీవాసులు తెలిపిన సమాచారం మేరకు..కాలనీలో 20 మందికి పైగా లబ్ధిదారుల ఇళ్లకు 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరిగిందని, వీరంతా రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు బకాయిలు పడ్డారని ఆదివారం విద్యుత్ అధికారులు దాదాపు 12 మంది గ్రామానికి చేరుకుని కనెక్షన్లు కట్ చేశారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2020 సంవత్సరంలో కూడా ఇలాగే సమస్య ఎదురైతే అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. అప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఇప్పుడు మరోసారి అదేవిధంగా అధిక బిల్లులు వచ్చాయని విద్యుత్ అధికారులు కనెక్షన్లు కట్ చేశారని వాపోయారు. అప్పటి విద్యుత్ బిల్లులు కూడా ఇప్పుడు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సోమవారం తీసుకువెళతామని తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్ జోరు
బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై చర్యలు క్రికెట్ బెట్టింగ్‌ల పేరుతో యువతను ఊబిలోకి దించి ఆన్లైన్లో, ప్రత్యేక యాప్‌ల ద్వారా నేరుగా ఆడించి కమీషన్లు పొందే వారిపై కఠిన చర్యలు తప్పవు. యువత కూడా క్రికెట్ మోజులో పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలి. – కె.వి.మహేష్, డీఎస్పీ, హిందూపురం హిందూపురం అర్బన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ –2025 (ఐపీఎల్) 18వ సీజన్ మొదలైంది. ఉత్కంఠగా సాగే ఈ క్రికెట్ మ్యాచ్‌లను అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగారు. ‘మీ ఫేవరెట్ టీమ్ గెలుస్తుందా.. నిజంగా టీమ్‌పై అభిమానం ఉంటే బెట్టింగ్ కట్టవచ్చు కదా.. సరదాకు సరదా.. డబ్బులూ గెలుచుకోవచ్చు.. అంటూ చిన్నగా ముగ్గులోకి దించుతున్నారు. బెంగళూరు కేంద్రంగా హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర పట్టణాలే కాకుండా మండల కేంద్రాలకు .. గ్రామాలకు బెట్టింగ్ వ్యవహారం విస్తరిస్తోంది. ఇదేమీ గుట్టుగా కాదు ఆన్లైన్ ద్వారా బహిరంగంగానే సాగిస్తున్నారు. బెట్టింగ్ అంతా సెల్ ఫోన్లోనే సాగుతోంది. ఇరువురు ఫోన్లలోనే కాంటాక్ట్ చేసి బెట్టింగులు కాయిస్తున్నారు. గెలిచిన వారి నుంచి కమీషన్ పొందేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. పట్టణాలు, పల్లెల్లోని యువకులను టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ఎంతోమంది యువకులు బెట్టింగ్‌లో ఓడి అప్పుల పాలైన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. కొందరు పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకొన్న విషయమూ విదితమే. ప్రతి బంతికీ ఓ రేటు.. టాస్ వేసే సమయం నుంచి బ్యాటింగ్ ఎవరు ఎంచుకొంటారు.. బౌలింగ్ ఎవరు చేస్తారు.. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు తీస్తాడు.. ఓవర్‌కు ఎన్ని పరుగులు వస్తాయి.. ఎవరు గెలుస్తారు.. ఎన్ని పరుగులతో మ్యాచ్ పూర్తి కానుంది .. ఇలా ప్రతి దానికీ ఒక పందెం ఉంటుంది. ప్రత్యేక యాప్‌ల ద్వారా.. ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు కొన్ని యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పందేలు కాయడం.. మ్యాచ్ చూసేందుకు ఒకటి.. బెట్టింగ్ కాసేందుకు మరో మొబైల్ వినియోగించి ఆన్లైన్లో క్రికెట్ బుకీలు సంప్రదింపులు జరుపుతూ కమీషన్ పొందుతున్నారు. ఇక స్థానికంగానూ.. హిందూపురం, ధర్మవరం, కదిరి లాంటి పెద్ద పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ యువత పోగై తమకు అనువైన ప్రదేశాలను ఎంచుకొని అక్కడికి చేరుకొని నేరుగా బెట్టింగ్‌లకు దిగుతున్నారు. గతంలో ఎవరెవరు బెట్టింగ్‌లకు పాల్పడింది గుర్తించిన కొంత మంది పోలీసులు సైతం సొమ్ము చేసుకొంటున్నారు. అప్పుడే మొదలైన జోరు.. పట్టణాలు, గ్రామాల్లో అప్పుడే యువత బెట్టింగ్‌ల జోరు కనిపిస్తోంది. ప్రధానంగా ఏయే తేదీల్లో ఎవరెవరి మధ్య మ్యాచ్ జరగనుందో తెలుస్తుండటంతో చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ , ముంబై టీమ్‌లపై బెట్టింగ్‌లు కాయనుండగా.. వీరిని కొందరు బుకీలు తమ వైపు తిప్పుకొని డబ్బు కాజేస్తున్నారు. కోడ్ లాంగ్వేజ్లతో.. బెట్టింగ్ వ్యవహరం అంతా కోడ్ లాంగ్వేజీలోనే సాగేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. సెల్ ఫోన్లోనే ఎస్.. నో.. ఓకే.. డన్.. ఈటింగ్ వంటి పదాలు దీనికోసం వాడనున్నారు. చాలామంది సెల్ఫోన్లకు అతుక్కుపోయి పందేలు కాసేందుకు ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేసుకొన్నారు. ఇందుకు హిందూపురం పట్టణంలో బెంగళూరు రోడ్డు, మోడల్ కాలనీ, ముద్దిరెడ్డిపల్లి. దండు రోడ్డు, చిలమత్తూరు, లేపాక్షి మండల కేంద్రాల్లో కొంతమంది యువత తమకు అనువైన ప్రదేశాలకు మ్యాచ్ టైమ్‌లో చేరుతున్నారు. టీవీలు చూస్తూ పందేలు కాస్తున్నారు. గ్రౌండ్లో చూసే ఆటకు.. టీవీల్లో చూసే వారికి రెండు నుంచి మూడు బంతుల సమయం తేడా ఉంటుంది. ఆట ముందే తెలుసుకొని బెట్టింగులు కాసే వారి జేబులను బుకీలు గుల్ల చేస్తున్నారు. ఇది యువత గమనించాలి. మ్యాచ్‌లో ఎవరు గెలవనున్నారు.. ఎవరు ఓడి పోతారు.. ఎవరెన్ని పరుగులు చేస్తారు.. ఈ ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయనే కోణంలోనూ పందేలు కాయడం మొదలైంది. మొదలైన ఐపీఎల్ మ్యాచ్‌ల సందడి అభిమానుల అమితాసక్తిపై బుకీల వల బెట్టింగ్‌లోకి దింపి.. గుల్ల చేస్తున్న వైనం -
నేలకూలిన భారీ వృక్షాలు
హిందూపురం: అసలే వర్షాలు అంతంతమాత్రం. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న నేపథ్యంలో పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లను పరిరక్షించుకోవాల్సి ఉండగా కొందరు క్షణాల్లో కూల్చేస్తున్నారు. ఇందుకు అటవీ శాఖ అధికారులు కూడా అనుమతులు ఇవ్వడం గమనార్హం. హిందూపురంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయ సమీపాన విశాలమైన మైదానంలో అనేక ఏళ్లుగా ఫలసాయం అందిస్తున్న 21 చింత చెట్లను ఆదివారం యంత్రాల సాయంతో కూకటివేళ్లతో పెకలించి ముక్కలు చేసేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలుపుట్టపర్తి టౌన్: శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీ తదితర చర్యలు చేపట్టారు. రాత్రివేళ గస్తీలు చేపడుతూ నైట్ బీట్ చెకింగ్లు ఏర్పాటు చేసి అనుమానితు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగిస్తూ ప్రమాదాలు జరగకుండా సూచనలు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. హెల్మెట్ ఫేస్వాష్పై కూడా అవగాహన కలిగిస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా, నాటుసారాలపై దాడులు చేస్తున్నారు. గ్రామాలను సందర్శించి గొడవలకు వెళ్లకుంగా ప్రశాతంగా జీవించాలని అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీ ఎంపిక పుట్టపర్తి టౌన్: జిల్లా పంచాయతీ కార్యదర్శుల (డిజిటల్ అసిస్టెంట్లు) సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం పట్టణంలోని సాయి ఆరామంలో జిల్లా ఇన్చార్జ్ చౌడప్ప ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చౌడప్ప, ఉపాధ్యక్షులుగా ప్రశాంతి, భార్గవ్ చౌదరి, జనరల్ సెక్రటరీగా లోకేష్, ట్రెజరర్‌గా రసూల్, జాయింట్ సెక్రటరీలుగా బాలాజీ, సాదిక్‌బాషా, సతీష్, శంకర, కమిటీ మెంబర్లుగా ప్రకాశ్, అశోక్, చంద్రశేఖర్, రవికాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లు కట్ బత్తలపల్లి: పోట్లమర్రి ఎస్సీ కాలనీలో 200 యూనిట్లకు మించి వినియోగించిన వారి విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. కాలనీలో దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ జగ్జీవన్ జ్యోతి స్కీం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలవుతోంది. అయితే 20 కుటుంబాల వారు 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించడంతో ఉచితం పరిధి దాటి బిల్లు పరిధిలోకి వచ్చారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో ఆదివారం 12 మంది సిబ్బంది కాలనీలోకి వచ్చి సదరు వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. తమకు గడువు ఇస్తే చెల్లిస్తామని ప్రాధేయపడినా వినలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రకృతి ప్రకోపం.. రైతులకు తీరని నష్టం
తాడిమర్రి: ప్రకృతి ప్రకోపం అన్నదాతలకు తీరని నష్టం మిగిల్చింది. శనివారం రాత్రి మండలంలో వడగండ్ల వర్షం, ఈదురుగాలులకు అరటి, దానిమ్మ, మొక్కజొన్న, టమాట పంటలు నేలకొరిగాయి. నాయనపల్లిలో రైతులు జానగాన పెద్దవీరనారప్ప, జడే శంకరయ్య, జడే నడిపి గంగన్న, జడే ఆది, బి.దస్తగిరి, పాళ్యం రహంతుల్లా, జడే శంకర్, డి.చెన్న యల్లప్ప, జె.శివయ్యతో సహా 15 మంది సాగు చేసిన అరటి తోటలు వడగండ్ల వర్షానికి దెబ్బతిన్నాయి. అరకొర పంటను కోసి అమ్ముకున్న మరో 20 మంది రైతులకూ తీరని నష్టం కలిగింది. దాడితోట గ్రామంలో ఈదురుగాలులకు రైతులు పాళ్యం రాము, పాళ్యం ఈశ్వరయ్య, సరిబాల రాజారెడ్డి, రవీంద్రారెడ్డి, పుల్లారెడ్డి, జొన్నగడ్డల శ్రీనివాస నాయుడు, బాలకృష్ణ తదితరులు సాగు చేసిన 130 ఎకరాల్లోని అరటి తోటలు ధ్వంసమయ్యాయి. తురకవారిపల్లిలో తమ్మినేని నరసింహనాయుడు, శ్రీరాములు, సూర్యనాగరాజు, పి.నారాయణ, నాగభూషణ, టి.నాగభూషణకు చెందిన దానిమ్మ చెట్లు నేలకొరిగాయి. ఇక టమాట తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. వడగండ్ల వర్షం, ఈదురు గాలులకు నేలకొరిగిన పంటలు -
కనుల పండువగా పుష్పయాగోత్సవం
కదిరి: పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి పుష్పయాగోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవం కనుల పండువగా, అత్యంత వైభవంగా సాగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని.. వారి వారి లోకాలకు సాగనంపేందుకు నిర్వహించినదే ఈ పుష్పయాగోత్సవమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు. తీర్థవాది ఉత్సవం ముగియగానే శనివారం సాయంత్రం నుంచి ఆలయం తలుపులు మూసివేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆదివారం వేకువ జామునే ఆలయ ద్వారాలు తెరిచి మహా సంప్రోక్షణ గావించారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కై ంకర్యాలను నిర్వహించిన మీదట భక్తులకు ఆలయంలో శ్రీవారి సర్వ దర్శన భాగ్యం కలిగించారు. రాత్రి రంగమండపంలో శ్రీదేవి, భూదేవిల సమేత శ్రీవారిని కర్ణాటక నుంచి తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. ఉత్సవానికి ఉభయ దారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముగిసిన నృసింహుని బ్రహ్మోత్సవాలు -
ఇసుక దోపిడీ అడ్డగింత
గోరంట్ల: బూదిలి సమీపాన చిత్రావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం మాటున కాంట్రాక్టర్ ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. హిటాచీలు పెట్టి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తుండడంతో ఆదివారం సాయంత్రం బూదిలి సర్పంచ్ రామాంజనేయులు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులరెడ్డి, బూదిలి, పాపిరెడ్డిపల్లి, గొల్లపల్లి, గంగాదేపల్లి గ్రామాల చిత్రావతి పరివాహక ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం పేరిట అవసరానికి మించి ఎందుకు ఇసుక తవ్వి డంప్ చేస్తున్నారని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. ఒక వేళ చిత్రావతి నది నుంచి ఇసుక తవ్వకం, తరలింపునకు అనుమతులు తీసుకుంటే పత్రాలు చూపాలని డిమాండ్ చేశారు. దీనికి కాంట్రాక్టర్ తరఫు నుంచి సరైన సమాధానం రాలేదు. ఇక్కడ తవ్విన ఇసుకను బ్రిడ్జి కోసం కాకుండా ఇతర పనుల్లో వాడేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. చిత్రావతి నదిలోని ఫిల్టర్ బోరుబావుల కింద వందలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకున్నామని, ఇసుకను ఎడాపెడా తవ్వేస్తే భూగర్భజలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వే క్రమంలో ఫిల్టర్ బోర్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
విద్యార్థిని చితకబాదిన వార్డెన్
ధర్మవరం: మండలంలోని నాగలూరు వద్ద ఉన్న పీసీఎంఆర్ పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థిపై కిషోర్‌ని ఆదివారం రాత్రి వార్డెన్ సందీప్ చితకబాదాడు. బాధిత విద్యార్థి తెలిపిన మేరకు... ఆదివారం రాత్రి స్టడీ ఆవర్ ముగిసిన తర్వాత డయాస్ పైకి వెళ్లాలని వార్డెన్ తెలిపాడు. దీంతో కిషోర్ డయాస్‌పైకి వెళుతుండగా ‘ఇంకా ఇక్కడే ఉన్నావా’ అంటూ వార్డెన్ ఓ పైపు తీసుకుని బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ‘నీవు ఎంపీపీ సంగాలప్ప కొడుకువురా’ అంటూ దుర్భాషలాడుతూ పదేపదే పైపుతో కొట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకునేలోపు వార్డెన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీపుపై, కాళ్లపై బలమైన గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలి పోయిన విద్యార్థిని తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు గోరంట్ల: ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. గోరంట్ల మండలం కంగారెడ్డిపల్లికి చెందిన రంగారెడ్డి, హిందూపురానికి చెందిన రాజశేఖర్‌రెడ్డికి మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేటకొడవళ్లు, ఇనుపరాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి రంగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిందూపురానికి చెందని రాజశేఖర్‌రరెడ్డి, కంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బయపరెడ్డి, నరేంద్రరెడ్డిపై, రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరువుల అంగడి రంగారెడ్డి, అశ్వత్థరెడ్డి, జగన్నాథరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, జనార్ధనరెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు వేటకొడవళ్లు, ఓ ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు. చీనీ చెట్లు దగ్ధంకనగానపల్లి: ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి చీనీ తోట దగ్ధమైంది. వివరాలు.. కనగానపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన రైతు మురళి తనకున్న నాలుగు ఎకరాల్లో ఐదేళ్ల క్రితం 350 చీనీ మొక్కలు నాటాడు. ప్రస్తుతం పంట కాయ దశలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం తోటకు సమీపంలోని ఎండు గడ్డికి ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. చుట్టుపక్కల రైతులు గమనించి మంటలు ఆర్పే లోపు 200 చీనీ చెట్లు, డ్రిప్ పరికరాలు, పైపులు కాలిపోయాయి. రూ.3.5 లక్షల మేర నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారులు పరిశీలించి తనకు నష్టపరిహారం అందించాలని వేడుకున్నాడు. -
అవగాహన కల్పిస్తున్నాం
క్షయ నివారణకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఒకరి నుంచి సగటున మరో 15 మందికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకే విధానం, ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దీర్ఘకాలికంగా దగ్గు ఉన్నా.. ఆకలి మందగించినా.. బరువు తగ్గినా.. వెంటనే సమీపంలోని పీహెచ్సీలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. – డాక్టర్ తిప్పయ్య, జిల్లా క్షయ అధికారి, పుట్టపర్తి -
సూక్ష్మ సేద్యం పరికరాల దగ్ధం
చెన్నేకొత్తపల్లి: మండలంలోని పులేటిపల్లి గ్రామ సమీపంలో పొలాల్లో ఉంచిన డ్రిప్, స్ప్రింక్లర్ల పైపులు ఆదివారం అగ్నికి ఆహుతైనట్లు రైతు వాపోయాడు. వివరాలు... గ్రామానికి చెందిన రైతు దాసరి పెద్దన్న తన పొలంలో ఉన్న వేప చెట్టు కింద 30 స్ప్రింక్లర్ల పైపులు, 15 కట్టల డ్రిప్ పైపును భద్ర పరిచాడు. ఆదివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా మంటలు వ్యాపించి సూక్ష్మ సేద్యం పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనతో రూ.50 వేల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. ‘రెవెన్యూ’ బెదిరింపులు.. రైతు ఆత్మహత్యాయత్నంబత్తలపల్లి: రెవెన్యూ అధికారుల బెదిరింపులతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణస్వామికి గ్రామంలో తనకున్న 2.43 ఎకరాల పొలంలో వ్యవసాయంతో పాటు గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గొర్రెల పోషణకు తన పొలంలో కంచె వేయాలని నిర్ణయించుకుని ఇప్పటికి ఐదు దఫాలుగా రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాడు. అధికారలు నిర్దేశించిన హద్దుల మేరకు తన భాగానికి వచ్చిన పొలంలో కంచె వేసేందుకు సిద్ధం కాగా, పక్క పొలం రైతు అభ్యంతరాలు లేవనెత్తాడు. అంతటితో ఆగకుండా విషయాన్ని గ్రామ సర్వేయర్ రవికిరణ్, వీఆర్ఓ నాగేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో వారు నారాయణస్వామికి ఫోన్ చేసి కంచె ఎలా వేస్తావంటూ బెదిరింపులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణస్వామి శనివారం తన పొలంలోనే క్రిమి సంహారక మందు తాగాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉప్పర్లపల్లికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలసి ఆరా తీశారు. ఘటనపై ఫిర్యాదు స్వీకరించారు. బెంగళూరులోని ఆస్పత్రికి పోలీసులు వెళ్లి బాధితుడి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. కాగా, తాము బెదిరించలేదని, సమస్యను పరిష్కరించేందుకు సర్దిచెప్పినట్లు పోలీసుకు వీఆర్వో నాగేంద్ర, సర్వేయర్ రవికిరణ్ తెలిపినట్లు సమాచారం. -
