
‘కలలు కనండి..ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ యువతలో చైతన
ఇస్రో శాస్త్రవేత్తగా
ఎంపికై న
పూజారి నాగప్రదీప్
ఓఎన్‌జీసీలో
ఉద్యోగం పొందిన పూజారి నాగసాయి
కనగానపల్లి: మండల కేంద్రానికి చెందిన పూజారి నాగభూషణ ఓ సాధారణ వ్యవసాయ కూలీ. వ్యవసాయ పనులు ఉంటే పూట గడుస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో వ్యవసాయ పనులు సరిగా లేకపోవడంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన కష్టం పిల్లలకు రాకూడదని భావించిన ఆయన... కేవలం చదువులు ఒక్కటే వారి జీవన గమనాన్ని మారుస్తాయని గుర్తించాడు. ఆ దిశగా పిల్లల చదువు కోసం అహర్నిశం శ్రమించాడు.
తండ్రి ఆశయానికి అనుగుణంగా..
పూజారి నాగభూషణకు నాగప్రదీప్, నాగసాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ వైపు ఆటో నడుపుతూనే రోజూ సమీపంలో ఉన్న ధర్మవరం పట్టణానికి పిల్లలను తీసుకెళ్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో వదిలి వచ్చేవాడు. తిరిగి పాఠశాల వేళలు ముగిసే వరకూ ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంలో మొదట పిల్లల చదువులకు కొంత మొత్తాన్ని పక్కన తీసిపెట్టేవాడు. తండ్రి ఆశయాన్ని గుర్తించిన పిల్లలు సైతం చదువులపై ఆసక్తి పెంచుకున్నారు. పేదరికపు సవాళ్లను అధిగమిస్తూ ఈ పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ప్రభుత్వ, దాతల సహకారంతో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం నాగప్రదీప్ బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. ఆ సమయంలో సైన్స్ పరిశోధనల్లో ప్రతిభ చూపటంతో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన బోర్డు పరీక్షలు రాసి ఆల్ ఇండియా స్థాయిలో 72వ ర్యాంకు సాధించాడు. దీంతో ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన శ్రీహరికోటలోని ఇస్రోలో గ్రూపు– ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హత సాధించాడు.
జాతీయ స్థాయిలో మెరిసిన మరొకరు..
నాగప్రదీప్‌తో పాటు గేట్‌లో మంచి ర్యాంకు సాధించిన సోదరుడు నాగసాయి కూడా జాతీయ స్థాయి ఓఎన్‌జీసీ సంస్థలో ఏఈఈ ఉద్యోగం సాధించాడు. బీటెక్ పూర్తి కాగానే చిరుప్రాయంలోనే ఈ ఉద్యోగం సాఽధించడం గమనార్హం. దీంతో తన ఆశయానికి అనుగుణంగా కుమారులిద్దరూ జాతీయ స్థాయి సంస్థల్లో మంచి ఉద్యోగాలు సాధించినందుకు ఆటో డ్రైవర్ నాగభూషణ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా పిల్లలిద్దరూ బాగా చదువుకొని ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించినందుకు వారిని గ్రామస్తులు అభినందించారు.
ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగిన
ఆటో డ్రైవర్ కుమారుడు
జాతీయ స్థాయి సంస్థలో
మరో కుమారుడికి ఉద్యోగం

‘కలలు కనండి..ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ యువతలో చైతన

‘కలలు కనండి..ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ యువతలో చైతన

‘కలలు కనండి..ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ యువతలో చైతన