
అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛను హరించలేవు ●
● చిలమత్తూరులో పాత్రికేయుల నిరసన
చిలమత్తూరు: సాక్షి ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షతో బనాయించిన కేసు అక్రమమని పాత్రికేయులు మండిపడ్డారు. నిజాలను నిష్పక్షపాతంగా ప్రచురించే పత్రికలను అణచివేయాలని చూడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు పాత్రికేయులపై నమోదు చేసిన అక్రమ కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛను హరించలేవన్నారు. ఉన్నవి ఉన్నట్టు రాస్తే ఇలా కేసులు బనాయించి ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ జగన్నాథ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల పాత్రికేయ సంఘం అధ్యక్షుడు గంగరాజు, ఆంజనేయులు(ఆంధ్రప్రభ), శంకర్ (ప్రజాశక్తి), సురేంద్రరెడ్డి( ది జర్నలిస్ట్) విశ్వనాథ్(బిగ్ టీవీ), నాగార్జున(కాకతీయ) నారాయణస్వామి( సూర్య న్యూస్), రామాంజనేయులు, వెంకటేష్(ఆర్టీఐ) తదితరులు పాల్గొన్నారు.