కాక రేపుతున్న కొల్లేరు
అనంతపురం: ఐపీఎల్ తరహాలో సాగుతున్న ఏపీ సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టు కాకరేపుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏపీ సూపర్ కప్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలిపి 8 జోన్లుగా, 8 క్లబ్‌లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టులో ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ కం నాకౌట్ పద్థతిలో సాగుతున్న ఈ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అన్నింటా విజయం సాధించి కొల్లేరు క్లబ్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో నల్లమల క్లబ్ జట్టుపై తలపడిన విశాఖ క్లబ్... 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో తుంగభద్ర క్లబ్‌పై ఏకంగా ఐదు గోల్స్ సాధించి గోదావరి క్లబ్ జట్టు (5–0) విజయం కై వసం చేసుకుంది. కొల్లేరు–కోరమాండల్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో 2–0 గోల్స్ తేడాతో కొల్లేరు క్లబ్ విజయకేతనం ఎగురవేసింది. -
కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
ఎన్పీకుంట: వీధి కుక్కలు దాడి చేయడంతో గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఎన్పీకుంట మండలం ఎస్కే తండా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన రైతు దుంగావత్ కృష్ణానాయక్ పాడితో పాటు గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటిక సమీపంలోని గొర్రెల కోసం ఓ దొడ్డిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గొర్రె, మేక పిల్లలను దొడ్డిలో వదిలి ఇంటికి వెళ్లి వచ్చేసరికి వీధి కుక్కలు చొరబడి 10 గొర్రె పిల్లలు, పది మేక పిల్లలను చంపేశాయి. రూ.90 వేలు నష్ట పోయినట్లు రైతు వాపోయాడు. అభివృద్ధి పనుల ప్రారంభంసోమందేపల్లి: స్థానిక సప్తగిరి కాలనీ, గీతానగర్‌లో రూ.1.50 కోట్లతో తలపెట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను మంత్రి సవిత ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్ర కుమార్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు. -
విస్తరిస్తున్న క్షయ
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో క్షయ వ్యాధి నానాటికీ విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సకాలంలో చికిత్స చేయించుకోకపోవడం, పాజిటివ్‌గా నిర్ధారణ అయినా మందులు సక్రమంగా వాడకపోవడం వంటి కారణాలతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. జిల్లాలో ఏటా వేల మంది క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా వైద్యాధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులతో పోలిస్తే క్షయ చాలా ప్రమాదకారి వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. ఆరంభంలోనే గుర్తించి మందులు సక్రమంగా వాడితే నివారణ సాధ్యమని, లేకపోతే ప్రాణాపాయం తప్పందని హెచ్చరిస్తున్నారు. గాలి ద్వారా సులువుగా.. ‘మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్’ బ్యాక్టీరియా ద్వారా క్షయ వ్యాధి సోకుతుందని నిపుణులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సంక్రమిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వేగంగా విస్తరిస్తుంది. రోగి దగ్గినప్పుడు, ఉమ్మిప్పుడు, చీదినప్పుడు రోగకారక క్రిములు గాలిలోకి చేరుతాయి. తద్వారా మరొకరి శరీరంలోకి ప్రవేశిస్తాయి. క్షయ రోగి ఓసారి దగ్గితే సుమారు 40 వేల వరకు వ్యాధికారక క్రిములు గాల్లో కలుస్తాయి. ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతోందని వైద్యులు అంటున్నారు. ముంచుతోన్న నిర్లక్ష్యం క్షయ వ్యాధిలో వివిధ రకాలు ఉన్నాయి. టీబీ సోకితే ఆరు నెలల మందులు వాడితే సరిపోతుంది. ఎండీఆర్ సోకితే దీర్ఘకాలంగా మందులు వాడాల్సి ఉంటుంది. ఎక్స్‌డీఆర్ సోకిన వారు ఆస్పత్రుల్లో డాక్టర్ల పర్యవేక్షణలోనే చికిత్స పొందాల్సి ఉంటుంది. ఈ విషయంగా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో నేలకోట, నేలకోటతండా, పోతులనాగేపల్లి, ఉప్పనేసినపల్లి, టేకులోడు, బ్రాహ్మణపల్లి, మండ్లి, పందిపర్తి, మొలకవేముల, ఒడ్డుకిందతండా, తురకలాపట్నం, మదిరేబైలుతండా, ఇరగంపల్లి, గోపేపల్లి, మసకవంకపల్లి, పులగంపల్లి, వేళ్లమద్ది, తిప్పేపల్లి, అమగొండపాలెం, పైపల్లి గ్రామాలు క్షయ రహితంగా అధికారులు గుర్తించారు. వ్యాధి నివారణకు ఎనిమిది ప్రాంతాల్లో వ్యాధి నివారణ యూనిట్లు ఏర్పాటు చేశారు. రోగులు అక్కడికి వెళ్తే మందులు ఉచితంగా అందిస్తారు. సకాలంలో డాక్టర్ల సలహాల మేరకు మందులు వాడితే వ్యాధి నియంత్రణలోనే ఉంటుంది. ఏడాదిలో తేలిన 2,119 పాజిటివ్ కేసులు జిల్లా వ్యాప్తంగా 8 చోట్ల యూనిట్లునేడు ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భం : క్షయ వ్యాధి లక్షణాలు రెండు వారాల పాటు క్రమం తగ్గని దగ్గు రెండు వారాలకు మించి జ్వరం తెలియకుండా బరువు తగ్గిపోవడం రాత్రిపూట చెమటలు పట్టడం -
మున్సిపాలిటీ స్థలం కబ్జా
● దర్జాగా షెడ్డు వేస్తున్న టీడీపీ నేత చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు. అంతేకాకుండా ఆ స్థలంలో దర్జాగా షెడ్ల నిర్మాణం చేపట్టాడు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొట్నూరు సర్వే నంబరు 259/1సీలో 18 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఇది గ్రామ కంఠంగా రికార్డుల్లో నమోదై ఉంది. దీనిపై కన్నేసిన టీడీపీ నాయకుడు గతంలోనే ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా.. మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడ నోటీసు బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సదరు నాయకుడు మళ్లీ కబ్జాకు తెగించాడు. శనివారం మున్సిపల్ అధికారులు నాటిన బోర్డును తొలగించి షెడ్ల నిర్మాణాలు చేపట్టాడు. దీంతో మున్సిపల్ అధికారులు ఆ పనులను తాత్కాలికంగా నిలిపివేయించారు. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న సదరు నాయకుడు... గతంలోనూ పట్టణంలోని మరొక ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి చేజిక్కుంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. న్యూస్‌రీల్ -
కౌలు రైతులకూ డ్రిప్ పరికరాలు
అనంతపురం సిటీ: కౌలు రైతులకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసి ఆదుకోవాలని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం చేయొద్దని ఉభయ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ–1, 2, 3, 4, 5, 6, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/వ్యవసాయం/విద్య, వైద్య/పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ శాఖలు/ఐసీడీఎస్/ సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రం, గోరంట్ల, కణేకల్లు, నార్పల జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్, జయరాం, పద్మావతి, వేదాంతం నాగరత్నమ్మ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, కనీసం తాగునీరు కూడా సరఫరా చేయకపోతే ఎలాగని అధికారులను నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ కల్పించుకుంటూ.. వేసవికి ముందే ఎక్కడెక్కడ తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందో గుర్తించి, అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించడంలో ఎందుకు వైఫల్యం చెందారంటూ రెండు జిల్లాల ఎస్ఈలను నిలదీశారు. తాగునీటి పథకాల నిర్వహణకు కోట్లాది రూపాయలు జెడ్పీ నుంచి నిధులు ఇస్తున్నా వాటర్ సీనరైజ్ చార్జెస్‌ను మున్సిపాలిటీల నుంచి వసూలు చేసుకొని వాడుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో ఫిల్టర్ బెడ్స్ మార్చాలని ఆదేశించారు. దళితవాడలు, గిరిజన తండాల్లో రహదారులు, తాగునీటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు అధికారులను కోరారు. పాఠశాలలను తరచూ తనిఖీలు చేస్తే ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుందని నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ అన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని గిరిజమ్మ సూచించారు. గత ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చుపెట్టి అన్ని హంగులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాల భవనాల్లో కొన్ని మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంపై అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ను బ్రోకర్లు శాసిస్తారా? శ్రీసత్యసాయి జిల్లాలో ఐసీడీఎస్ జిల్లా కార్యాలయాన్ని ఓ బ్రోకర్ శాసిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని గోరంట్ల జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాం నాయక్ ఆరోపించారు. సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జయరాం నాయక్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోనూ కొందరు సీడీపీఓలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అంగన్వాడీ కేంద్రాలను గాలికొదిలేశారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ ఆరోపించారు. ఈ అంశంపై ఐసీడీఎస్ శ్రీసత్యసాయి జిల్లా పీడీ భారతి స్పందిస్తూ.. తాను కొత్తగా వచ్చానని, పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతపురం అర్బన్ పరిధిలోని బుడ్డప్పనగర్ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త భాగ్యమ్మ పదేళ్లుగా విధులకు డుమ్మాకొట్టి, ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నట్లు గత సమావేశాల్లో అధికారుల దృష్టికి తెచ్చామని, ఆమైపె ఎటువంటి చర్యలు తీసుకున్నారని రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఐసీడీఎస్ పీడీ నాగమణిని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పీడీ నాగమణి స్పందిస్తూ.. ఈ రోజే తొలగింపు ఉత్తర్వులు ఆమెకు అందించామని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశం -
జిల్లాలో వడగండ్ల వాన
చిలమత్తూరు/తనకల్లు: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనంపై వరుణుడు కరుణ చూపాడు. వేసవి తీవ్రతతో జిల్లాలో పక్షం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. శనివారం మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మబ్బులు కమ్ముకున్నాయి. వెంటనే ఉరుములతో కూడిన వడగండ్ల వాన కురిసింది. తనకల్లు మండలంలో ఎన్ హెచ్–42పై వడగండ్లు పెద్ద ఎత్తున పడటంతో యువకులు కేరింతలు కొట్టారు. వడగండ్లను రోడ్డుపై కుప్పగా పోసి సెల్ఫోన్లతో చిత్రీకరించారు. కాగా, అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో టమాట, మొక్కజొన్న, దబ్బ చిక్కుడు పంటలు దెబ్బతిన్నాయి. ఇక చిలమత్తూరు మండల పరిధిలోని మొరసలపల్లిలోనూ వడగళ్ల వాన కురిసింది. పాలేపల్లిలో 20 ఎకరాల మేర కోత దశకు వచ్చిన వరి నేలపాలైంది. వడగండ్ల దెబ్బకు వడ్లు నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
కూటమి కినుక.. చేను తడవక
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వరుసగా మూడేళ్ల పాటు కృష్ణా జలాలు మడకశిర మండలానికి వచ్చాయి. మడకశిర చెరువును సైతం కృష్ణా జలాలలో రెండుసార్లు నింపారు. దీంతో నియోజకవర్గ రైతులంతా ఎంతో సంతోషించారు. మిగతా మండలాలకు కూడా కృష్ణా జలాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి సర్కార్ ఈప్రాంత రైతులను పూర్తిగా విస్మరించింది. వైఎస్ జగన్ హయాంలో కృష్ణాజలాలు వదలడంతో పూర్తిగా నిండి మరువ పారుతున్న మడకశిర చెరువుమడకశిర: సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న మడకశిర నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి చూసి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలించిపోయారు. 2004లో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) ద్వారా నియోజక వర్గానికి కృష్ణా జలాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే హంద్రీనీవా కాలువ పనులను 80 శాతం పూర్తి చేశారు. అయితే ఆయన భౌతికంగా దూరమయ్యాక మడకశిర రైతులను పట్టించున్న వారే కనిపించలేదు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక మడకశిర ప్రాంత రైతుల్లో ఆశలు చిగురించాయి. వైఎస్ జగన్ చొరవతో.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక హెచ్ఎన్ఎస్ఎస్ పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడానికి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలను చేరవేయడానికి బైపాస్ కెనాల్‌ను రూపొందించారు. పెనుకొండ నుంచి నేరుగా మడకశిరకు బైపాస్ కెనాల్ నిర్మించడానికి రూ.214.85 కోట్లు మంజూరు చేశారు. ఈ కెనాల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వివిధ మండలాల్లో నిలిచిపోయిన హెచ్ఎన్ఎస్ఎస్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపగా వైఎస్ జగన్ వెంటనే ఆమోదించి నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికలు రావడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హంద్రీనీవా పథకానికి గ్రహణం పట్టింది. సమీక్షలకే పరిమితం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడిచింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంపై స్థానిక నాయకులు అధికారులతో పలుసార్లు సమీక్ష చేశారు. సంబంధిత మంత్రి కూడా సచివాలయంలో ఈ పథకంపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. కానీ నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో భూగర్భజలమట్టం తగ్గిపోగా బోర్లు పనిచేయడం లేదు. చెరువులకింద ఆయకట్టు పొలాలన్నీ బీళ్లుగా మారుతున్నాయి. దీంతో ఇటీవలే రైతు సంఘం నాయకులు స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం కూడా ఇచ్చారు. అయినా పాలకుల్లో ఏమాత్రం స్పందన లేదు. నీరిచ్చే అవకాశం ఉన్నా... అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో హంద్రీనీవా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గుడిబండ మండలం శింగేపల్లి వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి అగళి, రొళ్ల, గుడిబండ మండలానికి ఓ మైనర్ కాలువ, అమరాపురం మండలానికి మరో మైనర్ కాలువ వెళ్తుంది. ఈ మైనర్ కాలువ పనులను పూర్తి చేస్తే అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలకు కూడా సాగునీరు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనీసం ఈ పనులపై కూడా పాలకులు దృష్టి సారించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా రైతుల సాగునీటి ఘోష పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మడకశిర.. వ్యవసాయం తప్ప మరో ఆధారం లేని ప్రాంతం. వర్షాధారంపైనే ఆధారపడి ఇక్కడి రైతులు పంటలు సాగుచేస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో పొలాలన్నీ బీళ్లుగా మారుతాయి. జనమంతా పొట్ట కూటికోసం కర్ణాటకకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న వైఎస్ జగన్ నియోజకవర్గంలో కృష్ణా జలాలు పారించి ఈప్రాంత రైతులకు మేలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మడకశిరపై శీతకన్ను వేసింది. సాగునీరు ఇవ్వకుండా రైతులను అష్టకష్టాలు పెడుతోంది. మడకశిరలో సాగునీటి ఘోష నేటికీ పూర్తి కాని హంద్రీ–నీవా పనులు కృష్ణా జలాలు అందక పొలాలు బీళ్లు పెట్టిన రైతులు వైఎస్ జగన్ హయాంలో మూడేళ్లు పారిన కృష్ణా జలాలు గత ప్రభుత్వంలోనే ఎంబీసీకి రూ.214.85 కోట్ల మంజూరు హెచ్ఎన్ఎస్ఎస్ పనుల పూర్తికి రూ.70 కోట్లతో ప్రతిపాదనలు తాజాగా ‘బైపాస్ కెనాల్’కు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం కాలువ పనులను పూర్తి చేయాలి అగళి మండలంలో హంద్రీనీవా కాలువ పనులు పూర్తి కాలేదు. వెంటనే ప్రభుత్వం కాలువ పనులను పూర్తి చేసి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. ముఖ్యంత్రి చంద్రబాబు మడకశిర నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాలువ పనుల పూర్తికి నిధులు మంజూరు చేయాలి. వైఎస్ జగన్ మంజూరు చేసిన బైపాస్ కెనాల్ పనులను కూడా ప్రారంభించాలి. – చంద్రప్ప, రైతు, మధూడి, అగళి మండలంహామీ నిలబెట్టుకోవాలి ప్రస్తుతం అగళి మండలంలో భూగర్భ జలమట్టం భారీగా తగ్గింది. బోర్లలోనూ నీళ్లు రావడం లేదు. కూటమి నేతలు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు మడకశిర నియోజకవర్గంలో హంద్రీనీవా సాగునీటి పథకాన్ని పూర్తి చేసి అన్ని మండలాలకూ కృష్ణా జలాలు అందించాలి. లేకపోతే సాగునీటి సమస్యతో వ్యవసాయానికి స్వస్తి పలకాల్సి వస్తుంది. – నాగరాజు, రైతు, అగళి -
