
సాయి సహస్రనామ హారం ప్రారంభం
ప్రశాంతి నిలయం: సత్యసాయి శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయంలో ‘సాయి సహస్రనామ హారం–ప్రేమామృత సారం’ కార్యక్రమం ప్రారంభమైంది. సహస్ర నామ హారంలో భాగంగా 1,008 సత్యసాయి నామాలతో భక్తిగీతాలను ఆలపించనున్నారు. వారం రోజుల పాటు సాగే కార్యక్రమంలో 21 భజన బృందాలు, 900 మంది సంగీత కారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి ప్రారంభించారు. అనంతరం భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలను ఆలపించారు.