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం జరగనున్నాయి. స్థాయీ సంఘం–1, 2, 4, 7 (ఆర్థిక, ప్రణాళిక/ గ్రామీణాభివృద్ధి/ విద్య, వైద్యం/ పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ శాఖల) సమావేశాలు ప్రధాన సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నారు. స్థాయీ సంఘం–3, 5, 6 (వ్యవసాయం/ ఐసీడీఎస్/ సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా సంఘాల చైర్పర్సన్ల అధ్యక్షతన జెడ్పీ అదనపు భవన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు. సమావేశాలకు సంబంధించి సభ్యులతో పాటు ఆయా శాఖల అధికారులకు ఇది వరకే సమాచారం అందించారు. అయితే ఈసారి జరిగే సమావేశాలు వాడీవేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. అనంతపురం అర్బన్ ప్రాజెక్టులో ఓ అంగన్వాడీ టీచర్ విధులకు హాజరుకాకుండా ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న విషయం ఆధారాలతో సహా తేలినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. సామాజిక భద్రత పింఛన్లలో కోతలు, రేషన్ సరుకులను డీలర్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి. గృహనిర్మాణ శాఖలో ఉద్యోగుల పనితీరు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ సమస్యలన్నింటిపై సభ్యులు గళం విప్పనున్నారు. వాడీవేడీగా జరిగే అవకాశం ఉందని ముందే పసిగట్టిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధాన సమస్యలపై నిలదీయనున్న సభ్యులు -
హత్యకు పురిగొల్పిన అనుమానం
హిందూపురం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానమే సద్దాం హత్యకు కారణమైందని హిందూపురం డీఎస్పీ మహేష్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. శుక్రవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. హిందూపురం పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ షఫీ, రేష్మా అలియాస్ ఆయేషా దంపతులు. కుటుంబ పోషణకు స్థానిక ఓ రీలింగ్ యూనిట్లో ఆయేషా కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న సద్దాం బేగ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న షఫీ... తన భార్యపై అనుమానాలు పెంచుకుని ఈ నెల 15న ఆస్పత్రి వద్ద సద్దాం బేగ్‌తో గొడవపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న షఫీ.. ఈ నెల 17న రాత్రి తన కుటుంబసభ్యులతో కలసి సద్దాం బేగ్‌ను ద్విచక్ర వాహనంపై అపహరించి, మలుగూరు చెరువు కట్ట కింద వేట కొడవండ్లతో దాడి చేసి హతమార్చాడు. హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో కొట్నూర్ శివారులో తచ్చాడుతున్న షేక్ మహమ్మద్ షషీతోపాటు అతని తమ్ముడు తౌఫిక్, చెల్లెలు రేష్మా, తల్లి సల్మాను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. సద్దాం హత్య కేసులో వీడిన మిస్టరీ నలుగురు నిందితుల అరెస్ట్ -
ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు
అమరాపురం: మండలంలోని కె.శివరం గ్రామ శివారులో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామానికి చెందిన పాడి రైతు మహంతేష్ గ్రామ సమీపంలోని పొలంలో గేదెకు గ్రాసం కోస్తుండగా పొదల మాటు నుంచి ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఆ సమయంలో ప్రతిఘటించడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. మహంతేష్ కేకలు విన్న సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వారు అక్కడకు చేరుకుని గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి బెదిరి అక్కడి నుంచి పారిపోయింది. క్షతగాత్రుడిని హేమావతిలోని పీహెచ్‌సీకి తరలించారు. గ్రామ శివారలోకి ఎలుగుబంటి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు, అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. చిరుతల దాడిలో జీవాల మృతి పావగడ: తాలూకాలోని కన్నమేడి గ్రామంలో చిరుతల దాడిలో నాలుగు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత రైతు హనుమంతరాజు తెలిపిన మేరకు.. గ్రామం బయలు ప్రదేశంలో చెరువు వద్దకు గురువారం సాయంత్రం తన మేకలు, గొర్రెలను మేపునకు హనుమంతరాజు తీసుకెళ్లాడు. ఆ సమయంలో పొదల మాటు నుంచి వచ్చిన రెండు చిరుతలు మందపై దాడి చేశాయి. ఘటనలో రెండు గొర్రెలు, రెండు మేకలు మృతి చెందాయి. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన హనుమంతరాజు భయభ్రాంతులకు గురయ్యాడు. జీవాల పెంపకంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న తనకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరాడు. బ్యాంకుల బంద్ వాయిదా అనంతపురం అగ్రికల్చర్: ఈ నెల 24, 25న తలపెట్టిన బ్యాంకుల బంద్ వాయిదా పడింది. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. జాతీయ కమిటీ, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన వ్యక్తమైన నేపథ్యంలో సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జాతీయ కమిటీ నుంచి సమాచారం అందిందన్నారు. -
బాధ్యతతో విధులు నిర్వర్తించాలి : డీఎంహెచ్ఓ
హిందూపురం టౌన్: అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సకాలంలో ప్రజలకు చేరువయ్యేలా బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఆరోగ్య సిబ్బందికి డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం సూచించారు. శుక్రవారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లోని రికార్డులు, ల్యాబ్ నిర్వహణ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్సీడీ సర్వే, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డ్స్ పంపిణీ, ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై ఆరా తీశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్యడి.హీరేహాళ్ (రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలంలోని లింగమనహళ్లి గ్రామానికి చెందిన బసవరాజు (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న బసవరాజుకు తల్లి భాగ్యమ్మతో పాటు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. అవసరాల నిమిత్తం రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు భూమి విక్రయిద్దామనుకుంటే అది కాస్త కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి జీవితంపై విరక్తితో శుక్రవారం పొలం వద్ద క్రిమి సంహారక మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు. మృతుడి తల్లి కురుబ భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పండ్ల వ్యాపారి దుర్మరణం పావగడ: స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొమ్మతమరి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో పండ్ల వ్యాపారి ఖాసీం సాహెబ్( 60) దుర్మరణం పాలయ్యాడు. సీఐ సురేష్ తెలిపిన మేరకు... వెంకటాపురం గ్రామానికి చెందిన ఖాసీం సాహెబ్ పెనుకొండలో పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున తన టీవీఎస్ వాహనంపై బయలుదేరిన ఆయనను తెల్లవారుజాము 5 గంటలకు దొమ్మతమర్రి శివారులోకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో ఖాసీం సాహెబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
‘హరి–హర’ క్షేత్రానికి అడుగులు
● భారీ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేసిన సనాతన ధర్మపరిరక్షణ వేదిక ●రూ.1,200 కోట్ల వ్యయంతో బృహత్ క్షేత్ర నిర్మాణం ●సమావేశంలో వెల్లడించిన సుప్రసిద్ధ స్తపతులు అనంతపురం కల్చరల్: ప్రపంచంలోనే ఎత్తైన 216 అడుగుల రామానుజల విగ్రహం, ఓంకారేశ్వరంలోని 108 అడుగుల ఆదిశంకర భగవత్పాదుల విగ్రహం, తెలంగాణాలో సుప్రసిద్ధి చెందిన యాదాద్రి గుట్టపై ఉన్న స్వర్ణగిరి మందిరాన్ని మించిన మరో అరుదైన ఆలయానికి ‘అనంత’ వేదికగా మారనుంది. సనాతన ధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్మాణమయ్యే అపురూపమైన ఈ కట్టడ నమూనాలను అనంత ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు శుక్రవారం అనంతపురంలోని గీతామందిరంలో ధర్మప్రచార మండలి అధ్యక్షుడు శ్రీపాద వేణు, ఇస్కాన్ ఇన్చార్జి దామోదర గౌరంగదాసు నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలు, కట్టడాలను నిర్మించిన ప్రముఖ శిల్పులు డీఎన్వీ ప్రసాద్ స్తపతి, రాజమండ్రికి చెందిన శ్రీనివాస స్తపతి, తిరుమల గోవింద పీఠం పీఠాధిపతి శ్రీరామప్రియ యతీంద్ర స్వామీజీ తదితరులు మాట్లాడారు. వైదిక ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మరోసారి ఆధ్యాత్మికంగా స్వర్ణయుగం రానున్న నేపథ్యంలో చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ధార్మిక మండళ్ల ప్రతినిధులు పరాంకుశం కృష్ణశర్మ, ఆచార్య మనోరంజనరెడ్డి, చిదంబరం, శ్రీధర్, చంద్రశేఖర్, రంగారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. కోటి మంది హిందువులను భాగస్వాములను చేస్తూ దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో అనంత వేదికగా బృహత్ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నాయనిపల్లి క్రాస్ వద్ద ప్రాచీన విశేషాలతో కూడిన ‘హరి–హర క్షేత్రం’ నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే ఎత్తైన 300 అడుగుల కోటి లింగాల అపురూప మహాశివలింగం, దాని కిందనే దివ్య స్పటిక శ్రీచక్ర మేరువు, చుట్టూ అష్టాదశ శక్తిపీఠాల ఆలయాల ప్రతిష్టాపన జరుగుతాయన్నారు. దీనికి పక్కనే 108 అడుగుల శ్రీమన్నారాయణ విశ్వరూప దర్శన కాంస్య విగ్రహంతో పాటు, అదే పీఠంపై దశావతారాల విగ్రహాలు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. వీటికి ఎదురుగా 54 అడుగుల ఎత్తుతో నంది, గరుడ విగ్రహాలు, సప్తాశ్వ రథారూఢుడైన సూర్యదేవ విగ్రహం, త్రిమతాచార్యులైన ఆది శంకరులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యుల విగ్రహలను ఏర్పాటు చేస్తామన్నారు. అన్నింటి కంటే ప్రధానంగా ఈ విశాలమైన ప్రదేశంలో వైదిక ధర్మాన్ని నేర్పే సంస్కృత పాఠశాల, వేద విజ్ఞానాన్ని అందించే పుస్తక భాండాగారం, రిషి విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ, ప్రాచీన ఆయుర్వేదాలయం, రామాయణ, భగవద్గీతల విశిష్టతలను తెలియజేసే కళాఖండాలూ నిర్మిస్తామన్నారు. దేశ విదేశాలలో స్థిరపడిన హిందువులు వచ్చి దర్శించుకునేందుకు వీలుగా పర్యాటకంగా ఈ ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రత్యేక కమిటీగా ఏర్పడిన ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం ఈ అపురూప కట్టడం గోదావరి తీరంలో కట్టాలని సంకల్పించినా ఇక్కడి ఆధ్యాత్మికవేత్తల చొరవతో అనంతకు మార్చారన్నారు. ఈ ఏడాది ఆగస్టులో భూమి పూజ ఉంటుందని, అప్పటి నుంచి ఐదేళ్ల లోపు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. -
నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అలుకోత్సవం నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అర్చకులు యాగశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి విశేషాలంకరణ చేసి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవం ఉభయదారులుగా వ్యవహరించిన ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నేడు తీర్థవాది ఉత్సవం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం భృగుతీర్థం(కోనేరు)లో తీర్థవాది ఉత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం(రేపు) నిర్వహించనున్న పుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
హోరాహోరీగా ఏపీ సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ
అనంతపురం: ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామంలోని ఆర్డీటీ ఫుట్‌బాట్ స్టేడియం వేదికగా సాగుతున్న ఏపీ సూపర్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ రెండో రోజు హోరాహోరీగా సాగింది. తొలి మ్యాచ్‌లో తుంగభద్ర క్లబ్ జట్టుతో తలపడిన కోరమాండల్ క్లబ్ జట్టు 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. నల్లమల క్లబ్, పెన్నా క్లబ్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఇరు జట్లూ చెరో గోల్ సాధించడంతో మ్యాచ్ డ్రా అయింది. గోదావరి క్లబ్, వంశధార క్లబ్ మధ్య జరిగిన మూడో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ ఆరంభం నుంచి గోదావరి క్లబ్ జట్టు క్రీడాకారులు దూకుడును ప్రదర్శిస్తూ వచ్చారు. 7–0 గోల్స్ తేడాతో గోదావరి క్లబ్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. కొల్లేరు క్లబ్, విశాఖ క్లబ్ జట్ల మధ్య జరిగిన నాల్గో మ్యాచ్‌లో కొల్లేరు రెండు గోల్స్ సాధించింది. విశాఖ క్లబ్ జట్టు పేలవమైన ఆటతీరుతో ఒక్క గోల్ కూడా సాధించలేక చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో కొల్లేరు క్లబ్ జట్టు విజయం సాధించింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో కొల్లేరు, కోరమాండల్ క్లబ్ జట్లు ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాయి. మ్యాచ్‌లను ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఏపీఎఫ్‌ఏ సీనియర్ క్రీడాకారులు సుధాకర్, సిరాజుద్దీన్, నీలాద్రి, శేషగిరి రావు, అనిల్, సురేష్, పవన్, రాజేష్ పరిశీలించారు. మ్యాచ్ కమిషనర్‌గా రెడ్డప్ప వ్యవహరించారు. -
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు
పుట్టపర్తి టౌన్: పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం స్పెషల్ సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. నల్లమాడ మండలం ఎనుమలవారిపల్లికి చెందిన కుళ్లాయప్ప కుమారుడు వీరానిపల్లి చిరంజీవి (22) ఓ బాలికను ఇంటి వద్ద వదిలిపెడతానని తన ఆటోలో తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కదిరి పోలీస్ స్టేషన్లో 2019 మార్చి 22న కేసు నమోదు చేశారు. నిందితుడిని అదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి సీఐ బి.వెంకట చలపతి కేసు దర్యాప్తు చేశారు. అనంతరం సీఐ టి.మధు జిల్లా సెషన్స్ కోర్టులో నిందితుడు వీరానిపల్లి చిరంజీవి అలియాస్ చిరుపై చార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ కేసును అనంతపురం ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. గురువారం ఈ కేసును ట్రయిల్ చేసి మొత్తం 14 మంది సాక్షులను విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి వీరానపల్లి చిరంజీవి అలియాస్ చిరుకు 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రత్యేక న్యాయ స్థానం (పోక్సో కోర్టు) శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. స్పెషల్ పీపీ ఈశ్వరమ్మ, విద్యాపతి వాదించారు. మెడికల్ షాపుల్లో అధికారుల తనిఖీలు హిందూపురం టౌన్: ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న, విజిలెన్స్ అధికారులు, ‘ఈగల్’ అధికారులు సంయుక్తంగా శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఏడు మెడికల్ షాపులపై దాడులు చేశారు. హిందూపురంలోని నాగశ్రీ, జనతా, బృంద మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనల అతిక్రమణలపై కేసులను నమోదు చేశారు. ఒక మెడికల్ షాపులో కాలం చెల్లిన ఔషధాలను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే (ఎన్‌ఆర్‌ఎక్స్) మందుల కొనుగోలు, అమ్మకాలలో వ్యత్యాసాలు గుర్తించినట్లు అనంతపురం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి వైబీపీటీఏ ప్రసాద్ తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ సీఐలు జమాల్‌బాషా, సద్గురుడు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లిష్ పరీక్షకు 111 మంది గైర్హాజరు పుట్టపర్తి: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 111 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 21,396 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 21,285 మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 13 మంది విద్యార్థుల డీబార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఎల్ఎల్బీ మొదటి, ఆరో సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 13 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
వ్యభిచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
హిందూపురం అర్బన్: అడ్డదారులు తొక్కి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఓ కానిస్టేబుల్ ఏకంగా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కానిస్టేబుల్ పురుషోత్తం హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఇటీవలే మడకశిర స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. హిందూపురంలోని మోడల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పట్టణంలోని బోయ పేటకు చెందిన ఓ మహిళతో కలిసి ఆ ఇంట్లో వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేవారు. కానిస్టేబుల్ వ్యవహారశైలిని గమనించిన చుట్టుపక్కల ఇళ్ల వారు పలుమార్లు హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం, సిబ్బంది ఈ నెల 18న రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి కానిస్టేబుల్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగు చూడటంతో శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేసి..రిమాండుకు తరలించారు. ఇదే కేసులో మేళాపురానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కాగా.. కానిస్టేబుల్ పురుషోత్తం గుడిబండ స్టేషన్లో పనిచేసిన సమయంలోనూ పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. మరో ఇద్దరు అరెస్టు.. ● హిందూపురం పట్టణంలోని సీపీఐ కాలనీలో ఎస్.బాబా, అతని భార్య వ్యభిచారం నిర్వహిస్తుండగా శుక్రవారం ఉదయం దాడి చేసి వారితో పాటు మరొక మహిళను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
●తాగునీటి కోసం నిరసన
లేపాక్షి: బోర్లలో నీరు పుష్కలంగా ఉంది..పైప్‌లైన్ సమస్య లేదు. మోటార్లు బాగానే పనిచేస్తున్నాయి. కానీ నిర్వహణ లోపంతో కల్లూరు ఎస్సీ కాలనీ వాసులు ఐదు నెలలుగా తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో బస్టాండు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తమ కాలనీలో వ్యక్తిగత కొళాయిలు లేవని, దీంతో పబ్లిక్ ట్యాప్‌ల వద్దే నీరు పట్టుకుంటామన్నారు. నీరు తగినంత అందుబాటులో ఉన్నా సరఫరా చేయడంలో నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. దీంతో కుటుంబానికి రెండు, మూడు బిందెల నీరు అందడం లేదన్నారు. దీంతో నీటికోసం తాము ఐదు నెలలుగా పనులు మానుకుని పడరానిపాట్లు పడుతున్నామన్నారు. నీటి సమస్యతో హోలీ పండుగ కూడా చేసుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కల్లూరు ఎస్సీ కాలనీలో ఐదు నెలలుగా తాగునీటి సమస్య పట్టించుకోని అధికారులు... ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు -
స్వచ్ఛ ఓటరు జాబితాకు సహకరించండి
ప్రశాంతి నిలయం: స్వచ్ఛ ఓటరు జాబితా తయారీకి సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. ఓటర జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే తెలపాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు నుంచి అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 14,12,177 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 7,01,586 మంది, సీ్త్రలు 7,10,527 మంది, ఇతరులు 64 మంది ఉన్నారని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 1,576 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, తప్పుల్లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్ శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు, యువతను ఓటరుగా నమోదు చేసే అంశాలపై సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ కోరారు. అలాగే రాజకీయ పార్టీలన్నీ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి అన్ని నియోజకవర్గాల బూత్ స్థాయి అధికారులను నియమించి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయసారథి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జాకీర్ హుస్సేన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాథమిక అంశాలపై నివేదికలు ఇవ్వండి త్వరలోనే కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాలపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో అన్ని ప్రభుత్వ విభాగాల జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రాబోయే మూడు నెలల్లో పంచాయతీ, మున్సిపల్, ఇరిగేషన్, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా విభాగం, మత్స్య, గృహ, విద్య, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, డీఆర్డీఏ, లీడ్ బ్యాంక్, వ్యవసాయం, అనుబంధ రంగాలు, సంక్షేమ శాఖలు, సేవా రంగాల శాఖలు తదితర శాఖల పరిధిలో నిర్వహించాల్సిన ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ టీఎస్ చేతన్ ఫారంపాండ్ల పనులు గ్రౌండింగ్ చేయాలి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో 3 నుంచి 5 ఫారంపాండ్ల పనుల కోసం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ జల దినోత్సవం, పల్లె పండుగ కార్యక్రమంపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 7,760 ఫారంపాండ్లు నిర్మించాలని లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. అందులో ఇప్పటిదాకా 1,784 ఫారంపాండ్లు మంజూరు కాగా, 840 పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి పశువుల షెడ్లు లక్ష్యాలను సాధించాలని డ్వామా పీడీని ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. -
వైఎస్సార్ పేరు తొలగింపు కక్షపూరితం
చిలమత్తూరు: విశాఖలోని ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి ఉన్న వైఎస్సార్ పేరును రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా తొలగించిందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. హిందూపురం పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పేదల ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు గడించి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును తొలగించిన మాత్రాన ఆయన స్థానం పేదల్లో చెరిగిపోదనే విషయాన్ని కూటమి పెద్దలు గ్రహించాలన్నారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ పేరు వింటే చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లో అప్రతిష్ట మూటకట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుతాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు ప్రజాస్వామ్యానికి చేటు తెస్తున్నాయన్నారు. ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తప్పక బుద్ది చెబుతారని పేర్కొన్నారు. హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక -
వృద్ధుడి దుర్మరణం
నల్లచెరువు: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన కేతప్ప (61) కాలి నడకన తిరుమలకు బయలుదేరాడు. గురువారం వేకువజామున నల్లచెరువు మండలం రాట్నాలపల్లి సమీపంలోకి జాతీయ రహదారికి ఓ వైపు నడుచుకుంటూ వెళుతున్న ఆయనను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఘటనలో కేతప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులుహిందూపురం: జీవితంపై విరక్తితో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయబోతే సకాలంలో పోలీసులు గుర్తించి కాపాడారు. హిందూపురం సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు... లేపాక్షికి చెందిన ఓ మహిళ భర్త ప్రమాదంలో మృతిచెందడంతో అందిన పరిహారం డబ్బును కుటుంబ సభ్యులు తీసుకున్నారు. అందులో కొంత తన జీవనోపాధికి ఇవ్వాలని ఆమె కోరినా ఫలితం లేకపోయింది. దీంతో జీవనం దుర్భరమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె... గురువారం హిందూపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుని తన తల్లి మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన గురించి ఎవరు వెతకరాదని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలంటూ అభ్యర్థించింది. దీంతో కంగారు పడిన తల్లి వెంటనే ఫోన్ చేయగా అప్పటికే స్విచ్ఛాఫ్ కావడంతో విషయాన్ని వెంటనే లేపాక్షి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి స్పందించి హిందూపురం రూరల్ ఆప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులుకు సమాచారం అందించాడు. బాధితురాలి సెల్‌ఫోన్ లాస్ట్సిగ్నల్ ఆధారంగా ఆచూకీని గుర్తించిన పోలీసులు వెంటనే హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై అడ్డంగా నిలబడిన ఆమెను గుర్తించి అధీనంలోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రాణాలను కాపాడిన సీఐ ఆంజనేయులు, సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య జిల్లాలోని వేర్వురు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడగా... కుటుంబ సమస్యల నేపథ్యలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ● ధర్మవరం అర్బన్: స్థానిక గిర్రాజుకాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్ (35) టైల్స్ వర్క్‌తో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమించిన ఓబునాథ్... తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించడంవతో గురువారం ఇంట్లోనే గవాచీకి తన తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కుఏసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. ● గోరంట్ల: మండలంలోని బూదిలి ఎస్సీ కాలనీకి చెందిన విమల (23) ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి, కుటుంబసభ్యులు బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. దీంతో బూదిలిలోని ఎస్సీ కాలనీలో తన మామ కిష్టప్ప ఇంట్లోనే ఉంటూ గోరంట్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సమస్యలతో విసుగు చెందిన ఆమె గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హిందీ అమలుకు కృషి చేయండి : డీఆర్ఎంగుంతకల్లు: రాజభాష హిందీని అమలు చేయడం బాధ్యతగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఆర్ఎం చంద్రశేఖర్‌గుప్తా పిలుపునిచ్చారు. రాజభాష అమలుల్లో ప్రతిభ కనబరిచిన దాదాపు 51 మంది ఉద్యోగులకు గురువారం తన కార్యాలయంలో ఆయన ప్రశంసా ప్రతాలను అందజేసి, అభినందించారు. రాజభాషా నియమాలను అనుసరించి ఉద్యోగులు తమ కార్యాలయాల్లో విధి నిర్వహణలో తప్పనిసరిగా హిందీ మాట్లాడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణ, డివిజన్ రాజభాష అధికారి ఆశా మహేష్‌కుమార్ పాల్గొన్నారు. -
విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా
పుట్టపర్తి టౌన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యుత్ మీటర్ రీడర్లు గురువారం ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఉమ్మడి జిల్లా మీటర రీడర్ల సంఘం అధ్యక్షుడు కిరణ్‌కమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అంజనేయులు మాట్లాడుతూ... స్మార్ట్ మీటర్ విధానంతో గత 15 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రీడర్లు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. తమను విద్యత్ శాఖలోకి విలీనం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్కా అకౌంట్ ద్వారా ప్రతి నెలా జీతాలు చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 25న కలెక్టరేట్ ముట్టడి, 27న సీఎండీ కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందన్నారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే ఏఫ్రెల్ 4న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎస్ఈ కార్యాలయ ఎస్ఏఓ రామస్వామికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు షనవాజ్, రాఘవరెడ్డి, బాబా, నరేష్, రవి, నగేష్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న ‘స్థానిక’ ఎన్నికలు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు ఎంపీపీ, నాలుగు ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు మండల పరిషత్ అధ్యక్ష స్థానాలతో పాటు నాలుగు మండలాల్లో ఉపాధ్యక్ష పదవుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఎన్నికల విభాగం ఏర్పాటైంది. రొద్దం మండలం లోచర్ల ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన పి.చంద్రశేఖర్, రామగిరి మండలం రామగిరి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా పని చేసిన మీనుగ నాగమ్మ మరణించడంతో ఆ రెండు మండలాల్లో ఎన్నిక అనివార్యమైంది. గాండ్లపెంట మండలం గొడ్డువెలగల ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా పని చేసిన కాటం జగన్మోహన్, కణేకల్లు మండలం గనిగెర ఎంపీటీసీగా గెలిచిన హరిజన సంధ్య, కంబదూరు మండలం ములకూరు ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన తిమ్మ రాజమ్మ తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆయా స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. అలాగే ఉరవకొండ మండలం బూదగవి మండల ఉపాధ్యక్షుడు నరసింహులు ఎంపీపీగా, పెద్దపప్పూరు మండల ఉపాధ్యక్షుడు జి.వెంకట్రామిరెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రెండు మండలాల్లో వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. యల్లనూరు మండల వైస్ ఎంపీపీగా పని చేసిన వెంకటరంగయ్య, రాయదుర్గం మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణ నాయుడు అకాల మరణంతో ఆ రెండు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. -
అడవికి నిప్పు.. భవితకు ముప్పు
పెనుకొండ: నిన్నా.. మొన్నటి వరకూ పర్యావరణ ప్రియులను, ప్రజలను ఎంతో ఆకట్టుకున్న పెనుకొండ అటవీ ప్రాంతంలోని పచ్చదనం నేడు కనుమరుగైంది. పర్యావరణ విద్వేషకుల చేతిలో నిలువునా కాలిపోయింది. ఏటా ఇది ప్రహసంగా మారుతున్నా... ముందస్తు చర్యలు చేపట్టడంలో అటవీ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాలుతున్న చెట్లు.. పెనుకొండ అటవీ రేంజ్ పరిధిలో 20 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఎటు చూసినా కొండ గుట్టలు, మైదాన ప్రాంతాలలో పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుండేవి. జూన్‌లో కురిసిన వర్షాలకు నిండుకున్న పచ్చదనం ఫిబ్రవరి మొదటి వారం వరకూ నేత్రానందం కలిగిస్తుంటుంది. ఆ తర్వాత వేసవి నేపథ్యంలో భూమిపై పరుచుకున్న గడ్డి ఎండిపోతోంది. ఇలాంటి తరుణంలో కొందరు స్వార్థపరులు నిప్పు రాజేయడంతో మంటలు చుట్టుముట్టి అటవీ ప్రాంతం బుగ్గవుతోంది. పచ్చని చెట్లతో పాటు వన్యప్రాణులూ సజీవ దహనమైపోతున్నాయి. కనిపించని ముందస్తు చర్యలు.. గతంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకునేవారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతంలో ట్రెంచ్‌లు, ఫైర్ బ్రేక్‌లు ఏర్పాటు చేసేవారు. అలాగే ఎక్కడికక్కడ వాచర్లను నియమించి అటవీ ప్రాంతం సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం ఈ చర్యలు కనిపించడం లేదు. ఫైర్‌బ్రేక్‌లు, వాచర్లు మచ్చుకై నా కనిపించడం లేదు. దీంతో కొందరు ఆకతాయిల చేష్టలకు విలువైన అటవీ సంపద బుగ్గవుతోంది. అటవీ ప్రాంతంలో నిప్పు రాజేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలోనూ అధికారిక వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఫిబ్రవరి ఆరంభం నుంచే గ్రామాల్లో సదస్సులు నిర్వహించేవారు. కళాజాతాలతో ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేవారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కనుమరుగవుతున్న పచ్చదనం పర్యావరణ మనుగడ ప్రశ్నార్థకం పర్యావరణ మనుగడకు ముప్పు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అడవులకు, కొండ గుట్టలకు నిప్పు పెట్టడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వేసవి వస్తే చాలు నిప్పుపెట్టడాన్ని ఓ సంప్రదాయంగా మార్చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో అడవులు అంతరించి జంతువులు జనావాసాల్లోకి చొరబడే ప్రమాదముంది. అసలే రాయలసీమలో వర్షపాతం తక్కువ. అడవులను కాపాడుకోకుంటూ పర్యావరణ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఈ విషయంగా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నాం. – జె.ప్రతాపరెడ్డి, పర్యావరణ పరిరక్షణ నాయకులు, పెనుకొండ -
1,300 ఓటర్లు మించితే కొత్త పోలింగ్ కేంద్రం
హిందూపురం: పోలింగ్ కేంద్రంలో 1,300కు మించి ఓటర్లు ఉంటే దానిని విభజించి కొత్త కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఓటరు నమోదు అధికారి, జేసీ అభిషేక్‌కుమార్ తెలిపారు. ‘ఓటరు జాబితా సవరణ – నూతన పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు’ అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు హిందూపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల విభజనపై చర్చించారు. ప్రతి ట్రాన్స్జెండర్నూ ఓటరుగా నమోదు చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా ప్రతి ఓటరు తన ఆధార్ నంబర్‌ను ఎపిక్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీ నాయకులు కూడా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తహసీల్దార్లు జి.వెంకటేష్, జి.సౌజన్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సి.శ్రీనివాసులు, డీటీ మైనుద్దీన్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ అమరేంద్ర, ఎన్నికల, రెవెన్యూ సిబ్బంది, ఎలక్షన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఎస్కేయూలో కొనసాగుతున్న గ్యాంగ్‌వార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో గ్యాంగ్ వార్ పరంపర కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి తలపడుతున్నారు. రెండు రోజుల క్రితం క్యాంపస్‌లోని ఫార్మసీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ ఘటనను మరువకనే బుధవారం రాత్రి మరోసారి ఎల్ఎల్బీ, ఎంబీఏ విద్యార్థులు కొట్టుకున్నారు. వివరాలు... బుధవారం రాత్రి ఎంబీఏ హాస్టల్ వద్దకు ఎల్ఎల్బీ ఫైనలియర్ విద్యార్థి వెళ్లడంతో ఇక్కడ నీకేం పని అంటూ అక్కడే ఉన్న ఎంబీఏ ఫైనలియర్ విద్యార్థులు నిలదీశారు. దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది. దీంతో వ్యక్తిగత ప్రతిష్టకు పోయిన ఎల్ఎల్బీ విద్యార్థి వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి ఎంత మంది ఉంటే అంత మంది ఎంబీఏ హాస్టల్ వద్దకు చేరుకోవాలన్నాడు. దీంతో ద్విచక్ర వాహనాలపై అక్కడకు చేరుకున్న ఎల్ఎల్బీ విద్యార్థులకు, అక్కడే ఉన్న ఎంబీఏ విద్యార్థులు బాహాబాహీకి దిగారు. పరస్పర భౌతిక దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎంబీఏ విద్యార్థి చేతికి, లా విద్యార్థి కన్నుకు గాయాలయ్యాయి. ఘటనపై క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు ఏడుగురు ఎంబీఏ విద్యార్థులు, పది మంది ఎల్ఎల్బీ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి పోలీసులు తెలిపారు. -
రెడ్డెప్పశెట్టికి ఎవిక్షన్ నోటీసు జారీ
చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టికి ఎట్టకేలకు ఎవిక్షన్ నోటీసును రెవెన్యూ అధికారులు జారీ చేశారు. రెడ్డెప్పశెట్టి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని కంచె మొత్తం తొలగించి రైతులకు ఊరట కలిగించే చర్యలకు శ్రీకారం చుట్టారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు, నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన రెడ్డెప్పశెట్టి అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్డీవో ఆనంద్‌కుమార్, చిలమత్తూరు ఇన్చార్జ్ తహసీల్దార్ వెంకటేష్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలు గుర్తించారు. అయితే ఈ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రెడ్డెప్పశెట్టి వ్యవహారంలో ఇప్పటికే తహసీల్దార్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ రహస్య తనిఖీలు దేనికి సంకేతమంటూ ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. రైతుల నుంచి అసైన్డ్ భూములను రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసినట్టుగా అధికారుల విచారణలో వెల్లడైంది. అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం రైతులకు సాగు కోసం ఇచ్చిన పట్టాలను కొనడానికి, అమ్మడానికి వీల్లేదు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ భూములను రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణ అయింది. రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో.. లేదో వేచి చూడాలి. కంచె తొలగింపు, భూ ఆక్రమణలపై స్పందించిన అధికారులు అసైన్డ్ భూముల కొనుగోలును రద్దు పరిచేందుకు కసరత్తు? ఎస్టేట్‌లో పెనుగొండ ఆర్డీఓ, తహసీల్దార్ రహస్య పర్యటన -
‘పగబట్టిన విధి’పై స్పందించిన అధికారులు
తాడిమర్రి: డయాలసిస్ చేయించుకునేందుకు అనంతపురానికి వెళ్లి వచ్చేందుకు ప్రత్యేకంగా 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని నిరుపేద కుటుంబానికి అధికారులు భరోసానిచ్చారు. ఓ వైపు బుద్ధిమాంద్య కుమార్తెల పోషణ, మరో వైపు భర్త డయాలసిస్ కోసం నిరుపేద మహిళ పడుతున్న ఇబ్బందులపై ‘పగబట్టిన విధి’ శీర్షికన ఈ నెల 17న ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీడీఓ వెంకటరంగారావు, తహసీల్దార్ భాస్కరరెడ్డి, ఈఓఆర్డీ విజయశేఖర్‌నాయుడు, వైద్యాధికారి హరిత తదితరులు గురువారం తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామానికి చెందిన బాధిత భూమే లక్ష్మయ్య, సుభద్రమ్మ దంపతుల ఇంటిని సందర్శించారు. కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిశీలించారు. కుటుంబ దైన్య స్థితిపై చలించిన అధికారులు సమస్యను కలెక్టర్, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్ పీఏతో చర్చించి లక్ష్మయ్యను డయాలసిస్ కోసం తీసుకెళ్లి, తిరిగి గ్రామానికి చేర్చేందుకు 108 అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు. డయాలసిస్‌కు వెళ్లి వచ్చేందుకు 108 వాహనం ఏర్పాటుకు భరోసా -
● రోడ్డెక్కిన గాంధీ
నోటుపై గాంధీ.. నడిరోడ్డుపై ఏందీ? ఆకలి దప్పులు.. రోజూ తిప్పలు కూటికోసం... పూటకో వేషం పచ్చడి మెతుకుల కోసం.. జీవన సమరం దేహానికి రంగులు.. దేహీ అంటు వేడుకోలు గాంధీ స్వరాజ్యంలో.. ఆకలి గాంధీలెందరో సమాజమా.. సిగ్గనిపిస్తోందా అయ్యో అనక... ఆకలి తీర్చే మార్గం చూపు .. గురువారం ఖాద్రీశుడి రథోత్సవంలో కనిపించిన ఈ చిన్నారి గాంధీలను చూసి కొందరు అయ్యో అంటే..మరికొందరు ఆహా అంటూ ఫొటోలు తీసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం
● చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం ధర్మవరం: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం చేతివృత్తుల కళాకారుడు చిప్పల చంద్రశేఖర్‌కు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారికి ప్రోత్సాహం కల్పించేందుకు ఎబిలిటీ ఎక్స్పో – 2025 డ్యూరింగ్ ద పర్పుల్ ఫెస్ట్‌లో భాగంగా చేతి వృత్తుల కళాకారుల ప్రదర్శన కోసం రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం పంపారు. చిప్పల చంద్రశేఖర్ ప్రస్తుతం ఆర్డీటీ సంస్థలో చేతివృత్తులపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. దేశ రాజధానిలో చేతివృత్తుల ప్రత్యేకతను తెలియజేయడం గొప్ప విషయమని చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 21తేదీ ప్రదర్శన ఉంటుందన్నారు. వీఆర్‌కు కొత్తచెరువు సీఐ ఇందిర పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు అప్‌గ్రేడ్ పోలీస్టేషన్ సీఐగా పనిచేస్తున్న ఎంపీ ఇందిరను వీఆర్‌కు పంపుతూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌కు రిపోర్టు చేసుకోవాలని సూచించారు. గతంలో కొన్ని కేసుల్లో న్యాయం చేయలేకపోవడం, వరుస హత్యలు, దొంగతనాలు లాంటి కేసుల్లో బాధితులకు న్యాయం చేయలేదన్న ఆరోపణలతోనే చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
బ్రహ్మ రథోత్సవం హైలెట్స్
కదిరి: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడు ఆశీనులైన బ్రహ్మరథం సరిగ్గా ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.53 గంటలకు తేరు యథాస్థానం చేరుకుంది. ● రథం వెళ్లాక రోడ్డుపై పడిన మిరియాలను భక్తులు ఒక్కోటి సేకరించడం కన్పించింది. అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయని వారి నమ్మకం. ● యువత చొక్కాలు చింపడం, రంగులు చల్లుకోవడం కనిపించింది. ● మిద్దెలపై నుంచి కొందరు రథంలాగే భక్తుల మీదకు బిందెలతో నీళ్లు చల్లారు. మరికొందరు నీళ్ల ప్యాకెట్లు విసిరారు. ● భక్తుల కోసం అడుగడుగునా ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మజ్జిగ, మంచినీళ్లు ప్యాకెట్లను పెద్ద ఎత్తున పంచిపెట్టారు. ● బ్రహ్మోత్సవాల కోసం ఆర్టీసీ ప్రతినిధులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ● బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తిరువీధుల్లోని మిద్దెలపైకి ఎక్కారు. ● కదిరి బ్రహ్మ రథోత్సవంలో 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అంచనా. ● రథోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ వి.రత్న దగ్గరుండి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవానికి సహకరించిన పోలీసు అఽధికారులు, సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు అలుకోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు అశ్వవాహనంపై తిరువీధుల్లో దర్శనమివ్వనున్నారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆలయం పక్కనే ఉన్న సుద్దుల మంటపం వద్దకు తీసుకువచ్చి అలుకోత్సవాన్ని నిర్వహించనున్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
హిందూపురం అర్బన్: క్షణికావేశంలో తప్పుచేసి జైలుకు వచ్చిన ఖైదీలందరూ బయటకు వెళ్లిన తరువాత సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. గురువారం స్థానిక ఉపకారాగారాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. జైలులో ఉన్న ఖైదీల వివరాలను జైలు సూపరింటెండెంట్ హనుమన్నను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం కారాగార గదులు, నిత్యావసర సరకుల నాణ్యత పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడారు. ఏ కేసుల్లో జైలుకు వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీకు న్యాయవాదులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సమస్యలతో న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారు దరఖాస్తు చేసుకొంటే న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, న్యాయవాదులు సిద్ధు, సదాశివరెడ్డి, సంతోషికుమారి, మురళి, అంజినమ్మ, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, శారద పాల్గొన్నారు. ధర్మవరం అర్బన్: పట్టణంలోని సబ్‌జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.శివప్రసాద్‌యాదవ్ గురువారం తనిఖీ చేశారు. సబ్‌జైలులోని వంట గది, స్టోర్ రూం, బ్యారక్‌లను తనిఖీ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సబ్‌జైలు సూపరింటెండెంట్ కెవీ బ్రహ్మంరెడ్డి, న్యాయవాదులు బాలసుందరి, నూర్ మహమ్మద్, పారా లీగల్ వలంటీర్ షామీర్‌బాషా, సబ్‌జైలు సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లా పరిశ్రమలశాఖ పనితీరుపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథకంలోని తీసుకురావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇండస్ట్రీయల్ పాలసీకి అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సహకారం అందించాలన్నారు. జిల్లా స్థాయి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ, పీఎంఈజీపీ పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, మండలాల వారీగా జాబితా సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, డీపీఓ సుమంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
గొట్లూరులో మరోసారి ఉద్రిక్తత
సాక్షి టాస్క్‌పోర్స్: ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ నడిబొడ్డున అంగన్వాడీ భవనాన్ని కూల్చివేసి అక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామంలోని కొందరు కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రికి రాత్రే పిల్లరు వేశారు. కోర్టు స్టేను పట్టించుకోకుండా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రామ నడిబొడ్డున ఉన్న శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాన్ని కూల్చివేశారు. అప్పట్లో ఈ చర్యను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ హేమంత్‌కుమార్, ఆర్డీఓ మహేష్ గ్రామంలో పర్యటించి విగ్రహ ఏర్పాట్లను నిలిపివేశారు. దీంతో సమస్య అప్పట్లో సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అంగన్వాడీ భవనం స్థానంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని అధికారులకు వినతులు ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయకుండా గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం గ్రామస్తులకు అనుకూలంగా స్టే ఇచ్చింది. అయితే గ్రామంలోని కూటమి నాయకుల ప్రోద్బలంతో కొందరు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు కోసం రాత్రికి రాత్రే పిల్లరు వేశారు. కోర్టు స్టేను పట్టించుకోకుండా దౌర్జన్యంగా పిల్లరు వేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కోర్టు స్టేను గౌరవించి అధికారులు విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలని కోరుతున్నారు. విలువైన ప్రభుత్వ స్థలంలో కాకుండా గ్రామంలో మరోచోట విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని చెబుతున్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్ చొరవ తీసుకొని విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోని కొందరి ప్రయోజనాలను కాకుండా అందరి ప్రయోజనాలకు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో కక్షలకు ఆజ్యం పోస్తున్న కూటమి నాయకులు కోర్టు స్టే ఉన్నా .. విగ్రహ ఏర్పాటుకు పిల్లరు ఏర్పాటు -
‘డ్వామా’లో ముగిసిన బదిలీలు
పుట్టపర్తి అర్బన్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు గురువారంతో ముగిసినట్లు డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్ పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్వహించామన్నారు. ఇందులో కౌన్సిలింగ్ మెంబర్, కన్వీనర్ డీఆర్డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు. 21 ఏపీఓలు, 50 మంది సీసీలు, 18 మంది ఈసీలు, 81 మంది టీఏలు, ప్లాంటేషన్ సూపర్వైజర్ కలిపి మొత్తం 171 మంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ లక్ష్మీ, ఏపీడీ శివశంకర్, హెచ్ఆర్ మేనేజర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. క్వింటా చింతపండు రూ.33 వేలుహిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.33 వేలు పలికింది. గురువారం మార్కెట్‌కు 1,891.80 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.33 వేలు, కనిష్టంగా రూ.8,100, సరాసరిన రూ.18 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ.12 వేలు, కనిష్టంగా రూ.4,320, సరాసరిన రూ.6 వేల ప్రకారం ధర పలికినట్లు కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. న్యూస్‌రీల్ -
తహసీల్దార్లు స్థానికంగానే నివాసం ఉండాలి
ప్రశాంతి నిలయం: తహసీల్దార్లు మండల కేంద్రంలోనే నివాసం ఉంటూ ఎప్పటిపనులు అప్పుడే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. రీసర్వేలో ప్రగతి సాధించేందుకు తహసీల్దార్లు, సర్వేయర్లు బాధ్యతతో పనిచేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రీసర్వే, పీజీఆర్ఎస్ తోపాటు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటి స్థలం సర్టిఫికెట్ మ్యానువల్‌గా ఇవ్వకూడదన్నారు. రీసర్వే సక్రమంగా జరిగితే భూ సమస్యలు తగ్గుతాయన్నారు. నిబంధనల మేరకు రీ సర్వే నిర్వహించాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలన్నారు. పీజీఆర్ఎస్లో అందిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలన్నారు. భూముల హద్దులు నిర్ణయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐవీఆర్ఎస్ రిపోర్టులో అమరాపురం, ఆగళి, చిలమత్తూరు, రొద్దం, రొళ్ల, సోమందేపల్లి సర్వేయర్లపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో విచారించి నివేదికలు అందజేయాలన్నారు. అనంతరం జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 25 గ్రామాలను పైలెట్‌గా ఎంపిక చేశామని, ఆయా గ్రామాల్లో మార్చి 20 నుంచి రీ సర్వే నిర్వహిస్తామన్నారు. ముందుగా ప్రతి రైతుకు, పట్టాదారునికి నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు, సర్వే అండ్ ల్యాండ్ అధికారి, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
●ఐరావతంపై వసంత వల్లభుడు
కదిరి: వసంత వల్లభుడిగా పేరు గాంచిన ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఐరావతం (గజవాహనం)పై దర్శనమిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఐరావతంపై కాటమరాయుడి కమనీయ రూపాన్ని చూసి తరించారు. అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లి పూజలందుకున్నారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారు రథంపైకి ప్రవేశించనున్నారు. శ్రీదేవి, భూదేవిలను కంకణ భట్టాచార్యులు రథంపైకి తీసుకు రానున్నారు. అంతకుముందు అర్చకులు యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశ పూజలు చేశారు. ఆ తర్వాత దాన్ని శ్రీవారి బ్రహ్మ రథంపై ప్రతిష్టించారు. శ్రీవారికి నిత్య కై ంకర్య సేవలు నిర్వహించిన మీదట బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్య హవచనం, వాస్తు హోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. -
ఐచ్ఛికంతో ‘తెలుగు’ ప్రశ్నార్థకం
పుట్టపర్తి టౌన్: ఇంటర్మీడియెట్‌లో తెలుగును ఐచ్ఛికం (ఆప్షనల్) చేస్తే తెలుగుభాష ఉనికి ప్రశ్నార్థకమవుతుందని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ మూల్యాంకనం కోసం వచ్చిన అధ్యాపకులు బుధవారం కొత్త చెరువు జూనియర్ కళాశాల ఎదుట ఽనిరసనకు దిగారు. అనంతరం జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘునాథరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటర్మీడియెట్‌లో ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు నూరుల్లా, శంకరప్ప, పెద్దన్న, బయపరెడ్డి, నాగరత్నమ్మ, లలిత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు 27న ఎన్నికలు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తమకు ఉత్తర్వులు వచ్చాయని వివరించారు. ఖాళీ అయిన రొద్దం, రామగిరి, గాండ్లపెంట, కంబదూరు, కణేకల్లు ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉరవకొండ, యల్లనూరు, పెద్దపప్పూరు, రాయదుర్గం వైస్ ఎంపీపీ స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ప్రకటించారు. పైన పేర్కొన్న స్థానాల్లో కొందరు చనిపోగా, మరికొందరు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. -
ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
కదిరి టౌన్: సబ్ జైలులోని ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ జైలు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీలకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఖైదీలకు న్యాయ సాయం అందించాలని సూచించారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. జైలు జీవితం గడిపి బయటకు వెళ్లిన వారు శాంతియుత జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు నరసింహులు, రఘునాథ్, ప్రభాకర్, నరేష్, జైలు సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముదిగుబ్బలో ఆక్రమణల తొలగింపుముదిగుబ్బ: స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలోని స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం జేసీబీ యంత్రాలతో తొలగించారు. పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్, సబ్ డివిజన్ అధికారి వన్నూరుస్వామి, సీఈఓ శ్రీనివాసులు దగ్గరుండి ఆక్రమణలు తొలగించారు. పీఏసీఎస్ పరిధిలో అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయుడి ఔదార్యం ● విద్యార్థులకు సొంత ఖర్చుతో అల్పాహారం ఓడీచెరువు: ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో ఖాళీ కడుపుతోనే ఉదయమే పాఠశాలకు వస్తున్న విద్యార్థుల ఆకలి బాధలను డబురువారిపల్లి ఉపాధ్యాయుడు కె.నాగరాజు గుర్తించారు. పాఠశాలలోని 40 మంది పిల్లలు ఇబ్బందులు పడకుండా తన సొంతఖర్చులతో ఒంటిపూట బడులు ముగిసే వరకూ అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా అల్పాహార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పరీక్ష కేంద్రం తనిఖీ కదిరి అర్బన్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆర్జేడీ శామ్యూల్ బుధవారం తనిఖీ చేశారు. అలాగే బాలుర హైస్కూల్ సెంటర్‌ను డీఈఓ కృష్ణప్ప తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు ఆరా తీశారు. పిల్లలు వడదెబ్బ బారిన పడకుండా చూడండి పుట్టపర్తి అర్బన్: విద్యార్థులు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నివేదిత పేర్కొన్నారు. బుధవారం ఆమె పుట్టపర్తి మండలంలోని ఎనుములపల్లి అంగన్వాడీ కేంద్రం, ప్రశాంతిగ్రామం పాఠశాల, జగరాజుపల్లి మోడల్‌స్కూల్, మంగళకర పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో రికార్డులు తనిఖీ చేశారు. చిన్నారులు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల్లో రక్త హీనత నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ మునిచంద్రిక, సీహెచ్ఓ నగేష్, సూపర్వైజర్ చంద్రకళ తదితరులు ఉన్నారు. -
ఐసీడీఎస్.. అస్తవ్యస్తం
సాక్షి, పుట్టపర్తి ఆరేళ్లలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం సర్కారు ఏర్పాటు చేసిన ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్) విభాగంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికార పార్టీ నాయకుల మాట వినకుంటే బదిలీ బహుమానంగా ఇస్తున్నారు. చిన్నారులకు గుడ్లు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేసే కాంట్రాక్టర్ల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాల వరకు కూటమి నేతలదే పెత్తనం. కూటమి నేతల సూచన మేరకు పని చేస్తేనే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఒక వేళ వారు చెప్పినట్లు తల ఆడించినా...ఉన్నతాధికారుల నుంచి వేటు తప్పదు. ఈక్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీగా రావాలంటే అధికారులు జంకుతున్నారు. గడిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నూతనంగా జిల్లా ఏర్పడిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చే వరకు ఒకరే పీడీగా ఉన్నారు. అప్పట్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. కేవలం అర్హత ఆధారంగా నియామకాలు చేపట్టేవారు. ఫలితంగా ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. దీంతో ఉండలేక చాలామంది పీడీలు స్వచ్ఛందంగా తమ స్థానాలకు వెళ్లిపోతున్నారు. ఆ ఒక్క పదవీ విరమణతో.. జిల్లా ఏర్పాటు నాటి నుంచి ఐసీడీఎస్ పీడీగా ఉన్న లక్ష్మీకుమారి గతేడాది జూలై 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మడకశిర సీడీపీఓగా ఉన్న నాగమల్లీశ్వరి ఇన్చార్జ్ పీడీగా వచ్చారు. సుమారు రెండున్నర నెలల పాటు ఆమె విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఐసీడీఎస్‌లో పలు కాంట్రాక్ట్‌లకు టెండర్లు పిలిచారు. ఏం జరిగిందో తెలిసే లోపు.. ఆమె తిరిగి మడకశిర సీడీపీఓగా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇన్చార్జ్ పీడీగా ఓడీ చెరువు సీడీపీఓగా ఉన్న సుధావరలక్ష్మి బాధ్యతలు తీసుకున్నారు. ఆమె హయాంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఉన్నఫలంగా ఈనెల 17వ తేదీన కొత్త పీడీని నియమించారు. దీంతో ఆమె తిరిగి ఓడీ చెరువు సీడీపీఓగా వెళ్లిపోయారు. డైరెక్టరేట్ నుంచి వచ్చిన పీడీ.. జిల్లా ఐసీడీఎస్‌లో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాల కారణంగా.. నేరుగా డైరెక్టరేట్ నుంచి నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలోనే గుంటూరులో పని చేసే శ్రీదేవిని.. శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీగా నియమించారు. ఈనెల 17వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ముందు పలు సవాళ్లు ఉన్నాయి. అన్నీ చక్కబెడతారా? లేక సర్దుకుంటారా? అనేది చర్చనీయంగా మారింది. నియామకాల్లో చేతివాటం! అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాల్లో కూటమి నేతల సూచన మేరకు ఉద్యోగాలు ఇచ్చినా.. కొందరు సిండికేటుగా మారి ఆయా గ్రామ స్థాయి నాయకులతో కుమ్మకై ్క భారీగా చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి.. అధికారికి చెడ్డపేరు రాకముందే మార్పులు చేస్తున్నారని సమచారం. దందా చేయడం.. చేయించడం.. తర్వాత బదిలీపై వెళ్లిపోవడం.. ఇంకొకరు రావడం.. ఐసీడీఎస్‌లో ఆర్నెల్లుగా జరుగుతున్న తీరు ఇదే. నెలల వ్యవధిలోనే మారిపోతోన్న పీడీలు కూటమి నేతల ఒత్తిళ్లతో దందా చేయడం.. వెళ్లిపోవడం అంగన్వాడీల నియామకాలు, బదిలీల్లో భారీగా చేతివాటం కొనసాగితే ఇబ్బందులు తప్పవని తెలిసి తప్పిస్తున్న నాయకులు ఫిర్యాదు చేయండి ఐసీడీఎస్‌లో ఎలాంటి అవినీతికి తావు లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి. విచారణ చేయించి నేరం రుజువైతే చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తాం. ఏ రాజకీయ పార్టీకి ప్రాధాన్యం ఉండదు. ప్రభుత్వ నిబంధనల మేరకు నియామకాలు, పాలన ఉంటుంది. – శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ, శ్రీసత్యసాయి జిల్లా -
ఊర పిచ్చుక.. ఊరికే అందం
ఒక ఊరిలో పిచ్చుక కనిపిస్తే ఆ ఊరు పచ్చగా ఉన్నట్లు గ్రామీణులు ఓ అంచనా వేస్తుంటారు. పిచ్చుకలు కనిపిస్తున్నాయంటే ఆ ఊరిలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నట్లు.. పంటలు బాగా పండుతున్నట్లు భావిస్తారు. పంట చేలల్లో రైతులను ఇబ్బంది పెట్టే క్రిమికీటకాలను తింటూ ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి వాటిబారి నుంచి మనల్ని కాపాడతాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఉండే పిచ్చుకల సంఖ్య నేడు గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో పిచ్చుకల జాతి పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా 2010 నుంచి ఏటా మార్చి 20న ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ నిర్వహిస్తూ వాటి మనుగడ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అనంతపురం కల్చరల్: ఒకప్పుడు ఊర పిచ్చుకలు లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాడ చూసినా, ఏ ఇల్లు చూసినా గుంపులు గుంపులుగా ఊరపిచ్చుకలు కనిపించేవి. మిగతా పక్షులకు భిన్నంగా ఊర పిచ్చుకలు, మానవులు ఒకే కుటుంబసభ్యులుగా కలిసి పోయేవారు. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుండే పిచ్చుకలు నేడు వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రేడియేషన్, శబ్ద కాలుష్యాల దెబ్బకు ఎక్కడికక్కడ రాలిపోతున్నాయి. దీంతో పర్యావరణాన్ని కాపాడే పిచ్చుకల జాతి సంరక్షణకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతరించిపోతున్న సంప్రదాయం ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకుంటే శుభం జరుగుతుందని పూర్వీకులు భావించి, వాటిని మురిపెంగా పిలుస్తూ ధాన్యాలను వెదజల్లేవారు. ఇళ్లు, ప్రార్థనా మందిరాల్లో పావురాలు, పిచ్చుకలు యథేచ్ఛగా సంచరించేవి. ఇప్పుడవన్నీ భూతద్దం పెట్టి వెతికినా కానరావు. రోజురోజుకూ పెరిగిపోతున్న మానవుడి స్వార్థం కారణంగా పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం కనుమరుగవుతోంది. జిల్లాలో పంటల సాగులో రసాయనిక మందుల వినియోగం పెరిగిపోవడం కూడా పక్షి జాతి అంతరించేందుకు కారణమవుతోంది. ముఖ్యంగా సెల్ఫోన్ల వాడకం పెరిగిపోయే కొద్దీ పిచ్చుకల జాతి క్రమంగా అంతరించిపోతూ వస్తోంది. నానాటికీ తగ్గుతున్న పర్యావరణ సమతుల్యత పక్షి జాతిని నేటి తరానికి దూరం చేస్తోంది. ఇలాంటి తరుణంలో పిచ్చుకల సంరక్షణకు మేము సైతం అంటూ పలువురు ముందుకొస్తున్నారు. కృత్రిమ గూళ్లను ఉచితంగా అందిస్తున్నారు. మలమల మాడ్చేస్తున్న వేసవి నుంచి కాపాడుకునేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు చోట్ల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఊరంతా పిచ్చుక గూళ్లు ఊర పిచ్చుకలకు మిగిలిన పక్షులకు చాలా తేడా ఉంటుంది. ఊర పిచ్చుకలు మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. దీంతో ఒకప్పుడు ఊరంతా పిచ్చుక గూళ్లు కనిపించేవి. ఆహారం కోసం, నివాసం కోసం పూర్తిగా మానవులపై ఆధారపడతాయి. పొలాల్లో ఎగురుతూ పంట నష్టాలకు కారణమైన క్రిమికీటకాలను ఆరగిస్తాయి. పిచ్చుక చిన్నదే అయినా దాని ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక జీవన విధానం పిచ్చుకల మనుగడకు ప్రతిబంధకం కారాదని పక్షి ప్రేమికులు అంటున్నారు. పిచ్చుకల సంరక్షణకు అనంతపురానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త ఏజే అనిల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా 1.40 లక్షల కృత్రిమ గూళ్లను ఇంటింటికి అందించి, పిచ్చుకల పునరుత్పత్తికి దోహదపడేలా చర్యలు తీసుకున్నారు. పిచ్చుకల విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో అనంత ఖ్యాతిని పతాక స్థాయిలో మెరిసేలా చేసింది. పర్యావరణానికి దోహదపడే పిచ్చుకలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఆ దిశగా అందరూ ప్రయాణం సాగించాలని అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిస్తున్నారు. సందర్భంనేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
నేత్రపర్వం.. భూతప్పల ఉత్సవం
రొళ్ల: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భూతప్ప ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యంలో భక్తులు మంగళవారం సాయంత్రమే తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. స్వామి మూల విరాట్‌కు బుధవారం తెల్లవారుజామున అభిషేకం, అంకురార్పణ, కుంకుమార్చన, తులసీపూజ చేశారు. అనంతరం వెండి, బంగారు ఆభరణాలతో పాటు పంచ లోహ కవచాలతో అలంకరణ చేశారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు, సంతానం లేని మహిళలు, పెళ్లిళ్లు కాని యువతులు, ఇతర కుటుంబసమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వేకువజామునే చన్నీటి స్నానంచేసి తడి దుస్తులతోనే స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఈరముద్దమ్మదేవి ఆలయం నుంచి ప్రధాన ఆలయం వరకూ దాదాపు కిలోమీటర్ల మేర భక్తులు భూతప్పల పాద స్పర్శ కోసం బోర్ల పడుకున్నారు. మారుతీ కాలనీ సమీపంలోని ముత్తరాయస్వామి ఆలయంలో విశేష పూజల అనంతరం మేళతాళాలతో పాదాల బండ వద్ద నుంచి బయలుదేరిన భూతప్పలు నృత్యం చేస్తూ భక్తుల మీదుగా ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంతో పాటు సమీపాన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోనూ పూజలు చేశారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు సమర్పించిన బొరుగులను ఆంజనేయస్వామి ఆలయంలో రాసిగా పోసి, దాని చుట్టూ ఉరాల శబ్ధాల నడుమ భూతప్పలు నాట్యం చేస్తూ బొరుగులను ఆరగించారు. అనంతరం బొరుగులను భక్తులకు ప్రసాదంగా పంచారు. ఉత్సవానికి తరలి వచ్చిన భక్తుల సౌకర్యార్థం 8 ప్రాంతాల్లో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో వెలసిన భూతప్ప ఆలయం వద్దకు చేరుకుని పట్టం కూర్చొబెట్టారు. ఉత్సవాల్లో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావని నేతృత్వంలో మడకశిర సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐలు వీరాంజినేయులు, ఇషాక్‌బాషా, సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు ప్రసాద వితరణ.. లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం భూతప్పస్వామి ఆలయం ఆవరణలో భక్తులు సమర్పించిన వడి బియ్యం, బెల్లం తదితర వాటితో 101 వడలు చేసి నైవేద్యం సమర్పించనున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద రూపంగా పంపిణీ చేయనున్నారు. భూతప్పల కాలిస్పర్శ కోసం పోటెత్తిన భక్తులు -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక మాజీ వలంటీర్ ఆత్మహత్య
గుత్తి: తల్లి ఆపరేషన్ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక గ్రామ సచివాలయ మాజీ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరిమానుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు, మణెమ్మ దంపతుల కుమారుడు మహేంద్ర గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామ సచివాలయ వలంటీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే తన తల్లికి శస్త్రచికిత్స అవసరం కావడంతో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈలోపు రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. వలంటీర్ వ్యవస్థను సీఎం చంద్రబాబు రద్దు చేయడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మదనపడ్డాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో యాడికి మండలం బోయరెడ్డిపల్లి వద్ద ఉన్న పెన్నా సిమెంట్స్ పరిశ్రమలో పనిలోకి చేరాడు. ఈ క్రమంలోనే తమ అప్పు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో దిక్కుతోచని మహేంద్ర (26) నాలుగు రోజుల క్రితం ఫ్యాక్టరీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు. బుధవారం ఉదయం గుత్తి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న మహేంద్ర...జీఆర్పీ స్టేషన్ ఎదుట అందరూ చూస్తుండగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి ఆచూకీని గుర్తించిన జీఆర్పీ ఎస్ఐ నాగప్ప సమాచారంతో మహేంద్ర తల్లిదండ్రులు గుత్తికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆర్థిక సమస్యలతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద వ్యక్తి మృతదేహం రాయదుర్గం టౌన్: స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వెనుక గుర్తు తెలియని వ్యక్తి (55) మృతదేహాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ జయానాయక్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోని మార్చురీ గదికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను వైరల్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు రాయదుర్గం పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా, రెండు రోజులుగా సదరు వ్యక్తి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా స్థానికుల ద్వారా తెలిసింది. అతిగా మద్యం సేవించడంతో పాటు వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
తల్లి అంత్యక్రియలకు వెళితే.. ఇల్లు దోచేశారు
తాడిపత్రి: తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన కుమార్తె ఇంటిని దుండగులు దోచేశారు. తాడిపత్రి మండలం బందార్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు... రెండు రోజుల క్రితం తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన రసూల్‌బీ అనంతపురంలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద విషయం తెలియగానే ఆమె కుమార్తె షేక్ హనీఫా ఇంటికి తాళం వేసి తన భర్తతో కలసి మంగళవారం రాత్రి అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకుంది. బుధవారం తల్లి మృతదేహాన్ని తాడిపత్రికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కుమార్తె హనీఫా తన స్వగ్రామం బందార్లపల్లికి చేరుకుంది. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించిన ఆమె ఆందోళనతో లోపలకు వెళ్లి పరిశీలించింది. బీరువాలోని బంగారు నెక్లెస్, లాంగ్ చైన్, కమ్మలు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కళింగరతో జాగ్రత్త
అనంతపురం అగ్రికల్చర్: ‘‘మండు టెండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎర్రగా కనిపిస్తూ నిగనిగలాడుతున్న కళింగర (పుచ్చకాయ), కర్భూజాలాంటివి తింటున్నారా? అయితే ముందు మీ ఆరోగ్యగం గురించి కూడా కొంచెం ఆలోచించండి’ అంటూ జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు (95812 75717) ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇటీవల కల్తీ, నాసిరకంతో పాటు విషపూరితమైన రసాయన మందులతో మాగబెట్టిన పండ్లు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారన్నారు. ఇందులో కళింగర కూడా ఉందన్నారు. మరీ ముఖ్యంగా వేసవి దాహాన్ని తీర్చుకునేందుకు బహిరంగ మార్కెట్లో కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్న కళింగర కాయ సహజమైన రంగా లేదంటే కృత్రిమ రసాయనాలు కలిపిన పండా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ● పక్వానికి రాని కళింగరలను, ఎర్ర రంగు రాని వాటికి సిరంజిల ద్వారా కృత్రిమ రసాయనాలను ఎక్కిస్తున్నారు. రసాయనాలు ఎక్కించిన కాయ లోపలి భాగం మామూలు కన్నా మరీ ఎర్రగా ఉంటుందన్నారు. లేదంటే నిర్ధిష్ట గడువు కంటే ముందుగానే మాగడం జరిగి ఉంటుందన్నారు. దీని వల్ల సహజంగా లభించే పోషకాలు అందక, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. ● సహజంగా పండిన కాయలో మృదువైన ఎరుపు లేదా గులాబీరంగు ఉంటుంది. అదే రసాయనాలు కలిపిన వాటిలో డార్క్ రెడ్, బ్లడ్ రెడ్ రంగులో ఉంటాయి. అంతేకాక ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కళింగర కాయ కోసి ముక్కలు నీటిలో వేస్తే నీరు ఎరుపు రంగులోకి మారితే రసాయనాలు కలిపినట్లుగా నిర్ధారించుకోవచ్చు. అలాగే కాయ తిన్న తర్వాత చేతులకు ఎరుపు రంగు అంటి, అది తుడిచినా అలాగే ఉంటే రసాయనాలు కలిపినట్లు గుర్తించాలి. సహజంగా పండిన పుచ్చకాయ తీపిగా తేలికగా ఉంటుంది. కృత్రిమ రంగు వేసినది కొంచెం చేదు రుచి వస్తుంది. ● పుచ్చకాయ పైభాగం పచ్చగా ఉండాలి, మెరుస్తూ ఉండకూడదు. తక్కువ గ్రీన్ కలర్ ఉన్నదే మంచిదని గుర్తించాలి. కాయ నేలపై ఉండే భాగం పసుపు రంగులో ఉండాలి. అలాగే ఆకారంలో గుండ్రంగానూ, సమంగానూ ఉంటే మంచిది. ఎడమొడిగా ఉంటే బాగా లేదని అర్థం. కండ పట్టిన భాగం పచ్చగా ఉంటే ఇంకా పక్వానికి రాలేదని గుర్తు. పొడిగా, గోధుమ రంగులో ఉంటే పండిందని తెలుసుకోవాలి. కట్ చేసిన కాయ గాఢ ఎరువు రంగులో ఉండకూడదు. ● రసాయనాలు కలిపిన పుచ్చకాయను తినడం వల్ల అలర్జీ, డయేరియా బారిన పడటమే కాకుండా దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీల సమస్య తలెత్తవచ్చు. క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. రసాయనాలు వాడి ఎర్రగా ఆకర్షణీయంగా మార్చేస్తున్న దుస్థితి -
25న చలో కలెక్టరేట్
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈఎస్ వెంకటేష్ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రాంభూపాల్ మాట్లాడుతూ... జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయిన జగనన్న ఇళ్లు, టిట్కో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోనూ శ్మశానానికి భూమిని కేటాయించాలని, ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రైతులకు నష్టం కలిగించే హంద్రీనీవా లైనింగ్ పనులు వెంటనే నిలిపివేయాలన్నారు. కూటమి పార్టీల నేతల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, నరసింహులు, జంగాలపల్లి పెద్దన్న, దిల్షాద్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
తొలి సంతకం ఏమైంది బాబూ?
పరిగి: ‘‘ఎన్నికల వేళ బాబు వస్తే జాబు వస్తుందని గొప్పలు చెప్పారు. అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు పీకేశారు. తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్‌పైనే అంటూ ఆర్భాటంగా ప్రకటించారు..అధికారం చేపట్టి 9 నెలలు దాటినా ఇంతవరకూ నోటిఫికేషన్ లేదు. ఏటా జాబ్ క్యాలెండర్..అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. నేటికీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మోసం చేశారు’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. మంగళవారం ఆమె.. మండలంలోని శీగిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి సంతకంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో... నిరుద్యోగులు గంపెడాశలతో నాటి నుంచి ఎదురుచూస్తునే ఉన్నారన్నారు. పైగా కోచింగ్‌ల కోసం లక్షలాది రూపాయలను వెచ్చించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం అదిగో డీఎస్సీ...ఇదిగో నోటిఫీకేషన్ అంటూ కాలయాపన చేయడం మాని వెంటనే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలతో పాటూ ఇతరత్రా టెక్నికల్ కోర్సులు చేసిన లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధ్యతారాహిత్యమని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించారన్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. వలంటీర్లకు తీరని అన్యాయం వలంటీర్ల ద్వారా గత ప్రభుత్వం ప్రతి గ్రామ గ్రామానా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందని ఉషశ్రీచరణ్ తెలిపారు. కోవిడ్ వంటి విపత్కర సమయంలో వలంటీర్ల సేవలతో యావత్ ప్రపంచమే జేజేలు పలికిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఇస్తున్న వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక..ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోగా..ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తమకు జరిగిన అన్యాయంపై గత కొన్ని రోజులుగా వలంటీర్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోవడం దురదృష్టకరమన్నారు. నిరుద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, సర్పంచ్ లక్ష్మణ్ణ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులను వంచిస్తోన్న చంద్రబాబు వేతనాలు పెంచుతామని వలంటీర్లకు మోసం నిరుద్యోగ సమస్యపై సత్వరమే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ -
మొత్తం మండలాలు
రెవెన్యూ గ్రామాలుతొలుత విస్తీర్ణంప్రస్తుత విస్తీర్ణంపుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) చైర్మన్ పదవి హాట్ టాపిక్‌గా మారింది. పదవి కోసం కూటమి పార్టీల నేతలు పోటాపోటీగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలైతే ఏకంగా అమరావతిలోనే మకాం వేసి లోకేష్ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రంగంలోకి దిగారు. ప్రొటోకాల్ సమస్య తీరడంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు పుడా చైర్మన్ గిరీ కోసం ప్రయత్నిస్తున్నారు. పుడా పరిధి ఇలా... సాక్షి, పుట్టపర్తి పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా)పై ఇప్పుడు అందరి కళ్లూ పడ్డాయి. దాదాపు ఆరు మండలాలు విస్తరించి ఉన్న ‘పుడా’ పీఠం దక్కితే దాదాపు పుట్టపర్తి నియోజకవర్గమంతా చేతిలో ఉన్నట్లే. ప్రొటోకాల్‌తో పాటు కీలకమైన నిర్ణయాల్లోనూ ‘పుడా’ చైర్మన్ పాత్ర తప్పకుండా ఉంటుంది. వైఎస్సార్సీపీ హయాంలో చైర్మన్‌గా ఉన్న లక్ష్మీనరసమ్మ.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో ఆ నామినేటెడ్ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో కూటమి నేతలందరి గురి ‘పుడా’ గిరిపై పడింది. రేసులో మాజీ మంత్రి కూటమి ప్రభుత్వం విడతల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) చైర్మన్‌పై స్పష్టత ఇవ్వలేదు. పుట్టపర్తి నుంచి ఒకప్పుడు మంత్రిగా పని చేసిన సీనియర్ నేత ‘పుడా’ చైర్మన్ పదవి ఆశిస్తున్నారని తెలిసింది. అధికార దాహంతో నిత్యం ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు చేస్తూ విమర్శల పాలవుతోన్న ఆయన ‘పుడా’ చైర్మన్ పదవి వస్తే.. ప్రొటోకాల్ పంచాయితీ ఉండదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికో ఇవ్వడం ఎందుకు? తానే ‘పుడా’చైర్మన్ పదవి తీసుకుంటే తప్పేంటని సన్నిహితులతో చర్చించారని సమాచారం. ఈ క్రమంలోనే ఎవరికీ ఇవ్వకుండా.. జాప్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా..‘పుడా’ చైర్మన్‌గా ఎవరినీ ప్రకటించకపోవడంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. అమరావతిలో ఆశావహుల మకాం వైఎస్సార్సీపీ హయాంలో బీసీ కేటగిరీకి చెందిన మహిళకు పుడా చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి బీసీ కులాలకే ఇస్తారన్న ఆలోచనతో ఆశావహులు జోరు మీద ఉన్నారు. కొందరు యువ నేతలూ తెరపైకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఆశావహులు ఎవరికి వారుగా.. అమరావతిలో మకాం వేస్తున్నారు. నెలలో మూడు – నాలుగుసార్లు వెళ్లి నారా లోకేశ్‌తో లాబీయింగ్ చేస్తున్నారని తెలిసింది. అయితే స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రమేయం లేకుండా ‘పుడా’చైర్మన్ గిరీ ఎవరికీ దక్కదన్న విషయం తెలిసినా.. దీనిపై ఆమె ఇంతవరకు నోరు విప్పకపోవడంతో కుటుంబ సభ్యులకే ఇస్తారేమో అనే చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ హయాంలోనే భారీ వృద్ధి నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) పరిధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్తరించింది. 1992లో ఏర్పడిన ‘పుడా’ఆరు గ్రామాలకే పరిమితం కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మండలాలకు విస్తరించింది. ఫలితంగా ‘పుడా’పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది. మొత్తం 82 రెవెన్యూ గ్రామాలు ‘పుడా’పరిధిలో ఉన్నాయి. ప్రస్థానం ఇలా.. 1992 ఫిబ్రవరి 18వ తేదీన పుడా (పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పడింది. పుట్టపర్తి, కప్పలబండ, బ్రాహ్మణపల్లి, లోచెర్ల, బీడుపల్లి, ఎనుములపల్లి గ్రామాలు ‘పుడా’పరిధిలో ఉండేవి. మొత్తం 86.54 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉండేది. 1996 సెప్టెంబరు 3వ తేదీన పుడా పేరును ‘సుడా’(శ్రీసత్యసాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)గా మార్పు చేశారు. తర్వాత 2007 ఫిబ్రవరి 28న ‘సుడా’పేరు తొలగించి మళ్లీ ‘పుడా’గా మార్చారు. 2022 మే 13వ తేదీన ఆరు మండలాలకు ‘పుడా’ను విస్తరించారు. పుట్టపర్తి నియోజకవర్గం మొత్తం (అమడగూరులోని ఐదు రెవెన్యూ గ్రామాలు మినహా) పుడా పరిధిలోకి తీసుకొచ్చారు. ఫలితంగా 1,407.87 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. తర్వాత 2022 నవంబరు 7వ తేదీన అమడగూరు మండలంలోని చీకిరేవులపల్లి, దడెంవారిపల్లి, కరిమిరెడ్డిపల్లి, రామానంతపురం, ఎస్.కురువపల్లె రెవెన్యూ గ్రామాలను చేర్చారు. ‘పుడా’పరిధిలోకి మరో 9.258 చదరపు కిలోమీటర్లు చేరడంతో ప్రస్తుతం ‘పుడా’పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది.అది నాదే కాదు.. నాది.. 682నేతలను ఊరిస్తోన్న ‘పుడా’ చైర్మన్ పదవి జాప్యంపై ఆశావహుల అసంతృప్తి ప్రొటోకాల్ కోసం మాజీ మంత్రి ఆసక్తి అధిష్టానం వద్ద నేటికీ తేలని పంచాయితీ వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు చైర్మన్ గిరి కూటమి సర్కారులో ఎవరినివరిస్తుందో తెలియని స్థితి86.541417.33‘పుడా’ పైనే గురి ఎందుకంటే... పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో రెండు అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టాలన్నా...ఏడు సెంట్ల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలన్నా తప్పనిసరిగా ‘పుడా’ అనుమతులు తీసుకోవాలి. పుట్టపర్తి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనూ ‘పుడా’ కీలక పాత్రపోషిస్తుంది. అందువల్లే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ‘పుడా’ చైర్మన్‌కు తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఇక గత టీడీపీ హయాంలో ‘పుడా’ను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు సాగించిన దందా అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు మళ్లీ ‘పుడా’ పీఠం కోసం చాలా మంది తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. వీరి బాటలోనే మాజీ మంత్రి కూడా ఉన్నట్లు తెలిసింది.చ.కిలోమీటర్లు -
క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 93 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో క్వింటా గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.7,200 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులు కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులకు రంగం సిద్ధమైంది. ఫోర్త్‌జోన్ పరిధిలో మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉండగా 48 మంది హెడ్ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో ఎస్ఐలుగా పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ నుంచి ఇటీవల జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రూప్–2 పోస్టులే అయినా అడ్హాక్ పద్ధతిలో పదోన్నతికి రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన పూర్తి కావడంతో ఈ నెల 20, 21 తేదీల్లో క్లర్కులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులకు డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు. సీమ జిల్లాల్లో 12 మంది క్లర్కులు ఎస్ఐలుగా పదోన్నతి పొందేందుకు జాబితా సిద్ధమైంది. వైద్యపరీక్షల అనంతరం పదోన్నతి కల్పించి ఈ నెలాఖరులోగా పోస్టింగులు కేటాయించే అవకాశమున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. జెడ్పీలో పదోన్నతులకు సన్నాహాలు అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జెడ్పీలోని ప్రత్యేక బృందం సీనియారిటీ జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ విభాగాల్లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. తొలుత సీనియారిటీ, రోస్టర్ ప్రకారం ముసాయిదా జాబితా తయారు చేసి సీఈఓ పరిశీలన అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు లేవనిపిస్తే.. తుది జాబితాను సిద్ధం చేసి చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆమోదంతో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇస్తారు. -
రైతుల పేరుతో రెడ్డెప్పశెట్టి డ్రామా!
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్రావతి నదిపై అక్రమంగా వంతెన నిర్మించి ఏళ్లుగా నదీ జలాలను సొంతానికి వాడుకుంటూ రైతుల నోట్లో మట్టికొట్టిన రియల్టర్ రెడ్డప్పశెట్టి...ఇప్పుడు తప్పించుకునేందుకు కొత్తరాగం అందుకున్నారు. చిత్రావతిపై వంతెన రైతుల కోసమేనంటూ సరికొత్త డ్రామాకు తెరతీశారు. అటు అధికారులను, ఇటు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన ఎస్టేట్ కోసం చిత్రావతి నదిపై నిర్మించుకున్న అక్రమ వంతెన తొలగిస్తే రైతులకు ఇబ్బంది అంటూ సంబంధం లేని వ్యక్తలతో గోప్యంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందించినట్లు తెలుస్తోంది. కంచె వేసుకొని రైతులకు దారి కూడా ఇవ్వకుండా వేధిస్తున్న రెడ్డెప్పశెట్టి... ఇప్పుడు తప్పించుకునేందుకు రైతుల పేరునే వాడుకుంటున్నాడు. తనకు అనుకూలంగా ఉండే కొంతమందిని తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడంపై ప్రజల నుంచి విమర్శలు వినపడుతున్నాయి. చర్యలకు అధికారుల వెనకడుగు రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలు సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చినా...చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నదిపై అక్రమంగా వంతెన నిర్మాణం, కంచె వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా.. అధికారులు హడావుడి చేశారు. రెడ్డెప్పశెట్టికి నోటీసులిచ్చి, కేసు పెట్టి వదిలేశారు. ఫిబ్రవరి 28వ తేదీలోపే అక్రమ వంతెనను కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నా...నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇక ఈడీ అటాచ్మెంట్లో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములనూ విడిపించలేదు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూములనూ వెనక్కి తీసుకునే ప్రయత్నమేదీ చెయ్యలేదు. ఇది అధికారుల్లో నెలకొన్న అలసత్వమా.. లేక మరేదైనా కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తప్పించుకునేందుకు సమయం ఇస్తున్నారా? రెడ్డెప్పశెట్టిపై రెండు కేసులు నమోదు కాగా, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు తొలుత ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడన్నది తెలియకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించారు. సదరు రియల్టర్‌కు బెయిల్ కూడా రాకపోవడంతో ఆయన అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇక తామే చర్యలు తీసుకుంటామని చెప్పిన ఇరిగేషన్ అధికారులు నేటికీ ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడంతో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 43 ఎకరాలు నది, ప్రభుత్వ భూమికి ఎంజాయ్మెంట్ పట్టా పొందడం, దాన్ని ఆక్రమించడం వంటి వాటికి సంబంధించి న్యాయ పరంగా తప్పించుకునేందుకే అధికారులు సమయం ఇస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్, ఈడీలకు ఫిర్యాదు? రెడ్డెప్పశెట్టి తన పలుకుబడి వినియోగించి అక్రమాలను దాచేసి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో కొంతమంది రైతులు గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నదీ జలాలను ఏళ్లుగా తన సొంత అవసరాలకు వినియోగించుకుంటూ, తన బోరుబావుల్లో నీరు వచ్చేలా ప్లాన్ చేసుకోవడం వంటి వాటితో నదీ పరివాహక రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఇక నేరుగా గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసేందుకు రైతులు సిద్ధమైనట్లు సమాచారం. అదే విధంగా ఈడీ అటాచ్‌మెంట్‌లోని భూములను ఆక్రమించిన నేపథ్యంలో ఈడీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చిత్రావతిపై అక్రమంగా వంతెన కట్టి రైతులను వంచించిన రియల్టర్ ఇప్పుడు రైతుల కోసమే వంతెన కట్టానంటూ తప్పించుకునే ప్రయత్నం ఫిబ్రవరి 28లోపే బ్రిడ్జి తొలగిస్తామని నోటిసులిచ్చి ఊరుకున్న అధికారులు కంచె తొలగింపులోనూ అలసత్వం గ్రీన్‌ట్రిబ్యునల్, ఈడీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన రైతులు -
● గరుడ వాహనంపై ఖాద్రీశుడు
కదిరి: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. పదో రోజైన మంగళవారం రాత్రి ఖాద్రీశుడు మరోసారి గరుడా రూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని తరించారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిని నారసింహునికి వాహనంగా పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ..మలి గరుడసేవ అని కూడా అంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. గిరి ప్రదక్షిణ గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం లక్ష్మీ నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన భక్తులు ఉదయాన్నే కదిరి కొండకు చేరుకొని గిరి ప్రదక్షణ చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బుధవారం రాత్రి తెల్లటి ఐరావతంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ఉచిత ఇసుక అందుబాటులో ఉంచాలి
ప్రశాంతి నిలయం: వినియోగదారులందరికీ ఉచిత ఇసుక అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ చేతన్ ఆదేశించారు. జిల్లాలో ఉచిత ఇసుక అమలుపై మంగళవారం స్థానిక మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నాణ్యమైన ఇసుక సరఫరా చేయాల్సిన బాధ్యత మైనింగ్ శాఖ అధికారులదేనన్నారు. నదీ ప్రవాహాలకు అనుకుని ఉన్న గ్రామాల పరిధిలో వినియోగదారులే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చన్నారు. ఆర్డీఓలు ఇసుక డంపింగ్ యార్డులను తనిఖీ చేయడంతో పాటు ప్రతి 15 రోజులకోసారి ఉచిత ఇసుక అమలుపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. అన్ని ఇసుక డంపింగ్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ బ్యానర్, జీపీఎస్ లేకుండా ఇసుకను రవాణా చేస్తే ఆ వాహనాన్ని బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి జిల్లాల్లో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం చెప్పవచ్చని, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.రత్న తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌పై రోజువారీగా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ అభిషేక్ కుమార్, జిల్లా గనులు శాఖ అధికారి పెద్దిరెడ్డి, ధర్మవరం ఆర్డీఓ మహేష్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. తప్పుడు సమాచారంతో ఆధార్ నమోదు చేయొద్దు ఆధార్ నమోదు, అప్డేషన్న్లలో తప్పులు దొర్లకూడదని, ఎవరైనా తప్పుడు సమాచారంతో ఆధార్ నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆధార్ సెంటర్లను తనిఖీ చేసి నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ నమోదు స్పెషల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. స్వర్ణాంధ్రకు పది సూత్రాలు అమలు చేయాలి స్వర్ణాంధ్ర విజన్–2047 సాకారానికి పది సూత్రాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని కోర్టు హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో విజయవాడలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలపై సమీక్షించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ద్వారా ఆదాయాలు పెంచుకునే మార్గాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. నల్లచెరువు మండలంలో ఏర్పాటు చేయనున్న ఉద్యాన ప్రాసెసింగ్ యూనిట్‌పై సమీక్షించారు. 18పిటివై303–పది సూత్రాల అమలుపై సమీక్షిస్తున్న కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
పెనుకొండ: స్థానిక నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం గ్రామ సమీపంలో చోటు చేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేవారు. వివరాలను మంగళవారం సీఐ రాఘవన్ వెల్లడించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు ఆంజనేయులు అదే గ్రామానికి చెందిన తిప్పమ్మతో కొన్నేళ్లుగా సహజీవనం సాగిస్తున్నాడు. ఉద్యోగ విరమణ అనంతరంరామె వద్దనే ఉంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కారణాలతో మూడు నెలల క్రితం ఆయనను తిప్పమ్మ కుమారుడు నాగరాజు హత మార్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తొలుత సాధారణ మృతిగా భావించినా... ఆంజనేయులు సోదరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆంజనేయులుది సాధారణ మరణం కాదని, హత్యగా నిర్ధారణ కావడంతో పక్కా ఆధారాలతో మంగళవారం నాగరాజును అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. చెట్టుపై నుంచి పడి వృద్ధుడి మృతి అగళి: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం పూజారిపల్లికి చెందిన చంద్రప్ప (72) కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్య శివలింగమ్మకు సంతానం లేకపోవడంతో అంజనమ్మను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పి.బ్యాడగెర గ్రామానికి చెందిన రైతు సత్యప్ప పొలంలో చింత ఫలసాయాన్ని కొనుగోలు చేసిన గుడిబండ మండలానికి చెందిన రామకృష్ణప్ప సోమవారం పలువురు కూలీలను పనిలో పెట్టాడు. ఈ క్రమంలో చెట్టుపైకి ఎక్కి చింత కాయలు దులుపుతున్న చంద్రప్ప ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను తోటి కూలీలు వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక అదే రోజు రాత్రి ఆయన మృతి చెందాడు. మృతుడి కుమారుడు మారుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రాచువారిపల్లిలో చోరీ తనకల్లు: మండలంలోని రాచువారిపల్లిలో నివాసముంటున్న దేశాయి భక్తవత్సలరెడ్డి ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. ఇంటికి తాళాం వేసి తన కుటుంబసభ్యులతో కలసి పది రోజుల క్రితం ఆయన కాశీకి వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గమనించిన దుండగులు మంగళవారం పట్టపగలే ఇంటి వెనుక ఉన్న తలుపు తెరిచి లోపలికి ప్రవేశించారు. మూడు బెడ్రూములలో ఉన్న బీరువాలను ధ్వంసం చేసి అందులోని పట్టు చీరలు, ఇతర విలువైన సామగ్రిని అపహరించారు. భక్తవత్సలరెడ్డి సమీప బంధువు సమాచారంతో ఎస్ఐ గోపి అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దింపి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. కాగా, ఇంటి యజమాని వచ్చిన తర్వాత ఏఏ వస్తువులు చోరీకి గురయ్యాయో తెలుసుకుని కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. తరగతి గదిలో విద్యార్థికి తేలు కాటు పెనుకొండ రూరల్: తరగతి గదిలో పాఠాలు వింటున్న ఓ విద్యార్థిని తేలు కుట్టింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే...మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన మహికాంత్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లాడు. ఉదయం తరగతి గదిలో పాఠాలు వింటుండగా ఏదో కుట్టినట్లు విపరీతమైన నొప్పి వచ్చింది. వెంటనే ఉపాధ్యాయులకు చూపించగా... తేలు మూడుచోట్ల కుట్టినట్లు గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. -
టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు
లేపాక్షి: లక్షలాది రూపాయలతో వేలం పాట దక్కించుకున్నా అధికారులు డబ్బులు కట్టించుకోకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. ఎమ్మెల్యే కార్యాలయ పైరవీలతో చివరకు వేలాన్ని రద్దు చేసారు. వివరాలు... లేపాక్షి గ్రామ పంచాయతీ పరిధిలో వారపు సంత, బస్టాండు ఆదాయ వనరులపై పంచాయతీ అధికారులు సోమవారం ఉదయం వేలం పాట నిర్వహించారు. ఇందులో బస్టాండులో వాహనాల పార్కింగ్‌కు సంబంధించి లేపాక్షికి చెందిన శంకరరెడ్డి అత్యధికంగా రూ.72 లక్షల వేలం పాడి దక్కించుకున్నారు. నిబంధనల మేరకు వేలం పాడిన 24 గంటల్లోపు వేలం పాడిన మొత్తంలో 50 శాతం డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 12 గంటలకే 50 శాతం మొత్తాన్ని వేలం పాటదారుడు చెల్లించడానికి వెళితే అక్కడ అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. ఇదేమని ఆరా తీస్తే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు కార్యాలయం వదిలి వెళ్లిపోయారని తేలింది. అదే సమయంలో సమయం మించి పోయిన తర్వాత డబ్బు చెల్లించేందుకు వచ్చినందుకు తిరస్కరిస్తున్నట్లుగా అక్కడున్న కింది స్థాయి సిబ్బంది నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ అన్యాయంపై శంకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తుండగానే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికారులు పనులు చేయాలని, తమ పార్టీకి సంబంధంలోని వ్యక్తికి టెండర్ ఎలా ఇస్తారంటూ దౌర్జన్యానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ నరేంద్ర, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ అక్కడకు చేరుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈఓఆర్డీ ఆనందకుమార్, పంచాయతీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ... నిబంధనల మేరకు వేలం పాట రద్దు చేసి తిరిగి ఎప్పడు వేలం నిర్వహించేది ప్రకటిస్తామని పేర్కొన్నారు. శంకర్‌రెడ్డి మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తాను కార్యాలయానికి చేరుకున్న సమయంలో పంచాయతీ సిబ్బంది తప్ప కార్యదర్శి అందుబాటులో లేరన్నారు. 2 గంటల తర్వాత వచ్చిన కార్యదర్శి, ఈఓఆర్డీ డబ్బులు కట్టించుకోకుండా నిరాకరించారన్నారు. కేవలం టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తనకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. వాహనాల పార్కింగ్‌కు సంబంధించి రూ.72 లక్షల వేలం రద్దు చేసిన వైనం తెలుగు తమ్ముళ్ల హైడ్రామాలకు వేదికగా మారిన పంచాయతీ కార్యాలయం